These AP 10th Class Physics Chapter Wise Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం will help students prepare well for the exams.
AP Board 10th Class Physical Science 5th Lesson Important Questions and Answers మానవుని కన్ను-రంగుల ప్రపంచం
10th Class Physics 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
కటక సామర్థ్యం అనగానేమి?
జవాబు:
కటక నాభ్యంతరం యొక్క విలోమ విలువను కటక సామర్థ్యం అంటారు.
ప్రశ్న 2.
పట్టకంతో ప్రయోగం చేసి, ఏ భౌతికరాశిని కనుగొనగలం?
జవాబు:
పట్టకంతో చేసిన ప్రయోగం ద్వారా
- ఆ పట్టక కనిష్ట విచలన కోణాన్ని,
- ఆ పట్టక పదార్థ వక్రీభవన గుణకాన్ని కనుగొనవచ్చును.
ప్రశ్న 3.
చత్వారం (Presbyopia) కలగడానికి గల కారణమేమి?
జవాబు:
సాధారణంగా వయసుతోపాటుగా కంటి సర్దుబాటు సామర్థ్యం తగ్గిపోవడం వల్ల చత్వారం కలుగుతుంది.
ప్రశ్న 4.
పట్టకం గుండా ప్రయాణించిన కాంతికిరణం పొందే విచలన కోణాన్ని తెలియజేసే పటాన్ని గీయండి.
జవాబు:
ప్రశ్న 5.
ఆకాశం నీలిరంగులో కనబడడం అనే దృగ్విషయానికి గల కారణంను వివరించండి.
జవాబు:
వాతావరణంలోని నైట్రోజన్, ఆక్సిజన్ అణువుల పరిమాణం నీలిరంగు కాంతి తరంగదైర్ఘ్యంతో పోల్చదగిన విధంగా ఉంటుంది. ఈ అణువుల వలన నీలిరంగు కాంతి పరిక్షేపణం చెందడం వల్ల ఆకాశం నీలిరంగులో కనబడుతుంది.
ప్రశ్న 6.
‘దీర్ఘదృష్టి’ గల రోగికి కంటివైద్యుడు సూచించే కటకం పటాన్ని గీయండి.
జవాబు:
దీర్ఘదృష్టి గల రోగికి కంటివైద్యుడు సూచించు కటకం ద్వికుంభాకార కటకము.
ప్రశ్న 7.
దృష్టి దోషంగల వ్యక్తి దోషం సవరించడానికి + 50 సెం.మీ.ల నాభ్యాంతరం గల ద్వికుంభాకార కటకాన్ని సూచించిన ఆ కటక సామర్థ్యంను కనుగొనుము.
జవాబు:
నాభ్యాంతరం f = 50 సెం.మీ.
కటక సామర్థ్యం (P) = \(\frac{100}{f}\) (సెం! మీ||లో )
P= \(\frac{100}{50}\) = 2 డయాప్టర్లు
ప్రశ్న 8.
ఒక వ్యక్తి యొక్క కంటి కటకం తన గరిష్ఠ నాభ్యంతరాన్ని 2.4 సెం.మీ. కంటే ఎక్కువకు సర్దుబాటు చేసుకోలేకపోతే ఏమి జరుగుతుందో ఊహించండి.
జవాబు:
ఆ వ్యక్తి నిర్ణీత దూరం మేరకు గల వస్తువులను మాత్రమే చూడగలడు. అంతకన్నా దూరంలో ఉన్న వస్తువులను చూడలేడు అతను పుటాకార కటకం వాడవలసి వస్తుంది.
ప్రశ్న 9.
ఒక వ్యక్తి దూరంగా ఉన్న వస్తువులను చూడలేకపోతున్నాడు. ఆ వ్యక్తికి గల దృష్టి లోపాన్ని కిరణచిత్రం ద్వారా చూపండి.
జవాబు:
ప్రశ్న 10.
కటక సామర్థ్యము, నాభ్యంతరముల మధ్య సంబంధమేమి?
జవాబు:
కటక సామర్థ్యము (P) మరియు నాభ్యంతరము (1) ల మధ్య సంబంధం :
ప్రశ్న 11.
సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు ఎర్రగా కనపడడానికి గల కారణము రాయండి.
జవాబు:
సూర్యకాంతిలోని ఎరుపు రంగు వేగం ఎక్కువ ఉండడం వల్ల అది పరిక్షేపణం చెందకుండానే మన కంటిని చేరడం వల్ల సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలలో సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు.
ప్రశ్న 12.
స్పష్ట దృష్టి కనీస దూరమంటే ఏమిటి?
జవాబు:
మన కంటికి ఏ ఒత్తిడి లేకుండా, స్పష్టంగా ఒక వస్తువును మనము చూడాలంటే అది దాదాపు 25 సెం.మీటర్ల దూరంలో ఉండాలి. దీనినే స్పష్ట దృష్టి కనీస దూరమంటారు.
ప్రశ్న 13.
10 సం||ల లోపు వారికి స్పష్ట దృష్టి కనీస దూరమెంత?
జవాబు:
10 సం||ల లోపు వారికి స్పష్ట దృష్టి కనీస దూరము విలువ 7 సెం.మీ.ల నుండి 8 సెం.మీ.ల వరకు ఉంటుంది.
ప్రశ్న 14.
వయసు మళ్ళిన వారి విషయంలో స్పష్ట దృష్టి కనీస దూరమెంత?
జవాబు:
వయసు మళ్ళిన వారి విషయంలో స్పష్ట దృష్టి కనీస దూరము విలువ 1 మీటరు నుండి 2 మీటర్లు లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటుంది.
ప్రశ్న 15.
మానవుని కంటి ఉపయోగమేమి?
జవాబు:
మానవుని కన్ను మన చుట్టూ వున్న వివిధ వస్తువులను, రంగులను చూడడానికి ఉపయోగపడును.
ప్రశ్న 16.
మానవుని. కన్ను దేనిపై ఆధారపడి పనిచేయును?
జవాబు:
మానవుని కన్ను దృష్టి ప్రతిస్పందన అనే నియమంపై ఆధారపడి పని చేయును.
ప్రశ్న 17.
మనము ఏ విధంగా వస్తువులను చూడగలుగుతున్నాము?
జవాబు:
వస్తువులపై పడిన కాంతి పరిక్షేపణం చెంది మన కంటిని చేరడం వలన మనము వస్తువులను చూడగలుగుతున్నాము.
ప్రశ్న 18.
దృష్టికోణం అంటే ఏమిటి?
జవాబు:
ఏ గరిష్ఠ కోణం వద్ద మనము వస్తువును పూర్తిగా చూడగలమో, ఆ కోణాన్ని “దృష్టికోణం” అంటారు.
ప్రశ్న 19.
సాధారణ మానవుని స్పష్ట దృష్టి కనీస దూరం, దృష్టికోణం విలువలను వ్రాయుము.
జవాబు:
సాధారణ మానవుని స్పష్ట దృష్టి కనీస దూరము 25 సెం.మీ. మరియు దృష్టికోణము 60° అగును.
ప్రశ్న 20.
కంటిలోని కటకానికి, రెటీనాకు మధ్య దూరం ఎంత ఉంటుంది?
జవాబు:
కంటిలోని కటకానికి, రెటీనాకు మధ్య దూరం దాదాపు 2.5 సెం.మీ. ఉంటుంది.
ప్రశ్న 21.
కార్నియా అంటే ఏమిటి?
జవాబు:
గోళాకారపు కనుగుడ్డు ముందు ఉండే పారదర్శక రక్షణ పొరను “కార్నియా” అంటారు.
ప్రశ్న 22.
నల్లగుడ్డు లేక ఐరిస్ అంటే ఏమిటి?
జవాబు:
నేత్రోదక ద్రవానికి, కటకానికి మధ్య గల కండర పొరను నల్లగుడ్డు లేక “ఐరిస్” అంటారు.
ప్రశ్న 23.
సర్దుబాటు అంటే ఏమిటి?
జవాబు:
కంటి కటక నాభ్యంతరంను తగిన విధముగా మార్పు చేసుకునే పద్ధతిని “సర్దుబాటు” అంటారు.
ప్రశ్న 24.
కంటికటక సర్దుబాటు దోషాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
కంటికటక సర్దుబాటు దోషాలు మూడు రకాలు. అవి :
- హ్రస్వదృష్టి
- దీర్ఘదృష్టి
- చత్వారం
ప్రశ్న 25.
హ్రస్వదృష్టి అంటే ఏమిటి?
జవాబు:
గరిష్ఠ దూర బిందువుకు ఆవల వున్న వస్తువును చూడలేకపోయే దోషమును “హ్రస్వదృష్టి” అంటారు.
ప్రశ్న 26.
దీర్ఘదృష్టి అంటే ఏమిటి?
జవాబు:
దూరంలో ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలిగి, దగ్గరిలోని వస్తువులను చూడలేని కంటి దోషమును “దీర్ఘదృష్టి” అంటారు.
ప్రశ్న 27.
చత్వారం అంటే ఏమిటి?
జవాబు:
వయస్సుతో పాటుగా కంటి కటక సర్దుబాటు సామర్థ్యం తగ్గిపోవు దృష్టి దోషాన్ని “చత్వారం” అంటారు.
ప్రశ్న 28.
చత్వారంను నివారించుటకు వాడు కటకం ఏది?
జవాబు:
చత్వారంను నివారించుటకు ద్వినాభ్యంతర కటకమును ఉపయోగిస్తారు.
ప్రశ్న 29.
విచలన కోణం అంటే ఏమిటి?
జవాబు:
ఒక పట్టకపు పతన, బహిర్గత కిరణాలను వెనుకకు పొడిగించగా, ఆ రెండు కిరణాల మధ్య కోణమును “విచలన కోణం” అంటారు.
ప్రశ్న 30.
పట్టకపు పతన, బహిర్గత మరియు విచలన కోణాల మధ్య సంబంధమును వ్రాయుము.
జవాబు:
A+ d = i1 + i2
ఇక్కడ A = పట్టకపు కోణం, d = విచలన కోణం, i1 = పతన కోణం, i2 = బహిర్గత కోణం.
ప్రశ్న 31.
పట్టకపు వక్రీభవన గుణక సూత్రమును వ్రాయుము.
జవాబు:
ప్రశ్న 32.
తెల్లని కొంతి రంగులుగా విడిపోవడాన్ని కిరణ సిద్ధాంతంతో వివరించగలమా?
జవాబు:
తెల్లని కాంతి రంగులుగా విడిపోవడాన్ని కిరణ సిద్ధాంతంతో వివరించలేము.
ప్రశ్న 33.
పట్టకం గుండా తెలుపు రంగు కాంతిని పంపితే అది వివిధ రంగులుగా ఎందుకు విడిపోతుందో నీవు చెప్పగలవా?
జవాబు:
అన్ని రంగుల కాంతి వేగాలు శూన్యంలో ఒకే విధంగా ఉన్నప్పటికీ, ఒక యానకంలో ప్రయాణించేటప్పుడు కాంతివేగం దాని తరంగదైర్ఘ్యం పై ఆధారపడును. అందువలన కాంతి వివిధ రంగులుగా విడిపోతుంది.
ప్రశ్న 34.
మనము దినపత్రికల్లో, వార్తలలో కంటి దానమునకు సంబంధించిన ప్రకటనలను చూస్తాము. వాటి ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
ఈ రకపు ప్రకటనల వలన
- జనాభాలో జ్ఞానేంద్రియాల ప్రాముఖ్యతను పెంపొందించగలం.
- అంగవైకల్యం గల వారిపై సానుభూతి తత్వమును పెంపొందించగలం.
ప్రశ్న 35.
కాంతి గాలి నుండి మరొక పారదర్శక యానకంలోకి ప్రవేశించినప్పుడు ఏఏ రంగుల కాంతులు కనిష్ఠ మరియు గరిష్ఠముగా విచలనం పొందును?
జవాబు:
ఎరుపు రంగు కాంతి కనిష్టముగాను, ఊదా రంగు కాంతి గరిష్టముగాను విచలనము పొందును.
ప్రశ్న 36.
తెలుపు మరియు నలుపులను రంగులుగా ఎందుకు లెక్కించరు?
జవాబు:
ఒక వస్తువు అన్ని రంగులను పరిక్షేపణం చెందించిన అది తెల్లగాను, శోషించుకున్న అది నల్లగాను కనిపించును, కావున ఈ రంగులను లెక్కలోనికి తీసుకొనరు.
ప్రశ్న 37.
ఇంద్రధనుస్సు ఏ ఆకారంలో కనపడును?
జవాబు:
ఇంద్రధనుస్సు అర్ధవలయాకారంలో కనపడును.
ప్రశ్న 38.
60°ల పట్టక కోణం (A) గల పట్టకం యొక్క కనిష్ఠ విచలన కోణం (D) 30°. అయిన పట్టకం తయారీకి వినియోగించిన పదార్థ వక్రీభవన గుణకాన్ని కనుగొనండి.
జవాబు:
ప్రశ్న 39.
కంటిలోకి వెళ్ళే కాంతిని నియంత్రించే ద్వారం వలె పనిచేసే అవయవం ఏది?
