Students can go through AP Board 10th Class Biology Notes 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ to understand and remember the concept easily.
AP Board 10th Class Biology Notes 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ
→ నాడీస్పందన హృదయస్పందనకు సమానంగా ఉంటుంది. ఏ పరికరం సహాయం లేకుండానే మనం హృదయస్పందనను కొలవవచ్చు.
→ మొట్టమొదటిసారిగా స్టెతస్కోపును “రెని లెన్నెక్’ అను శాస్త్రవేత్త కనుగొన్నాడు.
→ గుండె రెండు హృదయావరణత్వచాలచే ఆవరింపబడి ఉంటుంది. వీటి మధ్య ఉండే ద్రవం గుండెను అఘాతాల నుండి కాపాడుతుంది.
→ గుండెకు అతికి ఉన్న రక్తనాళాలలో దృఢంగా ఉండేవి ధమనులు. వీటిలో ధమనీచాపం శరీర భాగాలకు పుపుస ధమని, ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకుపోతుంది.
→ తక్కువ దృఢత్వం కలిగిన నాళాలను సిరలు అంటారు. పూర్వపరమహాసిరలు శరీర ఊర్ధ్వ, అధోభాగాల నుండి రక్తాన్ని సేకరిస్తాయి. పుపుస సిరలు ఊపిరితిత్తుల నుండి రక్తాన్ని సేకరిస్తాయి.
→ గుండెలో నాలుగు గదులుంటాయి. పూర్వభాగంలో రెండు కర్ణికలు, పరభాగంలో రెండు జఠరికలు ఉంటాయి.
→ ఒక వైపున గల కర్ణికాజఠరికలు కర్ణికాజఠరికా రంధ్రం ద్వారా కలుపబడి ఉంటాయి. కర్ణికాంతర విభాజకం అనే కండర పొర కర్ణికలనూ, జఠరికాంతర విభాజకం జఠరికలను వేరుచేస్తుంది.
→ కర్ణికలు, జఠరికల మధ్య రంధ్రాలుంటాయి. ఈ రంధ్రాలను కర్ణికా, జఠరికా కవాటాలు మూసి ఉంచుతాయి.
→ ధమనీ చాపం, పుపుస ధమనిలో కూడా కవాటాలుంటాయి.
→ గుండె కుడివైపు భాగం శరీరభాగాల నుండి రక్తాన్ని గ్రహించి ఊపిరితిత్తులకు పంపుతుంది.
→ గుండె ఎడమవైపు భాగం ఊపిరితిత్తుల నుండి మంచి రక్తాన్ని గ్రహించి శరీరభాగాలకు పంపుతుంది.
→ పుపుస ధమని తప్ప మిగిలిన ధమనులన్నీ ఆమ్లజనియుత రక్తాన్ని శరీరభాగాలకు సరఫరా చేస్తాయి. పుపుస సిర తప్ప మిగిలిన సిరలన్నీ ఆమ్లజని రహిత రక్తాన్ని గుండెకు చేరుస్తాయి.
→ గుండె ఒక సంకోచం వెంటనే ఒక యథాపూర్వస్థితికి (సడలింపు) రావడాన్ని హార్దిక వలయం అంటారు.
→ శరీర అవయవాలకు చేరేటపుడు రక్తం ఒక్కసారి మాత్రమే గుండెకు చేరడాన్ని ఏక వలయ ప్రసరణ అనీ, రెండుసార్లు రావడాన్ని ద్వంద్వవలయ ప్రసరణ అనీ అంటారు.
→ K విటమిన్ లోపం ఉన్నవారిలో రక్తస్కందనం జరగదు.
→ మొక్కలు నేలలోని లవణాలు కలిగిన నీటిని ద్రవాభిసరణ పద్ధతిలో వేళ్ళ ద్వారా గ్రహిస్తాయి.
→ నీరు దారువు ద్వారా, పోషక పదార్థాలు పోషక కణజాలం ద్వారా సరఫరా అవుతాయి.
→ మొక్కలలో బాష్పోత్సేకానికి, ప్రసరణ వ్యవస్థకు మధ్య సంబంధం ఉంటుంది.
→ జీవశాస్త్రవేత్తలు ఎఫిడ్ సహాయంతో పోషక కణజాలాల గురించి తెలుసుకోగలిగారు.
→ ఏపుగా పెరిగిన మొక్కజొన్న వారానికి 15 లీటర్ల నీటిని బాష్పోత్సేకం ద్వారా వాతావరణంలోనికి పంపుతుంది.
→ మానవునిలో ఒక మిల్లీలీటరు రక్తం గుండె నుండి కాలి చివరి వరకు వెళ్ళి తిరిగి గుండెను చేరటానికి సుమారు 2 మీటర్ల దూరం ప్రయాణించాలి. దీనికి 60 సెకన్ల సమయం పడుతుంది.
→ రక్త పీడనాన్ని స్పిగ్మోమానోమీటరుతో కొలుస్తారు.
→ మొక్కలలో నాళికాపుంజాలు ప్రసరణ క్రియను నిర్వహిస్తాయి.
