These AP 10th Class Physics Chapter Wise Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం will help students prepare well for the exams.
AP Board 10th Class Physical Science 9th Lesson Important Questions and Answers విద్యుత్ ప్రవాహం
10th Class Physics 9th Lesson విద్యుత్ ప్రవాహం 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
వలయంలో ప్రవహించే విద్యుత్ పరిమాణము కనుగొనండి.
జవాబు:
పటంలో మూడు నిరోధాలు శ్రేణి సంధానంలో ఉన్నాయి.
R1 = 3Ω, R2 = 5Ω, R3 = 2Ω
ఫలిత నిరోధం R = R1 + R2 + R3 = 3Ω + 5Ω + 2Ω
R= 10Ω, V = 1.5
విద్యుత్ I = \(\frac{V}{R}\) = \(\frac{1.5}{10}\) = 0.15 A
ప్రశ్న 2.
పటంలో చూపిన విధంగా రవి, A, B, C నిరోధాలను వలయంలో కలిపాడు. ప్రతీ నిరోధం 18 W సామర్థ్యాన్ని వినియోగించుకుంటుంది. ఒక్కొక్క నిరోధం గుండా ప్రవహించే విద్యుత్ ను కనుగొనండి.
జవాబు:
ప్రశ్న 3.
ఒక విద్యుత్ వలయంలో వలయాన్ని ఏర్పరచుటకు వాడిన వాహక తీగనే ఉపయోగించి తయారు చేసిన ఫ్యూజ్ ను అమర్చితే ఏమి జరుగుతుందో ఊహించండి.
జవాబు:
ఆ ఫ్యూజ్ పని చేయదు. కావున అధిక ఓల్టేజ్. ఏర్పడినప్పుడు వలయం తెరువబడదు. కనుక వలయంలో విద్యుత్ సాధనాలు పాడైపోతాయి.
ప్రశ్న 4.
బ్యాటరీ, ఓల్ట్ మీటర్, అమ్మీటర్, నిరోధము మరియు వాహక తీగలను ఉపయోగించి విద్యుత్ వలయాన్ని గీయండి.
జవాబు:
ప్రశ్న 5.
ఓమీయ, అఓమీయ వాహకాల మధ్య ఏవేని రెండు భేదాలు రాయండి.
జవాబు:
- ఓమీయ వాహకాలు ఓమ్ నియమాన్ని పాటిస్తాయి. అఓమీయ వాహకాలు ఓమ్ నియమాన్ని పాటించవు.
- ఓమీయ వాహకాలు విద్యుత్ వాహకాలు, అఓమీయ వాహకాలు అర్ధవాహకాలు.
- ఓమీయ వాహకాలకు V-I గ్రాఫ్ సరళరేఖగా ఉంటుంది.
అఓమీయ వాహకాలకు V-I గ్రాఫ్ సరళరేఖగా ఉండదు.
ప్రశ్న 6.
గృహాల విద్యుత్ వలయంలో విద్యుత్ ఉపకరణాలను శ్రేణిలో కలిపితే ఏమగును?
జవాబు:
గృహాల విద్యుత్ వలయంలో విద్యుత్ ఉపకరణాలను శ్రేణిలో కలిపితే
- ఏదేని ఒక ఉపకరణం పాడైపోతే మొత్తం వలయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది.
- వలయంలో నిరోధం పెరిగిపోయి విద్యుత్ ప్రవాహం తగ్గుతుంది.
- ఒక ఉపకరణాన్ని ఉపయోగించడానికి స్విచ్ ఆన్ చేస్తే మిగిలిన అన్ని ఉపకరణాలు కూడా పనిచేస్తూ అనవసరంగా ఎక్కువ విద్యుత్ ను వినియోగిస్తాయి. తద్వారా విద్యుత్ బిల్లు, విద్యుత్ నష్టం ఎక్కువగును.
ప్రశ్న 7.
“అధిక వోల్టేజి – ప్రమాదం” అనే బోర్డులను తరచుగా చూస్తుంటాం. కాని ‘అధిక విద్యుత్-ప్రమాదం’ అని ఎందుకు ఉంచటం లేదు. ఊహించి సమాధానం రాయండి.
జవాబు:
అధిక వోల్టేజ్ – అని రాయబడి ఉన్న తీగలకు ఏదైనా వస్తువు / మనిషి కలుపబడితే ఆ వస్తువులో తీగలకు తగిలిన రెండు బిందువుల మధ్య అధిక పొటనియల్ భేదం ఏర్పాటు చేయబడుతుంది. అయితే వస్తువులో ఎంత విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందనేది ఆ వస్తువు తయారైన పదార్థ స్వభావం, నిరోధంపై ఆధారపడి ఉంటుంది. అన్ని సందర్భాలలో ఒకే విధమైన అధిక విద్యుత్ ప్రవాహం ఉంటుందని చెప్పలేము. కనుక అధిక విద్యుత్ ప్రవాహం – ప్రమాదం అని రాయరు.
ప్రశ్న 8.
వాహక పొడవు, నిరోధం మధ్య సంబంధాన్ని గుర్తించే ప్రయోగాన్ని నిర్వహించడానికి కావలసిన పరికరాలను తెల్పండి.
జవాబు:
వాహక పొడవు, నిరోధం మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించు ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఈ క్రింది పరికరాలు అవసరం.
- ఒకే మధ్యచ్ఛేదం కలిగి వేర్వేరు పొడవులు గల ఇనుప చువ్వలు,
- బ్యాటరీ
- అమ్మీటర్
- కీ
- రాగి తీగలు.
ప్రశ్న 9.
విద్యుత్ వాహకాలంటే ఏమిటి?
జవాబు:
ఏ పదార్థాలైతే తమ గుండా విద్యుత్ ను ప్రసరింపజేస్తాయో వాటిని విద్యుత్ వాహకాలంటారు.
ఉదా : లోహాలు
ప్రశ్న 10.
విద్యుత్ బంధకాలంటే ఏమిటి?
జవాబు:
ఏ పదార్థాలైతే తమ గుండా విద్యుత్ ను ప్రసరింపచేయలేవో వాటిని విద్యుత్ నిబంధకాలంటారు.
ఉదా : చెక్క రబ్బరు.
ప్రశ్న 11.
విద్యుత్ ప్రవాహం అంటే ఏమిటి?
జవాబు:
ఒక వాహకంలో ఎలక్ట్రాన్ క్రమమైన చలనాన్ని విద్యుత్ ప్రవాహం అంటాము (లేదా) ఆవేశాల క్రమ చలనమును విద్యుత్ ప్రవాహం అంటారు.
ప్రశ్న 12.
విద్యుత్ ప్రవాహంకు సమీకరణంను వ్రాయుము.
జవాబు:
‘t’ కాలవ్యవధిలో ఒక వాహకంలోని ఏదేని మధ్యచ్ఛేదంను దాటి వెళ్ళే ఆవేశం (Q)ను విద్యుత్ ప్రవాహం (I) అంటారు.
విద్యుత్ ప్రవాహం (I) = \(\frac{Q}{t}\) అగును.
ప్రశ్న 13.
విద్యుత్ ప్రవాహానికి ప్రమాణాలను వ్రాయుము.
జవాబు:
SI పద్దతిలో విద్యుత్ ప్రవాహానికి ప్రమాణము ఆంపియర్.
ప్రశ్న 14.
డ్రిఫ్ట్ లేదా అపసర వడిని నిర్వచించుము.
జవాబు:
ఒక వాహకంలో ఎలక్ట్రాన్ల స్థిర సరాసరి వడిని డ్రిఫ్ట్ లేదా అపసర వడి అంటాము.
ప్రశ్న 15.
విద్యుత్ ప్రవాహంను కొలుచుటకు వాడు పరికరం ఏది?
జవాబు:
అమ్మీటరు విద్యుత్ ప్రవాహంను కొలుచుటకు వాడతారు. దీనిని ఎల్లప్పుడు శ్రేణి సంధానంలో కలుపుతారు.
ప్రశ్న 16.
పొటెన్షియల్ భేదంను నిర్వచించుము. దాని ప్రమాణాలను వ్రాయుము.
జవాబు:
- వాహకంలో ఒక బిందువు నుండి మరొక బిందువుకు ప్రమాణ ధనావేశంను కదల్చటానికి విద్యుత్ బలం చేసిన పనిని ఆ రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ భేదం అంటారు.
- దీనికి SI ప్రమాణం “ఓల్ట్”.
ప్రశ్న 17.
పొటెన్షియల్ భేదంను, విద్యుచ్చాలక బలంను కొల్చుటకు వాడు పరికరం ఏది?
జవాబు:
పొటెన్షియల్ భేదంను విద్యుచ్చాలక బలంను కొలుచుటకు ఓల్ట్ మీటర్‌ను వాడతారు. దీనిని వలయంలో సమాంతర సంధానంలో కలుపుతారు.
ప్రశ్న 18.
విద్యుచ్చాలక బలంను నిర్వచించుము.
జవాబు:
- ప్రమాణ ఋణావేశంను ధనధృవం నుండి ఋణధృవంకు కదిలించడానికి రసాయన బలం చేసిన పనిని విద్యుచ్చాలక బలం అంటారు.
- దీనికి SI ప్రమాణం “ఓల్ట్”.
ప్రశ్న 19.
వాహకాల యొక్క V – I గ్రాఫ్ ఆకృతిని గీయుము.
జవాబు:
ప్రశ్న 20.
అర్ధవాహకాల యొక్క V – I గ్రాఫ్ ఆకృతిని గీయుము.
జవాబు:
ప్రశ్న 21.
ఓమ్ నియమమును నిర్వచించుము.
జవాబు:
స్థిర ఉష్ణోగ్రత వద్ద, వాహకం యొక్క రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం వాహకం గుండా ప్రవహించు విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
V ∝ I ⇒ \(\frac{V}{I}\) =R
ప్రశ్న 22.
ఓమ్ నియమము యొక్క షరతులేవి?
జవాబు:
- లోహ వాహకాలు ఓమ్ నియమంను పాటిస్తాయి.
- వాయు వాహకాలకు ఓమ్ నియమం వర్తించదు.
- అర్ధ వాహకాలకు ఓమ్ నియమం వర్తించదు. ‘.
ప్రశ్న 23.
పదార్థ నిరోధాన్ని ప్రభావితం చేయు అంశాలు ఏవి?
జవాబు:
- వాహక పదార్థపు నిరోధము దాని ఉష్ణోగ్రతపై
- పదార్థ స్వభావంపై
- వాహకపు పొడవుపై
- వాహకపు మధ్యచ్ఛేద వైశాల్యంపై ఆధారపడి ఉండును.
ప్రశ్న 24.
విద్యుత్ వలయం అంటే ఏమిటి?
జవాబు:
బ్యాటరీ, వాహక తీగలతో ఎలక్ట్రాన్లు ప్రవహించడానికి అనుకూలంగా ఏర్పరచిన సంవృత మార్గాన్ని వలయం అంటారు.
ప్రశ్న 25.
కిర్ఛాఫ్ జంక్షన్ నియమంను వ్రాయుము.
జవాబు:
వలయంలో విద్యుత్ ప్రవాహం విభజింపబడే ఏ జంక్షన్ వద్దనైనా, జంక్షన్ ను చేరే విద్యుత్ ప్రవాహాల మొత్తం ఆ జంక్షనను వీడిపోయే విద్యుత్ ప్రవాహాల మొత్తంకు సమానము.
