Students can go through AP Board 10th Class Physical Science Notes 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు to understand and remember the concept easily.
AP Board 10th Class Physical Science Notes 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు
→ కార్టన్ ఆవర్తన పట్టికకు చెందిన 14వ లేక IVA గ్రూప్ కు చెందిన అలోహము.
→ కార్టన్ కేవలం సంయోజనీయ బంధాలను ఏర్పరుస్తుంది.
→ కార్టన్ యొక్క చతుర్ సంయోజకత, కాటినేషన్ మరియు .బహు బంధాలను ఏర్పరచుట మొదలైన ధర్మాల వలన కార్టన్ విలక్షణ మూలకంగా గుర్తించబడినది. అందువలననే కర్ణన రసాయన సమ్మేళన శాస్త్రం అనే అంశాన్ని రసాయన శాస్త్రంలో ప్రత్యేకమైన శాఖగా నేర్చుకోవడం జరుగుతున్నది.
→ ఉత్తేజిత కార్టన్ పరమాణువులలోని s మరియు p ఆర్బిటాళ్ళు సంకరీకరణం చెంది sp³ లేదా sp² లేదా sp సంకరీకరణాలను ఏర్పరుస్తాయి.
→ కార్టన్ రెండు రకాల రూపాంతరాలను ప్రదర్శిస్తుంది. అవి అస్ఫటిక మరియు స్ఫటిక రూపాలు.
→ నేల బొగ్గు, కోక్, దీపాంగరం, కొయ్యబొగ్గు మొదలైనవి కార్బన్ యొక్క అస్పటిక రూపాంతరాలు.
→ వజ్రం, గ్రాఫైట్, బక్ మిస్టర్ ఫుల్లరిన్, నానోట్యూబ్ మొదలైనవి కార్టన్ యొక్క స్ఫటిక రూపాంతరాలు.
→ ఒక మూలకం తన పరమాణువుల మధ్యనే బంధాన్ని ఏర్పరచుకొని పెద్ద అణువును ఏర్పరచే ధర్మాన్ని శృంఖల ధర్మం (కాటినేషన్) అంటారు.
→ కార్టన్ మరియు హైడ్రోజన్ ను మాత్రమే తమ అణువులలో కలిగి ఉన్న సమ్మేళనాలను హైడ్రోకార్టన్లు అంటారు. అవి రెండు రకాలు. అవి :
- అచక్రీయ లేదా వివృత
- చక్రీయ లేదా సంవృత హైడ్రోకార్బన్లు.
→ కార్టన్ పరమాణువుల మధ్య ఏకబంధం గల హైడ్రోకార్టన్లను ఆల్కేనులు అంటారు.
→ కార్టన్ పరమాణువుల మధ్య కనీసం ఒక ద్విబంధం గల హైడ్రోకార్టన్లను ఆల్కీనులు అంటారు.
→ కార్టన్ పరమాణువుల మధ్య కనీసం ఒక త్రిబంధం గల హైడ్రోకార్టన్లను ఆల్కైనులు అంటారు.
→ అల్కేగులు సంతృప్త హైడ్రోకార్టన్లు కాబట్టి ప్రతిక్షేపణ చర్యలలో పాల్గొంటాయి.
→ ఆల్కీనులు, ఆల్కైనులు అసంతృప్త హైడ్రోకార్బన్లు జాబట్టి సంకలన చర్యలలో పాల్గొంటాయి.
→ కార్బన్ ఇతర కార్బన్ పరమాణువులతోనే కాక హైడ్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, నైట్రోజన్ మరియు క్లోరిన్ వంటి మూలకాల పరమాణువులతో సంయోజనీయ బంధాలను ఏర్పరుస్తుంది.
→ ఒక కర్జన సమ్మేళనం ప్రత్యేకమైన ధర్మాలు ప్రదర్శించడానికి దానిలో ప్రమేయ సమూహం కొరణం.
→ ఆల్కహాలను – OH తోను, ఆల్డిహైడను – CHO తోను, కీటోను తోను, కారాకిలిక్ ఆమ్లమును – COOH తోను, ఈథరను C-0-C తోను, ఎమైనను – NH2 తోను, బస్టర్‌ను – COOR తోను సూచిస్తారు.
→ ఒకే అణు ఫార్ములా కలిగి వివిధ ధర్మాలు ప్రదర్శించే సమ్మేళనాలను అణు సాదృశ్యకాలు అంటారు. ఈ దృగ్విషయాన్ని సాదృశ్యం అంటారు.
→ ఒకే సాధారణ ఫార్ములా కలిగి, రెండు వరుస కర్జన సమ్మేళనాల మధ్య తేడా – CH2 గా ఉండే ఒరే నిర్మాణం మరియు ధర్మాలు కలిగిన సమ్మేళనాల శ్రేణిని సమజాత శ్రేణి అంటారు.
