AP Board 9th Class Social Studies Important Questions and Answers English & Telugu Medium

Andhra Pradesh SCERT AP State Board Syllabus 9th Class Social Studies Chapter Wise Important Questions and Answers 2021-2022 in English Medium and Telugu Medium are part of AP Board 9th Class Textbook Solutions.

Students can also read AP Board 9th Class Social Studies Solutions for exam preparation.

AP State Syllabus 9th Class Social Studies Important Questions and Answers English & Telugu Medium

AP 9th Class Social Studies Important Questions and Answers in English Medium

AP 9th Class Social Chapter Wise Important Questions in Telugu Medium

AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 17th Lesson లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 17th Lesson లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

9th Class Social Studies 17th Lesson లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
1. కింది వాటిని జతపరచండి. (AS1)

1. నల్లమందు యుద్ధాలు అ) బెల్జియం
2. ఒట్టోమన్ సామ్రాజ్యం ఆ) స్పెయిన్
3. వ్యక్తిగత ఆస్తిగా వలస ప్రాంతం ఇ) వలస ప్రాంతంగా మార్చటానికి ముందు వ్యాపారాన్ని నియంత్రించారు
4. రైతులు స్థిరపడేలా చేయడం ఈ) చైనా

జవాబు:

1. నల్లమందు యుద్ధాలు ఈ) చైనా
2. ఒట్టోమన్ సామ్రాజ్యం ఇ) వలస ప్రాంతంగా మార్చటానికి ముందు వ్యాపారాన్ని నియంత్రించారు
3. వ్యక్తిగత ఆస్తిగా వలస ప్రాంతం అ) బెల్జియం
4. రైతులు స్థిరపడేలా చేయడం ఆ) స్పెయిన్

ప్రశ్న 2.
ఐరోపా వాసులు ‘కనుగొనటం’, ‘అన్వేషణ’ అన్న పదాలను ఎలా ఉపయోగిస్తారు? ఆ భౌగోళిక ప్రాంతాలలో ఉంటున్న ప్రజలను ఇవి ఎలా ప్రభావితం చేశాయి? (AS1)
జవాబు:
ఐరోపా వాసులు ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య వర్తక వాణిజ్యాలు కొనసాగించి అధిక లాభాలు ఆర్జించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో వర్తక వాణిజ్యాలు కొనసాగించడానికి, అనేక నూతన ప్రదేశాలను కనుగొని, ముఖ్య పట్టణాలలో ముఖ్యమైన వ్యాపార కేంద్రాలను అన్వేషణ చేసి వ్యాపారాభివృద్ధికి తోడ్పడ్డారు. ప్రపంచానికి తెలియని అనేక కొత్త ప్రాంతాలు, దేశాలను అన్వేషించి, వాటికి పేర్లు పెట్టారు. తమ వలస ప్రాంతాలకు తేలికగా, సులువుగా చేరుకొనే ప్రయత్నంలో అనేక కొత్త మార్గాలను అన్వేషించారు. పోర్చుగీసు వాళ్ళు ఆఫ్రికా చుట్టుముట్టి భారతదేశానికి దారి కనుక్కోటానికి ప్రయత్నించారు. వివిధ కొత్త ప్రాంతాలను అన్వేషించి, కనుగొనడం ద్వారా ఆయా ప్రాంత ప్రజలు ఆనందం వెలిబుచ్చారు. వ్యాపారాభివృద్ధితో ముందుకు నడిపించడమే కాకుండా కొన్ని సందర్భాలలో హింసలకు, బానిసత్వానికి గురయ్యారు. ఏ విధమైన స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు లేక వలస పాలకుల అధీనంలో చీకటి బతుకులు బతికేవాళ్ళు.

AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

ప్రశ్న 3.
వలస ప్రాంతాలుగా మార్చటంలో వ్యాపారం పోషించిన పాత్ర ఏమిటి? (AS1)
జవాబు:
రాజుల పాలనలో రాజుల ఆధీనంలో ఉన్న ముఖ్య పట్టణాలను, వ్యాపారం పేరిట వివిధ దేశాలకు చెందిన వ్యాపారస్తులు, రాజుల అనుమతితో వర్తకం చేసుకోవడానికి అనుమతి పొందేవారు. తమ వ్యాపార మెళుకువలతో రాజులను ఆకర్షించడమే కాకుండా ముఖ్య నగరాలు, ముడి పదార్థాలు అభ్యమయ్యే ప్రాంతాలను తమ వ్యాపార కేంద్రాలుగా వ్యాపారస్తులు మలుచుకున్నారు. అంతేకాకుండా అప్పుడు రాజులలో ఉన్న అనైక్యత, వైరుధ్యాలు, వైరాలను తమకు అనుకూలంగా మార్చుకొని, లంచం రూపంలో నిధులు అందించి, చాలా ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. వ్యాపార కేంద్రాలు ద్వారా తమ అధీనమైన ప్రాంతాలలోని ప్రజలను బానిసలుగా చేసి, వలస ప్రాంతాలుగా మలుచుకొని అధిక సంపదను దోచుకొని, తమ పాదాక్రాంతం చేసుకున్నారు.

ప్రశ్న 4.
వలస పాలన వివిధ దేశాలలో స్థానిక ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేసింది? మూడు ఖండాలకు వేరుగా ఒక్కొక్క దాని గురించి ఈ కింది నేపథ్యంలో రాయండి.
ఎ) పండించిన పంటలు
బి) మతం
సి) ప్రకృతి వనరుల వినియోగం (AS1)
జవాబు:
ఎ) పండించిన పంటలు :
యూరపు వలస ప్రాంతాలలోని స్థానికులు నావికులను, వ్యాపారస్తులను ఆహ్వానించి, ఆహారం, ఆశ్రయం ఇచ్చారు. కాని స్పెయిన్ ప్రజలు వాళ్ళను దోచుకుని బానిసలుగా వాడుకున్నారు. వ్యవసాయ క్షేత్రాలలో వలస ప్రాంతాలు ఏర్పరిచారు. పండిన పంటలు ఆక్రమించుకుని రైతుల భూములు ఆక్రమించి వారికి భూముల్లేకుండా చేశారు.

లాటిన్ అమెరికాలో వలస దేశాల పరిపాలనలో కేథలిక్కు చర్చి కూడా ముఖ్య పాత్ర పోషించింది. స్పెయిన్ నుంచి స్థిరపడినవారి అధీనంలో విశాల భూభాగాలు ఉండేవి. వీటిని ‘హసియండా’ అనేవాళ్ళు. వేలాది ఎకరాలలో విస్తరించి అందులో వెండి, రాగి గనులు, వ్యవసాయ భూములు ఉండేవి. చెరుకు, పొగాకు, పత్తి వంటి వాణిజ్య పంటలను సాగుచేసి వలస పాలిత ప్రాంతాలు వాటిని చవకగా తమపై ఆధిపత్యమున్న దేశాలకు అమ్మాలి.

ఆసియాలో యూరపు వలస దేశాల పాలనలో కూడా రబ్బరు, మిరియాలు, చెరుకు వంటి ఏక పంటలతో ప్రోత్సహించారు.

బి) మతం :
మూడు ఖండాల మధ్య చాలా వ్యాపార మార్గాల అన్వేషణ, నియంత్రణ, అధిక లాభాలకై యుద్దాలు చేసేవారు. కేథలిక్కు మత విధానాలను బలవంతంగా రుద్దసాగారు. మతాధికారులు, మతగురువులు, పోపు ఆధిపత్యం కొనసాగింది. వలస పాలిత ప్రాంతాలలో మత ఆధిపత్యం చెలాయించటానికి అధికంగా ప్రయత్నించారు.

సి) ప్రకృతి వనరుల వినియోగం :
వలస ప్రాంతాలలో ప్రకృతి వనరులు ఈ మూడు ఖండాల వారిని ఆకర్షించాయి. ప్రకృతి వనరులను తమ అధీనంలోకి తెచ్చుకోడానికిగాను భూదాహంతో ఆయా ప్రాంతాలలో స్థిరపడడానికి ప్రయత్నించారు. విలువైన బంగారు గనులు, వెండి నిక్షేపాలు గల భూములను ఆక్రమించి, యజమానులను తరిమికొట్టారు. కొన్ని ప్రాంతాలలో వలస ప్రాంత భూములను చవకగా పొంది ప్రకృతి వనరులను అనుభవించారు.

AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

ప్రశ్న 5.
చైనా, భారతదేశం, ఇండోనేషియాలపై వలసపాలన తీరు గురించి రాయండి. వాటి మధ్య పోలికలు, తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
భారతదేశం :
15వ శతాబ్దం ఆరంభంలో గోవా వంటి ఓడ రేవుల పై పోర్చుగీసు ఆధిపత్యం సాధించింది. ఇతర యూరప్ దేశాలు 16వ శతాబ్దం చివరి నాటికి వ్యాపార కేంద్రాలను స్థాపించి, భారతదేశంతో వ్యాపారం చేయటం మొదలుపెట్టాయి. భారతదేశ భాగాలపై రాజకీయ నియంత్రణ దక్షిణ భారతంలో మొదలైంది. మద్రాస్ పైన బ్రిటిష్, పాండిచ్చేరి పైన ఫ్రెంచి ఆధిపత్యం సాధించాయి. చవక ధరలకు తమ ఉత్పత్తులను అమ్మేలా రైతులు, చేతి వృత్తి కళాకారులు, వ్యాపారస్తులను బలవంతం చేయటానికి తన రాజకీయ శక్తిని బ్రిటిషు వారు ఉపయోగించుకున్నారు.

చైనా :
యూరపు దేశాలు చైనాలో స్వేచ్ఛగా వ్యాపారం చేయడానికి చైనా అనుమతించలేదు. ఒక పట్టణంలో మాత్రమే వ్యాపారం చేసుకోడానికి అనుమతిచ్చారు. చైనాలో బాగా గిరాకి ఉండి, భారత్ లో విరివిగా పండు నల్లమందు అక్రమ రవాణా ద్వారా లాభాలు గడించాలని యూరపు దేశస్తులు తలంచారు. నల్లమందు ద్వారా తమ దేశస్తులు నష్టపోతున్నారని చైనా తలంచగా ఈ రెండు దేశాల మధ్య, 1840 – 42 ల మధ్య యుద్ధాలు జరిగాయి. తదుపరి చైనా ఓడిపోయి ఇంగ్లాండు. ఒప్పందాలకు అంగీకరించింది.

ఇండోనేషియా :
బలమైన రాజ్యాలు లేని ఇండోనేషియాలోని విశాల భూభాగాలను డచ్ కంపెనీ ఆక్రమించుకోసాగింది. తమ ఉత్పత్తులను కంపెనీకి తక్కువ ధరలకు అమ్మేలా స్థానిక ప్రజలపై ఒత్తిడి పెట్టగలిగింది. 1800 సం|| నుండి ఇండోనేషియా ఆక్రమించుకొని పాలించసాగింది. ఆ దేశాన్ని ఆదాయ వనరుగా ఉపయోగించుకుంది.

పోలికలు :

  1. ఈ మూడు దేశాలు వలస దేశాలుగా ఉన్నవే.
  2. ఈ మూడు దేశాలు, ప్రకృతి వనరులు, సహజ సంపదతో విలసిల్లేవి.
  3. వ్యాపారాలతో ప్రారంభించి, వలసవాద దేశాల అధీనంలోనికి వెళ్ళినవే.
  4. ఇచ్చట ప్రజలలో, రాజులలో అనైక్యత మూలంగానే.
  5. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న దేశాలు.
  6. ప్రజలను బానిసలుగా మార్చారు.

తేడాలు :
‘భారతదేశం’లో అన్ని ప్రాంతాలలో వర్తక వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతులు పొందారు. (ముఖ్య పట్టణాలు).

‘చైనా’ అన్ని ప్రాంతాలు కాకుండా, ఒకే ఒక్క పట్టణంలో వ్యాపారానికి అనుమతి.
‘ఇండోనేషియా’ బలమైన రాజ్యాలు లేకపోవడం వల్ల దేశం అంతా ఆక్రమణ.
భారతదేశంలో ఆధిపత్యానికి ఒకదానితో ఒకటి పోటి పడసాగాయి. అనేక యుద్ధాలు ద్వారా పరిపాలన పాదాక్రాంతం. చైనాలో నల్లమందు ద్వారా యుద్ధాలు ప్రారంభం. అనేక ఒప్పందాలు వల్ల నిధులన్ని కొల్లగొట్టారు.
ఇండోనేషియాలో రబ్బరు, మిరియాలు, చెరుకు వంటి ఏక పంటలతో విస్తృత తోటలు సాగు చేయటాన్ని ప్రోత్సహించింది.

ప్రశ్న 6.
ప్రపంచ పటం నందు పోర్చుగీసు, డచ్, బ్రిటిష్, ఫ్రెంచి వలసలను గుర్తించి, రంగులతో నింపండి. (AS5)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం 4

9th Class Social Studies 17th Lesson లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం InText Questions and Answers

9th Class Social Textbook Page No.205

ప్రశ్న 1.
వాళ్ళకు అసలు తెలియని ఖండాలు ఏవి?
జవాబు:
ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణా అమెరికా, అంటార్కిటికా.

ప్రశ్న 2.
వాళ్ళకు తీర ప్రాంతాలు తెలిసి, లోపలి ప్రాంతాలు తెలియని ఖండాలు ఏవి?
జవాబు:
ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, యూరప్.

9th Class Social Textbook Page No.206

ప్రశ్న 3.
1400 లలో ఆసియాతో వ్యాపారాన్ని యూరపు దేశాలైన పోర్చుగల్, స్పెయిన్ కాకుండా ఇటలీ ఎందుకు నియంత్రిస్తోంది?
జవాబు:
1400 సం||నాటికి యూరపు, ఆసియాల మధ్య చాలా వరకు వ్యాపార మార్గాలను ముస్లిం రాజ్యాలు నియంత్రించసాగాయి. ప్రత్యేకించి ఒట్టోమన్ సామ్రాజ్యం యూరప్ క్రైస్తవ శక్తులతో నిరంతరం యుద్ధాలు చేస్తుండేది. ఇటలీ దేశస్థులు అరబ్బు వ్యాపారస్తులతో కుదుర్చుకున్న ఒప్పంద ఫలితంగా వాళ్ళు ఆసియా నుండి సరుకులు తెచ్చి అలెగ్జాండ్రియా దగ్గర వాళ్లకి అమ్మేవాళ్ళు. పశ్చిమ యూరపులో హాలెండ్, స్పెయిన్, పోర్చుగల్, ఇంగ్లాండ్ వంటి దేశాల వ్యాపారస్తులు, ప్రభుత్వాలు, ఈ వ్యాపార ప్రాముఖ్యతను గుర్తించారు. దాంతో భారతదేశం, చైనా వంటి దేశాలకు ఇటలీ వ్యాపారస్తుల నియంత్రణలో ఉన్న ప్రాంతాల నుంచి కాకుండా తేలికగా, త్వరగా చేరుకునే మార్గాలను అన్వేషించసాగారు.)

AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

ప్రశ్న 4.
ఆసియాకి మరో మార్గాన్ని కనుక్కోవటానికి పోర్చుగల్, స్పెయిన్ దేశాలు ఎందుకు అంత ఆసక్తి కనపరిచాయి?
జవాబు:
భారతదేశం, చైనా, ఇండోనేషియా వంటి దేశాలు. ఇటలీ వ్యాపారస్తుల నియంత్రణలో ఉండటం, కొన్ని ప్రాంతాలలో ఇటలీ ఒప్పందం కుదుర్చుకొని వ్యాపారలావా దేవీలు కొనసాగించడం వల్ల ఈ మార్గాలు కాకుండా తేలికగా, త్వరగా చేరుకొనే మార్గాలను అన్వేషించారు. ఉదా : పోర్చుగీసు వాళ్ళు ఆఫ్రికా చుట్టుముట్టి భారతదేశానికి దారి కనుక్కోటానికి ప్రయత్నించారు. అట్లాంటిక్ మహా సముద్రాన్ని దాటటం ద్వారా భారతదేశం చేరుకోవచ్చో లేదో తెలుసుకోవాలని స్పెయిన్ ప్రయత్నించింది. అనుభవజ్ఞులైన నావికులు, ఓడలు ద్వారా ఆసియాను అన్వేషణ చేశారు.

9th Class Social Textbook Page No.208

ప్రశ్న 5.
1800 నాటి దక్షిణ అమెరికా పటాన్ని చూసి వివిధ వలస రాజ్యా లను, పాలిత దేశాలను గుర్తించండి.
జవాబు:
దక్షిణ అమెరికా వలస రాజ్యా లు :
పోర్చుగీసు, స్పెయిన్, డచ్, యు.కె.

పాలిత దేశాలు :
ఉరుగ్వే,
వెనిజులా,
ఈక్వెడార్,
బొలీవియా,
పెరు,
పరాగ్వే,
అర్జెంటైనా.
AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం 2

ప్రశ్న 6.
వలస ప్రాంతాల ప్రభుత్వాలలో అక్కడ స్థిరపడిన స్పానిష్ ప్రజలకు ప్రముఖ పాత్రను ఎందుకు ఇవ్వలేదు?
జవాబు:
స్పానిష్ ప్రజలకు వలస ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వలేదు. వలస దేశాల పరిపాలనలో కేథలిక్కు చర్చి. కూడా ముఖ్యపాత్ర పోషించేది. స్పెయిన్ కి చవకగా ప్రకృతి వనరులు, శ్రామికులను అందించేలా వలస ప్రాంతాల ఆర్థిక విధానాలను నియంత్రించారు, కానీ ఆ దేశాలు అభివృద్ధి చెందడానికి కాదు. స్పానిష్ ప్రజలకు ఉన్న ఆయుధాలు. మందుగుండు సామగ్రి వలస ప్రాంత ప్రభుత్వాలను భయపెట్టింది. స్పానిష్ వలస పాలనలో ఉన్న ప్రజలు అక్కడ ఎంతో కాలం క్రితం స్థిరపడిన స్పానిష్ ప్రజలతో సహ తమపై స్పానిష్ రాచరిక వర్గాల నియంత్రణను ద్వేషించసాగారు.

9th Class Social Textbook Page No.209

ప్రశ్న 7.
మీరు ఎనిమిదవ తరగతిలో నిజాం రాజ్యంలోని జమీందారీ వ్యవస్థ గురించి చదివారు. నిజాం రాష్ట్రంలోని జమీందారీ వ్యవస్థను దక్షిణ అమెరికాలోని హసియండాలతో పోల్చండి. వాటి మధ్య పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
జమీందారీ వ్యవస్థకు, హసియండాలతో పోలికలు, తేడాలు ఉన్నాయి.

పోలికలు :

  • జమీందారీ వ్యవస్థలోను, హసియండాలోను కూడా ఉండేవి వ్యవసాయ భూములే.
  • జమీందారుల అధీనంలోని భూములు, భూస్వాముల అధీనంలోని భూములు వేలల్లో ఉండేవి.
  • తరతరాలుగా అనుభవిస్తున్నారు.

భేదాలు :

  • జమీందారీ వ్యవస్థలోని భూముల్లో కొన్ని సారవంతమైనవి. మరికొన్ని ఎకరాలు నిస్సారమైనవి.
  • హసియండా భూములు బాగా ఖరీదైనవి, సారవంతమైనవి.
  • జమీందారీ భూములను చిన్నచిన్న రైతులు, కౌలుదార్లు వ్యవసాయం చేసేవారు.
    హసియండా భూముల్లో ఆఫ్రికా బానిసలు, స్వేచ్ఛలేని ఇండియన్లను నియమించుకునేవారు.
  • జమీందారుల భూముల్లో రకరకాల పంటలు, అడవులు, చెట్లు ఉండేవి.
    హసియండా వేలాది ఎకరాలలో విస్తరించి అందులో వెండి, రాగి గనులు, వ్యవసాయ భూములు, పచ్చిక బీళ్ళు, కర్మాగారాలు కూడా ఉండేవి.
  • జమీందారీ భూముల్లో భూ సంస్కరణ, భూ పరిమితి చట్టాలు వలన కొంత భూమి కోల్పోయారు. హసియండాలో భూములు కోల్పోలేదు.

ప్రశ్న 8.
లాటిన్ అమెరికాలోని వలస పాలిత ప్రాంతాల్లో దిగువ ప్రజల సమస్యల జాబితా తయారుచేయండి.
జవాబు:
1. హసియండాల యజమానులైన స్పానిష్ వలసవాదులు :
స్పెయిన్ నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళ చేతుల్లో ఆ దేశాల గనులు, భూములు ఉండేవి. వాళ్ళల్లో కొంతమంది పెద్ద భూస్వాములుగా ఉండేవాళ్ళు. వీళ్ళ కింద ఉండే విశాల భూభాగాన్ని “హసియండా” అనేవాళ్ళు. ఈ భూస్వాములు తమకింద పనిచేయటానికి, ఆఫ్రికా బానిసలను లేదా స్వేచ్ఛలేని ఇండియన్లని నియమించుకునే వాళ్ళు. వీరు అనేక బాధలు, కష్టాలు అనుభవిస్తూ, తమ శక్తిని ధారపోసి పనిచేసేవాళ్ళు.

2. అమెరికాలో స్థిరపడిన చిన్న స్పానిష్ రైతులు :
అమెరికాలో స్థిరపడిన చిన్న స్పానిష్ రైతులు ఉండేవారు. కాని వలస ప్రాంతాల పరిపాలనలో అక్కడ స్థిరపడిన స్పెయిన్ ప్రజలకు ఎటువంటి పాత్ర లేదు. స్పెయిన్ కి చవకగా ప్రకృతి వనరులు, శ్రామికులను అందించేలా వలస ప్రాంతాల ఆర్థిక విధానాలను నియంత్రించారు. కాని ఆ దేశాలు అభివృద్ధి చెందటానికి కాదు.

3. స్థానిక అమెరికన్లు :
‘దక్షిణ అమెరికాలో అధికభాగం స్పెయిన్, పోర్చుగల్ అధీనంలోకి వచ్చింది. ప్రజలలో సగానికిపైగా ప్రజలు యూరోపియన్ల చేతుల్లో హతమయ్యారు. తద్వారా యూరప్ ప్రజల నియంత్రణలో, బ్రతికారు. చాలామంది స్థానిక అమెరికన్లు స్పానిష్ నియంత్రణలోకి వచ్చారు. భారీగా పన్నులు చెల్లించేవారు. గనులు, వ్యవసాయ క్షేత్రాలలో పనిచేయవలసి వచ్చేది. గుడులను విధ్వంసం చేసి చాలామందిని రోమన్ కాథలిక్కు మతానికి మార్చేశారు.

4. లాటిన్ అమెరికాలో స్థిరపడిన ఆఫ్రికా బానిసలు :
లాటిన్ అమెరికాలో స్థిరపడిన ఆఫ్రికా బానిసల జీవనం దుర్భరంగా ఉండేది. దక్షిణ అమెరికాలో చాలామంది హతమవ్వడం, రోగాల బారిన పడి చనిపోవడం వల్ల ఆఫ్రికా బానిసలను కొనసాగారు. తద్వారా వాళ్ళు జీవితాంతం నరకయాతన అనుభవించేవాళ్ళు. ఎదిరించే శక్తి లేక, సరైన ఆయుధాలు, నాయకత్వం లేకపోవడం వలన కటికచీకటి బతుకులు అనుభవించేవారు.

9th Class Social Textbook Page No.211

ప్రశ్న 9.
వలసపాలన నుంచి స్వాతంత్ర్యం పొందినప్పటికీ లాటిన్ అమెరికా దేశాలు ఇంకా ఎందుకు అభివృద్ధి చెందకుండా ఉండిపోయాయి?
జవాబు:

  1. పారిశ్రామిక దేశాలైన బ్రిటన్, అమెరికాలపై ఆధారపడి ఉండటం.
  2. సామాజిక, ఆర్థిక, అసమానతలు తీవ్రంగా ఉండడం.
  3. భూమి లేకపోవడం వల్ల పేదరికం ఎక్కువగా ఉండి ఈ దేశాలు అభివృద్ధి చెందకుండా ఉండిపోయాయి.

ప్రశ్న 10.
మన్రో సిద్ధాంతం లాటిన్ స్వాతంత్ర్యాన్ని ఏ విధంగా కాపాడింది ఇది వాటి స్వాతంత్ర్యాన్ని పరిమితం కూడా చేసిందా?
జవాబు:
1820 నాటికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు బలమైన ఆర్థిక, రాజకీయ శక్తిగా ఎదిగింది. అమెరికా అధ్యక్షుడు జేమ్స్. మన్రో తయారుచేసిన ‘మన్రో సిద్ధాంతం ప్రకారం అమెరికా ఖండాలలో యూరప్ దేశాలు ఏవీ వలస ప్రాంతాలను ఏర్పరచుకోకూడదు. అందుకు ప్రతిగా ఇతర ఖండాలలో యూరపు వ్యవహారాల్లో కానీ, వలస ప్రాంతాలలో కానీ అమెరికా జోక్యం చేసుకోదు. వాటి స్వాతంత్ర్యాన్ని పరిమితం చేయలేదు.

AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

ప్రశ్న 11.
మన్రో సిద్ధాంతం వల్ల బ్రిటన్ ఏ విధంగా లాభపడింది?
జవాబు:
బలమైన నౌకాదళం ఉన్న బ్రిటన్ మన్రో సిద్ధాంతాన్ని సమర్ధించింది. అమెరికా ఖండాలలోని దేశాలు యూరపు శక్తుల రాజకీయ అధీనంలో లేకపోతే వాటికి ఇంగ్లాండుతో వ్యాపారం చేయడానికి, వాటి పారిశ్రామిక ఉత్పత్తులను కొనే స్వేచ్ఛ ఉంటుంది.

9th Class Social Textbook Page No.215

12. పాశ్చాత్య దేశాలు చైనా నుంచి దిగుమతి చేసుకున్న ముఖ్యమైన వస్తువులు పట్టు, తేయాకు.

13. చైనాలో పాశ్చాత్య దేశాలు అమ్మటానికి ప్రయత్నించిన ఉత్పత్తి నల్లమందు.

14. చైనాలో వ్యాపారాన్ని ప్రభావితం చేయటానికి ప్రయత్నించిన ఆసియా దేశం జపాన్.

9th Class Social Textbook Page No.216

ప్రశ్న 15.
1913 నాటి ఆఫ్రికా పటాన్ని చూసి ఆఫ్రికాని ఏ మేరకు యూరపు దేశాలు తమ వలస ప్రాంతాలుగా మార్చుకున్నాయో చూడండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం 1

ప్రశ్న 16.
కింద పట్టికలో ఆఫ్రికాలోని కొన్ని దేశాల పేర్లు ఉన్నాయి. 1913లో వీటిని వలసగా చేసుకొని పాలించిన దేశం పేరును ఎదురుగా రాయండి.
జవాబు:

ఆధునిక దేశం 1913 నాటికి వలసగా చేసుకొని పాలించిన దేశం
దక్షిణ ఆఫ్రికా ఇంగ్లాండ్
ఈజిప్టు ఇంగ్లాండ్
నైజీరియా ఫ్రాన్స్
ఘనా ఇంగ్లాండ్
లిబియా ఇటలీ
అల్జీరియా ఫ్రాన్స్
అంగోలా పోర్చుగీసు
కాంగో బెల్జియం

ప్రాజెక్టు

ప్రశ్న 1.
మీరు బ్రిటన్ పౌరులైతే వలసపాలనను సమర్థిస్తారా? ఎందుకు? భారతదేశ పౌరులుగా వలస పాలనకు మద్దతు ఇస్తారా? వ్యతిరేకిస్తారా? మీ దృక్పథాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
బ్రిటన్ పౌరుడిని అయితే వలస పాలనను సమర్థిస్తాను. ఎందుకంటే ప్రపంచ పోటీని తట్టుకోడానికి, వర్తక వాణిజ్యాలలో, ముందుండడానికి, విశాల సామ్రాజ్యం మా అధీనంలో ఉండడానికి, బ్రిటన్ ప్రపంచంలో బలమైన రాజ్యమని ప్రపంచ ప్రజలు జేజేలు పలకడానికి సమర్థిస్తాను.

భారతదేశ పౌరులుగా వలస పాలనను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే దాస్య బతుకులు, చీకటి పాలన వద్దని, పరదేశీయుల చేతుల్లో భారతమాత చిక్కరాదని, అపార సహజ వనరులు, ముడి పదార్థాలు, సుగంధ ద్రవ్యాలు విలువైన వస్తువులు వేరొక ప్రాంతానికి తరలించడం ఇష్టంలేక, అవమానాలు, బానిస బతుకులు మాకొద్దని, స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ఎంతో ముద్దని, త్యాగధనుల స్ఫూర్తి ఆదర్శాలు వెల్లివిరియాలని వలస పాలనను వ్యతిరేకిస్తాను.

పటనైపుణ్యం

ప్రశ్న 1.
ప్రపంచ పటంలో ఈ దిగువ దేశాలను గుర్తించుము.
1. మెక్సికో
2. అమెరికా
3. చైనా
4. నెదర్లాండ్స్
5. ఇండోనేషియా
6. టర్కీ
7. స్పెయిన్
8. వెస్ట్ ఇండీస్
9. ఇటలీ
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం 3

AP Board 9th Class Social Solutions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 16th Lesson సామాజిక నిరసనోద్యమాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 16th Lesson సామాజిక నిరసనోద్యమాలు

9th Class Social Studies 16th Lesson సామాజిక నిరసనోద్యమాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
పారిశ్రామిక కార్మికుల జీవితాలకు సంబంధించి కింద ఉన్న వాక్యాలలో సరైనవి ఏవి ? సరికాని వాటిని సరిచేయండి. (AS1)
ఎ) కార్మికులు పరిశ్రమలను నియంత్రించేవాళ్ళు.
జవాబు:
కార్మికులు ఏ మాత్రం దయ, కనికరం, సానుభూతిలేని యజమానుల నియంత్రణలో పనిచేశారు.

బి) కార్మికుల జీవన పరిస్థితులు సౌకర్యంగా ఉండేవి.
జవాబు:
పారిశ్రామికీకరణ వలన కార్మికుల జీవన పరిస్థితులు దుర్భరంగా ఉండేవి.

సి) కార్మికుల అసంతృప్తికి తక్కువ వేతనాలు ఒక కారణం. (✓)
జవాబు:
ఈ వాక్యం సరియైనది.

డి) పారిశ్రామికీకరణ దశలో ఉద్వేగాలు, భావనలకు ప్రాధాన్యత ఉండేది.
జవాబు:
పారిశ్రామికీకరణ దశలో ఉద్వేగాలు, భావనల కంటే హేతువు, శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాలకు అధిక ప్రాధాన్యతనిచ్చారు.

ఇ) జానపద కథలు, జానపద పాటలలో ప్రకృతికి దగ్గరగా ఉన్న విలువలకు కాల్పనికవాద రచయితలు, కళాకారులు ప్రాధాన్యతనిచ్చారు.
జవాబు:
ఈ వాక్యం సరియైనది.

ప్రశ్న 2.
ఆ కాలపు కార్మికులు ఎదుర్కొన్న సమస్యలను కొన్నింటిని పేర్కొనండి. ఈ కాలంలో కూడా ఆ సమస్యలు ఉన్నాయేమో చర్చించండి. (AS1)
జవాబు:
ఆ కాలపు కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు :

  1. నూలు పరిశ్రమలలో యంత్రాలను ప్రవేశపెట్టడం వల్ల వేలాది చేనేత కార్మికులకు, పనిలేకుండాపోయింది.
  2. యంత్రాలతో పోటీపడలేని కార్మికులు ఉపాధి కోల్పోయి పేదలుగా మారారు.
  3. కనీస వేతనాలు ఉండేవి కావు.
  4. అధిక పని గంటలు ఉండేవి.
  5. మహిళల, పిల్లల పనిభారం ఎక్కువగా ఉండేది.
  6. తమ హక్కుల కోసం పోరాడడానికి బలమైన కార్మిక సంఘాలు లేవు. విద్య, వైద్య సదుపాయాలు లేవు.
  7. సానుభూతిలేని పర్యవేక్షకులు, యజమానుల నియంత్రణలో పనిచేయడం.
  8. భద్రత, గౌరవప్రద జీవనానికి అవకాశం లేదు.
  9. దారిద్ర్యం, దుర్భర జీవన పరిస్థితులు.
  10. నివసించే ప్రాంతాలు అంటువ్యాధులకు నిలయమై ఉండేవి.

ఈ రోజుల్లో :

  1. అంత దుర్భర జీవన పరిస్థితులు లేవు.
  2. కొన్ని ప్రాంతాలలో తక్కువ వేతనాలు లభిస్తున్నాయి.
  3. యజమానుల నిరంకుశత్వ, ఒంటెద్దు పోకడలు ఉన్నాయి.
  4. కార్మికుల కోర్కెలు తీర్చలేని యజమానులు లాకౌట్స్ పేరిట పరిశ్రమలను మూసివేస్తున్నారు.

AP Board 9th Class Social Solutions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

ప్రశ్న 3.
పెట్టుబడిదారీ విధానం, సామ్యవాదం (సోషలిజం)ల భావనలను పోలుస్తూ ఒక పేరా రాయండి.. అవి ఎంత వరకు సారూప్యాన్ని, వైవిధ్యాన్ని కలిగి ఉన్నాయి? (AS1)
(లేదా)
పెట్టుబడిదారీ విధానం, సామ్యవాద విధానం మధ్య పోలికలు, తేడాలు రాయండి.
జవాబు:
ఉత్పత్తి సాధనాలు వ్యక్తిగత ఆస్తిగా ఉండి, ఏం ఉత్పత్తి చేయాలి. అందులో ఎవరికి వాటా ఉండాలి అనే విషయాలను మార్కెట్టు నిర్ణయించే పెట్టుబడిదారీ విధానంలోని మౌలిక భావనలను సామ్యవాదం ఖండిస్తుంది. పెట్టుబడిదారీ విధానం సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమయ్యే పరిస్థితికి అనివార్యంగా, అన్యాయంగా, దోపిడీకి దారితీస్తుందన్నది సామ్యవాదం చేసే విమర్శ. ‘వ్యక్తిగత స్వేచ్ఛ, అవకాశాలలో సమానత్వం అన్నది పెట్టుబడిదారులకు మాత్రమే వర్తిస్తాయి. సోషలిస్టుల * ప్రకారం నిజమైన స్వేచ్ఛ, నిజమైన సమానత్వం ఉండాలంటే, ఏ సమాజమైన వర్ధిల్లాలంటే వనరులు సామాజిక నియంత్రణలో ఉండాలి.

పోలికలలో ప్రధానంగా పెట్టుబడిదారీ విధానంలోని సామ్యవాదంలోను ఉత్పత్తి సాధనాలు ఉండాలి.
1. వస్తూత్పత్తికి పెట్టుబడి రెండింటికి అనివార్యం.
2. నాణ్యమైన వస్తూత్పత్తికి ప్రాధాన్యం. యుగాలు

పెట్టుబడిదారీ విధానం సామ్యవాదం
1. పారిశ్రామికులు, వ్యాపారస్తులు, తమ సంపద ద్వారా యంత్రాలను, ముడి సరుకులను కొనుగోలు చేసి, కార్మికుల ద్వారా వస్తువులను ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మటమే పెట్టుబడిదారీ విధానం. 1. ప్రకృతి వనరులు, ఆస్తులు, వ్యక్తుల కింద వారి నియంత్రణ లో కాకుండా ప్రజల అధీనంలో ఉండాలనేది సామ్యవాదం.
2. ఉత్పత్తి చేసిన వస్తువులను వాడకం కొరకు కాక, లాభాల కొరకై వినియోగిస్తారు. 2. పరిశ్రమలను జాతీయం చేయడం వల్ల ఉత్పత్తి అయిన జాతీయ సంపద సర్వ ప్రజలకు సమానంగా చెందు అవకాశం కలుగును.
3. ఈ పద్ధతిలో వస్తూత్పత్తి సాధనాలు పెట్టుబడిదారుల అధీనంలో ఉంటాయి. 3. ఈ పద్ధతిలో వస్తూత్పత్తి సాధనాలు ప్రభుత్వ అధీనంలో ఉండును.
4. ధనిక, బీద అను రెండు వర్గాలు కన్పించును. 4. ఆర్థిక అసమానతల నివారణకు తోడ్పడును.
5. కర్మాగారాలలో ఉత్పత్తి చేసే కార్మికులకు ఎటువంటి ఆస్తి లేదు. కాని ఉత్పత్తి జరగడానికి కార్మికులు ఎంతో కీలకం. 5. కర్మాగారాలు, భూములు ప్రభుత్వానికి చెంది అందరి ప్రయోజనం కోసం ప్రణాళికాబద్ధంగా ఉత్పత్తి చేపడతారు.
6. సప్లై మరియు డిమాండ్లు ధరను నిర్ణయిస్తాయి. 6. ధరలను ప్రభుత్వం స్వయంగా నిర్ణయిస్తుంది.
7. మార్కెట్ ఎలాంటి నియంత్రణలు లేకుండా స్వేచ్ఛగా ఉంటుంది. 7. మార్కెట్ ను చట్టాల ద్వారా ప్రభుత్వం నియంత్రిస్తుంది.
8. వచ్చే లాభాలు వ్యక్తిగత సంపదను పెంచుతాయి. 8. వచ్చే లాభాలు ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తారు.

ప్రశ్న 4.
సమానత్వం సాధించటంలో కార్మిక, మహిళా ఉద్యమాలు అనుసరించిన విధానాలలో పోలికలు, తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
మానత్వం సాధించటంలో కార్మిక, మహిళా ఉద్యమాలు :

అనుసరించిన విధానాలలో పోలికలు :

  1. నూలు పరిశ్రమలో యంత్రాలను ప్రవేశపెట్టడం వల్ల జీవనోపాధిని కోల్పోవటానికి కారణంగా భావించిన మరమగ్గాలపై దాడి చేసి నాశనం చేశారు.
  2. ఆహారం కొరకు ఉద్యమాలు.
  3. గడ్డి నుంచి గింజను వేరు చేసే నూర్పిడి యంత్రాల వల్ల తమకు పనిలేకుండా పోతుందని భయపడిన కార్మికులు అల్లర్లకు దిగారు.
  4. కనీస వేతనం కొరకు మహిళల, పిల్లల భారం తగ్గించటం, యంత్రాల వల్ల ఉపాధి కోల్పోయిన వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం కోసం, తమ హక్కుల కోసం పోరాడటానికి కార్మిక సంఘాలుగా ఏర్పడటం కోసం అనుసరించిన విధానాలలో పోలికలు ఉన్నాయి.

తేడాలు

మహిళలు కార్మికులు
1. ఓటు హక్కు కొరకు, ఆస్తి హక్కు కొరకు ఉద్యమాలు 1. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న ఆదర్శాల సాధన కొరకు
2. పురుషుల ఆధిపత్యం నుండి విముక్తి కొరకు 2. దోపిడీ నుండి మెరుగైన వేతనాల కొరకు
3. వ్యక్తిగత స్వేచ్ఛ, సమానత్వం కొరకు 3. యజమానుల యంత్రాలు, సరుకు నిల్వలపై దాడి చేయటం ద్వారా
4. విద్య, వైద్య, సతీసహగమనం, ఆడపిల్ల పుట్టగానే చంపేయటం, బలవంతంగా విధవను చేయడం వంటి వాటి విముక్తి కొరకు 4. అణచివేత నుండి, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో విముక్తి కొరకు

AP Board 9th Class Social Solutions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

ప్రశ్న 5.
కార్మికులు, మహిళల నేపథ్యంలో “స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం” అన్న భావనలను తెలియచేయటానికి ఒక గోడ పత్రిక తయారుచేయండి. ఈ హక్కులు ఉల్లంఘించబడుతున్న సందర్భాలను గుర్తించండి. (AS5)
జవాబు:

  1. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్నవి ఫ్రెంచి విప్లవం ద్వారా ప్రపంచానికి అందించబడిన అమూల్యమైన ఆదర్శా లు.
  2. అయితే ఈ భావనలు కార్మికులకు, మహిళలకు సమాన వేతనం.
  3. సమాన అవకాశాలు, అవకాశాలలో సమానత్వం ముఖ్యమైనవి.
  4. తమ కోర్కెలు చట్టబద్ధంగా తెలియజేయటానికి కార్మిక సంఘాలుగా ఏర్పడే హక్కు.
  5. కుల, మతాలకు, పేద, ధనిక తారతమ్యం లేకుండా వివక్షత లేకుండా విద్య, ఉద్యోగ అవకాశాలు, వేతనాలు కల్పించుట.
  6. స్త్రీ, కార్మికులకు సమాన ఓటు హక్కు కల్పించుట.
  7. సమాన పనికి సమాన వేతనం.
  8. కార్మికులకు, మహిళలకు భద్రత, గౌరవప్రదమైన జీవనం కల్పించుట.
  9. పార్లమెంటరీ, శాసనసభల, ప్రజాస్వామిక సంస్థల ఏర్పాటు.

హక్కులు ఉల్లంఘించబడుతున్న సందర్భాలు :

  1. మహిళలకు ఎక్కువ పని గంటలు, తక్కువ వేతనాలు.
  2. ఉద్యోగ భద్రత లేదు. మహిళలు, పిల్లలు పట్ల కారుణ్యం లేదు.
  3. ఆర్థిక అసమానతలు.
  4. ఎటువంటి వివక్షత లేకుండా గుణాలు, ప్రతిభ ఆధారంగా మహిళలతో పాటు పౌరులందరూ సమానులని గుర్తించక పోవడం.
  5. కార్మికులు తమ హక్కుల కొరకు, సంక్షేమం కొరకు చేసిన ఉద్యమాల కాలంలో జీతాలు నిలిపివేత, కంపెనీ లాకౌట్ ప్రకటన.

ప్రశ్న 6.
సామాజిక నిరసన ఉద్యమాలు జరిగిన దేశాలను ప్రపంచ పటంలో గుర్తించండి. (AS5)
జవాబు:
1. బ్రిటన్
2. ఫ్రాన్స్
3. జర్మనీ
4. ఇటలీ
5. భారత్
AP Board 9th Class Social Solutions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు 1

ప్రశ్న 7.
పేజీ నెం. 202లోని చివరి రెండు పేరాలు చదివి, వ్యాఖ్యానించండి.
జవాబు:
రోజు రోజుకు పురుష ప్రపంచంలో మహిళలపై జరుగుతున్న వివక్షతలను దూరం చేయడానికిగాను మహిళల్లో చైతన్యం వచ్చింది. వివిధ రచయిత్రులు, రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం, మహిళా ఉద్యమంలో భాగంగా వారిలో చైతన్యం ఉప్పొంగి, రాజకీయ, సాంస్కృతిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారు. విద్య, వైద్యం వంటి అన్ని రంగాలలో వివక్షతకు చరమగీతం పాడారు.

భారతదేశంలో సంఘసంస్కర్తలు నడిపించిన ఉద్యమాలు, సతీసహగమనం, ఆడపిల్ల పుట్టగానే చంపేయడం, బలవంతంగా విధవను చేయటం వంటి దురాచారాలను దూరం చేయ్యటానికి, విద్యయే కారణమని మహిళలు గ్రహించారు.

భారతదేశంలో గాంధీజీ వంటి నాయకులు మహిళా ప్రాధాన్యత గుర్తించి ఉద్యమంలో మహిళల పాత్రను నొక్కి చెప్పారు. కనుకనే స్వాతంత్ర్యం అనంతరం మహిళల కొరకు హక్కులు, చట్టాలు పొందుపరిచి సముచిత స్థానం కల్పించారు.

9th Class Social Studies 16th Lesson సామాజిక నిరసనోద్యమాలు InText Questions and Answers

9th Class Social Textbook Page No.198

ప్రశ్న 1.
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి భావనలు నిరసన ఉద్యమాలకు ఏవిధంగా స్ఫూర్తినిచ్చాయి?
జవాబు:
పారిశ్రామికీకరణ, జాతీయ రాజ్యాల ఆవిర్భావంతో చేతివృత్తులు, వ్యవసాయం అడుగంటి, ఉద్యోగ భద్రత దూరమై, కార్మికులు, మహిళలు, చిన్న రైతులు, శ్రామికులలో అసంతృప్తి, ఆవేదన, ఆందోళనలు సాగి ఉద్యమాలు చెలరేగాయి.

స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆదర్శాల ఆవశ్యకతను గుర్తించిన వీరు వ్యక్తిగత స్వేచ్ఛ, అవకాశాల సమానత్వం, వివక్షత లేకుండా హక్కులు పొందడానికి, ఓటు హక్కు వంటి హక్కులు సాధించుకోవడానికి, కార్మిక సంఘాలు, సమావేశాలు, చర్చలు, ఉద్యోగ భద్రత కొరకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం స్ఫూర్తినిచ్చాయి.

ప్రశ్న 2.
21వ శతాబ్దంలో ఈ మూడు ఆదర్శాలను ప్రజలు సాధించారా?
జవాబు:
21వ శతాబ్దంలో ఈ మూడు ఆదర్శాలు ప్రజలు సాధించారని చెప్పవచ్చు. కాని కొన్ని సందర్భాలలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆశయాలు దెబ్బతింటున్నాయి. ఇప్పటికీ కూడా మహిళలకు సమాన పనికి సమాన వేతనాలు పరిశ్రమలలో, వివిధ వ్యవసాయ పనులలో లభించడం లేదు. చాలా పట్టణాలు, గ్రామాలలో కులవివక్ష, మతవివక్ష కనబడుతూ, ఆడపిల్లల విషయంలో విద్య, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల విషయంలో వివక్షత కనిపిస్తుంది.

ప్రశ్న 3.
ఈ భావనలతో స్ఫూర్తిని పొందిన సామాజిక ఉద్యమాలు మీ ప్రాంతంలో ఏమైనా ఉన్నాయా?
జవాబు:
మా ప్రాంతంలో స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆదర్శాలను ఆశయంగా తీసుకొని, ఇటీవల మహిళలు, ఆడపిల్లల యెడల జరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులు, మానభంగాలు, వారికి ఎదురౌతున్న సహోద్యోగుల వేధింపులు, రక్షణకై ఉద్యమాలు, నిరసనలు జరుగుతున్నాయి. బాలురుతో పాటు బాలికకు కూడా సమాన ప్రాధాన్యత కొరకు విద్య, ఇంటిలో లభించని స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలకై తల్లిదండ్రులలో చైతన్యానికి కార్యక్రమాలు చేపడుతున్నారు.

