Students can go through AP Board 10th Class Physical Science Notes 9th Lesson విద్యుత్ ప్రవాహం to understand and remember the concept easily.
AP Board 10th Class Physical Science Notes 9th Lesson విద్యుత్ ప్రవాహం
→ ఈ ఆవేశాల చలనమును విద్యుత్ ప్రవాహం అంటారు.
→ మన నిత్యజీవితంలో విద్యుత్ ప్రముఖపాత్రను వహిస్తుంది.
ఉదా:
- రెండు మేఘాల మధ్య (లేదా) మేఘం, భూమి మధ్య జరుగు విద్యుత్ ఉత్సర్గంను మెరుపులు తెలియజేస్తాయి.
- మేఘాల నుండి భూమికి గాలి ద్వారా జరిగే విద్యుత్ ఉత్సర్గం వల్లనే మనకు మెరుపులు కనిపిస్తాయి.
- మెరుపు అనునది వాతావరణంలో ఆవేశాల చలనమునకు ఉదాహరణ.
→ సాధారణముగా ఆవేశాలు రెండు రకాలు.
- ధనావేశం,
- ఋణావేశం
→ విద్యుత్ కు మూలమైనది ఆవేశమే. ఈ విద్యుత్ ఆవేశంను కూలుంట్లలో కొలుస్తారు.
→ ఒక సెకను కాలంలో వాహకంలోని ఏదేని మధ్యఛ్ఛేదాన్ని దాటి వెళ్ళు ఆవేశ పరిమాణాన్ని “విద్యుత్ ప్రవాహం” అంటాము.
→ విద్యుత్ ప్రవాహంకు సూత్ర ఉత్పాదన : ‘t’ కాలవ్యవధిలో ఒక వాహకంలోని ఏదేని మధ్యచ్ఛేదాన్ని దాటివెళ్ళే
→ విద్యుత్ ప్రవాహానికి SI ప్రమాణం ఆంపియర్. దీనిని ‘A’ తో సూచిస్తారు.
→ పొటెన్సియల్ భేదం : విద్యుత్ క్షేత్రంలో ఉన్న ప్రమాణ ధనావేశాన్ని ఒక బిందువు నుండి మరొక బిందువుకు చేర్చుటకు చేసిన పనిని ఆ బిందువుల మధ్య పొటెన్షియల్ భేదం అంటారు. (లేదా) ప్రమాణ ధనావేశాన్ని A నుండి B కు l దూరం కదిలించడానికి విద్యుత్ బలం చేసిన పనిని A, B ల మధ్య పొటెన్సియల్ భేదం అంటారు.
→ పొటెన్షియల్ భేదాన్ని “ఓల్టేజ్” అని కూడా అంటారు.
→ పొటెన్షియల్ భేదాన్ని “V” తో సూచిస్తారు.
→ పొటెన్షియల్ భేదానికి SI ప్రమాణం “ఓల్ట్”.
→ ఒక ఘటములో ఏకాంక ఋణావేశంను ధన ధృవం నుండి ఋణ ధృవానికి కదిలించడానికి రసాయన బలం చేయు పనిని విద్యుచ్చాలక బలం అంటారు.
→ స్థిర ఉష్ణోగ్రత వద్ద, వాహకం యొక్క రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. దీనినే “ఓమ్ నియమం” అంటారు.
→ V ∝ I ⇒ \(\frac{V}{I}\) స్థిరాంకము
→ ఓమ్ నియమాన్ని పాటించే పదార్థాలను ఓమీయ పదార్థాలు అంటారు. ఉదా: లోహాలు
→ ఓమ్ నియమాన్ని పాటించని పదార్థాలను అఓమీయ పదారాలంటారు. ఉదా: LED
→ ఓమ్ నియమంను జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త “జార్జ్ సైమన్ ఓమ్” తెలియజేశారు.
→ వాహకంలో ఎలక్ట్రాన్ చలనానికి కలిగే ఆటంకమును “వాహక నిరోధము” అంటారు.
→ వాహక నిరోధాన్ని “ఓమ్” లలో కొలుస్తారు.
