AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

These AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ will help students prepare well for the exams.

AP Board 10th Class Biology 2nd lesson Important Questions and Answers శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

10th Class Biology 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
పులిసిన ఇడ్లీ, దోసె నుండి వాసన వస్తుంది. అందుకు కారణమైన సూక్ష్మజీవి ఏది?
జవాబు:
పులిసిన ఇడ్లీ, దోసె నుండి వాసన వస్తుంది. దీనికి కారణమైన సూక్ష్మజీవి – ఈస్ట్.

ప్రశ్న 2.
గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందడం వలన విడుదలయిన శక్తి ఏ పదార్ధ రూపంలో నిల్వ ఉంటుంది?
జవాబు:
“ATP” (అడినోసిన్ టైఫాస్ఫేట్).

ప్రశ్న 3.
క్రింది పటంలో a, b లను గుర్తించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 1
(a) మాత్రిక (b) క్రిస్టే

ప్రశ్న 4.
అవాయు మరియు వాయు సహిత శ్వాసక్రియలలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు ఏవి?
జవాబు:
వాయు సహిత శ్వాసక్రియలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు : కార్బన్ డై ఆక్సైడ్ (CO2), నీరు, శక్తి

అవాయు సహిత శ్వాసక్రియలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు : ఇథనాల్ / లాక్టిక్ ఆమ్లం, కార్బన్ డై ఆక్సైడ్, శక్తి

ప్రశ్న 5.
మానవ కండరాలలో అవాయు శ్వాసక్రియ వల్ల ఏ రసాయనం ఏర్పడుతుంది?
జవాబు:
మానవ కండరాలలో అవాయు శ్వాసక్రియ వల్ల ఏర్పడే రసాయనం : లాక్టిక్ ఆమ్లం

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 6.
అవాయు శ్వాసక్రియ ప్రయోగంలో గ్లూకోజ్ ద్రావణానికి డయాజీన్ గ్రీన్ ద్రావణాన్ని ఎందుకు కలుపుతారు?
జవాబు:
గ్లూకోజ్ ద్రావణములో ఆక్సిజన్ వుందో, లేదో తెలుసుకొనుటకు ఉపయోగిస్తారు.

ప్రశ్న 7.
బొమ్మ దేనిని గురించి తెలుపుతుంది?
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 2
జవాబు:
వాయుగత వేళ్ళు / శ్వాస వేళ్ళు / నిమాటోపోర్స్ / మడ చెట్టు వేళ్ళు / మాంగ్రూవ్ చెట్టు వేళ్ళు

ప్రశ్న 8.
శ్వాసక్రియ అనగానేమి?
జవాబు:
ఆహార పదార్థాలను ఆక్సీకరణం చెందించి శక్తిని వెలువరించే ప్రక్రియను శ్వాసక్రియ అంటారు.

శ్వాసక్రియ Respiration అనే పదం Respire అనే లాటిన్ పదం నుండి ఏర్పడింది. దీని అర్థం ‘పీల్చడం’ అయితే , శ్వాసక్రియ ఉచ్ఛ్వాస, నిశ్వాసలనే కాకుండా కణాలలో ఆక్సిజన్ వినియోగించబడటం వరకు ఉండే అన్ని దశలను కలిపి సూచిస్తుంది.
C6H12O6 + 6O2 → 6CO2 + 6H2O + 686 K.Cal

ప్రశ్న 9.
ఊపిరితిత్తులలోని శ్వాస కదలికకు తోడ్పడే నిర్మాణాలు ఏమిటి?
జవాబు:
ఊపిరితిత్తులు తమంతటతాముగా గాలిని లోపలకు తీసుకోవడంగాని, బయటకు పంపడంగాని చేయలేవు. ఛాతీ కండరాలు మరియు ఉరఃకుహరాన్ని, ఉదరకుహరాన్ని వేరుచేసే కండరయుతమైన ఉదరవితానం (diaphragm) అనే పొర ఊపిరితిత్తులలోనికి గాలి రావడానికి, బయటకు పోవడానికి సహాయపడతాయి.

ప్రశ్న 10.
మానవ ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత?
జవాబు:
మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం 5800 మిల్లీ లీటర్లు. విశ్రాంతి దశలో మనం సుమారుగా 500 మి.లీ గాలిని లోపలకు తీసుకుని బయటకు వదులుతాం. మనం పూర్తిగా ఊపిరితిత్తులలోని గాలిని బయటకు పంపినప్పటికీ ఇంకా 1200 మి.లీ. వాయువు ఊపిరితిత్తులలో మిగిలే ఉంటుంది.

ప్రశ్న 11.
కణశ్వాసక్రియ అనగానేమి?
జవాబు:
శరీరంలోని జరిగే వివిధ జీవక్రియలకు అవసరమైన శక్తిని ఆహార పదార్థాలలో గల రసాయన బంధాలను విడగొట్టడం ద్వారా విడుదల చేసే వివిధ రసాయన చర్యల సమాహారాన్ని కణశాస్వక్రియ (Cellular respiration) అంటారు. ఇది కణస్థాయిలో జరుగుతుంది.

ప్రశ్న 12.
చర్మీయ శ్వాసక్రియ అనగానేమి? అది ఏ జీవులలో జరుగుతుంది?
జవాబు:
చర్మం ద్వారా జరిగే వాయు మార్పిడిని చర్మీయ శ్వాసక్రియ అంటారు. ఉదా : కప్ప, వానపాము, జలగ

ప్రశ్న 13.
స్థిరమైన వాయువు అని దేనికి పేరు? దీనిని ఎలా గుర్తిస్తారు?
జవాబు:
స్థిరవాయువు :
కార్బన్ డై ఆక్సైడ్ ను స్థిరమైన వాయువు లేదా బొగ్గుపులుసు వాయువు అంటారు. సున్నపు తేటను తెల్లగా మార్చే గుణం ఆధారంగా CO2 ను గుర్తిస్తారు.

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 14.
ఖర్చు అయ్యే వాయువు అని దేనికి పేరు?
జవాబు:
పదార్థాలు మండించినపుడు, జీవులు శ్వాసించినపుడు ఈ వాయువు ఖర్చు అయ్యేది. కనుక ఆక్సిజన్ ను ఖర్చు అయ్యే వాయువు (Vitiated air) అని భావించారు.

ప్రశ్న 15.
శ్వాసక్రియలోని రకాలు ఏమిటి?
జవాబు:
శ్వాసక్రియలోని రకాలు : శ్వాసక్రియ ప్రధానంగా రెండు రకాలు. అవి:

  1. అవాయు శ్వాసక్రియ
  2. వాయుసహిత శ్వాసక్రియ.

ప్రశ్న 16.
శ్వాసక్రియలోని దశలు ఏమిటి?
జవాబు:
శ్వాసక్రియ దశలను రెండు రకాలుగా విభజిస్తారు. అవి:

  1. బాహ్య శ్వాసక్రియ
  2. అంతర శ్వాసక్రియ.

బాహ్య శ్వాసక్రియలో ఎ) ఉచ్ఛ్వాసం బి) నిశ్వాసం అనే దశలు ఉంటాయి. అంతర శ్వాసక్రియలో ఎ) గ్లైకాలసిస్ బి) క్రెట్స్ వలయం/కిణ్వణం అనే దశలు ఉంటాయి.

ప్రశ్న 17.
మానవుని శ్వాసవ్యవస్థలో గాలి ప్రసరణ మార్గాన్ని చూపించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 3

ప్రశ్న 18.
ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు ఏమిటి?
జవాబు:
వాయుగోణులు ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు.

ప్రశ్న 19.
ఊపిరితిత్తుల యొక్క ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
మన శరీర అవయవాలలో నీటిపైన తేలే ఒక అవయవం ఊపిరితిత్తులు. ఇవి బెలూన్ లాగా వ్యాకోచించే సామర్థ్యంతో 1200 మి.లీ వాయువును ఎప్పుడూ కలిగి ఉంటాయి. వీటి పూర్తి సామర్థ్యం 5900 మి.లీ.

ప్రశ్న 20.
శ్వాస కదలికలో తోడ్పడే నిర్మాణాలు ఏమిటి?
జవాబు:
పురుషుల శ్వాసకదలికలో ఉదరవితానం, స్త్రీల శ్వాసకదలికలో ప్రక్కటెముకలు ప్రముఖపాత్రను వహిస్తాయి.

ప్రశ్న 21.
ఊపిరితిత్తులు ఎలా రక్షించబడతాయి?
జవాబు:
ఊపిరితిత్తులకు చుట్టూ ప్లూరా అనే రెండు పొరలు ఉంటాయి. ఈ రెండు పొరల మధ్య ఉన్న ద్రవం ఊపిరితిత్తులను అఘాతాల నుండి కాపాడుతుంది.

ప్రశ్న 22.
కణ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది?
జవాబు:
కేంద్రక పూర్వజీవులైన బాక్టీరియాలలో కణ శ్వాసక్రియ కణద్రవ్యం (Cytoplasm) లో జరుగుతుంది. నిజకేంద్రక జీవులలో శ్వాసక్రియలోని కొంతభాగం (గ్లైకాలసిస్) కణద్రవ్యంలోనూ, మరికొంతభాగం (క్రెట్స్ వలయం) మైటోకాండ్రియాలో జరుగుతుంది.

ప్రశ్న 23.
కణశక్త్యాగారాలు అని వేటికి పేరు?
జవాబు:
శ్వాసక్రియలో శక్తి మైటోకాండ్రియాలలో వెలువడుతుంది. అందువలన మైటోకాండ్రియాలను “కణశక్త్యాగారాలు” అంటారు.

ప్రశ్న 24.
అవాయు శ్వాసక్రియ అంత్య ఉత్పన్నాలు ఏమిటి?
జవాబు:
అవాయు శ్వాసక్రియలో లాక్టిక్ ఆమ్లం / ఇథనాల్, CO2, శక్తి వెలువడతాయి.

ప్రశ్న 25.
శ్వాసక్రియకు, దహన క్రియకు గల పోలికలు ఏమిటి?
జవాబు:

  1. శ్వాసక్రియ మరియు దహనక్రియ రెండూ ఆక్సీకరణ చర్యలు.
  2. ఈ రెండు క్రియలలో శక్తి వెలువడుతుంది.

ప్రశ్న 26.
వాయునాళ శ్వాసక్రియ ఏ జీవులలో ఉంటుంది?
జవాబు:
ఆర్రోపొడ వర్గానికి చెందిన కీటకాలు వాయునాళ వ్యవస్థ ద్వారా శోషిస్తాయి.
ఉదా : బొద్దింక, మిడతలు

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 27.
జల శ్వాసక్రియ అనగానేమి?
జవాబు:
కొన్ని జలచర జీవులు మొప్పల ద్వారా శోషిస్తాయి. ఈ శ్వాసక్రియను “మొప్పల శ్వాసక్రియ లేదా జలశ్వాసక్రియ” అంటారు.
ఉదా : చేప

ప్రశ్న 28.
చర్మీయ శ్వాసక్రియ అనగానేమి?
జవాబు:
చర్మం ద్వారా జరిగే శ్వాసక్రియను “చర్మీయ శ్వాసక్రియ” అంటారు.
ఉదా : వానపాము, జలగ

ప్రశ్న 29.
శ్వాసవేర్లు ఏ మొక్కలలో ఉంటాయి?
జవాబు:
బురద నేలలలో పెరిగే మొక్కలు, మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థలోని మొక్కలు శ్వాసవేర్లు కలిగి ఉంటాయి.

ప్రశ్న 30.
లెంటిసెల్స్ అనగానేమి?
జవాబు:
కాండం మీద ఉన్న పత్రరంధ్రాలను “లెంటిసెల్స్” అంటారు. ఇవి వాయు వినిమయానికి తోడ్పడతాయి.

ప్రశ్న 31.
జీవక్రియలు అనగానేమి?
జవాబు:
జీవ కణాలలో జరిగే రసాయనిక చర్యలను “జీవక్రియలు” అంటారు.
ఉదా : శ్వాసక్రియ, జీర్ణక్రియ.

ప్రశ్న 32.
ఆక్సిజన్ సహిత రక్తం, ఆక్సిజన్ రహిత రక్తం కంటే ఎలా భిన్నంగా ఉంటుంది?
జవాబు:
ఆక్సిజన్ సహిత రక్తం, ప్రకాశవంతమైన ఎరుపురంగులో ఉండి ఆక్సిజన్ రహిత రక్తం కంటే భిన్నంగా ఉంటుంది.

ప్రశ్న 33.
రక్తంలోని ఏ పదార్థం వాయు రవాణాలో పాల్గొంటుంది?
జవాబు:
రక్తంలోని ‘హిమోగ్లోబిన్’ O2 ను CO2 ను రవాణా చేస్తుంది. ఆక్సిజన్ తో కలిసినపుడు ఆక్సీహిమోగ్లోబినను, CO2 తో కలిసినపుడు కార్బాక్సీహిమోగ్లోబిన్ ను ఏర్పరుస్తుంది.

ప్రశ్న 34.
శ్వాసక్రియలో ఏర్పడే పదార్థాలు ఏమిటి?
జవాబు:
శ్వాసక్రియలో ఏర్పడే పదార్థాలు :
శ్వాసక్రియలో CO2 నీరు, శక్తి విడుదల అవుతాయి.

ప్రశ్న 35.
క్రీడాకారులు ఎక్కువ దూరం ఎలా పరిగెత్తగల్గుతారు?
జవాబు:
ఎక్కువ దూరం పరిగెత్తే క్రీడాకారులు నిరంతరం శ్వాసిస్తూ ఉండటం వలన వీరు పరిగెత్తే సమయంలోనే కొంత లాక్టిక్ ఆమ్లం తొలగించబడటం వలన ఎక్కువ సమయం అలసిపోకుండా పరిగెత్తగల్గుతారు.

