AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

AP State Syllabus AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట.

AP State Syllabus 9th Class Telugu Important Questions 7th Lesson ఆడినమాట

9th Class Telugu 7th Lesson ఆడినమాట Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

క్రింది అపరిచిత గద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. “సర్వాంగం దుర్జనే విషమ్” అన్న పెద్దల మాట ఒకసారి పరికిస్తే – తేలుకు ఒక తోక (కొండి) లోనే విషం ఉంటుంది. ఈగకు తలలో మాత్రమే విషం ఉంటుంది. పాముకు కోరల్లోనే విషం ఉంటుంది. ఈ మూడింటిలో విషం ఒకచోటే ఉన్నప్పటికీ వాటివలన ప్రజలకు ఎంతో హాని జరుగుతున్నది. కాని ఒళ్ళంతా విషం ఉన్న దుర్జునుని వలన ప్రజలకు ఇంకా హాని ఎంత జరుగుతుందో !
ప్రశ్నలు – జవాబులు:
1. పెద్దలు ఏమన్నారు ?
జవాబు:
సర్వాంగం దుర్జనే విషమ్

2. తోకలో విషం కలిగినది ఏది?
జవాబు:
తేలు

3. ఈగకు విషం ఎక్కడ ఉంటుంది?
జవాబు:
తలలో

4. ఒళ్ళంతా విషం ఎవరికి ఉంది?
జవాబు:
దుర్జునునికి

2. తాను తలచిన విధముగ చెప్పుట, చెప్పిన విధముగ ఆచరించుట. ఈ ప్రకారముగ మనస్సు, వాక్కు, క్రియ ఒకే రూపము కలిగియుండట మహనీయుల లక్షణం.
ప్రశ్నలు – జవాబులు:
1. దీనిలో వేటి గురించి చెప్పబడింది?
జవాబు:
త్రికరణాలు (మనస్సు, వాక్కు, క్రియలు)

2. మాట ఎలా ఉండాలి?
జవాబు:
తాను తలచిన విధంగా (ఏదైతే ఆలోచిస్తామో ఆ విధంగా)

3. ఆచరణ దేనికి అనుబంధం ఉండాలి?
జవాబు:
చెప్పిన మాటకు

4. మనస్సు, వాక్కు, క్రియ ఒకే రూపంగా కలిగి ఉండేది ఎవరి లక్షణం?
జవాబు:
మహనీయుల లక్షణం.

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

3. ఈ కింది సంభాషణ చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. I – 2017-18)

పావురం : అసలు అడవులు నాశనం చేయడం వల్లనే వర్షాలు కురవడం లేదు, పంటలు పండటంలేదు. ఎటు చూసినా కరవు. తిండికి, నీటికి అన్నిటికీ కరవే !

చిలుక : ఎక్కడ చూసినా కరవే కాదు కాలుష్యం కాలుష్యం.

పావురం : జనం పెరగడం వల్లనే ఈ కాలుష్యం, కరవూ అన్నీ వస్తున్నాయి. కరవు, కాలుష్యం వల్లనే రోగాలు ఎక్కువ అయ్యాయి.

నక్క : మనకు చేసిన ద్రోహానికి శిక్ష అనుభవిస్తున్నారు.
పావురం : అలా అనకూడదు. మంచిది కాదు. ప్రకృతిని, అడవులను సంరక్షించుకోవాలి. అది అందరి బాధ్యత.
ప్రశ్నలు – జవాబులు:
1. వర్షాలు ఎందుకు కురవడం లేదు?
జవాబు:
అడవులు నాశనం చేయడం వల్ల

2. కరవు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?
జవాబు:
చెట్లు పెంచాలి.

3. ప్రకృతిని, అడవులను ఎవరు సంరక్షించాలి?
జవాబు:
మనందరం

4. పై సంభాషణ ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
‘మనకు ద్రోహం చేశారు’ అని అన్నదెవరు?

4. ఈ కింది అపరిచిత గద్యాన్ని చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి. (S.A. II – 2017-18)

నిజానికి పావురాలకు అద్భుతమైన దిశా పరిజ్ఞానం ఉంది. ఏనుగులూ, పావురాల కన్నా తమ తమ యజమానుల పట్ల ఎక్కువ విశ్వాసం ప్రదర్శించే ప్రాణులను నేనింతవరకూ చూడలేదు. ఈ రెండింటితోనూ నాకు సన్నిహిత పరిచయం ఉంది. వనసీమలోని గజరాజులు కానివ్వండి, నగర సీమలలోని పావురాలు గానివ్వండి, అవి తమ యజమానులంటే ప్రాణం పెడతాయి.
ప్రశ్నలు :
1. పై పేరాలో రచయితకు ఇష్టమైన జంతువేది?
2. ‘వనసీమ’ అంటే మీకేమర్థమయింది?
3. యజమానిపట్ల విశ్వాసం ప్రదర్శించే పక్షి ఏది?
4. పై పేరాకు తగిన పేరు పెట్టండి.
జవాబులు:
1. ఏనుగు
2. అరణ్యం
3. పావురం
4. ‘విశ్వాసము’

II. స్వీయరచన

అ) క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘కథాకావ్యం’ ప్రక్రియ గురించి రాయండి.
జవాబు:
‘కథ్యతే ఇతి కథా’ అని వ్యుత్పత్తి. ‘కథాకావ్యం’ అనే పదబంధం తెలుగువారు ఏర్పరచుకున్నదైనా, పైశాచీ భాషలో గుణాఢ్యుడు వ్రాసిన ‘బృహత్కథ’ తొలికథా కావ్యంగా ప్రసిద్ధికెక్కింది. కథాకావ్యం అంటే విషయ ప్రధానమైనది. వివిధ కథల సమాహారం కథాకావ్యం. దీనిలో వస్తు ప్రధానమై, రమణీయ కథన శోభితమై, మనోరంజనంతో పాటు నీతిని, వ్యవహార దక్షతను, కార్యకుశలతను, ధర్మ ప్రబోధాన్ని, ఉత్తమ గుణాలను పెంపొందించే కథావళి ఉంటుంది.

ప్రశ్న 2.
“ఆడినమాట’ పాఠ్యభాగ కవి రచనా శైలి గూర్చి రాయండి.
జవాబు:
అనంతామాత్యుని భోజరాజీయం కావ్యంలోని షష్ఠాశ్వాసం నుండి ‘ఆడినమాట’ అను పాఠ్యభాగం గ్రహించబడింది. ఈయన 15వ శతాబ్దానికి చెందినవారు. అనంతామాత్యుని అపూర్వ మేథాశక్తి నుండి ఆవిర్భవించిన సుమధుర కథా సముచ్ఛయం, విచిత్ర కథా రత్నాకరం ‘భోజరాజీయం’. మానవత్వపు విలువలకు, జీవన ప్రమాణాలకు మచ్చలేని మకుటం (అద్దం)గా నిల్చి కవికి మహోన్నత ఖ్యాతి తెచ్చిన గ్రంథం భోజరాజీయం. నీతిబద్ధమైన మానసిక బలం, శారీరక బలం కంటే వేయి రెట్లు శక్తివంతమని, ఘోర వ్యాఘ్రమును గంగిగోవుగా చేయగలదని కవి చేసిన ధర్మప్రతిపాదన అనుపమానము. అనంతుడు అనేక నీతులను, లోకం పోకడలను సందర్భోచితంగా చెబుతూ ఉత్తమ జీవనమే లక్ష్యమని సిద్దాంతము చేసాడు. జంతువుల పాత్రల ద్వారా మనిషిలోని పశుప్రాయాన్ని తొలిగించడంలో సఫలీకృతుడు అయ్యాడు అనంతామాత్యుడు.