ప్రశ్న 26.
కిర్ఛాఫ్ లూప్ నియమంను వ్రాయుము.
జవాబు:
ఒక మూసిన వలయంలోని వివిధ పరికరాల రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదాలలో పెరుగుదల, తగ్గుదల బీజీయ మొత్తం శూన్యము.
ప్రశ్న 27.
విద్యుత్ సామర్థ్యం అంటే ఏమిటి?
జవాబు:
విద్యుత్ ప్రవాహం, పొటెన్షియల్ భేదాల లబ్దాన్ని విద్యుత్ సామర్థ్యం అంటారు. దీనికి SI ప్రమాణం వాట్.
ప్రశ్న 28.
60 W, 120 V అని ముద్రించబడియున్న బల్బు యొక్క నిరోధమెంత?
జవాబు:
ప్రశ్న 29.
రెండు లేదా అంతకన్నా ఎక్కువ నిరోధకాలు శ్రేణిలో ఉన్నాయని ఎలా చెప్పగలవు?
జవాబు:
రెండు లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాల గుండా ఒకేరకమైన విద్యుత్ ప్రవాహము ఉన్నప్పుడు, అవి శ్రేణిలో కలుపబడి ఉన్నాయని చెప్పవచ్చు.
ప్రశ్న 30.
రెండు లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాలు సమాంతరంగా కలుపబడి ఉన్నాయని ఎలా చెప్పగలవు?
జవాబు:
రెండు లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాల ద్వారా ఒకే విధమైన పొటెన్షియల్ భేదమున్నపుడు ఆ నిరోధాలను సమాంతరంగా కలిపామని చెప్పవచ్చు.
ప్రశ్న 31.
“లాటిస్” అనగానేమి?
జవాబు:
లోహాల వంటి వాహకాలలో అధిక సంఖ్యలో స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ధనాత్మక అయాన్లు నిర్దిష్ట స్థానాలలో ఉంటాయి. ఈ ధనాత్మక అయాన్ల అమరికను “లాటిస్” అంటారు.
ప్రశ్న 32.
వాహకం రెండు చివరల బ్యాటరీకి కలిపితే దానిలో ఎలక్ట్రాన్లు నిర్దిష్ట దిశలోనే ఎందుకు కదులుతాయి?
జవాబు:
వలయంలో బ్యాటరీ లేనప్పుడు వాహకంలో ఎలక్ట్రాన్లు ‘క్రమరహిత’ చలనంలో ఉంటాయి. కాని వలయంలో బ్యాటరీని కలిపితే, వాహకమంతా ఒక సమ విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. ఈ క్షేత్రమే ఎలక్ట్రాన్లను నిర్దిష్ట దిశలలో కదిలిస్తుంది.
ప్రశ్న 33.
మధ్యచ్ఛేద వైశాల్యం 10-6 m² గా గల రాగి తీగ గుండా 14 విద్యుత్ ప్రవాహం ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ అపసర వడిని కనుగొనండి.
జవాబు:
రాగి ఎలక్ట్రాన్ సాంద్రత n = 8.5 × 1028 m-3
qe = 1.602 × 10-19c
మధ్యచ్ఛేద వైశాల్యం A = 10-6 m²
విద్యుత్ ప్రవాహము I = 1A
ప్రశ్న 34.
A, B ల మధ్య ఫలిత నిరోధం ఎంత?
జవాబు:
4Ω, 4Ω లు శ్రేణి సంధానంలో ఉన్నాయి. కనుక
R= R1 + R2 ∴ R = 4Ω + 4Ω = 8Ω ఫలిత నిరోధం R = 8Ω
ప్రశ్న 35.
P, Q ల మధ్య ఫలిత నిరోధం ఎంత?
జవాబు:
5Ω, 5Ω లు సమాంతర సంధానంలో ఉన్నాయి. కనుక
ప్రశ్న 36.
మన ఇంటిలోని విద్యుత్ వలయంలో ఫ్యూను సమాంతరంగా కలపాలా? శ్రేణిలో కలపాలా? ఎందుకు?
జవాబు:
- మన ఇంటిలోని విద్యుత్ వలయంలో ఫ్యూజ్ ను శ్రేణిలో కలపాలి.
- ఎందుకనగా, శ్రేణిలో ఫ్యూజ్ ను కలపడం వలన వలయంలో ఓవర్ లోడ్ సంభవించినప్పుడు వలయం తెరువబడి, విద్యుత్ ప్రవాహం ఆగిపోవును.
- దీని వలన వలయంలో అన్ని పరికరాలు పాడవకుండా ఉంటాయి.
ప్రశ్న 37.
విద్యుత్ వల్ల కలిగే రెండు దుష్ఫలితాలు తెలుపుము.
జవాబు:
- ఎవరైనా వ్యక్తులు విద్యుత్ ప్రవహించే తీగను తాకితే, విద్యుత్ షాక్ తగిలి ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా వుంది.
- విద్యుత్ లఘువలయం ఏర్పడడం వల్ల ఒక్కోసారి అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి.
ప్రశ్న 38.
విద్యుత్ లఘువలయం ఏర్పడిన చోట మెరుపు ఎందుకు వస్తుంది? ఆ కాంతి తెల్లగా ఎందుకుంటుంది?
జవాబు:
లఘువలయం ఏర్పడినపుడు విద్యుత్ నిరోధం తగ్గి, అధిక మొత్తంలో విద్యుత్ ప్రవహించడం వల్ల తీగ వేడెక్కుతుంది. ఆ వేడికి తీగను తయారుచేసిన లోహం ఆవిరిగా మారి మెరుపులాగా కనిపిస్తుంది. అధికవేడి వల్ల ఆ కాంతి తెల్లగా . కనిపిస్తుంది.
10th Class Physics 9th Lesson విద్యుత్ ప్రవాహం 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
ఒక విద్యుత్ వాహకం యొక్క VII విలువ స్థిరమని నిరూపించేందుకు నిర్వహించే ప్రయోగానికి సంబంధించిన పరికరాల అమరికను పటం గీచి చూపండి.
లేదా
ఓమ్ నియమాన్ని సరిచూచు ప్రయోగాల పటం గీయండి.
జవాబు:
ప్రశ్న 2.
ఫ్యూజ్ ల తయారీలో లెడ్ తీగను వాడటానికి కారణాలు తెల్పండి.
జవాబు:
- ఫ్యూజ్ ల తయారీలో లెడ్ తీగను వాడుటకు గల కారణము లెడ్ కు ద్రవీభవన స్థానం తక్కువ మరియు నిరోధత్వం విలువ తక్కువ.
- ఈ పదార్థం ద్వారా తయారు చేసిన తీగ గుండా విద్యుత్ ప్రవహించిన, అది ఒక ఉష్ణోగ్రత వద్ద వేడెక్కి కరుగును. దీని వలన వలయం తెరచుకొని ఇంటిలోని ఇతర పరికరాలకు విద్యుత్ ప్రవాహం ఆగును.
ప్రశ్న 3.
వలయాన్ని పటంలో చూపటం జరిగింది. A, B ల మధ్య ఫలిత నిరోధం ఎంత?
జవాబు:
A, B ల మధ్య ‘R’ నిరోధం గల మూడు నిరోధకాలు సమాంతరంగా కలుపబడ్డాయి. వీటికి ‘R’ నిరోధకం శ్రేణిలో కలుపబడినది.
1) సమాంతరంగా కలుపబడ్డ మూడు నిరోధకాల ఫలిత నిరోధం
ప్రశ్న 4.
వలయాన్ని పటంలో చూపటం జరిగింది. A, B ల మధ్య ఫలిత నిరోధం ఎంత?
జవాబు:
మూడు నిరోధాలు సమాంతరంగా అనుసంధానంలో ‘కలవు. కావున వాటి ఫలిత నిరోధం RP అగును.
ప్రశ్న 5.
ఒక పెట్టెలో రెండు నిరోదాలను అనుసంధానించారు. కాని ఎలా పెట్టెలో అనుసంధానం చేసారో తెలియదు. నిరోధ విలువలు సమానం. A, B ల మధ్య 10V బ్యాటరీని ఉంచారు. C, D ల మధ్య వోల్టు మీటర్ కలిపిన, వోల్టుమీటరు 5V గా చూపింది. మరల C, D ల మధ్య 10V బ్యాటరీని కలిపి A, B ల మధ్య వోల్టుమీటరు రీడింగు తీసుకున్నారు. ఆ రీడింగు 10V అయింది. ఆ నిరోధాలను పెట్టెలో ఎలా కలిపితే పై విలువ వస్తాయో తెలపండి.
జవాబు:
VAB = 10V అయితే R1// R2 కనుక ఫలిత నిరోధం = \(\frac{R}{2}\)
∴ VCD = 5V
VCD = 10V అయితే VAB = V అగును.
R1 R2 లు శ్రేణిలో ఉండును. R2 = 10V
ప్రశ్న 6.
కారు హెడ్ లైట్ తక్కువకాంతి విడుదలయ్యేటప్పుడు ; అవి 40 W సామర్థ్యాన్ని, ఎక్కువ కాంతి విడుదలచేసేటప్పుడు అవి 50 W సామర్థ్యాన్ని వినియోగించుకుంటున్నాయి. ఏ సందర్భంలో హెడ్ లైట్ నిరోధం ఎక్కువగా ఉంటుంది? చర్చించండి.
జవాబు:
విద్యుత్ సామర్ధ్యం అనేది నిరోధానికి, విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. కనుక రెండవ సందర్భంలో హెడ్ లైట్ నిరోధం ఎక్కువగా ఉంటుంది.
ప్రశ్న 7.
క్రింది వాటి గుర్తులు రాయుము.
1) బ్యాటరీ 2) నిరోధం 3) అమ్మీటర్ 4) వోల్ట్ మీటర్ 5) ప్లగ్ కీ 6) రియోస్టాట్ 7) టాప్ కీ
జవాబు:
10th Class Physics 9th Lesson విద్యుత్ ప్రవాహం 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
స్థిర ఉష్ణోగ్రత వద్ద సమానమయిన మధ్యచ్ఛేద వైశాల్యం గల వాహకం యొక్క నిరోధం, దాని పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుందనే అంశాన్ని మీరెలా సరిచూస్తారో తెల్పండి.
జవాబు:
- వాహకం యొక్క పొడవుకు, దాని నిరోధానికి గల సంబంధాన్ని సరిచూడవలసి ఉన్నది. కావున ఒకే పదార్థంతో తయారై సమాన మధ్యచ్ఛేద వైశాల్యం కలిగియుండి వివిధ పొడవులు గల లోహపు తీగలు లేదా సువ్వలను కొన్నింటిని తీసుకోవాలి.
- బ్యాటరీ, అమ్మీటరు, స్విచ్ (కీ) మరియు వాహక తీగలను ఉపయోగించి వలయాన్ని ఏర్పాటు చేయాలి. ఈ వలయంలో వివిధ పొడవులు గల సువ్వలను కలిపేందుకు వాహక తీగ మధ్యలో కొంత ఖాళీలని వదలాలి.
- ఎంచుకున్న సువ్వలను ఒక్కొక్కటిగా వలయంలో కలుపుతూ అమ్మీటరు సహాయంతో వలయంలో ప్రవహించే విద్యుత్ ను కొలవాలి. సువ్వల పొడవు, విద్యుత్ ప్రవాహాన్ని నమోదు చేయాలి.