ప్రశ్న 36.
ఎక్కువ శ్రమచేసినపుడు కండరాలు ఎందుకు నొప్పి పెడతాయి?
జవాబు:
శారీరక శ్రమ సమయంలో తగినంత ఆక్సిజన్’ లభ్యత లేనప్పుడు కండరాలు అవాయు పద్దతిలో శ్వాసిస్తాయి. అందువలన కండరాలలో లాక్టిక్ ఆమ్లం ఏర్పడి నొప్పి కలుగుతుంది.

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 37.
దహనం, శ్వాసక్రియ దాదాపుగా ఒకే విధమైన చర్యలు అనవచ్చా? దీనికి నీకున్న ఆధారాలు ఏమిటి?
జవాబు:

  1. దహనం మరియు శ్వాసక్రియనందు చక్కెర అయిన గ్లూకోజు కార్బన్ డై ఆక్సైడ్ మరియు నీరుగా మారుతుంది.
  2. రెండు క్రియలకు ఆక్సిజన్ తప్పనిసరిగా అవసరం.
  3. శ్వాసక్రియ, దహనం రెండూ శక్తిని విడుదల చేసే ప్రక్రియలు.

10th Class Biology 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
a) ఈ ప్రయోగంలో సున్నపుతేటను పాలవలె మార్చే వాయువు ఏది ?
జవాబు:
బొగ్గుపులుసు వాయువు లేదా CO2.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 4

b) మన చుట్టూ ఉన్న గాలితో పోల్చినపుడు మనం బయటకు వదిలే గాలిలో ఏ వాయువు తక్కువ పరిమాణంలో ఉంది?
జవాబు:
ఆక్సిజన్ లేదా ఆమ్లజని లేదా O2.

ప్రశ్న 2.
మానవులలో ఉపజిహ్విక లేకపోతే ఏమి జరగవచ్చు?
జవాబు:

  1. కంఠబిలం ద్వారా స్వర పేటికలోనికి ఆహారం ప్రవేశిస్తుంది.
  2. ఊపిరితిత్తులలోనికి ఆహారం ప్రవేశిస్తుంది. దాని వల్ల ప్రాణాపాయం కలుగుతుంది. 3) సరిగ్గా మాట్లాడలేము.
  3. గాలి, ఆహార మార్గాల నియంత్రణ సరిగ్గా జరగదు.

ప్రశ్న 3.
మొక్కలు పగలు కిరణజన్య సంయోగక్రియను జరుపుతాయి. రాత్రి శ్వాసక్రియను జరుపుతాయి అని బాలు చెప్పాడు. అతనితో నీవు ఏకీభవిస్తావా, లేదా ? ఎందుకు ?
జవాబు:

  1. నేను, బాలు అభిప్రాయంతో ఏకీభవించటం లేదు.
  2. ఎందుకంటే కిరణజన్య సంయోగక్రియ జరుగుటకు కాంతిశక్తి అవసరం అవుతుంది. కాని, శ్వాసక్రియ కాంతి మీద ఆధారపడదు.
  3. కావున కిరణజన్య సంయోగక్రియ పగటిపూట మాత్రమే జరుగుతుంది. శ్వాసక్రియ పగలు, రాత్రి కూడా జరుగుతుంది.

ప్రశ్న 4.
నీవు ఊపిరితిత్తుల వ్యాధుల నిపుణుడిని కలిసినప్పుడు శ్వాస సంబంధ వ్యాధుల గురించి ఎటువంటి ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:

  1. శ్వాస సంబంధ వ్యాధుల లక్షణాలను తెల్పండి.
  2. శ్వాస సంబంధ వ్యాధుల నుండి రక్షించుకొనుటకు నేను ఏ జాగ్రత్తలు పాటించాలి?
  3. పొగత్రాగడం ఊపిరితిత్తులకు ఏ విధంగా హానిచేస్తుంది?
  4. సాధారణంగా మానవులకు కలిగే శ్వాససంబంధిత వ్యాధులు ఏవి?

ప్రశ్న 5.
అవాయు శ్వాసక్రియలో ఉష్ణం, కార్బన్ డై ఆక్సైడ్ వెలువడునని నిరూపించే ప్రయోగానికి అవసరమైన రెండు రసాయనాలు, రెండు పరికరాలను రాయండి.
జవాబు:
రసాయనాలు :
1. గ్లూకోజ్ ద్రావణం, 2. పారాఫిన్ ద్రావణం, 3. డయాజీన్ గ్రీన్ (జానస్ గ్రీన్ బి), 4. సున్నపు నీరు/ బైకార్బొనేట్ ద్రావణం / సూచికా ద్రావణం

పరికరాలు :
1. థర్మామీటర్, 2. ప్లాస్క్ (సీసా), 3. పరీక్ష నాళిక, 4. రబ్బరు బిరడాలు, 5. డెలివరీ గొట్టము

ప్రశ్న 6.
ఊపిరితిత్తులలోని వాయుగోణుల పరిమాణం ఎంత?
జవాబు:
ఊపిరితిత్తుల లోపలి భాగం లక్షల సంఖ్యలో ఉండే వాయుకోశ గోణులను కలిగి ఉండి, వాయుమార్పిడి జరిగే వైశాల్యాన్ని పెంచుతుంది. ఊపిరితిత్తులలోని లోపలి పొర ఎక్కువగా ముడుతలుపడి ఉండడం వలన వాటి వైశాల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఊపిరితిత్తులలోని వాయుకోశ గోణులన్నింటినీ విడదీసి పరిస్తే దాదాపు 160 చదరపు మీటర్లు (ఒక టెన్నిస్ కోర్టు) వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి.

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 7.
ఉపజిహ్విక అనగానేమి? దాని ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:

  1. గ్రసనిలో కంఠబిలంపై ఉండే మూత వంటి నిర్మాణాన్ని ఉపజిహ్విక అంటారు. ఇది గ్రసనిలో ఉంటుంది.
  2. స్వరపేటికలోనికి ఆహారం పోకుండా ఉపజిహ్విక ఆహారం వాయువుల కదలికను క్రమబద్ధీకరిస్తుంది.
  3. ఉపజిహ్విక అనే కవాటం మనం ఆహారాన్ని మ్రింగే సమయంలో పాక్షికంగా కంఠబిలాన్ని’ మూసి ఉంచి ఆహారం శ్వాసవ్యవస్థలోనికి ప్రవేశించకుండా గొంతులోనికి పోయే విధంగా దారి మళ్ళిస్తుంది.
  4. మనం శ్వాసించే సమయంలో ఉపజిహ్విక పూర్తిగా తెరుచుకొని గాలి శ్వాసమార్గం ద్వారా ఊపిరితిత్తులలోనికి ప్రవేశిస్తుంది.
  5. ఉపజిహ్విక సక్రమంగా పనిచేస్తూ వాయు, ఆహార మార్గాల ద్వారా గాలి ఆహార కదలికను సక్రమంగా అమలు చేయడానికి నాడీ నియంత్రణ చాలా అవసరం.

ప్రశ్న 8.
ఉచ్ఛ్వాసం, నిశ్వాసంలలో ఉదరవితానం పాత్ర ఏమిటి?
జవాబు:
ఉరఃకుహరాన్ని ఒక గదిగా ఊహించుకుంటే ఉదరవితానం ఆ గది కింది భాగం అవుతుంది. ఉదరవితానం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు గొడుగు ఆకారంలో ఉంటుంది. గొడుగు ఉబ్బెత్తు భాగం ఉరఃకుహరం వైపునకు ఉంటుంది. ఉదరవితాన కండరాలు సంకోచించినపుడు అది చదునుగా తయారై ఉబ్బెత్తు భాగం కిందకు వస్తుంది. దీని వలన ఉరఃకుహర ఘనపరిమాణం పెరుగుతుంది.

ఉరఃకుహరం ఘనపరిమాణం పెరిగినపుడు, దాని లోపలి పీడనం తగ్గి గాలి బయటి నుండి నాసికారంధ్రాల ద్వారా ఊపిరితిత్తులలోనికి ప్రవేశిస్తుంది. దీనినే “ఉచ్ఛ్వాసం” అంటారు.

తరువాత దీనికి విపర్యం (వ్యతిరేకంగా) జరుగుతుంది. ఛాతి యథాస్థానానికి చేరుకుంటుంది. ఉదరవితాన కండరాలు విశ్రాంతి దశకు చేరుకోవడం వల్ల తిరిగి గొడుగు ఆకారానికి వస్తుంది. ఉరఃకుహరంలో ఒత్తిడి పెరుగుతుంది. ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరగడం వలన లోపలి గాలి వాయుమార్గం ద్వారా బయటకు వెళుతుంది. దీనినే “నిశ్వాసం” అంటారు.

ప్రశ్న 9.
ఊపిరితిత్తుల గురించి రాయండి.
జవాబు:
మన ఊపిరితిత్తులు ‘స్పాంజి’లాగా ఉంటాయి. ఇవి రెండూ ఒకే పరిమాణంలో ఉండవు. ఉరఃకుహరంలో ఎడమవైపు గుండె ఉండటం వలన ఆ వైపున ఉన్న ఊపిరితిత్తి కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఊపిరితిత్తులను కప్పుతూ ‘ఫ్లూరా’ అనే రెండు పొరలుంటాయి. ఈ పొరల మధ్యలో ద్రవం ఉండి ఊపిరితిత్తులను ఆఘాతాల నుండి కాపాడుతుంది. ఊపిరితిత్తులు గాలితో నిండేటప్పుడు, యథాస్థితికి వచ్చేటప్పుడు జరిగే ఘర్షణ నుండి కాపాడుతుంది.

ప్రశ్న 10.
శ్వాసక్రియ రేటును ప్రభావితం చేసే కారకాలు ఏమిటి?
జవాబు:
మనం విశ్రాంతి తీసుకునే సమయంలో మన శ్వాస నెమ్మదిగాను, తక్కువ (Shallow) ఒత్తిడితోను జరుగుతుంది. పరిగెత్తడం, వ్యాయామం చేయడం వంటి పనులుచేసే సమయంలో వేగంగాను, గాఢంగాను (ఎక్కువ ఒత్తిడితో) జరుగుతుంది. నిజానికి ఉచ్ఛ్వాస, నిశ్వాస పద్ధతులు విస్తృతమైన తారతమ్యాన్ని చూపుతాయి. భయపడినపుడు, ఆందోళనగా ఉన్నప్పుడు శ్వాసక్రియ రేటు పెరగటం మనకు అనుభవమే.

ప్రశ్న 11.
మైటోకాండ్రియాను కణశక్త్యాగారాలు అంటారు. ఎందుకు?
జవాబు:

  1. కేంద్రక పూర్వజీవులైన బాక్టీరియాలలో కణ శ్వాసక్రియ కణ ద్రవ్యం (cytoplasm) లో జరుగుతుంది.
  2. నిజకేంద్రక జీవులలో శ్వాసక్రియలోని కొంత భాగం కణద్రవ్యంలోను, మరికొంత భాగం మైటోకాండ్రియాలోను జరుగుతుంది.
  3. ఈ చర్యలో విడుదలైన శక్తి ఎ.టి.పి రూపంలో నిల్వ ఉంటుంది.
  4. అందువల్ల మైటోకాండ్రియాలను కణశక్యాగారాలు (Power houses of energy) అంటారు.

ప్రశ్న 12.
ఎనర్జీ కరెన్సీ అనగానేమి? దాని శక్తి విలువ ఎంత?
జవాబు:
1) ఎనర్జీ కరెన్సీ :
గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందడం వల్ల విడుదలైన శక్తి అడినోసిన్ ట్రై ఫాస్ఫేట్ (ATP) అనే ప్రత్యేక పదార్థ రూపంలో నిల్వ ఉంటుంది. ఇది చిన్న మొత్తాల్లో ఉండే రసాయన శక్తి. దీనికి కణం యొక్క ‘ఎనర్జీ కరెన్సీ’ అంటారు.

2) ఇలా నిల్వ ఉన్న శక్తి కణంలో అవసరమైన చోటికి రవాణా అవుతుంది. ప్రతి ATPలో 67200 కాలరీల శక్తి నిల్వ ఉంటుంది. ఈ శక్తి ఫాస్ఫేట్ బంధాల రూపంలో నిల్వ ఉంటుంది. ఈ బంధాలు విడిపోయినపుడు శక్తి విడుదలవుతుంది.

ప్రశ్న 13.
గ్లూకోజ్ నుండి శక్తి ఎలా విడుదలవుతుంది?
జవాబు:
మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులన్నింటిలో శక్తి విడుదల కొరకు సాధారణంగా వినియోగించబడే పదార్థం గ్లూకోజ్. అన్ని జీవులలోను గ్లూకోజ్ రెండు దశలలో ఆక్సీకరింపబడుతుంది. మొదటి దశలో గ్లూకోజ్ రెండు పైరూవిక్ ఆమ్ల అణువులుగా విడగొట్టబడుతుంది. రెండవ దశలో ఆక్సిజన్ లభ్యమైనట్లయితే పైరూవిక్ ఆమ్లం కార్బన్ డై ఆక్సైడ్, నీరుగా ఆక్సీకరింపబడుతుంది. దీనితో పాటు ఎక్కువ పరిమాణంలో శక్తి విడుదలవుతుంది.

