AP Board 5th Class Maths Solutions 2nd Lesson నా సంఖ్యా ప్రపంచం

Andhra Pradesh AP Board 5th Class Maths Solutions 2nd Lesson నా సంఖ్యా ప్రపంచం Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 5th Class Maths Solutions Chapter 2 నా సంఖ్యా ప్రపంచం

రేఖ మరియు హర్షలు 5వ తరగతి చదువు తున్నారు. వాళ్ళ తరగతి ఉపాధ్యాయుడు మీ గ్రామ/వార్డు, మండల మరియు జిల్లా జనాభా సమాచారాన్ని గ్రామ/వార్డు పెక్రటరీ మంచి సేకరించమని చెప్పారు. వారిద్దరూ గ్రామ పంచాయితీకి వెళ్ళి జవాభా వివరాలను సేకరించారు.

AP Board 5th Class Maths Solutions 2nd Lesson నా సంఖ్యా ప్రపంచం 1

i. కటారుపల్లి గ్రామ జనాభా ఎంత ?
జవాబు.
కటారుపల్లి గ్రామ జనాభా = 3,391 .

ii. గాండ్ల పెంట మండల జనాభా ఎంత ?
జవాబు. గాండ్ల పెంట మండల జనాభా = 24,118.

iii. మీలో ఎవరైనా అవంతపురం జిల్లా జనాభా ఎంతో చెప్పగలరా ?
జవాబు.
అనంతపురం జిల్లా జనాభా = 40,83,315.

3,00,000 = మూడు లక్షలు
4,00,000 = నాలుగు లక్షలు
5,00,000 = ఐదు లక్షలు
6,00,000 = ఆరు లక్షలు
7,00,000 = ఏడు లక్షలు
8,00,000 = ఎనిమిది లక్షలు
9,00,000 = తొమ్మిది లక్షలు
4,50,000 = నాలుగు లక్షల
యాభై వేలు 4,53,258 మ వాలుగు లక్షల యాభై మూడువేల రెండు వందల యాభై ఎనిమిది అని చదువుతాము. 7,49,192 మ ఇలా చదువుతాము ఏడు లక్షల వలభై తొమ్మిదివేల మాట తొంభై రెండు.

AP Board 5th Class Maths Solutions 2nd Lesson నా సంఖ్యా ప్రపంచం

ఇవి చేయండి: (TextBook Page No.29)

ప్రశ్న 1.
ఈ సంఖ్యలను చదవండి. 3,51,645 మరియు 9,38,715.
జవాబు.
3,51,645 – మూడు లక్షల యాభై ఒక్కవేల ఆరువందల నలభై ఐదు
9,38,715 – తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల పదిహేను

ప్రశ్న 2.
ఏవైనా ఐదు, ఆరు అంకెల సంఖ్యలు రాయండి. చదవండి.
జవాబు.
6,89,412 – ఆరు లక్షల ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు
7,98,521 – ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఒకటి.
8,89,215 – ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల పదిహేను
5,98,536 – ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదువందల ముప్పై ఆరు
4,63,748 – నాలుగు లక్షల అరవై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది

20,00,000 ఇలా చదవాలి ఇరవై లక్షలు
30,00,000 ఇలా చదవాలి ముప్పై లక్షలు
40,00,000 ఇలా చదవాలి వలభై లక్షలు
50,00,000 ఇలా చదవాలి యాభై లక్షలు
60,00,000 ఇలా చదవాలి అరవై లక్షలు
70,00,000 ఇలా చదవాలి డెబ్బై లక్షలు

ఇవి చేయండి: (TextBook Page No.29)

ప్రశ్న 1.
ఈ సంఖ్యలను చదవండి. 65,14,825 మరియు 29, 36,429
జవాబు.
65,14,825 – అరవై ఐదు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు
29, 36,429 – ఇరవై తొమ్మిది లక్షల ముప్ఫై ఆరు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది

ప్రశ్న 2.
ఏవైనా ఐదు ఏడు అంకెల సంఖ్యలను రాయండి. చదవండి.
జవాబు.
76,23,652 – డెబ్బై ఆరు లక్షల ఇరవై మూడు వేల ఆరు వందల యాభై రెండు
87,63,723 – ఎనభై ఏడు లక్షల అరవై మూడు వేల ఏడు వందల ఇరవ మూడు
95,76,842 – తొంభై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల నలభై రెండు
57,64,965 – యాభై ఏడు లక్షల ఆరవై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు
43,76,872 – నలభై మూడు లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు

