AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 6th Lesson శతక మధురిమ Textbook Questions and Answers.
AP State Syllabus SSC 10th Class Telugu Solutions 6th Lesson శతక మధురిమ
10th Class Telugu 6th Lesson శతక మధురిమ Textbook Questions and Answers
ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి
రాజేశ్ : రవీ! బాగున్నావా!
రవి : బాగున్నాను రాజేశ్. నువ్వేం చేస్తున్నావు? మన చిన్ననాటి మిత్రులు ఎవరైనా కలుస్తున్నారా?
రాజేశ్ : ఆ! ఆ! అందరూ కలుస్తున్నారు. సంతోష్ లాయరైనాడు. భాను టీచరైనాడు. మధు వ్యాపారం చేస్తున్నాడు. సుభాష్ రాజకీయనేతగా ఎదిగాడు. ఇలా అందరూ ఒక్కో రంగంలో నీతి నిజాయితీలతో రాణిస్తున్నారు.
రవి : చిన్నప్పుడు మనం చదివిన చదువు, పొందిన జ్ఞానం ఊరికే పోతుందా? ఆ చదువుల ఫలితం, గురువుల దీవెనలు అన్నీ కలిస్తేనే మన అభివృద్ధి.
రాజేశ్ : ఔనౌను! ముఖ్యంగా శతక పద్యాలలోని నీతులు మన వ్యక్తిత్వానికి బాటలు వేశాయి. ఆత్మవిశ్వాసాన్ని నింపాయి కదూ!
రవి : బాగా చెప్పావు రాజేశ్! శతక పద్యాలు నేటికీ మార్గదర్శకాలు. మీ పిల్లలకు కూడా నేర్పించు బాగా!
రాజేశ్ : నేర్పుతున్నాను. సరే రవీ! బస్సు వచ్చింది. మళ్ళీ కలుద్దాం.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
సంభాషణను బట్టి వారు ఎవరని భావిస్తున్నారు?
జవాబు:
సంభాషణను బట్టి వారు ఇద్దరూ చిన్ననాటి మిత్రులనీ, ఒకే బడిలో ఒకే తరగతిలో కలసి చదువుకున్నారని భావిస్తున్నాను.
ప్రశ్న 2.
వారి అభివృద్ధికి కారణాలేవి?
జవాబు:
చిన్నప్పుడు వారు చదివిన చదువు, అప్పుడు నేర్చుకున్న జ్ఞానం వారి అభివృద్ధికి కారణాలు.
ప్రశ్న 3.
వ్యక్తిత్వాన్ని ఏవి తీర్చిదిద్దుతాయి?
జవాబు:
శతక పద్యాల్లోని నీతులు (సూక్తులు) వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి.
ప్రశ్న 4.
ఏవి నేటి తరానికి మార్గదర్శకాలని రవి చెప్పాడు?
జవాబు:
‘శతక పద్యాలు’, నేటితరానికి మార్గదర్శకాలని రవి చెప్పాడు.
ఇవి చేయండి
1. అవగాహన – ప్రతిస్పందన
1. కింది అంశాల గూర్చి మాట్లాడండి.
అ) ఆచారం :
‘ఆచారము’ అంటే ఒక సంఘములోని సభ్యుల్లో సాంప్రదాయకంగా ఉన్న, ప్రామాణికమైన ప్రవర్తనా పద్దతి. నిషేధమే ఆచారానికి మూలం. ఆచారం, మానవజాతి యొక్క ప్రాచీనమైన వ్రాయబడని ధర్మశాస్త్రం. ఒక వ్యక్తి ఒక పనిని నిత్యమూ చేస్తే, అది ‘అలవాటు’. అదే జాతి పరంగానో, సంఘ పరంగానో చేస్తే, ‘ఆచారం’ అవుతుంది.
ఈ ఆచారాలు, జాతి జీవన విధానాన్ని తెలుపుతూ, ఆ జాతిని నైతికపతనం నుండి కాపాడవచ్చు. ఈ ఆచారాలు క్రమంగా తమ అంతశ్శక్తిని పోగొట్టుకొని, చెడు ఫలితాలకు దారి తీస్తున్నాయి.
ఆ) సత్కార్యం :
‘సత్కార్యం’ అంటే మంచి పని. ఏ పని చేస్తే సంఘం సంతోషిస్తుందో అది సత్కార్యం. వేదంలో చెప్పిన పని, ‘సత్కార్యం’ – ఒక పేదవాడిని ఆదరించి అన్నం పెడితే అది సత్కార్యం.
- దానాలు చేయడం
- గుడులు కట్టించడం
- ధర్మకార్యాలు చేయడం
- తోటలు నాటించడం
- ఒక బ్రాహ్మణుడికి పెండ్లి చేయించడం
- చెరువులు త్రవ్వించడం
- మంచి సంతానాన్ని కనడం – అనే వాటిని సత్కార్యాలని, వాటినే సప్తసంతానాలని అంటారు.
ఇ) న్యాయం:
న్యాయమునే ‘ధర్మము’ అని కూడా అంటారు. ఈ న్యాయము కాలానుగుణముగా మారుతుంది. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క న్యాయపద్ధతి ఉంటుంది. ఈ న్యాయాన్ని కాపాడేవి న్యాయస్థానాలు. న్యాయస్థానాలు ఏది న్యాయమో, ఏది అన్యాయమో నిర్ణయిస్తాయి. లోకములోనూ, శాస్త్రమునందూ ప్రసిద్ధమైన ఒక దృష్టాంత వాక్యాన్ని “న్యాయము” అంటారు.
ఈ) దాస్యం :
‘దాస్యము’ అంటే సేవ. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి సేవ చేస్తారు. ఇంట్లో అంట్లు, చెంబులు తోమి పాచి పని చేయడం కూడా ‘దాస్యమే’. కద్రువకు ఆమె సవతి వినత, దాస్యం చేసింది.
2. పాఠంలోని పద్యాలు ఆధారంగా కింది వాక్యాలకు తగిన పద్యపాదం గుర్తించండి.
అ) అనామకమై నశించడం
జవాబు:
‘నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు’.
ఆ) సముద్రాన్ని తియ్యగా మార్చడం
జవాబు:
‘తీపు రచింపన్ లవణాబ్దికిన్ మధుకణంబుం జిందు యత్నించు’.
ఇ) సముద్రంలో కాకిరెట్ట
జవాబు:
………………… అకుంఠిత పూర్ణ సుధాపయోధిలో నరుగుచుఁ గాకి రెట్ట యిడినందున నేమి”
3. కింది పద్యాలను పాదభంగం లేకుండా పూరించండి.
సూచన : పధ్యంలో 4 పాదాలలోని ప్రతిపాదం పాఠ్యపుస్తకంలో ఎక్కడికి పూర్తయిందో అక్కడికే పూర్తవ్వాలి. రెండవ అక్షరం ప్రాస. ఆ ప్రాస ఒక అక్షరం పొల్లు ఉంటుంది. దానిని తదంతో గుర్తుపెట్టుకోవాలి. గణాలు కూడా గుర్తు పెట్టుకొంటే, రాసేటపుడు పాదభంగం రాదు.
అ) నీరము ………………… కొల్చువారికిన్
జవాబు:
ఉ|| నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు నా
నీరమె ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చునా
నీరమె శుక్తిలోఁబడి మణిత్వము గాంచు సమంచిత ప్రభన్
బౌరుష వృత్తులి టధము మధ్యము నుత్తము గొల్చువారికిన్.
ఆ) తన దేశంబు …………. భక్త చింతామణీ!
జవాబు:
మ|| తన దేశంబు స్వభాష నైజమతమున్ అస్మత్సదాచారముల్
తన దేహాత్మల నెత్తెఱంగున సదాతానట్లు ప్రేమించి, త
ద్ఘనతా వాప్తికి సాధనంబులగు సత్కార్యమ్ములన్ జేయఁగా
ననుహౌ బుద్ధి యొసంగుమీ ప్రజకు దేవా! భక్త చింతామణీ!
4. కింది పద్యాన్ని చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
సత్యసూక్తి ఘటించు, ధీజడిమ మాన్చు
గౌరవమొసంగు, జనులకుఁ గలుషమడచు
కీర్తి ప్రకటించు, చిత్త విస్పూర్తి జేయు
సాధుసంగంబు సకలార్థ సాధకంబు.
ప్రశ్నలు :
అ) సూక్తి అంటే ఏమిటి?
జవాబు:
సూక్తి అంటే ‘మంచిమాట’.
ఆ) కీర్తి ఎలా వస్తుంది?
జవాబు:
సాధుసంగము వలన అనగా మంచివారితో స్నేహంగా ఉండడం వల్ల ‘కీర్తి’ వస్తుంది.
ఇ) సాధుసంగం వల్ల ఏం జరుగుతుంది?
జవాబు:
సాధుసంగం సకల ప్రయోజనాలనూ సాధించి పెడుతుంది.
ఈ) ఈ పద్యానికి శీర్షిక సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షికగా “సాధుసంగం” అనేది తగియుంటుంది.
సూచన:
పధ్యంలో దేని గురించి అధినంగా చెప్పారో అని శీర్షికగా పెట్టాలి, దేనికైనా సరే సుభాషితం , సూక్తి వంటి శీర్షికలు పెట్టి వచ్చును.
II. వ్యక్తీకరణ సృజనాత్మకత
1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాత్యాల్లో జవాబులు రాయండి.
అ) కాలిన ఇనుముపై నీళ్ళు పడితే ఆవిరిగా మారుతాయని తెలుసుకదా! అలాగే, మనుషులు ఎవరిని చేరితే ఎలా అవుతారో. సోదాహరణంగా రాయండి.
జవాబు:
కాలిన ఇనుము మీద నీళ్ళు పడితే ఆవిరైపోయి, అవి పూర్తిగా నశిస్తాయి. ఆ నీళ్ళు తామరాకుపైన పడితే ముత్యాల్లా ప్రకాశిస్తాయి. ఆ నీళ్ళే సముద్రంలోని ముత్యపుచిప్పలో పడితే, ముత్యాల్లా మారతాయి. దీనిని బట్టి మనిషి అధములలో చేరితే అధముడు అవుతాడు. కాలిన ఇనుముపై నీళ్ళవలె, అతడు అనామకుడవుతాడు. మనిషి మధ్యములలో చేరితే, మధ్యముడు అవుతాడు. అపుడు తామరాకుపై నీరులా ముత్యమువలె కనిపిస్తాడు. మనిషి ఉత్తములతో చేరితే, ఉత్తముడు అవుతాడు. అపుడు ముత్యపు చిప్పలో పడిన నీరు వలె, ‘ముత్యము’ అవుతాడు.