ప్రశ్న 14.
ఆక్సిజన్ లోటు అనగానేమి? అది ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
మనం శారీరక శ్రమ ఎక్కువగా చేసినపుడు కణాలలో శక్తి కొరకు అవాయు శ్వాసక్రియ రేటు పెరుగుతుంది. ఫలితంగా కండరాలలో లాక్టిక్ ఆమ్లం పేరుకుపోయి కండరాలు అలసటకు లోనౌతాయి. తిరిగి కండరాలు సాధారణ స్థితికి రావటానికి లాక్టిక్ ఆమ్లం తొలిగించవలసిన అవసరం ఉంది. దీని కొరకు కండరాలకు ఆక్సిజన్ కావాలి. కండరాలు ఆక్సిజనన్ను కోరుకునే ఈ స్థితిని ‘ఆక్సిజన్ లోటు’ అంటారు.

ప్రశ్న 15.
చక్కెర ద్రావణం నుండి ఇథనాల్ ఎలా తయారుచేస్తారు?
జవాబు:
చక్కెర ద్రావణం, ఈ మిశ్రమాన్ని కదిలించకుండా, ఆక్సిజన్ లభ్యం కాకుండా ఉంచితే, కొంచెం సేపటి తరువాత దాని నుండి ఒక ప్రత్యేకమైన వాసన వస్తుంది. దీనికి కారణం ఈస్ట్ చక్కెర ద్రావణాన్ని ఉపయోగించుకొని తయారుచేసిన ఇథనాల్ అనే కొత్త పదార్థం. చక్కెర ఈస్ట్ ద్రావణం నుండి అంశిక స్వేదనం (Fractional distillation) అనే ప్రక్రియ ద్వారా ఇథనాలను వేరుచేయవచ్చు. చక్కెర ద్రావణం కంటే ఇథనాల్ తక్కువ ఉష్ణోగ్రత (70°C) వద్దనే మరగడం వలన ఇది సాధ్యమవుతుంది.

ప్రశ్న 16.
ఎక్కువ శారీరక శ్రమ చేసినపుడు, మనం అలసిపోతాం. ఎందుకు?
జవాబు:
పరుగెత్తడం వంటి ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనులు చేయడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. కాబట్టి శ్వాసక్రియరేటు కూడా పెరుగుతుంది. అయితే వెలువడే ఉష్ణం పరిమాణం కూడా పెరుగుతుందన్నమాట. అందువలననే మనకు శరీరం నుండి ఆవిరి వస్తున్న భావన కలుగుతుంది.

శారీరక శ్రమ సమయంలో తగినంత ఆక్సిజన్ లభ్యత లేనపుడు కండరాలు అవాయు పద్ధతిలో శ్వాసిస్తాయి. అందువలన ‘లాక్టిక్ ఆమ్లం’ విడుదలవుతుంది. ఇలా ఏర్పడిన లాక్టిక్ ఆమ్లం కండరంలో పేరుకొనిపోయినపుడు కండరాలలో నొప్పి కలుగుతుంది. ఈ నొప్పి మనకు అలసిన అనుభూతిని కలిగిస్తుంది. కొంత విశ్రాంతి తరువాత తిరిగి మనం సాధారణ స్థితికి వస్తాం.

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 17.
శరీర కుడ్యం ద్వారా శ్వాసించే జీవులు ఏవి?
జవాబు:
అమీబా వంటి ఏక కణజీవులు, హైడ్రా, ప్లనేరియన్లు, గుండ్రటి పురుగులు, వానపాములు వంటి బహుకణ జీవులు శరీర కుడ్యం ద్వారా వ్యాపన పద్ధతిలో ఆక్సిజన్‌ను గ్రహించడం, కార్బన్ డై ఆక్సైడ్ ను విడుదల చేయడం నిర్వహిస్తాయి.

ప్రశ్న 18.
వాయునాళ వ్యవస్థ గురించి రాయండి.
జవాబు:
బొద్దింక, మిడతల వంటి కీటకాల్లో వాయునాళ వ్యవస్థ ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. వాయునాళ వ్యవస్థలో వాయునాళాలు అనే గొట్టాలు శరీరమంతటా అమర్చబడి ఉంటాయి. వాయునాళాలు, వాయునాళికలుగా చీలి కణాలకు ఆక్సిజన్‌ను నేరుగా అందిస్తాయి.

ప్రశ్న 19.
మొసలి, డాల్ఫిన్ వంటి జలచరాలు ఏ విధంగా శ్వాసిస్తాయి?
జవాబు:
మొసలి, డాల్సిన్ వంటి జలచరాలు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తాయి. కావున ఇవి గాలి కోసం తరచుగా నీటి నుండి బయటకు వస్తుంటాయి. మొసలి, డాల్ఫిన్స్ ఒకప్పుడు భూచర జీవనం గడిపి, తిరిగి నీటి ఆవాసాలలోనికి వెళ్ళటం వలన అనుకూలనాలను అభివృద్ధి చేసుకొన్నాయి. భూచర జీవులు కొన్ని తిరిగి జలావాసాలలోనికి ప్రవేశించాయనటానికి ఈ జీవులు నిదర్శనాలు.

ప్రశ్న 20.
మొక్కలలో శ్వాసక్రియకు తోడ్పడే నిర్మాణాలు ఏమిటి?
జవాబు:

  1. మొక్కలలో పత్రాలలో ఉండే పత్రరంధ్రాల ద్వారా వాయు వినిమయం జరుగుతుంది.
  2. పత్రరంధ్రాలతోపాటుగా ఇంకా కొన్ని భాగాలు వాయు వినిమయం జరుపుతాయి.
  3. వేర్ల ఉపరితలం కాండం మీద ఉండే ‘లెంటిసెల్స్’ కణవాయు వినిమయంలో పాల్గొంటాయి.
  4. మడ అడవులుగా పిలువబడే మాంగ్రూవ్ మొక్కలలో శ్వాసక్రియ కోసం ‘శ్వాసవేళ్ళు’ (Aerial roots) అనే ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. ఆర్కిడ్ జాతి మొక్కలలో శ్వాసక్రియ కోసం ప్రత్యేక కణజాలం ఉంటుంది.

ప్రశ్న 21.
శ్వాసక్రియలోని రకాలు ఏమిటి?
జవాబు:
ఆక్సిజన్ ప్రమేయం బట్టి శ్వాసక్రియ రెండు రకాలు. అవి:
1. వాయుసహిత శ్వాసక్రియ :
పెద్దజీవులలో జరుగుతుంది. అధిక శక్తి వెలువడును. గ్లైకాలసిస్, క్రెట్స్ వలయం అనే దశలు ఉంటాయి.

2. అవాయు శ్వాసక్రియ :
ఆక్సిజన్ అవసరం ఉండదు. తక్కువ శక్తి వెలువడుతుంది. గ్లైకాలసిస్, కిణ్వణం అనే దశలు ఉంటాయి.

ప్రశ్న 22.
ప్రక్క పటాన్ని పరిశీలించండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 5
అ) ఈ పటం ఏ జీవ వ్యవస్థకు సంబంధించినది?
ఆ) A, B భాగాల పేర్లు రాయండి.
ఇ) అవి ఏయే వ్యవస్థలతో అనుసంధానమై ఉంటాయి?
ఈ) ఇక్కడ జరిగే ప్రక్రియ ఏమిటి? దాని ఫలితంగా ఏమి జరుగుతుంది?
జవాబు:
అ) శ్వా సవ్యవస్థ
ఆ) A. వాయుగోణి B. రక్తకేశనాళికల వల
ఇ) శ్వాసవ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ
ఈ) ఇక్కడ జరిగే ప్రక్రియ వాయు వినిమయం. ఊపిరితిత్తులందలి వాయుగోణులు మరియు రక్తకేశనాళికల మధ్య వాయు వినిమయం జరుగుతుంది. దీనివలన రక్తకేశనాళికలందలి కార్బన్ డై ఆక్సెడ్ వాయుగోణిలోనికి, వాయుగోణి నందలి ఆక్సిజన్ రక్తకేశనాళికలలోనికి ప్రవేశించును.

ప్రశ్న 23.
నాసికా రంధ్రాల నుండి వాయుగోణుల వరకు ఉండే మార్గం వెచ్చగా, తేమగా ఉండడం వల్ల ప్రయోజనమేమి?
జవాబు:
నాసికా కుహరము నందు వాయువు వడపోయబడుతుంది. నాసికా కుహరంలోని తేమగా ఉండే పొర, రోమాలు గాలిలో ఉండే దుమ్ము ధూళి కణాలను చాలావరకు ఆపేస్తాయి. అంతేకాకుండా నాసికా కుహరము ద్వారా ప్రయాణించే సమయంలో గాలి ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రతకు దాదాపు సమానమవుతుంది. గాలిలోనికి నాసికా కుహరంలోని తేమ చేరడం వలన గాలి అంతకు ముందు కంటే తేమగా తయారవుతుంది. గాలిని వెచ్చచేయడం, గాలికి తేమను చేర్చడం వంటి కార్యక్రమాలు శ్వాస జీర్ణవ్యవస్థలు రెండింటికీ సంబంధించిన గ్రసనిభాగంలో కొనసాగుతాయి. ఇదే ప్రక్రియ వాయుగోణుల వరకు కొనసాగుతుంది.

ప్రశ్న 24.
రక్తంలోని హిమోగ్లోబిన్ ఏయే పనులు నిర్వర్తిస్తుంది? రక్తంలో హిమోగ్లోబిన్ లేని జీవుల్లో శ్వాసక్రియలో రక్తం పాత్ర ఏమిటి?
జవాబు:
హిమోగ్లోబిన్ నిర్వహించే విధులు : ఊపిరితిత్తుల నుండి శరీరంలోని అన్ని కణజాలములకు హిమోగ్లోబిన్ రక్తాన్ని తీసుకొని వెళుతుంది. ఇది కార్బన్ డై ఆక్సైడు కణజాలముల నుండి ఊపిరితిత్తులకు మోసుకువస్తుంది. కణాలకు నైట్రిక్ఆక్సెడ్ను కూడా రవాణా చేస్తుంది.

రక్తంలో హిమోగ్లోబిన్ లేని జీవులలో రక్తం కేవలం జీర్ణమైన ఆహార పదార్థములను కణజాలములకు సరఫరా చేయును. మరియు కణాలలో శ్వాసక్రియవలన తయారయిన వ్యర్థ పదార్థములను విసర్జన వ్యవస్థకు సరఫరా చేయును.

ప్రశ్న 25.
క్రింది పట్టికను చూడండి. దీని నుండి మీరేమి గ్రహించారో రాయండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 24
జవాబు:
ఈ పట్టిక ఉచ్ఛ్వాస, నిశ్వాసంలో గాలిలో ఉండే వాయువుల శాతాన్ని తెలుపుతుంది. ఉచ్ఛ్వాసంలో 21 శాతం ఉన్న ఆక్సిజన్ నిశ్వాసంలో 16 శాతానికి తగ్గుతుంది. దీనికి కారణం ఆక్సిజన్ కణ శ్వాసక్రియలో వినియోగించబడుతుంది. కార్బన్ డయాక్సెడ్ ఉచ్ఛ్వాసంలో 0.03 శాతం ఉంటుంది. నిశ్వాసంలో అది 4 శాతానికి పెరగడానికి కారణం కణశ్వాసక్రియ వలన కార్బన్ డయాక్సెడ్ ఉత్పత్తి కావడమే. నైట్రోజన్ యొక్క శాతం ఉచ్ఛ్వాసంలోను నిశ్వాసంలోను ఒకే విధంగా (78%) ఉండుటకు కారణము దానికి శ్వాసక్రియలో పాత్ర లేకపోవడము.

10th Class Biology 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
చిత్తడి ప్రదేశాలలో పెరిగే మాంగ్రూవ్ మొక్కలు జరిపే శ్వాసక్రియ గురించి వ్రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 6

  1. చిత్తడి ప్రదేశాలలో పెరిగే మాంగ్రూవ్ మొక్కలు వేర్ల ద్వారా శ్వాసక్రియను జరుపుకుంటాయి.
  2. మొక్కల వేర్లలో ఉండే మూలకేశాలు పలుచని ఉపరితలం ద్వారా వాయు మార్పిడి చేస్తాయి.
  3. ఇవి మట్టి అణువుల మధ్య ఉండే ఆక్సిజన్‌ను పీల్చుకుంటాయి.
  4. చిత్తడి ప్రదేశాలలో పెరిగే మొక్కలలో వేర్లు భూమి ఉపరితలంలో పైకి చొచ్చుకుని వచ్చి అనుకూలనాన్ని ప్రదర్శిస్తాయి. వీటి ద్వారా వాయు వ్యాపనం సమర్థవంతంగా జరుగుతుంది.

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 2.
శ్వాసక్రియలో ఉష్ణం వెలువడునని నిరూపించే ప్రయోగాన్ని మీ పాఠశాలలో నిర్వహించిన విధానాన్ని రాయండి. ఇదే ప్రయోగం పొడి విత్తనాలతో చేస్తే ఫలితం ఎలా ఉండవచ్చు?
లేదా
ప్రయోగశాలలో శ్వాసక్రియలో ఉష్ణం వెలువడునని నిరూపించుటకు మీరు నిర్వహించిన ప్రయోగం యొక్క విధానం మరియు తీసుకొనిన జాగ్రత్తలు వివరించండి.
జవాబు:
పరికరాలు :
మొలకెత్తిన గింజలు, ధర్మాస్ ప్లాస్కు, థర్మామీటరు, బిరడా.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 7

ప్రయోగ విధానం :

  1. మొలకెత్తిన గింజలను ఒక ధర్మాస్ ప్లాస్కులో తీసుకోవాలి.
  2. బిరడాను తీసుకొని రంధ్రం చేసి దాని గుండా థర్మామీటరును అమర్చాలి. థర్మామీటరు. నొక్కు మొలకెత్తిన గింజలలో మునిగి ఉండేలా జాగ్రత్తపడాలి.
  3. థర్మాస్ ప్లాను బిరడాతో బిగుతుగా బిగించాలి.
  4. ప్రతి రెండు గంటలకు థర్మామీటరులో ఉష్ణోగ్రత నమోదు చేయాలి.
  5. మంచి ఫలితాల కొరకు 24 గంటలు పరిశీలించాలి.