AP Board 5th Class Maths Solutions 2nd Lesson నా సంఖ్యా ప్రపంచం

అభ్యాసం 1:

ప్రశ్న 1.
ఈ క్రింది సంఖ్యలను అక్షరాలలో రాయండి.
అ) 1,25,602
జవాబు.
ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరువందల రెండు

ఆ) 4,50,536
జవాబు.
నాలుగు లక్షల యాభై వేల ఐదు వందల ముప్ఫై ఆరు

ఇ) 80,00,005
జవాబు.
ఎనభై లక్షల ఐదు

ఈ) 5,58,942
జవాబు.
ఐదు లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు

ఉ) 95,75,240
జవాబు.
తొంభై ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల నలభై

ప్రశ్న 2.
ఈ క్రింది వాటిని సంఖ్యలలో రాయండి.
a) ఐదు లక్షల ఇరవై నాలుగు వేల మూడు వందల తొంభై ఆరు
జవాబు.
5,24,396

b) పద్నాలుగు లక్షల ముప్పై ఐదువేల పదిహేను
జవాబు.
14,35,015

c) డెబ్బై నాలుగు లక్షల అరవై రెండు వేల నాలుగు వందల అరవై ఐదు
జవాబు.
74,62,465

ప్రశ్న 3.
చదివి సమాధానాలు రాయండి.
వేమన ఒక ఇంటిని 45,87,000 కు మరియు పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని18,56,000 కు కొన్నాడు. ఇందుకు గాను 64,43,000 చెల్లించాడు.

ఆ ఇంటి విలువ అక్షరాలలో ………………………………………
జవాబు.
వలభై ఐదు లక్షల ఎవభై ఏడువేలు

ఖాళీ స్థలం విలువ అక్షరాలలో …………………………………….
జవాబు.
పద్దెనిమిది లక్షల యాభై ఆరు వేలు

ఇల్లు మరియు ఖాళీ స్థలాల మొత్తం ధర అక్షరాలలో …………………………………….
జవాబు.
అరవై వాలుగు లక్షల నలభై మూడు వేలు.

AP Board 5th Class Maths Solutions 2nd Lesson నా సంఖ్యా ప్రపంచం

ఇవి చేయండి: (TextBook Page No.37)

ప్రశ్న 1.
కింది సంఖ్యలను ప్రామాణిక రూపం మరియు అక్షర రూపంలో రాయండి.
అ) 721594
జవాబు.
721594 యొక్క ప్రామాణిక రూపం= 7,21,594

ఆ) 4632584
జవాబు.
4632584 యొక్క ప్రామాణిక రూపం = 46,32,584

ఇ) 73156324
జవాబు.
73156324 యొక్క ప్రామాణిక రూపం = 7,31,56,324

ఈ) 407523436
జవాబు.
407523436 యొక్క ప్రామాణిక రూపం = 40,75,23,436

ప్రశ్న 2.
కింది సంఖ్యలను విస్తృత రూపంలో రాయండి.

అ) 7,34,254
జవాబు.
7,34,254 = 700000 + 30000 + 200 + 50 + 4

ఆ) 42,63,456
జవాబు.
42,63,456 = 4200000+ 60000 + 3000 + 400 + 50 + 6

ఇ) 40,63,52,456
జవాబు.
40,63,52,456 = 400000000+0000000+ 6000000 + 300000 + 50000 + 2000 + 400 + 50 + 6

ఈ) 73,45,46,800
జవాబు.
73,45,46,800 = 700000000 + 30000000 + 4000000 + 500000 + 40000 + 6000 + 800 + 00 + 0

పూసల చట్రంలో పూసలతో ప్రాతినిధ్య పరచబడిన సంఖ్యకు విస్తృత, సంక్షిప్త మరియు అక్షర రూపాలను రాయండి.

