AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

These AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ will help students prepare well for the exams.

AP Board 10th Class Biology 3rd lesson Important Questions and Answers ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

10th Class Biology 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
రక్తంలో రక్తఫలకికలు లేకపోతే ఏమి జరుగుతుంది?
జవాబు:
రక్తఫలకికలు రక్త స్కందనంలో పాల్గొంటాయి. రక్తఫలకికలు లేకపోతే ప్రమాదం జరిగినపుడు రక్తం గడ్డకట్టదు. అందువలన అధిక రక్తస్రావం జరిగి వ్యక్తి మరణిస్తాడు.

ప్రశ్న 2.
ఇద్దరు వ్యక్తుల రక్తపీడనం ఇలా ఉంది.

రామయ్య 140 / 807
రంగయ్య 110 / 90

ఎవరి రక్తపీడనం ఎక్కువ ? అది దేనిని సూచిస్తుంది?
జవాబు:
రామయ్య రక్తపీడనం ఎక్కువ. దీనిలో 140 సిస్టోలిక్ పీడనం, 80 డయాస్టోలిక్ పీడనాన్ని సూచిస్తుంది.

ప్రశ్న 3.
మన నాడీస్పందన ఎప్పుడు అధికమౌతుంది?
జవాబు:
పరిగెత్తుట, వ్యాయామము, భయం, ఉద్వేగం, ఎత్తైన ప్రదేశాలకు ఎక్కుతున్నప్పుడు అధికమౌతుంది.

ప్రశ్న 4.
శోషరసం రక్తం కన్నా ఏ విధంగా భిన్నంగా ఉంటుంది?
జవాబు:

  1. రక్తంలో ఎర్ర రక్తకణాలు ఉంటాయి, కానీ శోషరసంలో ఉండవు.
  2. రక్తం ఎరుపు రంగులో ఉంటుంది, కానీ శోషరసం వర్ణరహితంగా ఉండును.

ప్రశ్న 5.
ఏ జీవులలో రక్తం ఆక్సిజన్‌ను సరఫరా చేయదు?
జవాబు:
ఆర్థోపొడా జీవులు లేదా కీటకాలు (లేదా) వాయునాళ శ్వాసవ్యవస్థ కలిగిన జీవులు.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 6.
మేక గుండె పరిశీలించుటకు ప్రయోగశాలలో మీరు ఉపయోగించిన పరికరాలను తెలుపండి.
జవాబు:
కావలసిన పరికరాలు :
1. మేక తాజా గుండె, 2. సోడాస్త్రాలు, 3. ఉపయోగించిన పెన్ను, రీఫిల్స్, 4. పదునైన బ్లేడు, (లేదా) స్కాల్ పెల్, 5. డిసెక్షన్ ట్రే, 6. ఒక మగ్గు నీరు, 7. డిసెక్షన్ కత్తెర, 8. ఫోర్సెప్స్.

ప్రశ్న 7.
ప్రయోగశాలలో వేరుపీడన ప్రయోగంను నిరూపించుటకు కావలసిన పరికరాల జాబితాను తెల్పండి.
జవాబు:
వేరుపీడన ప్రయోగంను నిరూపించుటకు కావలసిన పరికరాలు : క్లాంప్, గాజు గొట్టం, గట్టి రబ్బరు గొట్టం, కుండీలో పెరుగుతున్న మొక్క.

ప్రశ్న 8.
శరీరంలో అతి పెద్ద ధమని పేరు రాయండి.
జవాబు:
శరీరంలో అతి పెద్ద ధమని : బృహద్ధమని

ప్రశ్న 9.
పటంలో చూపిన పరికరాన్ని గుర్తించి, దాని పేరు రాయండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 1
జవాబు:
స్పిగ్మోమానోమీటర్.

ప్రశ్న 10.
అధిక రక్తపోటు గురించి మరిన్ని వివరాలు తెలుసుకొనుటకు డాక్టర్‌ను మీరు అడిగే రెండు ప్రశ్నలు రాయండి.
జవాబు:

  1. అధిక రక్తపోటు వలన కలిగే పరిణామాలు ఏమిటి?
  2. అధిక రక్తపోటును ఎలా నివారించవచ్చు?

ప్రశ్న 11.
నిమ్నస్థాయి జీవులలో జీవక్రియలు ఎలా జరుగుతాయి?
జవాబు:
అమీబా, హైడ్రా. వంటి నిమ్నస్థాయి జీవులలో పదార్థాలన్నీ వ్యాపనం (Diffusion), ద్రవాభిసరణ (Osmosis) వంటి సరళమైన పద్ధతుల ద్వారా జరుగుతాయి.

ప్రశ్న 12.
నాడీస్పందన అనగానేమి?
జవాబు:
నాడీస్పందన :
హృదయ స్పందన వలన మణికట్టు వద్ద రక్తనాళాలలో లయ కదలికను నాడీ స్పందన (Pulse) అంటారు. నాడీ స్పందన రేటు హృదయస్పందన రేటుకు సమానం.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 13.
ఎడిమా అనగానేమి?
జవాబు:
ఎడిమా :
కాళ్ళలోని కణజాల ద్రవం పైకి ప్రసరించక కాళ్ళలో నిల్వ ఉండుటవలన వాపు కనిపిస్తుంది. ఈ స్థితిని “ఎడిమా” అంటారు. ప్రధానంగా ఎక్కువ సేపు కూర్చొని ప్రయాణించినపుడు ఈ స్థితిని గమనించవచ్చు.

ప్రశ్న 14.
కణజాల ద్రవం అనగానేమి?
జవాబు:
కణజాల ద్రవం :
హృదయస్పందన వలన రక్తం రక్తనాళాలలో ప్రవహిస్తుందని మనకు తెలుసు. గుండె నుండి ప్రవహించే రక్తం, రక్తనాళాల ద్వారా ప్రవహిస్తూ చివరకు రక్తకేశనాళికలను చేరుతుంది. పోషకాలతో కూడిన రక్తంలోని ద్రవం రక్తకేశనాళికల ద్వారా కణజాలాలలోనికి చేరుతుంది. కణజాలాలలోనికి చేరిన రక్తంలోని ద్రవభాగాన్ని “కణజాల ద్రవం” (Tissue fluid) అంటారు.

ప్రశ్న 15.
అమీబా వంటి ఏకకణ జీవులలో ప్రసరణ ఎలా జరుగుతుంది?
జవాబు:
అమీబా, హైడ్రా, వంటి నిమ్నస్థాయి జీవులలో పదార్థాలన్నీ వ్యాపనం, ద్రవాభిసరణ వంటి సరళమైన పద్ధతుల ద్వారా జరుగుతుంది.

ప్రశ్న 16.
ప్రసరణ వ్యవస్థ అనగానేమి?
జవాబు:
ప్రసరణ వ్యవస్థ:
జీవులలో కణజాలానికి కావలసిన పదార్థాలను రవాణా చేయు వ్యవస్థను “ప్రసరణ వ్యవస్థ” అంటారు.

ప్రశ్న 17.
గుండెకు రక్షణను కల్పించే నిర్మాణం ఏమిటి?
జవాబు:
ప్రక్కటెముకలు, హృదయావరణత్వచం గుండెకు రక్షణ కల్పిస్తాయి.

ప్రశ్న 18.
గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే నాళం ఏమిటి?
జవాబు:
కరోనరి ధమని గుండె కండరాలకు రక్తాన్ని అందిస్తుంది.

ప్రశ్న 19.
గుండెలోని గదులు ఏమిటి?
జవాబు:
గుండెలో నాలుగు గదులు ఉంటాయి. పై రెండు గదులను “కర్ణికలు” అని, క్రింది రెండు గదులను “జఠరికలు” అని అంటారు.

ప్రశ్న 20.
గుండెకు రక్తాన్ని తెచ్చే రక్తనాళాలు ఏమిటి?
జవాబు:
గుండెకు రక్తాన్ని తెచ్చే రక్తనాళాలను “ధమనులు” అంటారు.

ప్రశ్న 21.
పుపుస ధమని పని ఏది?
జవాబు:
పుపుస ధమని గుండె నుండి రక్తాన్ని ఊపిరితిత్తులకు తీసుకెళుతుంది.

ప్రశ్న 22.
ఊర్ధ్వబృహత్ సిర పని ఏమిటి?
జవాబు:
ఊర్ధ్వబృహత్ సిర తలపైన ఉన్న భాగాల నుండి రక్తాన్ని సేకరించి గుండెకు చేర్చుతుంది.

ప్రశ్న 23.
అథోబృహత్ సిర పని ఏమిటి?
జవాబు:
అథోబ్మహత్ సిర శరీరం క్రింద భాగాల నుండి, రక్తాన్ని సేకరించి గుండెకు చేర్చుతుంది.

ప్రశ్న 24.
ధమనీ ఛాపం (Arota)అనగానేమి?
జవాబు:
ధమనీ ఛాపం :
శరీరంలోని అతి పెద్ద ధమనిని ధమనీ చాపం అంటారు. ఇది ఎడమ జఠరిక నుండి ప్రారంభమై శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది.

ప్రశ్న 25.
ద్వివలయ ప్రసరణ అనగానేమి?
జవాబు:
ద్వివలయ ప్రసరణ :
దేహభాగాలకు రక్తాన్ని రెండు వలయాలలో పంపే హృదయాన్ని “ద్వివలయ ప్రసరణ” అంటారు.

ప్రశ్న 26.
సూక్ష్మ కేశనాళికలు అనగానేమి?
జవాబు:
సూక్ష్మకేశనాళికలు :
శరీరంలో రక్తనాళాలు సన్నని నాళాలుగా విడిపోతాయి. వీటిని సూక్ష్మనాళికలు (Capillaries) అంటారు. లాటిన్ భాషలో capillaries అంటే కేశం అని అర్థం. ఈ నాళాలు వెంట్రుకలవలె సన్నగా ఉంటాయి.

ప్రశ్న 27.
హార్దిక వలయం అనగానేమి?
జవాబు:
కర్ణికలు, జఠరికలు ఒకసారి సంకోచించి తరువాత యథాస్థితికి వస్తే దానిని “హృదయస్పందన లేదా హార్దిక వలయం” (Cardiac cycle) అంటారు.

ప్రశ్న 28.
హార్దిక వలయంలోని ప్రక్రియలు ఏమిటి?
జవాబు:
హర్దిక వలయంలో ఒక సంకోచదశ (సిస్టోల్), ఒక సడలింపు దశ (డయాస్టోల్) ఉంటాయి.

ప్రశ్న 29.
హార్దిక వలయానికి పట్టే సమయం ఎంత?
జవాబు:
హార్దిక వలయం సుమారుగా 0.8 సెకన్లలో పూర్తి అవుతుంది. ఈ ప్రక్రియలో కర్ణికల సంకోచానికి 0.11-0. 14 సెకన్లు, జఠరికా సంకోచానికి 0.27-0. 35 సెకన్ల సమయం పడుతుంది.

ప్రశ్న 30.
ఏకవలయ ప్రసరణ అనగానేమి?
జవాబు:
ఏకవలయ ప్రసరణ :
రక్తప్రసరణ ఒకే వలయం ద్వారా జరిపే వ్యవస్థను “ఏకవలయ ప్రసరణ” అంటారు.

ప్రశ్న 31.
కణజాల ద్రవం అనగానేమి?
జవాబు:
కణజాల ద్రవం :
కణజాలాలలోనికి చేరిన రక్తంలోని ద్రవ భాగాన్ని కణజాల ద్రవం (Tissue fluid) అంటారు.

ప్రశ్న 32.
శోషరసం, కణజాలద్రవం మధ్యగల భేదమేమి?
జవాబు:
ఘనపదార్థాలు లేని రక్తాన్ని “శోషరసం” అంటారు. కణజాలలో ఉన్న శోషరసాన్ని “కణజాలద్రవం” అంటారు.

ప్రశ్న 33.
సీరం అనగానేమి?
జవాబు:
సీరం :
రక్తం గడ్డకట్టిన తరువాత మిగిలిన ద్రవాన్ని “సీరం” అంటారు.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 34.
బ్రౌనియన్ చలనం అనగానేమి?
జవాబు:
బ్రౌనియన్ చలనం : కణజీవపదార్థంలో ఉండే సహజ కదలికలను “బ్రేనియన్ చలనం” అంటారు.

ప్రశ్న 35.
వివృత రక్తప్రసరణ వ్యవస్థ అనగానేమి?
జవాబు:
వివృత రక్తప్రసరణ వ్యవస్థ :
రక్తం రక్తనాళాలలో కాకుండా శరీర కుహరాల ద్వారా ప్రసరించే వ్యవస్థను “వివృత రక్తప్రసరణ వ్యవస్థ” అంటారు.
ఉదా : బొద్దింక

ప్రశ్న 36.
సంవృత రక్తప్రసరణ వ్యవస్థ అనగానేమి?
జవాబు:
సంవృత రక్తప్రసరణ వ్యవస్థ :
రక్తం రక్తనాళాలలో ప్రసరించే వ్యవస్థను “సంవృత ‘రక్తప్రసరణ వ్యవస్థ” అంటారు
ఉదా : మానవుడు.

ప్రశ్న 37.
రక్తపీడనం అనగానేమి? దాని విలువ ఎంత?
జవాబు:
రక్తం రక్తనాళాలలో ప్రవహించేటప్పుడు కలిగించే పీడనాన్ని “రక్తపీడనం” అంటారు. దీని విలువ 120/80.

ప్రశ్న 38.
120/80 దేనిని తెలియజేస్తుంది?
జవాబు:
120/80 లో 120 సిస్టోలిక్ పీడనాన్ని, 80 డయాస్టోలిక్ పీడనాన్ని తెలియజేస్తుంది.

ప్రశ్న 39.
రక్తస్కందనంలో పాల్గొనే ఎంజైమ్ ఏమిటి?
జవాబు:
రక్తస్కందనంలో థ్రాంబోకైనేజ్ ఎంజైమ్ పాల్గొంటుంది. ఇది రక్తఫలకికల నుండి విడుదల చేయబడుతుంది.

ప్రశ్న 40.
మొక్కలలోని పోషక కణజాలం పని ఏమిటి?
జవాబు:
మొక్కలలోని పోషక కణజాలం ఆహార రవాణాలో పాల్గొంటుంది.

ప్రశ్న 41.
నాళికాపుంజం దేనితో నిర్మితమౌతుంది?
జవాబు:
దారువు, పోషకకణజాలం వలన నాళికాపుంజం నిర్మితమవుతుంది.

ప్రశ్న 42.
వేరు పీడనం అనగానేమి?
జవాబు:
వేరు పీడనం :
వేరు, నీటిని పీల్చుకొన్నప్పుడు కలిగించే పీడనాన్ని “వేరు పీడనం” అంటారు.

ప్రశ్న 43.
బాష్పోత్సేకం అనగానేమి?
జవాబు:
బాష్పోత్సేకం :
మొక్క దేహభాగాల నుండి నీరు ఆవిరై పోవడాన్ని “బాష్పోత్సేకం” అంటారు.

ప్రశ్న 44.
జఠర ప్రసరణ కుహరం ఏ జీవులలో ఉంటుంది?
జవాబు:
స్పంజికలు, హైడ్రా, జెల్లీ చేప వంటి నిడేరియా జీవులలో జఠర ప్రసరణ కుహరం ఉంటుంది.

ప్రశ్న 45.
శరీరంలో పెద్ద ధమని ఏమిటి?
జవాబు:
బృహత్ ధమని శరీరంలోని పెద్ద ధమని. ఇది శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది.

ప్రశ్న 46.
అతి పెద్ద గుండె గల జంతువు ఏమిటి?
జవాబు:
నీటి తిమింగలం 750 కేజీల బరువు కలిగిన పెద్ద గుండె కలిగి ఉంటుంది.

ప్రశ్న 47.
రక్తపోటు అనగానేమి?
జవాబు:
రక్తపోటు :
రక్తపీడనం 120/80 కంటే అధికంగా ఉంటే దానిని “రక్తపోటు” అంటారు.

ప్రశ్న 48.
నీరు మూలకేశాలలోనికి ఏ ప్రక్రియ ద్వారా చేరుతుంది?
జవాబు:
మూలకేశాలలోనికి నీరు ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా చేరుతుంది.