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

ప్రశ్న 3.
ఆవు తన బిడ్డకు బుద్ధులు చెప్పింది కదా ! ఇలా చెప్పించడంలో కవి ఉద్దేశం ఏమిటి?
జవాబు:
‘సమాజహితం సాహిత్యం ‘ అన్నారు పెద్దలు. కథలు, కావ్యాలు రాయడంలో వారి ఆంతర్యం సమాజ శ్రేయస్సే. ఏది చెప్పినా, పాత్రల ద్వారా చెప్పించినా అది ఆ కాల ప్రజలకూ, భావితరాల వారిని ఉద్దేశించినవే. ‘కాకిపిల్ల కాకికి ముద్దు’ అన్నట్లు పిల్లలు ఎన్ని తప్పులు చేసినా కప్పిపుచ్చి తమ పిల్లలంత మంచివారు లేరనే తల్లిదండ్రులను మనం చూస్తూనే ఉంటాం. అలాంటి వారి వల్ల లోకానికే కాదు, ఆ కుటుంబానికి కలిగే మేలు తక్కువే. పశువైనా, తన బిడ్డకు అసత్యం పలుకవద్దని, చెడ్డ స్నేహాలు వద్దని, ఎవరితోనైనా సరే గొడవలకు పోవద్దని నీతిబోధ చేసింది. ఇలా ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పుతున్నారు ? ‘విద్యా విహీనః పశుః’ అన్నారు భర్తృహరి. మరి పశువే ఇంత చక్కగా బిడ్డకు బుద్ధులు నేర్పుతుంటే, మనుష్యులు ఏం చేయాలి ? ఏం చేస్తే సమాజానికి మేలు జరుగుతుందో మనం ఆలోచిస్తే కవి ఉద్దేశ్యం తేలికగా అర్థమౌతుంది.

ప్రశ్న 4.
పులిని ఆవు ఏ మాటలతో నమ్మించింది? (S.A. III – 2016-17)
జవాబు:
తనను చంపయిన పులితో కుమారుడికి కడుపునిండా పాలిచ్చి వెంటనే వస్తానన్న ఆవు మాటల్ని నమ్మదు పులి. అప్పుడు ఆవు పులితో ఇలా అంది. “కటినమైన మాటలు మాట్లాడి పెద్దలకు బాధ కలిగించేవాడు, తండ్రికి, తల్లికి ఎదురు మాట్లాడేవాడు, ఆకలితో గట్ల వెంబడి గడ్డిని మేస్తున్న పశువును వెళ్ళగొట్టేవాడు. ఏ నరకాల్లో పడతారో, తిరిగి నీ దగ్గరికి రాకుంటే నేను ఆ నరకాల్లోనే పడతాను” అని నమ్మించింది. (171 పేజిలో)

ఆ) క్రింది ప్రశ్నలకు పది లేక పన్నెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
అవు – పులి మధ్య జరిగిన సంభాషణను సొంతమాటల్లో రాయండి.
జవాబు:
తెలుగు కథాకావ్యాల్లో ఉత్తమ గ్రంథం అనంతామాత్యుని భోజరాజీయం. నీతిసారమగు ఈ ప్రబంధం షష్ఠాశ్వాసం నుండి ‘ఆడినమాట’ గ్రహించబడింది. ఆవు, పులి పాత్రల ద్వారా మానవతా విలువలు, సత్యవాక్కుకు ఉన్న శక్తి నిరూపితం అయినాయి. ‘ధర్మో రక్షతి రక్షితః’ అన్న మాటలు నిజం చేసింది ఆవు. అన్నింటికి మూలమైన ‘సత్యం’ అనే సూత్రంతో జీవనం సాగిస్తే ముందడుగే గాని వెనకడుగు లేదనే సత్యాన్ని చాటి చెప్పింది ఈ కథ. ఇక కథలోకి వెళితే –

పులి తనకు ఆహారంగా దొరికిన ఆవును చంపబోయింది. అప్పుడు ఆవు, తనకు ఇంటివద్ద మేతమేయడం కూడా రాని పాలు తాగే పసిబిడ్డ ఉన్నాడని, అనుమతిస్తే బిడ్డకు కడుపార పాలు ఇచ్చి వస్తానంటుంది. అప్పుడు పులి ఎగతాళిగా “చెప్పేవాడు చెప్పినా, వినేవాడికి వివేకం ఉండద్దా ? నన్ను అమాయకుణ్ణి చేసి, మరల వస్తానంటే నమ్మవచ్చా ?” అని మాట్లాడింది. ఆ సమయంలో ఆవు తల్లిదండ్రులకు ఎదురు మాట్లాడేవారు, ఆకలితో గడ్డి మేసే పశువును తోలేవాడు ఏ నరకంలో పడతారో నేను రాకపోతే నాకూ ఆ గతి అని చెప్పి, పులిని ఒప్పించి, సంతోషంగా బిడ్డ వద్దకు వెళ్ళింది.

కొడుకు పాలు తాగుతున్నంతసేపు తన ఆలోచనంతా బిడ్డపైనే ఉంచి, శిలా ప్రతిమాలా ఆవు నిలిచింది. తన బిడ్డతో “ఇక నుంచి అమ్మను తలచుకోకు. అబద్దపు మాటలు ఆడకు. చెడు స్నేహాలు చేయకు. ఎవరితోను కుమ్ములాడవద్దు. ఎవరితోను ఎదురు సమాధానం చెప్పవద్దు. దేనికీ భయపడవద్దు” అంటూ జరిగిన సంగతి అంతా చెప్పింది. అక్కడి నుండి మాట ప్రకారం పులి ఉన్న చోటుకు వచ్చింది. ఆవును చూసి పులి ఆశ్చర్యపడింది. ‘ఆడినమాట’ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని ‘ఆవు’ సామాన్యురాలిగా కనిపించలేదు. నిన్ను హింసించటం, పాపాన్ని మూటగట్టుకోవడం ఒకటే కనుక నీవు సంతోషంగా వెనుకకు వెళ్ళమని పులి ఆవుతో చెప్పింది. నన్ను పరీక్షించకు. నేను సిద్ధపడే వచ్చాను అని ముందడుగు ఆవు వేయగా, ఆ పులి వెనకడుగు వేసింది. తినమని ఆవు, తిననని పులి వాదులాడుకున్నాయి. ఆవు
సత్యవాక్ శుద్ధికి, పులి కరుణరస బుద్ధికి దేవతలు సంతోషించారు.

