Students can go through AP Board 10th Class Physical Science Notes 8th Lesson రసాయన బంధం to understand and remember the concept easily.
AP Board 10th Class Physical Science Notes 8th Lesson రసాయన బంధం
→ అణువులోని పరమాణువుల మధ్య ఆకర్షణ బలాలుంటాయి. ఈ ఆకర్షణ బలాలనే “రసాయన బంధం” అంటారు.
→ బాహ్యకర్పరంలో అష్టక ఎలక్ట్రాన్ విన్యాసం ఉన్న పరమాణువులు ఎక్కువ స్థిరత్వమును, తక్కువ చర్యాశీలతను కలిగి ఉంటాయి. ఉదా : హీలియం మినహాయించి ఇతర జడవాయువులు.
→ పరమాణువులు బాహ్య కర్పరంలో 8 ఎలక్ట్రానులను (హైడ్రోజను, లిథియం స్థిర విన్యాసానికి రెండు ఎలక్ట్రానులు చాలు) ఉంచుకోవడానికి ప్రయత్నించే ప్రవృత్తి వలన రసాయన సంయోగము మరియు బంధాలు ఏర్పడతాయి.
→ బహిర్గత కక్ష్యలోని ఎలక్ట్రానులను వేలన్సీ ఎలక్ట్రానులు అంటారు. రసాయన బంధం ఏర్పడడంలో వేలన్సీ ఎలక్ట్రానులు పాల్గొంటాయి.
→ ఒక పరమాణువులోని బహిరత కక్ష్మలోని ఎలక్ట్రానులు, మరొక పరమాణువులోని బహిర్గత కక్ష్యలోనికి బదిలీ చేయబడడం వలన అయానులు లేక ఆవేశపూరిత కణాలు ఏర్పడతాయి.
→ ఎలక్ట్రానులను కోల్పోయే పరమాణువు ధనావేశపూరితమవుతుంది. ఎలక్ట్రానులను గ్రహించే పరమాణువు ఋణావేశ పూరితమవుతుంది.
→ విరుద్ధ విద్యుదావేశం గల అయానుల మధ్య ఉండే స్థిర విద్యుత్ ఆకర్షణబలమే అయానిక బంధం.
→ ఎలక్ట్రానుల బదిలీ వలన ఏర్పడిన బంధం అయానిక బంధం.
→ స్పటిక లాటిస్ విరుద్ధ ఆవేశం గల అయానుల త్రిమితీయ క్రమబద్ధమైన అమరిక.
→ NaCl, K2S, MgCl2 మరియు CaF2 మొదలైన అయానిక సమ్మేళనాలు, అయానులు, విరుద్ధ ఆవేశ అయాను జంటల ఆకర్షణ వలన ఏర్పడినది.
→ ఎలక్ట్రానులను తీసివేయడం ఆక్సీకరణం.
→ ఎలక్ట్రానులను చేర్చడం క్షయకరణం.
→ ఎలక్ట్రానులను స్వీకరించే పరమాణువు ఆక్సీకరణి మరియు ఎలక్ట్రానులను ఇచ్చే పరమాణువు క్షయకరణి.
→ ఒక చర్యలో ఆక్సీకరణము, క్షయకరణము ఏక కాలంలో జరుగుతుంటాయి.
→ అయానిక పదార్థాల ధర్మాలు : గట్టిగానూ, దృఢంగానూ ఉంటాయి. ద్రవీభవన, బాష్పీభవన ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే పదార్థాలు. నీరు వంటి ధృవద్రావణిలలో ఎక్కువగా కరుగుతాయి.
→ రెండు పరమాణువుల మధ్య ఎలక్ట్రాను జంటను పంచుకోవడం వలన ఏర్పడిన బంధమే సంయోజనీయ బంధం. దీనిని ‘-‘ గుర్తుతో నిర్మాణంలో సూచిస్తారు.
→ అణువులోని పరమాణువుల మధ్య ఎలక్ట్రానులను పంచుకోవడం వలన ఏర్పడిన పదార్థాలను “సంయోజనీయ పదార్థాలు” అంటారు.
→ సమయోజనీయ పదార్థాలు మృదువుగా ఉంటాయి. ఈ పదార్థాల ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు తక్కువగా ఉంటాయి. సాధారణంగా విద్యుత్తును ప్రసరింపచేయవు.
→ ఎలక్ట్రాను జంట రెండు పరమాణువుల మధ్య అసమానంగా పంచుకోబడితే, ఆ విధంగా ఏర్పడిన సంయోజనీయ బంధంను “ధృవశీల సంయోజనీయ బంధం” అంటారు.
→ విరుద్ధ ఆవేశాలున్న అణువులను ధృవాణువులు అంటారు.
→ అధృవ అణువులలో ఎలక్ట్రాన్ జంట పరమాణువుల మధ్య సమానంగా పంచుకోబడుతుంది. ఈ విధంగా ఏర్పడిన అణువులు తటస్థంగానూ, మరియు ధృవత్వం లేకుండా ఉంటాయి.
→ రసాయన చర్యలో క్రొత్త బంధము ఏర్పడినప్పుడు విడుదలయ్యే శక్తిని బంధశక్తిగా వ్యవహరిస్తారు.
→ అణువులలో ఉన్న పరమాణువుల సంఖ్యను బట్టి, మరియు బంధాన్ని ఏర్పరచు ఆర్బిటాళ్ళ స్వభావాన్ని బట్టి అణువులు వివిధ ఆకృతులను ప్రదర్శిస్తాయి.