10th Class Biology 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
నీలిమ తన మిత్రులతో ఒక కృత్యం నిర్వహించింది. దాని ఫలితాలను కింది పట్టికలో నమోదుచేసింది. పట్టికను పరిశీలించి ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 2
i) నాడీ స్పందనకు, హృదయ స్పందనకు మధ్య ఏ విధమైన సంబంధాన్ని గుర్తించారు?
ii) జాగింగ్ చేసిన తర్వాత హృదయ స్పందన రేటు ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటి?
జవాబు:
i) నాడీ స్పందనకు, హృదయ స్పందనకు మధ్య ఏ విధమైన సంబంధాన్ని గుర్తించారు?
జవాబు:
నాడీ స్పందన రేటు హృదయ స్పందన రేటుకు సమానంగా ఉంటుంది.

ii) జాగింగ్ చేసిన తర్వాత హృదయ స్పందన రేటు ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటి?
జవాబు:
జాగింగ్ లో ఎక్కువ శక్తి వినియోగించబడి శ్వాసక్రియరేటు పెరుగుతుంది. కణజాలానికి అధిక ), అందించుటకు హృదయస్పందన రేటు పెరుగును.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 2.
ఒక విద్యార్థి ఆడుకుంటున్నప్పుడు గాయపడ్డాడు. అయితే రక్తం కారడం ఎంత సేపటికీ ఆగలేదు. దీనికి కారణాలు ఏమై ఉండవచ్చో, రాయండి.
జవాబు:
రక్తస్కందనం జరగకపోవటానికి

  1. రక్త ఫలకిలకలు తక్కువగా ఉండవచ్చు.
  2. విటమిన్ K లోపించి ఉండవచ్చు.
  3. హీమోఫీలియా వ్యాధి కల్గి ఉండవచ్చు.
  4. రక్త స్కందన ప్రోటీన్స్ లోపించి ఉండవచ్చు.

ప్రశ్న 3.
మీ ఉపాధ్యాయుడి నుండి “రక్త స్కందన” గురించి తెలుసుకొనుటకు ఏ ప్రశ్నలను వేస్తావు?
జవాబు:

  1. రక్తస్కందనం అనగానేమి?
  2. రక్తం ఏ విధంగా గడ్డ కడుతుంది?
  3. రక్తం గడ్డ కట్టడానికి కారణమేమిటి?
  4. రక్తం గడ్డ కట్టుటలో జరిగే ప్రక్రియ ఏమిటి?
  5. ఏ పదార్థము రక్తనాళములలో రక్తము గడ్డకట్టకుండా నివారిస్తుంది?
  6. రక్తం గడ్డ కట్టడానికి కావలసిన విటమిన్ ఏది?
  7. ప్రమాదాలు జరిగినపుడు రక్తం గడ్డ కట్టకపోతే ఏమి జరుగుతుంది?
  8. రక్తములో ఉన్న ఏ కణాలు రక్తం గడ్డకట్టడానికి సహాయం చేస్తాయి?

ప్రశ్న 4.
మానవ హృదయంలో కవాటాలు ఎక్కడెక్కడ ఉంటాయి? వాటి పేర్లు రాయండి.
జవాబు:

కవాటం పేరు కవాట స్థానం
1) కుడి కర్ణికా జఠరిక కవాటం / త్రిపత్ర కవాటం / అగ్రత్రయ కవాటం. 1) కుడి కర్ణిక, కుడి జఠరిక మధ్యలో
2) ద్విపత్ర కవాటం / మిట్రల్ కవాటం / అగ్రద్వయ కవాటం. 2) ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక మధ్యలో
3) పుపుస కవాటం / అర్ధ చంద్రాకార కవాటం 3) పుపుస ధమని బయలుదేరే వద్ద
4) దైహిక కవాటం 4) బృహద్ధమని బయలుదేరే వద్ద

ప్రశ్న 5.
మీ పాఠశాలలో పని చేయుచున్న ఉపాధ్యాయుల రక్త పీడనముల సమాచారం సేకరించారు కదా. వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి నివేదిక వ్రాయండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 3
జవాబు:

  1. శ్రీ విజయ్ రక్తపీడనం సాధారణ స్థాయిలో ఉన్నది.
  2. శ్రీమతి ఉమాదేవి అధిక రక్తపీడనం కలిగి ఉన్నది. ఈమెలో చికాకు, ఆందోళన లక్షణాలు ఉన్నాయి.
  3. శ్రీ నాగేశ్వరరావు అధిక రక్తపోటును కలిగి ఉన్నాడు. ఈయన భయం, తొందరగా కోపాన్ని ప్రదర్శించడం మొదలగు లక్షణాలతో బాధపడుచున్నారు.
  4. శ్రీమతి శాంత అల్ప రక్తపీడనం (Low B.P) తో బాధపడుచున్నది. ఈమె అలసట, కళ్ళు తిరగడం, మగతగా ఉండటం వంటి లక్షణాలను కలిగి ఉన్నది.

ప్రశ్న 6.
శోషరస వ్యవస్థ విధుల గురించి తెలుసుకున్న తరువాత మీ పెద్దలకు నీవు ఎడిమా గురించి ఎటువంటి సలహాలిస్తావు?
జవాబు:

  1. వీలైనంతవరకు ఒకే చోట స్థిరముగా కూర్చోకూడదు.
  2. కాళ్ళను కదుపుతూ ఉండాలి.
  3. వీలైనంతవరకు వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చోవాలి.
  4. ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
  5. నిరంతర వ్యాయామం చెయ్యాలి.
  6. ఉష్ణోగ్రతలలో సంభవించే అధిక తేడాల నుంచి తమను తాము రక్షించుకోవాలి.

ప్రశ్న 7.
సిరలలో కవాటాలు లేకపోతే ఏమవుతుంది?
జవాబు:

  1. సిరలలో రక్తం ఒకే మార్గంలోనే ముందుకే కాకుండా, వెనుక ప్రయాణిస్తుంది.
  2. గుండెకు రక్తం చేరడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.
  3. సిరలు ఉబ్బే అవకాశం ఉంది.

ప్రశ్న 8.
పుప్పుస సిరను తాడుతో బంధిస్తే ఏమి జరుగుతుందో ఊహించండి.
జవాబు:

  1. పుపుస సిరను తాడుతో బంధించుట వలన ఊపిరితిత్తుల నుంచి గుండెకు సరఫరా అయ్యే ఆమ్లజని సహిత రక్తం సరఫరా అవ్వదు.
  2. దీని వలన శరీరానికి ఆమ్లజని సహిత రక్తం అందక జీవి మరణించును.

ప్రశ్న 9.
హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉండటానికి నీవు ఇచ్చే సూచనలు ఏమిటి?
జవాబు:

  1. సక్రమమైన ఆహార నియమాలు పాటించాలి.
  2. తక్కువ కొవ్వులు కల్గిన ఆహారాన్ని తీసుకోవాలి.
  3. క్రమబద్ధమైన వ్యాయామం చేయాలి.
  4. ఆల్కహాలు, ధూమపానం చేయకూడదు.
  5. శారీరక, మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.

ప్రశ్న 10.
క్రింది పట్టికను పరిశీలించి, ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 4
a) హృదయ స్పందన అనగా నేమి?
జవాబు:
హృదయ స్పందన :
కర్ణికలు, జఠరికలు ఒకసారి సంకోచించి తరువాత యథాస్థితికి వస్తే దానిని ఒక హృదయ స్పందన అంటారు.
(లేదా)
ఒక సిస్టోల్ మరియు డయాస్టోలను కలిపి హృదయ స్పందన అంటారు.

b) గుండె బరువుకు, హృదయ స్పందనకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
జవాబు:
గుండె బరువు పెరిగే కొద్దీ ఒక నిమిషానికి జరిగే హృదయ స్పందనలు తగ్గుతాయి.

ప్రశ్న 11.
ప్రసరణ వ్యవస్థ యొక్క ఆవశ్యకత ఏమిటి?
జవాబు:
ట్రిలియన్ల సంఖ్యలో కణాలు కలిగిన ఉన్నతస్థాయి జీవులు వ్యాపనం, ద్రవాభిసరణ వంటి పద్ధతుల ద్వారా ఎక్కువ పరిమాణంలో పదార్థాలు రవాణా చేయడానికి సంవత్సరాల కొద్దీ సమయం అవసరమవుతుంది.

ఈ అనవసరపు ఆలస్యాన్ని నివారించడానికి జీవులన్నింటికి ప్రత్యేకమైన, వేగవంతమైన, సమర్థవంతమైన వ్యవస్థ యొక్క అవసరం ఏర్పడింది. జీవులు ప్రత్యేకంగా ఏర్పరచుకునే ఈ వ్యవస్థనే ‘ప్రసరణ వ్యవస్థ’ (Circulatory system) అంటారు.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 12.
స్టెతస్కోపు ఆవిష్కరణను తెలపండి.
జవాబు:
“రెని లెన్నెక్” (Rene Laennec) అనే శాస్త్రవేత్త 1816 సం||లో స్టెతస్కోపును కనుగొన్నాడు. స్టెతస్కోపు కనుగొనక పూర్వం వైద్యులు రోగి రొమ్ముపై చెవి ఆనించి హృదయస్పందన వినేవారు. రోగి హృదయస్పందన వినటానికి వెన్నెక్ మొదటిసారి కాగితపు గొట్టాన్ని ఉపయోగించాడు. గొట్టం ఒక చివరను రోగి రొమ్ముకు ఆనించి, రెండవ చివర చెవి ఉంచి వినేవాడు. కాగితపు గొట్టం ద్వారా శబ్దం స్పష్టంగా వినిపించడాన్ని ఆయన గమనించాడు. తర్వాత కాలంలో కాగితపు గొట్టం స్థానంలో వెదురు గొట్టాన్ని వాడేవారు. లెన్నెక్ దీనికి స్టెతస్కోపు అని పేరు పెట్టాడు.

ప్రశ్న 13.
హృదయం ఎలా రక్షించబడుతుంది?
జవాబు:

  1. హృదయం చుట్టూ రెండు పొరలు గల హృదయావరణం ఉంటుంది.
  2. ఈ రెండు పొరల మధ్య వుండే కుహరాన్ని ‘హృదయావరణ కుహరం’ అంటారు.
  3. దీనిలో హృదయావరణ ద్రవం ఉంటుంది.
  4. హృదయావరణం, హృదయావరణ ద్రవం హృదయాన్ని షాకుల నుండి, దెబ్బల నుండి రక్షిస్తాయి.
  5. హృదయాన్ని కాపాడుతూ అన్నివైపుల నుండి ప్రక్కటెముకలు వెనుకవైపు నుండి వెన్నుముక రక్షణ ఇస్తుంది.

ప్రశ్న 14.
సిరా వ్యవస్థ గురించి రాయండి.
జవాబు:

  1. మానవ శరీరంలో మూడు మహాసిరలు ఉన్నాయి. అవి :
    1) పూర్వమహాసిర 2) పరమహాసిర 3) పుపుససిర.
  2. పూర్వమహాసిర తల, మెడవంటి శరీర పైభాగాల నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని హృదయానికి తెస్తుంది.
  3. అథోమహాసిర శరీర దిగువ భాగాల నుండి (ఉదరం, కాళ్ళు, చేతులు) ఆమ్లజని రహిత రక్తాన్ని హృదయానికి తెస్తుంది.
  4. పుపుససిర ఊపిరితిత్తుల నుండి ఆమ్లజని సహిత రక్తాన్ని హృదయానికి తెస్తుంది.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 5

ప్రశ్న 15.
రక్తప్రసరణ వ్యవస్థ గురించిన ప్రాచీన తప్పుడు భావనలను విలియం హార్వే ఎలా ఖండించాడు?
జవాబు:
గుండె నుండి శరీరానికి చేరిన రక్తం వినియోగించబడి మరలా కొత్త రక్తం ఏర్పడుతుందనే భావన తప్పని హార్వే నిరూపించాడు. గుండె ఒక సంకోచంలో ఎంత రక్తాన్ని పంపిణీ చేస్తుందో అలాగే ఒక నిమిషానికి ఎన్ని స్పందనలు చోటు చేసుకుంటాయో లెక్కించాడు.

ఒక గంటలో గుండె మనిషి బరువుకు మూడురెట్ల రక్తం పంపిణీ చేస్తుందని హార్వే కనుగొన్నాడు. అంటే అంత రక్తం, ఇంత తక్కువ సమయంలో ఉత్పత్తి కాదు. దీనిని బట్టి రక్తం గుండె నుండి శరీరానికి, శరీరం నుండి గుండెకు మరల మరలా ప్రవహిస్తుందని చెప్పవచ్చు అని గుర్తించాడు.

ప్రశ్న 16.
రక్తకేశనాళికలను ఎలా గుర్తించారు? వాటి అర్థం ఏమిటి?
జవాబు:
హార్వే మరణించిన 4 సంవత్సరాల తర్వాత 1661 సంవత్సరంలో మాల్ఫీజి గబ్బిలం రెక్కలపై అధ్యయనం చేశాడు. గబ్బిలం రెక్కలో ఉండే అతి పలుచని పొరలోని (పెటాజియం ) రక్తనాళాలను సూక్ష్మదర్శిని సాయంతో పరిశీలించాడు. అప్పుడే ధమనులు మరియు సిరల మధ్యనుండే అతి సన్నని, చిన్నవైన రక్తనాళాలను చూడగలిగాడు.

ఆ సన్నని రక్తనాళాలకు సూక్ష్మ కేశనాళికలు (capillaries) అని పేరు పెట్టాడు. లాటిన్ భాషలో Capillaries అంటే కేశం అని అర్థం. ఎందుకంటే ఆ నాళాలు కూడా వెంట్రుకల వలె సన్నగా ఉంటాయి.

రక్తకేశనాళికలను కనుగొనడం ద్వారా రక్త ప్రసరణ విధానం గూర్చి, పూర్తిగా అర్థం అయ్యింది.

ప్రశ్న 17.
హార్దిక వలయానికి ఎంత సమయం పడుతుంది?
జవాబు:
హారిక వలయంలో గుండె కండరాలు చురుకుగా పాల్గొనే సంకోచక్రియ (systole), విశ్రాంతి తీసుకునే యథాపూర్వస్థితు (diastole) లు ఒకదానివెంట ఒకటి ఏర్పడుతూ ఉంటాయి. ఈ మొత్తం ప్రక్రియ సుమారుగా 0.8 సెకన్లలో పూర్తవుతుంది. కర్ణికల సంకోచానికి పట్టే సమయం 0.11-0. 14 సెకన్లు కాగా జఠరికల సంకోచానికి 0.27-0.35 సెకన్ల సమయం పడుతుంది.

ప్రశ్న 18.
శోషరస వ్యవస్థ అనగానేమి? దాని విధులు ఏమిటి?
జవాబు:
కణజాలంలో మిగిలిపోయిన ఈ కణజాల ద్రవాన్ని ప్రధాన రక్తప్రసరణ వ్యవస్థలోకి చేర్చడానికి మరొక సమాంతర వ్యవస్థ ఏర్పాటయింది. దానినే శోషరస వ్యవస్థ అంటారు. లాటిన్ భాషలో లింఫ్ అంటే నీరు అని అర్థం.
రక్తాన్ని, కణాలను జోడించే ప్రధానమైన పదార్థం శోషరసం. రక్తం నుండి పోషకాలను గ్రహించి కణాలకు అందించడం, కణాల నుండి వృథా పదార్థాలను సేకరించి రక్తంలోనికి చేర్చడం. శోషరసం నిర్వహించే విధులు.

సిరా వ్యవస్థకు సమాంతరమైన ఈ వ్యవస్థ కణజాలద్రవాన్ని సిరా వ్యవస్థలోకి చేర్చటానికి తోడ్పడుతోందన్నమాట.

ప్రశ్న 19.
వివిధ జంతువుల శరీరం బరువు, గుండె బరువు, హృదయస్పందన గురించిన సమాచారం సేకరించండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 6

ప్రశ్న 20.
సంవృత రక్తప్రసరణ వ్యవస్థ (Closed Circulatory System) అనగానేమి?
జవాబు:
స్వేచ్ఛాయుత రక్తప్రసరణ వ్యవస్థ :

  1. కీటకములు, మొలస్కా జీవులలో రక్తనాళాలు లేవు.
  2. ఈ జంతువులలో హృదయం శరీరంలో పెద్ద కాలువల్లా వుండే ప్రదేశాల్లోకి రక్తాన్ని పంపు చేస్తుంది. వీటిని ‘కోటరాలు’ అంటారు.
  3. ఈ విధమైన రక్తప్రసరణ వ్యవస్థని “స్వేచ్ఛాయుత రక్తప్రసరణ వ్యవస్థ” అంటారు.