AP Board 9th Class Social Solutions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

ప్రశ్న 4.
“మొక్కజొన్న చట్టాలు” తొలగించాలని కార్మికులు ఎందుకు కోరారు? భూస్వాములు వాటిని ఎందుకు సమర్థించారు?
జవాబు:
ఫ్రాన్స్ తో ఇంగ్లాండు యుద్దాలు వల్ల వాణిజ్యం దెబ్బతింది. కర్మాగారాలు మూసివేశారు. సగటు వేతనాల స్థాయికి అందనంతగా రొట్టె ధరలు పెరిగాయి. పేద ప్రజల ఆహారంలో రొట్టె (మొక్కజొన్న రొట్టె) ముఖ్యమైనది. దాని ధర వాళ్ళ జీవన ప్రమాణాన్ని నిర్ణయిస్తుంది. రొట్టెల నిల్వలను జప్తు చేసి లాభాల కోసం అధిక ధరలకు అమ్మేవారు.

బ్రిటన్లో ధరలు ఒక మేరకు పెరిగే వరకు చవకగా దొరికే ఆహారాన్ని దిగుమతి చేసుకోవటాన్ని నిషేధించే “మొక్కజొన్న చట్టాలకు” భూస్వాములు సమర్థించారు.

ప్రశ్న 5.
మన దేశంలో కూడా రైతుల క్షేమం కోసం చవక వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతుల నుంచి రక్షించే చట్టాలకు అంతం పలుకుతున్నారు. ఇటువంటి దిగుమతులు మనదేశ పేద ప్రజలకు మేలు చేస్తాయా?
జవాబు:
మనదేశంలో కూడా రైతుల క్షేమం కోసం చవక వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతుల నుంచి రక్షించే చట్టాలకు అంతం పలుకుతున్నారు. ఇటువంటి దిగుమతులు మనదేశ పేద ప్రజలకు మేలు చేస్తాయి. గిట్టుబాటు ధర లేకపోవడంతో నిరంతరం కరవు కాటకాలు, సరియైన ఉత్పత్తి లేకపోవడం వల్ల దిగుమతులు పేద ప్రజలకు మేలు చేస్తాయి.

9th Class Social Textbook Page No.199

ప్రశ్న 6.
యంత్రాలను పగలగొట్టడం కార్మికులకు ఎంతవరకు ప్రయోజనం చేకూర్చింది?
జవాబు:
నూలు పరిశ్రమలో యంత్రాలను ప్రవేశపెట్టడం వల్ల వేలాది చేనేత కార్మికులకు పని లేకుండా పోయింది. ఉపాధి కోల్పోయి, పేదలుగా మారారు. తమ ఈ దుర్భరస్థితికి యంత్రాలే కారణమని యంత్రాలను కార్మికులు తగలబెట్టారు.

  1. దీని ద్వారా అనేక సందర్భాలలో కర్మాగార యజమానులు కార్మికులతో సంప్రదింపులకు సిద్ధపడి మెరుగైన పని పరిస్థితులు కల్పించడానికి అంగీకరించారు.
  2. వీరికి సామాజిక మద్దతు లభించింది.
  3. సామ్యవాద భావాలు మరింత బలపడడానికి కారణమయ్యాయి.

ప్రశ్న 7.
యంత్రాలు పగలగొట్టిన వాళ్ళకు మరణశిక్ష విధిస్తూ ప్రభుత్వం చట్టాన్ని చేసింది. ఇది సరైనదేనా?
జవాబు:
ఉపాధి కోల్పోయి, పేదరికం పెరిగి, ఆకలితో అలమటించిన వారు ఏ ఆందోళనకైనా, ఏ ప్రతీకార చర్యలకైనా దిగవచ్చు. అటువంటి పరిస్థితులలో ఆ చర్యలకు గల కారణాలు తెలుసుకొని వారికి పునరావాసం కల్పించాలే గాని, మరణశిక్ష విధిస్తూ విచక్షణారహితంగా చంపడం సరైన చర్య కాదు.

AP Board 9th Class Social Solutions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

ప్రశ్న 8.
కర్మాగారంలో కొత్త యంత్రాలు ప్రవేశపెట్టినపుడు సాధారణంగా కొంతమంది కార్మికులు ఉపాధి కోల్పోతారు. ఇలా ఎందుకు జరుగుతుంది? సాంకేతిక విజ్ఞానాన్ని మెరుగుపరుస్తూనే కార్మికులలో నిరుద్యోగం పెంచకుండా చేసే మార్గాలు ఏమైనా ఉన్నాయా?
జవాబు:
కర్మాగారాలలో కొత్త యంత్రాల వలన కొంతమంది ఉపాధి కోల్పోతారు. ఎందుకంటే 50 మంది కార్మికులు ఒక రోజులో చేయవలసిన పని ఒక యంత్రం 3 గంటలలో చేస్తుంది. అదేవిధంగా యంత్రాల ద్వారా నాణ్యత, నమ్మకం ప్రజలలో ఉంటుంది. కార్మికుల నిర్లక్ష్యం, అశ్రద్ధ వలన అనుకున్న లాభాలు అందకపోవచ్చు. దానివలన యజమానులు మనుషుల స్థానంలో యంత్రాలను ప్రవేశపెడుతున్నారు.

కాని యంత్రాల సాంకేతిక విజ్ఞానం ద్వారా ఉత్పత్తి చేస్తున్న కార్మికులను తొలగించకూడదు. యంత్రాలపై పర్యవేక్షణకు, ఉత్పత్తులకు, మార్కెట్ కల్పించడానికి, ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి, మార్కెట్ సిబ్బందిని నియమించడానికి గాను కొంతమంది నిరుద్యోగులకు పని కల్పించవచ్చు.

9th Class Social Textbook Page No.202

ప్రశ్న 9.
మార్క్స్ ప్రతిపాదించిన సామ్యవాదం లుద్దిజంతో ఏ విధంగా విభేదించింది?
జవాబు:
లుద్దిజం కార్మికులను విప్లవవాదులుగా మార్చి హింసా, దౌర్జన్య, ఆస్తుల అంతానికి పూనుకుంది. రహస్య విప్లవవాద సంస్థలు ఏర్పడడానికి అవకాశం కల్పించింది. కనీస వేతనం, పనిభారం తగ్గించటం మొదలగు వాటికి అందజం ప్రాధాన్యతనీయగా, సామ్యవాదం దానితో విభేదించింది. ప్రజలు ఉత్పత్తి చేస్తున్న ప్రతిదీ సామాజిక ఉత్పత్తి అవుతుంది. వస్తు ఉత్పత్తిలో భాగస్వాములైన అందరికీ ‘వాటా ఉంటుంది. ఉత్పత్తి సమాజానికి సంబంధించినది అయి ఉంటుంది. తాత్కాలిక హక్కులు, హింసా ప్రవృత్తిపై మార్క్స్ విభేదించారు. మెరుగైన వేతనాల కోసమే కాకుండా పెట్టుబడిదారీ విధానాన్ని అంతం చేయడానికి పోరాటాలు చేయాలన్నారు. సమ సమాజ నిర్మాణం కోసం పని చేయాలన్నారు.

ప్రశ్న 10.
కర్మాగార ఉత్పత్తి మెరుగైనది, కోరుకోదగినది అని మార్క్స్ ఎందుకు భావించాడు?
జవాబు:
కర్మాగారాలలో ఉత్పత్తి చేసే కార్మికులకు ఎటువంటి ఆస్తిలేదు. కాని ఉత్పత్తి జరగడానికి కార్మికులు ఎంతో కీలకమని మార్క్స్ వాదించెను. కర్మాగారాలను, వనరులన్నింటిని కార్మికులు చేజిక్కించుకొని ఉమ్మడి ప్రయోజనాల కోసం వాటిని నడపటం మొదలు పెడితే కొత్త, సమసమాజానికి మార్గం అవుతుంది. ఉత్పత్తి అన్నది ఒక కుటుంబం, ఒక చిన్న క్షేత్రం లేదా ఒక గ్రామానికి సంబంధించింది కాకుండా మొత్తం సమాజానికి సంబంధించినదిగా అవుతుంది.

ప్రశ్న 11.
మార్క్స్ కి అంతకు ముందు కాలం నాటి సామ్యవాదులకు మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?
జవాబు:
మార్క్స్ కి అంతకు ముందు కాలం నాటి సామ్యవాదులకు మధ్య తేడా కన్పిస్తుంది.

ముందు కాలం నాటి సామ్యవాదులు ఉత్పాదక ఆస్తి సమాజానికి చెందాలని వాదించలేదు. సామాజిక అవసరాలను శాస్త్రజ్ఞులు, పారిశ్రామికవేత్తలు, ఇంజనీర్లు అంచనా వేసి వాటిని తీర్చేలా సమాజ శక్తులను వినియోగించే కేంద్రీకృత ప్రణాళిక ఉండాలని చెప్పారు. సహకార గ్రామాలు నిర్మించాలని పిలుపునిచ్చారు.

మార్క్స్ దృష్టిలో సామ్యవాదం అంటే ప్రపంచం పారిశ్రామికంగా మారి, అందరి ఉత్పాదక శక్తులను వెలికితీసి కొరత అనేది లేకుండా చేయటం వల్ల ప్రగతిశీలమైనది అన్నారు. కార్మికులు దేశ పగ్గాలను చేజిక్కించుకుని శ్రామిక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి. కర్మాగారాలు, భూములు, ప్రభుత్వానికి చెంది అందరి ప్రయోజనం కోసం ప్రణాళికాబద్ధంగా ఉత్పత్తి చేపడతారని మార్క్స్ చెప్పెను.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
మీ చుట్టుపక్కల ఇటువంటి సామాజిక నిరసన ఉద్యమాలు ఉన్నాయా? ఆ ఉద్యమాల నాయకులతో ముఖాముఖి నిర్వహించి, నివేదిక తయారుచేయండి. దానిని తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
మా చుట్టుపక్కల ఇటువంటి సామాజిక నిరసన ఉద్యమాలు ఉన్నాయి.

సామాజిక నిరసన ఉద్యమాలలో భాగంగా ఇటీవల కాలంలో మా ప్రాంతంలో మహిళలు మద్యపాన వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహించారు.

మా ఊరిలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని పద్మక్క నాయకత్వంలోని మహిళలు ఉద్యమాన్ని నిర్వహించారు.

పద్మక్కతో ముఖాముఖి :
నేను – అక్కా ! మన ఊరిలో మద్యపానాన్ని నిషేధించాలని ఎందుకు ఉద్యమాన్ని నిర్వహించారు.

పద్మక్క – మద్యపానం వలన చాలా కుటుంబాలు ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను నష్టపోవడం జరుగుతుంది.

నేను – అక్కా ! మద్యపానాన్ని సేవించడం వలన ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను ఎలా నష్టపోవడం జరుగుతుంది?

పద్మక్క – మద్యపానం సేవించడం వలన ఆరోగ్యపరంగా అనేక వ్యాధులకు గురికావలసి ఉంటుంది. ఊపరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, మూత్ర పిండాలకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తాయి.

నేను – అక్కా ! ఇంకా ఏమైనా నష్టాలు ఉన్నాయా ! మద్యపానాన్ని సేవించడం వలన.

పద్మక్క – ఉన్నాయి. పేద, మధ్యతరగతి పౌరులు తాను సంపాదించిన రోజు వారి వేతనంలో 3 వంతులు తాగడానికి ఉపయోగిస్తే మిగిలిన ఒక వంతు ఆ కుటుంబ జీవనానికి చాలక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. అలాగే ఇతర వ్యాధులు వచ్చినప్పుడు వారి వద్ద ధనం లేక ఎవరిని అడిగిన త్రాగుబోతు వానికి ‘అప్పు ఎలా ఇస్తారని, ఒకవేళ ఇచ్చిన మరల మాకు తిరిగి ఎలా ఇవ్వగల్గుతారని ఎవరు ఇవ్వరు. అలాంటి పరిస్థితులలో ఆ కుటుంబం చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది.

అందువలన మద్యపానాన్ని సేవించవద్దు. తాగేవారిని ప్రోత్సహించవద్దు.

పట నైపుణ్యాలు

1. పెట్టుబడిదారీ విధానం – పిరమిడ్
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు 2

AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

9th Class Social Studies 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
………………….., …………….. ల కోసం బ్రిటను ఇతర దేశాలపై ఆధారపడలేదు. (శ్రామికులు, ముడి సరుకులు, పెట్టుబడి, . ఆవిష్కరణలు) (AS1)
జవాబు:
పెట్టుబడి, శ్రామికులు.

ప్రశ్న 2.
పారిశ్రామిక విప్లవకాలంలో ప్రధానమైన రెండు రవాణా మార్గాలు ………… (రోడ్డు, వాయు, జల, రైలు) (AS1)
జవాబు:
జల, రైలు.

ప్రశ్న 3.
పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో కింది వాటి గురించి రెండు వాక్యాలు రాయండి. (AS1)
అ) సాంకేతిక విజ్ఞానం
ఆ) ఆర్థిక వనరులు సమకూర్చడం, డబ్బులు
ఇ) వ్యవసాయిక విప్లవం
డి) రవాణా వ్యవస్థలు
జవాబు:
అ) సాంకేతిక విజ్ఞానం :
పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో సాంకేతిక విజ్ఞానం ప్రధాన పాత్ర పోషించింది. చేతివృత్తులు, చేతి యంత్రాలు వల్ల పెద్ద ఎత్తున సరుకులు ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. వాణిజ్య కార్యకలాపాలకు పేరు గడించడానికి అనేక పరిశ్రమలు స్థాపించి, ప్రపంచ కర్మాగారంగా ఇంగ్లాండ్ పిలువబడడానికి కారణం సాంకేతిక విజ్ఞానమే.

ఆ) ఆర్థిక వనరులు సమకూర్చడం, డబ్బులు :
కొత్త యంత్రాలు, సాంకేతిక విజ్ఞానంలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికిన ఇంగ్లాండ్ లో సంపద అనంతంగా ఉండడం వల్ల పెట్టుబడి సమకూర్చుకోవడానికి ఇబ్బంది పడలేదు. ప్రపంచ దేశాలతో వాణిజ్య కార్యకలాపాల వలన అధికంగా ఆర్థిక వనరులు సంపాదించింది. ఈ ఆర్థిక వనరులను సరైన పద్ధతిలో ఉపయోగించారు. డబ్బును అధికం చేయడంలో ఇంగ్లాండ్ బ్యాంక్ ప్రధానపాత్ర పోషించింది. లండన్ విత్తమార్కెట్, ఉమ్మడి స్టాక్ బ్యాంకు, ఉమ్మడి స్టాక్ కార్పొరేషన్ ఏర్పడడంతో ఆర్థిక వనరులు, డబ్బు. పుష్కలంగా సమకూరాయి. సరుకులు, ఆదాయాలు, సేవలు, జ్ఞానం, ఉత్పాదక సామర్థ్యం వంటి రూపాలలో ఆర్థిక వనరులు వృద్ధి చెందాయి.

ఇ) వ్యవసాయిక విప్లవం :
బ్రిటిష్ జనాభా పారిశ్రామికీకరణ వల్ల పెరిగింది. లాభసాటికాని, పాతకాల వ్యవసాయ పద్ధతుల స్థానంలో కొత్త సాగు పద్ధతులు అంటే శాస్త్రీయంగా పంటలమార్పిడి వంటివి అనుసరించసాగారు. దీనివల్ల అధికంగా ఆహార ఉత్పత్తి పెరిగింది.

ఈ) రవాణా వ్యవస్థలు :
ముడి సరుకులు, ఉత్పత్తి అయిన వస్తువులను ప్రపంచ నలుమూలలకు చేర్చడానికి, లాభసాటి వ్యాపారాలు చేయడానికి రవాణా వ్యవస్థ ప్రధానపాత్ర పోషించింది. ముఖ్యంగా, రైలు, జల మార్గాలు పట్టణాలకు ఇనుము, బొగ్గును సమీప పట్టణాలకు ప్రయాణీకులను, సరుకులను వేగంగా, తక్కువ ఖర్చుతో రవాణా చేయడానికి తోడ్పాటు నందించాయి.

AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 4.
పారిశ్రామిక విప్లవ సమయంలో జరిగిన ఆవిష్కరణల ప్రత్యేకత ఏమిటి? (AS1)
జవాబు:
యాంత్రీకరణకు అవసరమైన ప్రధాన ముడి సరుకులైన బొగ్గు, ఇనుప ఖనిజాలతో పాటు పరిశ్రమలలో వినియోగించే సీసం, రాగి, తగరం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఇంగ్లాండ్లో లభించేవి. ఇనుప ఖనిజం నుంచి దానిని కరిగించే ప్రక్రియ (స్మెల్టింగ్) ద్వారా స్వచ్ఛమైన ఇనుమును ద్రవరూపంలో తీస్తారు. కొన్ని శతాబ్దాల పాటు కలపను కాల్చటం నుంచి బొగ్గుతో ఇనుమును కరిగించేవారు. తద్వారా అడవులు మొత్తం నాశనమయ్యాయి. ఇటువంటి తరుణంలో ‘కమ్మరం” పనిచేసే ప్రాప్ షైర్ కి చెందిన డర్బీలు 3 తరాలు ద్వారా కోక్ (బొగ్గు నుంచి గంధకం, ఇతర కలుషితాలు తొలగించగా ఏర్పడేది) ని ఉపయోగించే ఈ బట్టీలో అధిక ఉష్ణోగ్రతలు సాధించగలిగారు. ఈ ఆవిష్కరణల కారణంగా కలప, బొగ్గుపై బట్టీలు ఆధారపడటం తప్పిపోయింది. బొగ్గు, లోహాలను లోతైన గనుల నుంచి వెలికి తీసే క్రమంలో గనులు తరుచు నీటి ముంపునకు గురయ్యేవి. జేమ్స్ వాట్ ఆవిరి యంత్రంతో ఈ సమస్య పరిష్కారమైంది. రవాణా వ్యవస్థను మెరుగుపరచడంలో “మెడం” ద్వారా పక్కా రోడ్లు తయారుచేసే విధానం మరింత ప్రాధాన్యత పెంచింది. స్టీఫెన్సన్ యొక్క ఆవిరి రైలింజన్ ద్వారా విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

ఈ విధంగా పారిశ్రామిక ప్రగతిగ పురోభివృద్ధి సాధించడంలో ఆవిష్కరణలు ప్రధానపాత్ర పోషించాయి.

ప్రశ్న 5.
పారిశ్రామిక విప్లవం వల్ల బ్రిటిష్ మహిళలలోని వివిధ వర్గాలు ఏవిధంగా ప్రభావితమయ్యా యి? (AS1)
(లేదా)
“పారిశ్రామిక విప్లవం వలన బ్రిటిష్ సమాజంలోని అన్ని తరగతుల మహిళలూ ప్రభావితమయ్యారు” – వ్యాఖ్యానించండి.
జవాబు:
పారిశ్రామిక విప్లవం వల్ల మహిళల జీవన విధానంలో అనేక మార్పులు సంభవించాయి. ముందుగా – మహిళలు వ్యవసాయ పనులు చేసేవాళ్ళు, పశుపాలన చేస్తూ, కట్టెపుల్లలు తెచ్చేవాళ్ళు. ఇంటి దగ్గర రాట్నం మీద నూలు వడికే వాళ్ళు. అయితే కర్మాగారాలలో పని పూర్తిగా మారిపోయింది. వ్యవసాయ విప్లవంతో వ్యవసాయ పనులు లేకపోవడం వల్ల జీవన గమనంలో అనేక మార్పులు సంభవించాయి. విరామం లేకుండా చాలా గంటల సేపు ఒకే పని చేస్తూ ఉండేవారు. ఆ పనిపై పర్యవేక్షణ, తప్పులకు శిక్షలు కఠినంగా ఉండేవి. పురుషుల కంటే తక్కువ కూలీకి పనిచేయడానికి సిద్దపడే మహిళలను పనిలో పెట్టుకొనేవాళ్ళు. లాంక్ షైర్, యార్క్ షెర్లలోని నూలు వస్త్ర పరిశ్రమల్లో మహిళలను పెద్ద సంఖ్యలో పెట్టుకునేవాళ్ళు. పట్టు, లేసు తయారీ అల్లిక పరిశ్రమల్లో, బర్మింగ్ హాంలోని లోహ పరిశ్రమల్లో మహిళలే ప్రధాన కార్మికులుగా ఉండేవారు.

ప్రశ్న 6.
కాలువల ద్వారా, రైళ్ళ ద్వారా రవాణాలలోని లాభాలు ఏమిటి? (AS1)
జవాబు:
పారిశ్రామిక విప్లవం ఫలితంగా ప్రపంచ దేశాల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ పోటీని తట్టుకొని ప్రపంచ దేశాలను ఆకర్పించడానికి పటిష్టమైన రవాణా వ్యవస్థ బాగా ఉపయోగపడింది. రవాణా రంగంలో ప్రధానంగా కాలువలు, రైళ్ళు ముఖ్యమైనవి. కాలువల ద్వారా అనేక ప్రయోజనాలను గమనించవచ్చు. ముడి సరుకులను, ఉత్పత్తి అయిన వస్తువులను సురక్షితంగా, తక్కువ ఖర్చుతో గమ్యస్థానాలకు, చేర్చడానికి ముఖ్యమైనది. కాలువల ద్వారా, బొగ్గు, ఇనుము వంటి వాటిని సమీప పట్టణాలకు చేరవేయవచ్చును. కాలువల ద్వారా ప్రయాణ దూరం కూడా సగానికి “పైగా తగ్గుతుంది. కాలువల వలన. వ్యవసాయ భూమి విలువ పెరగడమేగాక సారవంతమవుతుంది. ఎక్కువ దిగుబడితో ఉత్పత్తులు పెరగడానికి కాలువలు దోహదపడతాయి.

రైళ్ళ ద్వారా సుఖవంతమైన, విలాసవంతమైన ప్రయాణం సాధ్యం. అధిక లోడు, అధిక టన్నుల ఉత్పత్తులు గమ్యస్థానాలకు చేరడానికి రైలు రవాణా ముఖ్యమైనది. సరుకులను, ప్రయాణీకులను, ముడి పదార్థాలను వేగవంతంగా గమ్యస్థానాలకు చేర్చగలదు. కరవు, వరదలు, నీళ్ళు గడ్డకట్టడం, క్షామం , తుపానులు వంటి సందర్భాలలో అత్యవసర సేవలకు రైళ్ళు ముఖ్య మైనవి.

ప్రశ్న 7.
పారిశ్రామిక విప్లవ కాలంలో ఇంగ్లాండ్ లో వస్త్ర, ఇనుము పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్న ప్రదేశాలను పటంలో గుర్తించండి. (AS5)
జవాబు:
1. ఇంగ్లాండ్ లో ఇనుము పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రాంతాలు :
AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు 1

2. బ్రిటన్ లో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రాంతాలు :
AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు 2

ప్రశ్న 8.
పారిశ్రామిక విప్లవ కాలంలో ఆవిష్కరణలకు సంబంధించిన పట్టికను తయారుచేయండి.
జవాబు:

  • జేమ్స్ వాట్ – ఆవిరి యంత్రం
  • స్టీఫెన్సన్ – ఆవిరి రైల్వే ఇంజన్
  • మెక్కం – పక్కా రోడ్లు తయారుచేసే విధానం
  • హార్ గ్రీవ్స్ – నూలు వడికే యంత్రం
  • మొదటి అబ్రహాం డర్బీ – కోక్ (బొగ్గు నుంచి గంధకం, ఇతర కలుషితాలు తొలగించగా ఏర్పడేది)
  • రెండవ డర్బీ – ఇనుము నుండి (తేలికగా విరిగిపోని) దుక్క ఇనుమును తయారుచేయుట.
  • హెన్రీ కోర్ట్ – కలబోత బట్టీ (దీంతో కరిగిన ఇనుములోని కలుషితాలు తొలగించవచ్చు.)
  • క్రుప్ కుటుంబం – క్షేత్ర ఫిరంగుల కర్మాగారం. రైలు పెట్టెలు, ఆయుధ తయారీ.
  • వెర్నెర్ సీమెన్స్ – విద్యుత్ డైనమో కనుగొన్నాడు.
  • ఎడ్మండ్ కార్డ్ రైట్ – నీటి సహాయంతో నడిచే మరమగ్గం
  • సామ్యుల్ క్రాంప్టన్ – మ్యూల్ అనే మెరుగైన యంత్రం (దీని వలన నాణ్యమైన నూలు ఉత్పత్తి పెరిగెను).
  • ఆర్కిరైట్ – జలశక్తితో మెరుగైన మగ్గాన్ని కనుగొనెను.

AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 9.
ఓ నెం. 191లోని “కార్మికులు” అనే శీర్షిక కింద ఉన్న పేరాను చదివి వ్యాఖ్యానించండి?
జవాబు:
పారిశ్రామికీకరణ, సామాజిక మార్పులో భాగంగా కార్మికులు తమ జీవనాన్ని దుర్భరంగా గడిపారు. కార్మికుల సగటు జీవితకాలం చాలా తక్కువ. బర్మింగ్ హాంలో 15 సంవత్సరాలు, మాంచెస్టర్ లో 17, డర్బీలో 21 సంవత్సరాలుగా ఉండేది. చిన్న వయసులో మరణాలు అధికంగా ఉండడమే కాకుండా, చిన్న పిల్లల్లో 50 సంవత్సరాల లోపు మరణాలు సంభవిస్తుండేవి. నీటి కాలుష్యం వల్ల వ్యాపించే కలరా, టైఫాయిడ్, గాలి కాలుష్యం వల్ల క్షయ వంటి అంటువ్యాధుల వల్ల మరణాలు ఎక్కువగా ఉండేవి. కలరా వ్యాపించడం వలన 1832లో 31,000 పైగా ప్రజలు చనిపోయారు. ఆ రోజుల్లో ప్రజలు అనుభవిస్తున్న రోగాలకు తగిన వైద్య సహాయం, వైద్య విజ్ఞానం అందకపోవడం, లేకపోవడం కూడా కార్మికులు, దీన స్థితిలో బ్రతకడానికి దోహదపడ్డాయి.

9th Class Social Studies 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు InText Questions and Answers

9th Class Social Textbook Page No.186

ప్రశ్న 1.
పారిశ్రామిక విప్లవకాలంలో మహిళలు, పిల్లలు ఎదుర్కొన్న కష్టాలు ఏమిటి?
జవాబు:
పారిశ్రామిక విప్లవ కాలంలో మహిళలు, పిల్లలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. పేద ప్రజల పిల్లలు ఇళ్ళల్లో, పొలాల్లో పనిచేస్తుండేవాళ్ళు. పగటిపూట ఎక్కువ పనిగంటలు చేస్తుండేవారు. లోహ పరిశ్రమల్లో పిల్లలు కూడా పని చేసేవాళ్ళు. బొగ్గు గనుల వంటి ప్రమాదకర పనులు సైతం పిల్లలు చేసేవారు. మహిళలు తక్కువ కూలీకి పనిచేయటానికి సిద్ధపడేవారు. విరామం లేకుండా మహిళలు పని చేసేవారు. తక్కువ కూలీ అందించేవారు. పట్టు, లేసు తయారీ, అల్లిక పరిశ్రమల్లో, లోహపరిశ్రమల్లో పని చేస్తూ మహిళలు అనేక కష్టాలు అనుభవించేవారు.

9th Class Social Textbook Page No.187

ప్రశ్న 2.
బ్రిటిష్ లో పారిశ్రామికీకరణను ప్రోత్సహించిన 18వ శతాబ్దం నాటి బ్రిటన్, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల పరిణామాలను చర్చించండి.
జవాబు:
ఆధునిక పారిశ్రామికీకరణను చవిచూసిన మొట్టమొదటి దేశం బ్రిటన్. బ్రిటన్ యూరప్ దేశాలన్నింటికంటే ముందే ఉత్పత్తిలో గణనీయమైన మార్పులను సాధించి, దాని ఫలితంగా ప్రపంచ కర్మాగారంగా గౌరవించబడింది. పరిశ్రమలు స్థాపించబడి అభివృద్ధి చెందటానికి బ్రిటన్‌కు ఎన్నో సానుకూల పరిస్థితులే కాకుండా అందుకు కావలసిన వనరులన్నీ ఉన్నాయి. ఇతర దేశాలు, ప్రపంచంలోని, దేశాలు ఈ మార్పులను తరువాత చవిచూశాయి.

9th Class Social Textbook Page No.188

ప్రశ్న 3.
పారిశ్రామికీకరణకు నాణ్యమైన ఇనుము, ఉక్కు ఎందుకు కావాలి? తరగతిలో చర్చించండి.
జవాబు:
యాంత్రీకరణకు, పారిశ్రామిక ప్రగతికి ప్రధాన ముడిసరుకు ఇనుము, ఉక్కు. ఇనుప ఖనిజం నుంచి దానిని కరిగించే ప్రక్రియ ద్వారా స్వచ్చమైన ఇనుమును ద్రవరూపంలో తీయవచ్చు. ఇనుము, ఉక్కుతో ఎన్నో రకాల వస్తువులను తయారు చేయవచ్చు. రోజువారీ వస్తువులలో కలపతో చేసిన భాగాలతో పోలిస్తే ఇనుముతో చేసిన వస్తువులు ఎక్కువ కాలం మనగలుగుతాయి. కలపతో చేసిన వస్తువులు కాలిపోయి, ముక్కలు అయ్యే ప్రమాదముంది. ఇనుము నాశనం కాకుండా, దాని యొక్క భౌతిక రసాయనిక, గుణాలను నియంత్రించవచ్చు.

AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 4.
ఇనుప ఖనిజం, బొగ్గు తవ్వకాలకు సమాన ప్రాధాన్యత ఎందుకు లభించింది?
జవాబు:
పారిశ్రామికీకరణకు ముఖ్యమైనవి బొగ్గు, ఇనుము. ఇనుము, బొగ్గు పరిశ్రమల ఆధారంగా నాగరికతను ప్రపంచమంతా అనుకరించింది. బొగ్గును ఇనుమును కరిగించే ప్రక్రియలో ఉపయోగించే వాళ్ళు. ఒక్కొక్కసారి ఒకే గనిలో నాణ్యమైన . బొగ్గు, ఇనుప ఖనిజాలు లభించేవి. ముడిసరుకులకు, వస్తూత్పత్తికి, బొగ్గు, ఇనుముకు సమాన ప్రాధాన్యత ఉండేది. ముడి ఇనుము తయారు చేయటానికి టన్నుల కొద్దీ బొగ్గు అవసరమయ్యేది. ఈ విధంగా బొగ్గు, ఇనుముకు సమాన ప్రాధాన్యత లభించింది.

ప్రశ్న 5.
తొలినాటి పారిశ్రామిక కేంద్రాలు ఇనుము, బొగ్గు గనుల దగ్గర ఎందుకు ఏర్పడ్డాయి?
జవాబు:
యాంత్రీకరణకు ప్రధానమైనవి ఇనుము, బొగ్గు. వస్తువుల ఉత్పత్తికి, బొగ్గు, ఇనుము ద్వారా తయారీకి ఆయా దేశాలు ప్రాధాన్యతనందించేవి. సులభంగా రవాణాకు, సమీప పట్టణాలకు తరలించటానికి, ప్రపంచ వ్యాప్తంగా తయారైన వస్తువులకు మార్కెట్ కల్పించడానికి,. బహుళ ప్రచారం చేయడానికి గాను ఇనుము, బొగ్గు గనుల దగ్గర పారిశ్రామిక కేంద్రాలు ఏర్పడ్డాయి.

ప్రశ్న 6.
వస్త్ర పరిశ్రమను విప్లవాత్మక మార్పులకు గురిచేసిన రెండు ముఖ్యమైన ఆవిష్కరణలు పేర్కొనండి.
జవాబు:
వస్త్ర పరిశ్రమను విప్లవాత్మక మార్పులకు గురిచేసిన రెండు ముఖ్యమైన ఆవిష్కరణలలో జేమ్స్ వాట్ 1769లో కనిపెట్టిన ఆవిరి యంత్రం ఒకటి.. దీనివలన వస్తూత్పత్తి రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సంభవించాయి. అదే విధంగా రెండోది 1770లో జేమ్స్ హార్ గ్రీవ్స్ కనిపెట్టిన “స్పిన్నింగ్ జెన్ని” (నూలు వడికే యంత్రం). దీనివలన నాణ్యమైన వస్త్రాలు ఉత్పత్తి అయ్యాయి.

9th Class Social Textbook Page No.193

ప్రశ్న 7.
మహిళలు, పిల్లలపై పారిశ్రామికీకరణ చూపిన రెండు ముఖ్యమైన ప్రభావాలను పేర్కొనండి.
జవాబు:
నూలువడికే జెన్ని’ వంటి చిన్న యంత్రాలు తయారుచేసి పిల్లలను పనిలో నియమించేవారు. దీర్ఘకాల పనిగంటలు, ఆదివారాల నాడు యంత్రాలను శుభ్రం చేయటం వంటి పనుల వల్ల పిల్లలకు తాజా గాలి, తగినంత వ్యాయామం ఉండేవి కావు. పిల్లలు నిద్రలోకి జారుకుని చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. మహిళలు కూడా పనిచేస్తూ ఆర్థిక స్వావలంబన, ఆత్మగౌరవం పెంచుకున్నా వారి జీవితాలు దుర్భరంగా ఉండేవి. ప్రసవ సమయంలో లేదా చాలా చిన్న వయసులోనే పిల్లలు చనిపోయేవాళ్ళు. లోహ పరిశ్రమల్లో పట్టు, లేసు తయారీ, అల్లిక పరిశ్రమల్లో ఎక్కువగా మహిళలు పని చేసేవాళ్ళు.

9th Class Social Textbook Page No.194

ప్రశ్న 8.
తొలి పారిశ్రామికీకరణ వల్ల బ్రిటిష్ పల్లెలు, పట్టణాలపై ప్రభావాలను, భారతదేశంలో అదే పరిస్థితులలోని ప్రభావాలతో పోల్చండి.
జవాబు:
తొలి పారిశ్రామికీకరణ బ్రిటిష్ పల్లెలు, పట్టణాలపై చాలా ప్రభావాన్ని చూపింది. అనేక సమస్యలకు లోనై, కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. జనాభా పెరుగుదలకు దీటుగా గృహవసతి, తాగటానికి శుభ్రమైన నీళ్ళు, పారిశుద్ధ్యం వంటివి పెరగలేదు. మురికివాడలలో నివసిస్తూ, కలరా, టైఫాయిడ్, క్షయ వంటి అంటు వ్యాధుల వలన అనేక వేలమంది చనిపోయారు.

భారతదేశంలో కూడా వలస పాలన వలన చేతివృత్తులు, కులవృత్తులు నశించి, వ్యవసాయరంగంలో ఆహార పదార్థాల • ఉత్పత్తి తగ్గిపోయి, వాణిజ్య పంటలకు ప్రాధాన్యత నిచ్చారు. అనేక ప్రాంతాలలో కరువు కాటకాలు, మలేరియా, టైఫాయిడ్, క్షయవంటి జబ్బులు కమ్ముకున్నాయి. స్వచ్ఛమైన గాలి, మంచినీరు దొరకక ప్రజలు అల్లాడిపోయారు. వైద్యశాస్త్రం నిర్లక్ష్యం
చేయబడింది.

9th Class Social Textbook Page No.195

ప్రశ్న 9.
జర్మనీ, ఫ్రాన్లలో పారిశ్రామికీకరణలను పోల్చండి. పోలికలు, తేడాలను గుర్తించండి.
జవాబు:
పోలికలు :
జర్మనీ, ఫ్రాన్స్ రెండు దేశాలు, ఇంగ్లాండ్ బాటలో నడవడానికి ప్రయత్నించాయి. ఇవి పారిశ్రామికీకరణ ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని తలంచాయి. రోడ్డు, రైలు మార్గాలు పారిశ్రామికీకరణకు రెండు దేశాలు ప్రాధాన్యతనిచ్చాయి.

తేడాలు :

జర్మనీ :
కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని జర్మనీ పరిశ్రమలు దిగుమతి చేసుకున్నాయి. పారిశ్రామికీకరణకు కావలసిన డబ్బులను పెద్ద పెద్ద బ్యాంకులు సమకూర్చాయి. జర్మనీ కొత్తతరం పరిశ్రమలైన ఇనుము – ఉక్కు రసాయనిక, విద్యుత్ పరిశ్రమలను అభివృద్ధి చేసింది. బ్రిటనను మించిపోయింది. బలమైన పారిశ్రామిక శక్తిగా జర్మనీ వెలుగొందింది.

ఫ్రాన్స్ :
ఫ్రాన్స్ ఇందుకు విరుద్ధంగా పారిశ్రామికీకరణను నిదానంగా కొనసాగించింది. 19వ శతాబ్దం చివరకు కూడా ఫ్రాన్స్ లో అధిక శాతం ప్రజలు చిన్న చిన్న కమతాలు సాగుచేసే దేశంగానే ఉంది. యాంత్రీకరణ కంటే మానవశక్తికే ఎక్కువ ప్రాధాన్యత నిచ్చారు. ఫ్రాన్స్ లో ఆర్థిక కష్టాలు అధికంగా ఉండేవి. జర్మనీ అంత సాంకేతిక విజ్ఞానాన్ని, యాంత్రీకరణను ఫ్రాన్స్ దిగుమతి చేసుకోలేకపోయింది.

AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 10.
పారిశ్రామిక అభివృద్ధిలో ఫ్రాన్స్ వెనుకబడటానికి కారణాలు ఏమిటి?
జవాబు:
పారిశ్రామిక అభివృద్ధిలో ఫ్రాన్స్ వెనుకబడటానికి కారణాలు :

  1. నిధుల సమస్య.
  2. ఇతర దేశాలు అభివృద్ధి చేసిన కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని ఫ్రాన్స్ అందుకోలేకపోయింది.
  3. గ్రామీణ శ్రామికులకు పని ఇవ్వటం వలన ఉత్పత్తి తగ్గుముఖం.
  4. బొగ్గు గనులు లేమి, దిగుమతులపై ఎక్కువ ఖర్చు.
  5. బట్టలు వంటి చిన్న పరిశ్రమలపై దృష్టి.
  6. ఎక్కువ పెట్టుబడిని ఇవ్వగల పెద్ద బ్యాంకులు ఫ్రాన్స్ లో లేకపోవడం.
  7. మానవ మేధస్సు తక్కువ.

ప్రశ్న 11.
పారిశ్రామిక ఉత్పత్తిలో ఇంగ్లాండ్, ఫ్రాన్లను అధిగమించటానికి జర్మనీకి దోహదం చేసిన అంశాలు ఏమిటి?
జవాబు:
పారిశ్రామిక ఉత్పత్తిలో ఇంగ్లాండ్, ఫ్రాన్లను జర్మనీ అధిగమించటానికి దోహదం చేసిన అంశాలు :

  1. బ్రిటన్, అమెరికా సాధించిన సాంకేతిక అభివృద్ధి వల్ల జర్మన్ పరిశ్రమల ప్రయోజనం.
  2. ప్రపంచ దేశాల సాంకేతిక విజ్ఞానం దిగుమతి చేసుకోవడం.
  3. పెద్ద పెద్ద పెట్టుబడుల్ని సమకూర్చగల బ్యాంకుల సహకారం.
  4. కొత్తతరం పరిశ్రమలైన రసాయనిక, విద్యుత్ పరిశ్రమల అభివృద్ధి.
  5. నూతన ఆలోచనా విధానం.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
పారిశ్రామిక విప్లవ పరిణామాలు ఆర్థిక రంగంపై ఎలా ప్రభావం చూపాయో పేర్కొనండి. ఒక నివేదిక రాసి మీ తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
నూతన ఆవిష్కరణలు, సాంకేతిక విజ్ఞానం, కొత్త యంత్రాల వినియోగంతో పారిశ్రామిక విప్లవం ప్రపంచ చరిత్రనే మార్చివేసింది. ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాలలో పారిశ్రామికీకరణ వలన – సంపద అనంతంగా ఉండటంతో వస్తు ఉత్పత్తికి, ముడి పదార్థాల వినియోగానికి, రవాణా వ్యవస్థను వృద్ధి చేసుకోవడానికి పెట్టుబడి సమకూర్చుకోవడం తేలిక అయింది. 17వ శతాబ్దం ఆరంభం నుంచి ఇతర దేశాలతో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు చేసి తద్వారా పెద్ద ఎత్తున లాభాలు గడించాయి.

పారిశ్రామిక రంగంలో వచ్చిన ఆర్థిక వనరులతో పెట్టుబడిని రెండింతలు చేసి నిధులు మరింత పెంచుకోవడానికి దేశాలు బ్యాంకులలో ఆదా చేశాయి. అంతేకాకుండా సముద్రయానం చేసే పారిశ్రామికవేత్తలకు అధిక మొత్తంలో అధికవడ్డీకి డబ్బులు ఇచ్చి లాభాన్ని గడించాయి. విత్తమార్కెట్, స్టాక్ బ్యాంకు, స్టాక్ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక పరిపుష్టి పెరిగింది. శాస్త్ర, సాంకేతిక రంగాలలో విప్లవాత్మక చర్యలు వలన అధికంగా నిధులు సమకూరి ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపింది.

AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 14th Lesson 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 14th Lesson 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

9th Class Social Studies 14th Lesson 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
సరైన వాటిని ఎంచుకోండి. (AS1)
ఎ) ఒక దేశానికి …………… ఉండాలని ప్రజాస్వామిక, జాతీయతావాద ఉద్యమాలు భావించాయి. (ఉమ్మడి చరిత్ర, ఉమ్మడి సంస్కృతి, ఉమ్మడి ఆర్థిక వ్యవస్థ, పైవన్నీ, పైవి ఏవీకావు)
జవాబు:
ఉమ్మడి చరిత్ర, ఉమ్మడి సంస్కృతి, ఉమ్మడి ‘ఆర్థిక వ్యవస్థ.

బి) వివిధ దేశాలలో జాకోబిన్ క్లబ్బులను ………. ఏర్పాటు చేసింది. (రైతాంగం, రాచరికం, మధ్యతరగతి, సైన్యం)
జవాబు:
మధ్యతరగతి

సి) 18వ శతాబ్దం మధ్యకాలంలో భూమి ……………. కింద ఉండేది. దానిని ……………… ‘సాగు చేసేవాళ్ళు. (మధ్యతరగతి, సైన్యం, రాచరిక కుటుంబాలు, కౌలుదారులు)
జవాబు:
రాచరిక కుటుంబాలు, కౌలుదారులు.

ప్రశ్న 2.
18వ శతాబ్దపు మధ్యకాలం నాటి యూరప్ లోని ప్రజలలో భాష, జాతి మూలాలు, వాణిజ్య పద్ధతులలో గల పోలికలు, తేడాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
18వ శతాబ్దపు మధ్యకాలంలో యూరప్ లోని ప్రజలలో భాష, జాతి మూలాలు వాణిజ్య పద్ధతులలో పోలికలు, తేడాలు కూడా మనకు కనిపిస్తాయి.

పోలికలు :

  1. ప్రధానంగా ఈ ప్రాంతాలలో నియంతృత్వ రాచరికాలు ఉండేవి.
  2. కులీన, మధ్యతరగతి, సంపన్న వర్గాల అధీనంలో భూములు, ఎస్టేట్స్ ఉండేవి.
  3. ఈ ప్రాంతాలలో ఉమ్మడి సంస్కృతి, లేదా సామూహిక గుర్తింపు ఉండేది.
  4. పశ్చిమ ప్రాంతాలు, మధ్య యూరప్ లు మార్కెట్ కోసం ఉత్పత్తి చేసే వాణిజ్య వర్గాలు ఏర్పడ్డాయి.
  5. శ్రామిక వర్గ ప్రజలు, మధ్యతరగతి, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్థులు, వృత్తి నిపుణులు ఏర్పడ్డారు.

తేడాలు :

  1. వీరంతా (యూరప్ లోని వారు) వేరు వేరు భాషలు మాట్లాడేవారు. టైరాల్, ఆస్ట్రియా, సుడెటె లాండ్, బొహీమియాలలో, ఆల్ఫైన్ ప్రాంతాలలో జర్మన్ భాష మాట్లాడేవారు.
  2. హంగరీలో సగం మంది జనాభా. మగ్యార్ మాట్లాడేవారు.
  3. గాలిసియాలో కులీనవర్గం వారు పోలిష్ భాష మాట్లాడేవారు.

వీరి మూలాలు కూడా వేరుగా ఉండేవి. సామ్రాజ్య పరిధిలో రైతాంగ ప్రజలు ఉండేవాళ్ళు. ఉత్తరానికి బొహీమియన్లు, స్లోవాకు, కార్నియోలాలో స్లోవీన్లు, దక్షిణానికి క్రొయాట్లు, తూర్పున ట్రాన్సిల్వేనియాలో రౌమన్లు ఈ తేడాల వల్ల రాజకీయ ఐక్యత అంత తేలికగా ఏర్పడదు.

వాణిజ్య పద్ధతులలో కూడా తేడా ఉంది. 18వ శతాబ్దంలో రెండవ భాగంలో ముందుగా ఇంగ్లాండ్ లో పారిశ్రామికీకరణ మొదలై వివిధ వాణిజ్య, వ్యాపారస్తులు లాభపడ్డారు. అయితే జర్మనీ, ఫ్రాన్స్ లో 19వ శతాబ్దంలో పారిశ్రామికీకరణ వల్ల అంత ప్రగతి సాధించబడలేదు.

AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 3.
“జాతీయ రాజ్యాలు ఏర్పడటంతో రాచరిక వర్గాల ఆధిపత్యం తగ్గి మధ్య తరగతి ప్రాభవం పెరిగింది” అన్న వాక్యంతో మీరు ఏకీభవిస్తారా? కారణాలు ఇవ్వండి. (AS2)
జవాబు:
జాతీయ రాజ్యాలు ఏర్పడటం వల్ల రాచరిక వర్గాల ఆధిపత్యం తగ్గి మధ్య తరగతి ప్రాభవం పెరిగిందని నేను ఏకీభవిస్తాను.

రాచరిక వర్గాల వల్ల రైతాంగం పన్నులు కట్టలేక, చర్చి అధీనంలో పని చేయలేక, వారికి సేవలు చేయలేక నలిగి పోతుండేవారు. ఒక సం|| పంటలు సరిగా పండకపోయినా, లేదా ఆహార ధరలు పెరిగినా పల్లెల్లో, పట్టణాల్లో పేదరికం పెరిగిపోతుంది.

కొత్తగా ఏర్పడిన, మధ్య తరగతులు విదేశీ సముద్ర ప్రయాణం, వర్తక, వాణిజ్యాల ద్వారా అధికంగా ఆస్తులు సంపాదించారు. వీళ్ళకు వ్యక్తిగత స్వేచ్ఛ, చట్టం ముందు అందరూ సమానులుగా ఉండటం అన్న వాటికి ఉదారవాదం ప్రతీకగా నిలిచింది.

