These AP 10th Class Social Studies Important Questions 12th Lesson సమానత – సుస్థిర అభివృద్ధి will help students prepare well for the exams.
AP Board 10th Class Social 12th Lesson Important Questions and Answers సమానత – సుస్థిర అభివృద్ధి
10th Class Social 12th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium
1. ఉత్తరాఖండ్ లో ప్రారంభమైన చిప్కో ఉద్యమ ప్రధాన లక్ష్య మేమిటి?
జవాబు:
అటవీ సంరక్షణ.
2. ‘సైలెంట్ సింగ్’ అన్న పుస్తకములోని ఇతివృత్త మేమిటి?
జవాబు:
DDT వాడకం వల్ల కలిగే ప్రభావములు.
3. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం నిషేధించిన రాష్ట్రమేది?
జవాబు:
సిక్కిం
4. ధారావి మురికివాడ ఏ నగరంలో ఉంది?
జవాబు:
ముంబయి.
5. ప్రపంచంలోనే అతి పెద్ద మురికివాడ ఏది?
జవాబు:
ధారావి.
6. మొత్తంగా సేంద్రీయ వ్యవసాయానికి మారాలని నిర్ణయించుకున్న మొదటి రాష్ట్రం ఏది?
జవాబు:
సిక్కిం
7. ‘NBA’ అనగా?
జవాబు:
నర్మదా బచావో ఆందోళన్.
8. జీవితాన్ని పూర్తిగా ఆనందించటానికి కాలుష్య రహిత నీటిని, గాలిని పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు 1991 సంవత్సరంలో ఇచ్చిన తీర్పు దేనికి (ఏ హక్కుకు) సంబంధించినది?
జవాబు:
జీవించే హక్కు
9. ‘జీవించే హక్కు’ను తెలియజేసే రాజ్యాంగ ప్రకరణ ఏది?
జవాబు:
21వ ప్రకరణ.
10. చిప్కో అనే పదానికి అర్థం ఏమిటి?
జవాబు:
హత్తుకోవడం.
11. ‘సైలెంట్ స్ప్రింగ్’ పుస్తకాన్ని రచించినది ఎవరు?
జవాబు:
రాచెల్ కార్సన్.
12. ‘సైలెంట్ స్పింగ్’ పుస్తకాన్ని ఏ సంవత్సరంలో ప్రచురించారు?
జవాబు:
1962.
13. భారత సుప్రీంకోర్టు వెలువరించిన అనేక ఆదేశాలు ప్రకారము ‘ప్రజా రవాణా’ వాహనాలన్నీ ఉపయోగించ వలసిన ఇంధనం ఏది?
జవాబు:
CNG (పీడనానికి గురిచేసిన సహజవాయువు)
14. క్రింది వానిలో తప్పుగా జతచేయబడినది గుర్తించి రాయండి.
→ సైలెంట్ వ్యాలి – కేరళ
→ సేంద్రియ రాష్ట్రం – సిక్కిం
→ నర్మదాబచావో – కర్ణాటక
→ చిప్కో – ఉత్తరాఖండ్
జవాబు:
నర్మదాబచావో – కర్ణాటక.
15. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) మొత్తంగా సేంద్రియ వ్యవసాయానికి మారాలని నిర్ణయించుకున్న మొదటి రాష్ట్రం సిక్కిం.
ii) 100 శాతం సేంద్రియ రాష్ట్రంగా మారే ఇదే పంథాని ఉత్తరాఖండ్ కూడా అనుసరిస్తోంది.
పై వాక్యాలలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
C – (i) మరియు (ii)
16. నర్మదా బచావో ఆందోళన్ ముఖ్య ఉద్దేశ్యమేమి?
జవాబు:
పర్యావరణ పరిరక్షణ.
17. రసాయనిక ఎరువులు, పురుగు మందులు అధికంగా, ఇష్టానుసారంగా వాడినందువల్ల కలిగే దుష్పరిణామం కానిది.
A) భూసారం తగ్గుతుంది
B) నీటి కాలుష్యం (భూగర్భజలం)
C) పంట దిగుబడి పెరుగుతుంది.
D) పర్యావరణం క్షీణతకు గురౌతుంది.
జవాబు:
C) పంట దిగుబడి పెరుగుతుంది.
18. “ప్రకృతి వనరుల దోపిడి చేయకుండా అభివృద్ధి అనేది సాధ్యం కాదు” ………
ఎ) ఇది అన్యాయమైన అభిప్రాయము.
బి) ఇది అన్యాయమైన అభిప్రాయము అయినా ఇదే వాస్తవం.
సి) ఇది అన్యాయము మరియు అవాస్తవం కూడా.
డి) అభివృద్ధికే తొలి ప్రాధాన్యం, ప్రకృతి పరిరక్షణ తర్వా త.
జవాబు:
బి – ఇది అన్యాయమైన అభిప్రాయము అయినా ఇదే వాస్తవం.
19. NBA ఉద్యమానికి కారణమైన ప్రధాన ఆనకట్ట ఏది?
జవాబు:
సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్.
20. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలను తీర్చటానికి, పంటల దిగుబడిని పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే పంటల దిగుబడి పెంచటానికి అత్యంత పర్యావరణ హితమైన వ్యవసాయ విధానం ఏది?
జవాబు:
సేంద్రియ వ్యవసాయం (ప్రకృతి వ్యవసాయం).
21. చిప్కో ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన వారు ఎవరు?
జవాబు:
గ్రామీణ మహిళలు.
22. కాలుష్యాన్ని పర్యావరణం గ్రహించి ప్రమాద రహితంగా మార్చే పర్యావరణ విధి ఏది?
జవాబు:
శుద్ధి చేసే విధి.
23. సుమారుగా 300 జిల్లాల్లో గత 20 సంవత్సరాలలో భూగర్భ జలాలు ఎన్ని మీటర్ల మేర పడిపోయాయి?
జవాబు:
4 మీటర్లు.
24. చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు?
జవాబు:
సుందర్లాల్ బహుగుణ.
25. ప్రస్తుత తరం రాబోయే తరాలకు నాణ్యమైన జీవనం అందించటాన్ని ఏమంటారు?
జవాబు:
సుస్థిరాభివృద్ధి.
26. ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థకు (మెదక్ జిల్లాలో) తోడ్పడిన స్వచ్చంద సంస్థ ఏది?
జవాబు:
డెక్కన్ డెవలప్మెంట్ సొసైటి (DDS)
27. భారతదేశంలో నిషేధించిన పురుగుమందు ఏది?
జవాబు:
ఎండో సల్సాన్.
28. DDT ని విస్తరింపుము.
జవాబు:
డైక్లోరో డైఫినాల్ టైక్లోరో ఈథేన్.
29. జలసింధి గిరిజన భాష ఏది?
జవాబు:
భిలాలా.
30. ఈ భూమి మీద ఎన్నోరకాల మొక్కలు, జంతువులు మొ||న రకరకాల జీవులు ఉండటాన్ని ఏమంటారు?
జవాబు:
జీవ వైవిధ్యం
31. భారతదేశంలో వార్షిక ఆదాయం ఎంతకంటే తక్కువ ఉంటే నిమ్న వర్గాలుగా పేర్కొంటారు?
జవాబు:
₹1.5 లక్షల కంటే తక్కువ.
32. కాసర్ గోడ్ జిల్లా ఏ రాష్ట్రంలో కలదు?
జవాబు:
కేరళ.
33. చిప్కో ఉద్యమం ఏ సంవత్సరంలో ఆరంభమైంది?
జవాబు:
1970.
34. భారతదేశంలోని ఎంత శాతం జిల్లాల్లో చేతి పంపులలోని నీళ్లు తాగడానికి పనికిరావు?
జవాబు:
59%
35. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) కెన్యా ( ) a)మస్సాయి
ii) ఖజకిస్తాన్ ( ) b) యుర్తా
iii) టిబెట్ ( ) c) కియాంగ్
iv) దక్షిణ అమెరికా (d) గౌచా
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d
36. దక్కన్ పీఠభూమి మధ్య భాగం తక్కువ వర్షపాతాన్ని పొందుతుంది. దీనికి ప్రధాన కారణమేమి?
జవాబు:
ఇది వర్షచ్చాయ ప్రాంతంలో ఉండటం.
37. “మానవులు అభివృద్ధి, సంతోషం పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నారు…….
→ A) అవునూ, మనం నేటి సంతోషాన్ని చూస్తున్నాం కాని రేపటి ఆపదను పట్టించుకోవటం లేదు.
→ B) నిజమే కానీ, అభివృద్ధి, సంతోషము తర్వాతే ఏమైనా.
→ C) ప్రకృతి సహజంగానే శుద్ధి చేసుకుంటుంది.
→ D) లేదు, అలా జరగడం లేదు.
జవాబు:
A) అవునూ, మనం నేటి సంతోషాన్ని చూస్తున్నాం కాని రేపటి ఆపదను పట్టించుకోవటం లేదు.
38. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) ధారావి ( ) a) ప్రత్యామ్నాయ ప్రజాపంపిణి
ii) జలసింధి ( ) b) సేంద్రియ వ్యవసాయము
iii) సిక్కిం ( ) c) నర్మదా బచావో
iv) జహీరాబాద్ ( ) d) మురికివాడ
జవాబు:
i – d, ii – c, iii – b, iv – a.