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

ప్రశ్న 2.
సాధుజంతువైన ఆవునకు ఎదురైన ఆపద ఏమిటి ? ఏ విధంగా తను ఆడినమాటను నిలబెట్టుకుంది? (S.A. II – 2017-18)
జవాబు:
మేతకోసం అడవికి వెళ్ళిన ఆవుకు పులి ఎదురైంది. పులి తనకు ఆహారంగా దొరికిన ఆవును చంపబోయింది. సాధు జంతువైన ఆవుకు ఎదురైన ఆపద ఇదే. అప్పుడు ఆవు, తన ఇంటి వద్ద మేత మేయడం కూడా రాని పాలుతాగే పసిబిడ్డ ఉన్నాడని, అనుమతిస్తే బిడ్డకు, కడుపార పాలు ఇచ్చి వస్తానంటుంది. అప్పుడు పులి ఎగతాళిగా ‘చెప్పేవాడు చెప్పినా వినేవాడికి వివేకం ఉండదా ?’ అని ఒప్పుకోదు. ఆవు పులిని బ్రతిమాలి, ఒప్పించి, సంతోషంగా బిడ్డ వద్దకు వెళ్ళింది. కొడుకు పాలు తాగుతున్నంతసేపు తన ఆలోచనంతా బిడ్డపైనే ఉంచింది. జరిగిన సంగతంతా చెప్పి, ఎవరితోను కుమ్ములాడవద్దని, చెడు స్నేహాలు చేయకని, అబద్దాలాడవద్దని బుద్ధులు చెప్పింది. అక్కడి నుండి ‘ఆడినమాట’ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయక అసామాన్యమైన వ్యక్తిత్వం కల ఆవు పులి ఉన్న చోటుకు వచ్చింది. ఈ విధంగా తను ఆడిన మాటను ఆవు నిలబెట్టుకుంది.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

క్రింది ప్రశ్నకు సమాధానము రాయండి.

ప్రశ్న 1.
సత్యం గొప్పతనం గూర్చి నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

విజయవాడ,
x x x x x

ప్రియమైన మిత్రుడు జశ్వంత్ కు,

నేను క్షేమం. అక్కడ నీవు క్షేమమని తలుస్తాను. ముఖ్యంగా రాయునది ఇటీవల నేను “సత్యహరిశ్చంద్ర” బొమ్మల కథల పుస్తకం చదివాను. ఆ పుస్తకం చాలా బాగుంది. హరిశ్చంద్రుడు, చంద్రమతి, లోహితాశుడు ఎన్ని కష్టాలు పడ్డారో! చాలా బాధేసింది. ఇచ్చిన మాటకోసం రాజ్య సంపదలన్నీ ధార పోశాడు. అడవులపాలయ్యాడు. భార్యాపిల్లలను అమ్మాడు. తానూ అమ్ముడు పోతాడు. చివరకు భార్యను నరకబోతాడు. ఇదంతా దేనికోసం అని ఆలోచిస్తే ‘సత్యం’ కోసం అని తెలుస్తుంది. చివరకు దేవతలంతా వచ్చి ఈ పరీక్షలంతా నీలోని మానసిక శక్తిని పరీక్షించడానికే, సత్యం కోసం : ఎంతవరకు నిలబడతావో లోకానికి చాటి చెప్పడానికే అని దీవిస్తారు. ఇలాంటి పుస్తకం నీవూ తప్పక చదువు.

ఇట్లు,
నీ మిత్రుడు,
కె. ఫణిరామ్,

చిరునామా :
కె. జశ్వంత్ సమీర్,
9వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూల్,
బాపట్ల,
గుంటూరు జిల్లా.

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

ప్రశ్న 2.
‘ఆడినమాట’ కోసం ఆవు ప్రాణాలు సైతం లెక్క చేయలేదు కదా ! ఇలాగే సత్యం కోసం నిలబడిన వారిని గూర్చి కథ రాయండి. (హరిశ్చంద్రుడు)
జవాబు:
సత్యహరిశ్చంద్రుడు

‘సత్యమేవ జయతే’ అన్న సూక్తికి నిలువుటద్దం హరిశ్చంద్రుని కథ. సమాజంలో ఈనాడు కావల్సినవి నైతిక విలువలు. అందుకు సమాజంలో సత్యానికి ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. సత్యాన్ని మించిన దైవమే లేదని అన్న విశిష్ఠ సంస్కృతి మనది. జాతిపిత గాంధీజీ జీవితానికే స్ఫూర్తినిచ్చిన ఇతివృత్తం హరిశ్చంద్ర.

తాను నమ్మిన సత్యాన్ని విడువక రాజ్యాన్ని, భార్యాపిల్లలను విడిచిన మహనీయుడు హరిశ్చంద్రుడు. నిత్య సత్యవ్రతుడు. గురువైన విశ్వామిత్రునికి ఇచ్చిన మాటకోసం రాజ్య సంపదలను అతనికే ఇచ్చాడు. రాజ్యం విడిచి కట్టుబట్టలతో, భార్యాపిల్లలతో అడవులకు వెళ్ళాడు. విశ్వామిత్రుడు దారిలో ఎన్నో ఆటంకాలు కలిగించినా సత్యాన్ని విడువక ధైర్యంగా ముందుకు నడిచాడు. తనతోపాటు కష్టాలు పడుతున్న భార్య చంద్రమతి, కుమారుడు లోహితాశుని చూసి బాధపడ్డాడు. దారిలో ఎదురైన కష్టాలు ఆ దంపతులిద్దరి సత్యము, పతిభక్తి, దైవానుగ్రహం వల్ల తొలిగాయి.

విశ్వామిత్రుని అప్పు తీర్చడానికి తన భార్యాపిల్లలను అమ్మాడు. తాను కూడా కాటికాపరిగా అమ్ముడుపోయి, ఆ ధనాన్ని నక్షత్రకుడికి ద్వారా పంపాడు. నిందపడ్డ తన భార్యను సైతం చంపడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు విశ్వామిత్రుడు వచ్చి ఇదంతా నా మాయేనని చెప్పి ఆడాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా సత్యాన్ని విడిచి పెట్టక సత్యహరిశ్చంద్రుడు దేవతలు సైతం కీర్తించేటట్లు జీవించాడు.

III. భాషాంశాలు (పదజాలం , వ్యాకరణం)

1. పర్యాయపదాలు :

సుకృతం : పుణ్యము, పున్నెము
ఉదరం : పొట్ట, కడుపు
తల్లి : మాత, అమ్మ, జనని
తండ్రి : పిత, నాన్న, జనకుడు
వృషభం : ఎద్దు, ఆబోతు, కోడె, గిత్త, కాసరం, బసవుడు
చేను : పంట నేల, సస్యము, పొలం
నరకం : దుర్గతి, పాపలోకం
బుద్ధి : మతి, ధీ, మేధ, జ్ఞప్తి, ప్రజ్ఞ
భీతి : భయం, వెఱుపు, బెదురు, త్రాసం
పురము : పురి, నగరం, పట్టణం
అసత్యం : అబద్దం, బొంకు, కల్ల, హుళక్కి
వృత్తాంతం : చరిత్ర, వార్త, సంగతి
దురంతం : పాపం, కిల్బిషం, దురితం
మాంసం : పలలం, పొలసు, పిశితం, తరసం
రక్తం : నెత్తురు, రుధిరం
సురలు : దేవతలు, అమరులు
తనువు : శరీరం, కాయం, దేహం

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

2. వ్యుత్పత్త్యర్థాలు :

సుకృతం : లెస్సగా చేయబడినది (పుణ్యం, ధర్మం )
నరకం : పాపులను తన సమీపమున బొందించునది (దుర్గతి)

3. నానార్థాలు :