జవాబు:
కంటిలోకి వెళ్ళే కాంతిని నియంత్రించే ద్వారం వలె పనిచేసే అవయవం కనుపాప (Pupil). ఇందుకొరకు కాంతి ప్రకాశవంతంగానున్న సందర్భాలలో కనుపాపను సంకోచింప చేయుట, కాంతి ప్రకాశం తక్కువ ఉన్నపుడు కనుపాపను వ్యాకోచింప చేయుటలో ‘ఐరిస్’ ఉపయోగపడుతుంది.
ప్రశ్న 40.
మానవుని కన్నులో దండాలు, శంఖువుల పాత్ర ఏమిటి?
జవాబు:
కంటిలోని దండాలు కాంతి తీవ్రతను గుర్తిస్తాయి. శంఖువులు రంగును గుర్తిస్తాయి.
ప్రశ్న 41.
గరిష్ఠ దూర బిందువు అనగానేమి?
జవాబు:
ఏ గరిష్ఠ దూరం వద్దనున్న బిందువుకు లోపల గల వస్తువులకు మాత్రమే కంటి కటకం రెటీనా పై ప్రతిబింబాన్ని ఏర్పరచగలుగుతుందో ఆ బిందువును గరిష్ఠ దూర బిందువు అంటారు.
ప్రశ్న 42.
కనిష్ఠ దూర బిందువు అనగానేమి?
జవాబు:
ఏ కనిష్ఠ దూరం వద్ద గల బిందువుకు ఆవల గల వస్తువులకు మాత్రమే కంటి కటకం రెటీనా పై ప్రతిబింబాన్ని ఏర్పరచ గలదో, ఆ బిందువును కనిష్ఠ దూర బిందువు అంటారు.
ప్రశ్న 43.
చత్వారం అనగానేమి? దీనిని ఎలా సరిచేస్తారు?
జవాబు:
సాధారణంగా వయసుతోపాటు కంటి సర్దుబాటు సామర్థ్యం తగ్గిపోతుంది. ఇటువంటి దృష్టి దోషాన్ని చత్వారం అంటారు. దీని నివారణకు ద్వినాభ్యంతర కటకాన్ని ఉపయోగిస్తారు.
ప్రశ్న 44.
కాంతి తీవ్రత అనగానేమి?
జవాబు:
కాంతి ప్రయాణ దిశకు లంబంగానున్న ఏకాంక వైశాల్యం గల తలం గుండా ఒక సెకను కాలంలో ప్రసరించే కాంతి శక్తిని కాంతి తీవ్రత అంటారు.
ప్రశ్న 45.
సూర్య కిరణాలకు లంబ దిశలో మనం ఆకాశాన్ని చూసినపుడు, ఆకాశం ఏ రంగులో కనబడుతుంది?
జవాబు:
సూర్యకిరణాల దిశకు లంబ దిశలో మనం ఆకాశాన్ని చూసినపుడు, ఆకాశం నీలి రంగులో కనబడుతుంది.
ప్రశ్న 46.
నలుపు, తెలుపు రంగుల ప్రత్యేకత ఏమి?
జవాబు:
నలుపు అనగా అన్ని రంగులను పూర్తిగా ఒక వస్తువు శోషణం చేసుకొన్నది అని అర్థం. తెలుపు అనగా ఏడురంగుల మిశ్రమం. ఒక వస్తువు కాంతిని పూర్తిగా పరావర్తనం చెందిస్తే దానిని తెలుపుగా గుర్తిస్తారు.
ప్రశ్న 47.
పట్టకమునకు సంబంధించి క్రింది పదాలను నిర్వచింపుము.
a) పతన కిరణం
b) లంబము
c) పతన కోణము
d) బహిర్గత కిరణం
e) బహిర్గత కోణం
f) వక్రీభవన కోణం
g) విచలన కోణం
జవాబు:
a) 1) పటంలో APQR, పట్టకం యొక్క త్రిభుజాకార ఆధారపు హద్దును సూచిస్తుంది.
2) PQ అనే సమాంతర తలంపై M బిందువు వద్ద ఒక కాంతి కిరణం పతనమైనదని భావిస్తే, ఈ కిరణాన్ని పతన కిరణం అంటారు.
b) M వద్ద PQ తలానికి ఒక లంబాన్ని గీస్తే అది, ఆ తలానికి పతన బిందువు వద్ద లంబము.
c) పతన కిరణానికి, లంబానికి మధ్యగల కోణాన్ని “పతనకోణం (i1)” అంటారు.
d) పతన కిరణం M వద్ద వక్రీభవనం చెంది పట్టకం గుండా ప్రయాణించి మరో సమతలంపై గల ‘N’ బిందువును చేరుతుంది. చివరకు PR తలంపై గల ‘N’ బిందువు గుండా బయటకు వెళుతుంది. దీనినే “బహిర్గత కిరణం” అంటారు.
e) బహిర్గత కిరణానికి ‘N’ వద్ద PR తలానికి గీసిన లంబానికి మధ్య గల కోణాన్ని బహిర్గత కోణం (i2) అంటారు.
f) PQ, PR తలాల మధ్య కోణాన్ని పట్టక కోణం (A) లేదా పట్టక వక్రీభవన కోణం అంటారు.
g) పతన కిరణానికి, బహిర్గత కిరణానికి మధ్య గల కోణాన్ని విచలన కోణం ‘d’ అంటారు.
ప్రశ్న 48.
పట్టకం గుండా ఒకే రంగు గల కాంతిని పంపించామనుకుందాం. అది మరికొన్ని రంగులుగా విడిపోతుందా. ఎందుకు?
జవాబు:
కాంతి జనకం ఒక సెకనుకు విడుదల చేసే కాంతి తరంగాల సంఖ్యను పౌనఃపున్యం అంటాం. కాంతి పౌనఃపున్యం అనేది కాంతి జనకం యొక్క లక్షణం. ఇది ఏ యానకం వలన కూడా మారదు. అనగా వక్రీభవనంలో కూడా పౌనఃపున్యం. మారదు. అందువల్ల పారదర్శక పదార్థం గుండా ప్రయాణించే ‘రంగు కాంతి’ యొక్క రంగు మారదు.
ప్రశ్న 49.
కంటి నుండి వస్తు దూరాన్ని పెంచినపుడు కంటిలోని ప్రతిబింబం దూరం ఎలా మారుతుంది?
జవాబు:
కంటిలో ప్రతిబింబ దూరం (కంటి కటకము మరియు రెటీనాల మధ్య దూరం) స్థిరంగా ఉంటుంది. దీనిని మార్చలేము. కావున వస్తుదూరాన్ని పెంచినప్పటికీ ప్రతిబింబ దూరం మారదు. కాని ప్రతిబింబ పరిమాణంలో మార్పు ఉంటుంది.
ప్రశ్న 50.
విమానంలో నుండి చూసినపుడు ఇంద్రధనుస్సు ఒక పూర్తి వృత్తం లాగా కనిపిస్తుంది. విమానం యొక్క నీడ ఎక్కడ ఏర్పడుతుంది?
జవాబు:
విమానానికి, ఇంద్రధనుస్సుకు మధ్య భూమి అడ్డుగా లేకపోవుట వల్ల, విమానంలో నుండి చూసినపుడు ఇంద్ర ధనుస్సు పూర్తి వృత్తాకారంగా కనిపిస్తుంది. అపుడు విమానం యొక్క నీడ వృత్తాకార ఇంద్రధనుస్సు యొక్క కేంద్రం వద్ద ఏర్పడుతుంది.
ప్రశ్న 51.
దృష్టికోణం అనగానేమి? దీని విలువ ఎంత?
జవాబు:
ఏ గరిష్ఠ కోణం వద్ద మనము వస్తువును పూర్తిగా చూడగలమో, ఆ కోణాన్ని దృష్టికోణం అంటారు. దృష్టికోణం విలువ 60°
10th Class Physics 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
ఇంద్రధనుస్సు ఏ ఏ సందర్భాలలో ఏర్పడుతుంది? ఎందుకు ఏర్పడుతుంది?
జవాబు:
i) వర్షం పడిన తరువాత గాలిలో నీటి తుంపరలు ఉన్న సమయంలో సూర్యరశ్మి ఉన్న సమయంలో ఇంధ్రధనుస్సు ఏర్పడును.
ii) ప్రకృతిలోని తెల్లని సూర్యకాంతి, అనేక లక్షల నీటి బిందువుల చేత విక్షేపణం చెందడం వలన ఇంధ్రధనుస్సు ఏర్పడును.
ప్రశ్న 2.
ఒక వ్యక్తికి స్పష్ట దృష్టి కనీస దూరం 35 సెం.మీ. ఉన్నట్లుగా గుర్తించాం. అతని పరిసరాలను అతను స్పష్టంగా చూడడానికి ఏ కటకం ఉపయోగపడుతుంది? ఎందుకు?
జవాబు:
ఒక వ్యక్తి స్పష్టదృష్టి కనీస దూరం 35 సెం.మీ. అనగా అది సాధారణ మానవుని స్పష్టదృష్టి కనీస దూరం (25 సెం.మీ) కన్నా ఎక్కువ. కనుక ఆ వ్యక్తికి గల దోషం ‘దీర్ఘ దృష్టి’.
అతను పరిసరాలను స్పష్టంగా చూడడానికి ఉపయోగపడే కటకం “ద్వికుంభాకార కటకం”.
ప్రశ్న 3.
కుంభాకార కటకం ఉపయోగించి దీర్ఘ దృష్టి దోషం సవరించడాన్ని చూపే కిరణ చిత్రంను గీయండి.
జవాబు:
ప్రశ్న 4.
కంటిలోని ఐరిస్ పనితీరును మీరు ఎలా అభినందిస్తారు?
జవాబు:
కనుపాప ద్వారా కంటిలోకి ప్రవేశించే కాంతి మొత్తాన్ని నియంత్రిస్తుంది.
ప్రశ్న 5.
పట్టకము యొక్క వక్రీభవన గుణకమును కనుగొనుటకు నీవు ఏ పరికరాలను ఉపయోగిస్తావు? ఈ ప్రయోగములో గ్రాఫ్ యొక్క ఆవశ్యకతను తెలపండి.
జవాబు:
పరికరాలు :
పట్టకం, తెల్లని డ్రాయింగ్ చార్ట్, పెన్సిల్, గుండుసూదులు, స్కేలు మరియు కోణమానిని
గ్రాఫ్ ఆవశ్యకత :
కనిష్ట విచలన కోణము కనుగొనడానికి గ్రాఫ్ ఉపయోగపడును.
ప్రశ్న 6.
సిలియరి కండరాలలో వ్యాకోచ, సంకోచాలు లేనట్లయితే ఏమి జరుగునో ఊహించి రాయండి.
జవాబు:
- సిలియరి కండరాలలో సంకోచ, వ్యాకోచాలు లేనట్లయితే కంటి కటక నాభ్యంతరం మారదు.
- మానవుని కన్ను నిర్దిష్ట దూరంలోని వస్తువులను మాత్రమే చూడగలుగుతుంది. ఆ వస్తువు కన్నా దగ్గరగా ఉన్న లేదా దూరంగా ఉన్న వస్తువును కన్ను చూడలేదు.
ప్రశ్న 7.
నిత్య జీవితంలో కాంతి విక్షేపణంను గమనించే రెండు సందర్భాలు తెలపండి.
జవాబు:
నిత్య జీవితంలో కాంతి విక్షేపణాన్ని కింది సందర్భాలలో గమనించవచ్చు.
- ఇంద్రధనుస్సు ఏర్పడడం.
- త్రిభుజాకార పారదర్శక పదార్థాల గుండా (పట్టకం, స్కేలు అంచు) సూర్యకాంతిని చూడడం.
- నూతన నిర్మాణ ఇండ్లగోడలకు నీటిని కొట్టడం (క్యూరింగ్) వంటి సందర్భాలలో.
- నీటిలో ఏటవాలుగా మునిగిన సమతల దర్పణాల వలన కాంతి విక్షేపణం.
ప్రశ్న 8.
ప్రస్వదృష్టి దోషాన్ని సరిచేయుటను చూపు కిరణ రేఖాచిత్రాన్ని గీయండి.
జవాబు:
ప్రశ్న 9.
కాంతి విక్షేపణం, పరిక్షేపణం జరుగకపోతే ఏమి జరుగుతుంది?
జవాబు:
- కాంతి విక్షేపణం జరుగకపోతే తెల్లని రంగు గల సూర్యకాంతి ఏడు రంగులుగా విడిపోదు (లేదా) ఇంద్రధనుస్సు ఏర్పడదు.
- కాంతి పరిక్షేపణం జరుగకపోతే
ఎ. సూర్యుడు ఉదయం, సాయంత్రం వేళల్లో ఎర్రగా కనపడడు. ఎల్లప్పుడూ తెల్లగానే కనిపిస్తాడు.
బి. ఆకాశం నీలిరంగులో కనిపించదు.
సి. వస్తువులకు వివిధ రంగులు ఉండడం జరుగదు.
డి. వస్తువులను మనం చూడలేము.
ప్రశ్న 10.