39. చిప్కో ఉద్యమం గురించి సరియైన వాక్యం కానిది.
→ ఉత్తరాఖండ్ లోని గఢీవాల్ కొండలలో ఆరంభమైంది.
→ 1970 లో ప్రారంభమైంది.
→ చిప్కో అంటే హత్తుకోవడం.
→ హింసాయుత పద్ధతుల్లో చెట్లను నరికి వెయ్యటాన్ని వ్యతిరేకించారు.
జవాబు:
హింసాయుత పద్ధతుల్లో చెట్లను నరికి వెయ్యటాన్ని వ్యతిరేకించారు.
40. కేరళలోని ఉత్తర ప్రాంతమైన కాసర్‌గోడ్ జిల్లాలో ఏ రసాయనిక పురుగు మందు జీడిమామిడి తోటల పైన పిచికారి చేయటం వల్ల 5,000 మంది మరణించడంతో పాటు, చాలా మందికి అవయవ లోపాలతోపాటు క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నారు.
జవాబు:
(Endo Sulfan) ఎండో సల్సాన్.
41. శ్రామిక వర్గం ఎక్కువగా అవ్యవస్థీకృత రంగంలో ఉన్నప్పటికీ GDPలో పెరుగుదల దేనికి సూచిక?
జవాబు:
పెరుగుతున్న వస్తు సేవల ప్రయోజనం కొద్దిమందే పొందుతున్నారు.
42. మనం ఉపయోగించే పురుగు మందులో ఎంత శాతం పురుగుమీద ప్రభావం చూపుతుంది?
జవాబు:
1%
43. జలసింధి గ్రామము ఏ రాష్ట్రంలో ఉంది?
జవాబు:
మధ్య ప్రదేశ్.
44. జలసింధి గ్రామము ఏ జిల్లాలో ఉంది?
జవాబు:
ఝాబువా.
45. “గుజరాత్ లోని మైదానాల్లోకి వెళ్లండి, మీ పరిస్థితి మెరుగుపడుతుంది, మీరు అభివృద్ధి చెందుతారు” అంటూ మీరు సలహాలు ఇస్తారు. కాని మేం ఎనిమిది సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం”. ఈ వాక్యం అన్నది ఎవరు?
జవాబు:
బావా మహాలియా.
46. క్రింది వానిలో సరియైన వాక్యం/లు ఎంచుకొని రాయండి.
i) ప్రజల ఆదాయాలు అవకాశాలలో అంతరాలు సమ సమాజ నిర్మాణానికి అడ్డంకి.
ii) అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండూ విరుద్ధ భావనలు.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (i) సత్యము
B) (ii) సత్యము
C) (i) మరియు (ii) సత్యము
D) రెండూ కావు
జవాబు:
A – (i) సత్యము
47. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయ కుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకోవటం.
ii) ప్రస్తుత తరం యొక్క నాణ్యమైన జీవనాన్ని మాత్రమే సుస్థిర అభివృద్ధి కోరుకుంటుంది.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
C – (i) మరియు (ii)
48. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) విధానాలను నిర్ణయించేవాళ్ళు అధిక ఆర్థిక అభివృద్ధి, సంపన్నత సాధించిన తరువాత కాలుష్యాన్ని, పర్యావరణ క్షీణతను పరిష్కరించవచ్చని భావించారు.
ii) అభివృద్ధి చెందిన దేశాల మాదిరి మనం కూడా వృద్ధి సాధించి వనరులను, ఇంధనాన్ని వినియోగిస్తే పర్యావరణ హితంగా భూమి వినాశనాన్ని అరికట్టవచ్చు.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (1) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
C – (i) మరియు (ii)
క్రింది పట్టికను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నకు సమాధానము రాయండి.
పట్టిక : భారతదేశంలో కొన్ని కీలక ఖనిజాల తవ్వకం (వేల టన్నులలో)
ఖనిజం | 1997-98 | 2008-09 |
బాక్సైట్ | 6,108 | 15,250 |
బొగ్గు | 2,97,000 | 4,93,000 |
ఇనుప ఖనిజం | 75,723 | 2,23,544 |
క్రోమైట్ | 1,515 | 3,976 |
49. అతి తక్కువగా వెలికి తీసిన ఖనిజాలు ఏవి?
జవాబు:
బాక్సైట్, క్రోమైట్.
50. ఖనిజాలు అధికంగా వెలికితీయటం వలన కలిగే సమస్య కానిది.
→ అటవీ నిర్మూలన → కాలుష్యం అధికమవుతుంది → భవిష్యత్తు ఖనిజాల సమస్య → పారిశ్రామికాభివృద్ధి,
జవాబు:
పారిశ్రామికాభివృద్ధి.
51. క్రింది చిత్రంను పరిశీలించి, ఇది ఏ ఉద్యమంనకు సంబంధించినదో పేర్కొనండి.
జవాబు:
చిప్కో ఉద్యమం.
52. పర్యావరణ నేపధ్యంలో క్రింద ఇచ్చిన చిత్రానికి ఒక శీర్షిక రాయండి.
జవాబు:
పర్యావరణ పరిరక్షణ – మన తక్షణ కర్తవ్యం (లేదా) పర్యావరణ పరిరక్షణకై ఉద్యమం.
53. సహజ వనరులను అందించటంలో పర్యావరణ సామర్థ్యాన్ని ఏ విధంగా పిలుస్తారు ?
జవాబు:
మేథాపాట్కర్.
54. నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు ఎవరు?
జవాబు:
పర్యావనరుల సరఫరా విధి.
10th Class Social 12th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
సుస్థిర అభివృద్ధి అనగానేమి?
జవాబు:
భవిష్యత్ తరాలు తమ అవసరాలను తీర్చుకొనే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకుంటూ అభివృద్ధి సాధించడం.
ప్రశ్న 2.
రాచెల్ కార్సన్ పుస్తకం ‘సైలెంట్ స్ప్రింగ్’ ముఖ్య ఇతివృత్తం (Theme) ఏమిటి?
జవాబు:
దోమల నియంత్రణ కోసం డి.డి.టి. పిచికారి చెయ్యటం వల్ల మనుషులపై, పక్షులపై పడే ప్రభావం గురించి తెలియజేయడం.
ప్రశ్న 3.
భారతదేశంలో అన్నిచోట్ల అటవీ విస్తీర్ణం తగ్గిపోతున్నది. అటవీ నిర్మూలనను నిరోధించడానికి రెండు పరిష్కారాలను తెలియజేయండి.
జవాబు:
అటవీ నిర్మూలనను నిరోధించడానికి పరిష్కారాలు : –
- అడవుల నరికివేత నియంత్రించడం.
- వాల్టా చట్టాన్ని సమర్థవంతంగా అమలుపరచడం.
ప్రశ్న 4.
ఒకవేళ నీవే అడవుల నరికివేతను నివారించే అధికారివి అయివుంటే, దానికై నీవు తీసికొనే రెండు చర్యలను పేర్కొనుము.
జవాబు:
ఒక వేళ నేనే అడవుల నరికివేతను నివారించే అధికారిని అయివుంటే,
- అటవీ చట్టాలను పకడ్బందీగా అమలుపరుస్తాను.
- అటవీ సంరక్షణ గురించి ప్రజలను చైతన్యపరుస్తాను.
ప్రశ్న 5.
చిప్కో ఉద్యమము యొక్క ఉద్దేశ్యము తెల్పండి.
జవాబు:
చిప్కో ఉద్యమము యొక్క ఉద్దేశ్యము : అటవీ పరిరక్షణ.
ప్రశ్న 6.
పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఏవేని నినాదాలు వ్రాయుము.
జవాబు:
పర్యావరణ పరిరక్షణ – నినాదాలు:
- పర్యావరణాన్ని కాపాడండి – ప్రపంచాన్ని కాపాడండి.
- మంచి పర్యావరణంతోనే – మంచి భవిష్యత్తు.
ప్రశ్న 7.
సుస్థిరాభివృద్ధి అనగా నేమి?
జవాబు:
సుస్థిరాభివృద్ధి :
సుస్థిరాభివృద్ధి అనగా భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బ తీయకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకోవడం.
ప్రశ్న 8.
‘సైలెంట్ స్ప్రింగ్’ పుస్తకంలోని ప్రధాన అంశాన్ని తెల్పండి.
జవాబు:
దోమల నియంత్రణ కోసం డి.డి.టి. పిచికారి చెయ్యటం వల్ల మనుషులపై, పక్షులపై పడే ప్రభావం గురించి తెలియజేయడం.
ప్రశ్న 9.
ఉత్పత్తి ప్రక్రియలో సహాయపడే సహజ వనరులేవి?
జవాబు:
భూమి, నీరు, ఖనిజాలు, చెట్ల నుంచి వచ్చే ఉత్పత్తులు, పశువులు వంటివి ఉత్పత్తి ప్రక్రియలో సహాయపడే సహజ వనరులు.
ప్రశ్న 10.
భూగర్భజలాల వినియోగం ఏ ఏ ప్రాంతాలలో ఎక్కువగా ఉంది?
జవాబు:
వ్యవసాయపరంగా సంపన్నంగా ఉన్న పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోను, మధ్య, దక్షిణ పీఠభూములలోని రాతి ప్రాంతాలలోనూ, కొన్ని కోస్తా ప్రాంతాలలోను, వేగంగా పెరుగుతున్న పట్టణ ప్రాంతాలలోనూ భూగర్భజలాల వినియోగం ఎక్కువగా ఉంది.