→ అణువులలో బంధకోణాలను వెస్పర్ట్ (VSEPRT) సిద్ధాంతం ద్వారా వివరించవచ్చు.
→ “ఒకే రకంగా ఉన్నవి దానిలోనే కరుగుతాయి” అనే సూత్రం ఆధారంగా సంయోజనీయ పదార్థాలు అధృవ ద్రావణిలో కరుగుతాయి. ఎందుకంటే సంయోజనీయ పదార్థాల అణువులు అధృవ స్వభావంను కలిగి ఉంటాయి.
→ ఎలక్ట్రానులు : పరమాణువులోని ఋణావేశిత కణాలు.
→ జడవాయువులు : వేలన్సీ కర్పరములో 8 ఎలక్ట్రానులు గల మూలకాలు (He తప్ప). హీలియం మూలకం జడవాయువైనా, దాని చివరి కర్పరంలో 2 ఎలక్ట్రానులుంటాయి. మిగిలిన జడవాయువులు నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, గ్జినాన్, రేడాన్.
→ లూయిస్ చుక్కల నిర్మాణాలు : వేలన్సీ కర్పరంలో ఉన్న ఎలక్ట్రానులను చూపే విధానం.
→ అష్టక నియమం : వేలన్సీ కర్పరంలో 8 ఎలక్ట్రానులు కలిగి ఉండటం.
→ రసాయన బంధం : అణువులోని పరమాణువుల మధ్య ఉండే ఆకర్షణ బంధం.
→ అయానిక బంధం : అయానుల మధ్య ఉండే బంధాన్ని అయానిక బంధం అంటారు.
→ సమయోజనీయ బంధం : రెండు పరమాణువులు ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు అవి ఎలక్ట్రానులను పరస్పరం పంచుకోవడం వల్ల ఏర్పడే బంధమే “సమయోజనీయ బంధం”.
→ కాటయాను : ఎలక్ట్రాను (ల)ను కోల్పోయిన ధనాత్మక అయాను (కాటయాను).
→ ఆనయాను : ఎలక్ట్రాను (ల)ను గ్రహించిన ఋణాత్మక అయాను (ఆనయాను).
→ స్థిర విద్యుదాకర్షణ బలం : కాటయాన్లు, ఆనయాన్లు మధ్యగల విద్యుదాకర్షణ బలాలను “స్థిర విద్యుదాకర్షణ బలాలు” అంటారు.
→ ఎలక్టోవాలెంట్ బంధం : వేలన్సీ భావనను ఎలక్ట్రానుల పరంగా వివరించిన బంధం ఎలక్టోవాలెంట్ బంధం (అయానిక బంధం).
→ ఎలక్టోవాలెంటం : వాలన్నీ భావనను ఎలక్ట్రాన్స్ పరంగా వివరించడం ఎలక్టోవాలెంటం.
→ ధృవద్రావణి : ధృవ స్వభావం గల ద్రావణి. ఉదా : నీరు (H2O).
→ అధృవద్రావణి : ధృవ స్వభావం లేని ద్రావణి. ఉదా : కిరోసిన్.
→ అణువులు : మూలకాలలో మరియు సంయోగ పదార్థాలలో పరమాణువులతో ఏర్పడినవి అణువులు.
→ అయానిక పదార్థాలు : అయానిక బంధం కలిగిన పదార్థాలు.
→ సంయోజనీయ పదార్థాలు : సంయోజనీయ బంధం కలిగిన పదార్థాలు.
→ ధనవిద్యుదాత్మక ధర్మం : ఎలక్ట్రానులను కోల్పోయి ధనాత్మక అయానుగా మారే ధర్మం.
→ ఋణవిద్యుదాత్మక ధర్మం : ఎలక్ట్రానులను గ్రహించి ఋణాత్మక అయానుగా మారే ధర్మం.
→ ధృవబంధాలు : ధృవ ద్రావణులలో ఉండే బంధాలు.
→ బంధ ఎలక్ట్రాన్ జంట : సమయోజనీయ బంధంలోని పరమాణువుల మధ్య పంచుకోబడే ఎలక్ట్రాన్ జంట.
→ ఒంటరి ఎలక్ట్రాన్ జంట : పరమాణు బాహ్యక్టరలో బంధంలో పాల్గొనకుండా ఉండే రెండు ఎలక్ట్రాన్లే ఒంటరి ఎలక్ట్రాన్ జంట.
→ బంధదూరం : సమయోజనీయ బంధంతో కలుపబడిన రెండు పరమాణువుల కేంద్రకాల మధ్య సమతాస్థితి వద్ద గల దూరాన్నే “బంధదూరం” అంటారు.
→ బంధశక్తి : రెండు పరమాణువుల మధ్య బంధం ఏర్పడినప్పుడు విడుదలయ్యే శక్తి.
→ బంధవిచ్చిత్తి శక్తి : అణువులోని బంధాలను విడదీయుటకు కావల్సిన శక్తి.
→ అణువు ఆకృతి : అణువులోని పరమాణువుల కేంద్రకాల గుండా వెళ్ళే ఊహారేఖల ఆకారాలు.
→ రేఖీయం : CO2 అణు ఆకృతి.
→ చతుర్ముఖీయం : మీథేన్ (CH4) అణువు ఆకృతి.
→ సమయోజనీయ పదార్థాలు : అణువులోని పరమాణువుల మధ్య ఎలక్ట్రానులను పంచుకోవడం వలన ఏర్పడిన పదార్థాలను సమయోజనీయ పదార్థాలు అంటారు.