These AP 10th Class Biology Important Questions 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ will help students prepare well for the exams.
AP Board 10th Class Biology 4th lesson Important Questions and Answers విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ
10th Class Biology 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
ప్రాథమిక ఉత్పన్నాలు అనగానేమి?
జవాబు:
ప్రాథమిక ఉత్పన్నాలు : పిండిపదార్థాలు, మాంసకృత్తులు మరియు కొవ్వులు వంటి పదార్థాలను “థమిక జీవక్రియా ఉత్పన్నాలు” అంటారు.
ప్రశ్న 2.
ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు అనగానేమి?
జవాబు:
ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు :
మొక్కల పెరుగుదలకు మరియు అభివృద్ధికి కాకుండా ఇతర విధులకు ఉపయోగపడే వాటిని “ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు” అంటారు.
ఉదా : ఆల్కలాయిడ్, రెసిన్లు.
ప్రశ్న 3.
మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. ఎందుకు?
జవాబు:
మూత్రంలో ‘యూరోక్రోమ్’ అనే పదార్థం ఉంటుంది. ఆ పదార్ధం వలన మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది.
ప్రశ్న 4.
అవయవదానంపై అవగాహన పెంచేందుకు రెండు నినాదాలు రాయండి.
జవాబు:
అవయవదానం – మహాదానం
అవయవాలు దానం చెయ్యండి – మరణం తరువాత కూడా జీవించండి.
ప్రశ్న 5.
మానవునిలో ఏవైనా రెండు విసర్జకావయవాల పేర్లు రాయండి.
జవాబు:
1) మూత్రపిండాలు, 2) చర్మం, 3) ఊపిరితిత్తులు, 4) కాలేయం, 5) పెద్ద ప్రేగు
ప్రశ్న 6.
రక్తం మరియు మూత్రం రెండింటిలోను వున్న రెండు పదార్థాలు ఏవి?
జవాబు:
గ్లూకోజ్, సోడియం, పొటాషియం, క్లోరైడ్స్, యూరియా, క్రియాటిన్, యూరిక్ ఆమ్లము, కాల్షియం, ఫాస్ఫరస్.
ప్రశ్న 7.
మీ క్షేత్ర పర్యటనలో మీరు కొన్ని ఆల్కలాయిడ్స్ కలిగిన మొక్కలను సేకరించారు. వాటిలో మనకు హాని కలిగించే ఆల్కలాయిడ్స్ పేర్లు వ్రాయండి.
జవాబు:
నికోటిన్, మార్ఫీన్, కొకైన్
ప్రశ్న 8.
మీ పరిసరాలలో నీవు పరిశీలించిన ఏయే మొక్కలు ఔషధాల తయారీలో ఉపయోగపడతాయి?
జవాబు:
వేప, తులసి, జిల్లేడు, తంగేడు, చామంతి
ప్రశ్న 9.
మొక్కల్లో తయారయ్యే పదార్థాలను ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు మరియు ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు అని వర్గీకరిస్తారు. ఈ రెండు రకాలకూ ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు : ఉదా : పిండి పదార్థములు (కార్బోహైడ్రేటులు), మాంసకృత్తులు (ప్రోటీనులు), కొవ్వులు
ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు : ఉదా : ఆల్కలాయిడ్లు, రెసిన్లు, టానిన్లు, జిగురులు, మరియు లేటెక్స్.
ప్రశ్న 10.
మూత్రపిండాలు వ్యాధి బారిన పడకుండా ఉండుటకు నీవు. పాటించే రెండు ఆరోగ్యకర అలవాట్లు రాయండి.
జవాబు:
- తగినంత నీటిని త్రాగటం
- ఆహార పదార్థాలలో ఉప్పు వాడకాన్ని తగ్గించటం
- పండ్ల రసాలను ఎక్కువగా తాగటం
ప్రశ్న 11.
క్షీరదాల మూత్రపిండ అంతర్నిర్మాణమును పరిశీలించే ప్రయోగంలో నీవు తీసుకున్న జాగ్రత్తలేవి?
జవాబు:
- గొర్రె మూత్రపిండమును సేకరించిన తర్వాత రక్తమంతా పోయేలా నీటిలో శుభ్రంగా కడగాలి.
- పూర్తిగా ఆరిన తర్వాత దానిని ట్రేలో పెట్టి పరిశీలించాలి.
- పరిశీలన పూర్తయిన తర్వాత యాంటీ బాక్టీరియల్ లోషన్ తో చేతులు కడుక్కోవాలి.
ప్రశ్న 12.
ఒక వ్యక్తి శరీరం నీరు, వ్యర్థ పదార్థాలతో నిండి ఉంది. అతని కాళ్ళు, చేతులు ఉబ్బి ఉన్నాయి. ఈ స్థితిని ఏమంటాము? ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేయక పోవడం వల్ల ఈ స్థితి కలుగుతుంది?
జవాబు:
- కాళ్ళు, చేతులు ఉబ్బి ఉన్న స్థితిని యురేమియా అంటారు.
- విసర్జక వ్యవస్థ (మూత్రపిండాలు) సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఈ స్థితి కలుగుతుంది.
ప్రశ్న 13.
మీ దైనందిన జీవితంలో ఉపయోగించుకొంటున్న రెండు ద్వితీయ జీవక్రియా ఉత్పన్నకాల పేర్లను రాయండి.
జవాబు:
1) ఆల్కలాయిడ్లు 2) టానిన్లు 3) రెసిన్లు 4) జిగుర్లు 5) లేటెక్స్
ప్రశ్న 14.
జీవక్రియలు అనగానేమి? అందలి రకాలు ఏమిటి?
జవాబు:
జీవ కణంలో జరిగే రసాయనిక చర్యలను జీవక్రియలు అంటారు.
ఇవి రెండు రకాలు. అవి : 1) నిర్మాణాత్మక క్రియలు, 2) విచ్ఛిన్న క్రియలు.
1) నిర్మాణాత్మక క్రియలు :
పదార్థాలు తయారుచేయబడతాయి. ఉదా : కిరణజన్యసంయోగక్రియ.
2) విచ్చిన్న క్రియలు :
పదార్థాలు విడగొట్టబడతాయి. ఉదా : జీర్ణక్రియ, శ్వాసక్రియ.
ప్రశ్న 15.
సమతుల్యత అనగా నేమి?
జవాబు:
దేహంలోని వివిధ భాగాలలోని ద్రవాల గాఢతను స్థిరంగా ఉంచడాన్ని “సమతుల్యత” అంటారు. సమతుల్యత దెబ్బతింటే జీవక్రియలలో ఆటంకం ఏర్పడుతుంది.
ప్రశ్న 16.
హైలస్ అనగా నేమి?
జవాబు:
హైలస్ :
మూత్రపిండం లోపలి తలంలో ఉండే పుటాకార నొక్కును “హైలస్” అంటారు. దీని నుండి వృక్పధమని లోపలికి ప్రవేశించగా, వృక్కసిర, మూత్రనాళం బయటకు వస్తాయి.
ప్రశ్న 17.
మూత్రపిండం అడ్డుకోతలో కనిపించే భాగాలు ఏమిటి?
జవాబు:
మూత్రపిండం అడ్డుకోతలో కనిపించే వెలుపలి ముదురు రంగు ప్రాంతాన్ని ‘వల్కలం’ అని, లోపలి లేత రంగు ప్రాంతాన్ని ‘దవ్వ’ అని అంటారు.
ప్రశ్న 18.
మూత్రపిందం యొక్క నిర్మాణాత్మక ప్రమాణం ఏమిటి?
జవాబు:
మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక ప్రమాణం “నెఫ్రాన్”. దీనినే “వృక్కనాళాలు” అంటారు.
ప్రశ్న 19.
నెఫ్రాలోని ప్రధాన భాగాలు ఏమిటి?
జవాబు:
నెఫ్రాన్లోని ప్రధాన భాగాలు :
నెఫ్రాలో ప్రధానంగా 1) మాల్ఫీజియన్ దేహం 2) వృక్కనాళిక అనే ప్రధాన భాగాలు ఉంటాయి.
ప్రశ్న 20.
రక్తకేశనాళికాగుచ్ఛం (గ్లోమరులస్) అనగా నేమి?
జవాబు:
రక్తకేశనాళికాగుచ్ఛం :
బొమన్ గుళికలో అభివాహ రక్తనాళం అనేక రక్తకేశనాళికలుగా విడిపోతుంది. దీనిని “గ్లోమరులస్” లేదా “రక్తకేశనాళికా గుచ్ఛం” అంటారు.
ప్రశ్న 21.
మాల్ఫీజియన్ దేహంలో ఏ ఏ భాగాలు ఉంటాయి?
జవాబు:
మాల్ఫీజియన్ దేహంలో 1) బొమన గుళిక 2) రక్తకేశనాళికా గుచ్ఛం (గ్లోమరులస్) అనే భాగాలు ఉంటాయి.
ప్రశ్న 22.
పోదోసైట్స్ అనగా నేమి?
జవాబు:
పోదోసెట్ :
భౌమన్ గుళిక గోడలలోని కణాలు ఉపకళాకణజాలంతో ఏర్పడతాయి. వీటిని “పోడోసైట్లు” అంటారు. పదార్థాల వడపోతకు వీలుకలిగించేలా పోడోసైట్ కణాల మధ్య సూక్ష్మరంధ్రాలు ఉంటాయి.
ప్రశ్న 23.
వృక్కనాళికలోని భాగాలు ఏమిటి?
జవాబు:
వృక్కనాళికలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. అవి :
- సమీపస్థ సంవళితనాళం
- హెన్లీశిక్యం
- దూరస్థ సంవళితనాళం.
ప్రశ్న 24.
పార్టీనీయం మొక్క వలన మనకు కలిగే నష్టం ఏమిటి?
జవాబు:
పార్టీనీయం మొక్క పుప్పొడి రేణువులు, మనకు ఎలర్జీని కలిగిస్తాయి. వాటిలో ఉండే నత్రజనియుత పదార్థాలు ఎలర్జీని, ఆస్తమాను కలిగిస్తాయి.
ప్రశ్న 25.
నెఫ్రా లో పునఃశోషణ ఎక్కడ జరుగుతుంది?
జవాబు:
సమీప సంవళితనాళంలో పునఃశోషణ జరుగుతుంది.
ప్రశ్న 26.
నెఫ్రాన్ యొక్క ఏ ప్రాంతంలో మూత్రం యొక్క pH విలువ నియంత్రించబడుతుంది?
జవాబు:
నెఫ్రాన్లోని దూరస్థ సంవళితనాళంలో నాళికాస్రావం వలన మూత్రం యొక్క pH విలువ నియంత్రించబడుతుంది.
ప్రశ్న 27.
నెఫ్రాల్లో నీటి పునః శోషణకు తోడ్పడే హార్మోన్ ఏమిటి? .
జవాబు:
నీటి పునఃశోషణకు వాసోప్రెస్సిన్ హార్మోన్ తోడ్పడుతుంది.
ప్రశ్న 28.
ఆళిందం (Vestibule) అనగా నేమి?
జవాబు:
మూత్రాశయం చివరి నాళాన్ని ప్రసేకం అంటారు. ఇది స్త్రీలలో 4 సెం.మీల పొడవు ఉంటుంది. దీనిని ‘ఆళిందం’ (Vestibule) అని కూడా అంటారు. అయితే ప్రసేకం పురుషులలో 20 సెం.మీ.ల పొడవు ఉండి ఉంటుంది. ఇది జననేంద్రియ నాళంగా పిలువబడుతుంది.
ప్రశ్న 29.
మూత్ర విసర్జన అనగా నేమి?
జవాబు:
మూత్ర విసర్జన :
మూత్రాశయం సంకోచం చెంది మూత్రాన్ని బయటకు పంపే ప్రక్రియను “మూత్ర విసర్జన” అంటారు.
ప్రశ్న 30.
మూత్రానికి రంగును కలిగించే పదార్థం ఏమిటి?
జవాబు:
యూరోక్రోమ్ అనే పదార్థం మూత్రానికి రంగుని కలిగిస్తుంది.
ప్రశ్న 31.
మూత్రంలో ఉండే పదార్థాలు ఏమిటి?
జవాబు:
మూత్రంలో ఉండే పదార్థాలు :
మూత్రంలో 96% నీరు, 25% కర్బన పదార్థాలు, 1.5% అకర్బన పదార్థాలు ఉంటాయి.
ప్రశ్న 32.
సెబం అనగానేమి?
జవాబు:
సెబం :
చర్మంలోని సెబేషియస్ గ్రంథులు స్రవించే పదార్థాన్ని “సెబం” అంటారు. ఇది రోమాలను మృదువుగా ఉంచటంతోపాటు చర్మతేమను రక్షిస్తుంది.
ప్రశ్న 33.
శీలాజకణాలు అనగానేమి?
జవాబు:
శిలాజకణాలు :
మొక్కల పండ్లలో వ్యర్థాలను నిల్వ చేసే కణాలను “శిలాజకణాలు” అంటారు.
ప్రశ్న 34.
ఆల్కలాయిడ్స్ అనగా నేమి?
జవాబు:
ఆల్కలాయిడ్స్ :
మొక్కలలో ఏర్పడే నత్రజని ఉత్పన్నాలను “ఆల్కలాయిడ్స్” అంటారు. ఇవి మొక్కల వివిధ భాగాలలో నిల్వ చేయబడతాయి.
ఉదా : క్వినైన్, నికోటిన్.
ప్రశ్న 35.
మొదటిసారిగా మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ చేసిన వ్యక్తి ఎవరు?
జవాబు:
“డా|| చార్లెస్ హఫ్ నగెల్” 1954లో సమరూప కవలలకు, మొట్టమొదట మూత్రపిండ మార్పిడి చేశాడు.
ప్రశ్న 36.
సంకోచరిక్తికలు ఏ జీవిలో ఉన్నాయి?
జవాబు:
అమీబా, పారమీషియం వంటి ఏకకణజీవులలో సంకోచరిక్తికలు విసర్జనను, ద్రవాభిసరణను నియంత్రిస్తాయి.
ప్రశ్న 37.
ఏ వర్గపు జీవులలో విసర్జక అవయవాలు లేవు?
జవాబు:
స్పంజికలు, సీలెంటిరేటా వర్గపు జీవులలో విసర్జక అవయవాలు లేవు.
ప్రశ్న 38.
మొక్కలు అధికంగా ఉన్న నీటిని ఎలా కోల్పోతాయి?
