Students can go through AP Board 10th Class Physical Science Notes 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం to understand and remember the concept easily.
AP Board 10th Class Physical Science Notes 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం
→ ధాతువుల నుండి లోహాలను సంగ్రహించుట, వాటిని శుద్ధి చేయుట మరియు మిశ్రమ లోహాలను తయారు చేయుటకు సంబంధించిన శాస్త్రాన్ని లోహ శాస్త్రము అంటారు.
→ భూమి పై పటలంలో దొరికే లోహం యొక్క సమ్మేళనాన్ని ఖనిజం అంటారు.
→ లాభసాటిగా లోహాన్ని సంగ్రహించుటకు వీలైన ఖనిజాన్ని ధాతువు అంటారు.
→ ఖనిజంలో ఉండే మలినాలు, మన్ను – రాళ్లు మొదలైన వాటిని ఖనిజమాలిన్యం (గాంగ్) అంటారు.
→ సులభంగా మార్చు ద్రవంగా మారని మలినాలను ద్రవంగా మార్చుటకు కలుపబడు పదార్థం ద్రవరారి. ఉదా : CaO, SiO2 మొదలైనవి.
→ గాంగ్ + ద్రవవారి → లోహమలం. ఇది సులభంగా ద్రవంగా మారి, ద్రవస్థితిలోని లోహంపై తేలుట వలన తొలగించుట తేలిక. ఉదా : CaO2 + SiO → CaSiO3
→ లోహ నిష్కర్షణలో ముఖ్యంగా మూడు దశలున్నాయి. అవి సాంద్రీకరణ, ముడిలోహ నిష్కర్షణ, లోహ శుద్ధి.
→ ధాతువును సాంద్రీకరించటానికి ఎంచుకొనే భౌతిక పద్ధతులు – చేతితో ఏరివేయుట, నీటితో కడగటం, ప్లవన ప్రక్రియ, అయస్కాంత వేర్పాటు పద్ధతి.
→ లోహాలను వాని చర్యాశీలతల అవరోహణక్రమంలో అమర్చగా వచ్చే శ్రేణిని చర్యాశీలత శ్రేణి అంటారు.
→ ముడిఖనిజం నుండి ముడిలోహాన్ని నిష్కర్షణ చేసినప్పుడు వాడే పద్ధతులు : భస్మీకరణం, భర్జనం, క్షయకరణం, స్థానభ్రంశ పద్ధతి, విద్యుత్ క్షయకరణం.
→ మెర్క్యురీ తప్ప మిగిలిన లోహాలన్నీ ఘనస్థితిలోనే ఉంటాయి.
→ లోహాలకు అయనీకరణ శక్తి, ఋణ విద్యుదాత్మకత విలువలు తక్కువగా ఉంటాయి. కనుక ఇవి ఎలక్ట్రాన్లను కోల్పోయి, ధన అయాన్లుగా మారే స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటాయి.
→ లోహాలకు విద్యుత్ వాహకత, ఉష్ణవాహకత చాలా ఎక్కువగా ఉంటాయి. వీటి విద్యుత్ వాహకత, విద్యుత్ విశ్లేష్యాలకన్నా ఎక్కువగా ఉంటుంది.
→ అనేక లోహాలను పలుచని రేకులుగానూ, సన్నని తీగలుగానూ సాగదీయవచ్చు.
→ సోడియం, పొటాషియం వంటి కొన్ని లోహాలకు తప్ప సాధారణంగా లోహాల సాంద్రత ఎక్కువగా ఉంటుంది.
→ కొన్ని లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి, హైడ్రోజన్ వాయువును ఇస్తాయి. అనేక లోహాల ఆక్సెర్లు నీటిలో కరిగి క్షారాలనిస్తాయి.
→ సాధారణంగా లోహాలకు ద్రవీభవన, బాష్పీభవన ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి.
→ భస్మీకరణం అనేది గాలి అందుబాటులో లేకుండా ధాతువును వేడి చేసే ప్రక్రియ.
→ భస్మీకరణంలో కారొనేట్ రూపంలో ఉండే ముడిఖనిజం, దాని ఆక్సైడ్ రూపంలోకి మారుతుంది.
→ భర్జనం అనేది నిర్విరామంగా. గాలి సరఫరాతో ముడి ఖనిజాన్ని బాగా వేడిచేసే ప్రక్రియ.
→ భర్జనం కొరకు రివర్బరేటరీ కొలిమి వాడతారు.
→ విద్యుత్ శోధన పద్ధతిలో అపరిశుద్ధ లోహాన్ని ఆనోడ్ గానూ, పలుచని శుద్ధ లోహ రేకులను కాథోడ్ గానూ తీసుకుంటారు.
→ ఆమీకృత లోహ లవణ ద్రావణాన్ని విద్యుత్ విశ్లేష్యంగా తీసుకుంటారు. శుద్ధలోహం కాథోడ్ పై పూతగా ఏర్పడుతుంది.
