Students can go through AP Board 10th Class Biology Notes 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ to understand and remember the concept easily.
AP Board 10th Class Biology Notes 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ
→ మన శరీరంలో వివిధ విధులను అంతస్రావ్య వ్యవస్థ మరియు నాడీవ్యవస్థ కలిసి సమన్వయం మరియు నియంత్రణ చేస్తాయి.
→ నాడీవ్యవస్థ ప్రతిస్పందనలను మూడు రకాలుగా విభజిస్తాయి. ప్రతీకార ప్రతిచర్యలు, నియంత్రిత, అనియంత్రిత చర్యలు.
→ మానవ నాడీవ్యవస్థను రెండు విభాగాలుగా అధ్యయనం చేస్తాం. 1) కేంద్రీయ నాడీ వ్యవస్థ 2) పరిధీయ నాడీ వ్యవస్థ.
→ కేంద్రీయ నాడీ వ్యవస్థలో మానవ మెదడు మరియు వెన్నుపాము ఉంటాయి. పరిధీయ నాడీ వ్యవస్థలో రెండు రకాలు. 1) సొమాటిక్ నాడీవ్యవస్థ 2) స్వయంచోదిత నాడీవ్యవస్థ.
→ స్వయంచోదిత నాడీవ్యవస్థలో, రెండు రకాలు 1) సహానుభూత నాడీవ్యవస్థ 2) సహానుభూత పరనాడీ వ్యవస్థ. పరస్పర భౌతిక వ్యతిరేక చర్యలకు ఇవే కారణభూతాలు.
→ నాడీ కణం నాడీవ్యవస్థ యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణం.
→ కొన్ని ఎక్సాన్లు నిర్వాహక అంగాలైన కండరాలు, గ్రంథుల కణాలతోటి సంబంధం పెట్టుకుంటాయి. ఈ భాగాన్ని సినాప్స్ అంటారు. సినాప్స్ వద్ద నాడీ అంత్యాల త్వచాలు, నిర్వాహక అంగాల కణాలు ఒకదాని నుండి మరొకటి వేరుగా ఉంటాయి. వీటికి మధ్య ఖాళీ ప్రదేశం ఉంటుంది.
→ హార్మోన్లు ఒక భాగంలో ఉత్పత్తి అయి మరొక భాగంలోకి వెళ్ళి తాము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాయి.
→ పునఃశ్చరణ యంత్రాంగం (Feedback mechanism) హార్మోన్ల చర్యలను నియంత్రిస్తుంది.
→ మొక్కలలో నిర్దిష్ట ఉద్దీపనాలు ఊదా కాంతి, రసాయనాల వలన ప్రతిస్పందనల వలన జరిగే చలనాలను “ట్రాపిక్ చలనాలు” (tropic movement) అంటారు.
→ మొక్కల హార్మోన్ల పెరుగుదలను ప్రభావితం లేదా నిరోధించే హార్మోన్లు, ఆక్సిన్లు, జిబ్బరెల్లిన్లు పెరుగుదలను ప్రభావితం చేసే అబ్ సైసిక్ ఆమ్లం పెరుగుదలను నిరోధిస్తుంది.
→ మొక్కలు బాహ్య ఉద్దీపనాలకు లోనైనప్పుడు చలనాలను ప్రదర్శిస్తాయి. ఇటువంటి చలనాలను “ట్రాపిజమ్ లేదా ట్రాపిక్ చలనాలు” అంటారు.
→ కొన్ని సందర్భాలలో ఉద్దీపనాల దిశ చలనదిశను నిర్ధారిస్తుంది. కొన్ని సందర్భాలలో చలనదిశ ఉద్దీపనాల దిశను నిర్ధారించదు. ఇటువంటి ప్రతిస్పందనలను “నాస్టిక్ చలనాలు” (nastic movements) అంటారు.
→ మొక్కలలో కాంతి అనువర్తనం, నీటి అనువర్తనం, స్పర్శానువర్తనం, రసాయనానువర్తనం వంటి చలనాలు ఉంటాయి.
→ చార్లెస్ డార్విన్ మరియు అతని కొడుకు ఫ్రావిన్స్ డార్విన్ కాంతి అనువర్తనంపై ప్రయోగాలు చేశారు.
→ డచ్ వృక శరీర ధర్మశాస్త్రవేత్తలు వెంట్ మొదటిగా మొక్క హార్మోను కనుగొనిదానికి ‘ఆక్సిన్’ అని పేరు పెట్టారు.
→ మొక్కలు కాంతికి ప్రతిస్పందించడాన్ని “కాంతి అనువర్తనం” (phototropism) అంటారు.
→ మొక్కలు గురుత్వ అకరణకు ప్రతిస్పందించడాన్ని గురుత్వానువర్తనం (geotropism) అంటారు.