సుకృతం : పుణ్యం, శుభం
వివేకం : ఆలోచన, తెలివి
కుమారుడు : కొడుకు, కుమారస్వామి, బాలుడు
గోవు : ఆవు, కన్ను, బాణం, ఎద్దు
పాలు : క్షీరం, భాగం, వంతు, తెల్లనివి
రక్తము : నెత్తురు, ఎఱుపు, కుంకుమ, రాగి, అనురాగం
ఉత్తరం : జవాబు, లేఖ, ఒక దిక్కు

4. ప్రకృతి – వికృతులు :

పుత్ర – పట్టి
అగ్ని – అగ్గి
వ్యాఘ్ర – వేగి
వృషభం – బసవన్న
బుద్ధి – బుద్ధి
స్తనం – చన్ను
భీతి – బీతు
దోషం – దోసం
ప్రాణం – పానం
ప్రౌఢ – ప్రోడ = (తెలివిగలది)
సఖీ – సకి (య) = చెలికత్తె పుణ్యం
పుణ్యం – పున్నెం
ఉపవాసం – ఉపాసం (పస్తు)
రత్నం – రతనం
గహనం – గగనం
గుణము – గొనయము
నిజము – నిక్కము
కులము – కొలము
ధర్మం – దమ్మం
సదృశం – సరి (సమానం)
విలాసం – వెళుకు = (కులాసా)
పురీ – ప్రోలు
దైవం – దయ్యం
సత్యం – సత్తు (నిజం)
బ్రధ్న – పొద్దు (వేళ)
ప్రీతి – బాతి
కథ – కత
కపిల – కవిల = (నల్లని)
సాధు – సాదు

5. సంధులు :

ఉదర + అగ్ని = ఉదరాగ్ని – సవర్ణదీర్ఘ సంధి
నిజ + ఆవాసం = నిజావాసం – సవర్ణదీర్ఘ సంధి
శోభన + అంగి = శోభనాంగి – సవర్ణదీర్ఘ సంధి
ముహుః+ భాషితంబులు = ముహుర్భాషితంబులు – విసర్గరేఫాదేశ సంధి
నీవు + ఎరుంగవే = నీ వెరుంగవే – ఉత్వసంధి
ప్రల్లదము + ఆడి = ప్రల్లదమాడి – ఉత్వసంధి
ఎగ్గు + ఆడిన = ఎగ్గాడిన – ఉత్వసంధి
చన్ను + ఇచ్చితి = చన్నిచ్చితి – ఉత్వసంధి
వృత్తాంతంబు + అంతయు = వృత్తాంతంబంతయు – ఉత్వసంధి
భక్షింపుము + అని = భక్షింపుమని – ఉత్వసంధి
ప్రసన్నులు + ఐరి = ప్రసన్నులైరి – ఉత్వసంధి
ఆ + పులికిన్ = అప్పులికిన్ – త్రికసంధి
ఆ + మొదవు = అమ్మొదవు – త్రికసంధి
ఈ + తనువు = ఇత్తనువు – త్రికసంధి
ఆ + అవసరం = అయ్యవసరం – యడాగమ, త్రిక సంధులు
ధర్మవిద + ఆలు = ధర్మవిదురాలు – రుగాగమ సంధి
తోరము + భీతి = తోరపుభీతి – పుంప్వాదేశ సంధి
నిన్నును + కని = నిన్నుఁగని – సరళాదేశ సంధి
ఈన్ + చూడకు = ఈఁజూడకు – సరళాదేశ సంధి
పుట్టగన్ + చేసిన = పుట్టగఁజేసిన – సరళాదేశ సంధి
చంపగన్ + చాల = చంపగఁజాల – సరళాదేశ సంధి
మహా + అనుభావుడు = మహానుభావుడు – సవర్ణదీర్ఘసంధి
అతి + అనురాగం = అత్యనురాగం – యణాదేశ సంధి

6. సమాసాలు:

ముద్దులపట్టి – ముద్దుయైన పట్టి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఏడురోజు – ఏడు సంఖ్య గల రోజులు – ద్విగు సమాసం
ఉదరాగ్ని – ఉదరమనెడి అగ్ని- రూపక సమాసం
కులభూషణ – కులమునందు శ్రేష్ఠుడు – సప్తమీ తత్పురుష సమాసం
తోరపు భీతి – పెద్దదైన భయం- విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మహానుభావులు – గొప్పదైన తేజస్సు కలవారు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
రక్తమాంసాలు – రక్తము, మాంసము – ద్వంద్వ సమాసం
సత్యప్రౌఢి – సత్యము యొక్క గొప్పతనం – షష్ఠీ తత్పురుష సమాసం

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

7. గణాలు:

1. మునుమును బుట్టె నాకు నొక ముద్దులపట్టి, యతండు పుట్టి యే
జవాబు:
AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట 1

2. గుమ్మెడు పాత నా సుతున కుం బరి తృప్తి జ నించుఁగా నిమాం
జవాబు:
AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట 2

8. అలంకారాలు:

ఉదరాగ్ని- రూపకాలంకారం
ఉపమేయం – ఉదరం
ఉపమానం – అగ్ని
వీటికి అభేదం చెప్పబడినది. ఉపమాన ఉపమేయములకు అభేదము చెప్పుట రూపకాలంకారం.

9th Class Telugu 7th Lesson ఆడినమాట 1 Mark Bits

1. ఆ సంఘటనకు అచ్చెరువు నొందితిని. (ప్రకృతి పదం గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) అపూర్వం
బి) ఆచరం
సి) ఆశ్చర్యం
డి) హాచెర్యం
జవాబు:
సి) ఆశ్చర్యం

2. ఇచ్చోట వసింపదగదు. (గీత గీసిన పదానికి సంధి గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) ద్రుత సంధి
బి) ఆమ్రేడిత సంధి
సి) ఇత్వసంధి
డి) త్రికసంధి
జవాబు:
డి) త్రికసంధి

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

3. నా సుతుడు సంగీత విద్వాంసుడు – (గీత గీసిన పదానికి సమాసం పేరు గుర్తించండి.) (S.A. II – 2018-19)
ఎ) తృతీయా తత్పురుష
బి) చతుర్దీ తత్పురుష
సి) రూపక సమాసం
డి) షష్ఠీ తత్పురుష
జవాబు:
డి) షష్ఠీ తత్పురుష

4. గోవునకు కొడుకు మొన్న మొన్ననే పుట్టాడు…. ముద్దు ముద్దుగా ఉంటాడు. ఏడెనిమిది రోజుల వయసు కలవాడు. గడ్డి అయిననూ తినలేడు – ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి. (S.A. II – 2018-19)
ఎ) అతిశయోక్తి
బి) స్వభావోక్తి
సి) ఉత్ప్రేక్ష
డి) రూపకం
జవాబు:
బి) స్వభావోక్తి

5. అరణ్యంలో పుండరీకం గాండ్రించగానే చిన్న జంతువులు కకావికలమయ్యాయి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) పులి
బి) సింహం
సి) ఏనుగు
డి) ఎలుగుబంటి
జవాబు:
ఎ) పులి

6. ముక్కంటి కోపానికి త్రిపురాలు భస్మమైనాయి. (ఏ సమాసమో గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) బహువ్రీహి
బి) విశేషణ పూర్వపద కర్మధారయం
సి) ద్విగువు
డి) ద్వంద్వ
జవాబు:
ఎ) బహువ్రీహి

