Andhra Pradesh BIEAP AP Inter 1st Year Civics Study Material 7th Lesson న్యాయం Textbook Questions and Answers.
AP Inter 1st Year Civics Study Material 7th Lesson న్యాయం
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
న్యాయం అంటే ఏమిటో నిర్వచించి, న్యాయం రకాలను వర్ణించండి.
జవాబు:
పరిచయం: రాజనీతిశాస్త్ర అధ్యయనంలో న్యాయం ఒక ముఖ్యమైన భావన. సమకాలీన సమాజంలో దాదాపు ప్రపంచ రాజ్యాలన్నీ తమ రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాల వైరుధ్యాలతో సంబంధం లేకుండా మానవ సమాజంలో న్యాయం చేకూర్చి కొనసాగేందుకు కృషి చేస్తున్నాయి.
అర్థం: న్యాయం (Justice) అనే ఇంగ్లీష్ పదం “జస్” (Jus) అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలో “జస్” అంటే “బంధించి ఉండటం” లేదా “కలిపి ఉంచడం” అని అర్థం.
- నిర్వచనాలు:
ప్లేటో: “వ్యక్తి తన పని తాను చేసుకుంటూ, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే న్యాయం”; - అరిస్టాటిల్: “న్యాయం అంటే సమాజంలో ప్రతి వ్యక్తీ తన నైతిక బాధ్యతలను నిర్వర్తించడం తప్ప మరేదీకాదు”.
- కెఫాలస్: “న్యాయం అంటే ప్రతి ఒక్కరూ సత్యాన్ని పలకడం, ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడం”.
న్యాయం రకాలు (Types of Justice): న్యాయం అనేక రకాలుగా ఉంటుంది. ఇది సహజ, ఆర్థిక, సామాజిక, రాజకీయ, చట్టబద్ధమైన పార్శాలకు సంబంధించినది. న్యాయభావనలోని వివిధ రకాలను కింది పట్టిక ద్వారా తెలుసు కోవచ్చు.
1) సహజ న్యాయం (Natural Justice): ప్రపంచంలో లభించే సహజ వనరులను ప్రతి ఒక్కరూ వినియోగించు కోవచ్చుననే సూత్రం ఆధారంగా ప్రతిపాదించబడినదే సహజ న్యాయం. భూమిపై నివసించే ప్రతి ఒక్కరికీ సహజ వనరులు జీవన ఆధారంగా ఉంటాయి. మానవులు ఒక్కరే హేతుబద్ధమైన జీవనం గడపటం వల్ల, సహజ వనరులను న్యాయబద్ధంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఈ సందర్భంలో మానవులు భవిష్యతరాల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి.
2) సామాజిక న్యాయం (Social Justice): సామాజిక న్యాయం అనేది వ్యక్తుల హక్కులు, సమాజం నియంత్రణల మధ్య చక్కని సమతౌల్యాన్ని నెలకొల్పేందుకు ఉద్దేశించింది. వర్తమాన చట్టాలకు లోబడి వ్యక్తుల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చుకొనేందుకు ఈ రకమైన న్యాయం వీలు కల్పిస్తుంది. చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే సూత్రాన్ని సామాజిక న్యాయం నమ్ముతుంది, సామాజిక అనర్థాలైన పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, ఆకలి వంటి వాటిని అధిగమించేందుకు సామాజిక న్యాయం హామీ ఇస్తుంది. సమాజంలోని నిమ్నవర్గాలు, బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తుంది. అంతిమంగా వ్యక్తుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది.
3) రాజకీయ న్యాయం (Political Justice): రాజకీయ న్యాయం అనేది రాజకీయ సమానత్వాన్ని సూచిస్తుంది. రాజ్యంలోని వయోజనులైన పౌరులకు రాజకీయ హక్కులను ఈ రకమైన న్యాయం ప్రతిపాదిస్తుంది. దేశ పాలనలో పౌరులు స్వేచ్ఛగానూ, నిర్భయంగానూ పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఎన్నికల సమయంలో రాజకీయ న్యాయ భావన విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకొంటుంది. రోజువారి పాలనలో పౌరులు చురుకుగా పాల్గొనేందుకు రాజకీయ న్యాయం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రతి ఒక్కరూ ఇతరులతో పాటుగా సమానులేనని, ఏ ఒక్కరూ ఇతరుల కంటే ఏ విషయంలోనూ అధికులు కారనీ, ఎటువంటి ప్రత్యేకతలు కలిగి ఉండరనే సూత్రంపై ఈ భావన రూపొందింది. రాజ్యంలో రాజకీయ న్యాయం ఉండాలంటే కింద పేర్కొన్న పరిస్థితులు నెలకొనాలి.
- సమన్యాయ పాలన
- స్వతంత్ర న్యాయశాఖ
- ప్రాతినిధ్య సంస్థలకు ఎన్నికలు
- రాజకీయ పార్టీలు
- పత్రికా స్వాతంత్ర్యం
- ప్రజాస్వామ్య పాలన మొదలైనవి.
4) ఆర్థిక న్యాయం (Economic Justice): వ్యక్తుల మధ్య నిర్హేతుకమైన, ప్రకృతి విరుద్ధమైన వ్యత్యాసాలు లేని పరిస్థితినే ఆర్థికన్యాయంగా పేర్కొనవచ్చు. ఆదాయం, ద్రవ్యం, సంపద, ఆస్తివంటి వ్యత్యాసాలు లేకుండా వ్యక్తులందరికీ సమానమైన ఆదరణ కల్పించేందుకు ఆర్థికన్యాయం ఉద్దేశించింది. సానుకూల దృష్టిలో ఆర్థిక న్యాయం అనేది శ్రామికులకు చాలినంత వేతనాలను చెల్లించేందుకు దోహదపడుతుంది. సంపద, ఆదాయంలో విపరీతమైన అంతరాలను తొలగించేందుకు కృషి చేస్తుంది. బడుగు బలహీనవర్గాలు దోపిడీకి గురికావడాన్ని ఎట్టి పరిస్థితులలో ఈ న్యాయం అనుమతించదు. ప్రతి ఒక్కరూ కనీస ప్రాథమికావసరాలను పొందేందుకు ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడు, గుడ్డ, వసతి వంటి ప్రాథమిక అవసరాలు కలిగి ఉండేందుకు చర్యలు తీసుకొంటుంది. సమాజంలో న్యాయబద్ధమైన ఆర్థిక వ్యవస్థాపనకు తోడ్పడుతుంది. “ప్రతి ఒక్కరూ వారి సామర్ధ్యాన్ని బట్టి ఉపాధి పొందడం, అవసరాన్ని బట్టి ఆర్థిక వనరులను వినియోగించుకోవడం” అనే భావనను ఆర్థికన్యాయం బలపరుస్తుంది.