AP Board 5th Class Maths Solutions 2nd Lesson నా సంఖ్యా ప్రపంచం 2

ప్రామాణిక రూపం : 56,04,26,325
విస్తృత రూపం : 50,00,00,000 + 1,00,00,000 + 00,00,000 + 4,00,000 + 20,000 + 6,000 + 300 + 20 + 5
అక్షరరూపం : యాభై ఆరు కోట్ల నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు

ఇవి చేయండి: (TextBook Page No. 39)

ప్రశ్న 1.
కింది సంఖ్యలకు సరిపోయే పూసల చట్రం మీ నోట్ బుక్ లో గీయండి.

1. 54,56,705
జవాబు.

AP Board 5th Class Maths Solutions 2nd Lesson నా సంఖ్యా ప్రపంచం 3

2.6,27,00,045
జవాబు.

AP Board 5th Class Maths Solutions 2nd Lesson నా సంఖ్యా ప్రపంచం 5

3. 72,61,50,305
జవాబు.

AP Board 5th Class Maths Solutions 2nd Lesson నా సంఖ్యా ప్రపంచం 5

AP Board 5th Class Maths Solutions 2nd Lesson నా సంఖ్యా ప్రపంచం

ప్రశ్న 2.
కింది అక్షర రూపంలోని సంఖ్యలను ప్రామాణిక రూపంలో రాయండి.

అ) ఇరవై ఐదు లక్షల ఐదు వేల ఎనిమిది వందల నలభై ఒకటి
జవాబు.
……. 25,05,841…………

ఆ) ఐదుకోట్ల ఇరవై లక్షల ఆరు వేల రెండు వందల ఐదు
జవాబు.
……… 5,20,06,205………..

ఇ) తొంభై ఒక్క కోట్లు అరవై ఏడు లక్షల ముప్ఫై ఐదు వేల ఎనిమిది వందల నలభై రెండు
జవాబు.
…………91,67,35,842……………

ప్రశ్న 3.
కింది విస్తృత రూపంలో ఉన్న సంఖ్యలను ప్రామాణిక రూపంలో రాయండి.
అ) 60,00,000 + 0 + 50,000 + 1,000 + 0 + 0 + 8 =
జవాబు.
60,51,008

ఆ) 70,00,00,000 + 30,000 + 5,000 + 400 + 3 =
జవాబు.
70,00,30,543

ఇ) 20,00,00,000+ 80,00,000 + 40,000 + 500 + 1 =
జవాబు.
20,80,40,501

అభ్యాసం 2:

ప్రశ్న 1.
కింది సంఖ్యలను కామాలను (.) ఉపయోగించి ప్రామాణిక రూపంలో హిందూ-అరబిక్ సంఖ్యారూపంలో రాయండి.
అ) 24536192
జవాబు.
24536192 యొక్క ప్రామాణిక రూపము = 2,45,36,192

ఆ) 512483427
జవాబు.
512483427 యొక్క ప్రామాణిక రూపము = 51,24,83,427

ఇ) 205030401
జవాబు.
205030401 యొక్క ప్రామాణిక రూపము = 20,50,30,401

ఈ) 900000100
జవాబు.
900000100 యొక్క ప్రామాణిక రూపము = 90,00,00,100

AP Board 5th Class Maths Solutions 2nd Lesson నా సంఖ్యా ప్రపంచం

ప్రశ్న 2.
కింది సంఖ్యలను అక్షర రూపంలో రాయండి.

అ) 7,29,47,542
జవాబు.
ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల నలభై ఏడు వేల ఐదు వందల నలభై రెండు

ఆ) 93,53,26,491
జవాబు.
తొంభై మూడు కోట్ల యాభై మూడు లక్షల ఇరవై ఆరువేల నాలుగు వందల తొంభై ఒకటి.

ఇ) 70,30,10,400
జవాబు.
డెబ్బై కోట్ల ముప్ఫై లక్షల పదివేల నాలుగు వందలు.

ఈ) 30,00,02,000
జవాబు.
ముప్ఫై కోట్ల రెండు వేలు

ప్రశ్న 3.
కింది సంఖ్యలను విస్తరణ రూపంలో రాయండి.
అ) 3,49,85,249 =
జవాబు.
3,00,00,000 + 40,00,000 + 9,00,000 + 80,000 + 5,000 + 200 + 40 + 9

ఆ) 72,47,27,144 =
జవాబు.
70,00,00,000 + 2,00,00,000 + 40,00,000 + 7,00,000 + 20,000 + 7,000 + 100 + 40 + 4

ఇ) 50,23,80,050 =
జవాబు.
50,00,00,000 + 20,00,000 + 3,00,000 + 80,000 + 50

ఈ) 90,07,00,020 =
జవాబు.
90,00,00,000 + 7,00,000 + 20

ప్రశ్న 4.
కింది సంఖ్యలను ప్రామాణిక రూప సంఖ్యలుగా రాయండి.

