Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 5th Lesson స్వేచ్ఛ – సమానత్వం Textbook Questions and Answers.
AP Inter 1st Year Civics Study Material 5th Lesson స్వేచ్ఛ – సమానత్వం
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
స్వేచ్ఛను నిర్వచించీ, వివిధ రకాల స్వేచ్ఛలను వర్ణించండి.
జవాబు:
పరిచయం: స్వేచ్ఛ అనేది రాజనీతిశాస్త్ర అధ్యయనంలో ఒక ముఖ్యమైన భావన. వ్యక్తులకు గల స్వేచ్ఛపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు తమ సర్వతోముఖాభివృద్ధి కోసం స్వేచ్ఛను వాంఛిస్తారు. సామాజిక స్థితిగతులను మెరుగుపరచుకోవడంలో వ్యక్తులకు స్వేచ్ఛ తగిన శక్తిని ప్రసాదిస్తుంది. జె. ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, మాంటెస్క్యూ, హెచ్. జె. లాస్కీ, సీలీ లాంటి రాజనీతి శాస్త్రవేత్తలు స్వేచ్ఛను పెంపొందించటంలో ప్రధాన పాత్రను పోషించారు.
అర్థం: స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు పదం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షల నుంచి విముక్తి”.
నిర్వచనాలు:
- హెచ్.జె.లాస్కీ: “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
- మాంటెస్క్యూ: “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ.”
- జె.ఆర్. సీలీ: “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ.”
స్వేచ్ఛ రకములు: స్వేచ్ఛ ఐదు రకాలు. అవి 1) సహజ స్వేచ్ఛ 2) పౌర స్వేచ్ఛ 3) ఆర్థిక స్వేచ్ఛ 4) రాజకీయ స్వేచ్ఛ. ‘5) జాతీయ స్వేచ్ఛ. వీటిని గురించి ఈ కింద పేర్కొన్న విధంగా విపులీకరించవచ్చు.
1) సహజ స్వేచ్ఛ (Natural Liberty): సహజ స్వేచ్ఛ అనేది ఎటువంటి ఆంక్ష లేకుండా ఏదైనా చేయడాన్ని సూచిస్తుంది. ఇది ఎలాంటి జోక్యానికి లేదా నిర్భంధాలకు తావివ్వదు. వ్యక్తులు తమ ఇచ్ఛానుసారం చేయదలచిన దాన్ని సుసాధ్యం చేస్తుంది. అయితే, నిర్నిబంధమైన స్వేచ్ఛ వ్యక్తుల స్వేచ్ఛలను హరిస్తుంది. నేటి సమాజంలో సహజ స్వేచ్ఛ అనేది కనిపించదు. ఇది అన్యాయం అరాచకత్వాలకు పర్యాయపదమైనది. సహజ స్వేచ్ఛగల చోట స్వాతంత్ర్యం మృగ్యమవుతుంది. ఆదిలో రోమన్ రాజనీతి తత్త్వవేత్తలు ఈ భావనను సమర్థించారు. ఎటువంటి అవధుల్లేని ప్రాకృతిక వ్యవస్థలోని మానవులు అపరిమితమైన స్వేచ్ఛను అనుభవించారన్నారు. అటువంటి స్వేచ్ఛ- రాజ్యం, సమాజాల అవిర్భావానికి ముందు మాత్రమే ఉనికిలో ఉండేది.
2) పౌర స్వేచ్ఛ (Civil Liberty): పౌరస్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడ అంటారు. ఇది సామాజిక సంస్థలోని సభ్యుడైన వ్యక్తి జీవనంలోని స్వాతంత్ర్యాన్ని తెలియజేస్తుంది. పౌరస్వేచ్ఛలో కింద పేర్కొన్న మూడు అంశాలు ఇమిడి ఉంటాయని బార్కర్ పేర్కొన్నాడు. i) సంచార స్వేచ్ఛను సూచించే భౌతిక స్వాతంత్ర్యం ii) ఆలోచన, అభివ్యక్తి, విశ్వాసాన్ని కలిగి ఉండే భౌద్ధిక స్వాతంత్య్రం iii) నిజజీవితంలోని ఆచరణాత్మక ఐచ్ఛిక స్వాతంత్ర్యం. పౌరస్వేచ్చ అనేది మిగతా స్వేచ్ఛలకు ప్రాతిపదికగా ఉంటుంది. సహజ స్వేచ్ఛకు ఇది విరుద్ధమైంది. సమాజంలోని పౌరులు దానిని అనుభవిస్తారు. ఒంటరిగా ఉంటున్న వ్యక్తులకిది ఆవశ్యకమైనది సమాజంలోని ప్రతిఒక్కరూ ప్రాపంచిక విషయాలను ‘ఉమ్మడిగా అనుభవించగలిగినప్పుడే పౌర స్వేచ్ఛ వాస్తవమవుతుంది.
“రాజ్యం చేత గుర్తించబడి అమలయ్యే హక్కుల సముదాయమే పౌర స్వేచ్ఛ” అని గెటిల్ పేర్కొన్నాడు. పౌరస్వేచ్ఛ అనేది అనేక హక్కుల రూపంలో ఉంటుంది. అవి (i) జీవించే హక్కు (ii) పనిచేసే హక్కు (iii) ఆస్తిహక్కు (iv) వాక్ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ, సమావేశ, సంచార, స్థిర నివాసపు హక్కులు మొదలైనవి.
3) ఆర్థిక స్వేచ్ఛ (Economic Liberty): ఆర్థిక స్వేచ్ఛ అంటే ప్రతి ఒక్కరూ తమ జీవనోపాధిని తామే సంపాదించుకోగలగడం. ఒక వ్యక్తి తన రోజువారీ ఆహారాన్ని హేతుబద్ధంగా సంపాదించుకొనే భద్రమైన అవకాశమే ఆర్థికస్వేచ్ఛగా లాస్కీ అభివర్ణించాడు. కోరిక – భయము, ఆకలి – పస్తులు, నిరద్యోగం – అసంపూర్ణతల నుంచి విముక్తి కలిగించేదే ఆర్థిక స్వేచ్ఛ. ఇది ఆర్థిక సంబంధమైన లేమి లేదా అభద్రతల నుంచి స్వాతంత్ర్యాన్ని సూచిస్తుంది. ఆర్థిక స్వేచ్ఛలేని ప్రజాస్వామ్యం అర్థరహితమైంది.
ఈ దిగువ పేర్కొన్న చర్యల అమలు ద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు.
- కనీస వేతనాలను అందించడం.
- పనిహక్కుకు భరోసా కల్పించడం.
- నిరుద్యోగం, అనారోగ్యం వంటి వివిధ రకాల అభద్రతల నుంచి కార్మికులను రక్షించడం
- తగినంత విశ్రాంతిని కల్పించడం.
- పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించడం.
4) రాజకీయ స్వేచ్ఛ (Political Liberty): రాజకీయ స్వేచ్ఛ పౌరులు రాజకీయాంశాలలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఈ రకమైన స్వేచ్ఛ పౌరులకు రాజ్య కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనే శక్తినిస్తుందని లాస్కీ పరిగణించాడు. రాజకీయ స్వేచ్ఛను ప్రజాస్వామ్యానికి పర్యాయపదంగా గిల్ క్రిస్ట్ భావించాడు. రాజకీయ స్వేచ్ఛ అంటే ఎవరికి వారు తమ ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకొనే రాజ్యాంగ స్వేచ్ఛగా లీకాక్ వర్ణించాడు. రాజకీయ స్వేచ్ఛ పౌరులకు మాత్రమే పరిమితమైంది. అది సంవర్ధక స్వభావాన్ని కలిగి ఉంటుంది. రాజకీయ స్వేచ్ఛ పౌరులకు రాజకీయాంశాలలో వివిధ హక్కులను కల్పిస్తుంది. అటువంటి వాటిలో i) ఓటు వేసే హక్కు ii) ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీ చేసే హక్కు iii) ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు iv) విమర్శించే హక్కువంటివి ఉన్నాయి. విద్య, నిజాయితీ, నిష్పక్షపాతమైన పత్రికలు మొదలైనవి ఉన్నప్పుడే రాజకీయ స్వేచ్ఛ వాస్తవం అవుతుందని లాస్కీ నొక్కి చెప్పాడు.
5) జాతీయ స్వేచ్ఛ (National Liberty): జాతీయ స్వేచ్ఛ అంటే రాజ్యం – స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కలిగి ఉండడంగా పేర్కొనవచ్చు. రాజ్యపు సార్వభౌమత్వాన్ని అది సూచిస్తుంది. ప్రతి రాజ్యం ఈ స్వేచ్ఛను అనుభవిస్తూ ఇతర రాజ్యాల ఆధిపత్యానికి లోనుకాకుండా ఉంటుంది. అన్ని రంగాలలో జాతి అభివృద్ధికి ఈ స్వేచ్ఛ ఆవశ్యకమైంది. ప్రాచీన కాలం నుంచి అనేక దేశాల్లో ఇది విశదమైంది. ఈ రకమైన స్వేచ్ఛను పొందడం కోసం అనేక దేశాలు ఎంతగానో ప్రయత్నించాయి. గతంలో టర్కీ ప్రజలకు వ్యతిరేకంగా గ్రీకులు స్వాతంత్య్ర సమరం సాగించారు. అట్లాగే మహాత్మాగాంధీ నాయకత్వంలో భారత ప్రజలు బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం కోసం అహింసాయుత పోరాటం చేశారు. జాతీయ స్వేచ్ఛ ఎంతో విలువైంది.
ప్రశ్న 2.
స్వేచ్ఛ అంటే ఏమిటి ? స్వేచ్ఛ సంరక్షణలను పేర్కొనండి.
జవాబు:
పరిచయం: స్వేచ్ఛ అనేది రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఒక ముఖ్యమైన భావన. వ్యక్తులకు గల స్వేచ్ఛపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు తమ సర్వతోముఖాభివృద్ధి కోసం స్వేచ్ఛను వాంఛిస్తారు. సామాజిక స్థితిగతులను మెరుగుపరచుకోవడంలో వ్యక్తులకు స్వేచ్ఛ తగిన శక్తిని ప్రసాదిస్తుంది. జె. ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, మాంటెస్క్యూ, హెచ్. జె. లాస్కీ, సీలీ లాంటి రాజనీతిశాస్త్రవేత్తలు స్వేచ్ఛను పెంపొందించటంలో ప్రధాన పాత్రను పోషించారు.
అర్థం: స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు పదం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షల నుంచి విముక్తి”.
నిర్వచనాలు:
- హెచ్.జె.లాస్కీ: “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
- మాంటెస్క్యూ: “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ.” 3) జె.ఆర్. సీలీ: “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ.”
స్వేచ్ఛ సంరక్షణలు (లేదా) పరిరక్షణ మార్గాలు:
స్వేచ్ఛ అనేది మానవుల పాలిట అత్యంత విలువైన ఆదర్శం. కాబట్టి దానిని సమాజ, రాజ్య విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పరిరక్షించుకోవాలి. ఈ సందర్భంగా స్వేచ్ఛ పరిరక్షణలో కిందివాటిని పేర్కొనవచ్చు.
1. ప్రజాస్వామ్య వ్యవస్థ (Democratic Rule): ప్రజాస్వామ్య వ్యవస్థ వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షిస్తుంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల ప్రభుత్వం. ఎన్నికైన ప్రతినిధులు ప్రజల స్వేచ్ఛను నిరంతరం కాపాడుతుంటారు. కేవలం ప్రజాస్వామ్య సంస్థలు మాత్రమే స్వేచ్ఛను పరిరక్షించగలవు.
2. లిఖిత మరియు ధృడ రాజ్యాంగం (Written and Rigid Constitution): వ్యక్తి స్వేచ్ఛకు లిఖిత, ధృడ . రాజ్యాంగాన్ని వేరొక ముఖ్య లక్షణంగా భావించవచ్చు. ఇటువంటి రాజ్యాంగం అనేక నిబంధనలలో వ్యక్తి స్వాతంత్ర్యాలను పేర్కొంటుంది. ప్రజల స్వేచ్ఛ, హక్కులకు అది రక్షకురాలిగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వాంగాల చర్యలకు అది హద్దులను ఏర్పరుస్తుంది. ప్రభుత్వాధికారులు లేదా మరెవరి చేతనైనా ప్రజల స్వాతంత్ర్యాలు ఉల్లంఘించబడినప్పుడు చేపట్టవలసిన వివిధ చర్యలను వివరిస్తుంది. తమ సంకుచిత ప్రయోజనాల కోసం రాజ్యాంగంలోని అంశాలను సవరించేందుకు ప్రయత్నించే పార్టీలపై ఆంక్షలను విధిస్తుంది.