ప్రశ్న 21.
వివృత రక్తప్రసరణ వ్యవస్థ (Open Circulatory System) అనగానేమి?
జవాబు:
వివృత రక్తప్రసరణ వ్యవస్థ :

  1. చాలా జంతువులలో రక్తనాళాలు ఉంటాయి.
  2. హృదయం రక్తాన్ని వీటిలోకి పంపు చేస్తుంది. ఈ విధమైన రక్తప్రసరణ వ్యవస్థను “బంధిత రక్తప్రసరణ వ్యవస్థ” అంటారు.
  3. కప్పల వంటి ఉన్నతస్థాయి జీవులలో రక్తం హృదయం నుండి ధమనులలోకి, ధమనుల నుండి సిరల ద్వారా మళ్లీ గుండెకు చేరుతుంది. దీనిని ‘ద్వివలయ రక్తప్రసరణ’ అంటారు.
  4. చేపలలో రక్తం హృదయం ద్వారా ప్రసరిస్తుంది. దీనిని ‘ఏకవలయ రక్తప్రసరణ’ అంటారు.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 22.
హీమోఫీలియా అనగానేమి?
జవాబు:
రక్తం గడ్డకట్టడానికి సాధారణంగా సుమారు 3 నుండి 6 నిముషాల సమయం పడుతుంది. కాని కొందరు వ్యక్తులలో ‘K’ విటమిన్ లోపం వలన గడ్డకట్టడానికి చాలా ఎక్కువ సమయం పట్టవచ్చు. జన్యులోపం వలన కొందరిలో రక్తం గడ్డకట్టడం జరగదు. ఈ లోపాన్ని ‘హీమోఫీలియా’ (Haemophilia) అంటారు. దగ్గరి సంబంధీకుల మధ్య పెళ్ళిళ్ళు జరగడం వలన కలిగే పిల్లల్లో ఈ వ్యాధిగ్రస్థులు ఎక్కువ.

ప్రశ్న 23.
మైదాన ప్రాంతాలకంటే అటవీ ప్రాంతాలలో వర్షపాతం ఎక్కువ. ఎందుచేత?
జవాబు:
మొక్కలలో ఎల్లప్పుడు తగినంత నీరు నిరంతరంగా ప్రసరిస్తుంటుంది. ఉదాహరణకి ఒక పెద్ద వృక్షం ప్రతిరోజు 900 లీటర్ల నీటిని బాష్పోత్సేకం ద్వారా ఆవిరి రూపంలో వెలుపలికి పంపుతుంది. వీటి వలననే అడవులలో గాలి ఎక్కువగా నీటి ఆవిరితో సంతృప్తం చెందుతుంది. నీటి ఆవిరితో నిండి పవనాలు ఇటువైపుగా వీచేటప్పుడు అక్కడి వాతావరణంలో నీటి ఆవిరితో మరింతగా సంతృప్తం చెందుతాయి. కాబట్టి వర్షం కురుస్తుంది.

అందుకే మైదాన ప్రాంతాల కంటే కూడా అటవీ ప్రాంతాలలో ఎక్కువ వర్షపాతం ఉంటుంది.

ప్రశ్న 24.
తయారైన ఆహారం మొక్కలలో ఎలా రవాణా చేయబడుతుంది?
జవాబు:
ఆకుపచ్చటి మొక్కలలో ఆకులలో తయారైన ఆహారం చక్కెర రూపంలో మిగిలిన ‘కణాలకు రవాణా చేయబడుతుంది. ముఖ్యంగా చురుకుగా పెరిగే భాగాలు మరియు నిల్వచేసే భాగాలకు రవాణా చేయబడుతుంది.

ఆకులలోని ఈనెలలో దారువు మరియు పోషక కణజాలాలు ఉంటాయని మనకు తెలుసు. ఇవి కాండంలోని కణజాలంతో అనుసంధానమై ఉంటాయి.

ప్రశ్న 25.
ఎఫిడ్స్ ఉన్న మొక్కల కాండాలు జిగటగా ఉంటాయి. ఎందుకు?
జవాబు:
ఎఫిడ్స్ (Aphids) పోషక కణజాలం నుండి ఎక్కువ మొత్తంలో చక్కెరను గ్రహించినప్పటికీ మొత్తాన్నీ శోషించలేవు. మిగిలిన చక్కెర చిక్కటి ద్రవరూపంలో పాయువు నుండి వెలుపలికి వస్తుంది. దీనిని తేనె (honey – dew) అంటారు. అందువల్లనే ఎఫిడ్స్ ఉన్న మొక్కల కాండం, ఆకులు చేతితో తాకితే అంటుకున్నట్లుగా ఉంటాయి.

ప్రశ్న 26.
క్షీరదాలు చెట్లకు ఎలా హాని కల్గిస్తాయి? దీని నివారణ మార్గం ఏమిటి?
జవాబు:
కొన్ని క్షీరదాలు పోషక కణజాలంలో ఉండే ఆహారం కోసం చెట్టు బెరడును తొలుస్తాయి.

సాధారణంగా పోషక కణజాలంలోని చక్కెర కొరకు శీతాకాలంలో ఆహారపు కొరత ఉన్నప్పుడు ఇలా చేస్తుంటాయి. చిట్టెలుకల వంటి కొన్ని జంతువులు చిన్న చిన్న మొక్కలకు హాని చేస్తుంటే కుందేళ్ళ వంటి జంతువులు పెద్ద పెద్ద చెట్లను నాశనం చేస్తుంటాయి. కుందేళ్ళ వంటి జంతువుల వల్ల చెట్లకు హాని కలగకుండా అటవీ సంరక్షణకు ఇనుప తీగ వలను అమరుస్తారు. అయితే ఇది ఖర్చుతో కూడినది. అందుకోసం అటవీశాఖ అధికారులు అడవులలో కుందేళ్ళ బారి నుండి వృక్షాలను కాపాడడానికి మాంస భక్షకులైన నక్కలు, గుడ్లగూబలు, బాడ్జర్లను (Badger) పెంచుతుంటారు.

ప్రశ్న 27.
రీసస్ కారకం గురించి రాయండి.
జవాబు:
రీసస్ కారకం :
రక్తంలో ఉండే మరొక ప్రతిదేహమే రీసస్ కారకం. బ్రిటన్ దేశ జనాభాలో 85 శాతం మందిలో ఈ రకమైన ప్రతిదేహాలున్నట్లు గమనించారు. దీనిని మొట్టమొదటిసారిగా (మకాక్) రీసస్ అనే జాతి కోతులలో గుర్తించారు. అందువల్ల ఈ ప్రతిదేహాలకు రీసస్ కారకం అని పేరు వచ్చింది. రక్తంలో ఈ ప్రతిదేహాలు కలిగిన వారిని Rh+ గానూ, లేని వారిని Rh గానూ గుర్తిస్తారు.

సాధారణంగా Rh వ్యక్తుల ప్లాస్మాలో దీనికి సంబంధించిన ప్రతిరక్షకాలు ఉండవు. ఒకవేళ Rh+ వ్యక్తి రక్తాన్ని Rhకు ఎక్కించినట్లయితే అతనిలో Rh ప్రతిరక్షకాలు ఏర్పడి Rh+ రక్తకణాలను నాశనం చేస్తాయి. ఇది
శిశువులలో తీవ్రమైన ఆటంకంగా పరిణమిస్తుంది.

ప్రశ్న 28.
Rh+ వ్యక్తి Rh స్త్రీని వివాహం చేసుకొన్నప్పుడు పుట్టే పిల్లలలో ఎటువంటి ప్రభావం చూపుతుంది?
జవాబు:
ఒకవేళ Rh+ వ్యక్తి Rh స్త్రీని వివాహం చేసుకొన్నపుడు పుట్టే పిల్లల్లో కొందరు Rh+ గానే ఉంటారు. గర్భంలో ఉన్నపుడు తల్లి నుండి పిండానికి నిరంతరం రక్తం సరఫరా కావలసిన పరిస్థితి ఉంటుంది. బిడ్డ రక్తం తల్లి రక్తంతో కలిసిపోతుంది. అప్పుడు ఆమెలో ప్రతిరక్షకాలు ఏర్పడతాయి. తరువాత పుట్టే పిల్లలు కూడా Rh+ అవుతున్నట్లయితే తల్లిలో ప్రతిదేహాల పరిమాణం పెరుగుతూపోతుంది. ఈ ప్రతిదేహాలు రక్తం ద్వారా బిడ్డకు చేరినట్లయితే వారు తీవ్రమైన రక్తహీనతకు గురవుతారు. కొన్నిసార్లు గర్భస్రావం, ప్రాణాపాయం కూడా జరగవచ్చు.

ఇలాంటి సందర్భాలలో ప్రతిరక్షకాలు లేకుండా శిశువులో మొత్తం రక్త మార్పిడి చేయాల్సి ఉంటుంది. Rh+ కారకం కలిగిన మొదటి శిశువు పుట్టగానే ప్రత్యేకమైన సూదిమందు ఇవ్వడం ద్వారా తరువాత పుట్టే పిల్లలకు హాని జరగకుండా వైద్యసదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.

ప్రశ్న 29.
మీ దగ్గరలో ఉన్న డాక్టరు దగ్గరకు వెళ్ళి శోషరస వ్యవస్థ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు. ఇందుకు నీవు ఏ ప్రశ్నలు వేస్తావు?
జవాబు:

  1. శోషరసము అనగానేమి?
  2. శోషరస వ్యవస్థనందలి భాగములు ఏవి?
  3. శోషరస వ్యవస్థ నిర్వహించు విధులేవి?
  4. శోషరస వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు మధ్యగల భేదములు ఏవి?
  5. శోషరస వ్యవస్థకు, సిరల వ్యవస్థకు మధ్యగల పోలికలు ఏవి?
  6. కణజాల ద్రవం అనగానేమి?
  7. కణజాలాలలోనికి చేరిన రక్తంలోని ద్రవభాగాన్ని ఏమంటారు?
  8. కణజాలాలలో మిగిలిపోయిన కణజాల ద్రవాన్ని తిరిగి ప్రధాన రక్త వ్యవస్థలోనికి చేర్చే ప్రసరణ వ్యవస్థ ఏది?

ప్రశ్న 30.
రక్త ప్రసరణ వ్యవస్థలో హృదయం పంపుచేసే విధానం గురించి తెలుసుకున్నప్పుడు నీవు ప్రత్యేకంగా గుర్తుంచుకున్న అంశాలు ఏమిటి? అందుకు కారణం ఏమిటి?
జవాబు:
శారీరక కసరత్తులు చేసిన తరువాత హృదయం వేగంగా కొట్టుకోవడంను నేను’ ప్రత్యేకంగా గుర్తించాను. కసరత్తులు చేసినప్పుడు కణజాలాలలో ఉన్న శక్తి నిల్వలు ఖర్చు అయిపోతాయి. అందువలన గుండె వేగంగా కొట్టుకొని ఎక్కువ మొత్తంలో ఆమ్లజనిని కణాలకు సరఫరా చేస్తుంది. ఆమ్లజని ఆహార పదార్థాలపై చర్య జరిపి శక్తిని ఎక్కువగా విడుదల చేస్తుంది. కొంత సేపటి తరువాత గుండె సాధారణ వేగంతో పనిచేస్తుంది.

గుండె కొట్టుకోవడంలో లయబద్దంగా లబ్ డబ్, లబ్ డబ్ శబ్దం రావడం కూడా నేను ప్రత్యేకంగా గుర్తించుకున్నాను. చిన్నదైన పిడికెడు పరిమాణంలో ఉండే గుండె పంపు చేసే విధానాన్ని అర్థం చేసుకున్నాక దానిని అభినందించకుండా ఉండలేకపోతాము.

10th Class Biology 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
రక్తస్కందనం అనగానేమి? ఇది ఎలా జరుగుతుంది?
(లేదా)
కబాడీ ఆడుతూ గాయపడ్డ రాముకు 6 నిమిషాలలోనే రక్తస్రావం ఆగిపోయింది. ఈ ప్రక్రియ జరిగే విధానంను వివరించండి.
జవాబు:
శరీరానికి గాయం తగిలినపుడు రక్తం కొంచెం సేపు మాత్రమే కారుతుంది. తర్వాత రక్తం గడ్డకట్టి తెగినచోట ఒక ఎర్రని గడ్డలా ఏర్పడుతుంది. ఈ ఎర్రని గడ్డనే ‘స్కందనం’ అంటారు. రక్తం గడ్డకట్టకపోతే శరీరంపై చిన్న గాయం తగిలినా విపరీతమైన రక్తస్రావం జరుగుతుంది.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 7

  1. గాయం నుండి రక్తం స్రవించినపుడు రక్తఫలకికలు థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ ను స్రవిస్తాయి.
  2. ఈ థ్రాంబోకైనేజ్ రక్తంలో ఉన్న ప్రోత్రాంబినను త్రాంబిన్ గా మారుస్తుంది.
  3. త్రాంబిన్ రక్తంలోని ద్రవరూపంలో ఉన్న ఫైబ్రినోజనను ఘనరూపంలో ఉండే ఫైబ్రిన్ తంతువులుగా మారుస్తుంది.
  4. ఈ తంతువులలో రక్తకణాలు చిక్కుకుని స్కందనం ఏర్పడుతుంది.
  5. ఫైబ్రిన్ దారాలు దెబ్బతిన్న రక్తనాళపు అంచులకు అతుక్కొని సంకోచించడం వలన వాటి అంచులు దగ్గరకు లాగబడతాయి.
  6. రక్తం గడ్డకట్టిన తర్వాత మిగిలిన గడ్డి పసుపు రంగు ద్రవాన్ని ‘సీరం’ (Serum) అంటారు.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 8

ప్రశ్న 2.
పంపింగ్ పరికరము అని మానవ శరీరములో దేనిని అంటారు? దాని నిర్మాణాన్ని పటం ద్వారా వివరించండి.
జవాబు:
మానవ శరీరంలోని హృదయము లేదా గుండెను పంపింగ్ పరికరము అంటారు.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 9

హృదయము – బాహ్య నిర్మాణము :

  1. హృదయం, ఉరః పంజరంలో ఊపిరితిత్తుల మధ్యలో అమరి ఉంటుంది. మీ గుండె పరిమాణం సుమారుగా మీ పిడికిలి అంత ఉంటుంది.
  2. ఇది కార్డియాక్ కండరంతో. చేయబడి ఉంది.
  3. గుండె బేరీ పండు ఆకారంలో ఉండి, త్రికోణాకారంగా ఉంటుంది. పై వైపున వెడల్పుగాను, క్రింది వైపున సన్నగాను, కొద్దిగా ఎడమ వైపుకు వంగి ఉంటుంది.
  4. గుండెను ఆవరించి రెండు పొరలుంటాయి. వీనిని “హృదయావరణ త్వచాలు” అంటారు. ఈ రెండు పొరల మధ్య భాగం హృదయావరణ ద్రవంతో నిండి ఉంటుంది.