మధ్య తరగతి వర్గం ఫ్రెంచి విప్లవం నాటి నుంచి నియంత పాలనకు అంతం, చర్చి ప్రత్యేక హక్కులకు అంతం, రాజ్యాంగం, పార్లమెంట్ ద్వారా ప్రాతినిధ్య ప్రభుత్వంగా పరిగణింపబడసాగింది. మధ్యతరగతిలో మేధావి వర్గానికి చెందిన ఆచార్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, న్యాయవాదులు, కళాకారులు, రచయితలు, వాణిజ్యవేత్తలు, వారి వారి స్థాయిలలో రాచరిక ప్రాధాన్యత తగ్గించి ప్రజా చైతన్యం, విప్లవాలు ద్వారా మధ్య తరగతి ప్రాతినిధ్యం పెరిగింది.

ప్రశ్న 4.
మీరు చదివిన ఒక భారతదేశ జాతీయతావాదికి, మాజినికి మధ్య సంభాషణను ఊహించి రాయండి. (AS6)
జవాబు:
సంభాషణ

మాజిని : మాటలు, ఉపన్యాసాలు, చర్చల ద్వారా జాతీయ రాజ్యం ఏర్పరచలేము. ఏదో ఒకటి చేయాలి.

రూసో : విప్లవాలు, ఉద్యమ హింసల ద్వారా స్వాతంత్ర్యం పొందలేం ……… జాతి ఐక్యతను సాధించలేం ……. కాలమే నిర్ణయిస్తుంది.

మాజిని : ఎంతకాలమో కాలయాపన. ఏదో విప్లవ సంఘాలు, రహస్య పోరాటాల ద్వారానే ఐక్యత సాధించగలం.

రూసో : ప్రజా చైతన్యం రావడానికి కాలం పడుతుంది. ప్రజలలో మార్పు ద్వారా జాతీయతావాదం బలపడుతుంది. ముందుగా ప్రజలలో చైతన్య బావుటా ఎగురవేయాలి.

మాజిని : ఎంతకాలమో ఎగురలాటలు, గంతులు, జిమ్మిక్కులు, యుద్ధ వాతావరణం కల్పించాలి. రాచరిక, నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలి.

రూసో : దానికో మార్గం ఉంది ……………… ఆగాలి.

మాజిని : ఇంకా ఆగితే అధోగతే ……………….

రూసో : ఫ్రెంచి విప్లవం ఎలా సాధ్యమయ్యిందో, ఎలా ఫలితాలు సాధించాయో తెలుసు కదా!

మాజిని : అప్పటి పరిస్థితులు వేరు.

రూసో : ఉద్రేకాల వల్ల, యుద్ధాలు పరిష్కారం కావు.

మాజిని : ఇంకా ఏదో తేల్చుకోవాలి. వేలకొలది యువకులతో విప్లవ జ్వా లలు రగిలించాలి …….. విప్లవ జ్వాలలు రగిలించాలి …… రగిలించాలి.

AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 5.
సాంప్రదాయవాదులు, ఉదారవాదుల గురించి వివరించే వాక్యాలను గుర్తించండి. మన ప్రస్తుత నేపథ్యంలో వీటికి ఉదాహరణలు ఇవ్వండి. (AS1)
జవాబు:
1815లో నెపోలియన్ ఓడిపోయిన తరువాత యూరోపియన్ ప్రభుత్వాలలో సంప్రదాయవాదం చోటుచేసుకుంది. రాచరికం, చర్చి, సామాజిక తారతమ్యాలు, ఆస్తి, కుటుంబం వంటి సంప్రదాయ వ్యవస్థలను కాపాడాలని భావించారు. ఆధునిక సైన్యం, సమర్థ పరిపాలనా వ్యవస్థ, వృద్ధి చెందుతున్న ఆర్థిక స్థితి, ఫ్యూడలిజం, బానిసత్వాల రద్దు ద్వారా యూరపులో నిరంకుశ రాచరికాలను బలోపేతం చేయవచ్చు అని వాళ్ళు భావించారు.
ఉదా : కుటుంబ సంప్రదాయం, స్థానిక ప్రభుత్వం ఏర్పాటు.

ఉదారవాదం ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛ, చట్టం ముందు అందరూ సమానులే అన్న వాటికి ప్రతీకగా నిలిచింది. నియంత పాలనకు స్వస్తి చెప్పి, చర్చి ప్రత్యేక హక్కులను అంతం చేసి, రాజ్యాంగం, పార్లమెంట్ ద్వారా ప్రాతినిధ్య ప్రభుత్వంగా పరిగణింపబడింది. సాంప్రదాయ వాదులు నియంత్రించిన, పత్రికా స్వేచ్ఛకు ప్రాధాన్యత నిచ్చింది.

ఉదా : వాక్ స్వాతంత్ర్యం, సమన్యాయపాలన.

ప్రశ్న 6.
ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీలలో జాతీయ రాజ్యాలు ఏర్పడటంలో తేడాలు, పోలికలు చూపించే పట్టికను తయారుచేయండి. (AS1)
జవాబు:
తేడాలు :

ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ
ఫ్రాన్స్ లో నిరంకుశ పాలనకు వ్యతి రేకంగా, అధిక పన్నులు, అభద్రతా భావం వల్ల, మధ్యతరగతి వర్గం చైత న్యంతో జాతీయ రాజ్యం ఏర్పడింది. జర్మనీలోని వివిధ ప్రాంతాలను సమాఖ్యగా ఏర్పరచి, ఎన్నికైన పార్లమెంట్ పాలనలో జాతీయ రాజ్యాంగం, రాజ్యస్థాపనకు కృషి. ఇటాలియన్ స్రామాజ్యం చెల్లాచెదురుగా ఉండేవి.
చదువుకున్న మధ్యతరగతి సంపన్న వర్గాలకు చెందిన ఉదారవాద జాతీయతా ఉదారవాదుల ప్రయత్నాన్ని రాచరిక, సైనిక శక్తులు అణచివేశాయి. ఇటాలియన్ ప్రజలు అధిక శాతం నిరక్షరాస్యులు.
వాదం విప్లవ భావాలతో కలవసాగాయి. జాకోబిన్ క్లబ్, రాబిన్ స్పియర్. బ్లెడ్ అండ్ ఐరన్ బిస్మార్క్, యంగ్ ఇటలీ మాజిని.
ఫ్రాన్స్ లో, జాతీయ రాజ్యం ప్రారంభం. ఫ్రాన్స్ అడుగుజాడల్లో ఫ్రాన్స్ విధానంలో కాకుండా

పోలికలు :

ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ
తిరుగుబాట్ల ద్వారా, ఉద్యమాలు ద్వారా రాజ్యస్థాపన. ఫ్రాన్స్ అడుగుజాడల్లో ఫ్రాన్స్ విధానంలో కాకుండా
రాచరికం, గణతంత్రం. ఫ్రాన్స్ అడుగుజాడల్లో ఫ్రాన్స్ విధానంలో కాకుండా
ఆకలి, కష్టాలు, ఆవేదనలు, ఆక్రందనల నుంచి ఫ్రాన్స్ అడుగుజాడల్లో ఫ్రాన్స్ విధానంలో కాకుండా
జాతీయ రాజ్యాలు ఏర్పాటు ఫ్రాన్స్ అడుగుజాడల్లో ఫ్రాన్స్ విధానంలో కాకుండా
స్త్రీలకు ప్రాధాన్యం ఫ్రాన్స్ అడుగుజాడల్లో ఫ్రాన్స్ విధానంలో కాకుండా
యువకులలో రాజకీయ చైతన్యం ఫ్రాన్స్ అడుగుజాడల్లో ఫ్రాన్స్ విధానంలో కాకుండా

ప్రశ్న 7.
1848 ఉదారవాదుల తిరుగుబాటు అంటే ఏమిటో వివరించండి. ఉదారవాదులు సమర్థించిన రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలు ఏమిటి? (AS1)
జవాబు:
చార్లెన్ X తదుపరి వరుసకి సోదరుడైన లూయీ ఫిలిప్ రాజు అయ్యాడు. 1830లో లాగానే 1848లో కూడా తిరుగుబాటు ఫ్రాన్స్ లో మొదలైంది. రాజ్యాంగబద్ద రాచరికంలో భాగంగా లూయీ ఫిలిప్ పరిపాలించాలి. సింహాసనాన్ని అధిష్టిస్తున్నప్పుడు అతడిని “పౌర రాజుగా” పేర్కొన్నారు. అతడి పట్టాభిషేకం దేవుని దయతోను, “జాతి కోరిక ప్రకారం” జరిగిందని అన్నారు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ ఫిలిప్ తిరోగామి పంథా అవలంబించడం వల్ల 1848 నాటికి అతడి పాలనకు తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ప్రజలు తిరగబడ్డారు. పలాయనం తప్పించి లూయీ ఫిలిప్ కి మరో దారి లేకుండా పోయింది. “గణతంత్రం వర్ధిల్లాలి” అన్న నినాదాలు వీధులలో మిన్నుముట్టాయి. ఫిలిప్ భయపడి ఇంగ్లాండ్ కు పారిపోయాడు. ఆ తదుపరి హింస కొనసాగింది. తిరుగుబాటుదారులను అంతిమంగా ప్రభుత్వ సైన్యాలు ఓడించి తీవ్ర శిక్షలు విధించాయి. ఉదారవాద ఉద్యమంలో మహిళలు చురుకుగా పాల్గొన్నారు.

ఉదారవాదులు సమర్థించిన రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలు :

  • వ్యక్తిగత స్వేచ్ఛ, చట్ట సమానత్వం.
  • రాజకీయంగా ప్రజామోదంతో ప్రభుత్వం అన్న భావన.
  • వ్యక్తిగత ఆస్తి హక్కుకు ప్రాధాన్యత.
  • రాజ్యాంగం, పార్లమెంట్ ద్వారా ప్రాతినిధ్య ప్రభుత్వం.
  • సరుకులు, ప్రజలు, పెట్టుబడి ఎటువంటి ఆటంకాలు లేకుండా తరలింపబడేలా ఏకీకృత ఆర్థిక ప్రాంతం ఏర్పాటు.
  • సుంకాల సమాఖ్య లేదా జోల్వెరిన్ ఏర్పాటు.
  • రైలు మార్గాల అభివృద్ధితో ప్రగతి అధికం.
  • దేశ ఐక్యతకు తగ్గట్లు ఆర్థిక, సామాజిక, రాజకీయ హక్కుల కల్పన.

AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 8.
జర్మనీ ఏకీకృతమైన ప్రక్రియను క్లుప్తంగా వివరించండి. (AS1)
(లేదా)
జర్మనీ ఏకీకరణను వివరించండి.
జవాబు:
జర్మనీ మధ్యతరగతి వర్గాలలో జాతీయభావం అధికం. 1848లో వీళ్ళు జర్మనీలోని వివిధ ప్రాంతాలను సమాఖ్యగా ఏర్పరచి, ఎన్నికైన పార్లమెంట్ పాలనలో జాతీయ రాజ్యాంగం మలచటానికి ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నాలను రాచరిక, సైనిక శక్తులు అణచివేశాయి. ఇందులో సైన్యానికి జంకర్లు అనే ప్రష్యా బడా, భూస్వాములు కూడా సహకరించారు. అప్పటి నుంచి జాతిని ఏకం చేసే ఉద్యమానికి ప్రష్యా నాయకత్వం వహించింది. ప్రష్యా సైన్యం, పాలనా యంత్రాంగం సహాయంతో ప్రష్యా ప్రధానమంత్రి ఒట్టోవాన్ బిస్మార్క్ ఈ ప్రక్రియకు సూత్రాధారిగా వ్యవహరించాడు. ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్ పై జరిగిన మూడు యుద్ధాలలో ప్రష్యా విజయం సాధించడంతో ఏకీకరణ ప్రక్రియ పూర్తయింది. ప్రష్యా రాజైన విలియం-I జర్మన్ చక్రవర్తిగా 1871లో ప్రకటింపబడ్డారు.

ప్రశ్న 9.
వియన్నా సమావేశం చేసిన మార్పులను యూరపు పటంలో చూపించండి. (AS5)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 1

ప్రశ్న 10.
పేజీ నెం. 177లోని ‘ఆకలి కష్టాలు, ప్రజా తిరుగుబాటు’ శీర్షిక కింద ఉన్న మొదటి పేరాను చదివి, వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
యూరపులో 1830లలో ఆకలి, కష్టాలు తత్ఫలితంగా ప్రజా తిరుగుబాటు .జరిగి ఆర్థికంగా తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. 194|| మొదటి సగంలో యూరప్ అంతటా జనాభా గణనీయంగా పెరిగింది. చాలా దేశాలలో పనుల కంటే పనిచేసే వాళ్లు ఎక్కువైనారు. పల్లె ప్రాంతాల నుండి పట్టణాలకు వలస వెళ్లి, మురికి వాడలలో నివసించి, దుర్భర జీవితం అనుభవించారు. పంటలు సరిగా పండకపోయినా, లేదా ఆహార ధరలు పెరిగినా పల్లెల్లో, పట్టణాల్లో పేదరికం పెరిగిపోయింది. తత్ఫలితంగా నిరసనలు పెల్లుబికి తిరుగుబాటుకు దారి తీసింది.

9th Class Social Studies 14th Lesson 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు InText Questions and Answers

9th Class Social Textbook Page No.174

ప్రశ్న 1.
ఆయా దేశాలలో జాతీయతాభావం ఏర్పడడానికి నెపోలియన్ దాడులు ఎలా దోహదపడి ఉంటాయి?
జవాబు:
నెపోలియన్ దాడుల తర్వాత 1815లో ఆయన ఓడిపోయిన తర్వాత ఆయా దేశాలలో ప్రభుత్వాలలో నెపోలియన్ ద్వారా పదవీచ్యుతులైన రాచరికాలకు తిరిగి అధికారం కట్టబెట్టి యూరపులో కొత్త సంప్రదాయవాదాన్ని నెలకొల్పటం ప్రధాన ఉద్దేశ్యంగా వియన్నా సమావేశం ఏర్పాటైంది. నెపోలియన్ చేపట్టిన మార్పుల ద్వారా రాజ్యాధికారం మరింత బలోపేతం అయి, ఆయన దాడుల వలన జాతీయతాభావం పెరిగింది. ఆధునిక సైన్యం, సమర్థ పరిపాలనావ్యవస్థ, వృద్ధి చెందుతున్న ఆర్థిక స్థితి, బానిసత్వాల రద్దు యూరప్లో రాచరికం తగ్గి, జాతీయతా భావాలు పెరిగాయి.

ప్రశ్న 2.
జాతీయతావాదం, జాతీయ రాజ్యాలు అన్న భావనలు ఎలా ఆవిర్భవించాయి?
జవాబు:
ఉమ్మడి చరిత్ర, సంస్కృతి, ఆర్థిక జీవనం పంచుకుందామన్న భావం కలిగిన పౌరుల క్రియాశీల భాగస్వామ్యంపై ఆధారపడిన బలమైన దేశాలను ఏర్పాటు చేయటానికి జాతీయతావాద ఉద్యమాలు ఆవిర్భవించాయి. ఈ ప్రయత్నాల ఫలితంగా పలు దేశాలతో కూడిన వంశపారంపర్య రాచరిక స్థానంలో యూరపులో జాతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి.

AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 3.
జాతీయతాభావం ఏర్పడటంలో భాష, జనాదరణ పొందిన సంప్రదాయాల ప్రాముఖ్యత గురించి చర్చించండి.
జవాబు:
జాతీయతాభావం ఏర్పడడంలో భాష, జనాదరణ పొందిన సంప్రదాయాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. యూరపు ప్రాంతాలు నియంతృత్వ రాచరికాల కింద ఉండేవి. వాళ్ళ పాలనలో వివిధ రకాల ప్రజలు ఉండేవాళ్ళు. వాళ్ళు తమకు ఒక ఉమ్మడి సంస్కృతి, లేదా సామూహిక గుర్తింపు ఉందని భావించే వాళ్ళు కాదు. వాళ్ళు తరచు వేరు వేరు భాషలు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. జాతీయతాభావం ఏర్పడడానికి అంతా ఒకటై ముందుకు సాగారు. అదే విధంగా జనాదరణ పొందిన కుటుంబ సాంప్రదాయాలు, బానిసత్వాల రద్దు వంటి సాంప్రదాయాల వల్ల కూడా జాతీయతా భావం పెరిగింది. కళలు, కవిత్వం, కథలు, సంగీతం వంటివి జాతీయతా భావాన్ని మలచటంలో సహాయపడ్డాయి.

9th Class Social Textbook Page No.176

ప్రశ్న 4.
పాత రాజ్యాలు వ్యాపార, పరిశ్రమల ప్రగతిని ఏ విధంగా అడ్డుకున్నాయి?
జవాబు:
ఆర్థికరంగంలో స్వేచ్ఛా మార్కెట్లనూ, సరుకునూ, పెట్టుబడి కదలికలపై పాత రాజ్యాలు, వ్యాపార, పరిశ్రమల ప్రగతిని అడ్డుకున్నాయి. ఒక్కొక్క రాష్ట్రానికి తనదైన ద్రవ్య విధానం, తూనికలు, కొలతలూ ఉండేవి. చాలా ప్రదేశాలలో తనిఖీలు, అధికంగా సుంకాలు వసూలు చేసేవారు. ప్రతీ ప్రాంతానికీ తనదైన తూనికలు, కొలతలు ఉండడం వల్ల సుంకం లెక్కించటానికి చాలా సమయం పట్టేది. తద్వారా వ్యాపార, పరిశ్రమల ప్రగతికి నిరోధకమయ్యెను.

ప్రశ్న 5.
ఆ దేశాలలో ఉదారవాద ప్రజాస్వామ్యం వ్యాపార, పరిశ్రమలకు ఏ విధంగా దోహదం చేసింది?
జవాబు:
ఉదారవాద ప్రజాస్వామ్యాలు వ్యాపార పరిశ్రమలకు ఎంతో ప్రాధాన్యత నిచ్చాయి. కొత్తగా ఏర్పడిన మధ్య తరగతి వర్గం వర్తక, వాణిజ్యాల ద్వారా, సముద్రయానం ద్వారా పరిశ్రమల అభివృద్ధికి కృషి చేశాయి. రాచరిక వ్యవస్థలో గల ఇబ్బందులు తొలగించడానికి ఇవి కృషి చేశాయి. వస్తువులు, సరుకుల పెట్టుబడిపై ప్రభుత్వ పరిమితులను రద్దు చేశాయి. సరకులు, ప్రజలు, పెట్టుబడి ఎటువంటి ఆటంకాలు లేకుండా తరలింపబడేలా ఏకీకృత ఆర్థిక ప్రాంతం ఏర్పాటు చేయాలని ఈ వర్గాలు కోరాయి. తనిఖీ కేంద్రాలు రద్దు చేసి ద్రవ్య విధానాలను రెండుకి కుదించాయి. రైలు మార్గాలు అభివృద్ధి చేసి పరిశ్రమలను ప్రోత్సహించాయి.

ప్రశ్న 6.
మన దేశంలో ఉదారవాద, ప్రజాస్వామిక రాజకీయ విధానం ఉందా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి.
జవాబు:
మనదేశంలో ఉదారవాద, ప్రజాస్వామిక రాజకీయ విధానం ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛ, సమన్యాయ పాలనతో పాటు, 18 సం||లు నిండిన స్త్రీ, పురుషులు కుల, మత, లింగ, పేద, ధనిక భేదం లేకుండా వయోజన ఓటు హక్కు కల్పించబడింది. 21 సం||లు నిండినవారు ఎన్నికలలో ఎవరైనా పోటీ చేయవచ్చు. నిరంకుశ, నియంత పాలన మనదేశంలో లేదు. రాజ్యాంగం, పార్లమెంటు ద్వారా ప్రాతినిధ్య ప్రభుత్వంగా మనదేశం పరిగణించబడింది.

ప్రశ్న 7.
మన ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి సంప్రదాయవాదం మంచిదనే వాళ్ళకీ, ఉదారవాద ప్రజాస్వామ్యం మంచిదనే వాళ్ళకీ మధ్య చర్చ నిర్వహించండి.
జవాబు:
సంప్రదాయవాదులు :
రాచరికమే మంచిది. రాజే ఉన్నతుడు, సామాజిక తారతమ్యాలే దేశాన్ని నడిపిస్తాయి.

ఉదారవాద ప్రజాస్వామ్యవాదులు :
ప్రజలే ప్రభువులు. రాజ్యమంటే ప్రజలే…. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం మేం పని చేస్తున్నాం.

సంప్రదాయవాదులు :
చర్చి అధీనంలో హక్కులు ఉండి, పరిపాలనలో మేటిగా ఉంటాం. ఆస్తి, కుటుంబ సంప్రదాయాలకు విలువిస్తాం.

ఉదారవాద ప్రజాస్వామ్యవాదులు :
చట్టం ముందు అందరూ సమానులే. వయోజనులకు ఓటు హక్కు కల్పించాము. వ్యక్తిగత స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం అందించాం.

సంప్రదాయవాదులు :
మధ్య తరగతి వారు ధనవంతులు కాకుండా, వాణిజ్య వ్యాపారాలను నివేదించాం. పత్రికల స్వేచ్ఛ, అభివృద్ధి నిరోధకం దానిని రూపుమాపాం.

ఉదారవాద ప్రజాస్వామ్యవాదులు :
నిరంకుశ భావాలు సహించం. ఉద్యమాలు, విప్లవాల ద్వారా చైతన్యం తెస్తాం. సంప్రదాయ చీకటి దారుల్ని తెరిపించి, వెలుగునందిస్తాం.

AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 8.
అభిప్రాయ వ్యక్తీకరణ, విమర్శలకు వ్యక్తికి ఉన్న స్వేచ్ఛలను సంప్రదాయవాదం ఎందుకు హరిస్తుంది?
జవాబు:
సంప్రదాయవాదం అభిప్రాయ వ్యక్తీకరణకు వ్యక్తికి ఉన్న స్వేచ్ఛలను అడ్డుకుంటుంది. అభిప్రాయ వ్యక్తీకరణ, విమర్శల వలన సంప్రదాయవాదుల ఆత్మగౌరవం దెబ్బతింటుందని, వ్యక్తికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల వలన అభివృద్ధి కుంటుపడుతుందని, పత్రికా స్వేచ్చ వలన కూడా ప్రజలు చెడు మార్గంలో పయనిస్తారని భావించింది. కుటుంబ సాంప్రదాయాలు, సామాజిక తారతమ్యాలు దెబ్బతిని పరిపాలకుల మనుగడ దెబ్బ తింటుందని తలంచాయి.

9th Class Social Textbook Page No.178

ప్రశ్న 9.
ఎనిమిదవ తరగతిలో భారతీయ జాతీయతావాదులు దేశంలోని సాంప్రదాయ, జానపద కళల పునరుద్ధరణకు ప్రాధాన్యత నిచ్చారని మీరు చదివారు. ఇది ముఖ్యమని వాళ్ళు ఎందుకు భావించారు?
జవాబు:
ప్రజలలో ఐక్యత, విజ్ఞానం, అక్షర జ్ఞానం లేకపోవడం వల్ల తరతరాలుగా బానిసత్వ బతుకుల్లా సంస్కృతి, సాంప్రదాయాలు, మన ఆచారాల పరిరక్షణకు వారు తలంచారు. ప్రజలలో ఉన్న అమాయకత్వం, మూఢ నమ్మకాలు, అవగాహనాలేమి, అవినీతి, వారసత్వ రాజకీయాలలో ప్రజలను చైతన్యపరచడానికి ప్రభుత్వాలు అందించు సంక్షేమ ఫలాలు, అభివృద్ధి పథకాలు సామాన్యులకు, వెనుకబడిన వర్గాల వారికి చేరవేయటానికి, సాంప్రదాయ, జానపద ‘కళల పునరుద్దరణకు ప్రాధాన్యతనిచ్చారు. మన కళలు, సాంప్రదాయాలు, మన సంస్కృతికి, మన వారసత్వానికి ప్రతిబింబాలు. జానపద కళలు, సాంప్రదాయాలు మన జీవన ఆధారాలు కాబట్టి ముఖ్యమని తలంచారు.

9th Class Social Textbook Page No.180

ప్రశ్న 10.
చార్లెస్ X, లూయీ ఫిలిట్లు ఫ్రాన్స్ వదిలి ఎందుకు పారిపోవలసి వచ్చిందో వివరించండి.
జవాబు:
చార్లెస్ X :

  1. చార్లెస్ X విప్లవాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు.
  2. కులీనులకు, మత గురువులకు ప్రత్యేక హక్కులను పునరుద్ధరించటానికి ప్రయత్నించాడు.
  3. 1814 చార్టర్ ని పక్కకు పెట్టి తన ఇష్టమొచ్చినట్లు పరిపాలించసాగాడు.
  4. తిరుగుబాట్లు, విప్లవంతో వచ్చిన నిరసనలు ద్వారా ఇక ప్రాణం కాపాడుకోవడానికి ఫ్రాన్స్ ను వదలి పారిపోయాడు.

లూయీ ఫిలిప్ :
చార్లెస్ X కి వరుసకు సోదరుడైన లూయీ ఫిలిప్ రాజు అయ్యాడు. ప్రారంభంలో పౌర రాజుగా కీర్తింపబడినా, ఆ తరువాత

  1. గడుస్తున్న కొద్దీ అతడి ప్రభుత్వం తిరోగామి పంథాను అవలంబించింది.
  2. 1848 నాటికి అతడి పాలనపై తీవ్ర వ్యతిరేకత.
  3. శత్రువులు పెరిగిపోయారు.
  4. అతడు నియమించిన ముఖ్యమంత్రి ప్రజాదరణ కోల్పోవటంతో అతడిని తొలగించారు.
  5. రాజు సైనికులు జరిపిన కాల్పులలో ఇరవై ముగ్గురు చనిపోయారు.
  6. దాంతో ప్రజలు తిరగబడ్డారు.
  7. గణతంత్రం వర్ధిల్లాలి, అన్న నినాదాలు మిన్నంటాయి.
  8. దాంతో భయపడి ఫిలిప్ ఇంగ్లాండుకు పారిపోయాడు.

9th Class Social Textbook Page No.181

ప్రశ్న 11.
ఈ వ్యంగ్య చిత్రాన్ని వివరించండి. బిస్మార్క్ కి ఎన్నికైన పార్లమెంటు డిప్యూటీలకీ మధ్య సంబంధాన్ని ఇది ఎలా చూపిస్తోంది? ప్రజాస్వామిక ప్రక్రియల గురించి చిత్రకారుడు ఏం వ్యాఖ్యానించదలుచుకున్నాడు?
AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 2
జవాబు:
ఈ చిత్రం బిస్మార్క్ వ్యక్తిత్వాన్ని వివరిస్తుంది. బిస్మార్క్ విధానం క్రూరమైన బలప్రయోగం మీద ఆధారపడింది. జర్మనీ ఏకీకరణ ప్రసంగాలతోనూ, ఉత్సవాలతోను, పాటలతోను సాధ్యం కాదని, క్రూరమైన బలప్రయోగం ద్వారానే ఇది సాధ్యమవుతుందని బిస్మార్క్ నమ్మాడని చిత్రకారుడు వ్యంగ్యంగా చిత్రీకరించాడు.

బిస్మార్క్ విధానాలు ప్రజాస్వామిక ప్రక్రియలను అణచివేయడానికి దోహదపడ్డాయని చిత్రకారుని వ్యాఖ్యానం.

9th Class Social Textbook Page No.183

ప్రశ్న 12.
రాజు ఇమాన్యుయెల్-II కింద ఏకీకృతమైన ఇటలీ నిజమైన జాతీయ రాజ్యంగా మారిందా? మీ సమాధానానికి కారణాలు తెలపండి.
జవాబు:
ఇటలీ దీర్ఘకాలంగా రాజకీయంగా ముక్కలై ఉంది. అనేక వంశపారంపర్య రాజ్యాలలో, అనేక జాతులతో కూడిన హాట్స్ బర్గ్ సామ్రాజ్యంలో ఇటాలియన్లు చెల్లాచెదురై ఉన్నారు. 1831, 1848లోని విప్లవాలు విఫలం అవ్వటంతో యుద్ధం ద్వారా ఇటాలియన్ రాజ్యాలను ఒకటిగా చేసే బాధ్యత సార్డీనియా, పీడ్మాంట్ రాజు విక్టర్ ఇమాన్యుయెల్-II మీద పడింది. మాజిని, కవూర్, గారి బాల్డి నేతృత్వాలలో సాయుధ వలంటీర్ల తిరుగుబాటుతో, 1860లో వీళ్ళు దక్షిణ ఇటలీ నుండి సిసిలీస్ రాజ్యంలోకి చొచ్చుకుపోయి స్పానిష్ పాలకులను తరిమి కొట్టడానికి స్థానిక రైతాంగం మద్దతు కూడగట్టారు. 1861లో ఏకీకృత ఇటలీకి విక్టర్ ఇమాన్యుయెల్-II రాజుగా ప్రకటించారు.

కాని ఇటాలియన్ ప్రజానీకంలో అధిక శాతం నిరక్షరాస్యులు. వారికి ఉదారవాద, జాతీయతా భావజాలం తెలియకుండా ఉండిపోయారు.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
18వ శతాబ్దపు మధ్యకాలపు (1815) పటాన్ని, ప్రస్తుత యూరపు పటంతో పోల్చి మీరు గమనించిన తేడాలను మీ నోటు పుస్తకంలో రాయండి.
జవాబు:

  1. అప్పటి యూరప్ పటము నందు కనిపించెడి హనోవర్, బొహేమియా, బలేరియా ప్రాంతాలు నేడు జర్మనీలో అంతర్భాగాలు.
  2. ఆనాటి ప్రష్యా కూడా నేడు జర్మనీలో అంతర్భాగమే.
  3. సెర్బియా నేటి యుగోస్లావియాలో అంతర్భాగం.
  4. బల్గేరియా, రుమేనియా దేశాలు ప్రస్తుతం వేరు వేరు స్వతంత్ర రాజ్యాలుగా అవతరించాయి.
  5. పోలెండ్ స్వతంత్ర దేశంగా అవతరించినది.
  6. రష్యా కూడా ఎస్తోనియా, లాట్వియా, లిథువేనియా, బెలారస్ యుక్రయిన్ జార్జియా, ఆర్మేనియా, అజీత్ బైజాన్ వంటి స్వతంత్ర రిపబ్లిలుగా అవతరించినది.

AP Board 9th Class Social Solutions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 13th Lesson 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 13th Lesson 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

9th Class Social Studies 13th Lesson 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
కింద పేర్కొన్న వాక్యాలు ఏ దేశానికి సంబంధించినవో గుర్తించండి. (బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్) (AS1)
జవాబు:

  1. విప్లవం ద్వారా పార్లమెంటరీ వ్యవస్థ నెలకొల్పబడింది. – బ్రిటన్
  2. విప్లవం తరువాత కూడా రాజుకి పాలనలో కొంత పాత్ర ఉన్న దేశం – ఫ్రాన్స్
  3. ప్రజాస్వామ్యాన్ని స్థాపించటానికి మరొక దేశంతో యుద్ధం చేయవలసి వచ్చిన దేశం – అమెరికా
  4. హక్కుల చట్టాన్ని ఆమోదించారు. – అమెరికా
  5. రాచరికాన్ని కూలదోయటానికి రైతాంగం నాయకత్వం వహించింది. – ఫ్రాన్స్
  6. మానవ పౌరహక్కుల ప్రకటనను ఆమోదించారు. – ఫ్రాన్స్

ప్రశ్న 2.
కొత్త రూపాలలో ప్రభుత్వాలు ఏర్పడటం వెనుక సామాజిక మేధావుల ప్రధాన ఆలోచనలు ఏమిటి? అవి ప్రజాదరణను ఎలా పొందాయి? (AS1)
జవాబు:
అధిక పన్నులు, నిరంకుశ పాలనలతో ప్రజలు విసిగిపోయారు. ఆహార పదార్థాల కొరత, నిరంతరం కరవుకాటకాలు, సమాజంలో కొందరికే అధికారం, వారికే పాలనా బాధ్యతలు, అత్యున్నత అధికారం రాచవర్గీయులకు చెందడం, వారు ప్రజల కష్టసుఖాలు పట్టించుకోకపోవడం, ఓటు హక్కు కల్పించకుండా చూడడం, చర్చి, మతాధికారులు, కులీనులు, ఆధ్వర్యంలో భూములు కేటాయించబడి ఉండడం, సమాజంలో 3 వ వర్గంగా లేదా మూడవ ఎస్టేట్ లో సభ్యులుగా ఉన్న న్యాయవాదులు, ఉపాధ్యాయులు, న్యాయస్థాన అధికారులు, కళాకారులు, రచయితలు ఆలోచించి, సామాజిక హోదా గలవారే దేశాన్ని మార్చగలరని, దేశాన్ని నడిపించగలరని తలంచారు. 90 శాతం ప్రజలు రైతాంగం మరియు సామాజిక మేథావి వర్గానికి చెందినవారు, వెనుకబడినవారు మరియు మహిళలున్నారు. వీరు తలుచుకుంటే ప్రభుత్వాలను మార్చగలరని, ప్రజల అవసరాలు, సంక్షేమం చూడగలరని ఆలోచించారు.

ప్రజలు కూడా రాజ్యా ధికారాలతో స్వేచ్ఛా, సమానత్వాలు, తగిన అవకాశాలు లేక పోవడం వల్ల సామాజిక మేధావుల ఆలోచనలతో వస్తున్న ప్రజా ప్రభుత్వాలు, పన్నులు లేని ప్రభుత్వాలు, సంక్షేమం చూసే నూతన అధికారం చూసి ఆనందించారు. ఆ విధంగా ప్రజాదరణ పొందింది.

AP Board 9th Class Social Solutions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 3.
ఫ్రాన్స్ లో విప్లవ తిరుగుబాటులకు దారి తీసిన పరిస్థితులను వివరించండి. (AS1)
జవాబు:
1774లో ఫ్రాన్సు XVI లూయీ రాజుగా బాధ్యతలు చేపట్టాడు. ఆ సమయంలో ఖజానా ఖాళీగా ఉంది. నిరంతర యుద్ధాలతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని ఆర్థిక వనరులు తగ్గాయి. విద్య, సైన్యం, న్యాయవ్యవస్థ ప్రభుత్వ కార్యాలయాల ఖర్చులు పెరిగాయి. దీనిని ఆసరాగా చేసుకొని అధిక పన్నులు విధించారు. ఫ్రాన్స్ లో మూడు ఎస్టేట్లు ఉండగా, మొదటి ఎస్టేట్ సభ్యులకు పన్ను విధించకుండా 90% ప్రాతినిధ్యం గల మూడవ ఎస్టేట్ పై పన్నులు విధించారు. రైతాంగం జీవనం దుర్భరంగా ఉండేది. వాళ్ళు ప్రభువుల పొలాల్లో, ఇళ్ళలో పనిచేయవలసి వచ్చేది. ఆహార కొరత వల్ల చాలామంది చనిపోయారు. దీనికి తోడు రూసో, జాక్వెస్, మాంటెస్క్యూ రచనలు ద్వారా సామాజిక చైతన్యం కల్గించి, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పత్రికలు, పుస్తకాలు ప్రజలను మేల్కొలిపాయి. దీనికితోడు ఎస్టేట్స్ జనరల్ సమావేశంలో 3 వ ఎస్టేట్ సభ్యులకు ఓటు హక్కు కల్పించకపోవడం తదితర కారణాలతో ఫ్రాన్స్ లో విప్లవ తిరుగుబాటుకు కారణమైంది.

ప్రశ్న 4.
విప్లవం వల్ల ఫ్రెంచి సమాజంలో ఏ వర్గాలు ప్రయోజనం పొందాయి? ఏ బృందాలు. అధికారాన్ని వదులుకోవలసి వచ్చింది? విప్లవానంతర పరిణామాల వల్ల ఏ సామాజిక వర్గాలు నిరాశకు గురై ఉంటాయి? (AS1)
జవాబు:
ఫ్రెంచి విప్లవం వల్ల సమాజంలో చిన్న రైతులు, భూమి లేని కూలీలు, సేవకులు, రైతాంగం, చేతివృత్తుల కళాకారులు, ఉపాధ్యాయులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు వీరు కాకుండా 18 వ శతాబ్దంలో కొత్త సామాజిక బృందాలు ఏర్పడ్డాయి. వీటన్నింటిని కలిపి మధ్యతరగతిగా వ్యవహరించారు. విదేశీ సముద్ర వాణిజ్యం, సముద్ర వ్యాపారం, పట్టు, ఉన్ని వ్యాపారస్తులు మొదలగువారు, మహిళలు ప్రయోజనం పొందారు. మొదటి, రెండవ ఎస్టేట్‌ సభ్యులు మతాధిపతులు, కులీన వర్గంవారు అధికారాన్ని వదులుకున్నారు. విప్లవానంతర పరిణామం వల్ల మతగురువులు, చర్చి నిర్వాహకులు, రాజవంశీయులు, వంశపారంపర్య రాజులు, మతాధిపతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సంపన్న వర్గాలకు చెందినవారు, విలాసవంతమైన జీవితాలు కొనసాగించినవారు.

ప్రశ్న 5.
ప్రాథమిక హక్కుల అధ్యాయం పూర్తి చేసిన తరువాత, ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ఏ ప్రజాస్వామిక హక్కుల మూలాలు ఫ్రెంచి విప్లవంలో ఉన్నాయో జాబితా తయారుచేయండి.
జవాబు:
ప్రపంచంలోని అనేక రాజకీయ ఉద్యమాలకు, ఆదర్శాలకు, ప్రాథమిక హక్కులకు ఫ్రెంచి విప్లవ కాలంలో గల హక్కులు అనుసరణీయమైనాయి. వాటిలో ప్రధానంగా

  1. సమానత్వం హక్కు
  2. స్వేచ్ఛా, స్వాతంత్ర్యం హక్కు
  3. సౌభ్రాతృత్వం వంటి ఆదర్శాలు
  4. చట్టం ప్రజల అభీష్టాన్ని నెరవేర్చేదని, దానిముందు పౌరులందరు సమానమనే విధానం. అదే మన దేశంలో గల సమ న్యాయపాలన.
  5. వాక్ స్వాతంత్ర్యం, జీవించే హక్కు.
  6. మానవులు స్వేచ్ఛాజీవులు. హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయి. మొదలగు ప్రజాస్వామిక హక్కుల మూలాలు ఫ్రెంచి విప్లవంలో ఉన్నాయి.

ప్రశ్న 6.
సార్వజనీన హక్కుల ప్రకటన వైరుధ్యాలతో కూడుకుని ఉందన్న అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? వివరించండి. (AS4)
జవాబు:
సార్వజనీన హక్కుల ప్రకటన వైరుధ్యాలతో కూడుకుని ఉంది. పరిపాలనా వ్యవస్థ ఖర్చులకి, ప్రజా సైన్యం నిర్వహించడానికి, పన్నులు విధించడం తప్పనిసరి చేయడం. ఆస్తుల నిష్పత్తిలో పౌరులందరకు వర్తింపజేయడం వైరుధ్యాలకు తావిస్తుంది. ఆస్తి పవిత్రమైన, ఉల్లంఘించగూడని హక్కు కాబట్టి చట్టబద్ధంగా నిర్ణయించిన ప్రజా ప్రయోజనాలకు అవసరమైనప్పుడు తప్పించి దానిని తీసుకోకూడదని, అటువంటి సందర్భాలలో న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలనే దానికి వ్యతిరేకిస్తాను.

AP Board 9th Class Social Solutions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 7.
‘ప్రాతినిధ్యం లేకుండా పన్నులు లేవు’ అన్న నినాదాన్ని అమెరికా వలస రాష్ట్రాలు లేవనెత్తటానికి కారణాలు ఏమిటి? (AS1)
(లేదా)
“ప్రాతినిధ్యం లేనిదే పన్నులు లేవు” అనే నినాదాన్ని మీరు ఎలా అర్థం చేసుకొన్నారు?
జవాబు:
అమెరికా స్వాతంత్ర్య పోరాటంలోని ప్రముఖ నినాదమేమనగా “ప్రాతినిధ్యం’ లేకుండా పన్ను చెల్లింపులేదు”.

ఇంగ్లాండ్ దేశం ఉత్తర అమెరికా తూర్పు తీరంలో 13 వలస రాష్ట్రాలను ఏర్పరిచింది. ఇంగ్లాండ్ నుంచి వ్యవసాయం, చిన్న కర్మాగారాలు, వ్యాపారం కోసం ఇంగ్లాండు నుంచి అధికులు వచ్చి వలస
రాష్ట్రాలలో లాభాలు ఆర్జించి స్థిరపడ్డారు. వలస రాష్ట్రాలకు సైతం చట్టాలు చేసే అధికారం, ప్రజలను నియంత్రించే అధికారం ఇంగ్లాండ్ లోని పార్లమెంట్ తీసుకుంది. కాని అక్కడి ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసే వాళ్ళు కాదు. వలస రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఇంగ్లీషు వ్యాపారస్థులు, కర్మాగారాలకు లాభం కలిగించే చట్టాలను పార్లమెంట్ తరుచు చేస్తుండేది. దాంతో విసిగిపోయిన అమెరికా వలస ప్రాంతాలు “ప్రాతినిధ్యం లేకుండా పన్ను చెల్లింపు లేదు” అన్న నినాదాన్ని లేవదీశారు.

ప్రశ్న 8.
మధ్య తరగతి అంటే మీరు ఏమి అర్థం చేసుకున్నారు? అది యూరప్ లో ఎలా ఏర్పడింది? (AS1)
(లేదా)
“18వ శతాబ్దంలో కొత్త సామాజిక బృందాలు ఏర్పడ్డాయి. వీటన్నిటిని కలిపి మధ్యతరగతిగా వ్యవహరించడం మొదలుపెట్టారు” – యూరప్లో మధ్యతరగతి ఆవిర్భావం గూర్చి వివరించండి.
జవాబు:
యూరప్లో 13 వ శతాబ్దం ప్రారంభంలో మధ్య తరగతి అంటే ప్రజలు సొంతనిర్ణయాలు తీసుకోక, స్వయంగా ఆలోచించక, మతగురువులు, చర్చి ఆధిపత్యంలో జీవనం సాగించేవారు. అత్యధిక రైతాంగం కట్టుబానిసలుగా జీవనం సాగించేవారు. యజమానుల ఆధీనంలో బందీగా వాళ్ళ పొలాల్లో, కర్మాగారాల్లో పనిచేయవలసి వచ్చేది. కాని 18వ శతాబ్దంలో కొత్త సామాజిక బృందాలు ఏర్పడ్డాయి. వీటన్నింటిని కలిపి మధ్యతరగతిగా వ్యవహరించడం మొదలు పెట్టారు. రాను రాను విదేశీ సముద్ర వాణిజ్యం, ఉన్ని, పట్టువస్త్రాల తయారీ వంటి వాటి ద్వారా వాళ్ళు సంపన్నులయ్యారు. వ్యాపారస్తులు, వస్తు ఉత్పత్తిదారులే కాకుండా మూడవ ఎస్టేట్లో న్యాయవాదులు, పాలన యంత్రాంగ అధికారులు, వృత్తినిపుణులు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ విద్యావంతులు.

ప్రశ్న 9.
యూరప్ పటంలో ఇంగ్లాండు, ఫ్రాన్స్, ప్రష్యా, స్పెయిన్, ఆస్ట్రియాలను గుర్తించండి. (AS5)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 1

ప్రశ్న 10.
ఫ్రెంచి విప్లవం నందు మహిళలు నిర్వహించిన పాత్రను ఎలా అర్థం చేసుకోవచ్చు?
జవాబు:
ఫ్రెంచి విప్లవం నందు మహిళలు ప్రధాన పాత్రను పోషించారు. ఫ్రెంచి సమాజంలో ముఖ్యమైన మార్పులు తెచ్చిన అన్ని ఘటనలలో మహిళలు మొదటి నుంచి క్రియాశీలక పాత్ర పోషించారు. తాము భాగస్వాములు కావటం ద్వారా తమ జీవితాలను మెరుగుపరిచే చర్యలు ప్రవేశపెట్టేలా వత్తిడి తీసుకురావచ్చని వాళ్ళు ఆశించారు. పురుషులకు ఉన్న రాజకీయ హక్కులు మహిళలకు కూడా ఉండాలన్నది వాళ్ళ ప్రధాన కోరికలలో ఒకటి. తమను ప్రేక్షక పౌరులుగా చేయటంతో మహిళలు నిరాశకు లోనయ్యారు. ఓటు హక్కు, శాసనసభకు పోటీ చేసే హక్కు, రాజకీయ పదవి చేపట్టే హక్కు కావాలని మహిళల పోరాటాలు ఫ్రెంచి విప్లవానికి నాంది అయింది.

AP Board 9th Class Social Solutions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 11.
పేజి నెం. 168లోని “భీతావహ పాలన” అనే శీర్షిక కింద ఉన్న పేరాను చదివి, దానిపై వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
ఫ్రెంచి పరిపాలనా కాలంలో విప్లవం అనంతరం ఫ్రాన్స్ లో జరిగిన అత్యంత ముఖ్యమైన ఘట్టం భీతావహ పాలన. ఇది 1793-1794 మధ్యలో జరిగింది. ఈ కాలంలో రాబిస్పియర్ తీవ్ర నియంత్రణ, శిక్షల విధానాన్ని ఈయన అనుసరించాడు. రిపబ్లిక్ కి శత్రువులుగా గుర్తించబడిన మతగురువులు, కులీనులు, రాజకీయ పార్టీ సభ్యులను అరెస్టు చేసి జైలుకు పంపించి విప్లవ ట్రిబ్యునల్ ద్వారా వివిచారణలో నేరం రుజువైనచో “గిల్లెటిన్” ద్వారా చంపేసేవాళ్లు. రైతులు పండించిన ధాన్యాన్ని పట్టణాలకు రవాణా చేసి, ప్రభు నిర్ణయించిన ధరలకు అమ్మేలా నిర్బంధించేవారు. ఖరీదైన తెల్ల పిండి (మైదా) వాడటాన్ని నిషేధించారు. చర్చిలను – “సివేసి వాటి భవనాలను సైన్యానికి, ప్రభుత్వం కార్యాలయాలకు ఇచ్చారు. రాబిస్పియర్‌ను 1794 జులైలో దోషిగా తేల్చి, మరునాడే గిల్లెటిన్ ద్వారా చంపేశారు.

9th Class Social Studies 13th Lesson 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు InText Questions and Answers

9th Class Social Textbook Page No.161

ప్రశ్న 1.
మన. నేపథ్యంలో రాజుల పార్టీ, పార్లమెంటరీ పార్టీల వ్యక్తుల మధ్య జరిగే సంభాషణను ఊహించి రాయండి.
జవాబు:
సంభాషణ

రాజుల పార్టీ : ఈ దేశాన్ని , ఈ సామ్రాజ్యాన్ని కాపాడేది, రక్షించేది మేమే. మేము లేకపోతే ఈ ప్రపంచ మనుగడే లేదు తెలుసా?