3. స్వతంత్ర న్యాయవ్యవస్థ (Independent Judiciary): పౌరుల స్వేచ్ఛా పరిరక్షణకు స్వయం ప్రతిపత్తి ఉన్న నిష్పాక్షిక న్యాయ వ్యవస్థ తప్పనిసరి. దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయస్థానాలు ఉన్నప్పుడే అవి శాసనసభ చేయగల ప్రజావ్యతిరేక చట్టాలను, కార్యనిర్వహక శాఖ అమలుపరచగల ప్రజావ్యతిరేక విధానాలను ఆపగలవు.
4. సమన్యాయపాలన (Rule of Law): స్వేచ్ఛకున్న వేరొక పరిరక్షణయే సమన్యాయపాలన. బ్రిటన్, ఇండియా, అమెరికా సంయుక్తరాష్ట్రాలు వంటి అనేక దేశాల్లో ఇది అమలులో ఉంది. వ్యక్తుల స్వేచ్ఛలను సమన్యాయపాలన మూడు విధాలుగా పరిరక్షిస్తుంది. అవి (i) ఇది వ్యక్తులందరినీ సమానంగా చూస్తుంది. (ii) రాజ్యమంతటా ఒకే విధమైన చట్టాలు అమలయ్యేటట్లు చేస్తుంది. (iii) కార్యనిర్వాహకవర్గపు నిరంకుశాధికారాలపైన తగిన ఆంక్షలను విధిస్తుంది.
5. ప్రాథమిక హక్కులు (Fundamental Rights): ప్రాథమిక హక్కులనేవి వ్యక్తి స్వేచ్ఛలను చాలావరకు పరిరక్షిస్తాయి. ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రజలు స్వేచ్ఛలను పొందుతారు. పౌరులలో నిబిడీకృతమైన నైపుణ్యాలను అభివృద్ధిపరచుటకు, విభిన్న రంగాలలో వారు తమ ప్రతిభను చాటుకొనేందుకు ప్రాథమిక హక్కులు దోహదపడతాయి.
6. ఆర్థిక సమానత్వం (Economic Equality): వ్యక్తుల స్వేచ్ఛా పరిరక్షణలో ఆర్థిక సమానత్వం కూడా ప్రధానమైంది. ఆకలి, పేదరికం, నిరుద్యోగం వంటి దుష్ప్రభావాల నుంచి బయటపడేందుకు వ్యక్తులకు చాలినన్ని అవకాశాలను కల్పించాలనే భావన ఇందులో ఇమిడి ఉంది. ఆర్థిక సమానత్వం నెలకొన్నప్పుడే స్వేచ్ఛ సాధ్యమవుతుంది. ఆర్థిక సమానత్వంలో ఆర్థిక న్యాయం అంతర్భాగంగా ఉంటుంది. దీనిని రాజ్యం ప్రసాదిస్తుంది.
7. అధికారాల వికేంద్రీకరణ (Decentralisation of Powers): అధికారాలు వికేంద్రీకరణ ద్వారా స్వేచ్ఛను మెరుగైన రీతిలో పరిరక్షించవచ్చు. ప్రభుత్వాధికారాల కేంద్రీకరణ నుంచి దేశానికి విముక్తి కలిగినప్పుడే వ్యక్తులు స్వేచ్ఛను అనుభవించగలరు. కేంద్రం రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాల మధ్య అధికారాలను కేటాయించినప్పుడు నిరంకుశత్వానికి, వ్యక్తి స్వేచ్ఛల హరింపునకు తావుండదు లేనిచో రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులను అనుభవించటమన్నది ప్రజలకు కష్టమవుతుంది.
8. పత్రికాస్వాతంత్ర్యం (Independent Press): ప్రజాస్వామ్యాన్ని కొందరు వ్యక్తి స్వేచ్ఛా పరిరక్షణ కవచంగా భావించారు. తమ పనితీరులో చాలినంత స్వతంత్ర ప్రతిపత్తిని పత్రికలు, ఇతర మాధ్యమాలు కలిగి ఉన్నప్పుడే వ్యక్తులు స్వేచ్ఛలను అనుభవించగలరు. ప్రజాభిప్రాయాన్ని ఏర్పరచి, సంఘటితపరచి, వ్యక్తీకరించడంలో పత్రికలు ముఖ్యమైన వాహకంగా వ్యవహరిస్తాయి. అవి తమ నిష్పాక్షిక సంపాదకీయాలు, సత్య సమ్మతమైన వార్తలు, అభిప్రాయాల ద్వారా వ్యక్తి స్వేచ్ఛలను పరిరక్షించగలుగుతాయి.
9. బలమైన ప్రతిపక్షం (Strong Opposition): వ్యక్తి స్వేచ్ఛను పెంపొందించేందుకు బలమైన ప్రతిపక్షం అవసరమవుతుంది. ఒకవిధంగా వ్యక్తి స్వేచ్ఛకు ప్రతిపక్షం కాపలాదారుడిగా పనిచేస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ లేదా ప్రభుత్వంలో ఉన్నత స్థానంలోని వ్యక్తులు నిరంకుశ చట్టాల అమలుద్వారా సామాన్యుల స్వేచ్ఛలకు హద్దులు గీసి హరించి వేసినపుడు, ప్రతిపక్షం అట్టి చర్యలను తీవ్రంగా అడ్డుకుంటుంది. అంతిమంగా, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వ్యక్తుల స్వేచ్ఛలను కాపాడుతుంది.
10. ప్రజల అప్రమత్తత (People vigilance): స్వేచ్ఛకు అన్నింటికన్నా ముఖ్యమైంది ప్రజల అప్రమత్తత. స్వేచ్ఛ పరిరక్షణకు ప్రజలు నిరంతరం అప్రమత్తతతో ఉండాలి. తమ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పరిరక్షించుకోవాలనే ఆకాంక్ష, స్ఫూర్తి, పట్టుదల పౌరస్వేచ్ఛకు శక్తివంతమైన రక్షణ కవచంగా పనిచేస్తాయి.
ప్రశ్న 3.
సమానత్వం అంటే ఏమిటి ? సమానత్వమందలి రకాలు ఏవి ?
జవాబు:
సమానత్వం ఆధునికకాలంలో ఒక ప్రధాన ఆశయం. అది ప్రజాస్వామ్య ఆదర్శం. మానవులంతా పుట్టుకతో సమానులని కొందరు నమ్మారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవహారాలలో ప్రజలందరికి జాతి, మత, కుల, లింగ, భాషా, ప్రాంతీయ, వర్ణ, వర్గ భేదాలు లేకుండా సమానావకాశాలుండటమే సమానత్వము. సమానత్వం అంటే (i) ఏ అడ్డంకులూ లేకుండా ప్రతి వ్యక్తీ వికాసం పొందడం (ii) శాసనాలు పాలనలలో వ్యక్తుల మధ్య భేదం లేకుండా చేయడం (iii) చట్టం ప్రకారం లభించే హక్కులు సమానంగా లభించడం.
నిర్వచనం: “సమానత్వం అంటే సమాజంలో కొందరికి మాత్రమే ప్రత్యేకమైన హక్కులు, అవకాశాలు కాకుండా అందరికీ సమానావకాలు ఉండటమే” అని లాస్కీ నిర్వచించాడు. పుట్టుక, కులం, మతం, ఆస్తి వంటి అర్హతలనుబట్టి వ్యక్తులకు అవకాశాలు కలుగజేస్తే సమానత్వం లభించదు. అందరికీ సమానఆదరణ ఉండటమే సమానత్వానికి అవసరం. సమానత్వ సిద్ధాంతం ప్రకారం చట్టం ముందు అంతా సమానులే. ఆధునిక రాజ్యం ప్రజలందరికీ సాంఘిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో సమానావకాశాలు కల్పించాలి.
సమానత్వం – రకాలు: సమానత్వం ప్రధానంగా ఐదు రకాలు. అవి 1) సహజ సమానత్వం 2) సాంఘిక సమానత్వం 3) ఆర్థిక సమానత్వం 4) రాజకీయ సమానత్వం 5) అంతర్జాతీయ సమానత్వం. వీటిని గురించి ఈ కింద పేర్కొన్న విధంగా విపులీకరించవచ్చు.
1. సహజ సమానత్వం (Natural Equality): సహజ సమానత్వం అంటే అన్ని రకాల అవరోధాలు, సాంఘిక కట్టుబాట్ల నుంచి స్వాతంత్ర్యాన్ని పొందడం. దీని అర్థం వ్యక్తిపరిధిలో ఎటువంటి ఆంక్షలు ఉండకపోవడం. సహజ సమానత్వం గురించి థామస్ హాబ్స్ ప్రతిపాదించిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో పేర్కొనడమైంది. పౌర సమాజం ఆవిర్భవించక ముందే ప్రజలు ప్రాకృతిక వ్యవస్థలో జీవించారని ఈ సిద్ధాంతం పేర్కొన్నది. అసమానతలు, బంధనాలకు నాగరికత దారితీసిందని హాబ్స్ ఉద్ఘాటించాడు. గ్రీకు రోమన్ రాజకీయ తత్త్వవేత్తల రచనలలో ఈ భావం కనపడుతుంది.
2. సాంఘిక సమానత్వం (Social Equality): వర్గ వ్యత్యాసాలు లేకపోవడం, సమానమైన హోదాలు కలిగి ఉండటాన్ని సాంఘిక సమానత్వం సూచిస్తుంది. ఏ వ్యక్తి మతం, వర్గం, వర్ణ, లింగం, పుట్టుక వంటి అంశాల ఆధారంగా వివక్షతకు గురికాకుండా ఉంటే సాంఘిక సమానత్వం నెలకొంటుంది.
ఉదాహరణకు భారతరాజ్యాంగం కుల, వర్గపరమైన వ్యత్యాసాలను నిషేధించింది. వాస్తవానికి అస్త్రశ్యతను అది వ్యతిరేకించింది. పౌరులందరూ సాంఘిక సమానత్వాన్ని అనుభవించినప్పుడు, ఏ ఒక్కరు ఇతరులతో పోల్చినచో కులం, వర్గం, వర్ణం, పుట్టుక, తెగ, జన్మస్థలం వంటి అంశాలపై ఏ విధమైన వివక్షతకు గురికారు. సందర్భంలో క్రింద పేర్కొన్న అంశాలు సాంఘిక సమానత్వ సాధన, కొనసాగింపులకు సహాయపడతాయని చెప్పవచ్చు.
- రాజ్యం ఏ ఒక్క పౌరుడికి ప్రత్యేక సౌకర్యాలను అనుమతించరాదు.
- విద్య, ఉపాధి, పరిపాలన, శాసన నిర్మాణం వంటి రంగాలలో ప్రభుత్వం ఒకే విధానాన్ని పాటించి, అమలు చేయాలి..
- సాంఘిక, మతపరమైన వ్యవహారాలలో ప్రజలు సహనం, త్యాగం, నిజాయితీ వంటి లక్షణాలతో కూడిన విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి.
- రాజ్యంలోని పౌరులు తోటి పౌరులతో సహృద్భావ సంబంధాలను ఏర్పరచుకొని కొనసాగించుకోవాలి.
- తమ విజ్ఞాపనలను పంపించేటప్పుడు కులం, తెగ, లేక మతం వంటి వాటిని సూచించే పేర్లను ప్రజలు ఉపయోగించరాదు.
- కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి.