అంతర్నిర్మాణం :

  1. గుండె లోపల ఉండే ఉబ్బెత్తు నిర్మాణాలు గుండెను నాలుగు గదులుగా విభజిస్తాయి.
  2. పై రెండు గదులను ‘కర్ణికలు’ అని, క్రింద రెండు గదులను ‘జఠరికలు’ అని అంటారు.
  3. గుండె గోడలకు అంటిపెట్టుకొన్న రక్తనాళాలను ‘కరోనరీ’ రక్తనాళాలంటారు.
  4. ఇవి గుండె కండరాలకు రకాన్ని సరఫరా చేస్తాయి.
  5. పై వైపున ఉన్న కర్ణికల గోడలు పలుచగాను, కిందివైపు ఉన్న జఠరికల గోడలు మందంగాను ఉంటాయి.
  6. దృఢంగా ఉన్న రక్తనాళాలను ‘ధమనులు’ అంటారు. ‘బృహద్ధమని’ హృదయం నుండి బయలుదేరి శరీర భాగాలన్నింటికి మంచి రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఇది అతి పెద్ద ధమని.
  7. చిన్న ధమని, “పుపుస ధమని”. ఇది రక్తాన్ని హృదయం నుండి ఊపిరితిత్తులకు తీసికుపోతుంది.
  8. గుండె పై భాగంలో కుడివైపున ఉండే పెద్ద సిరను “ఊర్ధ్వ బృహత్సిర” అంటారు.
  9. ఇది శరీరం పై భాగాల నుండి రక్తాన్ని సేకరించి కుడి కర్ణికలోకి తెరుచుకుంటుంది.
  10. గుండె కుడివైపు దిగువ భాగంలో కనిపించే సిరను “అధోబృహత్సర” అంటారు.
  11. ఇది శరీరం దిగువ భాగాల నుండి రక్తాన్ని సేకరించి కుడి కర్ణికలోకి తెరుచుకుంటుంది.
  12. ఎడమ కర్ణికలో ఊపిరితిత్తుల నుండి రక్తాన్ని తీసుకువచ్చే ‘పుపుస సిరలు’ తెరుచుకొనే రంధ్రాలుంటాయి.
  13. కుడి జఠరిక నుండి బయలుదేరే రక్తనాళము పుపుస ధమని ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు సరఫరా చేస్తుంది.
  14. ఎడమ జఠరిక నుండి “బృహద్ధమని” శరీర భాగాలకు ఆమ్లజనితో కూడిన రక్తాన్ని సరఫరా చేస్తుంది.
  15. కుడి కర్ణికకు, కుడి జఠరికకు మధ్యగల కుడికర్ణిక జఠరికాంతర విభాజకముపై గల కవాటాన్ని “అగ్రత్రయ కవాటం” అని అంటారు.
  16. ఎడమ కర్ణిక, ఎడమ జఠరికకు మధ్యగల ఎడమ కర్ణిక జఠరికాంతర విభాజకము పైగల కవాటాన్ని “అగ్రద్వయ కవాటం” అని అంటారు.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 3.
క్షీరదాల గుండె అంతర నిర్మాణం పరిశీలించడానికి నీవు గొర్రె గుండె నిలువుకోతను ప్రయోగశాలలో పరిశీలించావు కదా ! దాని ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబు ఇమ్ము.
a) గుండె గోడలు అంతటా ఒకే మందంతో ఉన్నాయా? ఎందుకు?
జవాబు:
గుండె గోడలు అంతటా ఒకే మందంతో ఉండవు. జఠరికలు ఎక్కువ ఒత్తిడితో రక్తాన్ని పంపుచేయాలి. కనుక జఠరికల గోడలు కర్ణికల గోడల కంటే మందంగా ఉంటాయి.

b) గుండెలోని గదులు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
గుండెలో నాలుగు గదులు కలవు. అవి రెండు కర్ణికలు మరియు రెండు జఠరికలు.

c) గుండెలోని గదులు ఒకదానితో ఒకటి ఎలా వేరు చేయబడ్డాయి? ఎలా కలుపబడ్డాయి?
జవాబు:
గుండెలోని గదులు ఒకదానితో ఒకటి విభాజకాల చేత వేరుచేయబడ్డాయి. కవాటాల ద్వారా కలపబడ్డాయి.

d) హృదయం అఘాతాల నుండి ఎలా రక్షింపబడుతుంది?
జవాబు:
హృదయం, హృదయావరణ త్వచం, హృదయావరణ ద్రవంచే అఘాతాల నుండి రక్షించబడుతుంది.

ప్రశ్న 4.
ఈ క్రింది పట్టికను విశ్లేషించి దిగువ నీయబడిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.

వర్గం పేరు ప్రసరణ వ్యవస్థ రకం
1. నిడేరియా జఠర ప్రసరణ కుహరం
2. ప్లాటీ హెల్మింథస్ జీర్ణవ్యవస్థ
3. నిమాటీహెల్మింథస్ మిథ్యాశరీర కుహరం
4. అనెలిడా రక్త నాళాలు
5. ఆర్రోపోడా వివృత రక్తప్రసరణ వ్యవస్థ

i) రక్తనాళాలు మొట్టమొదటగా ఏ వర్గంలో ఏర్పడ్డాయి?
ii) రక్తంలో హీమోగ్లోబిన్ కల జీవులేవి?
iii) ఏ జీవులలో జీర్ణవ్యవస్థ ప్రసరణకు ఉపయోగపడుతుంది?
iv) ఆర్రోపోడా జీవులు వివృత రక్తప్రసరణ వ్యవస్థను కలిగి ఉండడానికి కారణమేమిటి?
జవాబు:
i) రక్తనాళాలు మొట్టమొదటగా అనెలిడా వర్గజీవులలో ఏర్పడ్డాయి.
ii) అనెలిడా వర్గ జీవులలో రక్తం యందలి ప్లాస్మాలో హి మోగ్లోబిన్ ఉండును.
iii)నిడేరియా వర్గజీవులలో జీర్ణవ్యవస్థ ప్రసరణకు ఉపయోగపడును.
iv) ఆర్రోపోడా వర్గ జీవులలో రక్తనాళాలు లేకపోవడం చేత, కోటరాలు ఏర్పడి వివృత రక్తప్రసరణ వ్యవస్థ ఏర్పడింది.

ప్రశ్న 5.
మానవ హృదయంలోని కవాటాలు, అతుకబడి ఉన్న రక్తనాళాల స్థానాలు మరియు విధులను గురించి వివరించండి.
జవాబు:
మానవ హృదయంలోని కవాటాలు :

  1. కుడికర్ణిక, కుడి జఠరికకు మధ్య గల కవాటం – అగ్రత్రయ కవాటం
  2. ఎడమ కర్ణిక, ఎడమ జఠరికకు మధ్య గల కవాటం – అగ్రద్వయ కవాటం
  3. పుపుస ధమని పూర్వభాగంలో గల కవాటం – పుపుస ధమని కవాటం
  4. బృహద్ధమని పూర్వభాగంలో గల కవాటం – మహాధమని కవాటం

గుండెకు అతుకబడి ఉన్న రక్తనాళాల స్థానాలు మరియు విధులు :

  1. గుండే గోడలకు అంటి పెట్టుకుని కరోనరె రక్తనాళాలు ఉంటాయి. ఇవి గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి.
  2. ఎడమ జఠరిక పై భాగం నుండి బృహద్ధమని బయలుదేరుతుంది. ఇది శరీర భాగాలకు ఆమ్లజనితో కూడిన రక్తాన్ని సరఫరా చేస్తుంది.
  3. కుడి జఠరిక పై భాగం నుండి పుపుస ధమని బయలుదేరుతుంది. ఇది ఆమ్లజనిరహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు సరఫరా చేస్తుంది.
  4. గుండె పై భాగంలో కుడివైపున ఊర్ధ్వ బృహత్సిర ఉంటుంది. శరీరంపై భాగం నుండి రక్తాన్ని సేకరిస్తుంది.
  5. గుండె కుడివైపు దిగువ భాగంలో అధోబృహత్సిర ఉంటుంది. ఇది శరీర దిగువ భాగాల నుండి రక్తాన్ని సేకరించి హృదయానికి చేరవేస్తుంది.

ప్రశ్న 6.
మానవుని శోషరస వ్యవస్థ గురించి క్లుప్తంగా వివరిస్తూ, విధులను తెలియచేయండి.
జవాబు:

  1. కణజాలంలో మిగిలిపోయిన కణజాల ద్రవాన్ని ప్రధాన రక్త ప్రసరణ వ్యవస్థలోనికి చేర్చడానికి మరొక సమాంతర వ్యవస్థ ఏర్పాటయింది. దీనినే శోషరస వ్యవస్థ అంటారు.
  2. కణజాలాలలో ఉన్న శోషరసమే కణజాల ద్రవం.
  3. రక్తాన్ని కణాలను జోడించే ప్రధానమైన పదార్థం శోషరసం. రక్తం నుండి పోషకాలను గ్రహించి కణాలకు అందించడం, . కణాల నుండి వృధా పదార్థాలను సేకరించి రక్తంలోకి చేర్చడం.
  4. రక్తం ఘన మరియు ద్రవ పదార్థాల మిశ్రమం. ఘన పదార్థాలు లేని రక్తమే శోషరసం.
  5. సిరావ్యవస్థకు సమాంతరమైన వ్యవస్థ కణజాల ద్రవాన్ని సిరావ్యవస్థలోకి చేర్చుటకు తోడ్పడును.
  6. అస్తికండరాల సంకోచము వలన సిరలపైన, శోషరసనాళాలపైన ఒత్తిడి పెరిగి రక్తము, శోషరసం గుండెవైపు నెట్టబడును.

ప్రశ్న 7.
రక్తస్కందన ప్రక్రియలోని వివిధ దశలను వివరించండి.
జవాబు:

  1. రక్తంలో ఉండే రక్త ఫలకికలు రక్తస్కందన ప్రక్రియను ప్రారంభిస్తాయి.
  2. గాయం నుండి రక్తం స్రవించినప్పుడు రక్త ఫలకికల నుండి థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ విడుదల అవుతుంది.
  3. ఈ థ్రాంబోకైనేజ్ రక్తంలో ఉన్న ప్రోత్రాంబినను త్రాంబిన్‌గా మారుస్తుంది.
  4. త్రాంబిన్ రక్తంలోని ద్రవరూపంలో ఉన్న ఫైబ్రినోజనను ఘనరూపంలో ఉండే ఫైబ్రిన్ తంతువులుగా మారుస్తుంది. ఈ పోగులలో రక్త కణాలు చిక్కుకుని స్కందనము ఏర్పడుతుంది. ఫైబ్రిన్ దారాలు దెబ్బతిన్న రక్తనాళపు అంచులకు అతుక్కుని సంకోచించడం వలన వాటి అంచులు దగ్గరకు లాగబడతాయి. రక్తం గడ్డకట్టిన తర్వాత మిగిలిన గడ్డి పసుపురంగు ద్రవాన్ని ‘సీరం’ అంటారు.
    AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 10

ప్రశ్న 8.
లలిత తన తాతగారిని డాక్టరుగారి దగ్గరకు తీసుకొని వెళ్లినపుడు అతనికి అధిక రక్తపోటు ఉన్నట్లు డాక్టరు చెప్పారు.
i) అధిక రక్తపోటు అనగా నేమి?
జవాబు:
అధిక రక్తపోటు :
విశ్రాంతి సమయంలో ఒక వ్యక్తికి రక్తపీడనం 120/80 mmHg కంటే ఎక్కువ వుంటే దానిని అధిక రక్తపోటు అంటారు.

ii) అధిక రక్తపోటుకు కారణాలు ఏవి?
జవాబు:
అధిక రక్తపోటుకు కారణాలు :
అధిక బరువు, ఒత్తిడితో కూడిన జీవనం మరియు జన్యుసంబంధ కారణాలు.

iii) అధిక రక్తపోటును నియంత్రించుటకు కొన్ని సూచనలు తెల్పండి.
జవాబు:
అధిక రక్తపోటును నియంత్రించుటకు కొన్ని సూచనలు :

  1. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
  2. కొవ్వు పదార్థాలు తక్కువ తీసుకోవాలి.
  3. ఒత్తిడి తగ్గించుకోవడము అవసరము.
  4. ధూమపానం, మద్యపానం చేయకుండా వుండాలి.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 9.
కర్ణికల మధ్య గల భేదాలు తెలపండి.
జవాబు:

కుడి కర్ణిక ఎడమ కర్ణిక
1. పెద్దదిగా ఉంటుంది. 1. చిన్నదిగా ఉంటుంది.
2. పూర్వ, పర మహాసిరల ద్వారా రక్తాన్ని గ్రహిస్తుంది. 2. పుపుస సిరల ద్వారా రక్తాన్ని గ్రహిస్తుంది.
3. ఊపిరితిత్తుల నుండి తప్ప, మిగిలిన అన్ని శరీర భాగాల నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని గ్రహిస్తుంది. 3. ఊపిరితిత్తుల నుండి ఆమ్లజని సహిత రక్తాన్ని గ్రహిస్తుంది.
4. ఇందులో ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది. 4. ఇందులో ఆమ్లజని సహిత రక్తం ఉంటుంది.
5. రక్తాన్ని కుడి జఠరికలోనికి పంపుతుంది. 5. రకాన్ని ఎడమ జఠరికలోనికి పంపుతుంది.

ప్రశ్న 10.
జఠరికల మధ్య గల భేదాలు తెలపండి.
జవాబు:

కుడి జఠరిక ఎడమ జఠరిక
1. చిన్నదిగా ఉంటుంది. 1. పెద్దదిగా ఉంటుంది.
2. దీని నుండి పుపుస మహాధమని బయలుదేరుతుంది. 2. దీని నుండి దైహిక మహాధమని బయలుదేరుతుంది.
3. కుడికర్ణిక నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని గ్రహిస్తుంది. 3. ఎడమ కర్ణిక నుండి ఆమ్లజని సహిత రక్తాన్ని గ్రహిస్తుంది.
4. దీనిలో ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది. 4. దీనిలో ఆమ్లజని సహిత రక్తం ఉంటుంది.
5. ఊపిరితిత్తులకు ఆమ్లజని రహిత రక్తాన్ని పంపు చేస్తుంది. 5. ఊపిరితిత్తులకు తప్ప మిగతా శరీర భాగాలన్నింటికి ఆమ్లజని సహిత రక్తాన్ని పంపు చేస్తుంది.
6. కుడి కర్ణికా జఠరికా రంధ్రాన్ని అగ్రత్రయ కవాటం రక్షిస్తుంది. 6. ఎడమ కర్ణికా జఠరికా రంధ్రాన్ని అగ్రద్వయ కవాటం రక్షిస్తుంది.

ప్రశ్న 11.
మానవ హృదయాన్నుండి రక్తాన్ని తీసుకొని పోయే రక్తనాళాలను వర్ణించండి.
జవాబు:
మానవ హృదయాన్నుండి రక్తాన్ని తీసుకొని పోవు రక్తనాళాలను మహా ధమనులు అంటారు.
అవి (1) పుపుస మహాధమని (2) దైహిక మహాధమని (3) హృదయ ధమనులు

1) పుపుస మహాధమని :
ఇది హృదయంలోని కుడి జఠరికలో ఉన్న ఆమ్లజని రహిత రక్తాన్ని కుడి, ఎడమ పుపుస ధమనులుగా చీలిపోయి కుడి, ఎడమ ఊపిరితిత్తులకు అందజేస్తాయి.

2) దైహిక మహాధమని :
ఇది శాఖోపశాఖలుగా చీలి హృదయంలోని ఎడమ జఠరిక నుండి ఆమ్లజని సహిత రక్తాన్ని శరీరంలోని అన్ని అవయవాలకు సరఫరా చేస్తుంది.

3) హృదయ ధమనులు :
ఇవి ఆమ్లజని సహిత రక్తాన్ని హృదయ కండరాలకి తీసుకుపోతాయి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 11

ప్రశ్న 12.
ఏకవలయ, ద్వివలయ ప్రసరణ అనగానేమి?
జవాబు:
ఏకవలయ ప్రసరణ :

  1. చేపలలో గుండె ద్వారా రక్తం ఒకసారే ప్రవహిస్తుంది.
  2. ఈ విధమైన రక్తప్రసరణని ఏకవలయ ప్రసరణము అంటారు.
  3. ఈ వ్యవస్థను ఏకవలయ ప్రసరణ వ్యవస్థ అంటారు.
  4. ఇందు మొప్పలకు రక్తాన్ని పంపే హృదయాన్ని జలశ్వాస హృదయం అంటారు.