5) చట్టబద్ధమైన న్యాయం (Legal Justice): చట్టబద్ధమైన న్యాయం అనేది రాజ్యాంగ శాసనాల ద్వారా వెల్లడి అవుతుంది. సమాజంలో ఎంతోకాలంగా ప్రాచుర్యంలో ఉన్న ఆచార సంప్రదాయాలతో ఈ రకమైన న్యాయం సంబంధాన్ని కలిగి ఉంటుంది. రాజ్యంలోని రాజ్యాంగం, ఇతర శాసనచట్టాల రూపంలో అది వ్యక్తమవుతుంది. న్యాయం చట్టబద్ధమైన పరిమితులను నిర్ణయిస్తుంది. చట్టబద్ధమైన న్యాయంలో రెండు అంశాలు ఇమిడి ఉంటాయి. అవి:
1. సమాజంలో చట్టాలన్నీ సమన్యాయ పాలన సూత్రంపై ఆధారపడి రూపొందితమై, అమలులో ఉంటాయి.
2. చట్టాలన్నీ సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా రూపొందుతాయి. మొత్తం సమాజ సంక్షేమాన్ని చట్టాలు ఆకాంక్షిస్తాయి. అయితే చట్టబద్ధమైన న్యాయం అనేది పూర్తిగా న్యాయంగా పరిగణితం కాదు. ఈ సందర్భంలో న్యాయం అంటే న్యాయం ప్రకారం చట్టం అని ఎర్నస్ట్ బార్కర్ పేర్కొన్నాడు. చట్టబద్ధమైన న్యాయం అనేది న్యాయాన్ని ప్రసాదించేందుకు ఉద్దేశించిందని కొందరు పేర్కొన్నారు. మొత్తం మీద చట్టం అనేది న్యాయానికి కొంతమేరకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని మరికొందరు భావించారు.
ప్రశ్న 2.
న్యాయం అంటే ఏమిటి ? న్యాయం ఏ విధంగా పరిణామం చెందింది ?
జవాబు:
పరిచయం: రాజనీతి శాస్త్ర అధ్యయనంలో న్యాయం ఒక ముఖ్యమైన భావన. సమకాలీన సమాజంలో దాదాపు ప్రపంచ రాజ్యాలన్నీ తమ రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాల వైరుధ్యాలతో సంబంధం లేకుండా మానవ సమాజంలో న్యాయం చేకూర్చి కొనసాగేందుకు కృషి చేస్తున్నాయి.
అర్థం: న్యాయం (Justice) అనే ఇంగ్లీష్ పదం “జస్” (Jus) అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలో “జస్” అంటే “బంధించి ఉండటం” లేదా “కలిపి ఉంచడం” అని అర్థం.
న్యాయం – పరిణామం: ప్రాచీన భారతదేశంలో న్యాయం అనేది ధర్మంతో ముడిపడి ఉంది. అటువంటి ధర్మం గురించి ప్రాచీన హిందూ స్మృతులలో ప్రస్తావించడమైంది. వాటి ప్రకారం రాజు కర్తవ్యాలలో న్యాయం ఒకటి. ధర్మం ప్రాతిపదికపై న్యాయబద్ధమైన సామాజిక వ్యవస్థను ఏర్పరచి, నిర్వహించేందుకు రాజు కృషి చేసేవాడు. ప్రఖ్యాత చైనా తత్త్వవేత్త అయిన కన్ఫ్యూసియస్ రాజు, ప్రధాన కర్తవ్యం చెడు పనులకు పాల్పడే వారిని శిక్షించడం మంచి వ్యక్తులకు బహుమానాలిచ్చి ప్రోత్సహించడంగా పేర్కొన్నాడు.
సాధారణంగా న్యాయమంటే ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడమే. అయితే న్యాయభావన అర్థం వ్యక్తులను బట్టి మారుతుంది. ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన మానవీయ దృక్కోణంలో న్యాయాన్ని అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. జర్మనీ తత్త్వవేత్త ఇమ్మాన్యుయల్ కాంట్ ప్రకారం మానవులందరూ గౌరవాన్ని కలిగి ఉంటారు. వ్యక్తులందరికీ గౌరవం లభించినట్లయితే వారంతా శక్తి సామర్థ్యాలను వినియోగించుకొని తమ లక్ష్యాల సాధనకై చాలినన్ని అవకాశాలను పొందగలుగుతారు. అందువల్ల న్యాయభావన ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తికీ సమానమైన గుర్తింపు, గౌరవం ఇవ్వడమైంది.
ప్లేటో వల్ల ప్రభావితుడైన సెయింట్ ఆగస్టీన్ అనే మధ్యయుగ రాజనీతి తత్త్వవేత్త న్యాయభావనను వివరించాడు. సమాజం సరైన రీతిలో కొనసాగేందుకు వ్యక్తుల మధ్య సౌహార్ధ సంబంధాల గురించి అతడు ప్రముఖంగా ప్రస్తావించాడు. ఆ తరువాత న్యాయాన్ని మతం నుంచి వేరుచేసిన వారిలో ప్రథముడిగా మరొక మధ్యయుగ రాజనీతి తత్త్వవేత్త థామస్ ఆక్వినాసన్ను పరిగణించవచ్చు.