- మనం ఉపయోగించిన సువ్వల పొడవులు పెరిగే క్రమంలోనే వలయంలో విద్యుత్ ప్రవాహం తగ్గితే (నిరోధం పెరిగితే), వాహకం యొక్క నిరోధం దాని పొడవుకు అనులోమానుపాతంలో ఉన్నదని గుర్తించవచ్చు.
ప్రశ్న 2.
విద్యుత్ వాహక నిరోధమును ప్రభావితం చేసే కారకాలు ఏవి? ఏవేని రెండు కారకాల ప్రభావమును వివరించండి.
జవాబు:
విద్యుత్ వాహక నిరోధమును ప్రభావితం చేయు కారకాలు
- పదార్థ స్వభావము,
- ఉష్ణోగ్రత,
- వాహక పొడవు,
- వాహక మధ్యచ్ఛేద వైశాల్యము
వివరణ :
- వాహక ఉష్ణోగ్రత పెరిగిన దాని నిరోధము కూడా పెరుగును.
- వేర్వేరు పదార్థాలకు వేర్వేరు నిరోధములుండును.
- పదార్థ వాహకము యొక్క నిరోధము దాని పొడవుకు అనులోమానుపాతంలో ఉండును.
(T మరియు A లు స్థిరంగా ఉన్నప్పుడు) ∴ R ∝ l - పదార్ధ వాహకము యొక్క నిరోధము దాని మధ్యచ్ఛేద వైశాల్యము (A) కు విలోమానుపాతంలో ఉండును.
(1 మరియు T లు స్థిరంగా ఉన్నప్పుడు) ∴ R ∝ \(\frac{1}{A}\)
ప్రశ్న 3.
5Ω, 15Ω, 20Ω మరియు 10Ω నిరోధాలు వలయంలో క్రింద చూపబడిన విధంగా కలుపబడినాయి. అయిన వలయంలో ఫలిత నిరోధంను కనుగొనుము.
జవాబు:
a) వలయంలో 5Ω మరియు 15Ω నిరోధాలు శ్రేణిలో కలుపబడి ఉన్నాయి.
వీటి ఫలిత నిరోధం (Ri) = 5Ω + 15Ω [∵ R = R1 + R2] = 20Ω
b) వలయంలో Ri మరియు 20Ω లు సమాంతరంగా ఉన్నాయి.
c) వలయంలో Rii మరియు 10 Ω లు శ్రేణిలో ఉన్నాయి.
వీటి ఫలిత నిరోధం (Riii) = 10 Ω + 10 Ω = 20 Ω.
కావున ఇచ్చిన వలయంలో ఫలిత నిరోధం = 20 Ω.
ప్రశ్న 4.
వాహకం పొడవు, వాహక నిరోధముల మధ్య సంబంధం ఏమిటి? ఈ సంబంధంను పరిశీలించుటకు చేయు ప్రయోగ విధానం రాయుము.
జవాబు:
- పొటెన్షియల్ భేదం స్థిరంగా ఉన్నప్పుడు వాహక నిరోధం, దాని పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది.
- ఒకే మధ్యచ్ఛేద వైశాల్యం, వివిధ పొడవులు గల కొన్ని ఇనుప చువ్వలను తీసుకోవాలి.
- ఒక ఇనుప చువ్వ, బ్యాటరీ, ఆమ్మీటర్, స్విచ్ లను శ్రేణిలో కలుపుతూ వలయాన్ని పూర్తి చేయాలి.
- వలయంలో విద్యుత్ ప్రవహింపజేసి ఆమ్మీటర్ రీడింగ్ ని నమోదు చేయాలి.
- ఈ విధంగా వివిధ పొడవులు గల ఇనుప చువ్వలను మార్చి ఆమ్మీటర్ రీడింగ్లను నమోదు చేయాలి.
- రీడింగ్ లను అనుసరించి ఇనుప చువ్వ పొడవు పెరిగితే ఆమ్మీటర్ రీడింగ్ తగ్గుతుంది. దీనిని బట్టి వాహక తీగ పొడవు పెరిగితే నిరోధం పెరిగిందని చెప్పవచ్చు.
ప్రశ్న 5.
60 V బ్యాటరీని మూడు నిరోధాలు R1 = 10 Ω R3 = 20 Ω మరియు R3 = X Ω లను వలయంలో శ్రేణిలో కలిపారు. వలయంలో 1 ఆంపియర్ విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు కిర్కాఫ్ లూప్ నియమాన్ని ఉపయోగించి R3 యొక్క నిరోధంను కనుగొనుము.
జవాబు:
లూప్ నియమం ప్రకారం 60 – 10I – 20I – XI = 0
I = 1 ఆంపియర్ విలువను పై సమీకరణంలో ప్రతిక్షేపించగా
60 – 10 – 20 – x = 0 = X ⇒ 30
∴ R3 = 30 Ω
ప్రశ్న 6.
కిర్ ఛాఫ్ “లూప్ నియమము” ను నిర్వచించి, వివరించండి.
జవాబు:
లూప్ నియమం :
ఒక మూసిన వలయంలోని వివిధ పరికరాల రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదాలలో పెరుగుదల, తగ్గుదల బీజీయ మొత్తం శూన్యం.
వివరణ :
ఒక మూసిన వలయంలోని ప్రారంభంలో గల రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ భేదాన్ని, ఒక నిర్దిష్ట విలువగా భావించండి. ఆ వలయంలో ఉపయోగించిన వివిధ పరికరాల రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదాలను కొలుస్తూ పోతే, వలయంలో ఉపయోగించిన బ్యాటరీ, నిరోధాలను బట్టి పొటెన్షియల్ భేదం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. కానీ మనం వలయం అంతటా ప్రయాణించి తిరిగి ప్రారంభ బిందువును చేరితే, పొటెన్షియల్ భేదంలో ఫలిత మార్పు శూన్యమవుతుంది. అంటే పొటెన్షియల్ భేదాలలో మార్పుల బీజీయ మొత్తం శూన్యము.
ప్రశ్న 7.
ఒక ఇంటిలో మూడు ట్యూబ్ లైటులు, రెండు ఫ్యానులు, ఒక టెలివిజన్‌ను వాడుతున్నారు. ప్రతి ట్యూబ్ లైట్ 40 W విద్యుత్ ను వినియోగిస్తుంది. టెలివిజన్ 60 W, ఫ్యాన్ 80 W విద్యుత్ ను వినియోగిస్తున్నాయి. సుమారు ప్రతి ట్యూబ్ లైట్ ను ఐదు గంటల చొప్పున, ప్రతి ఫ్యానును 12 గంటల చొప్పున, టెలివిజనను 5 గంటల చొప్పున ప్రతిరోజూ వినియోగిస్తున్నారు. ఒక యూనిట్ (KWH) కు 3 రూ॥ చొప్పున విద్యుత్ ఛార్జి చేస్తే 30 రోజుల్లో చెల్లించాల్సిన సొమ్ము ఎంత?
మొత్తం 30 రోజులలో వినియోగించిన విద్యుత్
జవాబు:
ఒక యూనిట్ (KWH) కు ఛార్జీ = 3 రూ.
కావున 84.6 KWH కు చెల్లించవలసిన మొత్తం సొమ్ము = 84.6 × 3 = 253.80 రూ.
ప్రశ్న 8.
ఒక విద్యుత్ వలయంలో 12 V బ్యాటరీకి 4 Ω, 12 Ω ల నిరోధాలను సమాంతరంగాను, దీనికి 3 Ω ల నిరోధమును శ్రేణిలోను కలుపబడ్డాయి. ఈ దత్తాంశానికి సరిపడు విద్యుత్ వలయాలు గీయండి. ఈ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కనుగొనండి.
జవాబు:
ప్రశ్న 9.
విద్యుత్ నిరోధం పదార్థ స్వభావంపై ఆధారపడి ఉంటుందని చూపు ప్రయోగంనకు కావల్సిన పరికరాలు తెలిపి ప్రయోగ విధానము రాయండి.
జవాబు:
కావలసిన పరికరాలు :
బ్యాటరీ, సమాన పొడవు – సమాన మధ్యచ్ఛేద వైశాల్యం గల వేరు వేరు లోహాలతో తయారు చేసిన తీగలు, సంధాన తీగలు, టాప్ కీ, అమ్మీటర్.
ప్రయోగ విధానం :
- పటంలో చూపిన విధంగా పరకరాలను అమర్చండి.
- పటంలోని P మరియు Q ల మధ్య ఎంపిక చేసుకొన్న ఒక లోహపు తీగను అమర్చండి. అమ్మీటర్ రీడింగ్ గుర్తించండి.
- ఇదేవిధంగా P మరియు Q ల మధ్యలో వేరు వేరు తీగలను (ఎంపిక చేసుకున్న అన్ని తీగలను) అమర్చి అమ్మీటర్ లోని రీడింగ్ గ్లను పరిశీలించండి.
- పై విధంగా నిర్వహించిన ప్రయోగంలో అమ్మీటర్ రీడింగ్ ప్రతిసారీ వేరు వేరుగా వస్తుంది.
దీనిని బట్టి విద్యుత్ వాహక నిరోధం పదార్థ స్వభావంపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చును.
ప్రశ్న 10.
ఒక విద్యార్ధి దీర్ఘఘనాకార కడ్డీని తీసుకొని దాని కొనల మధ్య ఒకే పొటెన్షియల్ భేదాన్ని అనువర్తింపజేస్తే కింది విద్యుత్ విలువలు లెక్కించాడు. పొడవు, వెడల్పు, ఎత్తు కొనల మధ్య
పొటెన్షియల్ భేదం అనువర్తించిన కొలత | విద్యుత్ |
పొడవు | 2A |
వెడల్పు | 4A |
ఎత్తు | 6A |
పై సమాచారం ఆధారంగా మూడు సందర్భాల్లో పొడవు, వెడల్పు, ఎత్తుల నిష్పత్తిని కనుగొనండి.
జవాబు:
ప్రశ్న 11.
నీ స్నేహితుడికి 10Ω నిరోధం అవసరమయింది. నీ దగ్గరకు వచ్చి అడిగాడు. కాని నీ దగ్గర 40Ω ల నిరోధాలున్నవి.
i) కనీసం ఎన్ని నిరోధాలను నీ స్నేహితుడు నిన్ను అడుగుతాడు?
ii) తీసుకున్న వాటిని ఎలా సంధానించాలి?
iii) వాటి ఫలితనిరోధం 10Ω అని చూపండి.
జవాబు:
i) దాదాపు 4 నిరోధాలు,
ii) తీసుకున్న వాటిని సమాంతర సంధానం చేయాలి.
iii) నిరోధాలను సమాంతర సంధానం చేసినపుడు ఫలిత నిరోధం
ప్రశ్న 12.
ఎలక్ట్రాన్ల అపసరవడి కనుగొనడానికి ఒక సమీకరణమును ఉత్పాదించుము.
జవాబు:
- A మధ్యచ్ఛేద వైశాల్యం గల వాహకం రెండు చివరలను బ్యాటరీకి కలిపితే, దానిలో విద్యుత్ ప్రవహిస్తుంది. ఆవేశాల అపసరవడి Vd అనుకుందాం.
- వాహకంలోని ఏకాంక ఘనపరిమాణంలో గల ఆవేశాల సంఖ్య (ఆవేశాల సాంద్రత) n అనుకుందాం.
- ఒక సెకను కాలంలో ప్రతీ ఆవేశం కదిలిన దూరం Vd అవుతుంది. ఈ దూరానికి సంబంధించిన వాహక ఘనపరిమాణం AVd అవుతుంది.