ద్వివలయ ప్రసరణ :

  1. కప్ప, ఇతర ఉన్నత జంతువులలో రక్తం ‘హృదయం ద్వారా రెండు సార్లు ప్రయాణిస్తుంది.
  2. ఒకసారి హృదయం ఊపిరితిత్తుల మధ్య, రెండవసారి హృదయం శరీర భాగాల మధ్య ప్రయాణిస్తుంది.
  3. ఇటువంటి ప్రసరణని ద్వివలయ ప్రసరణము అంటారు.
  4. ఇట్టి హృదయాన్ని ద్వివలయ ప్రసరణ హృదయం అంటారు.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 12

ప్రశ్న 13.
సిరలలో రక్తకదలికలను నిరూపించటానికి హార్వే నిర్వహించిన ప్రయోగం ఏమిటి?
జవాబు:
ఆ రోజుల్లో సంయుక్త సూక్ష్మదర్శిని కాని, ఈనాటి ఆధునిక వైజ్ఞానిక పరికరాలు కాని లేవు. 17 వ శతాబ్దంలో సిరలలో రక్తం యొక్క కదలికలను నిరూపించడానికి విలియం హార్వే చేసిన ప్రయోగాన్ని పరిశీలిద్దాం.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 13

  1. రక్తనాళాలు బాగా కనిపించే వ్యక్తి యొక్క దండ చేయి (మోచేతి పై భాగంలో పటంలో చూపిన విధంగా) గుడ్డతో గట్టిగా కట్టాలి. (ఒక వేలుదూరేంత స్థలం ఉండాలి.)
  2. మరొక గుడ్డను చాపచుట్టలా మడిచి దానిని పిడికిలితో గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు చర్మం కింది రక్తనాళాలు ప్రస్ఫుటంగా కన్పిస్తాయి.
  3. బాగా లావుగా ఉబ్బినట్లున్న, శాఖలుగా విడిపోని రక్తనాళాన్ని గుర్తించండి.
  4. ఆ రక్తనాళంపై దండచేయి వైపు వేలు ఉంచి, మెల్లిగా, రక్తనాళంలో రక్త ప్రవాహం ఆగిపోయేవరకు ఒత్తిడి కలుగచేయండి. (బొమ్మ సహాయం తీసుకోండి)
  5. ఇప్పుడు వేలిని ఒత్తుతూ మోచేతి నుండి అరచేతి వరకు కదిలించండి. ఈ రక్త నాళంలో రక్తం నిలువ ఉండి ఉబ్బి స్పష్టంగా బయటకు కనిపిస్తాయి. వీటినే సిరలు అంటారు.
  6. సిరలలో రక్త ప్రసరణ గుండె వైపుకు ఉంటుంది. ఈ ప్రసరణను నిరోధించుట వలన రక్తం పోగై స్పష్టంగా బయటకు కనిపించాయి.

ప్రశ్న 14.
హృదయం పనిచేయు విధానంలోని దశలను తెలపండి. లేదా హార్దిక వలయాన్ని వివరించండి.
జవాబు:
కర్ణికలు, జఠరికలు ఒకసారి సంకోచించి తరువాత యథాస్థితికి వస్తే దానిని ఒక హృదయస్పందన వలయం లేదా హార్దిక వలయం (Cardiac cycle) అంటారు. దీనిలోని దశలను పరిశీలిద్దాం.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 14
1) గుండెలోని నాలుగు గదులు ఖాళీగా విశ్రాంతి (సడలింపు) స్థితిలో ఉన్నాయనుకొనే ఊహతో హార్దిక వలయం జరిగే విధానాన్ని పరిశీలిద్దాం.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 15
2) పూర్వపర మహాసిరల నుండి రక్తం కుడికర్ణికలోనికి, పుపుస గల నుండి ఎడమ కర్ణికలోనికి రక్తం ప్రవేశిస్తుంది.
3) ఇప్పుడు కర్ణికలు సంకోచిస్తాయి. కర్ణికల సంకోచం వలన రక్తం కర్ణిక, జఠరికల మధ్య ఉన్న కవాటాలను తోసుకుని జఠరికలోనికి ప్రవేశిస్తుంది.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 16
4) జఠరికలు రక్తంతో నిండగానే సంకోచిస్తాయి. అదే సమయంలో (సడలింపు), కర్ణికలు యథాస్థితికి చేరుకుంటాయి.
5) జఠరికల సంకోచం వలన రక్తం దైహిక చాపంలోనికి, పుపుస ధమనిలోనికి, వానిలో ఉన్న కవాటాలు తెరచుకుని ప్రవహిస్తుంది. అదే సమయంలో కర్ణికలు, జఠరికల మధ్య ఉన్న కవాటాలు రక్తం ఒత్తిడికి మూసుకుంటాయి. కవాటాలు మూసుకోవటం వలన మొదటి ‘లబ్’ అనే శబ్దం పెద్దగా మనకు వినిపిస్తుంది.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 17
6) జఠరికలు యథాస్థితికి చేరుకునే సమయంలో, జఠరికలలోని పీడనం తగ్గిపోతుంది. దీనివలన రక్తనాళాలలోనికి ప్రవేశించిన రక్తం వెనుకకు రావటానికి ప్రయత్నిస్తుంది. రక్తనాళాలలోని కవాటాలు మూసుకొని రక్తం వెనుకకు జఠరికలలోనికి రావటాన్ని నిరోధిస్తాయి. ఈ కవాటాలు మూసుకొన్నప్పుడు రెండవ ‘డబ్’ అనే శబ్దం చిన్నగా వినిపిస్తుంది.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 18
7) ఇదే సమయానికి కర్ణికలు రక్తంతో నిండి మరలా సంకోచానికి సిద్ధ పడతాయి.

హృదయస్పందనలో క్రమానుగతంగా జరిగే ఈ ప్రక్రియలన్నింటినీ కలిపి ‘హార్దిక వలయం ‘ (Cardiac cycle) అంటారు.

ప్రశ్న 15.
ప్రసరణ వ్యవస్థ పరిణామ క్రమం తెలపండి.
జవాబు:
ప్రొటోజోవన్స్ :
అమీబా వంటి ఏకకణజీవుల పదార్థంలో సహజసిద్ధమైన కదలికలుంటాయి. ఈ కదలికలను ‘బ్రేనియన్ చలనం’ అంటారు. ఈ చలనం వలన కణంలోని అన్ని భాగాలకు పోషకపదార్థాలు ఆమ్లజని సమానంగా సరఫరా అవుతాయి.

ఏకకణజీవుల మాదిరిగానే మానవునితో సహా అన్ని బహుకణ జీవులూ తమ కణాలలో కణాంతర ప్రసరణ వ్యవస్థ (intercellular transport system) ను కలిగి ఉంటాయి. నాడీ కణాలతో సహా మన శరీరంలోని అన్ని కణాలలోని జీవదార్థం ఈ బ్రౌనియన్ చలనాన్ని ప్రదర్శిస్తుంది.

పారాజోవన్స్ :
స్పంజికల వంటి పారాజోవన్లు సముద్రపు నీటినే ప్రసరణకు వాడుకుంటాయి. సహజసిద్ధమైన నీటి ప్రవాహాలు నియమబద్దంగా ఉండవు. కాబట్టి, స్పంజికలు శరీరం లోపల ఉండే కశాభాల కదలికల (fiagella) వలన తమ ప్రవాహలను తామే సృష్టించుకుంటాయి.

స్పంజికలకంటే అభివృద్ధి చెందిన హైడ్రా, జెల్లీ చేప వంటి నిడేరియా జీవులు తమ శరీరంలో జఠరప్రసరణ కుహరమనే (gretro vascular cavity) ఒక సంచి వంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. జఠర ప్రసరణకుహరం ఆహారాన్ని ఓం యులంతో పాటుగా పోషకాలను అన్ని కణాలకు అందించే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంది.

ప్లాటి హెల్మెంథిస్ :
ఫాసియోలా హెపాటికా వంటి ప్లాటి హెల్మెంథిస్ వర్గానికి చెందిన జీవులలో జీర్ణవ్యవస్థ శాఖోపశాఖలుగా , విస్తరించి ఉంటుంది. వీనిలో కూడా జీర్ణక్రియ, ప్రసరణలు రెండింటినీ ఒకే వ్యవస్థ నిర్వహిస్తుంది. ఈ జీవులలో ప్రతి కణం నుండి వ్యర్థ పదార్థాలను ప్రత్యేక విసర్జక వ్యవస్థ గ్రహిస్తుంది. ఈ జీవుల శరీరంలో ఎక్కువ భాగాన్ని జీర్ణ, విసర్జక వ్యవస్థలే ఆక్రమించాయి.

నిమాటిహెల్మెంథిస్ :
ఏలికపాముల (నట్టలు) వంటి నిమాటి హెల్మెంథిన్ల శరీరంలో ఉండే విధ్యాశరీర కుహరం , పదార్థాల (Pseudocoeloem) సేకరణ, వితరణను నిర్వహిస్తుంది.

అనిలెడ్లు :
నిజశరీరకుహర జీవులైన వానపాముల వంటి అనిలెడ్లు ద్రవాల కదలిక కోసం సంకోచించే ఒక నాళాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసుకున్నాయి. వీనిలో మొట్ట మొదటిసారిగా ప్రసరణ మాధ్యమంగా రక్తం పనిచేయడాన్ని గుర్తించవచ్చు.

ఆరోపొడ :
బొద్దింక వంటి ఆరోపొడ వర్గపు జీవులలో సంకోచించే నాళం వంటి గుండె ఉన్నప్పటికీ, రక్తనాళాలు లేకపోవటం వలన, రక్తం పెద్ద పెద్ద కోటరాల (ఖాళీ ప్రదేశాలు)లోనికి ప్రవహిస్తుంది. కణజాలాలకు పోషకాలను సరఫరా చేస్తుంది. అలాగే శ్వాసవ్యవస్థ కూడా నేరుగా కణజాలాలకు ఆక్సిజన్ ను సరఫరా చేస్తుంది. రక్తనాళాలు లేని ప్రసరణ వ్యవస్థను వివృత రక్తప్రసరణ వ్యవస్థ (Open Circulatory System) అంటారు.

ఆరోపొడతో పాటుగా, చాలా మొలస్కా :
జీవులు, కింది స్థాయి కార్డేటాజీవులలో వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది.

మొలస్కాన్స్, కార్డేట్స్ :
పదార్థాల రవాణా బాధ్యతను రక్తమే పూర్తిగా నిర్వహిస్తూ, రక్తం రక్తనాళాలలో ప్రవహించే వ్యవస్థను సంవృత రక్తప్రసరణ వ్యవస్థ (Closed Circulatory System) అంటారు. అనిలెడా, ఇఖైనోడెర్మటా, ఆక్టోపస్ వంటి సెఫలోపొడ మొలస్కా జీవులలోను, అన్ని పై స్థాయి కార్డేటా జీవులలోను ఈ రకమైన రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 16.
వేరు పీడనం అనగానేమి? దానిని ఎలా నిరూపిస్తావు?
జవాబు:
వేరు పీడనం :
వేరు నీటిని పీల్చుకొన్నప్పుడు వెలువర్చే పీడనాన్ని వేరు పీడనం అంటారు. దీనివలన నీరు వేరు నుండి కాండములోనికి చేరుతుంది. వేరు పీడనాన్ని మానోమీటరు సహాయంతో కొలుస్తారు.

ప్రయోగం :
ఉద్దేశం : వేరు పీడనం నిరూపించుట.

పరికరాలు :
కుండీలో పెరుగుతున్న మొక్క, గాజు గొట్టం, రబ్బరు గొట్టం.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 19

విధానం :

  1. కుండీలో పెరుగుతున్న మొక్కను తీసుకొని, భూమి ఉపరితలం కంటే 1 సెం.మీ పైన ఉండే విధంగా కాండం భాగాన్ని కోయాలి.
  2. గాజు గొట్టాన్ని కోసిన కాండ భాగానికి, రబ్బరుగొట్టం రబ్బరు గొట్టంతో కట్టాలి.
  3. గాజు గొట్టంలో నీరు పోసి నీటి మట్టాన్ని (M1) కొలిచి నమోదు చేయాలి.
  4. 2-3 గంటల పాటు, ప్రయోగ అమరికను కదపకుండా ఒకచోట ఉంచాలి.

పరిశీలన : రెండు గంటల తరువాత గాజు గొట్టంలో నీటి మట్టం పెరుగుదల (M2) ను గుర్తించాను.

వివరణ :
గాజు గొట్టంలో నీటి మట్టం పెరుగుదల, వేరు నీరు పీల్చడం వలన జరిగింది. వేరు నీటిని పీల్చి గాజు గొట్టంలోని నీటిని పైకి నెట్టింది. నీటిని పైకి నెట్టిన ఈ బలాన్ని వేరు పీడనం అంటారు.

నిరూపణ :
మొక్కలలో వేరు పీడనం ఉంటుందని నిరూపించటమైనది.

ప్రశ్న 17.
బాష్పోత్సేకం అనగానేమి? దానిని ఎలా నిరూపిస్తావు?
జవాబు:
బాష్పోత్సేకం :
మొక్క దేహ భాగాల నుండి నీరు ఆవిరైపోవడాన్ని బాష్పోత్సేకం అంటారు.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 20

నిరూపణ :

  1. కుండీలో పెరుగుతున్న ఆరోగ్యవంతమైన మొక్కను ఎన్నుకొని దానికి నీరు పోశాను.
  2. ఒక పాలిథిన్ కవర్ తీసుకొని మొక్క కొమ్మకు కట్టి సూర్యరశ్మిలో ఉంచాను.
  3. కొంత సేపటి తరువాత పాలిథిన్ కవర్‌లో నీటి తుంపరలు గమనించాను.
  4. ఇది మొక్క పత్రాల నుండి వెలువడి పాలిథిన్ కవర్‌లో చేరింది.
  5. ఇలా మొక్క దేహ భాగాల నుండి నీరు ఆవిరై పోవడాన్ని ‘బాష్పోత్సేకం’

ప్రశ్న 18.
మొక్కలలో ఖనిజ లవణాల రవాణాను వివరించండి.
జవాబు:
ఖనిజ లవణాల రవాణా :

  1. మొక్కల పోషణకు ఖనిజ లవణాలు (స్థూల, సూక్ష్మపోషకాలు) అవసరం.
  2. మృత్తిక ద్రావణం నుండి మూలకేశాల ద్వారా ఖనిజ లవణాలు గ్రహించబడతాయి.
  3. ఈ లవణాలన్నీ విద్యుదావేశ అయాన్ల రూపంలో ఉంటాయి. ఉదాహరణకు సోడియం క్లోరైడ్ Na+, Cl అయాన్లు రూపంలోనూ, మెగ్నీషియం సల్ఫేట్ Mg2+, So42- అయాన్ల రూపంలో ఉంటాయి.
  4. ఇవి మూలకేశాల ద్వారా వ్యాపనం పద్దతిలో కాకుండా కణద్రవ్య శక్తిని వినియోగించి శోషించబడతాయి.
  5. ఆయాన్లు శోషించబడిన తరువాత నీటి ద్వారా దారునాళాలలోకి చేరుకుని అక్కడ నుండి పెరుగుదల స్థానాలకు వెళ్ళి పెరుగుదలకు వినియోగించబడతాయి.
  6. కొన్ని సందర్భాలలో దారువు నుండి పోషక కణజాలానికి పార్శ్వంగా కూడా ప్రసరిస్తాయి. మొక్కల పెరుగుదలలో ఖనిజ లవణాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి.

ప్రశ్న 19.
దారువు ద్వారా మొక్కలలో నీటి రవాణా జరుగుతుందని తెలుపడానికి నీవు ఏ ప్రయోగాన్ని చేస్తావు? ఎలా చేస్తావో వివరించండి.
జవాబు:
ఉద్దేశం :
దారువు ద్వారా మొక్కలలో నీటి రవాణా జరుగుతుందని తెలుపుట.

కావలసిన పరికరాలు :
రెండు గాజు సీసాలు, ఎరుపు రంగు ద్రవం, నీలి రంగు ద్రవం, తెల్ల పుష్పం కలిగిన కాండం.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 21

విధానం :

  1. రెండు గాజు గ్లాసులు తీసుకొని ఒక దానిలో ఎరుపు రంగు నీరు మరొక దానిలో నీలిరంగు నీరు పోసాను.
  2. తెల్లపుష్పం కలిగిన కాండం తీసుకొని దానిని సగం వరకు రెండుగా చీల్చాను.
  3. చీల్చిన రెండు భాగాలను రెండు గ్లాసులలో ఉంచి, రెండు గంటల తరువాత పరిశీలించాను.

పరిశీలన :
రెండు గంటల తరువాత తెలుపురంగు పుష్పంలో కొంతభాగం ఎరుపు చారలను, మరికొంత నీలి చారలను కలిగి ఉంది.

వివరణ :
పువ్వులలోని ఈ రంగు చారలు గ్లాసులోని నీటివలన ఏర్పడింది. గ్లాసులలోని నీరు కాండం ద్వారా పుష్పంలోనికి ప్రయాణించుట వలన రంగు చారలు ఏర్పడ్డాయి. కాండంలో నీరు ప్రయాణించిన ఈ నాళాలను అడ్డుకోతలో పరిశీలించవచ్చు. ఈ నాళాలనే దారువు అంటారు.

నిరూపణ :
మొక్కలలో నీరు దారువు ద్వారా రవాణా అవుతుందని నిరూపించటమైనది.