3. ఆర్థిక సమానత్వం (Economic Equality): ఆర్థిక సమానత్వాన్ని సాంఘిక, రాజకీయ సమానత్వాలకు పునాదిగా పరిగణించడమైంది. ఆధునిక రాజ్యకార్యకలాపాల వెనుక అదొక ముఖ్యమైన చోదకశక్తిగా పనిచేస్తుంది. ఆర్థిక సమానత్వమంటే ఆదాయం, ఆస్తి, సంపదలలో విపరీతమైన వ్యత్యాసాలు లేకుండా చేయడంగా పేర్కొనవచ్చు. ఎర్నెస్ట్ బార్కర్ దృష్టిలో ఆర్థిక సమానత్వం అనేది హోదాకు, పాక్షికంగా ఆస్తి-ఆదాయాలకు సంబంధించిన అంశం. ఆర్థిక సమానత్వాన్ని “సంపదకు చెందిన వ్యత్యాసాలను తొలగించి ప్రయత్నంగా, ప్రాపంచిక వస్తువులను స్త్రీ, పురుషుల మధ్య సమానంగా పంపిణీ చేయాల్సిన ప్రయత్నం”గా లార్డ్స్ భావించాడు. ప్రొఫెసర్ లాస్కీ “పారిశ్రామిక ప్రపంచంలో విశృంఖలమైన, బాధ్యతారహిత ఇచ్ఛను నిషేధించడాన్ని ఆర్థిక సమానత్వం”గా భావించాడు.
4. రాజకీయ సమానత్వం (Political Equality): రాజకీయ సమానత్వం రాజకీయ కార్యకలాపాలలో ప్రజలకు చాలినన్ని అవకాశాలను కల్పించేందుకు అనుకూల పరిస్థితులను సూచిస్తుంది. రాజ్యంలోని పౌరులకు వివిధ రకాల రాజకీయ హక్కులను ప్రసాదించడం ద్వారా ఆ రకమైన సమానత్వాన్ని సాధించవచ్చు. ఈ సందర్భంలో రాజకీయ సమానత్వాన్ని పౌరులు మాత్రమే అనుభవిస్తారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రాజ్యంలో నివసించే అన్యులు, విదేశీయులకు ఇది వర్తించదు. ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయ సమానత్వమన్నది అత్యంత ఆవశ్యకమైంది. వివిధ రాజకీయ హక్కులను ప్రసాదించినప్పుడే పౌరులు రాజకీయ స్వేచ్ఛను అనుభవిస్తారు. అంటే, రాజకీయ సమానత్వమనేది రాజకీయ స్వేచ్ఛకు పర్యాయపదంగా భావించవచ్చు.
5. అంతర్జాతీయ సమానత్వం (International Equality): అంతర్జాతీయ సమానత్వమంటే భౌగోళిక, ఆర్థిక లేదా సైనికపరమైన అంశాలతో నిమిత్తం లేకుండా అన్ని రాజ్యాలనూ సమానంగా చూడటంగా పేర్కొనవచ్చును. ఈ విధమైన సమానత్వం ద్వారా ప్రపంచంలోని చిన్న, పెద్ద రాజ్యాలన్నీ సమానమవుతాయి. ఉదాహరణకు ఐక్యరాజ్యసమితి తన చార్టర్ లో అన్ని రాజ్యాలకు సమానమైన గౌరవం, హోదాలను కల్పించింది. అంతర్జాతీయ సమానత్వం మానవీయ లక్షణాలను ప్రతిబింబిస్తుంది. రాజ్యాల మధ్య ఉత్పన్నమయ్యే వివాదాలను శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలని నొక్కిచెబుతుంది. అంతర్జాతీయ న్యాయానికి గౌరవం లోపించినప్పుడు మూడో ప్రపంచ యుద్ధం సంభవించవచ్చని కొందరు హెచ్చరించారు.
ప్రశ్న 4.
స్వేచ్ఛ, సమానత్వం మధ్యగల సంబంధాన్ని గురించి వివరించండి.
జవాబు:
వ్యక్తులకు గల స్వేచ్ఛ – సమానత్వాలపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఈ రెండు అంశాలు విశేషమైన ప్రాముఖ్యతను సంతరించుకొన్నాయి. వ్యక్తులు తమ సర్వ సమగ్రమైన అభివృద్ధి కోసం స్వేచ్ఛ, సమానత్వాలను వాంఛిస్తారు.
స్వేచ్ఛ, సమానత్వం మధ్య సంబంధం (Relationship between Liberty and Equality): స్వేచ్ఛ సమానత్వం మధ్యగల సంబంధం గురించి రాజనీతి తత్త్వవేత్తలు రెండు భిన్న అభిప్రాయాలను వెల్లడించారు. ఆ రెండింటి భావనలు రాజనీతిశాస్త్రం అధ్యయనంలో ముఖ్యమైనవిగా వారు అంగీకరించారు. అయితే కొందరు ఆ రెండింటి మధ్య సంబంధం ఉందని పేర్కొనగా, మరికొందరు అవి ఒకదానికొకటి వ్యతిరేకమైనవిగా పరిగణించారు.
స్వేచ్ఛ, సమానత్వం పరస్పర సంబంధం కలిగి ఉంటాయనే భావనను రాజనీతి తత్త్వవేత్తలైన రూసో, టానీ, లాస్కీ, జి.డి. హెచ్. కోల్ వంటివారు ప్రతిపాదించారు. ఇక స్వేచ్ఛ, సమానత్వం అనేది పరస్పర వ్యతిరేకమైన భావనలని పేర్కొన్న వారిలో లార్డ్ మాధ్యూ, ఆర్నార్డ్, లార్డ్ ఆక్టన్, డి టాక్విల్లీ వంటి రాజనీతితత్వవేత్తలు ఉన్నారు. పైన పేర్కొన్న రెండు వాదనల గురించి కింది విధంగా తెలపడమైంది.
1) స్వేచ్ఛ, సమానత్వం పరస్పర పోషకాలు:
- వ్యక్తి శ్రేయోవాదులు, అరాచకవాదులు, కమ్యూనిస్టుల దృష్టిలో స్వేచ్ఛ, సమానత్వం పరస్పర పోషకాలు.
- సమానత్వం లేని స్వేచ్ఛ అర్థరహితం, ‘సమానత్వం’ నెలకొల్పబడిన తరువాతే స్వేచ్ఛను గురించి ఆలోచించాలని కమ్యూనిస్టులు భావిస్తారు.
- సక్రమమైన, ఆదర్శమైన రాజ్యం స్థాపించబడాలంటే తప్పనిసరిగా సమానత్వ ప్రాతిపదికగా ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించాలి. ఈ రెండు విస్తృత పరిధిలో చూడబడాలి.
- స్వేచ్ఛ, సమానత్వం – ఈ రెండింటిలో దేన్నీ త్యాగం చేయడానికి ప్రయత్నించరాదు. సమానత్వం, స్వేచ్ఛ లోపించినట్లయితే అరాచకత్వం ప్రబలుతుంది. కావున ప్రభుత్వం శాసనాల ద్వారా ప్రజలందరికి ఎటువంటి జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ భేదము లేకుండా సమానంగా ‘స్వేచ్ఛను’ ప్రసాదించాలి.
- రాజకీయ స్వేచ్ఛ ద్వారా భావ ప్రకటనా స్వాతంత్ర్యం, ఓటుహక్కు, అర్హత ప్రాతిపదికగా పదవులకు పోటీచేసే హక్కు లభిస్తాయి. సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమానత్వాలను ప్రజలందరూ కలిగి ఉండాలంటే వారందరూ స్వేచ్ఛను పొంది ఉండాలి. అందువలనే స్వేచ్ఛ లేకుండా సమానత్వం, సమానత్వం లేకుండా స్వేచ్ఛ ఉండవు.
- ఏ రాజ్యంలో ప్రజలు ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగాలలో స్వేచ్ఛ, సమానత్వాలను సమానంగా పొంది ఉంటారో ఆ రాజ్యం బహుముఖంగా త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని పరిశీలకులు భావిస్తారు.
2) స్వేచ్ఛ-సమానత్వాలు పరస్పర విరుద్ధాలు: స్వేచ్ఛ, సమానత్వం పరస్పర శత్రువులు అని పేర్కొన్న వారిలో లార్డ్ ఆక్టన్ ముఖ్యుడు. రాజ్యముగాని, వ్యక్తులుగాని సమానత్వానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తే స్వేచ్ఛ మరుగున పడిపోతుంది అని ఆక్టన్ మహాశయుడు వాదిస్తాడు. ‘మితిమీరని ప్రభుత్వ పరిపాలననే స్వేచ్ఛ’ అని సీలీ మహాశయుడు పేర్కొన్నాడు. ప్రభుత్వ అధికారాలు మితిమీరడమంటే ప్రజలు తమ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను కోల్పోవటమేనని వీరు భావిస్తారు. ప్రజల వ్యక్తిగత వ్యవహారాలలో, కార్యకలాపాలలో ప్రభుత్వము జోక్యం కల్పించుకోరాదు అని ఆక్టన్ అభిప్రాయం. ప్రజలందరికి ఆర్థిక స్వేచ్ఛను ప్రసాదించినట్లయితే శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు, విద్యా పరిజ్ఞానం కలిగినవారు అపారమైన సంపదను కూడబెడితే, అమాయకులు, నిరక్షరాస్యులు, సోమరిపోతులు తమతమ కనీస అవసరాలను కూడా సమకూర్చుకోలేరు. ఇది సమాజములో ఆర్థిక అసమానత్వానికి, వర్గతత్వానికి దారితీస్తుంది. కావున స్వేచ్ఛ-సమానత్వం పరస్పరం శతృ సంబంధాన్ని కలిగి ఉంటాయి. “ఎక్కడ స్వేచ్ఛ ఉంటుందో, అక్కడ సమానత్వం ఉండదు. ఎక్కడ సమానత్వం ఉంటుందో, అక్కడ స్వేచ్ఛ ఉండదు. స్వేచ్ఛ-సమానత్వం రెండు కత్తుల వంటివి. అవి ఒక ఒరలో ఇమడవు” అని ‘లార్డ్ ఆక్టివ్’, ‘డి టాక్వెల్లీ’, ‘సీలీ’ మొదలగు రాజనీతిజ్ఞులు వాదిస్తారు.
పైన పేర్కొన్న రెండు రకాల వాదనలు పూర్తిగా నిజమైనవికావు. వాస్తవ అంశం ఆ రెండింటికీ మధ్య ఉంటుంది. స్వేచ్ఛ, సమానత్వాలు రెండూ ఒకదానికొకటి పరస్పర పోషక, పరస్పర వ్యతిరేక స్వభావాన్ని కలిగి ఉండవు. ఈ సందర్భంలో ఆ రెండు భావనల మధ్య ఉండే వాస్తవిక సంబంధాన్ని క్రింది విధంగా వివరించడమైంది.
సమానత్వానికి స్వేచ్ఛ అవసరం (Liberty is essential for Equality):
i) స్వేచ్ఛ అంటే నిరపేక్షమైనదికాదు. దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. కొన్ని నిబంధనలకు లోబడి సామాజిక సంక్షేమాన్ని సాధించేందుకై ఈ స్వేచ్ఛ అందరికీ అందుబాటులో ఉంటుంది.
ii) స్వేచ్ఛ అంటే ఏ ఒక్కవ్యక్తి లేదా వ్యక్తుల సముదాయపు గుత్తాధికారంగా భావించరాదు.
iii) ఒకానొక వ్యక్తి స్వేచ్ఛను అనుభవించడమనేది ఇతరులకు స్వేచ్ఛకు భంగం కలిగించేదిగా ఉండకూడదనే ఈ సూత్రాన్ని ఆమోదించారు. సమానత్వ సూత్రాన్ని గౌరవించవలసి ఉంటుంది. దాని అర్థం స్వేచ్ఛా ఫలాలు సమానత్వమనే వృక్షానికి చెందిన శాఖలలో ఉంటాయని పేర్కొనవచ్చు. కాబట్టి స్వేచ్ఛ, సమానత్వాలు ఒకదానికొకటి పరస్పర పోషకాలుగా భావించడమైంది. సమానత్వ సూత్రం ఆధారంగా స్వేచ్ఛను వర్తింపజేస్తే, స్వేచ్ఛాలక్ష్యం వాస్తవానికి నెరవేరినట్లవుతుంది.
స్వేచ్ఛకు సమానత్వం అవసరం (Equality is essential for Liberty): సమానత్వం అంటే ఒకే విధమైన ఆదరణ అని అర్థం కాదు. ఎందుకంటే అటువంటి సమానత్వం పౌర సమాజంలో సాధ్యంకాదు. అందుకు బదులుగా ఒకేరకమైన పరిస్థితులలో సమానమైన ఆదరణయే సమానత్వంగా పేర్కొనవచ్చు. పౌర సమాజంలో కొందరు ఇతరులతో సమానమైన హోదాను కలిగి ఉండరు. అయితే వారికి తమ వ్యక్తిత్వం, హోదాలను పెంపొందించుకొనేందుకై కొన్ని పరిస్థితులు, అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలందరూ సమానంగా ఉన్నప్పుడు స్వేచ్ఛా, ఫలాలను వారందరూ అనుభవిస్తారని చెప్పవచ్చు.
