AP 10th Class Biology Notes 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

Students can go through AP Board 10th Class Biology Notes 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ to understand and remember the concept easily.

AP Board 10th Class Biology Notes 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

→ స్వయంపోషణ విధానంలో సరళమైన అకర్బన పదార్థాలైన కొన్ని ఖనిజ లవణాలను, నీటిని నేలనుండి గ్రహిస్తాయి. గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ ను ఉపయోగించి బాహ్యశక్తి జనకమైన సూర్యకాంతి సమక్షంలో అధిక శక్తి కలిగిన సంక్లిష్ట కర్బన పదార్థాలు తయారవుతాయి.

→ కిరణజన్యసంయోగక్రియ విధానంలో పత్రహరితం కలిగిన ఆకుపచ్చని మొక్కలు గ్లూకోజ్ మరియు పిండి పదార్థం వంటి పదార్థాలను ఉత్పత్తి చేయడానికి సూర్యరశ్మి (కాంతి) సమక్షంలో కార్బన్ డై ఆక్సెడ్ మరియు నీటిని వినియోగించుకుంటాయి. కిరణజన్యసంయోగక్రియలో ఆక్సిజన్ వ్యర్థ పదార్థంగా విడుదల అవుతుంది.

→ కిరణజన్యసంయోగక్రియను
AP 10th Class Biology Notes 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 1
అనే సమీకరణ రూపంలో చూపించవచ్చు.

→ కిరణజన్యసంయోగక్రియ జరగడానికి కాంతి, కార్బన్ డై ఆక్సైడ్, నీరు, పత్రహరితం అవసరం.

→ కిరణజన్యసంయోగక్రియ ప్రధానంగా క్లోరోప్లాలో జరుగుతుంది.

→ క్లోరోప్లాస్ట్ లోని గ్రానాలో కాంతిచర్య, స్ట్రోమాలో నిష్కాంతిచర్య జరుగుతుంది.

→ కిరణజన్య సంయోగక్రియలో గ్లూకోజ్, నీరు మరియు ఆక్సిజన్లు అంత్యపదార్థాలుగా ఏర్పడతాయి.

AP 10th Class Biology Notes 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

→ క్లోరోప్లాస్ట్ లో కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు ఈ కింది చర్యలు జరుగుతాయి.
కాంతిశక్తి రసాయనిక శక్తిగా మారటం
నీటి అణువు విచ్ఛిత్తి చెందడం
కార్బన్ డై ఆక్సైడ్ కార్బోహైడ్రేట్స్ గా క్షయకరణం చెందటం

→ ఇతర జీవులు తయారుచేసిన సంక్లిష్ట పదార్థాలను ఆహారపదార్థాలుగా తీసుకోవడమే పరపోషణ.

→ పోషణల పద్ధతులు ఆహారపదార్థాల లభ్యత పై మరియు ఆహారం పొందే విధానంపై ఆధారపడి ఉంటాయి.

→ కొన్ని ఏక కణజీవులలో శరీర ఉపరితలం నుండి ఆహారం సేకరించినప్పటికీ, జీవి సంక్లిష్టత పెరిగేకొలది వివిధ భాగాలు ప్రత్యేక విధులు నిర్వహించడానికి వీలుగా రూపొందాయి.

→ సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లిపిడ్లు సరళ అణువులుగా ఎంజైమ్స్ సహాయంతో విడగొట్టబడి, శరీరంలో శోషణకు అనువుగా మార్చే ప్రక్రియను ‘జీర్ణక్రియ’ అంటారు.

→ మానవునిలో ఆహారం తిన్న తరువాత అది వివిధ దశలలో జీర్ణాశయ గ్రంథుల ద్వారా స్రవించబడిన ఎంజైమ్ లచే విడగొట్టబడుతుంది. జీర్ణమైన ఆహారం చిన్నప్రేగులో శోషించబడి అక్కడ నుండి ప్రతి కణానికి పంపబడుతుంది.

→ జీర్ణవ్యవస్థలో ఆహారనాళంతో పాటుగా అనేక అనుబంధ అవయవాలు, జీర్ణరసగ్రంథులు ఉంటాయి. మానవుని జీర్ణవ్యవస్థ కింది విధులను నిర్వహిస్తుంది.

