AP 10th Class Biology Notes 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

Students can go through AP Board 10th Class Biology Notes 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ to understand and remember the concept easily.

AP Board 10th Class Biology Notes 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

→ ఒక జాతి శాశ్వతంగా మరియు నిరంతరంగా కొనసాగుటకు ప్రత్యుత్పత్తి చాలా అవసరం.

→ ప్రత్యుత్పత్తి రెండు రకాలు – లైంగిక మరియు అలైంగిక ప్రత్యుత్పత్తి.

→ లైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక్కో జనకుని నుండి సగం జన్యువులు సంతతికి అందించబడతాయి.

→ సంయోగం, మొగ్గతొడగటం, ముక్కలు కావడం, పునరుత్పత్తి, సిద్ధబీజాల ఉత్పత్తి మొదలగునవి అలైంగిక ప్రత్యుత్పత్తిలోని రకాలు.

→ చాలా మొక్కలు కాండం, వేర్లు, ఆకులు మొదలైన శాఖీయ భాగాల ద్వారా కూడా కొత్త మొక్కలను ఉత్పత్తి చేసుకుంటాయి. దానినే శాఖీయ ప్రత్యుత్పత్తి అని అంటారు.

→ కృత్రిమమైన శాఖీయ ప్రత్యుత్పత్తికి ఎంతో ఆర్థిక ప్రాముఖ్యత కలదు.

→ ‘కణజాలవర్ధనం’ మొక్కలను పెంచుటకై కనుగొనబడిన ఆధునిక ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా తక్కువ స్థలంలో మరియు తక్కువ సమయంలో అధిక సంఖ్యలో మొక్కలను పెంచవచ్చు.

AP 10th Class Biology Notes 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

→ గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా కోరుకున్న లక్షణాలు గల మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు.

→ ఉన్నత వర్గానికి చెందిన జంతువులలో లైంగిక ప్రత్యుత్పత్తి ప్రత్యేకంగా అభివృద్ధి చెందిన అవయవాలు పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థల ద్వారా జరుగుతుంది.

→ జీవుల్లో అవసరం మేరకు కణాలను సరిచేయడానికి (repair) లేదా పనిచేయని కణాల స్థానంలో కొత్త కణాలను ఉత్పత్తి చేయడానికి మరియు సంయోగబీజాల ఉత్పత్తి కోసం కణవిభజన చెందుతాయి.

→ కణవిభజన రెండు రకాలుగా జరుగుతుంది. ఎ) సమవిభజన లేదా శారీరక కణ విభజన బి) క్షయకరణ విభజన లేదా ప్రత్యుత్పత్తి కణాల్లోని విభజన.

→ సాధారణంగా ఒక జీవి దేహ, నిర్మాణంలో పాల్గొనే కణాలను శారీరక కణాలనీ, సంయోగబీజాల ఉత్పత్తి కోసం ఉపయోగపడే కణాలను జన్యు కణాలు అనీ అంటారు.

→ కణవిభజన యొక్క కణచక్రంలో (G – 1, G – 2, S మరియు M) దశలను చూడవచ్చు.

→ కణచక్రంలో సంశ్లేషణ దశ (S దశ) దీర్ఘకాలం జరుగుతుంది. ఈ దశలోనే జన్యువులు రెట్టింపు (duplication) అవుతాయి.

→ సమవిభజన ఫలితంగా ఏర్పడిన పిల్లకణాల్లోని క్రోమోజోమ్ ల సంఖ్య జనకుల సంఖ్యకు సమానంగా ఉంటుంది. ఈ విభజనలో ప్రథమదశ, మధ్యస్థదశ, చలనదశ, అంత్యదశలుంటాయి.

AP 10th Class Biology Notes 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

→ కణద్రవ్యం యొక్క విభజననే కణద్రవ్య విభజన (cytokinesis) అని అంటారు.

→ క్షయకరణ విభజనలో మాతృకణాలలో రెండుసార్లు విభజన జరిగి నాలుగు పిల్లకణాలు ఏర్పడతాయి.

→ ప్రత్యుత్పత్తి ప్రక్రియకు శారీరక, మానసిక ఎదుగుదల మరియు పూర్తి ఆరోగ్యం ఎంతో అవసరం.

→ లైంగిక వ్యాధులు వ్యాప్తి చెందే విధానాలు మరియు వాటి గురించిన యథార్థాలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత కలదు.

→ ఎయిడ్స్ వ్యాధికి చికిత్స లేదు. కావున ఎయిడ్స్ రాకుండా నైతిక జీవనం గడపడం సరైన మార్గం.

→ ప్రస్తుతం కుటుంబ నియంత్రణకు అనేక గర్భనిరోధక మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

→ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం మనలో ప్రతి ఒక్కరి బాధ్యత.

→ శిశు జననం కన్నా ముందుగానే లింగనిర్ధారణ పరీక్ష చేయడం చట్టరీత్యా నేరం. భ్రూణహత్యలను ఆపడం అవసరం.

→ టెస్టోస్టిరాన్ అనే పురుష లైంగిక హార్మోన్ పురుష ప్రత్యుత్పత్తి అవయవాల అభివృద్ధిని నియంత్రిస్తుంది.

→ అండాలు స్త్రీ బీజకోశంలోని గ్రాఫియన్ పుటికలో అభివృద్ధి చెందుతాయి. అండాల విడుదలను అండోత్సర్గం అంటారు.

→ పిండాన్ని ఆవరిస్తూ, పరాయువు (Chorion), ఉల్బం (Amnion) ఎల్లంటోయిస్ అనే పొరలు ఉంటాయి.