- ఆ ఘనపరిమాణంలోనున్న ఆవేశాల సంఖ్య n.A.Vd కి సమానం.
- ఒక్కొక్క వాహక కణం యొక్క ఆవేశం q అనుకుంటే, ఒక సెకనుకాలంలో D వద్ద గల మధ్యచ్ఛేదాన్ని దాటివెళ్ళే మొత్తం ఆవేశం ng AVd అవుతుంది. ఇది విద్యుత్ ప్రవాహానికి సమానం.
ప్రశ్న 13.
వాహకంలో విద్యుత్ ప్రవాహదిశను మనం ఎలా నిర్ణయిస్తాం?
జవాబు:
- I = nqAVd అని మనకు తెలుసు. దీనిలో n. A విలువలు ధనాత్మకం. కావున ఆవేశం q డ్రిఫ్ట్ వడి V, గుర్తులపై విద్యుత్ ప్రవాహదిశ ఆధారపడి ఉంటుంది.
- ఋణావేశాలకు q విలువ ఋణాత్మకం, Vd విలువ ధనాత్మకం ఐతే q.Vd ల లబ్దం ఋణాత్మకం అవుతుంది. అనగా విద్యుత్ ప్రవాహ దిశ ఋణావేశ ప్రవాహ దిశకు వ్యతిరేక దిశలో ఉంటుంది.
- ధనావేశాలకు q విలువ ధనాత్మకం, Vd విలువ ధనాత్మకం ఐతే q.Vd ల లబ్దం ధనాత్మకం. అనగా విద్యుత్ ప్రవాహ దిశ ధనావేశ ప్రవాహదిశలోనే ఉంటుంది.
ప్రశ్న 14.
కొంతదూరంలో వేరుచేయబడిన రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ భేదాన్ని కనుగొనడానికి సూత్రాన్ని ఉత్పాదించండి.
జవాబు:
1) వాహక తీగ రెండు చివరలను బ్యాటరీకి కలిపితే వాహక విద్యుత్ క్షేత్ర దిశ మంతటా విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. ఈ విద్యుత్ క్షేత్రం ఎలక్ట్రాన్ (ఆవేశం)పై F అనే బలాన్ని కలుగజేస్తుంది.
2) ఈ బలం, స్వేచ్ఛ, ఆవేశాలను కొంతదూరం కదిలించ డానికి కొంత ‘పని’ చేస్తుంది.
ప్రశ్న 15.
ఒక బ్యాటరీ యొక్క విద్యుచ్ఛాలక బలాన్ని కనుగొనుటకు ఒక సూత్రాన్ని ఉత్పాదించుము.
జవాబు:
ఏకాంక ధనావేశాన్ని ఋణ ధృవం నుండి ధనధృవానికి కదిలించడానికి రసాయన బలం చేసిన పనినే “విద్యుచ్ఛాలక బలం” అంటారు.
1) రసాయన బలం Fc అనుకుందాం.
2) ఈ రసాయన బలం, ‘q’ పరిమాణం గల ఋణావేశాన్ని విద్యుత్ బలానికి వ్యతిరేకంగా ధనధృవం నుండి ఋణదృవానికి కదిలించడానికి చేసిన పని ‘W’ అనుకుందాం.
ప్రశ్న 16.
మల్టీమీటర్‌ను గురించి వివరించుము.
జవాబు:
మల్టీమీటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. ఇది నిరోధం, ఓల్ట్జ్, కరెంట్ వంటి వివిధ విలువలను కొలవగలుగుతుంది. దీనితో కొలిచిన విలువలను ఇది సంఖ్యాత్మకంగా చూపిస్తుంది. మల్టీమీటర్ లో ప్రధానంగా 3 విభాగాలుంటాయి.
డిస్సే (Display) :
మల్టీమీటరు 4 ‘డిజిట్స్’ (Digits) చూపగలిగే డిస్పే ఉంటుంది. ఇది ఋణగుర్తు (nega tive symbol) ను కూడా చూపగలుగుతుంది.
సెలక్షన్ నాబ్ (Selection knob) :
ఓల్టేజ్ (V), నిరోధం (R) మొదలగు అంశాలలో దేనిని కొలవాలో, దానికి అనుగుణంగా మల్టీమీటరును అమర్చుకోడానికి సెలక్షన్ నాబ్ ఉపయోగపడుతుంది.
పోర్ట్ (Ports) :
మల్టీమీటరుకు సాధారణంగా రెండు పోర్టులుంటాయి. ఒకదానివద్ద COM (common or ground port) అని రాసి ఉంటుంది. దీనిలో నలుపురంగు తీగను (test lead) ను అమర్చాలి. రెండవ దానివద్ద mAVI2 అని రాసి ఉంటుంది. ఇందులో ఎరుపు తీగను అమర్చాలి.
హెచ్చరిక :
సాధారణంగా మల్టీమీటర్లు ‘AC’ వ్యవస్థల విలువలను కూడా కొలవగలవు. కానీ AC’ వలయాలు ప్రమాదకరమైనవి. కావున మల్టీమీటరును DC విలువలను కొలవడానికి మాత్రమే వినియోగించండి.
ప్రశ్న 17.
విద్యుత్ సామర్థ్యం కనుగొనడానికి ఒక సూత్రాన్ని ఉత్పాదించండి.
జవాబు:
1) పటంలో చూపినట్లు A బిందువు నుండి B బిందువును t పొటెన్షియల్ భేదం (V) సెకన్ల కాలంలో Q కులూంటే ఆవేశం ప్రవహించింది. అనుకొనుము.
2) A, B ల మధ్య పొటెన్షియల్ భేదం V అనుకుంటే, t కాలంలో
విద్యుత్ క్షేత్రం చేసిన పని W = QV – (1)
3) ఈ ‘పని’ వాహకంలో ప్రవహిస్తున్న Q ఆవేశం కోల్పోయిన శక్తికి సమానం.
ప్రశ్న 18.
ఒక వలయాన్ని పటంలో చూపటం జరిగింది.
A వద్ద వలయంలోనికి ప్రవేశించే విద్యుత్ I.
a) C, D బిందువుల మధ్య పొటెన్షియల్ భేదం ఎంత?
b) A, B బిందువుల మధ్య వలయఫలిత నిరోధం ఎంత?
c) C, D ల గుండా ప్రవహించే విద్యుత్ ఎంత?
జవాబు:
a) కిర్కాఫ్ లూప్ నియమం ప్రకారం ఒక మూసిన వలయంలోని వివిధ పరికరాల రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదాలలో పెరుగుదల, తగ్గుదల బీజీయ మొత్తం శూన్యం.
కావున C, Dల మధ్య పొటెన్షియల్ భేదం శూన్యం కారణం ఇది ఒక మూసిన లూప్.
b) ఇక్కడ 20 Ω, 5 Ω లు ఒకదానికొకటి సమాంతరంగా కలవు. వాటి ఫలితాలు ఒకదానికొకటి శ్రేణిలో ఉండును.
20 Ω మరియు 5 Ω ల ఫలిత నిరోధం విలువ
ప్రశ్న 19.
పటాన్ని గమనించండి. A, B, C వద్ద పొటెన్షియల్ విలువలు 70 V, 0 V, 10V
a) D వద్ద పొటెన్షియల్ ఎంత?
b) AD, DB, DC లలో ప్రవహించే విద్యుత్ ప్రవాహాలు నిష్పత్తిని కనుగొనండి.
జవాబు:
a) ఓమ్ నియమం ప్రకారం పొటెన్షియల్ భేదం (V) = IR
ఇవ్వబడిన వలయంలో జంక్షన్ నియమాలను పాటించగా
‘D’ జంక్షన్ వలె ప్రవర్తించుచున్నది. కావున, I = I1 + I2
‘D’ వద్ద పొటెన్షియల్ భేదం V0 అనుకొనుము.
ప్రశ్న 20.
వలయాన్ని పటంలో గమనించండి. R1 = R2 = R3 = 200 Ω.
వోల్టుమీటరు రీడింగు = 100 V,
వోల్టుమీటరు నిరోధం = 1000 Ω అయితే
బ్యాటరీ విద్యుచ్ఛాలక బలం ‘E’ ను కనుగొనండి.
జవాబు:
ఇవ్వబడిన విలువలు R1 = R2 = R3 = 200 Ω
వోల్ట్ మీటరు రీడింగు = 100 V.
వోల్ట్ మీటరు నిరోధపు విలువ = 1000 Ω
ఇవ్వబడిన వలయంలో R2 మరియు R3 లు శ్రేణిలో కలవు. కనుక ఫలిత నిరోధం విలువ
R= R2 + R3 = 200 + 200 = 400 Ω.
ఫలిత నిరోధం (400 2) మరియు వోల్ట్ మీటరు నిరోధం (1000 Ω) లు సమాంతరంగా కలవు. కావున
ప్రశ్న 21.
ఒక రాగి తీగతో ప్రక్కపటంలో చూపిన విధంగా వలయాన్ని ఏర్పరిచారు. వాహక నిరోధం దాని పొడవుకు అనులోమానుపాతంలో వుందని మనకు తెలుసు. దీని ఆధారంగా 1, 2 బిందువుల మధ్య వలయ ఫలిత నిరోధాన్ని లెక్కించండి.
జవాబు:
తీగ యొక్క వాహక నిరోధము విలువ ‘R’ మరియు తీగ పొడవు ‘l’ అనుకొనుము.
వలయము చతురస్ర ఆకారములో కలదు. భుజము పొడవు (l) = R
చతురస్రము కర్ణము, భుజముకు √2 రెట్లు ఉండును = √2l
కర్ణం పరముగా నిరోధము విలువ √2R అగును.
ఇవ్వబడిన తీగ యొక్క ఆకారమును వలయ రూపములో వ్రాయగా PTR మరియు QTS
పరంగా ఫలిత విద్యుత్ ఉండదు కనుక విద్యుత్ ప్రవాహం ఉండదు.
PQ మరియు PS లు శ్రేణిలో కలవు. కనుక ఫలిత నిరోధము విలువ R1 + R2 = R + R = 2R.
QR మరియు SR లు శ్రేణిలో కలవు. కనుక ఫలిత నిరోధము విలువ R1 + R2 = R + R = 2R.
ఈ వలయమును తిరిగి నిర్మించగా క్రింది రూపంలో ఉండును.
(1), (2) బిందువుల మధ్య వలయపు ఫలిత నిరోధము విలువ
ప్రశ్న 22.
సుధాకర్ వివిధ వోల్టేజిలు, ఒక పదార్థం (తీగరూపంలో ఉన్నది), వోల్టు మీటరు, అమ్మీటర్లు వాడి సేకరించిన విద్యుత్ ప్రవాహాలను పట్టికలో పొందుపరిచారు.
ఆ పట్టిక ఆధారంగా వచ్చిన గ్రాఫ్ ఈ క్రింది విధంగా ఉంది.
గ్రాఫ్ లో వోల్టేజి (V) ని వోల్టులలోనూ; విద్యుత్ (I) ని ఆంపియర్ లలోనూ కొలిచాడు. గ్రాఫ్ ఆధారంగా ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఎ) సుధాకర్ తీసుకున్న పదార్థం ఏరకమైనదిగా చెప్పవచ్చు?
బి) తీసుకున్న పదార్థం నిరోధం ఎంత?