కిషోర్ కళ్ళ అద్దాలు ధరించాడు. అతడి కళ్ళద్దాల గుండా నువ్వు చూసినపుడు అతడి కళ్ళ పరిమాణం, అసలు పరిమాణం కంటే పెద్దదిగా కనిపించాయి.
a) అతడు వాడిన కటకం ఏ రకం?
b) ఆ దృష్టి దోషాన్ని వివరించండి. (పట సహాయంతో)
జవాబు:
a) కిషోర్ కళ్ళద్దాల గుండా నువ్వు చూసినపుడు అతడి కళ్ళ పరిమాణం, అసలు పరిమాణం కంటే పెద్దదిగా కనిపించాయి. అనగా అతడు వాడిన కటకం కుంభాకార కటకం. ఈ కుంభాకార కటకం గుండా చూసినపుడు వస్తువులు పెద్దవిగా కనిపిస్తాయి.
b) కిషోర్ కు గల దోషము, అతడు వాడుచున్న కటకాన్ని బట్టి అతనికి దీర్ఘదృష్టి కలదని అర్థమగుచున్నది.
ఈ దృష్టిదోషం గల వ్యక్తి దగ్గర వస్తువులను చూడలేరు. దీనికి గల కారణం వస్తువులు ఏర్పరచు ప్రతిబింబం రెటీనాకు ఆవల ఏర్పడును. దీని సవరణకు కుంభాకార కటకంను వాడుట వలన కిరణాలు రెటీనా పై పడు విధంగా చేయవచ్చును.
ప్రశ్న 11.
సూర్య రాత్రి 12 గంటలకు నిద్రలేచి, తన రూమ్ లోగల ట్యూబ్ లైట్ స్విచ్ ను ఆన్ చేశాడు. తను ఆ కాంతిలో కనురెప్పలను తెరవటం కష్టం అనిపించింది. దానికి గల కారణాలను ఊహించండి.
జవాబు:
- సాధారణంగా మానవుని కంటి రెటీనా ఒకేసారిగా కాంతి లేమి ప్రాంతం నుండి తీవ్రత ప్రాంతం వైపు చూడలేదు.
- కాంతి తక్కువగా ఉన్నప్పుడు కనుపాప పెద్దగా ఉంటుంది. ఒకేసారి లైట్ వెలిగి ఎక్కువ కాంతి కంటిలోకి వెళ్ళడం కన్ను భరించలేదు. కనుక కనుపాప పరిమాణం తగ్గిన తర్వాత మాత్రమే’ అతను కన్ను పూర్తిగా తెరువగలడు. అందుకు కొద్దిగా సమయం పడుతుంది.
ప్రశ్న 12.
తరగతి గదిలో నలుగురు స్నేహితులు కటక నాభ్యాంతరాన్ని ప్రయోగపూర్వకంగా కనుగొన్నారు. ఆ విలువలు వరుసగా 12.1 సెం.మీ., 12.2 సెం.మీ. 12.05 సెం.మీ., 12.3 సెం.మీ. గా వచ్చినవి. ఆ స్నేహితులు వారు చూసుకొని ఈ దోషాలకు లేక వ్యత్యాసాలకు గల కారణాలను చర్చించారు. ఆ కారణాలను తెల్పండి.
జవాబు:
విద్యార్థులు వివిధ నాభ్యంతర విలువలు పొందిరి.
- పై విలువలను గమనించగా వారందరికీ అన్నీ ధనాత్మక విలువలున్నాయి. అనగా వారికి కుంభాకార కటకమును ఇచ్చిరి.
- వారందరికీ ఒకే పూర్ణసంఖ్య విలువ వచ్చినది, కానీ దశాంశ సంఖ్య వేరుగా కలదు.
కారణాలు : - వారందరి విలువలలో తేడాకు గల కారణము కనీస కొలతలో దోషాలు, దృష్టిదోషాలు, ప్రయోగ వైఫల్యాలు మరియు కొలతలను గుర్తించు దోషాలు మొదలగునవి.
ప్రశ్న 13.
రెటీనా పని తీరును నీవెలా అభినందిస్తావు?
జవాబు:
- రెటీనా అనేది ఒక సున్నితమైన పొర.
- దీనిలోని గ్రాహకాలు కాంతి సంకేతాలను గ్రహిస్తాయి. దండాలు కొంతి తీవ్రతను గుర్తిస్తాయి.
- శంఖువులు రంగును గుర్తిస్తాయి.
- ఈ సంకేతాలు దాదాపు 1 మిలియన్ దృకనాడుల ద్వారా మెదడుకు చేరవేయబడతాయి.
- వాటిలోని సమాచారాన్ని అనగా వస్తువు ఆకారం, పరిమాణం మరియు రంగులలో ఏ మార్పూ లేకుండా వస్తువును మనం గుర్తించే విధంగా రెటీనా ఉపయోగపడుతుంది. కావున ఇది అభినందనీయమైనది.
ప్రశ్న 14.
దండాలు, శంఖువుల ఉపయోగాలను తెలుపండి.
జవాబు:
దండాలు కాంతి తీవ్రతను గుర్తిస్తాయి. శంఖువులు రంగును గుర్తిస్తాయి. శంఖువులు సరిగా పనిచేయకపోతే వర్ణ అంధత్వం ఏర్పడుతుంది. దండాలు సరిగా పనిచేయకపోతే కాంతిని సరిగా చూడలేం.
ప్రశ్న 15.
హ్రస్వదృష్టి, దీర్ఘ దృష్టిల మధ్యగల భేదాలను తెలుపండి.
జవాబు:
హ్రస్వదృష్టి | దీర్ఘదృష్టి |
1. ఈ దృష్టి లోపం గలవారు గరిష్ఠ దూర బిందువుకు దూరంగా ఉండే వస్తువులు చూడలేరు. | 1. ఈ దృష్టి లోపం గలవారు కనిష్ఠ దూర బిందువు కంటే దగ్గరగా ఉన్న వస్తువులను చూడలేరు. |
2. కాంతి కిరణాలు రెటీనాకు ముందు కేంద్రీకరించబడతాయి. | 2. కాంతి కిరణాలు రెటీనా వెనుకవైపు కేంద్రీకరించబడతాయి. |
3. ద్విపుటాకార కటకం ద్వారా ఈ దృష్టి దోషాన్ని నివారించవచ్చు. | 3. ద్వికుంభాకార కటకాన్ని ఉపయోగించి ఈ దృష్టి దోషాన్ని నివారించవచ్చు. |
ప్రశ్న 16.
ఈ క్రింది పదాలను నిర్వచించండి.
ఎ) పట్టకము
బి) కాంతి విక్షేపణం
సి) కాంతి పరిక్షేపణం
జవాబు:
ఎ) పట్టకము : ఒకదానికొకటి కొంత కోణం చేసే కనీసం రెండు సమతలాలతో పరిసర యానకం నుండి వేరుచేయబడి ఉన్న పారదర్శక యానకాన్ని పట్టకం అంటారు.
బి) కాంతి విక్షేపణం : తెల్లని కాంతి పట్టకం గుండా ప్రసరించినపుడు వివిధ రంగులుగా విడిపోవడాన్ని కాంతి విక్షేపణం అంటారు.
సి) కాంతి పరిక్షేపణం : ఒక కణం తను శోషించుకొన్న శక్తిలో కొంత భాగాన్ని అన్ని దిశలలో వివిధ తీవ్రతలతో ఉద్గారం చేయడాన్ని కాంతి పరిక్షేపణం అంటారు.
ప్రశ్న 17.
పట్టక వక్రీభవన గుణకం కనుగొనుటలో గ్రాఫ్ ప్రాముఖ్యతను తెలుపండి.
జవాబు:
- గ్రాఫ్ ద్వారా పతనకోణం, విచలన కోణంకు ను గీస్తే ఆ గ్రాఫ్ ద్వారా లభించే కనిష్ఠ విలువ కనిష్ఠ విచలన కోణాన్ని తెలియజేస్తుంది.
- పట్టక వక్రీభవన గుణకం కనుగొనడానికి పట్టక కోణంతోపాటు కనిష్ఠ విచలన కోణం అవసరం.
ప్రశ్న 18.
మీ స్నేహితునికి ఉన్న దృష్టి దోషాన్ని తెలుసుకొనుటకు నీవు అతనిని ప్రశ్నించుటకు కొన్ని ప్రశ్నలను తయారుచేయండి.
జవాబు:
- నీకు పుస్తకంలో అక్షరాలు కనపడటం లేదా (లేదా) మసకగా కనిపిస్తున్నాయా?
- నీకు క్లాస్ లో చివరి బెంచిలో కూర్చున్నప్పుడు బోర్డ్ పై రాసిన అక్షరాలు కనపడటం లేదా?
- నీవు పుస్తకాన్ని బాగా దూరంగా పెట్టి చదువుతున్నావా?
- రోడ్డుమీద నడుస్తున్నప్పుడు హోర్డింగ్ మీద ఉన్న అక్షరాలు కనపడడం లేదా?
ప్రశ్న 19.
పట్టకము వక్రీభవన గుణకాన్ని కనుగొనుటకు కావలసిన వస్తువులను వ్రాయండి.
జవాబు:
కావలసిన వస్తువులు :
పట్టకం, తెల్లని డ్రాయింగ్ చార్ట్ (20 x 20 సెం.మీ.), పెన్సిల్, గుండుసూదులు మరియు కోణమానిని, గ్రాఫ్ కాగితం.
ప్రశ్న 20.
కాంతి విక్షేపణలో, ఏర్పడిన ఇంద్రధనుస్సు రంగులను మీ పరిసరాలలో ఈ ప్రక్రియను గమనించిన ఇతర ఉదాహరణలను వ్రాయండి.
జవాబు:
- ఫౌంటన్ నీటి ద్వారా కాంతి ప్రసరించినపుడు వివిధ రంగులు గమనించవచ్చు.
- టార్చిలైట్ ద్వారా తెల్లని కాంతిని నీటి బిందువుల ద్వారా పంపిస్తే అది వివిధ రంగులలో విడిపోతుంది.
ప్రశ్న 21.
పట్టకానికి సంబంధించిన పదాలను పటము ద్వారా వివరించండి.
జవాబు:
- పతన కిరణం : పట్టకంపైన పడిన కాంతి కిరణం
- బహిర్గత కిరణం : పట్టకం రెండవ తలం నుంచి బయటకు వచ్చిన కిరణం.
- పతనకోణం (i) : పతన కిరణానికి, లంబానికి మధ్య గల కోణం.
- బహిర్గత కోణం (i,) : బహిర్గత కిరణానికి, లంబానికి మధ్య గల కోణం.
- విచలన కోణం : పతన కిరణానికి, బహిర్గత కిరణానికి మధ్య గల కోణం.
- పట్టక కోణం (A) : పట్టకంలోని రెండు అంచుల మధ్య గల కోణం.
ప్రశ్న 22.
దాతల “నేత్రదానాన్ని” నీవు ఎలా ప్రశంసిస్తావు?
జవాబు:
ప్రపంచంలో ఏ వస్తువునైనా చూడాలంటే మనకు కన్ను అవసరం. అటువంటి కన్నులు లేనివారు ఈ అద్భుత ప్రపంచాన్ని చూడలేరు. కాబట్టి అటువంటి అంధులకు దృష్టి సామర్థ్యాన్ని కలుగజేసే నేత్రదానం ఎంతైనా ప్రశంసనీయం.
ప్రశ్న 23.
కాంతి విక్షేపణలో ఎరుపు రంగు, ఊదారంగుల వివిధ లక్షణాలను తెలుపండి.
తరంగదైర్ఘ్యం పెరిగితే వక్రీభవన గుణకం తగ్గుతుంది. కాంతి విక్షేపణం చెందినపుడు ఎరుపురంగు తక్కువ విచలనాన్ని పొందుతుంది. ఊదారంగు ఎక్కువ విచలనం పొందుతుంది. కారణం ఎరుపురంగు తరంగదైర్ఘ్యం ఎక్కువ. అంటే వక్రీభవన గుణకం తక్కువ కాబట్టి తక్కువ విచలనానికి గురి అవుతుంది.
10th Class Physics 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
కావ్య దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలదు. కానీ దగ్గర వస్తువులను చూడలేదు. ఆమెకు ఉన్న దృష్టి దోషం ఏది? దృష్టి దోషం ఉన్న మరియు దృష్టి దోషాన్ని సవరించుటకు చూపే పటములు గీయండి.
(లేదా)
రేవతి తరగతి గదిలో ముందు వరుసలో కూర్చునే విద్యార్థిని బోర్డుపై గీయబడిన బొమ్మ సరిగా కనిపించకపోవడంతో ఉపాధ్యాయుని అనుమతితో వెనుక వరుసలో కూర్చొని గీయగలిగింది. ఆమెకు ఉండే కంటి దోషం ఏది ? దాని సవరణను సూచించే పటం గీయండి.
జవాబు:
కావ్యకు దీర్ఘ దృష్టి లోపము ఉన్నది.
ఈ క్రింది పటాలు దృష్టి దోషాన్ని మరియు సవరించుటను చూపుతాయి.
ప్రశ్న 2.
దీర్ఘ దృష్టిని సవరించడానికి ఉపయోగించే ద్వికుంభాకార కటకం యొక్క నాభ్యంతరం ఎంత ఉండాలో మీరెలా నిర్ణయిస్తారు?