ప్రశ్న 20.
పోషక కణజాలం ద్వారా ఆహార పదార్థాలు రవాణా అవుతాయని నీవు ఎలా నిరూపిస్తావు?
జవాబు:

  1. పోషక కణజాలం ద్వారా చక్కెరలు రవాణా చేయబడతాయిని తెలుసుకోవడానికి మరొక ప్రయోగం ద్వారా కూడా నిరూపించవచ్చు.
  2. దారువు కనబడే విధంగా దాని చుట్టూ ఉన్న బెరడును తొలగించాలి. మధ్యభాగం మాత్రం ఉంచి మిగిలిన మొత్తం కణజాలాన్ని పోషక కణజాలంతో సహా తొలగించాలి.
  3. కొన్ని రోజుల తరువాత తొలగించిన బెరడు పై భాగాన్ని, కింది భాగాన్ని కణజాలాన్ని విశ్లేషించినప్పుడు మనకు ఆహార పదార్థ నిలువలు వలయంగా ఏర్పడిన పై భాగంలో మాత్రమే కనబడుతుంది. కింది భాగంలో కనబడదు.
  4. కొన్ని రోజుల తరువాత మనం అలాగే వదిలి పెడితే రింగుపై భాగంలో కాండ మందం పెరుగుతుంది. కాని కింది భాగంలో పెరుగుదల జరగదు.
  5. అందువలన కాండం చుట్టూ ఉన్న కణజాలానికి ఎటువంటి నష్టం కలిగించినా వేరుకు ఆహార సరఫరా ఆగిపోతుంది. తద్వారా చెట్టు మరణిస్తుంది.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 21.
అధిక రక్తపీడనం అనగానేమి? దాని లక్షణాల నివారణ ఏమిటి?
జవాబు:
1) సామాన్యంగా మానవునిలో రక్తపీడనం 120/80 ఉంటుంది.
2) కొంతమందిలో సామాన్యంగా ఉండే రక్తపీడనం కంటే చాలా ఎక్కువ ఉంటుంది. దీనినే హైపర్ టెన్షన్ లేక హై బి.పి. అని అంటారు.

కారణాలు:
3) రక్తంలో కొలెస్టరాల్ (కొవ్వు) శాతము ఎక్కువైనచో, అది ధమనుల గోడలలో చేరుతుంది. అప్పుడు ధమనుల గోడలు దళసరిగా తయారవుతాయి. అప్పుడు ధమనుల లోపలి కుహరం చిన్నదవుతుంది. తర్వాత రక్తం అధిక పీడనంతో ప్రవహించును.
4) దీర్ఘకాలపు ఒత్తిడి, శ్రమ, ధూమపానము, మద్యపానము వల్ల కూడా అధిక పీడనం కలుగును.
5) మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవటం వల్ల కూడా అధిక రక్తపీడనానికి కారణం కావచ్చు.

తీసుకోవలసిన జాగ్రత్తలు :
6) ఆహార నియమాలు పాటించాలి.
7) తగుమాత్రం వ్యాయామం చేయాలి.
8) అదనపు ఒత్తిడి, శ్రమకు లోనుగాకుండా చూసుకోవాలి.
9) ధూమపానం, మద్యపానం సేవించకుండా ఉండాలి.
10) 45 సం||లు పైబడిన వారు కనీసం ఏడాదికి రెండుసార్లైనా రక్తపీడనం పరీక్షని చేయించుకోవాలి.

ప్రశ్న 22.
తలసేమియా వ్యాధిని గూర్చి రాయండి.
జవాబు:

  1. తలసేమియా అనేది వంశపారంపర్యంగా వచ్చే రక్తసంబంధ వ్యాధి.
  2. ఎర్రరక్త కణాలలో హిమోగ్లోబిన్ లోపించి రక్తహీనతకు దారితీస్తుంది.
  3. తలసేమియాతో బాధపడేవారిలో ఆక్సిజనను రవాణా చేసే హిమోగ్లోబిన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది.
  4. ఈ వ్యాధి ఆల్ఫా మరియు బీటా అనే రెండు రకాలు.
  5. హిమోగ్లోబిన్ ప్రోటీన్లో వివిధ భాగాలలో వచ్చే లోపాలవల్ల ఈ రెండు రకాల తలసేమియా వ్యాధులు వస్తాయి.
  6. తక్కువస్థాయి తలసేమియా వ్యాధిగ్రస్తులలో రక్తహీనత, కాలేయం, పిత్తాశయం పరిమాణం పెరగడం, వ్యాధినిరోధక శక్తి తగ్గడం, పెరుగుదల నెమ్మదిగా ఉండడం, ఎముకలు సన్నబడి పెళుసుగా మారడం, గుండెపోటు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.

ప్రశ్న 23.
తలసేమియా చికిత్స విధానం తెలపండి.
జవాబు:
తలసేమియా మేజర్ :
పెరుగుదల తక్కువగా ఉండడం, పెళుసు బారిన ఎముకలు, తొందరగా వ్యాధులకు గురికావడం వంటి లక్షణాలను మొదటి ఏడాదిలోనే గుర్తించినట్లయితే ఈ వ్యాధిని తగ్గించడం తేలికవుతుంది. మొదటి సంవత్సరంలోనే శిశువులలో హిమోగ్లోబిన్ స్థాయిని, పెరుగుదలను జాగ్రత్తగా గమనిస్తుండాలి. హిమోగ్లోబిన్ పరిమాణం 70% కన్నా తగ్గినపుడు పిల్లల్లో పెరుగుదల లోపిస్తుంది. వారు క్రమం తప్పకుండా రక్త మార్పిడి చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది.

ప్రపంచ ఆరోగ్య సమస్యల లెక్కల ప్రకారం హి మోగ్లోబిన్ స్థాయి 115-120 గ్రా./లీ. గా ఉండేలా చూడడం. ఈ చికిత్సలో ముఖ్యమైన అంశం ప్రతిమూడు నాలుగు వారాలకొకసారి గాఢత కలిగిన ఎర్రరక్త కణాలను ప్రవేశపెట్టడం ద్వారా చికిత్స చేస్తారు. మూలకణాల మార్పిడి ద్వారా తలసేమియా మేజర్ వ్యాధిని నయం చేయవచ్చు. ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు వారి కణజాలాలకు సమానమైన కణజాలం కలిగిన వారి సోదర/సోదరిల నుండి సేకరించిన ఎముక మజ్జలో ఉండే ఎర్రరక్త కణాల మూలకణాల (ఎముక మజ్జ) మార్పిడి ద్వారా చికిత్స చేయవచ్చు.

ప్రశ్న 24.
ఈ క్రింది పట్టికను పూరించండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 22
జవాబు:
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 23

ప్రశ్న 25.
ప్రక్క పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 19
a) ఈ ప్రయోగ ఉద్దేశం ఏమిటి?
b) ఈ ప్రయోగంలో ఉపయోగించిన పరికరం పేరు ఏమిటి?
c) కుండీలో నీరు పొయ్యకుండా ప్రయోగం నిర్వహిస్తే ఏం జరుగుతుంది?
d) ఈ ప్రయోగానికి నీవు ఉపయోగించే ప్రత్యామ్నాయ పరికరాలు ఏమిటి?
జవాబు:
a) వేరు పీడనం నిరూపించటం ఈ ప్రయోగ ముఖ్య ఉద్దేశం.
b) వేరు పీడనం కొలవటానికి ఉపయోగించే పరికరం పేరు మానోమీటరు.
c) కుండీలో నీరు పోయకపోతే, వేరుపీడనం ఏర్పడదు. కావున నీటిమట్టంలో మార్పు రాదు.
d) గాజునాళం బదులు లెవల్ పైపు వాడి ప్రయోగం నిర్వహించవచ్చు.

ప్రశ్న 26.
క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
a) గుండెలో ఏ వైపున ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది?
b) ఆమ్లజని రహిత రక్తం ఏ ధమని ద్వారా ఊపిరితిత్తులకు చేరును?
c) మహాధమని గుండె ఏ గది నుండి బయలుదేరును?
d) గుండెలో రక్త ప్రవాహాన్ని నియంత్రించే నిర్మాణాలు ఏమిటి?
జవాబు:
a) గుండెలో కుడివైపున ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది.
b) ఆమ్లజని రహిత రక్తం పుపుస ధమని ద్వారా ఊపిరితిత్తులకు చేరును.
c) మహాధమని ఎడమ జఠరిక నుండి బయలుదేరును.
d) గుండెలో రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తూ కవాటాలు ఉంటాయి.

ప్రశ్న 27.
ప్రక్క పటం గమనించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 13
a) ఈ ప్రయోగం నిర్వహించిన శాస్త్రవేత్త ఎవరు?
b) ఈ ప్రయోగంలో పరిశీలించిన రక్తనాళాలు ఏమిటి?
c) ప్రయోగంలో మోచేతికి పైగా కట్టు ఎందుకు కట్టారు?
d) సిరలలో రక్తం వెనుకకు ఎందుకు రాదు?
జవాబు:
a) ఈ ప్రయోగం నిర్వహించిన శాస్త్రవేత్త విలియం హార్వే.
b) ఈ ప్రయోగం ద్వారా సిరలను పరిశీలించవచ్చును.
c) మోచేతికి పైన కట్టు కట్టటం వలన రక్తం ప్రవాహం ఆగి సిరలు ఉబ్బి కనిపిస్తాయి.
d) సిరలలో రక్తం వెనుకకు రాకుండా కవాటాలు నిరోధిస్తాయి.

ప్రశ్న 28.
ప్రక్క పటాన్ని పరిశీలించండి. ఇది ఏ రకమైన హార్దిక వలయాన్ని సూచిస్తుంది? ఇక్కడ జరిగే విధానాన్ని వివరించండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 24
జవాబు:

  1. ఇవ్వబడిన పటం ద్వివలయ ప్రసరణ వ్యవస్థను సూచిస్తుంది.
  2. ఉన్నత జంతువుల్లో రక్తం హృదయం ద్వారా రెండుసార్లు ప్రయాణం చేస్తుంది. ఒకసారి హృదయం, ఊపిరితిత్తుల మధ్య, రెండవసారి హృదయం, శరీర భాగాల మధ్య.
  3. ఇటువంటి ప్రసరణను ద్వివలయ ప్రసరణమని, హృదయాన్ని ద్వివలయ ప్రసరణ హృదయం అని అంటారు. ఈ వ్యవస్థని ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు.
  4. ఊపిరితిత్తులకు, గుండెకు మధ్య జరిగే ప్రసరణ వలయాన్ని పుపుస వలయం అని, హృదయానికి, శరీర అవయవాలకు మధ్య జరిగే ప్రసరణ వలయాన్ని దైహిక వలయం అని అంటారు.
  5. పుపుస వలయం లేదా ప్రసరణ నందు శరీర అవయవాల నుండి సేకరించబడిన రక్తం హృదయం కుడి కర్ణికకు చేరి అక్కడ నుండి కుడి జఠరికకు పోతుంది. కుడి జఠరిక నుండి ఊపిరితిత్తులకు చేరి ఆమ్లజనీకరణం అవుతుంది. ఆమ్లజని సహితరక్తం పుపుస సిరల ద్వారా ఎడమ కర్ణికకు, ఇక్కడ నుండి ఎడమ జఠరికకు చేరుతుంది.
  6. దైహిక వలయం నందు ఎడమ కర్ణిక నుండి, రక్తం ఎడమ జఠరికలోకి చేరుతుంది. ఇక్కడ నుండి దైహిక మహాధమని ద్వారా శరీర వివిధ భాగాలకు చేరుతుంది. శరీర భాగాల నుండి పూర్వపరమహాసిరల ద్వారా కుడి కర్ణికను చేరుతుంది.

ప్రశ్న 29.
ఈ క్రింది పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నలను విశ్లేషించండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 25
ఎ) ఏ వయస్సు వారిలో హృదయస్పందన ఎక్కువగా ఉంది?
జవాబు:
నవజాత శిశువు

బి) ఏ వయస్సు వారిలో హృదయస్పందన తక్కువగా ఉంది?
జవాబు:
సుశిక్షితులైన క్రీడాకారులు

సి) క్రీడాకారులలో హృదయస్పందన తక్కువగా ఎందుకు ఉంది?
జవాబు:
క్రీడాకారుల హృదయం ఒక హృదయస్పందన ద్వారా ఎక్కువ మొత్తంలో రక్తమును శరీర భాగాలకు సరఫరా చేస్తుంది. హృదయము నందలి గోడలు మందముగా ఉండుట వలన హృదయం ఎక్కువ మొత్తంలో రక్తమును పంపు చేస్తుంది.

డి) నవజాత శిశువుకి, పిల్లల మధ్య హృదయస్పందనలో ఎక్కువగా తేడాలు ఉండటానికి కారణమేమిటి?
జవాబు:

  1. థైరాయిడ్ మరియు మధుమేహ వ్యాధిగ్రస్తులైన తల్లులు జన్మనిచ్చిన పిల్లలలో హార్మోన్ ,మార్పుల వలన మరియు గ్లూకోజు స్థాయిలను అనుసరించి గుండె వేగంగా కొట్టుకుంటుంది.
  2. కొంతమంది నవజాత శిశువుల్లో గుండెనందు ప్రత్యేక కణజాలమైన అనుబంధ విద్యుత్ కణజాలంతో పుడతారు. ఈ కణజాలం ఎక్కువ హృదయస్పందనకు కారణమవుతుంది.
  3. ఉల్ఫ్ పార్కిన్సన్ సిండ్రోమ్ మరియు వైట్ సిండ్రోమ్ నందు అదనపు కణములు ఉండుట వలన మరియు అనుబంధ మార్గము వలన అదనముగా గుండె కొట్టుకోవడం జరుగుతుంది.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 30.
మానవులలో గల రక్తనాళాలను దేని ఆధారంగా వర్గీకరిస్తావు? వాటి మధ్య గల తేడాలను పట్టికలో వ్రాయండి.
జవాబు:
మానవులలో గల రక్తనాళాలను అవి తీసుకుని పోయే రక్తం ఆధారంగా ప్రధానంగా మూడు రకాలు. అవి :
ధమనులు, సిరలు, రక్తకేశనాళికలు. ధమనులు గుండె నుండి ఆక్సిజన్ సహిత రక్తాన్ని శరీర భాగాలకు అందిస్తాయి. సిరలు శరీర భాగాల నుండి ఆక్సిజన్ రహిత రక్తాన్ని గుండెకు తీసుకొని వస్తాయి. ధమనులు మరియు సిరల మధ్యన ఉండే అతి సన్నని, చిన్నవైన రక్తనాళాలను సూక్ష్మకేశ నాళికలు అంటారు.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 26

ప్రశ్న 31.
ధమనులు సిరలలో జరిగే రక్త ప్రవాహాన్ని, వాటి అడ్డుకోత బొమ్మను గీయండి. వాటి ద్వారా రక్త ప్రవాహం ఎలా జరుగుతుందో రాయండి.
జవాబు:
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 27

  1. ధమనులందు ఆమ్లజనిసహిత రక్తం ప్రవహిస్తుంది. ధమనులు ఆమ్లజనిసహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు తప్ప శరీర అన్ని భాగాలకు సరఫరా చేస్తాయి. పుపుస ధమని ఆమ్లజని రహితరక్తాన్ని ఊపిరితిత్తులకు గుండె నుండి సరఫరా చేస్తుంది.
  2. శరీర అన్ని భాగముల నుండి సిరలు ఆమ్లజనిరహిత రక్తాన్ని సేకరించి గుండెనందలి కుడి కర్ణికకు చేరుస్తాయి. పుపుస సిర ఊపిరితిత్తుల నుండి ఆమ్లజనిసహిత రక్తాన్ని గుండెకు సరఫరా చేస్తుంది.
  3. అతి చిన్నవైన ధమనికలను మరియు సిరలను రక్తకేశనాళికలు కలుపుతాయి.

ప్రశ్న 32.
ఈ క్రింది పట్టికను పరిశీలించి ప్రశ్నలను విశ్లేషించండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 28
ఎ) అధిక బరువు కల్గిన జంతువులలో హృదయస్పందన ఎందుకు తక్కువగా ఉంది?
జవాబు:
ఎక్కువ బరువు కలిగిన జంతువులలో ఎక్కువ బరువు కలిగిన హృదయం ఉంటుంది. ఒక హృదయస్పందనలో పెద్దదైన హృదయం ఎక్కువ మొత్తంలో శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. తిరిగి హృదయం పూర్తిగా నిండడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువలన అధిక బరువు కలిగిన జంతువులలో హృదయస్పందనలు చాలా తక్కువగా ఉంటాయి. హృదయం పూర్తిగా ఖాళీ కావటం అనేది అధిక బరువు కలిగిన జీవులలో అసంభవం.

