SCERT AP 9th Class Social Studies Guide Pdf 2nd Lesson భూమి – ఆవరణములు Textbook Questions and Answers.
AP State Syllabus 9th Class Social Solutions 2nd Lesson భూమి – ఆవరణములు
9th Class Social Studies 2nd Lesson భూమి – ఆవరణములు Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
ఖాళీలను పూరించండి. (AS1)
1. జలావరణం …………………………….. సంబంధించినది.
2. శిలావరణం ………………………… సంబంధించినది.
3. వాతావరణం ……………………….. సంబంధించినది.
4. జీవావరణం ……………………….. సంబంధించినది.
జవాబు:
- నీటికి
- శిలలకు
- వాయువులకు
- జీవులకు
ప్రశ్న 2.
శిలావరణం నేపథ్యంలో కింద ఇచ్చిన వాటిలో సరిపోనిది ఏమిటి? మీ ఎంపికకు కారణం పేర్కొనండి. (AS1)
‘బైసన్ గార్జ్, గ్రాండ్ కాన్యన్, థార్ ఎడారి
జవాబు:
థార్ ఎడారి శిలావరణం నేపథ్యానికి సరిపోదు.
కారణాలు :
థార్ ఎడారి అంతా ఇసుకతో ఏర్పడినది.
ఇక్కడ ఏ విధమైన రాతి పొరలు భూ ఉపరితల భాగంలో లేవు.
అందువలన ఇది శిలావరణం నేపథ్యానికి సరిపోదు.
ప్రశ్న 3.
శిలావరణం ఎలా ఏర్పడింది? (AS1)
జవాబు:
- శిలావరణం ఏర్పడిన విధానము : భూమిలో ఘనీభవించిన పొర, లేదా గట్టిగా ఉండే పై పొర ఇది.
- దీంట్లో రాళ్ళు, ఖనిజ లవణాలు ఉండి మందపాటి మట్టి పొర ఉంటుంది.
- ఈ ఆవరణాన్ని ఇంగ్లీషులో ,లితోస్పియిర్ అంటారు. లితో అంటే గ్రీకు భాషలో రాయి లేదా శిల అని అర్థం.
- ‘స్పేయిరా’ గోళం లేదా బంతి అని అర్థం. అనగా ఈ పొర చదునుగా ఉండే ఉపరితలం కాదు.
- ఎత్తైన కొండలు, పీఠభూములు, మైదాన ప్రాంతాలు, లోయలు నీటితో నిండిన లోతైన అగాధాలు వంటివి ఉండటం మీరు మ్యాపుల్లో చూసే ఉంటారు.
- వీటిల్లో పలు అంశాలు గాలి, నీటి ప్రభావాల వల్ల రూపుదిద్దుకున్నాయి.
- ఈ పై పొరలోని కొంత భాగం దుమ్ము వంటి వాటి రూపంలో గాలిలో కలిసి ఉంటుంది.
ప్రశ్న 4.
ఖండ ఫలకాలు ఎలా ఏర్పడ్డాయి? అవి అంతిమంగా ఎలా అంతరించిపోతాయి? (AS1)
జవాబు:
- ఎన్నో సంవత్సరాల సునిశిత అధ్యయనం ద్వారా ఖండాలు, మహాసముద్రాలు కూడా “ఫలకాలు” అనే అతి పెద్ద రాళ్ళ మీద ఉన్నాయని శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు.
- భూమిలో పెద్ద ఫలకాలు, అనేక చిన్న ఫలకాలు ఉన్నాయి.
పెద్ద ఫలకాలకు ఉదా : ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇండో – ఆస్ట్రేలియా, అంటార్కిటిక్, యూరేసియా, పసిఫిక్. చిన్న ఫలకాలకు ఉదా : నాజ్ కా, అరేబియా వంటివి. - ఈ ఫలకాలు వాస్తవంగా మధ్య పొరమీద తేలుతూ ఉంటాయి. ఇవి నిరంతరం నెట్టబడుతూ ఉంటాయి.
- అందువల్ల అవి మెల్లగా కదులుతూ ఉంటాయి.
- అవి చాలా నిదానంగా కదులుతూ ఉంటాయి. కాబట్టి వాటి కదలిక మనకు తెలియదు.
- ఈ కదలిక ఫలితంగా ఒక ఫలకం పక్కనున్న మరొక ఫలకాన్ని నెడుతూ ఉంటుంది.
- రెండు ఫలకాలు కలిసే చోట ఒకదానినొకటి నెట్టుకుంటాయి. ఒక దాని మీద మరొకటి ఎంతో ఒత్తిడి చూపుతుంది.
- ఒక ఫలకం కిందికి మధ్య పొరలోకి వెళితే మరొక ఫలకం పైకి నెట్టబడి పర్వత శ్రేణులు ఏర్పడతాయి.
- ఈ ఫలకాల కదలికను ఫలక చలనాలు అంటారు. ఈ ప్రక్రియ వల్ల భూకంపాలు వంటివి సంభవిస్తాయి.
