AP State Syllabus AP Board 9th Class Telugu Important Questions Chapter 4 ప్రేరణ
AP State Syllabus 9th Class Telugu Important Questions 4th Lesson ప్రేరణ
9th Class Telugu 4th Lesson ప్రేరణ Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
1. ఈ క్రింది గద్యాన్ని చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురుశిష్య సంబంధాన్ని దాటి వికసించింది. ఆయన సాహచర్యంలో ఒకరి జీవిత గమనాన్ని ఎవరైనా ఏ మేరకు ప్రభావితం చేయగలరో తెలుసుకున్నాను. ఇయదురై సోలోమోన్ అంటుండేవారు. జీవితంలో విజయం పొందడానికి, ఫలితాలు సాధించడానికి నువ్వు మూడు అంశాలు మీద పట్టు సాధించాల్సి ఉంటుంది – అవి “కోరిక”, “నమ్మకం”, “ఆశపెట్టుకోవడమూ”ను.
ప్రశ్నలు:
1. పై పేరాలో గురువు ఎవరు?
2. ఆయన ఏ అంశాలపై పట్టు సాధించాలని చెప్పారు?
3. దేనికోసం అంశాలపై పట్టు సాధించాలి?
4. ‘గురుశిష్యులు’ ఏ సమాసం?
జవాబులు:
1. ఇయదురై సోలోమోన్
2. “కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం”
3. జీవితంలో విజయం పొందడానికీ, ఫలితలు సాధించడానికీ
4. ద్వంద్వ సమాసం
2. ఈ క్రింది గద్యాన్ని చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (S.A. I – 2018-19)
కలాం రామనాథపురంలో హైస్కూల్లో స్థిరపడగానే ఆయనలోని పదిహేనేళ్ళ జిజ్ఞాసువు మేల్కొన్నాడు. కలాం తన ముందు పరచుకుని ఉన్న జీవితావకాశాల గురించి ప్రత్యామ్నాయాల గురించి ఇదమిత్థంగా ఏమి తెలుసుకోలేని ఒక నవ ఔత్సాహికుడైన ఆయనకు ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమన్ ఆదర్శపథ నిర్దేశకుడయ్యాడు. ఉదార విశాల దృక్పథంతో ఆయన తన తరగతి గదిలోని విద్యార్థుల్ని ఉత్సాహపరచేవాడు. మందబుద్ధి శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకోగలిగే దానికన్నా ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుడి నుంచి కూడా ఎక్కువ నేర్చుకోగలడనేవాడు కలాం.
ప్రశ్నలు:
1. కలామ్ గారు తనకు మార్గదర్శిగా ఎవరిని భావించారు?
2. ఉత్తమ విద్యార్థి లక్షణమేమిటి?
3. కలామ్ ఏ విషయం గూర్చి సందిగ్ధంలో ఉన్నారు?
4. పై పేరాననుసరించి ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబులు:
1. ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమన్
2. చెడ్డ ఉపాధ్యాయుడి నుంచి ఎక్కువ నేర్చుకోగలగడం
3. జీవితావకాశాల గురించి, ప్రత్యామ్నాయాల గురించి
4. విద్యార్థిలో ఏ లక్షణం ఉండకుండా ఉంటే మంచిది?
3. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
సమాజ అభివృద్ధిలో శ్రమకు భాగం ఉంటుంది. ఒకరు మరొకరికోసం శ్రమిస్తారు. పిల్లల బాగుకోసం తల్లిదండ్రులు శ్రమిస్తారు. పంట పండించడానికి రైతు శ్రమిస్తాడు. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయుడు శ్రమిస్తాడు. దేశాన్ని శత్రువుల నుండి రక్షించడానికి సైనికుడు పడే శ్రమ అద్వితీయం. సమాజం నుంచి నువ్వు పొందుతున్నదంతా ఎవరో ఒకరు విశ్రాంతి లేకుండా కష్టపడితే వచ్చిందే. వారి శ్రమను గుర్తించి, వారిని గౌరవించి వారి పట్ల కృతజ్ఞతతో ఉండు. వారికి ఏది తిరిగి ఇవ్వగలవో ఆలోచించు. సమాజం సృష్టించిన సంపదలను పాడుచేసే హక్కు ఎవరికీ లేదు. దానిని మరింత పెంచడమే నీకు నాకు కర్తవ్యం.
ప్రశ్నలు – జవాబులు:
1. మన కర్తవ్యమేమిటి ?
జవాబు:
సమాజం సృష్టించిన సంపదలను పెంచడం.
2. ఎవరి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి?
జవాబు:
శ్రమించేవారి పట్ల
3. సైనికుడు ఏమి చేస్తాడు?
జవాబు:
దేశాన్ని సృష్టించిన సంపదలను పెంచడం.
4. పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
పంట పండించడానికి ఎవరు శ్రమిస్తారు?
4. కింది పరిచిత గద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.
నేను రామనాథపురంలో హైస్కూల్లో స్థిరపడగానే నాలోని పదిహేనేళ్ళ జిజ్ఞాసి మేల్కొన్నాడు. తనముందు పరచుకొని ఉన్న జీవితావకాశాల గురించి ప్రత్యామ్నాయాల గురించి ఇతమిద్ధంగా ఏమీ తెలుసుకోలేని ఒక నవ ఔత్సాహికుడికి నా ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమోన్ ఆదర్శపథనిర్దేశకుడయ్యాడు. తన ఉదార విశాల దృక్పథంతో ఆయన తన తరగతి గదిలోని విద్యార్థుల్ని ఉత్సాహపరిచేవాడు. ‘మందబుద్ధి’ శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకోగలిగిన దానికన్న ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుని నుంచి కూడా ఎక్కువ నేర్చుకోగలడు అనేవాడాయన.
ప్రశ్నలు – జవాబులు:
1. జిజ్ఞాసువు అంటే ఎవరు?
జవాబు:
తెలియని దానిని తెలుసుకోవాలనే ఇచ్ఛ కలవాడు.
2. కలాంకు మార్గదర్శకుడెవరు?
జవాబు:
ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమోన్.
3. పై పేరా ప్రకారం నేర్చుకోవడం అనేది ఎవరిపై ఆధారపడి ఉంటుంది?
జవాబు:
విద్యార్థి
4. పై పేరాను చదివి ఒక ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
కలాం పూర్తి పేరు ఏమిటి?
5. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. III – 2015-16)
భారతదేశంలో 8.7 కోట్ల మంది బాలలు పాఠశాలలకు వెళ్ళడం లేదని, వీరంతా ఇళ్ళలోను, కర్మాగారాల్లోను, పొలాల్లోను పనిచేస్తున్నారని ‘గ్లోబల్ మార్చ్ ఎగనెస్ట్ చైల్డ్ లేబర్’ అనే అంతర్జాతీయ సంస్థ పేర్కొంది. కాబట్టి బాలకార్మికుల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పాలి. వాళ్ళు చదువుకొనే అవకాశం కల్పించాలి. మనరాష్ట్రంలో 16 లక్షల మంది బాలకార్మికులు ఉన్నారు. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా రూపు మాపేందుకు ప్రభుత్వం తగుచర్యలు తీసుకొంటున్నది.
ప్రశ్నలు – జవాబులు:
1. బాలకార్మికుల స్థితిగతులపై పరిశోధన చేసిన సంస్థ ఏది?
జవాబు:
గ్లోబల్ మార్చ్ ఎగనెస్ట్ చైల్డ్ లేబర్ అనే అంతర్జాతీయ సంస్థ.
2. బాలకార్మికులు పనిలోకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏమిటి?
జవాబు:
ఆర్థిక సమస్యలు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేని స్థితి వలన.
3. పై పేరాను ఆధారం చేసుకుని రెండు ప్రశ్నలను తయారు చేయండి.
జవాబు:
1) బాలకార్మిక వ్యవస్థ రూపుమాపడానికి ఏం చేయాలి?
2) మన రాష్ట్రంలో ఎంతమంది బాలకార్మికులున్నారు?
6. కింది పేరా చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. II – 2017-18)
మోతీలాల్ నెహ్రూ భార్య పేరు స్వరూపరాణి. మంచి సుగుణవతి. ఈ దంపతులకు 1889వ సంవత్సరం నవంబరు 14న ఒక పుత్రుడు జన్మించాడు. జవహర్ అని పేరు పెట్టారు. జవహర్ అంటే రత్నం లేక మణి అని అర్థం. ఆయనే శాంతిదూతయై, భారతరత్నమై భారతదేశానికి విలువైన సేవల్ని అందించాడు. మొదటి ప్రధానిగా దేశాన్ని అభివృద్ధి పధంలోకి నడిపించాడు.
ప్రశ్నలు – జవాబులు:
1. మొదటి భారత ప్రధాని ఎవరు?
జవాబు:
జవహర్‌లాల్ నెహ్రూ
2. జవహర్ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
రత్నం / మణి
3. నవంబరు 14ను ఏ దినంగా జరుపుకుంటాం?
జవాబు:
బాలల దినోత్సవం
4. ఈ పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
జవహర్ తల్లి పేరేమి?
7. సజ్జన సహవాసం సత్యవాక్యాలనే పలికింపజేస్తుంది. బుద్ధిమాంద్యాన్ని పోగొడుతుంది. గౌరవాన్ని కలిగిస్తుంది. పాపాలను దూరం చేస్తుంది. కీర్తిని వ్యాపింపజేస్తుంది. మనో వికాసాన్ని కలిగింపజేస్తుంది. సజ్జన సహవాసం సమస్త ప్రయోజనాలనూ సాధిస్తుంది.
ప్రశ్నలు – జవాబులు :
1. పాపాలను దూరం చేసేది ఏది?
జవాబు:
సజ్జన సహవాసం
2. ‘కీర్తి’ వ్యతిరేకపదం ఏది?
జవాబు:
అపకీర్తి
3. ‘గౌరవం’ వికృతి పదం ఏది?
జవాబు:
గారవం
4. ‘సజ్జనులు’ విడదీయము.
జవాబు:
సత్ + జనులు
8. సంపదకు, సౌజన్యం, పరాక్రమానికి వాక్సంయమం, విద్యకు వినయం, మంచి జ్ఞానానికి శాంతి, అధిక ధనానికి దానం, శక్తికి ఓర్పు, ధర్మాచరణకు దంభం లేకపోవడం అలంకారాలు. ఈ అలంకారాలన్నింటి కన్నా శీలమే మేలైన అలంకారం.
ప్రశ్నలు – జవాబులు:
1. పరాక్రమానికి అలంకారం ఏది?
జవాబు:
వాక్సంయమం
2. శాంతి దేనికి అలంకారం ఏది?
జవాబు:
మంచిజ్ఞానం
3. శక్తికి అలంకారం ఏది?
జవాబు:
ఓర్పు
4. అన్నిటికన్న మేలైన అలంకారం?
జవాబు:
శీలం
9. ఈ కింది పేరా చదవండి. చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. I – 2018-19)
ముగ్గురు మిత్రులు సముద్రం దగ్గర ఉన్న ఎత్తైన ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడొక వ్యక్తి నిలబడి ఉండటం చూశారు. మొదటి మిత్రుడు “బహుశా అతని పెంపుడు జంతువు తప్పిపోతే వెతుకుతున్నాడేమో” అన్నాడు. రెండవ మిత్రుడు “అదేం కాదు. ఎవరో స్నేహితుడు వస్తానని ఉంటాడు. అతనికోసం వచ్చినట్లున్నాడు” అన్నాడు. మూడవ మిత్రుడు “వేసవి కాలం కదా ! చల్లగాలి కోసం వచ్చినట్లున్నాడు” అన్నాడు. ముగ్గురూ వెళ్ళి” ఇక్కడికి ఎందుకు వచ్చారు ? అని అతనిని అడిగారు. అతను “ఊరికినే రావాలనిపించింది – వచ్చాను. నిలబడాలనిపించింది. నిలబడ్డాను” అన్నాడు. ముగ్గురు మిత్రులూ అవాక్కయ్యారు.
ఎదుటివారి గురించి ఏ ఆధారమూ లేకుండా ఏదేదో ఊహించుకోవడం పొరపాటు అని వారికి అర్థమైంది.
ప్రశ్నలు:
1) ఈ కథలో సందేశం ఏమిటి?
2) ఈ కథకు ఒక పేరు పెట్టండి.
3) “అవాక్కవడం” అంటే ఏమిటి?
4) పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచెయ్యండి.
జవాబులు:
1) ఎదుట వారి గురించి ఏ ఆధారము లేకుండా ఏదేదో ఊహించుకోవడం పొరపాటు అని చెప్పడం.