పదహారవ శతాబ్దంనాటికి న్యాయభావన పూర్తిగా లౌకిక భావాల చేత మార్పులకు గురయ్యింది. థామస్ హాబ్స్ వంటి సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలు న్యాయభావనను సార్వభౌమాధికారి ఆజ్ఞగా పరిగణించారు. ఆ తరువాత జాన్లాక్, రూసో, ఇమ్మాన్యుయల్ కాంట్ వంటివారు న్యాయమంటే స్వేచ్ఛ, సమానత్వ భావనల సమ్మేళనంగా పరిగణించారు. సహజ న్యాయ సిద్ధాంత ప్రతిపాదకులు వైయక్తిక న్యాయభావనను అభివృద్ధి చేశారు. సామ్యవాదులు న్యాయభావనను ఆర్థిక దృక్కోణం నుంచి అవలోకించారు. వేరొకవైపు సాంప్రదాయక రాజనీతి తత్వవేత్తలు న్యాయ భావనను వ్యక్తిపరంగా వివరించారు. ఆధునిక రాజనీతి శాస్త్రవేత్తలు ఆ భావనను సామాజిక దృక్కోణంలో పరిశీలించారు.
ప్రశ్న 3.
సామాజిక న్యాయం గురించి వ్యాసాన్ని వ్రాయండి.
జవాబు:
సామాజిక న్యాయం అనేది సాధారణంగా సమానత్వ భావనగా పరిగణించడమైంది. అలాగే సామాజిక న్యాయంలో సమానత్వం అనేది అంతర్లీనమైన, వివాదరహితమైన అంశం. సామాజిక న్యాయం (Social Justice) అనే పదానికి విస్తృతమైన అర్థం ఉంది. సమాజంలో నిష్పాక్షికత, పరస్పర కర్తవ్యం వంటి బాధ్యతలను ఇది సూచిస్తుంది. ప్రతి ఒక్కరూ ఇతరులకు బాధ్యత వహించాలని అది విశ్వసిస్తుంది. ప్రతి ఒక్కరికీ చాలినంత అవకాశాలు కల్పించాలని కోరుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే అన్యాయాన్ని పారద్రోలి న్యాయబద్ధమైన సమాజ సాధనకు సామాజిక న్యాయం సంకల్పిస్తుంది. సమాజంలో లభించే వస్తుసేవలను పంచుకోవాలనే నమ్మకం ప్రజలలో ఉన్నప్పుడు సామాజిక న్యాయం నెలకొంటుంది. ప్రజలందరికీ సమానమైన ఆదరణ, మానవ హక్కులను కల్పించి ఉమ్మడి వనరులను నిష్పక్షపాతమైన రీతిలో ప్రతి ఒక్కరూ వ్యవహరించినప్పుడే సామాజిక న్యాయాన్ని సాధించడం సులభమవుతుంది.
ఈ సందర్భంలో జాన్రాల్స్, డేవిడ్ మిల్లర్ వంటి ఆధునిక రాజనీతి శాస్త్రవేత్తలు రెండు ముఖ్యమైన ప్రకటనలు చేశారు. జాన్ రాల్స్ సామాజిక న్యాయం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అతడు ఈ సిద్ధాంతాన్ని న్యాయం లేదా ‘నిష్పాక్షికత’ అని సాధారణంగా వ్యవహరించడమైంది. అతడి ప్రకారం ‘సామాజిక న్యాయం’ అనేది ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ హక్కులు, ఇతర అవకాశాలు కల్పించడానికి సంబంధించినది. అలాగే సమాజంలో నిరాదరణకు గురైన వర్గాల ప్రయోజనాల గురించి శ్రద్ధ వహించడానికి ఉద్దేశించింది. వ్యక్తుల కార్యకలాపాల ప్రయోజనాన్ని బట్టి వ్యక్తుల మంచి చెడులను నిర్ణయించవచ్చనీ అతడు పేర్కొన్నాడు. సామాజిక న్యాయం ద్వారా వ్యక్తులు సుఖ సంతోషాలతో కూడిన జీవనాన్ని గడిపేందుకు అవకాశం ఉంటుందన్నాడు. సామాజిక న్యాయం భావన వ్యాప్తి ద్వారా నిరాదరణకు గురైన వ్యక్తుల గురించి పట్టించుకోవడం సాధ్యం అవుతుందని ఉద్ఘాటించాడు.
పైన పేర్కొన్న జాన్రాల్స్ సిద్ధాంతం సామాజిక ఒడంబడిక భావన ఆధారంగా రూపొందింది. ఆ భావన ప్రకారం ప్రజలందరూ ఒకానొక ఒప్పందంపై సంతకం చేస్తారు. తద్వారా మెరుగైన సమాజ స్థాపనకై వారంతా కొన్ని నియమ నిబంధనలను అనుసరించి వాటికి విధేయత చూపించేందుకు సంసిద్ధంగా ఉంటారు. అటువంటి నియమ నిబంధనలు కొన్ని మౌలిక హక్కులు, కర్తవ్యాలను నిర్దేశిస్తాయి. సామాజిక, రాజకీయ సంస్థలలో ప్రజలే సభ్యులుగా అంతిమంగా కొనసాగుతారు. సామాజిక సహకారం ద్వారా ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి.