→ మానవ శరీరం యొక్క నిరోధం విలువ సాధారణంగా 100Ω నుండి 5,00,000Ω కు మధ్యస్థంగా ఉంటుంది.
→ మన శరీరంలోని లోపలి అవయవాల కంటే చర్మానికి నిరోధం ఎక్కువ.
→ మల్లీమీటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరము.
→ మల్టీమీటర్ నిరోధం, ఓల్టేజ్, కరెంట్ వంటి వివిధ విలువలను కొలవగలుగుతుంది.
→ మల్లీమీటరులో డిస్ప్లే సెలక్షన్ నాబ్ మరియు పోర్ట్ వంటి మూడు భాగాలుండును.
→ పదార్థం యొక్క నిరోధము (R) ను
i) ఉష్ణోగ్రత (T) ii) పదార్థ స్వభావము iii) వాహకం పొడవు (l)
iv) మధ్యఛ్ఛేద వైశాల్యం (A) వంటి అంశాలు ప్రభావితం చేస్తాయి.
→ వాహక నిరోధం (R) = \(\frac{\rho l}{\mathrm{~A}}\) (ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు)
→ ‘ρ’ ను విశిష్ట నిరోధం లేదా నిరోధకత అంటాము.
→ విశిష్ట నిరోధం అనేది ఉష్ణోగ్రత, పదార్థ స్వభావంలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.
→ విశిష్ట నిరోధానికి SI ప్రమాణం Ω – m (ఓమ్ – మీటరు).
→ విశిష్ట నిరోధ విలోమాన్ని వాహకత్వం (σ) అంటాము.
→ విద్యుత్ బల్ట్ లో వాడు ఫిలమెంట్ ను “టంగ్స్టన్” తో తయారు చేయుటకు కారణం దీని విశిష్ట నిరోధం, ద్రవీభవన స్థానం విలువలు చాలా ఎక్కువ.
→ బ్యాటరీ, వాహక తీగలతో ఎలక్ట్రానులు ప్రవహించడానికి అనుకూలంగా ఏర్పరచిన సంవృత మార్గమును విద్యుత్ వలయం అంటాము.
→ శ్రేణిలో కలిపిన నిరోధాల వల్ల ఏర్పడే ఫలిత నిరోధం, ఆయా విడివిడి నిరోధాల మొత్తంకు సమానము.
Rఫలిత = R1 + R2 + R3
→ సమాంతర సంధానంలో ఉన్న నిరోధాల ఫలిత నిరోధం విలువ, ఆ విడివిడి నిరోధాల విలువ కన్నా తక్కువగా ఉంటుంది.
→ ఒక DC వలయంలో కొన్ని బ్యాటరీలు, కొన్ని నిరోధాలను ఏ విధంగా కలిపినా, దానిని గురించి అవగాహన చేసుకోవడానికి రెండు సరళమైన నియమాలు ఉపయోగపడతాయి. వీటినే కిరాఫ్ నియమాలంటారు.
→ జంక్షన్ నియమం : వలయంలో విద్యుత్ ప్రవాహం విభజింపబడే ఏ జంక్షన్ వద్దనైనా, ఆ జంక్షన్‌కు చేరే విద్యుత్ ప్రవాహాల మొత్తం, ఆ జంక్షనన్ను వీడిపోయే విద్యుత్ ప్రవాహాల మొత్తానికి సమానము.
→ ప్రక్క పటంలో I1 + I4 + I6 = I2 + I3 + I5
→ లూప్ నియమం: ఒక మూసిన వలయంలో పరికరాల రెండు చివరల మధ్య | 15 పొటెన్షియల్ భేదాల్లో పెరుగుదల, తగ్గుదలల బీజీయ మొత్తం శూన్యం.
ACDBA లూప్ నందు, – V2 + I2R2 – I1R1 + V1 = 0
EFDCE లూపనందు, – (I1 + I2) R3 – I2R2 + V2 = 0
EFBAE లూప్ నందు, – (I1 + I2) R3 – I1R1 + V1 = 0
→ విద్యుత్ ప్రవాహం, పొటెన్షియల్ భేదాల లబ్దాన్ని విద్యుత్ సామర్థ్యం అంటాం. విద్యుత్ సామర్థ్యం P= VI.
