Students can go through AP Board 10th Class Biology Notes 10th Lesson సహజ వనరులు to understand and remember the concept easily.
AP Board 10th Class Biology Notes 10th Lesson సహజ వనరులు
→ వనరుల సంరక్షణకు, వనరుల యాజమాన్యం చాలా అవసరం.
→ వనరులు స్థానికంగా విశిష్టత గలవి. స్థానిక ప్రజలే వాటిపై నియంత్రణ కలిగి ఉండాలి.
→ వనరుల వినియోగాన్ని తగ్గిస్తూ, వనరులను తిరిగి వినియోగిస్తూ, పర్యావరణంపై ఒత్తిడి తగ్గించే విధంగా ప్రజలను సంసిద్ధం చేయడం అవసరం.
→ బొగ్గు, పెట్రోలియం వంటి శిలాజ ఇంధనాలను మనం పూర్తిగా తరిగిపోకుండా విచక్షణతో ఉపయోగించుకోవాలి.
→ రాష్ట్రాలు, దేశాల మధ్య ఉన్న విభేదాలు వనరుల అందుబాటుకు అడ్డం కారాదు.
→ ప్రకృతిలో అధిక మోతాదులో లభిస్తూ, భవిష్యత్ లో వాడకానికి వీలుగా నిలువ ఉన్న పదార్థాలను “వనరులు” అంటారు.
→ సహజంగా లభించే వనరులను సహజ వనరులు అంటారు. ఉదా : గాలి, నీరు, నేల.
→ కొన్ని వనరులు వాడుతున్న కొలది తరిగిపోతాయి. తిరిగి భర్తీ చేయబడవు. వీటిని “తరిగిపోయే శక్తివనరులు” అంటారు.
ఉదా : అడవులు, పెట్రోలియం
→ కొన్ని వనరులు వాడుతున్నప్పటికి తిరిగి భర్తీ చేయబడుతుంటాయి. వీటిని “తరగని శక్తివనరులు” అంటారు.
ఉదా: గాలి, నీరు, సౌరశక్తి.
→ నీటి ప్రవాహాలకు అడ్డంగా రాళ్లు, మట్టితో అడ్డుకట్టలు కట్టి ఏర్పాటుచేసే నీటి నిల్వలను “ఇంకుడు చెరువులు” అంటారు. ఇవి భూగర్భ జలాన్ని పెంచుతాయి.
→ గత కొన్ని సంవత్సరాల నుండి ఋతుపవనాల రాకడతో మార్పులు సంభవించుట వలన భూగర్భ జలాల వినియోగంపై ఒత్తిడి పెరిగింది.
→ డ్రిల్లింగ్, లోతైన గొట్టపుబావులు, బోరుబావుల వినియోగం వలన భూగర్భజలం తగ్గిపోతుంది.
→ సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ సంస్థ గ్రామాలలో ఎండిపోతున్న బావులలో నీరు చేరుకొనేలా భూగర్భ జలాలపైనా, సుస్థిరత్వం పైనా దృష్టి కేంద్రీకరించింది.
→ డ్రిప్ మరియు స్ప్రింక్లర్లతో సూక్ష్మనీటిపారుదల పద్ధతుల వలన నీటి వృథా నివారించవచ్చు.
→ వెడల్పు చాళ్ల పద్ధతి, గెరిసిడియా మొక్కలు పెంపకం వంటి రైతు ఆధారిత విధానాల వలన నేలను సంరక్షించవచ్చు.
→ UNDP ప్రకారం ఎక్కడైతే ఒక వ్యక్తికి సంబంధించి, వార్షిక నీటి సరఫరా 1700 ఘ.మీ. కన్నా తక్కువగా ఉందో, ఆ ప్రాంతాలలో నీటి వనరులు బాగా తగ్గిపోతున్నాయని అర్థం.
→ అభివృద్ధికి, సంరక్షణకు రెండింటికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని “సుస్థిర అభివృద్ధి” అంటారు. బయోడీజిల్ ఉత్పత్తికి జట్రోప కర్కాస్ మొక్క విత్తనాలు వాడుతున్నారు.
→ చిన్ని చిన్న అడుగులే సంరక్షణ పట్ల గొప్ప విజయాలకు తెరతీస్తాయి.
→ ఇంకుడు చెరువు : నీటి ప్రవాహాలకు, అడ్డంగా రాళ్లు, మట్టితో అడ్డుకట్టలు ఏర్పాటుచేసే నీటి నిల్వలను “ఇంకుడు చెరువులు” అంటారు. ఇవి భూగర్భ జలాన్ని పెంచుతాయి.
→ సూక్షసేద్యం : స్ఫింక్లర్లు, డ్రిప్ పద్ధతులలో తక్కువ నీటితో వ్యవసాయం చేయవచ్చు. దీనినే ‘సూక్ష్మ సేద్యం” అంటారు. ఈ ప్రక్రియలో నీటి వృథాను సమర్థవంతంగా అరికట్టవచ్చు.
→ బోరుబావులు : భూగర్భ జలాల కోసం తవ్విన లోతైన బావులు. వీటి నుండి లభించే నీటితో పంటలు పండిస్తారు.
→ సుస్థిర అభివృద్ధి : పర్యావరణ సంరక్షణతో కూడుకొన్న అభివృద్ధిని “సుస్థిర అభివృద్ధి” అంటారు. ఈ ప్రక్రియలో అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని నాశనం చేయటం జరగదు.
→ జీవ ఇంధనాలు : మొక్కలు, జంతు వ్యర్థాల నుండి తయారుచేసే ఇంధనాలను “జీవ ఇంధనాలు” అంటారు.
ఉదా : జట్రోపా మొక్క నుండి బయోడీజిల్ తీస్తున్నారు.
→ కాంటూర్ పట్టీ పంటల విధానం : పర్వతాల వెంట వాలు ప్రాంతాలను అడ్డంగా దున్ని వేరువేరు ఎత్తులలో పెరిగే పంటలను ఏకాంతర చాళ్లలో పండించే విధానం. ఈ ప్రక్రియలో క్రమక్షయం నిరోధించబడుతుంది.
→ గట్లు : నీటి ప్రవాహానికి అడ్డంగా నిర్మించే నిర్మాణాలు. ఇవి క్రమక్షయాన్ని నివారించి, భూగర్భ జలాన్ని పెంచుతాయి.
→ కట్టల నిర్వహణ : ఏటవాలు ప్రదేశాలకు అడ్డంగా కట్టలు నిర్మించి, నీటి ప్రవాహవేగం తగ్గించి, క్రమక్షయం తగ్గించటం.