→ మొక్కలు నీటివైపుకు పెరగడాన్ని “నీటి అనువర్తనం” (hydrotropism) అంటారు.
→ స్పర్శ లేదా తాకడం వలన కలిగే ప్రతిస్పందనలను “థిగ్మో ట్రాపిజం” (thignotropism) అంటారు.
ఉదా : అత్తిపత్తి (మైమోసాఫ్యూడికా)
→ రసాయనిక పదార్థాలకు మొక్కలు ప్రతిస్పందించడాన్ని రసాయన ప్రతిస్పందనలను “కీమో ట్రాపిజం” (chemotro pism) అంటారు.
→ అంతస్రావీ గ్రంధులు విడుదల చేసే హార్మోన్ పరిమాణం మరియు సమయాన్ని నియంత్రించే యంత్రాంగాన్ని “పునఃశ్చరణ యాంత్రాంగం” (Feedback mechanism) అంటారు.
→ మన శరీరంలోని జీర్ణనాళంలోని నాడీవ్యవస్థ, కేంద్రీయ, పరిధీయ నాడీవ్యవస్థతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనీ చేస్తుంది. దానికి “చిన్న మెదడు” లేదా “enteric నాడీవ్యవస్థ” అని పేరు పెట్టారు.
→ వినాళ గ్రంథుల వ్యవస్థను “అంతస్రావ వ్యవస్థ” అంటారు. ఇది స్రవించే రసాయనాలను “హార్మోన్”లు అంటారు.
→ క్లోమంలోని లాంగర్ హాన్స్ పుటికల నుండి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. లాటిన్ భాషలో ఇన్సులా అనగా “AnIsland” అని అర్థము.
→ అడ్రినలిన్ హార్మోన్ మానసిక ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్‌గా పిలుస్తారు.
→ వినాళ గ్రంధులలో పీయూష గ్రంథిని ప్రధానమైనదిగా పేర్కొంటారు. ఇది ఇతర వినాళ గ్రంథులను నియంత్రిస్తుంది.
→ ప్రచోదనం : నాడీకణాలు ఉద్దీపనకు లోనైనపుడు, ప్రయాణించే విద్యుదావేశం.
→ ప్రతిస్పందన : ఉద్దీపనలకు జీవులు చూపే ప్రతి చర్యలు
→ నాడీకణం : నాడీవ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం.
→ శ్వాన్ కణం : మయిలిన్ తొడుగులోని మజ్జ నాడీతంతువులో కణాలనే శ్వాన్ కణం అంటారు. ఇవి అభివృద్ధి చెందిన తరువాత నాడీ తంతువును సర్పిలాకారంగా చుట్టుకొని ఉంటాయి.
→ తంత్రికాక్షం : నాడీకణంలోని పొడవాటి నిర్మాణాన్ని “తంత్రికాక్షం” (Axon) అంటారు.
→ నాడీసంధి : ఒక నాడీ కణంలోని డెండైట్స్, వేరొక కణంలోని రెండైట్లతో గాని, ఆక్సాన్. సో, నా మీ ప్రదేశాన్ని “నాడీకణ సంధి” (సైనాప్స్) అంటారు.
→ జ్ఞాననాడులు (అభివాహినాడులు) : జ్ఞానసమాచారాన్ని కేంద్రీయ నాడీవ్యవస్థకు చేర్చే నాడులు. వీటినే “జ్ఞాననాడులు” అంటారు.
→ చాలకనాడులు (అపవాహినాడులు) : ఆదేశాలను నిర్వాహక అంగాలకు చేర్చే నాడులు. వీటినే “చాలకనాడులు” అంటారు.
→ సహసంబంధ నాడులు : అభివాహి, అపవాది నాడులను కలిపే నాడులను “సహసంబంధ నాడులు” అంటారు.
→ కేంద్రీయ నాడీవ్యవస్థ : మెదడు, వెన్నుపామును కలిపి “కేంద్రీయ నాడీవ్యవస్థ” అంటారు.
→ మెదడు : నాడీవ్యవస్థలోని ప్రధాన భాగం. తలలోని కపాలంలో భద్రపర్చబడి ఉంటుంది. అగ్ని నియంత్రిత చర్యలను అదుపుచేస్తుంది.
→ వెన్నుపాము : మెదడు యొక్క క్రింది భాగం దేహంలోనికి పొడిగించబడి, వెన్నుపాముగా మారుతుంది. ఇది కేంద్రీయ నాడీవ్యవస్థలోని భాగం. మెదడుకు, పరిధీయ నాడీ వ్యవస్థకు మధ్య వారధిలా పని చేస్తుంది.
→ మస్తిష్క మేరుద్రవం : మెదడు వెలుపలి మధ్య త్వచాల మధ్య ఉండే ద్రవపదార్థం. ఇది మెదడు నుండి వెన్నుపాముకు నిరంతరం ప్రయాణిస్తూ రక్షణ ఇస్తుంది.