ప్రశ్న 5.
నదీ ప్రభావం వల్ల ఏర్పడే భూస్వరూపాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
నదీ ప్రభావం వల్ల ఏర్పడే భూస్వరూపాలు :
- ఎత్తైన కొండలలో నది పుట్టిన చోటు నుంచే దాని ప్రభావం మొదలవుతుంది.
- వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నదీ ప్రవాహం వేగంగా ఉండి కొండను నిలువుగా కోతకు గురిచేస్తుంది.
- దీని ఫలితంగా లోతైన లోయ ఏర్పడుతుంది. ఇది కింద సన్నగా పైగా వెడల్పుగా ఉంటుంది. దీనిని సాధారణంగా “V” ఆకారపు లోయ అంటారు.
- రాళ్ళు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి, లోతైన లోయగా కోస్తుంది.
- దీని అంచులు నిటారుగా ఉంటాయి. వీటిని “గార్జెస్” అంటారు.
- మరొక ముఖ్యమైన రూపాన్ని ‘అగాధదరి అంటారు. దీనిలో నది అంచులు తీవ్ర వాలుతో చాలా లోతుకు కోతకు గురవుతాయి. అగాధదరిలో కింద కంటే పై భాగం ఎక్కువ వెడల్పుగా ఉంటుంది.
- వాలులో తేడాలు బాగా ఎక్కువగా ఉండే పర్వత ప్రాంతాలలో జలపాతాలు అధిక సంఖ్యలో ఉంటాయి.
- జలపాతంలో నీళ్లు ఎంతో శక్తితో కిందకు పడతాయి. ఆ నీళ్లు కిందపడే చోట “దుముకు మడుగు” ఏర్పడుతుంది.
- నదికి వరదలు వచ్చినపుడు అది నేలను కోతకు గురిచేస్తుంది. వరద తగ్గుముఖం పట్టినపుడు కోసిన మట్టిని వేరేచోట మేట వేస్తుంది. దీనిని “ఒండ్రు” అంటారు.
- మెలిక తిరిగిన భాగం నది నుంచి తెగిపోయి ఒక చెరువులాగా ఏర్పడుతుంది. ఇటువంటి వాటిని ‘ఆక్స్ బౌ సరస్సు’ అంటారు.
- సముద్రాన్ని నది చేరుకున్నప్పుడు దాంట్లో మేటవేయని రేణువులు ఉంటే అవి నదీ ముఖంలో మేట వేయబడి డెల్టా ప్రాంతం ఏర్పడుతుంది.
ప్రశ్న 6.
కింద పేర్కొన్న విధంగా పట్టిక తయారుచేసి సమాచారాన్ని నింపండి. భూమి బయటి మార్పుల నేపథ్యంలో మీకు కనిపించే తేడాలు, పోలికలను వివరించడానికి ఒక పేరా రాయండి. (AS3)
జవాబు:
ప్రశ్న 7.
మీ పరిసరాల్లో హిమానీనదాలు ఎందుకు కనిపించవు? (AS1)
జవాబు:
- హిమాలయాలు, ఆల్బ్ వంటి బాగా చలిగా ఉండే ప్రాంతాలలో మంచు బాగా కురుస్తుంది.
- అక్కడ వర్షానికి బదులు మంచు కురుస్తుంది.
- మంచు పోగుబడి గడ్డగా మారుతుంది.
- అలా పోగుపడుతున్న క్రమంలో అది కింది వైపు మెల్లగా కదలటం మొదలు పెడుతుంది.
- అలా ప్రయాణించి కొంచెం వెచ్చగా ఉండే ప్రాంతాన్ని చేరుకునే సరికి మంచు కరిగి చిన్న నది మొదలవుతుంది.
- హిమాలయాలలోని గంగోత్రి హిమానీనదం నుంచి గంగానది ఈ విధంగానే ఏర్పడుతుంది.
- మా పరిసరాల్లో హిమానీనదాలు ఎందుకు లేవు అనగా ఇక్కడ హిమాలయాలు, ఆల్బ్ వంటి బాగా చలిగా ఉండే ప్రాంతాలు లేవు.
- అందువలన మా ప్రాంతాల్లో హిమానీనదాలు లేవు.
ప్రశ్న 8.
బీలు ఎలా ఏర్పడతాయి? కొన్ని బీచ్ పేర్లు రాయండి.
జవాబు:
సముద్ర అలలు తీరం వెంట మేటవేసే పదార్థాల వల్ల బీచ్లు ఏర్పడతాయి.
ఉదా: విశాఖపట్టణంలోని రామకృష్ణ బీచ్
మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్
చెన్నైలోని మెరీనా బీచ్
ప్రశ్న 9.
ఏడారుల విస్తరణకు మానవ జీవన విధానం ఏ విధంగా కారణమౌతున్నది?