పార్లమెంటరీ పార్టీ : ప్రజల కోరికలను నెరవేర్చేది, ప్రజాభీష్టం మేరకు పాలన చేసేది మేమే. మేము ప్రజలను, కన్నబిడ్డలవలే పాలిస్తాము.

రాజుల పార్టీ : మా పార్టీ దేవుని కృషితో, సృష్టిలో భాగం. మేము దైవాంశ సంభూతులం. మేము దేవునికి మారుగా పరిపాలన చేస్తున్నాం.

పార్లమెంటరీ పార్టీ : ప్రజలకు మాట్లాడే హక్కులు ఇచ్చాము. . స్వేచ్ఛగా బ్రతికే హక్కులు అందించాము. నచ్చిన మతాన్ని స్వీకరించామని చెప్పాము. అందరికీ అన్ని సౌకర్యాలు అందించాము.

రాజుల పార్టీ : ఈ విశాల సామ్రాజ్యంలో హాయిగా బ్రతుకుతున్నాం. ఏ బాధలు వచ్చినా రమ్మన్నాం. మీ కష్టసుఖాలలో తోడుగా ఉంటామన్నాం.

పార్లమెంటరీ పార్టీ : ప్రజాస్వామ్యంలో మేమే మీకు అధిక అధికారాలు మేమిచ్చాము. కులమతాలు లేవన్నాము. చట్టం ముందు అందరూ సమానులే నన్నాం. మీ క్షేమమే మా భాగ్యం. మీ” సేవే ఆ దేవుని సేవ.

AP Board 9th Class Social Solutions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 2.
పౌరయుద్ధం వల్ల ఇంగ్లాండు ప్రజలపై, రాజుపై ఎటువంటి ప్రభావం పడింది?
జవాబు:
పౌరయుద్ధం అంటే ఒక దేశంలో జరిగే అంతర్యుద్ధం. పౌరయుద్ధం వల్ల పరిపాలన కుంటుపడింది. అధిక పన్నుల భారం మోయవలసి వచ్చింది. ప్రజల క్షేమ సమాచారం, సంక్షేమం మరచిపోవడం వల్ల తరుచుగా అంతర్యుద్ధం వల్ల ప్రజలు నరకయాతన అనుభవించారు. ఆకలితో, రోగాలు, జబ్బులతో ఆహార సమస్యలతో అనేకులు మరణించారు. . పౌర యుద్ధం వల్ల రాజులు తమ ఉనికినే కోల్పోయే దుస్థితి దాపురించింది. పదవులు కోల్పోయి, అధికారం దూరం అయి, బలవంతపు చావులు దాపురించాయి. విలాసవంతమైన జీవనం కాకుండా ప్రజల ఆగ్రహానికి బలై కోరి చావులు తెచ్చుకున్నారు.

9th Class Social Textbook Page No.163

ప్రశ్న 3.
కింద ఉన్న పటంలోని ఖాళీ డబ్బాలను వీటినుంచి అనువైన పదంతో నింపండి :
ఆహారం కోసం అల్లర్లు, మరణాల సంఖ్య పెరగటం, పెరుగుతున్న ఆహార ధరలు, చిక్కిన శరీరాలు, సామాజిక అశాంతి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 2

9th Class Social Textbook Page No.168

ప్రశ్న 4.
(165 పేజీలోని చార్టుని చూడండి) 1791 రాజ్యాంగంలో ఫ్రెంచ్ సమాజంలో ఏ వర్గ ప్రజలు లాభపడి ఉంటారు? ఏ వర్గాలు అసంతృప్తి చెందడానికి అవకాశముంది?
జవాబు:
ఫ్రెంచి సమాజంలో లాభపడిన వర్గం ఓటు హక్కు కలిగిన సుమారు 50,000 మంది వీరి ద్వారా జాతీయ శాసనసభకు 745 మంది ఎన్నికై ఫ్రెంచ్ సమాజంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. రాజు, మంత్రులపై వీరికి నియంత్రణ ఉంటుంది. ప్రధానంగా మధ్య తరగతి వర్గం లాభపడింది. ఈ అదే విధంగా ఓటు హక్కు లేనివారు, అధికంగా పన్నులు చెల్లించలేనివారు, 25 సం||లు నిండని పౌరులు బాధపడ్డారు. దీని ద్వారా తక్కువ జనాభాగల ప్రాంతంలోని వారు ఎక్కువ లాభాన్ని పొందారు. అదే విధంగా ఎక్కువ జనాభా గలదే అయినా ఓటు లేకపోవడం వలన వారు చాలా నష్టపోయారు.

AP Board 9th Class Social Solutions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 5.
ఫ్రాన్స్ లోని ఘటనల ప్రభావం రాచరిక వ్యవస్థలైన ప్రష్యా, ఆస్ట్రియా – హంగర్తీ లేదా స్పెయిన్ వంటి పక్క దేశాలపై ఎలా ఉండి ఉంటుంది? ఫ్రాన్స్ లో జరుగుతున్న దానికి సంబంధించి వస్తున్న వార్తలకు ఆయాదేశాలలోని రాజులు, వ్యాపారస్తులు, రైతాంగం, కులీన వర్గాలు, మతనాయకుల స్పందన ఎలా ఉండి ఉంటుంది?
జవాబు:
ఫ్రాన్స్ లోని ఘటనలు, విప్లవ ప్రభావం, దాని నేపథ్యం రాచరిక వ్యవస్థలైన ప్రష్యా, ఆస్ట్రియా – హంగేరి, లేదా స్పెయిన్ వంటి ప్రక్కదేశాలు ఉలిక్కిపడేలా చేసింది. కులీన పాలనలతో, నిరంకుశ అధికారాలతో, మతాధికారుల నియంత్రణ గల రాచరిక రాజ్యాలు ఆందోళనలకు గురయ్యాయి. ప్రజాభీష్టం మేరకు, ప్రజల సంక్షేమ అవసరాల మేరకు, పరిపాలన జరగకపోతే ప్రజల ఆగ్రహానికి గురైతే రాజ్యాలు, పదవులు పోవడమే కాకుండా, ప్రజల చేతిలో మరణాలు సంభవించడం భయాందోళనలకు గురయ్యారు. రాజులు, కులీన వర్గాల మతనాయకుడు భయపడి తమ విధానంలో మార్పు అవసరం అని భావించగా, రైతాంగం, వ్యాపారస్థులు మాత్రం రాజులు, పరిపాలకులలో మార్పు తేవడానికి ఉద్యమాలు, విప్లవాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని భావించారు.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
అమెరికా, ఫ్రెంచి విప్లవాలలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తుల గురించి మరిన్ని వివరాలు సేకరించండి. వాళ్ళలో మీకు ఎవరు ఎక్కువగా నచ్చారు, ఎందుకు? ఆ వ్యక్తిపై ఒక పేరా రాయండి.
జవాబు:
అమెరికా, ఫ్రెంచి విప్లవాలలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తులలో ప్రధానమైన వాళ్ళలో 13 వలస రాష్ట్రాలలో బ్రిటన్ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా 1776 జూలై 4 న ఫిలడెల్ఫియాలో జరిగిన మూడవ కాంగ్రెస్ సమావేశంలో థామస్ జెఫర్సన్ రూపొందించిన స్వాతంత్ర్య ప్రకటనను ఆమోదించారు. “మానవులందరూ సమానులుగా సృష్టింపబడ్డారని” సృష్టికర్త ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు, స్వేచ్ఛ, ఆనందాన్ని అన్వేషించే హక్కులు వంటి కొన్ని హక్కులను ఇచ్చాడని పేర్కొంది. అమెరికా ప్రజలలో చైతన్యం నింపిన వారిలో థామస్ జెఫర్‌సన్ ఒకరు.

అదేవిధంగా ఫ్రెంచి విప్లవానికి నాంది పలికి అవినీతి, విలాసకర ప్రభువులు, చర్చి, మతాధికారులు, కులీనులపై తిరుగుబాటు బావుటా ఎగుర వేసిన ఉపాధ్యాయులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, 90 శాతం గల రైతులు, చేతి వృత్తి కళాకారులు, కళాకారులు, మహిళలు, తత్వవేత్తలు, రచయితలు, సామాజిక కార్యకర్తలు.

వీళ్ళలో నాకు బాగా నచ్చినవారు రూసో. సమజంలో ఏ వ్యక్తి పుట్టుకతో సామాజిక హోదా, హక్కులు కలిగిలేరని, స్వేచ్ఛాజీవిగా పుట్టిన మానవుడు అనేక సంకెళ్ళతో బ్రతుకుతున్నాడన్నారు. అందరికీ స్వాతంత్ర్యం, సమాన చట్టాలు, సమాన అవకాశాలు ఆధారంగా ఏర్పడిన సమాజం కోసం కలలుకన్నాడు. రూసో ప్రజలు, వాళ్ళ ప్రతినిధుల మధ్య సామాజిక ఒప్పందంపై ఆధారపడిన ప్రభుత్వాన్ని ప్రతిపాదించాడు.

రూసో అభిప్రాయాలు, ఆలోచనలు పుస్తకాలు, వార్తా పత్రికల ద్వారా ఫ్రెంచి విప్లవంలో చైతన్య స్ఫూర్తిని రగిలించింది.

AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

SCERT AP 9th Class Social Studies Guide Pdf 12th Lesson యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800 Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 12th Lesson యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

9th Class Social Studies 12th Lesson యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800 Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
ఈ అధ్యాయంలో పునరుజ్జీవనంపై చర్చ ప్రధానంగా ……… (ఇంగ్లాండ్ / ఇటలీ / ఫ్రాన్స్/ జర్మనీ). (AS1)
జవాబు:
ఇటలీ.

ప్రశ్న 2.
పునరుజ్జీవన కాలంలో కింద పేర్కొన్న భావనలలో వచ్చిన మార్పుల గురించి ఒక పదం లేదా ఒక వాక్యంతో రాయండి. (AS1)
జవాబు:
అ. మానవతావాదులు : మరణాంతర జీవితం గురించి కాక ప్రపంచం గురించి ఆసక్తి చూపారు.
ఆ. పుస్తకాలు : 14 శ॥ నుంచి 17 శ॥ వరకు కొత్త మానవతా సంస్కృతి వికసించింది.
ఇ. చిత్రకళలు : చుట్టు ప్రక్కల ప్రకృతి నుంచి ప్రజలను, ప్రదేశాలను పరిశీలించి చిత్రీకరించే వరకు.
ఈ. మానవులు : భౌతిక సంపద, అధికారం, కీర్తి నుంచి సత్ప్రవర్తన వరకు.
ఉ. మహిళలు : గృహసంరక్షణ ,నుంచి విద్య, ఆర్థికశక్తి, ఆస్తి సంపాదన వరకు.

AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

ప్రశ్న 3.
బైబిలును ముద్రించడం ద్వారా దేవుడు, చర్చిపై భావనలు ఎలా ప్రభావితం అయ్యాయి? (AS1)
జవాబు:
బైబిలు ముద్రించడానికి పూర్వం చేతితో రాసిన బైబిలు ఉండేది. ముద్రణ సాంకేతిక విజ్ఞానంపై పట్టు సాధించడం 16వశతాబ్దపు మహా విప్లవం. జర్మనీ దేశస్థుడు 1455లో జోహాన్స్ గుట్బెర్గ్ కార్యశాలలో బైబిలు 150 ప్రతులను ముద్రించాడు. కొత్త భావాలను ప్రచారం చేసే ముద్రిత పుస్తకం వెంటనే వందలాది పాఠకులను చేరుకుంది. ఇటలీ మానవతావాద సంస్కృతి యూరప్లో వేగంగా వ్యాపించటానికి ముద్రిత పుస్తకాలు అందుబాటులో ఉండటం ప్రధానకారణం.

ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక జీవితాన్ని చర్చి శాసించిందని, చర్చికి అపార అధికారం, సంపద సమకూరి, అవినీతిమయం అయ్యిందని గ్రహించారు. విశ్వవిద్యాలయ పండితులు, చర్చి సభ్యులు కూడా మానవతా భావాలపట్ల ఆకర్షితులయ్యారు. సాధారణ మతానికి అనవసర ఆచారాలను తరువాత జోడించారని ఖండిస్తూ వాటిని త్యజించమని చెప్పారు. ఎక్కడో ఉన్న దేవుడు మనిషిని సృష్టించాడని, ‘ఇక్కడ’ ఇప్పుడు, ఆనందాన్వేషణలో జీవితాన్ని స్వేచ్ఛగా బతకమన్నాడని వాళ్ళు విశ్వసించారు.

ప్రశ్న 4.
మధ్యకాలంనాటి ఇటలీ నగరాలను ప్రస్తుత ఇటలీ నగరాలతో పోల్చండి. వాటి ప్రస్తుత పేర్లలో ఏమైనా తేడాలు ఉన్నాయా? (AS1)
జవాబు:
బైజాంటైన్ సామ్రాజ్యం, ఇస్లామిక్ దేశాల మధ్య వాణిజ్యం విస్తరించటంతో ఇటలీ తీరం వెంట రేవు పట్టణాలు పునరుద్ధరించబడ్డాయి. చైనా, పశ్చిమ యూరప్ దేశాలతో వ్యాపారం పెరగటంలో ఇటలీ నగరాలు కీలకపాత్ర పోషించాయి. ఈ నగరాలు తమను బలమైన సామ్రాజ్యంలో భాగంగా కాకుండా స్వతంత్ర పట్టణ దేశాలుగా చూడసాగాయి. వీటిల్లో “ఫ్లోరెన్స్” “వెనిస్”, గణతంత్రాలు కాగా, ఇంకా ఎన్నో యువరాజుల పాలనలోని నగరసభలుగా ఉండేవి. బాగా వర్ధిల్లిన నగరాలలో “వెనిస్” జెనోవాలు ముఖ్యమైనవి.

ఈ నగరాలలో మత గురువులు రాజకీయ ఆధిపత్యం చెలాయించే వాళ్ళు కాదు. బలమైన ప్యూడల్ భూస్వాములు కూడా ఇక్కడ లేరు. పట్టణ పరిపాలనలో ధనిక వ్యాపారులు, బ్యాంకర్లు చురుకుగా పాల్గొనేవారు. ఈ పట్టణాలను సైనిక నియంతలు పరిపాలించిన సమయంలో కూడా పట్టణ ప్రజలలో పౌరులమన్న భావన బలహీనపడలేదు.

ప్రస్తుత గ్రీకు నగరాలలో మానవతావాదం తాండవిస్తుంది. మరణాంతర జీవితం గురించేకాక, ఈ ప్రపంచం గురించి వాళ్ళు ఆసక్తి చూపారు. మనిషిని ఈ జీవితంలో ప్రభావితం చేసే ప్రకృతి సమస్తాన్ని, విజ్ఞాన శాస్త్రం, కళలు వంటి వాటిని ముఖ్యమైనవిగా నేటి ఇటలీ నగరాలు భావించాయి.

ప్రశ్న 5.
14,15వ శతాబ్దాలలో గ్రీకు, రోమను సంస్కృతులలో ఏ అంశాలను పునరుద్ధరించారు? (AS1)
జవాబు:
14, 15వ శతాబ్దాలలో గ్రీకు, రోమను సంస్కృతులలో అనేక అంశాలు పునరుద్ధరించారు. గ్రీకు సాహిత్యం మానవ జీవితంలో ఆసక్తిని కలిగించింది. గ్రీకు, గ్రీకు రోమను సంస్కృతి, శిల్పాలు, చిత్రకళ, భవనాలు, సాహిత్యం , తత్వశాస్త్రం, విజ్ఞానశాస్త్రం ఎంతో ఉన్నతంగా ఉండేవి. క్రైస్తవ మతాన్ని పాటించటానికి ప్రాధాన్యత నిచ్చిన రోమన్ కాథలిక్కు చర్చి ప్రజల సంస్కృతిని తీవ్రంగా ప్రభావితం చేసింది. ప్రజలను ఆలోచించవద్దని, మతగురువులు చెప్పింది నమ్మమని అది ఒత్తిడి చేసేది. పురాతన సాంస్కృతిక సంపద అంతా విస్మరింపబడి, కనుమరుగైపోయింది.

ఆ తరువాత పరిస్థితి మారింది. రైతాంగం, భూస్వాముల వర్గం చర్చి నియంత్రణను వ్యతిరేకించ సాగింది. భూస్వాముల, చర్చి ఆధిపత్యం తగ్గి ప్రజలు మరింత స్వేచ్చను అనుభవించసాగారు. చిత్రకళ, శిల్పం, ఇతర కళలు, సాహిత్యం వంటి వాటిల్లో కొత్త ధోరణులు బయలుదేరాయి. విజ్ఞానశాస్త్రం పునరుద్ధరించబడింది. రోమన్ సంస్కృతి అవశేషాలైన భవనాలు, శిల్పాలు వంటి వాటిని కళాకారులు అధ్యయనం చేయసాగారు. కళలు, శిల్పాలు, వృద్ధి చెంది సంస్కృతిని నిల్పాయి. మానవతా వాదంతో మనిషిలో సత్ప్రవర్తనకు ప్రాధాన్యతనిచ్చారు.

AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

ప్రశ్న 6.
మానవతావాద భావనలు ఇటలీలోని పట్టణాలను ముందుగా ఎందుకు ప్రభావితం చేశాయి? (AS1)
జవాబు:
1453లో కాన్స్టాంటినోపుల్ పతనం తర్వాత అనేక మంది గ్రీకు పండితులు తను సాహిత్యంతో ఇటలీకి పారిపోయారు. దీంతో పురాతన సాహిత్యం గ్రీకు భాషపట్ల ప్రజలకు ఆసక్తి కలిగింది. మానవతావాద భావనలు ముందుగా ఇటలీని పట్టణాలను ప్రభావితం చేశాయి. మనిషిని ఈ జీవితంలో ప్రభావితం చేసే ప్రకృతి సమస్తాన్ని, విజ్ఞానశాస్త్రం, కళలు వంటి వాటిని మానవత వాదులు ముఖ్యమైనవిగా చెప్పటంతో పట్టణవాసులు ఆకర్షితులయ్యారు. కొత్త విషయాలు, చట్టం, మతం వంటి వాటిని బోధించటానికి విశ్వవిద్యాలయాలు స్థాపించారు.

ఇటలీలోని పట్టణ విద్యావంతులు ఈ విషయాల పట్ల ఆసక్తి కనపరిచారు. మూఢనమ్మకాలపై ఆధారపడిన కొన్ని చర్చి ఆచారాలను మానవతావాదులు విమర్శించడం కూడా ఇటలీ పట్టణ వాసులను ఆకర్షించింది. చిత్రకళ, శిల్పంనకు అధిక ప్రాధాన్యతనిచ్చిన ఈ వాద
భావనలను పట్టణవాసులు స్వాగతించారు. భౌతిక సంపద, అధికారం, కీర్తి ఎల్ల ఇటలీవాసులు ఆకర్షితులయ్యారు.

ప్రశ్న 7.
మానవతావాద ఆలోచనల్లోని అంశాలు ఏమిటి? (AS1)
జవాబు:
పురాతన గ్రీకు సాహిత్యం మానవ జీవనం ఆసక్తిని కల్గించింది. వాళ్ళు నివసించిన ప్రపంచం వాళ్ళకి చాలా కీలకమైనదిగా అనిపించింది. మానవతావాదం మనిషి స్వభావం, ఆసక్తులకు సంబంధించినది కాబట్టి దీనిని అధ్యయనం చేసే విద్యార్థులను మానవతావాదులుగా పేర్కొన్నారు. మధ్యయుగాల పండితుల మాదిరి మరణాంతర జీవితం గురించి కాక ఈ ప్రపంచం గురించి మానవతావాదులు ఆసక్తి చూపారు. మానవతావాదం వల్ల డబ్బు, అధికారం సంపాదించడం ద్వారా మాత్రమే కాకుండా ఇతరత్రా తమ జీవితాలను మలచుకునే సామర్థ్యం మనుషులకుందని నమ్మసాగారు. మానవ స్వభావం బహుముఖమైనది అన్న విశ్వాసంతో ఈ భావన ముడిపడి ఉంది.

ప్రశ్న 8.
పక్కన ఉన్న పట్టిక పుస్తకాల ముద్రణలో వృద్ధి గురించి చెబుతుంది. దాని గురించి ఏం చెప్పగలరు? (AS3)
(లేదా)
గ్రాఫ్ ఆధారంగా పుస్తకాల ముద్రణ గూర్చి రాయండి.
AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300-1800 1
జవాబు:
15వ శతాబ్దం ముందు వరకు చేతితో రాసిన ప్రతులు కొంతమంది చేతుల్లోనే ఉండేవి. ఇతర దేశాల ప్రజలు గొప్ప కళాకారుల చిత్రకళ, శిల్పాపత్రాలు, భవన 1450-1800 మధ్య కాలంలో విజ్ఞానం తెలుసుకోవాలంటే ఇటలీ వెళ్ళవలసి వచ్చేది. పత్రాలు చేతితో రాసిన – యూరప్ లో ప్రచురితమైన పుస్తకాలు పుస్తకాలు, పెయింటింగ్లు, యూరప్, అమెరికా పురావస్తుశాలల్లో, ఆర్ట్ గ్యాలరీలలో, మ్యూజియంలలో ఉండేవి. అయితే 1455 జోహాన్స్ గుటెన్బర్గ్ కార్యశాలలో బైబిలు 150 ప్రతులను ముద్రించారు.

“ముద్రణ సాంకేతిక విజ్ఞానంపై పట్టు సాధించటం 16వ శతాబ్దపు మహా విప్లవం”. 15 వ శతాబ్దం తరువాత చేతితో రాసిన పురాతన పుస్తకాలన్నింటిని ముద్రించారు. అచ్చు అయిన పుస్తకాలను కొనుక్కోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపారు. అంతకు ముందెన్నడూ లేనంతగా భావాలు, అభిప్రాయాలు, సమాచారం విస్తారంగా వ్యాపించడంతో కొత్త భావాలను ప్రచారం చేసే ముద్రిత పుస్తకాలు వెంటనే లక్షలాది పాఠకులను చేరుకున్నాయి. నిదానంగా ప్రజలలో చదివే అలవాటు పెరిగింది. ఇటలీ మానవతా సంస్కృతిపై ఆసక్తి కనపరిచిన లక్షలాది మంది విద్యార్థులు, ప్రజలకు ముద్రిత పుస్తకాలపై ఆసక్తి పెరగడంతో 18 || నాటికి శతాబ్దం కోట్ల కొలది పుస్తకాలు ప్రచురితమయ్యాయి.

ప్రశ్న 9.
“ముద్రింపబడిన పుస్తకాలు మన జీవితాలలో ఇంకా ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి” అన్న వాక్యంతో మీరు ఏకీభవిస్తారా? మీ సమాధానానికి కారణాలు తెలపండి. (AS4)
జవాబు:
తాళపత్ర గ్రంథాలు, చేతితో రాసిన పుస్తకాలు పరిమితంగా ఉండడమే కాకుండా, వాటి సాహిత్యం , విజ్ఞానం , భాష చదవడానికి, అర్థం చేసుకోవడానికి సామాన్య ప్రజలకు, విద్యార్థులకు ఇబ్బందిగా ఉండేది. జోహాన్స్ గుటెన్బర్గ్ ముద్రణా యంత్రం కనిపెట్టడం, కాగితాన్ని కనుగొని అచ్చులతో ముద్రణ చేసిన చైనీయులకు ప్రపంచం ఋణపడి ఉంది. అతితక్కువ సమయంలో శాస్త్రసాంకేతిక విజ్ఞానం, శిల్పం, సాహిత్యం , మానవతావాదం, అభివృద్ధి చెందిన భూగోళం, తత్వం, వైద్యశాస్త్ర మూలాలను చదవడం వల్ల అవి మానవ జీవనంలో ప్రముఖ పాత్ర పోషించాయి. విశ్వరహస్యాలు, ఆవిష్కరణలు, నూతన సిద్ధాంతాలు, ప్రకృతి సమాజం, మూఢనమ్మకాలపై సమరం మొ||లగు విషయాలు ముద్రిత పుస్తకాల ద్వారా వెలుగుచూపించి, మానవ అభ్యున్నతికి తోడ్పాటునందించాయి.

AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

ప్రశ్న 10.
17వ శతాబ్దపు ఐరోపావాసులకు ప్రపంచం ఎలాగ భిన్నంగా అనిపించి ఉంటుందో వివరించండి. (AS1)
జవాబు:
13వ శతాబ్దం ప్రారంభం, 13 శతాబ్దం ముందు ఐరోపాలో పెద్ద సామ్రాజ్యాలు ఏవీ లేవు. పట్టణాలు కూడా క్షీణించాయి. రాజకీయ అధికారం సైనిక, భూస్వాముల చేతుల్లో ఉండేది. రైతాంగంలో అధికభాగం “కట్టు బానిసలుగా” ఉండేవాళ్ళు. ప్రజలు తీవ్ర అభద్రతాభావంలో ఉండేవారు. అయితే 17వ శతాబ్దంలో ఐరోపాలో అనేక నూతన పోకడలు, అనేక రంగాలలో ప్రగతి కనిపించింది. చైనా, అరేబియా, భారతదేశం, ఈజిప్టులతో ఐరోపావాసుల వ్యాపార వాణిజ్యాలు పునరుద్దరించబడ్డాయి. వ్యాపారస్తులు, చేతివృత్తి కళాకారులు నివసించే అనేక పట్టణాలు, నగరాలు ఏర్పడాయి. అనేక సంస్కరణలు, ఆవిష్కరణలు, రచనలు, రూపకల్పనలు చూసి ఐరోపా వాసులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. పునరుజ్జీవనం ద్వారా కొత్త మానవతా సంస్కృతి వికసించడం, సాహిత్యం , భవన నిర్మాణం, చిత్రకళలు వంటివి చూసి ఐరోపా వాసులు అమితానందం చెందారు.

ప్రశ్న 11.
పునరుజ్జీవన కాలం నాటి భవన నిర్మాణంలో రెండు ముఖ్యమైన అంశాలను చెప్పండి. (AS6)
జవాబు:
భవనాలలో పొడవాటి స్తంభాలు, కమానులు గుండ్రటి పైకప్పులను ఉపయోగించారు. భవన నిర్మాణంలో ఇది ఒక కొత్త శైలికి దారి తీసింది. వాస్తవానికి ఇది పురాతన రోమన్ శైలి పునరుద్ధరణ మాత్రమే. ఇప్పుడు దీనిని క్లాసికల్ (సాంప్రదాయం) గా వ్యవహరిస్తున్నారు. ఈ కాలంలో మరొక ముఖ్యమైన మార్పు అంతకుముందు కాలంలో మాదిరి కళాకారులు వాళ్ళ సభ్యులైన బృందం పేరుతో కాకుండా వ్యక్తిగతంగా వాళ్ళ పేరుతో ప్రసిద్ధిచెందసాగారు.

ప్రశ్న 12.
ప్రపంచ అవుట్ లైన్ పటంలో పేజీ నెం. 155 లోని భౌగోళిక అన్వేషణలను గుర్తించండి. (AS5)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300-1800 2

ప్రశ్న 13.
పేజీ నెం. 150 లోని నాల్గవ పేరాను చదివి, వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
యూరప్లో మహిళల పాత్ర నామమాత్రమైనది. సంపన్న, కులీన కుటుంబాల పురుషులు ప్రజా జీవనంలో ముఖ్యపాత్ర పోషించారు. కుటుంబ వ్యవహారాల్లో, వ్యాపారాల్లో, ప్రజా జీవనంలో తమకు వారసులుగా తమ కొడుకులకు చదువులు చెప్పించేవాళ్ళు. అయితే వివాహ సమయంలో మహిళలు తెచ్చిన కట్నంతో పురుషులు తమ వ్యాపారాలను పెంచుకొన్నారు. – కట్న కానుకలు అందించలేని మహిళలు అవివాహితులుగానే ఉండి పోయేవారు. ప్రజా జీవనంలో మహిళల పాత్ర పరిమితమే కాకుండా, మహిళలను గృహ సంరక్షకులుగానే చూసేవారు.

అయితే కొన్ని సందర్భాల్లో పురుషులు ఇతర పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం మహిళలు, పురుషుల వ్యాపార లావాదేవీలు చూసేవారు.

పటనైపుణ్యం

1.
AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300-1800 4 1

2.
AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300-1800 2

9th Class Social Studies 12th Lesson యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800 InText Questions and Answers

9th Class Social Textbook Page No.145

ప్రశ్న 1.
ఎనిమిదవ తరగతిలో హైదరాబాద్ రాజ్యంలోని జమిందారీ వ్యవస్థ, ‘వెట్టి’ గురించి చదివారు. యూరపులోని ‘కట్టు బానిసత్వం’తో దీనిని పోల్చండి.
జవాబు:
హైదరాబాద్ రాజ్యంలోని జమిందారీ వ్యవస్థలో కౌలుదారులు, భూస్వాముల వ్యవసాయంలో వెట్టి చాకిరి చేస్తూ, సరియైన ఆదాయం, కూలీ లేకుండ దుర్భర జీవనం సాగించేవాళ్ళు. కష్ట నష్టాలలో ఆదుకొనే భూస్వాములు లేక తరతరాలుగా “వెట్టి” బతుకులతో జీవనం సాగించేవారు. యూరప్ లో రాజకీయ అధికారం సైనిక, భూస్వాముల చేతుల్లో ఉండేది. రైతాంగాన్ని వాళ్ళు నియంత్రించేవాళ్ళు. రైతాంగంలో అధికభాగం “కట్టు బానిసలుగా” ఉండేవారు. యజమానుల అధీనంలో బందీలుగా, వాళ్ళ పొలాల్లో, కర్మాగారాలలో పనిచేయాల్సి వచ్చేది. వాళ్ళ తదుపున యుద్ధాలు కూడా చేయాల్సి వచ్చేది.

ప్రశ్న 2.
పట్టణాల అభివృద్ధికి వ్యాపారం ఎలా దోహదం చేస్తుంది?
జవాబు:
భూస్వాములు, ధనవంతులు, ఉన్నత వర్గాలకు చెందినవారు అధిక పెట్టుబడి పెట్టి వ్యాపారాలు పట్టణాలలో చేసేవారు తద్వారా వారి నివాసాలకు, వారి సుఖవంతమైన జీవనానికి, వలసవచ్చిన కార్మికులను ఆకర్షించడానికి విలువైన కట్టడాలు నిర్మించేవారు. పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వానికి, పరిపాలకులకు తమవంతుగా లాభాలలో వచ్చిన వాటాలు విరాళంగా అందచేసేవారు.

ప్రశ్న 3.
పల్లెల్లో కంటే పట్టణాలలో కొత్త ఆలోచనలు గురించి తెలుసుకోటానికి, కొత్త విషయాలు ప్రయత్నించి చూడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయా? చర్చించండి.
జవాబు:
గ్రామాలలో జీవన విధానం ఒకే విధంగా ఉంటూ ఒకే రకమైన వృత్తితో, కూలి పనులతో నిరంతరం జీవనం సాగించే వాళ్ళు. అయితే పట్టణాలలో తమ ప్రావీణ్యత, నైపుణ్యం, చాకచక్యం చూపించాలంటే కొత్త ఆలోచనలు వివరించాలి. వినూత్నంగా ఆలోచించే వారికి ఎక్కువ జీతాలు, హోదా కలుగుతుంది. తద్వారా వారు ఉన్నతంగా జీవించటానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి విజ్ఞానంలో వస్తున్న మార్పులను గమనించి, తమ పనితనాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి.

AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

ప్రశ్న 4.
బహార్ట్ ప్రకారం కింది వాటిలో ఏది ఆధునిక దృక్పథానికి చెందినది, ఏది మధ్యకాలం నాటికి చెందినది?
అ) తెలుసుకుని, తమ నిర్ణయాలు తాము తీసుకునే సామర్థ్యంలో నమ్మకం ………….. (ఆధునిక దృక్పథానికి చెందినది)
ఆ) మతపర పుస్తకాలు, మతగురువులలో విశ్వాసం ………………….. (మధ్యకాలం నాటిది).
ఇ) దేవుడు అన్ని విషయాలు తెలియచేస్తాడన్న నమ్మకం …………………… (మధ్యకాలం నాటిది)
ఈ) మానవుల హేతువాదంపై విశ్వాసం ………………….. (ఆధునిక దృక్పథం)

9th Class Social Textbook Page No.146

ప్రశ్న 5.
ఇటలీ పటంలో గణతంత్రాలను, మూడు నగర సభలను గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300-1800 4 1

9th Class Social Textbook Page No.147

ప్రశ్న 6.
మానవతావాదులు ఎవరు? వారు ఏమి బోధించారు?
జవాబు:
పురాతన గ్రీకు సాహిత్యం మనిషి స్వభావం, ఆసక్తులకు సంబంధించినది కాబట్టి దానిని అధ్యయనం చేసే విద్యార్థులను మానవతావాదులుగా పేర్కొన్నారు. మధ్యయుగాల పండితుల మాదిరి మరణానంతరం జీవితం గురించి కాక ఈ ప్రపంచం గురించి వాళ్ళు వివరించారు. మనిషిని ఈ జీవితంలో ప్రభావితం చేసే ప్రకృతి నమస్తాన్ని, విజ్ఞానశాస్త్రం, కళలు వంటి వాటిని మానవతావాదులు వివరించారు. మూఢనమ్మకాలపై ఆధారపడిన కొన్ని చర్చి ఆచారాలను విమర్శించారు.

9th Class Social Textbook Page No.149

ప్రశ్న 7.
16వ శతాబ్దపు ఇటలీ కళాకారులు తమ పనులలో ఉపయోగించుకున్న వివిధ శాస్త్రీయ అంశాలను వివరించండి.
జవాబు:
16వ శతాబ్దంలోని ఇటలీ భవన నిర్మాణం పురాతన రోము భవనాల నుంచి అనేక ప్రత్యేక లక్షణాలను అనుకరించడం జరిగింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం స్త్రీ, పురుషుల శిల్పాలను మెచ్చుకుంటూ ఇటలీ శిల్పులు, ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని అనుకున్నారు. ఎముకల నిర్మాణాల గురించి అధ్యయనం చేయటానికి వైద్యశాస్త్ర ప్రయోగశాలలకు కళాకారులు వెళ్లేవాళ్లు. తమ బొమ్మలు, శిల్పాలు వాస్తవికంగా ఉండేలా చేయటానికి లియొనార్డో డా విన్సి వంటి కళాకారులు శరీర నిర్మాణ శాస్త్రాన్ని అధ్యయనం చేశారు. శరీర నిర్మాణ శాస్త్రం, రేఖాగణితం, భౌతిక శాస్త్రాలతో పాటు అందానికి సంబంధించిన బలమైన భావన ఇటలీ కళలకు ఒక ప్రత్యేకత.

9th Class Social Textbook Page No.150

ప్రశ్న 8.
అదే కాలంలో భారతదేశంలో ముద్రణా యంత్రం లేదు. శ్రీకృష్ణదేవరాయలు ఒక పుస్తకం రాసాడని అనుకుందాం. వివిధప్రాంతాలలోని పండితులకు అది ఎలా అందేది?
జవాబు:
శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ముద్రణా యంత్రం లేకపోయినా రాయలు రాసిన పుస్తకం వివిధ ప్రాంతాలకు ఆయా ప్రాంతాల రాజోద్యోగులు, రాయబారులు, భటుల ద్వారా చేరవలసిన పండితులకు అందుతుంది.

AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

ప్రశ్న 9.
రాజులు, మతగురువులు ముద్రణ యంత్రం పట్ల ఎలా స్పందించి ఉంటారు? దానిని స్వాగతించి ఉంటారా లేక ఆందోళన చెంది ఉంటారా?
జవాబు:
క్రైస్తవ మతాన్ని పాటించటానికి ఒత్తిడి చేసి, చర్చి పోపు ఆధిపత్యాన్ని ప్రచారం చేసిన మతగురువులు, ప్రారంభంలో ప్రజలను ఆలోచించవద్దని, మతగురువులు చెప్పింది నమ్మమని ఒత్తిడి చేసారు. మత ఆధిపత్యం ప్రశ్నించడానికి అవకాశం ఉండేది కాదు. అయితే ముద్రణా యంత్రం రావడంతో రాజులు, మతగురువులు ఆందోళన చెందారు. ఫ్యూడలిజం, రాజుల నిరంకుశత్వం, మతాధికారుల మూఢాచారాలు, ముద్రణ వల్ల ప్రజల ఆలోచనలలో మార్పు వచ్చింది. ప్రజల భావాలు, అభిప్రాయాలు, సమాచారం విస్తారంగా ప్రజలలోకి వెళ్ళి తిరగబడతారని, మత గురువుల ఆధిపత్యాన్ని ఎదిరించి, ప్రశ్నిస్తారని ఆందోళన చెందారు.

9th Class Social Textbook Page No.151

ప్రశ్న 10.
పునరుజ్జీవనాన్ని కొత్త యుగం అని కూడా అంటారు. సుఖాలను కోరుకోవడం, సంపద, భోగాలను ఆశించటం, స్వార్థ ప్రయోజనంతో పనిచేయటం సరైనవేనని ప్రజలు భావించసాగారు. స్వార్థ ప్రయోజనాలను వ్యతిరేకిస్తూ, సంపద, సుఖాలను త్యజించాలంటూ ఉండే మత బోధనలకు ఇది విరుద్ధంగా ఉంది. పునరుజ్జీవన మానవతావాదులకున్న ఈ దృక్పథంతో మీరు ఏకీభవిస్తారా?
జవాబు:
పునరుజ్జీవనం కొత్త యుగమే కాకుండా ప్రజల మేధోపర ఆలోచనలకు, శాస్త్రీయ దృక్పథానికి, విచక్షణా జ్ఞానానికి పరాకాష్ట. అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి, వివిధ దశలను, రకరకాల పుస్తకాలను పరిశీలించిన పిదప సుఖాలను కోరుకోవడం, సంపద భోగాలను ఆశించడం, అనుభవించడం, స్వార్థ ప్రయోజనంతో పనిచేయడం సరైనవేనని నేను ఏకీభవిస్తాను. మత. బోధకులు సుఖాలు త్యజించాలంటూ, వారు విలాసవంతమైన జీవనం సాగించారు. ప్రజల బలహీనతలతో మతం ముసుగును కొనసాగించారు. మానవతావాద సంస్కృతిలో మానవజీవితంపై భౌతిక సంపద, అధికారం, శారీరక సుఖాలు వంటివి కోరుకోదగినవే కాని త్యజించవలసిన అవసరం లేదని చెప్పారు. నేనూ ఏకీభవిస్తాను.

9th Class Social Textbook Page No.152

ప్రశ్న 11.
ఆ కాలం మహిళలు గ్రీకు, రోమన్ పుస్తకాలు చదివినందువల్ల ఏ ప్రయోజనం పొందారు?
జవాబు:
అ. గ్రీకు, రోమన్ పుస్తకాలు చదివినందువల్ల పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీలు ఎలా ధైర్యంగా బ్రతకవచ్చో తెలుసుకున్నారు.
ఆ. స్వేచ్ఛ, సమానత్వం గుర్చి అవగాహన ఏర్పరచుకున్నారు.
ఇ. ఆస్తి, ఆర్థికశక్తి వలన మాత్రమే స్త్రీలు సుఖంగా జీవించగలరని తెలుసుకున్నారు.
ఈ. సమాజంలో గౌరవం పెరిగి ఉన్నతంగా జీవించగలమని తెలుసుకున్నారు.

9th Class Social Textbook Page No.154

ప్రశ్న 12.
కాథలిక్కు చర్చిని ఏ అంశాలలో ప్రొటెస్టెంటులు విమర్శించారు?
జవాబు:
అ. దేవునితో సంబంధం ఏర్పరచుకోవటానికి మతగురువు అవసరం లేదన్నారు.
ఆ. విశ్వాసం ఒక్కటే సరైన జీవనం, స్వర్గ ప్రవేశం కల్పించగలదని చెప్పారు.
ఇ. పాపపరిహార పత్రాలు అమ్మటం, కొనటం తప్పని చెప్పారు.
ఈ. చర్చి, పోప్ దురాశను విమర్శించారు.
ఉ. మతానికి అనవసర ఆచారాలు కూడదన్నారు.

AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

ప్రశ్న 13.
భారతదేశంలోని భక్తి ఉద్యమానికి, ప్రొటెస్టెంటు ఉద్యమానికి మధ్య ఏమైనా పోలికలు ఉన్నాయా? ఆ రెండింటి మధ్య తేడాలు ఏమైనా ఉన్నాయా?
జవాబు:
భగవంతుని యెడ ప్రేమ, సహనం, అహింస, తపస్సు, నిరాడంబరత్వాన్ని నమ్మిన వారు భక్తి ఉద్యమంలో దేవుడొక్కడే అని, రామ్, అల్లా, జీసస్ ఒక్కరేనని చెప్పారు. తమ పాటలు, తత్వాలు ద్వారా సామాన్య ప్రజలను ఆకర్షించారు. విగ్రహారాధన కూడదన్నారు. సంస్కారవంతమైన జీవనం ముఖ్యమన్నారు. ఇతరుల సేవతో తృప్తి పడాలన్నారు. జంతుబలులు, మూఢ విశ్వాసాలు వలదన్నారు. నిరాడంబర జీవనం కావాలన్నారు. అదేవిధంగా, ప్రొటెస్టెంట్ మతంలో దేవునితో సంబంధం ఏర్పరచుకోటానికి మతగురువు అవసరం లేదన్నారు. దేవునిపై విశ్వాస ముంచమన్నారు. ప్రజల నమ్మకాలపై మోసం చేయరాదన్నారు. పేదకు సేవ చేయటం ముఖ్యమన్నారు.

తేడాలు :

  1. భక్తి ఉద్యమంలో అన్ని మతాల సారం ఒక్కటేనన్నారు. కాని ప్రొటెస్టెంట్ లో క్రైస్తవ మతానికి ప్రాధాన్యత నిచ్చారు.
  2. భక్తి ఉద్యమం అన్ని ప్రాంతాలలో ప్రాచుర్యం పొందగా, ప్రొటెస్టెంట్ మతం పట్టణ ప్రాంతానికే పరిమితమైంది.

9th Class Social Textbook Page No.155

ప్రశ్న 14.
పునరుజ్జీవన కాలం నాటి ప్రముఖ శాస్త్రవేత్తలు ఎవరు? విజ్ఞాన శాస్త్రానికి వాళ్లు చేసిన కృషి ఏమిటి?
జవాబు:
రోజర్ బాకన్ :
లోహాలు, రసాయనాలతో అనేక ప్రయోగాలు చేసాడు. సత్యాన్ని తీవ్రంగా అన్వేషించాడు.

నికోలస్ కోపర్నికస్ :
ఖగోళశాస్త్ర వేత్త. వేధశాలను స్థాపించాడు. సూర్యుడి చుట్టూ తిరుగుతున్న అనేక గ్రహాలలో భూమి ఒకటని చెప్పాడు.

టోలమి : భూమి విశ్వానికి కేంద్రమని, నక్షత్రాలు, సూర్యుడు, గ్రహాలు దానిచుట్టూ తిరుగుతున్నవని వివరించాడు.

గెలీలియో : సూక్ష్మదర్శినికి మెరుగులు దిద్దాడు. లోలకంలోని సిద్ధాంతాలను కనుగొన్నాడు. బరువైన వస్తువులు, తేలికైన వస్తువులు ఒకే వేగంతో కిందకు పడతాయని నిరూపించాడు.

9th Class Social Textbook Page No.157

ప్రశ్న 15.
పటం చూసి సముద్ర మార్గాలలో వివిధ అన్వేషణల జాబితా తయారుచేయండి.
జవాబు:
పోర్చుగల్ నావికుడైన ప్రిన్స్ హెన్రీ ఆఫ్రికా పశ్చిమ తీరానికి కొత్త సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు.

పోర్చుగల్ కి చెందిన బారొలొమ్యి డియాజ్ అన్న నావికుడు ఆఫ్రికాకి దక్షిణ భాగమైన గుడ్ హోప్ అగ్రం దాటి వెళ్ళాడు. వాస్కోడిగామా సముద్రంలో ఆఫ్రికాను చుట్టి ముట్టి 1498లో భారత్ లోని కాలికట్ తీరం చేరాడు. క్రిస్టఫర్ కొలంబస్ అట్లాంటిక్ సముద్రయానం తరువాత 1492లో అక్టోబర్ 12న ఒక దీవిని చేరుకున్నాడు. భారతదేశానికి తూర్పువైపుకి చేరుకున్నానని ఆ ప్రజలను ఇండియన్స్ అన్నాడు.

ఇటలీకి చెందిన అమెరిగో వెస్పూచి అన్న నావికుడు కొలంబస్ కనుగొన్నది ఆసియా కాదని, కొత్త ప్రపంచమని (అమెరికా) అని నిర్ధారించుకున్నాడు. ఫెర్డినాండ్ మాజిల్లాన్ (స్పెయిన్) ఓడలో ప్రపంచాన్ని చుట్టుముట్టి వచ్చాడు. అట్లాంటిక్ సముద్రం దాటి, పసిఫిక్ మహా సముద్రంలోని ఫిలిప్పైన్స్ దీవులను చేరుకున్నాడు.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
పునరుజ్జీవన కాలం నాటి ప్రముఖ కళాకారుల చిత్రాలను సేకరించి, వాటిని ఒక పుస్తకంలో అంటించండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు 1300-1800 3

ప్రశ్న 2.
సూర్యుడి చుట్టూ భూమి తిరగటం లేదని నమ్మే మతగురువుకి, గెలీలియోకి మధ్య సంభాషణను ఊహించి రాయండి. (T.Q.)
జవాబు:
సంభాషణ
మతగురువు : బైబిలు, చర్చి బోధనలకు విరుద్ధంగా మాట్లాడుతున్న పాపి గెలీలియోను పిలిపించండి.

గెలీలియో : సెలవివ్వండి పరిశుద్ధులారా!

మతగురువు : భూమి విశ్వానికి కేంద్రం కాదని అంటున్నారట, ఏం బ్రతకాలని లేదా?

గెలీలియో : మన్నించండి! మత గురువుగారు! నాకృషితో సూక్ష్మదర్శినిని కనుగొన్నాను. దీనితో యాభై మైళ్ళ దూరంలో ఉన్న ఓడ అయిదు మైళ్ళ దూరంలో ఉన్నంత స్పష్టంగా కనిపిస్తుంది. జ్యూపిటర్ ఉపగ్రహాలు, గ్రహ పరిభ్రమణాన్ని స్వయంగా చూసాను.

మతగురువు : కాదు కాదు మీ వ్యాఖ్యలు వెనక్కు తీసుకోండి లేదా కఠిన శిక్షలకు గురౌతారు. దీర్ఘకాల ఖైదుకి గురి కావలసి ఉంటుంది.