పరిశీలన :
ప్రతి రెండు గంటలకు నమోదు చేసిన ఉష్ణోగ్రతలో పెరుగుదల కన్పించింది.

పరికల్పన :
ఈ ప్రయోగం పొడి విత్తనాలలో నిర్వహిస్తే ఉష్ణోగ్రతలో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు.

జాగ్రత్తలు :

  1. థర్మామీటరు బల్బు మొలకెత్తిన గింజలలో మునిగి ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
  2. ప్లాస్కులోనికి గాలి చొరబడకుండా చూడాలి.

ప్రశ్న 3.
A) క్రింది పటమును పరిశీలించి, ఈ ప్రశ్నలకు సమాధానములు రాయండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 8
1) పై పటం దేనిని సూచించును?
జవాబు:
అవాయు శ్వాసక్రియ, లేదా అవాయు శ్వాసక్రియలో వెలువడిన ఉష్ణం, కార్బన్ డై ఆక్సైడ్ నిర్ధారణ పరీక్ష.

2) పై ప్రయోగంలో వేడి చేసి, చల్లార్చిన గ్లూకోజ్ పై పారాఫిన్ ద్రవాన్ని పొరగా ఎందుకు పోస్తారు?
జవాబు:
ప్రయోగంలో బయటి నుండి గ్లూకోజ్ ద్రావణానికి ఆక్సిజన్ సరఫరా కాకుండా నిరోధించవచ్చు.

3) గ్లూకోజు ఎందుకు డయాజిన్ గ్రీన్ ద్రవాన్ని కలుపుతారు? కలిపిన తరువాత ఏ మార్పును గమనించావు?
జవాబు:
గ్లూకోజ్ ద్రావణంలో ఇంకా ఆక్సిజన్ ఉన్నదో లేదో తెలుసుకొనుటకు డయాజిన్ గ్రీన్ ద్రవాన్ని కలుపుతారు. కలిపిన తరువాత నీలిరంగు ద్రావణం ఆక్సిజన్ లభ్యత తక్కువైనప్పుడు గులాబి రంగులో మారటం గమనిస్తాము.

4) ఈ ప్రయోగంలో సున్నపు నీరును ఎందుకు ఉపయోగించారు?
జవాబు:
సున్నపు నీరు ఉపయోగించడం వలన అవాయు శ్వాసక్రియలో వెలువడిన CO2 ను నిర్ధారించవచ్చు. (CO2 సున్నపుతేటను ఆ పాలవలె మారుస్తుంది.)

5) థర్మామీటర్ యొక్క బల్బ్ గ్లూకోజ్ నీటిలో ఎందుకు మునిగి ఉండాలి?
జవాబు:
అవాయు శ్వాసక్రియలో వెలువడే ఉష్ణోగ్రతలను థర్మామీటరు ద్వారా నమోదుచేసి నిర్ధారించటానికి.

B) తరగతి గదిలో అవాయు శ్వాసక్రియ ప్రయోగం నిర్వహించావు కదా ! కింది ప్రశ్నలకు సమాధానమిమ్ము.
a) ఈ ప్రయోగం నిర్వహించడం ద్వారా నీవు ఏ ఏ విషయాలు నిరూపించగలవు?
జవాబు:
అవాయు శ్వాసక్రియలో ఉష్ణం మరియు కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అగునని నిరూపించగలను.

b) ఈ ప్రయోగంలో గ్లూకోజ్ ద్రావణాన్ని నీవు ఎందుకు వేడిచేశావు?
జవాబు:
గ్లూకోజ్ ద్రావణంలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ను తొలగించడానికి.

c) వేడిచేసిన తర్వాత గ్లూకోజ్ ద్రావణంలో ఆక్సిజన్ లేదు అని ఎలా నిర్ధారించుకుంటావు?
జవాబు:
గ్లూకోజ్ ద్రావణానికి డయజిన్ గ్రీన్ (లేదా జానస్ గ్రీన్ బి) ద్రావణాన్ని కలిపినపుడు ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉంటే గులాబీ రంగులోకి మారుతుంది.

d) సున్నపుతేటలో నీవు గమనించిన మార్పులు ఏమి? ఎందుకు?
జవాబు:
ఈ ప్రయోగంలో ఉత్పత్తి అయిన కార్బన్ డై ఆక్సైడ్ సున్నపు తేటను పాలవలె తెల్లగా మారుస్తుంది.

ప్రశ్న 4.
మానవునిలో వాయు ప్రసార మార్గపు క్రమాన్ని ప్లో చార్టు ద్వారా వివరించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 9
నాసికా రంధ్రాల ద్వారా వాయువు శరీరంలోకి ప్రవేశిస్తుంది. నాసికా కుహరంలో గాలిలోని దుమ్ము, ధూళికణాలు తొలగించబడతాయి. గాలి ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత దాదాపు సమానమవుతుంది. ఉప జిహ్విక అనే కండరపు కవాటం ఆహారపు, వాయు మార్గాలను నియంత్రిస్తూ తమ తమ వ్యవస్థల లోనికి సరిగ్గా ప్రవేశించునట్లు చేస్తుంది. ఊపిరితిత్తుల నుండి నిశ్వాసంలో బయటకు వచ్చే గాలి స్వరతంత్రుల గుండా ప్రయాణించేటప్పుడు వాటిని కంపించేలా చేస్తుంది. వాయునాళం ఊపిరితిత్తుల వరకు గాలిని తీసుకెళ్ళే నిర్మాణం. వాయునాళం ఉరః కుహరం మధ్య భాగంలో రెండు శ్వాసనాళాలుగా చీలి ఒక్కొక్క ఊపిరితిత్తిలోకి చేరుతుంది. శ్వాసనాళాలు అనేకసార్లు చీలుతూపోయి చివరకు శ్వాసనాళికలుగా అంతమవుతాయి. శ్వాసనాళికలు వాయుగోణులలో అంతమవుతాయి. రక్త కేశనాళికలు వాయుకోశగోణుల గోడలలో అధిక సంఖ్యలో ఉండడం వలన వాయు వినిమయం జరుగుతుంది. రక్తం ఆక్సిజన్ ని శరీరంలోని ప్రతి కణానికి అందజేస్తుంది.

ప్రశ్న 5.
A) ఈ ప్రయోగం యొక్క ఉద్దేశ్యం ఏమిటి?
B) థర్మామీటర్ రీడింగ్ లో ఏ విధమైన మార్పు ఉంటుంది?
(లేదా)
ఈ ప్రయోగం నిర్వహించేటపుడు థర్మామీటరులో మార్పును గమనించారా?
C) ఈ ఉష్ణం ఎక్కడి నుండి వచ్చిందని మీరు భావిస్తున్నారు?
D) ప్రయోగం చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి?
E) ఈ ప్రయోగాన్ని పొడి విత్తనాలతో నిర్వహిస్తే ఎటువంటి ఫలితం వస్తుంది?
F) ఈ ప్రయోగంలో నీవు ఉపయోగించిన పరికరములు ఏవి?
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 7
జవాబు:
A) శ్వాసక్రియలో ఉష్ణం వెలువడుతుందని నిరూపించడం.
B) థర్మామీటరులో రీడింగ్ పెరుగుతుంది.
C) మొలకెత్తుతున్న విత్తనాలు శ్వాసించడం వలన కొంత శక్తి ఉష్ణం రూపంలో వెలువడింది. (లేదా) మొలకెత్తుతున్న విత్తనాల నుండి ఉష్ణం వెలువడింది.
D) థర్మామీటరు యొక్క బల్బు విత్తనాల మధ్యలో ఉండేలా జాగ్రత్తపడాలి.
E) థర్మామీటరులోని ఉష్ణోగ్రతలో ఎటువంటి మార్పు ఉండదు.
F) గాజు జాడీ, మొలకెత్తిన విత్తనాలు, రబ్బరు బిరడా, థర్మామీటరు.

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 6.
“శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది” అని నిరూపించుటకు మీ పాఠశాల ప్రయోగశాలలో ఒక ప్రయోగాన్ని నిర్వహించారు కదా ! కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
i) ఈ ప్రయోగంలో ఉపయోగించిన పరికరాల జాబితా రాయండి.
జవాబు:
పరికరాలు :
1. మొలకెత్తు విత్తనాలు / మొలకలు, 2. ప్లాస్టిక్ బాటిల్, 3. చిన్న బీకరు, 4. సున్నపుతేట

ii) ఈ ప్రయోగాన్ని నిర్వహించు విధానము వివరించండి.
జవాబు:
ప్రయోగ విధానము :

  1. వెడల్పాటి మూత కలిగిన ప్లాస్టిక్ బాటిల్ నందు మొలకెత్తు విత్తనాలను తీసుకోవాలి.
  2. ఒక చిన్న బీకర్ నందు మూడు వంతుల వరకు సున్నపుతేట తీసుకోవాలి.
  3. ఈ బీకర్‌ను బాటిల్ నందు ఉంచాలి.
  4. బాటిల్ ను మూతతో గాలి జొరబడకుండా గట్టిగా బిగించాలి.
  5. ఇలాంటి అమరికనే మరొకదానిని పొడి విత్తనాలతో తయారుచేసుకోవాలి.
  6. ఈ అమరికలను ఒకటి నుండి రెండు రోజులు కదపకుండా ఉంచాలి.

ప్రశ్న 7.
శ్వాసక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుందని నిరూపించడానికి అనుసరించవలసిన ప్రయోగ విధానం రాయండి. దాని పటం గీయండి.
(లేదా)
శ్వాసక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ వెలువడునని అర్థము చేసుకొనుటకు నీవు ప్రయోగశాలలో నిర్వహించిన ప్రయోగ విధానమును తెలుపుము.
జవాబు:
ఉద్దేశం : శ్వాసక్రియలో CO2 వెలువడుతుందని నిరూపించుట.

పరికరాలు :
వెడల్పు మూతిగల రెండు గాజు సీసాలు, మొలకెత్తుతున్న శనగగింజలు, పొడి శనగగింజలు, సున్నపునీరు ఉన్న బీకర్లు.

ప్రయోగ విధానం :
1) వెడల్పు మూతిగల రెండు గాజుసీసాలు తీసుకోవాలి. ఒకదానిలో మొలకెత్తుతున్న శనగగింజలు ఉంచాలి. రెండవ దానిలో పొడి శనగగింజలు ఉంచవలెను.

2) రెండు గాజుసీసాలలో సున్నపుతేటతో నింపిన బీకర్లు ఉంచాలి. తరువాత రెండు సీసాల రబ్బరు బిరడాలను గట్టిగా బిగించాలి.

3) సీసామూతి చుట్టూ గాలి చొరబడకుండా వేజిలైన్ పూయవలెను. సీసాలను కదపకుండా రెండు రోజులు ఉంచవలెను.

AP Board 10th Class Biology Solutions 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 7
పరిశీలన :
4) ఒకటి రెండు రోజులు గమనించినట్లయితే మొలకెత్తుతున్న థి తనలు ఎం సి ఏరులో ఉన్న సున్నపు టు ఎక్కువగా తెల్లటి పాలవలె మారుతుంది.

5) దీనికి కారణము మొలకెత్తే విత్తనాలు శ్వాసక్రియ జరపడం వల్ల వెలువడిన కార్బన్ డై ఆక్సైడ్ వల్లనే సున్నపు తేట పాల వలె మారిందని చెప్పవచ్చు.

6) పొడిగింజలు గల సీసాలోని సున్నపు తేట తెల్లగా పాలవలె అంతగా మారదు.

విడుదల ఫలితం :
7) కనుక శ్వాసక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతుందని నిరూపించడమైనది.

ప్రశ్న 8.
క్రింది ను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 17
i) ప్రయోగ ప్రారంభంలో లాక్టిక్ ఆమ్ల గాఢత ఎంత ఉంది?
ii) ప్రయోగం ఏ దశలో లాక్టిక్ ఆమ్ల గాఢత అత్యధిక స్థాయికి చేరింది?
iii) లాక్టిక్ ఆమ్ల గాఢత 25 నిముషాల తర్వాత ఎంత ఉంది?
iv) లాక్టిక్ ఆమ్ల గాఢతకు, కండరాల నొప్పికి మధ్య గల సంబంధమేమిటి?
జవాబు:
1) 20 మి.గ్రా / ఘ. సెం.మీ.
2) “B” స్థానం (లేదా) 20 నిమిషాలు దగ్గర
3) 101 మి.గ్రా / ఘ. సెం.మీ.
4) లాక్టిక్ ఆమ్లం గాఢత పెరిగితే కండరాల నొప్పి కూడా పెరుగుతుంది.

ప్రశ్న 9.
కింద ఇచ్చిన పరికరాల అమరికను గమనించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 11
i) ఈ ప్రయోగం ద్వారా ఏ ప్రక్రియ గురించి తెలుసుకుంటాం?
జవాబు:
ఈ ప్రయోగం ద్వారా దహన ప్రక్రియ గురించి తెలుసుకుంటాం.

ii) ఈ ప్రక్రియ శ్వాసక్రియతో ఎలా విభేదిస్తుంది?
జవాబు:
శ్వాసక్రియ నీటి సమక్షంలో జరుగుతుంది. దహన ప్రక్రియ నీరు లేనప్పుడు జరుగును.

iii) ఈ ప్రయోగంకు శ్వాసక్రియతో ఉన్న పోలికలు ఏవి?
జవాబు:
ఈ రెండు ప్రక్రియలలో శక్తి విడుదల అగును.

iv) ఏ వాయువు సున్నపుతేటను పాలవలె మారుస్తుంది?
జవాబు:
కార్బన్ డై ఆక్సైడ్ వాయువు సున్నపుతేటను పాలవలె మారుస్తుంది.