పైన పేర్కొన్న విధంగా స్వేచ్ఛ, సమానత్వం ఒకదానికొకటి పరస్పర పోషకాలుగా ఉంటాయి. ఆ రెండు భావనలు ఒకే ఉమ్మడి లక్ష్యాన్ని కలిగి ఉంటాయి. సమానత్వాన్ని విస్మరించినందునే స్వేచ్ఛ అనే అరాచకం, నియంతృత్వాలకు దారితీస్తుంది. అట్లాగే స్వేచ్ఛను పట్టించుకోకుండా, సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తే, బానిసత్వం ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి వ్యక్తి, సమాజాల ఔన్నత్యానికి ఆ రెండు భావనలు ఆవశ్యకమైనవిగా పేర్కొనవచ్చు.
ప్రశ్న 5.
సమానత్వమనే పదాన్ని నిర్వచించి, సాంఘిక, ఆర్థిక సమానత్వాల గురించి రాయండి.
జవాబు:
సమానత్వం ఆధునికకాలంలో ఒక ప్రధాన ఆశయం. అది ప్రజాస్వామ్య ఆదర్శం. మానవులంతా పుట్టుకతో సమానులని కొందరు నమ్మారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవహారాలలో ప్రజలందరికి జాతి, మత, కుల, లింగ, భాషా, ప్రాంతీయ, వర్ణ, వర్గ భేదాలు లేకుండా సమానావకాశాలుండటమే సమానత్వము. సమానత్వం అంటే (i) ఏ అడ్డంకులూ లేకుండా ప్రతి వ్యక్తీ వికాసం పొందడం (ii) శాసనాలు పాలనలలో వ్యక్తుల మధ్య భేదం లేకుండా చేయడం (iii) చట్టం ప్రకారం లభించే హక్కులు సమానంగా లభించడం.
నిర్వచనం: “సమానత్వం అంటే సమాజంలో కొందరికి మాత్రమే ప్రత్యేకమైన హక్కులు, అవకాశాలు కాకుండా అందరికీ సమానావకాశాలు ఉండటమే” అని లాస్కీ నిర్వచించాడు. పుట్టుక, కులం, మతం, ఆస్తి వంటి అర్హతలనుబట్టి వ్యక్తులకు అవకాశాలు కలుగజేస్తే సమానత్వం లభించదు. అందరికీ సమానఆదరణ ఉండటమే సమానత్వానికి అవసరం. సమానత్వ సిద్ధాంతం ప్రకారం చట్టం ముందు అందరు సమానులే. ఆధునిక రాజ్యం ప్రజలందరికీ సాంఘిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో సమానావకాశాలు కల్పించాలి.
సాంఘిక సమానత్వం (Social Equality): వర్గ వ్యత్యాసాలు లేకపోవడం, సమానమైన హోదాలు కలిగి ఉండటాన్ని సాంఘిక సమానత్వం సూచిస్తుంది. ఏ వ్యక్తి మతం, వర్గం, వర్ణ, లింగం, పుట్టుక వంటి అంశాల ఆధారంగా వివక్షతకు గురికాకుండా ఉంటే సాంఘిక సమానత్వం నెలకొంటుంది.
ఉదాహరణకు భారతరాజ్యాంగం కుల, వర్గపరమైన వ్యత్యాసాలను నిషేధించింది. వాస్తవానికి అస్త్రశ్యతను అది వ్యతిరేకించింది. పౌరులందరూ సాంఘిక సమానత్వాన్ని అనుభవించినప్పుడు, ఏ ఒక్కరు ఇతరులతో పోల్చినచో కులం, వర్గం, వర్ణం, పుట్టుక, తెగ, జన్మస్థలం వంటి అంశాలపై ఏ విధమైన వివక్షతకు గురికారు. ఈ సందర్భంలో క్రింద పేర్కొన్న అంశాలు సాంఘిక సమానత్వ సాధన, కొనసాగింపులకు సహాయపడతాయని చెప్పవచ్చు.
- రాజ్యం ఏ ఒక్క పౌరుడికి ప్రత్యేక సౌకర్యాలను అనుమతించరాదు.
- విద్య, ఉపాధి, పరిపాలన, శాసన నిర్మాణం వంటి రంగాలలో ప్రభుత్వం ఒకే విధానాన్ని పాటించి, అమలు చేయాలి.
- సాంఘిక, మతపరమైన వ్యవహారాలలో ప్రజలు సహనం, త్యాగం, నిజాయితీ వంటి లక్షణాలతో కూడిన విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి.
- రాజ్యంలోని పౌరులు తోటి పౌరులతో సహృద్భావ సంబంధాలను ఏర్పరచుకొని కొనసాగించుకోవాలి.
- తమ విజ్ఞాపనలను పంపించేటప్పుడు కులం, తెగ, లేక మతం వంటి వాటిని సూచించే పేర్లను ప్రజలు ఉపయోగించరాదు.
- కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి.
ఆర్థిక సమానత్వం (Economic Equality): ఆర్థిక సమానత్వాన్ని సాంఘిక, రాజకీయ సమానత్వాలకు పునాదిగా పరిగణించడమైంది. ఆధునిక రాజ్యకార్యకలాపాల వెనుక అదొక ముఖ్యమైన చోదకశక్తిగా పనిచేస్తుంది. ఆర్థిక సమానత్వమంటే ఆదాయం, ఆస్తి, సంపదలలో విపరీతమైన వ్యత్యాసాలు లేకుండా చేయడంగా పేర్కొనవచ్చు. ఎర్నెస్ట్ బార్కర్ దృష్టిలో ఆర్థిక సమానత్వం అనేది హోదాకు, పాక్షికంగా ఆస్తి-ఆదాయాలకు సంబంధించిన అంశం. ఆర్థిక సమానత్వాన్ని “సంపదకు చెందిన వ్యత్యాసాలను తొలగించి ప్రయత్నంగా, ప్రాపంచిక వస్తువులను స్త్రీ, పురుషుల మధ్య సమానంగా పంపిణీ చేయాల్సిన ప్రయత్నం”గా లార్డ్ బ్రైస్ భావించాడు. ప్రొఫెసర్ లాస్కీ “పారిశ్రామిక ప్రపంచంలో విశృంఖలమైన, బాధ్యతారహిత ఇచ్ఛను నిషేధించడాన్ని ఆర్థిక సమానత్వం”గా భావించాడు.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
స్వేచ్ఛను నిర్వచించి, ఏవైనా మూడు రకాలైన స్వేచ్ఛలను వర్ణించండి. [Mar. ’18, ’16]
జవాబు:
పరిచయం: స్వేచ్ఛ అనేది రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఒక ముఖ్యమైన భావన. వ్యక్తులకు గల స్వేచ్ఛపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు తమ సర్వతోముఖాభివృద్ధి కోసం స్వేచ్ఛను వాంఛిస్తారు. సామాజిక స్థితిగతులను మెరుగుపరచుకోవడంలో వ్యక్తులకు స్వేచ్ఛ తగిన శక్తిని ప్రసాదిస్తుంది. జె. ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, మాంటెస్క్యూ, హెచ్. జె. లాస్కీ, సీలీ లాంటి రాజనీతి శాస్త్రవేత్తలు స్వేచ్ఛను పెంపొందించటంలో ప్రధాన పాత్రను పోషించారు.
అర్థం: స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు పదం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షల నుంచి విముక్తి.
నిర్వచనాలు:
- హెచ్.జె.లాస్కీ: “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
- మాంటెస్క్యూ: “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ.”
- జె.ఆర్. సీలీ: “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ.”
1) సహజ స్వేచ్ఛ (Natural Liberty): సహజ స్వేచ్ఛ అనేది ఎటువంటి ఆంక్ష లేకుండా ఏదైనా చేయడాన్ని సూచిస్తుంది. ఇది ఎలాంటి జోక్యానికి లేదా నిర్భంధాలకు తావివ్వదు. వ్యక్తులు తమ ఇచ్ఛానుసారం చేయదలచిన దాన్ని సుసాధ్యం చేస్తుంది. అయితే, నిర్నిబంధమైన స్వేచ్ఛ వ్యక్తుల స్వేచ్ఛలను హరిస్తుంది. నేటి సమాజంలో సహజ స్వేచ్ఛ అనేది కనిపించదు. ఇది అన్యాయం, అరాచకత్వాలకు పర్యాయపదమైనది. సహజ స్వేచ్ఛగల చోట స్వాతంత్య్రం మృగ్యమవుతుంది. ఆదిలో రోమన్ రాజనీతి తత్త్వవేత్తలు ఈ భావనను సమర్థించారు. ఎటువంటి అవధుల్లేని ప్రాకృతిక వ్యవస్థలోని మానవులు అపరిమితమైన స్వేచ్ఛను అనుభవించారన్నారు. అటువంటి స్వేచ్ఛ-రాజ్యం, సమాజాల అవిర్భావానికి ముందు మాత్రమే ఉనికిలో ఉండేది.
2) పౌర స్వేచ్ఛ (Civil Liberty): పౌరస్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడ అంటారు. ఇది సామాజిక సంస్థలోని సభ్యుడైన వ్యక్తి జీవనంలోని స్వాతంత్ర్యాన్ని తెలియజేస్తుంది. పౌరస్వేచ్ఛలో కింద పేర్కొన్న మూడు అంశాలు ఇమిడి ఉంటాయని బార్కర్ పేర్కొన్నాడు. i) సంచార స్వేచ్ఛను సూచించే భౌతిక స్వాతంత్య్రం. ii) ఆలోచన, అభివ్యక్తి, విశ్వాసాన్ని కలిగి ఉండే భౌద్ధిక స్వాతంత్ర్యం iii) నిజజీవితంలోని ఆచరణాత్మక ఐచ్ఛిక స్వాతంత్ర్యం. పౌర స్వేచ్ఛ అనేది మిగతా స్వేచ్ఛలకు ప్రాతిపదికగా ఉంటుంది. సహజ స్వేచ్ఛకు ఇది విరుద్ధమైంది. సమాజంలోని పౌరులు దానిని అనుభవిస్తారు. ఒంటరిగా ఉంటున్న వ్యక్తులకిది ఆవశ్యకమైనది. సమాజంలోని ప్రతిఒక్కరూ ప్రాపంచిక విషయాలను ఉమ్మడిగా అనుభవించగలిగినప్పుడే పౌర స్వేచ్ఛ వాస్తవమవుతుంది.
“రాజ్యం చేత గుర్తించబడి అమలయ్యే హక్కుల సముదాయమే పౌరస్వేచ్చ” అని గెటిల్ పేర్కొన్నాడు. పౌరస్వేచ్ఛ అనేది అనేక హక్కుల రూపంలో ఉంటుంది. అవి (i) జీవించే హక్కు (ii) పనిచేసే హక్కు (iii) ఆస్తిహక్కు iv) వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణ, సమావేశ, సంచార, స్థిరనివాసపు హక్కులు మొదలైనవి.
3) ఆర్థిక స్వేచ్ఛ (Economic Liberty): ఆర్థిక స్వేచ్ఛ అంటే ప్రతిఒక్కరూ తమ జీవనోపాధిని తామే సంపాదించుకోగలగడం. ఒక వ్యక్తి తన రోజువారీ ఆహారాన్ని హేతుబద్ధంగా సంపాదించుకొనే భద్రమైన అవకాశమే | ఆర్థికస్వేచ్ఛగా లాస్కీ అభివర్ణించాడు. కోరిక – భయము, ఆకలి – పస్తులు, నిరద్యోగం – అసంపూర్ణతల నుంచి విముక్తి కలిగించేదే ఆర్థిక స్వేచ్ఛ. ఇది ఆర్థిక సంబంధమైన లేమి లేదా అభద్రతల నుంచి స్వాతంత్ర్యాన్ని సూచిస్తుంది. ఆర్థిక స్వేచ్ఛలేని ప్రజాస్వామ్యం అర్థరహితమైంది.
ఈ దిగువ పేర్కొన్న చర్యల అమలు ద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు.
- కనీస వేతనాలను అందించడం.
- పనిహక్కుకు భరోసా కల్పించడం.