గెలీలియో : “భూమి కదలికలను నేను చూసాను”. గొణుక్కుంటూ బయటకు వచ్చేస్తాడు.

ప్రశ్న 3.
ముద్రణ యంత్రం నుంచి వచ్చే వివిధ ఉత్పత్తులను మనం ఏ ఏ విధాలుగా వాడుతున్నామో తెలియజేస్తూ ఒక నివేదిక తయారుచేయండి.
జవాబు:
ముద్రణా యంత్రం నుంచి వచ్చే వివిధ ఉత్పత్తులను మనం అనేక విధాలుగా వాడుతున్నాం. శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్వేషణకు, సాహిత్యం , శిల్పం, చిత్రలేఖనం, భవన నిర్మాణ లోతుల అధ్యయనానికి, అంతరిక్ష, భూగోళ, విశ్వాంతర రహస్యాల ఛేదనకు, ఆవిష్కరణలు, రచనలు అభివృద్ధికి, ఆధారాలు సేకరణకు తోడ్పడుతుంది. వైద్యం, విజ్ఞానశాస్త్రం, తత్వం, భూగోళశాస్త్ర అధ్యయనానికి తోడ్పాటునందించింది.

AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 11th Lesson ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 11th Lesson ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

9th Class Social Studies 11th Lesson ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
ప్రభుత్వానికి బడ్జెట్ ఎందుకు అవసరం ? బడ్జెట్ పన్నుల గురించి ఎందుకు మాట్లాడుతుంది? (AS1)
జవాబు:

  1. కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్ రాబోవు ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం వివిధ కార్యక్రమాలపై చేయబోయే ఖర్చును తెలుపుతుంది.
  2. ఈ ఖర్చులను భరించటానికి ఏ విధంగా ఆదాయాలను సేకరిస్తుందో కూడా తెలుపుతుంది.
  3. అందువలన ప్రభుత్వం రానున్న ఆర్థిక సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది. ఎంత వ్యయం చేయడంలోను ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తుంది. దీనినే “బడ్జెట్” అంటారు.
  4. ప్రభుత్వం ఆదాయ వ్యయాలపై ముందుచూపు లేకుండా వ్యవహరించినట్లయితే తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది.
  5. వివిధ విధుల నిర్వహణకై ప్రభుత్వానికి చాలినంత డబ్బు అవసరం.
  6. ఆయా విధుల నిర్వహణకై కావాల్సిన డబ్బును ప్రజల నుండి పన్నుల రూపంలో సేకరిస్తుంది.
  7. ప్రభుత్వం వివిధ రకాల పన్నులను వసూలు చేస్తుంది.
  8. ఈ విధంగా వసూలు చేసిన పన్నులే ప్రభుత్వ రెవెన్యూ (ఆదాయం ) అవుతుంది.
  9. అందుకనే బడ్జెట్ లో పన్నుల ప్రస్తావన ఉంటుంది.

ప్రశ్న 2.
ఆదాయపు పన్ను, ఎక్సైజ్ సుంకానికి మధ్య వ్యత్యాసాలు ఏమిటి? (AS1)
జవాబు:

ఆదాయపు పన్ను ఎక్సైజ్ పన్ను
1. ప్రత్యక్ష పన్నుకు ఉదా : ఆదాయపు పన్ను. 1. పరోక్ష పన్నుకు ఉదా : ఎక్సైజ్ పన్ను.
2. వ్యక్తుల యొక్క వ్యక్తిగత ఆదాయం పై ఆదాయపు పన్ను విధించబడుతుంది. 2. ఉత్పత్తి అయిన వస్తువులు ఫ్యాక్టరీ ద్వారాన్ని దాటక ముందే ఎక్సెజ్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
3. ఆదాయపు పన్ను కొంత పరిమితిని మించి ఆర్జించే వారికే విధిస్తారు. 3. ఆ కర్మాగారపు యజమాని లేదా మేనేజర్ ఉత్పాదిత వస్తువుల పరిమాణం మేరకు ప్రభుత్వానికి పన్ను డబ్బు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
4. వ్యక్తిగత ఆదాయాలకు కూలీలు, వేతనాలు, పింఛన్ల వంటి వివిధ రకాల వనరులుంటాయి. వ్యక్తులు బ్యాంకు నగదు నిల్వలపై వడ్డీని ఆర్జిస్తారు. కొందరు భవనాల వంటి ఆస్తులపై అద్దెను ఆర్జిస్తారు. వీటన్నింటినీ ఆదాయంగానే పరిగణిస్తారు. కాబట్టి వీరు కూడా పన్ను చెల్లించవలసి ఉంటుంది. 4. ఎక్సైజ్ సుంకాన్ని కర్మాగారం చెల్లిస్తుంది. కానీ అది వస్తువులు కొన్నవారిపై బదలాయింప బడుతుంది. ఆ కర్మాగార యజమానులు వారు చెల్లించిన పన్నులను ధరలో కలుపుకునే అమ్ముతారు.

AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

ప్రశ్న 3.
క్రింది వానిని జతపరచండి : (AS1)

గ్రూపు -ఎ గ్రూపు – బి
1. ఎక్సెజ్ సుంకం A) వ్యక్తుల వార్షిక ఆదాయంపై విధించేది.
2. అమ్మకపు పన్ను B) వ్యాపార, వాణిజ్య సంస్థల వార్షిక లాభాలపై విధించేది.
3. దిగుమతి సుంకం C) వస్తువు తయారీ లేదా ఉత్పత్తి మీద విధించేది.
4. ఆదాయపు పన్ను D) వస్తువుల అమ్మకం జరిగినపుడు విధించేది.
5. కార్పొరేట్ పన్ను E) విదేశాల నుండి వస్తువులు తీసుకురావడంపై విధించేది.

జవాబు:

గ్రూపు -ఎ గ్రూపు – బి
1. ఎక్సెజ్ సుంకం C) వస్తువు తయారీ లేదా ఉత్పత్తి మీద విధించేది.
2. అమ్మకపు పన్ను D) వస్తువుల అమ్మకం జరిగినపుడు విధించేది.
3. దిగుమతి సుంకం E) విదేశాల నుండి వస్తువులు తీసుకురావడంపై విధించేది.
4. ఆదాయపు పన్ను A) వ్యక్తుల వార్షిక ఆదాయంపై విధించేది.
5. కార్పొరేట్ పన్ను B) వ్యాపార, వాణిజ్య సంస్థల వార్షిక లాభాలపై విధించేది.

ప్రశ్న 4.
ఉక్కు, అగ్గిపెట్టెలు, గడియారాలు, వస్త్రం, ఇనుము వీటిలో వేటిమీద పన్నులు పెరిగితే అవి ఇతర వస్తువుల ధరలను . ఎక్కువ ప్రభావితం చేస్తాయి? ఎందుకు? (AS1)
జవాబు:
ఇనుము ధర పెరిగితే కింది పేర్కొన్న విధంగా ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయి.

  1. వస్తువుల ధరలకు అన్ని రకాల పన్నులు కలుస్తూ ఉంటాయి.
  2. కానీ, కొన్ని ప్రత్యేక వస్తువులపై పన్నులు విధించడం వల్ల పెద్ద మొత్తంలో వస్తువుల ధరలు పెరుగుతాయి.
  3. ఉదా : సైకిళ్ల, తయారీకి ఉక్కు పైపులు కావాలి.
  4. ఉక్కు తయారీకిగాను ఉక్కు ఫ్యాక్టరీకి ఇనుము మరియు బొగ్గు కావాలి.
  5. ఒకవేళ ఇనుముపై ఎక్సెజ్ సుంకం పెరిగితే దాని ప్రభావం సైకిళ్ల ధరపై ఉంటుంది.
  6. ఇనుముతో తయారయ్యే వస్తువులన్నింటి ధరలూ పెరుగుతాయి.
  7. అంతేగాక ఉక్కును తయారు చేయడానికి ఇనుమునే వినియోగిస్తారు. కాబట్టి ఉక్కుతో తయారయ్యే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి.
  8. ఈ విధంగా ఇనుముపై పెంచిన పన్ను వివిధ అంశాలపై ప్రభావం చూపుతుంది.

ప్రశ్న 5.
సాధారణ ఆహార పదార్థాలైన ధాన్యం, పప్పులు, నూనెలను ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తారు. ఈ వస్తువుల మీద పన్నులు విధించడం పేదవారి మీద చాలా ప్రభావం చూపుతుందని ఎలా చెప్పవచ్చు? (AS4)
జవాబు:

  1. వస్తువులు, సేవలపై పన్ను విధించే విధానంలో ధనికులు, పేదల మధ్య వ్యత్యాసం చూపడం కష్టమైన పని.
  2. అయినప్పటికీ కొన్ని వస్తువుల విషయంలో అవకాశం ఉంది.
  3. ఉదా : ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, గుడ్డలు, కిరోసిన్, వంటనూనెలు, వంటగ్యాస్ వంటి అత్యవసర వస్తువులు ధనవంతులైనా, పేదవారైనా ప్రతి ఒక్కరూ కొంటారు.
  4. కానీ పేదలు వారి మొత్తం ఆదాయాన్ని దాదాపు వీటికే వినియోగించాల్సి ఉంటుంది. అవి నిత్యావసర వస్తువులు కాబట్టి వాటిని కొనకుండా ఉండలేరు. అవి లేకపోతే జీవనం కష్టం అవుతుంది. అందువల్ల పేదవారు తమ ఆదాయం మొత్తాన్ని వీటికి కేటాయించడం వలన వారికి ఏ విధమైన ఇతర ఆదాయముండదు.

AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

ప్రశ్న 6.
నలుగురు స్నేహితులు కలసి ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఆ అద్దెను నలుగురు కలసి చెల్లిద్దామనుకున్నారు. అద్దె నెలకు రూ. 2000. (AS1)
– వారి మధ్య ఆ అద్దె ఎలా పంచబడుతుంది?
– వారిలో ఇద్దరు నెలకు రూ. 3000, మరో ఇద్దరు రూ. 7000లు సంపాదిస్తున్నారని మనకు ముందే తెలుసు. ఈ వ్యయాన్ని వేరోక రకంగా వాటాలు వేస్తే, వారిలో ఒక్కొక్కరు అనుభవించే బాధ ఒకే విధంగా ఉంటుందా?
– అద్దె పంపకం ఎలా ఉంటే బాగుంటుందని నీవు భావిస్తున్నావు? ఎందుకు?
జవాబు:
సమానంగా పంచబడితే ఒక్కొక్కరికి రూ. 500 చొ||న వస్తుంది.
అలాగాక వారి ఆదాయం నిష్పత్తిని పరిగణనలోనికి తీసుకుంటే దాని ప్రకారం అద్దె పంచితే
(వారిలో ఇద్దరు నెలకు రూ. 3000, మరో ఇద్దరు రూ. 7000 లు సంపాదిస్తున్నారని మనకు ముందే తెలుసు.)
ఈ వ్యయాన్ని వేరొక రకంగా కాక వారి ఆదాయ నిష్పత్తి ప్రకారం పంచితే
3000 : 7000
రూ. 600 ‘లు రూ. 1400లు ప్రకారం పంచాలి.

అనగా 3000 రూపాయలు ఆదాయం పొందే ఇద్దరు (300 + 300) 600 రూపాయలు చెల్లిస్తే 7000 రూపాయలు ఆదాయం పొందేవారు (700 + 700) 1400 రూపాయలు చెల్లించాలి. ఆదాయ నిష్పత్తి ప్రకారం పంచితే బాగుంటుంది.

ప్రశ్న 7.
ఆదాయాలపై లేదా వస్తువులపై పన్ను, ఈ రెండింటిలో ధనికులు, పేదల మీద ఏది ఎక్కువ ప్రభావం చూపుతుంది? కారణాలతో వివరించండి. (AS1)
జవాబు:
ఆదాయాలపై లేదా’ వస్తువులపై పన్ను ఈ రెండింటిలో ధనికులు పేద మీద ఏది ఎక్కువ ప్రభావితం చూపుతుంది అనగా వస్తువులపై పన్ను ఎక్కువ ప్రభావం చూపుతుంది.

కారణం :
తక్కువ ఆదాయం వచ్చినా, ఎక్కువ ఆదాయం వచ్చినా తప్పనిసరిగా కొనవలసినది వస్తువులు.

వస్తువులపై పన్నులు తక్కువగా ఉంటే వస్తువులు చౌకగా లభిస్తాయి. పేదలు కూడా కొనడానికి తక్కువ ఆదాయం సరిపోతుంది. ఆదాయాలపై పన్నులు వేస్తే అధిక ఆదాయాలు పొందుతున్న కొంతమంది మీద మాత్రమే ఆ ప్రభావం పడుతుంది.

ప్రశ్న 8.
విలువ ఆధారిత పన్ను (VAT) వస్తువులపై పన్ను ఎగవేతను ఏ విధంగా తగ్గిస్తుంది? (AS1)
జవాబు:
VAT అనగా (Value Added Tax) విలువ ఆధారిత పన్ను.

  1. వ్యాట్ విధానంతో ఉన్న ప్రయోజనం వస్తువులపై పన్ను ఎగవేతను అరికట్టడం.
  2. అది ఎలా అనగా ఉత్పత్తిదారులు, వర్తకుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన లావాదేవీల నమోదులో పారదర్శకత పెంపొందుతుంది.
  3. ప్రతి ఒక్కరూ సరైన రికార్డులను నిర్వహించడానికి కొనుగోలు సమయంలో బిల్లులను అడుగుతారు.
  4. ఎందుకంటే ముడి సరుకులపై ఇది వరకే పన్ను ‘చెల్లించామని వాటి ద్వారానే తెలియజేయవచ్చు.
  5. పన్నుల శాఖ అధికారులు కొనుగోలుదారులు, అమ్మకందారుల రికార్డులను పోల్చి చూడటానికి అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా జరిగే పన్ను ఎగవేత కష్టసాధ్యమవుతుంది.

ప్రశ్న 9.
ఎక్సెజ్ సుంకానికి, దిగుమతి సుంకానికి మధ్యగల వ్యత్యాసాలేమిటి? (AS1)
జవాబు:

ఎక్సైజ్ సుంకం దిగుమతి సుంకం
1. ఎక్సైజ్ సుంకాలను ఫ్యాక్టరీలనుండి వసూలు చేస్తారు. 1. కస్టమ్స్ సుంకాలను అంతర్జాతీయ విమానాశ్రయాలు, నౌకాశ్రయాల నుండి వసూలు చేస్తారు.
2. ఫ్యాక్టరీలు వస్తువులు కొన్నవారిపై ఈ పన్నును బదలాయిస్తారు. 2. విదేశాలలో వస్తువులను కొని మన దేశానికి తెచ్చే వారిపై, మన దేశం నుండి ఇతర దేశాలకు వస్తువులను సరఫరా చేసేవారిపై విధించపబడుతుంది.
3. ఇది దేశీయ ఉత్పత్తులపై విధించబడుతుంది. దేశీయ ఉత్పత్తి వస్తువులు కొన్నవారిపై విధించబడుతుంది. 3. ఇది అంతర్జాతీయ వర్తకంలో వస్తువుల విక్రయాలపై విధించబడుతుంది.

ప్రశ్న 10.
ఇటీవలి కాలంలో బస్సు చార్జీలు ఒక్కసారిగా పెరిగాయా? అయితే దానికి గల కారణాలు తెలుసుకోండి.
జవాబు:
ఇటీవలి కాలంలో బస్సు చార్జీలు ఒక్కసారిగా పెరిగాయి
కారణాలు : డీజిల్, పెట్రోలు, రేట్లు పెరగడం
ఉద్యోగుల, కార్మికుల వేతనాలు పెరగడం
నిర్వహణ ఖర్చులు పెరగడం
బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు తగ్గడం
విద్యార్ధులకు, వృద్ధులకు రాయితీలు ఇవ్వడం

ప్రశ్న 11.
‘ప్రత్యక్ష పన్నులు’ శీర్షిక క్రింద గల వ్యక్తుల యొక్క వ్యక్తిగత ఆదాయంపై) పేరాను చదివి కింది ప్రశ్నకు సమాధానం రాయండి. (AS2)
ఎక్కువ ఆదాయం సంపాదించేవారు ఎక్కువ పన్ను ఎందుకు చెల్లించాలి?
జవాబు:

  1. వ్యక్తుల యొక్క వ్యక్తిగత ఆదాయంపై ఆదాయపు పన్ను విధించబడుతుంది.
  2. వ్యక్తిగత ఆదాయాలకు కూలీలు, వేతనాలు, పింఛన్లు వంటి వివిధ రకాల, వనరులుంటాయి.
  3. వ్యక్తులు బ్యాంకు నగదు నిల్వలపై వడ్డీని ఆర్జిస్తారు. కాబట్టి వీరు కూడా పన్ను చెల్లించవలసి ఉంటుంది.
  4. ఆదాయపు పన్నును కొంత పరిమితిని మించి ఆర్జించే వారికే విధిస్తారు.
  5. ఈ పన్నును ఆర్జించిన ఆదాయంలో పరిమితి పోగా మిగిలిన దానిలో కొంతశాతం విధిస్తారు.
  6. ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే వారు వారి ఆదాయాన్ని అనుసరించి ఎక్కువ నిష్పత్తిలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

దానివల్ల తక్కువ ఆదాయం వచ్చేవారు తక్కువ పన్ను, ఎక్కువ ఆదాయం వచ్చే వారు ఎక్కువ పన్ను చెల్లించుతారు. తద్వారా -పేదవారు మరింత పేదవారు కాకుండా, ధనవంతులు మరింత ధనవంతులు కాకుండా నిరోధించవచ్చు.

AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

ప్రశ్న 12.
మన ఆర్థిక వ్యవస్థపై నల్లధనం చూపే ప్రభావం ఏమిటి? (AS6)
జవాబు:
చాలా మంది ప్రజలు తమ మొత్తం ఆదాయాలను వెల్లడించకపోవడం లేదా ఉన్న దాని కంటే తక్కువ చూపి, ఆదాయాన్ని పైకి కనపడకుండా దాయడమే, ఆ దాచిన డబ్బును నల్లధనం (Black money) అంటారు. మన ఆర్థిక వ్యవస్థపై నల్లధనం విపరీత ప్రభావం చూపుతుంది. అది ఎట్లనగా ….

వాస్తవంగా ప్రజలు, ఫ్యాక్టరీ యజమానులు, వడ్డీ వ్యాపారస్తులు, వర్తకులు అధికంగా లాభాలు ఆర్జిస్తారు. కాని వాస్తవ లాభాలు చూపి, ప్రభుత్వానికి పన్నులు చెల్లించరు. వారికి వచ్చిన లాభాన్ని తక్కువ ఆదాయాలుగా చూపుతారు. ఈ విధంగా తమ వాస్తవ ఆదాయాన్ని చూపకుండా దాయడం వలన, ప్రభుత్వానికి ధనం చేకూరదు. వాస్తవంగా చెల్లించినట్లయితే ఆ ఆదాయంతో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి, ధరలను తగ్గించి, సామాన్య ప్రజలకు చేయూతనందించవచ్చు. ఉత్పత్తి కన్నా తక్కువ ఉత్పత్తి జరిగినట్లు చూపి పన్ను నుండి తప్పించుకోవడం వలన ఆ వస్తువుల ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుంది. కొంతమంది వ్యాపారులు బిల్లులు సరిగ్గా ఇవ్వకుండా లేదా వాస్తవంగా అయిన వాటి కంటే తక్కువ అమ్మకాలు జరిగినట్లుగా చూపి ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్నారు.

9th Class Social Studies 11th Lesson ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు InText Questions and Answers

9th Class Social Textbook Page No.132

ప్రశ్న 1.
మీ నగరం/పట్టణం/గ్రామాల్లో ప్రభుత్వం ఏ పాత్రలను పోషిస్తుండడాన్ని మీరు గమనించారో చర్చించండి.
జవాబు:

  1. మా ప్రాంతాలలో పాఠశాలలు, కళాశాలలు, గ్రంథాలయాలు, ఆరోగ్య కేంద్రాలు తపాలా కార్యాలయాలు వంటి వివిధ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వమే నెలకొల్పి నిర్వహిస్తున్నది.
  2. రోడ్డు, రైలు మార్గాల నిర్మాణం, ప్రభుత్వ రవాణా వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహిస్తున్నది.
  3. నీటి సరఫరా, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి వాటి నిర్వహణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నది.
  4. ఆరోగ్య, సేవలు, పరిశుభ్రత, విద్యుత్, ప్రజా రవాణా, పాఠశాలలు వంటివి ప్రభుత్వం సదుపాయాలుగా అందిస్తున్నది.
  5. రైతులు తమ పంట భూముల్లో నీటి పారుదలకై మోటారు పంపుసెట్ల ఏర్పాటుకు ఫ్యాక్టరీలు, కార్యాలయాలు, దుకాణాలు, మార్కెట్ల వంటి వాటిని నిర్వహిస్తున్నది.

ప్రశ్న 2.
ప్రభుత్వ ఖర్చు వివరాలను, మీ ప్రాంత వార్తాపత్రికల్లో సేకరించి జాబితా రాయండి.
జవాబు:
ప్రభుత్వ ఖర్చు వివరాలు :

  1. విద్యారంగం – 1200 కోట్లు
  2. ఆరోగ్యరంగం – 400 కోట్లు
  3. వ్యవసాయరంగం – 1000 కోట్లు
  4. గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి – 300 కోట్లు
  5. గ్రామీణాభివృద్ధి – 400 కోట్లు
  6. విద్యుత్, నీటి పారుదల వరదల నియంత్రణ – 600 కోట్లు
  7. ఎరువుల సబ్సిడీ – 200 కోట్లు
  8. రైల్వేలు, రవాణా, కమ్యూనికేషన్స్ – 600 కోట్లు.
  9. రక్షణ రంగం – 700 కోట్లు
  10. పరిపాలన ఖర్చులు – 800 కోట్లు

ప్రశ్న 3.
ప్రజా సేవలకు, ఇతర కార్యకలాపాల నిర్వహణకు ప్రభుత్వానికి డబ్బు ఎక్కడ నుండి లభిస్తుందో ఊహించగలరా?
జవాబు:

  1. వివిధ విధుల నిర్వహణకై ప్రభుత్వానికి చాలినంత డబ్బు అవసరం.
  2. ఈ విధంగా ప్రభుత్వం యొక్క ఆయా విధుల నిర్వహణకై కావాల్సిన డబ్బును ప్రజల నుండి పన్నుల రూపంలో సేకరిస్తుంది.
  3. ప్రభుత్వం వివిధ రకాల పన్నులను వసూలు చేస్తుంది.

9th Class Social Textbook Page No.134

ప్రశ్న 4.
పై విభాగంలోని సమాచారాన్ని ఉపయోగించి ప్రభుత్వం ఆహార సబ్సిడీపై ఎంత ఖర్చు చేసిందో లెక్కించండి.
ఈ డబ్బు దేనిపై, ఎందుకోసం ఖర్చు చేయబడిందో చర్చించండి.
AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు 1
జవాబు:
ఆహార సబ్సిడీపై 3% ఖర్చు చేయడం జరిగింది.

ఆ డబ్బును పేదలకు కేటాయించిన బియ్యం, పప్పులు, గోధుమలు, చింతపండు, పంచదార వంటి నిత్యావసర ఆహార ధాన్యాలకు కేటాయించడం జరిగింది.

ప్రశ్న 5.
మీ ఉపాధ్యాయుల సహాయంతో పై (pie) చార్టులోని కొన్ని ఖర్చులను మొదటి విభాగంలో చర్చించిన ప్రభుత్వ పాత్రలకు అన్వయింపజేయండి.
జవాబు:
మొదటి విభాగంలో చర్చించిన ప్రభుత్వ పాత్ర

  1. ఆహారం సబ్సిడీ – 3%
  2. విద్య మొ||న విషయాలకు – 12%
  3. ఆరోగ్యం, పారిశుద్ధ్యం – 4%
  4. గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధికి – 3%
  5. వినోదం వంటి ఇతరములకు – 21 %
    కేటాయించి ఖర్చు చేయడం జరిగింది.

ప్రశ్న 6.
స్వాతంత్ర్యానంతరం మన దేశ మొదటి బడ్జెట్ 1947-48 రూ. 197 కోట్లు. 2011-12లో బడ్జెట్ 23 లక్షల కోట్లు. బడ్జెట్ లో ఇంత మొత్తం పెరగడానికి కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు:

  1. జనాభా పెరుగుదల
  2. ఉద్యోగస్తుల వేతనాలు పెరుగుదల
  3. ప్రభుత్వరంగ సంస్థల నిర్మాణ, నిర్వహణ పెరుగుదల
  4. వడ్డీ చెల్లింపుల పెరుగుదల
  5. రక్షణ వ్యయం పెరుగుదల
  6. పరిపాలనా ఖర్చుల పెరుగుదల
    పై విధంగా అన్ని రంగాలలో ఖర్చులు పెరగడం వలన బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి. తద్వారా బడ్జెట్ మొత్తం పెరిగింది.

AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

ప్రశ్న 7.
ప్రభుత్వ బడ్జెట్ పై పార్లమెంట్ కు అధికారం, ఎందుకు ఇవ్వబడిందో ఆలోచించండి.
జవాబు:

  1. బడ్జెట్ అంశాలపై ప్రభుత్వాన్ని చట్టసభల ద్వారా నియంత్రించవచ్చు.
  2. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లోని వివిధ అంశాలపై చర్చలు జరిగిన అనంతరమే ప్రభుత్వ ప్రతిపాదనలను పార్లమెంటు ఆమోదించడం జరుగుతుంది.
  3. ప్రభుత్వ ఖర్చులకై డబ్బు విడుదలకు పార్లమెంటు అనుమతించాలి.
  4. అదే విధంగా పార్లమెంటు ఆమోదం లేనిదే ఏ రకమైన పన్నూ విధించరాదు. అందువలన బడ్జెట్ పై అధికారం పార్లమెంటుకు ఇవ్వబడింది.

ప్రశ్న 8.
రసాయన ఎరువులపై రాయితీలను తగ్గించడానికి ప్రభుత్వం వరుసగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీని అర్థం ప్రభుత్వం ఇక ముందు వాటి ధరల అదుపు కొనసాగించకపోవచ్చు. రైతులు మార్కెట్ ధరలకు కొనుక్కోవలసి ఉంటుంది. ప్రస్తుతం ఎరువుల కంపెనీలకు తక్కువ ధరలకు అమ్మడం వల్ల వచ్చే నష్టాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎరువులపై రాయితీ ఎత్తివేయాల్సి వస్తే ఆ డబ్బు ప్రభుత్వ బడ్జెట్లోని ఇతర ముఖ్య విషయాలకు మళ్లించడానికి అవకాశం కలుగుతుంది. మరో వాదం కూడా ఉంది. ఎరువులపై రాయితీలు చిన్న రైతులకు లాభదాయకంగా లేవు, కానీ పెద్ద రైతులు అవసరానికి మించి వాడేవిధంగా ప్రోత్సహిస్తున్నాయి.
ఎరువులపై రాయితీలు రైతులకు బాగా ఉపయోగపడుతున్నాయని నమ్మే రైతుగా మిమ్మల్ని మీరు భావించుకొని ఈ కేసును ఎలా వాదిస్తారు ? ఆర్థికశాఖ మంత్రికి ఒక లేఖ రాయండి.
జవాబు:

విజయవాడ,
5-8-20xx.

భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిగారికి,

అయ్యా,
మేము రైతులం. మాకు ఎరువులపై ఇచ్చే సబ్సిడీ వలన మేము వ్యవసాయకంగా ఎంతో లబ్దిని పొందుతున్నాం. అధునాతన పద్ధతులలో వ్యవసాయం చేసి, అధిక దిగుబడులు సాధించడానికి ఈ సబ్సిడీ కార్యక్రమం మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది. ఇప్పటికే వాతావరణ పరిస్థితులు అనుకూలించక, విత్తనాల రేట్లు పెరిగిపోయి, పండిన పంటకు గిట్టుబాటు రేటు లేక ఇబ్బందులు పడుతున్న మాకు ఎరువులపై ఉన్న సబ్సిడీలు ఎత్తివేస్తే వాటి రేట్లు పెరిగిపోయి వాటిని సరైన మోతాదులో వాడుకోలేక పంట దిగుబడి తగ్గిపోయి సరైన ఉత్పత్తులు సాధించలేక రైతులుగా మేమేంతో నష్టపోవలసి వస్తుంది. అందువలన తమరు మాయందు దయ ఉంచి ఎరువుల సబ్సిడీలను కొనసాగించి మా వ్యవసాయ ఆర్థికాభివృద్ధికి తోడ్పడతారని మిమ్మల్ని సహృదయపూర్వకంగా ప్రార్థించుచున్నాము..

ఇట్లు
మీ విధేయుడైన రైతు

9th Class Social Textbook Page No.135

ప్రశ్న 9.
పెట్రోల్, డీజిల్ వంటి వాటిని రవాణా వాహనాలకు, మోటారు పంపులకు, జనరేటర్ల వంటి వాటికి వినియోగిస్తాం. ఒకవేళ డీజిల్, పెట్రోల్ పై పన్ను పెరిగితే ఏమవుతుంది?
జవాబు:
పెట్రోల్, డీజిల్ వంటి వాటిని రవాణా వాహనాలకు మోటారు పంపులకు జనరేటర్ల వంటి వాటికి వినియోగిస్తాం.

  1. డీజిల్, పెట్రోల్ పై పన్ను పెరగడం వలన వాటి రేటు పెరుగుతుంది.
  2. దానితో డీజిల్ పెట్రోల్ పై ఆధారపడిన అన్ని వస్తువుల రేట్లు పెరుగుతాయి.
  3. రవాణా చార్జీలు పెరగడం వలన రవాణాపై ఆధారపడిన వస్తువుల రేట్లు పెరుగుతాయి.

9th Class Social Textbook Page No.136

ప్రశ్న 10.
టి.వి. ఉదాహరణలో, దాని ఖరీదులో ఎంత భాగం వినియోగదారుడు పన్నుగా చెల్లిస్తున్నాడు?
జవాబు:
ఎక్సెజ్ సుంకం రూపంలో 1200 రూపాయలు
అమ్మకం పన్ను రూపంలో 1650 రూపాయలు
మొత్తం కలిపి 2850 రూపాయలు పన్ను చెల్లిస్తున్నాడు.

ప్రశ్న 11.
ఒకే రకమైన ఉత్పత్తులను తయారు చేసేవారి ఇద్దరిలో ఒకరు పన్ను ఎగవేసినా, మరొక వ్యక్తి కంటే ఏ విధంగా ప్రయోజనం పొందుతాడు?
జవాబు:

  1. పన్ను కట్టడం వలన తక్కువ లాభం పొందుతాడు.
  2. పన్ను ఎగవేయడం వలన దానిని కూడా తన లాభంగా పొందవచ్చును.
  3. అంతేగాక పన్ను వేయడం వల్ల ఇతరులు ఉత్పత్తి చేసిన వస్తువులకన్నా తక్కువ ధరకే అమ్మవచ్చును.
  4. అలాంటి పరిస్థితులలో పన్ను ఎగవేతదారుడు ఎక్కువ వస్తువులను అమ్ముకోవచ్చును. దానితో అతనికి మంచి లాభం రావచ్చును.

AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

ప్రశ్న 12.
ఒకవేళ ఇనుముపై పన్ను పెంచితే దాని ప్రభావం ఇతర ఏ వస్తువులపై ఎలా పడుతుందో ఉదాహరణలివ్వండి.
జవాబు:

  1. ఇనుము రేటు పెరుగుతుంది.
  2. దానితో ఇనుముతో తయారయ్యే వస్తువులన్నింటి ధరలో పెరుగుతాయి.
  3. అంతేగాక ఉక్కును తయారు చేయడానికి ఇనుమునే వినియోగిస్తారు. కాబట్టి ఉక్కుతో తయారయ్యే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి.

9th Class Social Textbook Page No.138

ప్రశ్న 13.
విలువ ఆధారిత పన్నులపై మీ అభిప్రాయం ఏమిటి? చర్చించండి.
జవాబు:

  1. విలువ ఆధారిత పన్ను విధానంలో ఉత్పత్తిదారు చెల్లించే పన్ను తక్కువగా ఉంటుంది.
  2. ఎందుకనగా ముడి పదార్థాల విలువపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
  3. కర్మాగారాల్లో ఉత్పాదనాక్రమం ఇతర కర్మాగారాల్లో ఉత్పత్తి చేయబడిన ఎన్నో ఉత్పత్తులపై ఆధారపడి ఉంటుంది.
  4. ఈ పన్ను విధానం (వ్యాట్) లో ముడి పదార్థాలుగా ఉపయోగించే వాటిపై మళ్ళీ పన్ను విధించబడదు.
  5. ఉత్పత్తిదారులు, వర్తకుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన లావాదేవీల నమోదులో పారదర్శకత పెంపొందుతుంది.
  6. ప్రతి ఒక్కరూ సరైన రికార్డులను నిర్వహించడానికి కొనుగోలు సమయంలో బిల్లులను అడుగుతారు. ఎందుకంటే ముడిసరుకులపై ఇదివరకే పన్ను చెల్లించామని వాటి ద్వారానే తెలియజేయవచ్చు.
  7. పన్నుల శాఖ అధికారులు. కొనుగోలుదారులు, అమ్మకందారుల రికార్డులను పోల్చి చూడటానికి అవకాశం ఉంది.

ప్రశ్న 14.
పూరించండి : తార, సాజీదా, ప్రీతిల కొనుగోళ్లపై పన్ను రేట్లు వేర్వేరు ఉన్నాయి. (ఒకే రకమైన / వేర్వేరు అలా ఎందుకు ఉన్నాయో తెలుసుకోండి.
జవాబు:
తార తన యొక్క పాఠశాల కంప్యూటర్ల కోసం సాయిరాం కంప్యూటర్స్ నుండి రెండు హార్డ్ డ్రైవ్ లను కొని తెచ్చింది. బిల్లులో విలువ ఆధారిత పన్ను కంటే ముందు రేటు రూ. 5,000 దీనికి 5% విలువ ఆధారిత పన్ను రూ. 250లు కలిపిన అనంతరం మొత్తం అమ్మకం ధర (వ్యాట్‌లతో) కలిపి రూ. 5,250 లు.

సాజీదా బ్యాటరీ రూ. 9,165లు కొనగా వ్యాట్ కలిపి 1,146 మొత్తం రూ 10,311లు చెల్లించెను.
ప్రీతి తన వంటగ్యాస్ సిలిండర్‌కు చెల్లించిన బిల్లులో వ్యాట్ లేదు.
ఎందుకంటే వంటగ్యాసు వ్యాట్ లేదు.
అందువలన పై వస్తువులపై పన్ను రేట్లు వేరువేరుగా ఉన్నాయి.

9th Class Social Textbook Page No.139

ఆదాయంపై పన్ను విధించడంలో సరైన విధానమేది?
ప్రశ్న 15.
ప్రతి ఒక్కరూ సమాన మొత్తాలను పన్నుగా చెల్లించడం సరైన విధానమని మీరు భావించి ఉంటారు. కింద పేర్కొన్న ముగ్గురు వ్యక్తులను గమనించండి.
AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు 2
పై ముగ్గురిలో ప్రతి ఒక్కరూ సమాన .మొత్తం (రూ.50) పన్ను చెల్లించే విధానం వాస్తవంగా సరైనదా? జ్యోతి తన ఆదాయంతో కనీసం తన పిల్లల్ని కూడా సరిగా పోషించలేదు. ఆమె కూడా అదే మొత్తంలో పన్ను చెల్లించడం సరైనదేనా?
జవాబు:
ఈ రకమైన పన్నుల విధానం సరియైనది కాదు.

ప్రశ్న 16.
ప్రతి ఒక్కరు తమ ఆదాయంలో కొంత మొత్తం పన్నుగా చెల్లించడం సరైన విధానమని భావిస్తున్నారు కదా! ఉదాహరణకు ప్రతి ఒక్కరు 10% పన్ను చెల్లించాల్సి ఉంటే ఎంత చెల్లించాలో కనుక్కోండి.

వ్యక్తి నెలలో సంపాదించినవి (రూ.లలో) 10% పన్ను (రూ.లలో)
జ్యోతి 1,500 150
ఆసిఫ్ 8,000 800
నితీష్ 30,000 3000

ఇది సరైనదా? అయినప్పటికీ జ్యోతికి జీవించడానికి చాలినంత ఆదాయం లేదు. ఆసిఫ్ కు తన ఇల్లు మరమ్మతులు చేయించడానికి సరిపడా డబ్బు కలిగి ఉండకపోవచ్చు. కానీ నితీష్ 20% పన్ను చెల్లించినా తన కనీస అవసరాలకు పెద్ద . మొత్తంలో డబ్బు ఉంటుంది.
జవాబు:
ఇది సరికాదు.

AP Board 9th Class Social Solutions Chapter 11 ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు

ప్రశ్న 17.
పన్నుల విధానాన్ని సరిచేయడానికి మరింత సరైన పద్ధతిని ఇప్పుడు మీరు చెప్పగల్గుతారు. కొంత పరిమితిని ఉదాహరణకు నెలకు రూ. 7,000 లకు మించి. సంపాదించే వారే పన్ను చెల్లించాలి. బాగా ఆర్జించేవారు వారి ఆదాయాల నుండి . ఎక్కువ నిష్పత్తిలో పన్ను చెల్లించాలని కూడా మీరు చెప్పగలుగుతారు.

మీరు సంపాదించే ఆదాయం (రూ.లలో) మీరు చెల్లించే పన్ను
7,000లు కన్నా తక్కువ 0%
7,001 నుండి 15,000 ల వరకు 10%
15,001 నుండి 25,000 ల వరకు 20%
25,000ల కన్నా ఎక్కువ 30%

కింది వారిలో ఒక్కొక్కరు ఎంత పన్ను చెల్లించాలో లెక్కించండి.

వ్యక్తి నెలలో సంపాదించినవి
(రూ. లలో)
నెలకు చెల్లించాల్సిన పన్ను
(రూ.లలో)
జ్యో తి 1,000
ఆసిఫ్ 6,000
నితీష్ 20,000 4000

ఇది సరైనదేనా?
1. సరైనది కాదు.

కారణం :

  1. మనిషి తన ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి కొంత డబ్బు అవసరం. దానిమీద పన్ను విధించరాదు.
  2. అందువలన ఒక స్థాయి ఆదాయం వరకు ఏ విధమైన పన్నూ విధించకుండా ఆ దశ దాటిన తరువాత పన్ను విధిస్తే బాగుంటుంది.
  3. కావున 3వ అంశంలో పేర్కొన్న విధంగా కొంత పరిమితి వరకు పన్ను విధించకుండా ఆ తరువాత విధిస్తూ ఉండాలి.
  4. అప్పుడు పన్నుల వలన పేదవారు ఇబ్బందిపడరు.

9th Class Social Textbook Page No.140

ప్రశ్న 18.
ప్రభుత్వం విధించే ప్రధానమైన పన్నుల గురించి మనం చదివాం. ఇచ్చిన సమాచారంతో కింద పట్టికను పూరించండి. ఆదాయం పన్ను 12%, కార్పొరేట్ పన్ను 24%, దిగుమతి సుంకం 10%, ఎక్సెజ్ పన్ను 16%, సేవాపన్ను 5%, అమ్మకపు పన్ను 23%, ఇతర పరోక్ష పన్నులు 10%.
ప్రభుత్వంచే వసూలు చేయబడే పన్నులు :

పన్నులు మొత్తం పన్ను యొక్క శాతం
ప్రత్యక్ష పన్నులు : 36%
ఆదాయం పన్ను 12%
కార్పొరేట్ పన్ను 24%
పరోక్ష పన్నులు : 64%
దిగుమతి పన్ను 10%
ఎక్సైజ్ పన్ను 16%
సేవా పన్ను 5%
అమ్మకం పన్ను 23%
ఇతర పన్నులు 10%
మొత్తం పన్నులు 100%

1. ఏ రకమైన పన్నులు ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి?
జవాబు:
పరోక్ష పన్నులు (64%)

2. క్రాంతికి సంవత్సరానికి రూ. 1,75,000ల ఆదాయం ఉంది. అతడు రూపాయలు రూ. 3000 పన్ను చెల్లించాలి. కమలేశ్ వార్షిక ఆదాయం 3,00,000 రూపాయలు. అతడు రూ. 5,500 ఆదాయం పన్ను చెల్లించాలి.
* ఎవరు ఎక్కువ. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు?
జవాబు:
క్రాంతికి సంవత్సరాదాయం – 1,75,000 రూపాయలు
క్రాంతి చెల్లిస్తున్న ఆదాయపు పన్ను – 3,000 రూపాయలు
క్రాంతి చెల్లిస్తున్న ఆదాయపు పన్ను శాతం – 1.71%
కమలేశ్ వార్షికాదాయం – 3,00,000
కమలేశ్ చెల్లిస్తున్న ఆదాయపు పన్ను – 5,
కమలేశ్ చెల్లిస్తున్న ఆదాయపు పన్ను శాతం – 1.83%
అందువలన కమలేశ్ ఎక్కువ ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు.

* ఎవరు ఆదాయంలో ఎక్కువ భాగాన్ని పన్నుగా చెల్లించాలి?
జవాబు:
కమలేశ్

* ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ ఆదాయం ఉన్నవారు చెల్లించే పన్ను వారి ఆదాయంలో ……….. (తక్కువ/ఎక్కువ / సమానం) భాగం.
జవాబు:
ఎక్కువ

ప్రాజెక్టు

కొన్ని సబ్బులు, టూత్ పేస్టు, టాబ్లెట్స్ స్క్రిప్స్ లేదా ఎం.ఆర్.పి రాసి ఉన్న కొన్ని వస్తువుల ప్యాకింగ్ ను సేకరించి వాటిమీద రాసి ఉన్న ధరను, వాటిని అమ్ముతున్న ధరలను గురించి చర్చించండి. చిల్లర వర్తకుడు పొందుతున్న లాభాల గురించి మాట్లాడండి.
జవాబు:
లక్స్ – 20 రూ.
రెక్సోనా – 19 రూ
సంతూర్ – 16 రూ.
లిరిల్ – 25 రూ.
కోర్గెట్ 74-00 రూ.
పెప్సొడెంట్ – 70-00 రూ.
బబూల్ – 60-00 రూ.

వాటిపై ఎం.ఆర్.పి. పై విధంగా ఉండగా చిల్లర వర్తకుడు ఒక్కొక్కదానిపై దానిమీద ఉన్న ఎం.ఆర్.పి. రేటుకన్నా 2 లేదా 3 రూపాయలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నాడు.

ప్రతి ఉత్పత్తి వస్తువుపైనా ఎం.ఆర్.పి. రేటుకన్నా 2 లేదా 3 రూపాయలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నాడు.

ప్రతి ఉత్పత్తి వస్తువుల పైనా ఎం.ఆర్. పి. రేటుతోపాటు (అన్నిరకముల పన్నులను కలిపి) అని ఉంటుంది. కాబట్టి చిల్లర వర్తకుడు ఎం.ఆర్.పి. ఎక్కువ రేటుకు అమ్మవలసిన అవసరం లేదు. వారికి ఎం.ఆర్.పి రేటులోనే కొంత తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. ఆ లాభం సరిపోతుంది. కానీ చిల్లర వర్తకుడు మరికొంత అదనపు ఆదాయాన్ని రాబట్టడం కోసం ఆ విధంగా ఎక్కువ రేటుకు అమ్ముతున్నాడు.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 10th Lesson ధరలు – జీవనవ్యయం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 10th Lesson ధరలు – జీవనవ్యయం

9th Class Social Studies 10th Lesson ధరలు – జీవనవ్యయం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
ధరలను నియంత్రించాల్సిన ఆవశ్యకత ఏమిటి? (AS1)
జవాబు:

  1. ధరలను నియంత్రించకపోతే స్థిరమైన ఆదాయం కలిగిన పెన్షనర్లు, రోజువారి వేతనదారులు, చేతి పనివారు, చిన్న అమ్మకందారులు, చిన్న పరిశ్రమలలోని కార్మికులు, తక్కువ ఆదాయం కలిగిన ప్రైవేటు ఉద్యోగులు నిరంతరం పెరిగే ధరల వలన దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావానికి గురవుతారు.
  2. దీనినే ద్రవ్యోల్బణం అంటారు.
  3. ద్రవ్యోల్బణ కాలంలో కూడా ఈ వ్యక్తుల ఆదాయం మారదు.
  4. కాబట్టి వారు తమ వినియోగాన్ని బలవంతంగా తగ్గించుకోవాలి.
  5. అప్పటికే వారి జీవన ప్రమాణం తక్కువ. ఇప్పుడు ద్రవ్యోల్బణం వారి జీవన ప్రమాణాన్ని మరింత తగ్గించింది. ఇది వారిని ఇంకా పేదరికంలోనికి నెడుతుంది. అందువలన ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉంది.

ప్రశ్న 2.
వస్తువులను ఉత్పత్తి చేసేవారు, అమ్మేవారు ధరలను ఎలా నిర్ణయిస్తారు? (AS1)
జవాబు:
వస్తువులను ఉత్పత్తి చేసేవారు తమ వస్తువుల ఉత్పత్తికయ్యే వ్యయాన్ని పరిగణనలోనికి తీసుకుంటారు. మరియు వారి లాభాలను కొంత మేర కలుపుకుంటారు. ఆ వస్తువులను అమ్మేవారు వారి యొక్క లాభాలను కూడా కలుపుకుని వస్తువుల యొక్క ధరలను నిర్ణయిస్తారు.

పై విధంగా వస్తువులను ఉత్పత్తిదారులు, అమ్మకందారుల యొక్క లాభాలు మరియు ఉత్పత్తికయ్యే ఖర్చులను పరిగణన లోనికి తీసుకుని ధరలను నిర్ణయించడం జరుగుతుంది.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 3.
జీవన వ్యయం, జీవన ప్రమాణానికి మధ్యగల తేడా ఏమిటి? (AS1)
జవాబు:

  1. జీవన ప్రమాణం అనగా మానవుల కొనుగోలు శక్తి.
  2. జీవన వ్యయం అనగా మానవులు చేసే ఖర్చులు. 3. స్థిరమైన ఆదాయం కలిగిన పెన్షనర్లు, రోజువారి వేతనదారులు, చేతిపనివారు, చిన్న అమ్మకందారులు, చిన్న పరిశ్రమలలోని కార్మికులు, తక్కువ ఆదాయం కలిగిన ప్రైవేట్ ఉద్యోగులు, నిరంతరం పెరిగే ధరల వలన దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావానికి గురవుతారు. దీనినే ద్రవ్యోల్బణం అంటారు.
  3. ఈ ద్రవ్యోల్బణ కాలంలో కూడా వ్యక్తుల ఆదాయం మారదు.
  4. కాబట్టి వారు తమ వినియోగాన్ని బలవంతంగా తగ్గించుకోవాలి.
  5. అప్పటికీ వారి జీవన ప్రమాణం తక్కువ. ఇప్పుడు ద్రవ్యోల్బణం వలన వారి జీవన వ్యయం పెరిగి వారిని పేదరికంలోనికి నెట్టింది.