→ పలుచని అల్యూమినియం రేకును చాక్లెట్ల మీద చుట్టడానికి వాడతారు.
→ నీటి ఆవిరి గొట్టాలను తయారు చేయడానికి రాగిని వాడతారు.
→ బ్యాటరీలలో అధిక మొత్తంలో జింకును వాడతారు.
→ స్టవ్ లను, రైలు బోగీలను మరియు బొమ్మలను పోతపోయడంలో పోత ఇనుమును వాడతారు.
→ సైకిళ్లు, ఆటోమొబైల్ మొదలైన వాటిలో స్టెయిన్లెస్ స్టీలును వాడతారు.
→ ఖనిజాలు : భూపటలంలో దొరికే మలినాలతో కూడిన లోహ సమ్మేళనాలను లోహ ఖనిజాలు అంటారు.
→ ధాతువులు : తక్కువ ఖర్చుతో లోహం పొందటానికి అత్యంత అనుకూలమైన ఖనిజాలను ధాతువులు అంటారు.
→ గాంగ్ (ఖనిజ మాలిన్యం) : లోహ ధాతువుతో కలసి ఉన్న మలినాలను ఖనిజ మాలిన్యం (గాంగ్) అంటారు.
→ ప్లవన ప్రక్రియ : సల్సెడ్ ధాతువుల నుండి ఖనిజ మాలిన్యాన్ని తొలగించడానికి అనువుగా ఉండే ప్రక్రియ.
→ థెర్మైట్ చర్య : Fe2O3, Cr2O3, Mn3O3 వంటి ధాతువులను Al పొడితో క్షయకరణం చేయగా ద్రవస్థితిలో లోహాలు లభిస్తాయి. దీనినే గోల్డ్ స్మిత్ అల్యూమినో థెర్మెట్ విధానం అంటారు.
→ స్వేదనం : లోహాన్ని శుద్ధి చేసే ఒకానొక పద్ధతి.
→ పోలింగ్ : ద్రవస్థితిలో, లోహాన్ని పచ్చి కర్రలతో బాగా కలుపుతారు. ఇలా చేయడం ద్వారా మలినాలు వాయువుల రూపంలో వేరుపడటం గానీ లేదా చిక్కని నురగలా ద్రవరూప లోహ ఉపరితలంపై ఏర్పడటంగానీ జరుగుతుంది. ఇదే పోలింగ్.
→ గలనం చేయడం : అల్ప ద్రవీభవన స్థానాలున్న లోహాలను వేడిచేసి వాలుగా ఉన్న తలం పై జారేటట్లు చేస్తారు. అప్పుడు లోహం కరిగి క్రిందికి కారడం ద్వారా అధిక ద్రవీభవన స్థానాలున్న మలినాలు వేరు చేయబడతాయి. ఈ విధానాన్నే ‘గలనం చేయటం’ అంటారు.
→ విద్యుత్ విశ్లేషణ : గలన స్థితిలో ఉన్న పదార్థంలోనికి విద్యుతను ప్రసరింపచేసి పదార్థాన్ని విడగొట్టే ప్రక్రియ.
→ ప్రగలనం : ధాతువుకు, క్షయకరిణిని, ద్రవవారితో కలిపిగాని, కలపకుండా గాని అధిక ఉష్ణోగ్రత వద్ద వేడిచేయుట ద్వారా లోహాన్ని లేక లోహ సల్ఫైడ్ ను ద్రవస్థితిలో పొందుట. దీనిని బ్లాస్ట్ కొలిమిలో చేస్తారు.
→ భస్మీకరణం : ధాతువును దాని ద్రవీభవన స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద గాలి తగలకుండా వేడిచేయుట.
→ భర్జనం : ధాతువును దాని ద్రవీభవన స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద అధిక గాలి సమక్షంలో వేడిచేయుట.
→ బ్లాస్ట్ కొలిమి : లోహశాస్త్రంలోని వివిధ ప్రక్రియలను జరుపుటకు వేరువేరు ఆకారాలు గల కొలిములు ఉంటాయి. వాటిలో బ్లాస్ట్ కొలిమి ఒకటి. ఇందులో అగ్గిగది, హాలు రెండూ ఒకే పెద్ద చాంబర్ లో కలసి ఉంటాయి. ఈ చాంబర్ లో ధాతువు, ఇంధనం రెండిటినీ ఉంచడానికి వీలుగా ఉంటుంది.
→ రివర్బరేటరి కొలిమి : ఈ కొలిమిలో అగ్గిగది, హార్త్ లు విడిగా ఏర్పాటు చేయబడి ఉంటాయి. కానీ ఇంధనాన్ని మండించినప్పుడు వెలువడిన మంట హార్త్ లో ఉన్న ధాతువును వేడి చేస్తుంది.