సి) తీగ కొనలమధ్య 20 V ల పొటెన్షియల్ భేదాన్ని అనువర్తించినప్పుడు ఆ తీగ ఎంత విద్యుత్ సామర్థ్యాన్ని వినియోగించుకుంటుంది?
డి) పై శ్లో ఇమిడియున్న నియమాన్ని తెల్పండి.
జవాబు:
ఎ) పటంలో ఇచ్చిన గ్రాఫు మూలబిందువు గుండా పోవు సరళరేఖను సూచిస్తున్నది. కావున తీసుకున్న పదార్థం ఓమీయ వాహకం అగును.
బి) ఓమ్ నియమం ప్రకారం V = IR = R = – = R = 0 = 502 .
డి) ఓమీయ వాహకాలు ఓమ్ నియమమును పాటించును.
ఓమ్ నియమం :
పొటెన్షియల్ భేదం (V) విద్యుత్ ప్రవాహం, (I) కు అనులోమానుపాతంలో కలదు.
ప్రశ్న 23.
మీ ఇంటిలోని వివిధ విద్యుత్ పరికరాలు వలయంలో ఏ విధంగా కలుపబడ్డాయో తెలియజేసే చిత్రాన్ని గీయండి. వలయంలో వాడిన సంకేతాలకు పేర్లు రాయండి.
జవాబు:
ప్రశ్న 24.
ఒకే పొడవు, ఒకే మధ్యచ్ఛేద వైశాల్యం కలిగియున్న వివిధ పదార్థాల నిరోధాలు పోల్చేందుకు వలయాన్ని ఎలా ఏర్పాటు చేయాలో పటంతో చూపండి.
జవాబు:
ప్రశ్న 25.
పైపటాన్ని గమనించి సమాధానములు వ్రాయండి.
(ఎ) పై నిరోధాలన్నీ సమాంతర సంధానంలో ఉన్నాయా లేక శ్రేణిలో ఉన్నాయా?
(బి) ఇచ్చిన మూడు నిరోధాల ఫలిత తుల్య నిరోధం ఎంత?
(సి) ఈ వ్యవస్థలో ఏ భౌతిక రాశి స్థిరం?
(డి) R1 = 2Ω, R2 = 3Ω, R3 = 4Ω అయితే ఫలిత తుల్య నిరోధం ఎంతో కనుగొనండి.
జవాబు:
(ఎ) శ్రేణి సంధానంలో ఉన్నాయి.
(బి) R = R1 + R2 + R3
(సి) కరెంట్ (i)
(డి) R = R1 + R2 + R3 = 2 + 3 + 4 = 9Ω
ప్రశ్న 26.
ఇచ్చిన వలయాన్ని పరిశీలించండి. R1, R2 లు రెండు నిరోధాలు మరియు R1 = R2 = 4Ω బ్యాటరీ విద్యుత్ చాలక బ్యాటరీ E విలువ 10V. క్రింది ప్రశ్నలకు సమాధానములను రాయండి.
a) R1, R2 నిరోధాలను ఏ సంధానంలో కలిపారు?
b) R1 నిరోధంపై ఉండే పొటెన్షియల్ భేదం ఎంత?
c) వలయ ఫలిత నిరోధం ఎంత?
d) బ్యాటరీ నుండి వెలువడు మొత్తం విద్యుత్ ప్రవాహం ఎంత?
జవాబు:
a) R1 మరియు R2 నిరోధాలు వలయంలో సమాంతరంగా కలుపబడ్డాయి.
ప్రశ్న 27.
i) వలయంలో ఫలిత నిరోధం ఎంత?
ii) వలయంలో ప్రవహించే విద్యుత్ ఎంత?
జవాబు:
పటం నుండి
ప్రశ్న 28.
క్రింది పటంలో ఏ రెండు చివరల మధ్యనైనా ఫలిత నిరోధాన్ని కనుగొనండి. వలయంలో ప్రవహించే మొత్తం విద్యుత్ ప్రవాహాన్ని లెక్కించండి.
జవాబు:
పటం నుండి BC, CA నిరోధాలు శ్రేణిలోను, ఇవి రెండు AB నిరోధానికి సమాంతరంగాను ఉన్నాయి.
BC, CA ఫలిత నిరోధం R1 = RBC + RAC = 30 + 30 = 60 Ω
R1, AB లు సమాంతరంగా ఉన్నాయి. వీటి ఫలిత నిరోధం
ప్రశ్న 29.
ఒక తీగ రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం V, ఆ తీగలో ప్రవహించే విద్యుత్ I లకు సంబంధించిన గ్రాఫ్ గీయండి. ఆ గ్రాఫ్ ఆకారం ఎలా ఉంది?
జవాబు:
- ఒక వాహక విద్యుత్ పొటెన్షియల్ (V) దాని గుండా ప్రవహించు విద్యుత్ (I) కు అనులోమానుపాతంలో ఉండునని ఓమ్ నియమము తెలుపును.
- ఓమ్ నియమం ప్రకారం \(\frac{V}{I}\) స్థిరము.
- ప్రవాహ విద్యుత్ (I) విలువలను Y – అక్షంపై, తీగ రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం (V) విలువలను X- అక్షంపై తీసుకొనుము.
- తగిన స్కేలును నిర్ణయించుకుని V, I మధ్య గ్రాఫ్ గీయగా అది మూలబిందువు గుండా పోవు సరళరేఖను ఏర్పరచినది.
10th Class Physics 9th Lesson విద్యుత్ ప్రవాహం Important Questions and Answers
ప్రశ్న 1.
ఓమ్ నియమం ప్రయోగంలో క్రింది ఇచ్చిన విలువల సహాయంతో I మరియు V మధ్య గ్రాఫ్ గీచి సరిచూడండి. మరియు వాహకం నిరోధం కనుగొనండి.
జవాబు:
V = IR ⇒ R = \(\frac{V}{I}\) ⇒ \(\frac{1.6}{0.5}\) = 3.2 ఓమ్ లు
∴ వాహకం యొక్క నిరోధము 3.2 Ω
ప్రశ్న 2.
ఒక వాహకపు నిరోధానికి 300 పొటెన్షియల్ భేదాన్ని ఏర్పరచనపుడు దానిలోని విద్యుత్ ప్రవాహం 3A పొటెన్షియల్ భేదాన్ని 200 తగ్గించినపుడు విద్యుత్ ప్రవాహం ఎంత?
జవాబు:
వాహకపు పొటెన్షియల్ భేదం = V = 30 V
వాహకంలో విద్యుత్ ప్రవాహం = 1 = 3A
వాహకంలో విద్యుత్ నిరోధము = R = ?
ప్రశ్న 3.
ఓల్ట్ మరియు ఆంపియర్ పరంగా ఓమ్ ను వివరించండి.
జవాబు:
స్థిర ఉష్ణోగ్రత వద్ద, వాహకం రెండు చివరల మధ్య 1 ఓల్ట్ పొటెన్షియల్ భేదం, వాహకం గుండా ప్రవహించే 14 విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో వుంటుంది.
ప్రశ్న 4.
వాహక మూలకాలన్నింటికి ఓమ్ నియమం సార్వత్రికమైనది. ‘అయితే ఓమ్ నియమాన్ని పాటించని మూలకాలకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ఓమ్ నియమాన్ని పాటించని మూలకాలు లేదా పదార్థాలను అఓమీయ పదార్థాలు అంటారు.
ఉదా : అర్ధ వాహకాలు, అలోహాలు.
ప్రశ్న 5.
నిత్యజీవితంలో ఓమ్ నియమం యొక్క అనువర్తనాలను తెల్పండి.
జవాబు:
- ఓమ్ నియమాలను DC వలయాలలో వాడతారు.
- వలయంలో ఓల్టేజ్ డ్రాప్ సమయంలో ఖచ్చిత నిరోధంను లెక్కించుటకు ఓమ్ నియమాలను వాడతారు.
- ఇంటిలో, వలయంలోని ఏ పరికరము యొక్క నిరోధము విలువలను కనుగొనుటకు అయినా ఓమ్ నియమం వాడతారు.
- మనము ఇళ్ళలో వాడు బల్బులలోని ఫిలమెంట్ నిరోధం విలువను లెక్కించుటకు ఓమ్ నియమమును వాడతారు.
- హీటర్ నిర్మాణంలో వాడతారు.
- ఎలక్ట్రిక్ స్ట్రీ నిర్మాణంలోనూ,
- సిగార్ వెలిగించే లైటర్ లో ఉష్ణం విడుదలవుటలోనూ,
- LED బల్బులు తయారీలోను ఓమ్ నియమమును వాడతారు.
ప్రశ్న 6.
ప్రక్క వలయంలో లోపాలను గుర్తించండి.
జవాబు:
- ఇవ్వబడిన వలయంలో అమ్మీటర్ (A) ను బ్యాటరీకి సమాంతరంగా అనుసంధానం చేశారు. ఇది లోపము.
- అమ్మీటరు (A)ను బ్యాటరీకి ఎల్లప్పుడు శ్రేణిలో కలపాలి.
10th Class Physics 9th Lesson విద్యుత్ ప్రవాహం ½ Mark Important Questions and Answers
1. స్వేచ్ఛా ఎలక్ట్రానులు దేనిలో ఉంటాయి?
A) వాహకం
B) బంధకం
C) A మరియు B
D) రెండూ కావు
జవాబు:
A) వాహకం
2. మేఘాల నుండి భూమికి గాలి ద్వారా జరిగే విద్యుత్ ఉత్సర్గం ఏ రూపంలో కనిపిస్తుంది?
జవాబు:
మెరుపులు
3. వాతావరణంలో ఆవేశాల చలనానికి ఉదాహరణ ఇమ్ము.
జవాబు:
మెరుపులు
4. నైలాన్ తీగల గుండా విద్యుత్ ప్రవాహం జరగదు. కారణం ఊహించండి.
జవాబు:
నైలాన్లో స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ఉండవు.
5. క్రింది వానిలో అవాహకం
A) రాగి తీగ
B) అల్యూమినియం తీగ
C) నైలాన్ తీగ
D) ఇనుప తీగ
జవాబు:
C) నైలాన్ తీగ
6. లోహాల వంటి వాహకాలలో అధిక సంఖ్యలో స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ధనాత్మక అయాన్లు నిర్దిష్ట స్థానాలలో ఉంటాయని చెప్పిన శాస్త్రవేత్తలు ఎవరు?
జవాబు:
డ్రూడ్ మరియు లోరెంజ్
7. వాహకాలలో ధనాత్మక అయాన్ల అమరికను ఏమంటారు?
జవాబు:
లాటిస్
8. తెరిచియున్న వలయం వంటి వాహకంలో ఏదేని మధ్యచ్చేదం వెంబడి కదిలే ఫలిత ఆవేశం
A) గరిష్ఠం
B) శూన్యం
C) ఋణావేశం
D) ధనావేశం
జవాబు:
B) శూన్యం
9. A : తెరచి ఉన్న వలయంలో ఏదేని వాహకంలో మధ్యచ్ఛేదం వెంబడి కదిలే ఆవేశాల మొత్తం శూన్యం.
R : వలయంలో బ్యాటరీ లేనప్పుడు వాహకంలో ఎలక్ట్రానులు చలనంలో ఉండవు.
A) A, R లు సరియైనవి
B) A మాత్రమే సరియైనది
C) R మాత్రమే సరియైనది
D) A, R లు సరియైనవి కావు
జవాబు:
B) A మాత్రమే సరియైనది
10. విద్యుత్ ప్రవాహం అనగా ఏమిటి?