ప్రశ్న 10.
కింది అంశాన్ని పరిశీలించండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 12
పై అంశాల ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
i) గ్లూకోజ్ ఎన్ని పైరువిక్ ఆమ్ల అణువులుగా మారుతుంది?
ii) పైరువిక్ ఆమ్లం వాయుసహిత లేదా అవాయు శ్వాసక్రియలలో పాల్గొనడం దేనిపై ఆధారపడి ఉంటుంది?
iii) వాయుసహిత, అవాయు శ్వాసక్రియలు రెండింటిలో దేంట్లో ఎక్కువ శక్తి విడుదలవుతుంది?
iv) మానవ కండరాలలో అవాయు శ్వాసక్రియ జరిగినప్పుడు ఏర్పడే రసాయన పదార్ధమేది?
జవాబు:
i) 2 పైరువిక్ ఆమ్ల అణువులు
ii) ఆక్సిజన్ లభ్యత
iii) వాయుసహిత శ్వాసక్రియ
iv) లాక్టిక్ ఆమ్లము

ప్రశ్న 11.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 13
a) ప్రక్క పటం దేనిని తెలియచేస్తుంది?
జవాబు:
మైటోకాండ్రియా

b) పటంలో చూపిన ‘X’ భాగాన్ని గుర్తించండి.
జవాబు:
మాత్రిక

c) ప్రక్కన చూపిన పటము యొక్క విధులను తెల్పండి.
జవాబు:
కణ శ్వాసక్రియలో పాల్గొని శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

d) ప్రక్కన చూపిన పటము ఏ వ్యవస్థకు సంబంధించినది?
జవాబు:
శ్వాసవ్యవస్థకు సంబంధించినది.

ప్రశ్న 12.
మనం విడిచేగాలిలో CO2 ఉంటుందని ఎలా నిరూపిస్తావు?
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 4
ఉద్దేశం :
మనం విడిచే గాలిలో CO2 ఉంటుందని నిరూపించుట.

పరికరాలు :
రెండు పరీక్షనాళికలు, సున్నపుతేట, గాజునాళాలు, సిరంజి

విధానం :
రెండు పరీక్షనాళికలు తీసుకొని ఒకదానిలో సున్నపుతేట, మరొక దానిలో నీటిని తీసుకోవాలి. రెండింటిలోనికి గాజు నాళాలు అమర్చి గాలి ఊదాలి.

పరిశీలన :
గాలి ఊదినపుడు పరీక్షనాళికలోని సున్నపుతేట తెల్లగా పాలవలె మారింది.

నిర్ధారణ :
మరొక సున్నపుతేట ఉన్న పరీక్షనాళికలోనికి సిరంజి ద్వారా గాలి ఊదినపుడు అది రంగు మారలేదు. అంటే మనం విడిచే గాలిలో ఉన్న వాయువు సున్నపుతేటను పాలవలె మార్చింది. సున్నపునీటిని పాలవలె మార్చే వాయువు CO2.

నిరూపణ :
మనం విడిచే గాలిలో CO2 ఉండి సున్నపుతేటను పాలవలె మార్చుతుందని నిరూపించటమైనది.

ప్రశ్న 13.
వాయుగోణులలో జరిగే వాయుమార్పిడి గురించి రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 14

  1. ఊపిరితిత్తుల లోపల వ్యాపన పద్ధతిలో వాయుగోణుల నుండి రక్తకేశనాళిలోనికి, రక్తకేశనాళికల నుండి వాయుగోణులలోనికి వాయువుల మార్పిడి జరుగుతుంది. అంటే రక్తంలోని కార్బన్ డై ఆక్సైడ్, ‘వాయుగోణులలోని ఆక్సిజన్లు పరస్పరం మార్పిడి జరుగుతాయన్నమాట.
  2. అతిసూక్ష్మమైన వాయుగోణులు ఒకే కణం మందంతో అసంఖ్యాకంగా ఉంటాయి. ఈ వాయుగోణుల చుట్టూ ఒకే కణం మందంతో ఉండే రక్త కేశనాళికలు ఉంటాయి.
  3. గుండె నుండి ఊపిరితిత్తులకు ప్రవహించే ముదురు ఎరుపు రంగులో ఉండే ఆక్సిజన్ రహిత రక్తం ఈ రక్త కేశ నాళికలలోనికి ప్రవహించి, వాయుగోణుల నుండి ఆక్సిజన్‌ను గ్రహిస్తుంది.
  4. అదే సమయంలో రక్తంలోని కార్బన్ డై ఆక్సైడ్ రక్త కేశనాళికల నుండి వాయుగోణులలోకి వ్యాపన పద్ధతిలో ప్రవేశిస్తుంది. మనం నిశ్వాసించినపుడు కార్బన్ డై ఆక్సైడ్ బయటకు వెళుతుంది.
  5. ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉండే ఆక్సిజన్ సహిత రక్తం గుండెకు చేరి, అక్కడ నుండి శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది.

ప్రశ్న 14.
శరీరంలో జరిగే వాయువుల రవాణా విధానాన్ని వివరించండి.
జవాబు:
వాతావరణంలో ఆక్సిజన్ సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు (సుమారు 21%) మొత్తం రక్తంలోని ఎర్రరక్త కణాలలో ఉన్న హిమోగ్లోబిన్ వర్ణదం దాదాపుగా ఆక్సిజన్తో సంతృప్తం చెంది, రవాణా చేయబడుతుంది. హిమోగ్లోబిన్ కూడా క్లోరోఫిల్ మాదిరిగా ఒక వర్ణ పదార్థం. రెండింటికీ ఉన్న ప్రధానమైన తేడా ఏమిటంటే క్లోరోఫిల్ లో మెగ్నీషియం అణువు ఉంటుంది. హిమోగ్లోబిన్ మధ్యలో ఇనుము (Fe) అణువు ఉంటుంది.

ఆక్సిజన్ రక్తంలోకి వ్యాపన పద్ధతి ద్వారా ప్రవేశించగానే అది వెంటనే హిమోగ్లోబిన్తో బంధాన్ని ఏర్పరచుకొని ఆక్సీ హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. ఈ రక్తం కణజాలాలకు చేరినపుడు ఆక్సిజన్
హిమోగ్లోబిన్ నుండి విడిపోయి కణజాలాలలోనికి ప్రవేశిస్తుంది. కార్బన్ డై ఆక్సైడ్ సాధారణంగా బై కార్బొనేట్స్ రూపంలో రవాణా చేయబడుతుంది. కొంత భాగం హిమోగ్లోబిన్ తో కలుస్తుంది. మరికొంత ప్లాస్మాలో కరుగుతుంది.
Hb + O2 → HbO2 (ఊపిరితిత్తులలో)
HbO2 → Hb + O2 (కణజాలాలలో)

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 15.
పర్వతారోహకులు తమ వెంట ఆక్సిజన్ సిలిండర్ తీసుకెళతారు. ఎందుకు?
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 15
సముద్రమట్టం దగ్గర హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తో పూర్తిగా సంతృప్తం చెందుతుంది. దాదాపు ప్రతి హిమోగ్లోబిన్ ( ణువు ఆక్సిజన్ తో బంధాన్ని ఏర్పరచి ఆక్సీ హిమోగ్లోబిన్ గా మారుతుంది. సముద్రమట్టానికి 13 కిలోమీటర్లపైన (8 మైళ్ళు) ఆక్సిజన్ లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. సముద్రమట్టంతో పోలిస్తే కేవలం ఐదవ వంతు ఆక్సిజన్ మాత్రమే లభ్యమవుతుంది. ఈ పరిస్థితులలో లభ్యమయ్యే ఆక్సిజన్ సగం హిమోగ్లోబిన్ అణువులను మాత్రమే సంతృప్తం చేయగలుగుతుంది.

హిమోగ్లోబిన్ తక్కువ ఆక్సిజన్ అణువులతో కలిసినట్లయితే, రక్తం కణజాలాలకు అవసరమైన రక్తాన్ని సరఫరా చేయలేదు. కృత్రిమమైన పద్ధతిలో ఆక్సిజన్ సరఫరా (ఆక్సిజన్ సిలిండర్లతో) లేకుండా అంత ఎత్తులో జీవించడం అసాధ్యం. అందువలన పర్వాతారోహకులు తమ వెంట ఆక్సిజన్ సిలెండర్లు తీసుకెళతారు.

ప్రశ్న 16.
శ్వాసక్రియ దశలను ఫ్లోచార్టు రూపంలో రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 16

ప్రశ్న 17.
మైటోకాండ్రియా నిర్మాణాన్ని పటం సహాయంతో వివరించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 18

  1. మైటోకాండ్రియాలు పొడవుగా, దండాకారముగా మరికొన్ని గోళాకారంలో లేక టెన్నిస్ రాకెట్ ఆకారంలో ఉంటాయి.
  2. ఇది రెండు భాగాలను కలిగి ఉంటుంది. లోపలి భాగంలో మాత్రిక ఉండును.
  3. మాత్రిక చుట్టూ మైటోకాండ్రియా లోపలి త్వచము కప్పబడి యుండును.
  4. దీని లోపలి త్వచం ముడతలుపడి ఉంటుంది. వీటిని క్రిస్టే అంటారు. ఇవి మాత్రికలో వ్యాపించి ఉంటాయి.
  5. ముడతల మధ్య ఉండే స్థలం మైటోకాండ్రియా వెలుపలి భాగంతో కలిసి ఉంటుంది.
  6. మాత్రికలలోకి చొచ్చుకుంటూ, లోపలి త్వచం నుండి ఎక్కువ సంఖ్యలో ప్రాథమిక రేణువులుంటాయి. ఈ రేణువులకు గోళాకారపు అగ్రభాగం, వృంతం ఉంటాయి. వాటి వృంతాలు లోపలి త్వచానికి చేర్చబడి అగ్రభాగం మాత్రికలోకి ఉంటాయి.
  7. మైటోకాండ్రియా వెలుపలి భాగం బాహ్యత్వచంతో కప్పబడి ఉంటుంది. ఇది ముడతలు లేకుండా నునుపుగా ఉంటుంది.
  8. మైటోకాండ్రియాలో. శ్వాసక్రియకు సంబంధించిన ఎంజైములు ఉండును.
  9. మైటోకాండ్రియాలో శక్తి ATP రూపంలో నిలువచేయబడి ఉండుట వల్ల వీనిని శక్తి ఉత్పాదక కేంద్రములందురు.

ప్రశ్న 18.
గ్రాఫ్ ను పరిశీలించండి. కండరాలలో లాక్టిక్ ఆమ్లం ఏ విధంగా పేరుకుంటున్నదో పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానాల్వివండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 17
నిరంతర వ్యాయామం రక్తంలోని లాక్టికామ్లం గాఢతను ప్రభావితం చేసే అంశాన్ని చూపే గ్రాఫ్
అ) ప్రయోగ ప్రారంభంలో లాక్టిక్ ఆమ్ల గాఢత ఎంత ఉన్నది?
జవాబు:
ప్రయోగ ప్రారంభంలో లాక్టిక్ ఆమ్ల గాఢత 20మి.గ్రా/ఘ. సెం.మీ ఉంది.

ఆ) ప్రయోగం ఏ దశలో లాక్టిక్ ఆమ్ల గాఢత అత్యధిక స్థాయికి చేరింది?
జవాబు:
9 నిమిషాలకు లాక్టిక్ ఆమ్లం గాఢత అత్యధిక స్థాయికి చేరింది.

ఇ) C మరియు D స్థానముల మధ్య లాక్టిక్ ఆమ్ల గాఢత ఒకే స్థాయిలో కొనసాగుతూ ఉన్నట్లయితే లాక్టిక్ ఆమ్లం సాధారణ స్థాయి చేరడానికి ఎంత సమయం పట్టవచ్చు?
జవాబు:
లాక్టిక్ ఆమ్లం సాధారణ స్థాయికి చేరటానికి 100 నిమిషాలు పడుతుంది. అంటే గంటా నలభై నిమిషాలు.

ప్రశ్న 19.
చేపలో జరిగే శ్వాసక్రియను వివరించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 19

  1. చేప నోటిని తెరచి ఆస్యకుహరం నేల భాగాన్ని కిందకు దించుతుంది.
  2. దీనివల్ల ఆక్సిజన్ కరిగి ఉన్న బయటి నీరు ఆస్యకుహరంలోకి తీసుకోబడుతుంది.
  3. ఇపుడు నోటిని మూసి ఆస్యకుహరం నేలను పైకి నెట్టుతుంది.
  4. నీరు ఆస్యకుహరం నుండి గ్రసనిలోనికి నెట్టబడుతుంది.
  5. గ్రసని నుండి అంతర జలశ్వాసరంధ్రాల ద్వారా చేపలో జరిగే శ్వాసక్రియ మొప్ప కోష్టాలలోకి చేరి మొప్ప పటలికలను తడుపుతుంది.
  6. నీటిలోని ఆక్సిజన్ మొప్ప పటలికల్లోని రక్తాన్ని చేరుతుంది.
  7. రక్తంలోని కార్బన్ డై ఆక్సైడ్ నీటిలోకి చేరుతుంది. నీరు బాహ్య జల శ్వాసరంధ్రాల ద్వారా బయటకుపోతుంది.
  8. ఈ విధంగా చేపలో మొప్పల ద్వారా జరుగు శ్వాసక్రియను జలశ్వాసక్రియ అంటారు.