- నిరుద్యోగం, అనారోగ్యం వంటి వివిధ రకాల అభద్రతల నుంచి కార్మికులను రక్షించడం.
- తగినంత విశ్రాంతిని కల్పించడం.
- పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించడం.
ప్రశ్న 2.
స్వేచ్ఛకు గల ఏవైనా మూడు పరిరక్షణలను వివరించండి. [Mar. 2017]
జవాబు:
1. ఆర్థిక సమానత్వం (Economic Equality): వ్యక్తుల స్వేచ్ఛా పరిరక్షణలో ఆర్థిక సమానత్వం కూడా ప్రధానమైంది. ఆకలి, పేదరికం, నిరుద్యోగం వంటి దుష్ప్రభావాల నుంచి బయటపడేందుకు వ్యక్తులకు చాలినన్ని అవకాశాలను కల్పించాలనే భావన ఇందులో ఇమిడి ఉంది. ఆర్థిక సమానత్వం నెలకొన్నప్పుడే స్వేచ్ఛ సాధ్యమవుతుంది. ఆర్థిక సమానత్వంలో ఆర్థిక న్యాయం అంతర్భాగంగా ఉంటుంది. దీనిని రాజ్యం ప్రసాదిస్తుంది.
2. అధికారాల వికేంద్రీకరణ (Decentralisation of Powers): అధికారాల వికేంద్రీకరణ ద్వారా స్వేచ్ఛను మెరుగైన రీతిలో పరిరక్షించవచ్చు. ప్రభుత్వాధికారాల కేంద్రీకరణ నుంచి దేశానికి విముక్తి కలిగినప్పుడే వ్యక్తులు స్వేచ్ఛను అనుభవించగలరు. కేంద్రం రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాల మధ్య అధికారాలను కేటాయించినప్పుడు నిరంకుశత్వానికి, వ్యక్తి స్వేచ్ఛల హరింపునకు తావుండదు, లేనిచో రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులను అనుభవించటమన్నది ప్రజలకు కష్టమవుతుంది.
3. పత్రికాస్వాతంత్ర్యం (Independent Press): ప్రజాస్వామ్యాన్ని కొందరు వ్యక్తి స్వేచ్ఛా పరిరక్షణ కవచంగా భావించారు. తమ పనితీరులో చాలినంత స్వతంత్ర ప్రతిపత్తిని పత్రికలు, ఇతర మాధ్యమాలు కలిగి ఉన్నప్పుడే వ్యక్తులు స్వేచ్ఛలను అనుభవించగలరు. ప్రజాభిప్రాయాన్ని ఏర్పరచి, సంఘటితపరచి, వ్యక్తీకరించడంలో పత్రికలు ముఖ్యమైన వాహకంగా వ్యవహరిస్తాయి. అవి తమ నిష్పాక్షిక సంపాదకీయాలు, సత్య సమ్మతమైన వార్తలు, అభిప్రాయాల ద్వారా వ్యక్తి స్వేచ్ఛలను పరిరక్షించగలుగుతాయి.
ప్రశ్న 3.
స్వేచ్ఛ లక్షణాలేవి ?
జవాబు:
పరిచయం: స్వేచ్ఛ అనేది రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఒక ముఖ్యమైన భావన. వ్యక్తులకు గల స్వేచ్ఛపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు తమ సర్వతోముఖాభివృద్ధి కోసం స్వేచ్ఛను వాంఛిస్తారు. సామాజిక స్థితిగతులను మెరుగుపరచుకోవడంలో వ్యక్తులకు స్వేచ్ఛ తగిన శక్తిని ప్రసాదిస్తుంది. ‘జె. ఎస్. మిల్, హెర్బర్ట్ స్పైన్సర్, మాంటెస్క్యూ, హెచ్. జె. లాస్కీ, సీలీ లాంటి రాజనీతి శాస్త్రవేత్తలు స్వేచ్ఛను పెంపొందించటంలో ప్రధాన పాత్రను పోషించారు.
అర్థం: స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు పదం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షల నుంచి విముక్తి”.
నిర్వచనాలు:
- హెచ్.జె.లాస్కీ: “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
- మాంటెస్క్యూ: “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ.”
- జె.ఆర్. సీలీ: “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ.”
స్వేచ్ఛ లక్షణాలు (Characteristics of Liberty): స్వేచ్ఛ ముఖ్య లక్షణాలను కింద పేర్కొనడమైనది.
- స్వేచ్ఛ ఒక శక్తివంతమైన భావన. దాని వ్యాఖ్యానమనేది స్థలం, కాలం, ప్రాంతం, ప్రజల ఆకాంక్షలను బట్టి ఉంటుంది.
- రాజకీయంగా లోబరచుకోవడం, బానిసలుగా మార్చటాన్ని స్వేచ్ఛ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుంది.
- వ్యక్తుల ఆకాంక్షలను సదా వాస్తవం చేయడమే స్వేచ్ఛలక్ష్యం అవుతుంది.
- నిర్హేతుకమైన ఆంక్షలకు బదులు నిరంతరం సానుకూల పరిస్థితులను కలిగి ఉండటమే స్వేచ్ఛ. 5. ఇది హక్కుల ఫలం.
- మానవీయ వ్యక్తిత్వాల సాధనకు అత్యంత ఆవశ్యకమైంది.
- ప్రజాస్వామ్య రాజ్యాలలోనే ఇది కనిపిస్తుంది.
- హక్కుల రూపంలో ఇది సాకారమవుతుంది.
- స్వేచ్ఛ అంటే ఏ ఒక్కరు యధేచ్ఛగా వ్యవహరించడం కాదు. ఇది ఎన్నో పరిమితులతో కూడుకొని ఉంటుంది.
ప్రశ్న 4.
స్వేచ్ఛకు గల వివిధ ధృక్కోణాలను తెలపండి.
జవాబు:
అర్థం: స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు పదం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షల నుంచి విముక్తి”.
నిర్వచనాలు:
- హెచ్.జె.లాస్కీ: “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
- మాంటెస్క్యూ: “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ.”
- జె.ఆర్. సీలీ: “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ.”
స్వేచ్ఛ ధృక్కోణాలు (Aspects of Liberty): స్వేచ్ఛకు రెండు ధృక్కోణాలు ఉంటాయి. అవి 1. సకారాత్మకమైన ధృక్కోణం 2. నకారాత్మకమైన ధృక్కోణం.
1. సకారాత్మక ధృక్కోణం (Positive Aspect): సకారాత్మక ధృక్కోణంలో స్వేచ్ఛ అనేది వ్యక్తి తన అభీష్టం మేరకు నడుచుకుంటూ ఇతరులు కూడా తనవలె నడుచుకోవాలనే పరిస్థితిని సూచిస్తుంది. వేరొక మాటలో చెప్పాలంటే, ఇతరులకు హాని కలిగించని అధికారమే స్వేచ్ఛ అనే ధృక్కోణాన్ని సూచిస్తుంది. టి.హెచ్. గ్రీన్ అనే ఆదర్శ తత్త్వవేత్త ఈ రకమైన స్వేచ్ఛా ధృక్కోణాన్ని ప్రతిపాదించాడు. “ఇతరులతో సమానంగా ఆనందంతో ఏదైనా చేసి అనుభవించేందుకు గల అధికారమే స్వేచ్ఛ” గా అతడు భావించాడు.
2. నకారాత్మక ధృక్కోణం (Nagative Aspect): నకారాత్మక ధృక్కోణంలో స్వేచ్ఛ అంటే ఎటువంటి ఆంక్షలు లేకపోవడం. తమ స్వాతంత్ర్యాల మీద ఎలాంటి ఆంక్షలు లేనప్పుడే వ్యక్తులు స్వాతంత్ర్యాన్ని పొందగలరు. అయితే, కొందరు దీన్ని వాస్తవ విరుద్ధమైనదిగా భావించారు. రాజ్యం ఆవిర్భావానికి పూర్యం మాత్రమే వ్యక్తులకు ఆంక్షలు లేని, స్వేచ్ఛ ఉందన్నారు. వారి ప్రకారం అటువంటి రాజ్యం అసాధ్యమైందే కాకుండా, ఆధునిక కాలంలో వ్యక్తులు స్వాతంత్ర్యాన్ని అనుభవించే వీలులేనిది కూడా అవుతుంది.
ప్రశ్న 5.
పౌర స్వేచ్ఛ అంటే ఏమిటి ?
జవాబు:
పౌర స్వేచ్ఛ (Civil Liberty): పౌరస్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడ అంటారు. ఇది సామాజిక సంస్థలోని సభ్యుడైన వ్యక్తి జీవనంలోని స్వాతంత్ర్యాన్ని తెలియజేస్తుంది. పౌరస్వేచ్ఛలో కింద పేర్కొన్న మూడు అంశాలు ఇమిడి | ఉంటాయని బార్కర్ పేర్కొన్నాడు. i) సంచార స్వేచ్ఛను సూచించే భౌతిక స్వాతంత్ర్యం ii) ఆలోచన, అభివ్యక్తి, విశ్వాసాన్ని కలిగి ఉండే భౌద్ధిక స్వాతంత్ర్యం, iii) నిజజీవితంలోని ఆచరణాత్మక ఐచ్ఛిక స్వాతంత్య్రం. పౌర స్వేచ్ఛ అనేది మిగతా స్వేచ్ఛలకు ప్రాతిపదికగా ఉంటుంది. సహజస్వేచ్ఛకు ఇది విరుద్ధమైంది. సమాజంలోని పౌరులు దానిని అనుభవిస్తారు. ఒంటరిగా ఉంటున్న వ్యక్తులకిది ఆవశ్యకమైనది సమాజంలోని ప్రతిఒక్కరూ ప్రాపంచిక విషయాలను ఉమ్మడిగా అనుభవించగలిగినప్పుడే పౌరస్వేచ్ఛ వాస్తవమవుతుంది.
“రాజ్యం చేత గుర్తించబడి అమలయ్యే హక్కుల సముదాయమే పౌర స్వేచ్ఛ” అని గెటిల్ పేర్కొన్నాడు. పౌరస్వేచ్ఛ అనేది అనేక హక్కుల రూపంలో ఉంటుంది. అవి (i) జీవించే హక్కు (ii) పనిచేసే హక్కు (iii) ఆస్తిహక్కు (iv) వాక్ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ, సమావేశ, సంచార, స్థిర నివాసపు హక్కులు మొదలైనవి.
ప్రశ్న 6.
వ్యక్తి స్వేచ్ఛలను ఆటంకపరిచే ఏవైనా రెండు అంశాలను సూచించండి.
జవాబు:
అర్థం: స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు పదం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షల నుంచి విముక్తి”.
నిర్వచనాలు:
- హెచ్.జె.లాస్కీ: “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
- మాంటెస్క్యూ “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ.”
- జె.ఆర్. సీలీ: “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ.”
ఆధునిక కాలంలో వ్యక్తిస్వేచ్ఛకు కింద పేర్కొన్న అంశాలు భంగం కలిగిస్తాయి.
1. రాజ్యాధికార పెరుగుదల (Enhancement of State Authority): ఆధునిక ప్రజాస్వామ్యరాజ్యం సంక్షేమ సిద్ధాంతం పేరుతో అనిర్వచనీయమైన అధికారాలను సంతరించుకుంది. దాంతో అది ప్రజలకు సంబంధించిన ప్రతి కార్యక్రమంలో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది. జనాభా నియంత్రణ పేరుతో అది కుటుంబ విషయాలలో కూడా జోక్యం చేసుకుంటున్నది. అట్లాగే ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి, కళలు, శాస్త్రవిజ్ఞాన రంగాలలో సైతం రాజ్యం జోక్యం పెరిగింది. పైన పేర్కొన్న అంశాలన్నీ ప్రభుత్వ వ్యవహారాలలో రాజ్యం జోక్యానికి నిదర్శనంగా నిలిచాయి. దాంతో వ్యక్తిస్వేచ్ఛకు చెప్పుకోదగిన రీతిలో ఆటంకాలు ఏర్పడినాయి.
2. మితిమీరిన చట్టాలు (Too many Laws): ఆధునిక కాలంలో ప్రభుత్వం అనేక సదుపాయాలను కల్పించడం ద్వారా తమను ఆదుకోవలసి ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. అటువంటి భావన ప్రజల వ్యవహారాలలో ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు కారణమైంది. ఆ ప్రక్రియలో అనేక చట్టాలు అమలులోకి రావడం ఈనాడు సర్వసాధారణమైంది. చట్టాలు విస్తృతమయ్యేకొద్దీ వ్యక్తి స్వేచ్ఛలు క్రమేణ తగ్గిపోతూ వచ్చాయి.