7. అడవిలో పుండరీకములున్న సరస్సు ఒడ్డున ఒక పుండరీకం జింకను వేటాడింది. (గీత గీసిన పదాలకు తగిన నానార్థపదాలు గుర్తించండి) (S.A. III – 2016-17)
ఎ) పులి, బెబ్బులి
బి) పులి, సివంగి
సి) తెల్లతామర, పులి
డి) పులి, మల్లెపూవు
జవాబు:
సి) తెల్లతామర, పులి

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

8. బహుబ్లి హి సమాసానికి ఉదాహరణను గుర్తించండి. (S.A. III – 2016-17)
ఎ) చక్రధారి
బి) చతుర్ముఖుడు
సి) చరకుడు
డి) మేధ
జవాబు:
బి) చతుర్ముఖుడు

9. నీవు బాగా పాడుతావు. (వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
ఎ) నీవు బాగా పాడావు
బి) నీవు బాగా పాడవు
సి) నీవు బాగా పాడుతున్నావు
డి) నీవు బాగా పాడావా?
జవాబు:
బి) నీవు బాగా పాడవు

10. కడుపారఁజన్లుడిపి చయ్యన వచ్చెద (ఆధునిక వచనాన్ని గుర్తించండి.) (S.A. II – 2018-19 )
ఎ) కడుపు నిండా పాలిచ్చి, వెంటనే వస్తాను
బి) కడుపు నిండకుండా పాలిచ్చి వెంటనే రాను
సి) కడుపు నిండా పాలిచ్చి, రేపు వస్తాను
డి) కడుపు నిండా పాలిచ్చి, సాయంత్రం వస్తాను.
జవాబు:
ఎ) కడుపు నిండా పాలిచ్చి, వెంటనే వస్తాను

11. అబద్ధపు మాటలు అనవద్దు (వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి) (S.A. II – 2018-19)
ఎ) సత్యమును ఎపుడూ చెప్పు
బి) అబద్ధపు మాటలంటే ఇష్టం
సి) అబద్దపు మాటలు ఆడు
డి) అబద్ధపు మాటలు ఆడవా !
జవాబు:
సి) అబద్దపు మాటలు ఆడు

12. “రవి అల్లరి చేస్తున్నాడు” (వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) రవి అల్లరి చేయడు
బి) రవి అల్లరి చేయలేదా?
సి) రవి అల్లరి చేయడం లేదు
డి) రవి అల్లరి చేయలేడు
జవాబు:
సి) రవి అల్లరి చేయడం లేదు

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

13. చదువుపై శ్రద్ధ తగ్గింది. (వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి) (S.A. II – 2017-18)
ఎ) చదువుపై శ్రద్ధ తగ్గుతోంది.
బి) చదువుపై శ్రద్ధ తగ్గడం లేదు.
సి) చదువుపై శ్రద్ధ తగ్గదు.
డి) చదువుపై శ్రద్ధ తగ్గలేదు.
జవాబు:
డి) చదువుపై శ్రద్ధ తగ్గలేదు.

భాషాంశాలు (పదజాలం, వ్యాకరణం)

1. అర్థాలు :

14. పూర్వజన్మ సుకృతంబు వల్ల ఈ భరతమాత బిడ్డనై పుటాను – గీత గీసిన పదానికి అరాన్ని గురించండి.
A) దానం
B) పుణ్యం
C) పాపం
D) దయ
జవాబు:
B) పుణ్యం

15. గురువుల పట్ల అపహాస్యము తగదు- గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) భక్తి
B) గౌరవం
C) ఎగతాళి
D) మర్యాద
జవాబు:
C) ఎగతాళి

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

16. నిక్కమ్ము నిప్పు వంటిది – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) పాపం
B) పుణ్యం
C) భక్తి
D) నిజం
జవాబు:
D) నిజం

17. పాశ్చాత్య ధోరణి పై గల మోజు మన సంస్కృతిని దుర్గతి పాలు జేస్తోంది – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) నాశనం
B) అశ్రద్ధ
C) వృద్ధి
D) సమం
జవాబు:
A) నాశనం

18. సురభి కామధేనువు – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) పులి
B) గుఱ్ఱం
C) గోవు
D) గేదె
జవాబు:
C) గోవు

19. కష్టాలలో భీతిల్లకూడదు – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) అభయం
B) భయం
C) ధైర్యం
D) పిటికి
జవాబు:
B) భయం

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

20. సున్నిత మనస్కులు కానివారిని పాషాణ హృదయులు అనవచ్చు – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) రాయి
B) రేయి
C) మట్టి
D) మొద్దు
జవాబు:
A) రాయి

21. ఇతరులు ఎగ్గు ఆడినన్ తిరిగి సమాధానము ఇవ్వకు – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) పొగడ్త
B) ఎగతాళి
C) కోపం
D) కీడు
జవాబు:
D) కీడు

22. తన బిడ్డకు జరిగిన వృత్తాంతమంతా తెలిపింది – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) నాటిక
B) సంగతి
C) వ్యాసం
D) నవల
జవాబు:
B) సంగతి

23. ఆవు పులుల సంభాషణను విన్న సురలు సంతోషించారు – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) ప్రజలు
B) పిల్లలు
C) దేవతలు
D) మునులు
జవాబు:
C) దేవతలు

24. నా బిడ్డ పూరియు మేయనేరడు – గీత గీసిన పదానికి అర్థం ఏమిటి?
A) పూరీ
B) పిండివంట
C) గడ్డి
D) పాలు
జవాబు:
C) గడ్డి

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

25. అడవిలో పుండరీకము మేకను ఎత్తుకుపోయింది – గీత గీసిన పదానికి అర్థం ఏట? (S.A. II – 2017-18)
A) సింహము
B) తెల్ల తామర
C) ఏనుగు
D) పెద్దపులి
జవాబు:
D) పెద్దపులి

26. నీవు మాట్లాడిన ప్రల్లదములు, కర్ణ కఠోరంగా ఉన్నాయి – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) తిట్టు
B) శపథము
C) కఠినపు మాట
D) శాపవాక్యం
జవాబు:
C) కఠినపు మాట

27. వ్యాఘ్రము వస్తే వృషభము బెదిరి పారిపోయింది – గీత గీసిన పదానికి అర్థం ఏది?
A) పెద్దపులి
B) ఎద్దు
C) ఆవు
D) మేక
జవాబు:
B) ఎద్దు

28. మా ఇంటిలో మొదటి నుండి మొదవులను పెంచుతాము – గీత గీసిన పదానికి అర్థం ఏది?
A) ఆవు
B) కుక్క
C) గేదె
D) కోడి
జవాబు:
A) ఆవు

29. సరస్సులో పుండరీకములు సూర్యుని రాకతో ఉదయించాయి – గీత గీసిన పదానికి గల మరో అర్థమును గుర్తించండి.
A) తెల్లతామర
B) మల్లి
C) బంతి
D) గులాబి
జవాబు:
A) తెల్లతామర

2. పర్యాయపదాలు :

30. పొట్ట కూటికోసం మనుష్యులు అనేక వేషాలు వేస్తారు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ఉదరం, కడుపు
B) కుక్షి, అక్కు
C) కడుపు, విడుపు
D) ఉదరం, చదరం
జవాబు:
A) ఉదరం, కడుపు

31. శివుని వాహనం వృషభం – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ఎద్దు, పిల్లి
B) బసవుడు, సాంబ
C) ఎద్దు, బసవుడు
D) కోడె, పుంజు
జవాబు:
C) ఎద్దు, బసవుడు