→ అంతరగ్రహణం : ఆహారం తీసుకోవడం

→ జీర్ణక్రియ : సంక్లిష్ట పదార్థాలు ఎంజైమ్ సహాయంతో సరళ పదార్థాలుగా మారతాయి. వాటిని శరీరం ఉపయోగించుకుంటుంది.

→ శోషణ : జీర్ణమైన ఆహారం ఆహార నాళం గుండా ప్రధానంగా చిన్న ప్రేగుల గుండా ప్రయాణించేటప్పుడు ప్రసరణ వ్యవస్థలోకి ఆహారం చేరడాన్ని “శోషణ” అంటారు.

→ మలవిసర్జన : జీర్ణంకాని ఆహారాన్ని పాయువు ద్వారా బయటికి పంపడం.

→ జీవక్రియలలో కీలకపాత్ర వహించే కర్బన పోషక పదార్థాలను విటమిన్లు అంటారు. ఇవి రెండు రకాలు :
1. నీటిలో కరిగేవి : బి కాంప్లెక్స్ మరియు సి విటమిన్
2. కొవ్వులలో కరిగేవి : ఎ,డి,ఇ మరియు కె విటమిన్లు.

AP 10th Class Biology Notes 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

→ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషకాలు లోపించిన ఆహారాన్ని తీసుకోవడాన్ని పోషకాహార లోపం అంటారు.

→ పోషకాహార లోపం వలన కలిగే వ్యాధులను న్యూనతా వ్యాధులు అంటారు. ఉదా : క్వాషియార్కర్

→ ఆహారంలో ప్రోటీన్స్ లోపం వలన క్వాషియార్కర్ వ్యాధి కలుగుతుంది. ఈ వ్యాధి ఉన్న పిల్లలలో పెరుగుదల మందగించి దేహభాగాలు ఉబ్బి ఉంటాయి.

→ ప్రోటీన్స్ మరియు కేలరీల రెండింటి లోపం వలన ‘మెరాస్మస్’ వ్యాధి కలుగుతుంది. దీని వలన శిశువు, శుష్కించి ఎండిపోయినట్లు ఉంటాడు.

→ శరీర బరువులో 60% కంటే అధిక బరువు కొవ్వుల వలన కలిగితే దానిని స్థూలకాయత్వం అంటారు. అధిక కేలరీలు గల ఆహారం తీసుకోవటం దీనికి ఒక కారణం.

→ సరైన ఆహార అలవాట్లు, పోషక విలువలపై అవగాహన పెంచుకోవటం వలన మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.

→ గ్లూకోజ్ : సరళ కార్బోహైడ్రేట్ పిండిపదార్థం యొక్క సరళ రూపము. దీని ఫార్ములా C6H12O6

→ పిండిపదార్థం : సంక్లిష్ట కార్బోహైడ్రేడ్ జీవులకు ప్రధాన స్థూల పోషకం (CHO)

→ సెల్యులోజ్ : వృక్షకణ కవచాలలో ఉండే ఒక రకమైన కార్బోహైడ్రేట్ దృఢత్వాన్ని ఇస్తుంది.

→ హరితరేణువు : కిరణజన్య సంయోగక్రియ నిర్వహించు కణాంగము.

→ గ్రానా : హరితరేణువులోని థైలకాయిడ్స్ దొంతర.

→ సోమా : హరితరేణువులోని మాత్రిక.

→ కాంతిచర్య : కిరణజన్యసంయోగక్రియ మొదటి దశ. గ్రానాలో జరుగుతుంది. కాంతి శక్తి అవసరం.

→ నిష్కాంతి చర్య : కిరణజన్యసంయోగక్రియలోని రెండవ దశ సోమాలో జరుగుతుంది. కాంతితో ప్రమేయం లేదు.

→ స్వయం పోషణ : జీవి స్వయంగా పోషకాలను తయారుచేసుకొనే ప్రక్రియ.

→ పరపోషణ : ఇతర జీవుల నుండి పోషకాలను పొందే ప్రక్రియ.

→ పరాన్నజీవ పోషణ : చూషకాలు లేదా ఇతర ఏదేని భాగాల ద్వారా మొక్కలు ఆహారాన్ని ఆతిథేయి కణాల నుండి సంగ్రహించే పోషణనే పరాన్నజీవ పోషణ అంటాం.

AP 10th Class Biology Notes 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

→ హాస్టోరియా : వృక్ష పరాన్న జీవులలో ఉండే వేర్లు. ఇవి అతిథేయి నుండి ఆహారాన్ని గ్రహిస్తాయి.