2) కాలక్షేపానీకొక మాట
3) మాటరాకపోవడం
4) పై పేరాలో కాలాన్ని తెలిపే పదం గుర్తించండి.
II. స్వీయరచన
అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
‘ఆత్మకథ’ ప్రక్రియ గురించి రాయండి.
జవాబు:
ఒక వ్యక్తి తన జీవిత విశేషాల్ని తానే గ్రంథస్థం చేసుకుంటే అది అత్మకథ. దీనినే ‘స్వీయచరిత్ర’ అని కూడా అంటారు. ఇందులో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి. రచయిత అనుభవాలేకాక, ఆ కాలం నాటి సాంఘిక, ఆర్థిక రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి. ఆత్మకథ ఇతరులకు ప్రేరణ కలిగిస్తుంది. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది.
ప్రశ్న 2.
‘ప్రేరణ’ పాఠ్యభాగ రచయిత గురించి రాయండి.
జవాబు:
‘ప్రేరణ’ పాఠ్యభాగాన్ని రచించినది డా|| అవుల్ ఫకీర్ జైనులాబీన్ అబ్దుల్ కలాం (ఏ.పి.జె. అబ్దుల్ కలాం)
జననం : 15-10-1931
మరణం : 27-07-2015
జన్మస్థలం : ధనుష్కోటి (తమిళనాడు)
రచనలు : ఒక విజేత ఆత్మకథ, ఇగ్నైటెడ్ మైండ్స్, ద వింగ్స్ ఆఫ్ ఫైర్, యాన్ ఆటోబయోగ్రఫి.
బిరుదులు : పద్మభూషణ్, పద్మవిభూషణ్, గౌరవ డాక్టరేట్లు, భారతరత్న.
ఆ) క్రింది ప్రశ్నలకు పది లేక పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
‘పెద్దలమాట చద్దిమూట’ అన్నారు పెద్దలు. కలాం విషయంలో తండ్రి, గురువుల పలుకులు ఏ మేరకు ఆయన కృతకృత్యుణ్ణి చేసాయి?
జవాబు:
ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుని జీవితం ఎందరికో ప్రేరణ. ఆయనెవరో కాదు డా|| అవుల్ ఫకీర్ జైనులాల్దీన్ అబ్దుల్ కలామ్. ఏ.పి.జె. అబ్దుల్ కలాంగా ప్రసిద్ధులైన వీరి జీవితం అంత సాఫీగా ఏమీ సాగలేదు. అడుగడుగునా పరీక్షలతో, ఒత్తిళ్ళతో గడిచినా చివరకు విజయం సొంతం చేసుకున్నాడు. ఆయన విజయ సోపానాలకు ఆధారం గురువుల, తండ్రి మాటలే. కలాం గురువులలో ప్రథమంగా చెప్పుకోవల్సిన వ్యక్తి ఇయదురై సోలోమోన్. జీవితంలో పట్టు సాధించాల్సి ఉంటుంది. అవి “కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడమూ” అని కలాంకి ఆదర్శపథ నిర్దేశకుడయ్యాడు. అంతేకాక “విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు” అని ఆత్మగౌరవాన్ని మేల్కొల్పాడు.
లక్ష్యాన్ని చేరే సమయంలో వివిధ రకాల వ్యక్తులతో పరిచయాలు, వైఫల్యాలు, ఆశాభంగాలు, దారితప్పిన ప్రతివేళా కలాం తండ్రి మాటలు కలాంను మళ్ళీ సరిగా నిలబెట్టేవి. ఆ ఉత్తేజకరమైన మాటలు “ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని. కానీ తన్ను తాను తెలుసుకున్న వాడే వివేకి. వివేకం లేని విజ్ఞానం, ప్రయోజన శూన్యం” అలాగే ప్రొఫెసర్ స్పాండర్, “నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచిపేరు తేవడానికి ఉపకరిస్తుంది. దేవుడే ఆశా, ఆశ్రయమూ, మార్గదర్శి కాగలడు. భవిష్యత్ లో నీ ప్రయాణానికి ఆయనే దారిచూపే దీపం కాగలడు” అన్న ఆ మహామేధావి మాటలు కలాం ఉన్నతికి దోహదపడ్డాయి.
ప్రశ్న 2.
మీరా అనే విద్యార్థిని శాస్త్రవేత్త కావాలని కోరుకుంది. ఆమె తన పాఠశాలకు వచ్చిన ఒక శాస్త్రవేత్తను ఏయే విషయాలను గురించి ప్రశ్నలను అడగ దలచినదో ఊహించి 10 ప్రశ్నలు రాయండి.
జవాబు:
మీరా : నమస్కారమండి.
- మీరు శాస్త్రవేత్త కావాలనే కోరిక ఏ వయసులో కలిగింది?
- శాస్త్రవేత్త అవడానికి గల కారణాలేమిటి?
- శాస్త్రవేత్త అవడానికి ప్రేరణ ఇచ్చిన ఉపాధ్యాయులు ఎవరు?
- మీ తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల సహకారం ఎంత ఉంది?
- మీ స్నేహితులు ఎలా సపోర్టు చేశారు?
- ఆర్థికంగా ఏవైనా ఇబ్బందులు ఏర్పడ్డాయా?
- ఎటువంటి అభ్యాసం చేశారు?
- ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చాయా?
- మిమ్మల్ని ముందుకు నడిపించిన మార్గదర్శకులు ఎవరు?
- మాలాంటి వారికి మీరిచ్చే సూచనలు ఏమిటి?
ప్రశ్న 3.
కింది వివరాల ఆధారంగా “ఏ.పి.జె. అబ్దుల్ కలాం” జీవిత విశేషాలను వర్ణనాత్మకంగా ఒక క్రమపద్ధతిలో రాయండి.
* పూర్తి పేరు : అవుల్ ఫకీర్ జైనులాథీన్ అబ్దుల్ కలామ్
* జననం : 15 అక్టోబర్, 1931
* జన్మస్థలం : రామేశ్వరం, మద్రాస్ ప్రెసిడెన్సీ (గతంలో) ధనుష్కోటి రామనాథపురం, తమిళనాడు (ఇప్పుడు)
* భారత రాష్ట్రపతి : 2002 – 2007.