ఆ) ధర్మవర్తనులను నిందించడం వల్ల ప్రయోజనం లేదు అనే విషయాన్ని సోదాహరణంగా రాయండి.
జవాబు:
ధర్మాన్ని పాటించే ధర్మవర్తనుడిని, ఒక నీచుడు మిక్కిలి హీనంగా నిందించినా, ఆ ధర్మవర్తనుడికి ఏ మాత్రమూ లోటురాదు. ఎందుకంటే అమృత సముద్రముపై నుండి కాకి ప్రయాణము చేస్తూ ఆ సముద్రములో ఆ కాకి రెట్ట వేస్తుంది. అంతమాత్రము చేత ఆ సముద్రానికి ఏమీ లోటు రాదు. అలాగే, ధర్మాత్ముడిని నీచుడు నిందించినా, ఆ ధర్మమూర్తికి లోటు రాదు.
ఇ) “కరిరాజున్” అనే పద్యభావాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
మూర్ఖులను అమృతధారలవంటి మాటలతో సమాధాన పరిచేవాడూ, మదపుటేనుగును తామర తూడునందలి దారములతో బంధించాలని ఆలోచించేవాడూ, దిరిసెన పువ్వుతో వజ్రాన్ని బ్రద్దలు చేయాలని యత్నించేవాడూ, ఒక్క తేనెబొట్టుతో ఉప్పు సముద్రపు నీటిని తియ్యగా మార్చాలనుకొనేవాడూ, సమానులు.
2. కింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాత్యాల్లో జవాబులు రాయండి.
అ) సజ్జన లక్షణాలు పేర్కొనండి.
జవాబు:
సజ్జన లక్షణాలు : –
- మనిషి ఉత్తములతో స్నేహం చేయాలి. అలా చేస్తే ముత్యపు చిప్పలో ముత్యంలా అతడు శోభిస్తాడు.
- అమృత ధారల వంటి తియ్యటి మాటలతో, మూర్యుడికి బోధించడం మానుకోవాలి.
- తనకున్న దానితోనే అనాథలనూ, నిరుపేదలనూ ప్రేమతో లాలిస్తూ వారికి అన్నం పెట్టాలి.
- తన దేశాన్నీ, తన మతాన్నీ, భాషనూ, ఆచారాన్ని అభిమానించే బుద్ధి కలిగి ఉండాలి.
- ఇతరులు తనకు కీడు చేసినా, వారికి అపకారము చేయకుండా, ఉపకారమే చేయాలి.
- ధర్మవర్తనులను ఎప్పుడూ తాను నిందించకూడదు.
- పరద్రవ్యాన్ని ఆశించి, చెడు పనులు చేయకూడదు.
- వరదల్లో మునిగిపోయే పొలాన్ని దున్నకపోవడం, కరవు వచ్చినపుడు చుట్టాల ఇళ్ళకు వెళ్ళకపోవడం, రహస్యాన్ని ఇతరులకు వెల్లడించకపోవడం, పిరికివాడిని సేనానాయకునిగా చేయకపోవడం అనేవి సజ్జన లక్షణాలు.
ఆ) నైతిక విలువలంటే ఏమిటి? మీరు గమనించిన విలువల్ని పేర్కొనండి.
జవాబు:
‘నైతిక విలువలు’ అంటే నీతి శాస్త్రానికి సంబంధించిన విలువైన మంచి పద్ధతులు అని భావము. వీటినే ఆంగ్ల భాషలో ‘Moral Values’ అంటారు. అంటే అమూల్యమైన నీతులు అని అర్థము. మనిషి ఎలా నడచుకోవాలో నీతి శాస్త్రము చెపుతుంది. నీతి శాస్త్రంలో చెప్పిన, ధర్మశాస్త్రంలో చెప్పిన నీతులను పాటించడం, నైతిక విలువలను పాటించడం అంటారు.
నేను గమనించిన నైతిక విలువలు :
- తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవించడం.
- స్త్రీలను అందరినీ కన్నతల్లులవలె, సోదరీమణులవలె గౌరవించడం, ఆదరించడం.
- కులమత భేదాలను పాటించకుండా, తోటి విద్యార్థులనందరినీ సోదరులుగా, విద్యార్థినులను సోదరీమణులుగా ఆదరించాలి. గౌరవించాలి.
- మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకున్నట్లే, మన గ్రామాన్ని, పాఠశాలను, మనకు ఉన్న నీటి వసతులను, రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలి. ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలి.
- అహింసా మార్గాన్ని ఎప్పుడూ చేపట్టకూడదు. గాంధీజీ వలె ఒక చెంపపై కొడితే, రెండవ చెంప చూపాలి. జాలి, దయ, కరుణ కలిగి ఉండాలి.
- మత్తుపదార్థాలు సేవించకపోవడం, చెడు అలవాట్లకు బానిసలు కాకపోవడం అనేవి మంచి నైతిక విలువలుగా నేను భావిస్తున్నాను.
3. కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.
అ) పేదలకు దానం చేయటం వల్ల మనం పొందే మేలును గురించి తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:
(మిత్రుడికి లేఖ) తిరుపతి, మిత్రుడు శశిభూషణకు, / మిత్రురాలు కమలకు, ఉభయ కుశలోపరి. నీవు రాసిన లేఖ చేరింది. మనం నైతిక విలువలను పాటించాలని రాశావు. సంతోషము. మన ఇరుగు పొరుగువారిలో ఎందరో పేదలు ఉంటారు. భగవంతుడు మానవులు అందరిలోనూ ఉంటాడు. కాబట్టి మనుషులు అంతా దైవంతో సమానం. ముఖ్యంగా పేదవారికి, మనకు ఉన్నంతలో దానం చేయాలి. మన తరగతిలోని పేదవారికి పుస్తకాలు, పెన్నులు, నోట్సులు దానం చెయ్యాలి. పరీక్ష ఫీజులు కట్టడానికి వారికి డబ్బు సాయం చెయ్యాలి. వైద్య సహాయం కోసం డబ్బులు అడిగే వారికి తప్పక ఇవ్వాలి. పేదలకు దానం చేస్తే మరుసటి జన్మలో మనకు భగవంతుడు మరింతగా ఇస్తాడు. పేదల ముఖాల్లో ఆనందం కనబడేలా చేస్తే, మన జీవితాలు సుఖసంతోషాలకు నిలయం అవుతాయి. నేను నాకు ఉన్నంతలో పేదలకు దాన ధర్మాలు చేస్తున్నాను. నీవు కూడా చెయ్యి. ఇట్లు చిరునామా : |
(లేదా)
ఆ) పాఠశాలలో జరిగే భాషోత్సవాన్ని తిలకించడానికి ప్రముఖ శతక కవులు వచ్చారు. వారి ద్వారా శతకాల గురించి, వారి రచనల గురించి తెలుసుకోవడానికి పిల్లలు ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు. మీరైతే ఏమని ఇంటర్వ్యూ చేస్తారు? ఇంటర్వ్యూకు అవసరమైన ప్రశ్నావళిని రూపొందించండి.
జవాబు:
ఇంటర్వ్యూ ప్రశ్నావళి :
- శతక కవులకు సుస్వాగతం. తెలుగు భాషలో శతకాలు ఎన్ని రకాలో దయచేసి చెప్పండి.
- మన తెలుగులో మొదటి శతక కర్త ఎవరు?
- మకుటం అంటే ఏమిటి?
- మకుటం లేని శతకాలు మనకు ఉన్నాయా? ఉంటే అవి ఏవి?
- నీతి శతకాల ప్రత్యేకత ఏమిటి?
- భక్తి శతకాలు మీరు ఏమైనా వ్రాశారా?
- భక్తి శతకాల్లో దాశరథీ శతకం ప్రత్యేకత ఏమిటి?
- కాళహస్తీశ్వర శతకంలో భక్తి ఎక్కువా? రాజదూషణ ఎక్కువా?
- ‘సుమతీ శతకం’ ప్రత్యేకత ఏమిటి?
- కృష్ణ శతకాన్ని ఎవరు రచించారు?
- మీకు నచ్చిన శతకం ఏమిటి?
- మీరు మాకు ఇచ్చే సందేశం ఏమిటి?
- ఛందోబద్ధం కాని తెలుగు శతకం ఏది?
భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని
పాఠశాల గ్రంథాలయంలో శతకపద్యాలున్న పుస్తకాలు తీసుకొని చదవండి. వాటిలో ఏవైనా ఐదు శతకపద్యాలను, వాటి భావాలను రాసి ప్రదర్శించండి.
జవాబు:
1) సుమతీ శతకం :
తలనుండు విషము ఫణికిని
వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
తల తోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
భావం :
పాముకు విషం తలలో ఉంటుంది. తేలుకు విషం తోకలో ఉంటుంది. దుర్మార్గుడికి మాత్రం తల, తోక అని కాకుండా నిలువెల్లా ఉంటుంది.
2) కృష్ణ శతకం :
దేవేంద్రు డలుక తోడను
వావిరిగా రాళ్ళవాన వడి గురియింపన్
గోవర్ధనగిరి యెత్తితి
గోవుల గోపకుల గాచుకొఱకై కృష్ణా !
భావం:
ఓ కృష్ణా ! దేవేంద్రుడు కోపంతో రాళ్ళవానను వేగంగా కురిపించాడు. అప్పుడు నీవు ఆవులను, గోపాలురను రక్షించడానికి మందరపర్వతాన్ని ఎత్తిపట్టుకున్నావు.
3) వేమన శతకం:
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడవడైన నేమి ఖరము పాలు
భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ.
భావం :ఓ వేమనా ! గంగిగోవు పాలు గరిటెడు చాలు. గాడిదపాలు కుండెడు ఉంటే మాత్రం, ఏం ప్రయోజనం ఉంటుంది? భక్తితో పట్టెడు అన్నం పెడితే చాలు కదా !