ప్రశ్న 11.
సైలెంట్ స్ప్రింగ్ (నిశ్శబ్ద వసంతం) అనే పుస్తకాన్ని రచించినదెవరు?
జవాబు:
సైలెంట్ స్ప్రింగ్ (నిశ్శబ్ద వసంతం) అనే పుస్తకాన్ని రచించింది : రాచెల్ కార్సన్ అనే మహిళ.
ప్రశ్న 12.
జలసింధి గ్రామంలో ఇళ్ళ నిర్మాణం ఎలా చేపడతారు?
జవాబు:
అడవిలో దొరికే టేకు, వెదురుతో ఇళ్ళు నిర్మించుకుంటారు. నింగోండి, హియాలీ రకం వెదురును చీల్చి తడికలు అల్లుతారు.
ప్రశ్న 13.
వ్యవసాయంలో మేలు చేసే జంతుమిత్రులు ఎవరు?
జవాబు:
జంతువులు : పాము, వానపాము, బల్లి, తొండ, ఊసరవెల్లి, ఉడుం మొ||నవి.
ప్రశ్న 14.
వ్యవసాయంలో మేలు చేసే పక్షుల మిత్రులు ఎవరు?
జవాబు:
పక్షులు :
పోలీస్ పిట్ట, గోరింక, బయోపిచ్చుక, గుడ్లగూబ, కొంగ, పాలపిట్ట.
ప్రశ్న 15.
వ్యవసాయంలో కీడుచేసే శత్రు పక్షులు, జంతువులు ఏవి?
జవాబు:
పక్షులు :
పిచ్చుక, చిలుక
జంతువులు :
ఎలుక, ఉడుత, ‘కుందేలు, మొ||నవి.
ప్రశ్న 16.
ప్రాథమికరంగ కార్యకలాపాలు ఏవి?
జవాబు:
వ్యవసాయం, గనుల తవ్వకం, చేపల పెంపకం ప్రాథమిక రంగ కార్యకలాపాలు.
ప్రశ్న 17.
ఆర్థికాభివృద్ధిలో పర్యావరణం అందించే సామర్థ్యాన్ని ఏమంటారు?
జవాబు:
వనరులను అందించటంలో పర్యావరణ సామర్థ్యాన్ని “పర్యావరణ వనరుల సరఫరా విధి” అంటాం.
ప్రశ్న 18.
పర్యావరణం నిర్వర్తించే ముఖ్య విధి ఏమిటి?
జవాబు:
వివిధ కార్యక్రమాల ద్వారా విడుదలయ్యే వ్యర్థాలను శుద్ధిచేసి, ప్రమాదరహితంగా చేయటం.
ప్రశ్న 19.
రాచెల్ కార్సన్ రాసిన పుస్తకమేది? అందులో ఏముంది?
జవాబు:
రాచెల్ కార్సన్ అన్న మహిళ “సైలెంట్ స్ప్రింగ్” (నిశ్శబ్ద వసంతం) అన్న పుస్తకం రాసింది. దోమల నియంత్రణ కోసం డిడిటి పిచికారీ చెయ్యటం వల్ల మనుష్యులపైన, పక్షుల పైనా పడే ప్రభావం గురించి వివరించింది.
ప్రశ్న 20.
ఎండోసల్ఫాన్ పురుగుమందు దుష్ఫలితాలేవి?
జవాబు:
గాలి, నీళ్ళు, మొత్తం పర్యావరణం ఎండోసల్ఫాతో కలుషితమైనది. ప్రజల మీద దాని ప్రభావం ఎక్కువగా పడింది.
ప్రశ్న 21.
జలసింధి గ్రామంలో పశుసంపద ఏది?
జవాబు:
జలసింధి గ్రామంలో పశుసంపద కోళ్ళు, గొర్రెలు, ఆవులు, గేదెలు. దాదాపు ప్రతి ఒక్కరికి 10-20-40 మేకలు ఉన్నాయి.
ప్రశ్న 22.
చిప్కో ఉద్యమం ఎందుకు మొదలైంది?
జవాబు:
చెట్లు నరకటాన్ని అడ్డుకుని, గుత్తేదార్లు, కాంట్రాక్టర్ల నుంచి ముప్పును ఎదుర్కొంటున్న గఢ్ వాల్ కొండవాసుల సంప్రదాయ అటవీ హక్కుల కోసం చిప్కో ఉద్యమం ప్రారంభమైంది.
ప్రశ్న 23.
సుస్థిర పద్ధతుల్లో ఆహార ఉత్పత్తి, దాని పంపిణీకి ఉదాహరణనిమ్ము.
జవాబు:
సుస్థిర పద్ధతుల్లో ఆహార ఉత్పత్తి, దాని సమాన పంపిణీకి చక్కని ఉదాహరణ ప్రత్యామ్నాయ ప్రజాపంపిణీ వ్యవస్థ. దీనిని . తెలంగాణలోని జహీరాబాద్ ప్రాంతంలో ప్రజాబృందాలు చేపట్టాయి.
ప్రశ్న 24.
ప్రత్యామ్నాయ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా చేపట్టే కార్యక్రమాలు ఏవి?
జవాబు:
వర్షాధార భూములను సాగులోకి తేవడం, పంట బయట అమ్మకుండా గ్రామస్థాయిలో ప్రజాధాన్య బ్యాంకు ప్రారంభించడం, ప్రజాపంపిణీ వ్యవస్థ మాదిరి పనిచేయడం ప్రత్యామ్నాయ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా చేపట్టే కార్యక్రమాలు.
ప్రశ్న 25.
హరిత విప్లవం ద్వారా ఏ ఏ పంటలకు ప్రాధాన్యం ఇచ్చారు?
జవాబు:
హరిత విప్లవం ద్వారా గోధుమ, వరికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ పంటల ఆహారధాన్యాలే ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా చౌకధరల దుకాణాలలో లభించేవి.
ప్రశ్న 26.
మిశ్రమ పంటల వలన లాభమేమి?
జవాబు:
మిశ్రమ పంటల వల్ల ఒక పురుగు తీవ్ర నష్టం కలిగించే స్థాయికి చేరకుండా నిరోధింపబడుతుంది. సాగుచేసే పంటల నేలకి, మనుషులకు, పశువులకు సమతుల పోషకాహారాన్ని ఇచ్చేలా ఎంపిక చేస్తారు.
ప్రశ్న 27.
సేంద్రియ వ్యవసాయం వల్ల లాభమేమి?
జవాబు:
సేంద్రియ వ్యవసాయం వల్ల జీవవైవిధ్యం పెరుగుతుంది. ఒకటి, రెండు పంటలే కాకుండా అనేక పంటలను సాగుచెయ్యవచ్చు. హానికరమైన పురుగులను తినే జీవులను ప్రోత్సహించడం కూడా సాధ్యమవుతుంది.
ప్రశ్న 28.
ప్రాథమిక హక్కులలోని జీవించే హక్కు ఏమి చెబుతుంది?
జవాబు:
ప్రాథమిక హక్కులలోని జీవించే హక్కు జీవితాన్ని పూర్తిగా ఆనందించటానికి కాలుష్యరహిత నీటిని, గాలిని పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
ప్రశ్న 29.
అభివృద్ధికి కొలబద్దలుగా వేటిని పరిగణిస్తారు?
జవాబు:
అభివృద్ధికి కొలబద్దగా తలసరి ఆదాయం, స్థూల జాతీయోత్పత్తులకంటే మానవ అభివృద్ధి సూచిక మెరుగైనది.
ప్రశ్న 30.
HDI అనగానేమి?
జవాబు:
HDI : Human Development Index (మానవ అభివృద్ధి సూచిక).
ప్రశ్న 31.
భూగర్భజలాల పునరుద్ధరణ అనగానేమి?
జవాబు:
భూమిలోనికి ఇంకిపోయిన నీటిని తోడుకోవడానికి వీలుగా చేయడాన్ని ‘భూగర్భజలాల పునరుద్ధరణ’ అంటారు. దీనికి ఎక్కువగా వర్షం సహకరిస్తుంది.
10th Class Social 12th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
భారతదేశంలో కొన్ని కీలక ఖనిజాల త్రవ్వకమును సూచించు పట్టికను పరిశీలించండి.
పట్టిక : ఖనిజాల త్రవ్వకం (వేల టన్నులలో)
ఖనిజం | 1997-98 | 2008-09 |
బాక్సైట్ | 6,108 | 15,250 |
బొగ్గు | 2,97,000 | 4,93,000 |
ఇనుప ఖనిజం | 75,723 | 2,23,544 |
క్రోమైట్ | 1,515 | 3,976 |
పై పట్టికను పరిశీలించి, గనుల త్రవ్వకము వేగంగా అభివృద్ధి చెందటం వల్ల పర్యావరణానికి ఏ విధమైన నష్టము జరుగుతుందో విశ్లేషించండి.
జవాబు:
- ఖనిజాలు అధికంగా వెలికితీయటం వలన అనేక పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతాయి.
- ఉష్ణోగ్రతలు పెరిగి మనుషులకు సమస్యలు ఏర్పడతాయి.
- అటవీ ప్రాంతాలు, వివిధ జంతువులు, పక్షులు, జీవరాసులు నశిస్తాయి.