3. ప్రతికూల ధోరణి (Negative Attitude): ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి అనుగుణంగా స్పందిస్తూ ప్రజలకు తన విధానాలను తెలియజేస్తుంది. ఆ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వంలో సంబంధిత వ్యక్తులు ప్రజాభిప్రాయాన్ని వక్రీకరించేందుకు ప్రయత్నించే అవకాశం ఏర్పడింది. అటువంటి ధోరణి వర్తమాన ప్రపంచంలో ఇండియాతో సహా అనేక రాజ్యాలలో మనం గమనించవచ్చు.
4. మెజారిటీ నియంతృత్వం (Tyranny of Majority): వ్యక్తి స్వేచ్ఛ మెజారిటీ నియంతృత్వంచే అణచివేతకు గురవుతుంది. శాసనసభలో మెజారిటీ సభ్యులు మద్దతును కలిగి ఉండడం ద్వారా అధికారపక్షం ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలను పట్టించుకోకుండా చట్టాలను రూపొందిస్తుంది. అటువంటప్పుడు అధికారపక్ష వైఖరితో వ్యక్తిస్వేచ్ఛకు ప్రమాదం ఏర్పడుతుంది. అటువంటి పార్టీకి అధికారంలో కొనసాగేందుకు లేదా ప్రతిపక్షంగా వ్యవహరించేందుకు అవకాశాన్నివ్వకుండా పౌరులు రాబోయే ఎన్నికలలో ఓటు హక్కుద్వారా అప్రమత్తంగా వ్యవహరించాలి.
ప్రశ్న 7.
స్వేచ్ఛ అంటే ఏమిటి ?
జవాబు:
ఏది లేకుండా మానవుడు తన మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసుకోలేడో, అటువంటి అనివార్యమైన నిబంధనే స్వేచ్ఛ. నిజానికి స్వేచ్ఛకు తగిన అర్థాన్ని ఇవ్వటమన్నది బహుకష్టమైన పని. ఎందుకంటే, దీనిని విభిన్న వర్గాలకు చెందినవారు విభిన్నమైన అర్థాలతో సంబోధించారు.
Liberty అనే ఇంగ్లీషు పదం ‘లిబర్’ అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో ‘లిబర్’ అనే పదానికి అర్థం ‘ఆంక్షల నుంచి విముక్తి. రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వ్యక్తులు పాల్గొనుటకు ఉండే హక్కులు, బాధ్యతల సాధనమే స్వేచ్ఛ అని ప్రాచీన గ్రీకు రాజనీతి తత్త్వవేత్తలు భావించారు. నిఘంటువులలో స్వేచ్ఛపదాన్ని వివిధ రకాలుగా ప్రస్తావించడమైంది. కొలంబియా విజ్ఞాన సర్వస్వంలో వ్యక్తుల వాక్ స్వాతంత్ర్యం, ఆత్మరక్షణ హక్కు వంటి విభిన్న స్వాతంత్ర్యాలను వర్ణించేందుకై ‘స్వేచ్ఛ’ అనే పదాన్ని ఉపయోగించడమైనది. వాస్తవానికి వ్యక్తి తన ఇష్టానుసారం, ఏదిపడితే అది చేయటానికి స్వేచ్ఛ అనుమతినివ్వదు. సమాజం నియంత్రించిన కొన్ని సాంఘిక, నైతిక ఆంక్షలకు లోబడి వ్యక్తులు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు స్వేచ్ఛను వినియోగించుకోవాలి. ఇతరులకు హాని కలిగించని వ్యక్తి ప్రవర్తనే స్వేచ్ఛ పరమార్థంగా పేర్కొనవచ్చు.
ప్రశ్న 8.
స్వేచ్ఛకు గల ఏవైనా మూడు ధృక్కోణాలను పేర్కొనండి.
జవాబు:
స్వేచ్ఛకు రెండు ధృక్కోణాలు ఉంటాయి. అవి 1. సకారాత్మకమైన ధృక్కోణం 2. నకారాత్మకమైన ధృక్కోణం.
1. సకారాత్మక ధృక్కోణం (Positive Aspect): సకారాత్మక ధృక్కోణంలో స్వేచ్ఛ అనేది వ్యక్తి తన అభీష్టం మేరకు నడుచుకొంటూ ఇతరులు కూడా తనవలె నడుచుకోవాలనే పరిస్థితిని సూచిస్తుంది. వేరొక మాటలో చెప్పాలంటే, ఇతరులకు హాని కలిగించని అధికారమే స్వేచ్ఛ అనే ధృక్కోణాన్ని సూచిస్తుంది. టి.హెచ్. గ్రీన్ అనే ఆదర్శ తత్త్వవేత్త ఈ రకమైన స్వేచ్ఛా ధృక్కోణాన్ని ప్రతిపాదించాడు. “ఇతరులతో సమానంగా ఆనందంతో ఏదైనా చేసి అనుభవించేందుకు గల అధికారమే స్వేచ్ఛ” గా అతడు భావించాడు.
2. నకారాత్మక ధృక్కోణం (Nagative Aspect): నకారాత్మక ధృక్కోణంలో స్వేచ్ఛ అంటే ఎటువంటి ఆంక్షలు లేకపోవడం. తమ స్వాతంత్ర్యాల మీద ఎలాంటి ఆంక్షలు లేనప్పుడే వ్యక్తులు స్వాతంత్ర్యాన్ని పొందగలరు. అయితే, కొందరు దీన్ని వాస్తవ విరుద్ధమైనదిగా భావించారు. రాజ్యం ఆవిర్భావానికి పూర్యం మాత్రమే వ్యక్తులకు ఆంక్షలేని, స్వేచ్ఛ ఉందన్నారు. వారి ప్రకారం అటువంటి రాజ్యం అసాధ్యమైందే కాకుండా, ఆధునిక కాలంలో వ్యక్తులు స్వాతంత్య్రాన్ని అనుభవించే వీలు లేనిది కూడా అవుతుంది.
ప్రశ్న 9.
సమానత్వం అంటే ఏమిటి ? ఏవైనా మూడు రకాల సమానత్వాలను వివరించండి.
జవాబు:
సమానత్వం ఆధునికకాలంలో ఒక ప్రధాన ఆశయం. అది ప్రజాస్వామ్య ఆదర్శం. మానవులంతా పుట్టుకతో సమానులని కొందరు నమ్మారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవహారాలలో ప్రజలందరికి జాతి, మత, కుల, లింగ, | భాషా, ప్రాంతీయ, వర్ణ, వర్గ భేదాలు లేకుండా సమానావకాశాలుండటమే సమానత్వము. సమానత్వం అంటే (i) ఏ అడ్డంకులూ లేకుండా ప్రతి వ్యక్తీ వికాసం పొందడం, (ii) శాసనాలు పాలనలలో వ్యక్తుల మధ్య భేదం లేకుండా చేయడం (iii) చట్టం ప్రకారం లభించే హక్కులు సమానంగా లభించడం.
నిర్వచనం: “సమానత్వం అంటే సమాజంలో కొందరికి మాత్రమే ప్రత్యేకమైన హక్కులు, అవకాశాలు కాకుండా అందరికీ సమానావకాలు ఉండటమే” అని లాస్కీ నిర్వచించాడు. పుట్టుక, కులం, మతం, ఆస్తి వంటి అర్హతలనుబట్టి వ్యక్తులకు అవకాశాలు కలుగజేస్తే సమానత్వం లభించదు. అందరికీ సమానఆదరణ ఉండటమే సమానత్వానికి అవసరం. సమానత్వ సిద్ధాంతం ప్రకారం చట్టం ముందు అంతా సమానులే. ఆధునిక రాజ్యం ప్రజలందరికీ సాంఘిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో సమానావకాశాలు కల్పించాలి.
1. సహజ సమానత్వం (Natural Equality): సహజ సమానత్వం అంటే అన్ని రకాల అవరోధాలు, సాంఘిక కట్టుబాట్ల నుంచి స్వాతంత్ర్యాన్ని పొందడం. దీని అర్థం వ్యక్తి పరిధిలో ఎటువంటి ఆంక్షలు ఉండకపోవడం. సహజ సమానత్వం గురించి థామస్ హాబ్స్ ప్రతిపాదించిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో పేర్కొనడమైంది. పౌర సమాజం ఆవిర్భవించక ముందే ప్రజలు ప్రాకృతిక వ్యవస్థలో జీవించారని ఈ సిద్ధాంతం పేర్కొన్నది. అసమానతలు, బంధనాలకు నాగరికత దారితీసిందని హాబ్స్ ఉద్ఘాటించాడు. గ్రీకు రోమన్ రాజకీయ తత్త్వవేత్తల రచనలలో ఈ భావం కనపడుతుంది.
2. సాంఘిక సమానత్వం (Social Equality): వర్గ వ్యత్యాసాలు లేకపోవడం, సమానమైన హోదాలు కలిగి ఉండటాన్ని సాంఘిక సమానత్వం సూచిస్తుంది. ఏ వ్యక్తి మతం, వర్గం, వర్ణ, లింగం, పుట్టుక వంటి అంశాల ఆధారంగా వివక్షతకు గురికాకుండా ఉంటే సాంఘిక సమానత్వం నెలకొంటుంది.
ఉదాహరణకు భారతరాజ్యాంగం కుల, వర్గపరమైన వ్యత్యాసాలను నిషేధించింది. వాస్తవానికి అస్త్రశ్యతను అది వ్యతిరేకించింది. పౌరులందరూ సాంఘిక సమానత్వాన్ని అనుభవించినప్పుడు, ఏ ఒక్కరు ఇతరులతో పోల్చినచో కులం, వర్గం, వర్ణం, పుట్టుక, తెగ, జన్మస్థలం వంటి అంశాలపై ఏ విధమైన వివక్షతకు గురికారు. ఈ సందర్భంలో క్రింద పేర్కొన్న అంశాలు సాంఘిక సమానత్వ సాధన, కొనసాగింపులకు సహాయపడతాయని చెప్పవచ్చు.
- రాజ్యం ఏ ఒక్క పౌరుడికి ప్రత్యేక సౌకర్యాలను అనుమతించరాదు.
- విద్య, ఉపాధి, పరిపాలన, శాసన నిర్మాణం వంటి రంగాలలో ప్రభుత్వం ఒకే విధానాన్ని పాటించి, అమలు చేయాలి.
- సాంఘిక, మతపరమైన వ్యవహారాలలో ప్రజలు సహనం, త్యాగం, నిజాయితీ వంటి లక్షణాలతో కూడిన విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి.
- రాజ్యంలోని పౌరులు తోటి పౌరులతో సహృద్భావ సంబంధాలను ఏర్పరచుకొని కొనసాగించుకోవాలి.
- తమ విజ్ఞాపనలను పంపించేటప్పుడు కులం, తెగ, లేక మతం వంటి వాటిని సూచించే పేర్లను ప్రజలు ఉపయోగించరాదు.
- కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి.
3. ఆర్థిక సమానత్వం (Economic Equality): ఆర్థిక సమానత్వాన్ని సాంఘిక, రాజకీయ సమానత్వాలకు పునాదిగా పరిగణించడమైంది. ఆధునిక రాజ్యకార్యకలాపాల వెనుక అదొక ముఖ్యమైన చోదకశక్తిగా పనిచేస్తుంది. ఆర్థిక సమానత్వమంటే ఆదాయం, ఆస్తి, సంపదలలో విపరీతమైన వ్యత్యాసాలు లేకుండా చేయడంగా పేర్కొనవచ్చు. ఎర్నెస్ట్ బార్కర్ దృష్టిలో ఆర్థిక సమానత్వం అనేది హోదాకు, పాక్షికంగా ఆస్తి-ఆదాయాలకు సంబంధించిన అంశం. ఆర్థిక సమానత్వాన్ని “సంపదకు చెందిన వ్యత్యాసాలను తొలగించి ప్రయత్నంగా, ప్రాపంచిక వస్తువులను స్త్రీ, పురుషల మధ్య సమానంగా పంపిణీ చేయాల్సిన ప్రయత్నం”గా లార్డ్స్ భావించాడు. ప్రొఫెసర్ లాస్కీ “పారిశ్రామిక ప్రపంచంలో విశృంఖలమైన, బాధ్యతారహిత ఇచ్ఛను నిషేధించడాన్ని ఆర్థిక సమానత్వం”గా భావించాడు.