డేవిడ్ మిల్లర్ సామాజిక న్యాయం అనేది సమాజంలో మంచి చెడుల పంపిణీకి సంబంధించినది. మంచి ఎన్నో ప్రయోజనాలు, చెడు ద్వారా ఎన్నో నష్టాలు ప్రజలకు ఒనగూరుతాయి. సామాజిక రాజకీయ సంస్థలు ఏ విధంగా ప్రజల మధ్య వనరుల పంపిణీకి చర్యలు తీసుకొంటాయనే విషయాన్ని సామాజిక న్యాయం సూచిస్తుందని మిల్లర్ పేర్కొన్నాడు. సామాజిక న్యాయం ద్వారా ప్రజలు విద్య, ఉపాధి, ఆరోగ్యం, సంపద, సంక్షేమం, రవాణా వంటి రంగాలలో అనేక ప్రయోజనాలను పొందుతారని ఉద్ఘాటించాడు. అయితే సామాజిక న్యాయం వల్ల కొన్ని దుష్ఫరిణామాలు ఎదురవుతాయని అతడు హెచ్చరించాడు. వ్యక్తుల స్వీయ వ్యవహారాలలో రాజ్యం జోక్యం, వ్యక్తులు నిర్బంధంగా సైనిక పరమైన సేవలను అందించడం వంటి దుష్ఫరిణామాలు ఉంటాయని పేర్కొన్నాడు.
మిల్లర్ సిద్ధాంతం ప్రభుత్వ, ప్రైవేటురంగాలు రెండింటికీ వర్తిస్తుంది. అతడి సిద్ధాంతం ప్రకారం సామాజిక న్యాయం అనేది సామాజిక సుగుణంగా భావిస్తుంది. వ్యక్తులు సమాజంలో వేటిని కలిగిఉంటారో, సమాజానికి వారు అందించాల్సినవి ఏమిటో అనే విషయాన్ని ఇతడి సిద్ధాంతం ప్రస్తావించింది.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
న్యాయం యొక్క ముఖ్య భావనలను వివరించండి.
జవాబు:
అర్థం: న్యాయం (Justice) అనే ఇంగ్లీష్ పదం “జస్” (Jus) అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలో “జస్” అంటే “బంధించి ఉండటం” లేదా “కలిపి ఉంచడం” అని అర్థం.
నిర్వచనాలు:
1. ప్లేటో: “వ్యక్తి తన పని తాను చేసుకుంటూ, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే న్యాయం”. 2. అరిస్టాటిల్: “న్యాయం అంటే సమాజంలో ప్రతి వ్యక్తీ తన నైతిక బాధ్యతలను నిర్వర్తించడం తప్ప మరేదీకాదు”. 3. కెఫాలస్: “న్యాయం అంటే ప్రతి ఒక్కరూ సత్యాన్ని పలకడం, ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడం”. న్యాయం ముఖ్య భావనలు: న్యాయం ప్రధానంగా రెండు ముఖ్య భావనలను కలిగివుంది. అవి: 1) సంఖ్యాత్మక భావన (Numerical concept) 2) క్షేత్రగణిత భావన (Geometrical concept). వీటిని ఈ క్రింది విధంగా వివరించవచ్చు.
1) సంఖ్యాత్మక భావన (Numerical concept): సంఖ్యాత్మక భావన ప్రకారం సామాజిక వ్యవహారాలలో ప్రతి ఒక్కరికీ సమానమైన వాటా, భాగస్వామ్యం, ప్రమేయం ఉంటాయి. ప్రాచీన గ్రీకునగర రాజ్యాలు ప్రజలకు సంబంధించిన వ్యవహారాల నిర్వహణలో ఈ రకమైన భావనను అనుసరించాయి. ఆనాటి పాలకులు ప్రభుత్వంలోని వివిధ పదవుల భర్తీ విషయంలో సమానత్వ భావనను అమలులో ఉంచేందుకు శాయశక్తులా కృషి చేశారు. ప్రభుత్వ పదవులను చేపట్టి, వాటిని నిర్వహించే విషయంలో ప్రత్యేక పరిజ్ఞానం, అర్హతలను పరిగణనలోకి నగర రాజ్యాలు తీసుకోలేదు. ఆధునిక కాలంలో ప్రముఖ బ్రిటిష్ రాజనీతి తత్త్వవేత్త జెరిమీ బెంథామ్ ఈ రకమైన భావనను ప్రతిపాదించాడు. ప్రతి ఒక్కరూ ఒకరుగానే పరిగణించబడతారనీ, ఏ ఒక్కరూ ఒకరి కంటే అధికంగా పరిగణించబడరనీ అతడు ఈ సందర్భంలో ప్రకటించాడు. ఆధునిక కాలంలో అనేక ఉదారవాద రాజ్యాలు ఈ భావన ప్రాతిపదికపై పనిచేయటం ప్రారంభించాయి.
2) క్షేత్రగణిత భావన (Geometrical concept): క్షేత్రగణిత (Geometrical) భావన నైష్పత్తిక సమానత్వ సూత్రంపై ఆధారపడి రూపొందింది. సమానులకు సమానమైన భాగస్వామ్యం, అసమానులకు అసమానమైన భాగస్వామ్యం కల్పించాలనే సూత్రాన్ని ఈ భావన ప్రతిపాదిస్తుంది. వ్యక్తుల అర్హత, యోగ్యత లేదా వారు అందించే సేవల ప్రాతిపదికపై ప్రభుత్వ పదవులు, అధికారాన్ని పంపిణీ చేయాల్సి ఉంటుందని ఈ భావన పేర్కొంటుంది. ప్లేటో, అరిస్టాటిల్ వంటి ప్రముఖ ప్రాచీన రాజనీతి తత్త్వవేత్తలు ఈ భావన పట్ల సుముఖత వ్యక్తం చేశారు. అరిస్టాటిల్ ఈ భావన గురించి వివరిస్తూ క్రింది విధంగా ప్రకటించాడు. “వేణువులను పంపిణీ చేయాలంటే, వాటిని వాయిద్యాలుగా ఉపయోగించే సామర్థ్యం గల వారికే అందించాల్సి ఉంటుందని” అతడు పేర్కొన్నాడు. ఈ భావన ప్రకారం గ్రహీతల యోగ్యతను బట్టి సౌకర్యాలు, ప్రయోజనాలను సమాన ప్రాతిపదికపై పంపకం చేసేందుకై ప్రత్యేక కృషి జరపాల్సి ఉంటుంది.