* విద్య : మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (1955-1960)
* అవార్డులు : భారతరత్న, పద్మభూషణ్, పద్మ విభూషణ్, హూవర్ మెడల్
* మరణం : 27 జూలై, 2015, షిల్లాంగ్, మేఘాలయ
* రచనలు : వింగ్స్ ఆఫ్ ఫైర్
జవాబు:
అందరూ ఏ.పి.జె అబ్దుల్ కలాంగా పిలిచే డాక్టర్ అబ్దుల్ ఫకీర్ జైనుల్ ఆబిదీన్ అబ్దుల్ కలాం 1931 అక్టోబరు 15న తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ధనుష్కోటి (మద్రాస్ ప్రెసిడెన్సీ (గతంలో) రామనాథపురం, తమిళనాడు (ఇప్పుడు)లో జన్మించారు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, జ్ఞాన జిజ్ఞాసతో మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (1955-60) విద్య నభ్యసించారు. అనతికాలంలోనే ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా (2002-2007) తమ సేవలను ఈ జాతికి అందించారు.
‘ఒక విజేత ఆత్మకథ’ (ఇగ్నేటెడ్ మైండ్స్ ద వింగ్స్ ఆఫ్ ఫైర్ – యాన్ – ఆటోబయోగ్రఫీ) వంటి రచనలు చేశారు.
శాస్త్ర రంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మభూషణ్, పద్మవిభూషణ్ తో పాటు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నతోను భారత ప్రభుత్వం సత్కరించింది. దేశవిదేశాల్లోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో, హూవర్ మెడల్ తో ఆయనను గౌరవించాయి.
భారతదేశానికి ఒక శాస్త్రవేత్త రాష్ట్రపతి అయ్యాడని ప్రపంచమంతా ఇండియా వైపు తలయెత్తి చూసింది. అంత ఘనత నిచ్చిన ఆ మహనీయుడు జులై 27, 2015లో మేఘాలయ లోని షిల్లాంగ్ లో మరణించారు.
III. భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)
1. పర్యాయపదాలు :
స్పృహ : ఇచ్ఛ, కోరిక
వ్యతాసం : భేదం, తేడా
2. వ్యుత్పత్త్యర్థాలు :
ఉపాధ్యాయుడు : వేదమును చదివించువాడు, చదువు చెప్పువాడు (గురువు)
3. నానార్థాలు :
వ్యవధి = మేర, ఎడమ
నిర్దేశం = ఉపదేశం, చూపుట
చైతన్యం = తెలివి, ప్రాణం
4. ప్రకృతి – వికృతులు :
శిష్యుడు – సిసువడు
కష్టం – కసటు, కస్తి
లక్ష్యం – లేక్క
శక్తి – సత్తి
ఆశా – ఆస
త్యాగం – చాగం
శూన్యం – సున్న
భూమి బూమి
ఆసక్తి – ఆసత్తి
శాస్త్రం – చట్టం
రేఖా – రేక
5. సంధులు :
అమిత + ఆసక్తి – అమితాసక్తి – సవర్ణదీర్ఘ సంధి
విద్యా + అర్థి – విద్యార్థి – సవర్ణదీర్ఘ సంధి
రామ + ఈశ్వరం – రామేశ్వరం – గుణసంధి
తల్లి + తండ్రి – తల్లిదండ్రులు – గసడదవాదేశ సంధి
కష్ట + ఆర్జితం – కష్టార్జితం – సవర్ణదీర్ఘ సంధి
గ్రంథము + లు – గ్రంథాలు – లులనల సంధి
ఏక + ఏక – ఏకైక – వృద్ధి సంధి
ప్రతి + ఏక – ప్రత్యేక – యణాదేశ సంధి
వాక్ + దానం – వాగ్దానం – అనునాసిక సంధి
6. సమాసాలు :
గురుశిష్యులు – గురువు మరియు శిష్యుడు – ద్వంద్వ సమాసం
జీవిత గమనం – జీవితం యొక్క గమనం – షష్ఠీ తత్పురుష సమాసం
అమితాసక్తి – అమితమైన ఆసక్తి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
దృఢ సంకల్పం – దృఢమైన సంకల్పం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
అదృశ్యం – దృశ్యము కానిది – నఞ్ తత్పురుష సమాసం
తాగ్య నిరతి – త్యాగము నందు ఆసక్తి – సప్తమీ తత్పురుష సమాసం
జ్ఞానతృష్ణ – జ్ఞాన సంపాదనమందు ఆసక్తి – సప్తమీ తత్పురుష సమాసం
నిశిత బోధన – నిశితమైన బోధన – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
9th Class Telugu 4th Lesson ప్రేరణ 1 Mark Bits
1. సురేఖకు అందరూ బాగుండాలని ఆకాంక్ష – (గీత గీసిన పదానికి అర్ధం గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) ఆంక్ష
బి) కోరిక
సి) ఆశయం
డి) కోరకం
జవాబు:
బి) కోరిక
2. దేవతలు సముద్రం మధించగా, పయోధి నుంచి అమృతం సిద్ధించింది. (గీత గీసిన పదాలకు సరియగు పర్యాయ పదం గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) సరోవరం
బి) కాసారం
సి) అకూపారం
డి) కాపారం
జవాబు:
సి) అకూపారం
3. పెద్దలపట్ల గారవమును ప్రదర్శించుట మంచిది – (ప్రకృతి పదం గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) గర్వము
బి) గరువము
సి) గౌరవం
డి) గార్వం
జవాబు:
సి) గౌరవం
4. భూమి మీద ఎన్నో నిక్షేపాలున్నాయి – (గీత గీసిన పదానికి పర్యాయ పదం గుర్తించండి)(S.A. II . 2018-19)
ఎ) వసుధ – అవని
బి) వసుధ – సుధ
సి) వసుధ – ఆమని
డి) వసుధ – నింగి
జవాబు:
ఎ) వసుధ – అవని
5. మంచి వాని పథంలో పయనించాలి. ఆ దారి పదుగురికి మార్గదర్శకమవుతుంది. (గీత గీసిన పదాలకు సరియగు పర్యాయ పదం గుర్తించండి) (S.A. I – 2017-18)
ఎ) పదవి
బి) మార్గం
సి) మార్దవం
డి) మాలోకం
జవాబు:
బి) మార్గం
6. ధనం కంటే విద్య మిన్నయైనది. (అర్థం గుర్తించండి) (S.A. III – 2016-17)
ఎ) అనువు
బి) మనస్సు
సి) ఎక్కువ
డి) హృదయం
జవాబు:
సి) ఎక్కువ
7. చాలా మంచి కథలు నాన్నచేత చెప్పబడ్డాయి. (కర్తరి వాక్యాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) చాలా మంచి కథలు ఎవరో చెప్పారు.