బి) తక్కువ బరువు కల్గిన జంతువులలో హృదయస్పందన ఎక్కువగా ఎందుకు ఉంది?
జవాబు:
తక్కువ శరీర బరువు కలిగిన జంతువులలో హృదయం కూడా తక్కువ బరువు ఉంటుంది. రక్తాన్ని శరీర భాగాలకు పంపించడానికి సంకోచించినపుడు అతి తక్కువ పరిమాణంలో రక్తం శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది. అందువలన ఎక్కువ మొత్తం రక్తం శరీర భాగాలకు సరఫరా చేయడానికి గుండె ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది.

సి) శరీర బరువుకు హృదయస్పందనానికి గల సంబంధమేమి?
జవాబు:
శరీర బరువు పెరిగితే హృదయస్పందనలు తక్కువగా ఉంటాయి. శరీర బరువు తక్కువగా ఉంటే హృదయస్పందనలు ఎక్కువ.

డి) శరీర బరువుతో పోలిస్తే, గుండె బరువు తక్కువగా ఉండటానికి కారణాలు ఏమై ఉండవచ్చు?
జవాబు:
జీవి అనేక అవయవాలు మరియు అవయవ వ్యవస్థలతో నిర్మితమై ఉంటుంది. హృదయం జీవి శరీరములో ఒక భాగమైనందున సాధారణముగా శరీర బరువు కంటే హృదయం బరువు తక్కువగా ఉంటుంది.

10th Class Biology 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ ½ Mark Important Questions and Answers

1. బి.పి.ని విస్తరించుము.
జవాబు:
Blood Pressure / రక్త పీడనం

శాస్త్రవేత్తను గుర్తించండి

2. రోగి హృదయ స్పందన వినడానికి మొదటిసారి కాగితపు గొట్టాన్ని ఉపయోగించాడు. కాగితపు గొట్టం స్థానంలో వెదురు గొట్టాన్ని వాడేవారు. దానికి స్టెతస్కోప్ అని పేరు పెట్టారు.
జవాబు:
రెని లెన్నేక్

3. ఇతను ఇటాలియన్ వైద్యుడు. కాలిలోని సిరలను అధ్యయనం చేస్తుండగా వాటిలో చిన్న చిన్న కవాటాలు ఉండటం గుర్తించాడు.
జవాబు:
గైరోలమా ఫ్యాబ్రిసి

4. ఇతనొక బ్రిటీష్ వైద్యుడు. గుండెలో ఒకే దిశలో రక్త ప్రసరణకు తోడ్పడే కవాటాలను గుర్తించాడు. ఇవి రక్తాన్ని కర్ణికల నుండి జఠరికలకు ప్రవహింపజేస్తాయి అని కనుగొన్నాడు.
జవాబు:
విలియం హార్వే

5. ఆయన సూక్ష్మజీవ శాస్త్రవేత్త. చిన్న ధమనులు మరియు సిరలు అతిసన్నని, చిన్నవైన రక్తనాళాల ద్వారా అనుసంధానించబడి ఉన్నట్లు కనుగొన్నాడు. వాటికి సూక్ష్మ కేశనాళికలు అని పేరు పెట్టాడు.
జవాబు:
మార్సెల్లో మాల్ఫీజి

ఫ్లో చార్టులు

6. చేపలోని ఏకవలయ రక్తప్రసరణ వ్యవస్థలో ఖాళీని పూరించండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 29
జవాబు:
మొప్పలు

7.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 30
జవాబు:
రక్త కేశనాళికలు

8.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 31
జవాబు:
ప్లాస్మా

9.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 32
జవాబు:
ఎడమ జఠరిక

10.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 33
జవాబు:
ప్రసరణ కణజాలం

11.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 34
జవాబు:
పుపుస మహాధమని

12.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 35
జవాబు:
త్రాంబోకైనేజ్

13.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 39
జవాబు:
ఫైబ్రినోజెన్

14.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 36
జవాబు:
వల్కల కణాలు / వల్కలం

15.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 37
జవాబు:
పత్రరంధ్రాలు

సరైన గ్రూపును గుర్తించండి

16. ఏ గ్రూపు కణాలు మొక్కలకు సంబంధించినవి?
A. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు
B. దారువు పోషక కణజాలం, పత్రాంతర కణాలు
జవాబు:
సమూహం B

17. రక్తం గడ్డ కట్టడానికి సంబంధం లేని సమూహాన్ని గుర్తించండి.
A. త్రాంబిన్, ఫైబ్రినోజెన్, త్రాంబోకైనేజ్
B. హెపారిన్, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు
జవాబు:
సమూహం B

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

18. ఏ గ్రూపుకు సంబంధించిన రక్త నాళాలలో ఆమ్లజని సహిత రక్తం ప్రవహించదు?
A. దైహిక మహాధమని, కరోనరీ ధమని, పుపుస మహాసిర
B. పుపుస మహాధమని, కరోనరీ సిర, పర మహాసిర
జవాబు:
సమూహం B

19. ఏ గ్రూపు జీవులు వివృత రక్త ప్రసరణ వ్యవస్థను చూపిస్తాయి?
A. కీటకం, రొయ్య, సాలీడు
B. వానపాము, ఆక్టోపస్, మానవుడు
జవాబు:
సమూహం A

20. మొక్కలలో రవాణా కొరకు ఏ ప్రక్రియలు సహాయ పడతాయి?
A. కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ, ద్రవాభిసరణ
B. వేరు పీడనం, బాష్పోత్సేకం, సంసంజన మరియు అసంజన బలాలు
జవాబు:
సమూహం B

21. ఏ గ్రూపులోని కణాలు కణికారహిత కణాలు కావు ? జ.
A. ఇసినోఫిల్స్, బాసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ సరైన గ్రూపును గుర్తించండి
B. మోనోసైట్లు, లింఫోసైట్లు, రక్తఫలకికలు
జవాబు:
సమూహం A

22. ఏ గ్రూపు లక్షణాలు ధమనులకు సంబంధించినవి?
A. పలుచని గోడలు, మిడిమిడి కవాటాలు
B. మందపాటి గోడలు, అంతర్గతం, కవాటాలు లేవు
జవాబు:
సమూహం B

23. రక్త ప్రసరణ యొక్క సరైన క్రమాన్ని కనుగొనండి.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 38
జవాబు:
సమూహం B

24. రక్త ప్రసరణ జరిగే విధానం యొక్క సరైన క్రమాన్ని గుర్తించండి.
A. ఊపిరితిత్తులు → ఎడమ కర్ణిక → ఎడమ జఠరిక → కరోనరీ ధమనులు → హృదయ కండరం
B. హృదయ కండరం → కరోనరీ ధమనులు ఎడమ కర్ణిక → ఎడమ జఠరిక → ఊపిరితిత్తులు
జవాబు:
సమూహం A

25. ఇవ్వబడ్డ టేబుల్ లో ఖాళీని పూరించండి.

వర్గము రవాణా వ్యవస్థ
కార్డేటా సంవృత ప్రసరణ వ్యవస్థ
? వివృత ప్రసరణ వ్యవస్థ

జవాబు:
ఆర్రోపోడా

ఉదాహరణలు ఇవ్వండి

26. బహుకణ జంతువులు శరీరంలో ఉన్న పదార్థాలను రవాణా చేయడానికి రక్తం అనే ప్రత్యేక ద్రవాన్ని అభివృద్ధి చేసుకున్నాయి. మీ శరీరంలో పదార్థాలను రవాణా చేసే మరొక ద్రవానికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
లింఫ్ / శోషరసం

27. గొల్లభామ అనే కీటకంలో రక్తం వర్ణరహితం. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
బొద్దింక

28. వివృత రక్తప్రసరణ వ్యవస్థ కీటకాలలో కనిపిస్తుంది. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
మలస్కా జీవులు

29. హైడ్రా వంటి నిడేరియా జీవులు పదార్థాల రవాణా కొరకు శరీరంలో జఠర ప్రసరణ కుహరం అనే నిర్మాణాన్ని అభివృద్ధి చేసుకున్నాయి. దీనికి మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
జెల్లీ ఫిష్

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

30. పూర్వ మహాసిర శరీరంలోని వివిధ భాగాల నుండి ఆమ్లజనిరహిత రక్తాన్ని సేకరిస్తుంది. మరొక మహాసిర కు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పర మహాసిర

పోలికను గుర్తించుట

31. అమీబా : ట్రేనియన్ చలనం :: స్పంజికలు 😕
జవాబు:
నీటి ప్రవాహాలు

32. సిరలు : ఆమ్లజనిరహిత రక్తం :: ? : ఆమ్లజనిసహిత రక్తం
జవాబు:
ధమనులు

33. ఆమ్లజనిసహిత రక్తం : పుపుస మహాసిర :: ఆమ్లజని రహిత రక్తం 😕
జవాబు:
పుపుస మహాధమని

34. ఆమ్లజనిసహిత రక్తం : మహాధమని :: ఆమ్లజని రహిత రక్తం 😕
జవాబు:
పుపుస మహాధమని

35. ఆమ్లజనిసహిత రక్తం : శరీర భాగాలు :: ? : ఊపిరితిత్తులు
జవాబు:
ఆమ్లజని రహిత రక్తం

36. హృదయ స్పందన : స్టెతస్కోప్ :: రక్తపీడనం 😕
జవాబు:
స్పిగ్మో మానోమీటర్

37. కవాటాలు : ఫాబ్రిసి :: రక్త కేశనాళికలు 😕
జవాబు:
మార్సెల్లో మాల్ఫీజి

38. రక్తం : రక్తనాళాలు :: శోషరసం 😕
జవాబు:
శోషరస నాళాలు

39. రక్త స్కందన ఎంజైము : త్రాంబోకైనేజ్ :: రక్త స్కందన విటమిన్ 😕
జవాబు:
విటమిన్ K

40. పత్రాలు : పత్రరంధ్రాలు :: కాండం 😕
జవాబు:
లెంటిసెల్స్

41. దారువు : నీరు :: ? : పోషకాలు
జవాబు:
పోషక కణజాలం

42. RBC యొక్క లోపం : అనీమియా :: జన్యు రుగ్మత 😕
జవాబు:
తలసేమియా

దోషాన్ని గుర్తించి, సరిచేసీ రాయండి

43. గాయం ద్వారా రక్తం బయటకు ప్రవహించినప్పుడు, రక్త ఫలకికలు టయలిన్ అనే ఎంజైమ్ ను విడుదల చేస్తాయి.
జవాబు:
గాయం ద్వారా రక్తం బయటకు ప్రవహించినప్పుడు, రక్త ఫలకికలు త్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ ను విడుదల చేస్తాయి.

44. రక్తం గడ్డకట్టిన తర్వాత పసుపుపచ్చ గడ్డి రంగులో ఏర్పడే ద్రవ భాగాన్నే ప్లాస్మా అంటారు.
జవాబు:
రక్తం గడ్డకట్టిన తర్వాత పసుపుపచ్చ గడ్డి రంగులో ఏర్పడే ద్రవ భాగాన్నే సీరం అంటారు. పోలికను గుర్తించుట

45. ధమనీ వ్యవస్థకు సమాంతరమైన శోషరస వ్యవస్థ కణజాల ద్రవాన్ని సిరా వ్యవస్థలోకి చేర్చడానికి తోడ్పడుతుంది.
జవాబు:
సిరా వ్యవస్థకు సమాంతరమైన శోషరస వ్యవస్థ కణజాల ద్రవాన్ని సిరా వ్యవస్థలోకి చేర్చడానికి తోడ్పడుతుంది.

46. ఎడమ కర్ణికా – జఠరిక రంధ్రం వద్ద గల కవాటాన్ని అగ్రత్రయ కవాటం లేదా మిట్రల్ కవాటం అంటారు.
జవాబు:
ఎడమ కర్ణికా – జఠరిక రంధ్రం వద్ద గల కవాటాన్ని అగ్రద్వయ కవాటం లేదా మిట్రల్ కవాటం అంటారు.

47. మూలకేశాలలోని రిక్తికలోకి నీరు విసరణ ప్రక్రియ ద్వారా ప్రవేశిస్తుంది.
జవాబు:
మూలకేశాలలోని రిక్తికలోకి నీరు ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా ప్రవేశిస్తుంది.

48. ఫ్లూరల్ ఫ్లూయిడ్ గుండెను అఘాతాల నుండి కాపాడుతుంది.
జవాబు:
హృదయావరణ కుహరద్రవం గుండెను అఘాతాల నుండి కాపాడుతుంది.

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

49. వేర్లు గ్రహించిన నీటిని మరియు పత్రాల ద్వారా తయారుచేసిన ఆహారాన్ని మొక్క యొక్క వివిధ భాగాలకు దారువు మరియు పోషక కణజాలం గల యాంత్రిక కణజాలం ద్వారా సరఫరా చేయబడతాయి.
జవాబు:
వేర్లు గ్రహించిన నీటిని మరియు పత్రాల ద్వారా తయారు చేసిన ఆహారాన్ని మొక్క యొక్క వివిధ భాగాలకు దారువు మరియు పోషక కణజాలం గల నాళికా పుంజం / ప్రసరణ కణజాలం ద్వారా సరఫరా చేయబడతాయి.

జతపరచుట

50. సరిగ్గా జతపరిచిన దానిని గుర్తించండి.
సిస్టోలిక్ పీడనం – 80
సాధారణ రక్తపీడనం – 120/80
డయాస్టోలిక్ పీడనం – 120
జవాబు:
సాధారణ రక్తపీడనం – 120/80

51. తప్పుగా జత చేయబడ్డ దానిని గుర్తించండి.
హార్దిక వలయం – 0.1
సెకను కర్ణికా సంకోచం – 0.11-0.14 సెకన్లు
జఠరిక సంకోచం – 0.27-0.35 సెకన్లు
జవాబు:
హార్దిక వలయం – 0.1 సెకను

52. తప్పుగా జతచేయబడ్డ దానిని గుర్తించండి.
అగ్రత్రయ కవాటం – కుడి కర్ణికా – జఠరికా రంధ్రం
అగ్రద్వయ కవాటం – ఎడమ కర్ణికా – జఠరికా రంధ్రం
పుపుస కవాటాలు – ఎడమ జఠరిక మొదలయ్యే స్థానం
జవాబు:
పుపుస కవాటాలు – ఎడమ జఠరిక మొదలయ్యే స్థానం

53. సరిగ్గా జతపరిచిన దానిని గుర్తించండి.
కర్ణికల సిస్టోల్ – కర్ణికలు మరియు జఠరికలు విశ్రాంతి
జఠరికల సిస్టోల్ – జఠరిక సంకోచం
జఠరికల డయాస్టోల్ – కర్ణికలు మరియు జఠరికల సంకోచం
జవాబు:
జఠరికల సిస్టోల్ – జఠరిక సంకోచం

54. తప్పుగా జతచేయబడ్డ దానిని గుర్తించండి.
కణజాల ద్రవం – శోషరసం
సీరం – రక్త మాతృక
శోషరసం – రక్తం మరియు కణజాలం మధ్య కనెక్షన్
జవాబు:
సీరం – రక్త మాతృక

55. సరిగ్గా జతపరిచిన దానిని గుర్తించండి.
సాధారణ రక్తపీడనం – <120/80 అల్ప రక్తపీడనం – 120/80 అధిక రక్తపీడనం – > 120/80
జవాబు:
అధిక రక్తపీడనం – > 120/80

56. తప్పుగా జతచేయబడ్డ దానిని గుర్తించండి.
ఎఫిడ్స్ – తొండము
Rh కారకం – WBC యొక్క యాంటీజెన్
వేరు – ద్రవాభిసరణ పీడనం
జవాబు:
Rh కారకం – WBC యొక్క యాంటీజెన్

నేను ఎవరు?