జవాబు:
ఏడారుల విస్తరణకు మానవ జీవన విధానం ప్రధాన కారణం
కారణాలు :
- పారిశ్రామిక విప్లవం తరువాత పరిశ్రమల స్థాపన సంఖ్య పెరిగింది.
- పరిశ్రమల నుండి విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువుల వల్ల వాతావరణం వేడెక్కుతుంది.
- అలాగే మానవుని రవాణా సాధనాల సంఖ్య, మోటారు వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది.
- దీంతో ఈ రవాణా సాధనాలు విడుదల చేసే కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువుల వల్ల వాతావరణం వేడెక్కుతుంది.
- అలాగే మానవుని విలాస జీవితానికి ఆలవాలమైన రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, ఎయిర్ కండిషన్స్ సంఖ్య నానాటికి పెరుగుతుండడంతో అవి విడుదలచేసే వాయువుల వల్ల కూడా వాతావరణం వేడెక్కుతుంది.
ఈ విధంగా వాతావరణం వేడెక్కడం వల్ల వర్షపాతం తగ్గిపోతుంది. వర్షపాతం తగ్గిపోవడం వల్ల భూ ఉపరితలం ఎడారిగా మారిపోతుంది. కావున ఎడారుల విస్తరణకు మానవ జీవన విధానం ప్రధాన కారణం.
ప్రశ్న 10.
ఇవి ఏ శ్రేణి భూస్వరూపాలలో తెలియజేయండి. (AS1)
జవాబు:
భూ స్వరూపం | భూస్వరూప శ్రేణి |
1. హిమాలయ పర్వతాలు | రెండవ శ్రేణి భూస్వరూపం |
2. పసిఫిక్ మహాసముద్రం | మొదటి శ్రేణి భూస్వరూపం |
3. ఆసియా ఖండం | మొదటి శ్రేణి భూస్వరూపం |
4. బైసన్ గార్జ్ | మూడవ శ్రేణి భూస్వరూపం |
5. జోగ్ జలపాతం | మూడవ శ్రేణి భూస్వరూపం |
6. రాఖీ పర్వతాలు | రెండవ శ్రేణి భూస్వరూపం |
7. హిందూ మహాసముద్రం | మొదటి శ్రేణి భూస్వరూపం |
8. గొప్ప విధీర్ణధరి | మూడవ శ్రేణి భూస్వరూపం |
ప్రశ్న 11.
పటం – 2ను చూసి ప్రపంచ పలకలను గీయండి.
జవాబు:
ప్రశ్న 12.
ఓ నెం. 20 లోని (ప్రవహిస్తున్న …….. క్రమక్షయం అని అంటారు) క్రమక్షయం పేరాను చదివి వాఖ్యానించండి. (AS2)
జవాబు:
ప్రవహిస్తున్న నీటికి, గాలికి ఎంతో శక్తి ఉంటుంది. అది రాళ్ళను నిదానంగా కరిగించి వేస్తుంది. మట్టి పై పొరలను తొలగించివేస్తుంది. వాన, నది, ప్రవహిస్తున్న భూగర్భజలం, సముద్ర అలలు, హిమానీ నదులు వంటి అనేక రూపాలలో నీళ్ళు ప్రభావం చూపుతాయి. గాలి కూడా స్థిరమైన గాలులు, ఈదురు గాలులు, తుపాను గాలులు వంటి అనేకరూపాలను తీసుకుంటుంది. గాలి, నీటి శక్తుల కారణంగా భూమి ఉపరితలం పై పొరలు కొట్టుకుపోవడాన్ని క్రమక్షయం అని అంటారు.
9th Class Social Studies 2nd Lesson భూమి – ఆవరణములు InText Questions and Answers
9th Class Social Textbook Page No.14
ప్రశ్న 1.
బెరైటీస్, బొగ్గు వంటి ఖనిజాల తవ్వకం గురించి మీరు చదివారు. ఇది శిలావరణాన్ని, జలావరణాన్ని, వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
జవాబు:
శిలావరణాన్ని ప్రభావితం చేసే విషయం :
శిలలను కూడా ధ్వంసం చేసి బెరైటీస్, బొగ్గు వంటి ఖనిజాలను వెలికి తీస్తున్నారు.
జలావరణాన్ని ప్రభావితం చేసే విషయం :
బొగ్గు వలన జలావరణం కలుషితం అవుతుంది. జలావరణం వలన బెరైటీస్ గనులు దెబ్బతింటున్నాయి.
వాతావరణాన్ని ప్రభావితం చేసే విషయం :
బొగ్గు, బెరైటీస్ వలన వాతావరణం కలుషితం అవుతుంది.
ప్రశ్న 2.
రోగాలు నయం చేయడానికి మనుషులు అధిక సంఖ్యలో యాంటిబయాటిక్ మందులు తీసుకుంటున్నారు. ఇది శిలావరణాన్ని, జలావరణాన్ని, వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
జవాబు:
- మనుషులు అధిక సంఖ్యలో తీసుకునే యాంటిబయాటిక్ మందులు తయారుచేసే ఫ్యాక్టరీలు వివిధ రకాల రసాయనాలను విడుదల చేస్తాయి.