అ) నలభై ఐదు లక్షల ముప్పై మూడు వేల ఆరువందల ఎనభై నాలుగు =
జవాబు.
45,33,684

ఆ) ఇరవై ఐదు కోట్ల డెబ్బై వేల ఐదు వందల – రూపాయలు =
జవాబు.
25,00,70,500
ఇ) ఐదు కోట్లు + 20 లక్షలు + 9 లక్షలు + 40 వేలు + 2 వేలు + 1 వంద+ 2 పదులు + 8 ఒకట్లు =
జవాబు.
5,29,42,128

ఈ) 90 కోట్లు + 7 కోట్లు + 80 లక్షలు + 50 . , . వేలు + 4 వందలు + ఒకటి , =
జవాబు.
97,80,50,041

ఉ) 20,00,00,000 + 4,00,00,000 + 50,00,000 + 3,00,000 + 40,000 + 5,000 + 300+ 70+ 9 ఆ =
జవాబు.
24,53,45,379

ఊ) 80,00,00,000 + 5,000 + 3 =
జవాబు.
80,00,5,003

ప్రశ్న 5.
కింది వాటిని చదివి సమాధానాలు రాయండి.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీల జనాభా 9,49,85,062 పురుష జనాభా 10,45,96,415. (2011 జనాభా లెక్కల ప్రకారం) రాష్ట్ర మొత్తం జనాభా 19,95,81,477.

అ) ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని స్త్రీల జనాభాను అక్షర రూపంలో ‘రాయండి.
జవాబు.
స్త్రీల జనాభా = తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల అరవై రెండు

ఆ) పురుష జనాభాను విస్తరణ రూపంలో రాయండి.
జవాబు.
పురుష జనాభా = 10,00,00,000 + 40,00,000 + 5,00,000 + 90,000 + 6,000 + 400 + 10 + 5

ఇ) రాష్ట్రం మొత్తం జనాభాను అక్షర రూపంలోను, విస్తరణ రూపంలోను రాయండి.
జవాబు.
మొత్తం జనాభా = పందొమ్మిది కోట్ల, తొంభై ఐదు లక్షల, ఎనభై ఒక వేల నాలుగు వందల డెబ్భై ఏడు
= 10,00,00,000 + 9,00,00,000 +90,00,000 + 5,00,000 + 80,000 + 1,000 + 400 + 70 + 7

ప్రశ్న 6.
సూర్యునికి, భూమికి మధ్య దూరం పద్నాలుగు కోట్ల . తొంభై ఐదు లక్షల తొంభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై కిలోమీటర్లు.
పై సంఖ్యలను ప్రామాణిక రూపంలోను, విస్తరణ రూపంలోను రాయండి.
జవాబు.
ప్రామాణిక రూపం: 14,95,97,870
విస్తరణ రూపం : 10,00,00,000 + 4,00,00,000 +90,00,000 + 5,00,000 + 90,000 + 7,000 + 800 + 70.

AP Board 5th Class Maths Solutions 2nd Lesson నా సంఖ్యా ప్రపంచం

ఇవి చేయండి: (TextBook Page No.45)

కింద గీత గీయబడిన అంకెల యొక్క స్థానం, స్థాన విలువ, సహజ విలువను రాయండి.
అ) 43,84,304
జవాబు.
స్థానం = లక్షలు,
స్థాన విలువ = 3,00,000
సహజ విలువ = 3

ఆ) 43,67,245
జవాబు.
స్థానం = పదివేలు
స్థాన విలువ = 60,000
సహజ విలువ = 6

ఇ) 68,98,23,052
జవాబు.
స్థానం = పది లక్షలు
స్థాన విలువ = 90,00,000
సహజ విలువ = 9

ఈ) 47,63,05,100
జవాబు.
స్థానం = పది కోట్లు
స్థాన విలువ = 40,00,00,000
సహజ విలువ = 4

ఇవి చేయండి: (TextBook Page No.47)

