Students can go through AP Inter 2nd Year Botany Notes 1st Lesson మొక్కలలో రవాణా will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Botany Notes 1st Lesson మొక్కలలో రవాణా
→ మొక్కలలో ఒక నిమిషంలో జరిగే పెరుగుదలను ఒక మిల్లీమీటర్ లోని పదిలక్షల వంతును నమోదు చేయగలిగే అంత సూక్ష్మగాహ్యంగా ఉన్న క్రెస్కోగ్రాఫ్ను సర్.జె.సి.బోస్ రూపొందించారు.
→ బోస్ పరిశోధనా సంస్థ కోల్కత్తాలో ఉన్నది.
→ ఎక్కువ దూరాల మధ్య జరిగే రవాణా నాళికావ్యవస్థ ద్వారా జరుగుతుంది. దీనిని స్థానాంతరణ అంటారు. నేలలో నాటుకొని ఉన్న మొక్కలలో దారువు ద్వారా జరిగే రవాణా తప్పనిసరిగా ఒకే దిశలో అనగా వేరు నుంచి కాండంలోకి జరుగుతుంది.
→ సేంద్రియ, ఖనిజ పోషకాలు అన్ని దిశలలో రవాణా చెందుతాయి.
→ వాయువులు లేదా ద్రవాలు అధిక గాఢత గల ప్రదేశం నుండి అల్ప గాఢత గల ప్రదేశంలోనికి చలించుటను అంటారు.
→ త్వచ ప్రొటీన్ల సహాయంతో విసరణ జరగాలంటే అంతకు ముందే గాఢత ప్రవణత ఏర్పడి ఉండాలి. దీనిని సులభతర విసరణ అంటారు.
→ పదార్థాలను గాఢతా ప్రవణతకు వ్యతిరేక దిశలో ప్రవహింపచేయడానికి శక్తిని వినియోగించే విధానమే సక్రియా రవాణా.
→ మొక్క జీవక్రియలన్నింటిలో నీరు ప్రధానంగా పాల్గొంటుంది. అన్ని జీవరాశులకు నీరు ముఖ్యంగా కావలసిన పదార్థం.
→ పూర్తి స్థాయికి పెరిగిన మొక్కజొన్న 1 రోజులో దాదాపు 3 లీటర్ల నీటిని పీల్చుకుంటుంది. కాగా ఆవమొక్క 5 గంటలలో తను బరువుకు సమానమైన నీటిని గ్రహిస్తుంది.
→ నీటిశక్మము = ద్రావిత శక్మము + పీడన శక్మము.
→ స్వచ్ఛమైననీటి నీటిశర్మ విలువ = 0
→ ద్రావిత శక్మం ఎల్లప్పుడూ ఋణాత్మకము.
→ పీడన శక్మం ధనాత్మకం కాని మొక్కలలో ఋణాత్మకము.
→ అర్థ పారగమ్య త్వచం ద్వారా నీరు అల్ప గాఢత గల ప్రదేశం నుంచి అధిక గాఢత గల ప్రదేశంలోకి రవాణా అగుటను ద్రవాభిసరణ అంటారు.
→ ద్రవాభిసరణను థిసిల్ గరాటు ప్రయోగం లేదా పొటాటో ఆస్మాస్కోప్ ప్రయోగము ద్వారా వివరించవచ్చు.
→ కణాల నుంచి నీరు బయటకు వెళ్ళిపోయినప్పుడు కణత్వచం కణ కవచం నుండి విడిపోయి కణద్రవ్య సంకోచం జరుగుతుంది.
→ సాధారణ జీవకణాలు అధిక గాఢత గల ద్రావణంలో ఉంచినప్పుడు శుథం చెందుతాయి. అలాంటి కణాలలో పీడనశక్మం ‘0’ అవుతుంది. కావున నీటిశక్మం, ద్రావితశక్మం సమానం అవుతాయి.
→ కొల్లాయిడ్ల వంటి ఘన పదార్థాలు నీటిని అధిశోషించుకొని విస్తారంగా ఘనపరిమాణంలో వృధ్ధి చెందే ప్రక్రియను నిపానం అంటారు. ఉదా : విత్తనాలు పొడిగా ఉన్న కొమ్మలు నీటిని పీల్చుకునే విధానము.