- కాలుష్యం అధికమవుతుంది.
- మృత్తికా క్రమక్షయం జరిగి జలాశయాలలో ఇసుక మేట వేయడం జరుగుతుంది.
ప్రశ్న 2.
పర్యావరణ పరిరక్షణను గురించి ప్రజలను చైతన్య పరచడానికి రెండు నినాదాలు రాయండి.
జవాబు:
“పర్యావరణాన్ని కాపాడితే – ప్రపంచాన్ని కాపాడినట్లే”
“చెట్లను రక్షించండి – కాలుష్యాన్ని నివారించండి.”
“భూమిని రక్షించండి – మీ జీవితాన్ని కాపాడుకోండి.”
ప్రశ్న 3.
ఒక దేశ అభివృద్ధిలో పర్యావరణ ప్రాముఖ్యతను తెలియజేయుము.
జవాబు:
ఒక దేశ అభివృద్ధిలో పర్యావరణ ప్రాముఖ్యత :
- భూమి, నీరు, ఖనిజాలు వంటి సహజ వనరుల లభ్యత.
- చెట్లు, పశువుల నుంచి వచ్చే ఉత్పత్తులు.
- ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ రంగాలు సహజ వనరులు మీద ఆధారపడి ఉంటాయి.
- వాతావరణ కాలుష్యం దేశ అభివృద్ధికి నిరోధకంగా ఉంటుంది.
ప్రశ్న 4.
సేంద్రీయ వ్యవసాయం జీవవైవిధ్యాన్ని ఎలా పెంపొందింస్తుందో తెలపండి.
జవాబు:
- సేంద్రీయ వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగుమందులను వినియోగించరు.
- పర్యావరణానికి అనుకూలంగా ఉండే వ్యవసాయ పద్ధతులను పాటిస్తారు.
- పంట మార్పిడి, కంపోస్టు వినియోగము, స్థానికవనరులను వినియోగించడం వంటి పద్ధతులను పాటిస్తారు.
- సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న కొన్ని సేవలు విస్తరించాయి.
ప్రశ్న 5.
నేటి కాలంలో సుస్థిరాభివృద్ధిపై దృష్టి నిలపవలసిన అవసరమెందుకు ఏర్పడింది?
జవాబు:
- ప్రస్తుత, భవిష్యత్ తరాల అవసరాలు తీర్చడం
- ప్రస్తుత, రాబోయే తరాలకు నాణ్యమైన జీవనాన్ని అందించడం
- భూసార సంరక్షణ
- నీటి కాలుష్యం కాకుండా చూడడం
- పరిశ్రమలు వెదజల్లే విషవాయువుల నియంత్రణ
ప్రశ్న 6.
‘సుస్థిర అభివృద్ధి’ ప్రాముఖ్యతపై కరపత్రం తయారు చేయండి.
జవాబు:
సుస్థిర అభివృద్ధి’ ప్రాముఖ్యతపై కరపత్రం
భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చటమే సుస్థిర అభివృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు కేవలం మన కొరకే కాదు భవిష్యత్తు తరాల వారికీ అవసరం. ప్రస్తుత అభివృద్ధి భావన ఆ విధంగా ఉండటం లేదు.
ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికీకరణ పేరుతో ప్రకృతి వనరులను ధ్వంసం చేసే తీరు చూస్తోంటే రాబోయే తరాలు తమ అవసరాలకై ఎన్ని ఇబ్బందులకు గురవుతారో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. సహజ వనరులైన నీరు, గాలి, నేల మొదలైన వాటిని ఉపయోగించుకొనే హక్కు అన్ని తరాలకూ వుంటుంది. మనం దీనిని దృష్టిలో ఉంచుకొని వ్యవహరించకుండా వనరులను, ఇంధనాన్ని విచక్షణా రహితంగా వినియోగిస్తున్నాము.
సహజ వనరులు మనకు ఏ మేరకు అవసరమో ఆ మేరకే వినియోగించాలి. ఈ భావన ప్రజలందరిలో విస్తృతంగా వ్యాపించాలి. వేగవంతమైన ఆర్థికాభివృద్ధి వల్ల అనేక రంగాలలో ఇప్పటికే మనం వ్యతిరేక పరిణామాలను చవిచూస్తున్నాం. పర్యావరణంపై ఆధారపడి అనేక వేల సమూహాలు నివసిస్తున్నాయి. పర్యావరణాన్ని విధ్వంసం చెయ్యటమంటే ఈ సమూహాలను మట్టు పెట్టడమే.
కావున ప్రభుత్వం ఈ విషయమై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. పర్యావరణానికి హాని తలపెట్టేవారిపై, పర్యావరణ చట్టాలను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రగతితోపాటు పర్యావరణ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. పేదరికం నుండి బయటపడటానికి పర్యావరణరీత్యా సుస్థిర మార్గాన్ని కనుగొనాలి. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి, సమానతతో కూడిన సుస్థిర అభివృద్ధి భావన సఫలమయ్యే విధంగా తగిన చర్యలు చేపట్టడం ఆవశ్యకం.
ప్రశ్న 7.
పర్యావరణ ‘వనరుల సరఫరా విధి’ మరియు ‘శుద్ధి చేసే విధి’ ల మధ్య తేడా తెల్పండి.
జవాబు:
పర్యావరణ ‘వనరుల సరఫరా విధి’ మరియు ‘శుద్ధి చేసే విధి’ ల మధ్య గల తేడా :
పర్యావరణ ‘వనరుల సరఫరా విధి’:
సహజవనరులను అందించడంలో పర్యావరణమునకు గల సామర్థ్యాన్ని “పర్యావరణ వనరుల సరఫరా విధి” అంటారు. పర్యావరణ శుద్ధి చేసే విధి : కాలుష్యాన్ని గ్రహించి ప్రమాదరహితంగా మార్చడంలో పర్యావరణమునకు గల సామర్థ్యాన్ని పర్యావరణ శుద్ధిచేసే విధి అంటారు.
ప్రశ్న 8.
సహజ వనరులను వేగంగా సంగ్రహించడం భవిష్యత్తు అభివృద్ధి అవకాశాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? వివరించండి.
జవాబు:
సహజ వనరులను వేగంగా సంగ్రహించడం వల్ల భవిష్యత్తు అభివృద్ధి అవకాశాలపై కలిగే ప్రభావం :
- సహజ వనరులను పరిమితికి మించి వినియోగించడం మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవడం వంటిది.
- అది భవిష్యత్ అభివృద్ధిని తీవ్రంగా దెబ్బతీస్తుంది.
- పునరుద్ధరించడానికి సాధ్యంకాని సహజవనరులను ఒక్కసారి పూర్తిగా వాడేస్తే భవిష్యత్తు తరాలకు జీవించడమే అసాధ్యమవుతుంది.
- సహజవనరులను కొల్లగొట్టడం ద్వారా చేసే అభివృద్ధి మారువేషంలో ఉన్న విధ్వంసమే అని చెప్పవచ్చు.
ప్రశ్న 9.
సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ కరపత్రము తయారు చేయండి.
జవాబు:
సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రకృతి సిద్ధమైన పర్యావరణ అనుకూలమైన జీవాధారిత వ్యవసాయంగా వర్ణించవచ్చు.
సేంద్రియ వ్యవసాయం జీవుల వైవిధ్యాన్ని, జీవుల వివిధ దశలను మరియు నేలలో గల సూక్ష్మజీవుల పనితనాన్ని వృద్ధి పరుస్తుంది. ముఖ్యంగా ప్రాంతీయంగా లభించే వనరులతో వ్యవసాయం చేయుటకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ హానికర రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని విస్మరిస్తూ సేద్య, జీవ సంబంధ మరియు యాంత్రిక పద్ధతులతో F.A.O., W.H.D., పరిధి ప్రాప్తికి వ్యవసాయం చేయుటకు అవకాశం కల్పిస్తుంది.
సేంద్రియ వ్యవసాయం వలన మనకు చాలా లాభాలు ఉన్నాయి.
- నేల సంరక్షించబడుతుంది.
- అతి తక్కువ లోతులో దుక్కి చేయగలము. దీని వలన సూక్ష్మజీవులు, ప్లవకాల సంఖ్య (ఫోరా, ఫానా) ఎక్కువగా ఉంటుంది.
- మిశ్రమ పంటలు : దీని వలన పురుగుల తాకిడిని తగ్గించగలము.
- పంటమార్పిడి : దీని వలన నేలను ఆరోగ్యంగా ఉంచగలము. సూక్ష్మజీవులు సహజసిద్ధంగా పనిచేయుటకు దోహదపడుతుంది.
- సేంద్రియ పదార్థములను పునరుత్పత్తి చేయగలము. కావున ప్రభుత్వము ప్రజలను సేంద్రియ వ్యవసాయ పద్ధతులు
వైపు ప్రోత్సహించవలెను. సేంద్రియ వ్యవసాయం వలన ప్రజలలో ప్రబలుతున్న రోగాలను నిరోధించవచ్చును. ప్రజలకు పౌష్టిక ఆహారాన్ని అందించగలము.
ముగింపు :
ప్రస్తుతం వ్యవసాయదారులు లాభాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ దిగుబడి కోసం కొన్ని రకాలైన రసాయనిక విధానాలను అనుసరించడం వలన నేల సారాన్ని కోల్పోవడమే కాకుండా వారు పర్యావరణాన్ని కాలుష్యానికి గురిచేస్తూ వారు అనారోగ్యం పాలవుతున్నారు.