బి) నాన్న చాలా మంచి కథలు చెప్పబడ్డాయి.
సి) నాన్న చాలా మంచి కథలు చెప్పాడు.
డి) మంచి కథలు ఎవరు చెప్పినా వినాలి.
జవాబు:
సి) నాన్న చాలా మంచి కథలు చెప్పాడు.
8. రమేష్ భారతాన్ని చదివాడు. (కర్మణి వాక్యాన్ని గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) రమేష్ చేత భారతం చదువబడింది.
బి) రమేష్ చేత భారతం అనువదించబడింది.
సి) రమేష్ చేత భారతం చదువబడలేదు.
డి) రమేష్ చేత భారతం విడువబడింది.
జవాబు:
ఎ) రమేష్ చేత భారతం చదువబడింది.
9. నా చేత ఎన్నో పుస్తకాలు వ్రాయబడ్డాయి. (కర్తరి వాక్యాన్ని గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) ఎన్నో పుస్తకాలు నాచేత వ్రాయబడ్డాయి.
బి) ఎన్నో పుస్తకాలను వ్రాశాను.
సి) ఎన్నో పుస్తకాలే వ్రాశాను.
డి) నేను ఎన్నో పుస్తకాలను వ్రాశాను.
జవాబు:
డి) నేను ఎన్నో పుస్తకాలను వ్రాశాను.
10. శ్రీనివాసన్ కలాంను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. (ఈ కర్తరి వాక్యానికి కర్మణి వాక్యాన్ని గుర్తించండి.)(S.A. III – 2016-17)
ఎ) శ్రీనివాసన్ చేత కలాం ఆప్యాయంగా కౌగిలించుకోబడ్డాడు.
బి) శ్రీనివాసన్, కలాం ఒకరినొకరు కౌగిలించుకున్నారు.
సి) శ్రీనివాసన్, కలాం ఆప్యాయంగా కౌగిలించుకోబడలేదు.
డి) శ్రీనివాసన్, కలాం కౌగిలించుకోలేదు.
జవాబు:
ఎ) శ్రీనివాసన్ చేత కలాం ఆప్యాయంగా కౌగిలించుకోబడ్డాడు.
11. తమ విమానాన్ని తామే తయారు చేసుకుంటాం అని కలాం అన్నారు. (ప్రత్యక్ష కథనం గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) “మా విమానాన్ని మేము తయారు చేయమ”ని కలాం అన్నారు.
బి) “మా విమానాన్ని మేమే తయారు చేసుకుంటాం” అని కలాం అన్నారు.
సి) “మా విమానాన్ని వేరే వారు తయారు చేస్తారు” అని కలాం అన్నారు.
డి) “మేమెప్పటికీ విమానం తయారు చేయం” అన్నారు కలాం.
జవాబు:
బి) “మా విమానాన్ని మేమే తయారు చేసుకుంటాం” అని కలాం అన్నారు.
12. గోపాల్ ఏ పనినైనా చేయగలడు. (ఏ రకమైన వాక్యమో గుర్తించండి) (S.A. II – 2018-19 S.A. II – 2017-18)
ఎ) ఆశ్చర్యార్థకం
బి) వ్యతిరేకార్థకం
సి) సామర్థ్యార్థకం
డి) అభ్యర్థకం
జవాబు:
సి) సామర్థ్యార్థకం
13. మీరు బయటకు వెళ్ళవచ్చును. (ఏ రకమైన వాక్యమో గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) అనుమత్యర్థకం
బి) ప్రశ్నార్థకం
సి) నిశ్చయార్థకం
డి) శత్రర్థకం
జవాబు:
ఎ) అనుమత్యర్థకం
14. ‘లోపలికి రావడం’ (అనుమత్యర్థకం గుర్తించండి) (S.A. II – 2017-18) (ఎ)
ఎ) లోపలికి రావచ్చు
బి) లోపలికి రా
సి) లోపలికి రావద్దు
డి) లోపలికి రాగలడు
జవాబు:
ఎ) లోపలికి రావచ్చు
15. ఏదో ఓ కొత్త విషయం చెప్పాలి. (వాక్యానికి వ్యతిరేకార్థం వచ్చే వాక్యాన్ని గుర్తించండి.) (S.A. III – 2016-17)
ఎ) ఏదో ఓ కొత్త విషయం చెప్పకూడదు.
బి) ఏదో ఓ కొత్త విషయం చెప్పేశాడు.
సి) ఏదో ఓ కొత్త విషయం చెప్పను.
డి) ఏదో ఓ కొత్త విషయం చెప్పలేదు.
జవాబు:
ఎ) ఏదో ఓ కొత్త విషయం చెప్పకూడదు.
భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)
1. అర్థాలు :
16. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యంతో చదవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) పంతం
B) గురి
C) సరదా
D) నిర్లక్ష్యం
జవాబు:
A) పంతం
17. ప్రతిభ ఉంటే గుర్తింపు అదే వస్తుంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) నేర్పు
B) బద్దకం
C) తెలివి
D) వినయం
జవాబు:
C) తెలివి
18. చైతన్యం లేకపోతే పశువుకి, మనిషికి తేడా ఏమిటి? – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) జ్ఞానం
B) కదలిక
C) మాట
D) నిద్ర
జవాబు:
A) జ్ఞానం
19. స్వార్థం విడిచి, దేశ ప్రగతికోసం అందరూ ప్రయత్నించాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) కులం
B) మతం
C) ప్రాంతం
D) అభివృద్ధి
జవాబు:
D) అభివృద్ధి
20. ఉత్తములైన పెద్దల ఆధ్వర్యంలో ముందుకు నడవాలి – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) ఆశీస్సు
B) పెత్తనం
C) ఇష్టం
D) మాట
జవాబు:
B) పెత్తనం
21. నాలోని పదిహేనేళ్ళ జిజ్ఞాస మేల్కొంది – గీత గీసిన పదానికి అర్థం ఏమిటి?