- ఈ రసాయనాల వలన శిలావరణం, జలావరణం, వాతావరణాల సమతుల్యత దెబ్బతింటుంది.
- మనుషులు వీటిని అధికంగా వాడటం వలన కొన్ని సూక్ష్మజీవులు, వైరస్లు నశించిపోతాయి. మరికొన్ని వాతావరణంలోనికి విడుదల చేయబడతాయి. తద్వారా భూమ్యావరణములు కలుషితమవుతాయి.
ప్రశ్న 3.
అనేక శాస్త్రీయ పదాల మూలాలు గ్రీకు భాషలో ఉండటం మీరు గమనించి ఉంటారు. ఇలా ఎందుకు ఉంది? మీ టీచరుతో చర్చించండి.
జవాబు:
శాస్త్ర, సాంకేతిక రంగాలకు మూలం గ్రీకు నాగరికత. గ్రీకు భాష కూడా ప్రాచీనమైనది. గ్రీకు తత్త్వవేత్తలు ఆయా ఆంశాలను గురించి వివరించి చెప్పడమే గాక ప్రయోగ పూర్వకంగా ఋజువు చేయడానికి ప్రయత్నించారు. అందువలన ప్రాచీన పదాలు ఎక్కువగా గ్రీకు భాష నుండి ఉద్భవించాయి.
9th Class Social Textbook Page No.15
ప్రశ్న 4.
వాన ఎలా పడుతుంది?
జవాబు:
భూమి ఉపరితలంపై ఉన్న నీరు ఆవిరై మేఘంగా ఏర్పడి, ఆ మేఘాలు చల్లదనానికి నీటిని నిల్వ ఉంచుకోక వర్షం రూపంలో భూమిపైకి మరల నీటిని వదులుతాయి. ఆ విధంగా వర్షం కురుస్తుంది.
ప్రశ్న 5.
డెల్టాలు ఎలా ఏర్పడతాయి?
జవాబు:
సముద్రాన్ని నది చేరుకున్నప్పుడు దాంట్లో మేటవేయని రేణువులు ఉంటే అవి నదీ ముఖంలో మేటవేయబడి డెల్టా ప్రాంతం ఏర్పడుతుంది. ఈ ప్రాంతం గ్రీకు అక్షరం డెల్టా (A) రూపంలో ఉంటుంది. కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది.
ప్రశ్న 6.
భూకంపాలు, అగ్నిపర్వతాలు ఎలా సంభవిస్తాయి?
జవాబు:
భూకంపాలు సంభవించే విధానం :
- భూమికి సంబంధించి ఫలకాలు వాస్తవంగా మధ్య పొర మీద తేలుతూ ఉంటాయి.
- ఇవి నిరంతరం నెట్టబడుతూ ఉంటాయి. అందుకే అవి మెల్లగా కదులుతూ ఉంటాయి.
- అవి చాలా నిదానంగా కదులుతూ ఉంటాయి. కాబట్టి వాటి కదలిక మనకు తెలియదు.
- ఈ కదలిక ఫలితంగా ఒక ఫలకం పక్కనున్న మరొక ఫలకాన్ని నెడుతూ ఉంటుంది.
- రెండు ఫలకాలు కలిసేచోట ఒకదానినొకటి నెట్టుకుంటాయి.
- ఒక దాని మీద మరొకటి ఎంతో ఒత్తిడి చూపుతుంది.
- ఒక ఫలకం కిందికి మధ్య పొరలోకి వెళితే మరొక ఫలకం పైకి నెట్టబడి పర్వత శ్రేణులు ఏర్పడతాయి.
- ఈ ఫలకాల కదలికను ఫలక చలనాలు అంటారు. ఈ ప్రక్రియ వల్ల భూకంపాలు వంటివి సంభవిస్తాయి.
అగ్నిపర్వతాలు సంభవించే విధానం :
భూ గర్భంలోని శిలాద్రవం అనుకూల పరిస్థితులలో గొట్టం వలె ఉండే భాగాల నుండి బయటకు వస్తుంది. బయటికి ప్రవహించిన శిలాద్రవం ముఖద్వారం చుట్టూ ఘనీభవించి ఒక శంఖాకార పర్వత నిర్మాణంగా ఏర్పడుతుంది. దీనినే అగ్ని పర్వతం అంటారు.
ప్రశ్న 7.
కొండలు ఎందుకు ఉన్నాయి?
జవాబు:
ఒక ఫలకను ఇంకొక ఫలక నెట్టడం వలన కొండలు ఏర్పడుతున్నాయి.
ప్రశ్న 8.
నదుల వెంట లోయలు, అగాధాలు వంటివి ఎందుకు ఉన్నాయి?
