Students can go through AP Board 10th Class Physical Science Notes 1st Lesson ఉష్ణం to understand and remember the concept easily.
AP Board 10th Class Physical Science Notes 1st Lesson ఉష్ణం
→ చల్లదనం లేదా వెచ్చదనం తీవ్రతనే ఉష్ణోగ్రత అంటారు.
→ వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ఉష్ణశక్తి బదిలీ అవుతుంది.
→ రెండు వస్తువులు ఒకే వెచ్చదనం తీవ్రత పొందినట్లయితే ఆ రెండు వస్తువులు ఉష్ణ సమతాస్థితిలో ఉన్నాయని అర్థం.
→ ఉషేయ ధార్మిక స్పర్శలో ఉన్న A, B అనే రెండు వ్యవస్థలు విడివిడిగా C అనే వ్యవస్థతో ఉష్ణ సమతాస్థితిలో ఉంటే, A, B వ్యవస్థలు కూడా పరస్పరం ఉష్ణ సమతాస్థితిలో ఉంటాయి.
→ అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రవహించే శక్తి స్వరూపాన్ని ఉష్ణం అంటారు
→ ఉష్ణోగ్రత అనేది ఉష్ణ సమతాస్థితి యొక్క కొలత. లో ఒక గ్రాము నీటి ఉష్ణోగ్రతను 1°C పెంచటానికి అవసరమైన ఉష్ణాన్ని కెలోరీ అంటారు.
→ 1 కెలోరి = 4.18 జొళ్ళు
→ అణువుల సరాసరి గతిశక్తి చల్లని వస్తువులో కంటె వేడి వస్తువులో ఎక్కువగా ఉంటుంది.
→ ఒక పదార్థంలోని అణువుల సరాసరి గతిజశక్తి ఆ పదార్థ పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది.
→ ఉష్ణశక్తి ప్రసార దిశను నిర్ణయించేది ఉష్ణోగ్రత.
→ ఉష్ణోగ్రత పెరుగుదల రేటు పదార్థ స్వభావంపై ఆధారపడి ఉంటుంది.
→ ప్రమాణ ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను 1° పెంచటానికి కావలసిన ఉష్ణరాశిని ఆ పదార్థ విశిష్టోష్ణం అంటారు.
SS = Q/mat
→ వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం = చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణం.
→ ద్రవ అణువులు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవం ఉపరితలాన్ని విడిచి వెళ్లే ప్రక్రియను బాష్పీభవనం అంటాం. ఆ బాష్పీభవనం ఒక శీతలీకరణ ప్రక్రియ.
→ బాష్పీభవనం యొక్క వ్యతిరేక ప్రక్రియే సాంద్రీకరణం. ఆ వాయువు ద్రవంగా స్థితి మార్పు చెందటమే సాంద్రీకరణం అంటారు. ఈ గాలిలోని నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ధత అంటారు.
→ స్థిరపీడనం మరియు స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలోని పదార్థం , వాయుస్థితిలోకి మారే ప్రక్రియను మరగటం అంటారు.
→ నీరు ద్రవస్థితి నుండి వాయు స్థితికి మారటానికి వినియోగపడిన ఉష్ణాన్ని బాషీషీభవన గుప్తోష్ణం అంటారు. * స్థిర ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో ఉన్న పదార్థం ద్రవస్థితిలోకి మారే ప్రక్రియను ద్రవీభవనం అంటారు.
→ ఉష్ణోగ్రత : చల్లదనం స్థాయిని, వెచ్చదనం స్థాయిని ఉష్ణోగ్రత అంటారు. దీనిని T తో సూచిస్తారు. C.G.S. ప్రమాణాలు – సెంటీగ్రేడ్ (°C), S.I. ప్రమాణం – కెల్విన్ (K)
→ ఉష్ణం : అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రవహించే శక్తి స్వరూపాన్ని ఉష్ణం అంటారు. దీనిని ‘Q’ తో సూచిస్తారు.
C.G.S. ప్రమాణాలు – కేలరీ, S.I. ప్రమాణం – బౌల్.