4) కుమార శతకం:
ఆచార్యున కెదిరింపకు;
బ్రోచిన దొర నింద సేయబోకుము; కార్యా
లోచనము లొంటిఁ జేయకు
మాచారము విడువబోకుమయ్య కుమారా !
భావం:
కుమారా ! గురువు మాటకు ఎదురు చెప్పవద్దు. నిన్ను పోషించే యజమానిని నిందించకు. ఒంటరిగా కార్యమును గూర్చి ఆలోచింపకు. మంచి నడవడికను వదలిపెట్టకు.
5) గువ్వలచెన్నా శతకం ::
కలకొలది ధర్మ ముండిన
గలిగిన సిరి కదలకుండు, కాసారమునన్
గలజలము మడువులేమిని
గొలగల గట్టు తెగిపోదె గువ్వలచెన్నా !
భావం :
సిరిసంపదలకు తగినట్లుగా, దానధర్మాలు చేస్తే, ఆ సంపద పెరుగుతుంది. చెరువులోని నీటికి సరియైన వినియోగం లేకపోతే, గట్లు తెగిపోతాయి కదా !
III. భాషాంశాలు
పదజాలం
1) కింది పదాలకు అర్థాలు రాసి, వాటితో సొంతవాక్యాలు రాయండి.
ఉదా : ఉత్తములు = గొప్పవారు
సొంతవాక్యం :
ఉత్తములు ధనిక, పేద భేదాలు చూపరు.
అ) ముష్కరుడు = దుష్టుడు
సొంతవాక్యం :
ఢిల్లీ నగరములో అత్యాచారాలు చేసే ముష్కరుల సంఖ్య పెరుగుతోంది.
ఆ) లాలన = బుజ్జగించడం
సొంతవాక్యం :
తల్లిదండ్రులు తమ పిల్లలను అతిగా లాలన చేయకూడదు.
ఇ) ఘనత = గొప్పతనము
సొంతవాక్యం : రామభక్తియే, కంచర్ల గోపన్న ఘనతకు ముఖ్యకారణము.
ఈ) మర్మము = రహస్యము
సొంతవాక్యం :
దేశమర్మములను విదేశ గూఢచారులకు ఎన్నడూ తెలుపరాదు.
2) కింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలు రాయండి.
అ) భాస్కరుడు : కాంతిని కలుగజేయువాడు (సూర్యుడు)
ఆ) పయోనిధి : దీని యందు నీరు నిలిచియుంటుంది. (సముద్రము)
ఇ) దాశరథి : దశరథుని యొక్క కుమారుడు (రాముడు)
3) కింది పదాలకు పర్యాయపదాలు రాసి, వాటితో వాక్యాలు రాయండి.
ఉదా : ఈశ్వరుడు : 1) శివుడు 2) శంకరుడు.
వాక్య ప్రయోగము :
శివుడు కైలాసవాసి. ఆ శంకరుని “ఈశ్వరా! కాపాడు” అని వేడుకుంటే పాపాలు పోతాయి.
అ) లక్ష్మి : 1) కమల 2) హరిప్రియ 3) పద్మ 4) ఇందిర.
వాక్య ప్రయోగము :
‘కమల‘ వైకుంఠ నివాసిని. హరిప్రియను భక్తులు ‘పద్మ‘ అని, ‘ఇందిర‘ అని పిలుస్తారు.
ఆ) దేహం : 1) శరీరము 2) కాయము 3) గాత్రము.
వాక్య ప్రయోగము :
ఆమె శరీరము ఆహారము లేక ఎండిపోయింది. ఆ కాయమునకు బలమైన తిండి పెడితే, ఆ గాత్రము తిరిగి చక్కనవుతుంది.
ఇ) నీరము : 1) జలము 2) ఉదకము 3) పానీయము.
వాక్య ప్రయోగము :
ఆ గ్రామం చెరువులో జలము లేదు. ఉదకము కోసం గ్రామస్థులు నూయి తవ్వినా పానీయము పడలేదు.
ఈ) పయోనిధి : 1) సముద్రము 2) కడలి 3) సాగరము.
వాక్య ప్రయోగము :
జాలరులు వేటకు సముద్రము మీద పడవపై వెళ్ళారు. కడలిలో తరంగాలు హెచ్చుగా ఉండి ఆ పడవ సాగరములో మునిగిపోయింది.
4) కింది వాక్యాలను గమనించండి. ఆయా వాక్యాల్లోని ప్రకృతి – వికృతుల్ని గుర్తించి పట్టికగా కూర్చండి.
అ) మూర్ఖులకు నీతులు చెప్పడం వల్ల ఆ మొరకులకు లోకువ అవుతాము.
ఆ) సిరిని కురిపించు లచ్చిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీలక్ష్మిని పూజించాలి.
ఇ) న్యాయము తప్పి చరించరాదు. నాయమును కాపాడుట మన కర్తవ్యం.
జవాబు:
ప్రకృతి – వికృతి
అ) మూర్ఖులు – మొరకులు
ఆ) శ్రీ – సిరి
ఇ) న్యాయము – నాయము
వ్యాకరణాంశాలు
1. కింది సందర్భాలలో పునరుక్తమయిన హల్లులను పరిశీలించండి. అవి వృత్త్యనుప్రాస అలంకారాలవునో, కాదో చర్చించండి.
అ) నీ కరుణాకటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము.
ఆ) అడిగెదనని కడువడిఁజను
నడిగినఁదను మగుడనుడుగడని నడయుడుగున్.
ఇ) మకరంద బిందు బృంద రసస్యందన మందరమగు మాతృభాషయే.
ఈ) చూరుకు, తేరుకు, యేరుకు, నారకు, దారువును వాడు నరవరులిలలోన్.
వృత్త్యను ప్రాసాలంకారం :
‘లక్షణం’ : ఒకటిగాని అంతకంటే ఎక్కువగాని అక్షరాలు కాని, అనేకసార్లు తిరిగి రావడాన్ని ‘వృత్త్యను ప్రాసాలంకారం’ అంటారు. వృత్తి అంటే ఆవృత్తి; ఆవృత్తి అంటే మళ్ళీ మళ్ళీ రావడం.
అ) “నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము”.
సమన్వయం :
పై వాక్యంలో, ‘క్ష’ అనే అక్షరం, మూడుసార్లు ఆవృత్తి చెందింది. కాబట్టి ఇది ‘వృత్త్యనుప్రాసాలంకారం’.
ఆ) ‘అడిగెదనని కడువడిఁజను
నడిగినఁదను మగుడనుడుగడని నడయుడుగున్’.
సమన్వయం :
పై పద్యపాదంలో ‘డ’ అనే హల్లు పలుమార్లు ఆవృత్తి అయ్యింది. కాబట్టి ఇది ‘వృత్త్యనుప్రాసాలంకారం’.
ఇ) ‘మకరంద బిందు బృంద రసస్యందన మందరమగు మాతృభాషయే’.
సమన్వయం :
పై వాక్యములో బిందు పూర్వక ‘ద’ కారము పలుమార్లు ఆవృత్తి అయ్యింది. కాబట్టి ఇది ‘వృత్త్యనుప్రాసాలంకారం’.
ఈ) చూరుకు, తేరుకు, మీరుకు, నారకు, దారువును వాడు నరవరులిలలోన్’.
సమన్వయం :
పై వాక్యములో, ‘ర’ అనే హల్లు పలుమార్లు ఆవృత్తి అయ్యింది. కాబట్టి ఈ వాక్యంలో ‘వృత్త్యనుప్రాస’ అలంకారం ఉంది.
విసర్గ సంధి
2. సంస్కృత పదాల మధ్య ‘విసర్గ’ మీద తరచు సంధి జరుగుతూ ఉంటుంది. అది వేర్వేరు రూపాలుగా ఉండటం గమనిద్దాం.
కింది ఉదాహరణలు విడదీసి చూడండి..
అ) నమోనమః
ఆ) మనోహరం
ఇ) పయోనిధి
ఈ) వచోనిచయం
1. పై సంస్కృత సంధి పదాలను విడదీస్తే, ఈ కింద చెప్పిన మార్పు జరిగిందని గుర్తింపగలం.
అ) నమః
ఆ) మనః + హరం
ఇ) పయః + నిధి
ఈ) వచః + నిచయం
సూత్రము :
అకారాంత పదాల విసర్గకు శషసలు, వర్గ ప్రథమ, ద్వితీయాక్షరాలు (క ఖ చ ఛట ఠ త థ ప ఫ లు) కాక మిగతా అక్షరాలు కలిస్తే, అకారాంత పదాల మీదున్న విసర్గ లోపించి, అకారం ‘ఓ’ కారంగా మారింది.
గమనిక :
ఈ ఉదాహరణలలో మొదటి పదాలు, అకారాంతాలుగా ఉన్నాయి. అకారాంత పదాల మీదున్న విసర్గ లోపించి, అకారం ‘ఓ’ కారంగా మారింది.
అ) నమోనమః
ఆ) మనోహరం
ఇ) పయోనిధి
ఈ) వచోనిచయం
2. కింది పదాలు కలిపి, మార్పును గమనించండి.
అ) మనః + శాంతి = మనశ్శాంతి
ఆ) చతుః + షష్టి = చతుషష్టి
ఇ) నభః + సుమం = నభస్సుమం
గమనిక :
పై సంధి పదాలను కలుపగా, వరుసగా మనశ్శాంతి, చతుషష్టి, నభస్సుమం – అనే రూపాలు ఏర్పడ్డాయి. అంటే విసర్గ తరువాత ‘శ, ష, స’లు ఉంటే, విసర్గలు కూడా శషసలుగా మారి ద్విత్వాలుగా తయారవుతాయి.
3. కింది పదాలను విడదీయండి.
అ) ప్రాతఃకాలము = ప్రాతస్ + కాలము – ప్రాతఃకాలము
ఆ) తపఃఫలము = తపస్ + ఫలము – తపఃఫలము
గమనిక :
పై ఉదాహరణములలో సకారము (‘స్’) విసర్గగా ప్రయోగింపబడింది.
నమస్కారము, శ్రేయస్కరము, వనస్పతి మొదలయిన మాటలలో ‘స్’ కారము విసర్గగా మారలేదు.
1) శ్రేయస్ + కరము = శ్రేయస్కరమ
2) నమస్ + కారము = నమస్కారము
3) వనస్ + పతి = వనస్పతి మొ||నవి.