→ ప్రొటీన్లకు అధిక నివాన సామర్థ్యము, కార్బోహైడ్రేటులకు తక్కువ నిపాన సామర్థ్యం ఉంటాయి. అందువల్ల ప్రొటీన్లు ఎక్కువగా గల బఠాణీ గింజలు, పిండి పదార్థము ఎక్కువగా ఉన్న గోధుమగింజల కంటే ఎక్కువగా ఉబ్బుతాయి.
→ స్థూల ప్రవాహంలో పదార్థాలు రెండు బిందువుల మధ్య ఉన్న పీడన వ్యత్యాసాల వల్ల ఒక చోటు నుంచి మరొక చోటుకు స్థూలంగా చలిస్తాయి.
→ మూలకేశంలోకి ప్రవేశించిన నీరు దిగువన ఉన్న వేరు పొరలకు అపోప్లాస్ట్ పథం లేదా సింప్లాస్ట్ పథం ద్వారా చేరుతుంది.
→ శిలీంధ్రం, వేరు వ్యవస్థతో కలిసి ఏర్పడిన సహజీవన సాంగత్యాన్ని శిలీంధ్ర మూలము (మైకోరైజా) అంటారు.
→ నీరు నీటి బిందువుల రూపంలో బయటకు పోవుటను బిందుస్రావం అంటారు.
→ సిక్వియా సిమ్ పర్విరెన్స్ వంటి చాలా ఎత్తయిన వృక్షాలలో ఎక్కువ భాగము నీటి స్థానాంతరణకు వేరు పీడనం సరిపోదు.
→ సంసంజన – అసంజన, బాష్పోత్సేక కర్షణ నమూనాను డిక్సన్ ప్రతిపాదించారు.
→ పత్ర రంధ్రాలు పగలు తెరుచుకుని, రాత్రి మూసుకుంటే, ఫొటోయాక్టివ్ రకం అంటారు.
→ రసయుత మొక్కలలో (ఉదా : కాక్టస్లు, బయోఫిల్లమ్) పత్రరంధ్రాలు పగలు మూసుకుని రాత్రులందు తెరుచుకుంటాయి. వీటిని స్కోటోయాక్టివ్ రకం అంటారు.
→ పత్రరంధ్రాలు తెరుచుకునే మూసుకునే యాంత్రికాన్ని వివరించడానికి లెవిట్, K’ పంపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
→ A B A (అబ్సిసిక్ ఆమ్లము) అనే సహజ బాష్పోత్సేక నిరోధకము నీటికొరత సందర్భాలలో పత్రరంధ్రం మూసుకునేటట్లు చేస్తుంది.
→ బాష్పోత్సేకం వల్ల మొక్కలకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. అందువల్ల దీనిని “అవశ్యకమైన అనర్థం” గా అభివర్ణిస్తారు.
→ పీడన ప్రవాహం లేదా సమూహ ప్రవాహ సిద్ధాంతంను ముంచ్ ప్రతిపాదించారు.
→ సర్. జె.సి. బోస్
జననము : నవంబర్ 30, 1858
మరణము : నవంబర్ 23, 1937
దేశము : ఇండియన్
మొక్కలకు కూడ ప్రాణము ఉంటుందని వాటికి భావవ్యక్తీకరణ ఉంటుందని శాస్త్ర ప్రపంచానికి తెలియచేసిన వ్యక్తి సర్. జగదీష్ చంద్రబోస్. ఆయన సూక్ష్మతరంగ ధైర్ఘ్యవిద్యుత్ అయస్కాంత తరంగాల ను ఉత్పత్తి చేసి రేడియోతరంగాలను గుర్తించే ‘కొహెరర్’ అనుపరికరం రూపకల్పన చేసారు. ఆయన క్రెస్కోగ్రాఫ్ అనే అత్యంత అధునాతన పరి కరాన్ని రూపొందించారు. ఇది మొక్కలలో ఒక నిమిషంలో జరిగే పెరుదల ను ఒక మిల్లిమీటర్లోని పదిలక్షలవంతు వరకు నమోదు చేయకలిగే అంతసూక్ష్మ గ్రాహ్యంగా ఉంటుంది. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను ‘నైట్ హుడ్'(Knight Hood)గా అభివర్ణిస్తూ, అతని పేరుకు ముందు “సర్” అను బిరుదు నిచ్చినది.