→ పరిధీయ నాడీవ్యవస్థ : కపాల మరియు కశేరునాడులను కలిపి “పరిధీయ నాడీవ్యవస్థ” అంటారు.
→ ఇన్సులిన్ : శ్లోమంలోని లాంగర్ హాన్స్ పుటికలు స్రవించే హార్మోన్. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని క్రమబద్దీకరిస్తుంది. దీని లోపం వలన చక్కెర వ్యాధి వస్తుంది.
→ అంతఃస్రావగ్రంథులు : నాళాలు లేని గ్రంథులను “వినాళ గ్రంథులు లేదా అంతఃస్రావ గ్రంథులు” అంటారు. ఇవి తమ రసాయనాలను నేరుగా రక్తంలోనికి పంపుతాయి.
→ హార్మోనులు : వినాళ గ్రంథులచే స్రవించబడే రసాయనాలు. ఇవి రక్తం ద్వారా ప్రయాణించి జీవక్రియలను నియంత్రిస్తాయి.
→ పునఃశ్చరణ యంత్రాంగం : శరీరంలోని హార్మోన్ల స్థాయిని నియంత్రించే యంత్రాంగం. హార్మోన్ స్థాయి పెరిగినపుడు, తిరిగి సాధారణ స్థాయికి చేరటానికి ఈ యంత్రాంగం కీలకపాత్ర వహిస్తుంది.
→ వృక్ష హార్మోన్లు : మొక్కలలో నియంత్రణ, సమన్వయాన్ని నిర్వహించే రసాయనాలు.
ఉదా : ఆక్సిన్స్
→ నాస్టిక్ చలనాలు : కొన్ని సందర్భాలలో ఉద్దీపన దిశ, ప్రతిస్పందన దిశకు సంబంధం ఉండదు. ఈ ప్రతిచర్యలను “నాస్టిక్ మూమెంట్స్” అంటారు.
ఉదా : అత్తిపత్తి.
→ అనువర్తన చలనాలు : ఉద్దీపనం వైపుకు మొక్కలు ప్రతిస్పందన చూపే ప్రతిచర్యలను “అనువర్తన చలనాలు” అంటారు.
ఉదా : కాంతి అనువర్తనం.
→ గురుత్వానువర్తనం : భూమి ఆకర్షణకు మొక్కలు చూపే ప్రతిస్పందన.
ఉదా : వేరు భూమిలోనికి పెరుగుట.
→ స్పర్శానువర్తనం : మొక్కలు స్పర్శను చూపే ప్రతిస్పందనను స్పర్శానువర్తనం అంటారు.
ఉదా : నులితీగెలు, అత్తిపత్తి.
→ రసాయనిక అనువర్తనం : మొక్కలు రసాయనిక పదార్థాలకు చూపించే ప్రతిస్పందనలను “రసాయనిక అనువర్తనాలు” అంటారు.
ఉదా : పరాగరేణువు కీలాగ్రంపై మొలకెత్తటం, తుమ్మెద పుష్పం చుట్టూ తిరగటం.
→ ఉద్దీపనాలు : జీవిలో ప్రతిచర్యను కలిగించే బాహ్య లేదా అంతర కారకాలు.
→ ప్రతీకార చర్యలు : ఉద్దీపనాలకు జీవులు చూపించే చర్యలు.
→ కాంతి అనువర్తనం : కాంతికి మొక్కలు చూపే ప్రతిచర్య, కాండం కాంతివైపుకు పెరుగుతుంది.
→ జియో ట్రాపిజం : మొక్క వేర్లు గురుత్వ ఆకర్షణ వైపు పెరిగే ధర్మం. భూమి ఆకర్షణకు మొక్కలు చూపే ప్రతిచర్య.
→ ఫైటో హార్మోన్ : మొక్కలలో నియంత్రణ సమన్వయం చేసే రసాయన పదార్థాలు.
→ కీమో ట్రాపిజం : రసాయన పదార్థాలకు మొక్కలు చూపే ప్రతిచర్య.
→ ఆగ్జాన్ : నాడీకణంలోని పొడవైన భాగం. సమాచార రవాణాలో పాల్గొంటుంది.
→ సైనాప్స్ : నాడీకణాల డెండైట్స్ మధ్య ఏర్పడే సంధి తలం.
→ కపాలనాడులు : మెదడు నుండి ఏర్పడే నాడులను “కపాలనాడులు” అంటారు. వీటి సంఖ్య 12 జతలు.
→ మెనింజస్ : మెదడును కప్పుతూ మూడు పొరలు ఉంటాయి. వీటిని “మెనింజస్” అంటారు.
→ కశేరునాడులు : వెన్నుపాము నుండి ఏర్పడే నాడులను “కశేరునాడులు” అంటారు. ఇవన్నీ మిశ్రమనాడులు. వీటి సంఖ్య 31 జతలు.