4. కింది పదాలను కలిపి, మార్పును గమనించండి.
ఉదా: అంతః + ఆత్మ = అంతరాత్మ
అ) దుః + అభిమానం = దురభిమానం
ఆ) చతుః + దిశలు = చతుర్దిశలు
ఇ) ఆశీః + వాదము + ఆశీర్వాదము
ఈ) పునః + ఆగమనం + పునరాగమనం
ఉ) అంతః + మథనం = అంతర్మథనం
గమనిక:
పై విసర్గ సంధులలో 1) అంతః, 2) దుః, 3) చతుః, 4) ఆశీః, 5) పునః మొదలయిన పదాలకు, వర్గ ప్రథమ, నమః ద్వితీయాక్షరాలు, శ, ష, స లు గాక, మిగతా అక్షరాలు కలిస్తే విసర్గ రేఫ(ర్)గా మారడం గమనించండి.
5. కింది పదాలు విడదీయండి.
ఉదా:
ధనుష్కోటి = ధనుః + కోటి (ధనుస్ + కోటి)
అ) నిష్ఫలము = నిః + ఫలము (నిస్ + ఫలము)
ఆ) దుష్కరము = దుః + కరము (దుస్ + కరము)
ఇస్ (ఇః), ఉస్ (ఉః)ల విసర్గకు క, ఖ, ప, ఫ లు కలిసినప్పుడు, విసర్గ (స్) ‘ష’ కారంగా మారుతుంది.
6. కింది పదాలు విడదీయండి.
ఉదా:
నిస్తేజము = నిః + తేజము
అ) దుశ్చేష్టితము = దుః + చేష్టితము
ఆ) ధనుష్టంకారము = ధనుః + టంకారము
ఇ) మనస్తాపము = మనః + తాపము
విసర్గకు చ, ఛలు పరమైతే ‘శ’ గా, ట, ఠ లు పరమైతే ‘ష’ గా, త, థ లు పరమైతే ‘స’ గా మారుతుంది.
7. పై ఉదాహరణలన్నీ పరిశీలించిన మీదట, విసరసంధి ఆఱు విధాలుగా ఏర్పడుతున్నదని తెలుస్తున్నది.
i) అకారాంత పదాల విసర్గకు, వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు అనగా (క చట తప; ఖ, ఛ, ఠ, థ ఫ); శ, ష, సలు గాక, మిగతా అక్షరాలు కలిసినప్పుడు విసర్గ లోపించి ‘అ’ కారం ‘ఓ’ కారంగా మారుతుంది.
ii) విసర్గకు శ, ష, స లు పరమైనప్పుడు శ, ష, స లుగా మారుతుంది.
iii) విసర్గమీద క, ఖ, ప, ఫ లు వస్తే, విసరకు మార్పు రాదు (సంధి ఏర్పడదు).
iv) అంతః, దుః, చతుః, ఆశీః, పునః మొదలయిన పదాల విసర్గ, రేఫ (5) గా మారుతుంది.
v) ఇస్, ఉన్ల విసర్గకు, క, ఖ, ప, ఫలు పరమైతే, విసర్గ ‘ష’ కారంగా మారుతుంది.
vi) విసర్గకు చ, ఛలు పరమైతే ‘శ’ కారం; ట, ఠలు పరమైతే ‘ష’ కారం; త, థలు పరమైతే ‘స’ కారం వస్తాయి.
అదనపు సమాచారము
సంస్కృత సంధులు
1. సవర్ణదీర్ఘ సంధి :
1) లవణాబ్ది = లవణ + అబ్ది – సవర్ణదీర్ఘ సంధి
2) సుధాధారానుకారోక్తులు = సుధాధారా + అనుకారోక్తులు – సవర్ణదీర్ఘ సంధి
3) దేహాత్మలు = దేహా + ఆత్మలు – సవర్ణదీర్ఘ సంధి
4) శ్రీకాళహస్తీశ్వరుడు = శ్రీకాళహస్తి + ఈశ్వరుడు – సవర్ణదీర్ఘ సంధి
5) హింసారంభకుండు = హింసా + ఆరంభకుడు – సవర్ణదీర్ఘ సంధి
2. గుణ సంధి:
1) ధారానుకారోక్తులు = ధారానుకార + ఉక్తులు – గుణ సంధి
3. జశ్వ సంధి:
1) ‘సదాచారము = సత్ + ఆచారము – జశ్వ సంధి
తెలుగు సంధులు
4. అత్వ సంధులు :
1) ఇచ్చినంతలో = ఇచ్చిన + అంతలో – అత్వ సంధి
2) ఊరకుండినన్ = ఊరక + ఉండినన్ – అత్వ సంధి
3) ఇడినందునన్ = ఇడిన + అందునన్ – అత్వ సంధి
4) వఱదైన = వఱద + ఐన – అత్వ సంధి
5. ఇత్వ సంధి:
1) అదెట్లు = అది +ఎట్లు – ఇత్వ సంధి
6. ఉత్వ సంధులు:
1) ముత్యమట్లు = ముత్యము + అట్లు – ఉత్వ సంధి
2) కాదని = కాదు + అని – ఉత్వ సంధి
3) కఱవైనను = కఱవు + ఐనను – ఉత్వ సంధి
7. యడాగమ సంధులు :
1) బుద్ధి యొసంగు = బుద్ధి + ఒసంగు – యడాగమ సంధి
2) రెట్టయిడు = రెట్ట + ఇడు – యడాగమ సంధి
8. త్రిక సంధులు :
1) అమ్మహాత్ముడు = ఆ + మహాత్ముడు – త్రిక సంధి
2) ఇద్దరణిన్ = ఈ + ధరణిన్ – త్రిక సంధి
3) ఎత్తెఱంగున = ఏ + తెఱంగున – త్రిక సంధి
4) అయ్యెడన్ = ఆ + ఎడన్ – యడాగమ త్రిక సంధులు
9. గసడదవాదేశ సంధులు :
1) జాతుల్సెప్పుట = జాతుల్ + చెప్పుట – గసడదవాదేశ సంధి
2) మర్మము సెప్పకు = మర్మము + చెప్పకు – గసడదవాదేశ సంధి
3) అపకారము సేయడు = అపకారము + చేయడు – గసడదవాదేశ సంధి
4) మణిత్వము గాంచు = మణిత్వము + కాంచు – గసడదవాదేశ సంధి
10. సరళాదేశ సంధులు (ద్రుతప్రకృతిక సంధులు) :
1) శుక్తిలోఁబడి = శుక్తిలోన్ + పడి – సరళాదేశ సంధి
2) ఉత్తముఁగొల్చు = ఉత్తమున్ + కొల్చు – సరళాదేశ సంధి
3) మధుకణంబుం జిందు = మధుకణంబున్ + చిందు – సరళాదేశ సంధి
4) మూర్ఖులఁదెల్పు = మూర్ఖులన్ + తెల్పు – సరళాదేశ సంధి
5) లాలనఁజేసి = లాలనన్ + చేసి – సరళాదేశ సంధి
6) లక్ష్మిఁబొందు = లక్ష్మి న్ + పొందు – సరళాదేశ సంధి
7) కీడుఁజేయగాన్ = కీడున్ + చేయగాన్ – సరళాదేశ సంధి
8) కవ్వముఁబట్టి = కవ్వమున్ – సరళాదేశ సంధి
9) తరువగఁజొచ్చు = తరువగన్ + చొచ్చు – సరళాదేశ సంధి
11. నుగాగమ సంధి:
1) తనర్చు నా నీరము = తనర్చు + ఆ నీరము – నుగాగమ సంధి
సమాసాలు
సమాస పదం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
1) భక్త చింతామణి | భక్తులకు చింతామణి | షష్ఠీ తత్పురుష సమాసం |
2) పరహితము | పరులకు హితము | షష్ఠీ తత్పురుష సమాసం |
3) సుధాధార | సుధయొక్క ధార | షష్ఠీ తత్పురుష సమాసం |
4) మధుకణంబు | మధువు యొక్క కణము | షష్ఠీ తత్పురుష సమాసం |
5) తంతు సంతతులు | తంతువుల యొక్క సంతతులు | షష్ఠీ తత్పురుష సమాసం |
6) కరిరాజు | కరులకు రాజు | షష్ఠీ తత్పురుష సమాసం |
7) దయా పయోనిధి | దయకు పయోనిధి | షష్ఠీ తత్పురుష సమాసం |
8) స్వ భాష | తమ యొక్క భాష | షష్ఠీ తత్పురుష సమాసం |
9) కరుణాపయోనిధి | కరుణకు పయోనిధి | షష్ఠీ తత్పురుష సమాసం |
10) నళినీ దళ సంస్థితము | నళినీ దళము నందు సంస్థితము | సప్తమీ తత్పురుష సమాసం |
11) లవణాబ్ధి | లవణ సహితమైన అభి | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
12) చిక్కని పాలు | చిక్కనైన పాలు | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
13) ధర్మవర్తన | ధర్మమైన వర్తన | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
14) నీచ వాక్యములు | నీచమైన వాక్యములు | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
15) తప్త లోహము | తప్తమైన లోహము | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
16) ఉరువజ్రంబు | గొప్పదైన వజ్రంబు | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
17) పౌరుష వృత్తులు | పురుషులకు సంబంధించిన వృత్తులు | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
18) శిరీష పుష్పములు | శిరీషము అనే పేరు గల పుష్పములు | సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము |
19) దీన దేహులు | దీనమైన దేహము గలవారు | బహుప్రీహి సమాసము |
20) అనామకము | పేరు లేనిది | నజ్ బహుజొహి సమాసము |
ప్రకృతి – వికృతులు
నీరమ్ – నీరు
మౌక్తికము – ముత్తియము
రాట్టు – రేడు
వజ్రమ్ – వజ్జిరము
పుష్పమ్ – పూవు
మూర్యుడు – మొఱకు
లక్ష్మి – లచ్చి
భాష – బాస
కార్యము – కర్ణము
రూపము – రూపు
శ్రీ – సిరి
యుగము – ఉగము
భీరుకుడు – పిటికి
యుగమ్ – ఉగము
హితమ్ – ఇతము
న్యాయము – నాయము
ధర్మము – దమ్మము
కాకము – కాకి
వ్యుత్పత్యర్థాలు
1. వజ్రము : అడ్డము లేకపోవునట్టిది (వజ్రము )
2. పుష్పము : వికసించేది (పుష్పము)
3. ధరణి : విశ్వమును ధరించేది (భూమి)
4. ఈశ్వరుడు : స్వభావముచేతనే ఐశ్వర్యము కలవాడు (శివుడు)
5. భాస్కరుడు : కాంతిని కలుగజేయువాడు (సూర్యుడు)
6. పయోనిధి : దీనియందు నీరు నిలిచియుండునది (సముద్రము)
7. పయోధి : నీటికి ఆధారమైనది (సముద్రము)
పర్యాయపదాలు
1. పయోనిధి : పయోధి, జలనిధి, సముద్రము, ఉదధి.