32. కంచె చేను మేస్తే అన్నది సామెత – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) నేల, భూమి
B) సస్యం, పొలం
C) పంటనేల, బంజరు
D) రాతినేల, చవుడు
జవాబు:
B) సస్యం, పొలం

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

33. తన దుఃఖము నరకమండ్రు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) పాపలోకం, స్వర్గం
B) దుర్గతి, అశుభం
C) యమపురి, స్వర్ణపురి
D) దుర్గతి, పాపలోకం
జవాబు:
D) దుర్గతి, పాపలోకం

34. హరిశ్చంద్రుడు ఎప్పుడూ అసత్వం పలుకలేదు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) అబద్ధం, నిజం
B) బొంకు, కుంకు
C) కల్ల, అబద్ధం
D) హుళక్కి, బులాకి
జవాబు:
A) అబద్ధం, నిజం

35. రాక్షసులు మాంసాహారులు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) పలలం, పదిలం
B) పొలసు, పిశితం
C) తరసం, విరసం
D) పిశితం, పసరు
జవాబు:
B) పొలసు, పిశితం

36. స్వాతంత్ర్యం కోసం ఎందరో రక్తం చిందించారు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) నెత్తురు, నెతురు
B) రుధిరం, మధురం
C) నల్ల, నల్లి
D) నెత్తురు, రుధిరం
జవాబు:
D) నెత్తురు, రుధిరం

37. మా ఇంటిలోని ధేనువు హర్యానా జాతికి చెందినది – గీత గీసిన పదానికి పర్యాయపదాలేవి?
A) బఱ్ఱె, వృషభము
B) మొదవు, గోవు
C) మేక, జింక
D) గేదె, ఆవు
జవాబు:
B) మొదవు, గోవు

38. సర్కసులో పులిచే బాగా నాట్యం చేయించారు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) సింహము, హరి
B) కరి, గజము
C) శార్దూలము, వ్యాఘ్రము
D) శరభము, శార్దూలం
జవాబు:
C) శార్దూలము, వ్యాఘ్రము

39. దీనులను ఆదుకుంటే సుకృతము వస్తుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) మంచి పని, పుణ్యము
B) న్యాయము, ధర్మము
C) పాపము, పుణ్యం
D) మోక్షం, స్వర్గము
జవాబు:
A) మంచి పని, పుణ్యము

3. వ్యుత్పత్త్యర్థాలు :

40. ‘పాపులను తన సమీపమున బొందించునది’ – వ్యుత్పత్తి పదం గుర్తించండి.
A) భూమి
B) నరకం
C) పాతాళం
D) స్వర్గం
జవాబు:
B) నరకం

41. ‘లెస్సగా చేయబడినది’ – వ్యుత్పత్తి పదం గుర్తించండి.
A) పాపం
B) అబద్దం
C) సుకృతం
D) దానం
జవాబు:
C) సుకృతం

42. దేవతాదులనుద్దేశించి మూడు సార్లు కుడివైపుగా తిరగడం – వ్యుత్పత్తి పదం ఏది?
A) దేవతా వందనం
B) ప్రదక్షిణం
C) త్రిప్రదక్షిణం
D) అప్రదక్షిణం
జవాబు:
B) ప్రదక్షిణం

4. నానార్థాలు :

43. వివేకహీనుడు తనకు, ఇతరులకు హాని చేస్తాడు – గీత గీసిన పదానికి నానార్థాలను గుర్తించండి.
A) ఆలోచన, అలవాటు
B) తెలివి, అలవాటు
C) బుద్ధి, తిక్క
D) ధర్మం, దయ
జవాబు:
B) తెలివి, అలవాటు

44. నందుని కుమారుడు శ్రీకృష్ణుడు – గీత గీసిన పదానికి నానార్థాలను గుర్తించండి.
A) కొడుకు, బాలుడు
B) కుమారస్వామి, వినాయకుడు
C) బాలుడు, బాలిక
D) కొడుకు, పుత్రుడు
జవాబు:
A) కొడుకు, బాలుడు

45. గోవులలో కపిల బహుక్షీర – గీత గీసిన పదానికి నానార్థాలను గుర్తించండి.
A) ఆవు, ధేనువు
B) కన్ను, నేత్రం
C) ఆవు, బాణం
D) ఎద్దు, దున్న
జవాబు:
C) ఆవు, బాణం

46. విద్యార్థి దశ నుండి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి – గీత గీసిన పదానికి నానార్థాలను గుర్తించండి.
A) భాగం, ఇష్టం
B) క్షీరం, క్షారం
C) తెలుపు, తెల్లనివి
D) క్షీరం, భాగం
జవాబు:
D) క్షీరం, భాగం

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

47. భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి – గీత గీసిన పదానికి నానార్థాలను గుర్తించండి.
A) జవాబు, ప్రశ్న
B) లేఖ, ఒక దిక్కు
C) జాబు, జేబు
D) లేఖ, ఉత్తరం
జవాబు:
B) లేఖ, ఒక దిక్కు

48. సీత గుణములు చెవిసోకగానే, రాముడు శివధనుస్సుకు గుణమును బిగించాడు – గీత గీసిన పదాలకు నానార్థాలు గుర్తించండి.
A) స్వభావము, బాణము
B) గుణము, నారి
C) అమ్ము, నారి
D) విల్లు, ఈటె
జవాబు:
B) గుణము, నారి

5. ప్రకృతి – వికృతులు :

49. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) బిడ్డ
B) కొడుకు
C) బొట్టె
D) సుతుడు
జవాబు:
C) బొట్టె

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

50. గోవ్యాఘ్ర సంవాదము భోజరాజీయములోనిది – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) వేగి
B) వాగ
C) పులి
D) వాగర
జవాబు:
A) వేగి

51. డూడూ బసవన్న అంటూ గంగిరెద్దుల వాళ్ళు తిరుగు తారు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) ఎద్దు
B) వృషభం
C) నంది
D) ఆబోతు
జవాబు:
B) వృషభం

52. అతని కంఠధ్వని సింహగర్జన సదృశం – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) అదృశ్యం
B) ప్రత్యక్షం
C) సదసం
D) సరి
జవాబు:
D) సరి

53. సత్యం కోసం హరిశ్చంద్రుడు రాజ్యాన్ని విడిచాడు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) నిజం
B) సూనృతం
C) సత్తు
D) ఋజు
జవాబు:
C) సత్తు

54. దేవతలు గగన మార్గంలో ప్రయాణిస్తారు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) ఆకాశం
B) గహనం
C) ఆకసం
D) గాలి
జవాబు:
B) గహనం

55. కులం కన్న గుణం మిన్న- గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) కొలము
B) గొల్ల
C) కాలం
D) గులాం
జవాబు:
A) కొలము

56. ప్రౌఢ వ్యాకరణం బహుజపల్లి వారి దివ్య గ్రంథం – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) బాల
B) పౌడ
C) ప్రోడ
D) ప్రొడ
జవాబు:
C) ప్రోడ

6. సంధులు :

57. అ – ఇ – ఉ – ఋ లకు అవియే అచ్చులు పరమైన వాని దీర్ఘములు ఏకాదేశమగును. ఈ సూత్రంతో సరిపోవు కింది ఉదాహరణను గుర్తించండి.
A) ప్రల్లదమాడి
B) నిజావాసం
C) అత్వనురాగం
D) ధర్మవిధురాలు
జవాబు:
B) నిజావాసం