→ ప్రసరణ : శరీరభాగాలకు కావలసిన పదార్థాలను రవాణా చేసే ప్రక్రియ.
→ కర్ణికలు : గుండెలోని పై గదులను “కర్ణికలు” అంటారు.
→ జఠరికలు : గుండెలోని క్రింది గదులను “జఠరికలు” అంటారు.
→ నాడీ స్పందన : హృదయ స్పందన వలన మణికట్టు వద్ద రక్తనాళాలలో గుర్తించే అలజడి.
→ ధమని : గుండె నుండి రక్తాన్ని తీసుకెళ్ళే రక్తనాళాన్ని “ధమని” అంటారు.
→ సిర : గుండెకు రక్తాన్ని తీసుకొని వచ్చే రక్తనాళాన్ని “సిర” అంటారు.
→ స్టెతస్కోపు ఆ: హృదయ స్పందనను పరిశీలించటానికి ఉపయోగించే పరికరము.
→ బృహద్ధమని : ఎడమ జఠరిక నుండి బయలుదేరే పెద్ద రక్తనాళాన్ని “బృహద్ధమని లేదా ధమనీ చాపం” (Aorta) అంటారు.
→ రక్తకేశనాళిక : రక్తనాళం చీలిపోయి రక్తకేశనాళికలుగా మారుతుంది. ఇవి పరిమాణాత్మకంగా చిన్నవిగా ఉంటాయి. గోడలు పలుచగా ఉంటాయి.
→ సిస్టోల్ : గుండె సంకోచించే దశను “సిస్టోల్” అంటారు.
→ డయాస్టోల్ : గుండె సడలే స్థితిని “డయాస్టోల్” అంటారు. హార్దిక వలయం గుండె ఒక సంకోచం వెంటనే పూర్వస్థితికి రావడాన్ని “హార్దిక వలయం” అంటారు.
→ రక్తపీడనం : రక్తం రక్తనాళాలలో ప్రయాణించేటపుడు కలిగించే పీడనాన్ని “రక్తపీడనం” అంటారు.
→ శోషరసం : రక్తం నుండి కణజాలంలోనికి విసరణ చెందే కణాంతర ద్రవపదార్థాన్ని “శోషరసం” అంటారు. ఇది నిర్మాణాత్మకంగా రక్తాన్ని పోలి ఉంటుంది. కాని రక్తకణాలు ఉండవు.
→ ఏకప్రసరణ వలయం : శరీర అవయవాలు చేరేటప్పుడు రక్తం ఒకసారి మాత్రమే గుండెకు చేరడాన్ని “ఏక ప్రసరణ వలయం” అంటారు.
→ ద్విప్రసరణ వలయం : శరీర అవయవాలకు చేరేటప్పుడు రక్తం రెండు సార్లు గుండెకు చేరడాన్ని “ద్వి ప్రసరణ వలయం” అంటారు.
→ రక్త స్కందనము : శరీరం నుండి బయటకు వచ్చిన రక్తము గడ్డకట్టే ధర్మాన్ని “రక్తస్కందనం” అంటారు.
→ స్పిగ్మోమానోమీటర్ : రక్త పీడనాన్ని కొలిచే పరికరము.
→ ప్రోత్రాంబిన్ : రక్తంలోని ప్రోటీన్, రక్తస్కందనానికి తోడ్పడుతుంది.
→ త్రాంబిన్ : థ్రాంబోకైనేజ్ చర్య వలన ప్రోత్రాంబిన్ త్రాంబిన్‌గా మారుతుంది.
→ ఫైబ్రినోజన్ : రక్తంలోని ద్రవరూప పదార్థం. త్రాంబిన్ చర్య వలన ఘనరూపంలోనికి మారుతుంది.
→ ఫైబ్రిన్ : ఫైబ్రినోజన్, త్రాంబిన్ చర్య వలన ఫైబ్రగా మారుతుంది. ఇవి దారపుపోగుల వంటి నిర్మాణాలు.
→ మూలకేశాలు : వేర్ల నుండి ఏర్పడే సన్నని వెంట్రుకల వంటి నిర్మాణాలు. నీరు, లవణ శోషణలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.
→ ప్రథమమూలం : వేరు వ్యవస్థను ఏర్పరిచే పిండనిర్మాణం.
→ వేరుపీడనం : వేరు నీటిని పీల్చుకొన్నప్పుడు వెలువర్చే పీడనాన్ని “వేరు పీడనం” అంటారు.
→ మొక్కల పోషకాలు : మొక్కల పెరుగుదలకు, అభివృద్ధికి అవసరమయ్యే రసాయన పదార్థాలు.
→ దారువు : మొక్కలలో నీటి రవాణాకు తోడ్పడే ప్రసరణ కణజాలం.
→ పోషక కణజాలం : మొక్కలలో ఆహారపదార్థాల రవాణాకు తోడ్పడే ప్రసరణ కణజాలం.
→ నాళికాపుంజాలు : మొక్కలలోని ప్రసరణ కణజాలాన్ని “నాళికాపుంజాలు” అంటారు. ఇవి దారువు మరియు పోషక కణజాలాన్ని కలిగి ఉంటుంది.