జవాబు:
దీర్ఘదృష్టి గల వ్యక్తికి దగ్గర వస్తువులు కనిపించవు. కనిష్టదూర బిందువు (H) కు అవతల ఉన్న వస్తువులను మాత్రమే చూడగలడు. సవరణ కొరకు స్పష్ట దృష్టి కనీస దూరం (L) వద్ద ఉన్న వస్తువుకు కనిష్ఠ దూరబిందువు (H) వద్ద ప్రతిబింబం ఏర్పడాలి.
u : -25 సెం.మీ.; V = =d సెం.మీ.;
ఇక్కడ d > 25, కనుక ‘f’ కు ధనవిలువ వస్తుంది అనగా కుంభాకార కటకం వాడాలి.
ప్రశ్న 3.
దృష్టిదోషం గల ఒక వ్యక్తికి నేత్రవైద్యుడు + 2D కటకంను సూచించాడు. ఆ వ్యక్తికి గల దృష్టి దోషం ఏది? ఆ దృష్టిదోషాన్ని చూపు పటం మరియు తగిన కటకంతో ఆ దోషాన్ని సవరించుటకు సూచించు పటం గీయుము.
జవాబు:
నేత్ర వైద్యుడు సూచించిన కటకం + 2D కావున అది ద్వికుంభాకార కటకం. ద్వికుంభాకార కటకం దీర్ఘదృష్టి నివారణకు ఉపయోగిస్తారు. కనుక ఆ వ్యక్తికి దీర్ఘదృష్టి లోపము ఉందని చెప్పవచ్చును.
ప్రశ్న 4.
కాంతి పరిక్షేపణమును ప్రయోగపూర్వకంగా చూపుటకు కావలసిన పరికరాలు, రసాయనాల జాబితాను రాసి, – ప్రయోగ విధానాన్ని వివరించండి.
జవాబు:
కావలసిన పరికరాలు, రసాయనాలు : ఒక బీకరు, సోడియం థయో సల్ఫేట్ (హైపో) సల్ఫ్యూరికామ్లం, నీరు.
ప్రయోగ విధానము:
- ఒక బీకరు తీసుకొని సోడియం థయోసల్ఫేటు ద్రావణమును తయారు చేయాలి.
- ఈ బీకరును ఆరుబయట ఎండలో సూర్యుని వెలుగులో ఉంచాలి.
- బీకరులోని ద్రావణానికి సల్ఫ్యూరికామ్లమును కలపాలి. బీకరులో సల్పర్ స్పటికాలు ఏర్పడడం గమనించితిని.
- ప్రారంభంలో సల్ఫర్ స్ఫటికాలు చాలా చిన్నవిగాను, చర్య జరుగుతున్న కొద్ది ఏర్పడిన స్ఫటికాల పరిమాణం పెరుగుతున్నట్లు గమనించితిని.
- మొదట సల్ఫర్ స్ఫటికాలు నీలిరంగులో ఉండి వాటి పరిమాణం పెరుగుతున్న కొలది తెలుపు రంగులోకి మారతాయి. దీనికి కారణం కాంతి పరిక్షేపణం.
ప్రశ్న 5.
ఫణి తాతగారు పేపర్ చదవలేకపోతున్నారు. అది చూసిన ఫణి వాళ్ళ తాతగారికి కటకాన్ని ఇచ్చి చదవమన్నాడు.
ఎ) అతడు ఇచ్చిన కటకం ఏమిటి?
బి) ఆ కటకాన్ని ఇవ్వడానికి గల అంశాలను తెలియజేయండి. స్పష్టత కోసం పట సహాయం తీసుకోండి.
జవాబు:
ఎ) ఫణి ఇచ్చిన కటకం ద్వికుంభాకార కటకం.
బి) ఫణి తాతగారు పేపరు చదవలేకపోతున్నారు, అనగా దగ్గరి వస్తువులను చూడలేకపోవటమే. ఇది దీర్ఘదృష్టి అను కంటి దోషప్రభావమే. దీనిని కుంభాకార కటకంతో సవరించవచ్చు.
ప్రశ్న 6.
ఒక చెరువు ప్రక్కన గల రోడ్డుపై బస్సులో నీవు ప్రయాణిస్తున్నావు. ఆ చెరువులో నీటి ఫౌంటేన్ నుండి నీరు వెదజల్ల ‘బడుతుంది. దాని గుండా చూసిన నీకు ఇంద్రధనస్సు కనిపించింది. కాని అది కొంతదూరం పోయిన తర్వాత కనిపించలేదు. దీనిని ఎలా వివరిస్తావు?
జవాబు:
- నీటి బిందువులలోకి ప్రవేశించే కిరణాలు, బయటకు వెళ్ళే కిరణాల మధ్యకోణం 0° నుండి 42° మధ్య ఎంతైనా ఉన్నప్పుడు మనము ఇంద్రధనుస్సును చూడగలము.
- ఆ కోణం. 40° నుండి 42° లకు దాదాపు సమానంగా ఉన్నప్పుడు ప్రకాశవంతమైన ఇంద్రధనుస్సును మనం చూడగలము.
- బస్సులో ప్రయాణిస్తున్న నేను ఆ కోణం కంటే ఎక్కువ కోణంను ఏర్పరచినప్పుడు ఇంద్రధనుస్సు నాకు కన్పించదు.
ప్రశ్న 7.
కంటి కటక గరిష్ఠ, కనిష్ఠ నాభ్యంతరాలను కనుగొనుము.
జవాబు:
గరిష్ఠ నాభ్యంతరం :
1) అనంత దూరంలోనున్న వస్తువు నుండి వచ్చే సమాంతర కాంతి కిరణాలు కంటి కటకంపై పడి వక్రీభవనం చెందాక రెటీనా పై ఒక భిందురూప ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. ఈ సందర్భంలో కంటి కటక నాభ్యంతరం గరిష్ఠంగా ఉంటుంది.
2) వస్తువు అనంత దూరంలోనున్నపుడు
కనిష్ఠ నాభ్యంతరం :
1) కంటి ముందు 25 సెం.మీ. దూరంలో వస్తువు ఉందనుకుందాం. ఈ సందర్భంలో కంటి కటక నాభ్యంతరం కనిష్ఠంగా ఉంటుంది.
అపుడు
ప్రశ్న 8.
చత్వారం అనగానేమి? దానినెట్లా సరిదిద్దుతారు?
జవాబు:
- వయసుతో పాటుగా కంటి సర్దుబాటు సామర్థ్యం తగ్గిపోయే దృష్టిదోషాన్ని చత్వారం అంటారు.
- వయసుతో పాటుగా చాలామందికి కనిష్ట దూర బిందువు క్రమంగా దూరమైపోతుంది. అప్పుడు వారు దగ్గరలోనున్న వస్తువులను స్పష్టంగా చూడలేరు.
- సిలియరీ కండరాలు క్రమంగా బలహీనపడి కంటి కటక స్థితిస్థాపక లక్షణం క్రమంగా తగ్గిపోవటం వలన ఈ విధంగా జరుగుతుంది. కొన్నిసార్లు హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి దోషాలు రెండూ కలుగవచ్చు.
- ఇటువంటి దోషాల్ని సవరించడానికి ద్వి-నాభ్యంతర కటకాన్ని ఉపయోగించాలి. ఈ కటకం పై భాగంలో పుటాకార కటకం, క్రింది భాగంలో కుంభాకార కటకం ఉంటాయి.
ప్రశ్న 9.
కాంతి పరిక్షేపణ అనగానేమి? కాంతి ఎలా పరిక్షేపణ చెందుతుంది?
జవాబు:
కాంతి పరిక్షేపణ :
కణాలు తాము శోషించుకున్న శక్తిలో కొంత భాగాన్ని అన్ని దిశల్లో వివిధ తీవ్రతలతో తిరిగి ఉద్గారం చేసే ప్రక్రియను కాంతి పరిక్షేపణ అంటారు.
- అంతరాళంలో ఒక స్వేచ్ఛా పరమాణువు లేదా అణువు ఉన్నదనుకుందాం. ఆ కణంపై నిర్దిష్ట పౌనఃపున్యం గల కోంతి పతనమైనదనుకుందాం.
- ఆ కణం పరిమాణం, పతనం చెందిన కాంతి తరంగదైర్ఘ్యంతో పోల్చదగిన విధంగా ఉన్నపుడు మాత్రమే ఆ కాంతికి, కణం స్పందిస్తుంది. ఈ నియమం పాటించబడినపుడు మాత్రమే ఆ కణం కాంతిని శోషించుకుని కంపనాలు చేస్తుంది.
- ఈ కంపనాల వలన కణం శోషించుకున్న శక్తిలో కొంత భాగాన్ని అన్ని దిశలలో వివిధ తీవ్రతలలో తిరిగి ఉద్గారం చేస్తుంది.
- ఇలా తిరిగి ఉద్గారించడాన్నే కాంతి పరిక్షేపణం అంటారు. ఉద్గారమైన కాంతిని పరిక్షేపణ కాంతి అంటారు.
- ఈ అణువులు / పరమాణువులను పరిక్షేపణ కేంద్రాలు అంటారు.
ప్రశ్న 10.
పట్టకం కాంతిని విక్షేపణం చెందించును కాని గాజు పలక చెందించదు. వివరించుము.
జవాబు:
- పట్టకంలో కాంతి వక్రీభవనం రెండు తలాల వద్ద జరుగును.
- మొదటి తలం వద్ద కాంతి విక్షేపణం చెంది, వివిధ రంగులు గల కాంతి కిరణాలు, వాటి పౌనఃపున్యాల ఆధారంగా వివిధ కోణాలలో ప్రయాణిస్తాయి.
- ఇవి రెండవ తలాన్ని చేరి మరొకసారి వక్రీభవనానికి గురై మరింతగా విడిపోతాయి.
- దీర్ఘచతురస్రాకార గాజుదిమ్మెలో, రెండు సమాంతర తలాలలో వక్రీభవనం జరుగుతుంది.
- మొదటి తలం వద్ద కాంతి విక్షేపణానికి గురై దానిలోని వివిధ రంగులుగా విడిపోయినప్పటికి, రెండవ తలం సమాంతరంగా వుండడం వల్ల ఆ కిరణాలు మరొకసారి వక్రీభవనానికి గురియైన కూడా కలిసిపోయి తెల్లని కాంతిగా బయటకు వస్తుంది.
ప్రశ్న 11.
మానవుని కంటి నిర్మాణమును పటము ద్వారా వివరించండి.
జవాబు:
- కంటి ముందు భాగం కార్నియా అనే పారదర్శక రక్షణ పొరను కలిగి ఉంటుంది.
- కార్నియా వెనుక ప్రదేశంలో నేత్రోదక ద్రవం ఉంటుంది.
- దీని వెనుక ప్రతిబింబ ఏర్పాటుకు ఉపయోగపడే కటకం ఉంటుంది.
- నేత్రోదక ద్రవానికి, కటకానికి మధ్య నల్లగుడ్డు / ఐరిస్ అనే కండర పొర ఉంటుంది.
- ఈ కండర పొరకు ఉండే చిన్న రంధ్రాన్ని కనుపాప అంటారు.
- కంటిలోకి వెళ్ళే కాంతిని నియంత్రించే ద్వారం లాగా కనుపాపకు ఐరిస్ సహాయపడుతుంది.
- కంటిలోకి ప్రవేశించిన కాంతి కనుగుడ్డుకు వెనుకవైపున ఉండే రెటీనా పై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.
10th Class Physics 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం Important Questions and Answers
ప్రశ్న 1.
వివిధ వస్తు దూరాలకు ఒకే ప్రతిబింబ దూరం ఉండడం ఎలా సాధ్యం?
జవాబు:
1. వివిధ వస్తు దూరాలకు ఒకే ప్రతిబింబం ఏర్పడుటకు, కంటి నిర్మాణమే ముఖ్య కారణము.
2. కంటి నిర్మాణంలో గల సిలియరి కండరాలు అధిక దూరపు, అల్ప దూరపు వస్తువుల ప్రతిబింబాలు కటకంపై సరిగా ఏర్పడే విధంగా సహాయపడతాయి.
ప్రశ్న 2.
కన్ను తన నాభ్యంతరాన్ని ఎలా మార్చుకుంటుంది?
జవాబు:
- దూరంలో ఉన్న వస్తువును కన్ను చూస్తున్నపుడు సిలియరి కండరాలు విశ్రాంత స్థితిలో ఉండటం వల్ల కంటి కటక నాభ్యంతరం గరిష్టమగును. అనగా కటకం నుండి రెటీనాకు గల దూరానికి, నాభ్యంతరం విలువ సమానమగును.
- ఈ సందర్భంలో కంటిలోనికి వచ్చు సమాంతర కిరణాలు రెటీనాపై కేంద్రీకరింపబడుట వలన వస్తువును మనము చూడగలము.
- దగ్గరగా ఉన్న వస్తువును కన్ను చూస్తున్నపుడు సిలియరి కండరాలు ఒత్తిడికి గురికావడం వల్ల కంటి కటక నాభ్యంతరం తగ్గును. రెటీనా పై ప్రతిబింబం ఏర్పడే విధంగా సిలియరి కండరాలు కటక నాభ్యంతరంను మార్చి, నాభ్యంతర విలువ తగిన విధంగా సర్దుబాటు చేయును.