→ ఆహారనాళం : జీర్ణవ్యవస్థలో నోటి నుండి జీర్ణాశయం వరకు ఉండే పొడవాటి నాళము.

→ లాలాజల గ్రంథులు : ఇవి నోటిలో ఉండే మూడు జతల జీర్లగ్రంథులు. లాలాజలాన్ని స్రవిస్తాయి.

→ పెరిస్టాల్టిక్ చలనం : కండరాల ఏకాంతర కదలిక వలన అవయవాలలో వచ్చే అలల వంటి చలనం.

→ అమైలేజ్ : పిండిపదార్థంపై పనిచేసే జీర్ణఎంజైమ్.

→ టయలిన్ : లాలాజలంలోని ఎంజైమ్. ఇది పిండిపదార్థంపైన పనిచేసి చక్కెరలుగా మార్చుతుంది.

→ పెప్సిన్ : ప్రోటీన్స్ మీద పనిచేసే జీర్ణ ఎంజైమ్. ప్రోటీన్స్ ను పెట్టాన్ గా మార్చును.

→ క్రైమ్ : పాక్షికంగా జీర్ణమైన ఆహారం.

→ సంవరిణి కండరాలు : జీర్ణవ్యవస్థలో ఆహార ప్రసరణను నియంత్రించే కండరాలు.

→ జీర్ణక్రియ : సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళ శోషణ పదార్థాలుగా మార్చే ప్రక్రియ.

→ క్లోమం : ఆంత్రమూలం వంపులో ఉండే ఆకువంటి జీర్ణగ్రంథి. క్లోమరసాన్ని స్రవిస్తుంది.

→ ఎంజైమ్ : జీర్ణక్రియను నిర్వహించే రసాయన పదార్దములు. ఇవి జీర్లగ్రంథులచే ఉత్పత్తి కాబడతాయి.

→ పైత్యరసం : కాలేయంచే ఉత్పత్తి కాబడే జీర్ణరసము. దీనిలో ఎటువంటి ఎంజైమ్స్ ఉండవు.

→ లైపేజ్ : కొవ్వుల జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్. కొవ్వులను కొవ్వు ఆమ్లాలుగా, గ్లిజరాల్ గా మార్చుతుంది.

→ కొవ్వులు : ఘనరూప నూనెలను కొవ్వులు అంటారు. ఇవి అధిక శక్తిని ఇచ్చే స్థూల పోషకాలు.

→ కాలేయం : జీర్ణవ్యవస్థలోని పెద్ద గ్రంథి. పైత్యరసాన్ని స్రవిస్తుంది.

→ ఎమల్సీకరణం : పైత్యరసం వలన కొవ్వు అణువులు విచ్ఛిన్నం చెంది, చిన్న అణువులుగా మారే ప్రక్రియ.

AP 10th Class Biology Notes 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

→ క్వాషియార్కర్ : ప్రోటీన్స్ లోపం వలన ఏర్పడే న్యూనతావ్యాధి. పెరుగుదల మందగించి, దేహభాగాలు ఉబ్బుతాయి.

→ మెరాస్మస్ : ప్రోటీన్స్ మరియు కేలరీల పోషకాహార లోపం వలన ఏర్పడే వ్యాధి. పిల్లలు బక్కపల్చగా ఎండినట్లు ఉంటారు.

→ సూక్ష్మచూషకాలు : చిన్నప్రేగు లోపలితలంలో ఉండే వ్రేళ్ళ వంటి నిర్మాణాలు. ఇవి శోషణతల వైశాల్యాన్ని పెంచును.

→ విటమిన్ : జీవక్రియలో కీలకపాత్ర వహించే కర్బన సూక్షపోషకాలు. కొన్ని ఆహారం ద్వారా లభిస్తే, మరికొన్ని బాక్టీరియాచే సంశ్లేషించబడతాయి.

→ స్థూలకాయత్వం : అధిక కేలరీలు తీసుకోవటం వలన శరీర బరువులో 60% కంటే ఎక్కువ బరువు, కొవ్వుల వలన కలిగ అనారోగ్యస్థితి.

→ శోషణ : జీర్ణమైన సరళపదార్థాలు రక్తంలోనికి గ్రహింపబడటాన్ని శోషణ అంటారు. ఇది ప్రధానంగా చిన్న ప్రేగులలో జరుగుతుంది.

AP 10th Class Biology Notes 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 2