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 20.
మొక్కలలో జరిగే వాయు రవాణాను వివరించండి.
జవాబు:

  1. పత్రరంధ్రాలు, లెంటి సెల్స్ మొక్క లోపలికి తెరుచుకొని ఉంటాయి. కణాలలో ఉండే ఖాళీలు (గాలి గదులు) వల మాదిరిగా మొక్క అంతా విస్తరించి ఉంటాయి.
  2. ఈ ఖాళీ ప్రదేశాలు పత్రాలలో పెద్ద పరిమాణంలోనూ మిగిలిన మొక్క భాగాలలో చిన్నవిగానూ ఉంటాయి. ఈ గాలి గదుల గోడలు నీటి పొర కలిగి ఉండి తేమగా ఉంటాయి.
  3. పత్రరంధ్రాల ద్వారా లోనికి ప్రవేశించిన గాలిలోని ఆక్సిజన్ నీటిపొరలో కరుగుతుంది. కణకవచం గుండా కణ పదార్థాన్ని చేరుతుంది. కణంలోని చక్కెరలతో చర్య జరిపి శక్తిని విడుదల చేస్తుంది.
  4. దీనితోపాటు నీరు, కార్బన్ డై ఆక్సైడ్ కూడా వెలువడతాయి. ఇలా విడుదలైన శక్తి జీవక్రియ నిర్వహణ కోసం కణంలోని మైటోకాండ్రియాలో ఎ.టి.పి రూపంలో నిల్వ ఉంటుంది. ఏర్పడిన కార్బన్ డై ఆక్సైడ్ ఇదే మార్గంలో గాలి గదుల నుండి బయటకు వెలువడుతుంది.
  5. ఈ చర్య వ్యాపన పద్దతిలో జరుగుతుంది. కణంలో ఆక్సిజన్ వినియోగింపబడగానే కణాలకు, గాలి గదులకు మధ్య వాయు సాంద్రతలో తేడా ఏర్పడుతుంది.
  6. అదే సమయంలో గాలి గదులలో పత్రరంధ్రాలు, లెంటిసెల్స్ వెలుపల కూడా వాయు సాంద్రతలో తేడా వస్తుంది.
  7. అందువల్ల వెలుపలి గాలి పత్రరంధ్రాలగుండా లోపలికి ప్రవేశిస్తుంది.
  8. అదే విధంగా కార్బన్ డై ఆక్సైడ్లో ఏర్పడిన సాంద్రత వ్యత్యాసం వల్ల పై చర్యకు వ్యతిరేక దిశలో వెలుపలికి వస్తుంది.

ప్రశ్న 21.
ప్రక్క పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 5
a) పటంలో చూపబడిన భాగము పేరు ఏమిటి?
b) ఈ భాగము ఏ అవయవంలో ఉంటుంది?
c) ఈ భాగము నిర్వహించు క్రియ ఏమిటి?
d) వాయుమార్పిడిలో ఇమిడి ఉన్న సూత్రము ఏమిటి?
జవాబు:
a) పటంలో చూపబడిన భాగము వాయుగోణి.
b) వాయుగోణులు ఊపిరితిత్తులలో ఉంటాయి.
c) వాయుగోణులలో వాయుమార్పిడి జరుగుతుంది.
d) వాయుమార్పిడి వినిమయం లేదా విసరణ సూత్రం ఆధారంగా జరుగుతుంది.

ప్రశ్న 22.
ప్రక్క పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 13
a) పటంలో చూపబడిన కణాంగము ఏమిటి?
b) ఈ కణాంగము ఏ క్రియను నిర్వహిస్తుంది?
c) క్రిస్టే అనగానేమి?
d) ఈ కణాంగానికి గల మరొక పేరు ఏమిటి?
జవాబు:
a) పటంలో చూపబడిన కణాంగము మైటోకాండ్రియా.
b) కణాంగము శ్వాసక్రియను నిర్వహిస్తుంది.
c) మైటోకాండ్రియా లోపలి త్వచం ముడుతలను క్రిస్టే అంటారు.
d) మైటోకాండ్రియాలను కణ శక్త్యాగారాలు అని పిలుస్తారు.

ప్రశ్న 23.
ప్రక్కపటం పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 20
a) ఈ ప్రయోగం యొక్క ఉద్దేశం ఏమిటి?
b) ఈ ప్రయోగంలో వాడిన పరికరాలు తెలపండి.
c) ప్రయోగ నిర్వహణ అనంతరం నీవు గమనించే మార్పు ఏమిటి?
d) శ్వాసక్రియలో ఉష్ణోగ్రత పెరుగుతుందని నిరూపించటానికి నీవు ఏ మార్పులు చేస్తావు?
జవాబు:
a) శ్వాసక్రియలో CO2 వెలువడుతుందని నిరూపించుట ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం.
b) ప్రయోగంలో గాజుసీసా, మొలకెత్తిన గింజలు, సున్నపునీటి బీకరు, సీసా మూత ఉపయోగించారు.
c) ప్రయోగ నిర్వహణ అనంతరం బీకరులోని సున్నపునీరు తెల్లగా మారటం గమనించాను.
d) సీసా మూత ద్వారా థర్మామీటరును శనగగింజల మధ్య అమర్చి, శ్వాసక్రియలో ఉష్ణోగ్రత పెరుగుతుందని నిరూపించవచ్చు.

ప్రశ్న 24.
ప్రక్క పటం పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 21
a) ఈ ప్రయోగంలో మండించిన పదార్థం ఏమిటి?
b) క్రింద ఉన్న పరీక్షనాళికలో తీసుకొన్న ద్రవము ఏమిటి?
c) ఈ ప్రయోగం ద్వారా ఏ క్రియను నిరూపిస్తావు?
d) ప్రయోగం ద్వారా నిరూపించబడిన భౌతికక్రియ ఏ జీవక్రియను పోలి ఉంటుంది?
జవాబు:
a) ప్రయోగంలో మండించిన పదార్థం – గ్లూకోజ్
b) క్రింద ఉన్న పరీక్షనాళికలో తీసుకొన్న ద్రవము – సున్నపునీరు
c) ఈ ప్రయోగం ద్వారా దహనక్రియను నిరూపిస్తారు.
d) దహనము అనే భౌతికచర్య, శ్వాసక్రియ అనే జీవక్రియను పోలి ఉంటుంది.

ప్రశ్న 25.
మానవుని శ్వాసవ్యవస్థ పటం గీచి, భాగాలు గుర్తించండి. మానవ ఊపిరితిత్తులు దేనితో నిర్మితమౌతాయి?
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 22
మానవ ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం వాయుగోణులు.

ప్రశ్న 26.
ఊపిరితిత్తులు మరియు రక్తకేశ నాళికల మధ్య జరిగే వాయు మార్పిడిని చూపు పటం గీయండి. ఏ పద్దతిలో ఈ వాయు మార్పిడి జరుగుతుందో తెలపండి.
జవాబు:

ఊపిరితిత్తులలో వాయు మార్పిడి జరిగే ప్రక్రియను వినిమయం లేదా వ్యాపనం అంటారు.

ప్రశ్న 27.
శ్వాసక్రియలో పాల్గొనే కణాంగం యొక్క పటం గీచి, భాగాలు గుర్తించండి. దీనిలో క్రిస్టే ఎలా రూపొందుతుంది?
(లేదా)
కణశక్యాగారముగా పిలువబడే కణాంగం పటం గీచి, భాగాలు గుర్తించండి. క్రిస్టే అనగానేమి?
జవాబు:
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 18
మైటోకాండ్రియా మైటోకాండ్రియా లోపలి త్వచం ముడతలను క్రిస్టే అంటారు. దీనిమీద ప్రాథమిక రేణువులు ఉంటాయి.

10th Class Biology 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ ½ Mark Important Questions and Answers

ఫ్లో చార్పులు

1.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 25
జవాబు:
ఊపిరితిత్తులలో వాయుమార్పిడి

2.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 26
జవాబు:
మైటోకాండ్రియా

3.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 27
జవాబు:
కిణ్వనం

4.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 28
జవాబు:
నాసికా కుహరాలు

5.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 29
జవాబు:
వాయునాళం

6.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 30
జవాబు:
ఇథైల్ ఆల్కహాల్

7.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 31
జవాబు:
చర్మ శ్వాసక్రియ

8.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 32
జవాబు:
వాయునాళం

9.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 33
జవాబు:
గ్రసని

10.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 34
జవాబు:
లెంటిసెల్స్

సరైన గ్రూపును గుర్తించండి

11. ఏ గ్రూపు శ్వాసక్రియ భాగాలు సరియైన క్రమంలో అమరి ఉన్నాయి?
A. నాసిక – స్వరపేటిక – గ్రసని – వాయునాళం
B. నాసిక – గ్రసని – స్వరపేటిక – వాయునాళం
జవాబు:
సమూహం B

12. ఏ గ్రూపు శ్వాసక్రియ భాగాలు సరియైన క్రమంలో అమరి ఉన్నాయి?
A. వాయునాళం – శ్వాసనాళం – శ్వాసనాళికలు – వాయుగోణులు
B. వాయునాళం – శ్వాసనాళికలు – శ్వాసనాళం – వాయుగోణులు
జవాబు:
సమూహం A

13. ఏ గ్రూపు సంఘటనలు నిశ్వాసక్రియకు సంబంధించినవి?
A. డయాఫ్రమ్ సంకోచించడం – ఉరఃకుహరం పరిమాణం పెరగడం – అంతర్గత పీడనం తగ్గడం – గాలి ఊపిరితిత్తుల్లోకి చేరడం
B. డయాఫ్రమ్ యథాస్థితికి చేరడం – ఉరఃకుహరం పరిమాణం తగ్గడం – అంతర్గత పీడనం పెరగడం – ముక్కు ద్వారా గాలి బయటకు వెళ్ళడం
జవాబు:
సమూహం A

14. “కణజాలాలలో వాయు మార్పిడి” దశకు సంబంధించి ఈ క్రింది ఏ గ్రూపు ఘటనలున్నాయి?
A. వాయుగోణులలో O2 – వ్యాపనం – O2 రక్త కేశనాళికలోకి చేరడం
B. రక్త కేశనాళికలలోని O2 – వ్యాపనం – O2 కణంలోకి చేరడం
జవాబు:
సమూహం B

15. ఊపిరితిత్తుల నుండి రక్తానికి చేరడం క్రింది ఏ చర్యను సూచిస్తుంది?
A. Hb + O2 → HbO2
B. HbO2 → Hb + O2
జవాబు:
చర్య A

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

16. వాయురహిత శ్వాసక్రియతో సంబంధం లేని దశలు ఏవి?
A. గైకాలసిస్, క్రెబ్స్ వలయం, ఎలక్ట్రాన్ రవాణా
B. గైకాలసిస్, ఎలక్ట్రాన్ రవాణా, కిణ్వనం
జవాబు:
సమూహం A

17. ఏ గ్రూపు సమ్మేళనాలు వాయుసహిత శ్వాసక్రియలో ఏర్పడతాయి?
A. పైరువిక్ ఆమ్లం, లాక్టిక్ ఆమ్లం, ఇథైల్ ఆల్కహాల్
B. పైరువిక్ ఆమ్లం, కార్బన్ డై ఆక్సైడ్, నీరు
జవాబు:
సమూహం B

18. ఏ సమీకరణం వాయుసహిత శ్వాసక్రియకు సంబంధించినది?
A. C6H12O6 + 6O2 → 6CO2 + 6H2O + 686 K.Call
B. C6H12O6 → 2C2H5OH + 2 CO2 + 56 K.Call
జవాబు:
సమూహం B

19. ఏ సమూహంలోని జీవులు జల శ్వాసక్రియకు ఉదాహరణలు?
A. చేప, పీత, టాడ్ పోల్
B. వానపాము, కీటకం, పక్షి
జవాబు:
సమూహం A

20. ఏ భేదమును తప్పుగా పేర్కొన్నారు?

కిరణజన్య సంయోగక్రియ శ్వాసక్రియ
1. ఇది అనబాలిక్ ప్రక్రియ. 1. ఇది కాటబాలిక్ ప్రక్రియ.
2. O2 ఉపయోగించబడుతుంది మరియు CO2 విడుదల అవుతుంది. 2. CO2 వినియోగించబడుతుంది మరియు O2 విడుదల అవుతుంది.