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

58. ‘నీవు + ఎరుంగవే’ కలిపి రాయండి.
A) నీవు యెరుంగవే
B) నీవే యెరుంగవే
C) నీ వెరుంగవే
D) నీవు ఎరుంగవే
జవాబు:
C) నీ వెరుంగవే

59. ‘ఈ + తనువు’ – సంధి పేరేమిటి?
A) త్రికసంధి
B) ఇత్వసంధి
C) యణాదేశసంధి
D) వృద్ధి సంధి
జవాబు:
A) త్రికసంధి

60. విసర్గసంధికి ఉదాహరణను గుర్తించండి.
A) ఎగ్గాడిన
B) అప్పులికిన్
C) శోభనాంగి
D) ముహుర్భాషితంబులు
జవాబు:
D) ముహుర్భాషితంబులు

61. ‘ఆ + అవసరం’ – సంధి చేయండి.
A) ఆయవసరం
B) అయ్యవసరం
C) అ అవసరం
D) ఆ అవసరం
జవాబు:
B) అయ్యవసరం

62. ‘నిన్నుఁగని’ – విడదీయుము.
A) నిన్ను + కవి
B) నిన్నే + కని
C) నిన్నున్ + కని
D) నిన్ను + గని
జవాబు:
C) నిన్నున్ + కని

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

63. ‘అతి + అనురాగం’ – సంధి పేరేమిటి?
A) యణాదేశ సంధి
B) యడాగమ సంధి
C) గుణసంధి
D) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
A) యణాదేశ సంధి

64. తోరము + భీతి – కలిపి రాయండి.
A) తోరముభీతి
B) తోరపు భీతి
C) తోరభీతి
D) తోరముబీతి
జవాబు:
B) తోరపు భీతి

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

65. ‘అప్పులి’ ఈ సంధి పదాన్ని విడదీయండి.
A) అప్పు + లి
B) అ + ప్పులి
C) ఆ + పులి
D) ఆ + ప్పులి
జవాబు:
C) ఆ + పులి

66. ‘ఉదరాగ్ని’ అనే పదంలో గల సంధి ఏది?
A) యణాదేశ సంధి
B) అత్వసంధి
C) గుణసంధి
D) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
D) సవర్ణదీర్ఘ సంధి

67. ‘తోరపు భీతి’లో గల సంధి ఏది?
A) రుగాగమ సంధి
B) పుంప్వాదేశ సంధి
C) యడాగమ సంధి
D) పజ్వవర్ణాదేశ సంధి
జవాబు:
B) పుంప్వాదేశ సంధి

7. సమాసాలు:

68. ఉదరాగ్ని కై ప్రాణికోటి పలు ఇబ్బందులు పడును – సమాసం పేరు గుర్తించండి.
A) చతుర్డీ
B) తృతీయా
C) రూపకం
D) షష్టి
జవాబు:
C) రూపకం

69. ‘సత్య ప్రౌఢి’ విగ్రహవాక్యమున వచ్చు విభక్తిని గుర్తించండి.
A) అనెడి
B) యొక్క
C) చేత
D) వలన
జవాబు:
B) యొక్క

70. ‘రక్తమాంసాలు’ – సమాసం పేరేమిటి?
A) బహువ్రీహి
B) ద్వంద్వ
C) రూపకం
D) సప్తమీ
జవాబు:
B) ద్వంద్వ

71. ‘కుల భూషణుడు’ విగ్రహవాక్యమున వచ్చు విభక్తిని గుర్తించండి.
A) చేత
B) అనెడి
C) అందు
D) యొక్క
జవాబు:
C) అందు

72. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణను గుర్తించండి.
A) సత్యప్రౌఢి
B) ముద్దుల పట్టి
C) ఏడు రోజులు
D) రక్తమాంసాలు
జవాబు:
A) సత్యప్రౌఢి

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

73. ‘రత్నము వంటి ధేనువు’ – అనే విగ్రహం గల సమాస పదాన్ని గుర్తించండి.
A) రత్నధేనువు
B) ధేను రత్నము
C) ధేనూత్తమము
D) మంచి గోవు
జవాబు:
B) ధేను రత్నము

74. ద్విగు సమాసానికి ఉదాహరణమేది?
A) త్రినయనుడు
B) ముక్కంటి
C) చతుస్సనములు
D) చతుర్ముఖుడు
జవాబు:
C) చతుస్సనములు

75. ‘చతుర్ముఖుడు’ సమాసానికి విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
A) నాల్గు ముఖాలు
B) మూడు కన్నులు గలవాడు
C) త్రినేత్రుడు
D) నాల్గు ముఖాలు కలవాడు
జవాబు:
D) నాల్గు ముఖాలు కలవాడు

76. ‘ధర్మమును తెలిసిన వాడు’ – సమాసపదంగా కూర్చండి.
A) ధర్మరతుడు
B) ధర్మవిదుడు
C) ధర్మమూర్తి
D) ధర్మ ప్రభువు
జవాబు:
B) ధర్మవిదుడు

8. గణాలు :

77. ‘గుమ్మెడు’ గురులఘువులు గుర్తించండి.
A) UUI
B) IUU
C) UII
D) IIU
జవాబు:
C) UII

78. ‘UTU’ దీనికి సరియగు పదం గుర్తించండి.
A) పుట్టియే
B) అతండు
C) ముద్దల
D) సుతుడు
జవాబు:
A) పుట్టియే

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

79. చంపకమాల యతిస్థానం గుర్తించండి.
A) 10
B) 11
C) 13
D) 14
జవాబు:
B) 11

80. ఉత్పలమాల గణాలు గుర్తించండి.
A) స భ ర న మ య వ
B) మ స జ స త త గ
C) న జ భ జ జ జ ర
D) భ ర న భ భ ర వ
జవాబు:
D) భ ర న భ భ ర వ

81. ‘వినియెడు వారి కించుక వివేకము పుట్టదె యింత యేటికిన్’ పై పద్యపాదము ఏ వృత్తమునకు చెందినది?
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) శార్దూలము
D) మత్తేభము
జవాబు:
B) చంపకమాల

82. మత్తేభ పద్యానికి గల గణాలు ఇవి.
A) మ స జ స త త గ
B) స భ ర న మ య వ
C) భ ర న భ భ ర వ
D) న జ భ జ జ జ ర
జవాబు:
B) స భ ర న మ య వ

83. ‘తెళ్ళెడు’ ఈ పదం ఈ గణానికి సంబంధించినది.
A) న గణము
B) య గణము
C) త గణము
D) భ గణము
జవాబు:
D) భ గణము

84. ర గణానికి ఉదాహరణం ఏది?
A) పాదము
B) శ్రీరామ
C) శ్రీలక్ష్మీ
D) అమ్మణి
జవాబు:
B) శ్రీరామ

9. అలంకారాలు :

85. ఉపమాన, ఉపమేయములకు అభేదం చెప్పుట – ఇది ఏ అలంకారం?
A) ఉపమా
B) ఉత్ప్రేక్ష
C) రూపక
D) అతిశయోక్తి
జవాబు:
C) రూపక

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

86. “గోవు పై నీగ సోకిన గదలకుండె నెమ్మి బాషాణధేనువు నిలిపినట్లు” – ఈ పాదంలో గల అలంకారం ఏది?
A) ఉత్ప్రేక్ష
B) రూపకము
C) ఉపమ
D) స్వభావోక్తి
జవాబు:
C) ఉపమ