ఈ విధముగా కంటిలోని కటకానికి ఆనుకొని ఉన్న సిలియరి కండరాలు కటక వక్రతావ్యాసార్ధాన్ని మార్చడం ద్వారా కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకోవడానికి దోహదపడతాయి.
ప్రశ్న 3.
పై పటంలో చూపిన భాగం దేనిని సూచిస్తుంది? దాని పనితీరు తెలుపుము.
జవాబు:
పటంలో చూపించబడిన కంటి భాగము సిలియరి కండరాలు.
పనితీరు :
- సిలియరి కండరాలు, కంటి కటకం వస్తుదూరానికి అనుగణంగా తన నాభ్యంతరాన్ని మార్చుకుంటుంది.
- దూరంగా ఉన్న వస్తువును కన్ను చూస్తున్నపుడు కటక నాభ్యంతరం గరిష్టమయ్యినపుడు, వస్తువు నుండి వచ్చే కిరణాలు రెటీనాపై కేంద్రీకరింపబడునట్లు ఈ కండరాలు సహాయపడుతాయి.
- దగ్గరగా ఉన్న వస్తువును కన్ను చూస్తున్నపుడు, కటక నాభ్యంతరం కనిష్టమయినపుడు, వస్తువు నుండి వచ్చే కిరణాలు రెటీనాపై కేంద్రీకరింపబడునట్లు ఈ కండరాలు సహాయపడతాయి. ఈ విధంగా సర్దుబాటు లక్షణంను సిలియరి కండరాలు ప్రదర్శించి మన కంటికి స్పష్టదృష్టిని అందిస్తాయి.
ప్రశ్న 4.
కంటి ముందు వస్తువు ఎంత దూరంలో ఉన్న ప్రతిబింబ దూరం మాత్రం 2.5 సెం.మీ మాత్రమే ఉంటుంది. నీ సమాధానం సమర్దింపుము.
జవాబు:
- సిలియరి కండరాలు మానవుని కంటిలో లేకుంటే, దూరపు వస్తువులను మరియు దగ్గర వస్తువులను స్పష్టంగా చూడలేము.
- ఈ ప్రభావం వలన వస్తు పరిమాణం, ఆకారంలో స్పష్టత లోపిస్తుంది.
- కనుక సిలియరి కండరాలు లేని మానవుని కన్ను వలన దృష్టిలో దాదాపు 30% వరకు మాత్రమే ఉపయోగము కానీ పూర్తిగా ఉపయోగము ఉండేది కాదు.
- మనము, మనకు తెలిసిన వారిని కూడా త్వరగా గుర్తించలేము.
ప్రశ్న 5.
కంటి కటక నాభ్యంతరం 2.27 – 2.5 సెం.మీ మధ్యస్తంగా ఉండడానికి ఏ కండరాలు ఉపయోగపడతాయో వివరించండి.
జవాబు:
ఉదాహరణకు మనము ఒక వస్తువును కంటికి చాలా దగ్గరగా ఉంచినపుడు రెటీనా పై ప్రతిబింబం ఏర్పడే విధంగా నాభ్యంతరం సర్దుబాటు జరుగదు. కాబట్టి వస్తువును స్పష్టంగా చూడలేము. అదే వస్తువును స్పష్టంగా చూడాలంటే కనీసం 25 సెం.మీల దూరంలో ఉంచాలి.
(లేదా)
కంటి కటకం తన నాభ్యంతరాన్ని 2.27 సెం.మీ నుండి 2.5 సెం.మీలకు మధ్యస్థముగా ఉండేటట్లు సర్దుబాటు చేసుకుంటుంది. దీని ద్వారా ప్రతిబింబం రెటీనాపై ఏర్పడుతుంది.
10th Class Physics 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం ½ Mark Important Questions and Answers
1. మానవుని కంటి కటకం ప్రతిబింబ దూరం ఎంత
జవాబు:
2.5 సెం.మీ.
2. వస్తువు ఎక్కడ వున్నప్పుడు కుంభాకార కటక నాభ్యంతరం మరియు ప్రతిబింబ దూరం సమానమవుతుందో ఊహించుము.
జవాబు:
అనంత దూరంలో
3. మానవుని కంటి స్పష్టదృష్టి కనిష్ఠ దూరం ఎంత?
జవాబు:
25 సెం.మీ.
4. చిన్న పిల్లలలో స్పష్టదృష్టి కనిష్ఠ దూరం ఎంత? వుంటుంది?
జవాబు:
7 నుండి 8 సెం.మీ.
5. నీ స్నేహితుడు తన కంటి నుండి 10 సెం.మీ. దూరంలో గల వస్తువులను స్పష్టంగా చూడలేకపోతున్నాడు. అతని దృష్టి లోపం
a) హ్రస్వ దృష్టి
b) దీర్ఘ దృష్టి
c) చత్వారం
d) దృష్టి లోపం లేదు
జవాబు:
d) దృష్టి లోపం లేదు
6. క్రింది వానిలో దేనిని మానవుడు పూర్తిగా స్పష్టంగా చూడగలడు?
a) కంటితో 60° కోణం చేసే వస్తువును
b) కంటితో 60° కన్నా ఎక్కువ కోణం చేసే వస్తువును
c) కంటితో 60° కన్నా తక్కువ కోణం చేసే వస్తువును
d) a మరియు c
జవాబు:
d) a మరియు c
7. దృష్టికోణం మానవునిలో
a) 60°
b) 360°
C) 180°
d) 0°
జవాబు:
a) 60°
8. క్రింది వానిని జతపర్చుము :
a) దృష్టికోణం ( ) i) 2.5 సెం.మీ.
b) స్పష్ట దృష్టి కనిష్ఠ దూరం ( ) ii) 25 సెం.మీ.
c) రెటీనా-కంటి కటకం మధ్య గరిష్ఠ దూరం ( ) iii)60°
జవాబు:
a . (iii), b – (ii), C – (i)
9. మానవుని కంటి ఆకారం ఎలా వుంటుంది?
జవాబు:
గోళాకారంలో
10. కంటిలో పారదర్శక రక్షణ పొర ఏది?
జవాబు:
కార్నియా
11. నేత్రోదక ద్రవం కంటిలో ఎక్కడ ఉంటుంది?
జవాబు:
కార్నియా మరియు కంటి కటకం మధ్యలో
12. మన కంటిలో ఏ భాగం కనుపాపను కలిగి ఉంటుంది?
జవాబు:
ఐరిస్ (నల్లగుడ్డు)
13. కనుపాప (ఐరిస్) అనేది
a) పొర
b) ద్రవం
c) కటకం
d) ఏదీకాదు
జవాబు:
d) ఏదీకాదు
14. కంటిలో ఏ భాగం రంగులో కనిపిస్తుంది?
జవాబు:
ఐరిస్ (నల్లగుడ్డు)
15. A : కనుపాప నలుపు రంగులో కనిపిస్తుంది.
R : కనుపాప గుండా పోయే కాంతి తిరిగి వెనుకకు రాదు.
A) ‘A’ మరియు ‘R’ లు సరియైనవి. మరియు ‘R’, ‘A’ కు సరియైన కారణం.
B) ‘A’ మరియు ‘R’ లు సరియైనవి. మరియు ‘R’, ‘A’ కు సరియైన కారణం కాదు.
C) ‘A’ మాత్రమే సరియైనది.
D) ‘R’ మాత్రమే సరియైనది.
జవాబు:
A) ‘A’ మరియు ‘R’ లు సరియైనవి. మరియు ‘R’, ‘A’ కు సరియైన కారణం.
16. కంటిలోకి ప్రవేశించే కాంతిని అదుపు చేసేది ఏది?
జవాబు:
ఐరిస్
17. ఏ సందర్భంలో కనుపాప సంకోచిస్తుంది?
జవాబు:
ఎక్కువ తీవ్రత గల కాంతి కంటిలో ప్రవేశించినపుడు.
18. ‘కాంతిని నియంత్రించే ద్వారం’ అని దేనిని అంటారు?
జవాబు:
కనుపాప
19. కనుపాప సంకోచవ్యాకోచాలకు సహాయపడేది ఏది?
జవాబు:
ఐరిస్
20. కంటి కటక ప్రతిబింబ దూరం ఎంత ?
జవాబు:
2.5 సెం.మీ.
21. కంటి కటకానికి ఈ దూరం స్థిరంగా వుంటుంది.
A) వస్తు దూరం
B) ప్రతిబింబ దూరం
C) నాభ్యంతరం
D పైవన్నీ
జవాబు:
B) ప్రతిబింబ దూరం
22. కంటి కటకం యొక్క వక్రతా వ్యాసార్ధం మార్చడానికి సహాయపడేది ఏది?
జవాబు:
సిలియరి కండరం
23. కంటిలో ఏ భాగంనకు నిలియరి కండరాలు అతికించబడి వుంటాయి?
జవాబు:
కంటి కటకం
24. కంటి కటకం
a) కుంభాకార కటకం.
b) పుటాకార కటకం
c) a మరియు b
d) సమతల కుంభాకార కటకం
జవాబు:
a) కుంభాకార కటకం
25. కన్ను దగ్గరి వస్తువును చూసినపుడు
a) సిలియరి కండరాలు ఒత్తిడికి గురి అవుతాయి.
b) కంటి కటక నాభ్యంతరం తగ్గుతుంది.
c) a మరియు b
d) సిలియరి కండరాలు విశ్రాంతిలో ఉంటాయి.
జవాబు:
c) a మరియు b
26. క్రింది కంటి భాగాలను ఒక క్రమంలో అమర్చుము.
కంటి కటకం, నేత్రోదకం, రెటీనా, ఐరిస్, కార్నియా
జవాబు:
కార్నియా, ఐరిస్, నేత్రోదకం, కంటి కటకం, రెటీనా
27. దూరపు వస్తువులను చూసినపుడు సిలియరీ కండరాల స్థితి.
a) సంకోచం
b) వ్యాకోచం
c) a లేదా b
d) రెండూ కావు
జవాబు:
d) రెండూ కావు
28. కంటి కటకం యొక్క నాభ్యంతరం ఎప్పుడు తగ్గుతుంది?
జవాబు:
దగ్గర వస్తువులను చూస్తున్నప్పుడు
29. కంటి కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకునే ప్రక్రియను ఏమందురు ?
జవాబు:
సర్దుబాటు
30. వాక్యం (A) : 25 సెం.మీ. కన్నా తక్కువ దూరంలో ఉన్న వస్తువును మనం స్పష్టంగా చూడలేము.
కారణం (R1) : సిలియరీ కండరాలు విశ్రాంతి స్థితిలో ఉండటం వలన.
కారణం (R2) : సిలియరీ కండరాలు ఎక్కువ ఒత్తిడికి గురి కాలేవు.
A) R1 సరియైనది
B) R2 సరియైనది
C) A, B లు సరియైనవి
D) రెండూ సరియైనవి కావు
జవాబు:
B) R2 సరియైనది
31. కంటిలో రెటీనాపై ఏర్పడే ప్రతిబింబం లక్షణాలేవి?
జవాబు:
నిజ, తలక్రిందులు
32. కంటిలో దండాలు, శంఖువులు ఎక్కడ వుంటాయి?
జవాబు:
రెటీనాపై
33. కంటిలో ఏ గ్రాహకాలు రంగులను గుర్తిస్తాయి?
జవాబు:
శంఖువులు
34. కంటిలో ఏ గ్రాహకాలు కాంతి తీవ్రతను గుర్తిస్తాయి?
జవాబు:
దండాలు
35. కాంతి సంకేతాలను మెదడుకు తీసుకుపోయేవి ఏవి?
జవాబు:
దృక్ నాడులు
36. మన రెటీనాలో ఎన్ని గ్రాహకాలు ఉంటాయి?
జవాబు:
125 మిలియన్లు
37. వస్తువు ఆకారం, రంగు, పరిమాణాలను ఎవరు గుర్తిస్తారు?
జవాబు:
మెదడు
38. కంటి కటక నాభ్యంతర కనిష్ఠ, గరిష్ఠ విలువలు ఏమిటి?
జవాబు:
fగరిష్టం = 2.5 సెం.మీ., fకనిష్ఠం = 2.27 సెం.మీ.
39. జతపరుచుము :
a) fగరిష్టం ( ) i) వస్తువు 25 సెం.మీ. వద్ద
b) fకనిష్ఠం ( ) ii) వస్తువు అనంత దూరంలో
iii) వస్తువు 1 సెం.మీ. వద్ద
జవాబు:
a – ii, b-i
40.
పటంను బట్టి వస్తువు ఎక్కడ వుంది?
జవాబు:
అనంత దూరంలో
41.
పటంను బట్టి, కంటి కటక నాభ్యంతరం ఎంత?
జవాబు:
2.27 సెం.మీ.
42. అనంత దూరంలో వస్తువును చూసినపుడు కంటి కటక నాభ్యంతరం ఎంత వుంటుంది?
జవాబు:
2.5 సెం.మీ.
43. కంటి కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకునే సామర్థ్యంను ఏమంటారు?