జవాబు:
ఆవేశాల క్రమచలనం
11. ఒక సెకను కాలంలో వాహకంలోని ఏదేని మధ్యచ్ఛేదాన్ని దాటి వెళ్ళే ఆవేశ పరిమాణాన్ని ఏమంటారు?
జవాబు:
విద్యుత్ ప్రవాహం
12. క్రింది వానిలో సరియైనది ఏది?
జవాబు:
D
13. విద్యుత్ ప్రవాహానికి SI ప్రమాణం ఏమిటి?
జవాబు:
ఆంపియర్
14. 1 ఆంపియర్ అనగా ఏమిటి ?
జవాబు:
15. వాహకం రెండు చివరలను బ్యాటరీ టెర్మినల్స్ కి కలిపినపుడు వాహకంలో ఎలక్ట్రానులు నిర్దిష్ట దిశలో కదులుతాయి. ఈ కదలికకు కారణం ఏమిటో ఊహించండి.
జవాబు:
వాహకమంతా ఏర్పడే సమ విద్యుత్ క్షేత్రం.
16. వాహకంలోని స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల దృష్ట్యా సరికాని వాక్యం
a) విద్యుత్ క్షేత్రం వలన త్వరణాన్ని పొందుతాయి.
b) విద్యుత్ క్షేత్ర దిశలో చలిస్తాయి.
c) విద్యుత్ క్షేత్రం వలన ఎలక్ట్రానులు లాటిన్ అయాన్లతో అభిఘాతం చెందుతాయి.
d) పైవేవీ కావు
జవాబు:
b) విద్యుత్ క్షేత్ర దిశలో చలిస్తాయి.
17. వాహకంలో విద్యుత్ క్షేత్ర దిశకు ఎలక్ట్రాన్ల చలన దిశ ఇలా ఉంటుంది.
A) ఒకే దిశలో
B) వ్యతిరేక దిశలో
C) పై రెండింటిలో ఏదైనా
జవాబు:
B) వ్యతిరేక దిశలో
18. వాహకంలో ఎలక్ట్రానులు చలించే మార్గం ఇలా వుంటుంది.
A) సరళరేఖా మార్గంలో
B) వృత్తాకారంగా
C) క్రమరహితంగా
జవాబు:
C) క్రమరహితంగా
19. వాహకంలో ఎలక్ట్రానులు ఇలా చలిస్తాయి.
A) స్థిర వేగంతో
B) స్థిర సరాసరి వడితో
జవాబు:
B) స్థిర సరాసరి వడితో
20. వాహకంలో ఎలక్ట్రాలు స్థిర సరాసరి వడితో చలిస్తాయి. ఈ వడిని ఏమంటారు?
జవాబు:
అపసర వడి (లేదా) డ్రిఫ్ట్ వడి
21. ఎలక్ట్రాన్ విద్యుదావేశ పరిమాణం ఎంత?
జవాబు:
1.602 × 10-19 C
22. మధ్యచ్ఛేద వైశాల్యం 10-6m² గల రాగి తీగలో ఎలక్ట్రాన్ల సాంద్రత ఎంత?
జవాబు:
n = 8.5 × 1028 m-3
23. వాహకంలో ఎలక్ట్రాన్ల అపసర వడి లేదా డ్రిప్ట్ వడి ఎంత?
జవాబు:
Vd = 7 × 10-5m/s (లేదా) 0.07 mm/s.
24. 10-6m² మధ్యచ్చేద వైశాల్యం గుండా 14 కరెంట్ ప్రవహించినపుడు ఒక ఎలక్ట్రాన్ ఎంత సరాసరి వడితో కదులుతుంది?
జవాబు:
సెకనుకి 0.07 మి.మీ.
25. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని దేనితో కొలుస్తారు?
జవాబు:
అమ్మీటర్
26. వలయంలో అమ్మీటర్‌ను ఎలా కలుపుతారు?
జవాబు:
శ్రేణిలో
27. స్వేచ్చావేశాలను నిర్దిష్ట దిశలో కదిలించడానికి విద్యుత్ క్షేత్రం చేసే పనికి సూత్రం రాయండి.
జవాబు:
W = Fe l
ఇక్కడ Fe = విద్యుత్ బలం,
l= ఆవేశం కదిలిన దూరం
28. ఏకాంక ఆవేశంపై విద్యుత్ బలం చేసే పనిని ఏమంటారు?
జవాబు:
పొటెన్షియల్ భేదం
29. పొటెన్షియల్ భేదానికి SI ప్రమాణం రాయుము.
జవాబు:
ఓల్ట్ (V)
30. 1 ఔల్ /1 కూలూంబ్ =?
జవాబు:
1 వోల్ట్
31. సరికాని సూత్రం ఏది?
జవాబు:
C
32. ధనావేశాల చలనాన్ని మనం ఎక్కడ గమనించవచ్చును?
జవాబు:
ద్రవాల గుండా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు (లేదా) ఎలక్ట్రో ప్లేటింగ్ లో.
33. i) ద్రవాలలో విద్యుత్ ప్రవాహం జరగడానికి ధన, ఋణ ఆవేశాలు రెండూ చలిస్తాయి.
ii) లోహ ఘనరూప వాహకంలో ఎలక్ట్రాన్లు మాత్రమే చలిస్తాయి.
పై వాక్యా లలో ఏది సరికాదు?
జవాబు:
రెండూ సరియైనవే.
34. i) ఎలక్ట్రాన్లు అల్ప పొటెన్షియల్ నుండి అధిక పొటెన్షియల్ కి కదులుతాయి.
ii) ఋణావేశాలు ఎప్పుడూ విద్యుత్ క్షేత్ర దిశలో చలిస్తాయి.
పై వాక్యాలలో తప్పుగా గల వాక్యం ఏది?
జవాబు:
(ii)
35. “బ్యాటరీలలో ఎల్లప్పుడూ వాటి పొటెన్షియల్ భేదం సిరంగా ఉంటుంది.” ఈ వాక్యం సరియైనదేనా?
జవాబు:
సరియైనదే.
36. బ్యాటరీలలో విద్యుద్విశ్లేష్యంలో గల ధన అయాన్లను ఆనోడ్ వైపు కదిలించే బలం
A) రసాయన బలం
B) విద్యుత్ క్షేత్ర బలం
C) A మరియు B
జవాబు:
A) రసాయన బలం
37. బ్యాటరీలలో ధన అయాన్లు గల పలకను ఏమంటారు?
జవాబు:
ఆనోడ్
38. కేథోడ్ పై ఆవేశం
A) ధన
B) ఋణ
C) శూన్య
D) A లేదా B
జవాబు:
B) ఋణ
39. బ్యాటరీలో విద్యుత్ బల దిశ
i) రసాయన బల దిశకు వ్యతిరేక దిశలో ఉంటుంది.
ii) పరిమాణం ఎలక్ట్రోడ్లపై పోగయిన ఆవేశంపై ఆధారపడి ఉంటుంది.
జవాబు:
(i) మరియు (ii)
40. బ్యాటరీలోని పలకలపై పోగయ్యే ఆవేశ పరిమాణం దేనిపై ఆధారపడి ఉంటుంది?
జవాబు:
బ్యాటరీలోని రసాయన స్వభావంపై
41. విద్యుచ్ఛాలక బలం సూత్రం రాయుము.
జవాబు:
42. ఏకాంక ఋణావేశాన్ని ధన ధృవం నుండి ఋణ ధృవానికి కదిలించడానికి రసాయన బలం చేసిన పనిని ఏమందురు?
జవాబు:
విద్యుచ్ఛాలక బలం (emf)
43. పొటెన్సియల్ భేదంను కొలుచుటకు ఉపయోగించు పరికరం ఏమిటి?
జవాబు:
వోల్ట్ మీటర్
44. వోల్ట్ మీటరు వలయంలో ఎలా కలుపుతారు?
జవాబు:
సమాంతరంగా
45. ఓమ్ నియమాన్ని చెప్పినవారు ఎవరు?
జవాబు:
జార్జ్ సైమన్ ఓమ్
46. ఓమ్ నియమంను రాయండి.
జవాబు:
స్థిర ఉష్ణోగ్రత వద్ద వాహకం రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. (లేదా)
\(\frac{V}{I}\) స్థిరం.
47. i) అర్ధవాహక \(\frac{V}{I}\) స్థిరం.
ii) వాహకాలకి \(\frac{V}{I}\) స్థిరం. కాదు.
పై వాక్యాలలో సరికానిది ఏది?
జవాబు:
రెండూ సరియైనవి కావు.
48. V/I = స్థిరం అని చూపు ప్రయోగానికి తీసుకోవలసిన పరికరాలేవి ?
జవాబు:
6V బ్యాటరీ ఎలిమినేటర్, అమ్మీటర్, ఓల్ట్ మీటర్, లోహపు తీగ (మాంగనిన్), రియోస్టాట్.
49. ఓమ్ నియమం నిరూపించు ప్రయోగంలో కొలవవలసిన అంశాలు ఏవి?
జవాబు:
వోల్టేజి (V) మరియు విద్యుత్ ప్రవాహం (I)
50. లోహాలతో ఓమ్ నియమం ప్రయోగం చేసినప్పుడు V, I గ్రాఫ్ ఎలా ఉంటుంది?
జవాబు:
మూల బిందువు గుండా పోయే సరళరేఖ
51. LED కి సంబంధించి V, I గ్రాఫు ఎలా వుంటుంది? పై వాక్యా లలో ఏది సరియైనది?
జవాబు:
వక్రరేఖ
52. V/I = స్థిరాంకం. ఈ స్థిరాంకాన్ని ఏమంటారు?
జవాబు:
వాహక నిరోధం
53. V = ?
జవాబు:
D
54. 1 వోల్ట్ /1 ఆంపియర్ అనగా ఏమిటి?
జవాబు:
1 ఓమ్
55. నిరోధాన్ని సూచించు గుర్తును రాయుము.
జవాబు:
56. నిరోధం యొక్క ప్రమాణాన్ని సూచించు గుర్తు రాయుము.
జవాబు:
57. ఓమ్ నియమం ఆధారంగా పదార్థాలు ఎన్ని రకాలు?
జవాబు:
2
58. ఓమీయ పదార్థాలు అనగానేమి?
జవాబు:
ఓమ్ నియమాన్ని పాటించే పదార్థాలు
59. ఓమ్ నియమాన్ని పాటించని పదార్థాలను ఏమందురు?
జవాబు:
అఓమీయ పదార్థాలు
60. క్రింది వానిలో అఓమీయ వాహకం
A) రాగి తీగ
B) మాంగనిన్ తీగ
C) నికెల్ తీగ
D) LED
జవాబు:
D) LED
61. a) లోహ వాహకాలు ఓమ్ నియమాన్ని పాటిస్తాయి.
b) ఉష్ణోగ్రతను బట్టి పదార్థ నిరోధం మారుతుంది.
c) వాహకానికి చెందిన V, I గ్రాఫు ఎల్లప్పుడూ సరళరేఖయే.
d) వాయు వాహకాలకు ఓమ్ నియమం వర్తించదు.
పై వాక్యాలలో సరికాని వాక్యం ఏది?
జవాబు:
c) వాహకానికి చెందిన V, I గ్రాఫు ఎల్లప్పుడూ సరళరేఖయే.
62. నిరోధం అనగానేమి?
జవాబు:
వాహకంలో ఎలక్ట్రాన్ చలనానికి కలిగే ఆటంకం.