ప్రశ్న 2.
న్యాయం ఏ విధంగా పరిణామం చెందింది ?
జవాబు:
న్యాయం – పరిణామం: ప్రాచీన భారతదేశంలో న్యాయం అనేది ధర్మంతో ముడిపడి ఉంది. అటువంటి ధర్మం గురించి ప్రాచీన హిందూ స్మృతులలో ప్రస్తావించడమైంది. వాటి ప్రకారం రాజు కర్తవ్యాలలో న్యాయం ఒకటి. ధర్మం ప్రాతిపదికపై న్యాయబద్ధమైన సామాజిక వ్యవస్థను ఏర్పరచి, నిర్వహించేందుకు రాజు కృషి చేసేవాడు. ప్రఖ్యాత చైనా తత్త్వవేత్త అయిన కన్ఫ్యూసియస్ రాజు ప్రధాన కర్తవ్యం చెడు పనులకు పాల్పడే వారిని శిక్షించడం మంచి వ్యక్తులకు బహుమానాలిచ్చి ప్రోత్సహించడంగా పేర్కొన్నాడు.
సాధారణంగా న్యాయమంటే ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడమే. అయితే న్యాయభావన అర్థం వ్యక్తులను బట్టి మారుతుంది. ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన మానవీయ దృక్కోణంలో న్యాయాన్ని అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. జర్మనీ తత్త్వవేత్త ఇమ్మాన్యుయల్ కాంట్ ప్రకారం మానవులందరూ గౌరవాన్ని కలిగి ఉంటారు. వ్యక్తులందరికీ గౌరవం లభించినట్లయితే వారంతా శక్తి సామర్థ్యాలను వినియోగించుకొని తమ లక్ష్యాల సాధనకై చాలినన్ని అవకాశాలను పొందగలుగుతారు. అందువల్ల న్యాయభావన ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తికీ సమానమైన గుర్తింపు, గౌరవం ఇవ్వడమైంది.
ప్లేటో వల్ల ప్రభావితుడైన సెయింట్ ఆగస్టీన్ అనే మధ్యయుగ రాజనీతి తత్త్వవేత్త న్యాయభావనను వివరించాడు. సమాజం సరైన రీతిలో కొనసాగేందుకు వ్యక్తుల మధ్య సౌహార్ద్ర సంబంధాల గురించి అతడు ప్రముఖంగా ప్రస్తావించాడు. ఆ తరువాత న్యాయాన్ని మతం నుంచి వేరుచేసిన వారిలో ప్రథముడిగా మరొక మధ్యయుగ రాజనీతి తత్త్వవేత్త థామస్ ఆక్వినాన్ను పరిగణించవచ్చు.
పదహారవ శతాబ్దంనాటికి న్యాయ భావన పూర్తిగా లౌకిక భావాల చేత మార్పులకు గురయ్యింది. థామస్ హాబ్స్ వంటి సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలు న్యాయభావనను సార్వభౌమాధికారి ఆజ్ఞగా పరిగణించారు. ఆ తరువాత జాన్లాక్, రూసో, ఇమ్మాన్యుయల్ కాంట్ వంటివారు న్యాయమంటే స్వేచ్ఛ, సమానత్వ భావనల సమ్మేళనంగా పరిగణించారు. సహజ న్యాయ సిద్ధాంత ప్రతిపాదకులు వైయక్తిక న్యాయ భావనను అభివృద్ధి చేశారు. సామ్యవాదులు న్యాయభావనను ఆర్థిక దృక్కోణం నుంచి అవలోకించారు. వేరొకవైపు సాంప్రదాయక రాజనీతి తత్వవేత్తలు న్యాయ భావనను వ్యక్తిపరంగా వివరించారు. ఆధునిక రాజనీతి శాస్త్రవేత్తలు ఆ భావనను సామాజిక దృక్కోణంలో పరిశీలించారు.
ప్రశ్న 3.
న్యాయంలోని మూడు రకాలను వర్ణించండి. [Mar. ’16]
జవాబు:
న్యాయం రకాలు (Types of Justice): న్యాయం అనేక రకాలుగా ఉంటుంది. ఇది సహజ, ఆర్థిక, సామాజిక, రాజకీయ, చట్టబద్ధమైన పార్శాలకు సంబంధించినది. న్యాయభావనలోని వివిధ రకాలను కింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.
1) సహజ న్యాయం (Natural Justice): ప్రపంచంలో లభించే సహజ వనరులను ప్రతి ఒక్కరూ వినియోగించకోవచ్చుననే సూత్రం ఆధారంగా ప్రతిపాదించబడినదే సహజ న్యాయం. భూమిపై నివసించే ప్రతి ఒక్కరికీ సహజ వనరులు జీవన ఆధారంగా ఉంటాయి. మానవులు ఒక్కరే హేతుబద్ధమైన జీవనం గడపటం వల్ల, సహజ వనరులను న్యాయబద్ధంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఈ సందర్భంలో మానవులు భవిష్యతరాల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి.
2) సామాజిక న్యాయం (Social Justice): సామాజిక న్యాయం అనేది వ్యక్తుల హక్కులు, సమాజం నియంత్రణల మధ్య చక్కని సమతౌల్యాన్ని నెలకొల్పేందుకు ఉద్దేశించింది. వర్తమాన చట్టాలకు లోబడి వ్యక్తుల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చుకొనేందుకు ఈ రకమైన న్యాయం వీలు కల్పిస్తుంది. చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే సూత్రాన్ని సామాజిక న్యాయం నమ్ముతుంది, సామాజిక అనర్థాలైన పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, ఆకలి వంటి వాటిని అధిగమించేందుకు సామాజిక న్యాయం హామీ ఇస్తుంది. సమాజంలోని నిమ్నవర్గాలు, బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తుంది. అంతిమంగా వ్యక్తుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది.