→ సమ్మేళనాలు ఒకే ఒక అణునిర్మాణం మరియు ఒకే ఒక అణు ఫార్ములా కలిగి ఉండడానికి IUPAC నామీకరణంను ఏర్పరచారు.
→ కర్జన సమ్మేళనాలను అధిక ఆక్సిజన్లో మండించడాన్ని దహనచర్య అంటారు. ఈ చర్యలో నీరు, కార్టన్ డై ఆక్సైడ్ తో పాటు ఉష్ణం మరియు కాంతి విడుదలవుతాయి.
→ రసాయన చర్యలో పాల్గొనకుండా రసాయన చర్చావేగాన్ని నియంత్రించే పదార్థాలను ఉత్ప్రేరకాలు అంటారు.
→ ఒక సమ్మేళనంలోని మూలకం లేదా సమూహం, వేరొక మూలకం లేదా సమూహం చేత ప్రతిక్షేపించబడితే దానిని ప్రతిక్షేపణ చర్య అంటారు.
→ ఇథనోల్, ఇథనోయిక్ ఆమ్లాలు ముఖ్యమైన కర్బన సమ్మేళనాలు.
→ ఆల్కహాల్ ప్రధానమైన ద్రావణి. దీనిని టింక్చర్ అయోడిన్లోను, దగ్గు మందులలోను ఉపయోగిస్తారు.
→ ఇథనోయిక్ ఆమ్లంను ఎసిటిక్ ఆమ్లం అని కూడా అంటారు. 5 – 8% ఎసిటిక్ ఆమ్ల జలద్రావణాన్ని వినెగర్ అంటారు. దీనిని ఊరగాయలను నిల్వ ఉంచుటలో ఉపయోగిస్తారు.
→ ఇథనోయిక్ ఆమ్లం, సోడియం లోహంతో చర్యజరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది.
→ కారాక్సిలిక్ ఆమ్లం గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్ల సమక్షంలో ఆల్కహాల్ తో చర్య జరిపి చక్కని వాసనగల ఎస్టర్ అనే సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది. దీనినే ఎస్టరీకరణం అంటారు.
→ రసాయనికంగా సబ్బు ఫాటీ ఆమ్లాల సోడియం లేక పొటాషియం లవణం.
→ ఎస్టర్లను క్షార సమక్షంలో జలవిశ్లేషణ చెందించి సబ్బును పొందవచ్చు. దీనినే సఫోనిఫికేషన్ అంటారు.
→ సబ్బును నీటిలో కరిగిస్తే అది కొల్లాయిడల్ అవలంబనాన్ని ఏర్పరుస్తుంది. సబ్బు అణువులు మలినాల చుట్టూ గోళాకృతి మిసిలిలు అనే నిర్మాణాలను ఏర్పరుస్తాయి.
→ సబ్బు ఒక చివర హైడ్రోఫిలిక్ (కార్టెక్సిల్) మరియు మరొక చివర హైడ్రోఫోబిక్ (హైడ్రోకార్బన్) లను రెండు భాగాలను కలిగి ఉంటుంది.
→ రసాయనికంగా డిటర్జెంట్లు పొడవైన కర్జన గొలుసు కలిగిన కార్టాక్సిలిక్ ఆమ్లము అమ్మోనియా లేదా సలొనేట్ లవణాలు.
→ సబ్బులు హైడ్రోఫిలిక్ మరియు హైడ్రోఫోబిక్ చివరలను కలిగి ఉండటం వలన అవి మలినాలు మరియు నూనెల ఎమర్జెనను ఏర్పరుస్తాయి, తద్వారా వాటిని తొలగిస్తాయి.
→ సంకరీకరణం : పరమాణువు బాహ్యకర్పరాల్లోని దాదాపు సమానశక్తితో కలిసిపోవడానికి తగినట్లుగా ఉన్న ఆర్బిటాళ్ళు పూర్తిగా ఒకదానితో ఒకటి కలిసిపోయి కొత్తగా అదే సంఖ్యలో సమానశక్తి, ఆకృతి గల ఆర్బిటాళ్ళ సమితిని ఏర్పరచే పద్ధతినే సంకరీకరణం అంటారు.
→ రూపాంతరత : ఒక మూలకం రెండు లేక అంతకంటే ఎక్కువ భౌతిక రూపాలను కలిగి ఉండి దాదాపు ఒకే విధమైన రసాయన ధర్మాలను, వివిధ భౌతిక ధర్మాలను ప్రదర్శించే ధర్మాన్నే రూపాంతరత అంటారు.