→ విద్యుత్ సామర్థ్యంను వాట్ (W)లలో కొలుస్తారు.
→ 1KW = 1000 W = 1000 J/s.
→ ఒక యూనిట్ అనగా ఒక కిలోవాట్ అవర్ (1KWH) అని అర్థము.
→ 1KWH = 3.6 × 106J
→ ఫ్యూజ్ అనగా అతి తక్కువ ద్రవీభవన స్థానం గల సన్నని తీగ.
→ విద్యుత్ సామర్థ్యం మరియు కాలాల లబ్దాన్ని విద్యుత్ శక్తి అంటారు.
→ విద్యుత్ శక్తికి ప్రమాణం వాట్ – సెకను మరియు KWH.
→ ఆవేశం : ఏదైనా పదార్థంలో ఉన్న ప్రాథమిక కణాల పరస్పర ప్రభావ పర్యవసానముగా ఆ పదార్థంలో ఏర్పడే ఫలితము.
→ పొటెన్షియల్ భేదం : ప్రమాణ ధనావేశాన్ని విద్యుత్ క్షేత్రంలో ఉన్న ఏదైనా ఒక బిందువు నుండి మరొక బిందువు వద్దకు కదల్చడానికి చేసిన పనిని ఆ బిందువుల మధ్య పొటెన్షియల్ భేదం అంటారు.
→ విద్యుత్ ప్రవాహం : ఏదేని వాహకం గుండా ప్రవహించే విద్యుదావేశం.
→ మల్టీమీటర్ : పొటెన్షియల్ భేదంను, నిరోధాన్ని, విద్యుత్ ప్రవాహంను కొలిచే సాధనము.
→ ఓమ్ నియమము : స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాహకం యొక్క రెండు చివరల మధ్యనున్న పొటెన్షియల్ భేదం (V)కి మరియు అదే వాహకంలోని విద్యుత్ ప్రవాహం (I) కి గల నిష్పత్తి విలువ స్థిరముగా ఉండును.
V ∝ I (లేక) \(\frac{V}{I}\) = స్థిరము
→ వాహక నిరోధం : ఇది వాహకం చివరల మధ్య గల పొటెన్షియల్ భేదానికి, దానిలో ప్రవహించే విద్యుతక్కు గల నిష్పత్తి.
→ విశిష్ట నిరోధం : విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించు విద్యుత్ వాహక స్వభావము.
→ ఆఫ్ నియమాలు : ఒక DC వలయంలో కొన్ని బ్యాటరీలు, నిరోధాలను ఏ విధంగా కలిపినా వాటిని విశ్లేషణ చేయుటకు ప్రతిపాదించిన నియమాలు. అవి : i) జంక్షన్ నియమం, ii) లూప్ నియమం
→ విద్యుత్ సామర్థ్యం : విద్యుత్ శక్తిని వినియోగించుకునే రేటు. (లేదా)
విద్యుత్ వ్యవస్థలో పని జరిగే రేటు. (లేదా) విద్యుత్ ప్రవాహం, పొటెన్షియల్ భేదాల లబ్ధము.
→ విద్యుత్ శక్తి : ఇది విద్యుత్ సామర్థ్యం మరియు కాలాల లబ్ధము. (లేదా)
ఇది ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ను నిర్వహించుటకు వినియోగించబడిన మొత్తం శక్తి.
→ జంక్షన్ నియమం : వలయంలో విద్యుత్ ప్రవాహం విభజింపబడే ఏ జంక్షన్ వద్దనైనా, జంక్షన్ ను చేరే విద్యుత్ ప్రవాహాల మొత్తం ఆ జంక్షనను వీడిపోయే విద్యుత్సవాహాల మొత్తానికి సమానం.
→ లూప్ నియమం : ఒక మూసిన వలయంలోని వివిధ పరికరాల రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదాలలో పెరుగుదల, తగ్గుదలల బీజీయ మొత్తం శూన్యము.