అ. 4, 0, 3, 6, 2, 5మరియు 9 లను ఉపయోగించి 7అంకెల అతి పెద్ద సంఖ్య మరియు అతి చిన్న సంఖ్యను రాయండి.
జవాబు.
ఇచ్చిన అంకెలు 4, 0, 3, 6, 2, 5 మరియు 9
అతి పెద్ద సంఖ్య = 9654320
అతి చిన్న సంఖ్య = 2034569

ఆ. 4, 1, 0 మరియు 3 లను ఉపయోగించి 6 అంకెల … అతి పెద్ద మరియు అతి చిన్న సంఖ్యలమ రాయండి. (ప్రతి అంకెన కనీసం ఒకసారైనా ఉపయోగించాలి)
జవాబు.
ఇచ్చిన అంకెలు 4, 1, 0 మరియు 3
అతి చిన్న సంఖ్య = 100344
అతి పెద్ద సంఖ్య = 443310

AP Board 5th Class Maths Solutions 2nd Lesson నా సంఖ్యా ప్రపంచం

ఇవి చేయండి: (TextBook Page No.51)

ప్రశ్న 1.
ఇచ్చిన సంఖ్యలను గుర్తులను < లేదా > ఉపయోగించి ఖాళీలను పూరించండి.
అ. 48,34,635 _____ 2,84,00,00
జవాబు.
<

ఆ. 9,63,84,312 _____ 9,24,94,989
జవాబు.
>

ఇ. 42,35,68,943 _____ 42,35,19,045
జవాబు.
>

ఈ. 25,25,25,252 _____ 25,25,25,525
జవాబు.
<

ప్రశ్న 2.
కింది సంఖ్యలను ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో అమర్చండి.
2345678, 607810542, 694317, 84120079, 498900351, 902347016
జవాబు.
ఆరోహణ క్రమం :
694317 < 2345678 < 84120079 < 498900351 < 607810542 < 902347016

అవరోహణ క్రమం :
902347016 > 607810542 > 498900351 > 84120079 > 2345678 > 694317

అభ్యాసం 3:

ప్రశ్న 1.
కింది వాటిని చేయండి.
అ) కింద గీత గీసిన. అంకెల యొక్క స్థానం, స్థానవిలువ మరియు సహజ విలువలను రాయండి. (హిందూ సంఖ్యామానంలో)

అ) 73,58,942
జవాబు.
స్థానం : పదివేలు
స్థాన విలువ : 50,000
సహజ విలువ : 5.

ఆ) 40,73,35,536
జవాబు.
స్థానం : పదివేలు
స్థాన విలువ : 30,000
సహజ విలువ : 3

ఇ) 82,45,63,125
జవాబు.
స్థానం : లక్షలు
స్థాన విలువ : 5,00,000
సహజ విలువ : 5

ఈ) 64,63,98,524
జవాబు.
స్థానం : పది కోట్లు
స్థాన విలువ : 60,00,00,000
సహజ విలువ : 6

ఆ) 47, ___5,63,251 సంఖ్యలోని ఖాళీలో పరియైన అంకెన పూరించండి. దాని స్థాన విలు 90,00,000?
జవాబు.
47,95,63,251

ఇ) పది కోట్ల స్థానంలో, లక్షల స్థానంలో మరియు పదుల స్థానంలో 3 అంకెమ ఉపయోగించి, మిగిలిన స్థానాలలో ఏదైవ ఒకే అంకెను ఉపయోగించి ఐదు సంఖ్యలను రాయండి.
జవాబు.
i) 30,03,00,030
ii) 31,13,11,131
iii).32,23,11,232
iv) 34,43,44,434
v) 35,53,55,535

ఈ) వేవొక 9 అంకెల సంఖ్యము, వా పది కోట్ల స్థానంలో అంకె వందల స్థానంలోని ఉన్న అంకె కంటే రెండు ఎక్కువ మరియు వేల స్థానంలో ఉన్న అంకె వందల స్థానంలోని అంకె కన్నా 5 ఎక్కువ. న్ా వందల స్థానంలోని అంకె 3 మిగిలిన స్థానాలలో ఒకటి కలదు. అయితే వేవెవరివి ?
జవాబు.
కావలసిన సంఖ్య = 51,11,16,311.