జవాబు:
2వ భేదం

ఉదాహరణలు ఇవ్వండి

21. మొక్కలలో శ్వాసక్రియ పత్రరంధ్రాల ద్వారా జరుగును. మొక్కలలో శ్వాసక్రియ జరిగే మరో భాగానికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
లెంటిసెల్స్

22. మాంగ్రూవ్ మొక్క శ్వాసక్రియ కొరకు శ్వాసించే వేర్లను కలిగి ఉంటుంది. శ్వాసించడానికి ప్రత్యేకమైన కణజాలం ఉండే మొక్కలకు మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఆర్కిడ్

23. గ్లూకోజ్ శ్వాసక్రియ ఆధారానికి ఒక ఉదాహరణ. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఫ్యాటీ ఆమ్లాలు

24. కేంద్రకపూర్వ కణాలలో కణశ్వాసక్రియ కణద్రవ్యంలో జరుగుతుంది. నిజకేంద్రక జీవులలో కణద్రవ్యంతోపాటు కణ శ్వాసక్రియలో పాల్గొనే మరొక భాగాన్ని పేర్కొనండి.
జవాబు:
మైటోకాండ్రియా

25. బాక్టీరియాలో లాక్టిక్ ఆమ్లం అనేది వాయురహిత శ్వాసక్రియ యొక్క తుది ఉత్పత్తి. మన శరీరంలో లాక్టిక్ ఆమ్లం ఏర్పడే భాగానికి మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
కండరాలు

26. కిణ్వన ప్రక్రియలో ఇథనాల్ ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో మరో ఉత్పత్తి ఏమిటి?
జవాబు:
CO2

27. కిణ్వ ప్రక్రియను ఆల్కహాల్ తయారీలో ఉపయోగిస్తారు. దీనిని ఉపయోగించే మరో సందర్భానికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
దోస పిండి, ఇడ్లీ పిండి తయారీలో

28. ‘గ్లూకోజ్ ద్రావణం మరియు బైకార్బోనేట్ ద్రావణం అనేవి వాయురహిత శ్వాసక్రియ జరిపే ప్రయోగాల్లో ఉపయోగించే రసాయనాలు. ఈ ప్రయోగంలో ఉపయోగించే రసాయనానికి మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
లిక్విడ్ పారాఫిన్

29. అమీబా వంటి ఏకకణ జీవులు వ్యాపనం ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి. వ్యాపనం ద్వారా శ్వాసక్రియ జరిగే బహుకణ జీవికి ఉదాహరణను ఇవ్వండి.
జవాబు:
హైడ్రా

30. చర్మ శ్వాసక్రియ జరిపే జీవికి ఉదాహరణ వానపాము. చర్మం మరియు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసించగల జీవికి ఉదాహరణను ఇవ్వండి:
జవాబు:
కప్ప

శాస్త్రవేత్తను గుర్తించండి

31. ఆక్సిజన్ మరియు ఇతర వాయువులను కనుగొన్నాడు.
జవాబు:
జోసెఫ్ ప్రీస్ట్లీ

32. మనం పీల్చేగాలి మన చుట్టూ ఉన్న గాలిలో ఉంటూ వస్తువులను మండించడానికి సహాయపడుతుంది. గాలిలో స్థిరమైన వాయువు లేదా బొగ్గుపులుసు వాయువు 1/6 వ వంతు పరిమాణంలో ఉంటుందని తన ప్రయోగాల ద్వారా గుర్తించాడు.
జవాబు:
లావోయిజర్

33. జీవులు గ్రహించే పదార్థాలలో దహనం చెందడానికి వీలైన వాటిలో నీరు, ఆక్సిజన్ ప్రధానంగా ఉంటాయి. ఇవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి జరిపే చర్యల వల్ల భౌతికంగా జీవక్రియలు జరుగుతాయి. శరీరం నుండి విడుదలయ్యే విసర్జితాలలో నీరు, కార్బన్ డై ఆక్సైడ్, ఫాస్ఫరస్, సల్ఫర్, కొన్ని ఇతర పదార్థాలు ఉంటాయి.
జవాబు:
జాన్ డాపర్

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

34. “శ్వాసక్రియ అనేది ఒక విధమైన దహనక్రియ. దీని వలననే జీవుల శరీరానికి ఉష్ణం లభిస్తుంది” అని పేర్కొన్నాడు.
జవాబు:
రాబిన్సన్

35. యోగాభ్యాస అనే శాస్త్రీయ శ్వాస పద్ధతిని అభివృద్ధి చేశాడు. ఎనిమిది విభాగాలలో 195 యోగశాస్త్ర నియమాలను ప్రవేశపెట్టాడు.
జవాబు:
మహర్షి పతంజలి

నేను ఎవరు?

36. నేను వాతావరణములో ఉన్నటువంటి వాయువు మరియు నన్ను స్థిర గాలి అని పిలిచేవారు. నేను సున్నపు నీటిని పాలవలే తెల్లగా మార్చుతాను.
జవాబు:
CO2

37. నాసికా కుహరం నుండి నోటి కుహరాన్ని వేరు చేసే ఒక అస్తి పలక
జవాబు:
అంగిలి

38. C ఆకారంలో ఉన్న మృదులాస్థి ఉంగరాల ద్వారా ఆవరించబడి ఉంటాను. నన్ను గాలిగొట్టం అని కూడా పిలుస్తారు.
జవాబు:
వాయునాళం

39. నన్ను ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలుగా పిలుస్తారు.
జవాబు:
వాయుగోణులు

40. బాక్టీరియా మరియు ఈస్ట్ లో కనపడే వాయురహిత శ్వాసక్రియ నేను.
జవాబు:
కిణ్వనం

41. కణ శ్వాసక్రియలో పాల్గొనే కణాంగాన్ని నేను మరియు నన్ను కణ శక్త్యాగారము అని కూడా పిలుస్తారు.
జవాబు:
మైటోకాండ్రియా

42. నేనొక భౌతిక, అనియంత్రిత ప్రక్రియ. ఈ ప్రక్రియలో పదార్థాన్ని మండించడం కొరకు ఉష్ణాన్ని బయటి నుండి అందించడం జరుగుతుంది.
జవాబు:
దహనం

43. నేనొక జీవిని. శ్వాసకోశ వాయువుల రవాణాకు తోడ్పడే శ్వాసవర్ణకం నాలో లేదు. తద్వారా వాయునాళాల ద్వారా గాలి నేరుగా కణజాలానికి చేరుకుంటుంది.
జవాబు:
బొద్దింక

44. నేనొక ఉభయచర జీవిని. నేను చర్మం, ఊపిరితిత్తులు మరియు ఆస్యగ్రసని కుహరం ద్వారా శ్వాసిస్తాను.
జవాబు:
కప్ప

జతపరచుట

45. సరిగా జతపరిచిన దానిని గుర్తించండి.
ఆకులు – లెంటిసెల్స్
కాండం – పత్రరంధ్రము
వాయుగత వేర్లు – న్యుమాటోఫోర్స్
జవాబు:
వాయుగత వేర్లు – న్యుమాటోఫోర్స్

46. సరిగా జతపరిచిన దానిని గుర్తించండి.
ఊపిరితిత్తుల సామర్థ్యం – 5800 m.l
నిశ్వాస వాయువులోని CO2 – 0.03%
ఉచ్ఛ్వాస వాయువులోని O2 – 16%
జవాబు:
ఊపిరితిత్తుల సామర్థ్యం – 5800 m.l

47. సరిగా జతచేయబడని దానిని గుర్తించండి.
బాక్టీరియా – కిణ్వనం
కండరాలు – వాయురహిత శ్వాసక్రియ
ఈస్ట్ – వాయుసహిత శ్వాసక్రియ
జవాబు:
ఈస్ట్ – వాయుసహిత శ్వాసక్రియ

48. సరిగా జతచేయబడని దానిని గుర్తించండి.
ATP – ఎనర్జీ కరెన్సీ
మైటోకాండ్రియా – కణ శక్త్యాగారము
కణ ద్రవ్యం – క్రెబ్స్ వలయం
జవాబు:
కణ ద్రవ్యం – క్రెబ్స్ వలయం

49. సరిగా జతపరిచిన దానిని గుర్తించండి.
కండరాలు – లాక్టిక్ ఆమ్లం
బాక్టీరియా – ఇథైల్ ఆల్కహాల్
ఈస్ట్ – CO2 + లాక్టిక్ ఆమ్లం
జవాబు:
కండరాలు – లాక్టిక్ ఆమ్లం

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

50. సరిగా జతపరిచిన దానిని గుర్తించండి.
పుపుస శ్వాసక్రియ – ఊపిరితిత్తులు
జల శ్వాసక్రియ – వాయునాళం
చర్మ శ్వాసక్రియ – మొప్పలు
జవాబు:
పుపుస శ్వాసక్రియ – ఊపిరితిత్తులు

51. సరిగా జతచేయబడని దానిని గుర్తించండి.
పక్షులు – పుపుస శ్వాసక్రియ
టాడ్ పోల్ – జల శ్వాసక్రియ
సీతాకోక చిలుక – చర్మ శ్వాసక్రియ
జవాబు:
సీతాకోక చిలుక – చర్మ శ్వాసక్రియ

52. సరిగా జతచేయబడని దానిని గుర్తించండి.
బొద్దింక – వాయునాళం
వానపాము – చర్మం
బల్లి – మొప్పలు
జవాబు:
బల్లి – మొప్పలు

53. సరిగా జతచేయబడని దానిని గుర్తించండి.
స్థిరమైన గాలి – CO2
బొగ్గుపులుసు వాయువు – H2
ఖర్చయ్యే వాయువు – O2
జవాబు:
బొగ్గుపులుసు వాయువు – H2

54. సరిగా జతపరిచిన దానిని గుర్తించండి.
స్వరపేటిక – శబ్దపేటిక
వాయునాళం – ఆహార గొట్టం
ఆహారవాహిక – గాలిగొట్టం
జవాబు:
స్వర పేటిక – శబ్ద పేటిక

దోషాన్ని గుర్తించి, సరిచేసి రాయండి.

55. ఆహార పదార్థాలు ముఖ్యంగా గ్లూకోజ్, కొవ్వు ఆమ్లాలు క్షయకరణం చెంది కార్బన్ డై ఆక్సైడ్, నీరు ఏర్పడటాన్ని కణ శ్వాసక్రియ అంటారు.
జవాబు:
ఆహార పదార్థాలు ముఖ్యంగా గ్లూకోజ్, కొవ్వు ఆమ్లాలు ఆక్సీకరణం చెంది కార్బన్ డై ఆక్సైడ్, నీరు ఏర్పడటాన్ని కణ శ్వాసక్రియ అంటారు.

56. కంఠబిలం మీద మృదులాస్థితో ఏర్పడిన గ్రసని అనే పోలికను గుర్తించుట భాగం మూత వలె పనిచేస్తూ మరియు ఆహారాన్ని స్వరపేటిక ప్రవేశించకుండా నిరోధిస్తుంది.
జవాబు:
కంఠబిలం మీద మృదులాస్థితో ఏర్పడిన ఉపజిహ్విక అనే భాగం మూత వలె పనిచేస్తూ మరియు ఆహారాన్ని స్వరపేటికలోనికి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.

57. వాయునాళంలో స్వరతంత్రులు నిశ్వాస సమయంలో కంపిస్తూ ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి.
జవాబు:
స్వరపేటిక లో స్వరతంత్రులు నిశ్వాస సమయంలో కంపిస్తూ ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి.

58. పుపుస ధమని గుండె నుంచి ఊపిరితిత్తులకు ఆమ్లజని సహిత రక్తాన్ని తీసుకొస్తుంది.
జవాబు:
పుపుస ధమని గుండె నుంచి ఊపిరితిత్తులకు ఆమ్లజని రహిత రక్తం తీసుకొస్తుంది.

59. కార్బన్ డై ఆక్సైడ్ సాధారణంగా కార్బోనేట్స్ రూపంలో రవాణా చేయబడుతుంది. కొంతభాగం హీమోగ్లోబిన్ తో కలుస్తుంది.
జవాబు:
కార్బన్ డై ఆక్సైడ్ సాధారణంగా బైకార్బోనేట్స్ రూపంలో రవాణా చేయబడుతుంది. కొంతభాగం హీమోగ్లోబిన్ తో కలుస్తుంది.

60. నిజకేంద్రక కణాలలో కణద్రవ్యం మరియు హరితరేణువు కణ శ్వాసక్రియ జరిగే ప్రదేశాలు.
జవాబు:
నిజకేంద్రక కణాలలో కణద్రవ్యం మరియు మైటో కాండ్రియా కణ శ్వాసక్రియ జరిగే ప్రదేశాలు.

61. మైటోకాండ్రియాలోని లోపలి విభాగములోని పదార్థాన్ని అవర్ణిక అంటారు.
జవాబు:
మైటోకాండ్రియాలోని లోపలి విభాగములోని పదార్థాన్ని మాత్రిక అంటారు.

62. ATP అణువులో శక్తి హైడ్రోజన్ బంధాల రూపంలో నిలువ ఉంటుంది.
జవాబు:
ATP అణువులో శక్తి ఫాస్ఫేట్ బంధాల రూపంలో నిలువ ఉంటుంది.

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

63. కండరాలలో పైరువిక్ ఆమ్లం చేరడం వల్ల నొప్పి వస్తుంది.
జవాబు:
కండరాలలో లాక్టిక్ ఆమ్లం చేరడం వల్ల నొప్పి వస్తుంది.

64. వాయునాళాల ద్వారా జరిగే శ్వాసక్రియను చర్మ శ్వాసక్రియ అంటారు.
జవాబు:
చర్మం ద్వారా జరిగే శ్వాసక్రియను చర్మ శ్వాసక్రియ అంటారు.