3) రాజకీయ న్యాయం (Political Justice): రాజకీయ న్యాయం అనేది రాజకీయ సమానత్వాన్ని సూచిస్తుంది. రాజ్యంలోని వయోజనులైన పౌరులకు రాజకీయ హక్కులను ఈ రకమైన న్యాయం ప్రతిపాదిస్తుంది. దేశ పాలనలో పౌరులు స్వేచ్ఛగానూ, నిర్భయంగానూ పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఎన్నికల సమయంలో రాజకీయ న్యాయ భావన విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకొంటుంది. రోజువారి పాలనలో పౌరులు చురుకుగా పాల్గొనేందుకు రాజకీయ న్యాయం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రతి ఒక్కరూ ఇతరులతో పాటుగా సమానులేనని, ఏ ఒక్కరూ ఇతరుల కంటే ఏ విషయంలోనూ అధికులు కారనీ, ఎటువంటి ప్రత్యేకతలు కలిగి ఉండరనే సూత్రంపై ఈ భావన రూపొందింది. రాజ్యంలో రాజకీయ న్యాయం ఉండాలంటే కింద పేర్కొన్న పరిస్థితులు నెలకొనాలి.
- సమన్యాయ పాలన
- స్వతంత్ర న్యాయశాఖ
- ప్రాతినిధ్య సంస్థలకు ఎన్నికలు
- రాజకీయ పార్టీలు
- పత్రికా స్వాతంత్య్రం
- ప్రజాస్వామ్య పాలన మొదలైనవి.
ప్రశ్న 4.
న్యాయానికి గల మూడు ఆధారాలను పేర్కొనండి. [Mar. ’18, ’17]
జవాబు:
న్యాయం – నిర్వచనాలు:
- ప్లేటో: “వ్యక్తి తన పని తాను చేసుకుంటూ, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే న్యాయం”.
- అరిస్టాటిల్: “న్యాయం అంటే సమాజంలో ప్రతి వ్యక్తీ తన నైతిక బాధ్యతలను నిర్వర్తించడం తప్ప మరేదీకాదు”.
- కెఫాలస్: “న్యాయం అంటే ప్రతి ఒక్కరూ సత్యాన్ని పలకడం, ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడం”. న్యాయం ఆధారాలు: ఎర్నస్ట్ బార్కర్ న్యాయానికి నాలుగు ఆధారాలున్నాయని పేర్కొన్నాడు. అవి: 1) ప్రకృతి 2) నైతికత 3) మతం 4) ఆర్థిక అంశాలు. వాటిని క్రింది విధంగా వివరించవచ్చు.
1) ప్రకృతి (Nature): గ్రీకు యధేచ్ఛావాదులు (Stoics) ప్రకృతిని న్యాయం ఆధారాలలో ఒకటిగా భావించారు. వారి దృష్టిలో ప్రకృతి అనేది నైతిక తాత్వికత, మత విశ్వాసాల సమ్మేళనం. ప్రకృతి, దైవం, హేతువులనేవి అవిభాజ్యాలు. ప్రకృతి నియమాల ప్రకారం జీవనం సాగించే వ్యక్తులు భగవంతుడు, హేతువులపట్ల ఒకే విధమైన భావాలను కలిగి ఉంటారని వారు ఉద్ఘాటించారు. ప్రకృతి మూడు ప్రధాన అంశాలను సూచిస్తుందని వారు పేర్కొన్నారు. అవి: 1) మానవుడికి స్వాతంత్ర్యం ఉండాలి. 2) మానవులందరూ సమానమైన గుర్తింపును కలిగి ఉండాలి. 3) మానవులందరూ తోటి మానవులతో హేతువు ఆధారంగా స్నేహ సంబంధాలను కలిగి ఉండాలి. పైన పేర్కొన్న మూడు అంశాలు కాలక్రమేణా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మూడు భావనలకు ఆధారాలయ్యాయి.
2) నైతికత (Ethics): ఆదర్శవాదులైన ప్లేటో, ఎమ్మాన్యుయెల్ కాంట్, థామస్ హిల్లీ గ్రీన్, ఎర్నెస్ట్ బార్కర్లు న్యాయం అనేది నైతిక సూత్రాల అవలంబన ద్వారా అవతరించిందని ఉద్ఘాటించారు. కాలానుగుణంగా సమాజం |ఆమోదం పొందిన విలువలే సంవర్ధక న్యాయభావన (Concept of Positive Justice) కు ఆధారమయ్యాయని వారు పేర్కొన్నారు. తరువాత కాలంలో రాజ్యం సంవర్ధక న్యాయాన్ని అమలులో ఉంచేందుకు చర్యలు తీసుకొన్నదన్నారు.
3) మతం (Religion): న్యాయానికి గల మరొక ఆధారమే మతం. మధ్యయుగం నుంచి మతం న్యాయానికి ఆధారంగా కొనసాగుతూ వచ్చింది. న్యాయం, మంచి, చెడులకు సంబంధించిన భావనలను భగవంతుడు ప్రవచించాడని క్రైస్తవమతాధిపతులు పేర్కొన్నారు. మతం ద్వారా న్యాయభావనలకు అంకురార్పణ చేసి, బలవంతుడే రాజ్య పాలకుడిగా ఉంటాడనీ వారు ఉద్ఘాటించారు. థామస్ అక్వినాస్ అనే మతాచార్యుడిగా మారిన తత్వవేత్త మతాన్ని క్రైస్తవచర్చికి ప్రతిరూపంగా విశ్వసించాడు. ఇతని ప్రకారం చట్టం ఆధారంగా కొనసాగే జీవనం ఉత్తమమైందిగా భావించాడు. రాజు ఎల్లప్పుడు ప్రజలను సన్మార్గంలో నడిపించాలన్నారు. రాజు తన అధికారాలను మతాధిపతి ఆధిపత్యానికి బద్ధుడై వినియోగించాలన్నాడు.
ప్రశ్న 5.
