AP 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

Students can go through AP Board 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం to understand and remember the concept easily.

AP Board 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

→ కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రయాణించునప్పుడు రెండు యానకాలను వేరుచేసే తలం వద్ద కాంతివేగం మారిపోయే లక్షణంను కాంతి వక్రీభవనం అంటారు.

→ కాంతి సమతలాల వద్ద మరియు వక్రతలాల వద్ద కూడా వక్రీభవనం చెందును.

→ వక్రతలం ఏ గోళానికి సంబంధించినదో, ఆ గోళ కేంద్రాన్ని వక్రతా కేంద్రం (C) అంటారు.

→ వక్రతా యొక్క కేంద్రాన్ని ధృవం (పోల్) (P) అంటాము.

→ వక్రతా కేంద్రాన్ని, ధృవంను కలిపే రేఖను ప్రధానాక్షం అంటారు.

→ యానకాల వక్రీభవన గుణకాలు, వస్తుదూరం, ప్రతిబింబదూరం మరియు వక్రతావ్యాసార్ధాల మధ్య సంబందం \(\frac{n_{2}}{v}-\frac{n_{1}}{u}=\frac{n_{2}-n_{1}}{R}\) అగును.

AP 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

→ రెండు ఉపరితలాలతో ఆవృతమైన పారదర్శక పదార్థం యొక్క రెండు తలాలూ లేదా ఏదో ఒక తలం వక్రతలమైతే ఆ పారదర్శక పదార్థాన్ని ‘కటకం’ అంటాం.

→ కటకాలు వివిధ రకాలుగా ఉంటాయి. అవి :
AP 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 1

→ కటకపు రెండు వక్రతలాలు రెండు గోళాలకు చెందినవి.

→ ఒక కటకానికి రెండు వక్రతలాలుంటే దాని వక్రతా కేంద్రాలను C1 మరియు C2 లతో సూచిస్తాం.

→ వక్రతా కేంద్రం నుండి వక్రతలం వరకు గల దూరాన్ని వక్రతా వ్యాసార్ధం(R) అంటాం.

→ కటకం యొక్క రెండు వక్రతా వ్యాసార్ధాలను R1 మరియు R2 లతో సూచిస్తాము.

→ ద్వికుంభాకార కటకంలో గల వక్రతా కేంద్రాలు C1, C2లను కలిపే రేఖను ప్రధానాక్షం అంటాం.

→ కటకం యొక్క మధ్య బిందువును కటక దృక కేంద్రం (P) అంటాం.

AP 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

→ ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తూ వచ్చి కటకంపై పడిన కాంతికిరణాలు వక్రీభవనం చెందాక కేంద్రీకరింపబడిన బిందువు లేదా కాంతికిరణాలు వెలువడుతున్నట్లు కనిపించే బిందువును కటక నాభి (F) అంటాం.

→ ప్రతి కటకానికి రెండు నాభులు ఉంటాయి.

→ నాభి మరియు దృక కేంద్రం మధ్య దూరాన్ని కటక నాభ్యంతరం “f’ అంటారు.


AP 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 2

→ కటకంపై పతనమైన కొన్ని కాంతికిరణాల ప్రవర్తన :
i) ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే ఏ కాంతికిరణమైనా విచలనం పొందదు.
AP 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 3

ii) కటక దృక కేంద్రం గుండా ప్రయాణించే కాంతికిరణం కూడా విచలనం పొందదు.
AP 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 4

iii) ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతికిరణాలు నాభి వద్ద కేంద్రీకరించబడతాయి లేదా నాభి నుండి వికేంద్రీకరించబడినట్లు కనిపిస్తాయి.
గమనిక: C1 మరియు C2 బిందువులు వక్రతా కేంద్రాలు కావు. ఇవి దృక్ కేంద్రం నుండి ‘2f’ దూరాన్ని సూచిస్తాయి.
AP 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 5

iv)నాభి గుండా ప్రయాణించే కాంతికిరణం: వక్రీభవనం పొందాక ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించును.
AP 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 6

v) ప్రధానాక్షంతో కొంత కోణం చేస్తూ వచ్చే సమాంతర కాంతికిరణాలు నాభీయతలంపై ఏదేని బిందువు వద్ద కేంద్రీకరింపబడతాయి లేదా నాభీయతలంపై ఏదేని బిందువు నుండి వికేంద్రీకరింపబడినట్లు కనిపిస్తాయి.
AP 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 7

→ వస్తువు వివిధ స్థానాలలో ఉన్నప్పుడు కుంభాకార కటకం వలన ఏర్పడే ప్రతిబింబాలు, వాటి లక్షణాలు :
AP 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 8

→ \(\frac{1}{v}=\frac{1}{u}-\frac{1}{f}\)ను వస్తువు దూరం, ప్రతిబింబదూరం మరియు కటక నాభ్యంతరాల మధ్య గల సంబంధం అంటారు. దీనినే ‘కటక సూత్రము’ అంటాము.

→ n1 వక్రీభవన గుణకం గల యానకం నుండి n2 వక్రీభవన గుణకం గల యానకంలోకి, R వక్రతావ్యాసార్ధం గల వక్రతలం గుండా ఒక కాంతికిరణం ప్రయాణించునపుడు \(\frac{n_{2}}{v}-\frac{n_{1}}{u}=\frac{n_{2}-n_{1}}{R}\) సూత్రాన్ని వినియోగిస్తాము.

→ కటక తయారీ సూత్రం : \(\frac{1}{f}=\{n-1)\left(\frac{1}{R_{1}}-\frac{1}{R_{2}}\right)\)
ఇందులో R1, R2లు వక్రతా వ్యాసార్ధాలు, n – వక్రీభవన గుణకం, f – నాభ్యంతరం.

→ కటకం : ఒక పారదర్శక యానకం యొక్క రెండు ఉపరితలాలలో కనీసం ఒకటి వక్రతలమై, అది మరొక యానకంను వేరుచేస్తుంటే దానిని కటకం అంటాం.

→ నాభ్యంతరం : కటక నాభి మరియు దాని దృక్ కేంద్రం మధ్య దూరము.

→ నాభి : ఒక కటకం పైన పడిన కాంతికిరణాలు వక్రీభవనం చెందిన తర్వాత కేంద్రీకరింపబడిన లేదా వెలువడుతున్నట్లు కనిపించే బిందువు.

→ దృక్ కేంద్రం : కటకపు మధ్య బిందువు.

AP 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

→ ప్రధానాక్షం : కటకపు వక్రతా కేంద్రాలను కలిపే రేఖ.

→ వక్రతా వ్యాసార్థం : వక్రతా కేంద్రం నుండి వక్రతలం వరకు గల దూరము.

→ వక్రతా కేంద్రం : వక్రతలంకు సంబంధించిన గోళం యొక్క కేంద్రం.

→ నాభీయ తలం : నాభీయ తలం అనేది ప్రధానాక్షానికి లంబంగా నాభి వద్ద గల తలం.

→ కాంతి కిరణాల కేంద్రీకరణ : కాంతి కిరణాలు ఒక బిందువు వద్దకు వచ్చి కలవడాన్ని ‘కేంద్రీకరణ’ అంటారు.

→ కాంతి కిరణాల వికేంద్రీకరణ : కాంతి కిరణాలు ఒక బిందువు నుండి బయలుదేరి వివిధ దిశలలో వెళ్ళడాన్ని ‘వికేంద్రీకరణ’ అంటారు.

AP 10th Class Physical Science Notes 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 9