జవాబు:
మొక్కలు బాష్పోత్సేకం, మరియు బిందుస్రావం ప్రక్రియల ద్వారా అధికంగా ఉన్న నీటిని కోల్పోతాయి.
ప్రశ్న 39.
రబ్బరును ఏ మొక్క నుండి తయారు చేస్తారు?
జవాబు:
హీవియా బ్రెజీలియన్సిస్ మొక్క లేటెక్స్ నుండి రబ్బరు తయారు చేస్తారు.
ప్రశ్న 40.
మానవ శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలు ఏమిటి?
జవాబు:
మానవ శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలు CO2, నీరు, నత్రజని సంబంధిత వ్యర్థాలైన అమ్మోనియా, యూరియా, యూరికామ్లం , పైత్యరస వర్ణకాలు, లవణాలు మొదలైనవి.
ప్రశ్న 41.
శరీర వ్యర్థాలలో ప్రమాదకరమైనది ఏమిటి?
జవాబు:
శరీర వ్యర్థాలన్నింటిలోనూ అమ్మోనియా విషతుల్యమైనది.
ప్రశ్న 42.
వాసోప్రెస్సిన్ లోపం వలన కలిగే వ్యాధి ఏమిటి?
జవాబు:
వాసోప్రెస్సిన్ లోపం వలన తక్కువ గాఢత గల మూత్రం విసర్జించబడుతుంది. దీనిని “అతిమూత్ర వ్యాధి” లేదా “డయాబెటిస్ ఇన్సిపిడస్” అంటారు.
ప్రశ్న 43.
‘యురేమియ’ అనగా నేమి?
జవాబు:
యురేమియ:
మూత్ర పిండాలు పనిచేయటం ఆగిపోతే, శరీరంలో నీరు, వ్యర్థ పదార్థాలు నిండిపోతాయి. ఈ దశను ‘యురేమియ’ అంటారు. ఈ దశలో కాళ్లు, చేతులు ఉబ్బిపోతాయి.
ప్రశ్న 44.
హీమోడయాలసిస్ అనగా నేమి?
జవాబు:
హీమోడయాలసిస్ :
కృత్రిమంగా రక్తాన్ని వడగట్టే ప్రక్రియను ‘హీమోడయాలసిస్’ అంటారు.
ప్రశ్న 45.
టానిన్ల ప్రయోజనం ఏమిటి?
జవాబు:
టానిన్లను తోళ్ళను పదును చేయటానికి, మందులలో ఉపయోగిస్తారు.
ప్రశ్న 46.
రైసిన్ల ప్రయోజనం ఏమిటి?
జవాబు:
వార్నిష్ తయారీలో రెసిన్లు వాడతారు.
ప్రశ్న 47.
జిగురుల ఉపయోగం ఏమిటి?
జవాబు:
అతికించుటకు, బైండింగ్ వర్కులలోను, ఆహారపదార్థాలలోనూ జిగురులు ఉపయోగిస్తారు.
ప్రశ్న 48.
బయోడీజిల్ తయారీకి ఏ మొక్కను ఉపయోగిస్తారు?
జవాబు:
జట్రోపా, కానుగ మొక్కలను బయోడీజిల్ తయారీకి వాడతారు.
10th Class Biology 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
విసర్జక వ్యవస్థలో కలిగే అవరోధాలకు గల కారణాలు తెలుసుకొనేందుకు నాలుగు ప్రశ్నలు తయారు చేయండి.
జవాబు:
- విసర్జక వ్యవస్థలో అవరోధాలు ఎలా ఏర్పడతాయి?
- అవరోధాలు ఏర్పడటానికి దారితీసే పరిస్థితులు ఏమిటి?
- ఆహారపదార్థాలకు, అవరోధాలకు ఉన్న సంబంధం ఏమిటి?
- అవరోధాల వలన సంభవించే పరిస్థితులు ఏమిటి?
ప్రశ్న 2.
క్షేత్ర పర్యటనలో మీరు పరిశీలించిన అంశాల సహాయంతో ఈ క్రింది పట్టికను పూరించండి.
జవాబు:
మొక్క పేరు | మొక్క నుండి లభించే జీవక్రియోత్పన్నం | ఉపయోగం |
ఎ) వేప | నింబిన్ | యాంటీ సెప్టిక్ |
బి) ఉమ్మెత్త | స్కోపోలమైన్ | మత్తుమందు |
ప్రశ్న 3.
ప్రతి మానవునిలోని రెండు మూత్రపిండాలు ప్రధాన విసర్జక అవయవములు. హరిత 23 సంవత్సరాల వయస్సులో ఒక మూత్రపిండాన్ని ఆమె తండ్రికి దానం చేసింది. ప్రస్తుతం ఆమెకు ఒక మూత్రపిండం మాత్రమే ఉంది. పెళ్ళి చేసుకుని ఒక పాపకు జన్మనిచ్చింది.
ఎ) హరిత కూతురుకు ఎన్ని మూత్రపిండాలు ఉంటాయి?
జవాబు:
హరిత కూతురుకు రెండు మూత్రపిండాలు ఉంటాయి.
బి) మీ సమాధానమును సమర్థించండి.
జవాబు:
శారీరక మార్పులు అనువంశికంగా సంక్రమించవు. కావున హరిత కూతురుకు రెండు మూత్రపిండాలు ఉంటాయి.
ప్రశ్న 4.
మూత్రపిండాలు సక్రమంగా పనిచేయడానికి నీవు నీ ఆహారపు అలవాట్లలో ఎటువంటి మార్పులు చేయాలను కుంటున్నావు?
జవాబు:
- నీరు ఎక్కువగా త్రాగాలి.
- పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
- నియమానుసార వ్యాయామం.
- కూల్ డ్రింక్స్ బదులుగా కొబ్బరినీళ్ళు ఎక్కువగా త్రాగాలి.
- ద్రాక్ష, పుచ్చకాయ, కమలా వంటి నీరు అధికంగా ఉన్న పండ్లను తీసుకోవాలి.
- వేపుడు కూరలను తినకూడదు.
ప్రశ్న 5.
మూత్రపిండ సంబంధిత వ్యాధుల గురించి తెలుసుకోవడానికి నెఫ్రాలజిస్టు ఎటువంటి ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:
- మూత్రపిండాలలో రాళ్లు ఎలా ఏర్పడతాయా?
- డయాలసిస్ అనగానేమి?
- ధూమపానం, ఆల్కహాలు వలన మూత్రపిండాలపై ఎటువంటి ప్రభావం ఉంటుంది?
- ESRD అనగానేమి?
ప్రశ్న 6.
రబ్బరు మరియు తోళ్ళ పరిశ్రమలలో వాడే ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు ఏవి? ఏవి ఏ మొక్క నుండి లభిస్తాయి?
జవాబు:
- రబ్బరు, తోళ్ళ పరిశ్రమలో వాడే ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు లేటెక్స్ మరియు టానిన్స్
- లేటెక్స్ – హేవియా బ్రెజిలియన్సిస్ (రబ్బరు మొక్క) టానిన్ – తుమ్మ, తంగేడు
ప్రశ్న 7.
మూత్రపిండాలు పనిచేయక పోవటం గూర్చి నెఫ్రాలజిస్టును అడిగే నాలుగు ప్రశ్నలు రాయండి.
జవాబు:
- మూత్రపిండాలు ఎప్పుడు పనిచేయడం మానేస్తాయి?
- మూత్రపిండాలు పనిచేయకపోవటం వలన కలిగే లక్షణాలు ఏవి?
- ఏ రకమైన నివారణోపాయాలను తీసుకోవటం ద్వారా మూత్రపిండాల వ్యాధిని నివారించవచ్చు?
- ఒకవేళ మూత్రపిండం పనిచేయుట మానేస్తే ఎటువంటి ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి?
ప్రశ్న 8.
కింది పట్టికను పరిశీలించండి.
పట్టిక ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
i) పై పట్టికలో మానవుల మాదిరిగా విసర్జక వ్యవస్థ ఉన్న జీవులేవి?
జవాబు:
సరీసృపాలు / పక్షులు / క్షీరదాలు (లేదా) సరీసృపాలు / పక్షులు / క్షీరదాలకు సంబంధించిన ఉదాహరణలు.
ii) వానపాములో మరియు బొద్దింకలో ఉండే విసర్జకావయవాలేవి?
జవాబు:
ఎ) వానపాములో నెఫ్రీడియా (వృక్కము)
బి) బొద్దింకలో మాల్ఫీజియన్ నాళికలు / హరిత గ్రంథులు
ప్రశ్న 9.
మూత్రం ఏర్పడే విధానంలోని దశలు ఏవి?
జవాబు:
మూత్రం ఏర్పడే విధానంలో 4 దశలుంటాయి.
- గుచ్ఛగాలనం (Glomerular filtration),
- వరణాత్మక పునఃశోషణం (Tubular reabsorption),
- నాళికాస్రావం (Tubular secretion),
- అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం (Formation of hypertonic urine).
ప్రశ్న 10.
ప్రాథమిక మూత్రం అనగా నేమి? అది ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
గుచ్చగాలనం ద్వారా ఏర్పడిన మూత్రాన్ని ప్రాథమిక మూత్రం (Primary urine) అంటాం. ఇది రసాయనికంగా రక్తంతో సమానంగా ఉంటుంది. ప్రాథమిక మూత్రంలో రక్తకణాలు ఉండవు. ఇది సమీపస్థ సంవళిత నాళంలోనికి వెళుతుంది. ప్రాథమిక మూత్రంలో నుండి శరీరానికి ఉపయోగపడే పదార్థాలు బాహ్యకేశనాళికా వల (Peritubular network) లోనికి పునఃశోషణం అవుతాయి.
ప్రశ్న 11.
గుచ్ఛగాలనం గురించి రాయండి.
జవాబు:
గుచ్ఛగాలనం :
అభివాహి ధమనిక కలిగించే పీడనం వల్ల రక్తకేశనాళికాగుచ్ఛం గుండా’ రక్తం ప్రవహిస్తుంది. ఈ పీడనం ఫలితంగా రక్తం వడపోయబడుతుంది. వ్యర్థపదార్థ అణువులు, పోషక పదార్థ అణువులు, నీరు వడపోయబడి బొమన్ గుళికకు చేరుతాయి.
ప్రశ్న 12.
వరణాత్మక పునఃశోషణలో ఏ ఏ పదార్థాలు శోషించబడతాయి?
జవాబు:
వరణాత్మక పునఃశోషణం :
ప్రాథమిక మూత్రంలో ఉండే ఉపయుక్త పదార్థాలను పరికేశనాళికా వల తిరిగి శోషిస్తుంది. గ్లూకోజ్, ఆమైనో ఆమ్లాలు, విటమిన్ ‘సి’, పొటాషియం , కాల్షియం, సోడియంల క్లోరైలు, 75% నీరు పునః శోషించబడతాయి.
ప్రశ్న 13.
నాళికాస్రావంలో స్రవించబడే పదార్థాలు ఏమిటి?
జవాబు:
నాళికాస్రావం :
రక్తకేశనాళికల నుండి మూత్రనాళికలోనికి వ్యర్థపదార్థాలు స్రవించబడతాయి. రక్తంలో ఉండే యూరియా, యూరికామ్లం, క్రియాటినిన్, సోడియం, పొటాషియం, హైడ్రోజన్ అయాన్లు స్రవించబడతాయి. ఇవి మూత్రం యొక్క గాఢతను, pH ని నియంత్రిస్తాయి.
ప్రశ్న 14.
మూత్రం ఎలా గాఢత చెందుతుంది?
(లేదా)
మూత్రం ఏర్పడే విధానం తెలపండి.
జవాబు:
నెఫ్రాన్ వడగట్టిన మూత్రంలో 75% నీరు సమీపస్థ సంవళిత భాగంలోనే పునఃశోషణ చెందుతుంది. హెస్లీ శిక్యం ప్రాంతంలో ఉన్న మూత్రం నుండి 10% నీరు ద్రవాభిసరణం ద్వారా దానిని ఆవరించియున్న కణజాలంలోనికి శోషించబడుతుంది. తరువాత సంగ్రహణ నాళంలో వాసోప్రెస్సిన్ (ADH) అనే హార్మోన్ సమక్షంలో నీటి పునఃశోషణ జరిగి మూత్రం అతిగాఢతను పొందుతుంది. గాఢతలో గరిష్టస్థాయికి చేరిన ఈ ద్రవాన్ని మూత్రం (Urine) అంటారు. ఇది రక్తం కన్నా అధిక గాఢతతో ఉంటుంది.
ప్రశ్న 15.
అతిమూత్ర వ్యాధి అనగానేమి ? దాని లక్షణాలు ఏమిటి?
జవాబు:
వాసోప్రెస్సిన్ హార్మోన్ స్రావం తగ్గిపోతే అల్పగాఢతగల మూత్రాన్నే విసర్జించవలసి ఉంటుంది. శరీర ద్రవాల ద్రవాభిసరణ క్రమతను హార్మోన్ చర్య క్రమబద్దీకరిస్తుంది. వాసోప్రెస్సిన్ లోపం వలన అధిక మూత్ర విసర్జన మరియు తక్కువ గాఢత గల మూత్రవిసర్జన చేయవలసి ఉంటుంది. దీనినే ‘డయాబెటిస్ ఇన్సిపిడస్’ లేదా ‘అతిమూత్ర వ్యాధి’ అంటారు.
ప్రశ్న 16.
మూత్రనాళికలు గురించి వ్రాయండి.
జవాబు:
మూత్రనాళికలు ప్రతి మూత్రపిండం యొక్క నొక్కు లేదా హైలస్ నుండి ఒక జత తెల్లని, కండరయుతమైన సన్నని మూత్రనాళాలు బయటికి వస్తాయి. ఇవి దాదాపు 30 సెం.మీ. పొడవు ఉంటాయి. పరభాగానికి ప్రయాణించి మూత్రాశయంలోనికి తెరచుకుంటాయి. మూత్రం, మూత్రపిండాల నుండి మూత్రాశయంలోనికి మూత్రనాళాల ద్వారానే పెరిస్టాలిసిస్ కదలికలతో ప్రయాణిస్తుంది.
ప్రశ్న 17.
మూత్రాశయం గురించి రాయండి.