ప్రశ్న 10.
రాజకీయ సమానత్వం అంటే ఏమిటో రాయండి.
జవాబు:
రాజకీయ సమానత్వం (Political Equality): రాజకీయ సమానత్వం రాజకీయ కార్యకలాపాలలో ప్రజలకు చాలినన్ని అవకాశాలను కల్పించేందుకు అనుకూల పరిస్థితులను సూచిస్తుంది. రాజ్యంలోని పౌరులకు వివిధ రకాల రాజకీయ హక్కులను ప్రసాదించడం ద్వారా ఆ రకమైన సమానత్వాన్ని సాధించవచ్చు. ఈ సందర్భంలో రాజకీయ సమానత్వాన్ని పౌరులు మాత్రమే అనుభవిస్తారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రాజ్యంలో నివసించే అన్యులు, విదేశీయులకు ఇది వర్తించదు. ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయ సమానత్వమన్నది అత్యంత ఆవశ్యకమైంది. వివిధ రాజకీయ హక్కులను ప్రసాదించినప్పుడే పౌరులు రాజకీయ స్వేచ్ఛను అనుభవిస్తారు. అంటే, రాజకీయ సమానత్వమనేది రాజకీయ స్వేచ్ఛకు పర్యాయపదంగా భావించవచ్చు. రాజకీయ హక్కులను పౌరులు సక్రమంగా వినియోగించుకొన్నప్పుడే రాజకీయ సమానత్వం ఆచరణలో ఉన్నట్లుగా పేర్కొనవచ్చు. దూరదృష్టి, చిత్తశుద్ధి, నిజాయితీలు గల మంచి ఆదర్శప్రాయమైన అభ్యర్థులను ఎన్నుకొనేందుకు పౌరులు తమ రాజకీయ హక్కులను సద్వినియోగపరచుకోవాలి. ఓటు హక్కును వినియోగించుకొనేటప్పుడు వారు ఎటువంటి బహుమానాలు లేదా ప్రలోభాలకు లోనుకాకూడదు. దేశప్రగతి కోసం గట్టిగా కృషి చేసేవారికే వారు తమ మద్దతు ప్రకటించాలి. కనీస విద్య, అక్షరాస్యత, ఆర్ధిక స్వయంసమృద్ధి, రాజకీయ అవగాహనలను వారు కలిగి ఉండాలి. తమ అభీష్టానికి విరుద్ధంగా వ్యవహరించే పాలన, కార్య- నిర్వహణాధికారులు, శాసనసభ్యుల విధానాలను విమర్శించేందుకు వారు సందేహించరాదు. అయితే అటువంటి విమర్శలు రాజ్యాంగ అంశాల పరిధిలోనే జరగాలి. శాంతియుత మార్గాల ద్వారా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలి. ప్రభుత్వాధికారాన్ని చేపట్టే అవకాశం ఉన్నప్పుడు ఎంతో హేతువు, బాధ్యత, విశ్వసనీయతలతో వారు తమ అధికారాలను నిర్వహించాలి. అటువంటప్పుడే రాజ్యంలో రాజకీయ సమానత్వం ఉనికిలో ఉంటుందని చెప్పవచ్చు.
రాజకీయ సమానత్వం అనేది ప్రజాస్వామ్య రాజ్యంలో మాత్రమే అమలులో ఉంటుంది. రాజరికం, కులీన పాలన వంటి ఇతర ప్రభుత్వ రకాలలో అది కానరాదు. ఎందుకంటే రాజకీయ వ్యవహారాలలో పౌరులకు ఆ ప్రభుత్వాలు సమానావకాశాలను కల్పించవు.
ప్రశ్న 11.
ఆర్థిక సమానత్వం ప్రాధాన్యత గురించి చర్చించండి.
జవాబు:
ఆర్థిక సమానత్వం (Economic Equality): ఆర్థిక సమానత్వాన్ని సాంఘిక, రాజకీయ సమానత్వాలకు | పునాదిగా పరిగణించడమైంది. ఆధునిక రాజ్య కార్యకలాపాల వెనుక అదొక ముఖ్యమైన చోదకశక్తిగా పనిచేస్తుంది. ఆర్థిక సమానత్వమంటే ఆదాయం, ఆస్తి, సంపదలలో విపరీతమైన వ్యత్యాసాలు లేకుండా చేయడంగా పేర్కొనవచ్చు. ఎర్నెస్ట్ బార్కర్ దృష్టిలో ఆర్థిక సమానత్వం అనేది హోదాకు, పాక్షికంగా ఆస్తి – ఆదాయాలకు సంబంధించిన అంశం. ఆర్థిక సమానత్వాన్ని “సంపదకు చెందిన వ్యత్యాసాలకు తొలగించి ప్రయత్నంగా, ప్రాపంచిక వస్తువులను స్త్రీ పురుషుల మధ్య సమానంగా పంపిణీచేయాల్సిన ప్రయత్నంగా లార్డ్స్ భావించాడు. ఇక ప్రొఫెసర్ లాస్కి “పారిశ్రామిక ప్రపంచంలో విశృంఖలమైన, బాధ్యతారహిత ఇచ్ఛను భావించాడు. అదేసమయంలో ఆర్థిక సమానత్వమనేది సమాన ఆదరణ, ప్రతిఫలంగా భావించరాదు. వ్యక్తులు తగిన పనిని పొందే అవకాశం ద్వారా జీవనభృతిని సంపాదించుకొని, తమ ఆర్థిక హోదాను పెంపొందించుకొనేందుకు అది సంకేతంగా ఉంటుంది. అనేక సామ్యవాద దేశాలు ఆర్థిక సమానత్వ సాధనకు ప్రయత్నించి పాక్షికంగా విజయవంతమైనాయి.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
స్వేచ్ఛకు చెందిన ఏవైనా రెండు నిర్వచనాలను పేర్కొనండి.
జవాబు:
- హెచ్.జె.లాస్కీ: “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
- మాంటెస్క్యూ: “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ.”
ప్రశ్న 2.
స్వేచ్ఛ యొక్క సకారాత్మక ధృక్పథాన్ని తెలపండి.
జవాబు:
సకారాత్మక ధృక్కోణం (Positive Aspect): సకారాత్మక ధృక్కోణంలో స్వేచ్ఛ అనేది వ్యక్తి తన అభీష్టం మేరకు నడుచుకొంటూ ఇతరులు కూడా తనవలె నడుచుకోవాలనే పరిస్థితిని సూచిస్తుంది. వేరొక మాటలో చెప్పాలంటే, ఇతరులకు హాని కలిగించని అధికారమే స్వేచ్ఛ అనే ధృక్కోణాన్ని సూచిస్తుంది. టి.హెచ్. గ్రీన్ అనే ఆదర్శ తత్త్వవేత్త ఈ రకమైన స్వేచ్ఛా ధృక్కోణాన్ని ప్రతిపాదించాడు. “ఇతరులతో సమానంగా ఆనందంతో ఏదైనా చేసి అనుభవించేందుకు గల అధికారమే స్వేచ్ఛ” గా అతడు భావించాడు.
ప్రశ్న 3.
స్వేచ్ఛకు చెందిన ఏవైనా నాలుగు లక్షణాలను పేర్కొనండి.
జవాబు:
- మానవీయ వ్యక్తిత్వాల సాధనకు అత్యంత ఆవశ్యకమైంది.
- స్వేచ్ఛ ఒక శక్తిమంతమైన భావన. దాని వ్యాఖ్యానమనేది స్థలం, కాలం, ప్రాంతం, ప్రజల ఆకాంక్షలను బట్టి ఉంటుంది.
- వ్యక్తుల ఆకాంక్షలను సదా వాస్తవం చేయడమే స్వేచ్ఛలక్ష్యం అవుతుంది.
- నిర్హేతుకమైన ఆంక్షలకు బదులు నిరంతరం సానుకూల పరిస్థితులను కలిగి ఉండటమే స్వేచ్ఛ.
ప్రశ్న 4.
స్వేచ్ఛలోని నాలుగు రకాలను ఉదహరించండి.
జవాబు:
స్వేచ్ఛలోని నాలుగు రకాలు:
- సహజ స్వేచ్ఛ
- పౌర స్వేచ్ఛ
- రాజకీయ స్వేచ్ఛ
- ఆర్థిక స్వేచ్ఛ.
ప్రశ్న 5.
పౌర స్వేచ్ఛ అంటే ఏమిటి ? [Mar. 2017]
జవాబు:
పౌర స్వేచ్ఛ (Civil Liberty): పౌరస్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడ అంటారు. ఇది సామాజిక సంస్థలోని సభ్యుడైన వ్యక్తి జీవనంలోని స్వాతంత్య్రాన్ని తెలియజేస్తుంది. పౌరస్వేచ్ఛలో కింద పేర్కొన్న మూడు అంశాలు ఇమిడి ఉంటాయని బార్కర్ పేర్కొన్నాడు. 1) సంచార స్వేచ్ఛను సూచించే భౌతిక స్వాతంత్ర్యం ii) ఆలోచన, అభివ్యక్తి, విశ్వాసాన్ని కలిగి ఉండే భౌద్ధిక స్వాతంత్ర్యం, iii) నిజజీవితంలోని ఆచరణాత్మక ఐచ్ఛిక స్వాతంత్య్రం. పౌర స్వేచ్ఛ అనేది మిగతా స్వేచ్ఛలకు ప్రాతిపదికగా ఉంటుంది. సహజ స్వేచ్ఛకు ఇది విరుద్ధమైంది. సమాజంలోని పౌరులు దానిని అనుభవిస్తారు. ఒంటరిగా ఉంటున్న వ్యక్తులకిది ఆవశ్యకమైనది సమాజంలోని ప్రతిఒక్కరూ ప్రాపంచిక విషయాలను ఉమ్మడిగా అనుభవించ గలిగినప్పుడే పౌర స్వేచ్ఛ వాస్తవమవుతుంది.
“రాజ్యం చేత గుర్తించబడి అమలయ్యే హక్కుల సముదాయమే పౌర స్వేచ్ఛ” అని గెటిల్ పేర్కొన్నాడు.
పౌర స్వేచ్ఛ అనేది అనేక హక్కుల రూపంలో ఉంటుంది. అవి (i) జీవించే హక్కు (ii) పనిచేసే హక్కు (iii) ఆస్తి హక్కు (iv) వాక్ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ, సమావేశ, సంచార, స్థిర నివాసపు హక్కులు మొదలైనవి.
ప్రశ్న 6.
రాజకీయ స్వేచ్ఛ గురించి రాయండి.
జవాబు:
రాజకీయ స్వేచ్ఛ (Political Liberty): రాజకీయ స్వేచ్ఛ పౌరులు రాజకీయాంశాలలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఈ రకమైన స్వేచ్ఛ పౌరులకు రాజ్య కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనే శక్తినిస్తుందని లాస్కీ పరిగణించాడు. రాజకీయ స్వేచ్ఛను ప్రజాస్వామ్యానికి పర్యాయపదంగా గిల్ క్రిస్ట్ భావించాడు. రాజకీయ స్వేచ్ఛ అంటే ఎవరికి వారు
తమ ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకొనే రాజ్యాంగ స్వేచ్ఛగా లీకాక్ వర్ణించాడు. రాజకీయ స్వేచ్ఛ పౌరులకు మాత్రమే పరిమితమైంది. అది సంవర్ధక స్వభావాన్ని కలిగి ఉంటుంది. రాజకీయ స్వేచ్ఛ పౌరులకు రాజకీయాంశాలలో వివిధ హక్కులను కల్పిస్తుంది. అటువంటి వాటిలో 1) ఓటు వేసే హక్కు ii) ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీ చేసేహక్కు iii) ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు iv) విమర్శించే హక్కువంటివి ఉన్నాయి. విద్య, నిజాయితీ, నిష్పక్షపాతమైన పత్రికలు మొదలైనవి ఉన్నప్పుడే రాజకీయ స్వేచ్ఛ వాస్తవం అవుతుందని లాస్కీ నొక్కి చెప్పాడు.
ప్రశ్న 7.