A) జ్ఞానము
B) అజ్ఞానము
C) తెలుసుకోవాలనే కోరిక
D) విజ్ఞానం
జవాబు:
C) తెలుసుకోవాలనే కోరిక
22. మా ఉపాధ్యాయుడు విద్యార్థులందరిలో ఏదో ఒక విలువ గురించి స్మృహని మేల్కొల్పేవాడు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) జానం
B) కోరిక
C) ప్రేమ
D) వైరాగ్యం
జవాబు:
B) కోరిక
2. పర్యాయపదాలు :
23. సామాజిక స్పృహతో ప్రతి ఒక్కరు మసలుకోవాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ఇచ్ఛ, ఆకలి
B) కోరిక, క్షామం
C) ఇచ్ఛ, కోరిక
D) కాంక్ష, ఒత్తిడి
జవాబు:
C) ఇచ్ఛ, కోరిక
24. ధనిక, పేద అనే వ్యత్యాసం తొలగినపుడే సమాజం బాగుంటుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి
A) భేదం, ప్రబోధం
B) తేడా, భేదం
C) తేడా, కలయిక
D) కూడిక, తేడా
జవాబు:
B) తేడా, భేదం
25. వారు తమ నిశిత బోధనల వల్ల నాలో తృష్ణని జాగరితం చేశారు – గీత గీసిన పదానికి సమానార్థక పదం ఏది?
A) మేల్కొల్పడం
B) పెంచడం
C) తగ్గించడం
D) అధికం
జవాబు:
A) మేల్కొల్పడం
26. అపరిచితుల గుంపులో నీ పాతమిత్రుడిని పసిగట్టడం వంటిది – గీత గీసిన పదానికి సమానార్థాన్ని గుర్తించండి.
A) తెలియడం
B) వెదకడం
C) సూచనగా తెలిసికోవడం
D) గుర్తింపకపోవడం
జవాబు:
C) సూచనగా తెలిసికోవడం
27. అది నా తండ్రికి తలకు మించిన ఖర్చు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) తాత, అత్త
B) జనకుడు, అయ్య
C) నాన్న, అమ్మ
D) ఆర్య, పిత
జవాబు:
B) జనకుడు, అయ్య
28. ఉపాధ్యాయుడు సోలోమాన్ మాకు మార్గనిర్దేశకుడు గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ఆచార్యుడు, పూజారి
B) గురువు, ఛాత్రుడు
C) అధ్యాపకుడు, ఒజ్జ
D) ఒజ్జ, మిత్రుడు
29. విశ్వాసంతో నీవు, నీ విధిని తిరిగి రాయగలవు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు ఏవి?
A) కర్మం, ధర్మం
B) అదృష్టం, దురదృష్టం
C) బ్రహ్మ, చతురాననుడు
D) తలరాత, విధాత
జవాబు:
C) బ్రహ్మ, చతురాననుడు
3. వ్యుత్పత్తరాలు :
30. వేదమును చదివించువాడు – అనే వ్యుత్పత్తి గల పదాన్ని గుర్తించండి.
A) గురువు
B) వేదవ్యాసుడు
C) ఉపాధ్యాయుడు
D) వేదజ్ఞుడు
జవాబు:
C) ఉపాధ్యాయుడు
31. ‘గురువు‘ గారు ఇటురారు – గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.
A) జ్ఞానం ఇచ్చేవాడు
B) అంధకారమనే అజ్ఞానాన్ని ఛేదించేవాడు
C) చీకటి పోగొట్టేవాడు
D) వెలుగును ప్రసాదించేవాడు
జవాబు:
B) అంధకారమనే అజ్ఞానాన్ని ఛేదించేవాడు
4. నానార్థాలు :
32. ప్రతి ఒక్కరు చదువు ద్వారా చైతన్యవంతులు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) జ్ఞానం, అజ్ఞానం
B) తెలివి, ప్రాణం
C) ప్రాణం, నీరు
D) తెలివి, స్పర్శ
జవాబు:
B) తెలివి, ప్రాణం
33. పెద్దలు నిర్దేశించిన పనులనే పిల్లలు చేయాలి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) ఉపదేశం, ఆదేశం
B) చూపుట, ఆజ్ఞ
C) ఉపదేశం, చూపుట
D) మాట, పాట
జవాబు:
C) ఉపదేశం, చూపుట
34. వ్యవధులు దాటితే అవరోధాలు ఎదురవుతాయి – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) మేర, ఎడమ
B) హద్దు, పొద్దు
C) దారి, తెన్ను
D) కాలం, మాట
జవాబు:
A) మేర, ఎడమ
35. నమ్మకం, ఆశ పెట్టుకోవాలి – గీత గీసిన పదానికి నానార్థాలు ఏవి?
A) కోరిక, వాంఛ
B) ఆకాంక్ష, అపనమ్మకం
C) కోరిక, దిక్కు
D) విశ్వాసం, ప్రేమ
జవాబు:
C) కోరిక, దిక్కు
36. విధి నీతో ఆటలాడుకుంటోంది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి. –
A) బ్రహ్మ, భాగ్యం
B) కర్తవ్యం , దేవుడు
C) దైవం, పరమాత్మ
D) కాలం, కర్మం
జవాబు:
A) బ్రహ్మ, భాగ్యం
5. ప్రకృతి – వికృతులు :
37. గురు శిష్య సంబంధం లోకంలో అత్యున్నతమైనది -గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) శిశువు
B) సిసువుడు
C) చట్టు
D) సిశువు
జవాబు:
B) సిసువుడు
38. ఆశకు లోనై మనిషి పతనమౌతున్నాడు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) అస
B) ఆసా
C) ఆస
D) అసా
జవాబు:
C) ఆస
39. చదువుపట్ల ఆసక్తి ఉండాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) ఆసత్తి
B) ఇష్టం
C) అసత్తి
D) ఆస
జవాబు:
A) ఆసత్తి
40. ‘కష్టేఫలి‘ అన్నారు పెద్దలు – గీత గీసిన పదానికి వికృతి
A) కస్టం
B) కాస్తి
C) కషటు
D) కసటు
జవాబు:
D) కసటు
41. ఎందరో వీరుల త్యాగఫలం మననేటి స్వేచ్చకు మూలధనం – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) తాగం
B) చాగం
C) దానం
D) కష్టం
జవాబు:
B) చాగం
42. పెద్దలమాట లక్ష్యం లేనపుడు పతనానికి దారితీస్తుంది – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) అశ్రద్ధ
B) శ్రద్ధ
C) లెక్క
D) పెడచెవి
జవాబు:
C) లెక్క
43. శూన్యం నిన్ను ప్రశ్నిస్తుంది. నీలో ఏముందని – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) సున్నం
B) ఆకాశం
C) చదువు
D) సున్న
జవాబు:
D) సున్న
44. జ్ఞానం ఉన్నవారే మరొకరికి పంచగలరు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) నాన
B) గ్యానం
C) సిగ్గు
D) బుద్ధి
జవాబు:
A) నాన
45. మహాత్ముల గూర్చి రేఖా మాత్రంగా తలచుకున్న మంచి జరుగుతుంది – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) ఏ
B) తక్కువ
C) రేక
D) కొద్ది
జవాబు:
C) రేక
46. సత్తి లేనపుడు కష్టమైన పనులకు పూనుకోకూడదు – గీత గీసిన పదానికి వికృతి పదం గురించండి.