జవాబు:
- వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నదీ ప్రవాహం వేగంగా ఉండి కొండను నిలువుగా కోతకు గురిచేస్తుంది. దీని ఫలితంగా లోతైన లోయ ఏర్పడుతుంది. అందువల్ల నదుల వెంట లోయలు ఏర్పడతాయి.
- రాళ్ళు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి లోతైన లోయగా కోస్తుంది. దీని అంచులు నిటారుగా ఉంటాయి. అగాధాలలో పైన ఎక్కువ వెడల్పుగాను, కింద భాగం సన్నగాను ఉంటాయి. అందువల్ల అగాధాలు వంటివి కూడా నదుల వెంట ఉంటాయి.
ప్రశ్న 9.
గాలులు ఎలా వీస్తాయి?
జవాబు:
గాలులు ఎల్లప్పుడు అధిక పీడన ప్రాంతం నుండి అల్ప పీడన ప్రాంతం వైపు వీస్తాయి.
9th Class Social Textbook Page No.17
ప్రశ్న 10.
హిమాలయ, ఆండిస్, రాకీ పర్వత శ్రేణులను పటం మీద గుర్తించండి. అవి అక్కడే ఎందుకు ఏర్పడ్డాయి? కారణాలు సూచించండి.
జవాబు:
1. హిమాలయాలు ఏర్పడటానికి కారణం :
యూరేసియా ఫలకాన్ని ఇండియా ఫలకం నెట్టటం వల్లనే హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి.
2. అండీస్ పర్వతాలు ఏర్పడటానికి కారణం :
దక్షిణ అమెరికా ఫలకాన్ని ఇండో- ఆస్ట్రేలియా ఫలకం నెట్టటం వల్లనే ఆండీస్ పర్వతాలు ఏర్పడ్డాయి.
3. రాకీ పర్వతాలు ఏర్పడటానికి కారణం :
ఉత్తర అమెరికా ఫలకాన్ని యూరేసియా ఫలకం నెట్టటం వల్లనే రాకీ పర్వతాలు ఏర్పడ్డాయి.
ప్రశ్న 11.
భూమి మీద శిలలు అన్నీ మహాసముద్ర మధ్యమిట్ట ప్రాంతంలోనే ఏర్పడ్డాయా?
జవాబు:
భూమి మీద గుట్టలన్నీ మహసముద్ర మధ్యమిట్ట ప్రాంతంలోనే ఏర్పడ్డాయి.
- సముద్రాలలోని భూమి పై పొరను అధ్యయనం చేస్తున్న భూ శాస్త్రజ్ఞులు పసిఫిక్ మహాసముద్రం వంటి కొన్ని మహా సముద్రాలలోని, మధ్య భాగంలో మిట్టలు, పర్వత శ్రేణులు ఉన్నాయని కనుగొన్నారు.
- మధ్య పొరల నుంచి పైకి లేచే లావా వల్ల ఇవి ఏర్పడుతున్నాయి.
- మిట్టప్రాంతంలో నేలపైకి నెట్టబడి బీటలు వారటం వల్ల బసాల్ట్ రాళ్ళతో కూడిన సముద్రపు కొత్తనేల తయారవుతుంది.
- ఆ తరువాత ఇది మిట్టనుంచి రెండు వైపులా పక్కలకు విస్తరిస్తుంది. అంటే మన భూమి మీద మహాసముద్ర మధ్య ప్రాంతంలోని మిట్టలలో అత్యంత తాజాగా ఏర్పడిన పై పొర ఉంటుంది.
ప్రశ్న 12.
భూగర్భవేత్తలు హిమాలయాల్లో సముద్ర జీవుల శిలాజాలను కనుగొన్నారు. వీటిల్లో చాలా వాటిని ‘సాలగ్రామాలు’ (శివలింగాకారంలో) గా ఇళ్లల్లో పూజిస్తారు. ఈ శిలాజాలు హిమాలయాల్లో ఎందుకు ఉన్నాయి?
జవాబు:
- ఖండఫలకాలు జరిగేటప్పుడు ఖండాల అంచులలో ఉన్న శిలాద్రవం పైకి వచ్చి పర్వతాలు ఏర్పడతాయి.
- హిమాలయాలు ప్రపంచంలో నూతన ముడుత పర్వతాలు.
- యురేసియా ఫలకాన్ని ఇండియా ఫలకం నెట్టడం వల్లనే హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి.
- కనుక సముద్ర జీవుల శిలాజాలు నూతనంగా ఏర్పడిన హిమాలయాల్లోనే ఉన్నాయి.
ప్రశ్న 13.
భూమి మీద జరుగుతున్న ఇటువంటి పెనుమార్పులు మన అనుభవంలోకి ఎందుకు రావటం లేదు? అవి మనల్ని ప్రభావితం చేయకపోవడంవల్లనా? ఈ మార్పులు అసలు మనల్ని ఏరకంగానైనా ప్రభావితం చేస్తాయా?