జవాబు:
కటక సర్దుబాటు సామర్థ్యం
44. ఏవేని రెండు దృష్టి లోపాలను రాయండి.
జవాబు:
హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి
45. రమ దగ్గరగా వున్న వస్తువులను చూడగలదు. కానీ దూరంలో ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేదు. ఈమె దృష్టిలోపం ఏమిటి?
జవాబు:
హ్రస్వదృష్టి
46. క్రింది వానిలో f ఎంత వుంటే హ్రస్వదృష్టిని సూచిస్తుంది?
a) 2.5 సెం.మీ.
b) 2.27 సెం.మీ.
c) 2.7 సెం.మీ.
జవాబు:
b) 2.27 సెం.మీ.
47. క్రింద ఇవ్వబడిన పటం ఎటువంటి దృష్టి లోపాన్ని సూచిస్తుంది?
జవాబు:
హ్రస్వదృష్టి
48. పై పటంలో చూపిన దృష్టి లోపాన్ని సవరించుటకు వినియోగించవలసిన కటకం ఏమిటి?
జవాబు:
ద్విపుటాకార కటకం
49. పై పటంలో ‘M’ దేనిని సూచిస్తుంది?
జవాబు:
గరిష్ఠ దూర బిందువు
50. హ్రస్వదృష్టి గలవారు ఏ వస్తువులను చూడలేరు?
a) గరిష్ఠ దూర బిందువుకు ఆవల
b) గరిష్ఠ దూర బిందువుపై
c) గరిష్ఠ దూర బిందువు లోపల
జవాబు:
a) గరిష్ఠ దూర బిందువుకు ఆవల
51. ఏ గరిష్ఠ దూరం వద్దనున్న బిందువుకు లోపల గల వస్తువులకు మాత్రమే కంటి కటకం రెటీనాపై ప్రతిబింబంను ఏర్పరచగలదు? ఆ బిందువునేమంటారు?
జవాబు:
గరిష్ఠ దూర బిందువు (M)
52. గరిష్ఠ దూర బిందువుకు ఆవల ఉన్న వస్తువును చూడలేకపోయే దృష్టి లోపాన్ని ఏమంటారు?
జవాబు:
హ్రస్వదృష్టి
53. ఏ కటకం దూరపు వస్తువుల ప్రతిబింబాన్ని గరిష్ఠ దూర భిందువు వద్ద ఏర్పరచగలదు?
జవాబు:
ద్విపుటాకార కటకం
54. హ్రస్వదృష్టి గలవారు వినియోగించవలసిన ద్విపుటాకార కటక నాభ్యంతరాన్ని (f), గరిష్ఠ దూర బిందువు నుండి కంటికి గల దూరం (D) లలో వ్యక్తపరుచుము.
జవాబు:
f = – D
55. f = -D దీనిలో ‘-‘ గుర్తు దేనిని సూచించును?
జవాబు:
పుటాకార కటకం
56. కంటి కటక నాభ్యంతరం 2.27 సెం.మీ. కన్నా ఎక్కువైతే ఏ దృష్టిలోపం ఏర్పడును?
జవాబు:
దీర్ఘదృష్టి
57. దీర్ఘదృష్టిలో దగ్గరి వస్తువుల నుండి వచ్చే కాంతి కిరణాలు ఎక్కడ కేంద్రీకరింపబడతాయి?
జవాబు:
రెటీనాకు ఆవల
58. కనిష్ఠ దూర బిందువును ఏ దృష్టి లోపం గల వారిలో గుర్తిస్తారు?
జవాబు:
దీర్ఘదృష్టి
59. దీర్ఘదృష్టి సవరణకు వినియోగించవలసిన కటకం ఏది?
జవాబు:
ద్వికుంభాకార కటకం
60. a) దీర్ఘదృష్టి గలవారు కనిష్ఠ దూర బిందువు (H) కు, స్పష్టదృష్టి కనీస దూరం (L) కు మధ్య గల వస్తువులను చూడలేరు.
b) హ్రస్వదృష్టి గలవారు గరిష్ఠ దూరబిందువు (M)కి ఆవల గల వస్తువులు చూడలేరు. పై వాక్యా లలో ఏది సరియైనది?
జవాబు:
రెండూ సరియైనవే.
61.
పటంలో చూపబడిన దృష్టి లోపం ఏమిటి?
జవాబు:
దీర్ఘదృష్టి
62. దీర్ఘదృష్టి కలవారు వినియోగించవలసిన కటక నాభ్యంతరం కనుగొనుటకు సూత్రం రాయుము.
జవాబు:
63. వయసుతోబాటు కంటి కటక సామర్థ్యం తగ్గిపోవు దృష్టి లోపాన్ని ఏమంటారు?
జవాబు:
చత్వారం
64. చత్వారం గలవారు (హ్రస్వ మరియు దీర్ఘ దృష్టి లోపం) వినియోగించవలసిన కటకాలు ఏవి?
జవాబు:
ద్వినాభ్యంతర కటకం
65. చత్వారం వచ్చేవారు వినియోగించే కళ్ళద్దాలలో దిగువన ఉండే కటకం ఏది?
జవాబు:
కుంభాకార కటకం
66. కటక సామర్థ్యం అనగానేమి?
జవాబు:
కటక నాభ్యంతరం యొక్క విలోమ విలువ (లేదా) ఒక కటకం కాంతి కిరణాలను కేంద్రీకరించే స్థాయి లేదా వికేంద్రీకరించే స్థాయి.
67. కటక సామర్థ్యం సూత్రం రాయుము.
జవాబు:
68. కటక సామర్థ్యం ప్రమాణం రాయుము.
జవాబు:
డయాప్టర్
69. 2D కటకాన్ని వాడాలని డాక్టర్ సూచించారు. ఆ కటక నాభ్యంతరం ఎంత?
జవాబు:
70. ఒక కటకం నాభ్యంతరం 50 సెం.మీ. అయిన కటక సామర్థ్యం ఎంత?
జవాబు:
2 డయాప్టర్లు
71. గాజు పట్టకంలో ఎన్ని త్రికోణ భూములు ఉంటాయి?
జవాబు:
2
72. ‘ఒకదానికొకటి కొంత కోణం చేసే కనీసం రెండు సమతలాలతో పరిసర యానకం నుండి వేరు చేయబడివున్న పారదర్శక పదార్థం’ అనగా
A) గాజు పలక
B) పట్టకం
C) కటకం
D) పైవన్నియు
జవాబు:
B) పట్టకం
73.
• పటంలో పట్టక వక్రీభవన కోణం ఏది?
జవాబు:
PQ మరియు PR ల మధ్య కోణం (లేదా) ∠QPR.
• పటంలో ‘d’ దేనిని సూచిస్తుంది?
జవాబు:
విచలన కోణం
• పటంలో i1, i2 లు వేనిని సూచిస్తాయి?
జవాబు:
i1 = పతన కోణం,
i2 = బహిర్గత కోణం
74. పతన కిరణం మరియు బహిర్గత కిరణంల మధ్య గల కోణాన్ని ఏమంటారు?
జవాబు:
విచలన కోణం
75. పట్టకం వక్రీభవన గుణకాన్ని కనుగొనుటకు చేయు ప్రయోగంలో కొలవవలసిన విలువలు ఏవి?
జవాబు:
పతన కోణం (i1), బహిర్గత కోణం (i2).
76. కనిష్ఠ విచలన కోణం వద్ద, పట్టక పతన కోణం (i1) మరియు బహిర్గత కోణం (i12) ల మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
i1 = i2
77. పట్టక కోణం (A), విచలన కోణం (d), పతన కోణం (i1) మరియు బహిర్గత కోణం (i2) ల మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
A + d = i1 +i2
78. పట్టక వక్రీభవన గుణక సూత్రాన్ని రాయుము.
జవాబు:
79.
• పై గ్రాలో ‘D’ దేనిని సూచిస్తుంది?
జవాబు:
కనిష్ఠ విచలన కోణం
• విచలనకోణం మరియు పతనకోణంల గ్రాఫ్ ఎలా ఉంటుంది?
జవాబు:
వక్రరేఖ (సున్నిత వక్రం)
80. పట్టక ప్రయోగంలో పతన కోణం పెరుగుతున్న కొలదీ
విచలన కోణం
a) పెరుగును
b) తగ్గును
c) ముందు తగ్గి తర్వాత పెరుగును
జవాబు:
c) ముందు తగ్గి తర్వాత పెరుగును
81. పట్టక వక్రీభవన గుణకం కనుగొనుటకు కావలసిన కనీస దత్తాంశం
a) పట్టక కోణం విలువ
b) కనిష్ఠ విచలన కోణం విలువ
c) పై రెండూ
d) రెండూ కావు
జవాబు:
c) పై రెండూ
82. 60°ల పట్టక కోణం గల పట్టకం యొక్క కనిష్ఠ విచలన కోణం 30° అయిన పట్టక పదార్థ వక్రీభవన గుణకం ఎంత?
జవాబు:
83. పట్టకం యొక్క ఒక ఉపయోగం రాయుము.
జవాబు:
- కృత్రిమ ఇంద్రధనుస్సునేర్పరచుటకు
- తెల్లని కాంతిని విక్షేపణ చెందించుటకు
84. VIBGYOR ను విస్తరించుము.
జవాబు:
ఊదా, ఇండిగో, నీలం, ఆకుపచ్చ, పసుపు, ఆరెంజ్, ఎరుపు.
85. తెల్లని కాంతి ఏడు రంగులుగా విడిపోవడాన్ని ఏమంటారు?
జవాబు:
కాంతి విక్షేపణం
86. తక్కువ విచలనం చెందే రంగు ఏమిటి? దృగ్విషయంను ఏమంటారు?
జవాబు:
ఎరుపు
87. ఎక్కువ విచలనం చెందే రంగు ఏమిటి?
జవాబు:
ఊదా
88. తక్కువ తరంగదైర్ఘ్యం గల రంగు ఏది?
జవాబు:
ఊదా
89. ఎక్కువ తరంగదైర్ఘ్యం గల రంగు ఏది?
జవాబు:
ఎరుపు
90. a) శూన్యంలో కాంతి వేగం స్థిరం.
b) కాంతి ఒక యానకం గుండా వెళ్ళినపుడు దాని వేగం, దాని తరంగదైర్ఘ్యంపై ఆధారపడును.
పై వాక్యములలో ఏది సరియైనది?
జవాబు:
రెండూ
91. కాంతి తరంగదైర్ఘ్యం పెరిగితే వక్రీభవన గుణకం ఎలా మారుతుంది?
జవాబు:
తగ్గుతుంది
92. గొజు యొక్క వక్రీభవన గుణకం క్రింది ఇవ్వబడిన ఏ కాంతిలో ఎక్కువ?
a) నీలం
b) పసుపు
c) నారింజ
d) మారదు.
జవాబు:
c) నారింజ
93. వక్రీభవనం వలన ఏ తరంగ ధర్మం మారదు?
జవాబు:
పౌనఃపున్యం
94. ఒకవేళ ఎరుపు కాంతిని పట్టకం గుండా పంపితే ఏ రంగుగా బహిర్గతమవుతుంది?
జవాబు:
ఎరుపు
95. కాంతి వేగం (v), తరంగదైర్ఘ్యం (λ) మరియు పౌనఃపున్యం (f) ల మధ్య సంబంధమేమిటి?
జవాబు:
v = fλ
96. ఒక స్థిర కాంతి జనకం నుండి వస్తున్న కాంతి వేగం ఒక యానకం వలన మారింది. అయిన ఏ కాంతి తరంగ ధర్మం మారి వుంటుంది?
జవాబు:
తరంగదైర్ఘ్యం
97. కాంతి విక్షేపణానికి ఒక ఉదాహరణనిమ్ము.
జవాబు:
ఇంద్రధనుస్సు ఏర్పడుట
98. యానకాలు వేరు చేయు ఏ తలం వద్ద వక్రీభవనం జరిగినపుడు కాంతివేగం (v), తరంగదైర్ఘ్యం (λ) కు సంబంధమేమిటి?
జవాబు:
అనులోమానుపాతం (λ ∝ v)
99. అభి నోటితో నీటిని బయటకు తుంపరులుగా ఊదినపుడు వివిధ రంగులను గమనించాడు.
జవాబు:
కాంతి విక్షేపణం
100. ఇంద్రధనుస్సు ఏర్పడినపుడు నీటి బిందువులోకి ప్రవేశించే కిరణాలు, బయటకు వెళ్ళే కిరణాలకు మధ్యకోణం ఎంత ఉంటే ప్రకాశవంతమైన ఇంద్ర ధనుస్సు కనిపిస్తుంది?
జవాబు:
42°
101. ఇంద్రధనుస్సు ఏర్పడునప్పుడు ఒక పరిశీలకునికి ఒక నీటి బిందువు నుండి గరిష్ఠంగా ఎన్ని రంగులను చూడగలడు?
జవాబు:
1 (ఒకటి)
102. సూర్యకాంతి పుంజానికి, నీటి బిందువుచే వెనుకకు పంపబడిన కాంతికి మధ్య ఎంత కోణంలో VIBGYOR కనిపిస్తుంది?