సామాజిక న్యాయాన్ని ఏ విధంగా పొందవచ్చు ?
జవాబు:
సామాజిక న్యాయం (Social Justice): సామాజిక న్యాయం అనేది వ్యక్తుల హక్కులు, సమాజం నియంత్రణల మధ్య చక్కని సమతౌల్యాన్ని నెలకొల్పేందుకు ఉద్దేశించింది. వర్తమాన చట్టాలకు లోబడి వ్యక్తుల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చుకొనేందుకు ఈ రకమైన న్యాయం వీలు కల్పిస్తుంది. చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే సూత్రాన్ని సామాజిక న్యాయం నమ్ముతుంది, సామాజిక అనర్థాలైన పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, ఆకలి వంటి వాటిని అధిగమించేందుకు సామాజిక న్యాయం హామీ ఇస్తుంది. సమాజంలోని నిమ్నవర్గాలు, బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తుంది. అంతిమంగా వ్యక్తుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది.
సామాజిక న్యాయాన్ని క్రింది విధంగా పొందవచ్చు (లేదా) సాధించవచ్చు సమాజంలోని విభిన్న వర్గాల మధ్య విపరీతమైన వ్యత్యాసాలు ఉన్నప్పుడు సామాజిక న్యాయం అనేది భ్రాంతిగా మిగిలిపోతుంది. ఈ సందర్భంలో సామాజిక న్యాయాన్ని ఖచ్ఛితంగా అవగాహన చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఆధునిక సమాజంలో సమానత్వంతో పాటుగా న్యాయాన్ని కలిగి ఉండటం అనేది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. అనైతిక, అన్యాయ, పక్షపాత ధోరణులు ఆధిపత్యం వహించినంత కాలం సమాజంలో ప్రగతిని సాధించడం సాధ్యం కాదు. అటువంటి సమాజంలో నిరాదరణ, అసౌకర్యాలకు గురైన వర్గాలు దైనందిన జీవనంలో నిరాశా నిస్పృహలకు లోనవుతాయి. అటువంటి పరిస్థితులలో అత్యధిక సంఖ్యలో ఉన్న పేద ప్రజానీకానికి, కొద్ది సంఖ్యలో ఉన్న సంపన్న వర్గానికి మధ్య ఘర్షణలు నెలకొంటాయి. కాబట్టి కనీస సౌకర్యాలు, సంతోషం భద్రతతో కూడిన న్యాయమైన సమాజం ఆవశ్యకత ఎంతైనా అవసరం. అప్పుడే సమాజంలోని విభిన్న వర్గాలకు చెందిన ప్రజలు తమ లక్ష్యాలను చేరుకొనేందుకు ప్రయత్నిస్తారు.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
న్యాయాన్ని నిర్వచించండి. [Mar. ’17, ’16]
జవాబు:
నిర్వచనాలు:
- ప్లేటో: “వ్యక్తి తన పని తాను చేసుకుంటూ, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే న్యాయం”.
- అరిస్టాటిల్: “న్యాయం అంటే సమాజంలో ప్రతి వ్యక్తీ తన నైతిక బాధ్యతలను నిర్వర్తించడం తప్ప మరేదీకాదు”.
- కెఫాలస్: “న్యాయం అంటే ప్రతి ఒక్కరూ సత్యాన్ని పలకడం, ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడం”.
ప్రశ్న 2.
వితరణశీల న్యాయం అంటే ఏమిటి ?
జవాబు:
వ్యక్తుల మధ్య యోగ్యత ప్రాతిపదికపై వస్తు సంపదను రాజ్యం పంపిణీ చేయడాన్ని వితరణశీల న్యాయం అని అంటారు. న్యాయమంటే ఒక రకమైన వితరణ పద్దతి అని అరిస్టాటిల్ పేర్కొన్నాడు. న్యాయాన్ని విప్లవాలకు వ్యతిరేకంగా వినియోగించే సాధనమని అరిస్టాటిల్ ఉద్దేశ్యం.
ప్రశ్న 3.
సరియైన న్యాయం అనగానేమి ?
జవాబు:
ఇతరుల చర్యల కారణంగా కోల్పోయిన హక్కులను ఒక వ్యక్తికి అప్పగించడాన్ని సరైన న్యాయం అంటారు. ఈ రకమైన న్యాయాన్ని అరిస్టాటిల్ నిషేధాత్మక న్యాయంగా భావించాడు. ఈ రకమైన న్యాయం కొన్ని రకాల వ్యాపార లావాదేవీలకు సంబంధించినదై ఉంటుంది.
ప్రశ్న 4.
ఆర్థిక అంశాలను ఏ విధంగా న్యాయానికి ఆధారంగా పరిగణించవచ్చు ?
జవాబు:
ఆర్థిక అంశాలను కూడా న్యాయానికి మరొక ఆధారంగా పరిగణించవచ్చు. పారిశ్రామిక విప్లవ ఫలితంగా ఆర్థిక అంశాలకు ప్రాధాన్యం పెరిగింది. కారల్మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగిల్స్ వంటి విప్లవాత్మక సామ్యవాదులు న్యాయానికి ఆర్థిక అంశాలే ఆధారాలుగా ఉంటాయని గట్టిగా విశ్వసించారు. వర్గరహిత సమాజ స్థాపన ద్వారా ఆర్థిక సమానత్వం సాధించినపుడే న్యాయం ఆచరణ సాధ్యమని వారి విశ్వాసం.
ప్రశ్న 5.