జవాబు:
భూమి మీద జరుగుతున్న ఇటువంటి పెనుమార్పులు కొన్ని వందల, వేల సంవత్సరాలకు జరుగుతుంటాయి. అప్పటికి మానవుల జీవిత కాలం చాలదు. అందువల్ల అవి మన అనుభవంలోకి రావడం లేదు. అవి మనల్ని ప్రభావితం చేయటం లేదు. ఈ మార్పులు మనల్ని మన తరువాత తరాల్ని అనేక రకాలుగా ప్రభావితం చేస్తాయి. జీవన విధానాన్ని మార్చివేస్తాయి.
9th Class Social Textbook Page No.19
ప్రశ్న 14.
అగ్నిపర్వతం పేలుడు వల్ల ఆ ప్రాంతంలో సంభవించే నష్టాలను ఊహించి రాయండి.
జవాబు:
అగ్నిపర్వతాలు పేలడం వల్ల ఆ ప్రాంతంలో సంభవించే నష్టాలు :
- అగ్ని పర్వతాలు పేలడం వల్ల సమీప ప్రాంతాలలో కూడా ధన, ప్రాణ నష్టాలు సంభవిస్తాయి.
- పంటలు నాశనమౌతాయి, జలాలు కలుషితమౌతాయి.
- బూడిద, అనేక రకాల వాయువులు, ధూళితో వాతావరణం కలుషితమవుతుంది.
9th Class Social Textbook Page No.20
ప్రశ్న 15.
శిలలోని అంతర్భాగం బయటిభాగం కంటే ఎందుకు కఠినంగా ఉంటుంది?
జవాబు:
శిలలోని అంతర్భాగం బయటిభాగం కంటే కఠినంగా ఉండటానికి గల కారణాలు :
- రాళ్ళు వేడెక్కినప్పుడు వ్యాకోచిస్తాయి. చల్లబడినప్పుడు సంకోచిస్తాయి.
- ఇది ప్రతి పగలూ, రాత్రి, వేసవి, శీతా కాలాల్లో సంవత్సరాల తరబడి జరుగుతూ ఉంటుంది.
- పైన ఉన్న రాళ్ళు సంకోచించి, వ్యాకోచించి తిరిగి సంకోచిస్తూ ఉండటం వల్ల అవి పెళుసుగా మారి ముక్కలవుతాయి.
- నీళ్ళు, గాలిలోని తేమ కూడా ఈ ప్రక్రియకు దోహదం చేస్తుంది.
- అందువలన అంతర్భాగం గట్టిగా ఉంటుంది.
9th Class Social Textbook Page No.21
ప్రశ్న 16.
ఆనకట్టలు కట్టటానికి గార్జెస్ అనువుగా ఉంటాయి. ఎందుకో చెప్పండి.
జవాబు:
- రాళ్ళు (శిలలు) చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి, లోతైన లోయగా కోస్తుంది. దీని అంచులు నిటారుగా ఉంటాయి. వీటిని గార్జెస్ అంటారు.
- గార్జెస్ వద్ద ఆనకట్టలు కట్టడానికి అనుకూలంగా ఉంటుంది. కారణం
- నదులు సన్నగా ఉంటాయి.
- రెండు వైపులా నిటారుగా రాళ్ళు ఉంటాయి. ఇవి కోతకు గురికాకుండా ఆనకట్టలు ఉంటాయి.
- అందువల్ల ఇవి ఆనకట్టలు నిర్మించడానికి అనుకూలంగా ఉంటాయి.
9th Class Social Textbook Page No.22
ప్రశ్న 17.
జలపాతాలు ఎలా ఉపయోగపడతాయో వివరించండి.
జవాబు:
- వినోద పర్యటనానికి ఉపయోగపడతాయి.
- జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించడానికి అనువుగా ఉంటాయి.
ప్రశ్న 18.
మన రాష్ట్రంలోని జలపాతాల వివరాలు సేకరించండి.
జవాబు:
- విశాఖపట్టణం జిల్లాలోని రణజిల్లెడ జలపాతం.
- గుంటూరు జిల్లాలోని మాచర్ల వద్ద ఎత్తిపోతల జలపాతం.
ప్రశ్న 19.
కొన్ని జలపాతాల చిత్రాలు సేకరించండి.
జవాబు:
9th Class Social Textbook Page No.23
ప్రశ్న 20.
పర్వత, మైదాన ప్రాంతాలలో నదీ ప్రవాహంలోని పోలికలు, తేడాలు పేర్కొనండి. ఈ రెండింటి మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
పర్వత ప్రాంతాలు :
- వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నదీ ప్రవాహం వేగంగా ఉండి కొండను నిలువుగా కోతకు గురిచేస్తుంది.
- ‘V’ ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి.
- రాళ్ళు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి లోతైన లోయగా కోస్తుంది. వీటిని గార్డెన్ అంటారు.