ప్రశ్న 4.
జీవన వ్యయంలో పెరుగుదల ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది? ఎందుకు? (AS4)
జవాబు:
జీవన వ్యయంలో పెరుగుదల ఈ క్రింది వారిపై ప్రభావం చూపుతుంది :

  1. స్థిరమైన ఆదాయం కలిగిన పెన్షనర్లు
  2. రోజువారి వేతనదారులు
  3. చేతి పనివారు
  4. చిన్న అమ్మకందారులు
  5. చిన్న పరిశ్రమలలోని కార్మికులు
  6. తక్కువ ఆదాయం కలిగిన ప్రయివేట్ ఉద్యోగులు.

వీరి ఆదాయంలో మార్పు లేకపోవడం వలన జీవన వ్యయం పెరగడం వలన అప్పుల పాలవుతారు.

ప్రశ్న 5.
ద్రవ్యోల్బణ కాలంలో ఏ సమూహాలు ఎక్కువ ఆదాయాన్ని పొందుతాయి? (AS4)
జవాబు:

  1. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో, కొన్ని సంస్థలలో పనిచేసే ఉద్యోగులు కరవు భత్యం (డి.ఎ)ను అదనంగా పొందుతారు.
  2. ధరలు ఒక శాతం వరకు పెరిగినప్పుడు వారి వేతనం కూడా పెరుగుతుంది.
  3. ఎందుకంటే ప్రభుత్వం వారికి డి.ఎ.ను చెల్లిస్తుంది.
  4. తద్వారా ద్రవ్యోల్బణంతో పాటు వారి ఆదాయం పెరుగుతుంది.
  5. వ్యాపార కార్యకలాపాలు చేసే ప్రజలు వారు అమ్మే వస్తువుల ధరలు పెంచడం ద్వారా అధిక జీవన వ్యయంను రాబట్టుకుంటారు.
    ఉదా : పంచదార ధర పెరిగితే స్వీట్సు అమ్మేవారు ధరలను పెంచుతారు. టీ అమ్మేవారు కప్పు టీ – ధరను పెంచుతారు.
  6. డైక్లీనర్లు, కర్షకులు, లాయర్లు, డాక్టర్లు మొదలగు వివిధ సేవలను అందించే ప్రజలు ధరలు పెరిగినప్పుడు వారి ఫీజును కూడా పెంచుతారు.
  7. అధిక ధనవంతులు, కార్పొరేట్ రంగంలో పనిచేసే వారిపైన పెరిగిన ధరలు ప్రభావం చూపలేవు.

ప్రశ్న 6.
టోకు ధరల సూచిక (WPI), వినియోగదారుల ధరల సూచిక (CPI) కంటే ఏవిధంగా భిన్నమైనది? (AS1)
జవాబు:

  1. టోకు ధరల సూచికలో అన్ని వస్తువులు (ఉత్పాదక వస్తువులు, వినియోగ వస్తువులు) వస్తాయి.
  2. వినియోగదారుల ధరల సూచికలో వినియోగదారుల వస్తువుల ధరలు, చిల్లర ధరలు వస్తాయి.
  3. కావున ప్రధాన తేడా టోకు ధరల సూచికలోనే ఇమిడియున్నది. వినియోగదారుల ధరల సూచికలో ఆ తేడా లేదు.

ప్రశ్న 7.
ఆహార ద్రవ్యోల్బణం, వినియోగదారుల ధరల సూచికల మధ్యగల భేదమేమి? (AS1)
జవాబు:
ఆహార ధరల సూచికను.ఆహార పదార్థాల ధరలలో పెరుగుదలను అంచనా వేయుటకు ఉపయోగిస్తారు. దీనినే ఆహార ద్రవ్యోల్బణం అంటారు. ఆహార ధరల సూచికలో బియ్యం, గోధుమ, కూరగాయలు, పంచదార, పాలు, గుడ్లు, మాంసం, చేపలు, ఆహార పదార్థాల తయారీకి ఉపయోగపడే వంటనూనెల టోకు ధరలు ఉంటాయి.

కొన్నిసార్లు లాభార్జన ప్రధాన ఆశయంగా గల వ్యాపారస్తులు చాలా వస్తువులు ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు అక్రమంగా పెంచుతారు.

వినియోగదారులైన శ్రామికుల వేతనంలో పెరుగుదల లేకుంటే వారు మార్కెట్లో వస్తువులను కొనలేరు. నిత్యావసర వస్తువులైన గోధుమలు, బియ్యం, పాలు మొదలైన వాటి విషయంలో కొరత సంభవిస్తే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 8.
వినియోగదారుల ధరల సూచిక యొక్క ఉపయోగాలు ఏమిటి? (AS1)
జవాబు:

  1. జీవన వ్యయంలో పెరుగుదలను తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది.
  2. వినియోగదారులు ఉపయోగించే వస్తువుల ధరలు పెరిగితే వాటిని నియంత్రించడానికి తగిన చర్యలు చేపట్టడానికి ఉపయోగపడుతుంది.
  3. ప్రభుత్వం ఎగుమతి దిగుమతుల విధానం ద్వారా ఆహార పదార్థాల ధరలు పెరిగినప్పుడు ఆ వస్తువుల ఎగుమతిని పూర్తిగా నిషేధిస్తుంది లేదా కొంత పరిమితిని విధిస్తుంది.
  4. ఏవైనా వస్తువులు కొరతగా ఉంటే ప్రభుత్వం ఇతర దేశాల నుంచి తెప్పించి మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లాంటి సహకార సంఘాల ద్వారా అందిస్తుంది.

ప్రశ్న 9.
వినియోగదారుల ధరల సూచికను లెక్కించుటకు ఐదు అంశాలను రాయండి. (AS1)
జవాబు:

  1. తల్లిదండ్రులు కొనుగోలు చేసిన ప్రతి వస్తువు యొక్క ధరలను వ్రాయుట.
  2. ప్రతి నెల అంతే మొత్తంలో కొన్నారని ఊహించుకొంటే, కాని ఈ నెల ధరలు పెరగడం వలన అంతే మొత్తంలో వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగాయి.
  3. అంటే రోజువారీ వినియోగంలో రిటైల్ స్థాయిలోను లేదా చిల్లర వ్యాపారుల స్థాయిలోను ధరల తీరుతెన్నులను తెలిపే వినియోగదారుల సూచి.
  4. ఆర్థిక – గణాంకాల డైరెక్టరేట్ వివిధ మార్కెట్లలో ధరలను సేకరిస్తుంది.
  5. ఒక కుటుంబ బడ్జెట్ లోని ప్రాముఖ్యత గల వస్తువులపై చేసే ఖర్చును లెక్కించే విధంగానే వినియోగదారుల ధరల సూచికను కూడా లెక్కిస్తారు.
  6. గత నెలలో నాలుగు వస్తువుల సరాసరి ధరల స్థాయి 100. అది ఇప్పుడు 123. 3కి పెరిగింది. అంటే దీని అర్థం గత నెలతో పోలిస్తే ఇంట్లో వినియోగించుకొనే ఈ నాలుగు వస్తువుల ధరల స్థాయి ఈ నెలలో 23.3% పెరిగింది.

ప్రశ్న 10.
ధరల పాలనా యంత్రాంగం (APM), కనీస మద్దతు ధర (MSP) కంటే ఎలా భిన్నమైనది? (AS1)
జవాబు:
ధరల పాలనా యంత్రాంగం :
వస్తువులకు ధరలు పెరగకుండా నియంత్రిస్తుంది. వినియోగదారులకు వినియోగ వస్తువుల యొక్క ధరలను అందుబాటులో ఉంచుతుంది. అనగా వారి కొనుగోలు శక్తికి అనుకూలంగా వ్యవహరిస్తుంది.

కనీస మద్దతు ధర :
రైతులు పంటలు పండించటానికి అయిన ఖర్చులను వారి యొక్క శ్రమను పరిగణనలోకి తీసుకుని రైతులు నష్టపోకుండా వారు పండించిన ధాన్యానికి, ఇతర ఉత్పత్తులకు ప్రభుత్వం కనీస ధరను ప్రకటించి కొనుగోలు చేస్తుంది.

ఆ విధంగా రెండు విభిన్న ధోరణులను కలిగి ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 11.
‘ధరలను నియంత్రించడంలో ప్రభుత్వ పాత్ర’ అనే శీర్షిక కింద గల 6వ పేరాను చదివి ఈ ప్రశ్నకు జవాబు రాయండి. ప్రభుత్వ రాబడిని ధరల పాలనా యంత్రాంగం (APM) ఎలా ప్రభావితం చేస్తుంది? చర్చించండి. (AS2)
జవాబు:

  1. ప్రభుత్వ రాబడిని ధరల పాలనా యంత్రాంగం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభావితం చేస్తున్నది.
  2. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే వస్తువుల ధరలు మార్కెట్ లోని ధరల కన్నా తక్కువగా ఉంటాయి.
  3. వీటి ధరలలో తేడా లేదా సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుంది.
  4. చౌక ధరల దుకాణాల నుండి పేద ప్రజలు వస్తువులను కొనడానికి వీలు కల్పించడమే కాకుండా, నిత్యావసర వస్తువుల ధరలు మార్కెట్లో విచక్షణారహితంగా పెరగకుండా నియంత్రిస్తుంది.
  5. నిత్యావసర వస్తువుల అక్రమ నిల్వలను నిరోధించి, వాటి ధరలను సహేతుకమైన స్థాయిలలో ఉంచడం, వాటి లభ్యతను సులభతరం చేయడం కోసం ప్రభుత్వమే ధరలను నిర్ణయించి, అవే ధరలకు మార్కెట్లో వస్తువులను విక్రయించాలని వ్యాపారస్తులను అదేశిస్తుంది.
  6. ప్రభుత్వం నిర్ణయించిన ధరను ఎవరైతే పాటించరో వారిపై వివిధ చట్టాల ద్వారా జరిమానా విధిస్తుంది.
  7. కిరోసిన్, డీజిల్, LPG, CNG, PNG మొదలగు వాటికి ప్రభుత్వం కొంతమేర లేదా మొత్తంగా సబ్సిడీ ఇచ్చి ధరల పాలనా యంత్రాంగం ద్వారా విక్రయిస్తుంది.

ప్రశ్న 12.
మీ కుటుంబం వినియోగించే ఐదు రకాల వస్తువులను లేదా సేవలను తీసుకొని మీ కుటుంబానికి సంబంధించిన వినియోగదారుల ధరల సూచికను తయారుచేయండి. (AS3)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం 1
వినియోగదారుల ధరల సూచికలను రాయండి. ………………. 100%
గత నెలతో పోలిస్తే మీ కుటుంబం మొత్తం ఖర్చులో ఎంత మార్పు వచ్చింది?
గత నెలలో 1630 రూపాయల వ్యయం జరగగా ఈ నెల 2020 వ్యయం జరిగింది.
అనగా 2020 – 1630 = 390 రూపాయలు తేడా వచ్చింది.
అనగా అవే వస్తువులకు అదే పరిమాణానికి అదనంగా 390 రూపాయలు చెల్లించవలసి వచ్చింది.

ప్రశ్న 13.
ఈ కింది వాక్యాలలో తప్పొప్పులను గుర్తించండి. (AS1)
జవాబు:
అ. ద్రవ్యోల్బణం ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచుతుంది. (తప్పు)
ఆ. ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తిలోని మార్పు ఆ ద్రవ్యం విలువను తెలుపుతుంది. (ఒప్పు)
ఇ. జీవన వ్యయంలో వచ్చిన మార్పు పెన్షనర్ల జీవన ప్రమాణంపై ఎటువంటి ప్రభావం చూపదు. (తప్పు)
ఈ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డి.ఎ. ను పెంచడం ద్వారా ద్రవ్యోల్బణం నుండి వారు మినహాయింపు పొందుతారు. (ఒప్పు)
ఉ. వినియోగ వస్తువుల ధరలలో వచ్చిన మార్పులను మాత్రమే టోకు ధరల సూచిక లెక్కిస్తుంది. (ఒప్పు)

ప్రశ్న 14.
పారిశ్రామిక వస్తువుల టోకు ధరల సూచికలు ఈ కింది పట్టికలో ఇవ్వబడ్డాయి. వీటి ద్వారా రేఖాపటం గీసి, కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. (AS3)
AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం 2
AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం 3
అ. గత కొన్ని సంవత్సరాలుగా ఏ వస్తువుల ధరలు నిలకడగా పెరుగుతున్నాయి?
జవాబు:
ఎరువులు, సిమెంట్, ధరలు నిలకడగా పెరుగుతున్నాయి.

ఆ. నూలు వస్త్రం, ఎరువుల ధరలు నెమ్మదిగా పెరగడానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
నూలు వస్త్రం, ఎరువుల ధరలు నెమ్మదిగా పెరగడానికి గల కారణాలు :

  1. నూలు వస్త్రం, ఎరువుల వాడకంలో ఒక్కసారిగా వేగవంతంగా మార్పురాదు.
  2. నూలు వస్త్రం, ఎరువుల ఉత్పత్తి కూడా ఒక్కసారిగా పడిపోదు.
  3. అందువలన నూలు వస్త్రం, ఎరువుల ధరలు నెమ్మదిగా పెరుగుతాయి.

ఇ. పై వస్తువుల విషయంలో ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకుందా? ఎలా?
జవాబు:

  1. వస్తువుల ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.
  2. వస్తువుల కొరత ఏర్పడినపుడు విదేశాల నుండి దిగుమతి చేసుకుని వాటిని మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లాంటి సహకార సంఘాల ద్వారా అందిస్తుంది.
  3. ఎప్పుడైనా వ్యాపారులు అక్రమ నిల్వల ద్వారా కృత్రిమ కొరతను సృష్టిస్తే ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.

ప్రశ్న 15.
ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమ నిర్వహణకై సలహాలను సూచిస్తూ మీ తహశీల్దారుకు ఒక లేఖ రాయండి. (AS6)
జవాబు:

తహశీల్దారుకు ఉత్తరం

To:
తహశీల్దార్ వార్కి
సాలూరు.
విజయనగరం.

From:
టి. అప్పారావు
సాలూరు.
అయ్యా

విషయం : ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమ నిర్వహణకై తమ సహకారానికై సూచనలు.

పేద ప్రజల ఆహార భద్రతకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమైన పథకం ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS – Public Distribution System). ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం నిత్యావసర వస్తువులైన గోధుమలు, బియ్యం , పంచదార, వంట నూనెలు సకాలంలో మాకు అందడం లేదు. ప్రతి నెల 1వ తేదీ నాటికి సరకులు డీలర్ల ద్వారా అందించేందుకు ముందు నెలాఖరు. నాటికి డి.డి.లు పూర్తి చేసి మొదటి వారానికి పంపిణీ జరిగేటట్లు చేయవలెను. చాలా మంది డీలర్లు అక్రమ నిల్వలను చీకటి మార్కెట్లో విక్రయిస్తున్నారు, నిరోధించగలరు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందజేయు సరకులు నాణ్యతగా ఉండడం లేదు. కొన్ని సందర్భాలలో అవి అనారోగ్యం తెచ్చి పెడుతున్నాయి.

పై సూచనలు, సలహాలు ప్రజలందరివిగా భావించి, వాటిని సరిదిద్ది ప్రజా పంపిణీ వ్యవస్థను దిగ్విజయం చేయ ప్రార్థన.

ఇట్లు
టి. అప్పారావు.

9th Class Social Studies 10th Lesson ధరలు – జీవనవ్యయం InText Questions and Answers

9th Class Social Textbook Page No.121

ప్రశ్న 1.
రేపు ఉపాధ్యాయ దినోత్సవం అనుకోండి. మీ తరగతిలోని విద్యార్థులు ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుటకు, నీకు రూ. 200 ఇచ్చి స్వీట్లు, బిస్కెట్లు తెమ్మని మార్కెట్ కు పంపించారు అని అనుకుందాం. మార్కెట్లో ధరలను చూస్తే ఒక స్వీట్ ప్యాకెట్ ధర రూ. 60, బిస్కట్ ప్యాకెట్ ధర రూ. 20 ఉంది. నీవు రెండు స్వీట్ ప్యాకెట్లు కొన్నచో, మిగతా డబ్బులతో ఎన్ని బిస్కట్ ప్యాకెట్లు కొనగలవు? వాటికి ఎంత చెల్లించావు?
జవాబు:
మొత్తం తీసుకెళ్ళినది – రూ. 200
ఒక స్వీట్ ప్యాకెట్ ధర – రూ. 60
రెండు స్వీట్ ప్యాకెట్ల ధర – 2 × 60 = రూ. 120
బిస్కెట్ ప్యాకెట్ ధర – రూ. 20
రెండు స్వీట్ ప్యాకెట్లు కొనగా మిగిలినది – 200 – 120 = 80 రూపాయలు
80 రూపాయలకు ప్యాకెట్ 20 రూ. చొప్పున కొనగా నాలుగు బిస్కెట్ ప్యాకెట్లు వస్తాయి. అనగా
4 × 20 = 80 రూపాయలు
కావున 200 రూపాయలకు కొని తెచ్చినది.
AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం 4

ప్రశ్న 2.
నీవు పాఠశాలకు తిరిగి వచ్చిన తర్వాత, మీ తరగతి విద్యార్థులు “ఎందుకు ఇన్ని తక్కువ ప్యాకెట్లు కొని తెచ్చావు ? ప్రతిది ఐదు ప్యాకెట్లు తీసుకురావల్సింది.” అని అన్నారు.
జవాబు:
అప్పుడు నేను ప్రతిది ఐదు ప్యాకెట్లు తీసుకురావడానికి నేను తీసుకెళ్ళిన 200 రూపాయలకు 2 స్వీట్ ప్యాకెట్లు మరియు 4 బిస్కెట్ ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి.
రేట్లు పెరిగాయి అని నేను పై వివరాలు తెలిపాను.

ప్రశ్న 3.
అందుకుగాను, నీవు స్వీట్లు బిస్కెట్ ప్యాకెట్ల ధరల గురించి చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. మీ తరగతిలో ఒకరు ఈ విధంగా అన్నారు. “గత సంవత్సరం మనం స్వీటు ప్యాకెట్‌కు రూ. 30, బిస్కెట్ ప్యాకెట్‌కు రూ. 10 చెల్లించాం కదా.”
జవాబు:
గత సంవత్సరం ధరలతో పోలిస్తే ఈ సంవత్సరం రేట్లు రెట్టింపు అయ్యాయి. అందువలన 2 స్వీట్ ప్యాకెట్లు, 4 బిస్కెట్ ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి. కారణం రేట్లు రెట్టింపు కావడమే.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 4.
గత సంవత్సర కాలంలో ఏమి జరిగింది? రెండు వస్తువుల ధరలు పెరిగాయి. కావున రూ. 200 తో అవే వస్తువులను తక్కువ మొత్తంలో కొనుగోలు చేయాల్సి వస్తుంది.
జవాబు:
గత సంవత్సరంలో వస్తువుల రేట్లు తక్కువగా ఉన్నాయి.
ఈ సంవత్సరం వస్తువుల రేట్లు గత సంవత్సరంతో పోలిస్తే రెట్టింపు అయ్యాయి.
అందువలన తక్కువ మొత్తంలో వస్తువులను కొనుగోలు చేయాల్సి వచ్చింది.

ప్రశ్న 5.
ఒకవేళ మీ ఉపాధ్యాయులు, ఈ సంవత్సరం 5 స్వీట్స్, 5 బిస్కెట్ ప్యాకెట్లు కొనమంటే, వాటి కోసం మీరు ఎంత చెల్లించాల్సి ఉంటుంది?
జవాబు:

  1. 5 ప్యాకెట్ల స్వీట్స్ కోసం = రూ. 5 × 60 = 300 రూపాయలు
  2. 5 ప్యాకెట్ల బిస్కెట్స్ కోసం = రూ. 5 × 20 = 100 రూపాయలు
  3. నీవు చెల్లించాల్సిన మొత్తం = రూ. 400 రూపాయలు
  4. గత సంవత్సరంతో పోలిస్తే ఎంత ఎక్కువ మీరు చెల్లించాల్సి ఉంటుంది?

గత సంవత్సరం చెల్లించినది :
5 స్వీట్ ప్యాకెట్ల రేటు = 5 × 30 = 150 రూపాయలు
5 బిస్కెట్ ప్యాకెట్ల రేటు = 5 × 10 = 50 రూపాయలు
మొత్తం = 200 రూపాయలు
గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 200 రూపాయలు
అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

డబ్బుతో మనం వాస్తవంగా కొనగలిగిన వస్తుసేవల సంఖ్యను ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి అంటారు. ద్రవ్యోల్బణ కాలంలో వాస్తవ ఆదాయం, ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి పడిపోతుంది. పై ఉదాహరణను బట్టి గత సంవత్సరం ఇవే వస్తువులు ఐదు చొప్పున కేవలం రూ. 200 మాత్రమే చెల్లించారు. కాని ఇప్పుడు మీరు అదే వస్తువులను కొనడానికి . ‘ ఎక్కువ చెల్లించాలి, కాబట్టి మీరు ఈ రెండు రకాల వస్తువులను తక్కువగా కొనుగోలు చెయ్యాల్సి వస్తుంది.

  • గత సంవత్సరం రూ. 200 = 5 స్వీట్ ప్యాకెట్లు + 5 బిస్కెట్ ప్యాకెట్లు
  • ఈ సంవత్సరం రూ. 200 = 2 స్వీట్ ప్యాకెట్లు + 4 బిస్కెట్ ప్యాకెట్లు
  • మరో రకంగా చెప్పాలంటే రూ. 200 లతో చేసే కొనుగోలు శక్తి లేదా డబ్బు విలువ పడిపోయింది. కాబట్టి మీరు అదే డబ్బుతో తక్కువ వస్తువులనే కొనగలిగారు. ఎందుకంటే వాటి ధరలు పెరిగాయి.

9th Class Social Textbook Page No.123

* ప్రతిరోజు క్రమం తప్పకుండా మీ కుటుంబం ఉపయోగించే కొన్ని వస్తువుల లేదా సేవల పేర్లను రాయండి.
ప్రస్తుతం వాటి ధరలను, గత సంవత్సరం అవే వస్తువుల ధరలను పరిశీలించండి. వాటి మధ్య గల తేడా ఏమిటి? . దీనికిగాను మీ తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సహాయం తీసుకోండి.

వాటి మధ్యగల తేడా :
వస్తువుల రేటు గత సంవత్సరపు రేట్లతో పోలిస్తే ఈ సంవత్సరం అన్ని వస్తువుల రేట్లు పెరిగాయి.

కారణం :
ద్రవ్యం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం రేటు పెరగడం, జనాభా పెరగడం, వస్తూత్పత్తి వనరులు జనాభా పెరిగినంత వేగంగా పెరగక పోవడం.

9th Class Social Textbook Page No.126

ప్రశ్న 1.
2005-06లో వరి ధర రూ. 20 కిలో కొంటే 2011లో ఎంత చెల్లించాలి?
2005-06లో కిలో వరి. బియ్యం – 20 రూపాయలు.
2011లో కిలో వరి బియ్యం – 40 రూపాయలు.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 2.
ఏ సంవత్సరంలో పప్పుదినుసుల ధరలు అధికంగా పెరిగాయి?
జవాబు:
2006-07 సంవత్సరంలో పప్పుదినుసుల ధరలు అధికంగా పెరిగాయి.

ప్రశ్న 3.
ప్రత్తి ధరలో ఎంత శాతం పెరుగుదల ఉంది?
జవాబు:
100 శాతం పెరుగుదల ఉంది.

ప్రశ్న 4.
ఏ వస్తువు ధర హెచ్చు, తగ్గులు లేకుండా నిలకడగా ఉంది?
జవాబు:
వంటనూనెలు

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 9th Lesson ద్రవ్య వ్యవస్థ – ఋణం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 9th Lesson ద్రవ్య వ్యవస్థ – ఋణం

9th Class Social Studies 9th Lesson ద్రవ్య వ్యవస్థ – ఋణం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
పేద కుటుంబాలలో చాలా కుటుంబాలు అనియత వనరుల నుండి రుణాలు పొందుతాయి. అనియత రుణాలపై ధనిక కుటుంబాలు చాలా తక్కువగా ఆధారపడతాయి. ఈ వాక్యాలను మీరు సమర్థిస్తారా? మీ సమాధానాన్ని సమర్థించడానికి పేజీ నెం. 114 లోని సమాచారాన్ని ఉపయోగించండి. (AS3)
(లేదా)
భారతదేశంలో నియత, అనియత రుణదాతలు రుణాన్ని అందించే విషయంలో చాలా తేడా ఉంది. నియత రుణ సంస్థలు ప్రభుత్వం, ఆర్.బి.ఐ. రూపొందించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ తమ ఖాతాదారులచే కూడా ఈ నిబంధనలను పాటింపచేస్తారు. కాని అనియత వడ్డీ వ్యాపారులు ఎటువంటి ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా తమ స్వంత పద్ధతులను పాటిస్తారు. రుణగ్రహీతలు తీసుకున్న అప్పును చెల్లించలేకపోయిన పక్షములో నియత రుణదాతలు అప్పును తిరిగి రాబట్టడానికి వారిపై ఎటువంటి చట్టపరమైన చర్యనైనా చేపడతారు. కాని అనియత రుణదాతలు అప్పును తిరిగి రాబట్టడానికి చట్టవ్యతిరేక మరియు ఎటువంటి చర్యనైనా చేపడతారు. ఈ కారణాల వలన అప్పుడప్పుడు రుణగ్రహీతలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నియత రుణ సంస్థలతో పోలిస్తే అనియత రుణదాతలు అధిక వడ్డీ రేటు వసూలు చేస్తున్నారు.

బ్యాంకులు, సహకార సంస్థలు అధికంగా రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీని వలన ఎక్కువ మంది తక్కువ వడ్డీకి రుణాలు పొంది “అధిక ఆదాయాన్ని పొందగల్గుతారు. వారు పంటలను పండించగల్గడం, వ్యాపారం చేయడం, చిన్న తరహా పరిశ్రమలను స్థాపించడం మొదలగునవి చేయగలుగుతారు. ప్రతి ఒక్కరికి తక్కువ వడ్డీ రేటు, అప్పును తిరిగి చెల్లించే సామర్థ్యం వంటివి కల్గించడం దేశాభివృద్ధికి ప్రధాన అంశాలుగా పనిచేస్తాయి.
ప్రశ్న : “ధనిక కుటుంబాల వారు నియత రుణదాతల నుండి స్వల్ప వడ్డీకి రుణాలు పొందుతుండగా, పేదకుటుంబాల వారు అనియత రుణదాతలకు అధిక వడ్డీ చెల్లించవలసి వస్తున్నది” వ్యాఖ్యానించండి.
జవాబు:
నియత రుణాలు :
1. బ్యాంకుల ద్వారా, సహకార సంస్థల ద్వారా పొందే రుణాలు :
అనియత రుణాలు :
1. వడ్డీ వ్యాపారస్థులు, వర్తకులు, యజమానులు – బంధువులు, స్నేహితులు ద్వారా పొందే రుణాలు. పేద కుటుంబాలలో చాలా కుటుంబాలు అనియత వనరుల నుండి రుణాలు పొందుతాయి. అనియత రుణాలపై ధనిక కుటుంబాలు చాలా తక్కువగా ఆధారపడతాయి. ఈ వాక్యాలను నేను సమర్థిస్తాను.

కారణం :
పేద కుటుంబాల వారికి బ్యాంకుల గురించిన సమాచారం అంతగా తెలియదు. బ్యాంకులలో జరిగే లావాదేవీలు కూడా పేద కుటుంబాల వారికి తెలియదు. బ్యాంకులు అంటే ధనికులకు
చెందినవి వారి అపోహ.

పైగా బ్యాంకుల ద్వారా ఋణాలు ఇవ్వడానికి పుచీకత్తులు’ అడుగుతారు అవి పేద కుటుంబాల వారి వద్ద ఉండవు. అందువలన ప్రైవేటు వ్యాపారస్తులను నమ్ముకుని వారి వద్ద మోసపోతారు.

పట్టిక – 1 ను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది.
బ్యాంకులను ఎవరు వినియోగించుకుంటున్నారంటే…..
జీతం తీసుకునే ఉద్యోగులు,
పంటలు బాగా పండించే పెద్ద రైతులు,
వ్యాపారం చేసే వ్యాపారస్థులు,
బ్యాంకులలో డబ్బులు దాచుకుంటూ ఉండగా

బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్న వారు, కార్లు కొనుక్కునేవారు. ట్రాక్టర్లు కొనుక్కునేవారు, ఎరువులను కొనుగోలు చేసేవారు, ఇళ్లు కట్టుకునేవారు. వీరంతా ధనికులు. అందువలన బ్యాంకులావాదేవీలు అన్నియు నిర్వహించేవారు ఎక్కువగా ధనికులు మాత్రమే.

పేదవారు బ్యాంకులు వద్దకు వెళ్ళకుండానే ప్రైవేటు వ్యక్తుల వద్ద రుణాలు పొందుతూ ఉంటారు.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 2.
రుణాలపై అధిక వడ్డీరేట్లు ఎందుకు హానికరం? (AS1)
జవాబు:
రుణాలపై అధిక వడ్డీరేట్లు హానికరం ఎందుకు అనగా –

  1. ఒక్కొక్కసారి మనం తీసుకున్న దానికన్నా వడ్డీ అధికం అవుతుంది.
  2. మొత్తం తిరిగి చెల్లించాలంటే అది రుణగ్రహీతలకు భారం అవుతుంది.
  3. రుణం ద్వారా పొందిన ప్రయోజనం కన్నా రుణగ్రహీతలకు వడ్డీ చెల్లించే భారం అధికం అవుతుంది.
  4. వడ్డీ రేట్లు అధికంగా ఉండటం వలన రైతులు తమ పంటలు పాడైపోతున్నా చూస్తూ ఉంటారు. కానీ రుణాలు తీసుకుని వాటికి తగిన చర్యలు చేపడదాము అని అనుకోరు. అందువలన వడ్డీరేట్లు ప్రజలకు అందుబాటులో ఉంటే ధనాన్ని వడ్డీకి తీసుకుని అభివృద్ధికరమైన పనులు చేయడానికి వారికి అవకాశం ఏర్పడుతుంది.

ప్రశ్న 3.
పేదల కోసం గల స్వయం సహాయక బృందాల ప్రధాన ఉద్దేశం ఏది? మీ సొంత వాక్యాల్లో వివరించండి. (AS4)
జవాబు:
పేదవారికి రుణాలు అందజేయడానికి కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు.

  1. పేదవారిని సమీకృతం చేయడం
  2. ముఖ్యంగా స్త్రీలకోసం, వారు పొదుపు చేసే డబ్బును సేకరించడం.
  3. దీనికోసం స్వయం సహాయక బృందాలను ఏర్పాటుచేసి నిర్వహించడం.
  4. ప్రతి స్వయం సహాయక బృందంలో 15 నుండి 20 మంది ఒకే ప్రాంతానికి చెందినవారు సభ్యులుగా ఉంటూ నిరంతరం కలుస్తూ, వారి డబ్బును పొదుపు చేస్తారు.
  5. ప్రతి ఒక్కరూ 25 రూ||ల నుండి 100 లేదా అంతకన్నా ఎక్కువ వారి వారి సామర్థ్యాలను బట్టి పొదుపు చేస్తారు.
  6. సభ్యుల్లో ఎవరికైనా రుణం అవసరమైతే తమ బృందం నుండి అందరూ కలసి దాచుకున్న సొమ్ము నుండి అప్పుగా పొందవచ్చు.
  7. బృంద సభ్యులు అప్పు తీసుకున్న వారి నుండి వడ్డీ వసూలు చేస్తారు.
  8. ఈ వడ్డీ వ్యాపారులు వసూలు చేసే వడ్డీలకన్నా తక్కువగా ఉంటుంది.
  9. 1 లేదా 2 సం||రాల పాటు బృందంలోని సభ్యులందరూ క్రమం తప్పకుండా పొదుపు చేస్తే వారికి రుణం పొందే అర్హత వస్తుంది.
  10. బ్యాంకులతో ఉండే ఈ సంబంధం అందరికీ ఇచ్చే రుణాల మొత్తాన్ని పెంచడానికి దోహదపడుతుంది.
  11. బృందం పేరుమీద బ్యాంకులు రుణాలను అందజేస్తాయి.
  12. అదే విధంగా బృందాలు తీసుకున్న అప్పును అందరు కలసి తిరిగి చెల్లించే హామీని బ్యాంకులకు ఇస్తాయి.
  13. రుణాలను పొందడం, డబ్బును పొదుపు చేయడం వంటి విషయాలను బృందం చర్చించి నిర్ణయిస్తుంది.
  14. ఎవరైనా సభ్యులు అప్పును సరిగా చెల్లించకపోతే ఆ విషయాన్ని బృందమే పర్యవేక్షిస్తుంది. ఈ ఏర్పాట్ల వలన పేద మహిళలకు బ్యాంకులు పూచీకత్తు లేకుండానే రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయి.

ప్రశ్న 4.
బ్యాంకర్ తో మాట్లాడి పట్టణ ప్రాంత ప్రజలలో ఎవరు ఎక్కువ రుణాలు ఎందుకోసం పొందుతారో తెలుసుకోండి. (AS3)
జవాబు:
బ్యాంకుల నుండి పట్టణ ప్రాంత ప్రజలలో ఎక్కువ రుణాలు పొందుతున్న వారు:

  1. వ్యాపారస్థులు
  2. పారిశ్రామికవేత్తలు
  3. ప్రభుత్వ ఉద్యోగస్థులు
  4. ఆర్థికవేత్తలు

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 5.
స్వయం సహాయక బృందాల ద్వారా వచ్చే రుణానికి, బ్యాంక్ ద్వారా వచ్చే రుణానికి తేడాలేమిటి? (AS1)
జవాబు:

  1. స్వయం సహాయక బృందాల ద్వారా వచ్చే రుణాలు సమష్టిగా ఉంటాయి. అదే విధంగా బృందాలు తీసుకున్న అప్పును అందరు కలిసి తిరిగి చెల్లించే హామీని బ్యాంకులకు ఇస్తాయి.
  2. రుణాలను పొందడం, డబ్బును పొదుపు చేయడం వంటి విషయాలను బృందం చర్చించి నిర్ణయిస్తుంది.
  3. రుణాలు షరతులను బృందమే నిర్ణయిస్తుంది.
  4. అప్పును తిరిగి చెల్లించడం బృందం సభ్యులందరి సమిష్టి బాధ్యత.
  5. ఎవరైనా సభ్యులు అప్పును సరిగా చెల్లించకపోతే ఆ విషయాన్ని బృందమే పర్యవేక్షిస్తుంది. అదే బ్యాంకు ద్వారా వచ్చే రుణాలు బృందాలతో సంబంధం ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. వద్దు అనుకుంటే ఆగిపోవచ్చు. లేదా చెల్లించాల్సి వచ్చినప్పుడు చెల్లించవచ్చు. అనగా వ్యక్తిగత రుణాలు ఆ వ్యక్తి యొక్క అవసరాలను బట్టి ఉంటాయి.

ప్రశ్న 6.
పేజీ నెం. 115 లోని స్వయం సహాయక బృందాల ……. గురించి ఉన్న మూడవ పేరా చదివి ఈ కింది ప్రశ్నకు జవాబు రాయండి. (AS2)
మీ ప్రాంతంలో స్వయం సహాయక బృందాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి?
(లేదా)
“స్వయం సహాయక బృందాలు గ్రామీణ, పట్టణ పేద ప్రజలకు కేంద్రంగా పనిచేస్తాయి. మహిళలు స్వయంకృషితో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మాత్రమే కాకుండా వివిధ సామాజిక సమస్యలైన ఆరోగ్యం, పోషణ, గృహహింస మొదలైన వాటిని చర్చించి సరియైన చర్యలు తీసుకునే వేదికగా కూడా స్వయం సహాయక బృందాల సమావేశాలు తోడ్పడతాయి.” పై అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా? మీ జవాబును వివరించండి.
జవాబు:
మా ప్రాంతంలోని స్వయం సహాయక బృందాలు పనిచేసే విధానం :

  1. స్వయం సహాయక బృందాలలోని సభ్యులు రుణాలను పొంది స్వయం ఉపాధిని పొంది స్వయం ఉపాధిని ఏర్పరచుకుంటున్నారు.
  2. బృంద సభ్యులు చిన్న చిన్న మొత్తాలను రుణాలుగా పొందుతారు.
  3. ఉదా:- పూచీకత్తుగా ఉంచిన భూమిని తిరిగి పొందడం, పెట్టుబడులను సంపాదించడం. (ఉదా: విత్తనాలు, ఎరువులు, ముడిసరుకులు, బట్టలు, నగలు కొనుగోలు మొదలైన వాటికి)
  4. గృహోపకరణాల కొనుగోలు నిమిత్తం, కుట్టుమిషన్, మగ్గం, పశువులు మొదలగు ఆస్తుల సంపాదన కోసం రుణాలు పొందుతారు.
  5. స్వయం సహాయక బృందాలు గ్రామీణ, పట్టణ పేదప్రజలకు కేంద్రంగా పనిచేస్తాయి.
  6. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మాత్రమేకాక వివిధ సామాజిక సమస్యలైన ఆరోగ్యం, పోషణ, గృహహింస – మొదలయిన వాటిని చర్చించి సరియైన చర్యలు తీసుకునే విధంగా కూడా స్వయం సహాయక బృందాలు పనిచేస్తున్నాయి.

ప్రశ్న 7.
రైతుల అవసరాలు తీర్చడంలో బ్యాంకులు అందజేసే సేవలు ఏమిటి?
జవాబు:
రైతుల అవసరాలను తీర్చడంలో బ్యాంకులు అందజేసే సేవలు ప్రముఖపాత్ర వహిస్తున్నాయి. పూర్వ కాలంలో అవసరాలకి, ప్రస్తుత కాల వ్యవసాయ అవసరాలకి చాలా తేడా కన్పిస్తుంది. పూర్వ కాలంలో వ్యవసాయానికి కావలసిన ఉత్పాదకాలలో చాలా వాటిని రైతులే స్వయంగా సమకూర్చుకునే వారు. సొంత పశువులనే పొలం దున్నడానికి, ఇంటి మనుషులే వ్యవసాయ కూలీలుగా తమ పొలంలో పండిన పంటనే విత్తనాలుగా, తమ పశువుల కొట్టం నుండే ఎరువులను తయారు చేసుకోవడం మొదలైన పనులు చేసేవారు. నవీన వ్యవసాయ పద్ధతులకు అధికమైన ధనం అవసరం.

విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు కొనడం కోసం అలాగే పొలం దున్నడం, విత్తనాలు నాటడం, పంటకోత కోయడం మొదలైన వ్యవసాయ పనులు చేసే యంత్రాల కోసం, కూలీల జీతాల కోసం ఎక్కువ డబ్బు అవసరం. దీనికి అనుగుణంగా బ్యాంకులు, రైతుల అవసరాలకు తగ్గట్లు, కాలానుగుణంగా ఋణాలు అందించి, వ్యవసాయ పురోభివృద్ధికి, రైతుల అవసరాలు తీర్చడంలో బ్యాంకులు ముందుంటున్నాయి.

9th Class Social Studies 9th Lesson ద్రవ్య వ్యవస్థ – ఋణం InText Questions and Answers

9th Class Social Textbook Page No.105

ప్రశ్న 1.
డిమాండ్ డిపాజిట్లను నగదుగా ఎందుకు పరిగణిస్తారు?
జవాబు:

  1. డిమాండ్ డిపాజిట్లు నగదు, యొక్క వివిధ లక్షణాలకు దారితీస్తుంది.
  2. నగదుకు బదులుగా చెక్కుల రూపంలో లేదా వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా చెల్లింపులు జరుగుతాయి.
  3. కరెన్సీ నోట్లు మొదలైన వివిధ నగదు రూపాల లాగానే ఈ డిపాజిట్ల ద్వారా జమచేసిన డబ్బును తిరిగి తీసుకోవడం లేదా చెల్లింపులు జరపటం లాంటి విషయాలను నగదు రూపంలో గాని, చెక్కుల రూపంలోగాని చేయవచ్చు.
  4. చెల్లింపులు జరపడంలో డిమాండ్ డిపాజిట్లు అధిక ,వినియోగం వలన అధునిక ఆర్థిక వ్యవస్థలో ఇవి కరెన్సీ, నగదుకు ప్రతిరూపంలో ఉన్నాయి. ప్రస్తుత కాలంలోని డబ్బు యొక్క వివిధ రూపాలైన కరెన్సీ, డిపాజిట్లు ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థతో దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 2.
బ్యాంక్ డిపాజిట్లను కూడా ప్రభుత్వం బీమా చేస్తుంది. వివరాలు సేకరించండి.
జవాబు:
ప్రతి బ్యాంక్ తన డిపాజిట్ దారుల తరఫున “డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్” కు ఇన్సూరెన్స్ చేస్తుంది. ఏదైనా విపత్కర పరిస్థితులలో బ్యాంకు మూసివేయవలసి వస్తే ఒక లక్ష రూపాయలవరకు డిపాజిట్ దారులకు బీమా లభిస్తుంది. ప్రజలకు బ్యాంకులపై నమ్మకం కలుగచేయుటకొరకు బ్యాంక్ డిపాజిట్లను కూడా ప్రభుత్వం బీమా చేస్తుంది.

ప్రశ్న 3.
బ్యాంకులలో జమ చేసే ఫిక్స్ డిపాజిట్లు నగదు లాగా పనిచేస్తాయి. చర్చించండి.
జవాబు:

  1. బ్యాంకులలో దాచుకొనే డబ్బుకు, ఫిక్స్ డిపాజిట్లకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది.
  2. వివిధ లావాదేవీలపై అనుమతిస్తూ, ప్రజలకు బ్యాంకులపై నమ్మకం కలిగిస్తుంది.
  3. ఫిక్స్ డిపాజిట్లపై ఎప్పుడు కావాలంటే అప్పుడు ఋణాలను వెంటనే పొందవచ్చు. వాటిని తిరిగి చెల్లించవచ్చు. లేక నిర్ణీతకాలం అయిన తరువాత రుణమును మినహాయించి తిరిగి మొత్తం సొమ్మును పొందవచ్చును. అందువలన ఫిక్స్ డిపాజిట్లు కూడా నగదు లాగా పనిచేస్తాయి.

9th Class Social Textbook Page No.107

ప్రశ్న 4.
డిపాజిట్ దారులందరు ఒకేసారి బ్యాంకు నుండి తమ డబ్బును తిరిగి ఇవ్వవలసినదిగా కోరితే ఏమౌతుంది?
జవాబు:

  1. ఏమీ జరగదు. కారణం బ్యాంకు స్థాపించబోయే ముందు కొంత పైకమును రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియాకు డిపాజిట్ గా చెల్లించాలి. మరియు బ్యాంకులు వ్యాపారం చేస్తూ ఉంటాయి కాబట్టి లాభాల బాటలోనే నడుస్తాయి.
  2. బ్యాంకులు డిపాజిట్ చేసిన మొత్తం కన్నా ఎక్కువగా డిపాజిట్లను సేకరించరాదు.
  3. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టిన షరతులను అంగీకరించి డిపాజిట్ల పరిధి ఎక్కువగా ఉండరాదు.
  4. అందువలన డిపాజిట్ దారులు ఒకేసారి డిపాజిట్ చేసిన సొమ్ము మొత్తము అడిగినా బ్యాంకులు ఇవ్వగలవు.

ప్రశ్న 5.
బ్యాంకు నుండి రుణం తీసుకున్న వ్యక్తితో మాట్లాడండి. రుణాన్ని ఏ అవసరానికి తీసుకున్నాడో బ్యాంకు వారిని ఏ విధంగా కలిసాడో తెలుసుకోండి?
జవాబు:

  1. బ్యాంకు నుండి రుణం తీసుకున్న సుమ అనే వ్యక్తితో మాట్లాడాను.
  2. ఆమె రుణాన్ని ఇల్లు నిర్మించడానికి తీసుకున్నది.
  3. ఆమె ఎలా రుణాన్ని తీసుకుంది అనగా ముందుగా బ్యాంకు మేనేజర్ గారి వద్దకు వెళ్ళి నేను ఇల్లు నిర్మించదలచాను. నేను ప్రభుత్వ ఉద్యోగిని అని చెప్పి రుణం ఇవ్వమని అడిగాను అంది.
  4. ఆ తరువాత ఆమెను డిఫ్యూటి మేనేజర్ హోదాలో ఉన్న ఒక ఆఫీసర్ దగ్గరకు పంపగా ఆయన రుణం ఇవ్వడానికి ఏమి కావాలో చెప్పారు.
  5. కావలసినవి :
    1. జీతమునకు సంబంధించిన వివరాలతో కూడిన సర్టిఫికెట్
    2. ఇంటి స్థలమునకు చెందిన రిజిస్ట్రేషన్ పత్రం.
    3. న్యాయపరమైన అర్హత గల పత్రము.
    4. ఆ స్థలమును ఎవరికీ అన్యాక్రాంతము చేయలేదని రుజువు చేసే పత్రం.
    5. సంబంధిత అధికారుల చేత ఇల్లు నిర్మించుకోవటానికి కావలసిన అనుమతి పత్రం.
    6. ఇంజనీరు చేత రూపొందించబడిన ఇంటి నిర్మాణం యొక్క ఆకృతి పత్రము వంటివి తీసుకువచ్చి బ్యాంకువారికి అప్పగించిన తరువాత పై అధికారులు వాటిని పరిశీలించిన తరువాత రుణమును పొందవచ్చును అని చెప్పారని ఆమె తెలియపరిచినది.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 6.
బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడి వారు ఏ ఏ రుణాలు ఇచ్చారో ఏ ఏ వాటికి రుణాలు ఇవ్వకూడదో చర్చించండి.
జవాబు:
1. బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడితే ఆయన ఇవ్వవలసిన రుణాలను గురించి, ఇవ్వకూడని రుణాలను గురించి వివరించి చెప్పారు.