→ వజ్రం (డైమండ్) : డైమండ్ స్పటికాకార జాలకం కలిగి ఉన్న కర్బన రూపాంతరం. డైమండ్ లో ప్రతి కార్బన్ sp³ సంకరీకరణం చెందుతుంది. ప్రతి కార్బన్ నాలుగు ఇతర కార్బన్ పరమాణువులతో sp³ సంకర ఆర్బిటాలను టెట్రా హైడ్రల్ రీతిలో ఉపయోగించుకొని బంధాలను ఏర్పరుస్తుంది. ఇది చాలా దృఢమైన పదార్థం, కారణం C – C మధ్య గట్టి బంధాలు ఉండును.
→ గ్రాఫైట్ : గ్రాఫైట్ పొరల వంటి నిర్మాణం కలిగి ఉంటుంది. రెండు పక్క పక్క పొరల మధ్య దూరం 3.35 A. ప్రతి పొరలో కార్బన్ పరమాణువులు సమతల షట్కోణ వలయాల నిర్మాణంలో ఉంటాయి. ప్రతి కార్బన్ sp- సంకరీకరణం చెందుతుంది.
→ బక్ మిస్టర్ ఫుల్లరిన్ : ఇది కార్బన్ యొక్క రూపాంతరము. దీనిలో 60 కర్బన పరమాణువులు కలిసి ఫుట్ బాల్ ఆకృతిని ఏర్పరుస్తాయి.
→ నానోట్యూబులు : ఇది కూడా కార్బన్ యొక్క రూపాంతరము. దీనిలో షట్కణ’ ఏలయాలు చుట్టబడుటచే స్థూపాకృతిని ఏర్పరుస్తాయి. అందువలన వీటిని నానోట్యూబులు అంటారు.
→ శృంఖల సామర్థ్యం : ఏదైనా మూలకం దానికి చెందిన పరమాణువులు మధ్య బంధాలనేర్పరచుకొనుట (కాటినేషన్) ద్వారా అతి పెద్దదైన అణువుల నేర్పరచగల ధర్మాన్ని శృంఖల ధర్మం (Catenation) అని అంటారు. ఈ ధర్మం వలన అది అసంఖ్యాకమైన కార్బన్ పరమాణువులు గల అతి పొడవైన శృంఖలాలుగా, శాఖాయుత శృంఖలాలుగా, వలయాలుగా, అణువులుగా ఏర్పరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
→ చతు:సంయోజనీయత : ఒక మూలక పరమాణువు అదే మూలక పరమాణువులతో కాని లేదా వేరే మూలక పరమాణువులతో కాని నాలుగు సంయోజనీయ బంధాలను ఏర్పరచే ప్రవృత్తిని చతుఃసంయోజనీయత అంటారు.
→ హైడ్రోకార్బన్లు : కార్బన్ మరియు హైడ్రోజన్‌ను మాత్రమే కలిగి ఉండే సమ్మేళనాలను హైడ్రోకార్బన్లు అంటారు.
→ ఆల్కేర్లు : కార్బన్ పరమాణువుల మధ్య ఏకబంధం కలిగిన సంతృప్త హైడ్రోకార్బన్లను ఆల్కేనులు అంటారు.
→ ఆల్కీన్లు : కార్బన్ పరమాణువుల మధ్య కనీసం ఒక ద్విబంధం కలిగిన అసంతృప్త హైడ్రో కార్బన్లను ఆల్కీనులు అంటారు.
→ ఆల్కన్లు : కార్బన్ పరమాణువుల మధ్య కనీసం ఒక త్రిబంధం కలిగిన అసంతృప్త హైడ్రోకార్బన్లను ఆల్కెనులు అంటారు.
→ సంతృప్త హైడ్రోకార్బన్లు : కార్బన్ పరమాణువుల మధ్య ఏకబంధం కలిగిన హైడ్రోకార్బన్లను సంతృప్త హైడ్రోకార్బన్లు అంటారు. ఉదా : ఆల్కేనులు
→ అసంతృప్త హైడ్రోకార్బన్లు : కార్బన్ పరమాణువుల మధ్య కనీసం ఒక ద్విబంధం లేదా ఒక త్రిబంధం కలిగిన హైడ్రోకార్బన్లను అసంతృప్త హైడ్రోకార్బన్లు అంటారు. ఉదా : ఆల్కీనులు, ఆల్కైనులు.
→ ప్రమేయ సమూహం : ఒక కర్బన సమ్మేళనం యొక్క ధర్మాలు దానిలోని ఏ పరమాణువు లేక సమూహం మీద ఆధారపడుతుందో దానిని ప్రమేయ సమూహం అంటారు. ఉదా : ఆల్డిహైడ్, కీటోన్.