పోలికను గుర్తించుట

65. ఉచ్ఛ్వాస O2 : 21% :: నిశ్వాస O2😕
జవాబు:
16%

66. నిశ్వాస CO2: 44% :: ఉచ్ఛ్వాస CO2😕
జవాబు:
0.03%

67. ఉచ్చ్వాస O2 : 21% :: ? : 44%
జవాబు:
నిశ్వాస CO2

68. బ్యా క్టీరియా : లాక్టిక్ ఆమ్లం :: ? : ఇథైల్ ఆల్కహాల్
జవాబు:
ఈస్ట్

69. పీత : మొప్పలు :: ? : వాయునాళం
జవాబు:
కీటకాలు

70. కప్ప : చర్మం :: ? : టాడ్ పోల్
జవాబు:
మొప్పలు

71. CO2 : స్థిరమైన వాయువు :: ? : ఖర్చయ్యే వాయువు
జవాబు:
ఆక్సిజన్

72. గాలిగొట్టం : ? :: శబ్దపేటిక : స్వరపేటిక
జవాబు:
వాయునాళం

బొమ్మలపై ప్రశ్నలు

73.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 35
గాలిని బైటకి వదిలినప్పుడుఅద్దంపై ఉండే ఆవిరికి ఏ ప్రక్రియ కారణమవుతుంది?
జవాబు:
శ్వాసక్రియ

74.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 36
ఈ చిత్రంలోని పార్ట్ X ను గుర్తించండి.
జవాబు:
గ్రసని

75.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 37
వాయునాళాన్ని ముడుచుకుపోకుండా, మూసుకుపోకుండా నిరోధించే భాగాలు ఏవి?
జవాబు:
O ఆకారంలో ఉన్న మృదులాస్థి ఉంగరాలు

76.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 38
ఊపిరితిత్తులకు గాయం కాకుండా కాపాడే త్వచపు నిర్మాణం ఏది?
జవాబు:
ఫ్లూరా

77.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 39
ఈ ప్రక్రియ శ్వాసక్రియలోని ఏ దశను తెలుపుతుంది?
జవాబు:
ఉచ్చ్వా సం

78.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 40
ఏ భౌతిక ప్రక్రియ వాయుగోణులు మరియు రక్త కేశనాళికల మధ్య వాయువుల మార్పిడిని అనుమతిస్తుంది?
జవాబు:
వ్యాపనం / విసరణ

79.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 41
ఈ ప్రయోగం నుండి విడుదలయ్యే ఏ వాయువు సున్నపు నీటిని పాల వలె తెల్లగా మారుస్తుంది?
జవాబు:
కార్బన్ డై ఆక్సెడ్

80.
AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 42
పటంలో చూపిన ఈ నిర్మాణాలు మొక్క యొక్క ఏ భాగంలో ఉంటాయి?
జవాబు:
కాండం

ఖాళీలను పూరించండి

81. శ్వాసక్రియ ప్రధాన లక్ష్యం …………
జవాబు:
శక్తి విడుదల

82. శ్వాసక్రియ నిర్వహించు కణాంగం ……….
జవాబు:
మైటోకాండ్రియా

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

83. ఆక్సిజన్ ప్రమేయం లేని శ్వాసక్రియ …….
జవాబు:
అవాయు శ్వాసక్రియ

84. శ్వాసక్రియ అంత్య ఉత్పన్నాలు ………….
జవాబు:
CO2, నీటిఆవిరి, ఉష్ణం మరియు శక్తి

85. కిణ్వనం అంత్య ఉత్పనము …………
జవాబు:
ఆల్కహాల్

86. అవాయు శ్వాసక్రియ జరుపు జీవులు ……….
జవాబు:
ఈస్ట్, బాక్టీరియా

87. సున్నపు తేటను పాల వలె మార్చు వాయువు. ………
జవాబు:
CO2

88. ఊపిరితిత్తుల నిర్మాణాత్మక ప్రమాణం …………
జవాబు:
వాయుగోణులు

89. ఊపిరితిత్తులలో వాయు వినిమయం జరిగే ప్రాంతం ………..
జవాబు:
వాయుగోణులు

90. ఊపిరితిత్తులను కప్పి ఉంచు పొర ……..
జవాబు:
ఫ్లూరా

91. శ్వాస కదలికలలో ప్రముఖ పాత్ర వహించునది ………
జవాబు:
ఉదర వితానం

92. కాండంపై శ్వాసక్రియకు తోడ్పడు నిర్మాణం ……….
జవాబు:
లెంటి సెల్స్

93. మడ అడవులలోని మొక్కలలో శ్వాసక్రియకు తోడ్పడు నిర్మాణాలు …..
జవాబు:
వాయుగత వేర్లు

94. జలచర జీవులలో శ్వాస అవయవాలు …………..
జవాబు:
మొప్పలు

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

95. చర్మం ద్వారా శ్వాసక్రియ జరిపే జీవి …………..
జవాబు:
వానపాము, కప్ప

10th Class Biology 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 1 Mark Bits Questions and Answers

1. కణం యొక్క ‘ఎనర్జీ కరెన్సీ’ అని దీనికి పేరు.
A) ADP
B) మైటోకాండ్రియా
C) ATP
D) క్లోరోప్లాస్టు
జవాబు:
C) ATP

2. అవాయు శ్వాసక్రియకు సంబంధించి నిర్వహించే ప్రయోగంలో ఆక్సిజన్ ఉనికిని తెలుసుకోవడానికి
A) డయాబీన్ గ్రీన్
B) పొటాషియం హైడ్రాక్సైడ్
C) బెటాడిన్
D) సల్ఫర్ తో ఉన్న కడ్డీ
జవాబు:
A) డయాబీన్ గ్రీన్

3. మనము విడిచే గాలిలోని అంశాలు ……..
A) కార్బన్ డై ఆక్సైడ్ మరియు ఆక్సిజన్
B) ఆక్సిజన్ మరియు నీటి ఆవిరి ఉపయోగించే ద్రావణం
C) కార్బన్ డై ఆక్సైడ్ మరియు నీటి ఆవిరి
D) నీటి ఆవిరి మాత్రమే
జవాబు:
C) కార్బన్ డై ఆక్సైడ్ మరియు నీటి ఆవిరి

4. భూమిపై ఆకుపచ్చని మొక్కలు లేకపోతే ఏమౌతుంది?
A) ప్రాణికోటికి O2 అందదు
B) ప్రాణికోటికి CO2 అందదు
C) ప్రాణికోటికి N2 అందదు
D) పైవన్నీ
జవాబు:
A) ప్రాణికోటికి O2 అందదు

5. మనము CO2 ని గుర్తించే పరీక్షలో సున్నపు నీటిని తరచుగా ఈ క్రింది మార్పును గమనించటానికి ఉపయోగిస్తాం.
A) రంగులోని మార్పు
B) వాసనలోని మార్పు
C) స్థితిలోని మార్పు
D) ఆకారంలోని మార్పు
జవాబు:
A) రంగులోని మార్పు

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

6. కాంతి చర్యలో కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం, నీటి అణువు విచ్ఛిన్నమవడం, CO2 అణువు గ్లూకోజ్ గా సంశ్లేషించబడటం – ఈ చర్యలు ఎక్కడ జరుగుతాయి? A) మైటోకాండ్రియా
B) రైబోజోములు
C) హరితరేణువు
D) లైసోజోములు
జవాబు:
C) హరితరేణువు

7. వంశీ నిర్వహించిన ప్రయోగంలో ఉష్ణమాపకంలో ఉష్ణోగ్రత పెరిగింది. ఈ ప్రయోగ ఉద్దేశ్యం ….
A) విత్తనాలు మొలకెత్తడం వల్ల CO2 విడుదలగును
B) శ్వాసక్రియలో ఉష్ణము విడుదలగును
C) శ్వాసక్రియలో ఆల్కహాల్ విడుదలగును
D) శ్వాసక్రియలో CO2 విడుదలగును
జవాబు:
B) శ్వాసక్రియలో ఉష్ణము విడుదలగును

8. నిశ్వాసించే వాయువులలో కార్బన్ డై ఆక్సైడ్ శాతం ఎంత?
A) 44
B) 4.4
C) 0.4
D) 0.04
జవాబు:
B) 4.4

9. హీమోగ్లోబిను ఈ క్రింది వానిలో దేనిని బంధించే శక్తి ఉంది?
A) O2
B) SO2
C) NO2
D) PO4
జవాబు:
A) O2

10. ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం
A) శ్వా సనాళిక
B) వాయుగోణులు
C) క్రిస్టే
D) నెఫ్రాన్
జవాబు:
A) శ్వా సనాళిక

11. శ్వాసక్రియలోని వివిధ దశల సరయిన క్రమాన్ని గుర్తించండి.
A) ఉఛ్వాస నిశ్వాసాలు → రక్తం → ఊపిరితిత్తులు → కణశ్వాసక్రియ
B) ఉఛ్వాస నిశ్వాసాలు → ఊపిరితిత్తులు → రక్తం – కణశ్వాసక్రియ
C) ఉఛ్వాస నిశ్వాసాలు – ఊపిరితిత్తులు → కణశ్వాసక్రియ → రక్తం
D) ఊపిరితిత్తులు → కణజాలాలు → రక్తం → కణశ్వాసక్రియ
జవాబు:
B) ఉఛ్వాస నిశ్వాసాలు → ఊపిరితిత్తులు → రక్తం – కణశ్వాసక్రియ

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

12. స్వరతంత్రులను ఇక్కడ గమనించవచ్చు.
A) స్వర పేటిక
B) గ్రసని
C) నాశికా కుహరం
D) వాయు నాళం
జవాబు:
A) స్వర పేటిక

మీకు తెలుసా?

→ ఊపిరితిత్తుల లోపలి భాగం లక్షల సంఖ్యలో ఉండే వాయుకోశ గోణులను కలిగి ఉండి, వాయుమార్పిడి జరిగే వైశాల్యాన్ని పెంచుతుంది. ఊపిరితిత్తులలోని లోపలి పొర ఎక్కువగా ముడతలుపడి ఉండడం వలన వాటి వైశాల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఊపిరితిత్తులలోని వాయుకోశ గోణులన్నింటినీ విడదీసి పరిస్తే దాదాపు 160 చదరపు మీటర్లు (ఒక టెన్నిస్ కోర్టు) వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి.

→ మన ఊపిరితిత్తులు (స్పాంజి’లాగా ఉంటాయి. ఇవి రెండూ ఒకే పరిమాణంలో ఉండవు. ఉరఃకుహరంలో ఎడమవైపు గుండె ఉండటం వలన ఆ వైపున ఉన్న ఊపిరితిత్తి కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఊపిరితిత్తులను కప్పుతూ ‘ఫ్లూరా’ అనే రెండు పొరలుంటాయి. ఈ పొరల మధ్యలో ద్రవం ఉండి ఊపిరితిత్తులను అఘాతాల నుండి కాపాడుతుంది. ఊపిరితిత్తులు గాలితో నిండేటప్పుడు, యథాస్థితికి వచ్చేటప్పుడు జరిగే ఘర్షణ నుండి కాపాడుతుంది.

→ మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం 5800 మిల్లీ లీటర్లు. విశ్రాంతి దశలో మనం సుమారుగా 500 మి.లీ గాలిని లోపలకు తీసుకుని బయటకు వదులుతాం. మనం పూర్తిగా ఊపిరితిత్తులలోని గాలిని బయటకు పంపినప్పటికీ ఇంకా 1200 మి.లీ వాయువు ఊపిరితిత్తులలో మిగిలే ఉంటుంది.

→ సముద్రమట్టం దగ్గర హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో పూర్తిగా సంతృప్తం చెందుతుంది. దాదాపు ప్రతి హిమోగ్లోబిన్ అణువు ఆక్సిజన్ తో బంధాన్ని ఏర్పరచి ఆక్సీ హిమోగ్లోబిన్ గా మారుతుంది. సముద్ర మట్టానికి 13 కిలోమీటర్ల పైన (8 మైళ్ళు) ఆక్సీజన్ లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. సముద్రమట్టంతో పోలిస్తే కేవలం ఐదవ వంతు ఆక్సిజన్ మాత్రమే లభ్యమవుతుంది. ఈ పరిస్థితులలో లభ్యమయ్యే ఆక్సిజన్ సగం హిమోగ్లోబిన్ అణువులను మాత్రమే సంతృప్తం చేయగలుగుతుంది.

హిమోగ్లోబిన్ తక్కువ ఆక్సిజన్ అణువులతో కలిసినట్లయితే, రక్తం కణజాలాలకు అవసరమైన రక్తాన్ని సరఫరా చేయలేదు. కృత్రిమమైన పద్దతిలో ఆక్సిజన్ సరఫరా (ఆక్సిజన్ సిలిండర్లతో) లేకుండా అంత ఎత్తులో జీవించడం అసాధ్యం. ఆధునిక విమానాలలో ఆక్సిజన్‌ను సరిపడినంత ఒత్తిడిలో ప్రయాణికులకు అందేలా ఏర్పాటు ఉంటుంది. సముద్రపు లోతుల్లోకి వెళ్ళే గజ ఈతగాళ్ళ సమస్యలు వేరేవిధంగా ఉంటాయి.

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

* మొక్కలు, జంతువులు, సూక్ష్మ జీవులన్నింటిలో శక్తి విడుదల కొరకు సాధారణంగా వినియోగించబడే పదార్థం గ్లూకోజ్. అన్ని జీవులలోను గ్లూకోజ్ రెండు దశలలో ఆక్సీకరింపబడుతుంది. మొదటి దశలో గ్లూకోజ్ రెండు పై రూబిక్ ఆమ్ల అణువులుగా విడగొట్టబడుతుంది. రెండవ దశలో ఆక్సిజన్ లభ్యమైనట్లయితే పైరూవిక్ ఆమ్లం కార్బన్ డై ఆక్సైడ్, నీరుగా ఆక్సీకరింపబడుతుంది. దీనితోపాటు ఎక్కువ పరిమాణంలో శక్తి విడుదలవుతుంది. ఆక్సిజన్ లభ్యం కాని పక్షంలో పైరువిక్ ఆమ్లం ఇథనాల్ గా కాని, లాక్టిక్ ఆమ్లంగా కాని మార్చబడి ఆక్సిజన్ సమక్షంలో జరిగే చర్యలలో కంటే పదవ వంతు శక్తి మాత్రమే విడుదలవుతుంది.

పునశ్చరణ

AP 10th Class Biology Important Questions 2nd lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 43