→ మూడు నెలల పిండాన్ని భ్రూణం అంటారు. ఇది పూర్తిగా అభివృద్ధి చెందటానికి 9 నెలలు లేదా 280 రోజులు పడుతుంది. దీనినే గర్భావధికాలం (Gustation period) అంటారు.

AP 10th Class Biology Notes 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

→ కణ విభజనను కారియోకైనసిస్, కణద్రవ్య విభజనను “సైటోకైనసిస్” అని అంటారు.

→ కుటుంబ నియంత్రణకు మగవారిలో ‘వేసక్టమీ’, ఆడవారిలో ‘ట్యూబెక్టమీ’ నిర్వహిస్తారు.

→ చట్టరీత్యా పురుషులలో వివాహ వయస్సు 21, స్త్రీలలో 18.

→ సంతతి : జనక తరం నుండి ఏర్పడిన జీవులు.

→ కోశము : ప్రతికూల పరిస్థితులలో ప్రాథమిక జీవులలో రక్షణ, ప్రత్యుత్పత్తికి తోడ్పడే నిర్మాణం.

→ ముక్కలు కావటం : ఒక జీవి ప్రమాదవశాత్తు తెగిపోయి, రెండు జీవులుగా వృద్ధి చెందటం.

→ పునరుత్పత్తి : జీవి కోల్పోయిన భాగాలను తిరిగి ఉత్పత్తి చేసుకోవటం.

→ శాఖీయ ప్రత్యుత్పత్తి : మొక్క శాఖీయ భాగాల నుండి జరిగే ప్రత్యుత్పత్తి.

→ కృత్రిమ ప్రత్యుత్పత్తి : మానవ ప్రమేయంతో జరిగే ప్రత్యుత్పత్తి.

→ అనిషేక ఫలనం : ఫలదీకరణ జరగకుండా అండాశయం ఫలంగా మారే ప్రక్రియ.

→ కత్తిరించుట : మొక్క కాండాన్ని వేర్లను కత్తిరించి కొత్త మొక్కలుగా పెంచే ప్రక్రియ.

→ అంటుకట్టుట : కోరుకున్న లక్షణాలు ఉన్న మొక్కను మరొక మొక్కకు జోడించే ప్రక్రియ.

AP 10th Class Biology Notes 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

→ స్టాక్ : అంటుకట్టే ప్రక్రియలో ఆధారాన్నిచ్చే మొక్కను స్టాక్ అంటారు.

→ సయాన్ : అంటుకట్టే ప్రక్రియలో స్టాక్ పైన పెంచే మొక్కను సయాన్ అంటారు.

→ కణజాలవర్ధనం : మొక్క కణజాలాన్ని మొక్కలుగా పెంచే ప్రక్రియ.

→ ఉమ్మనీరు : ఉల్బం లోపలి కుహరం ఉమ్మ నీటితో నిండి ఉంటుంది. ఈ ద్రవం తేమను అందించటమే గాక చిన్న చిన్న యాంత్రిక అఘాతాల నుండి రక్షణ కల్పిస్తుంది.

→ ఉల్బం : పిండాన్ని చుట్టి ఉండే రెండవ పొర.

→ నాభితాడు : పిండం గర్భాశయ కుడ్యానికి అంటిపెట్టుకొనే నిర్మాణం. ఇది తల్లికి, పిండానికి మధ్య సంధాన కర్తగా పనిచేస్తుంది.

→ ఎండోమెట్రియం : గర్భాశయం లోపల ఉండే మ్యూకస్ పార.

→ నాభిరజ్జువు : జనక జీవి శరీరం నుండి అవే పోలికలతో ఉన్న నిర్మాణం బయటకు పెరగటం.

→ సమవిభజన : శాఖీయ కణాలలో జరిగే కణవిభజన. ఈ ప్రక్రియలో ద్వయస్థితికంలో ఉండే రెండు కణాలు ఏర్పడతాయి.

→ క్షయకరణ విభజన : లైంగిక కణాలలో జరిగే కణవిభజన. ఈ ప్రక్రియలో నాలుగు ఏక స్థితిక కణాలు ఏర్పడతాయి.

→ క్రొమాటిడ్లు : కణ విభజన సమయంలో క్రోమోజోమ్ రెండుగా చీలిపోతుంది. వీటిని క్రొమాటిడ్స్ అంటారు.

→ క్రోమోజోమ్ లు : కేంద్రకంలోని జన్యుపదార్థం ‘క్రొమాటిస్ వల’ లో ఉంటుంది. విభజన సమయంలో ఇది ముక్కలై క్రోమోజోమ్స్ గా మారుతుంది.

→ భ్రూణహత్య : గర్భములోని పిండాన్ని చంపి, తొలగించే ప్రక్రియ.

AP 10th Class Biology Notes 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

→ HIV – ఎయిడ్స్ : హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్. దీని వలన AIDS వస్తుంది. ఎక్వయిర్డ్ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఇది వ్యాధినిరోధక వ్యవస్థను దెబ్బతీసే HIV వలన వస్తుంది.

→ వేసక్టమీ : సంతానం కలగకుండా పురుష శుక్రవాహికలను కత్తిరించే శస్త్రచికిత్స.

→ ట్యూబెక్టమీ : సంతానం కలగకుండా స్త్రీలలో స్త్రీ బీజవాహికలను కత్తిరించే శస్త్రచికిత్సా విధానం.

→ కోరకీభవనం : జనక జీవి శరీరం నుండి అవే పోలికలతో ఉన్న నిర్మాణం బయటకు పెరగటం.

AP 10th Class Biology Notes 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 1