జవాబు:
మూత్రాశయం పలుచని గోడలు కలిగి, బేరిపండు ఆకారంలో ఉండే సంచి వంటి నిర్మాణం. ఇది ద్రోణి (కటివలయ) భాగంలో పురీషనాళానికి ఉదరతలాన ఉంటుంది. మూత్రనాళాల ద్వారా చేరిన దాదాపు 300-800 మి.లీ.ల మూత్రాన్ని ఇది తాత్కాలికంగా నిల్వ చేస్తుంది.
ప్రశ్న 18.
ప్రసేకం గురించి రాయండి.
జవాబు:
ప్రసేకం, మూత్రాశయం నుండి మూత్రాన్ని బయటికి విసర్జించే నాళం. మూత్రాశయం చివర ప్రసేకంలో తెరచుకునే – చోట సంవరణీ (Sphincter) కండరం ఉండి కదలికల నియంత్రణకు తోడ్పడుతుంది. ప్రసేకం స్త్రీలలో 4 సెం.మీ.ల పొడవు ఉంటుంది. దానిని ఆళిందం (Vestibule) అంటారు. అయితే పురుషులలో 20 సెం.మీ. పొడవుండి మూత్ర జననేంద్రియనాళంగా ప్రసేకం (Uretra) పిలవబడుతుంది.
ప్రశ్న 19.
మూత్ర విసర్జన ప్రక్రియను వర్ణించండి.
జవాబు:
మూత్రాశయంలో గరిష్టంగా 700-800 మి.లీ. మూత్రం నిల్వ ఉంటుంది. అయితే దాదాపు 300-400 మి.లీ. మూత్రం చేరినప్పుడు మూత్రాశయం ఉబ్బి, దాని గోడలలోని స్ట్రెచ్ గ్రాహకాలు ఉత్తేజితమై మెదడుకు ప్రచోదనాలను పంపుతాయి. ఫలితంగా మూత్రం విసర్జించాలనే కోరిక కలుగుతుంది. మూత్రాశయం సంకోచించడం మూలంగా మూత్రం బయటకు పోతుంది. ఈ ప్రక్రియనే మూత్ర విసర్జన (Micturition) అంటారు.
మానవుడు రోజుకు దాదాపు 1.6-1.8 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు. అయితే అధికంగా నీరు, పండ్లరసాలు, ద్రవాలు ఎక్కువ తీసుకొనేవారు ఎక్కువగానూ, తక్కువ తీసుకునే వారు తక్కువగానూ మూత్రాన్ని విసర్జించటం సాధారణంగా జరుగుతుంది.
ప్రశ్న 20.
మూత్ర విసర్జనను ఎలా నియంత్రించగలం?
జవాబు:
మూత్రాశయంలో మూత్రం తాత్కాలికంగా నిల్వ ఉంటుంది. మూత్రం బయటకు వచ్చే మార్గాన్ని ఆవరించి రెండు జతల వర్తుల సంవరిణీ కండరాలు ఉంటాయి. మూత్రాశయం నిండేంత వరకు ఈ రెండు కండరాలు సంకోచస్థితిలో ఉంటాయి. దీనివలన రంధ్రం మూసుకొని ఉంటుంది. మూత్రం చేరేకొద్ది అది కలుగజేసే ఒత్తిడి వలన మూత్రాశయం గోడల మీద పీడనం అధికమవుతుంది. దీనివలన అసంకల్పితంగా పై వర్తుల సంవరిణీ కండరం సడలుతుంది. కానీ కింది సంవరిణీ కండరం మన అధీనంలో ఉండి మూత్రవిసర్జనను నియంత్రించగలం. కానీ చిన్నపిల్లలలో ఈ విధమైన నియంత్రణ సాధ్యం కాదు. కాలక్రమేణా వారు మూత్రవిసర్జనను నియంత్రించగలుగుతారు.
ప్రశ్న 21.
మూత్ర సంఘటనమును తెలపండి.
జవాబు:
మూత్రంలో 96% నీరు, 25% కర్బన పదార్థాలు (యూరియా, యూరికామ్లం, క్రియాటినిన్, నీటిలో కరిగే విటమిన్లు, హార్మోన్లు మరియు ఆక్సలేట్లు మొదలైనవి) మరియు 1.5% అకర్బన పదార్థాలు (సోడియం, క్లోరైడ్, ఫాస్పేట్, సల్ఫేట్, మెగ్నీషియం, కాల్షియం, అయోడిన్ మొదలైనవి) ఉంటాయి. మూత్రం మొదట ఆమ్లయుతంగా (pH = 6.0) గా ఉన్నా క్రమంగా క్షారయుతంగా మారుతుంది. ఎందుకంటే యూరియా విచ్ఛిన్నం జరిగి అమ్మోనియా ఏర్పడుతుంది.
ప్రశ్న 22.
మూత్రపిండ మార్పిడి అనగానేమి? దీనిలో ఉన్న సమస్య ఏమిటి?
జవాబు:
మూత్రపిండాలు పనిచేయని వారికి దీర్ఘకాలిక పరిష్కారం చూపే ప్రక్రియనే మూత్రపిండ మార్పిడి అంటారు. మూత్రపిండాలు పనిచేయని వారికి వారి దగ్గర బంధువు (దాత) నుండి బాగా పనిచేస్తున్న మూత్రపిండాన్ని వేరుచేసి అమర్చుతారు. రోగికి అమర్చిన మూత్రపిండం సరిగ్గా సరిపోయేలా అసంక్రామ్యత వ్యవస్థ ఆ మూత్రపిండాన్ని తిరస్కరించకుండా ఉండాలంటే అతి సమీప బంధువు మూత్రపిండాన్ని దానం చేయాల్సి ఉంటుంది. అయితే ఆధునిక వైద్య విద్య వైజ్ఞానిక కృషి ఇలాంటి ప్రక్రియల సమర్థతను పెంచాయి.
ప్రశ్న 23.
అవయవదానం అనగానేమి? మన శరీరంలోని ఏ ఏ అవయవాలు దానం చేయవచ్చు?
జవాబు:
వైద్య పరంగా మరణించారని నిర్ధారించిన వ్యక్తి నుండి అవయవాలను సేకరించి అవసరమైన వారికి అమరుస్తారు. దీనిని “అవయవదానం” అంటారు. దాత శరీరం నుండి రెండు మూత్రపిండాలు, గుండె, వాలు, కాలేయం, ఊపిరితిత్తులు, ప్లీహం, క్లోమం, చర్మం, ఎముకలు, జీర్ణాశయం కళ్లు (కార్నియా) లాంటి అవయవాలు గ్రహిస్తారు.
ప్రశ్న 24.
చర్మాన్ని విసర్జక అవయవంగా ఎందుకు పరిగణిస్తారు?
జవాబు:
చర్మం అసంఖ్యాకమైన స్వేదగ్రంథులను కలిగి ఉంటుంది. వాటి చుట్టూ అనేక రక్తకేశ నాళికలుంటాయి. స్వేదగ్రంథులు రక్తం నుండి నీరు మరియు జీవక్రియా ఉత్పన్నాల వ్యర్థాలను సంగ్రహిస్తాయి. అలా శరీరంలో అధికంగా ఉన్న నీటిని మరియు అతి తక్కువ మోతాదులో లవణాలను చెమట రూపంలో బయటకు పంపుతూ చర్మం ఒక అదనపు విసర్జకాంగంగా పరిగణించబడుతోంది. చర్మంలోని సెబేషియస్ గ్రంథులు సెబం అనే పదార్థాన్ని స్రవిస్తాయి. దీనిలో సెబం, మైనం, స్టిరాల్స్, కర్బన పదార్థాలు మరియు ఫాటీ ఆమ్లాలు ఉంటాయి.
ప్రశ్న 25.
విసర్జక క్రియలో కాలేయం పాత్ర ఏమిటి?
జవాబు:
కాలేయం రక్తంలోని చనిపోయిన ఎర్రరక్తకణాలలోని హిమోగ్లోబినను విచ్ఛిన్నం చేసేటపుడు బైలురూబిన్, బైలువర్దిన్, యూరోక్రోమ్’ మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. పిత్తాశయంలో పైత్యరస వ్యర్థాలు నిలవవుండి తర్వాత పైత్యరసంతోపాటు కొలెస్ట్రాల్ మరియు స్టిరాయిడ్ హార్మోన్లు, మందులు, విటమిన్లు, క్షారలవణాలు మొదలైన వాటితో పాటు మూత్రం ద్వారా బయటకు విసర్జింపబడతాయి. యూరియా తయారీలోను కాలేయం ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
ప్రశ్న 26.
పెద్ద ప్రేగులో తొలగించబడే లవణాలు ఏమిటి?
జవాబు:
పెద్దప్రేగు (Large intestine) :
అధికంగానున్న కాల్షియం, మెగ్నీషియం మరియు ఐరన్ యొక్క లవణాలు పెద్ద ప్రేగు యొక్క ఉపకళాకణజాలం (Epithelial) చేత వేరుచేయబడి మలంతోబాటు బయటికి విసర్జింపబడతాయి.
ప్రశ్న 27.
అమీబా, పారమీషియం వంటి ఏకకణ జీవులలో విసర్జన విధానం తెలపండి.
జవాబు:
మంచి నీటిలో నివసించే అమీబా, పారమీషియం మొదలైనవి సంకోచరిక్తికల ద్వారా ద్రవాభిసరణ క్రమత చూపుతాయి. సంకోచరిక్తికలు కణంలోని అధికంగా ఉన్న నీటిని మరియు వ్యర్థ పదార్థాలను సేకరిస్తాయి. సంకోచరిక్తికలు (Contraltile vacuole) కణద్రవ్యంలో కొద్దికొద్దిగా జరుగుతూ కణ పరిధిని చేరి పగిలిపోవుట ద్వారా సేకరించిన వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. ప్రధానమైన విసర్జన కణద్రవాభిసరణ (Osmosis) ద్వారా జరుగుతుంది.
ప్రశ్న 28.
మొక్కలు వ్యర్థాలను విషపూరితాలుగా మార్చి ఎందుకు నిల్వ చేసుకొంటాయి?
జవాబు:
కొన్ని మొక్కలు వ్యర్థ పదార్థాలను వేర్లు, ఆకులు, విత్తనాలలో విషపూరిత పదార్థాలుగా మార్చుకొని శాకాహార జంతువుల నుండి రక్షించుకోవడానికి ఉపయోగించుకుంటాయి. వీటిలో ఉండే రసాయనాల వలన మొక్కల భాగాలు తినడానికి వీలుకాని రుచితో ఉంటాయి. అందువల్ల ఆ మొక్కలను జంతువులు తినలేవు. కొన్ని రసాయనాలు ఎక్కువగా విషపూరితంగా ఉండి వీటిని తిన్న జంతువులు చనిపోతాయి.
ప్రశ్న 29.
మొక్క తమ వ్యర్థాలను ఎలా ఉపయోగించుకొంటుంది?
జవాబు:
- కొన్ని రకాల మొక్కలలో మొక్క భాగాలకు గాయమైనపుడు కొన్ని రసాయనాలను స్రవిస్తాయి. అలా స్రవించిన రసాయనాలు గాయాన్ని మాన్పుటలో మొక్కకు సహాయపడతాయి.
- కొన్ని మొక్కలు ఆకర్షణీయమైన పదార్థాలను వెదజల్లి తమకు ఉపయుక్తంగా మార్చుకొంటాయి. పరాగసంపర్కానికి, విత్తన వ్యాప్తికి, పోషణకు కూడా ఉపయోగపడేలా చేసుకోగలుగుతాయి.
- వేరు బుడిపెలను కలిగి ఉన్న మొక్కలు కొన్ని రసాయనిక స్రావాలచేత రైజోబియం బాక్టీరియాలను ఆకర్షించి, ఆశ్రయం కల్పించి సహజీవనం చేస్తుంటాయి.
ప్రశ్న 30.
టానిన్లు, రెసిన్లు గురించి వర్ణించండి.
జవాబు:
టానిన్లు :
టానిన్లు కర్బన సంయోగపదార్థాలు. ఇవి మొక్కల వివిధ భాగాలలో నిల్వ చేయబడి ఉంటాయి. ముదురు గోధుమవర్ణం కలిగి ఉంటాయి. టానిన్లు టానింగ్ లేదా తోళ్ళను పదునుచేయడానికి మరియు మందులలోను ఉపయోగిస్తారు.
ఉదా : తుమ్మ, తంగేడు.
రెసిన్లు :
రెసిన్ నాళాలను కలిగి ఉండటం అత్యధిక వివృత బీల ప్రత్యేకత. రెసిన్లను వార్నిష్ లో ఉపయోగిస్తారు.
ఉదా : పైనస్.
ప్రశ్న 31.
జిగురులు గురించి తెలపండి.
జవాబు:
జిగురులు :
వేప, తుమ్మ మొదలైన చెట్లు శాఖలు, కాండంపై గాయాలైనపుడు అవి జిగురు వంటి పదార్థాన్ని స్రవిస్తాయి. జిగురు నీటిని పీల్చుకొని ఉబ్బుతుంది. ఇది మొక్క గాయాన్ని మాన్పుటకు దోహదం చేస్తుంది. ఆర్థికంగా చూస్తే జిగురులు చాలా విలువైనవి. వాటిని అతికించుటకు మరియు బైండింగ్ కారకంగా మందుల తయారీలోను, ఆహార పదార్థాలలోను ఉపయోగిస్తుంటారు.
ప్రశ్న 32.
లేటెక్స్ గురించి రాయండి.
జవాబు:
లేటెక్స్ :
లేటెక్స్ జిగురుగా తెల్లగా పాలవలే ఉండే ద్రవపదార్థం, ఇది మొక్కలోకి లేటెక్స్ కణాల్లో లేదా లేటెక్స్ నాళాల్లో నిల్వ ఉంటుంది. హీవియా బ్రెజీలియన్సిస్ (రబ్బరు మొక్క) మొక్క లేటెక్స్ నుండి రబ్బరు తయారుచేస్తారు. జట్రోపా మొక్క నుండి బయోడీజిలను తయారుచేస్తారు.
ప్రశ్న 33.
చూయింగ్ గమ్ ను ఎలా తయారు చేస్తారు?
జవాబు:
చూయింగ్ గమ్ అనేది నమలడం కోసం తయారుచేసే ఒక రకమైన జిగురు పదార్థం. 5000 సంవత్సరాలకు పూర్వమే దీనిని తయారుచేసేవారని చారిత్రక ఆధారాలున్నాయి. ప్రస్తుతం చూయింగ్ గమ్ ను చికిల్ మొక్క యొక్క సహజసిద్ధమైన లేటెక్స్ నుండి తయారుచేస్తున్నారు.