ఇవ్వవలసిన రుణాలు :

  1. వ్యక్తిగత రుణాలు,
  2. ఇళ్లు నిర్మించడానికి రుణాలు,
  3. కార్లు కొనుగోలు చేయడానికి రుణాలు,
  4. గృహోపకరణాలు కొనుగోలు చేయడానికి,
  5. చదువుకోడానికి,
  6. రైతులకు సంబంధించినవి,
  7. వ్యాపారులకు సంబంధించినవి,
  8. పారిశ్రామికవేత్తలకు సంబంధించినవి.

ఇవ్వకూడని రుణాలు :

  1. ఒకసారి తనఖా పెట్టిన తరువాత మరల తనఖా పెట్టవలసి వస్తే వాటిని పరిశీలించాలి.
  2. దివాళా తీసిన వారికి
  3. స్థిర నివాసం లేనివారికి ఋణాలను ఇవ్వరాదు.

ప్రశ్న 7.
ప్రజలు వారి డబ్బును బ్యాంకులలోనే కాకుండా ఇతర సంస్థలైన గృహ సముదాయ సంస్థలు, కంపెనీలు పోస్టాఫీసు పథకాలు మొదలైన వాటిలో కూడా జమ చేస్తారు. బ్యాంక్ డిపాజిట్ల కన్నా ఇవి ఏ విధంగా విభిన్నమో చర్చించండి.
జవాబు:

  1. బ్యాంక్ డిపాజిట్లలో కరెంట్ డిపాజిట్లు, ఫిక్స్ డిపాజిట్లు వంటి రకరకాల డిపాజిట్లు ఉంటాయి.
  2. ఇతర సంస్థలలో నిర్ణీత కాలపరిమితి ననుసరించి డిపాజిట్లు ఉంటాయి.
  3. వడ్డీ రేట్లలలో కూడా తేడాలుంటాయి.
  4. వాటిని బ్యాంకులలో హామీగా చూపించి రుణాలు పొందవచ్చును.
  5. ఇతర సంస్థల యందు లావాదేవీలు సులభంగా ఉంటాయి. చిన్న చిన్న మొత్తాలలో కూడా పొదుపు చేయవచ్చును. ఆ విధంగా పొదుపుచేసిన మొత్తం ఒకేసారి పొందవచ్చును.
  6. బీమా సంస్థలలో పొదుపు చేసేటప్పుడు పొదుపు చేసే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే తదుపరి పొదుపు చేయవలసిన అవసరం లేకుండానే ఆ మొత్తం పొదుపు డబ్బును పొందవచ్చును.
  7. బ్యాంకులలో అయితే ఆ విధంగా ఉండదు. అందువలన బ్యాంక్ కార్యకలాపాలకు, ఇతర బీమా, గృహ సముదాయ పోస్టాఫీసు పథకాలకు కొంత వ్యత్యాసం ఉంది.

9th Class Social Textbook Page No.108

ప్రశ్న 8.
కింది పట్టికను పూరించండి.
జవాబు:

అలీషా స్వప్న
రుణాలు ఎందుకవసరం? చెప్పులు తయారీదారుడు. పట్టణంలో పెద్ద వ్యాపారస్థుడు నెలరోజుల సమయంలో 3 వేల జతల షూస్ తయారుచేసి ఇవ్వమని ఆర్డర్ ఇచ్చాడు. గడువు లోపల ఇచ్చిన పని పూర్తి చేయడానికి పేస్టింగ్ గ్రీజు పూయడం, స్టిచ్చింగ్ (చెప్పులు కుట్టడం) మొ||న పనుల కోసం, మరి కొంత మంది పని వారికి నియమించుకోవాలి. ఇంకా చెప్పుల తయారీకి కావలసిన ముడి సరుకులు కొనాలి అందువలన అప్పు చేశాడు. స్వప్న ఒక చిన్న రైతు. తన 3 ఎకరాల భూమిలో వేరుశనగను పండిస్తుంది. పంట పండిన తరువాత వచ్చే డబ్బుతో తను అప్పును తీర్చవచ్చు అనే ఆశతో పంటకయ్యే ఖర్చును వ్యాపారస్థుని నుండి అప్పుగా పొందింది.
రుణం తీసుకోవడం వలన ఎటువంటి హాని జరగవచ్చు? అలీషా అనుకున్న సమయంలో చెప్పులుకుట్టి వ్యాపారస్థునికి ఇచ్చాడు. కాబట్టి లాభం పొందాడు. వేసిన పంట చీడకు గురైనందువలన ఏ విధమైన ఆదాయం రాకపోగా పెట్టిన పెట్టుబడి వృథా అయినది. అందువలన నష్టపోయి అప్పు తీర్చలేని పరిస్థితి ఎదురైంది.
ఫలితమేమిటి? లాభం పొందడం నష్టాలలో చిక్కుకోవడం, కష్టాలలో పడిపోవడం జరిగింది.

ప్రశ్న 9.
అలీషాకు వరుసగా ప్రతి సంవత్సరం ఆర్డర్లు వస్తే ఆరు సంవత్సరాల తరువాత అతను ఎటువంటి స్థితికి చేరుతాడు?
జవాబు:

  1. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటాడు.
  2. తరువాత ఆర్డర్లు వచ్చిన అప్పు తీసుకునే అవకాశం ఉండదు.
  3. చిన్న కుటీర పరిశ్రమ లాంటి దానిని స్థాపించడానికి అవకాశం ఉంటుంది.
  4. దానిలో అతను మాత్రమే ఉపాధి పొందడం కాక ఇతరులకు ఉపాధి కల్పిస్తాడు.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 10.
స్వప్న నష్టాల స్థితికి చేరడానికి కారణాలు ఏవి? కింది అంశాలను చర్చించండి.
క్రిమి సంహారక మందులు, వడ్డీవ్యాపారుల పాత్ర, శీతోష్ణస్థితి.
జవాబు:
1. క్రిమిసంహారక మందులు :
ఉపయోగించిన ఈ మందుల వల్ల చీడపోవడం లేదు – కారణం నాణ్యత లోపం, కలీ మందుల వ్యాపారం వంటివి. అందువలన రైతు నష్టపోవడం జరుగుతుంది.

2. వడ్డీ వ్యాపారుల పాత్ర :
రైతులకు అధిక వడ్డీలకు రుణాలను ఇచ్చి పంటలు పండిన తరువాత తమకు అమ్మమనే షరతు పెడతారు. తక్కువ రేటుకు కొంటారు. ఎక్కువ రేటుకు అమ్ముకుంటారు. ఆ విధంగా వారు రెండు విధాలుగా లబ్ధి పొందుతారు.

3. శీతోష్ణస్థితి :
పంటలు పండటానికి వాతావరణం అనుకూలించాలి. అందుకే భారతీయ రైతు ఋతుపవనాలతో జూదం ఆడతాడు అంటారు. సకాలంలో వర్షాలు పడి పంటలు పండితే రైతు గెలిచినట్లు, పడవలసిన సమయంలో వర్షాలు పడక పడరాని సమయంలో వర్షాలు పడి అనావృష్టి, అతివృష్టి వంటి పరిస్థితులు ఏర్పడితే నష్టపోవాల్సి ఉంటుంది. అందువలన రైతులపై ప్రభావం చూపే ప్రధాన అంశాలుగా క్రిమిసంహారక మందులను, వడ్డీ వ్యాపారులను, శీతోష్ణస్థితి వంటి అంశాలను పేర్కొనవచ్చు.

9th Class Social Textbook Page No.109

ప్రశ్న 11.
ప్రజలు అనేక సామాజిక, సాంస్కృతిక విషయాల కోసం రుణాలు తీసుకుంటారు. వివాహ సమయాలలో చేసే అధిక ఖర్చుల కోసం వధూవరుల ఇద్దరి కుటుంబాలు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ ప్రాంతంలోని ప్రజలు చేసే అప్పులకు ఇతర కారణాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? మీ పెద్దలు, ఉపాధ్యాయుల నుండి సమాచారాన్ని సేకరించి తరగతిలో చర్చించండి.
జవాబు:
ఇతర కారణాలు ఉన్నాయి. అవి :

  1. అప్పటికే అప్పులలో ఉండటం,
  2. పంటలు సరిగా పండక అప్పులు తీర్చకపోవడం,
  3. ఆభరణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం,
  4. కట్న, కానుకలకు అప్పులు చేయడం,
  5. తామే గొప్పగా కనిపించాలి అని అనుకోవడం,
  6. అనారోగ్య పరిస్థితులకు లోనుకావడం వంటి అంశాల వలన కూడా అప్పులు చేస్తారు.

9th Class Social Textbook Page No.110

ప్రశ్న 12.
రుణదాతలు అప్పు ఇవ్వడానికి ఎందుకు పూచీకత్తును అడుగుతారు?
జవాబు:

  1. అప్పు తీసుకునేవారు తమ సొంత ఆస్తులైన భూమి, భవనాలు, వాహనం, పశుసంపద, బ్యాంకులలో డిపాజిట్లు మొదలైన వాటిని పూచీకత్తుగా చూపిస్తారు.
  2. ఇవన్నీ అప్పు పూర్తిగా తీర్చే వరకు రుణదాతకు హామీగా ఉపయోగపడతాయి.

ప్రశ్న 13.
అప్పు తీసుకోవడంలో పూచీకత్తు పేదవారిపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది?
జవాబు:

  1. అప్పు తీసుకోవడంలో పూచీకత్తు ప్రధానపాత్ర పోషిస్తుంది.
  2. పూచీకత్తు లేకపోతే ఎవరూ వడ్డీకి ఇవ్వడానికి ముందుకు రారు.
  3. ఒకవేళ ఇచ్చినా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారు.
  4. పేదవారిని తమ వద్ద పనిచేయమని ఒత్తిడి చేస్తారు.
  5. తక్కువ కూలీ ఇస్తారు. తప్పనిసరి పరిస్థితులలో వారు చెప్పే షరతులకు అంగీకరించాల్సి ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 14.
సరియైన సమాధానమును ఎంచుకొని ఖాళీలను పూరించండి.
అప్పు తీసుకునేటప్పుడు రుణగ్రహీతలు సులభమైన షరతుల కోసం ఎదురుచూస్తారు. దీని అర్థం ……….. (అధిక / అత్యల్ప) వడ్డీరేటు, ………….. (సులభమైన / కష్టమైన) షరతులతో కూడిన చెల్లింపులు, ……………….. (తక్కువ / ఎక్కువ) సంఖ్యలో చూపాల్సిన పూచీకత్తుగా ఉపయోగపడే ఆస్తులు.
జవాబు:
అత్యల్ప, సులభమైన, తక్కువ.

9th Class Social Textbook Page No.111

ప్రశ్న 15.
పై ఉదాహరణలలో రుణం పొందడానికి ఉపయోగపడే వనరుల జాబితాను రాయండి.
జవాబు:

  1. భూమికి సంబంధించిన వివరాల పత్రం.
  2. పండిన పంటను దాచినట్లు చూపే పత్రం.

ప్రశ్న 16.
అందరికీ రుణం తక్కువ వడ్డీ రేటుతో లభిస్తుందా? ఎవరెవరికి లభిస్తుంది?
జవాబు:
అందరికీ రుణం తక్కువ వడ్డీకి లభించదు.

ఎవరికి లభిస్తుంది అనగా : పంట పొలాలున్న రైతులకు, వ్యాపారస్థులకు, పారిశ్రామికవేత్తలకు, ఇటీవలికాలంలో ఏర్పడిన స్వయం సహాయక బృందాలకు, పండిన పంటలను గోదాములలో దాచినట్లు చూపే హామీపత్రాలు ఉన్న రైతులకు తక్కువ వడ్డీ రేట్లకు బ్యాంకులు రుణాలు అందిస్తాయి.
సరియైన సమాధానం వద్ద (✓) గుర్తును ఉంచండి.
అ. కాలం గడిచే కొద్దీ రమ చేసిన అప్పు
– పెరుగుతుంది. (✓)
– స్థిరంగా ఉంటుంది.
– తగ్గుతుంది.

ఆ. బ్యాంకు నుండి రుణం పొందిన కొద్ది మందిలో అరుణ్ కూడా ఒకడు. దీనికి కారణం
– అతను విద్యావంతుడు.
– బ్యాంకు అడిగే పూచీకత్తును ప్రతి ఒక్కరూ సమర్పించలేరు. (✓)
– వడ్డీ వ్యాపారులు, బ్యాంకులు విధించే వడ్డీరేటు ఒక్కటే.
– బ్యాంకు రుణం పొందుటకు ఎటువంటి దస్తావేజులు (పత్రాలు) అవసరం లేదు.

ప్రశ్న 17.
మీ ప్రాంతంలోని కొందరిని కలిసి మీ దగ్గర ఉన్న రుణ ఏర్పాట్ల వివరాలు సేకరించండి. రుణ షరతులలో ఉన్న తేడాలను నమోదు చేయండి.
జవాబు:
నమ్మకం కలిగిన వ్యాపారస్థుల నుండి, భూస్వాముల నుండి బ్యాంకులు ఏ విధమైన హామీలు లేకపోయినా పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయి.

అదే పేదవారు అయితే బ్యాంకులకు నమ్మకం ఉండదు. అందువలన వారినీ పూచీకత్తులు అడుగుతాయి.

పూచీకత్తులు చూపించిన తదుపరి రుణాలను అందజేస్తాయి.

ప్రశ్న 18.
శివకామి, అరుణ్, రమ, వాసులకు సంబంధించిన కింది వివరాలు పట్టికలో నింపండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం 1

9th Class Social Textbook Page No.114

ప్రశ్న 19.
నియత, అనియత వనరుల నుండి పొందే రుణాలలో గల భేదాలు ఏవి?
జవాబు:

  1. ధనిక కుటుంబాలు తక్కువ వడ్డీతో నియత రుణాలను పొందుతూ ఉంటే పేద కుటుంబాలు అధిక వడ్డీతో అనియత రుణాలను పొందుతున్నారు.
  2. అనగా నియత వనరులు ధనికులకు అందుబాటులో ఉన్నాయి. పేదలకు అందుబాటులో లేవు.
  3. నియత వనరులు తక్కువ వడ్డీరేటుకు లభిస్తాయి. అనియత వనరులకు ఎక్కువ వడ్డీరేటు ఉంటుంది.
  4. నియత వనరులు బ్యాంకులు ద్వారా, సహకార సంస్థల ద్వారా పొందే రుణాలు.
  5. అనియత వనరులు వడ్డీ వ్యాపారస్థుల ద్వారా, వర్తకుల ద్వారా, యజమానుల ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా పొందే రుణాలు.

ప్రశ్న 20.
ప్రతి ఒక్కరికి సముచితమైన వడ్డీ రేట్లతో ఉన్న రుణాలు ఎందుకు అందుబాటులో ఉండాలి?
జవాబు:

  1. పేదవారు అనియత రుణాలపై ఆధారపడటం వలన ఒక్కొక్కసారి తీసుకున్న మొత్తం సొమ్ము కన్నా వడ్డీ ఎక్కువగా ఉంటుంది.
  2. దానితో వారు తిరిగి చెల్లించడానికి చాలా ఇబ్బంది పడతారు. అందువలన వడ్డీరేటు ఎల్లప్పుడు తక్కువగా ఉండాలి.
  3. వడ్డీరేటు తక్కువగా ఉండే రుణాలు నియత రుణాలు. అనగా బ్యాంకులు, సహకార సంస్థలు ఇచ్చేవి.
  4. అందువలన నియత వనరుల రుణాలు మరిన్ని ప్రదేశాలకు విస్తరించి ప్రతి ఒక్కరూ పొందేలా ఉండాలి.
  5. దానితో పేదప్రజలు తక్కువ వడ్డీపై రుణాలను పొందగలుగుతారు.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 21.
ఆర్.బి.ఐ లాగానే అనియత రుణాలకు పర్యవేక్షణాధికారి ఉండాలా? ఈ పని ఎందుకు కష్టతరం?
జవాబు:

  1. ఆర్.బి.ఐ లాగానే అనియత రుణాలకు పర్యవేక్షణాధికారి ఉండాలి. కానీ చాలా కష్టం.
  2. ఎందుకంటే అనియత రుణాలు ఎవరు ఇచ్చారు? ఎవరు తీసుకున్నారు? అనేది వివాదాస్పదం అయితే తప్ప ఎవరికీ తెలియదు.
  3. ఏ వడ్డీ వ్యాపారస్థుడైనా లేదా ఏ ధనవంతుడైనా మేము ఇంత పైకము వడ్డీకి ఇచ్చాము అని సమాచారాన్ని ఎవరికీ చెప్పరు.
  4. అంతేకాక ఆ లావాదేవీలన్నీ అనధికారికంగా జరుగుతాయి. అధికారికంగా వెల్లడి చేయరు.
    అందువలన పర్యవేక్షణాధికారి ఉండలేరు.

ప్రశ్న 22.
ఆంధ్రప్రదేశ్ రైతుల నిస్పృహకు పేదవారికి నియత రుణాలు తక్కువగా అందడం కూడా ఒక కారణమా? చర్చించండి.
జవాబు:

  1. అవును, అదీ ఒక కారణమే ఎందుకో మన ప్రభుత్వం చెప్పినంతగా బ్యాంకులు వ్యవసాయదారులకు రుణాలు ఇవ్వడం లేదు.
  2. వ్యవసాయం చేసే వారిలో ఎక్కువ మంది కౌలు రైతులు ఉండటం, వారికి యజమాన్యపు హక్కు లేకపోవడం వలన వారికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదు.
  3. దానితో వారు నిరాశ నిస్పృహలతో ప్రయివేటు వ్యక్తులను ఆశ్రయించి ఎక్కువ వడ్డీకి రుణాలను పొందవలసి వస్తున్నది.

9th Class Social Textbook Page No.115

ప్రశ్న 23.
బ్యాంకు నుండి పొందే రుణానికి స్వయం సహాయక బృంద సభ్యురాలిగా పొందే రుణానికి గల భేదాలు ఏమిటి?
జవాబు:

  1. బ్యాంకు నుండి పొందే రుణం వ్యక్తిగతం. :
  2. స్వయం సహాయక బృంద సభ్యురాలుగా పొందే రుణం సమష్టిది.
  3. బ్యాంకు నుండి రుణాన్ని వ్యక్తిగతంగా ఎప్పుడైనా తిరిగి చెల్లించవచ్చు.
  4. స్వయం సహాయక బృంద సభ్యురాలుగా పొందే రుణం సభ్యులందరితో కలసి సమష్టిగా చెల్లించాలి.
  5. బ్యాంకు నుండి పొందేది వ్యక్తిగత బాధ్యత. 6. స్వయం సహాయక బృందం పొందేది సమష్టి బాధ్యత.

ప్రశ్న 24.
కొన్ని స్వయం సహాయక బృందాలు’ వారి సభ్యులు తీసుకునే రుణాలకు అధిక వడ్డీని వసూలు చేస్తాయి. ఈ చర్య సరియైనదేనా? చర్చించండి.
జవాబు:

  1. సరియైనది కాదు ఎందువలననగా అన్ని స్వయం సహాయక బృందాలూ ఒకే రకమైన వడ్డీలు వసూలు చేయాలి.
  2. అందరీ పట్లా సమానత పాటించాలి.
  3. ఏ విధమైన వ్యత్యాసం చూపించరాదు.
  4. దానితో వారిలో ఆత్మస్టెర్యం పెరిగి ధైర్యంతో కొత్త కొత్త పనులు చేయడానికి, నూతన ఉత్పత్తులు చేయడానికి ముందుకు వస్తారు.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 25.
స్వయం సహాయక బృందాల సమాఖ్య యొక్క పాత్ర ఏమిటి?
జవాబు:

  1. స్వయం సహాయక బృందాలు గ్రామీణ, పట్టణ పేదప్రజలకు కేంద్రంగా పనిచేస్తాయి.
  2. మహిళలు స్వయం కృషితో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మాత్రమే కాకుండా వివిధ సామాజిక సమస్యలైన ఆరోగ్యం , పోషణ, గృహ హింస మొదలైన వాటిని చర్చించి సరియైన చర్యలు తీసుకునే వేదికగా కూడా స్వయం సహాయక బృందాల సమావేశాలు తోడ్పడతాయి.

ప్రాజెక్టు

మీ ప్రాంతంలో ఏ రైతు అయినా ఆత్మహత్య చేసుకున్నాడా? అయితే దానికి కారణాలను తెల్సుకొని ఒక రిపోర్టు తయారు చేసి, వార్తాపత్రికలలో దీనికి సంబంధించిన వార్తలను సేకరించి మీ తరగతి గదిలో చర్చించండి.

మా ప్రాంతంలో ఒకప్పుడు రామయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణం అప్పట్లో అనావృష్టి పరిస్థితి ఏర్పడి ఆరుగాలం శ్రమించి కష్టపడి వేసుకున్న పంట చేతికి రాక ఎండిపోతే దానికి పెట్టిన పెట్టుబడి తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

రిపోర్టు :

అయ్యా,
న్యూస్ పేపర్ మేనేజర్ గారికి
మా ప్రాంతంలో ఒకప్పుడు తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితి నెలకొన్నది. వర్షాలు లేక నదులు ఎండిపోయి కాలువల ద్వారా నీరు రాక బావులలో సైతం ఊటలేక ‘చెరువులు ఎండిపోయి తత్ఫలితంగా పొలాలలో వేసిన పంటలు ఎండిపోయి, రైతులు పెట్టిన పెట్టుబడి రాక కుమార్తె పెండ్లి కుదుర్చుకొని పంట పండితే వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో కుమార్తెకు కట్నకానుకలు ఇచ్చి వివాహం చేద్దామనికొని నిర్ణయించుకున్న రామయ్య అనే రైతు చివరికి పెట్టిన పెట్టుబడి కూడా రాక వేసిన పంట ఎండిపోవడం చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి మేనేజర్ గారు దీనిని వార్తా పత్రికలయందు ప్రచురించి ఇలాంటి నిర్ణయాలు ఎవరిని తీసుకోవద్దు, బ్రతికి ఉంటే ఈ సంవత్సరం పంట పండకపోయిన వచ్చే సంవత్సరం పండుతుంది. ప్రభుత్వం ‘ఈసారి ముందుగానే పరిస్థితిని అంచనావేసి తగిన నిర్ణయాలు తీసుకొని చక్కని ప్రణాళికను రూపొందించి రైతులను ఆదుకుంటుంది, ప్రకృతి సహకరిస్తుంది’ అని రైతులకు తెలియజేయండి. వారిలో మనో ధైర్యాన్ని నింపండి.

ఇట్లు,
రామతేజ,
9వ తరగతి.

AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు

9th Class Social Studies 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
1. ‘సేవా కార్యకలాపాలు’ అంటే ఏమిటి? (AS1)
జవాబు:

  1. సేవా కార్యకలాపాలు వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాలకు అవసరమైనటువంటివి.
  2. సేవా కార్యకలాపాలు ఉత్పత్తి చేసే సేవలు వరి లేక వస్త్రం లాగా కంటికి కనిపించవు. అయినప్పటికి వీరు ఒక ప్రత్యేకమైన సేవలను తమ పనుల ద్వారా ప్రజలకు, వ్యాపారాలకు అందిస్తారు.
  3. ఇక్కడ సేవ అనేది చేసిన పని స్వభావాన్ని తెలుపుతుంది.
  4. సేవ అనేది వస్తువు యొక్క ఉత్పత్తికి భిన్నమైనది.
    ఉదా : ఆసుపత్రిలో వైద్యులు చేసేది సేవ
    కిరాణాషాపులో వ్యాపారి చేసేది సేవ
    సంస్థలో అకౌంటెంట్ చేసేది సేవ
    వ్యా న్ డ్రైవర్ చేసేది సేవ
    బ్యాంకులు, రవాణా రంగాలు చేసేవి సేవలు.

ప్రశ్న 2.
ఏవైనా ఐదు సేవా కార్యకలాపాలమ రాసి, అవి ఎందుకు వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాల కిందికి రావో కారణాలు తెలపండి. (AS1)
జవాబు:
ఐదు సేవా కార్యకలాపాలు
1. వైద్యం :
వైద్యులు ఆసుపత్రిలో రోగులను పరీక్షించి, మందులను సూచించి వారి ఆరోగ్య పరిస్థితులను సమీక్షిస్తారు.

2. వ్యాపారం :
వస్తువులను సూల్ సేల్ దుకాణాల నుండి కొనుగోలు చేసి వినియోగదారులకు విక్రయించడం.

3. అకౌంటెంట్ :
ఖాతాలను పరిశీలించడం, చెల్లింపులను రశీదులను సరిచూసుకుంటూ ఆ బిల్లులు, ఖాతాలకు అనుకూలంగా ఉన్నాయో లేదో సరిచూడటం. ప్రతి యొక్క వ్యాపార సంస్థకు ఖాతాలను రాయడం, నిర్వహించడం.

4. డ్రైవర్ :
ఆటోలలో, వ్యా న్లలో ప్రయాణికులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరవేయడం. సరకులను కూడా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరవేయడం.

5. ప్రభుత్వ పరిపాలన :
గ్రామాలు, నగర పంచాయతీలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా అందించే ప్రజాసేవలన్నీ పరిపాలన వర్గానికి చెందుతాయి.
ఉదా : పోలీసులు, గ్రామ పరిపాలనాధికారులు మొదలయినవారు.

పైన పేర్కొన్న వారు అందిస్తున్న సేవలు రైతులు, వ్యవసాయ కూలీలు, పరిశ్రమలలో పనిచేసే వారి పనులకు భిన్నంగా ఉన్నాయని మనం గమనించవచ్చు.
6. వీరు ఉత్పత్తి చేసే సేవలు వరి లేక వస్త్రం లాగా కంటికి కనిపించవు.

7. అయినప్పటికి వీరు ఒక ప్రత్యేకమైన సేవలను తమ పనుల ద్వారా ప్రజలకు, వ్యాపారాలకు అందిస్తారు.

8. ఇక్కడ సేవ అనేది చేసిన పని స్వభావాన్ని తెలుపుతుంది.

9. సేవ అనేది వస్తువు యొక్క ఉత్పత్తికి భిన్నమైనది.

AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

ప్రశ్న 3.
దేశ సమగ్రాభివృద్ధికి సేవా కార్యకలాపాలు ఎలా తోడ్పడతాయి? (AS1)
జవాబు:

  1. సేవా కార్యకలాపాలనేవి వ్యవసాయం లేదా పరిశ్రమలలో తయారవుతున్నట్లు వస్తువును ఉత్పత్తి చేయవు.
  2. ఇవి వ్యవసాయానికి, పరిశ్రమలకు, ప్రజలకవసరమైన ఎన్నో సేవలను చేస్తూ ఒక ప్రత్యేకమైన రీతిలో సహాయం చలాయి.
  3. రవాణ సమాచార సాధనాలు, బ్యాంకులు మొదలైన రంగాలు అభివృద్ధి చెందడం వలన వ్యవసాయక ఉత్పత్తులకు, పారిశ్రామిక ఉత్పత్తులకు ఉపయోగించడం మాత్రమేకాక వస్తువుల సరఫరాకు తగిన ఆర్థిక వనరులు అందించుటకు తద్వారా వాటి అభివృద్ధికి కారకాలు అవుతాయి.
  4. ప్రజలు మెరుగైన ఆదాయాలు ఆర్జించినపుడు వారి వినియోగ వ్యయంలో కూడా మార్పులు వస్తాయి.
  5. వారు ఎక్కువగా సేవాసంబంధమైన కార్యకలాపాలైన విద్య, వినోదం, ఆహారం, పర్యాటకం పైన ఎక్కువ ఖర్చు చేయడానికి ఆసక్తి చూపుతారు. అభివృద్ధికి అది ఒక చిహ్నం.

ప్రశ్న 4.
వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాలు సేవలతో ఎలా ముడిపడి ఉన్నాయి? (AS1)
జవాబు:

  1. సేవలు అనేవి వ్యవసాయానికి, పరిశ్రమలకు, ప్రజలకు అనేకానేక అవసరాలకు ఒక ప్రత్యేకమైన రీతిలో సహాయపడతాయి.
  2. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ కు తరలించడంలో, వీటిని కొంతమంది వ్యక్తుల సమూహం కొని వినియోగదారులకు నేరుగా లేదా రైస్ మిల్లులు, నూనె మిల్లులు వంటి ఇతర ఉత్పత్తిదారులకు అమ్మడం జరుగుతుంది.
  3. ఇవి అన్నీ సేవాసంస్థలైన రవాణా, వాణిజ్య, కార్యకలాపాల ద్వారా జరుగుతాయి.
  4. పారిశ్రామిక కార్యకలాపాలకు పట్టణాలలో, నగరాలలోని సిమెంట్ వ్యాపారులకు రైల్వేల ద్వారా సిమెంట్ కర్మాగారాల నుండి సిమెంట్ సంచులు రవాణా కాకపోతే భవన నిర్మాణాలు ఎలా జరుగుతాయి?
  5. కావున వ్యవసాయక, పారిశ్రామిక కార్యకలాపాలన్నీ సేవలపైనే ఆధారపడి ఉన్నాయి.

ప్రశ్న 5.
సేవారంగం పెరుగుదల సుస్థిరమైనది మరియు అది భారతదేశాన్ని ఒక ధనిక దేశంగా చేస్తుంది. ఈ వ్యాఖ్యతో నీవు ఏకీభవిస్తావా? విశదీకరించండి. (AS2)
జవాబు:

  1. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో అభివృద్ధికి ప్రోత్సాహమనేది ఎన్నో వ్యవస్థాపక సౌకర్యాలతో ముడిపడి ఉంటుంది.
  2. ఇది అవస్థాపన సౌకర్యాలు, ఇతర సేవల విస్తరణను కలిగి ఉంటుంది.
  3. రవాణా సమాచార సాధనాలు, బ్యాంకులు మొదలైన విలువైన సేవల తరహాలోనే సేవా కార్యకలాపాల విలువ కూడా – పెరగాలని ఆశించడం సహజం.
  4. భారతదేశంలో ఉద్యోగాలు చేసే వారిలో 1/4వ వంతు సేవాకార్యకలాపాలే కలిగి ఉన్నారు.
  5. సేవాకలాపాల ఉద్యోగాలు ప్రజల జీవన స్థాయిలో పురోభివృద్ధికి ఒక కారణం.
  6. ప్రజలు మెరుగైన ఆదాయాలు ఆర్జించినపుడు వారి వినియోగ వ్యయంలో కూడా మార్పులు వస్తాయి.
  7. వారు ఎక్కువగా సేవా సంబంధమైన కార్యకలాపాలైన విద్య, వినోదం, ఆహారం, పర్యాటకం పైన ఎక్కువ ఖర్చు చేయడానికి ఆసక్తి చూపుతారు.

అందువలన సేవారంగం సుస్థిర వృద్ధి భారతదేశాన్ని ఒక ధనిక దేశంగా చేస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

ప్రశ్న 6.
సేవారంగం కార్యకలాపాలు ఎందుకు ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి? (AS1)
జవాబు:
సేవారంగ కార్యకలాపాలు ప్రాముఖ్యత సంతరించుకోవడానికి ప్రధాన కారణాలు :

  1. మారుతున్న పరిస్థితులకనుగుణంగా సమాచార, సాంకేతిక విజ్ఞానంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.
  2. మానవ జీవితం యాంత్రికమైనది.
  3. రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది.
  4. సుదూర ప్రాంతాలను అతి తక్కువ సమయంలో చేరడానికి గాను, ఇంటర్నెట్, గ్లోబల్ విలేజ్ వంటి వాటి ద్వారా మానవ సమాజం చేరువైనది.
  5. అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులోనికి వచ్చాయి.
  6. అనేక రకాలుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి.

ప్రశ్న 7.
వ్యవసాయం, పరిశ్రమలు లేకుండా సేవా కార్యకలాపాలను ఒక స్థాయిని దాటి విస్తరించలేం. వివరించండి. (AS1)
జవాబు:

  1. ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగం, ద్వితీయ రంగమైన పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితే తృతీయ రంగం సత్వర, సుస్థిర ప్రగతిని సాధిస్తుంది.
  2. ఆర్థిక వ్యవస్థ అనే ఇరుసుకు రెండు చక్రాల వంటివి వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు. వీటి వలన ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుంది.
  3. ఉత్పాదక సామర్థ్యం. ఉన్న చోట సేవారంగం సుస్థిర ప్రగతి సాధిస్తుంది.
  4. ప్రజలు మెరుగైన ఆదాయాలు పొందాలంటే వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందాలి. అప్పుడు వారి వినియోగ వ్యయంలో మార్పులు వచ్చి సేవాకార్యకలాపాలైన విద్య, వినోదం, ఆహారం, పర్యాటకం వంటి వాటిపై ” ఖర్చు చేయడానికి ఆసక్తి చూపుతారు.
  5. అందువల్ల వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందడం వల్ల సేవాకార్యకలాపాలు ఒకస్థాయిని దాటి విస్తరించగలవు.

ప్రశ్న 8.
భారతదేశంలో చదువుకున్నవారి నిరుద్యోగితను సేవారంగం ఎలా తగ్గించగలదు? (AS1)
జవాబు:

  1. సాంకేతిక పరిజ్ఞానంలో నిరంతర మార్పు ,సేవారంగాన్ని ముందుకు నడిపిస్తుంది.
  2. వ్యాపార నిర్వహణలో పొరుగు సేవల ద్వారా కొత్త తరహా ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువతకు కల్పిస్తోంది.
  3. టెలికమ్యూనికేషన్ల అనుసంధానాన్ని ఉపయోగించుకొని ఉద్యోగులు తాము ఉన్న చోటునుండి ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారికైనా తమ సేవలను అందిస్తున్నారు.
  4. ప్రధాన నగరాలలో స్థాపించబడిన ఎన్నో ఐ.టి. సంస్థలు అత్యంత నిపుణులైన ఇంజనీర్లకు ఉద్యోగాలు కల్పించి ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ సేవలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలకు అందిస్తున్నాయి. వారికి ఇతర దేశాల నుండి ప్రాజెక్టులు వస్తాయి.
  5. వినోద పరిశ్రమ, వార్తా ప్రసార సంస్థలు, కేబుల్ టెలివిజన్ ఛానల్ లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి.
  6. పట్టణాలలో, నగరాలలో ఇంటర్ నేట్ కేఫీలు, పబ్లిక్ టెలిఫోన్ బూత్ లు సర్వసాధారణంగా కన్పిస్తాయి.
  7. సాధారణంగా వాణిజ్య ప్రకటనల రంగం కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు తీసుకువచ్చింది.

ప్రశ్న 9.
మీ ప్రాంతం నుండి ఎవరైనా పనివారు వలస వెళ్లారా? వారు ఎందుకు వలస వెళ్లారో కారణాలు తెలుసుకోండి. (AS3)
జవాబు:

  1. మా ప్రాంతం నుండి వలస వెళ్ళినవారు ఉన్నారు.
  2. వారు వివిధ రకాల పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళినారు.
  3. ఉన్నత చదువులు చదువుకుని ఉన్నత ఉద్యోగాల కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళినారు.
  4. అలాగే పనిపాటలు చేసుకునే వివిధ రకాల పనులు కోసం వలస వెళ్ళినారు.
  5. కూలి పనులు చేసుకునేవారు మా ప్రాంతంలో పని ఉన్నప్పుడు ఉండి పని లేని సమయంలో వేరే ప్రాంతాలకు వలస వెళ్ళి పనులు పూర్తయిన తదుపరి ప్రాంతానికి వస్తారు.

ప్రశ్న 10.
ఈ పాఠంలోని 9వ పేరా చదవండి (సేవా కార్యకలాపాలనేవి వ్యవసాయం….) ఈ కింది ప్రశ్నకు సమాధానం వ్రాయండి. వ్యవసాయం, పరిశ్రమలకు అవసరమైన, సేవా కార్యకలాపాలు ఏమిటి?
జవాబు:

  1. రోడ్లు, రైలు, జల, వాయు మార్గాలు అనగా రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయాలి.
  2. వైద్య, విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం
  3. గిడ్డంగి సౌకర్యాలను కల్పించడం.
  4. రుణ సదుపాయాలను కల్పించడం.
  5. వ్యాపార సౌకర్యాలను ఏర్పాటుచేయడం.

ప్రశ్న 11.
పేజీ నెం. 104లోని పటాన్ని పరిశీలించి భారతదేశ అవుట్ లైన్ పటంలో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కులు గల నగరాలను గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు 2

9th Class Social Studies 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు InText Questions and Answers

9th Class Social Textbook Page No.97

ప్రశ్న 1.
ఈ కింద ఎనిమిది రకాల సేవా కార్యకలాపాలు ఇవ్వబడ్డాయి. కొన్ని వివరాలు నింపి మిగిలినవి వదిలేయబడ్డాయి. మీ ఉపాధ్యాయుడితో చర్చించి ఆ ఖాళీలను పూరించండి.
జవాబు:
1. విద్య : సంస్థలు :
పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాలు, సాంకేతిక విద్యాసంస్థలు ఈ కోవకు చెందుతాయి. ఈ సంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, పరిపాలన సిబ్బంది, వారి కార్యకలాపాలు సేవలను అందిస్తాయి.

2. ఆరోగ్య, వైద్య సేవలు :
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా జనరల్ ఆసుపత్రులు, వివిధ రకాలైన వైద్య కేంద్రాలు, వృద్ధాశ్రమాలు మొ||నవి.

3. వర్తకం :
మన చుట్టూ చూస్తున్న వివిధ రకాల టోకు (సూల్ సేల్) చిల్లర వ్యాపార కార్యకలాపాలు, జాతీయ, అంతర్జాతీయ వ్యాపారం మొదలైనవి.

4. ప్రభుత్వ పరిపాలన :
గ్రామీణ, నగర పంచాయితీలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ద్వారా అందించే ప్రజాసేవలన్నీ ఈ . వర్గానికి చెందుతాయి. ఉదా: పోలీస్ స్టేషన్లో పనిచేసే వ్యక్తులు, వివిధ ప్రభుత్వ విభాగాలలో చేస్తున్న వ్యక్తులు అంటే గ్రామ పరిపాలనాధికారులు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్, తహసీల్దార్లు అన్ని రకాల న్యాయస్థానాలలో పనిచేయువారు, . అసిస్టెంట్లు, క్లలు, అకౌంటెంట్లు, టైపిస్టులు, ఫ్యూన్లు, డ్రైవర్లు మొదలగువారు.

5. రక్షణ రంగం :
త్రివిధ దళాలకు చెందిన సైనిక,నావిక, వైమానిక దళాలలో పనిచేయు వ్యక్తులు, వారి కార్యకలాపాలు ఈ కోవకు చెందుతాయి. బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ పోలీసుల సేవల వంటివి కూడా వస్తాయి.

6. విత్త కార్యకలాపాలు :
బ్యాంకులు, వివిధ పొదుపు పథకాలు, తపాలా తంతి – వ్యవస్థ, జీవిత బీమా సంస్థ మొ||నవి.

7. వ్యక్తిగత సేవలు :
ఇళ్లలో పనిచేయు పనివారు, బట్టలు ఉతుకువారు, శుభ్రపరిచేవారు, అద్దకం సేవలు, క్షురకులు, బ్యూటీపార్లర్ నడిపేవారు, టైలరింగ్ పనివారు, ఫోటో, వీడియో స్టూడియోలో పనిచేయువారు.

8. ఇతర రకాల కార్యకలాలు :
వినోదం, సమాచార సాంకేతిక పరిశ్రమలు – చిత్ర నిర్మాణం, టీవీ సీరియళ్లలో పని చేయువారు. వార్తాపత్రికలు, టివి ఛానళ్లలో, వాణిజ్య ప్రకటన సంస్థలు, మీడియాలో పనిచేసేవారి పనులు కూడా సేవలకు చెందుతాయి.

9th Class Social Textbook Page No.100

ప్రశ్న 2.
1991 నుండి 2010 వరకు కొన్ని ప్రధాన తరగతులలో వివిధ సేవా కార్యకలాపాలలో పనిచేసే వారి సంఖ్యను (లక్షలలో) ఈ కింది పట్టిక చూపుతుంది. ఈ పట్టికను జాగ్రత్తగా చదివి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు 1
1) 2010 సంవత్సరంలో ఏ సేవా కార్యకలాపం అత్యధిక ఉద్యోగితను కల్పించింది?
జవాబు:
సామాజిక, సాంఘిక, వ్యక్తిగత సేవలు.

2) గత సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య పెరిగిందా లేదా తగ్గిందా? ఈ కాలంలో ఏ రకమైన ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించింది?
జవాబు:
గత సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గింది. విత్త, బీమా సంస్థలు, స్థిరాస్తి వ్యాపారం మొదలగునవి మాత్రం 11.9 నుంచి 14.1 కి పెరిగాయి.

3) ప్రైవేటు సేవాకార్యకలాపాల్లో ప్రజలు ఎటువంటి ఉద్యోగాలను పొందగలిగారు?
జవాబు:
ప్రైవేట్ ఉద్యోగాల సంఖ్య పెరిగింది.

టోకు వర్తకం, చిల్లర వర్తకం, రవాణా గిడ్డంగులు, సమాచార రంగం, విత్త, బీమా సంస్థలు, స్థిరాస్తి వ్యాపారం మొదలైన వాటిల్లోనూ,

సామాజిక, సాంఘిక, వ్యక్తిగత సేవలు వంటి అంశాలలో ఉద్యోగాలు పెరిగాయి.

4) ప్రభుత్వ, ప్రైవేట్ వ్యవస్థలో కల్పిస్తున్న ఉద్యోగాలకు మధ్య ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా? చర్చించండి.
జవాబు:

  1. టోకు వర్తకం, చిల్లర వర్తకం వంటి అంశాలలో ‘ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కువగా ఉండగా
  2. రవాణా గిడ్డంగులు, సమాచార రంగం వంటి అంశాలలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా ఉండి, ప్రైవేట్ ఉద్యోగాలు తక్కువగా ఉన్నాయి.
  3. విత్త, బీమా సంస్థలు, స్థిరాస్తి వ్యాపార రంగాలలో ఒకప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కన్నా తక్కువగా ఉండగా ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల కన్నా ప్రైయివేట్ ఉద్యోగాల సంఖ్య పెరిగింది.
  4. సామాజిక, సాంఘిక, వ్యక్తిగత సేవల రంగాలలో ప్రైవేట్ ఉద్యోగాలకన్నా ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి.

9th Class Social Textbook Page No.101

ప్రశ్న 3.
చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై మీ అభిప్రాయం ఏమిటి? ఈ సమస్యను చక్కదిద్దడానికి ప్రభుత్వం ఏమైనా చేయగలుగుతుందా?
జవాబు:

  1. మా అభిప్రాయం ఏమనగా వీటి వల్ల లాభాలు, నష్టాలు ఉన్నాయి.
  2. మొత్తం మీద చూస్తే నష్టాల కంటే లాభాలే ఎక్కువ అని అంటారు.
  3. అంతేకాక కాలక్రమంలో మొదట్లో నష్టపోయిన వాళ్లు కూడా లాభపడతారు.
  4. పెద్ద, మధ్యతరగతి రైతులు ప్రారంభంలో ఎక్కువ లాభపడతారని, చిన్న రైతులు లేదా భూమి లేని కూలీలు నష్టపోతారని పేర్కొంటారు.
  5. అయితే పెద్ద సూపర్ మార్కెట్ల కొనుగోళ్ల వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరిగి తత్ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది.
  6. దీని వల్ల కూలీలకు గిరాకీ పెరిగి క్రమంగా వ్యవసాయ కూలీ రేట్లు పెరుగుతాయి.

ఈ సమస్యను చక్కదిద్దడానికి ప్రభుత్వం చేపట్టే అంశాలు :

  1. ఆధునిక నిల్వ సౌకర్యాలను ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తుంది.
  2. మార్కెట్ కొద్ది చేతులలో కేంద్రీకృతం కాకుండా చూస్తుంది.
  3. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎప్పటికప్పుడు తన పర్యవేక్షణలో పెడుతుంది.

9th Class Social Textbook Page No.102

ప్రశ్న 4.
భారతదేశంలో విదేశీ కంపెనీలు చిల్లర దుకాణాలను ఏర్పరచడంపై మీ అభిప్రాయం ఏమిటి?’ అవి భారతదేశంలో ఉపాధి కల్పనకు ఏ విధంగా దోహదం చేస్తాయి?
జవాబు:
భారతదేశంలో విదేశీ కంపెనీలు సరకులు అమ్మడానికి చిల్లర దుకాణాలను ప్రారంభించడం జరిగింది.

  1. కాలక్రమంలో ఈ విదేశీ పెట్టుబడి కంపెనీలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి తక్కువ ధరలకు తమ సరకును అమ్మే విధంగా రైతులపై ఒత్తిడి తెస్తాయి.
  2. సరైన నిల్వ సౌకర్యాలు లేని కారణంగా వ్యవసాయ ఉత్పత్తులలో 20 – 40% వృథా అవుతున్నాయి.
  3. విదేశీ చిల్లర వ్యాపారస్తులు కూడా రైతులతో ఒప్పందం కుదుర్చుకొని వడ్డీ వ్యాపారస్తుల కంటే తక్కువ వడ్డీకి అప్పులు సమకూర్చవచ్చు.
  4. మెరుగైన నిల్వ సౌకర్యాల కారణంగా బహుళజాతి కంపెనీలు పెద్ద మొత్తంలో సరకు కొనుగోలు చేయడంతో రైతులకు వడ్డీ వ్యాపారస్తులతో పోలిస్తే ఇది ప్రయోజనకారిగా ఉంటుంది.
  5. వీటి వలన ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఎంతో మందికి ఉపాధి కల్పించడానికి అవకాశాన్ని ఏర్పరచుతాయి.

AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

ప్రశ్న 5.
మీ ప్రాంతంలోని కొంతమంది చిల్లర వ్యాపారస్తులతో మాట్లాడండి. విదేశీ చిల్లర దుకాణాలపై వాళ్ల అభిప్రాయాలు గురించి తరగతిలో చర్చించండి.
జవాబు:

  1. బహుళజాతి సంస్థలు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం వలన వారు తక్కువ రేటుకు అమ్మినప్పటికి వారికి నష్టాలు రావు.
  2. అందువల్ల చిన్న దుకాణదారులు అమ్మే రేట్లతో పోలిస్తే తక్కువ రేట్లకు అమ్ముతారు.
  3. దానితో వినియోగదారులు చిన్న దుకాణాదారుల వద్దకు వెళ్ళకుండా చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల షాపులకు వెళ్తారు.
  4. దానితో చిల్లర దుకాణదారులు తమ షాపులను మూసివేయాల్సి వస్తుంది.
  5. వాటిపై ఆధారపడినవారు ఉపాధిని కోల్పోతారు.
  6. నిల్వ సౌకర్యాల్లో పెద్ద పెద్ద చిల్లర వ్యాపారస్తులు ఆశించినంతగా పెట్టుబడులు పెట్టలేదు.
  7. అందువల్ల సంప్రదాయ చిల్లర వర్తకులు ఉపాధి కోల్పోతారు. దీనివల్ల మార్కెట్ కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతుంది.