నా విజ్ఞప్తి ఏమిటంటే వ్యవసాయదారులు అందరూ సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరిస్తే మన సమాజానికి, దేశానికి చాలా మేలు చేసినవారు అవుతారు.
కాపీల సంఖ్య : 2500
” ప్రచురణ కర్త :
సంక్షేమ సంస్థ
ప్రశ్న 10.
ముఖ్యమైన పర్యావరణ సమస్యలేవి?
జవాబు:
కాలానుగుణంగా మానవ వినియోగంలో మార్పు వల్ల పర్యావరణపరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం.
- పురుగుమందుల వినియోగం
- శిలాజ ఇంధనాల మీద ఆధారపడటం
- వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వినియోగం
- భూగర్భజలాలు తరిగిపోవడం
- కాలుష్యం పెరుగుతుండడం
- శీతోష్ణస్థితిలో మార్పు
ప్రశ్న 11.
పర్యావరణం నిర్వర్తించే అతి ముఖ్యమైన విధి ఏది?
జవాబు:
పర్యావరణం నిర్వర్తించే ముఖ్యమైన విధి ఏమనగా, వివిధ కార్యక్రమాల ద్వారా విడుదలయ్యే. వ్యర్థాలను శుద్ధిచేసి, ప్రమాదరహితంగా చేయటం. ఉత్పత్తి, వినియోగాలలో నిరుపయోగమైన ఉప ఉత్పత్తులు, ఉదాహరణకు ఇంజన్ల నుండి వెలువడే పొగ, శుభ్రం చెయ్యటానికి ఉపయోగించిన నీళ్ళు, పారేసిన అట్టపెట్టెలు, వస్తువులు వంటి వాటిని పర్యావరణం శుభ్రం చేస్తుంది.
ప్రశ్న 12.
దోమల నియంత్రణ కోసం డిడిటి పురుగుమందు కలిగించే అనర్థాలు ఏవి?
జవాబు:
డిడిటి పురుగుమందులోని భారలోహాలు పర్యావరణంలో కరిగిపోకుండా జీవులలో పేరుకునిపోతాయి. డిడిటి ఉన్న నీళ్ళు చెరువులలోకి చేరి కలుషితం చేసినప్పుడు డిడిటి లోని విషపదార్థం ఆ చెరువుల్లోని చేపల్లో పేరుకోవటం మొదలవుతుంది. ఆ ఈ విష మోతాదు తక్కువగా ఉండి చేపలు చనిపోవు. కానీ ఒక పక్షి అనేక చేపలను తిన్నప్పుడు వాటన్నిటిలో ఉండే అధిక విషమోతాదు ఆ పక్షిని చంపటానికి కారణమవుతుంది.
ప్రశ్న 13.
జలసింధి గ్రామంలో ప్రజలు పండించే పంటలేవి?
జవాబు:
జలసింధి గ్రామంలో ప్రజలు వారి యొక్క శ్రమతోనే వ్యవసాయం చేస్తారు. పశువుల నుంచి వచ్చే ఎరువునే వాడి నాణ్యమైన విత్తనాలను వాడుతారు. వీరికి ప్రధాన ఆహారం మొక్కజొన్న, వారి యొక్క అటవీ భూమిలో సజ్జలు, జొన్నలు, శనగలు, మిటికెలు, మినుములు, నువ్వులు, పల్లీలు పండిస్తారు.
ప్రశ్న 14.
జలసింధి గిరిజన గ్రామం యొక్క ఆరాధ్య దేవతలు ఎవరు? వారు జరుపుకొనే పండుగలు ఏవి?
జవాబు:
జలసింధి గిరిజన గ్రామంలో వారి యొక్క పూర్వీకులు చనిపోయిన తర్వాత ఒక పెద్దరాతిని పెట్టి వారి జ్ఞాపకార్థం పూర్వీకులను పూజిస్తారు.
కాలో రానో, రాజా పాంతో, ఇంది రాజాలను పూజిస్తారు. ఆయి ఖాడా, భేడు బాయిని కూడా పూజిస్తారు. రాణి కాజోల్ వారి పెద్ద దేవత. ఇందల్, దివస, ధివాలి వంటి పండుగలు జరుపుకోటానికి అందరూ ఉత్సాహం చూపుతారు.
ప్రశ్న 15.
బావా మహాలియా ఆవేదనను క్లుప్తంగా రాయండి.
జవాబు:
బావా మహాలియా జలసింధి గ్రామ గిరిజన నాయకుడు. సర్దార్ సరోవర్ ఆనకట్ట వలన తమ గ్రామం ముంపునకు గురవుతుందని భావించి, ఆవేదనతో ముఖ్యమంత్రికి ఉత్తరం ద్వారా వివరిస్తూ, అడవే తమకు ఆధారమని, అడవిలోని ప్రతి చెట్టు, పొద, మొక్క పేరు తెలుసని, వాటి ఉపయోగాలు కూడా తెలుసంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కష్టాన్నే నమ్ముకొని, శ్రమ ద్వారా వ్యవసాయం చేసి, సంప్రదాయ ఆచారాలకు విలువనిస్తూ జంతువులతో మచ్చిక చేసుకొని, అడవితో కలిసిపోయామని ఆవేదన చెందాడు.
ప్రశ్న 16.
సేంద్రియ వ్యవసాయం గూర్చి రాయండి.
జవాబు:
వ్యవసాయ రంగంలో సేంద్రియ పద్దతులు సారవంతమైనవి. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు రసాయనిక ఎరువులు, పురుగుమందులను వినియోగించరు. ఇందుకు బదులుగా పంటమార్పిడి, పెంటపోగు ఎరువు పురుగుల జైవిక నియంత్రణ వంటి సహజ పద్దతులను అవలంబిస్తారు. ఈ విధానంలో ముఖ్యమైన లక్షణం స్థానిక వనరులను వినియోగించటం, మిత్ర, కీటకాలను రక్షించడం.
ప్రశ్న 17.
రసాయనిక పురుగుల మందు పర్యావరణంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వివరించండి.
జవాబు:
- రసాయనిక పురుగుల మందు వినియోగం పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
- ఒక స్థాయిని మించిన విషపదార్థాలను పర్యావరణం జీర్ణించుకోలేదు.
- పురుగుల మందులలోని భారలోహాలు పర్యావరణంలో కరిగిపోకుండా జీవులలో పేరుకొనిపోతాయి.
- గాలి, నీళ్ళు, మొత్తం పర్యావరణం ఎండోసల్ఫాతో ప్రభావితమైన ఘటన కేరళలోని కాసర్ గోలో జరిగింది.
ప్రశ్న 18.
భారతదేశంలో శతకోటీశ్వరులకు ఉన్న మొత్తం సంపద (బిలియన్ రూ॥లలో) గ్రాఫ్ రూపంలో వివరించుము.
జవాబు:
భారతదేశంలో శతకోటీశ్వరులకు ఉన్న మొత్తం సంపద (బిలియన్ రూ||లలో)
ప్రశ్న 19.
భారతదేశంలో శతకోటీశ్వరుల (బిలియనీర్ల) సంఖ్య పెరుగుదలను సూచించే గ్రాఫ్ గీయండి.
జవాబు:
భారతదేశంలో శతకోటీశ్వరులు (బిలియనీర్ల) సంఖ్య పెరుగుదల
ప్రశ్న 20.
అభివృద్ధికి కొలబద్దగా మానవ అభివృద్ధి సూచికను (HDI) తీసుకోవడం ఎంతవరకు సమంజసం?
జవాబు:
- అభివృద్ధికి కొలబద్దగా తలసరి ఆదాయం , స్థూల జాతీయోత్పత్తి కంటే మానవాభివృద్ధి సూచిక మెరుగైనది.
- ఉత్పత్తి, ఆదాయాలు వేగంగా పెరుగుతున్నప్పటికీ అధిక శాతం ప్రజలు పోషకాహార లోపంతోనూ, విద్యా, వైద్య సదుపాయాలు అందని పరిస్థితులు ఉంటున్నాయి.
- అయితే అభివృద్ధిలో సామాజిక సూచికలైన విద్య, వైద్యం వంటివి చోటుచేసుకొనేలా మానవ అభివృద్ధి సూచిక చూస్తుంది.
ప్రశ్న 21.
‘పర్యావరణ వనరుల సరఫరా విధి’ గురించి వివరించండి.
జవాబు:
- ఉత్పత్తి ప్రక్రియలో భూమి, నీరు, ఖనిజాలు, చెట్ల నుంచి వచ్చే ఉత్పత్తులు, పశువులు వంటి సహజవనరులు ఎంతో ముఖ్య మైనవి.
- వ్యవసాయం, గనుల తవ్వకం వంటి ప్రాథమికరంగ కార్యకలాపాల్లోనే కాకుండా తయారీ, ఇంధన రంగాలలో కూడా సహజ వనరుల మీద ఉత్పత్తి ప్రధానంగా ఆధారపడి ఉంది.
- ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాలు కూడా వివిధ స్థాయిలలో సహజ వనరుల మీద ఆధారపడి ఉన్నాయి.