2. లక్ష్మి : పద్మ, కమల, రమ, లచ్చి,
3. ఈశ్వరుడు : ఈశుడు, శివుడు, శంభువు, పినాకి, ముక్కంటి,
4. కరి : ఏనుగు, హస్తి, సామజము, ఇభము, దని.
5. కాకి : వాయసము, చిరజీవి, అరిష్టము.
6. నీరము : నీరు, జలము, ఉదకము.
7. పుష్పము : పూవు, ప్రసూనము, కుసుమము, సుమము, విరి.
8. ముత్యము : మౌక్తికము, పాణి, ముక్తాఫలము, ముత్తియము.
9. అబ్ది : సముద్రము, జలధి, ఉదధి, పారావారము.
10. ధరణి : భూమి, ధర, జగత్తు, జగము, క్షోణి, కాశ్యపి.
11. దేహం : శరీరము, కాయము, గాత్రము, వపువు.
12. సుధ : అమృతము, పీయూషము.
13. కఱవు : కాటకము, క్షామము.
నానార్థాలు
1. కరి : ఏనుగు, కోతి, ఎనిమిది, సాక్షి.
2. రాజు : ప్రభువు, చంద్రుడు, ఇంద్రుడు.
3. దళము : ఆకు, సేన, సగము, గుంపు.
4. ప్రభ : వెలుగు, పార్వతి, ప్రభల సంబరము, సూర్యుని భార్య.
5. సంతతి : కులము, సంతానము, పుత్ర పౌత్ర పారంపర్యము.
6. కణము : నీటిబొట్టు, బాణము, కొంచెము, నూక, కణత.
7. సుధ : అమృతము, సున్నము, ఇటుక, చెముడు మొక్క.
8. ఈశ్వరుడు : ప్రభువు, శివుడు, భర్త, భగవంతుడు.
9. లక్ష్మి : శ్రీదేవి, కలువ, పసుపు, ముత్యము, జమ్మిచెట్టు.
10. సాధనము : సాధించుట, ధనము, తపము, ఉపాయము.
11. పట్టు : గ్రహణము, అవకాశము, బంధుత్వము, పట్టుదల.
12. శ్రీ : లక్ష్మి, ఐశ్వర్యము, అలంకారము, విషము, సాలిపురుగు, ఒక రాగము.
13. యుగము : జంట, రెండు, బండికాడి, వయస్సు.
14. ద్రవ్యము : ధనము, ఇత్తడి, ఔషధము, లక్క.
కవయిత్రి, కపుల పరిచయం
1) కవి పేరు : ఏనుగు లక్ష్మణకవి
రచించిన శతకం : సుభాషిత రత్నావళి
అనువాద శతకం : ఇది సంస్కృతము నుండి తెలుగులోకి అనువదింపబడిన శతకము. భర్తృహరి మహాకవి సంస్కృత భాషలో ‘సుభాషిత త్రిశతి’ అనే పేరున మూడు శతకాలు రచించాడు. వాటినే ఏనుగు లక్ష్మణకవి ‘సుభాషిత రత్నావళి’ అనే పేరున అనువదించాడు.
కాలము : క్రీ.శ. 1720 – 1780 మధ్యకాలము.
నివాసము : ఈయన తూర్పు గోదావరి జిల్లా ‘పెద్దాడ’ గ్రామంలో నివసించారు.
ఇతర గ్రంథాలు :
1) రామేశ్వర మాహాత్మ్యం,
2) విశ్వామిత్ర చరిత్ర,
3) గంగా మాహాత్మ్యం,
4) రామవిలాసం,
అనేవి వీరి ప్రసిద్ధ రచనలు.
2) కవయిత్రి : తరిగొండ వెంగమాంబ
రచించిన శతకం : తరిగొండ నృసింహ శతకం
కాలం : ఈమె 18వ శతాబ్దానికి చెందిన కవయిత్రి.
జన్మస్థలం : చిత్తూరు జిల్లా ‘తరిగొండ’ గ్రామము.
భక్తి జీవనం : ఈమె బాల్యము నుండి భగవద్భక్తురాలు.
రచనలు : ఈమె తరిగొండ నృసింహ శతకం, శివనాటకం, ‘నారసింహ (ఊహాచిత్రం) విలాసకథ’ అనే యక్షగానాలు, ‘రాజయోగామృతం’ అనే ద్విపద కావ్యం, శ్రీ వేంకటాచల మాహాత్మ్యం, అష్టాంగ యోగసారం, వాశిష్ఠ రామాయణం అనే పద్యకావ్యాలు రచించి ప్రసిద్ధి పొందింది.
3) కవి పేరు : వడ్డాది సుబ్బారాయ కవి (వసురాయకవి)
రచించిన శతకం : భక్తచింతామణి శతకం
కాలం : 20వ శతాబ్దం
ప్రసిద్ధి : వీరు “వసురాయకవి”గా ప్రసిద్ధులు.
ఉద్యోగం : రాజమహేంద్రవరంలోని ఫస్టుగ్రేడ్ కళాశాలలో ఆంథ్రోపన్యాసకులుగా పనిచేశారు.
భక్తచింతామణి శతకం : వీరు ‘హిందూ జన సంస్కారిణి’ అనే పత్రికలో మొదట “భక్త చింతామణి” పేర 80 పద్యాలు వ్రాశారు. తరువాత దాన్ని భక్తచింతామణి శతకంగా వీరు పూర్తిచేశారు.
రచనలు : వీరి ‘వేణీ సంహారము’ నాటకానువాదము చాలా ప్రసిద్ధి పొందింది. ‘ప్రబోధ చంద్రోదయం’ అనే మరో నాటకం, నందనందన శతకం, భగవత్కీర్తనలు- అనేవి వీరి ఇతర రచనలు.
4) కవి పేరు : మారద వెంకయ్య
ఈయనను మారన వెంకయ్య’ అని, ‘మారవి’ అని కూడా కొందరు అంటారు.
రచించిన శతకం : “భాస్కర శతకము”
కాలము : క్రీ.శ. 1650 – 1600 మధ్య కాలంలో ఇతడు జీవించి ఉంటాడని విమర్శకుల అభిప్రాయం.
భాస్కర శతకం విశిష్టత : సుమతీ శతకం, వేమన శతకం తరువాత మంచి ప్రచారంలో ఉన్న నీతి శతకాలలో ‘భాస్కర శతకం’ మొదటిది. ఇందులో పద్యాలు అకారాది క్రమంలో ఉన్నాయి. దృషాంత అలంకారం ప్రయోగించడం వల్ల భావపుషికి సాయపడుతుంది. దృషాంత పూర్వక నీతిబోధ హృదయంపై చెరగని గాఢముద్ర వేస్తుంది. ‘భాస్కర శతకము’ తెలుగులో వెలసిన మొదటి దృష్టాంత శతకము.
5) కవి పేరు : కంచర్ల గోపన్న
రచించిన శతకం : ‘దాశరథీ శతకం’. ఇది ‘దాశరథీ కరుణాపయోనిధీ’ అనే మకుటంతో రచింపబడింది.
కాలము : 17వ శతాబ్దానికి చెందిన కవి.
కంచర్ల గోపన్న విశిష్టత : ఈయనకు ‘రామదాసు’ అనే పేరు ఉంది. ఈయన భద్రాచలంలో శ్రీరామునికి దేవాలయాన్ని పునరుద్ధరణ చేయించాడు. సీతారామలక్ష్మణులకూ, హనుమంతునికీ ఆభరణాలు చేయించాడు. ఈయనను తానీషా గోలకొండ కోటలో బంధించాడు. ఈయన శ్రీరామునిపై అనేక కీర్తనలు వ్రాశాడు. అవే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి పొందాయి. ఈయన శ్రీరామ భక్తాగ్రగణ్యుడు.
6) కవి పేరు : ధూర్జటి
రచించిన శతకం : ‘శ్రీకాళహస్తీశ్వర శతకం’. ఇది శ్రీకాళహస్తీశ్వరా ! అనే మకుటంతో వ్రాయబడింది.
కాలము : క్రీ.శ. 16వ శతాబ్దము వాడు. ధూర్జటి మహాకవి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజకవులలో ఒకడిగా ఉండి, అనేక సత్కారాలు పొందాడు.
ఇతర గ్రంథము : ఈయన “కాళహస్తి మాహాత్మ్యము” అనే కావ్యాన్ని ప్రబంధ శైలిలో వ్రాశాడు. ఈయన శుద్ధ శైవుడు. పరమ శివభక్తుడు. అపార మహిమగల కవి. రాజులనూ, రాజసేవనూ నిరసించాడు.
7) కవి పేరు : బద్దెన
శతకం పేరు : ‘సుమతీ శతకము’. ‘సుమతీ’ అనే మకుటంతో ఈ శతకం వ్రాయబడింది.
కాలము : 13వ శతాబ్దము
సుమతీ శతక విశిష్టత : సుమతీ శతక రచనా విధానం, లలితంగా ఉంటుంది. ఈ శతకం లలితమైన శబ్దాలతో, హృదయంగమైన శైలిలో సరళంగా ఉంటుంది. భావాలు సులభంగా పఠితుల మనస్సులకు హత్తుకొనేటట్లు ఈ శతకం ఉంటుంది. తరువాతి కాలంలో కందములలో వ్రాయబడ్డ శతకాలకు ఈ సుమతీ ‘శతకం’ ఆదర్శంగా నిలిచింది. ఆనాటి సమకాలీన ప్రజల జీవిత విధానాన్ని, వారి మనస్తత్వాన్ని బద్దెన బోధించిన నీతులు అద్దముల వలె ప్రతిఫలిస్తున్నాయి.