57. నేను ఛాతీ కుహరంలో అమరియున్న పియర్ ఆకారంలో ఉన్న అవయవాన్ని. నేను పిండాభివృద్ధి దశలో 21వ రోజు స్పందించడం ప్రారంభిస్తాను.
జవాబు:
హృదయం

58. నేను చేపలలో కనపడే రక్త ప్రసరణను, శరీర భాగాల నుంచి గుండెకు, అక్కడి నుంచి శ్వాసకోశ అవయ వాలకు రక్తం ప్రవహిస్తుంది.
జవాబు:
ఏకవలయ ప్రసరణం

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

59. నేను సిరా వ్యవస్థకు సమాంతరంగా ఏర్పడిన రవాణా వ్యవస్థను. టాన్సిల్స్, అడినాయిడ్స్, ప్లీహం, థైమస్ అనేవి ఆ వ్యవస్థలో భాగాలు.
జవాబు:
శోషరస వ్యవస్థ

60. మొక్కల్లో ఉండే జీవన ప్రక్రియను నేను. ఈ ప్రక్రియలో పత్రాలలో ఉండే పత్రరంధ్రాల ద్వారా మరియు కాండం యొక్క లెంటి సెల్స్ ద్వారా నీరు ఆవిరైపోతుంది.
జవాబు:
బాష్పోత్సేకం

61. రక్తం గడ్డ కట్టడానికి రక్తంలోని రక్తఫలకికలు మరియు ఇతర కారకాలతో పాటుగా అవసరమయ్యే విటమిన్ ని.
జవాబు:
విటమిన్ K

62. నేనొక వర్ణద్రవ్యాన్ని, రక్త వర్ణానికి మరియు శ్వాస వాయువుల రవాణాకు సహాయపడతాను.
జవాబు:
హీమోగ్లోబిన్

63. నేను ఒక కవాటాన్ని. ఎడమ జఠరిక నుండి రక్తాన్ని మహాధమనిలోనికి రక్తం ప్రవేశించడానికి అనుమతిస్తాను.
జవాబు:
మహాధమని కవాటం

64. నేనొక విభాజకాన్ని, కుడి కర్ణిక మరియు ఎడమ కర్ణికను వేరు చేస్తాను.
జవాబు:
కర్ణికాంతర విభాజకం

బొమ్మలపై ప్రశ్నలు

65.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 40
ఈ పరికరం యొక్క ఉద్దేశ్యం ఏమిటి?
జవాబు:
రక్తపోటును కొలవడానికి

66.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 41
ఈ చర్యకు కారణమైన ఎంజైమ్ పేరేమిటి?
జవాబు:
త్రాంబోకైనేజ్

67.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 42
సిరల మధ్య కలుపుతూ ఉన్న రక్తనాళాన్ని గుర్తించండి.
జవాబు:
రక్త కేశనాళికలు

68.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 43
ఈ పటంలోని ఎగువ గదులను ఏమంటారు?
జవాబు:
కర్ణికలు

69.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 44
పటంలో చూపిన వ్యవస్థ ఏమిటి?
జవాబు:
శోషరస వ్యవస్థ

70.
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 19
ఈ పటం ఏ ప్రయోగాన్ని సూచిస్తుంది?
జవాబు:
వేరుపీడన ప్రయోగం

ఖాళీలను పూరించండి

71. మానవ శరీరంలో రవాణా ద్రవాలు …………
జవాబు:
రక్తం, శోషరసం

72. రక్తాన్ని పంపు చేయు సాధనం ……..
జవాబు:
గుండె

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

73. ఆమ్లజనిరహిత రక్తం కలిగిన ధమని …..
జవాబు:
పుప్పుస ధమని

74. శరీర భాగాలకు గుండెకు మధ్య జరిగే వలయం …………..
జవాబు:
దైహిక వలయం

75. గుండెలోని కవాటాల సంఖ్య
జవాబు:
4

76. గుండెను చుట్టి ఉండు పొర ………….
జవాబు:
హృదయావరణ త్వచం

77. గుండె ఎడమ వైపు ఉండే రక్తం …..
జవాబు:
ఆమ్లజనిసహిత రక్తం

78. ద్విపత్ర కవాట స్థానము ………
జవాబు:
ఎడమ కర్ణిక జఠరిక రంధ్రము

79. స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ కలిగిన జీవి ……..
జవాబు:
బొద్దింక

80. మొదటిసారిగా రక్తనాళాలు కలిగిన జీవుల వర్గం ……….
జవాబు:
అనిలెడా

81. మొక్కలలో నీటి రవాణా చేయు కణజాలం ……….
జవాబు:
దారువు

82. పోషక కణజాలం పని …………
జవాబు:
ఆహార రవాణా

83. వేరులో నీటిని పీల్చుకొనే నిర్మాణాలు …………
జవాబు:
మూలకేశాలు

84. కాండంలోనికి నీరు ప్రవేశించటానికి తోడ్పడే వత్తిడి …………….
జవాబు:
వేరు పీడనం

85. కీటకాలు ఆహారం సంపాదించటానికి ………… ను దారువులోనికి చొప్పిస్తాయి.జవాబు:
ప్రోబోసిస్

86. రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్ ………..
జవాబు:
విటమిన్ K

87. రక్తాన్ని గడ్డ కట్టించే ప్రోటీన్స్ ………
జవాబు:
తాంబ్రిన్, ప్రోత్రాంబిన్

88. రక్తాన్ని గడ్డ కట్టించే రక్త కణాలు …………
జవాబు:
రక్త ఫలకికలు

89. ఊపిరితిత్తుల నుండి ………… రక్తం గుండెకు చేరుతుంది.
జవాబు:
ఆమ్లజనిసహిత రక్తం

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

90. మానవ శరీరంలో పెద్ద దమని ….
జవాబు:
మహా ధమని

10th Class Biology 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 1 Mark Bits Questions and Answers

1. ఊపిరితిత్తులపై ఉన్న పొరను ప్లూరా అంటారు. అలాగే గుండెపై ఉన్న పొరను ఏమంటారు?
A) హైపర్ కార్డియం
B) పెరికార్డియం
C) ఎపికార్డియం
D) అప్పర్ కార్డియం
జవాబు:
B) పెరికార్డియం

2. మానవుని గుండెలో గదులు
A) 1 కర్ణిక, 1 జఠరిక
B) 2 కర్ణికలు, 1 జఠరిక
C) 1 కర్ణిక, 3 జఠరికలు
D) 2 కర్ణికలు, 2 జఠరికలు
జవాబు:
D) 2 కర్ణికలు, 2 జఠరికలు

3. మొక్కల్లో బాష్పోత్సేకం జరగకపోతే ……….. జరగదు.
A) కిరణజన్య సంయోగక్రియ
B) శ్వాసక్రియ
C) నీటి రవాణా
D) ప్రత్యుత్పత్తి
జవాబు:
C) నీటి రవాణా

4. సామాన్య రక్త పీడనము కొలవడానికి డాక్టరు ఉపయోగించే పరికరం
రక్త పీడనం కొలుచుటకు వాడే పరికరం
A) స్పిగ్మోమానోమీటరు
B) మానోమీటర్
C) హైగ్రోమీటర్
D) బారోమీటర్
జవాబు:
A) స్పిగ్మోమానోమీటరు

5. రక్తనాళాల అడ్డుకోతలో కండర పొర మందంగా క్రింది వానిలో కన్పిస్తుంది ……
a) స్టెతస్కోపు – రెనె లెన్నెక్
b) రక్త పీడనం – థర్మో మీటర్
c) అమీబా – బ్రౌనియన్ చలనం
A) a
B) b
C) c
D) పైవేవీకాదు
జవాబు:
a) స్టెతస్కోపు – రెనె లెన్నెక్

6. మొక్కలలో నీటి రవాణాకు తోడ్పడేది
A) దారు కణజాలం
B) ఉపకళా కణజాలం
C) పోషక కణజాలం
D) స్తంభ కణజాలం
జవాబు:
A) దారు కణజాలం

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

7. ఇచ్చిన ప్రయోగం కింది వానిలో దేనిని గురించి తెలుసుకొనుటకు నిర్వహిస్తారు?
A) వేరు పీడనం
B) కిరణజన్య సంయోగక్రియ
C) శ్వాసక్రియ
D) బాష్పోత్సేకం
జవాబు:
D) బాష్పోత్సేకం

8. నడవడం, పరిగెత్తడం వంటి సమయాలలో రక్త పీడనం ఏ విధంగా ఉంటుంది?
A) సాధారణంగా
B) తక్కువగా
C) ఎక్కువగా
D) పైవేవీ కాదు
జవాబు:
C) ఎక్కువగా

9. గుండెలో ఏ భాగంలో ఉండే రక్తంలో తక్కువ ఆక్సిజన్ ఉంటుంది?
A) కుడి కర్ణిక, కుడి జఠరిక
B) ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక
C) కుడి కర్ణిక, ఎడమ జఠరిక
D) ఎడమ కర్ణిక, కుడి జఠరిక
జవాబు:
A) కుడి కర్ణిక, కుడి జఠరిక

10. పటంలో చూపిన రక్తనాళం రక్తాన్ని శరీర భాగాల నుండి హృదయానికి తీసుకువెళుతుంది. దీని పేరేమి?
A) ధమని
B) రక్తకేశ నాళిక
C) సిర
D) కండర తంతువు
జవాబు:
C) సిర

11. క్రింది వానిలో సరికాని జత ఏది?
i) పుపుస ధమని
ii) పుపుస సిర
iii) బృహద్ధమని
iv) బృహత్సిర
A) i, iii
B) ii, iv
C) i, ii
D) iii, iv
జవాబు:
B) ii, iv

12. ఈ చిత్రంలో చూపబడిన క్రియ
A) బాష్పోత్సేకము
B) కిరణజన్య సంయోగక్రియ
C) శ్వాసక్రియ
D) పోషణ
జవాబు:
A) బాష్పోత్సేకము

13. జతపరచండి.
జాబితా -1 జాబితా – 2
1) కర్ణికల సిస్టోలు ఎ) 0.27 – 0.35 సె.
2) జఠరికల సిస్టోలు బి) 0.8 సె.
3) హార్దిక వలయం సి) 0.11 – 0. 14 సె.
A) 1-బి, 2-ఎ, 3-సి
B) 1-బి, 2-సి, 3-ఎ
C) 1-సి, 2-ఎ, 3-బి
D) 1-సి, 2-బి, 3-ఎ
జవాబు:
C) 1-సి, 2-ఎ, 3-బి

14. క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి.
i) ధమనుల గోడలు మందంగా ఉంటాయి.
ii) ధమనులు గుండె నుండి శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి.
iii) ధమనుల్లో రక్త పీడనం తక్కువ.
iv) పుపుస ధమనిలో ఆమ్లజని సహిత రక్తం ఉంటుంది.
A) (i), (iii)
B) (i), (iv)
C) (ii), (iv)
D) (i), (ii)
జవాబు:
D) (i), (ii)

15. ఏకవలయ రక్తప్రసరణ వ్యవస్థ కల జీవి
A) కప్ప
B) నత్త
C) కోడి
D) చేప
జవాబు:
D) చేప

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

16. ఈ బొమ్మను గుర్తించుము.
A) సిర అడ్డుకోత
B) సిరిక అడ్డుకోత
C) ధమని అడ్డుకోత
D) రక్తకేశ నాళిక అడ్డుకోత
జవాబు:
C) ధమని అడ్డుకోత

17. మొక్కలలో నీటి ప్రసరణకు ఉపయోగపడునది
A) పోషక కణజాలం
B) బాహ్య చర్మం
C) దారువు
D) విభాజ్య కణజాలం
జవాబు:
C) దారువు

18. వేరు పీడనం ప్రయోగం చేసేటప్పుడు నీవు తీసుకునే జాగ్రత్త ఏది?
A) మొక్క కొమ్మలను కలిగి ఉండాలి.
B) మొక్కను చీకటిలో ఉంచాలి.
C) గాజు గొట్టం పరిమాణం, కాండ పరిమాణం ఒకే విధంగా ఉండాలి.
D) గాజు గొట్టం పరిమాణం, కాండం పరిమాణం కన్నా పెద్దదిగా ఉండాలి.
జవాబు:
C) గాజు గొట్టం పరిమాణం, కాండ పరిమాణం ఒకే విధంగా ఉండాలి.

19. రాము యొక్క హృదయ స్పందన రేటు 72/ని. అయిన అతని నాడీ స్పందన రేటు ………..
A) 72/ని. కన్నా ఎక్కువ
B) 72/ని. కన్నా తక్కువ
C) 72/ ని. కు సమానం
D) అంచనా వేయలేం
జవాబు:
C) 72/ ని. కు సమానం

20. సరియైన వాక్యమును గుర్తించుము.
A) అవకాశిక (lumen) ఎక్కువ.
B) ధమనులలో రక్తపీడనం ఎక్కువ.
C) సిరల గోడల మందం ఎక్కువ.
D) ధమనుల్లో కవాటాలుంటాయి.
జవాబు:
B) ధమనులలో రక్తపీడనం ఎక్కువ.

21. సరియైన జతను గుర్తించండి.
i) పుపుస సిర a) ఆమ్లజని రహిత రక్తం
ii) పుపుస ధమని b) కుడి కర్ణిక, కుడి
iii)కరోనరి రక్తనాళాలు c) ఆమ్లజని సహిత రక్తం
iv)అగ్రత్రయ కవాటం d) గుండెకు రక్తం
A) (i) – c, (ii) – a, (iii) – d, (iv) – b
B) (i) – a, (ii) – b, (iii) – c, (iv) – d
C) (i) – c, (ii) – b, (iii) – d, (iv) – a
D) (i) – c, (ii) – a, (iii) – b, (iv) -d
జవాబు:
A) (i) – c, (ii) – a, (iii) – d, (iv) – b

22. కింది బొమ్మను పరిశీలించి అది ఏ వ్యవస్థకు సంబంధించినదో గుర్తించండి.
A) విసర్జక వ్యవస్థ
B) నాడీ వ్యవస్థ
C) శోషరస వ్యవస్థ
D) కండర వ్యవస్థ
జవాబు:
C) శోషరస వ్యవస్థ

23.

జాబితా – A జాబితా – B
i) రెండు గదుల హృదయం a) కప్ప
ii) మూడు గదుల హృదయం b) ఆవు
iii) నాలుగు గదుల హృదయం c) చేప

A) i – a, ii – c, iii – b
B) i – a, ii – b, iii – c
C) i – c, ii – a, iii – b
D) i – c, ii – b, iii – a
జవాబు:
C) i- c, ii – a, iii – b

24. నాడీ స్పందనను కనుగొనడానికి నీవు తయారుచేసిన పరికరంలో ఉపయోగించిన వస్తువులు
A) దారం మరియు అగ్గిపుల్ల
B) దారం మరియు చొక్కా గుండీ
C) అగ్గిపుల్ల మరియు నాణెం
D) అగ్గిపుల్ల మరియు చొక్కా గుండీ జఠరిక మధ్య
జవాబు:
D) అగ్గిపుల్ల మరియు చొక్కా గుండీ జఠరిక మధ్య

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

25. క్రింది వానిలో రక్తం గడ్డ కట్టుటలో పాత్ర లేనిది
A) ఫిల్లో క్వినోన్
B) ఫైబ్రిన్ అందించడం
C) థ్రాంబిన్
D) థైమిన్
జవాబు:
D) థైమిన్

మీకు తెలుసా?

AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 25 AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 28
• మానవునిలో ఒక మిల్లీలీటరు రక్తం గుండె నుండి కాలి చివరి వరకు వెళ్ళి తిరిగి గుండెకు చేరడానికి అంటే సుమారు 2 మీటర్ల దూరం ప్రయాణించడానికి సుమారుగా 60 సెకన్ల సమయం పడుతుంది. ఇదే రక్తాన్ని వ్యాపన పద్దతిలో ఇంతదూరం ప్రయాణించటానికి సుమారుగా 60 సంవత్సరాల కాలం పడుతుంది.

మొక్కల ద్వారా ఎంత నీరు బాష్పోత్సేకం చెందుతుంది? ఏపుగా పెరిగిన ఒక మొక్కజొన్న మొక్క వారానికి 15 లీటర్ల నీరు బాష్పోత్సేకం ద్వారా వాతావరణంలోకి పంపుతుంది. ఒక ఎకరం విస్తీర్ణంలోని మొక్కజొన్న తోట నుండి 13,25,000 లీటర్ల నీరు ఆవిరి అవుతుంది. ఒక పెద్ద మామిడి చెట్టు వసంతకాలంలో రోజుకు 750 నుండి 3,500 లీటర్ల నీటిని బాష్పోత్సేకం ద్వారా బయటకు పంపుతుంది.

పునశ్చరణ
AP 10th Class Biology Important Questions 3rd lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 45