- ఈ వనరులను అందించడంలో పర్యావరణ సామర్థ్యాన్ని ‘పర్యావరణ వనరుల సరఫరా విధి’ అంటారు.
ప్రశ్న 22.
తక్కువ ఆదాయం వచ్చేవారి శాతం ఎక్కువగా ఉన్నప్పుడు స్థూల జాతీయోత్పత్తి పెరుగుతూ ఉండడం అంటే పెరుగుతున్న వస్తువులు, సేవలవల్ల కొద్దిమంది మాత్రమే ప్రయోజనం పొందుతున్నారని అర్థం. దీనిని చదివి, వ్యాఖ్యానించండి.
జవాబు:
- ఒక దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు, సేవల విలువను GDP సూచిస్తుంది.
- అయితే అభివృద్ధిని కేవలం వస్తువులు, సేవల ఉత్పత్తికే పరిమితం చెయ్యలేం.
- ఉత్పత్తి, ఆదాయాలు పెరిగినపుడు కూడా తక్కువ ఆదాయం వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటే దానివల్ల వారు ప్రయోజనం పొందలేదని అర్థం.
- అయితే పెరిగిన స్థూల జాతీయోత్పత్తి వల్ల కొద్దిమందే ప్రయోజనం పొందితే అది హర్షణీయం కాదు.
ప్రశ్న 23.
శుద్ధిచేయు విధి అనగానేమి?
జవాబు:
పర్యావరణం నిర్వర్తించే వాటిలో ఒక విధిని శుద్ధిచేయు విధి అంటారు.
వివిధ కార్యక్రమాల ద్వారా విడుదలయ్యే వ్యర్థాలను శుద్ధిచేసి, ప్రమాదరహితంగా చేయటం. ఉత్పత్తి వినియోగాలలో నిరుపయోగమైన ఉప ఉత్పత్తులు – ఉదాహరణకు ఇంజన్ల నుండి వెలువడే పొగ, శుభ్రం చెయ్యటానికి ఉపయోగించిన నీళ్ళు, పారేసిన పనికిరాని అట్టపెట్టెలు, వస్తువులు వంటి వాటిని పర్యావరణం శుభ్రం చేస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విధి. కాలుష్యాన్ని పర్యావరణం గ్రహించి ప్రమాదరహితంగా మార్చే శక్తిని, ‘శుద్ధిచేయు విధి’ అని అంటారు.
10th Class Social 12th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
క్రింది గ్రాఫ్ చిత్రపటమును పరిశీలించండి.
భారతదేశంలోని సమాజ అంతరాలను గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
- భారతదేశంలో 30 లక్షల కుటుంబాలకు ఆదాయం 17 లక్షలకు పైగా ఉంది.
- 3 కోట్ల 10 లక్షల కుటుంబాలకు ఆదాయం 3.4 లక్షల రూపాయల నుండి 17 లక్షల రూపాయల వరకు ఉంది.
- 7 కోట్ల 10 లక్షల కుటుంబాలకు ఆదాయం 1.5 లక్షల నుండి 3.4 లక్షల రూపాయల మధ్య ఉంది.
- 13 కోట్ల 50 లక్షల కుటుంబాలకు ఆదాయం 1.5 లక్షల కంటే తక్కువగా ఉంది.
- మనదేశంలో 90% పైగా ప్రజలు అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు.
- పై చిత్రాన్ని పరిశీలిస్తే ధనికులు మరింత ధనవంతులుగానూ, పేదవారు మరింత పేదవారుగానూ మారుతున్నారు.
- ఆదాయంలోనూ, సంపదలోనూ మరియు అవకాశాలలోనూ అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
- ఈ ఆదాయ అసమానతలు సమసమాజానికి అవరోధంగా ఉన్నాయి.
ప్రశ్న 2.
ఈ క్రింది పేరా చదివి నీ అభిప్రాయం రాయుము.
స్థానిక పర్యావరణం నుండి నిర్వాసితులు కావటం వల్ల నష్టపోయేది ప్రజలు ఒక్కరే కాదన్నది ముఖ్యంగా గుర్తించాలి. ప్రజలతోపాటు సాంప్రదాయ జ్ఞానం మాయమైపోతుంది. సుసంపన్నమైన పర్యావరణ జీవ వైవిధ్యత అంతరించిపోతుంది.
జవాబు:
నిర్మించిన ఆనకట్టలలోకెల్లా సర్దార్ సరోవర్ అతి పెద్దది. దీనివల్ల 37,000 హెక్టార్ల అడవి, వ్యవసాయ భూమి ముంపునకు గురి అవుతుంది. అయిదు లక్షలకు పైగా ప్రజలు దీనివల్ల నిర్వాసితులు అవుతున్నారు. భారతదేశంలోని అత్యంత సారవంతమైన నేలలు దీనివల్ల నాశనం అవుతాయి. వేలాది ఎకరాలలో అటవీ ప్రాంతం, వ్యవసాయ భూమి ముంపునకు గురికావటం వలన జీవ వైవిధ్యత మానవ జీవితాలు ధ్వంసం అయ్యాయి. నిర్వాసితులలో ఎక్కువ శాతం ఆదివాసీలు, దళితులు.
పర్యావరణం అందుబాటులో ఉన్నప్పుడు దానినుంచి వాళ్ళ అనేక అవసరాలు తీరతాయి. అదే లేకపోతే వీటికి డబ్బులు చెల్లించాల్సి వస్తుంది.
నిర్వాసితులైనందువల్ల పర్యావరణం అందుబాటులో లేకుండా పోయినా, లేదా అది కలుషితమైనా, విధ్వంసమైనా ‘ ఎక్కువగా నష్టపోయేది పేదవాళ్ళే. పర్యావరణం, సుస్థిరత అన్న అంశాలు సమానత అన్న అంశంతో బలంగా ముడిపడి ఉన్నాయి.
ప్రశ్న 3.
ప్రజల జీవనశైలి పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ? పర్యావరణ పరిరక్షణకై నీవు ఏ సూచనలు ఇస్తావు?
జవాబు:
- అత్యంత ఆనందంగా జీవితాన్ని గడపడానికి ప్రస్తుతకాలంలో మానవుడు ప్రయత్నిస్తున్నాడు.
- కనీసం బజారు నుండి కూరగాయలు తీసుకురావడానికి కూడా తన చేతిలో గుడ్డ సంచిని తీసుకుని వెళ్ళకుండా దుకాణదారులు ఇచ్చే ప్లాస్టిక్ సంచిని వాడుతున్నాడు.
- ప్లాస్టికను అతిగా ఉపయోగించడం వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుంది.
- వాహనాలు, ఎ.సి.లు, ఫ్రిట్లు మొదలగు వాటి వినియోగం పెరగడం వలన వాటి నుండి వెలువడే విషవాయువులు పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి.
- అడవుల నరికివేత, రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం ఎక్కువై భూమి, నీరు, గాలి కలుషితమవుతున్నాయి.
పర్యావరణ పరిరక్షణకు సూచనలు :
- ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి.
- తక్కువ దూరాలకు సైకిళ్ళను ఉపయోగించడం.
- రసాయన ఎరువుల, పురుగుమందుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువులను వాడడం.
- చెట్లను పెంచడాన్ని ప్రోత్సహించాలి.
ప్రశ్న 4.
ఈ పట్టికను పరిశీలించి, క్రింది ప్రశ్నలకు జవాబులు రాయుము.
భారతదేశంలో కొన్ని కీలక ఖనిజాల తవ్వకంలో పెరుగుదల (వేల టన్నులలో) | ||
ఖనిజం | 1997-98 | 2008-09 |
బాక్సెట్ | 6,108 | 15,250 |
బొగ్గు | 2,97,000 | 4,93,000 |
ఇనుప ఖనిజం | 75,723 | 2,23,544 |
క్రోమైట్ | 1,515 | 3,976 |
a) పై పట్టికలోని వివరాలు దేనిని తెలియజేస్తాయి?
b) ఇతర ఖనిజాలతో పోల్చినప్పుడు ఏ ఖనిజము యొక్క వెలికితీత 2008-09 నాటికి రెండింతల కన్నా ఎక్కువ కాలేదు?
C) గనుల తవ్వకం పెరగడానికి కారణాలేమై ఉంటాయి?
d) గనుల తవ్వకం వేగంగా వృద్ధి చెందటం వల్ల పర్యావరణానికి, మనుషులకు ఏ విధమైన నష్టాలు జరుగుతాయి?
జవాబు:
a) పై పట్టికలోని వివరాలు భారతదేశంలో కొన్ని కీలక ఖనిజాల తవ్వకంలోని పెరుగుదలను తెలియజేస్తాయి.
b) ఇతర ఖనిజాలతో పోల్చితే ‘బొగ్గు’ యొక్క వెలికితీత 2008-09 నాటికి రెండింతల కన్నా ఎక్కువ కాలేదు.
c) గనుల తవ్వకం పెరగడానికి కారణాలు :
- పరిశ్రమల సంఖ్య విరివిగా పెరగటం.
- గనుల తవ్వకంలో యంత్రాల వాడకం.
- వినియోగం పెరగడం, జనాభా పెరగడం వల్ల వస్తువుల వినియోగం పెరగడం.