అవగాహన – ప్రతిస్పందన
పద్యం – 1 : కంఠస్థ పద్యం
ఉ॥ వీరము తప్తలోహమున నిల్చి యవాచకమై వశించు వా
వీరము ముత్యమట్లు వళివీదళ సంగీతమై తవర్చునా
నీరమె శక్తిలో(బడి మణిత్వము గాంచు సమంచిత ప్రభవ్
బౌరుష వృత్తులి బ్లధము మధ్యము మత్తము గొల్చువారికిన్.
– ఏనుగు లక్ష్మణకవి
ప్రతిపదార్థం :
నీరము = నీరు
తప్తలోహమునన్ = కాల్చిన ఇనుము నందు
నిల్చి = నిలబడి
అనామకమై = పేరులేనిదై
నశించున్ = నశిస్తుంది
ఆ నీరము = ఆ నీరే
నళినీదళ సంస్థితమై ; నళినీదళ = తామర ఆకునందు
సంగీతము + ఐ = ఉన్నదై
ముత్యమట్లు (ముత్యము + ఆట్లు) = ముత్యమువలె
తనర్చున్ = అలరిస్తుంది (భాసిస్తుంది)
ఆ నీరము = ఆ నీరే
శుక్తిలోఁబడి (శుక్తిలోన్ + పడి) = ముత్యపు చిప్పలో పడి (సముద్రములోని ముత్యపు చిప్పలో పడినట్లయితే)
సమంచిత ప్రభన్; సమంచిత = మిక్కిలి ఒప్పిదమైన
ప్రభన్ = ప్రకాశముతో
మణిత్వమున్ = మణియొక్క రూపమును ; (మణి యొక్క స్వభావమును)
కాంచున్ = పొందుతుంది;
అధమున్ = అధముని (నీచుని)
మధ్యమున్ = మధ్యముని
ఉత్తమున్ = ఉత్తముడిని
కొల్చువారికిన్ = సేవించేవారికి
పౌరుష వృత్తులు ; పౌరుష = పురుషునకు సంబంధించిన
వృత్తులు = నడవడులు (బ్రతుకు తెరువులు)
ఇట్లు = ఈ విధంగానే ఉంటాయి.
భావం:
కాల్చిన ఇనుము మీద నీళ్ళుపడితే, ఆవిరైపోయి, పేరు లేకుండా పోతాయి. ఆ నీళ్ళే తామరాకు పైన పడితే, ముత్యమువలె కన్పిస్తాయి. ఆ నీళ్ళే ముత్యపు చిప్పలలో పడితే, మణులవలె (ముత్యములవలె) మారతాయి. అలాగే మనిషి అధముడిని సేవిస్తే, తాను కూడా అధముడు ఔతాడు. మధ్యముడిని సేవిస్తే, మధ్యముడు ఔతాడు. ఉత్తముడిని సేవిస్తే, తాను కూడా ఉత్తముడౌతాడు.
పద్యం – 2 : కంఠస్థ పద్యం
మ॥ కరిరాజువ్ బిసతంతు సంతతులచే గట్టన్ విజృంభించు వాఁ
దురు వజ్రంబు శిరీష పుష్పములచే సహించు భేదింపఁదీ
పురచింపన్ లవణాఫ్రికన్ మధుకణంబుం ఇందు యత్నించు ని
ధరణిన్ మూర్ఖులఁ దెల్పువెవ్వడు సుధాధారామకారోక్తులన్
– ఏనుగు లక్ష్మణకవి
ప్రతిపదార్థం :
ఎవ్వడు = ఎవడు;
సుధాధారానుకారోక్తులన్; సుధాధారా = అమృత ధారలను
అనుకార = పోలునట్టి;
ఉక్తులన్ = మాటలతో
ఇద్దరణిన్ (ఈ + ధరణిన్) = ఈ భూమండలములో
మూర్చులన్ = మూర్ఖులను;
తెల్పున్ = స్పష్టపరుస్తాడో (సమాధాన పరుస్తాడో)
వాడు = వాడు
కరిరాజున్ = మదపు టేనుగును ;
బిసతంతు సంతతులచేన్ ; బిసతంతు = తామర తూడునందలి దారముల యొక్క
సంతతులచేన్ = సమూహముచే
కట్టన్ = కట్టడానికి
విజృంభించున్ = ప్రయత్నిస్తాడు
ఉరువజ్రంబున్ = గొప్ప వజ్రపుమణిని
శిరీషపుష్పములచేన్ = దిరిసెన పూవులతో
భేదింపన్ – బ్రద్దలు చేయడానికి
ఊహించున్ = ఆలోచిస్తాడు
లవణాభికిన్ (లవణ + అబ్ధికిన్) = ఉప్పు సముద్రానికి
తీపు రచింపన్ = తియ్యన చేయడానికి (తీయగా చేయడానికి)
మధుకణంబున్ = తేనె బొట్టును
చిందు యత్నించున్ = ఒలికించడానికి ప్రయత్నిస్తాడు
భావం:
మూర్ఖులను అమృతధారలవంటి మాటలతో సమాధాన పరిచేవాడూ, మదపుటేనుగును తామర తూడునందలి దారములతో బంధించాలని ఆలోచించేవాడూ, దిరిసెన పువ్వుతో వజ్రాన్ని బ్రలు చేయాలని యత్నించేవాడూ, ఒక్క తేనెబొట్టుతో ఉప్పు సముద్రపు నీటిని తియ్యగా మార్చాలనుకొనేవాడూ, సమానులు.
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
ఉత్తమ లక్షణాలు ఏవి?
జవాబు:
తల్లిదండ్రులనూ, గురువులనూ, పెద్దలను గౌరవించడం, సత్యమునే మాట్లాడడం, సకాలంలో తనకు ఉన్న పనులు చేయడం, ధర్మమార్గాన్ని పాటించడం, బీదలనూ, అనాథులనూ ఆదుకోవడం, దానధర్మాలు చేయడం, చక్కగా చదువుకోవడం, తోటివారిపై కరుణ, జాలి కలిగియుండడం, తనకున్న దానిలో కొంత ప్రక్కవారికి ఇవ్వడం, మొదలైనవి ఉత్తమ లక్షణాలు.
ప్రశ్న 2.
మీకు తెలిసిన లోహాల పేర్లు చెప్పండి.
జవాబు:
ఇనుము, వెండి, బంగారము, ఇత్తడి, కంచు, రాగి, స్టెయిన్లెస్ స్టీలు, తగరము, సీవెండి మొదలైనవి నాకు తెలిసిన కొన్ని లోహాలు.
ప్రశ్న 3.
మూర్ఖుల స్వభావం ఎలాంటిది?
జవాబు:
మూర్యుడు మొండి పట్టుదల గలవాడు. అతడికి విషయము తెలియదు. ఇతరులు చెపితే అతడు వినడు. తెలియని వాడికి చెప్పవచ్చు. తెలిసినవాడికి మరింత సులభంగా చెప్పవచ్చు. కాని మూర్ఖుడికి చెప్పడం, ఎవరికీ శక్యం కాదు. ఇసుక నుండి నూనెను తీయగలము. ఎండమావిలో నీరు త్రాగగలము. కాని మూర్ఖుడి మనస్సును మాత్రం సంతోషపెట్టలేము.
ప్రశ్న 4.
‘ధరణి’ అనే పదానికి పర్యాయపదాలు చెప్పండి.
జవాబు:
భూమి, అచల, రస, విశ్వంభర, అనన్త, స్థిర, ధర, ధరిత్రి, ధరణి, క్షోణి, కాశ్యపి, క్షితి, సర్వంసహ, వసుమతి, వసుధ, ఉర్వి, వసుంధర, పృథివి, పృథ్వి, అవని, మేదిని, మహి, ఇల, విపుల, జగతి, రత్నగర్భ, భూత ధాత్రి, కుంభిని, క్షమ, పుడమి, నేల మొదలైనవి ధరణి అనే పదానికి పర్యాయపదములు.
పద్యం – 3 : కంఠస్థ పద్యం
ఉ॥పట్టుగ నీశ్వరుండు తన పాలిట మండిపుడిచ్చినంతలో
దిట్టక దీనదేహలమ దేటగ లాలవఁ జేసి, యన్నమున్
బెట్టు వివేకి మానసముఁ బెంపావరించుచు మారకుండినన్
గుట్టుగ లక్ష్మి(బొందుఁ; దరిగొండపృసింహ! దయాపయోనిధీ!
– తరిగొండ (తరికుండ) వెంగమాంబ
ప్రతిపదార్థం :
దయాపయోనిధీ = దయకు సముద్రుడవైన వాడా ! (సముద్రమంత గొప్ప దయ కలవాడా !)
తరిగొండ నృసింహ : తరిగొండ గ్రామంలో వెలసిన ఓ నృసింహ స్వామీ!
వివేకి = వివేకము గలవాడు
ఈశ్వరుండు = భగవంతుడు
పట్టుగన్ = దృఢముగా
తన పాలిటనుండి = తన పక్షమున ఉండి
ఇపుడు = ఈ జన్మములో
ఇచ్చినంతలోన్ = తనకు ప్రసాదించిన దానిలోనే
దీనదేహులను = దరిద్రులను
తిట్టక = నిందింపక (కసురుకోక)
దేటగన్ = ఇంపుగా (ఆప్యాయంగా)
లాలనఁజేసి = (దీనులను)లాలించి (బుజ్జగించి)
అన్నమున్ = అన్నాన్ని
పెట్టున్ = పెడతాడు
మానసమున్ = తన మనస్సును (అతడు)
పెంపొనరించుచున్ (పెంపు+ఒనరించుచున్) = ఆనందింపజేసికొంటూ (సంతోషపరచుకుంటూ)
ఊరకుండినన్ (ఊరక+ఉండినన్) = (తనకు ఇమ్మని ఏమీ) అడుగకుండా ఊరకున్నప్పటికీ
గుట్టుగన్ = రహస్యంగా
లక్ష్మిన్ = ఐశ్వర్యాన్ని
పొందున్ = పొందుతాడు
భావం :
ఓ దయా సముద్రుడా ! తరిగొండ నృసింహదేవా! వివేకి అయినవాడు, తనకు భగవంతుడు ప్రసాదించిన దానిలోనే నిరుపేదలను కసరుకోక, ఆప్యాయతతో లాలిస్తూ వారికి అన్నము పెడతాడు. అతడు మనసులో ఆనందపడుతూ ఉంటే, అతడు తనకు పెట్టమని అడుగకపోయినా, లక్ష్మీదేవి రహస్యంగా అతడిని వచ్చి చేరుతుంది.