సంపూర్ణ ఆర్థిక స్వేచ్చ సాధన సాధ్యమేనా అన్న విషయాన్ని తెలపండి.
జవాబు:
సంపూర్ణ ఆర్థిక స్వేచ్ఛసాధన ఈ క్రింది చర్యల ద్వారా సాధ్యమవుతుంది. అవి 1) కనీస వేతనాలను అందించటం 2) పనిహక్కుకు భరోసా కల్పించటం 3) నిరుద్యోగం, అనారోగ్యం వంటి అభద్రతల నుండి కార్మికులను రక్షించటం 4) తగినంత విశ్రాంతిని కల్పింటం 5) పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించటం.
ప్రశ్న 8.
ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏమిటి ? [Mar. 2016]
జవాబు:
ఆర్థిక స్వేచ్ఛ (Economic Liberty): ఆర్థిక స్వేచ్ఛ అంటే ప్రతిఒక్కరూ తమ జీవనోపాధిని తామే సంపాదించుకోగలగడం. ఒక వ్యక్తి తన రోజువారీ ఆహారాన్ని హేతుబద్ధంగా సంపాదించుకొనే భద్రమైన అవకాశమే ఆర్థికస్వేచ్ఛగా లాస్కీ అభివర్ణించాడు. కోరిక – భయము, ఆకలి – పస్తులు, నిరద్యోగం – అసంపూర్ణతల నుంచి విముక్తి కలిగించేదే ఆర్థిక స్వేచ్ఛ. ఇది ఆర్థిక సంబంధమైన లేమి లేదా అభద్రతల నుంచి స్వాతంత్ర్యాన్ని సూచిస్తుంది. ఆర్థిక స్వేచ్ఛలేని ప్రజాస్వామ్యం అర్థరహితమైంది.
ఈ దిగువ పేర్కొన్న చర్యల అమలు ద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు.
- కనీస వేతనాలను అందించడం.
- పనిహక్కుకు భరోసా కల్పించడం.
- నిరుద్యోగం, అనారోగ్యం వంటి వివిధ రకాల అభద్రతల నుంచి కార్మికులను రక్షించడం.
- తగినంత విశ్రాంతిని కల్పించడం.
- పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించడం.
ప్రశ్న 9.
జాతీయ స్వేచ్ఛ గురించి తెలపండి.
జవాబు:
జాతీయ స్వేచ్ఛ (National Liberty): జాతీయ స్వేచ్ఛ అంటే రాజ్యం – స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కలిగి ఉండడంగా పేర్కొనవచ్చు. రాజ్యపు సార్వభౌమత్వాన్ని అది సూచిస్తుంది. ప్రతి రాజ్యం ఈ స్వేచ్ఛను అనుభవిస్తూ ఇతర రాజ్యాల ఆధిపత్యానికి లోనుగాకుండా ఉంటుంది. అన్ని రంగాలలో జాతి అభివృద్ధికి ఈ స్వేచ్ఛ ఆవశ్యకమైంది. ప్రాచీనకాలం నుంచి అనేక దేశాల్లో ఇది విశదమైంది. ఈ రకమైన స్వేచ్ఛను పొందడం కోసం అనేకదేశాలు ఎంతగానో ప్రయత్నించాయి. గతంలో టర్కీ ప్రజలకు వ్యతిరేకంగా గ్రీకులు స్వాతంత్య్ర సమరం సాగించారు. అట్లాగే మహాత్మాగాంధీ నాయకత్వంలో భారత ప్రజలు బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం కోసం అహింసాయుత పోరాటం చేశారు. జాతీయ స్వేచ్ఛ ఎంతో విలువైంది.
ప్రశ్న 10.
స్వేచ్ఛకు గల ఏవైనా నాలుగు పరిరక్షణలను పేర్కొనండి.
జవాబు:
స్వేచ్ఛకు గల నాలుగు పరిరక్షణలు
- ప్రజాస్వామ్య పాలన
- లిఖిత మరియు దృఢ రాజ్యాంగం
- స్వతంత్ర న్యాయవ్యవస్థ
- సమన్యాయపాలన.
ప్రశ్న 11.
స్వేచ్ఛా పరిరక్షణగా స్వతంత్ర న్యాయశాఖను గురించి వ్రాయండి.
జవాబు:
వ్యక్తి స్వేచ్ఛకు పరిరక్షణయే స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయవ్యవస్థ. న్యాయవ్యవస్థ రాజ్యాంగాన్ని సమర్థించి, ప్రభుత్వం ప్రజలకు బాధ్యత వహించేటట్లు చూస్తుంది. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు వివిధ రక్షణలను సూచిస్తుంది. కావున స్వేచ్ఛ పరిరక్షించబడటానికి స్వతంత్ర న్యాయశాఖ అత్యంత అవసరం అని రాజనీతిజ్ఞులు భావిస్తారు.
ప్రశ్న 12.
సమానత్వం అంటే ఏమిటి ?
జవాబు:
సమానత్వం ఆధునిక కాలంలో ఒక ప్రథాన ఆశయం. అది ప్రజాస్వామ్య ఆదర్శం. మానవులంతా పుట్టుకతో సమానులని కొందరు నమ్మారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవహారాలలో ప్రజలందరికి జాతి, మత, కుల, లింగ, భాష, ప్రాంతీయ, వర్ణ, వర్గ భేదాలు లేకుండా సమానావకాశాలు ఉండటమే సమానత్వము. సమానత్వం అంటే (i) ఏ అడ్డంకులు లేకుండా ప్రతి వ్యక్తి వికాసం పొందడం (ii) శాసనాలు పాలనలలో వ్యక్తుల మధ్య భేదం లేకుండా చేయడం (iii) చట్ట ప్రకారం లభించే హక్కులు సమానంగా లభించడం.
ప్రశ్న 13.
సమానత్వంలోని వివిధ సూచితార్థాలను పేర్కొనండి.
జవాబు:
- ఏ వ్యక్తికి లేదా వ్యక్తుల సమూహానికి ఎటువంటి అదనపు సౌకర్యాలు ఉండరాదు.
- తమ వ్యక్తిత్వాలను అభివృద్ధి చేసుకొనుటకు సరిపడినన్ని అవకాశాలు వ్యక్తులకు ఉండాలి.
- వ్యక్తుల మధ్య కులం, మతం, రంగు, జన్మస్థలం వంటి వివక్షలు ఉండరాదు. అయితే కొన్ని న్యాయ సమ్మతమైన కారణాల వల్ల రక్షిత వివక్షను పాటించవచ్చు.
ప్రశ్న 14.
సంపూర్ణ సమానత్వపు దృక్పథాలేవి ?
జవాబు:
సంపూర్ణ సమానత్వానికి రెండు దృక్పథాలున్నాయి. అవి 1) సకారాత్మక దృక్పథం 2) నకారాత్మక దృక్పథం. సమానత్వం అంటే అందరికి తగినన్ని అవకాశాలను కల్పించాలి అని సకారాత్మక దృక్పథం సూచిస్తుంది. కులం, మతం, రంగు, పుట్టుక, ప్రాంతం వంటి కృత్రిమ కారణాలతో ఎటువంటి వివక్షతను పాటించరాదని నకారాత్మక దృక్పథం సూచిస్తుంది.
ప్రశ్న 15.
సమానత్వం లక్షణాలలో రెండింటిని గురించి రాయండి.
జవాబు:
- సమానత్వం ప్రకృతి ప్రసాదించింది కాదు. తిరుగులేని సమాతన్వం ఎక్కడా కనిపించదు.
- సమానత్వం నిరపేక్షమైనదికాదు. నిరపేక్ష సమానత్వం సాకారమయ్యేదికాదు. అభిలాషించేదికాదు. చరిత్రలో ఏ కాలంలోనూ వ్యక్తులు తిరుగులేని సమానత్వాన్ని కోరలేదు. కాబట్టి సమానత్వానికి అర్థం ఏకరూపత కాదు.
ప్రశ్న 16.
సమానత్వపు వివిధ రకాలను తెలపండి.
జవాబు:
సమానత్వపు వివిధ రకాలు
- సహజ సమానత్వం
- సాంఘిక సమానత్వం
- ఆర్థిక సమానత్వం
- రాజకీయ సమానత్వం
- అంతర్జాతీయ సమానత్వం.
ప్రశ్న 17.
సహజ సమానత్వాన్ని వివరించండి. [Mar. 2016]
జవాబు:
సహజ సమానత్వం (Natural Equality): సహజ సమానత్వం అంటే అన్ని రకాల అవరోధాలు, సాంఘిక కట్టుబాట్ల నుంచి స్వాతంత్ర్యాన్ని పొందడం. దీని అర్థం వ్యక్తి పరిధిలో ఎటువంటి ఆంక్షలు ఉండకపోవడం. సహజ సమానత్వం గురించి థామస్ హాబ్స్ ప్రతిపాదించిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో పేర్కొనడమైంది. పౌర సమాజం ఆవిర్భవించక ముందే ప్రజలు ప్రాకృతిక వ్యవస్థలో జీవించారని ఈ సిద్ధాంతం పేర్కొన్నది. అసమానతలు, బంధనాలకు నాగరికత దారితీసిందని హాబ్స్ ఉద్ఘాటించాడు. గ్రీకు రోమన్ రాజకీయ తత్త్వవేత్తల రచనలలో ఈ భావం కనపడుతుంది.
ప్రశ్న 18.
సాంఘిక సమానత్వం అంటే ఏమిటి ? [Mar. 2017]
జవాబు:
వర్గ వ్యత్యాసాలు లేకపోవడం, సమానమైన హోదాను కలిగి ఉండటాన్ని సాంఘిక సమానత్వం సూచిస్తుంది. ఏ వ్యక్తి మతం, వర్గం, వర్ణం, లింగం, పుట్టుక మొదలగు అంశాల ఆధారంగా వివక్షతకు గురికాకుండా ఉంటే సాంఘిక సామానత్వం నెలకొంటుంది. సమాజంలో పౌరులందరినీ సమానమైనవారుగా సాంఘిక సమానత్వం భావిస్తుంది. పౌరులందరూ సమానమైన సాంఘిక, రాజకీయ, ఆర్థిక, చట్టపరమైన హక్కులను అనుభవించేందుకు వీలు కల్పించే సమానత్వాన్నే సాంఘిక సమానత్వం అని అంటారు.
ప్రశ్న 19.
రాజకీయ సమానత్వం అంటే ఏమిటి ? [Mar. 2018]
జవాబు:
రాజకీయ సమానత్వం (Political Equality): రాజకీయ సమానత్వం రాజకీయ కార్యకలాపాలలో ప్రజలకు చాలినన్ని అవకాశాలను కల్పించేందుకు అనుకూల పరిస్థితులను సూచిస్తుంది. రాజ్యంలోని పౌరులకు వివిధ రకాల రాజకీయ హక్కులను ప్రసాదించడం ద్వారా ఆ రకమైన సమానత్వాన్ని సాధించవచ్చు. ఈ సందర్భంలో రాజకీయ సమానత్వాన్ని పౌరులు మాత్రమే అనుభవిస్తారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రాజ్యంలో నివసించే అన్యులు, విదేశీయులకు ఇది వర్తించదు. ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయ సమానత్వమన్నది అత్యంత ఆవశ్యకమైంది. వివిధ రాజకీయ హక్కులను ప్రసాదించినప్పుడే పౌరులు రాజకీయ స్వేచ్ఛను అనుభవిస్తారు. అంటే, రాజకీయ సమానత్వమనేది రాజకీయ స్వేచ్ఛకు పర్యాయపదంగా భావించవచ్చు.
ప్రశ్న 20.
ఆర్థిక సమానత్వ సాధనకై చేపట్టే చర్యలను పేర్కొనండి.
జవాబు:
ఈ దిగువ పేర్కొన్న చర్యలను చేపట్టడం ద్వారా ఆర్థిక సమానత్వాన్ని సాధించవచ్చు.
- ఆస్తి, సంపద మరియు ఆదాయాలలో ఉన్న విపరీతమైన వ్యత్యాసాలను తొలగించాలి.
- ప్రాపంచిక వస్తువులను స్త్రీ, పురుషుల మధ్య సమానంగా పంపిణీ చేయాలి.
- వ్యక్తులకు వారికి తగిన పనిని పొంది, జీవనభృతిని సంపాదించుకొని, తమ ఆర్థిక హోదాను పెంపొందించుకొనేలా అవకాశాలను కల్పించాలి.