ప్రశ్న 34.
రెండు మూత్రపిండాలు పూర్తిగా పనిచేయకపోతే, ఏమి జరుగుతుంది?
జవాబు:
మూత్రపిండాలు పనిచేయకపోవడాన్ని (End Stage Renal Disease – ESRD) అంటారు. మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోయే శరీరంలో నీరు, వ్యర్థ పదార్థాలు నిండిపోతాయి. ఈ దశను ‘యూరేమియ’ అంటారు. కాళ్లు, చేతులు ఉబ్బిపోత రక్తం శుద్ధికాకపోవడం వలన నీరసం, అలసట వస్తాయి.
ప్రశ్న 35.
మూత్రపిండాలు పనిచేయనప్పుడు, పరిష్కారం ఏమిటి?
జవాబు:
మూత్రపిండాలు పనిచేయని వారికి కృత్రిమ మూత్రపిండాల ద్వారా రక్తాన్ని శుభ్రం చేస్తారు. ఈ ప్రక్రియను ‘హీమోడయాలసిస్’ అంటారు. ఈ ప్రక్రియలో రక్తాన్ని డయలైజర్ లోనికి పంపి మలినాన్ని తొలగిస్తారు.
ప్రశ్న 36.
మనకు ఉపయోగపడే ఆల్కలాయిడ్లను తెలపండి.
జవాబు:
క్వినైన్ – మలేరియా నివారణకు
నికోటిన్ – క్రిమి సంహారిణిగా
రిసర్ఫిన్ – పాముకాటుకు
నింబిన్ – యాంటీ సెప్టిక్ గా ఉపయోగిస్తారు.
10th Class Biology 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
మానవుని రక్తము నుండి జీవ వ్యర్థములను తొలగించడానికి మూత్రపిండము ఎలా అనుకూలంగా ఉన్నది?
(లేదా)
మూత్రం ఏర్పడడంలోని వివిధ దశలేవి? ఆయా దశలలో ఏం జరుగుతుందో వివరించండి.
జవాబు:
మూత్రపిండాల నిర్మాణం :
- మానవునిలో విసర్జన వ్యవస్థలో ఉండే భాగాలు ఎ) ఒక జత మూత్రపిండాలు, బి) ఒక జత మూత్రనాళాలు సి) మూత్రాశయం మరియు డి) ప్రసేకం.
- మూత్రపిండాల లోపలి తలం మధ్యలో గల పల్లాన్ని హైలస్ అంటారు. ఈ హైలస్ ద్వారా వృక్పధమని మూత్రపిండం లోనికి ప్రవేశిస్తుంది. వృక్కసిర మూత్రనాళం వెలుపలికి వస్తుంది.
- శరీరంలోని వివిధ అవయవాలలో ఉత్పత్తి అయిన వ్యర్థాలు ఆమ్లజని సహిత రక్తంతో కూడి వృక్పధమని ద్వారా మూత్రపిండాన్ని చేరుతాయి. ఆమ్లజని రహిత రక్తాన్ని వృక్కసిర మూత్రపిండం నుండి బయటికి పంపుతుంది.
- మూత్రపిండంలో రక్తం వడకట్టబడుతుంది. ఫలితంగా వేరుచేయబడిన వ్యర్థాలు మూత్రంగా బయటికి విసర్జించబడతాయి. దీనిలో నెఫ్రాన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది.
మూత్రం ఏర్పడే విధానం :
మూత్రం ఏర్పడే విధానంలో 4 దశలుంటాయి.
- గుచ్చగాలనం
- వరణాత్మక పునఃశోషణం
- నాభికాస్రావం
- అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం.
1) గుచ్చగాలనం :
వృక్క ధమని శాఖ అయిన అభివాహి ధమని నుండి రక్తం, రక్తకేశ నాళికా గుచ్చం లోనికి ప్రవేశిస్తుంది. ఈ ధమని కలిగించే పీడనం వల్ల రక్తం వడపోయబడుతుంది. వ్యర్థ పదార్థాల అణువులు, పోషక పదార్థాల అణువులు, నీరు వడపోయబడి బొమన్స్ గుళికకు చేరతాయి.
2) వరణాత్మక పునఃశోషణం :
వరణాత్మక పునః శోషణం ప్రాథమిక మూత్రంలో ఉండే ఉపయుక్త పదార్థాలను బాహ్య రక్తకేశనాళికా వల తిరిగి శోషిస్తుంది. గ్లూకోజు, అమైనో ఆమ్లాలు, విటమిన్ ‘సి’, పొటాషియం , కాల్షియం, సోడియం
3) నాళికాస్రావం :
సమీపస్థ సంవళితనాళంలో పునఃశోషణం తరువాత మూత్రం హెగ్లీశక్యం ద్వారా దూరస్థ సంవళితనాళంలోనికి చేరుతుంది. ఇక్కడ అధికంగా ఉన్న పొటాషియం, సోడియం,. హైడ్రోజన్ అయానులు బాహ్యరక్తకేశనాళికా వల నుండి దూరస్థ సంవళిత నాళంలోకి స్రవించబడతాయి. దీనివల్ల మూత్రం యొక్క pH సమతుల్యమవుతుంది.
4) అతిగాఢత గల మూత్రం ఏర్పడటం :
నెఫ్రాన్ వడగట్టిన మూత్రంలో 75% నీరు సమీపస్థ సంవళిత భాగంలోనే పునఃశోషణమవుతుంది. హెన్లీశిక్యం ప్రాంతంలో ఉన్న మూత్రం నుండి 10% నీరు ద్రవాభిసరణం ద్వారా దానిని ఆవరించి ఉన్న కణజాలంలోనికి శోషించబడుతుంది. తరువాత సంగ్రహణ నాళంలో వాసోప్రెసిన్ అనే హార్మోన్ సమక్షంలో నీటి పునఃశోషణ జరిగి మూత్రం అతి గాఢతను పొందుతుంది.
మూత్రంలో 96% నీరు, 2.5% కర్బన పదార్థాలు (యూరియా, యూరికామ్లం, క్రియాటిన్, క్రియాటినైన్, నీటిలో కరిగే విటమిన్లు, హార్మోన్లు మరియు ఆక్సలేట్లు మొదలైనవి) మరియు 1.5% అకర్బన పదార్థాలు (సోడియం, క్లోరైడ్, ఫాస్ఫేట్, సల్ఫేట్, మెగ్నీషియం , కాల్షియం, అయోడిన్ మొదలైనవి) ఉంటాయి.
ప్రశ్న 2.
కింది పట్టికను విశ్లేషించి ప్రశ్నలకు సమాధానం రాయండి.
A) బైలురూబిన్ తెలుసుకోవాలంటే ఏ పరీక్ష అవసరం?
జవాబు:
బైలురూబిన్ పరీక్ష
B) చక్కర వ్యాధిని ఎలా నిర్ధారించవచ్చు?
జవాబు:
అన్నం తినకముందు, తిన్న తరువాత నిర్వహించిన చక్కెర పరీక్ష ద్వారా చక్కెర వ్యాధిని నిర్ధారించవచ్చు.
C) పై నివేదిక పరిశీలించిన తర్వాత ఆ వ్యాధిగ్రస్థ వ్యక్తి ఏ ఇతర సమస్యలు ఎదుర్కొనుండవచ్చును?
జవాబు:
రోగి అధిక రక్తపీడనం కల్గి ఉన్నాడు. రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉంది. ఇది చక్కెర వ్యాధిని సూచిస్తుంది.
D) ఆ సమస్యలు ఏయే భాగాలపై ప్రభావం చూపుతాయి?
జవాబు:
ఈ సమస్యలు రోగి హృదయం మరియు క్లోమంపై ప్రభావం చూపుతాయి.
ప్రశ్న 3.
కింది సమాచారాన్ని విశ్లేషించండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఆల్కలాయిడ్ | మొక్కలోని భాగం | ఉపయోగం |
క్వినైన్ | బెరడు | మలేరియా నివారణ |
నికోటిన్ | ఆకులు | క్రిమి సంహారిణి |
మార్ఫిన్ | ఫలం | మత్తుమందు, నొప్పి నివారిణి |
కెఫెన్ | విత్తనాలు | నాడీవ్యవస్థ ఉత్తేజ కారకం |
పైరిత్రాయిడ్స్ | పుష్పాలు | కీటక నాశనులు |
స్కోపోలమైన్ | పండ్లు, పూలు | మత్తుమందు |
i) మొక్కల యొక్క ఏ భాగాలు ఆల్కలాయిడ్లుగా ఉపయోగపడతాయి?
జవాబు:
బెరడు, ఆకులు, ఫలం, విత్తనాలు, పుష్పాలు.
ii) మొక్కలకు వచ్చే వ్యాధుల నివారణకు ఉపయోగించే ఆల్కలాయిడ్ లేవి?
జవాబు:
నికోటిన్, పైరిత్రాయిడ్స్
iii) మత్తుమందుగా ఉపయోగించే ఆల్కలాయిడ్లు మొక్క ఏ భాగాల నుండి తయారవుతాయి?
జవాబు:
పండ్లు, పూలు
iv) మలేరియా జ్వరం వస్తే ఏ ఆల్కలాయిడ్ వాడతారు?
జవాబు:
క్వి నైన్
ప్రశ్న 4.
మానవ విసర్జక వ్యవస్థ పటం గీచి భాగాలు గుర్తించండి.
(లేదా)
కింది భాగాలతో కూడిన పటం ఏ వ్యవస్థకు చెందినది? దాని పటం గీచి, భాగాలను గుర్తించండి.
a) మూత్రపిండాలు b) మూత్రనాళాలు c) మూత్రాశయము
జవాబు:
ప్రశ్న 5.
సలోని సమాచారమును విశ్లేషించి, ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
ఆల్కలాయిడ్ | మొక్కలోని భాగం | ఉపయోగాలు |
క్వినైన్ | బెరడు | మలేరియా నివారణ |
పైరిత్రాయిడ్స్ | ఆకులు | క్రిమి సంహారిణి |
రిసర్సెన్ | వేరు | పాముకాటు నుండి రక్షణ |
కెఫీన్ | విత్తనాలు | నాడీ వ్యవస్థ ఉత్తేజకారకం |
నింబిన్ | విత్తనాలు, బెరడు, ఆకులు | యాంటీ సెప్టిక్ |
i) మలేరియా చికిత్సకు ఉపయోగపడే ఆల్కలాయిడ్ ఏది?
జవాబు:
క్వినైన్
iii) క్రిమి సంహారిణిగా ఏ ఆల్కలాయిడ్ ఉపయోగపడుతుంది?
జవాబు:
పైరిత్రాయిడ్స్
iii) కెఫీన్ వల్ల మానవ శరీరంలోని ఏ వ్యవస్థ ఉత్తేజం చెందుతుంది?
జవాబు:
నాడీ వ్యవస్థ
iv) పాముకాటు నుండి రక్షణనిచ్చే ఆల్కలాయిడ్ ఏ మొక్క భాగము నుండి లభిస్తుంది?
జవాబు:
రావుల్ఫియా సర్పెస్ టైనా లేక సర్పగంథి మొక్క వేరు.
ప్రశ్న 6.
విసర్జక వ్యవస్థలో నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణమని దేనిని పేర్కొంటారు? దాని బొమ్మ గీసి, భాగాలు గుర్తించండి. అభివాహ ధమనిక వ్యాసం, అపవాహి ధమనిక వ్యాసం కంటే ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటి?
(లేదా)
వృక్కనాళీక నిర్మాణాన్ని పటం సహాయంతో వివరించండి.
(లేదా)
ఈ క్రింది భాగాలను గుర్తించటానికి నీవు ఏ పటంను గీస్తావు ? ఆ పటంను గీసి క్రింది భాగాలను గుర్తించండి.
1) భౌమన్ గుళిక 2) వృక్క నాళిక 3) సంగ్రహణ నాళం
(లేదా)
హె శిక్యము, బొమన్ గుళిక గల విసర్జక అవయవము యొక్క పటం గీచి, భాగాలను గుర్తించండి.
జవాబు:
విసర్జక వ్యవస్థలో నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణమని నెఫ్రాన ను పేర్కొంటారు.
రక్తకేశనాళికాగుచ్ఛంలో పీడనం పెరిగి, దానిలోని పదార్థాలు వడపోతకు గురికావడానికి అభివాహి ధమనిక వ్యాసం, అపవాహి ధమనిక వ్యాసం కంటే ఎక్కువగా ఉంటుంది.
1. వృక్క నాళిక (నెఫ్రాన్)లో 2 భాగాలుంటాయి.
1 మాల్ఫీజియన్ దేహం,
2. వృక్క నాళిక
2. మాల్వీజియన్ దేహం :
నెఫ్రాలో ఒక చివర వెడల్పైన కప్పు ఆకారంలో ఉండే నిర్మాణాన్ని బొమన్ గుళిక అంటారు. అందులోని రక్తకేశ నాళికా గుచ్ఛం మరియు బౌమన్ గుళికను కలిపి మాల్ఫీజియన్ దేహం అంటారు.
3. రక్తకేశ నాళికాగుచ్చం అభివాహిధమనిక నుండి ఏర్పడుతుంది. దాని నుండి అపవాహిధమనిక ఏర్పడుతుంది.
4. వృక్క నాళిక : దీనిలో మూడు భాగాలుంటాయి.
1) సమీపస్థ సంవళిత నాళం (PCT), 2) హెన్లీశిక్యం, 3) దూరస్థసంవళిత నాళం (DCT)
ప్రశ్న 7.
మానవునిలో కల అనుబంధ విసర్జకావయవాలేవి? అవి ఉత్పత్తి చేయు విసర్జక పదార్థాలు ఏమిటి?
జవాబు:
అనుబంధ విసర్జక అవయవాలు – విసర్జక పదార్థాలు
1. ఊపిరితిత్తులు ……. CO2 మరియు నీరు.
2. చర్మం ……… – స్వేదం మరియు జీవక్రియ ఉత్పన్నాల వ్యర్థ పదార్థాలు (సెబం).
3. కాలేయం …… బైలురూబిన్, బైలువర్డిన్, యూరోక్రోం.
4. పెద్ద ప్రేగు ……. అధికంగా ఉన్న కాల్షియం, మెగ్నీషియం .మరియు ఐరన్ యొక్క లవణాలు మలపదార్ధంతో పాటు విసర్జించబడును.
ప్రశ్న 8.