పద్యం – 4 : కంఠస్థ పద్యం
మ|| తన దేశంబు స్వభాష వైజమతమున్ ఆస్మత్సదాచారముల్
తన దేహాత్మల ఎత్తెలుంగువ పదా రావట్లు ప్రేమించి, త
దృవతావాప్తికి సాధనంబులగు సత్కార్యమ్ములన్ జేయఁగా
నమవా బుద్ధి యొసంగుమీ ప్రజకు దేవా! భక్త చింతామణి!
– వడ్డాది సుబ్బరాయకవి
ప్రతిపదార్థం :
దేవా = ఓ దైవమా !
భక్త చింతామణీ = భక్తులకు చింతామణి రత్నంవలె కోరిన కోరికలను ఇచ్చేవాడా!
తన దేహాత్మలన్; (తన దేహ + ఆత్మలన్) తన దేహ = తన శరీరాన్ని
ఆత్మలన్ = ఆత్మలను
ఎత్తెఱంగునన్ (ఏ + తెలుంగునన్) – ఏ విధంగా మనిషి ప్రేమిస్తాడో,
అట్లు = ఆ విధంగానే
తన దేశంబున్ = తన దేశాన్ని
స్వభాషన్ = తన భాషను
నైజమతమున్ = తన మతాన్ని
అస్మత్ సదాచారముల్; అస్మత్ = తన యొక్క
సదాచారముల్, (సత్ + ఆచారముల్) = మంచి ఆచారములను
సదా = ఎల్లప్పుడునూ
తాను = తాను
ప్రేమించి = ప్రేమతో చూసి
తద్ఘనతా వాప్తికిన్; (తత్ +ఘనతా+అవాప్తికిన్) తత్ = ఆ దేశము, భాష, మతము సదాచారములు అనేవి
ఘనతా = గొప్పతనమును
అవాప్తికిన్ = పొందడానికి
సాధనంబులగు = సాధనములయిన
సత్కార్యములన్ = మంచి పనులను
చేయగాన్ = చేయడానికి
అనువౌ (అనువు+ఔ) = తగినటువంటి
బుద్దిన్ = బుద్ధిని
ప్రజకున్ = దేశప్రజలకు
ఒసంగుమీ = ఇమ్ము
భావం :
భక్తుల పాలిటి చింతామణి రత్నం వంటి వాడవైన ఓ స్వామీ ! ఎవరైనా తన శరీరాన్ని, ఆత్మనూ ఏవిధంగా అభిమానిస్తూ ఉంటారో, ఆవిధంగానే తన దేశాన్ని, తన భాషనూ, తన మతాన్ని, తన మంచి ఆచారాలనూ కూడా అభిమానించే టట్లు, వాటి ఔన్నత్యానికి సాధనాలయిన మంచి పనులను చేసేటట్లూ తగిన బుద్ధిని ప్రజలకు ప్రసాదించు.
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
ఎవరిని ఆదరించాలి? లక్ష్మి ఎప్పుడు వచ్చి చేరుతుంది?
జవాబు:
దీనులనూ, అనాథలనూ, కష్టములలో ఉన్నవారినీ మనం ఆదరించాలి. దీనులను ఆదరించి, వారికి అన్నము పెడితే లక్ష్మి తనంతట తానుగా మనలను వచ్చి చేరుతుంది.
ప్రశ్న 2.
మంచి పనులకు అవసరమైన బుద్ది అనగా ఏమిటో వివరించండి.
జవాబు:
మంచి పనులకు అవసరమైన బుద్ధి, అంటే తన దేశాన్ని, తన మతాన్ని, తన భాషను, తన దేశ ప్రజలను ప్రేమించే మనస్తత్వం కలిగియుండడం. అలాగే ఇరుగుపొరుగు వారిపై జాలి, కరుణ, దయ, ఆర్థత కల్గియుండడం. ఇరుగు పొరుగు వారి కష్టసుఖాలలో తాము పాలు పంచుకోవాలి. తాను నమ్మిన దైవాన్ని పూజించాలి. తోటి ప్రజలను అన్నదమ్ములవలె అక్కాచెల్లెండ్రవలె, ఆదరించగలిగిన మనస్తత్వం ఉండాలి. ఉన్నంతలో తోటివారికి దానధర్మాలు చేయగలగాలి.
పద్యం – 5 : కంఠస్థ పద్యం
చం॥ ఉరుగుణవంతుఁ దొడ్లు తన కొండపకారము చేయునపుడుం
బరహితమే యొనర్చు వాక పట్టువ నైవను గీడుఁజేయగా
తెలుగదు; విక్కి మేకద యదెట్లనఁ గవ్వముఁబట్టి యెంతయున్
దరువగ జొచ్చినం బెరుగు తాలిమివీయదె వెన్న భాస్కరా!
– మారద వెంకయ్య
ప్రతిపదార్థం :
భాస్కరా = ఓ సూర్య భగవానుడా !
ఒడ్లు = ఇతరులు
తనకున్ = తనకు
ఒండు = ఒక
అపకారము = కీడు
చేయునప్పుడున్ = చేస్తున్నప్పుడు కూడ
ఉరుగుణవంతుడు = గొప్ప గుణములు కలవాడు
పరహితమే (పరహితము + ఏ) = ఇతరులకు మేలునే
ఒనర్చున్ = చేస్తాడు
ఒక పట్టునన్+ఐనన్ = ఒక సమయమునందైనా ఎప్పుడైనా)
కీడున్ = కీడును
చేయఁగాన్ (చేయన్+కాన్) = చేయడానికి
ఎఱుగడు = తెలియదు
నిక్కమేకద = అది నిజమే కదా !
అదెట్లనన్ (అది+ఎట్లు+అనన్) = అది ఎలాగున అంటే
కవ్వమున్ పట్టి = కవ్వమును చేతితో పట్టుకొని
ఎంతయున్ = మిక్కిలిగా (అధికంగా)
తరువగఁ జొచ్చినన్ (తరువగన్+చొచ్చినన్) = (పెరుగును) చిలుకుతున్నా
పెరుగు = పెరుగు
తాలిమిన్ = ఓర్పుతో
వెన్నన్ = వెన్నను
ఈయదె (ఈయదు +ఎ)= ఇస్తుంది కదా !
భావం :
పెరుగును మానవులు కవ్వమును చేతపట్టి ఎంతగా చిలుకుతున్నప్పటికీ అది ఓర్చుకొని చిలుకుతున్న వారికి వెన్ననే ఇస్తుంది. అలాగే గుణవంతుడు తనకు ఇతరులు కీడు చేస్తున్నప్పటికీ వారికి అపకారము చేయకుండా తాను పరోప కారమే చేస్తాడు.
పద్యం – 6 : కంఠస్థ పద్యం
చం॥ స్థిరతర ధర్మవర్తనఁ బ్రసిద్దికి వెక్కివని నొక్కము
ష్కరుఁ డతి విచవాక్యములఁ గాదని పల్కిన నమ్మహాత్ముఁడుం
గొంతవహింపఁ డయ్యెడ, వకుంఠిత పూర్ణ మధాపయోధిలో
వరుగుచుఁ గాకి రెట్ట యిడి వందున వేమి కొంత భాస్కరా!
– మారద వెంకయ్య
ప్రతిపదార్థం :
భాస్కరా = ఓ సూర్యుడా !
ఒక ముష్కరుడు = ఒక దుష్టుడు (నీచుడు)
స్థిరతర ధర్మవర్తనన్; స్థిరతర = మిక్కిలి స్థిరమైన
ధర్మవర్తనన్ = న్యాయ ప్రవర్తన చేత;
ప్రసిద్ధికి నెక్కినవానిన్ = పేరుపడిన వానిని
అతి నీచవాక్యములన్ = మిక్కిలి హీనములైన మాటల చేత
కాదని (కాదు + అని) = తిరస్కరించి
పల్కినన్ = మాట్లాడినా
అయ్యెడన్ (ఆ+ఎడన్) = ఆ సమయమందు
అమ్మహాత్ముడున్ (ఆ +మహాత్ముడున్) = ఆ గొప్పవాడును
కొఱతన్ = లోపమును
వహింపడు = పొందడు
ఎట్లనినన్ = ఎలాగునా అంటే
కాకి = కాకి
అరుగుచున్ = ఆకాశము నుండి ఎగిరివెడుతూ
అకుంఠిత పూర్ణసుధాపయోనిధిలోన్, అకుంఠిత = అడ్డులేని
పూర్ణ = నిండినదైన
సుధాపయోనిధిలోన్ = అమృతసముద్రములో
రెట్ట = మలము (పక్షిమలము)
ఇడినందునన్ = వేసినంత మాత్రముచేత
ఏమి కొఱంత – (ఆ సముద్రానికి వచ్చిన) లోపము ఏమిటి? (లోపమూ ఏమీ లేదు)
భావం:
ధర్మ ప్రవర్తనతో పేరుపొందిన మానవుడిని, ఒక నీచుడు, మిక్కిలి నీచమైన మాటలతో తిరస్కరించినంత మాత్రముచేత ఆ ధర్మాత్మునికి లోపము కలుగదు. అమృత సముద్రము మీదుగా ఎగిరివెళ్ళే కాకి ఆ సముద్రములో రెట్టవేసినంత మాత్రముచేత ఆ సముద్రమునకు ఏమియు లోపము రాదు కదా !
గమనిక : అలంకారము : దృష్టాంతాలంకారము
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
ఇతరులకు మేలు చేస్తే మనకు కలిగే ప్రయోజనమేమిటి?
జవాబు:
ఇతరులకు మేలు చేస్తే మనకు భగవంతుడు మేలు చేస్తాడు. మనవల్ల మేలు పొందినవారు మనలను అవసర సమయాల్లో తమ ప్రాణాలు అడ్డువేసి కాపాడతారు. ఒకరికొకరు సాయం చేసుకుంటే దేశ ప్రజలంతా సుఖసౌఖ్యాలలో ఓలలాడతారు.
ప్రశ్న 2.