A) బలం
B) శక్తి
C) సత్తువ
D) సామర్థ్యం
జవాబు:
B) శక్తి
47. నీవు ఎక్కడికి ప్రయాణం అయ్యావు? – గీత గీసిన పదానికి వికృతి ఏది?
A) పయాణం
B) యానం
C) పయనం
D) పాయనం
జవాబు:
C) పయనం
48. బంగారు గాజులు కనబడడం లేదు – గీత గీసిన పదానికి ప్రకృతిని గుర్తించండి.
A) కనకము
B) స్వర్ణము
C) భృంగారము
D) పైడి పదం గుర్తించండి.
జవాబు:
C) భృంగారము
49. శంఖము ఊదినా, వినబడడం లేదు – గీత గీసిన పదానికి వికృతి ఏది?
A) సంకు
B) సంఖం
C) జంకు
D) సన్నాయి
జవాబు:
A) సంకు
6. సంధులు:
50. ‘విద్యార్థి’ విడదీయుము.
A) విద్యా + అర్థి
B) విద్దె + అర్థి
C) విద్య + అర్థి
D) విద + అర్థ
జవాబు:
A) విద్యా + అర్థి
51. సవర్ణదీర్ఘ సంధికి ఉదాహరణ రాయండి.
A) కష్టార్జితం
B) గ్రంథాలు
C) రామేశ్వరం
D) ప్రత్యేకం
జవాబు:
A) కష్టార్జితం
52. ‘తల్లి + తండ్రి’ – సంధి చేయండి.
A) తల్లిదండ్రి
B) తల్లితండ్రులు
C) తల్లిదండ్రులు
D) తల్లితండ్రి
జవాబు:
C) తల్లిదండ్రులు
53. ‘ఏకెక’ సంధి పేరు రాయండి.
A) ఆమ్రేడిత సంధి
B) వృద్ధి సంధి
C) గుణసంధి
D) యణాదేశ సంధి
జవాబు:
B) వృద్ధి సంధి
54. కింది వానిలో అనునాసిక సంధికి ఉదాహరణ ఏది?
A) రామేశ్వరం
B) అమితాసక్తి
C) గ్రంథాలు
D) వాజ్మయం
జవాబు:
D) వాజ్మయం
55. ‘ప్రతి + ఏకం’ – పదాలను కలపండి.
A) ప్రతేకం
B) ప్రతిఏకం
C) ప్రత్యేకం
D) ప్రత్యేకం
జవాబు:
C) ప్రత్యేకం
56. ‘గ్రంథాలు’ విడదీయుము.
A) గ్రంథ + ఆలు
B) గ్రంథము + లు
C) గ్రంథి + ఆలు
D) గ్రంథము + ఆలు
జవాబు:
B) గ్రంథము + లు
57. అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైన క్రమంగా ఏ, ఓ, అర్లు వచ్చును. ఇది ఏ సంధి సూత్రమో గుర్తించండి.
A) సవర్ణదీర్ఘ సంధి
B) వృద్ధి సంధి
C) యణాదేశ సంధి
D) గుణసంధి
జవాబు:
D) గుణసంధి
58. ‘బలోపేతం’ పదాన్ని విడదీయండి.
A) బలో + పేతం
B) బలా + ఉపేతం
C) బల + అపేతం
D) బల + ఉపేతం
జవాబు:
D) బల + ఉపేతం
59. విద్యాభ్యాసము బాగా జరుగుతోంది – గీత గీసిన పదం ఉదాహరణను గుర్తించండి.
A) యణాదేశ సంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) వృద్ధి సంధి
D) అత్వ సంధి
జవాబు:
B) సవర్ణదీర్ఘ సంధి
60. ‘సముద్రము + గువ్వలు’ సంధి జరిగిన పిమ్మట ఏర్పడే పదం ఏది?
A) సముద్ర గువ్వలు
B) సముద్రం గువ్వలు
C) సముద్రపు గువ్వలు
D) సముద్రంలో గువ్వలు
జవాబు:
C) సముద్రపు గువ్వలు
7. సమాసాలు :
61. త్యాగనిరతి యందు తరువులే గురువులు – గీత గీసిన పదానికి సమాసం పేరు గుర్తించండి.
A) ద్వంద్వ
B) షబ్న్
C) సప్తమీ
D) ద్విగు
జవాబు:
C) సప్తమీ
62. “జ్ఞాన సంపాదనమందు ఆసక్తి” ఈ విగ్రహవాక్యాన్ని సమాసపదంగా మార్చండి.
A) జ్ఞానాసక్తి
B) జ్ఞానతృష్ణ
C) జ్ఞాన సంపాదనాసక్తి
D) జ్ఞాన సంపాదన తృష్ణ
జవాబు:
B) జ్ఞానతృష్ణ
63. “దృశ్యము కానిది” – సమాసం పేరు గుర్తించండి.
A) నణ్
B) అవ్యయీభావ
C) భ్రాంతి
D) రూపకం
జవాబు:
A) నణ్
64. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఏ సంధి?
A) జ్ఞానతృష్ణ
B) జీవిత గమనం
C) గురుశిష్యులు
D) నిశిత బోధన
జవాబు:
D) నిశిత బోధన
65. గురుశిష్యుల అనుబంధం ఎంతో గొప్పది – గీత గీసిన పదానికి సమాసం పేరు గుర్తించండి.
A) ద్విగువు
B) ద్వంద్వ
C) రూపకం
D) బహుజొహి
జవాబు:
B) ద్వంద్వ
66. ‘కష్టముతో ఆర్జితము’ సమాస పదంగా మార్చండి.