→ ఉష్ణ సమతాస్థితి : అధిక, అల్ప ఉష్ణోగ్రతలున్న రెండు వస్తువులు ఒకదానితో ఒకటి తాకుతున్నప్పుడు రెండు వస్తువుల ఉష్ణోగ్రతలు సమానం అయ్యే వరకు ఉష్ణ ప్రసారం జరుగును. ఇప్పుడు రెండు వస్తువులు ఉష్ణ సమతాస్థితిలో ఉంటాయి. ఉష్ణ సమతాస్థితి అంటే ఒక వస్తువు ఉష్ణం బయటకు ఇవ్వలేని, స్వీకరించలేని స్థితి.
→ విశిష్టోష్ణం : ప్రమాణ ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ పెంచడానికి కావల్సిన ఉష్ణరాశిని ఆ పదార్థం యొక్క విశిష్టోష్ణం అంటారు. దీనిని ‘S’ అనే అక్షరంతో సూచిస్తారు. ప్రమాణాలు : C.G.S. పద్ధతిలో కేలరీ /గ్రా. × °C
S.I. పద్ధతిలో బౌల్/కి.గ్రా.-K
అధిక విశిష్టోష్ణం గల పదార్థం – నీరు – కేలరీ / గ్రా.°C
అల్ప విశిష్టోష్ణం గల పదార్థం – సీసం – 0.31 కేలరీ / గ్రా.°C
→ బాష్పీభవనం : ద్రవంలోని అణువులు ఏ ఉష్ణోగ్రత ,వద్దనైనా ద్రవ ఉపరితలాన్ని విడిపోయే ప్రక్రియను బాష్పీభవనం అంటారు.
బాష్పీభవనం అనేది ఉపరితలానికి చెందిన దృగ్విషయం.
బాష్పీభవనం వలన వ్యవస్థ ఉష్ణోగ్రత తగ్గును.
→ సాంద్రీకరణం : వాయువు ద్రవంగా స్థితి మార్పు చెందడమే సాంద్రీకరణం. సాంద్రీకరణలో వ్యవస్థ ఉష్ణోగ్రత పెరుగును.
→ ఆర్ధత : గాలిలోని నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ధత అంటారు.
→ తుషారం : శీతాకాలంలో భూమిపై ఉన్న ఘనపదార్థాలు తక్కువ ఉష్ణోగ్రతలో ఉంటాయి. ఈ చల్లటి పదార్థాలను తాకిన గాలిలోని నీటి ఆవిరి చిన్న చిన్న బిందువులుగా మారి వాటి ఉపరితలంపై ఏర్పడతాయి. దీనినే తుషారం అంటారు.
→ పొగమంచు : భూమి ఉపరితలంపై ఉన్న గాలి ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు గాలి పొరలలోని నీటి ఆవిరి గాలిలోని ధూళికణాల పై సాంద్రీకరణం చెంది చిన్నచిన్న నీటి బిందువులుగా ఏర్పడతాయి. ఈ నీటి బిందువులు గాలిలో తేలియాడుతూ పలుచని మేఘం వలె కనిపిస్తాయి. పొగవలె గాలిలో తేలియాడే నీటి బిందువులను పొగమంచు అంటారు.
→ మరగటం : స్థిర పీడనం, స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలోని పదార్థం వాయుస్థితిలోనికి మారటం.
→ బాష్పీభవన గుప్తోష్ణం : స్థిర ఉష్ణోగ్రత వద్ద 1 గ్రా. ద్రవ పదార్థం పూర్తిగా ఆవిరిగా మారటానికి కావలసిన ఉష్ణాన్ని బాష్పీభవన గుప్తోష్ణం అంటారు.
నీటి బాష్పీభవన గుప్తోష్ణం విలువ 540 Cal/gram.
→ ద్రవీభవనం : స్థిర ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో ఉన్న పదార్థం ద్రవస్థితిలోకి మారే ప్రక్రియను ద్రవీభవనం అంటారు.
→ ఘనీభవనం : ద్రవస్థితిలో ఉన్న పదార్థం కొంత శక్తిని కోల్పోవడం ద్వారా ఘనస్థితిలోకి మారే ప్రక్రియను ఘనీభవనం అంటారు.
→ ద్రవీభవన గుప్తోష్ణం : స్థిర ఉష్ణోగ్రత వద్ద 1 గ్రా. ఘనపదార్థం పూర్తిగా ద్రవంగా మారటానికి కావల్సిన ఉష్ణాన్ని ద్రవీభవన గుప్తోష్ణం అంటారు.
మంచు ద్రవీభవన గుప్తోష్ణం విలువ 80 Cal/gram.