AP Inter 2nd Year Zoology Notes Chapter 5(b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం

Students can go through AP Inter 2nd Year Zoology Notes Lesson 5(b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Zoology Notes Lesson 5(b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం

→ మనదేశంలో సుమారు 2 మిలియన్ల ప్రజలు HIV / AIDS వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు.

→ భారతదేశంలో మాతృశిశు మరణాల రేట్లు అధికంగా ఉన్నాయి.

→ చాలా సంవత్సరముల క్రితమే మనదేశంలో కుటుంబ నియంత్రణ, ప్రత్యుత్పత్తి పిల్లల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం వంటి కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి.

→ పెద్ద మొత్తంలో పిల్లలకు టీకాలు ఇవ్వడం, గర్భిణీ స్త్రీలకు పోషక ఆహారం అందించడం, జననీ సురక్షా యోజనా మొదలైన ముఖ్యమైన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు భారత ప్రభుత్వంచే జాతీయస్థాయిలో నిర్వహించ బడుతున్నాయి.

→ స్త్రీ భ్రూణ హత్యలు – భారతదేశంలో రగులుతున్న సమస్య

→ పాఠశాలలో లైంగిక విద్యను ప్రవేశపెట్టడం వల్ల యౌవనులకు లైంగికత, తత్సంబంధ విషయాలపై సరియైన అవగాహన ఏర్పడుతుంది.

→ 1970వ సంవత్సరంలో ఉలద్రవ పరీక్ష అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి భారతదేశంలో భ్రూణ లైంగిక నిర్ధారణ జరిపే అవకాశమేర్పడింది.

→ లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే అంటువ్యాధులను సమిష్టిగా లైంగిక సంపర్క వ్యాధులు లేక సుఖవ్యాధులు అంటారు. ఇవి గనేరియా, సిఫిలిస్, జననాంగ హెర్పెస్, HIV మొదలైనవి.

→ లైంగిక సుఖ వ్యాధులను చికిత్స చేయించని యెడల స్త్రీలలో జటిల సమస్యలకు దారితీస్తాయి. అది శ్రోణి ఉజ్వలన వ్యాధులు, గర్భస్రావాలు, మృతజననాలు, వంధ్యత్వం / ప్రత్యుత్పత్తి మార్గ క్యాన్సర్ మొదలైనవి.

→ 15-24 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో లైంగిక సంపర్క వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. 11) సురక్షితం లేని లైంగిక సంపర్కానికి దూరంగా ఉండడం ద్వారా లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే అంటువ్యాధులను నియంత్రించవచ్చు.

AP Inter 2nd Year Zoology Notes Chapter 5(b) ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం జన్యుశాస్త్రం

→ సహజంగా కాని కృత్రిమంగా గాని గర్భధారణను ఉద్దేశ్యపూర్వకంగా నివారిస్తే దాన్ని గర్భనిరోధం అంటారు.

→ గర్భనిరోధకాలు సాధారణంగా అండోత్సర్గం, ఫలదీకరణం, పిండ ప్రతిస్థాపనను అడ్డుకొని గర్భధారణను నివారిస్తాయి.

→ ఆవర్తనంగా సంపర్కించకుండుట, అంతరాయసంభోగం, క్షీరోత్పాదన వల్ల రుతుచక్రం ఆగిపోవడం వంటి పద్ధతులు సహజ సిద్ధ గర్భనిరోధక పద్ధతులు.

→ కండోమ్లు పలుచని రబ్బరు లేదా లెటెక్స్ పొరచేతయారు చేయబడతాయి. ఇవి శుక్రకణాలు అండాలను చేరడాన్ని భౌతికంగా అడ్డుకుంటాయి.

→ IUDS అనేవి ఆలస్యంగా సంతానం, శిశువుల మధ్య ఎక్కువ వ్యవధి కావాలనుకొనే స్త్రీలకు అనువైన గర్భనిరోధకాలు.

→ శస్త్ర చికిత్స విధానంలో గర్భధారణను నివారించడాన్ని వంధ్యీకరణం అంటారు. పురుషులలో వంధ్యీకరణ విధానాన్ని వెసెక్టమీ అని స్త్రీలలో అయితే ట్యూబెక్టమీ అని అంటారు.

→ గర్భస్థ శిశువు (పిండం)లో జన్యులోపాలను కనుక్కొనే రోగనిర్థారక విధానాన్ని ఉలద్రవ పరీక్ష అంటారు.

→ స్త్రీ శరీరం బయట అండాన్ని శుక్రకణాలతో ఫలధీకరణం చేయడాన్ని దేహబాహ్య ఫలదీకరణం అంటారు.

→ కొన్ని సందర్భాలలో స్త్రీలో గర్భాధారణ జరగక పోవడం వల్ల, గాని, గర్భాశయంలో సమస్యల వల్ల పిండాభివృద్ధికి తగిన అనుకూల వాతావరణాన్ని సమకూర్చకపోవడం వల్ల గాని మరొక స్త్రీ గర్భాశయాన్ని ఉపయోగించు కోవలసి వస్తుంది. అలాంటి తల్లిని అరువు తల్లి (Surrogate mother) అంటారు.