A) కష్టార్జితము
B) కష్ట ఆర్జితము
C) కష్టపు ఆర్జితము
D) కష్టంపు ఆర్జితం
జవాబు:
A) కష్టార్జితము
67. ‘త్యాగనిరతి’ – ఏ సమాసం?
A) సప్తమీ తత్పురుష
B) ద్వితీయా తత్పురుష
C) బహుబ్లిహి
D) ఉపమాన పూర్వపద కర్మధారయం
జవాబు:
A) సప్తమీ తత్పురుష
68. ‘విద్యాభ్యాసము’ పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
A) విద్య కొఱకు అభ్యాసము
B) విద్య యొక్క అభ్యాసము
C) విద్యను అభ్యసించడం
D) విద్యల యందు అభ్యాసము
జవాబు:
B) విద్య యొక్క అభ్యాసము
8. ఆధునిక వచనాన్ని గుర్తించడం :
69. ‘ఆచార్యున కెదిరించకు’ – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) ఆచార్యున కెదిరించు
B) ఆచార్యుని పొగడు
C) గురువును ఎదిరించకు
D) టీచర్ని కాదనకు
జవాబు:
C) గురువును ఎదిరించకు
9. కర్తరి, కర్మణి వాక్యాలను గుర్తించడం:
70. ‘నేనెన్నో పుస్తకాలు రాశాను’ – దీనికి కర్మణి వాక్యాన్న గుర్తించండి. (S.A. I – 2018-19)
A) నేను ఎన్నో పుస్తకాలు రాశా.
B) నా చేత ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి.
C) నా చేత పుస్తకాలు వ్రాయబడినవి.
D) పుస్తకాలు వ్రాసిన వారు నేనే.
జవాబు:
B) నా చేత ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి.
71. ‘జిడ్డు కృష్ణమూర్తి గారు ఎన్నో విషయాలను చెప్పారు’ – ఈ వాక్యం యొక్క కర్మణి వాక్యాన్ని గుర్తించండి. (S.A. II – 2017-18)
A) ఎన్నో విషయాలు జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారు.
B) జిడ్డు కృష్ణమూర్తి గారిచే ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి.
C) జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పే విషయాలు వినాలి.
D) జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పే విషయాలు ఎన్నో.
జవాబు:
B) జిడ్డు కృష్ణమూర్తి గారిచే ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి.
10. ప్రత్యక్ష, పరోక్ష కథనంలోకి మార్చడం :
72. ‘రా నాతో పాటు ముందు కూర్చో’ చెప్పారు ప్రొఫెసరు – దీనికి పరోక్ష కథనాన్ని గుర్తించండి.
A) రమ్మనీ, తనతో పాటు ముందు కూర్చోమనీ ప్రొఫెసరు చెప్పారు.
B) రా నాతో కూర్చో అని ప్రొఫెసరు అన్నారు.
C) వచ్చి నాతో కూర్చో అన్నారు ప్రొఫెసరు.
D) ప్రొఫెసరు రమ్మని, కూర్చోమని అన్నారు.
జవాబు:
A) రమ్మనీ, తనతో పాటు ముందు కూర్చోమనీ ప్రొఫెసరు చెప్పారు.
11. వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించడం :
73. ‘నా మాతృభూమి విస్తృతి ఎంతో గుర్తించాను’ – క్రియను మార్చిన వ్యతిరేక వాక్యాన్ని గుర్తించండి.
A) నా మాతృభూమి విస్తృతి ఎంతో గుర్తించగలను.
B) నా మాతృభూమి విస్తృతి ఎంతో గుర్తించలేదు.
C) నా మాతృభూమి విస్తృతి గుర్తింపలేదు.
D) నా మాతృభూమి విస్తృతి గుర్తించావా?
జవాబు:
B) నా మాతృభూమి విస్తృతి ఎంతో గుర్తించలేదు.
12. వాక్యరకాలను గుర్తించడం :
74. “నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచిపేరు తేవడానికి ఉపకరిస్తుంది” ఇది ఏ రకమైన వాక్యం?
A) ఆశ్చర్యార్థకం
B) అనుమత్యర్థకం
C) ప్రశంసా వాక్యం
D) ప్రశ్నార్థక వాక్యం
జవాబు:
C) ప్రశంసా వాక్యం
75. “దేవుడే నీ ఆశా, ఆశ్రయమూ, మార్గదర్శి కాగలడు” – ఇది ఏ రకమైన వాక్యం
A) సామర్థ్యార్థకం
B) ఆశ్చర్యార్థకం
C) ప్రశంసా వాక్యం
D) నిషేధకం
జవాబు:
A) సామర్థ్యార్థకం
76. ‘ఆంగ్లేయ గ్రంథము లెన్నియో వ్రాయుచున్నారు. ఆంగ్లేయ ఉపన్యాసము లెన్నియో ఇచ్చుచున్నారు’ – ఈ సామాన్య వాక్యాలతో ఏర్పడిన సంక్లిష్ట వాక్యాన్ని గుర్తించండి.
A) ఆంగ్లేయ గ్రంథాలు ఎన్నో వ్రాస్తున్నారు. ఉపన్యాసా లిస్తున్నారు.
B) ఆంగ్లేయ గ్రంథోపన్యాసకులు ఇస్తున్నారు.
C) ఆంగ్లేయ గ్రంథము లెన్నియో వ్రాసి, ఉపన్యాసము లెన్నియో ఇచ్చుచున్నారు.
D) గ్రంథములు వ్రాసి ఉపన్యాసాలిచ్చుచున్నారు.
జవాబు:
C) ఆంగ్లేయ గ్రంథము లెన్నియో వ్రాసి, ఉపన్యాసము లెన్నియో ఇచ్చుచున్నారు.
13. ప్రక్రియలను గుర్తించడం :
77. ‘రంగయ్యకు రెక్కాడితే కాని డొక్కాడదు’ – గీత గీసిన పదం ఏ ప్రక్రియకు చెందినది?
A) క్వార్థకం
B) అనంతర్యార్థకం
C) చేదర్థకం
D) అభ్యర్థకం
జవాబు:
C) చేదర్థకం
78. కవిత గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు తెచ్చింది – గీత గీసిన పదం ఏ ప్రక్రియకు చెందినది?
A) క్వార్థకం
B) చేదర్థకం
C) శత్రర్థకం
D) అనంతర్యార్థకం
జవాబు:
A) క్వార్థకం