రాజకీయ న్యాయం అనగానేమి ? [Mar. 16]
జవాబు:
రాజకీయ న్యాయం (Political Justice): రాజకీయ న్యాయం అనేది రాజకీయ సమానత్వాన్ని సూచిస్తుంది. రాజ్యంలోని వయోజనులైన పౌరులకు రాజకీయ హక్కులను ఈ రకమైన న్యాయం ప్రతిపాదిస్తుంది. దేశ పాలనలో, పౌరులు స్వేచ్ఛగానూ, నిర్భయంగానూ పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఎన్నికల సమయంలో రాజకీయ న్యాయ భావన విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకొంటుంది. రోజువారి పాలనలో పౌరులు చురుకుగా పాల్గొనేందుకు రాజకీయ న్యాయం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రతి ఒక్కరూ ఇతరులతో పాటుగా సమానులేనని, ఏ ఒక్కరూ ఇతరుల కంటే ఏ విషయంలోనూ అధికులు కారనీ, ఎటువంటి ప్రత్యేకతలు కలిగి ఉండరనే సూత్రంపై ఈ భావన రూపొందింది. రాజ్యంలో రాజకీయ న్యాయం ఉండాలంటే కింద పేర్కొన్న పరిస్థితులు నెలకొనాలి.
ప్రశ్న 6.
సామాజిక న్యాయం అనగానేమి ? [Mar. ’17]
జవాబు:
సామాజిక న్యాయం (Social Justice): సామాజిక న్యాయం అనేది వ్యక్తుల హక్కులు, సమాజం నియంత్రణల మధ్య చక్కని సమతౌల్యాన్ని నెలకొల్పేందుకు ఉద్దేశించింది. వర్తమాన చట్టాలకు లోబడి వ్యక్తుల న్యాయబద్దమైన ఆకాంక్షలను నెరవేర్చుకొనేందుకు ఈ రకమైన న్యాయం వీలు కల్పిస్తుంది. చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే సూత్రాన్ని సామాజిక న్యాయం నమ్ముతుంది, సామాజిక అనర్థాలైన పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, ఆకలి వంటి వాటిని అధిగమించేందుకు సామాజిక న్యాయం హామీ ఇస్తుంది. సమాజంలోని నిమ్నవర్గాలు, బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తుంది. అంతిమంగా వ్యక్తుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది.
ప్రశ్న 7.
చట్టబద్ధమైన న్యాయంలోని పర్యవసానాలు ఏవి ?
జవాబు:
చట్టబద్ధమైన న్యాయం రాజ్యాంగ శాసనాల ద్వారా వెల్లడి అవుతుంది. రాజ్యంలోని రాజ్యాంగం, ఇతర శాసన చట్టాల రూపంలో ఇది వ్యక్తమవుతుంది. న్యాయం చట్టబద్ధమైన పరిమితులను నిర్ణయిస్తుంది. చట్టబద్ధమైన న్యాయంలో రెండు అంశాలు ఇమిడి ఉంటాయి. అవి:
- సమాజంలో చట్టాలన్నీ సమన్యాయ పాలన సూత్రంపై ఆధారపడి రూపొందించబడి, అమలు చేయబడతాయి.
- చట్టాలన్నీ సహాయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా రూపొందించబడతాయి.
ప్రశ్న 8.
సామాజిక న్యాయంపై జాన్రాల్స్ అభిప్రాయాలను తెల్పండి. [Mar. ’18]
జవాబు:
జాన్ రాల్స్ ‘సామాజిక న్యాయం’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతాన్ని ‘న్యాయం’ లేదా ‘నిష్పాక్షికత’ అని జాన్రాల్స్ పేర్కొన్నాడు. సామాజిక న్యాయం అంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, హక్కులను, ఇతర అవకాశాలను కల్పించటం అని ఆయన భావన. సామాజిక న్యాయం ద్వారానే వ్యక్తులు సుఖసంతోషాలతో కూడిన జీవనాన్ని పొందుతారని జాన్ రాల్స్ పేర్కొన్నాడు.
ప్రశ్న 9.
స్వేచ్ఛాయుత మార్కెట్ యంత్రాంగ సమర్థకుల అభిప్రాయాలు ఏమిటో పేర్కొనండి.
జవాబు:
స్వేచ్ఛాయుత మార్కెట్ యంత్రాంగ సమర్థకుల అభిప్రాయం ప్రకారం రాజ్యంలో వ్యక్తులందరూ సంపూర్ణమైన ఆర్థిక స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను కలిగి ఉండాలి. ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి కారకాల మధ్య స్వేచ్ఛాయుత పోటీ ఉండాలి. ఆస్తిహక్కు, ఒప్పందాల స్వేచ్ఛ, ఆర్థిక వ్యవహారాలలో భాగస్వామ్యం ఏర్పరచుకొనే స్వాతంత్ర్యం ప్రతి వ్యక్తి కలిగి ఉండాలి అని స్వేచ్ఛాయుత మార్కెట్ యంత్రాంగ సమర్థకులు భావిస్తారు.
ప్రశ్న 10.
మతాన్ని ఏ విధంగా న్యాయానికి ఆధారంగా పరిగణించవచ్చు ?
జవాబు:
మతం (Religion): న్యాయానికి గల మరొక ఆధారమే మతం. మధ్యయుగం నుంచి మతం న్యాయానికి ఆధారంగా కొనసాగుతూ వచ్చింది. న్యాయం, మంచి, చెడులకు సంబంధించిన భావనలను భగవంతుడు ప్రవచించాడని క్రైస్తవమతాధిపతులు పేర్కొన్నారు. మతం ద్వారా న్యాయభావనలకు అంకురార్పణ చేసి, బలవంతుడే రాజ్య పాలకుడిగా ఉంటాడనీ వారు ఉద్ఘాటించారు. థామస్ అక్వినాస్ అనే మతాచార్యుడిగా మారిన తత్వవేత్త మతాన్ని క్రైస్తవచర్చికి ప్రతిరూపంగా విశ్వసించాడు. ఇతని ప్రకారం చట్టం ఆధారంగా కొనసాగే జీవనం ఉత్తమమైందిగా భావించాడు. రాజు ” ఎల్లప్పుడు ప్రజలను సన్మార్గంలో నడిపించాలన్నారు. రాజు తన అధికారాలను మతాధిపతి ఆధిపత్యానికి బద్ధుడై వినియోగించాలన్నాడు.