AP Board 5th Class Maths Solutions 2nd Lesson నా సంఖ్యా ప్రపంచం

ప్రశ్న 2.
కింది సమస్యలమ సాధించండి.
అ) 8,3, 9, 2 మరియు 5 అంకెలను పునరావృతం చేయకుండా 5 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య : మరియు చిన్న పంఖ్యము రాయండి.
జవాబు.
ఇచ్చిన సంఖ్యలు = 8, 3, 9, 2 మరియు 5
మిక్కిలి పెద్ద సంఖ్య = 98,532
మిక్కిలి చిన్న సంఖ్య = 23,589

ఆ) 4, 5, 8,7, 2 మరియు 6 అంకెలము పునరావృతం చేయకుండా 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యను మరియు చిన్న సంఖ్యలను రాయండి.
జవాబు.
ఇచ్చిన సంఖ్యలు 4, 5, 8, 7, 2, మరియు 6
మిక్కిలి పెద్ద సంఖ్య = 876542
మిక్కిలి చిన్న సంఖ్య = 245678

ఇ) 1, 5, 3, 8, 6, 4, 7 మరియు 2 అంకెలను పువరావృతం చేయకుండా 8 అంకెల పెద్ద సంఖ్యను, చిన్నసంఖ్యను రాయండి.
జవాబు.
ఇచ్చిన సంఖ్యలు 1, 5, 3, 8, 6, 4, 7 మరియు 2
మిక్కిలి పెద్ద సంఖ్య = 87654321
మిక్కిలి చిన్న సంఖ్య= 12345678

ఈ) 5, 0, 8, 4, 3 మరియు 7 లలో ఏదైన ఒక అంకెను పువరావృతం చేసి, మిగిలిన అంకెలను ఒకసారి మాత్రమే ఉపయోగించి, 7 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య మరియు చిన్నపంఖ్యను రాయండి.
జవాబు.
ఇచ్చిన సంఖ్యలు 5, 0, 8, 4, 3 మరియు 7
మిక్కిలి పెద్ద సంఖ్య = 8875430
మిక్కిలి చిన్న సంఖ్య = 3004578

ఉ) 5, 0, 2 మరియు 1 లను ఉపయోగించి 6 అంకెల మిక్కిలి పెద్ద పరిపంఖ్య మరియు చిన్న సరిసంఖ్యలను రాయండి. ప్రతి అంకెను ఒకసారి అయినా ఉపయోగించాలి.
జవాబు.
ఇచ్చిన సంఖ్యలు 5, 0, 2 మరియు 1
మిక్కిలి పెద్ద సంఖ్య = 552210
మిక్కిలి చిన్న సంఖ్య = 01255

ప్రశ్న 3.
ఖాళీలలో సరియైన గుర్తులను ( > లేదా < =) ” . ఉపయోగించి క్రింది సంఖ్యలను పోల్చండి.
అ. 878393790 _______ 82980758
జవాబు.
>

ఆ. 192849758 _______ 46758490
జవాబు.
>

ఇ. 90020403 _______ 400953400
జవాబు.
<

ఈ. 58694658 _______ 45100857
జవాబు.
>

AP Board 5th Class Maths Solutions 2nd Lesson నా సంఖ్యా ప్రపంచం

ప్రశ్న 4.
కింది సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి.

అ) 2828335; 3537286; 1995764 ; 2989632; 42,86371
జవాబు.
ఆరోహణ క్రమం : 1995764 < 2828335 < 2989632 < 3537286 < 42,86371

ఆ) 1643468735; 102947026; 19385702; 148927131; 109125456
జవాబు.
ఆరోహణ క్రమం : 19385702 < 102947026 < 109125456 < 148927131 < 1643468735

ప్రశ్న 5.
కింది సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయండి.
అ) 2003563; 19872003; 279868; 20016930
జవాబు.
అవరోహణ క్రమం :
20016930> 19872003 > 2003563 > 279868

ఆ) 748932165; 482930456; 69539821; 984326834; 289354124
జవాబు.
అవరోహణ క్రమం :
984326834 > 748932165 > 482930456 > 289354124 > 69539821

ఇవి చేయండి: (TextBook Page No. 57)

ప్రశ్న 1.
కింది సంఖ్యలను ప్రామాణిక రూపంలో రాయండి. అంతర్జాతీయ సంఖ్యామానంలో అక్షరాలలో రాయండి.
అ) 4753625
జవాబు.
4753625 యొక్క ప్రామాణిక రూపం = 4,753,625
నాలుగు మిలియన్ల ఏడు వందల యాభై మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు.