మూత్రపిండాలు పనిచేయని వ్యక్తి (ESRD) పాటించవలసిన తాత్కాలిక మరియు శాశ్వత పరిష్కార పద్ధతులను వివరించండి.
జవాబు:
వివరణ :
ESRD వ్యక్తికి తాత్కాలిక పరిష్కార పద్ధతి – డయాలసిస్ (లేదా) కృత్రిమ మూత్రపిండము మరియు శాశ్వత పరిష్కార పద్ధతి మూత్రపిండ మార్పిడి.
డయాలసిస్ :
- ఈ ప్రక్రియలో రక్తాన్ని ఒక ముఖ్యమైన ధమని ద్వారా బయటకు తెచ్చి రక్తస్కంధనాన్ని నిరోధించే కారకాలను కలిపి డయలైజర్ యంత్రంలోకి పంపిస్తారు.
- డయలైజర్ యంత్రంలో రక్తం గొట్టాల వంటి సెల్లో ఫేన్ తో తయారైన నాళికల ద్వారా ప్రవహించును. ఈ నాళికలు డయలైజింగ్ ద్రావణంలో మునిగి వుంటాయి.
- డయలైజింగ్ ద్రావణంలో నత్రజని వ్యర్థాలు వుండవు కనుక డయలైజర్ లో రక్తం ప్రవహించేటప్పుడు నత్రజని వ్యర్థాలు వేరై రక్తం శుద్ధి చేయబడుతుంది.
మూత్రపిండ మార్పిడి :
- మూత్రపిండాలు పనిచేయని వారికి వారి దగ్గర బంధువు (దాత) నుండి బాగా పనిచేస్తున్న మూత్రపిండాన్ని వేరుచేసి అమర్చుతారు.
- రోగికి అమర్చిన మూత్రపిండము సరిగ్గా సరిపోయేలా అసంక్రామ్యత వ్యవస్థ ఆ మూత్రపిండాన్ని తిరస్కరించకుండా వుండాలంటే అతి సమీప బంధువు మూత్రపిండాన్ని దానం చేయాల్సి వుంటుంది.
- ఈ మధ్య కాలంలో దాతల నుండి మూత్రపిండాలు మరియు ఇతర అవయవాలు సేకరించి మూత్రపిండాలు పాడైపోయిన వారికి అమరుస్తున్నారు.
ప్రశ్న 9.
మూత్రపిండం అంతర్నిర్మాణాన్ని పరిశీలించిన ప్రయోగ విధానాన్ని, పరిశీలనలను రాయండి.
జవాబు:
ఉద్దేశ్యం : మూత్రపిండము అంతర లక్షణాలను అధ్యయనం చేయుట.
పరికరాలు :
1. మేక / గొర్రె మూత్రపిండము, 2. పదునైన బ్లేడు / స్కాల్ పల్, 3. ట్రే, 4. నీరు, 5. గ్లోస్
ప్రయోగ విధానము :
1. మూత్రపిండమును రక్తమంతా పోయేలా నీటిలో కడగాలి.
2. ఒక పదునైన బ్లేడు లేదా స్కాల్ పల్ సహాయంతో మూత్రపిండాన్ని నిలువుగా, జాగ్రత్తగా కోసి అంతర్గత నిర్మాణాన్ని పరిశీలించాలి.
పరిశీలన :
- మూత్ర పిండము బయటవైపు ముదురు ఎరుపు రంగులోనూ, లోపలి వైపు లేత గులాబి రంగులోనూ కనబడుతుంది.
- పుటాకారంగా ఉన్న లోపలి తలంలో మధ్యలో ఉన్న పల్లాన్ని హైలస్ అంటారు. ఈ హైలస్ ద్వారా వృక్కమని మూత్ర పిండములోనికి, వృక్కసిర మూత్రనాళంలోకి వస్తాయి.
- ముదురు గోధుమ వర్ణంలో ఉన్న వెలుపలి భాగమును వల్కలము అని, లేత ‘వర్ణములో ఉన్న లోపలి భాగమును దవ్వ అని అంటారు.
- ప్రతి మూత్రపిండములోనూ సూక్ష్మ వృక్క నాళాలు / నెఫ్రాన్లు ఉంటాయి.
ప్రశ్న 10.
మానవ విసర్జన వ్యవస్థను వర్ణించండి.
జవాబు:
మానవ విసర్జన వ్యవస్థలో ప్రధానంగా 1) ఒక జత మూత్రపిండాలు 2) ఒక జత మూత్రనాళాలు 3) ఒక మూత్రాశయం 4) ప్రసేకం అనే భాగాలు ఉంటాయి.
1. మూత్రపిండాలు :
- ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ముదురు ఎరుపు రంగులో, పృష్ఠకుడ్యానికి అంటుకొని ఒక జత ఉంటాయి.
- దీని వెలుపలి భాగం కుంభాకారంగాను, లోపలి భాగం పుటాకారంగాను ఉంటుంది.
- పుటాకార భాగంలో ఉండే నొక్కును నాభి అంటారు. దీని ద్వారా వృక్కమని లోపలికి ప్రవేశించగా, వృక్క సిర, మూత్రనాళం బయటకు వస్తాయి.
- ప్రతి మూత్రపిండం దాదాపు ఒక మిలియన్ నెఫ్రాన్లచే నిర్మించబడి ఉంటుంది.
2. మూత్రనాళాలు :
ఒక జత మూత్రనాళాలు మూత్రపిండం నుండి బయలుదేరి మూత్రాశయంలోనికి తెరచుకుంటాయి. ఇవి దాదాపు 30 సెం.మీ పొడవు ఉంటాయి.
3. మూత్రాశయం :
ఇది బేరిపండు ఆకారంలో ఉండే సంచి వంటి నిర్మాణం. 300-800 మి.లీ. మూత్రాన్ని తాత్కాలికంగా నిల్వచేస్తుంది.
4. ప్రసేకం :
మూత్రాశయం నుండి మూత్రాన్ని విసర్జించే నాళం. ఇది సంవరణి కండరాన్ని కలిగి ఉండి స్త్రీ, పురుషులలో వేరువేరు పొడవులతో ఉంటుంది.
ప్రశ్న 11.
మానవ మూత్రపిండం అంతర్నిర్మాణాన్ని వర్ణించండి.
జవాబు:
మూత్రపిండం-అంతర్నిర్మాణం :
మూత్ర పిండం అంతర్నిర్మాణాన్ని తెలుసుకోవడానికి మూత్రపిండ నిలువు కోతను పరిశీలిద్దాం. మూత్రపిండం లోపల రెండు భాగాలుగా కనిపిస్తుంది. ముదురు గోధుమ వర్ణంలోనున్న వృక్క ధమని – వెలుపలి భాగాన్ని వల్కలం (Cortex) అనీ, లేత వర్ణంలోనున్న లోపలి భాగాన్ని దవ్వ (Medulla) అనీ అంటారు. ప్రతీ మూత్రపిండంలోనూ సుమారు ఒక మిలియన్ కంటే ఎక్కువ (1.3 నుండి 1.8 మిలియన్) సూక్ష్మ వృక్కనాళాలు ఉంటాయి. వాటినే వృక్క ప్రమాణాలు లేదా నెఫ్రాన్ (Nephron) లని అంటారు.
ప్రశ్న 12.
మూత్ర సంఘటనము ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది?
జవాబు:
మూత్రం లేత పసుపురంగు ద్రవం. రక్తంలోని హిమోగ్లోబిన్ విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడే యూరోక్రోమ్ అనే పదార్థం ఈ రంగుకి కారణమవుతుంది. మూత్ర సంఘటనం అనేది అనేక కారణాలపైన ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణకు మాంసకృత్తులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకొన్న వ్యక్తి మూత్రంలో యూరియా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రోటీన్ల జీర్ణక్రియలో భాగంగా కాలేయంలో జరిగే డీఅమినేషన్ ఫలితంగా ఎక్కువ పరిమాణంలో యూరియా ఏర్పడుతుంది.
పిండిపదార్థాలు అధికంగా తీసుకొన్నవారి మూత్రంలో అధిక చక్కెర కనిపించవచ్చు. ద్రవపదార్థాలు లేదా నీరు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకొన్నవారి రక్తంలోనికి అధికంగా నీరు చేరటం ఫలితంగా పలుమార్లు వారు మూత్రానికి వెళ్ళవలసి వస్తుంది.
ప్రశ్న 13.
వివిధ జీవులలోని విసర్జన వ్యవస్థలు తెలపండి.
జవాబు:
ప్రశ్న 14.
మొక్కలలో విసర్జన జంతువుల కంటే ఎలా విభిన్నంగా ఉంటుంది?
జవాబు:
- తయారైన వ్యర్థాలను విసర్జించడానికి మొక్కల్లో ప్రత్యేకంగా అవయవాలు ఉండవు.
- మొక్కల్లో వ్యర్థ పదార్థాలు విచ్ఛిన్నం కావడమనే ప్రక్రియ జంతువులతో పోల్చినపుడు అతి నెమ్మదిగా జరుగుతుంది.
- అంటే మొక్కల్లో వ్యర్థ పదార్థాల తయారీ కూడా అతి నెమ్మదిగా జరుగుతుందన్నమాట.
- అవి మొక్క దేహంలో పోగవడం కూడా నెమ్మదిగానే జరుగుతుంది.
- ఆకుపచ్చని మొక్కలు రాత్రిపూట, హరిత పదార్థం లేని భాగాలలో మొక్కలు శ్వాసక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ మరియు నీటిని వ్యర్థ పదార్థాలుగా విడుదల చేస్తాయి.
- కిరణజన్యసంయోగక్రియలో ఆక్సిజన్ వ్యర్థ పదార్థంగా ఉత్పత్తి చేయబడి ఆకుల్లోని పత్రరంధ్రాల ద్వారా, కాండంలోని లెంటి సెల్స్ ద్వారా వాతావరణంలోనికి విడుదల చేయబడుతుంది.
ప్రశ్న 15.
మొక్కలలో ఉత్పత్తి అయ్యే, జీవరసాయన పదార్థాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
మొక్కల్లో ఉత్పత్తయ్యే వరసాయనిక పదార్థాలు రెండు రకాలు. అవి :
1) ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు
2) ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు.
1) ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు :
పిండిపదార్థాలు, మాంసకృత్తులు మరియు కొవ్వులు వంటి వాటిని ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు అంటారు.
2) ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు :
మొక్కల సాధారణ పెరుగుదలకు మరియు అభివృద్ధికి కాకుండా ఇతరమైన విధులకు ఉపయోగపడే వాటిని ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలంటారు.
ఉదా : ఆల్కలాయిడ్స్, టానిన్లు, రెసిన్లు, జిగురులు మరియు లేటెక్సులు అయితే మొక్కలు వాటిని తమకోసం ఉత్పత్తి చేసుకోగా, మనం ఆయా రసాయనాలను అనేక రకాలుగా ఉపయోగించుకుంటున్నాం.
ప్రశ్న 16.
మొక్కలలోని ఆల్కలాయిడ్స్, వాటి ఉపయోగాలు, ఉత్పత్తి అయ్యే భాగాలు తెలుపుతూ పట్టిక రూపొందించండి.
జవాబు:
ప్రశ్న 17.
విసర్జించడం, స్రవించటం మధ్యగల పోలికలు ఏమిటి? అవి ఒకదాని కంటే మరొకటి ఎలా భిన్నమైనవి?
జవాబు:
విసర్జన మరియు స్రావం రెండూ ఒక రకమైనవే. రెండింటిలోను వ్యర్ధమైన లేదా అవసరం లేని పదార్థాలను తరలించడం లేదా బయటికి పంపించటం జరుగుతుంది. విసర్జన అనేది జీవులలోని వ్యర్థ పదార్థాల తొలగింపు కాగా, స్రావం అనేది ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వ్యర్థ పదార్థాలను కదలించడం. అందుకే స్రావం క్రియాత్మకమైనది అనీ, విసర్జన క్రియాత్మకం కానిదనీ అంటారు. ఉదాహరణకు మానవునిలో – కన్నీళ్ళు, చెమట, మూత్రం, కార్బన్ డై ఆక్సెడ్ మొదలైనవన్నీ విసర్జితాలు, ఎంజైములు, హార్మోన్లు, లాలాజలం అనేవి స్రావాలుగా చెప్పుకుంటాం.
మొక్కలు వ్యర్థాలను వేర్ల ద్వారా చుట్టూ పరిసరాల్లోకి విసర్జిస్తాయి. కాగా ఆకులు, బెరడు, పండ్లు రాలడం ద్వారా మొక్కలు వ్యర్థాలను తొలగించుకుంటాయి. వివిధ రూపాలలో స్రావాలను విడుదల చేస్తాయి.
విసర్జన, స్రావం :
విసర్జన | స్రావం |
1) వ్యర్థ పదార్థాలను శరీరం నుండి బయటకు పంపే ప్రక్రియ. | 1) పదార్థాలను ఒక చోట నుండి మరొక చోటుకు రవాణా చేసే ప్రక్రియ. |
2) క్రియాత్మకం కాని ప్రక్రియ. | 2) క్రియాత్మక ప్రక్రియ. |
3) మానవునిలో యూరియా, యూరికామ్లం, అమ్మోనియా విసర్జన పదార్థాలు. | 3) ఎంజైమ్లు, హార్మోన్లు, లాలాజలం స్రావాలు. |
4) మొక్కలలో ఆల్కలాయిడ్లు, రెసిన్ మొదలైనవి విసర్జితాలు. | 4) జిగురులు, లేటెక్స్ వంటివి స్రావితాలు. |
ప్రశ్న 18.
ప్రక్క పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
a) మూత్రపిండం నిలువుకోతలో నీవు గమనించే భాగాలు ఏమిటి?
b) మూత్రపిండం వెలుపలి భాగం ఎరుపు రంగులో ఎందుకు ఉంటుంది?
c) మూత్రపిండంలో కనిపించే సన్నని నాళాలు ఏమిటి?
d) మూత్రపిండ నాభి నుండి వెలుపలికి వచ్చే నాళాలు ఏమిటి?
జవాబు:
a) మూత్రపిండం నిలువుకోతలో వల్కలం, దవ్వ, వృక్కద్రోణి అనే భాగాలు ఉంటాయి.
b) మూత్రపిండ వెలుపలి భాగం వల్కలం. దీనిలో మూత్ర నాళికల యొక్క బొమన్ గుళికలు అమరి ఉండుట వలన ఎరుపుగా కనిపిస్తుంది.
c) మూత్రపిండం మూత్రనాళికలు అనే సన్నని నాళాలు కల్గి ఉంటుంది.
d) మూత్రపిండ నాభి నుండి వృక్క సిర, మూత్రనాళం బయటకు వస్తాయి.