జవాబు:
40° నుండి 42°ల కోణంలో
103. సాధారణంగా మనకు కనిపించే ఇంద్రధనుస్సు అసలు ఆకారం ఏమిటి?
జవాబు:
త్రిమితీయ శంఖువు
104. శంఖువు ఆకారంలో ఉండే ఇంద్రధనుస్సు బాహ్యపొరపై ఏ రంగు కనిపిస్తుంది?రంగుగానే
జవాబు:
ఎరుపు
105. ఇంద్రధనుస్సు ఏర్పడినపుడు, పరిశీలకుడు
a) ఒక నీటి బిందువు నుండి ఒక రంగును మాత్రమే చూడగలడు.
b) వివిధ బిందువుల నుండి వివిధ రంగులను చూడగలడు.
సరియైన వాక్యం ఏది?
జవాబు:
రెండూ
106. ఇంద్రధనుస్సు ఏర్పడినపుడు ఒక నీటి బిందువు వద్ద కాంతి కిరణం ఎన్నిసార్లు వక్రీభవనం చెందును ?
జవాబు:
రెండు సార్లు
107. ఇంద్రధనుస్సు ఏర్పడినపుడు ఏ దృగ్విషయాలు జరుగును?
a) వక్రీభవనం
b) సంపూర్ణాంతర పరావర్తనం
c) a మరియు b
d) పరావర్తనం
జవాబు:
c) a మరియు b
108. కాంతి ప్రయాణ దిశకు లంబంగా ఉన్న ఏకాంక వైశాల్యం గల తలం గుండా ఒక సెకను కాలంలో ప్రసరించే కాంతి శక్తిని ఏమని పిలుస్తారు?
జవాబు:
కాంతి తీవ్రత
109. a) ఒక కణం పరిమాణం తక్కువగా ఉంటే, అది ఎక్కువ పౌనఃపున్యం గల కాంతితో ప్రభావితం అవుతుంది.
b) ఒక కణం పరిమాణం ఎక్కువగా ఉంటే అది ఎక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతితో ప్రభావితం అవుతుంది.
పై రెండు వాక్యా లలో సరియైనది/వి?
జవాబు:
రెండు సరియైనవే.
110. ఒక పరమాణువుపై నిర్దిష్ట పౌనఃపున్యం గల కాంతి పతనమయినపుడు ఏం జరుగుతుందో ఊహించుము.
జవాబు:
కంపించును
111. ఒక కణం, పతనకాంతికి స్పందించాలంటే కావలసిన నియమం ఏమిటి?
జవాబు:
కణపరిమాణం, పతనకాంతి తరంగదైర్ఘ్యంతో పోల్చదగినదిగా ఉన్నప్పుడు
112. పరిక్షేపణం వలన కాంతిని ఉద్గారం చేసే పరమాణువులు లేదా అణువులను ఏమంటారు?
జవాబు:
పరిక్షేపణ కేంద్రాలు
112. పై పటంలో చూపిన ప్రయోగంలో ఏ దృగ్విషయాన్ని పరిశీలించవచ్చును?
జవాబు:
కాంతి విక్షేపణం
113. పరిక్షేపణ కోణం ఎంత ఉన్నప్పుడు ఉద్గార కాంతి తీవ్రత అత్యధికంగా ఉంటుంది?
జవాబు:
90°
114. వాతావరణంలో ఏయే అణువులు ఆకాశం నీలి రంగుకు కారణం అవుతాయి?
జవాబు:
నైట్రోజన్, ఆక్సిజన్
115. నీలి రంగు కాంతిని పరిక్షేపణం చెందించే ఏదైనా అణువును రాయండి.
జవాబు:
నైట్రోజన్ లేదా ఆక్సిజన్
116. ఆకాశం నీలిరంగుకు కారణమైన దృగ్విషయంను ఏమంటారు?
జవాబు:
కాంతి పరిక్షేపణం
117. ఏ దృగ్విషయంలో కణాలు కాంతిని శోషించి, కంపించి, తిరిగి ఉద్గారం చేస్తాయి?
జవాబు:
కాంతి పరిక్షేపణంలో
118. వేసవి రోజుల్లో ఆకాశం తెల్లగా కనిపించడానికి కారణమయ్యే ‘అణువుల పేర్లు రాయుము.
జవాబు:
N2, O2 మరియు H2O
119.
పటంలో చూపబడిన కాంతి దృగ్విషయాన్ని రాయండి.
జవాబు:
కాంతి పరిక్షేపణం
120. ‘హైపో’ అనగానేమి?
జవాబు:
సోడియం థయో సల్ఫేట్
121. సాధారణంగా ఏ రంగు గల కాంతి తక్కువ పరిక్షేపణం చెందును?
జవాబు:
ఎరుపు
122.
పై పటంలో చూపిన ప్రయోగంలో ఏ దృగ్విషయాన్ని పరిశీలించవచ్చును?
జవాబు:
కాంతి విక్షేపణం
123. కాంతి విక్షేపణం చూపడానికి ప్రయోగశాలలో లభించే పరికరం ఏమిటి?
జవాబు:
పట్టకం
124.
ఈ గ్రాఫు ద్వారా ఏ విలువను లెక్కిస్తారు?
జవాబు:
పట్టక కనిష్ఠ విచలన కోణం
125. హ్రస్వదృష్టి సవరణకు వినియోగించు కటకం పటం గీయుము.
జవాబు:
126. దీర్ఘదృష్టి సవరణకు వినియోగించు కటకం పటం గీయుము.
జవాబు:
127. పట్టకం ఆకారం ఎలా ఉంటుందో పటం గీయుము.
జవాబు:
128. కంటి కటకం ఆకారం పటం గీయుము.
జవాబు:
129. చివరి బెంచిలో కూర్చున్న ఉమకి నల్లబల్లపై అక్షరాలు స్పష్టంగా కనిపించడం లేదు. దీని సవరణకు ఏ కటకం వినియోగించాలి?
జవాబు:
ద్విపుటాకార
130. మీ తాతగారు దూరపు, దగ్గర వస్తువులను స్పష్టంగా చూడలేకపోతున్నారు. అతను వినియోగించవలసిన కటకం ఏమిటి?
జవాబు:
ద్వి నాభ్యంతర కటకం
131. కటక సామర్థ్యం
1) ఏ వ్యక్తి హ్రస్వదృష్టితో బాధపడుతున్నాడు?
జవాబు:
‘A’
2) ఏ వ్యక్తి చత్వారంతో బాధపడుతున్నాడు?
జవాబు:
‘C’
3) B వ్యక్తికి గల దృష్టి లోపం ఏమిటి?
జవాబు:
దీర్ఘదృష్టి
4) ఏ వ్యక్తి దగ్గరి వస్తువులను స్పష్టంగా చూడగలడు?
జవాబు:
A
5) ఎవరు పుటాకార కటకాన్ని వినియోగిస్తున్నారు ?
జవాబు:
A మరియు C
132. P = -1.5 D అని డాక్టర్ గారు చీటీ పై రాసారు.
1) ఎటువంటి రకపు కటకంను సూచించారు?
జవాబు:
ద్విపుటాకార
2) కటక సామర్థ్యం ఎంత?
జవాబు:
-1.5 D.
3) వినియోగించు కటక నాభ్యంతరం ఎంత?
జవాబు:
66.66 సెం.మీ.
4) వ్యక్తి యొక్క దృష్టి లోపం ఏమిటి?
జవాబు:
హ్రస్వదృష్టి
సాధించిన సమస్యలు
1. ఒక కుంభాకార కటకము యొక్క నాభ్యంతరము 10 మీ అయిన ఆ కటక సామర్థ్యము కనుగొనండి. (+ 0.1 D)
సాధన:
2. ఒక కటక సామర్థ్యం + 2.5D అయిన ఆ కటకం ఏ రకానికి చెందినది? మరియు దాని నాభ్యంతరాన్ని కనుగొనండి.
(కుంభాకార కటకం, 40 సెం.మీ.)
సాధన:
P = +2.5 D
కటక సామర్థ్యం ధనాత్మకం కాబట్టి అది కుంభాకార కటకం.
3. ఒక కుంభాకార, ఒక పుటాకార కటకముల నాభ్యంతరాలు వరుసగా + 20 సెం.మీ. – 30 సెం.మీ, అయిన వాటి కటక సామర్థ్యాలను వేరువేరుగా లెక్కించండి. మరియు ఈ రెండు కలిసిన సంయుక్త కటకము నాభ్యంతరము ఎంత? సంయుక్తంగా కటక సామర్థ్యాన్ని లెక్కించండి.
(+5D; – 3.3D, to 60 సెం.మీ. ; + 1.7D)
సాధన:
కుంభాకార కటకం నాభ్యంతరం f1 = 20 సెం.మీ
4. హ్రస్వదృష్టి కలిగిన వ్యక్తి కంటి ముందు దూరపు బిందువు 80 సెం.మీ.లో ఉంది. ఈ దృష్టిదోషాన్ని సవరించుటకు వాడు కటకమును మరియు దాని కటక సామర్థ్యాన్ని కనుగొనండి. (పుటాకార కటకము, -1.25D).
సాధన:
5. దీర్ఘదృష్టిలో కంటి దగ్గర గల బిందువు 1 మీ. దూరంలో ఉంది. ఈ దృష్టి దోషాన్ని సవరించుటకు వాడు కటకమును మరియు దాని కటక సామర్థ్యాన్ని కనుగొనండి. (స్పష్ట దృష్టి కనీస దూరం 25 సెం.మీ.) (కుంభాకార కటకము, +3.0D).
సాధన:
d = 1 మీ = 100 సెం.మీ.
వాడే కటకం కుంభాకార కటకం
అదనపు ప్రాక్టీస్ ప్రశ్నలు
ప్రశ్న 1.
సంజయ్, బయటి నుండి చీకటిగానున్న సినిమా హాల్ లోకి ప్రవేశించగానే అతనికి సీట్లుగాని, ఏమీ కనబడలేదు. కాని కొంత సేపటి తరువాత అతనికి సీట్లు, వాటిలోని మనుషులు కనబడ్డారు. దీని కారణాన్ని కంటిలోని కనుపాప పనితీరు ఆధారంగా వివరించండి.
జవాబు:
సంజయ్ వెలుతురులోనున్నప్పుడు అతని కనుపాప పరిమాణం చాలా తక్కువగా వుండి అతి తక్కువ కాంతి కంటిలోకి ప్రవేశిస్తుంది. అతను చీకటిలోకి ప్రవేశించగానే, కనుపాప పెద్దదవడానికి కొంత సమయం తీసుకుంటుంది. అప్పటి వరకు అతనికి ఏమీ కనబడవు. కనుపాప పెద్దదవగానే అతడు అతని చుట్టూ వున్న పరిసరాలను గమనించగలడు.
ప్రశ్న 2.
గుడ్లగూబ చీకటిలో కూడా స్పష్టంగా చూడగలదు కాని మనం చూడలేము. ఎందుకు?
జవాబు:
తక్కువ కాంతి వున్నప్పుడు కూడా వస్తువును చూడడానికి కంటిలోని ‘దండాలు’ ఉపయోగపడతాయి. గుడ్లగూబ కంటిలో మానవుని కన్నా ఎక్కువ దండాలు వుండడం వల్ల అది చీకటిలో కూడా స్పష్టంగా చూడగలదు.
ప్రశ్న 3.
మన కన్ను రంగులను ఎలా గుర్తించగలదు?
జవాబు:
కంటిలోనున్న ‘శంఖువులు’ రంగులను గుర్తించడానికి ఉపయోగపడతాయి.
ప్రశ్న 4.
మనం మనకి దూరంగా లేదా దగ్గరగానున్న వస్తువులను స్పష్టంగా చూడగలం. ఇది ఎలా సాధ్యం?
జవాబు:
కంటి కటకం యొక్క సర్దుబాటు స్వభావం వల్ల ఇది సాధ్యమవుతుంది. కంటి కటకం వస్తు దూరాన్ని బట్టి దాని నాభ్యంతరాన్ని సర్దుబాటు చేసుకుంటుంది.
ప్రశ్న 5.
‘గరిష్ఠ దూర బిందువు’, ‘కనిష్ఠ దూర బిందువు’ అనగానేమి?
జవాబు:
గరిష్ఠ దూర బిందువు :
ఏ గరిష్ఠ దూరం వద్దనున్న బిందువుకు లోపల గల వస్తువులకు మాత్రమే కంటి కటకం రెటీనాపై ప్రతిబింబాన్ని ఏర్పరచగలుగుతుందో, ఆ బిందువును గరిష్ఠ దూర బిందువు అంటారు.
కనిష్ఠ దూర బిందువు :
ఏ కనిష్ఠ దూరం వద్ద గల బిందువుకు ఆవల గల వస్తువులను మాత్రమే కంటి కటకం రెటీనా పై ప్రతిబింబాన్ని ఏర్పరచగలుగుతుందో, ఆ బిందువును కనిష్ఠ దూర బిందువు అంటారు.
ప్రశ్న 6.