63. నిరోధకం అనగానేమి?
జవాబు:
ఎలక్ట్రాన్ చలనాన్ని నిరోధించే పదార్థాన్ని ‘నిరోధకం’ అంటారు.
64. మన నిత్య జీవితంలో ఓమ్ నియమం యొక్క ఉపయోగం రాయండి.
జవాబు:
విద్యుత్ బల్బ్ లు ఓమ్ నియమం ప్రకారం పనిచేయుట.
65. మానవ శరీరం యొక్క నిరోధం ఎంత వుంటుంది?
జవాబు:
100Ω – 5,00,000Ω
66. మానవ శరీరం గుండా విద్యుత్ ప్రవహించే కాలం పెరుగుతున్న కొలదీ శరీర నిరోధం ఎలా మారుతుంది?
జవాబు:
తగ్గుతుంది.
67. విద్యుత్ షాక్ ప్రభావాన్ని గుర్తించగలగాలంటే మన శరీరం గుండా ప్రవహించే కనీస విద్యుత్ ప్రవాహ విలువ ఎంత ఉండాలి?
జవాబు:
0.001 ఆంపియర్లు
68. శరీరం గుండా 0.01 ఆంపియర్ల విద్యుత్ ప్రవహిస్తే శరీరంపై ప్రభావం ఏమిటి?
జవాబు:
కండరాలు సంకోచిస్తాయి
69. విద్యుత్ ఘాతం క్రింది వాని వలన జరుగును.
A) విద్యుత్ ప్రవాహం
B) పొటెన్సియల్ భేదం
C) శరీర నిరోధం
D) పైవన్నియు
జవాబు:
D) పైవన్నియు
70. అధిక ఓల్టేజి తీగపై నిలుచున్న పక్షికి విద్యుత్ ఘాతం కలగదు. కారణం ఏమిటి?
జవాబు:
దాని కాళ్ళ మధ్య పొటెన్షియల్ భేదం ఉండదు.
71. పదార్థ నిరోధాన్ని ప్రభావితం చేసే అంశాలలో ఒకటి కానిది.
A) ఉష్ణోగ్రత
B) పదార్థ స్వభావం
C) వాహకం పొడవు
D) వాహక ద్రవ్యరాశి
జవాబు:
D) వాహక ద్రవ్యరాశి
72. క్రింది వానిలో ఏది పెరిగితే వాహక నిరోధం పెరుగుతుంది?
i) ఉష్ణోగ్రత
ii) వాహక పొడవు
iii) మధ్యచ్ఛేద వైశాల్యం
జవాబు:
(i), (ii)
73. వాహక పొడవును పెంచితే నిరోధం ఏమవుతుంది?
జవాబు:
పెరుగును.
74. వాహకం యొక్క మధ్యచ్ఛేద వైశాల్యం పెంచితే దాని నిరోధం ఏమవుతుంది?
జవాబు:
తగ్గుతుంది.
75. R = ρ\(\frac{l}{A}\) లో ρ దేనిని సూచించును?
జవాబు:
విశిష్ట నిరోధం (లేదా) నిరోధకత
76. ‘విశిష్ట నిరోధం’ ఆధారపడే అంశాలు ఏమిటి?
జవాబు:
ఉష్ణోగ్రత, పదార్థ స్వభావం
77. ‘నిరోధం ‘ ఆధారపడే అంశాలు ఏమిటి?
జవాబు:
ఉష్ణోగ్రత, పదార్థ స్వభావం, పొడవు, మధ్యచ్ఛేద వైశాల్యం
78. విశిష్ట నిరోధానికి (S.I.) ప్రమాణం ఏమిటి?
జవాబు:
12 – m (ఓమ్ – మీటర్)
79. వాహకత్వం అనగానేమి?
జవాబు:
విశిష్ట నిరోధ విలోమం
80. వాహకత్వాన్ని ఏ గుర్తుతో సూచిస్తారు?
జవాబు:
σ
81. విశిష్ట నిరోధం తక్కువ వుంటే ఆ పదార్థాలు
A) మంచి వాహకాలు
B) నిరోధాలు
C) అర్ధవాహకాలు
D) చెప్పలేం
జవాబు:
A) మంచి వాహకాలు
82. (A) : రాగిని విద్యుత్ తీగల తయారీలో ఉపయోగిస్తారు.
(R) : రాగికి విశిష్ట నిరోధం తక్కువ.
A) A, Rలు సరియైనవి. A కి R సరియైన కారణం.
B) A, Rలు సరియైనవి. A కి R సరియైన కారణం కాదు.
C) A సరియైనది, R సరియైనది కాదు.
D) R సరియైనది, A సరియైనది కాదు.
జవాబు:
A) A, Rలు సరియైనవి. A కి R సరియైన కారణం.
83. విద్యుత్ బల్బ్ లలో వినియోగించే లోహం ఏమిటి?
జవాబు:
టంగ్ స్టన్
84. విద్యుత్ బల్బ్ లలో ఫిలమెంట్ గా టంగ్ స్టనన్ను వినియోగించడానికి కారణం ఏమిటి?
జవాబు:
దాని విశిష్ట నిరోధం, ద్రవీభవన స్థానం విలువలు చాలా ఎక్కువ.
85. టంగ్ స్టన్ యొక్క ద్రవీభవన స్థానం, విశిష్ట నిరోధం విలువలు రాయండి.
జవాబు:
ద్రవీభవన స్థానం – 3422°C.
విశిష్ట నిరోధం 5.6 × 10-8 Ω-m
86. జతపరుచుము :
విశిష్ట నిరోధాలు పదార్థం
i) 1014 – 1016Ω – m a) వాహకాలు
ii) 10-1 – 101Ω – m b) అర్ధవాహకాలు
iii) 10-6 – 10-8Ω – m c) విద్యుత్ బంధకాలు
జవాబు:
i – c, ii – b, iii – a
87. నిక్రోమ్ లో ఉండే లోహాలు ఏమిటి?
జవాబు:
నికెల్, క్రోమియం, ఇనుము
88. మాంగనిలో ఉండే లోహాలు ఏమిటి?
జవాబు:
86% రాగి, 12% మాంగనీస్, 2% నికెల్
89. మిశ్రమ లోహాలయిన నిక్రోమ్, మాంగనిన్ నిరోధాలు లోహాల నిరోధాల కన్నా
A) 30 – 100 రెట్లు తక్కువ ఉంటాయి.
B) 30 – 100 రెట్లు ఎక్కువ ఉంటాయి.
జవాబు:
B) 30 – 100 రెట్లు ఎక్కువ ఉంటాయి.
90. మిశ్రమ లోహాల
i) విశిష్ట నిరోధం విలువ ఎక్కువ.
ii) నిరోధం ఉష్ణోగ్రతలతో పాటు స్వల్పంగా మారుతుంది.
iii) సులభంగా తుప్పు పట్టవు.
iv) తాపన పరికరాలుగా వినియోగిస్తారు.
పై వానిలో సరికాని వాక్యం ఏది?
జవాబు:
ఏదీ లేదు
91. మిశ్రమ లోహాలైన మాంగనీస్, నిక్రోమ్ ఒక ఉపయోగాన్ని రాయండి.
జవాబు:
ఇస్త్రీ పెట్టె, టోస్టర్ (toaster) లలో తాపన పరికరాలుగా వినియోగిస్తారు.
92. అర్ధవాహకాలకి ఉదాహరణనిమ్ము.
జవాబు:
సిలికాన్, జెర్మేనియం
93. అర్ధవాహకాలను ఎక్కడ వినియోగిస్తారు?
జవాబు:
డయోడ్, ట్రాన్సిస్టర్, ఇంటిగ్రేటెడ్ (IC) చిట్లలో వినియోగిస్తారు.
94. జతపర్చుము :
a) వెండి ( ) i) 1.00 × 1013 Ω-m
b) జెర్మేనియం ( ) ii) 4.60 × 10-1Ω-m
c) రబ్బరు ( ) iii) 1.59 × 10-8Ω-m
జవాబు:
a – iii, b – ii, c – i
95. బ్యాటరీ, వాహక తీగలతో ఎలక్ట్రాన్లు ప్రవహించడానికి అనుకూలంగా ఏర్పరిచిన సంవృత మార్గాన్ని ఏమంటారు?
జవాబు:
విద్యుత్ వలయం (సర్క్యూట్)
96. విద్యుత్ వలయంలో వలయాన్ని తెరవడానికి, మూయడానికి వినియోగించే పరికరం ఏమిటి?
జవాబు:
స్విచ్
97. నిరోధాలను శ్రేణి సంధానంలో కలిపినపుడు దాని యొక్క ……… స్థిరం.
A) నిరోధం
B) విద్యుత్ ప్రవాహం
C) పొటెన్షియల్ భేదం
D) పైవన్నీ
జవాబు:
B) విద్యుత్ ప్రవాహం
98.
పై పటంలో నిరోధాలు ఎలా కలిపారు?
జవాబు:
శ్రేణి సంధానంలో
99. ఏ సంధానంలో కలిపిన నిరోధాల వల్ల ఏర్పడే ఫలిత నిరోధం, ఆయా విడివిడి నిరోధాల మొత్తానికి సమానం?
జవాబు:
శ్రేణి సంధానంలో
100.
పై పటంలో,
i) నిరోధాలు ఎలా కలుపబడ్డాయి?
జవాబు:
సమాంతర సంధానంలో
ii) నిరోధాల ఫలిత నిరోధం ఎంత?
జవాబు:
iii) పై వలయంలో ఏది స్థిరంగా ఉంటుంది?
A) విద్యుత్ ప్రవాహం
B) పొటెన్షియల్ భేదం
C) రెండూ
జవాబు:
B) పొటెన్షియల్ భేదం
iv) R1 వద్ద విద్యుత్ ప్రవాహం ఎంత?
జవాబు:
\(\mathrm{I}_{1}=\frac{\mathrm{V}}{\mathrm{R}_{1}}\)
101. సమాంతర సంధానంలో ఉన్న నిరోధాల ఫలిత నిరోధం విలువ ఆ విడివిడి నిరోధాల విలువ కన్నా
A) తక్కువ
B) ఎక్కువ
C) సమానం
D) చెప్పలేం
జవాబు:
A) తక్కువ
102. మందపాటి తీగ నిరోధం , సన్నని తీగ నిరోధం కన్నా
A) ఎక్కువ
B) తక్కువ
C) సమానం
D) A లేదా C
జవాబు:
B) తక్కువ
103. జతపరుచుము.
a) శ్రేణి సంధానంలో నిరోధాలు ( ) i) I = I1 + I2 + I3
b) సమాంతర సంధానంలో నిరోధాలు ( ) ii) V = V1 +V2 + V3
జవాబు:
a – ii, b – i
104. కిర్ఛాఫ్ నియమాలు ఏమిటి?
జవాబు:
జంక్షన్ నియమం, లూప్ నియమం
105.
పై పటంలో దత్తాంశం ప్రకారం
i) I1 + I4 + I6 ఎంత?
జవాబు:
I2 + I3 + I5
ii) పై పటం ఏ నియమాన్ని తెలియజేస్తుంది?
జవాబు:
జంక్షన్ నియమం
iii) జంక్షన్ వైపు వచ్చే విద్యుత్ ప్రవాహాలు ఏవి?
జవాబు:
I1, I4, I6
iv) ఈ జంక్షన్ వద్ద పోగు అయ్యే ఆవేశం ఎంత?