ప్రశ్న 19.
ప్రక్క పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
a) పటంలో విసర్జక వ్యవస్థకు సంబంధించని భాగము ఏమిటి?
b) కుడి మూత్రపిండం కొంచెం దిగువగా ఉంటుంది ఎందుకు?
c) ఒక మూత్రపిండం పనిచేయకపోతే, రెండవ మూత్రపిండంలో ఏమైనా మార్పులు వస్తాయా?
d) మూత్రాశయం బయటకు తెరుచుకొనే నాళం పేరు ఏమిటి?
జవాబు:
a) మూత్రపిండం మీద టోపీలా ఉండే వినాళగ్రంథికి విసర్జన వృక్క సిర క్రియతో సంబంధం లేదు.
b) ఉదర కుహరంలో కాలేయ కుడివైపున స్థలం ఆక్రమించటం వలన కుడి మూత్రపిండం కొంచెం దిగువగా ఉంటుంది.
c) ఒక మూత్రపిండం పనిచేయకపోతే, రెండవ మూత్రపిండం పరిమాణంలో కొంచెం పెరిగి, విధి నిర్వహణా సామర్ధ్యం పెంచుకొంటుంది.
d) మూత్రాశయం బయటకు తెరుచుకొనే నాళాన్ని ప్రసేకం అంటారు.
ప్రశ్న 20.
ప్రక్క పటం పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
a) ప్రక్క పటము దేనిని సూచిస్తుంది?
b) దీని నిర్మాణంలోని రెండు ప్రధాన భాగాలు ఏమిటి?
c) నాళికా స్రావం ఏ ప్రాంతంలో జరుగుతుంది?
d) వరణాత్మక శోషణం జరిగే ప్రాంతాలు ఏమిటి?
జవాబు:
a) ఈ పటం మూత్రనాళిక నిర్మాణాన్ని సూచిస్తుంది.
b) మూత్రనాళికా నిర్మాణంలో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి.
అవి 1. బొమన్ గుళిక, 2) మాల్పీజియన్ దేహం.
c) నాళికాస్రావం దూరస్థ సంగ్రహనాళంలో జరుగును (DCT).
d) వరణాత్మక శోషణం, సమీప సంవళిత నాళం (PCT) మరియు హెన్లీశిక్యంలో జరుగును.
ప్రశ్న 21.
మానవ శరీరంలో వ్యర్థాల విసర్జనలో మూత్రపిండాలే కాకుండా ఇతర అవయవాలు కూడా తోడ్పడుతాయనడాన్ని నీవెలా సమర్ధిస్తావు?
జవాబు:
- మానవ శరీరంలో మూత్రపిండాలే కాకుండా ఇతర అవయవాలు కూడా వ్యర్థాల విసర్జనకు తోడ్పడతాయి.
- మూత్రపిండాలు రక్తాన్ని వడపోసి నత్రజని సంబంధిత వ్యర్థాలైన యూరియా మరియు యూరికామ్లాన్ని మరియు ఇతర వ్యర్థాలను విసర్జిస్తాయి.
- మూత్రపిండాలతోపాటు ఊపిరితిత్తులు, చర్మము, కాలేయము, ప్రేవులు, లాలాజల గ్రంథులు మరియు లాక్రిమల్ గ్రంథులు కూడా కొన్ని రకాల వ్యర్థాలను విడుదల చేస్తాయి.
- ఊపిరితిత్తులు కార్బన్ డై ఆక్సెడ్ మరియు నీటిని శరీరం నుండి తొలగిస్తాయి.
- చర్మము చెమట రూపంలో నీరు మరియు లవణములను విసర్షిస్తుంది.
- కాలేయము మూత్రము ద్వారా పైత్యరస లవణాలు అయిన బైలిరూబిన్ మరియు బైలివర్జిన్లను విసర్జిస్తుంది.
- శరీరములో అధిక మొత్తంలో నిల్వ ఉన్న కాల్షియం , మెగ్నీషియం మరియు ఇనుము లవణాలను పెద్ద ప్రేగు ఉపకళా కణజాలాలు మలముతో బాటు బయటకు విసర్జిస్తాయి.
- లాలాజల గ్రంథులు మరియు లాక్రిమల్ గ్రంథులు అతిస్వల్ప పరిమాణంలో నత్రజని సంబంధిత పదార్థాలను లాలాజలము మరియు కన్నీరు ద్వారా విసర్జిస్తాయి.
ఇన్ని రకాలుగా శరీరము నందలి వివిధ అవయవములు మరియు గ్రంథులు శరీరములో నిల్వ ఉండే వ్యర్ధ పదార్ధములను బయటకు పంపుటలో అవి నిర్వహించు పాత్రను నేను అభినందిస్తాను.
ప్రశ్న 22.
కింది స్లో చార్టును గమనించండి. ఖాళీ గడులు నింపండి. ఇది ఏ వ్యవస్థకు చెందినదో వివరించండి.
జవాబు:
1) మూత్రపిండం 2) హెన్లీ శిక్యం 3) వృక్కద్రోణి 4) ప్రసేకం
ఈ ఫ్లోచార్టు విసర్జన వ్యవస్థకు సంబంధించినది. రక్తం ఏ విధముగా మూత్రపిండం నందు ప్రయాణిస్తుందో తెలుపుతుంది మరియు మూత్రము ఏర్పడే విధము మరియు బయటకు విసర్జించబడే విధానము గురించి వివరిస్తుంది.
మూత్రపిండమునకు వృక్కధమని రక్తమును సరఫరా చేస్తుంది. వృక్కడమని శాఖ అయిన అభివాహి ధమని నుండి రక్తం, రక్తకేశనాళికాగుచ్ఛంలోనికి ప్రవహిస్తుంది. గుచ్ఛగాలనం ద్వారా ఏర్పడిన మూత్రాన్ని ప్రాథమిక మూత్రం అంటారు. ఇది సమీపస్థ సంవళిత నాళంలోనికి వెళుతుంది. సమీపస్థ సంవళిత నాళంలో పునఃశోషణ తరువాత మూత్రం హెస్లీ శిక్యం ద్వారా దూరస్థ సంవళిత నాళంలోనికి చేరుతుంది. సమీపస్థ సంవళిత నాళంలో కూడా నాళికా స్రావం కొద్ది పరిమాణంలో జరుగుతుంది.
నెఫ్రాన్ వడగట్టిన మూత్రంలో 75% నీరు సమీపస్థ సంవళిత భాగంలోనే పునఃశోషణ చెందుతుంది. తరువాత సంగ్రహనాళంలో వాసోప్రెస్సిన్ అనే హార్మోను సమక్షంలో నీటి పునఃశోషణ జరిగి మూత్రం అతిగాఢతను పొందుతుంది. గాఢతలో గరిష్టస్థాయికి చేరిన ద్రవాన్ని మూత్రం అంటారు.
సంగ్రహనాళం నుండి మూత్రం వృక్మద్రోణిలోకి అక్కడ నుండి మూత్రనాళం, మూత్రాశయం మరియు ప్రసేకం ద్వారా బయటకు విసర్జించబడుతుంది.
ప్రశ్న 23.
రంగయ్యకు ఆరోగ్యం సరిగా లేదు. డాక్టర్ నిర్వహించిన పరీక్షల్లో క్రింది ఫలితాలు వచ్చాయి. పట్టికను విశ్లేషించండి. కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
అ) రంగయ్యకు చక్కెర వ్యాధి ఉన్నది అని ఎలా చెప్పవచ్చు?
ఆ) బైలిరూబిన్ గురించి తెలుసుకోవడానికి ఏ పరీక్షలు నిర్వహించాలి?
ఇ) పై నివేదిక ఆధారంగా నీవేం గ్రహించావు?
ఈ) పై నివేదిక ఆధారంగా డాక్టరును నీవు ఏ ఏ ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:
అ) ఆహారం తినకముందు సాధారణ చక్కెర స్థాయి (గ్లూకోజ్) 60 – 100 మధ్య ఉండాలి. కాని రంగయ్యకు చక్కెర స్థాయి ఆహారం తినకముందు 120 ఉన్నది. ఆహారం తిన్న తర్వాత గ్లూకోజు సాధారణ స్థాయి 160 – 180 మధ్య ఉండాలి. కాని రంగయ్యకు 220గా ఉన్నది. రెండు సందర్భాలలోను గ్లూకోజు స్థాయిలు రక్తం నందు ఎక్కువగా ఉండుట వలన రంగయ్యకు చక్కెర వ్యాధి ఉన్నట్లు చెప్పవచ్చు.
ఆ) బైలిరూబిన్ గురించి తెలుసుకోవడానికి రక్తపరీక్ష చేయాలి.
ఇ) పై నివేదిక ఆధారంగా రంగయ్యకు అధిక రక్త పీడనము, చక్కెర వ్యాధి ఉన్నదని, రక్తం నందు 24 గంటల ప్రోటీను స్థాయి కూడా ఎక్కువగా ఉన్నదని తెలియుచున్నది. మూత్రం నందు సోడియం స్థాయి సాధారణముగానే ఉన్నదని తెలియుచున్నది. రక్తం నందు పరిమాణం సాధారణ స్థాయి కంటే హెచ్చుగా నున్నది.
ఈ)
- చక్కెర వ్యా ధి వలన కలిగే నష్టాలు ఏమిటి?
- చక్కెర వ్యాధి కలుగుటకు కారణమేది?
- రక్తంలో గ్లూకోజు స్థాయిలను నియంత్రించు హార్మోను ఏది?
- అధిక రక్త పీడనము ఎందువలన కలుగుతుంది?
- అధిక రక్త పీడనము వలన కలిగే అనర్థాలు ఏమిటి?
- మూత్రం నందు 24 గంటల ప్రోటీను ఎక్కువైతే ఏం జరుగుతుంది?
- మన శరీరానికి సోడియం ఏ విధంగా అవసరం అవుతుంది?
- బైలిరూబిన్ వర్ణక స్థాయి రక్తమునందు ఎక్కువ అయితే కలిగే అనర్థాలు ఏమిటి?
ప్రశ్న 24.
రక్తం మూత్రపిండాలలో శుభ్రపడుతుంది. మూత్రపిండాలలోని నెఫ్రాన్లో రక్తం నుండి అనేక వ్యర్థ పదార్థాలు తొలగించబడతాయి. విసర్జన వ్యవస్థలో నిన్ను అత్యంత ఆశ్చర్యానికి గురిచేసిన అంశాలు ఏమిటి?
జవాబు:
- మూత్రపిండాలు మన శరీరం నుండి వ్యర్థాలను విసర్జిస్తాయి. అవి శరీరంలో విటమినులు, ఖనిజలవణాలు, కొవ్వులు సమతుల్యత కలిగి ఉండేలా చూస్తాయి.
- ప్రతిరోజు మన శరీరం నుండి 1.6 లీ నుండి 1.8 లీటర్ల వరకు మూత్రము విసర్జించబడుతుంది. దీనిలో మన శరీరానికి ఉపయోగపడని ఖనిజ లవణములు, విటమినులు ఉంటాయి.
- మానవ మూత్రాశయము మానవ మెదడు పరిమాణం కలిగి ఉండడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం.
- అతిచిన్నవైన మూత్రపిండాలు మానవ జీవిత కాలంలో రమారమి 7,850, 000, 000 గాలనుల ద్రవపదార్థాలను విసర్జించుటకు కారణమవుతాయి.
- మానవ మూత్రాశయము సుమారు 400 మి.లీ. పరిమాణంలో మూత్రమును నిలువచేయగలుగుతుంది.
- మానవ మూత్రములో ఉండే యూరియా మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
- ఒక్కొక్క మూత్రపిండము అతి సూక్ష్మమైన రక్తాన్ని వడకట్టే సుమారు 10 లక్షల కంటే ఎక్కువ ఉండే నెఫ్రాన్లను
(లేదా)
మూత్రనాళికలను కలిగియుండటం నన్ను ఎంతో ఆశ్చర్యపరుస్తుంది.
ప్రశ్న 25.
మీ గ్రామంలో ఏయే మొక్కలు లభిస్తాయి ? వీటిలో ఏయే మొక్కల ఉప ఉత్పన్నాలు మీరు నిజజీవితంలో ఉపయోగించుకుంటున్నారు?
జవాబు:
1) మా గ్రామంలో లభ్యమయ్యే మొక్కల వివరాలు :
సపోట, కొబ్బరి, తుమ్మ, మామిడి, జామ, తాటి, అరటి, పొగాకు, సర్పగంధి, కాఫీ, వేప, ఉమ్మెత్త, గడ్డి చామంతి, తంగేడు, పైనస్, వాలిస్ నేరియా, టేకు మొదలైన మొక్కలు పెరుగుతాయి.
2) పై మొక్కలందు ఆల్కలాయిడ్లను ఉత్పత్తి చేయు మొక్కలు :
పొగాకు, సర్పగంధి, కాఫీ, వేప, ఉమ్మెత్త మరియు చామంతి. ఈ మొక్కల ఉప ఉత్పన్నాలు నిత్యజీవితములో ఎంతో ఉపయోగపడతాయి.
మొక్క | ఆల్కలాయిడ్ | ఉపయోగం |
పొగాకు | నికోటిన్ | క్రిమిసంహారిణి |
సర్పగంధి | రిసర్ఫిన్ | పాముకాటు నుండి రక్షణ |
కాఫీ | కెఫెన్ | నాడీ వ్యవస్థ ఉత్తేజకారకం |
వేప | నింబిన్ | యాంటిసెప్టిక్ |
ఉమ్మెత్త | స్కోపోలమైన్ | మత్తుమందు |
గడ్డిచామంతి | పైరిత్రాయిడ్స్ | కీటకనాశనులు |
3) తుమ్మ, తంగేడు నుండి లభ్యమయ్యే టానిన్లను తోళ్ళను శుభ్రం చేయడానికి వినియోగిస్తాము.
4) వేప, తుమ్మ చెట్ల నుండి లభ్యమయ్యే జిగురును అతికించుటకు మరియు బైండింగ్ కారకంగా ఉపయోగిస్తాం.
5) పైనస్ నుండి లభ్యమయ్యే రెసిన్లను వార్ని ఉపయోగిస్తాం.
10th Class Biology 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ ½ Mark Important Questions and Answers
ఫ్లో చార్టులు
1.