87. ‘జింకలు, బిత్తరి చూపులు చూస్తూ, చెవులు నిగిడ్చి, చెంగు చెంగున గెంతుతున్నాయి – ఈ వాక్యంలో గల అలంకారమేది? (S.A. II – 2017-18)
A) అతిశయోక్తి
B) స్వభావోక్తి
C) రూపకము
D) ఉపమాలంకారము
జవాబు:
B) స్వభావోక్తి

10. ఆధునిక వచనాన్ని గుర్తించడం :

88. చెప్పెడు వారు చెప్పినన్ వినియెడువారి కించుక వివేకము పుట్టదె – ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) చెప్పేవారు చెప్పినా, వినేవారికి ఏమైనా బుద్ధి ఉండదా.
B) చెప్పేవాడు చెప్పినా, వినేవాడికి కొంచెం వివేకం కలుగదా.
C) చెప్పేవాడికి, వినేవాడికి వివేకం ఉండదా.
D) చెప్పేవాడికి, లేకపోయినా వినేవాడికి బుద్ధిలేదా.
జవాబు:
B) చెప్పేవాడు చెప్పినా, వినేవాడికి కొంచెం వివేకం కలుగదా.

89. నెమ్మిఁ బాషాణధేనువు నిలిపినట్లు – ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) ఆవు నిదానంగా బొమ్మలా నిల్చుంది
B) ప్రేమతో రాతిలా నిల్చుంది
C) ప్రేమతో రాతిబొమ్మలా ఆవు నిలుచుంది
D) రాతి బొమ్మలా ఆవు నిలబడింది
జవాబు:
C) ప్రేమతో రాతిబొమ్మలా ఆవు నిలుచుంది

90. విని వినని వాని చొప్పునఁ జనుమీ – ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) విని విననట్లు నటించి వెళ్ళు
B) విని విననట్లు వెళ్ళు
C) పెడచెవిగా వెళ్ళు
D) విని కూడా వినని వాడిలా వెళ్ళిపో
జవాబు:
D) విని కూడా వినని వాడిలా వెళ్ళిపో

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

91. దైవ మీ పట్టునఁ బూరి మే పెడినే? – ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) దైవం ఇప్పుడు గడ్డి తినిపిస్తాడా?
B) దైవం ఈ సమయంలో గడ్డినే తినమంటాడా?
C) దైవమే ఇప్పుడు గడ్డి వేస్తాడా?
D) దైవమా గడ్డి తినాలా?
జవాబు:
A) దైవం ఇప్పుడు గడ్డి తినిపిస్తాడా?

92. ‘చయ్యనఁ బోయి వచ్చెదన్’ – దీనికి ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) వెంటనే పోయివస్తా
B) శీఘ్రంగా పోయి వస్తాను
C) వేగంగా తిరిగి వెడతా
D) చయ్యన పోయిరమ్ము
జవాబు:
A) వెంటనే పోయివస్తా

93. ‘ప్రాణములింతనె పోవుచున్నవే !! – ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) ప్రాణాలు ఇప్పుడు పోవు
B) ప్రాణాలు ఇంతట్లో పోతాయా?
C) ప్రాణాలు ఈ మాత్రానికే పోతాయా?
D) ప్రాణాలిప్పుడు పోవు
జవాబు:
C) ప్రాణాలు ఈ మాత్రానికే పోతాయా?

11. కర్తరి, కర్మణి వాక్యాలను గుర్తించడం :

94. ‘ఆవు తిరిగి వస్తానని మాట ఇచ్చింది’ – కర్మణి వాక్యం గుర్తించండి.
A) ఆవు తిరిగి వస్తానంది
B) మాట ఈయబడింది చేత ఆవు
C) ఆవుచేత తిరిగి వస్తానని మాట ఈయబడింది
D) ఆవుచేత తిరిగి రానని మాట ఈయబడింది
జవాబు:
C) ఆవుచేత తిరిగి వస్తానని మాట ఈయబడింది

95. ఫులిచేత ఆవు చంపబడలేదు – కర్తరి వాక్యం గుర్తించండి.
A) ఆవు పులిని చంపలేదు
B) ఆవును పులి చంపలేదు
C) ఆవు పులి చంపలేదు
D) పులిని ఆవు చంపలేదు
జవాబు:
B) ఆవును పులి చంపలేదు

12. ప్రత్యక్ష, పరోక్ష కథనాలను గుర్తించడం :

96. “నేను నిన్ను నమ్మాను” అని పులి, ఆవుతో అంది – పరోక్ష కథనం గుర్తించండి.
A) తను దానిని నమ్మానని పులి, ఆవుతో అంది.
B) తన దీనినే నమ్మానని పులి, ఆవుతో అంది.
C) నేను దానిని నమ్మానని ఆవు, పులితో అంది.
D) తన నిన్ను నమ్మానని పులితో ఆవు అంది.
జవాబు:
A) తను దానిని నమ్మానని పులి, ఆవుతో అంది.

97. తనచే గడ్డి తినిపిస్తాడాయని పులి అంది – ప్రత్యక్ష
కథనం గుర్తించండి.
A) “నన్ను గడ్డి తినిపిస్తాడా?” అని పులి అంది.
B) “నాచే గడ్డి తినిపిస్తాడా?” అని పులి అంది.
C) “నాతో గడ్డి తినిపించగలడా?” అని పులి అంది.
D) “నన్ను గడ్డి తినమంటాడా?” అని పులి అంది.
జవాబు:
B) “నాచే గడ్డి తినిపిస్తాడా?” అని పులి అంది.

13. వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించడం :

98. నీ ఇంటికి నీవు వెళ్ళు – వ్యతిరేక వాక్యం గుర్తించండి. (S.A. II – 2018-19)
A) నీ ఇంటికి నీవు వెళ్ళకు
B) నీ ఇంటికి వెళ్ళకు
C) వెళ్ళకు
D) ఏదీకాదు
జవాబు:
A) నీ ఇంటికి నీవు వెళ్ళకు

99. నాకు పుణ్యం ప్రసాదించు – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) ప్రసాదించకు
B) పుణ్యం ప్రసాదించకు
C) నాకు పుణ్యం ప్రసాదించుకు
D) ఏదీకాదు
జవాబు:
C) నాకు పుణ్యం ప్రసాదించుకు

100. అబద్దపు మాటలు ఆడకు – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) అబద్దం ఆడు
B) అబద్దం మాట ఆడు
C) అబద్ధపు మాటలు ఆడు
D) పైవన్నీ
జవాబు:
C) అబద్ధపు మాటలు ఆడు

14. వాక్యంకాలను గుర్తించడం :

101. ఆవు తన మెడ ఎత్తి, పులి దగ్గరగా వెళ్ళింది – ఇది ఏ వాక్యం?
A) సంయుక్త
B) సంక్లిష్ట
C) సామాన్య
D) మహావాక్యం
జవాబు:
B) సంక్లిష్ట

AP Board 9th Class Telugu Important Questions Chapter 7 ఆడినమాట

102. పులి ఆవుని నమ్మింది – ఇది ఏ వాక్యం?
A) మహావాక్యం
B) సంక్లిష్ట
C) సంయుక్త
D) సామాన్య
జవాబు:
D) సామాన్య