మహాత్ముల గుణాలు ఎటువంటివి?
జవాబు:
ఇతరులు తమకు అపకారము చేసినా మహాత్ములు మాత్రం ఉపకారమే చేస్తారు. వారు ఎప్పుడూ ఇతరులకు అపకారం తలపెట్టరు. సర్వకాల సర్వావస్థల యందూ మహాత్ములు తమ ధనమాన ప్రాణాలను పరహితము కోసమే వినియోగిస్తారు. ఇతరుల నుండి మహాత్ములు ప్రత్యుపకారమును కోరుకోరు.
ప్రశ్న 3.
తాలిమి వల్ల ఉపయోగమేమిటి?
జవాబు:
తాలిమి అంటే ఓర్పు. “ఓర్పు’ కవచము వంటిది. ఓర్పు మనకు . ఉన్నట్లయితే అది మన శరీరానికి మనము ధరించిన కవచమువలె మనల్ని కాపాడుతుంది. ఓర్పు అనేది మంచి గుణం. ఓర్పు ఉన్నవారికి శత్రువులు ఉండరు.
పద్యం – 7 : కంఠస్థ పద్యం
ఉ॥ చిక్కవిపాలపై మిసిమిఁ చెందిన మీగడ పంచదారతో
మెక్కిన భంగి నీ విమల మేచకరూప సుధారసంబు నా
మక్కువ పశ్చిరంబువ సమాహిత దావ్యమనేటి దోయిటవ్
దక్కా నటంచు బుచ్చెదను దాశరథీ కరుణాపయోనిధీ !
– కంచర్ల గోపన్న
ప్రతిపదార్థం :
కరుణాపయోనిధీ = దయాసముద్రుడవైన
దాశరథీ = దశరథుని కుమారుడైన ఓ శ్రీరామచంద్రా !
చిక్కని పాలపైన్ = చిక్కనైన పాలమీద నున్న
మిసిమి చెందిన = మిసమిసలాడుతున్న
మీగడన్ = మీగడను
పంచదారతోన్ = పంచదారతో కలిపి
మెక్కిన భంగిన్ = తిన్న విధంగా; (తినే విధముగా)
నీ విమల మేచకరూప సుధారసంబున్; నీ = నీ యొక్క
విమల = అచ్చమైన
మేచక = నల్లని
రూప = ఆకారము అనే (నీలమేఘచ్ఛాయతో కూడిన రూపము అనే)
సుధారసంబున్ = అమృతరసమును;
నా = నాయొక్క
మక్కువ = ప్రేమ అనే
పళ్ళెరంబునన్ = భోజన పాత్రములో (పళ్ళెములో (కంచములో) ఉంచుకొని)
సమాహిత దాస్యము = శ్రద్ధతో కూడిన సేవ అనే
దోయిటన్ = దోసిలియందు
దక్కెను = చిక్కింది (లభించింది)
అటంచున్ = అనుకుంటూ
జుఱ్ఱెదను = జుఱ్ఱుతూ త్రాగుతాను (ఇష్టముతో తింటాను)
భావం :
దయాసముద్రుడవైన ఓ దశరథనందనా ! శ్రీరామా! చిక్కని పాలమీద మిసమిసలాడునట్టి మీగడను పంచదారతో కలిపి తిన్నవిధంగా, నీ నీలమేఘచ్ఛాయతో కూడిన రూపము అనే అమృతరసమును, ప్రేమ అనే పళ్ళెమందు ఉంచుకొని, శ్రద్ధతో కూడిన సేవ అనే దోసిలి యందు పెట్టుకొని ఇష్టంగా జుజ్జుతూ త్రాగుతాను.
పద్యం – 8 : కంఠస్థ పద్యం
శా॥ జాతుల్పిప్పుట, సేవచేయుట మృషల్ సంధించుట వ్యాయామం
బ్యాతింబొందుట, కొండిగాడవుట, పాంపారంభకుండాట, మి
ధ్యా తాత్పర్యము లాడు టన్నియుఁ బరద్రవ్యంబు వారించి, యా
శ్రీ తా నెన్ని యుగంబులుండగలదో శ్రీకాళహస్తీశ్వరా !
– ధూర్జటి
ప్రతిపదార్థం :
శ్రీకాళహస్తీశ్వరా = ఓ శ్రీకాళహస్తీశ్వరుడు అనే పేరుగల స్వామి !
జాతుల్సెప్పుట; (జాతుల్ + చెప్పుట) = జాతకములు చెప్పడం;
సేవచేయుట = రాజులకుగాని, ఇతరులకు గాని సేవలు చేయుటయు
మృషల్ సంధించుట = అసత్యములు (అబద్దాలు) కల్పించడమూ
అన్యాయాపఖ్యాతిన్; (అన్యాయ + అపఖ్యాతిన్) – అన్యాయ ప్రవర్తన ద్వారా చెడ్డ పేరును
పొందుట = పొందుటయూ
కొండెకాడవుట; (కొండెకాడు + అవుట) = చాడీలు చెప్పేవాడు కావడమూ
హింసారంభకుండౌట; (హింసా + ఆరంభకుడు + ఔట) = హింసా ప్రయత్నమునకు ఉపక్రమించుటయు
మిధ్యాతాత్పర్యములాడుట; (మిధ్యా తాత్పర్యములు+ఆడుట) = ఉన్నవీ, లేనివీ తలు మాట్లాడుటయు;
అన్నియున్ = పై చెప్పినవన్నియునూ
పరద్రవ్యంబున్ = ఇతరుల ధనమును
ఆశించి = కోరి చేయునట్టివే కదా !
ఆ శ్రీ = అలా సంపాదించిన లక్ష్మి (సంపద)
తాను = తాను
ఎన్ని యుగంబులు = ఎన్ని యుగాలపాటు
ఉండగలదో = సంపాదించిన వాడివద్ద ఉంటుందో (ఉండదుకదా!)
తాత్పర్యం :
శ్రీకాళహస్తీశ్వరా ! ప్రజలు పరధనమును కోరి, జాతకములు చెప్పడం, రాజుల సేవలు చేయడం, అన్యాయంగా అపఖ్యాతిని పొందడం, చాడీలు చెప్పడం, హింసలు చేయడం, ఉన్నవీ, లేనివీ మాట్లాడడం మొదలయిన పనులు చేస్తున్నారు. ఈ పనులన్నీ ఇతరుల ద్రవ్యాన్ని ఆశించి చేసేవే. ఆ ద్రవ్యము మాత్రము ఎన్నాళ్ళు ఉంటుంది ? తాను కూడా శాశ్వతంగా బ్రతికి యుండడు కాబట్టి ఈ చెడుపనులు చేయడం నిరర్షకం.
పద్యం – 9
క॥ వఱదైన చేను దున్నకు
కరవైనను బంధుజనుల కడ కేగకుమీ
పరులకు మర్మము పెప్పకు
పితికి దళవాయితనముఁ బెట్టకు సుమతీ!
– బద్దెన
ప్రతిపదార్థం :
సుమతీ = ఓ మంచి బుద్ధి కలవాడా !
వఱదైన; (వఱద + ఐన) = వజద వస్తే మునిగిపోయే
చేనున్ = పొలమును
దున్నకు = సేద్యానికి దున్నవద్దు
కఱవైనను; (కఱవు + ఐనను) = కఱవు వచ్చినట్లయితే
బంధుజనుల కడకున్ = చుట్టాల వద్దకు
ఏగకుమీ = వెళ్ళవద్దు
పరులకున్ = ఇతరులకు
మర్మము + చెప్పకు = (ఇంటి) రహస్యాన్ని చెప్పవద్దు
పిఱికికిన్ = పిఱికివాడికి
దళవాయితనమున్ = సైన్యాధిపత్యమును
పెట్టకు = కల్పించకు (ఇవ్వవద్దు)
భావం :
ఓ మంచిబుద్ధి కలవాడా ! వఱదలు వస్తే మునిగిపోయే పొలమును దున్నవద్దు, కణవు వచ్చినపుడు బంధువుల ఇండ్లకు వెళ్ళవద్దు. రహస్యాన్ని ఇతరులకు చెప్పవద్దు. వీటికివాడికి సేనానాయకత్వమును ఇవ్వవద్దు.
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
భగవద్దర్శనం వలన కలిగే అనుభూతులు చెప్పండి.
జవాబు:
భగవంతుడిని దర్శనం చేసుకుంటే మన మనస్సులు సంతోషంతో నిండిపోతాయి. మన మనస్సులోని దుఃఖం తొలగిపోతుంది. మన కలతలన్నీ తీరిపోతాయి. ఆనందంతో మన కన్నుల వెంట ఆనందబాష్పాలు వస్తాయి. ఆనందంతో మన మనస్సులు తేలిఆడుతాయి. మన బాధలన్నీ పోయి, మనస్సు తేలిక పడుతుంది.
ప్రశ్న 2.
జాతకాలను నమ్మవచ్చా? ఎందుకు?
జవాబు:
జాతకాలు చెప్పడం చాలా కాలంగా ఉంది. అదొక శాస్త్రము. సరైన పుట్టిన వేళ, నక్షత్రము, హోర తెలిస్తే, కొంతవఱకూ జాతకం చెప్పవచ్చు. కాని జాతకాలు అన్నీ నిజము కావు. జాతకములపై పిచ్చి పనికిరాదు. చక్కగా జ్యోతిశ్శాస్త్రం తెలిసిన పండితులు సైతమూ నేడు లేరు. కాబట్టి అదే పనిగా పెట్టిగా నేడు జాతకాలను నమ్మడం అవివేకం.
ప్రశ్న 3.
ఇంటి గుట్టు ఎవరికి, ఎందుకు చెప్పకూడదు?
జవాబు:
‘ఇంటి గుట్టు’ అంటే మన ఇంటిలోని రహస్యము. రహస్యమును ఎప్పుడూ ఇతరులకు చెప్పకూడదు. ‘ఇంటిగుట్టు లంకకు చేటు’ అన్న సామెత మనకు ఉంది. లంకాధిపతి తమ్ముడైన విభీషణుడు రాముడితో చేరి, లంకలోని రహస్యాలను రాముడికి చెప్పి రావణుడి పతనానికి కారణం అయ్యాడు. అందువల్లనే ఇంటి గుట్టును ఇతరులకు ఎప్పుడూ చెప్పరాదు.