ప్రశ్న 6.
రెండు నిలువు వరుసలతో ఒక పట్టిక తయారు చేసి అందులో భారతదేశంలో విదేశీ కంపెనీల చిల్లర దుకాణాల వల్ల కలిగే లాభాలను, నష్టాలను పేర్కొనండి.
జవాబు:

లాభాలు నష్టాలు
1. పెద్ద సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ళ వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరిగి తత్ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల కూలీలకు గిరాకీ పెరిగి క్రమంగా వ్యవసాయ కూలీ రేట్లు పెరుగుతాయి. 1. నిల్వ సౌకర్యాల్లో పెద్ద పెద్ద చిల్లర వ్యాపారస్తులు ఆశించినంతగా పెట్టుబడులు పెట్టలేదు. అందువల్ల సంప్రదాయ చిల్లర వర్తకులు ఉపాది కోల్పోతారు. దీనివల్ల మార్కెట్ కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమవుతుంది.
2. విదేశీ చిల్లర వ్యాపారస్తులు కూడా రైతులతో ఒప్పందం కుదుర్చుకొని వడ్డీ వ్యాపారస్తులు కంటే తక్కువ వడ్డీకి అప్పులు సమకూర్చవచ్చు. 2. విదేశీ పెట్టుబడి కంపెనీలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి తక్కువ ధరలకు తమ సరుకును అమ్మే విధంగా రైతులపై ఒత్తిడి తెస్తాయి.
3. మెరుగైన నిల్వ సౌకర్యం కారణంగా బహుళజాతి కంపెనీలు పెద్ద మొత్తంలో సరకు కొనుగోలు చేయడంతో రైతులకు వడ్డీ వ్యాపారస్తులతో పోలిస్తే ఇది ప్రయోజనకారిగా ఉంటుంది. 3. నిల్వ సౌకర్యాలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా వృథా అయ్యే శాతాన్ని సూపర్ మార్కెట్లు తగ్గిస్తాయనడంలో వాస్తవం లేదు.

ప్రశ్న 7.
భారతదేశంలో మరిన్ని వైద్య విద్యాసంస్థలను నెలకొల్పాల్సిన అవసరం ఏమిటి?
జవాబు:

  1. భారతదేశం ఆరోగ్య రంగంలో 64 లక్షల వృత్తి సేవానిపుణుల కొరతను ఎదుర్కొంటున్నది.
  2. ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 10 లక్షల ఆరోగ్య సంబంధ వృత్తి సేవానిపుణుల కొరత ఉంది.
  3. 2011 లో భారతదేశంలో ప్రతి 10 వేల జనాభాకు ఆరుగురు డాక్టర్లు ఉన్నారు.
  4. అదే నర్సులు, మంత్రసానుల విషయానికొస్తే ప్రతి 10 వేలమందికి 13 మంది ఉన్నారు.
  5. డాక్టరు, జనాభా నిష్పత్తి భారతదేశంలో 0.5 : 1000 కాగా, థాయ్ లాండ్లో 0.3, శ్రీలంకలో 0.4, చైనాలో 1.6, ఇంగ్లాండ్లో 5.4, అమెరికాలో 5.5 గా ఉంది.
  6. దంత సంబంధిత సాంకేతిక విజ్ఞానంలో 20 లక్షల మంది నిపుణుల కొరత ఉంది.
  7. పునరావాస వృత్తి సంబంధిత వృత్తినిపుణులలో 18 లక్షల మంది కొరత ఉంది.
  8. ఆపరేషన్లో మత్తుమందుకు సంబంధించిన నిపుణులు 9 లక్షలమంది కొరత ఉంది.
  9. వివిధ ఆరోగ్య కార్యకర్తలు సంబంధించిన నిపుణులు 9 లక్షలమంది కొరత ఉంది.
  10. వైద్య పరీక్షల సాంకేతిక నిపుణులు 2.4 లక్షల మంది కొరత ఉంది.
  11. ఆపరేషన్ సంబంధిత ఆరోగ్య నిపుణులు – 2 లక్షల మంది కొరత ఉంది.
  12. కంటికి సంబంధించిన కార్యకర్తలు 1.3 లక్షల మంది కొరత ఉంది.

వృత్తి, విద్యా కళాశాలలు, పాఠశాలల కేటాయింపుల్లో అసమానతల వల్ల అన్ని ప్రాంతాలలో సమానంగా లేరు.

అందువల్ల వైద్య, విద్యా సంస్థలను నెలకొల్పవలసిన అవసరం ఎంతైనా ఉంది.

AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

ప్రశ్న 8.
కొత్త వైద్య విద్యా సంస్థలను ప్రభుత్వ రంగంలో నెలకొల్పవచ్చా లేక ప్రైవేట్ రంగంలోనా? ఎందుకు?
జవాబు:
ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోను స్థాపించవచ్చు.

ఎందుకనగా :

  1. ప్రభుత్వరంగంలో స్థాపించడం వలన పేద, మధ్యతరగతికి చెందిన ప్రతిభగల విద్యార్థినీ విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది.
  2. ప్రైవేట్ రంగంలో స్థాపించినప్పటికి కొన్ని సీట్లను ప్రతిభగల పేద విద్యార్థులకు కేటాయించడం వల్ల వారికి న్యాయం చేకూరుతుంది.
  3. ప్రభుత్వం పైన నిర్వహణ ఖర్చు ఉండదు. ఆర్థిక భారమూ పడదు.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
ఎవరైనా ఏడుగురు వ్యక్తులను కలసి వారి ఏ రంగంలో పనిచేస్తున్నారో తెలుసుకోండి. వారి పని గురించి సంక్షిప్తంగా వ్రాయండి. లేదా పోస్టరు తయారుచేయండి. వారి నివాస ప్రాంతానికి వారి పనికి మధ్య ఎలాంటి సంబంధాన్ని చూసారు.
జవాబు:

వ్యక్తి పేరు చేసే పని యొక్క స్వభావం వ్యవసాయం/పరిశ్రమ/సేవలు
1. రామారావు ప్రభుత్వ డాక్టరు సేవలు
2. కార్తికేయ ప్రభుత్వ సీనియర్ అసిస్టెంట్ సేవలు
3. వేణుగోపాలరావు ప్రైవేటు డాక్టర్ సేవలు
4. ముకుందరావు ప్రైవేటు డాక్టర్ సేవలు
5. మీరాబాయి ప్రభుత్వ సీనియర్ నర్సు సేవలు
6. పాపారావు రైతు వ్యవసాయం
7. బుచ్చమ్మ కార్మికురాలు పరిశ్రమ

వైద్య నిపుణుల కొరత గురించి ప్రభుత్వ ప్రయివేటు వైద్యశాలలయందు పైన పేర్కొన్న వ్యక్తులతో మాట్లాడగా వారు క్రింది విషయాలను వెల్లడి చేశారు.
అవి :

  1. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో వైద్య నిపుణుల కొరత ఎంతైనా ఉంది.
  2. అనేక గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు ఇంకా డాక్టర్ అందుబాటులో లేడంటే ఆశ్చర్యపడవలసిన పనిలేదు.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 7th Lesson భారతదేశంలో పరిశ్రమలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 7th Lesson భారతదేశంలో పరిశ్రమలు

9th Class Social Studies 7th Lesson భారతదేశంలో పరిశ్రమలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
మౌలిక సరుకుల పరిశ్రమలను నెలకొల్పటానికి ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకుంది? (AS1)
జవాబు:
మౌలిక సరుకుల పరిశ్రమలను నెలకొల్పటానికి ప్రభుత్వం బాధ్యత తీసుకొనటానికి గల కారణం :

  1. దేశం పారిశ్రామికీకరణ చెందాలంటే, వివిధ రకాల కర్మాగారాలు పెద్ద సంఖ్యలో అభివృద్ధి చెందాలంటే యంత్రాలు, విద్యుత్, ఖనిజాలు, ముడిలోహాలు రవాణా సౌకర్యాలు వంటి కొన్ని మౌలిక సౌకర్యాలు అవసరం.
  2. ఈ అవసరమైన సరుకులను – యంత్రాలు, విద్యుత్, ఖనిజాలు, ముడిలోహాలు రవాణా సౌకర్యాలను తయారు చేసే పరిశ్రమలను మౌలిక పరిశ్రమలంటారు.
  3. అనేక కర్మాగారాలకు అవసరమయ్యే మౌలిక సరుకులను ఈ మౌలిక పరిశ్రమలు అందిస్తాయి కాబట్టి ప్రభుత్వం ఈ పరిశ్రమలను స్థాపించటానికి బాధ్యత తీసుకుంది.

ప్రశ్న 2.
కొన్ని ప్రత్యేక ప్రాంతాలలోనే పరిశ్రమలు ఎందుకు నెలకొల్పబడ్డాయి? (AS1)
జవాబు:
కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో పరిశ్రమలు నెలకొల్పబడడానికి కారణాలు :

  1. ముడి సరుకుల లభ్యత
  2. కూలీల అందుబాటు
  3. పెట్టుబడి
  4. విద్యుత్
  5. మార్కెట్ వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకుని పరిశ్రమలను స్థాపించుతారు.
  6. అందువల్లనే పరిశ్రమలు అన్ని అంశాలు అనువుగా అందుబాటులో ఉండే ప్రదేశాల్లో లేదా తక్కువ ఖర్చుతో సమకూర్చుకోగల ప్రదేశాల్లో నెలకొల్పుతారు.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 3.
మౌలిక సరుకుల పరిశ్రమలు ఏవి? వినియోగ వస్తువుల పరిశ్రమలకూ వీటికీ తేడా ఏమిటి? (AS1)
జవాబు:
యంత్రాలు, విద్యుత్, ఖనిజాలు, ముడిలోహాలు, రవాణా సౌకర్యాలను తయారు చేసే పరిశ్రమలను మౌలిక పరిశ్రమలు ప్రజలు ఉపయోగించే వస్తువులను తయారు చేసే పరిశ్రమలను వినియోగ వస్తువుల పరిశ్రమలంటారు.

మౌలిక సరుకుల పరిశ్రమలు వినియోగ వస్తువుల పరిశ్రమలు
1. వీటిని ప్రజలు ప్రత్యక్షంగా వినియోగించుకోలేరు. 1. వీటిని ప్రజలు ప్రత్యక్షంగా వినియోగించుకోగలరు.
2. వీటిని ఉపయోగించి వినియోగ వస్తువులను ఉత్పత్తి చేయవచ్చును. 2. వీటిని ప్రజలు తమ అవసరాల కొరకు ఉపయోగించుకొంటారు.

ప్రశ్న 4.
ఖనిజ వనరులు ఉన్న పట్టణాలు / ప్రాంతాల పేర్లు విద్యార్థులచే గుర్తింపజేసి, అక్కడ ఎలాంటి పరిశ్రమలు స్థాపించవచ్చో వాళ్లని రాయమనండి. (AS1)
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 1
జవాబు:

ప్రశ్న 5.
అంతకుముందు ప్రభుత్వ రంగానికే పరిమితమైన అనేక పరిశ్రమలలోకి 1990లలో ప్రైవేటు సంస్థలను ప్రభుత్వం ఎందుకు అనుమతించింది? (AS4)
జవాబు:

  1. కర్మాగారాలలో తయారైన వినియోగ వస్తువులు దేశంలోకి దిగుమతి చేసుకునేలా ప్రభుత్వం చట్టాలను సడలించింది.
  2. భారతదేశంలో పారిశ్రామిక కార్యకలాపాలను ప్రత్యేకించి కొత్త వాణిజ్యవేత్తలను ప్రోత్సహించటానికి ప్రభుత్వ నియమాలను సరళీకృతం చేశారు.
  3. ప్రభుత్వ ఆధీనంలోని పరిశ్రమల సామర్థ్యాన్ని పెంచటానికి వాటిలో కొన్నింటిని అమ్మేశారు.
  4. ఈ పరిశ్రమల నిర్వహణకు ప్రభుత్వం కేటాయించే నిధులను కూడా తగ్గించేశారు.
  5. ప్రభుత్వ జోక్యం లేకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోటానికి ఈ కంపెనీలను అనుమతించసాగారు.
  6. కొత్త సాంకేతిక విజ్ఞానం దేశంలోకి వచ్చేలా, ఉత్పత్తి చేసిన సరుకులను విదేశాలకు ఎగుమతి చేసేలా ప్రోత్సహించడానికి విదేశీ, ప్రైవేటు, ప్రభుత్వ కంపెనీలను భారతదేశంలో పరిశ్రమలు స్థాపించటానికి ప్రోత్సహించసాగారు.

ప్రశ్న 6.
పారిశ్రామిక అభివృద్ధి వల్ల ఉపాధి కల్పన ఎలా ప్రభావితమైనది? (AS1)
జవాబు:

  1. పారిశ్రామిక సంస్థల సంఖ్య పెరిగింది. కానీ ఉపాధి ఆశించినంతగా పెరగలేదు. ఎక్కువగా చిన్న చిన్న ఉద్యోగాలే కల్పించబడ్డాయి.
  2. ప్రస్తుతం భారతదేశంలో సంఘటిత రంగంగా వ్యవహరించే రెండు లక్షల పెద్ద కర్మాగారాలున్నాయి.
  3. అసంఘటిత రంగంగా పేర్కొనే 3 కోట్ల చిన్న పారిశ్రామిక కేంద్రాలున్నాయి.
  4. ఇవన్నీ కలిపి దేశంలోని 46 కోట్ల కార్మికవర్గంలో అయిదింట ఒక వంతుకు ఉపాధి కల్పిస్తున్నాయి.
  5. కర్మాగారాలలో ఉపాధి పొందే కార్మికుల శాతాన్ని ఆ దేశ ఆర్థికాభివృద్ధికి ముఖ్యమైన సూచికగా పరిగణిస్తారు.
  6. కార్మికులకు మెరుగైన జీతాలు, మెరుగైనని సురక్షిత పని పరిస్థితులు, ఆరోగ్య వైద్య సదుపాయాలను పరిశ్రమల యాజమాన్యాలు కల్పించేలా భారతదేశంలో అనేక చట్టాలను చేశారు.
  7. అనేక కొత్త పరిశ్రమలు ఏర్పడతాయని, కాలక్రమంలో కార్మికులలో అధిక శాతం సంపాదన పెరుగుతుందని ఆశించారు.
  8. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినప్పటికి పరిశ్రమలలో ఉపాధి శాతం ఆశించినంతగా పెరగలేదు.
  9. అంతేగాకుండా కార్మికులలో చాలామంది చిన్న పారిశ్రామిక కేంద్రాలలో ఉపాధి పొందుతున్నారు.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 7.
పారిశ్రామిక అభివృద్ధి వల్ల ప్రభుత్వ ఆదాయం ఎలా ప్రభావితమైనది? (AS1)
జవాబు:
పారిశ్రామిక అభివృద్ధి వల్ల ప్రభుత్వ ఆదాయం ప్రభావితమైన విధానం :

  1. ప్రభుత్వ పారిశ్రామిక రంగాల విషయంలో పరిశ్రమల నిర్వహణకు ప్రతి సంవత్సరం కొన్ని నిధులు కేటాయించేవారు.
  2. కాలక్రమంలో ఇవి స్వతంత్రమైనా, ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తాయని భావించేవారు.
  3. అనేక ప్రభుత్వ రంగ కర్మాగారాలలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉండేది. వీటికి ప్రభుత్వం సహాయం నిరంతరం అవసరం అవుతూ ఉండేది.
  4. వీటి నిర్వహణలో ప్రభుత్వ జోక్యం కొనసాగుతూ ఉండేది. ఆశించిన దానికంటే వాటి పని చాలా నిరాశాజనకంగా ఉండేది.
  5. అందువల్ల అలాంటి వాటిని ప్రైవేటు పరం చేసి నూతన పారిశ్రామిక విధానం ప్రకారం అత్యుత్తమ లాభాలు పొందుతున్న సంస్థలను మాత్రమే దాని నియంత్రణలో ఉంచింది.

ప్రశ్న 8.
“పరిశ్రమల వల్ల పర్యావరణ సమస్యలు పెరుగుతాయి” చర్చించండి. (AS4)
జవాబు:

  1. పరిశ్రమల ఉత్పత్తి ప్రక్రియలో విద్యుత్, వివిధ రసాయనికాలు అవసరం అవుతాయి.
  2. ఉత్పత్తి క్రమంలో ఈ పరిశ్రమలు అనేక వ్యర్థాలను విడుదల చేస్తాయి.
  3. పారిశ్రామిక ప్రాంతాలలో ఇవి కాలుష్యానికి దారితీస్తున్నాయి.

ప్రశ్న 9.
పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు కొన్ని నినాదాలు రాయండి. (AS6)
(లేదా)
“పర్యావరణ కాలుష్య నివారణకై” ఏవైనా రెండు నినాదాలు రాయండి.
జవాబు:

  1. వృక్షో రక్షతి రక్షితః
  2. పర్యావరణ పరిరక్షణ – మనందరి బాధ్యత.
  3. మనిషికి ఆయువు పెరగాలి – అందుకే చెట్లను పెంచాలి.
  4. కాలుష్యాన్ని నివారించండి – పర్యావరణాన్ని కాపాడండి.
  5. సహజ ఎరువులను వాడండి – పుడమితల్లిని కాపాడండి.
  6. ప్రకృతి రక్షణే జీవాధారం – చెట్లే ప్రగతికి ప్రాణాధారం.
  7. హద్దులు లేని అనుబంధానికి అమ్మే ఒక అందం
    అంతులేని ఆనందానికి ప్రకృతితోనే బంధం.
  8. పరిసరమే మన చుట్టూ ఉండే చక్కని నేస్తం
    పర్యావరణం కాపాడటమే మన అందరి కర్తవ్యం.
  9. చెట్లు లేనిది బ్రతుకే లేదు
    మానవ జాతికి మెతుకే లేదు.
  10. గాలీ, నేలా, నీరు, నింగి జీవుల మనుగడకి ఆధారం.
    అడవులు నరికి పెంచే కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలే మానవునికి దుఃఖకారణం.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 10.
పేజీ నెం. 83లోని రెండవ పేరాను (రేడియోసెట్ల నుంచి ……….. కీలకమవుతుంది) చదివి వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
సమాచార సాంకేతిక విజ్ఞానం, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ భారతదేశాన్ని ఆసియా. ఖండంలో ప్రధమురాలిగా నిలబెట్టాయి. భారతదేశానికి ఎలక్ట్రానిక్స్ రాజధానిగా బెంగళూర్ ఎదిగింది. ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్, పుణె, చెన్నై, కోల్ కత, లక్నో, కోయంబత్తూరు వంటి నగరాలు సమాచార విప్లవంలో దూసుకుపోతున్నాయి.

రేడియో సెట్ల నుండి టెలివిజన్ వరకు, టెలిఫోన్లు, చరవాణీలు, పేజర్లు, కంప్యూటర్లతో దేశం దూసుకుపోతోంది. ఈ ‘ రంగంలో 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఈ రంగంలో 30% వరకు మహిళలు తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ రంగాలలో ప్రగతి కొనసాగి, విదేశీ మారక ద్రవ్యాన్ని సైతం ఈ రంగం ఆర్జిస్తుంది.

ప్రశ్న 11.
పేజీ నెం. 95లోని పటాన్ని పరిశీలించి, భారతదేశ అవుట్ లైన్ పటంలో మన దేశంలోని ఇనుము – ఉక్కు కర్మాగారాలను గుర్తించండి. (AS5)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 2

9th Class Social Studies 7th Lesson భారతదేశంలో పరిశ్రమలు InText Questions and Answers

9th Class Social Textbook Page No.76

ప్రశ్న 1.
ఇతర కర్మాగారాలు ముడి సరుకులుగా ఉపయోగించుకొనే వస్తువులను తయారు చేసే కర్మాగారాల జాబితా రాయండి.
జవాబు:
యంత్రాల పరిశ్రమ, విద్యుత్ పరిశ్రమ, ఖనిజాల పరిశ్రమ, ముడి లోహాలను శుద్ధి చేసే పరిశ్రమ రవాణా సౌకర్యాలను తయారు చేసే పరిశ్రమలు.

ప్రశ్న 2.
ఇతర కర్మాగారాల కోసం ఉత్పత్తి చేసే అనేక వస్తువులకు ఇనుము మౌలిక అవసరం. మీ చుట్టు పక్కల కనిపించే ఉదాహరణలతో దీనిని వివరించండి.
జవాబు:
ఇనుము మౌలిక అవసరం.
ఉదా : నేలను త్రవ్వే పలుగు, పార, కోయడానికి ఉపయోగించే కత్తులు, కొడవళ్లు, చాకులు బరిసెలు. ఇంటి నిర్మాణానికి ఉపయోగించే ” ఇనుపచువ్వలు.

వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించే మేకులు, వివిధ రకాలైన ఫ్రేములు మొ||నవి.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 3.
కర్మాగారాలలో ఉపయోగించే యంత్రాలను మీరు చూశారా? వివిధ రకాల యంత్రాల చిత్రాలను సేకరించండి.
జవాబు:
కర్మాగారాలలో ఉపయోగించే యంత్రాలను మేము చూశాము. అవి :
బియ్యం మిల్లు, పత్తి మిల్లు, కారం పట్టేవి, పిండి పట్టేవి, నీరు లాగేవి మొ||నవి.

ప్రశ్న 4.
అనేక వస్తువుల ఉత్పత్తిలో పెట్రోలియం మౌలిక అవసరం ఎలా అవుతుందో తెలియజేసే చార్టుని తయారు చేయండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 3

ప్రశ్న 5.
‘మౌలిక’ అనే పదం అంటే ఏమిటో చర్చించండి. పరిశ్రమలకు మౌలిక అవసరాలు ఏమిటి?
జవాబు:
మౌలిక అంటే ముఖ్యమైనవి, ప్రధానమైనవి, ప్రాథమికమైనవి అనే అర్థాలు వస్తాయి. పరిశ్రమకు మౌలిక అవసరాలు ఏమిటనగా యంత్రాలు, విద్యుత్, ఖనిజాలు, ముడిలోహాలు, రవాణా సౌకర్యాలు వంటివి. ”

ప్రశ్న 6.
స్వాతంత్ర్య కాలంలో పారిశ్రామికీకరణ ద్వారా మనం ఏ లక్ష్యాలను సాధించాలని కోరుకున్నాం?
జవాబు:
స్వాతంత్ర్యకాలంలో పారిశ్రామికీకరణ ద్వారా మనం సాధించాలని అనుకున్న లక్ష్యాలు :

  1. పారిశ్రామిక కార్యకలాపాలు మొదలైతే పట్టణీకరణ మొదలవుతుంది.
  2. పట్టణాలలో మాత్రమే పట్టణ సమీప ప్రాంతాలలో పరిశ్రమలను స్థాపించి వాటిని అభివృద్ధి చేయడం.
  3. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ జంటగా పురోగమిస్తాయి.
  4. పట్టణాలు సరుకులకు మార్కెట్ గా ఉండటమేగాక బ్యాంకింగ్, బీమా, రవాణా కార్మికులు, సలహాదారుల, ఆర్థిక సలహాలు వంటి సేవలను కూడా అందిస్తాయి.
  5. అందువల్ల గ్రామీణ ప్రాంతాలలో కూడా చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించి పారిశ్రామిక వాతావరణాన్ని కల్పించాలి.
  6. భారతదేశ జనాభా ప్రధానంగా గ్రామీణ జనాభా కావడం వలన గ్రామాలలో పరిశ్రమలను స్థాపించవలసిన అవసరం ఉన్నదని భావించడం.

9th Class Social Textbook Page No.77

ప్రశ్న 7.
టీ పొడి, టూత్ పేస్టు కవర్లు (Wrappers) సేకరించండి. వాటిమీద ఉన్న విషయాన్ని చదివి కింది ప్రశ్నలకు సమాధానాలివ్వండి.
………………. ని వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఉత్పత్తిగా పేర్కొనవచ్చు.
………………. ని ఖనిజ ఆధారిత పరిశ్రమ ఉత్పత్తిగా పేర్కొనవచ్చు.
జవాబు:
టీ పొడి, టూత్ పేస్ట్.

ప్రశ్న 8.
టూత్ పేస్ట్ కు ముడిసరుకులైన …………………….., ………………… లను మరో పరిశ్రమలో ఉత్పత్తి చేస్తారు. దానిని మౌలిక లేదా కీలక పరిశ్రమ అంటారు. ఇందుకు భిన్నంగా టూత్ పేస్ట్ వినియోగదారీ సరుకు కావడం వల్ల ఈ పరిశ్రమ వినియోగదారీ వస్తు పరిశ్రమ అంటారు.
జవాబు:
అల్యూమినియం ట్యూబు, కాల్షియం.

ప్రశ్న 9.
పరిశ్రమల యాజమానులు వ్యక్తులు కావచ్చు, వ్యక్తుల బృందం కావచ్చు. ఉదా : టీ ప్యాకెట్ల తయారీ యజమానులు …………….. కాగా టూత్ పేస్టు …………… ఇలాంటి పరిశ్రమను ప్రైవేటు రంగ పరిశ్రమ అంటారు. యాజమాన్యం ప్రభుత్వానికి చెందినట్లయితే దానిని, ప్రభుత్వరంగ పరిశ్రమ అంటారు. అలాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలకు రెండు ఉదాహరణలు …………..
జవాబు:
ప్రయివేటు వ్యక్తులు, పేస్ట్ తయారీ ;

  1. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
  2. భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ లిమిటెడ్.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 10.
పెద్ద సంఖ్యలో వ్యక్తులు కొన్ని పరిశ్రమలను పాలు, చెరకు, కొబ్బరి పీచు మొదలైన ముడి సరుకులను, వనరులను సమీకరించుకొని నిర్వహిస్తారు. ఇటువంటి పరిశ్రమలను ………… అంటారు.
జవాబు:
సహకార పరిశ్రమలు

9th Class Social Textbook Page No.78

ప్రశ్న 11.
నూలు వడకటం, ఖద్దరు నేయటానికి మహాత్మాగాంధీ ఎందుకు ప్రాధాన్యత నిచ్చారు?
జవాబు:
నూలు వడకటం, ఖద్దరు నేయటానికి మహాత్మాగాంధీ ప్రాధాన్యత ఇవ్వటానికి కారణం :

  1. మన దేశంలో ప్రాచీనమైన, అతి పెద్ద పరిశ్రమ నూలు వస్త్ర పరిశ్రమ.
  2. ఎక్కువమందికి జీవనోపాధి కల్పించే పరిశ్రమ నూలు పరిశ్రమ.
  3. అందరికి అవసరమైన వస్తువు బట్టలు. అందువల్ల ఇంగ్లాండ్ లో పారిశ్రామిక విప్లవం యంత్రాలపై – నేయబడిన వస్త్రాలను దిగుమతి చేసుకోవడంతో చేనేత కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది.
  4. కావున చేనేత కార్మికులకు ఉపాధిని కల్పిస్తూ, మనకు కావలసిన వస్త్రాన్ని మనమే తయారు చేసుకుంటూ, వ్యాపార నిమిత్తం భారత దేశానికి వచ్చిన బ్రిటిష్ వారికి లాభం లేకుండా చేయడం వలన వారు మనదేశం నుండి వెళ్ళిపోవడానికి అవకాశం కల్పించగలము అనే నమ్మకంతో గాంధీగారు అలాంటి విధానానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

9th Class Social Textbook Page No.80

ప్రశ్న 12.
పంచదార, బెల్లం పరిశ్రమలను ఎక్కడ స్థాపించాలి?
జవాబు:

  1. పంచదార, బెల్లం పరిశ్రమలు చెరకు పండే ప్రాంతాలలోనే స్థాపించాలి. కారణం చెరకు నరికిన తరువాత ఎక్కువ కాలం నిల్వ ఉంటే సుక్రోజ్ శాతం తగ్గిపోతుంది.
  2. అందువల్ల చెరకు నరికిన వెంటనే పరిశ్రమకు తరలించవలసి ఉంటుంది.
  3. కావున చెరకు పండే ప్రాంతాలలోనే. పంచదార, బెల్లం పరిశ్రమలను స్థాపించవలసి ఉంటుంది.

ప్రశ్న 13.
భారతదేశంలో తలసరి ఉక్కు వినియోగం ఎందుకు తక్కువగా ఉంది?
జవాబు:

  1. ఇనుము – ఉక్కు పరిశ్రమలు మౌలిక పరిశ్రమలు ఇతర భారీ, మధ్యతరహా, తేలికపాటి పరిశ్రమలన్నీ తమకు కావలసిన యంత్రాలకు వీటిపై ఆధారపడి ఉన్నాయి.
  2. అనేక రకాల ఇంజనీరింగ్ వస్తువులు, భవననిర్మాణ సామగ్రి, రక్షణ, వైద్య, దూరవాణి, శాస్త్రీయ పరికరాలు, అనేక వినియోగదారీ వస్తువుల వంటి వాటికి ఉక్కు అవసరం.
  3. కాని పైన పేర్కొనబడిన పరిశ్రమలు భారతదేశంలో చెప్పుకోదగినంత స్థాయిలో అభివృద్ధి చెందలేదు.
    అందువల్ల తలసరి ఉక్కు వినియోగ తక్కువగా ఉంది.

9th Class Social Textbook Page No.82

ప్రశ్న 14.
సిమెంట్ ఉత్పత్తి కర్మాగారాలను ఎక్కడ స్థాపించటం ఆర్థికంగా లాభసాటిగా ఉంటుంది?
జవాబు:
సిమెంట్ ఉత్పత్తి కర్మాగారాలను స్థాపించవలసిన ప్రదేశాలు :

  1. ప్రధాన ముడిపదార్థాలైన సున్నపురాయి, సిలికా, అల్యూమినియం, జిప్సం వంటి ముడి పదార్థాలు ఎక్కడ లభిస్తాయో సాధారణంగా సిమెంట్ పరిశ్రమలు అక్కడ స్థాపించవలసి ఉంటుంది.
  2. సిమెంట్ పరిశ్రమకు రైలు వంటి రవాణా సౌకర్యాలతో పాటు బాగా అభివృద్ధి చెందిన ప్రదేశం కూడా కావాలి.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 15.
గల్ఫ్ దేశాల మార్కెటుకి దగ్గరగా గుజరాత్ లో సిమెంట్ కర్మాగారాలు కొన్ని నెలకొని ఉన్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలలో సిమెంట్ కర్మాగారాలు ఎక్కడ నెలకొని ఉన్నాయో తెలుసుకోండి. ఆ కర్మాగారాల పేర్లు తెలుసుకోండి.
జవాబు:

  1. మొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904లో చెన్నైలో నిర్మించారు.
  2. 1989లో ధర, పంపిణీలలో నియంత్రణలను తీసివేయటం, ఇతర విధానాలలో సంస్కరణల వల్ల సామర్థ్యం, ప్రక్రియ, సాంకేతిక విజ్ఞానం, ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతి సాధించింది.
  3. సిమెంట్ నాణ్యత పెరగటంతో తూర్పు ఆసియా, గల్ఫ్ దేశాలలో, ఆఫ్రికా దక్షిణ ఆసియాలలో మన దేశ సిమెంటుకు గిరాకీ పెరిగింది.

సిమెంట్ పరిశ్రమ నెలకొని ఉన్న ప్రాంతాలు :

  1. తమిళనాడు : తలైయుత్తు అలంగులం, తలకపట్టి దాల్మియాపురం, పాలియూర్, వంకరిదుర్గ్, మధురై.
  2. మధ్యప్రదేశ్ : జముల్, సాత్నా, కల్ని, కైమూర్, బాన మూర్, ముంధర్ దేశంలోకెల్లా జముల్ ఫ్యాక్టరీ అతి పెద్దది.
  3. ఆంధ్రప్రదేశ్ : జగ్గయ్యపేట.
  4. తెలంగాణ : కరీంనగర్, కోదాడ.
  5. రాజస్థాన్ : లఖేరి బుంది, సవాయ్, మాధోపూర్ బితోర్ గద్, ఉదయపూర్.

9th Class Social Textbook Page No.84

ప్రశ్న 16.
దిగువ పట్టికను పూరించండి.
కొన్ని పరిశ్రమల గురించి తెలుసుకోవడానికి మీ ఉపాధ్యాయునితో చర్చించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 4
జవాబు:

పరిశ్రమ ప్రస్తుతం అవి ఉన్న రాష్ట్రాలు ఆయా రాష్ట్రాలలో అవి ఎందుకు ఉన్నాయి?
రసాయనిక పరిశ్రమ రసాయనిక ఎరువులు :
బీహార్ లోని సింద్రి, ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్, తెలంగాణలోని రామగుండం, పంజాబ్ – నంగల్, హర్యానా – పానిపట్
ఆయా రాష్ట్రంలో ఎక్కువగా నెలకొల్పడానికి ప్రధాన కారణం – రసాయనాలు, విద్యుత్, పెట్రోలియం వంటి ఉత్పత్తులు ఆయా ప్రాంతాలలో విరివిగా దొరకడం.
ఎరువుల పరిశ్రమ సింథటిక్ దారాలు :
మహారాష్ట్ర – ముంబయి
గుజరాత్ – అహ్మదాబాద్
మధ్యప్రదేశ్ – గ్వాలియర్
తెలంగాణ – కాగజ్ నగర్పెట్రో కెమికల్స్ :
మహారాష్ట్ర – ట్రాంబే ధానే
గుజరాత్ – వడోదర
సిమెంట్ పరిశ్రమ తమిళనాడు – తలైయుత్తు అలిహలా
తలకపట్టి దాల్మియాపూర్
ఆంధ్రప్రదేశ్ – జగ్గయ్యపేట
తెలంగాణ – కరీంనగర్, కోదాడ
గుజరాత్ – సిక్కా, సూరీ
రాజస్థాన్ – లభేరి బుంది
సిమెంట్ పరిశ్రమకు కావలసిన సున్నపురాయి, సిలికా, అల్యూమినియం, జిప్సం వంటి ముడి పదార్థాలతో పాటు, అభివృద్ధి చెంది రవాణా సౌకర్యాలు
ఆటోమొబైల్ పరిశ్రమ మహారాష్ట్ర – ముంబయి, పుణె
పశ్చిమబెంగాల్ – కోల్ కత
తమిళనాడు – చెన్నై
ఉత్తరప్రదేశ్ – లక్నో
రోడ్లు, రవాణా అభివృద్ధి చెంది ఉండడం, ఎగుమతులు, దిగుమతులకు అనుకూల ప్రదేశాలు సాంకేతిక నైపుణ్యం గల, సాంకేతిక నైపుణ్యం లేని శ్రామికులు ఎక్కువగా ఉండడం.

9th Class Social Textbook Page No.88

ప్రశ్న 17.
రెండు ‘పై’ (Pie) చార్టులలోని మూడు రకాల ఆర్థిక రంగాలలో ‘ఉపాధిలో తేడాలు ఏమిటి ? :
(లేదా)
కింది “పై” చార్టు, వ్యవసాయ, పరిశ్రమలు మరియు సేవారంగం ద్వారా పొందుతున్న ఉపాధి శాతాలను తెలియజేస్తున్నది. చార్టును పరిశీలించి, ప్రశ్నకు సమాధానం రాయండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 5
ప్రశ్న: 1972 – 73 మరియు 2009-2010 మధ్య ఉపాధి కల్పనలో వచ్చిన మార్పులు ఏమిటి?
జవాబు:
1972-73 సం||రం వ్యవసాయంపై ఆధారపడిన వారి శాతం – 74%.
2009-2010 సం||రం వ్యవసాయరంగంపై ఆధారపడిన వారి శాతం 53%.
కావున 1972 -73 సం||రంతో పోలిస్తే వ్యవసాయ రంగంపై ఆధారపడిన శాతం తగ్గింది.
1972 -73 పరిశ్రమలపై ఆధారపడిన వారి శాతం – 11%.
2009 – 10 సం||రంలో పరిశ్రమలపై ఆధారపడిన వారి శాతం – 22%.
కావున 1972 – 73 సంవత్సరంతో పోలిస్తే 2009-10 సం||రంలో పరిశ్రమలపై ఆధారపడిన వారి శాతం పెరిగింది.
1972 – 73 సం||రంలో సేవలపై ఆధారపడిన వారి శాతం – 13%.
2009 – 10 సం||రంలో సేవలపై ఆధారపడిన వారి శాతం – 25%.
కావున 1972 – 73 సంవత్సరంతో పోలిస్తే 2009 – 10 సం||రాల్లో సేవలపై ఆధారపడిన వారి శాతం పెరిగింది.
మొత్తం మీద 1972 – 73 సం||రానికి 2009 – 10 సం||రానికి తేడా ఏమనగా వ్యవసాయరంగంపై ఆధారపడిన వారి శాతం తగ్గగా మిగిలిన రంగాలపై ఆధారపడిన వారి శాతం పెరిగింది.

ప్రశ్న 18.
పారిశ్రామిక రంగం వారీగా ఉపాధి కల్పనలో ఎంత శాతం తేడా ఉంది?
జవాబు:
1972 – 73 లో పారిశ్రామిక రంగంపై ఆధారపడిన వారి శాతం – 11%
2009 – 10 లో పారిశ్రామిక రంగంపై ఆధారపడిన వారి శాతం – 22%
తేడా – 11%
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 6

ప్రశ్న 19.
పరిశ్రమలలో ఆశించినంతగా ఉపాధి పెరగలేదా? టీచరుతో చర్చించండి.
జవాబు:
పరిశ్రమలలో ఆశించినంతగా ఉపాధి పెరగలేదు. కారణం –
1972-73లో 11% ఉంటే 2009-10లలో 22 శాతానికి మాత్రమే పెరిగినది. అంటే 27 సం||రాలలో ఉపాధి కేవలం 11% మాత్రమే పెరిగినది.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 7

9th Class Social Textbook Page No.90

రవాణా వాహనాలు, పంపులు ఉత్పత్తి, ….. 1950 – 2011
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 8

ప్రశ్న 20.
వివిధ కర్మాగారాలు తమ ఉత్పత్తులలో ఉపయోగించే వస్తువులు ఉత్పత్తి పెరుగుదలకు ఉదాహరణలు పేర్కొనండి.
జవాబు:
వాణిజ్య వాహనాలు 1950-51లో 9 మిలియన్లు ఉండగా 2010-11 నాటికి 753 మిలియన్లకి పెరిగింది.

మోటారు సైకిళ్ళు 1950-51లో ఏమీ లేవు. 1960-61లో 1 మిలియన్ మాత్రమే ఉండగా 2010-11 నాటికి 10. 527 మిలియన్లకు పెరిగాయి. అనగా పెరుగుదల గణనీయంగా ఉన్నది.

పంపులు 1950-51లో 35 మిలియన్లు ఉండగా 2010-11లో 3139 మిలియన్లకు పెరిగింది.

ట్రాక్టర్లు డీజిల్ తో నడిచేవి 1980-81కు ముందు లేవు. ఆ సంవత్సరం మాత్రం 71 మిలియన్లు ఉండగా 2010-11 నాటికి 465 మిలియన్లకు పెరిగింది. కాబట్టి పెరుగుదల పై విధంగా ఉన్నది.

AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు

ప్రశ్న 21.
గత 30 సంవత్సరాలలో వస్త్ర ఉత్పత్తి ఎంత పెరిగింది ? దీని ప్రభావం ఎలా ఉంటుంది ? మీ తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
వస్త్రాల ఉత్పత్తి (మిలియన్ చదరపు మీటర్లలో)

సంవత్సరం నూలు వస్త్రాలు ఇతర వస్త్రాలు
1950-51 4900
1960-61 6000 100
1970-71 6500 1000
1980-81 8000 2000
1990-91 15000 8000
2000-01 20000 20000
2010-11 31000 30000

వస్త్రాలు మన అవసరాలకు ఉపయోగించడం మాత్రమే కాక ఇతర దేశాలకు దిగుమతి చేయడం జరుగుతుంది.

ప్రశ్న 22.
సిమెంటు, ఉక్కు ఉత్పత్తిని చూపించే పటాన్ని చూడండి. 1980 – 81 నుంచి ఇప్పటి వరకు వీటి ఉత్పత్తిలో పెరుగుదల తెలియజేయటానికి ఒక పట్టిక తయారు చేయండి. ఈ ఉత్పత్తి పెరగటం వల్ల కలిగిన ప్రయోజనాలను, నష్టాలను చర్చించండి.
జవాబు:

సంవత్సరం సిమెంట్ ఉత్పత్తి
(మిలియన్ టన్నులలో)
ఉక్కు ఉత్పత్తి
(మిలియన్ టన్నులలో)
1950-51 5 1
1960-61 10 2
1970-71 15 6
1980-81 20 8
1990-91 50 12
2000-01 100 30
2010-11 210 62

ఉక్కు ఉత్పత్తి పెరిగినది దీనివలన మౌలిక పరిశ్రమలు సంఖ్య పెరిగింది.

ఉత్పత్తి పెరగటం వల్ల కలిగిన లాభాలు :
సిమెంట్ ఉత్పత్తి పెరగటం వల్ల భవన నిర్మాణం రంగం పెరిగింది. మరియు ఎగుమతులు పెరిగాయి.

అరబ్ దేశాలకు మన సిమెంట్ ను ఎక్కువగా ఎగుమతి చేయడం జరుగుతున్నది.

నిర్మాణ రంగానికి కూడా ఉక్కును ఎక్కువగా ఉపయోగించడం జరుగుతున్నది.

నష్టాలు :
సున్నపురాయి, జిప్సమ్ నిల్వలు రోజు రోజుకు తరిగిపోతున్నాయి. అలాగే ఉక్కుకు కావలసిన ముడి ఇనుమును ఎక్కువగా ఎగుమతి చేయడం జరుగుతుంది.

ఇంకా పూర్తి స్థాయిలో ముడి ఇనుమును మన అవసరాలకు ఉపయోగించుకోగలిగితే ఇనుము – ఉక్కు పరిశ్రమ అభివృద్ధి చెందినట్లు అవుతుంది.

పట నైపుణ్యం

1. భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన ఉక్కును 1950-51 నుండి. 2010-11 వరకు గ్రాఫ్ చిత్రంలో చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 9

2. 1950-51 నుండి 2010-11 వరకు ఉత్పత్తి చేయబడిన సిమెంట్ ను గ్రాఫ్ చిత్రం ద్వారా చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 10

3. 1950-51 నుండి 2010-11 వరకు ఉత్పత్తి చేయబడిన విద్యుత్ ను గ్రాఫ్ చిత్రం ద్వారా చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 11

4. 1950-51 నుండి 2010-11 వరకు ఉత్పత్తి చేయబడిన వస్త్రాలను గ్రాఫ్ చిత్రం ద్వారా చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 12

5. భారతదేశంలో లభించే ఇనుప ఖనిజ క్షేత్రాలను, ఇనుప ఖనిజ గనులను భారతదేశం పటంలో చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 13

6. బొగ్గు లభించే ప్రాంతాలను భారతదేశ పటం నందు చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 14

7. భారతదేశ పటం నందు ఇనుము – ఉక్కు కర్మాగారాల ప్రదేశాలను చూపించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 15

8. భారతదేశ పటం నందలి సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కులను గుర్తించండి.
AP Board 9th Class Social Solutions Chapter 7 భారతదేశంలో పరిశ్రమలు 16

ప్రాజెక్టు

ప్రశ్న 1.
మీ ప్రాంతంలోని వ్యవసాయ ఆధారిత పరిశ్రమను ఒకదానిని, ఖనిజ ఆధారిత పరిశ్రమను ఒకదానిని ఎంచుకోండి.
1) వాటిల్లో ఉపయోగించే ముడిసరుకులు ఏమిటి?
2) ఉత్పత్తిలో కావలసిన ఇతర ఉత్పాదకాలలో వేటికి రవాణా ఖర్చు కావాలి?
3) ఈ కర్మాగారాలు పర్యావరణ నియమాలను పాటిస్తున్నాయా?
జవాబు:
మా ప్రాంతంలోని వ్యవసాయ ఆధారిత పరిశ్రమ.

– పొగాకు పరిశ్రమ :

  1. వాటిలో ఉపయోగించే ముడి సరుకులు – పొగాకు.
  2. ఉత్పత్తిలో కావలసిన ఇతర ఉత్పాదకాలలో వేటికి రవాణా ఖర్చు కావాలి?
    పొగాకుకు రవాణా ఖర్చు కావాలి.

మరియు తయారుచేయబడిన సిగరెట్లు, బీడీలు, చుట్టలు వంటి వాటిని వివిధ ప్రాంతాలకు చేరవేయాలన్నా, మరియు సిగరెట్ పరిశ్రమ, బీడీల పరిశ్రమ, చుట్టల పరిశ్రమ ప్రాంతాలకు పొగాకును చేరవేయాలన్నా రవాణా ఖర్చు కావలసి ఉంటుంది.

ఈ కర్మాగారాలు పర్యావరణ నియమాలను అంతగా పాటించడం లేదనే చెప్పవచ్చును.

ఎందువలెనంటే పరిశ్రమల చుట్టు మొక్కలను పెంచడం లేదు.

పరిశ్రమ నందు వడిలివేయబడిన పదార్థాల డంపింగ్ యార్డ్ ద్వారా నాశనం చేయకుండా దగ్గరలోని కృష్ణానదిలోను, రోడ్ల ప్రక్కన వేయడంవల్ల ఆ పరిసర ప్రాంతాలు కాలుష్యానికి గురౌతున్నాయి.

మా ప్రాంతంలోని ఖనిజాధార పరిశ్రమ.

– సిమెంట్ పరిశ్రమ :
ప్రధాన ముడి సరుకులు : సున్నపురాయి, జిప్సం , బొగ్గు, డోలమైట్, పింగాణి మన్ను మొదలగునవి.

ఉత్పత్తిలో కావలసిన ఇతర ఉత్పాదకాలలో సున్నపురాయి, జిప్సం, డోలమైట్, పింగాణి మన్ను, బొగ్గు మొదలైన వాటి అన్నింటికి రవాణా ఖర్చు కావాలి.

సున్నపురాయి అధిక పరిమాణంలో కావాలి.

ఈ కర్మాగారాలు పర్యావరణ నియమాలను పాటిస్తున్నాయా?

అంతగా పాటించడం లేదనే చెప్పాలి. ఎందువలెనంటే ఈ పరిశ్రమ పనిచేస్తున్నప్పుడు దుమ్ము, ధూళి విపరీతంగా వస్తుంది.

అది గాలిలో కలిసి గాలిని కలుషితం చేస్తుంది.
అలాగే వ్యర్థ పదార్థాలను బయట ప్రదేశములందు వదలడం వలన బయటి ప్రదేశాలు రసాయనిక కాలుష్యానికి గురౌతున్నాయి.