జవాబు:
శూన్యం
106. జంక్షన్ నియమాన్ని రాయండి.
జవాబు:
జంక్షన్ ను చేరే విద్యుత్ ప్రవాహాల మొత్తం = జంక్షన్ ను వీడిపోయే విద్యుత్ ప్రవాహాల మొత్తం
107. లూప్ నియమాన్ని రాయండి.
జవాబు:
ఒక మూసిన వలయంలోని వివిధ పరికరాల రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదాలలో పెరుగుదల, తగ్గుదలల బీజీయ మొత్తం శూన్యం.
108.
పై పటంలో వలయంలో ఫలిత పొటెన్షియల్ భేదం ఎంత?
జవాబు:
-V1 + I1 R1 = 0
109.
పై పటంలో ఇచ్చిన వలయంలో
IR1 + IR2 + IR3 = ?
జవాబు:
V1 + V2
110. విద్యుత్ సామర్థ్యానికి సూత్రం రాయుము.
జవాబు:
P = VI (లేదా) P = I²R (లేదా) P = \(\frac{\mathrm{V}^{2}}{\mathrm{R}}\)
111. AC : P= VI :: DC : P = ?
జవాబు:
εI (ε = emf)
112. ఒక బల్బ్ పై 60W మరియు 120V అని రాసి వుంది. అది ఎంత నిరోధకత్వం కలిగియుండును?
జవాబు:
113. విద్యుత్ శక్తికి పెద్ద ప్రమాణం ఏమిటి?
జవాబు:
కిలో వాట్
114. మనం సాధారణంగా ఇండ్లలో వినియోగించే విద్యుచ్ఛక్తిని కొలవడానికి ‘యూనిట్లు’ అని అంటాం. ఒక యూనిట్ అనగా ఎంత ?
జవాబు:
యూనిట్ = 1 కిలో వాట్ అవర్(1 unit = 1 KWH)
115. IKWH కి ఎన్ని ఔళ్ళు?
జవాబు:
3.6 x 106J
116. సాధారణంగా మన ఇండ్లలో విద్యుత్ సప్లై ఎంత పొటెన్షియల్ భేదాన్ని కలిగియుండును?
జవాబు:
240V
117. ఓవర్ లోడింగ్ వలన గృహోపకరణాలను కాపాడే పరికరం ఏమిటి?
జవాబు:
ఫ్యూజ్
118. 100W -1 ఫ్యాన్ – 12 గంటలు; 9W-5LED బల్బులు – 10 గంటలు వినియోగించిన, విద్యుచ్ఛక్తి ఎంత ఖర్చు అగును?
జవాబు:
1.65 U (లేదా) 1.65 KWH
119. ఇండ్లలో వాడే విద్యుచ్ఛక్తిని దేనిలో కొలుస్తారు?
జవాబు:
కిలో వాట్ అవర్
120. క్రింది వానిలో దేనికి, వేటికి అధిక నిరోధం ఉండును?
i) మందపాటి తీగ
ii) సన్నని తీగ
iii) పొడవాటి తీగ
iv) పొట్టి తీగ
జవాబు:
(ii) మరియు (iii)
121. ఒక పరికరం 12V వద్ద 0.2A విద్యుత్ ను పొందుతుంది. అయిన దాని నిరోధం ఎంత?
జవాబు:
60 Ω
122. 2Ω, 4Ω మరియు 6Ω ల నిరోధాలు శ్రేణిలో వలయానికి అనుసంధానం చేయబడ్డాయి. వలయం ఫలిత నిరోధం ఎంత?
జవాబు:
12Ω [∵ R1 + R2 + R3]
123. 10V బ్యాటరీ 10W ల సామర్థ్యం కలిగియుంది. బ్యాటరీ ఎంత విద్యుత్ ఇవ్వగలదు?
జవాబు:
1 Amp
[∵ P = 10W, V = 10V ⇒ P= VI ⇒ I = \(\frac{P}{V}\)]
124. 500 నిరోధం గల ఒక తీగను అడ్డంగా, సమానంగా 5 భాగాలుగా, ముక్కలుగా కత్తిరించారు. ఈ ముక్కలను సమాంతరంగా ఒక వలయంలో ఉంచారు. దాని ఫలిత నిరోధం ఎంత?
జవాబు:
125. ఈ క్రింది పరికరాల గుర్తులను గీయండి.
i) నిరోధం
ii) బ్యాటరీ
iii) రియోస్టాట్
iv) అమ్మీటర్
v) వోల్ట్ మీటరు
జవాబు:
126. R1, R2 రెసిస్టర్లు సమాంతరంగా వలయంలో కలపబడ్డాయి. ఫలిత నిరోధం ఎంత?
జవాబు:
127. నిరోధకత్వం : ρ : : …?… : σ
జవాబు:
వాహకత్వం
128. ఓమ్ నియమాన్ని నిరూపించునప్పుడు ఏ రాశిని స్థిరంగా ఉంచాలి?
జవాబు:
ఉష్ణోగ్రతని
129. వలయంలో వోల్ట్ మీటరు, అమ్మీటర్, బ్యాటరీ నిరోధాలను ఎలా అనుసంధానిస్తారో పటం ద్వారా చూపుము.
జవాబు:
పట్టికలు
విద్యుత్ ప్రవాహం (ఆంపియర్లలో) | శరీరంపై ప్రభావం |
0.001 | ప్రభావాన్ని గుర్తించగలం |
0.005 | నొప్పిని కలుగజేస్తుంది |
0.010 | కండరాలు సంకోచిస్తాయి |
0.015 | కండరాల పటుత్వం దెబ్బ తింటుంది |
0.070 | 1 సెకను కంటే ఎక్కువ సమయం గుండె ద్వారా ప్రవహిస్తే స్పృహ కోల్పోతారు. |
→ వివిధ పదార్థాల నిరోధకతలు పదార్థం
ప్రమాణాలు మరియు వాటి సంకేతాలు
10th Class Physics 9th Lesson విద్యుత్ ప్రవాహం 1 Mark Bits Questions and Answers
సరియైన సమాధానమును గుర్తించండి.
1. ఇది దేనికి గుర్తు?
A) బ్యాటరీ
B) రియోస్టాట్
C) నిరోధము
D) అమ్మీటరు
జవాబు:
C) నిరోధము
2. మందంగా ఉన్న వాహకం నిరోధం ,సన్నని వాహకం నిరోధం కంటే ….
A) ఎక్కువ
B) తక్కువ
C) సమానం
D) A మరియు B
జవాబు:
B) తక్కువ
3. క్రింది వానిలో అసత్య వాక్యం / వాక్యాలను గుర్తించండి.
i) వాహక నిరోధం అపదార్థ స్వభావంపై ఆధారపడుతుంది.
ii) వాహక నిరోధం వాహకం మధ్యచ్ఛేద వైశాల్యంపై ఆధారపడదు
iii) వాహక నిరోధం వాహకం పొడవుపై ఆధార పడుతుంది.
iv) వాహక నిరోధం వాహకం ఉష్ణోగ్రతపై ఆధారపడదు.
A) (i) & (ii)
B) (ii) & (iii)
C) (ii) & (iv)
D) (iv) మాత్రమే
జవాబు:
C) (ii) & (iv)
4. వలయాన్ని పరిశీలించండి. R2 నిరోధం వినియోగించే విద్యుత్ సామర్థ్యం P వలయం నుండి R1 ను తొలగించిన R2 నిరోధం వినియోగించే విద్యుత్ సామర్థ్యం ………… (R1 = R,2 గా తీసుకోండి.)
జవాబు:
C
5. కింది వాటిల్లో ఏది పొటెన్షియల్ భేదంను కొలవడానికి ఉపయోగించే పద్ధతి?
A) వోల్టుమీటరును వలయంలో సమాంతరంగా కలపడం
B) వోల్టుమీటరును వలయంలో శ్రేణిలో కలపడం
C) అమ్మీటరును వలయంలో సమాంతరంగా కలపడం
D) అమ్మీటరును వలయంలో శ్రేణిలో కలపడం
జవాబు:
A) వోల్టుమీటరును వలయంలో సమాంతరంగా కలపడం
6. ఒక గదిలో టెలివిజన్ మరొక గదిలో కంప్యూటర్ కలదు. ఈ రెండూ ఒకే వలయంలో కలుపబడ్డాయి. అవి ఈ విధంగా కలుపబడి ఉంటాయి.
A) శ్రేణి పద్ధతి
B) సమాంతర పద్దతి
C) ఒకటి శ్రేణి మరొకటి సమాంతర పద్ధతిలో
D) ఏవిధంగానైనా
జవాబు:
B) సమాంతర పద్దతి
7. ఓవర్ లోడ్ వల్ల కలిగే ప్రమాదాలను నివారించడానికి ఉపయోగించే సాధనం
A) అమ్మీటర్
B) ఓల్టామీటరు
C) ఫ్యూజ్
D) స్విచ్
జవాబు:
C) ఫ్యూజ్
8. 10 Ω మరియు 10 Ω నిరోధాలను శ్రేణిలో కలిపితే ఫలితం నిరోధం
A) 5 Ω
B) 10 Ω
C) 0 Ω
D) 20 Ω
జవాబు:
D) 20 Ω
9. క్రింది జతలలో ఏది సరైన జతల సమూహం?
i) అమ్మీటర్ ( ) a) వలయంలో సమాంతరంగా కలుపబడుతుంది.
ii) టాప్ కీ ( ) b) వలయంలో శ్రేణిలో కలుపబడును.
iii) ఓల్ట్ మీటర్ ( ) c) వలయం కలుపబడానికి విడదీయడానికి ఉపయోగిస్తారు.
A) i – a, ii – b; iii – c
B) i – b, ii – c, iii – a
C) i – c, ii – a, iii – b
D) i – a, ii – c, iii – b
జవాబు:
B) i – b, ii – c, iii – a
10. పొటెన్షియల్ భేదం కొలవటానికి ……………… ఉపయోగిస్తారు.
A) ఆమ్మీటర్
B) గాల్వనోమీటర్
C) బ్యాటరీ
D) వోల్టుమీటర్
జవాబు:
D) వోల్టుమీటర్
11. రెండు నిరోధాలు 10Ω, 15Ω శ్రేణిలో కలిపిన ఫలిత నిరోధం
A) 10Ω
B) 15 Ω
C) 20 Ω
D) 25 Ω
జవాబు:
D) 25 Ω
12. ఏకరీతి మందంతో RΩ ల నిరోధం గల ఒక తీగను 10 సమాన భాగాలుగా చేసి, వాటిని సమాంతర సంధానం చేశారు. సంధాన ఫలిత నిరోధం ……..
A) 100 RΩ
B) 10 RΩ
C) 0.1 RΩ
D) 0.01 RΩ
జవాబు:
D) 0.01 RΩ
13. క్రింది ఏ సందర్భంలో విశిష్ట నిరోధం మారదు ?పై వాటిని జతపరుచుటకు క్రింది వాటిలో సరైన సమాధానం.
A) పదార్థం మారినపుడు
B) ఉష్ణోగ్రత మారినపుడు
C) నిరోధం ఆకారం మారినపుడు
D) పదార్థం, ఉష్ణోగ్రత రెండూ మారినపుడు
జవాబు:
C) నిరోధం ఆకారం మారినపుడు
14. 6Ω, 6Ω, 6Ω లను సమాంతర సంధానం చేస్తే వచ్చే ఫలిత నిరోధం …………
A) 1/6
B) 6
C) 18
D) 2
జవాబు:
D) 2