ఈ పటాన్ని పరిశీలించండి.
i) ఇది ఏ దృష్టి దోషం?
ii) ఈ దోషాన్ని నివారించుటకు ఏ కటకాన్ని వాడాలి?
iii) ఈ దోష నివారణను చూపే పటాన్ని గీయండి.
iv) ఈ దోష నివారణకు వాడవలసిన కటకం గురించి వివరించండి
జవాబు:
i) పటంలో చూపబడిన దృష్టిదోషం ‘హ్రస్వదృష్టి’.
ii) ఈ దోషాన్ని నివారించడానికి పుటాకార కటకాన్ని వాడాలి.
iii)
iv) అనువైన పుటాకార కటకాన్ని వాడడం వల్ల, గరిష్ఠ దూర బిందువుకు ఆవల గల వస్తువు యొక్క మిథ్యా ప్రతిబింబం గరిష్ఠ దూర బిందువు వద్ద ఏర్పడుతుంది. ఈ ప్రతిబింబం కంటి కటకానికి వస్తువు వలె పనిచేసి ఆ వస్తువు యొక్క ప్రతిబింబాన్ని రెటీనాపై ఏర్పడునట్లు చేస్తుంది. కావున మనం వస్తువును స్పష్టంగా చూడగలం.
ప్రశ్న 7.
హ్రస్వదృష్టితో బాధపడే ఒక వ్యక్తికి గరిష్ఠ దూర బిందువు 150 సెం.మీ. అతను దృష్టి దోషం సవరించుకోవడానికి ఎటువంటి కటకాన్ని వాడాలి? ఆ కటక సామర్థ్యమెంత?
జవాబు:
ఈ వ్యక్తి హ్రస్వదృష్టితో బాధపడుతున్నాడు. కావున ఇతను. అనువైన పుటాకార కటకాన్ని వాడాలి.
u = ∞, V = – 150 సెం.మీ., f = ?
ప్రశ్న 8.
దీర్ఘదృష్టితో బాధపడే ఒక వ్యక్తి యొక్క కనిష్ఠ దూర బిందువు 50 సెం.మీ. ఈ దోష నివారణకు వాడే కటక నాభ్యంతరాన్ని, ఆ కటక సామర్థ్యాన్ని కనుగొనండి.
జవాబు:
ప్రశ్న 9.
మీ తరగతి గదిలో ఇంద్రధనుస్సు ఏర్పరచుటకు కావలసిన పరికరముల జాబితా వ్రాయుము.
జవాబు:
కావలసిన పరికరములు :
ట్రే, నీరు, సమతల దర్పణం, తెల్లరంగు గల గోడ.
ప్రశ్న 10.
పట్టకం గుండా తెల్లని కాంతి ఎందుకు విక్షేపణం చెందును?
జవాబు:
తెల్లని కాంతి పట్టకం గుండా ప్రవేశించినపుడు అది వివిధ రంగులుగా విక్షేపణం చెందును. ఎందుకనగా తెల్లని కాంతి వివిధ రంగుల మిశ్రమం. అంతేగాక ప్రతి రంగుకు గల తరంగదైర్ఘ్యాలు వేరువేరుగా వుంటాయి. దీని వలననే వివిధ రంగుల వర్ణపటం ఏర్పడుతుంది.
ప్రశ్న 11.
పట్టకం గుండా ఏదైనా ఒక రంగు గల కాంతిని పంపినపుడు అది మరికొన్ని రంగులుగా విక్షేపణం చెందుతుందా? ఎందుకు?
జవాబు:
కాంతి జనకం యొక్క ఒక ప్రత్యేక లక్షణం దాని పౌనఃపున్యం. అనగా ఆ కాంతి జనకాన్ని ఒక సెకనులో విడిపోయే తరంగాల సంఖ్య. ఈ సంఖ్య యానకాన్ని బట్టి మారదు. కావున వక్రీభవనం వల్ల కాంతి పౌనఃపున్యం మారదు. అందువల్ల పట్టకంలో ప్రవేశించిన రంగు.కాంతి మరికొన్ని రంగులుగా విక్షేపణం చెందదు.
ప్రశ్న 12.
తెల్లని కాంతి పట్టకంలోనికి ప్రవేశించినపుడు 7 రంగులను గమనిస్తాము. ఆ 7 రంగుల జాబితా వ్రాయుము.
జవాబు:
1) ఊదారంగు 2) ఇండిగో 3) నీలం 4) ఆకుపచ్చ 5) పసుపుపచ్చ 6) నారింజరంగు 7) ఎరుపురంగు
ప్రశ్న 13.
ప్రక్కపటాన్ని పరిశీలించండి. ఈ పటం నుండి క్రింది వాటిని గుర్తించండి.
i) బహిర్గత కిరణం ii) విచలన కోణం iii) పట్టక కోణం iv) పట్టకంలో వక్రీభవన కిరణం v) వక్రీభవన గుణకం కనుగొను సూత్రం
జవాబు:
i) బహిర్గత కిరణం YZ
ii) విచలన కోణం ∠d
iii) పట్టక కోణం ∠BAC
iv) పట్టకంలో వక్రీభవన కిరణం XY
10th Class Physics 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 1 Mark Bits Questions and Answers
సరియైన సమాధానమును గుర్తించండి.
1. సాధారణ మానవుని దృష్టి కోణం
A) 160°
B) 60°
C) 6°
D) 16°
జవాబు:
B) 60°
2. జతపరచండి.
i) పరిక్షేపణం P) కంటి దృష్టి దోషం
ii) విక్షేపణం Q) VIBGYOR
iii) కటక సామర్థ్యం R) రెటీనా
iv) కోనులు, దండాలు’ S) ఆకాశపు రంగు
A) i – s, ii – Q, iii – R, iv – P
B) i – Q, ii – S, iii – P, iv – R
C) i – s, ii – Q, iii – P, iv – R
D) i – Q, ii – S, iii – R, iv-P
జవాబు:
C) i- s, ii – Q, iii – P, iv – R
3.
పటాన్ని పరిశీలించండి. కన్నుపై సమాంతర కాంతి కిరణాలు పతనం చెంది, రెటీనాకు ముందు అభిసరణం చెందినది. ఇది కంటి యొక్క ఒక నిర్దిష్ట దృష్టిలోపాన్ని
తెలుపుతుంది. దీనిని నివారించడానికి ……. కటకాన్ని వాడాలి.
A) ద్వికుంభాకార
B) ద్విపుటాకార
C) కుంభాకార లేదా పుటాకార
D) పుటాకార – కుంభాకార
జవాబు:
B) ద్విపుటాకార
4. రాజ్ కుమార్ కళ్ళను డాక్టర్ పరీక్షించి, అతడికి దీర్ఘదృష్టి ఉందని గుర్తించాడు. అతడి కనిష్ట దూర బిందువు దూరం 50 సెం.మీ. డాక్టర్ అతడికి సూచించిన కటకం
A) -2D
B) +1D
C) -1D
D) +2D
జవాబు:
D) +2D
5. ప్రవచనం P : హ్రస్వదృష్టిని నివారించేందుకు ద్విపుటాకార కటకాన్ని వాడతారు.
ప్రవచనం Q : ద్విపుటాకార కటకం యొక్క f విలువ ధనాత్మకం.
A) P సరియైనది కాదు. Q సరియైనది
B) P సరియైనది, Q సరియైనది కాదు
C) P, Q లు రెండూ సరియైనవి
D) P, Q లు రెండూ సరియైనవి కావు
జవాబు:
B) P సరియైనది, Q సరియైనది కాదు
6. తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోవడాన్ని ఏమంటారు?
A) పరిక్షేపణం
B) పరావర్తనము
C) వక్రీభవనం
D) విక్షేపణం
జవాబు:
D) విక్షేపణం
7. హ్రస్వదృష్టి (Myopia) గల కంటి యొక్క గరిష్ఠ దూర బిందువు 1.5 మీ|| దూరంలో ఉంది. ఈ దోషాన్ని సవరించడానికి వాడవలసిన కటక సామర్థ్యం విలువ
A) 0.66 D
B) -0.66 D
C) +1.5D
D) -1.55 D
జవాబు:
B) -0.66 D
8. కింది వాటిలో కాంతి విక్షేపణం యొక్క ఫలితం
A) ఎండమావులు
B) ఆకాశపు నీలి రంగు
C) ఇంధ్రధనుస్సు
D) నక్షత్రాలు మిణుకు మిణుకుమనడం
జవాబు:
C) ఇంధ్రధనుస్సు
9. నీవు ఎండలో నిలబడి పరిసరాలను పరిశీలిస్తున్న సందర్భంలో క్రింది వానిలో సరియైనది.
A) నల్లగుడ్డు, కనుపాపను సంకోచింపచేయును.
B) నల్లగుడ్డు, కనుపాపను వ్యాకోచింపచేయును.
C) కనుపాపలో ఎలాంటి మార్పూ లేదు.
D) నల్లగుడ్డులో ఎలాంటి మార్పూ లేదు. యొక్క సామర్థ్యం
జవాబు:
A) నల్లగుడ్డు, కనుపాపను సంకోచింపచేయును.
10. ఆకాశం నీలిరంగులో కనబడడానికి కారణం
A) కాంతి పరావర్తనం
B) కాంతి వక్రీభవనం
C) కాంతి విక్షేపణం
D) కాంతి పరిక్షేపణం
జవాబు:
D) కాంతి పరిక్షేపణం
11. ఆకాశం నీలిరంగులో కనిపించటానికి వాతావరణంలోని ……. అణువులు కారణం.
A) నీటి ఆవిరి మరియు క్రిప్టాన్
B) కార్బన్ డై ఆక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్
C) నైట్రోజన్ మరియు ఆక్సిజన్
D) క్రిప్టాన్ మరియు కార్బన్ మోనాక్సైడ్
జవాబు:
C) నైట్రోజన్ మరియు ఆక్సిజన్
12. పరిక్షేపణ కాంతి యొక్క తీవ్రత అధికంగా ఉండాలంటే పరికేపణం కోణ విలువ
A) 0°
B) 90°
C) 180°
D) 60°
జవాబు:
B) 90°
13. VIBGYOR లో కనిష్ఠ శక్తి కలిగిన కాంతి ……….
A) ఊదా (వయోలెట్)
B) నీలం
C) ఆకుపచ్చ
D) ఎరుపు
జవాబు:
D) ఎరుపు
14. సాధారణంగా ఆరోగ్యవంతుడైన మానవుని స్పష్ట దృష్టి కనీస దూరం, దృష్టి కోణం విలువలు వరుసగా ……
A) 25 సెం.మీ., 60°
B) 60 సెం.మీ., 20°
C) 25 సెం.మీ., 25°
D) 60 సెం.మీ., 60°
జవాబు:
A) 25 సెం.మీ., 60°
15. మధ్యాహ్నం సూర్యుడు తెలుపు రంగులో కనిపించుటకు ప్రధాన కారణం
A) కాంతి తక్కువగా పరిక్షేపణం చెందుట.
B) కాంతి పరావర్తనం చెందడం.
C) కాంతి వక్రీభవనం చెందడం.
D) కాంతి విక్షేపణం చెందడం.
జవాబు:
A) కాంతి తక్కువగా పరిక్షేపణం చెందుట.
16. దగ్గర వస్తువులు మాత్రమే చూడగల్గటాన్ని ……… అని అంటారు. దాని నివారణకు ……… కటకాన్ని వాడతారు.
A) హ్రస్వదృష్టి, కుంభాకార
B) దీర్ఘదృష్టి, కుంభాకార
C) దీర్ఘదృష్టి, పుటాకార
D) హ్రస్వదృష్టి, పుటాకార
జవాబు:
D) హ్రస్వదృష్టి, పుటాకార
17. కంటి కటకం తన నాభ్యంతరాన్ని ……… సెం.మీ. నుండి ……… సెం.మీ. ల మధ్య ఉండేటట్లు సర్దుబాటు చేసుకుంటుంది.
A) 22.7; 25
B) 2.27; 2.42
C) 2.26; 2.5
D) 2.27; 2.5
జవాబు:
D) 2.27; 2.5
18. జతపరచండి.
1) కంటి కటకానికి నేత్రోదక ద్రవానికి మధ్య ఉండే కండర పొర ( ) X) రెటీనా
2) కంటి కటకానికి నేత్రోదక ద్రవానికి మధ్య ఉండే కండర పొరకు ఉండే చిన్న రంధ్రం ( ) Y) కనుపాప
3) కనుగుడ్డు వెనక ప్రతిబింబం ఏర్పడే ప్రదేశం ( ) Z) ఐరిస్
A) (1) – X, (2) – Y, (3) – Z
B) (1) – X, (2) – Z, (3) – Y
C) (1) – 2, (2) – X, (3) – Y
D) (1) – Z, (2) – Y, (3) – X
జవాబు:
D) (1) – Z, (2) – Y, (3) – X
19. క్రింది వాటిలో కంటి యొక్క ఏ భాగాలు కంటిలోకి వచ్చే కాంతి తీవ్రతను నియంత్రిస్తాయి?
(లేదా)
మానవుని కంటిలోనికి ప్రవేశించే కాంతిని అదుపు చేయు కంటి భాగం
A) నల్లగుడ్డు, కనుపాప
B) నల్లగుడ్డు, సిలియరి కండరాలు
C) కనుపాప, కార్నియా
D) నల్లగుడ్డు, కార్నియా
జవాబు:
A) నల్లగుడ్డు, కనుపాప