- వాలులో తేడాలు బాగా ఎక్కువగా ఉండే పర్వత ప్రాంతాలలో జలపాతాలు అధిక సంఖ్యలో ఉంటాయి.
మైదాన ప్రాంతాలు :
- మైదాన ప్రాంతంలో వాలు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి నదీ ప్రవాహ వేగం తగ్గుతుంది.
- అప్పుడు బరువైన రేణువులను తీసుకువెళ్ళే శక్తి నదికి ఉండదు.
- నదికి వరదలు వచ్చినపుడు అది నేలను కోతకు గురిచేస్తుంది.
- వరద తగ్గుముఖం పట్టినపుడు కోసిన మట్టిని వేరేచోట మేట వేస్తుంది.
- మైదాన ప్రాంతాలలో నది తరచూ తన ప్రవాహ దారిని మారుస్తూ ఉంటుంది.
- మైదాన ప్రాంతాలలో నదులు డెల్టాలను ఏర్పరచుతాయి.
రెండింటి మధ్య సంబంధం :
- కొండలలో పడిన వర్షపు నీరు నదులలో ప్రవహించి మైదాన ప్రాంతాలలో డెల్టాలను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది.
- కొండల ప్రాంతంలో నదీప్రవాహ వేగం ఎక్కువగా ఉండటం వలన సారవంతమైన పై పొర కొట్టుకు వచ్చి మైదాన ప్రాంతాలలో నదీ ప్రవాహ వేగం తక్కువగా ఉంటుంది కాబట్టి దానిని అక్కడ మేట వేయగలదు.
- దాని వలన సారవంతమైన మైదానాలు ఏర్పడి తద్వారా పంటలు బాగా పండటానికి అవకాశం ఉంటుంది.
ప్రశ్న 21.
పర్వత ప్రాంతాలతో పోలిస్తే వరద మైదానాలు మానవ ఆవాసానికి ఎందుకు అనువుగా ఉంటాయి?
జవాబు:
- కొండ ప్రాంతాలు ఎత్తైన ప్రాంతాలు. ఇవి మానవ నివాసానికి అనువైన ప్రాంతాలు కావు.
- ఇవి ఎగుడు దిగుడు స్థలాకృతులను కలిగి ఉంటాయి.
- అందువలన వ్యవసాయం చేయడానికి, పంటలు.పండించడానికి అనువైనవి కావు.
- శిలా నిర్మితమై ఉంటుంది. కాబట్టి మొక్కలు నాటటానికి అనుకూలంగా ఉండవు.
- అదే వరద మైదానాలు అయితే బల్లపరుపుగా ఉంటాయి.
- విశాలంగా ఉంటాయి. నీటిని నిలువ చేసుకోడానికి అనుకూలంగా ఉంటాయి.
- సారవంతమైన నేలలు ఉంటాయి.
- పంటలు సమృద్ధిగా పండుతాయి.
- ఇళ్లు నిర్మించడానికి అనుకూలంగా ఉంటాయి. నివాస యోగ్యాలుగా ఉంటాయి. కనుక ప్రజలు కొండ ప్రాంతాల్లో కన్నా మైదాన ప్రాంతాలలోనే ఎక్కువగా నివసిస్తారు.
ప్రశ్న 22.
వరద మైదానాలలో ఉండటంలోని ప్రమాదాలు ఏమిటి?
జవాబు:
వరద మైదానాలలో ఉండటంలోని ప్రమాదాలు :
- తరచుగా వరదలు వస్తాయి.
- పంటలు పాడైపోతాయి.
- ఒక్కొక్కసారి చెట్లు, ఇళ్లు కూలిపోతాయి.
- జంతువులు, వస్తువులు కొట్టుకుపోతాయి.
- ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగుతుంది.
- కనుక వరద మైదానాలలో ఉండటం వలన పై ప్రమాదాలు ఎదురవుతాయి.
ప్రశ్న 23.
కొండ లేదా వరద మైదానాల్లో నివసిస్తున్న ప్రజల గురించి మీరు చదివిన దానిని గుర్తుకు తెచ్చుకోండి.
జవాబు:
- కొండ ప్రాంతాలలో గిరిజనులు, ఆదిమ వాసులు నివసిస్తారు.
- వారికి అంతగా నాగరికత తెలియదు.
- ఇప్పుడిప్పుడే పోడు వ్యవసాయం చేస్తున్నారు.
- అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తారు.
- రవాణా సౌకర్యాలను కల్పించడం కష్టంతో కూడుకున్న పని.
- మైదాన ప్రాంతాలలో నాగరీకులు నివసిస్తారు.
- అధునాతన, వ్యవసాయ పరికరాలను ఉపయోగించి వ్యవసాయం చేస్తారు.
- అధిక దిగుబడులను సాధిస్తారు.
- అధునాతన రవాణా సౌకర్యాలను సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు.