జవాబు:
మూత్రాశయం
2.
జవాబు:
వృక్క ద్రోణి
3.
జవాబు:
గ్లోమరులస్
4.
జవాబు:
హెన్లీ శిక్యం
5.
జవాబు:
ఎంజైమ్స్
6.
జవాబు:
స్రావాలు
7.
జవాబు:
రెసిన్
8.
జవాబు:
హెస్లీ శిక్యం
9.
జవాబు:
కాలేయం
10.
జవాబు:
వరణాత్మక పునఃశోషణం
సరైన గ్రూపును గుర్తించండి
11. ఏ గ్రూపు సమ్మేళనాలు నత్రజని సంబంధిత వ్యర్థాలు?
A. అమ్మోనియా, యూరియా, యూరిక్ ఆమ్లం
B. గ్లూకోజ్, అమైనో ఆమ్లం, కొవ్వు ఆమ్లం
జవాబు:
గ్రూపు A
12. ఏ రక్తనాళాల సమూహం ఆమ్లజనిసహిత రక్తాన్ని తీసుకెళతాయి?
A. వృక్కసిర, వృక్క ధమని, వృక్క నాళిక
B. వృక్క ధమని, అభివాహి ధమనిక, అపవాహి ధమనిక
జవాబు:
గ్రూపు B
13. ఏ గ్రూపు సరైన క్రమంలో అమరి ఉంది?
A. అభివాహి ధమనిక, గ్లోమరులస్, అపవాహి ధమనిక
B. గ్లోమరులస్, అభివాహి ధమనిక, అపవాహి ధమనిక
జవాబు:
గ్రూపు A
14. అల్పగాఢత గల మూత్రం మరియు అధిక మూత్ర విసర్జన లక్షణాలు ఉన్న వ్యాధిని గుర్తించండి.
A. డయాబెటిస్ ఇన్సిపిడస్
B. డయాబెటిస్ మెల్లిటస్
జవాబు:
డయాబెటిస్ ఇన్సిపిడస్
15. ఏ గ్రూపు సరైన క్రమంలో అమరి ఉంది?
A. సంగ్రహణ నాళం-కేలిసిస్-పిరమిడ్-ద్రోణి మూత్రనాళం
B. సంగ్రహణ నాళం-పిరమిడ్-కేలిసిస్-ద్రోణి – మూత్రనాళం
జవాబు:
గ్రూపు B
16. ఈ క్రింది ఏ సమూహం మానవునిలోని అనుబంధ విసర్జక అవయవాలు?
A. ఊపిరితిత్తులు, కాలేయం, చర్మం
B. గుండె, కళ్ళు, క్లోమం
జవాబు:
గ్రూపు A
17. ఏ గ్రూపు సమ్మేళనాలు ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు కావు?
A. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు
B. ఆల్కలాయిడ్స్, రెసిన్, లేటెక్స్
జవాబు:
గ్రూపు B
18. ఏ గ్రూపు పండ్ల నుంచి ద్వితీయ జీవక్రియోత్పన్నాలు వెలికితీస్తారు?
A. మార్ఫిన్, కొకైన్, స్కోపాలమైన్
B. కెఫిన్, నింబిన్, రిసర్ఫిన్
జవాబు:
గ్రూపు A
19. ఏ గ్రూపులోని సమ్మేళనాలు మొక్కల్లోని నత్రజని సంబంధిత ద్వితీయ జీవక్రియోత్పన్నాలు కావు?
A. క్వినైన్, పైరిథ్రాయిడ్స్, నికోటిన్
B. రెసిన్, లేటెక్స్, టానిన్స్
జవాబు:
గ్రూపు B
20. ఏ గ్రూపు మొక్కల స్రావాలకు సంబంధించినవి?
A. లేటెక్స్, రెసిన్లు, జిగురులు
B. ఎంజైములు, హార్మోన్లు, లాలాజలం
జవాబు:
గ్రూపు A
విస్తరించుము
21. LS – Longitudinal Section
22. PCT – Proximal Convoluted Tubule/ సమీపస్త సంవళిత నాళము
23. DCT – Distal Convoluted Tubule / దూరస్థ సంవళిత నాళము
24. ESRD – End Stage Renal Diseas
ఉదాహరణలు ఇవ్వండి
25. జలచర జంతువులు అమ్మోనియాను నత్రజని వ్యర్థాలుగా విసర్జిస్తాయి. యూరిక్ ఆమ్లంను విసర్జించే జంతువుకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
కీటకాలు మరియు పక్షులు
26. పక్షులు యూరిక్ ఆమ్లం అనే నత్రజని వ్యర్థాలను విసర్జిస్తాయి. యూరియాను విసర్జించే జీవికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
మానవుడు
27. రక్తస్కందన నిరోధక పదార్థానికి హెపారిన్ ఒక ఉదాహరణ. కృత్రిమ రక్తస్కందన నిరోధక పదార్థానికి మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
సోడియం ఆక్సలేట్ / సోడియం సిట్రేట్
28. సేబాషియస్ గ్రంథులు చర్మం ద్వారా సెబమ్ ను విసర్జిస్తాయి. అధికంగా తీసుకున్న ఔషధాలను తొలగించడంలో సహాయపడే అనుబంధ విసర్జక అవయవానికి ఉదాహరణను ఇవ్వండి.
జవాబు:
కాలేయం
29. అమీబా సంకోచ రిక్తికల ద్వారా ద్రవాభిసరణ క్రమతను చూపుతాయి. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పారామీషియం
30. పొరిఫెరా వర్గ జీవులలో విసర్జన కొరకు ప్రత్యేకమైన విసర్జకావయవాలు లేవు. జీవుల ప్రతి కణంలోకి నీటి ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా విసర్జ కావయవాలు లేని వర్గానికి మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
సీలెంటరేటా
31. క్వినైన్ అనేది బెరడు నుండి సేకరించిన ఆల్కలాయిడ్ మరో ఉగా హరణ ఇవ్వండి.
జవాబు:
రిసర్ఫిన్ మరియు నింబిన్
32. స్కోపాలమైన్ అనేది పుష్పం నుండి సేకరించిన ఆల్కలాయిడ్. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
పైరిత్రాయిడ్లు
33. ఆల్కలాయిడ్స్ అనేవి నైట్రోజన్ ను కలిగి ఉండే ద్వితీయ జీవక్రియోత్పన్నాలు. కార్బన్ ని కలిగి ఉన్న ద్వితీయ జీవక్రియోత్పన్నానికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
టానిన్లు
34. నింబిన్ అనేది యాంటీ సెప్టిక్ గా ఉపయోగించే ఆల్కలాయిడ్. కీటకనాశనిగా వాడే ఆల్కలాయిడు ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
నికోటిన్ / పైరిత్రాయిడ్లు
35. హీవియా మొక్క నుండి లభించే లేటెస్ట్ ను రబ్బరు తయారీలో వాడతారు. లేటెక్స్ ను స్రవించే మొక్కకు మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
జ ట్రోపా
36. మానవులలో స్రావాలకు ఉదాహరణలు హార్మోన్లు. మరో ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
లాలాజలం/ఎంజైములు
నేను ఎవరు?
37. నేను వృక్షశాస్త్రవేత్తను. మొక్కలు నేల నుండి కొన్ని ద్రవాలను నీటిని పీల్చుకోవడమే కాకుండా కొన్ని స్రావాలను నేలలోకి స్రవిస్తాయి అని నా ప్రయోగాల ద్వారా తెలియజేశాను.
జవాబు:
బ్రుగ్ మన్
38. నేనొక మొక్కను. రబ్బరును తయారు చేయడానికి ఉపయోగించే జిగటగా ఉండే పాలపదార్థాన్ని నేను స్రవిస్తాను.
జవాబు:
హీవియా బ్రెజిలియన్సిస్
39. నేను ద్వితీయ జీవక్రియోత్పన్నాన్ని. నేను ఎక్కువగా వివృతబీజ మొక్కలలో ఉంటాను. మరియు నన్ను వార్నిష్‌లలో ఉపయోగిస్తారు.
జవాబు:
రెసిన్
40. నన్ను సర్పగంధి మొక్క అని పిలుస్తారు. నేను స్రవించే ఆల్కలాయిడు పాముకాటుకు మందుగా ఉపయోగిస్తారు.
జవాబు:
రావుల్ఫియా సర్పెంటైనా
41. నేనొక విత్తనాన్ని, కేంద్రనాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసే ఆల్కలాయిడ్ ను కలిగి ఉంటాను.
జవాబు:
కాఫీ విత్తనం
42. ఎకైనోడర్మటా జీవులలో చలనానికి, పోషక మరియు వర్థపదార్థాల రవాణా కొరకు ఏర్పడిన అవయవవ్యవస్థను.
జవాబు:
జలప్రసరణ వ్యవస్థ
43. నేనొక వర్గాన్ని. ఈ వర్గంలో మొదటిసారిగా విసర్జక నిర్మాణాలు ఏర్పడ్డాయి.
జవాబు:
ప్లాటీ హెల్మింథిస్
44. ఏకకణ జీవులలో ద్రవాభిసరణ క్రమతను నియంత్రించే కణాంగాన్ని,
జవాబు:
సంకోచరిక్తిక
45. ఎర్రరక్తకణాలు చనిపోవడం వలన హీమోగ్లోబిన్ విచ్ఛిన్నం అయినప్పుడు ఏర్పడే వ్యర్థాన్ని మరియు మూత్రం యొక్క రంగుకి కారణమైన వర్ణక పదార్థాన్ని.
జవాబు:
యూరోక్రోమ్
46. నేనొక వాషింగ్టన్ కి చెందిన సర్టైన్ ని. 1954లో మొదటి సారిగా మూత్రపిండ ఆపరేషన్ చేసిన ఘనత నాదే.
జవాబు:
డా|| చార్లెస్ హఫ్ నగెల్
జతపరచుట
47. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
మూత్రం – యూరోక్రోమ్
రక్తం – పత్రహరితం
పత్రం – హీమోగ్లోబిన్
జవాబు:
మూత్రం – యూరోక్రోమ్
48. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
అమ్మోనియా – చేప
యూరియా – మానవులు
యూరిక్ ఆమ్లం – ఎలుక
జవాబు:
యూరిక్ ఆమ్లం – ఎలుక
49. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
మూత్రాశయం సామర్థ్యం – 1.6 – 1.81 లీటర్లు
రోజుకు విసర్జించే మూత్ర
పరిమాణం – 700-800 మి.లీ.
డయాలిసిసికి పట్టే సమయం – 3-6 గంటలు
జవాబు:
డయాలిసిస్ కి పట్టే సమయం – 3-6 గంటలు
50. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
ఊపిరితిత్తులు – CO2 & నీరు
కాలేయం – అదనపు మందులు
చర్మం – బిలిరుబిన్
జవాబు:
చర్మం – బిలిరుబిన్
51. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
అనెలిడా – మాల్ఫీజియన్ నాళికలు
నెమటోడా – రెనెట్ కణాలు
ఆరోపోడా – నెఫ్రీడియా
జవాబు:
నెమటోడా – రెనెట్ కణాలు
52. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
మానవుడు – మూత్రపిండం
పక్షులు – హరితగ్రంథులు
మొలస్కా – మెటా నెఫ్రీడియా
జవాబు:
పక్షులు – హరిత గ్రంథులు
53. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు – కార్బోహైడ్రేట్
ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు – ప్రొటీన్లు
మొక్కలలో కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలు – రాఫైడ్లు
జవాబు:
ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు – ప్రొటీన్లు
54. సరిగ్గా జతచేయబడిన దానిని గుర్తించండి.
నికోటిన్ – బెరడు
క్వి నైన్ – ఆకు
స్కోపాలమైన్ – పుష్పం
జవాబు:
స్కోపాలమైన్ – పుష్పం
55. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
నల్లమందు – నొప్పి నివారిణి
నింబిన్ – మత్తుమందు
పైరిత్రాయిడ్ – కీటకనాశిని
జవాబు:
నింబిన్ – మత్తుమందు
56. తప్పుగా జతచేయబడిన దానిని గుర్తించండి.
జిగురు – తుమ్మ
అలర్జిన్ – పార్టీనియం
టానిన్ – జట్రోపా
జవాబు:
టానిన్ – జట్రోపా
పోలికను గుర్తించుట
57. గడ్డి చామంతి : పువ్వు :: సింకోనా 😕
జవాబు:
బెరడు
58. వేప : అజాడిరక్త ఇండికా :: ? : నికోటియాన టొబాకం
జవాబు:
పొగాకు
59. స్కోపాలమైన్ : మత్తుమందు :: కొకైన్ 😕
జవాబు:
నొప్పి నివారిణి
60. చూయింగ్ గమ్ : చికిల్ :: బయోడీజిల్ 😕
జవాబు:
జట్రోపా
61. రెసిన్ : మొక్క స్రావం :: లాలాజలం 😕
జవాబు:
మానవ స్రావం
62. శ్వాసక్రియ : CO2 :: బాష్పోత్సేకం 😕
జవాబు:
నీరు
63. వృక్క ధమని : ? :: వృక్క సిర : ఆమ్లజనిరహిత రక్తం
జవాబు:
ఆమ్లజనిసహిత రక్తం
64. గుచ్చగాలనం : బౌమన్ గుళిక :: నాళికా స్రావం 😕
జవాబు:
దూరస్థ సంవళిత నాళము
65. సజల మూత్రం : వాసోప్రెస్సిన్ :: ? : రక్తస్కందన నిరోధకం
జవాబు:
హెపారిన్
66. డయాలసిస్ : కృత్రిమ మూత్రపిండం :: జీవన్ దాన్ పథకం 😕
జవాబు:
అవయవ దానం
దోషాన్ని గుర్తించి, సరిచేసి రాయండి
67. జీవక్రియలోని వ్యర్థ పదార్థ ఉత్పత్తుల్లో అత్యంత విషతుల్యం యూరియా.
జవాబు:
జీవక్రియలోని వ్యర్థ పదార్థ ఉత్పత్తుల్లో అత్యంత విషతుల్యం అమ్మోనియా.
68. ప్రతీ మూత్రపిండంలో, సూక్ష్మమైన మరియు నాళికా రూప క్రియాత్మక ప్రమాణాలను న్యూరాన్లు లేదా వృక్క ప్రమాణాలు అంటారు.
జవాబు:
ప్రతీ మూత్రపిండంలో, సూక్ష్మమైన మరియు నాళికా రూప క్రియాత్మక ప్రమాణాలను నెఫ్రాన్లు లేదా వృక్క ప్రమాణాలు అంటారు.