- మానవులు సంపాదనకై (దురాశ) అర్రులు చాస్తు ఖనిజాలను విపరీతంగా తవ్వి పారేస్తున్నారు.
d) గనులు వేగంగా తవ్వటం వల్ల నష్టాలు :
- అడవులు అంతరించిపోయి పర్యావరణం దెబ్బతింటుంది.
- నదుల ప్రవాహ దిశ మారటం, ఫలితంగా తరచుగా వరదలు రావటం సంభవిస్తాయి.
- ఖనిజ వనరులు భవిష్య తరాలకు మిగలవు. తత్ఫలితంగా ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకోవాలి. విదేశీ మారక ద్రవ్యం ఖర్చయిపోతుంది.
ప్రశ్న 5.
మీ ప్రాంతంలోని పర్యావరణ సమస్యలపై మీ జిల్లా కలెక్టర్‌కు ఉత్తరం రాయుము.
జవాబు:
సింగ్ నగర్, గౌరవనీయులైన కలెక్టరు గారికి, మా ప్రాంతంలో వలస కూలీల సంఖ్య పెరిగింది. వారు వారి అవసరాలు తీర్చుకోవడానికి నగరానికి వచ్చి ఇక్కడ క్రొత్త సమస్యలను సృష్టిస్తున్నారు. నీటి సరఫరా కొరత, మురికివాడల పెరుగుదల, వ్యర్థ పదార్థాలను రోడ్ల మీద పడవేయడం వల్ల రవాణా మరియు కాలుష్యం పెరిగి పర్యావరణం దెబ్బతింటుంది. ప్లాస్టిక్ కవర్లను ఎక్కడ పడితే అక్కడ రోడ్లమీద వదలివేయడం, వాటిని తిన్న చాలా జంతువులు మరణించాయి. చెత్తాచెదారం పెరిగింది. దానిని సరిగా శుభ్రం చేయడం లేదు. భయంకరమైన దుర్గంధం వెలువడుతుంది. ఇవి వివిధ రకాల రోగాలకు కారణమవుతున్నాయి. నేను చేసుకునే విన్నపం ఏమిటంటే వీటిని బాగుచేయించటంతోపాటు కాలుష్యాన్ని కలిగించే పరిశ్రమలు ఊరికి దూరంగా ఏర్పాటుచేయడం వలన మరియు కాలుష్యానికి కారణం అవుతున్న వాహనాలను కూడా నిలిపివేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను. మీయందు విధేయత గల, చిరునామా: |
ప్రశ్న 6.
వ్యవసాయంలో జీవవైవిధ్యత భారతీయ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెల్పుము.
జవాబు:
వ్యవసాయంలో జీవవైవిధ్యత భారతీయ రైతులకు ఈ క్రింది విధంగా ఉపయోగపడుతుంది.
వ్యవసాయ రంగంలో సేంద్రీయ రైతులు రసాయనిక ఎరువులు, పురుగు మందులను వినియోగించరు. ఇందుకు బదులుగా పంటమార్పిడి, పెంట పోగు ఎరువు, పురుగుల జైవిక నియంత్రణ వంటి సహజ పద్దతులను వీళ్ళు అవలంబిస్తారు. సేంద్రియ వ్యవసాయంలో ముఖ్యమైన ఒక లక్షణం లైనిక వనరులను వినియోగించటం. ఉదాహరణకు హానికరమైన పురుగులను తినే జీవులను అనగా పక్షులు, సాలీళ్ళు, మేలుచేసే పురుగులను ప్రోత్సహించటం, పోషకాలను మొక్కలకు అందుబాటులోకి తెచ్చే నేలలోని సూక్ష్మజీవులను అనగా రైజోబియం, అజటోబాక్టర్ వంటి వాటిని పెంపొందించటం. కృత్రిమ రసాయనక పదార్థాల వినియోగాన్ని సాధ్యమైనంతగా తగ్గిస్తారు. అలాగే ఒకటి రెండు పంటలు మాత్రమే కాకుండా అనేక పంటలను సాగుచెయ్యటం వల్ల, జీవవైవిధ్యత పెరుగుతుంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులలో సాధించిన ఉత్పత్తిని ఈ పద్ధతులలోనూ పొందవచ్చు.
ప్రశ్న 7.
“అభివృద్ధిని సాధించడంలో పర్యావరణ అంశాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి” – వివరించండి.
జవాబు:
- అభివృద్ధిని సాధించడంలో పర్యావరణ అంశాలను తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాలి.
- అభివృద్ధిని సాధించే క్రమంలో వనరులను అతివేగంగా వినియోగించడం వలన పర్యావరణ వనరుల సరఫరా విధి దెబ్బతింటుంది.
- ఎక్కువ మోతాదులో వ్యర్థ పదార్థాలు ఉత్పన్నమవుతూ ఉండడం వలన పర్యావరణానికి దీర్ఘకాల నష్టం కలుగుతుంది.
- భారీ ప్రాజెక్టుల వలన జీవవైవిధ్యతకి హాని కలుగుతుంది.
- ఆధునిక వ్యవసాయంలో భాగంగా ఉపయోగిస్తున్న రసాయన ఎరువులు, పురుగుమందులు పర్యావరణానికి నష్టం కలిగిస్తాయి.
- పారిశ్రామికాభివృద్ధిలో ఉపయోగిస్తున్న ఇంధనం, వాయుకాలుష్యానికి దారితీస్తుంది.
- భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయి.
- అడవులు నరికివేయబడుతున్నాయి.
- నిమ్న ఆదాయ దేశాల, భవిష్యత్ తరాల హక్కులని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
ప్రశ్న 8.
క్రింది పేరాగ్రాఫ్ ను చదివి, అర్ధం చేసుకొని, దానిపై మీ అభిప్రాయం రాయండి.
పారిశ్రామికీకరణ వల్ల కొంతమందికి అనేక వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. అయితే దీని ఫలితంగా ప్రపంచ సహజ వనరులు అంతరించి పోతున్నాయి. వాతావరణం కూడా అతలాకుతలమయిపోతుంది. ఈ రకమైన వృద్ధి ఎంతో కాలం కొనసాగలేదు.
జవాబు:
పారిశ్రామికీకరణ ఫలితంగా మానవుడు సుఖజీవనం సాగించడానికి ఎన్నో వస్తువులు, సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. మానవుడు గనుల తవ్వకం ద్వారా వచ్చిన లోహాలతో గుండుసూది మొదలు విమానం వరకు ఆవిష్కరించాడు. అయితే మానవునికి దూరదృష్టి లేని కారణంగా ఖనిజాలు వేగంగా అంతరించిపోతున్నాయి. మానవుని అత్యాశ ఫలితంగా సహజ వనరులు, ఖనిజాలు, శిలాజ ఇంధనాలు తరిగిపోతున్నాయి. ఈ వనరులను అధికంగా వినియోగించడం వల్ల వాతావరణం పెను మార్పులకు గురవుతూ అతలాకుతలమవుతోంది.
ఆర్థిక అభివృద్ధిని సాధించే క్రమంలో పారిశ్రామికీకరణ పేరిట పర్యావరణ వనరులను ఇంతకుముందు కనీవినీ ఎరుగని రీతులలో ఉపయోగిస్తూ నాశనం చేస్తున్నారు. అడవులను నరికివేస్తున్నారు. నేల కోతకు గురవుతోంది. భూగర్భజలాలు తరిగిపోతున్నాయి. కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. ఇంకా ఇతర పర్యావరణ సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. ఈ రకమైన వృద్ధి ఎంతోకాలం కొనసాగలేదు. ఇది సుస్థిర అభివృద్ధికి విరుద్ధమైనది. పారిశ్రామికంగా ముందంజ వేస్తూనే పర్యావరణ పరిరక్షణ చేయడం మనందరి ముందున్న తక్షణ కర్తవ్యం.
ప్రశ్న 9.
మన జీవితాలు అనేక విధాలుగా పర్యావరణంపై ఆధారపడి ఉన్నాయి. వివరించండి.
జవాబు:
మన జీవితాలు అనేక విధాలుగా పర్యావరణంపై ఆధారపడి ఉన్నాయి.
- మానవుడు అత్యంత ఆవశ్యకమైన ఆహారం, ప్రాణవాయువు (0) ఆవాసం కొరకు ఎల్లప్పుడు పర్యావరణం పైనే ఆధారపడి ఉండాల్సి ఉంటుంది.
- పేదరికాన్ని తగ్గించటానికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచటానికి, అధిక GDP ని సాధించటానికి ప్రకృతి వనరులనే ఎక్కువగా వినియోగించాల్సి ఉంది.
- పారిశ్రామికాభివృద్ధికై మనం గనుల త్రవ్వకం, అడవుల నిర్మూలన, వాతావరణ కాలుష్యం తప్పనిసరియైంది.
- వ్యవసాయాభివృద్ధికి, అధిక దిగుబడులకుగాను (హరిత విప్లవం) రసాయన ఎరువులు, పురుగు మందులు విరివిగా వాడుతూ భూ, జల కాలుష్యం చేస్తున్నాం.
- ఈ విధంగా దేశ, మానవ అభివృద్ధి నెపంతో పర్యావరణంపై విపరీతంగా ఆధారపడిపోతూ, పర్యావరణానికి అత్యంత నష్టం వాటిల్లేలా ప్రవర్తిస్తున్నాం.