- పరిశ్రమలను స్థాపించవచ్చు. పారిశ్రామిక ఉత్పత్తులను ఉత్పత్తి చేయవచ్చు.
9th Class Social Textbook Page No.25
ప్రశ్న 24.
లోయస్ మైదానాలను డెల్టాతో పోల్చండి. వాటి మధ్య పోలికలు తేడాలు ఏమిటి?
జవాబు:
లోయస్ మైదానాలు:
- మెత్తగా ఉండే దుమ్ము ఎడారులను దాటి, కొట్టుకెళ్ళి పక్క భూముల మీద పడుతుంది. ఇటువంటి నేలను ”లోయస్” అంటారు.
- ఇది చక్కటి ఒండ్రు. దీంట్లో సున్నం చాలా ఎక్కువగా ఉంటుంది.
- రేణువులు ఒకదానితో ఒకటి అతుక్కుని ఉండి అదే సమయంలో దానికి నీళ్లు బాగా ఇంకిపోయే గుణముంటుంది.
- లోయస్ మేటతో ఏర్పడిన మైదానాలను లోయస్ మైదానాలు అంటారు.
డెల్టాలు :
1. సముద్రాన్ని నది చేరుకునేటప్పుడు దాంట్లో మేట వేయని రేణువులు ఉంటే అవి నదీ ముఖంలో మేట వేయబడి డెల్టా ప్రాంతం ఏర్పడుతుంది.
ఈ ప్రాంతం గ్రీకు అక్షరం డెల్టా (∆) రూపంలో ఉంటుంది. కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది.
పోలికలు :
- రెండూ ఇసుక రేణువులతో ఏర్పడినవే.
- రెండింటిలోనూ నీరు త్వరగా ఇంకిపోతుంది.
- రెండింటిలోనూ ఒండ్రు ఉంటుంది.
తేడాలు :
లోయస్ మైదానాలు | డెల్టా |
1. లోయస్ దుమ్ముతో ఏర్పడినది. | 1. డెల్టా నదులు తీసుకొచ్చిన ఒండ్రుతో ఏర్పడినది. |
2. లోయలో సున్నం ఉంటుంది. | 2. డెల్టాలలో గవ్వల రూపంలో సున్నం ఉంటుంది. |
3. లోయలో నీరు ఎక్కువగా ఇంకిపోతుంది. | 3. డెల్టాలలో నీరు ఎక్కువగా ఇంకిపోదు. నదులు ఎల్లప్పుడు ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి నీరు ఎక్కువగా ఉంటుంది. |
ప్రాజెక్టు
ప్రశ్న 1.
వివిధ వార్తాపత్రికలు, మ్యాగజైన్స్ ద్వారా భూకంపాలు, అగ్ని పర్వతాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఒక క్రమంలో అమర్చండి. ఇవి ఏ విధంగా ఏర్పడతాయి? మానవ జీవనాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?
జవాబు:
అగ్ని పర్వతాలు ఎలా ఏర్పడతాయి అనగా :
- భూమి లోపలికి పోయేకొలది ప్రతి 32 మీటర్లకు 1°C ఉష్ణోగ్రత పెరుగుతుంది.
- అందువల్ల భూమిలోపల కొన్ని ప్రదేశాలలో శిలలు కరిగిపోయి శిలాద్రవంగా (మాగ్మా) గా మారతాయి.
- ఈ మాగ్మా పైన కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ లాంటి వాయువులు ఉత్పత్తి అయి యుగ్మాను ఒత్తిడి చేసినందున మాగ్మా బలహీనంగా ఉన్న భూ పొరలను చీల్చుకుంటూ ఒక రంధ్రం చేస్తూ బయటపడి శంఖువు ఆకారంలో ఘనీభవించి అగ్ని పర్వతాలు ఏర్పడతాయి.
మానవ జీవనాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి. అనగా
- అగ్ని పర్వతాలు ఉద్భేదనము చెందిన ప్రాంతాలలోనూ సమీప పరిసర ప్రాంతాలలో కూడ ధన, ప్రాణ నష్టాలు సంభవిస్తాయని మనందరకూ తెలుసు.
- అయితే ఆ తరువాత ఎంతోకాలంపాటు ఈ అగ్నిపర్వతాలు ఉద్భేదనము ఫలితంగా మానవ జాతి అనేక విధాలుగా లాభం పొందుతుంది.
- ఈ ఉద్భేదనము ఫలితముగా భూమి లోతుల నుండే విలువైన ఖనిజాలు భూమి ఉపరితలానికి దగ్గరగా తీసుకుని రాబడతాయి.
- ఈ ప్రదేశాలలో సారవంతమైన నేలలు ఏర్పడతాయి.
ఉదా : భారతదేశంలోని డెక్కన్ ట్రాప్స్ ప్రాంతంలో ఏర్పడిన నల్లరేగడి నేలలు నూనెగింజలు, ప్రత్తి మొదలైన వాణిజ్య పంటలకు నిలయాలుగా ఉన్నాయి.