69. దూరస్థ సంవళిత నాళము చుట్టూ అమరి ఉన్న బాహ్య కేశ నాళికావల ప్రాథమిక మూత్రంలోని శరీరానికి ఉపయోగపడే పదార్థాలను పునఃశోషణం చేసుకుంటుంది.
జవాబు:
సమీపస్థ సంవళిత నాళము చుట్టూ అమరి ఉన్న బాహ్యకేశ నాళికావల ప్రాథమిక మూత్రంలోని శరీరానికి ఉపయోగపడే పదార్థాలను పునఃశోషణం చేసుకుంటుంది.
70. వరణాత్మక పునఃశోషణం అనేది మూత్రం యొక్క పిహెచ్ యొక్క సరైన గాఢతను క్రమబద్ధం చేస్తుంది.
జవాబు:
నాళికా స్రావం అనేది మూత్రం యొక్క పిహెచ్ యొక్క సరైన గాఢతను క్రమబద్ధం చేస్తుంది.
71. వాసోప్రెస్సిన్ లోపం వలన అధిక మూత్ర విసర్జన మరియు తక్కువ గాఢత గల మూత్రవిసర్జన జరుగుతుంది. దీనినే డయాబెటిస్ మెల్లిటస్ అంటారు.
జవాబు:
వాసోప్రెస్సిన్ లోపం వలన అధిక మూత్ర విసర్జన మరియు తక్కువ గాఢత గల మూత్రవిసర్జన జరుగుతుంది. దీనినే డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటారు.
72. ఒకవేళ మూత్రపిండాలు విఫలం అయితే, శరీరం నీరు మరియు వ్యర్థ ఉత్పత్తులతో నిండి ఉంటుంది. ఈ స్థితిని ఎడిమ అంటారు.
జవాబు:
ఒకవేళ మూత్రపిండాలు విఫలం అయితే, శరీరం నీరు మరియు వ్యర్థ ఉత్పత్తులతో నిండి ఉంటుంది. ఈ స్థితిని యూరేమియా అంటారు.
73. ఆల్కలాయిడ్స్ కర్బన సమ్మేళనాలు మరియు విష పూరితం.
జవాబు:
ఆల్కలాయిడ్స్ నత్రజని సమ్మేళనాలు మరియు విష పూరితం.
బొమ్మలపై ప్రశ్నలు
74.
ఈ పరికరంలో ఉపయోగించిన ద్రవం పేరేమిటి?
జవాబు:
డయలైజింగ్ ద్రావణం
75.
ఈ పటం దేనిని సూచిస్తుంది?
జవాబు:
మూత్రపిండ మార్పిడి
76.
ఈ మొక్కల్లో ఉండే ఆల్కలాయిడ్ పేరేమిటి?
జవాబు:
స్కోపోలమైన్
77.
ఈ మొక్క నుండి స్రవించే పదార్థం ఏమిటి?
జవాబు:
లేటెక్స్
78.
ఈ పటంలో U ఆకారంలో ఉన్న భాగం పేరు ఏమిటి?
జవాబు:
హె శిక్యం
79.
ఈ పటంలో తప్పుగా గుర్తించిన భాగం పేరేమిటి?
జవాబు:
వృక్క సిర (మూత్రనాళం)
80.
మానవునిలో అనుబంధ విసర్జక అవయ వంగా పనిచేసే ఈ పటాన్ని గుర్తించండి.
జవాబు:
కాలేయం
ఖాళీలను పూరించండి
81. విసర్జన ప్రధాన లక్ష్యము
జవాబు:
శరీర అయాన్ సమతా స్థితి
82. మూత్రపిండ లోపలి తల నొక్కును ఏమంటారు?
జవాబు:
హైలమ్
83. మూత్రపిండం లోనికి ………. ప్రవేశించగా, వృక్క సిర, మూత్రనాళం బయటకు వస్తాయి.
జవాబు:
వృక్క ధమని
84. మూత్రపిండం యొక్క వెలుపలి వలయాన్ని ………. అంటారు.
జవాబు:
వల్కలము
85. మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక ప్రమాణం ………….. నెఫ్రాన్
జవాబు:
వృక్క నాళిక
86. మూత్రనాళికలోని తలపిన్ను వంటి నిర్మాణం …………
జవాబు:
హె శిక్యం
87. కృత్రిమ మూత్రపిండాన్ని …….. అంటారు.
జవాబు:
డయాలసిస్
88. ………… మూత్రపిండం కొంచెం దిగువగా ఉంటుంది.
జవాబు:
కుడి
89. మొక్కలలోని విసర్జక పదార్థాలను ……. అంటారు.
జవాబు:
ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు
90. ఆల్కలాయిడ్స్ …….. ఉత్పన్నాలు.
జవాబు:
కర్బన
91. తోళ్ళ పరిశ్రమలో ఉపయోగించే వృక్ష వ్యర్థాలు ………..
జవాబు:
టానిన్లు
92. రబ్బరు మొక్క ………… నుండి రబ్బరు తయారు చేస్తారు.
జవాబు:
లేటెక్స్
93. మొక్కల వేర్ల నుండి వ్యర్థాల విసర్జనను ఏమంటారు?
జవాబు:
అయాన్ నిశ్రావణం
94. ఏ మొక్క ఆల్కలాయిడ్ ను యాంటీ బయాటిక్ గా ఆవాడతారు?
జవాబు:
వేప
95. రెసిన్లను ఏ పరిశ్రమలలో వాడతారు?
జవాబు:
రంగుల పరిశ్రమలో
10th Class Biology 4th lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 1 Mark Bits Questions and Answers
1. పాముకాటు నుండి రక్షణ పొందడానికి ఈ క్రింది ఆల్కలాయిడను ఉపయోగిస్తారు.
A) క్వి నైన్
B) రిసర్ఫిన్
C) కెఫెన్
D) నింబిన్
జవాబు:
B) రిసర్ఫిన్
2. ఈ కింది వానిలో విసర్జక అవయవము లేని జంతువును గుర్తించండి.
A) పక్షి
B) అమీబా
C) స్పంజికలు
D) B మరియు C
జవాబు:
D) B మరియు C
3. ఒక వ్యక్తికి కాళ్ళు, చేతులు ఉబ్బిపోయాయి. నీరసం అలసట వస్తుంది. అతనిలో ఈ అవయవం పాడై ఉండవచ్చు.
A) మూత్రపిండం
B) మెదడు
C) గుండె
D) కాలేయం
జవాబు:
A) మూత్రపిండం
4. క్రింది వాటిలో సరిగ్గా లేని జత ఏది?
A) ప్లాటి హెల్మింథిస్ – జ్వాలకణాలు
B) ఆగ్రోపొడ – మాల్ఫీజియన్ నాళికలు
C) మొలస్కా – మెటానెఫ్రీడియా
D) ప్రోటోజోవా – జల ప్రసరణ వ్యవస్థ
జవాబు:
D) ప్రోటోజోవా – జల ప్రసరణ వ్యవస్థ
5. ఈ క్రింది పటములో ‘X’ ను గుర్తించుము.
A) బౌమన్ గుళిక
B) సిర
C) నాళము
D) కప్పు
జవాబు:
A) బౌమన్ గుళిక
6. మాల్ఫీజియన్ నాళికలు విసర్జకావయవములుగా గల జీవి ………
A) వానపాము
B) బొద్దింక
C) ఏలికపాము
D) ప్లనేరియా
జవాబు:
B) బొద్దింక
7. రక్తంలోని వ్యర్థ పదార్థాలను ఏ విధంగా గుర్తిస్తారు?
A) స్కానింగ్ ద్వారా
B) మూత్ర పరీక్ష ద్వారా
C) థర్మామీటర్ తో
D) రక్తపరీక్ష ద్వారా
జవాబు:
B) మూత్ర పరీక్ష ద్వారా
8. మన శరీరంలో మూత్రం ప్రయాణించే సరైన మార్గం
A) మూత్ర పిండాలు → మూత్ర నాళాలు → మూత్రాశయం → ప్రసేకం
B) మూత్రనాళాలు → మూత్రాశయం → ప్రసేకం → మూత్రపిండాలు
C) మూత్రాశయం → ప్రసేకం → మూత్రపిండాలు → మూత్రనాళాలు
D) ప్రసేకం → మూత్రపిండాలు → మూత్రనాళాలు → మూత్రాశయం
జవాబు:
A) మూత్ర పిండాలు → మూత్ర నాళాలు → మూత్రాశయం → ప్రసేకం
9. క్రింది స్లో చార్టును పూర్తి చేయుము.
వరణాత్మక . . అతిగా ఢత గల గుచ్చ గాలనం మూత్రం ఏర్పడడం
A) నాళికా స్రావం
B) నాళికా వడబోత
C) నాళికా విసర్జన
D) మూత్రం ఏర్పడటం
జవాబు:
A) నాళికా స్రావం
10. నేను ఒక మొక్కను. నా విత్తనాల నుండి జీవ ఇంధనం ఉత్పత్తి అవుతుంది. నేనెవరిని?
A) రబ్బరు మొక్క
B) వేప మొక్క
C) కాక్టస్ మొక్క
D) జట్రోపా మొక్క
జవాబు:
D) జట్రోపా మొక్క
11. మొలస్కాలో విసర్జక అవయవాలు ఏవి?
A) రెనెట్ కణాలు
B) హరిత గ్రంథులు
C) మెటా నెఫ్రీడియా
D) మూత్రపిండాలు
జవాబు:
C) మెటా నెఫ్రీడియా
12. మూత్రము ఏర్పడే విధానంలో ఈ క్రింది నాలుగు దశలు ఉన్నవి. వాటిని క్రమ పద్ధతిలో అమర్చండి.
i) వరణాత్మక పునఃశోషణ
ii) గుచ్చగాలనం
iii) అతిగాఢత గల మూత్రం ఏర్పడటం
iv) నాళికా స్రావం
A) (i), (ii), (iii), (iv)
B) (iv), (iii), (ii), (i)
C) (iii), (ii), (i), (iv)
D) (ii), (i), (iv), (iii)
జవాబు:
D) (ii), (i), (iv), (iii)
13. సరైన జతను గుర్తించండి.
A) ప్రోటోజోవా – జ్వాలాకణాలు
B) అనెలిడా – మూత్రపిండాలు
C) ఇఖైనోడర్మేటా – నెఫ్రీడియా
D) ఆర్రోపోడా – హరితగ్రంథులు
జవాబు:
D) ఆర్రోపోడా – హరితగ్రంథులు
14. మూత్రం పసుపు రంగులో ఉండుటకు కారణము
A) బైలిరూబిన్
B) యూరోక్రోమ్
C) క్లోరైడ్లు
D) క్రియాటినిన్
జవాబు:
B) యూరోక్రోమ్
15. గ్రూపు — A గ్రూపు – B
i) ప్లాటి హెల్మింథస్ ( ) a) నెఫ్రిడియ
ii) అనెలిడ ( ) b) జ్వాలా కణాలు
iii) ఆర్రోపోడా ( ) మాల్ఫీజియన్ నాళికలు
A) i – b, ii – a, iii – c
B) i – b, ii – c, iii – a
C) i – a, ii – c, iii – b
D) i – c, ii – b, iii – a
జవాబు:
A) i – b, ii – a, iii – c
16. చర్మము : చెమట : : ఊపిరితిత్తులు : ………….
A) కార్బన్-డై-ఆక్సెడ్
B) మలం
C) యూరియా
D) లాలాజలం
జవాబు:
A) కార్బన్-డై-ఆక్సెడ్
17. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకొనుటకు నీవిచ్చే సలహాలేవి?
A) రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడం
B) పొగ తాగడం, మద్యం సేవించడం మానివేయడం
C) రక్తపీడనంను అదుపులో ఉంచుకోవడం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
18. ప్లాటి హెల్మింథిస్ వర్గ జీవుల్లో విసర్జకావయవాలు
A) నెఫ్రిడియా
B) జ్వాలాకణాలు
C) హరిత గ్రంథులు
D) మూత్ర పిండాలు
జవాబు:
B) జ్వాలాకణాలు
19. కింది వాటిలో తప్పు వాక్యాన్ని గుర్తించండి.
A) మాంసకృత్తులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకున్న వ్యక్తి మూత్రంలో యూరికామ్లం ఎక్కువగా ఉంటుంది.
B) మధుమేహం ఉన్నవారి మూత్రంలో చక్కెర ఉంటుంది.
C) మూత్రం లేత పసుపురంగులో ఉండడానికి యూరోక్రోమ్ కారణం.
D) ద్రవ పదార్థాలు లేదా నీరు ఎక్కువగా తీసుకునేవారు ఎక్కువసార్లు మూత్రానికి వెళతారు.
జవాబు:
A) మాంసకృత్తులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకున్న వ్యక్తి మూత్రంలో యూరికామ్లం ఎక్కువగా ఉంటుంది.
మీకు తెలుసా?
* 40 సంవత్సరాల వయసు దాటిన తరువాత దాదాపుగా అందరిలోను ప్రతి 10 సంవత్సరాలకు 10% నెఫ్రాన్ల క్రియాశీలత తగ్గుతుంది.
* మొట్టమొదట మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ 1954లో సమరూప కవలలకు చేసిన ఘనత డా. చార్లెస్ హఫ్ నగెల్ అనే వాషింగ్టన్‌కు చెందిన సర్జనకు చెందుతుంది. మన దేశంలో మొదటిసారి డిసెంబర్ 1వ తేదీ 1971న క్రిస్టియన్ మెడికల్ కాలేజీ వెల్లూర్ లో మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ జరిగింది.
* చూయింగ్ గమ్ అనేది నమలడం కోసం తయారుచేయబడిన ఒక రకమైన జిగురు పదార్థం. దీనిని 5000 సంవత్సరాలకు పూర్వమే దీనిని తయారుచేసేవారని చారిత్రక ఆధారాలున్నాయి. ప్రస్తుతం చూయింగ్ గమ్ చికిల్ మొక్క యొక్క సహజసిద్ధమైన లేటెక్స్ నుండి తయారుచేస్తున్నారు. పార్టీనియం వంటి మొక్కల పుప్పొడి రేణువులు మనకు ఎలర్జీని కలుగజేస్తాయి. వాటిలో ఉండే నత్రజనియుత పదార్థాలు చర్మ సంబంధమైన ఎలర్జీ, ఆస్తమా కలిగిస్తాయి.
పునశ్చరణ