→ అణు సాదృశ్యం : సమ్మేళనాలు ఒకే అణు ఫార్ములా కలిగి ఉండి వేరు వేరు ధర్మాలు కలిగి ఉండడాన్ని అణుసాదృశ్యం అంటారు.
→ సమజాత శ్రేణులు : వరుస సమ్మేళనాల మధ్య తేడా – CH2 గా కలిగి ఉండే కర్బన సమ్మేళనాల శ్రేణిని సమజాత శ్రేణి అంటారు. ఉదా : ఆల్కేనులు.
→ నామీకరణం : ఒక సమ్మేళనానికి ఒకే నిర్మాణం, పేరు ఇవ్వడాన్ని నామీకరణం అంటారు. దీనిని IUPAC వారు అభివృద్ధి చేశారు.
→ దహనం : కర్బన సమ్మేళనాలు అధిక ఆక్సిజన్ సమక్షంలో మండి ఉష్ణాన్ని, కాంతిని విడుదల చేసే చర్యను దహన చర్య అంటారు. ఉదా: C + O2 → CO2 + శక్తి
→ ఆక్సీకరణం : ఒక సమ్మేళనానికి ఆక్సిజనను కలపడాన్ని ఆక్సీకరణ చర్య అంటారు.
→ సంకలన చర్య : అసంతృప్త కర్బన సమ్మేళనాలు సంతృప్త కర్బన సమ్మేళనాలుగా మారే చర్యలను సంకలన చర్యలు అంటారు.
→ ప్రతిక్షేపణ చర్య ఒక రసాయన చర్యలో ఒక సమ్మేళనంలోని మూలకం లేదా సమూహం, వేరొక మూలకం లేదా సమూహం చేత ప్రతిక్షేపించబడితే అటువంటి చర్యలను ప్రతిక్షేపణ చర్యలు అంటారు.
→ ఇథనోల్ : ఇథనోల్ అనేది రంగు లేని ఒక ద్రవం. దీని మొలాసిస్ ను కిణ్వ ప్రక్రియకు గురిచేసి తయారు చేస్తారు. దీని ఫార్ములా C2H5OH.
→ ఇథనోయిక్ ఆమ్లం (ఎసిటిక్ ఆమ్లం) : ఇది దుర్వాసనను కలిగిన ద్రవం. వెనిగర్ 5-8% ఇథనోయిక్ ఆమ్లం లేదా ఎసిటిక్ – ఆమ్లాన్ని కలిగి ఉంటుంది.
→ ఎస్టర్ : – COOR ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్న సమ్మేళనాలను ఎస్టర్లు అంటారు.
→ ఎస్టరిఫికేషన్ : కార్బాక్సిలిక్ ఆమ్లాలు గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్ల సమక్షంలో మంచి సువాసన గల ఎస్టర్ అనే సమ్మేళనాలను ఏర్పరచే ప్రక్రియను ఎస్టరీకరణం అంటారు.
→ సఫోనిఫికేషన్ : క్షార సమక్షంలో నూనెను జలవిశ్లేషణం చెందించి సబ్బును పొందే ప్రక్రియను సఫోనిఫికేషన్ అంటారు.
→ మిసిలి : మలిన కణాల చుట్టూ ఏర్పడ్డ గోళాకృత సబ్బు అణువులను మిగిలి అంటారు.
→ హైడ్రోఫిలిక్ కొన : నీటిచే ఆకర్షించబడే సబ్బులోని ధృవపు కొనను హైడ్రోఫిలిక్ కొన అంటారు.
→ హైడ్రోఫోబిక్ కొన : నీటిచే ఆకర్షించబడని సబ్బులోని అధృవపు కొనను హైడ్రోఫోబిక్ కొన అంటారు.
→ అణు సాదృశ్యాలు : అణు సాదృశ్యత కలిగిన సమ్మేళనాలను అణు సాదృశ్యాలు అంటారు.
→ సమజాతులు : సమజాత శ్రేణిలోని సమ్మేళనాలను సమజాతులు అంటారు.
→ నిర్మాణాత్మక సాదృశ్యం : కర్బన సమ్మేళనాలు ఒకే అణు ఫార్ములా, వేరు వేరు నిర్మాణాత్మక ఫార్ములాలు కలిగి ఉండడాన్ని నిర్మాణాత్మక సాదృశ్యం అంటారు.
→ ఉత్ప్రేరకం : రసాయన చర్యలో పాల్గొనకుండా రసాయన చర్యవేగాన్ని మార్చే పదార్థాలను ఉత్ప్రేరకాలు అంటారు.
→ కిణ్వప్రక్రియ : ఎంజైముల సమక్షంలో పెద్ద అణువును, చిన్న అణువుగా విడగొట్టే ప్రక్రియను