కాబట్టి
- విరివిగా చెట్లను పెంచడాన్ని ప్రోత్సహించాలి, చెట్లను నరకడాన్ని నేరంగా ప్రకటించాలి. ఆ ప్లాస్టిక్ వినియోగాన్ని మానివెయ్యాలి, గుడ్డ, జూట్ సంచులు వాడాలి.
- రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగంను తగ్గించి సేంద్రియ ఎరువులు (ప్రకృతి వ్యవసాయం) వాడాలి.
- వాహనాలు, ఎ.సిలు, ఫ్రిజ్ ల వాడకం అత్యంత కనిష్ఠంగా వాడాలి.
ప్రశ్న 10.
చిప్కో ఉద్యమం గూర్చి రాయుము.
జవాబు:
చిప్కో ఉద్యమం ఉత్తరాఖండ్ లోని గడవాల్ కొండలలో ఛమోలి జిల్లాలోని గోపేశ్వర్ పట్టణంలో ఒకానొక శుభోదయాన ప్రారంభమైంది. ఇది ఒక పర్యావరణ ఉద్యమం. అటవీ ప్రాంతంలో నివసించే ప్రజలకు ఆయా అడవులు ప్రత్యక్షంగా ఆహారం, కట్టెపుల్లలు, పశువుల మేత ఇవ్వటమే కాకుండా పరోక్షంగా నేల, నీటి వనరులను సుస్థిరపరచటంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. వ్యాపారం, పరిశ్రమల కోసం అడవులను నరకటం తీవ్రరూపం దాల్చటంతో తమ జీవనోపాధులను కాపాడుకోడానికి అహింసా పద్ధతులలో వ్యతిరేకించాలని ప్రజలు చిప్కో ఉద్యమం చేపట్టారు. ‘చిప్కో’ అంటే హత్తుకోవడం (కౌగిలించుకోవడం). చెట్లను పల్లెవాసులు హత్తుకొని కాంట్రాక్టర్లు, గుత్తేదార్ల గొడ్డళ్ళకు అడ్డుగా నిలిచారు. ఈ ఉద్యమంలో ‘గౌరీదేవి’ అను మహిళ నాయకత్వంలో మహిళలు ప్రధానపాత్ర పోషించారు.
ప్రశ్న 11.
ఆర్థిక అభివృద్ధిని సాధించే క్రమంలో పర్యావరణ పరంగా, సామాజికంగా ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించవచ్చని పాలకులు భావించారు?
జవాబు:
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో పేదరికం ఉంది కాబట్టి ఆర్థికాభివృద్ధి అవసరమని పాలకులు భావించారు. పర్యావరణ పరంగా ఎన్ని విపరీత పరిణామాలున్నా అభివృద్ధి మాత్రం తప్పనిసరి తలచారు. పేదరికాన్ని తగ్గించడానికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచటానికి, ఆధునిక పరిశ్రమలలోనూ, స్థూల జాతీయోత్పత్తిలోను అభివృద్ధి సాధించడం అవసరమనే నిశ్చయానికి వచ్చారు. అధిక ఆర్థికాభివృద్ధి, సంపన్నత సాధించిన తరువాత కాలుష్యాన్ని, పర్యావరణ క్షీణతను పరిష్కరించవచ్చని ఆశించారు. డబ్బు ఖర్చు చేసి నదులను, గాలిని శుభ్రపరచవచ్చని, సీసాలలోని నీళ్ళు త్రాగవచ్చని, ఇంధనాన్ని పొదుపుగా వినియోగించే వాహనాలను రూపొందించవచ్చని పాలకులు భావించారు.
ప్రశ్న 12.
అధిక ఆర్థికాభివృద్ధి, సంపన్నత పేరుతో జరిగే పర్యావరణ నష్టాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
ఆర్థిక అభివృద్ధి, సంపన్నత, పారిశ్రామికీకరణ పేరుతో పర్యావరణం తీవ్ర క్షీణతకు గురైంది. వనరులను, ఇంధనాన్ని వినియోగించి, పర్యావరణాన్ని కలుషితం చేయడం వలన భూమి వినాశనానికి లోనైంది. పర్యావరణానికి జరిగిన హానిని తిరిగి సరిదిద్దగల స్థితిలో మనం లేం. జరిగిన నష్టాన్ని పర్యావరణం తనంతట తాను సరిచేసుకుంటుందన్న భావన సరైంది కాదు. భవిష్యత్తు తరాలు జరిగిన నష్టాన్ని సరిదిద్దగలిగినా ఇప్పుడు చేసిన కాలుష్యాన్ని తొలగించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. భూగర్భజలాలు, రసాయనిక పురుగుమందుల సమస్యలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు.
ప్రశ్న 13.
భారతదేశంలో భూగర్భజల వినియోగంలో జరిగే విపరీత పరిణామాలను వివరించుము.
జవాబు:
మన దేశంలో భూగర్భజల వనరులను అధికంగా వినియోగించడం వల్ల తీవ్ర సంక్షోభంలో ఉన్నాం. మన దేశంలో మూడవ వంతు ప్రాంతంలో భూగర్భజలాల పునరుద్దరణకంటే ఆ నీటి వినియోగం ఎక్కువగా ఉంది. సుమారుగా 300 జిల్లాల్లో గత 20 సంవత్సరాలలో భూగర్భజలాలు 4 మీటర్ల మేర పడిపోయాయి. ప్రస్తుతం భూగర్భజలాలు కొన్ని – వందల అడుగుల లోతుకు వెళ్ళిపోయాయి. దీనినిబట్టి భూగర్భ నీటిని చాలా ఎక్కువగా వాడుకుంటున్నామని తెలుస్తుంది. పీఠభూములలోని రాతి ప్రాంతాలలోనూ, కొన్ని కోస్తా ప్రాంతాలలోనూ, వేగంగా పెరుగుతున్న పట్టణ ప్రాంతాలలోనూ భూగర్భజలాల వినియోగం చాలా ఎక్కువగా ఉంది. భూగర్భజలాలు తగ్గిపోవడమే కాదు. వాటి నాణ్యత కూడా తగ్గిపోతున్నది. మన దేశంలో 59% జిల్లాల్లో చేతి పంపులలోని నీళ్ళు తాగటానికి పనికిరావు.
ప్రశ్న 14.
భారతదేశంలో నర్మదాలోయ అభివృద్ధి పథకం వలన జరిగే పర్యావరణ సమస్యలేవి?
జవాబు:
ప్రపంచంలోని అతి పెద్ద జల విద్యుత్ ప్రాజెక్టులలో ఇది ఒకటి. మన దేశంలో నర్మదా లోయ అభివృద్ధి పథకం అతి పెద్ద ఆనకట్ట. దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి వసతి, వరదల నియంత్రణ వంటి ప్రయోజనాలున్నా పర్యావరణ పరంగా.. ఎదురయ్యే సమస్యలే ఎక్కువ. అవి:
- ఈ ప్రాజెక్టులోని 3000 పెదా, చిన్నా ఆనకట్టల వల్ల పర్యావరణానికి జరిగే నష్టం ఎంతో ఎక్కువ.
- నిర్మించిన ఆనకట్టలలో కెల్లా సర్దార్ సరోవర్ అతిపెద్దది.
- దీనివల్ల 37,000 హెక్టార్ల అడవి, వ్యవసాయ భూమి ముంపునకు గురి అవుతుంది.
- 5 లక్షలకు పైగా ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు.
- జీవవైవిధ్యం, మానవ జీవితాలు ధ్వంసం అయ్యాయి.
- నిర్వాసితులైన వాళ్ళలో అధిక శాతం ఆదివాసీలు, దళితులు.
ప్రశ్న 15.
ఈ క్రింది వాటిని భారతదేశ పటంలో గుర్తించుము.
1) ముంబయి.
2) హైదరాబాద్
3) మధ్యప్రదేశ్
4) గుజరాత్
5) తమిళనాడు
6) కేరళ
7) పంజాబ్
8) ఉత్తరప్రదేశ్
9) నర్మదానది
10) సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్
11) ఆంధ్రప్రదేశ్
12) ఢిల్లీ
ప్రాజెక్టు
సేంద్రియ వ్యవసాయం నేపథ్యంలో మీరు పెంటపోగు ఎరువు గురించి చదివారు. మీ బడిలో, ఇంటి దగ్గర ప్రయత్నించటానికి తేలికైన పద్ధతి ఇదిగో :
* ఒక పెద్ద పాత్ర తీసుకుని అధికంగా ఉన్న నీళ్లు పోవటానికి కింద భాగంలో రంధ్రాలు చెయ్యండి.
* కొబ్బరి పీచు ఒక పొర వేయండి. అధికంగా ఉన్న నీళ్లు పోటానికి ఇది దోహదం చేస్తుంది.
* ఒక పలచటి మట్టి పొరతో దీనిని కప్పండి.
* కూరగాయల పొట్టు ఇతర వ్యర్థ పదార్థాలను ఒక పొర లాగా వెయ్యండి.
* మరొక పొర మట్టి వెయ్యండి.
* కూరగాయల వ్యర్థాలను మళ్లీ పొరలాగా వెయ్యండి.
* మట్టితో కప్పుండి.
* వారం రోజుల తరువాత దీంట్లోకి వానపాములను ప్రవేశ పెట్టండి.
* ఇది కుళ్లిన తరువాత మీ తోటలో కావలసిన మొక్కలు పెంచటానికి ఈ మట్టిని ఉపయోగించండి.