ఆ) 700400300
జవాబు.
700400300 యొక్క ప్రామాణిక రూపం = 700, 400, 300
ఏడువందల మిలియన్ల నాలుగు వందల వేల మూడు వందలు

ఇ) 4250431
జవాబు.
4250431 యొక్క ప్రామాణిక రూపం = 4,250,431
నాలుగు మిలియన్ల రెండు వందల యాభై వేల నాలుగు వందల ముప్పై ఒకటి.

ఈ) 147235857
జవాబు.
147235857 యొక్క ప్రామాణిక రూపం = 147,235,857
నూట నలభై ఏడు మిలియన్ల రెండు వందల ముప్ఫై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఏడు

ప్రశ్న 2.
కింది వాటిని అంతర్జాతీయనంఖ్యామానంలో రాయండి.
అ) మూడు వందల వేలు = __________
జవాబు.
300,000

ఆ) 5 మిలియన్లు = __________
జవాబు.
5,000,000

ఇ) డెబ్భై మిలియన్లు = __________
జవాబు.
70,000,000

ఈ) నాలుగు వందల మిలియన్లు = __________
జవాబు.
400,000,000

ఆలోచించి చెప్పండి: (TextBook Page No.59)

మనము చర్చించుకొన్న ప్రకారం ఒక మిలియన్ అనగా _____ లక్షలు
జవాబు.
10

AP Board 5th Class Maths Solutions 2nd Lesson నా సంఖ్యా ప్రపంచం

అభ్యాసం 4:

ప్రశ్న 1.
కింది సంఖ్యలకు అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం ప్రామాణిక రూపంలో రాసి కామా (.) ఉంచండి.

అ) 4528973
జవాబు.
4528973 యొక్క ప్రామాణిక రూపం = 4,528,973

ఆ)53547652
జవాబు.
53547652 యొక్క ప్రామాణిక రూపం = 53,547,652

ఇ) 901247381
జవాబు.
901247381 యొక్క ప్రామాణిక రూపం = 901,247,381

ఈ) 200200200
జవాబు.
200200200 యొక్క ప్రామాణిక రూపం = 200,200,200

ప్రశ్న 2.
అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం కింది సంఖ్యలను అక్షరాలలో రాయండి.

అ. 700,000
జవాబు.
ఏడు వందల వేలు

ఆ. 1,200,000
జవాబు.
ఒక మిలియను రెండు వందల వేలు

ఇ. 2,524,000
జవాబు.
రెండు మిలియన్ల ఐదు వందల ఇరవై నాలుగు వేలు

ఈ. 7,521,256
జవాబు.
ఏడు మిలియన్ల ఐదు వందల ఇరవై ఒకవేల రెండు వందల యాభై ఆరు.

ఉ. 475,562,125
జవాబు.
నాలుగు వందల డెబ్బై ఐదు మిలియన్ల ఐదు వందల అరవై రెండు వేల నూట ఇరవై ఐదు

ప్రశ్న 3.
కింది వాటికి సమాధానాలు ఇవ్వండి.
అ) ఒక లక్ష = _______ వేలు
జవాబు.
100

ఆ) ఒక మిలియన్ = _______ లక్షలు
జవాబు.
10

ఇ) ఒక కోటి = _______ మిలియన్లు
జవాబు.
10

ఈ)ఒక వంద మిలియన్లు = _______ కోట్లు
జవాబు.
10

ఉ) ఒక మిలియన్ = _______ వేలు
జవాబు.
1000

AP Board 5th Class Maths Solutions 2nd Lesson నా సంఖ్యా ప్రపంచం

ప్రశ్న 4.
సూర్యుని నుండి మనం నివసిస్తున్న భూమికి మధ్య దూరం 149597870 కిలోమీటర్లు. పై సంఖ్యను అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం ప్రామాణిక రూపంలోను, మరియు అక్షర
రూపంలోను రాయండి.
జవాబు.
సూర్యుని నుండి భూమికి మధ్య దూరం = 149597870 కి.మీ.
ప్రామాణిక రూపం = 149,597,870
నూట నలభై తొమ్మిది మిలియన్ల ఐదు వందల తొంభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై