AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

These AP 10th Class Social Studies Important Questions 11th Lesson ఆహార భద్రత will help students prepare well for the exams.

AP Board 10th Class Social 11th Lesson Important Questions and Answers ఆహార భద్రత

10th Class Social 11th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. ప్రభుత్వము ఆహార ధాన్యాల నిల్వకోసం, ప్రధానంగా గోధుమలు, బియ్యం దేని ద్వారా సేకరిస్తుంది?
జవాబు:
FCI

2. కనీస మద్దతు ధరను ఎవరు నిర్ణయిస్తారు?
జవాబు:
ప్రభుత్వం

3. పోషకాహార సమస్యను అధిగమించుటకై పాఠశాలల్లో అమలవుతున్న పథకం ఏది?
జవాబు:
మధ్యాహ్న భోజన పథకం.

4. రోజుకు పట్టణ ప్రాంత ప్రజలు తీసుకోవలసిన ఆహారంలో కేలరీలు ఎన్ని?
జవాబు:
2100 కేలరీలు.

5. రోజుకు గ్రామీణ ప్రాంత ప్రజలు తీసుకోవలసిన ఆహారంలో కేలరీలు ఎన్ని?
జవాబు:
2400 కేలరీఅం.

6. అంత్యోదయ కార్డు కుటుంబాలకు, నెలకు కుటుంబానికి ఎన్ని కిలోల ఆహార ధాన్యాలు అందజేస్తారు?
జవాబు:
35 కిలోలు.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

7. జాతీయ ఆహార భద్రతా చట్టం ఏ సంవత్సరంలో చేసారు?
జవాబు:
2013.

8. తక్కువ ఆదాయ వర్గాల వారికి ఆహార ఉత్పత్తులను సరఫరా చేయునది.
జవాబు:
ప్రజాపంపిణీ వ్యవస్థ.

9. 2018 – జాతీయ ఆహార భద్రత చట్టం ప్రజల యొక్క ఏ హక్కుకు చట్టబద్ధత కల్పిస్తోంది?
జవాబు:
ఆహారం పొందే హక్కు

10. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు పరచిన మొదటి రాష్ట్రం ఏది?
జవాబు:
తమిళనాడు.

11. జాతీయ పోషకాహార సంస నెలకొని ఉన్న ప్రదేశం ఏది?
జవాబు:
హైద్రాబాద్.

12. 1943 – 45 సంవత్సరాలలో ఏ రాష్ట్రంలో తీవ్రమైన కరువు ఏర్పడింది?
జవాబు:
బెంగాల్.

13. (సంవత్సరంలో లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు + జనాభా) / 365 =?
జవాబు:
తలసరి ఆహార ధాన్యాల లభ్యత.

14. తలసరి ఆహార ధాన్యాల లభ్యత ఎక్కువగా కలిగి ఉన్న దేశం ఏది?
జవాబు:
అమెరికా.

15. జొన్న, సజ్జ, రాగి, గోధుమలలో చిరు లేదా తృణ ధాన్యం కానిది ఏది?
జవాబు:
గోధుమ.

16. ఏ రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ చక్కగా పనిచేస్తుందని అధ్యయనాలు తెల్పుతున్నాయి?
జవాబు:
తమిళనాడు.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

17. ఆహార ధాన్యాల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించు ధర నేమంటారు?
జవాబు:
కనీస మద్దతు ధర.

18. అంగన్ వాడీకి వచ్చే పిల్లల వయసు ఏ సంవత్సరాల మధ్య ఉంటుంది?
జవాబు:
1- 6 సంవత్సరాలు

19. ప్రపంచంలో కెల్లా అత్యంత పెద్ద పాఠశాల భోజన పథకం ఏ దేశంలో అమలవుతుంది?
జవాబు:
భారత్ లో

20. భారతదేశ గ్రామీణ ప్రాంతాలలో ఎంత శాతం ప్రజలు కేలరీల దృష్ట్యా తినవలసిన దానికంటే తక్కువ ఆహారం తీసుకుంటున్నారు?
జవాబు:
80%

21. ఆహార ధాన్యాల దిగుబడి పెంచటం కోసం చేపట్టిన కార్యక్రమంను ఏమన్నారు?
జవాబు:
హరిత విప్లవం.

22. భారతదేశంలో ప్రజల మొత్తం వినియోగంలో ఎంత శాతం బియ్యం, ఎంత శాతం గోధుమలు చౌకధరల దుకాణాల నుంచి కొనుగోలు చేస్తున్నారు, వరుసగా………
జవాబు:
39%, 28%

23. BMI ని విస్తరింపుము
జవాబు:
శరీర బరువు సూచిక (బాడీ మాస్ ఇండెక్స్)

24. FCI ని విస్తరింపుము.
జవాబు:
భారత ఆహార సంస్థ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)

25. MSP ని విస్తరింపుము
జవాబు:
కనీస మద్దతు ధర (మినిమం సపోర్ట్ ప్రెస్)

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

26. PDSని విస్తరింపుము.
జవాబు:
ప్రజా పంపిణీ వ్యవస్థ. (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్)

27. ఆరోగ్యవంతుని BMI (సాధారణ BMI )ఎంత?
జవాబు:
18.5.

28. బరువు చాలా తక్కువగా ఉన్న తీవ్ర పరిస్థితి మొత్తం మీద ఎంత శాతం పిల్లల్లో ఉంది?
జవాబు:
16%.

29. BMI 25 కంటే ఎక్కువ ఉంటే ఎలా పరిగణిస్తారు?
జవాబు:
ఊబకాయం

30. రోజుకు ప్రతి వ్యక్తి 300 మి.లీ. పాలు తీసుకోవలసి ఉండగా ఎన్ని మి. లీ. మాత్రమే లభ్యత ఉంది?
జవాబు:
210 మి.లీ.

31. సంవత్సరంలో ప్రతి వ్యక్తి 180 గ్రుడ్లు తీసుకోవలసి ఉండగా ఎన్ని లభ్యత ఉన్నాయి?
జవాబు:
30

32. పురుషులలో తీవ్ర శక్తిలోపం ఎంత శాతం, ఊబకాయం ఎంత శాతంగా ఉంది?
జవాబు:
35%, 10%.

33. మహిళల్లో తీవ్ర శక్తి లోపం ఎంత శాతం, ఊబకాయం ఎంత శాతంగా ఉంది?
జవాబు:
35%, 14%

34. సగటున ప్రతి వ్యక్తికి, ప్రతిరోజూ లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు =?
జవాబు:
(సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహారధాన్యాలు ÷ జనాభా) / 365.

35. ఒక టన్నుకి ఎన్ని కిలోలు?
జవాబు:
1000 కిలోలు.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

36. అందరిలో శారీరక శ్రమ, కష్టమైన పనులు చేసేది ఏ ప్రాంతవాసులు?
జవాబు:
గ్రామీణ ప్రాంత వాసులు.

37. భారత ప్రభుత్వం భారత ఆహార సంస్థ ద్వారా కొని నిల్వచేసే ఆహార ధాన్యాలను ఏవిధంగా పిలుస్తారు?
జవాబు:
బఫర్ నిల్వలు.

38. శారీరక ఎదుగుదలకు, కణజాల పునరుద్దరణ కోసం దోహదం చేసేవి ఏవి?
జవాబు:
చిక్కుళ్ళు, పప్పులు, మాంసం, గ్రుడ్లు.

39. 3 – 5 సంవత్సరాల పిల్లల్లో తక్కువ బరువు ఉన్న పిల్లలు గుజరాత్ రాష్ట్రంలో ఎంత శాతం మంది ఉన్నారు?
జవాబు:
58%

40. 3 – 5 సంవత్సరాల పిల్లల్లో తక్కువ బరువు ఉన్న పిల్లలు కేరళ రాష్ట్రంలో ఉన్నారు. అయితే ఎంత శాతం మంది కేరళలో ఉన్నారు?
జవాబు:
24%

41. వయోజనులైన స్త్రీ, పురుషులలో పోషకాహార స్థాయిని దేనితో కొలుస్తారు?
జవాబు:
శరీర బరువు సూచికతో.

42. మహిళలలో భారతదేశంలోని ఒడిశా, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, కేరళ ఏ రాష్ట్రంలో అధికశక్తి లోపం ఉన్న మహిళలు తక్కువగా ఉన్నారు?
జవాబు:
కేరళ.

43. తలసరి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో యూరప్ లో లభ్యతలో ఉన్నది ఎంత?
జవాబు:
200 గ్రా||లు.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

44. కింది వాక్యాలను పరిగణించండి.
i) రోజుకు పట్టణ ప్రాంతాల్లో 2100 కాలరీలు, గ్రామీణ ప్రాంతాల్లో 2400 కేలరీలు శక్తిని ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి.
ii) కాలరీల వినియోగం 1983 తో పోలిస్తే 2004
నాటికి పెరిగింది.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
A – (i) మాత్రమే

45. 2010-11 సంవత్సరంలో హెక్టారుకు ‘వరి’ దిగుబడి ఎన్ని కిలోలు?
జవాబు:
2250 కిలోలు.

46. 2010 – 11 సంవత్సరంలో హెక్టారుకు ‘గోధుమ’ దిగుబడి ఎన్ని కిలోలు?
జవాబు:
3000 కిలోలు.

47.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 1
జవాబు:
శరీర బరువు సూచిక (BMI)

48. హరిత విప్లవం వలన బాగా దిగుబడి పెరిగిన పంట ఏది.
జవాబు:
గోధుమ.

49. ప్రజా పంపిణీ వ్యవస్థలో అత్యంత పేదలకు ఇవ్వబడిన కార్డు ఏది?
జవాబు:
అంత్యోదయ కార్డు.

50. ICDS ను విస్తరింపుము.
జవాబు:
సమగ్ర శిశు సంక్షేమాభివృద్ధి సంస్థ.

51. పోషకాహార స్థాయిని సూచించే ప్రమాణం ఏది?
జవాబు:
BMI

52. భారత దేశంలో సగటున ప్రతి వ్యక్తికి రోజుకు అందుబాటులో ఉన్న కూరగాయలు?
జవాబు:
58 గ్రా.

53. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమూల్ డైరీ కలదు?
జవాబు:
గుజరాత్

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

54. క్రింది వానిలో సరి అయిన జతను గుర్తించండి.
→ ఆహార ధాన్యాల ఉత్పత్తి – హరిత విప్లవం.
→ ఆహార ధాన్యాల తలసరి లభ్యత – ఆహార ధాన్యాల లభ్యత + జనాభా.
→ ఆహార ధాన్యాల అందుబాటు – ప్రజా పంపిణీ వ్యవస్థ.
→ బఫర్ నిల్వలు – జాతీయ పోషకాహార సంస్థ.
జవాబు:
బఫర్ నిల్వలు – జాతీయ పోషకాహార సంస్థ.

55. క్రింది వానిలో సరికాని జతను గుర్తించి రాయండి.
→ MSP – కనీస మద్దతు ధర.
→ FCI – ప్రపంచ ఆహార సంస్థ.
→ BMI – శరీర బరువు సూచిక.
→ PDS – ప్రజా పంపిణీ వ్యవస్థ.
జవాబు:
FCI – ప్రపంచ ఆహార సంస్థ.

56. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) మాంసకృత్తులు ( ) a) పప్పుదినుసులు
ii) పిండి పదార్థాలు ( ) b) గోధుమలు, బియ్యం
iii) విటమిన్లు ( ) c) పళ్లు, మొలకలు
iv) ఖనిజ లవణాలు ( ) d) ఆకుకూరలు
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d

57. క్రింది వానిని సరిగా జతపరచండి.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 2
జవాబు:
i – c, ii – d, iii – b, iv – a

క్రింది ను పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నకు సమాధానము రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 3

58. గ్రామీణ భారతంలో అట్టడుగు వర్గం వారు (కింది విభాగం) అతి తక్కువ కాలరీలు తీసుకోవటానికి కారణమేమి?
జవాబు:
వారి ఆదాయం తక్కువగా ఉండటం (కొనుగోలు శక్తి – తక్కువగా ఉండటం)

59. క్రింది గ్రాను చదివి, ఇచ్చిన ప్రశ్నకు సరియైన సమాధానము రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 4
ప్ర. ప్రజలు తమ ఆహార ధాన్యాల అవసరంలో అధిక భాగం ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు?
జవాబు:
రిటైల్ మార్కెట్లో

60. ప్రజా పంపిణీ వ్యవస్థ అద్వాన్నంగా ఉన్న రాష్ట్రమేది?
జవాబు:
బీహార్.

ఇచ్చిన గ్రాఫ్ ను పరిశీలించి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానమును రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 5

61. ఆహార ధాన్యాల ఉత్పత్తి ధోరణి ఎలా ఉంది?
జవాబు:
పెరుగుతుంది.

62. ఏ ఆహార ధాన్యం ఉత్పత్తి తక్కువగా ఉంది?
జవాబు:
జొన్న

63. 1970 – 2011 కాలంలో ఏ పంట ఉత్పత్తి పెరగక పోగా తగ్గింది?
జవాబు:
నూనెగింజలు.

64. ఈ 40 ఏళ్ళ కాలంలో ఉత్పత్తి వేగంగా పెరిగిన ఆహార పంట ఏది?
జవాబు:
వరి.

క్రింద ఇవ్వబడిన పట్టికను పరిశీలించి, ప్రశ్నలకు సరియైన జవాబులు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 6

65. ఇవ్వబడిన పట్టికలో ‘A’ అనే అక్షర స్థానంలో ఉండాల్సిన విలువను లెక్కించండి.
జవాబు:
481 గ్రాములు.

66. ఇవ్వబడిన పట్టికలో ‘B’ అనే అక్షర స్థానంలో ఉండాల్సిన విలువను లెక్కించండి.
జవాబు:
219.5

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

67. ఇవ్వబడిన (ను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నకు సమాధానము రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 7
ప్ర. గోధుమ ఉత్పత్తి అనూహ్యంగా పెరగటానికి కారణ మేమిటి?
జవాబు:
హరిత విప్లవం.

10th Class Social 11th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
కనీస మద్దతు ధర అనగానేమి?
జవాబు:
ఆహార ధాన్యాలను ప్రభుత్వం కొనుగోలు చేయు (ముందుగా ప్రకటించిన) ధర. ప్రభుత్వ సంస్థ ప్రతి సంవత్సరానికి MSP ప్రకటిస్తుంది.

ప్రశ్న 2.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెట్టడానికి గల కారణమేమిటి?
జవాబు:

  1. అక్షరాస్యతను పెంచడం.
  2. ఎక్కువమంది బాలబాలికలు పాఠశాలల్లో వారి పేరు నమోదు చేసుకునేలాగా చూడటం.
  3. పేదవారికి, పిల్లలకు కనీసం ఒక్కపూట అయినా పౌష్టిక ఆహారం అందేలా చూడటానికి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు.

ప్రశ్న 3.
పిల్లల్లో పౌష్టికాహార లోపాల పరిష్కారానికి నీవు సూచించే రెండు మార్గాలేవి?
జవాబు:

  1. ప్రతిరోజూ పిల్లలకు పాలు, పండ్లు, గుడ్లు తమ ఆహారంలో ఇవ్వడం.
  2. పిల్లలకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచటం.

ప్రశ్న 4.
FCI విస్తరించుము.
జవాబు:
Food Corporation of India (భారత ఆహార సంస్థ).

ప్రశ్న 5.
ఆహార భద్రత అమలయ్యేలా చూడటంలో భారత న్యాయ వ్యవస్థ కూడా చురుకైన పాత్ర పోషించడంతో దీనివల్ల పిల్లలకు ఎలాంటి ఉపయోగాలు కలుగుతున్నాయి?
జవాబు:

  1. పిల్లలకు పౌష్టికాహారం లభించుచున్నది.
  2. మధ్యాహ్నభోజనం పాఠశాలల్లో అమలు చేయడం వలన వారు పాఠశాలకు క్రమం తప్పకుండా వచ్చి విద్య నేర్చుకోగలుగుతున్నారు.

ప్రశ్న 6.
విటమిన్లు పుష్కలంగా లభించే ఆహార పదార్థాలకు రెండు ఉదాహరణలిమ్ము.
జవాబు:
పళ్ళు, ఆకుకూరలు, మొలకలు, ముడి బియ్యం వంటి ఆహార పదార్థాలలో విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

ప్రశ్న 7.
పోషక ఆహార ధాన్యాలకు రెండు ఉదాహరణలు వ్రాయుము.
జవాబు:
జొన్న, రాగి, సజ్జ మొదలైనవి.

ప్రశ్న 8.
భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఏర్పడిన (1943-45) కరవు ఏ ప్రాంతంలో ఏర్పడింది?
జవాబు:
భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు 1943-45 సం||రాలలో ‘బెంగాల్’లో అతి పెద్ద కరవు పరిస్థితి ఏర్పడింది.

ప్రశ్న 9.
భారతదేశంలో వరి, గోధుమలను పండిస్తున్న విధానం సురక్షిత పద్ధతేనా? ఎందుకని?
జవాబు:
అధిక దిగుబడుల కోసం అనుసరిస్తున్న విధానం సురక్షిత, సుస్థిర పద్ధతి కాదని శాస్త్రజ్ఞులు, వ్యవసాయరంగ వ్యక్తులు భావిస్తున్నారు. ఈ పద్ధతులవల్ల నేల క్షీణతకు గురయ్యింది, భూగర్భజల వనరులు అంతరించిపోతున్నాయి.

ప్రశ్న 10.
2010-11 సం||రంలో హెక్టారుకు వరి దిగుబడి ఎన్ని కిలోలు?
జవాబు:
2250 కిలోలు.

ప్రశ్న 11.
2010-11 సం||రంలో హెక్టారుకు గోధుమల దిగుబడి ఎన్ని కిలోలు?
జవాబు:
3000 కిలోలు.

ప్రశ్న 12.
సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలను ఎలా అంచనా వేస్తారు?
జవాబు:
సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు = సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి (ఉత్పత్తి – విత్తనం, దాణా, వృథా) + నికర దిగుమతులు (దిగుమతులు – ఎగుమతులు) – ప్రభుత్వ నిల్వలలో తేడా (సంవత్సరం ముగిసే నాటికి ఉన్న నిల్వలు – సంవత్సరం ఆరంభం నాటికి ఉన్న నిల్వలు).

ప్రశ్న 13.
తలసరి ఆహార ధాన్యాల లభ్యత అనగానేమి?
జవాబు:
సగటున ప్రతి వ్యక్తికి, ప్రతిరోజూ లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలను తలసరి ఆహార ధాన్యాల లభ్యత అంటారు.

ప్రశ్న 14.
తలసరి ఆహార ధాన్యాల లభ్యతను ఎలా అంచనా వేస్తారు?
జవాబు:
తలసరి ఆహార ధాన్యాల లభ్యత (ప్రతిరోజు) = (సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు + జనాభా )/365.

ప్రశ్న 15.
2011 సంవత్సరంలో తలసరి ఆహార ధాన్యాల లభ్యత ఎంతగా ఉంది?
జవాబు:
2011 సంవత్సరంలో తలసరి ఆహార ధాన్యాల లభ్యత ఒక రోజుకు 500 గ్రాములు.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

ప్రశ్న 16.
ప్రధాన ఆహార ధాన్యాలకు రెండు ఉదాహరణలిమ్ము.
జవాబు:
వరి, గోధుమ.

ప్రశ్న 17.
చిరు లేదా తృణ ధాన్యాలకు ఉదాహరణలిమ్ము.
జవాబు:
చిరు లేదా తృణ ధాన్యాలకు ఉదాహరణలు : జొన్న, రాగి, సజ్జ మొదలగునవి.

ప్రశ్న 18.
ప్రస్తుతం పోషక ధాన్యాలుగా వేటిని వ్యవహరిస్తున్నారు?
జవాబు:
చిరు లేదా తృణ ధాన్యాలను పోషకధాన్యాలుగా వ్యవహరిస్తున్నారు.

ప్రశ్న 19.
ఆహార పదార్థాల ఉత్పత్తి చేపట్టటానికి రైతులకు ఏ రూపంలో మద్దతు అవసరం?
జవాబు:
ఆహార పదార్థాల ఉత్పత్తి చేపట్టటానికి రైతులకు ఉత్పాదకాలు, మార్కెట్ అవకాశాల రూపంలో మద్దతు అవసరం.

ప్రశ్న 20.
భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకు ఎన్ని గ్రాముల కూరగాయలు, పళ్లు తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచించారు?
జవాబు:
భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకు వరుసగా 300 గ్రా||ల కూరగాయలు, 100 గ్రా||ల పళ్లు తీసుకోవాలని సూచించారు.

ప్రశ్న 21.
వ్యవసాయ వైవిధీకరణ అనగానేమి?
జవాబు:
ఆధునిక పద్ధతులు, విధానాలు అవలంబించి ఆహార మరియు వాణిజ్య పంటలు మరియు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను అభివృద్ధి చేయుట.

ప్రశ్న 22.
తలసరి ఆహార ధాన్యాల అభ్యత ఎక్కువగా ఉన్న దేశమేది?
జవాబు:
తలసరి ఆహార ధాన్యాల లభ్యత ఎక్కువగా ఉన్న దేశం అమెరికా.

ప్రశ్న 23.
పట్టణ ప్రాంతంలో నివసించే వ్యక్తులు తీసుకోవలసిన కనీస కాలరీలు ఎన్ని?
జవాబు:
పట్టణ ప్రాంతంలో నివసించే వ్యక్తులు తీసుకోవలసిన కనీస కాలరీలు 2100.

ప్రశ్న 24.
గ్రామీణ ప్రాంతంలో వ్యక్తులు శక్తి కోసం తీసుకోవలసిన కనీస కాలరీలు ఎన్ని?
జవాబు:
గ్రామీణ ప్రాంతంలో వ్యక్తులు శక్తి కోసం తీసుకోవలసిన కనీస కాలరీలు 2400.

ప్రశ్న 25.
భారతదేశ గ్రామీణ ప్రాంతంలో ఎంత శాతం ప్రజలు కాలరీల దృష్ట్యా తినవలసిన దానికంటే తక్కువ ఆహారం తింటున్నారు?
జవాబు:
భారతదేశ గ్రామీణ ప్రాంతంలో 80 శాతం మంది ప్రజలు కాలరీల దృష్ట్యా తినవలసిన దానికంటే తక్కువ ఆహారం తింటున్నారు.

ప్రశ్న 26.
భారతదేశంలో ఏ ప్రాంతంలో ప్రజాపంపిణీ వ్యవస్థ బాగుందని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి?
జవాబు:
భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాలలో ప్రజాపంపిణీ వ్యవస్థ బాగుందని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి.

ప్రశ్న 27.
ఏ రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది?
జవాబు:
తమిళనాడు రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది.

ప్రశ్న 28.
భారతదేశంలో ప్రజల మొత్తం బియ్యం వినియోగంలో ఎంత శాతం చౌక ధరల దుకాణం నుంచి కొనుగోలు చేస్తున్నారు?
జవాబు:
భారతదేశంలో ప్రజల మొత్తం బియ్యం వినియోగంలో 39 శాతం చౌక ధరల దుకాణం నుంచి కొనుగోలు చేస్తున్నారు.

ప్రశ్న 29.
బఫర్ నిల్వలు అనగానేమి?
జవాబు:
భారత ప్రభుత్వం భారత ఆహార సంస్థ (FCI) ద్వారా కొని నిల్వచేసే ఆహార ధాన్యాలను బఫర్ నిల్వలు అంటారు.

ప్రశ్న 30.
ప్రజాపంపిణీ వ్యవస్థ అనగానేమి?
జవాబు:
ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వాతా ఆహార ధాన్యాలు మరియు ఇతర నిత్యావసర వస్తువులను సబ్సిడీ ధరపై సరఫరా చేయడాన్ని ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) అంటారు.

ప్రశ్న 31.
భారత ప్రభుత్వం ఆహార భద్రత చట్టం ఏ సంవత్సరంలో చేసింది?
జవాబు:
భారత ప్రభుత్వం ఆహార భద్రత చట్టం 2013 సంవత్సరంలో చేసింది.

ప్రశ్న 32.
పేదలలో అత్యంత పేదలకు ఎన్ని కిలోల ఆహార ధాన్యాలు ఈ చట్టం ప్రకారం అందుతాయి?
జవాబు:
పేదలలో అత్యంత పేదలకు 35 కిలోల ఆహార ధాన్యాలు ఈ చట్టం ప్రకారం అందుతాయి.

ప్రశ్న 33.
అంగన్‌వాడీకి వచ్చే పిల్లల వయస్సు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది?
జవాబు:
అంగన్వాడీకి వచ్చే పిల్లల వయస్సు 1 – 5 సంవత్సరాలు ఉంటుంది.

ప్రశ్న 34.
ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్ద పాఠశాల భోజన పథకం ఏది?
జవాబు:
ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్ద పాఠశాల భోజన పథకం భారతదేశంలోని మధ్యాహ్న భోజన పథకం.

ప్రశ్న 35.
పోషకాహారం అనగానేమి?
జవాబు:
శరీరం అన్ని విధులను నిర్వహించడానికి శక్తికి, ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి, రోగాలతో పోరాడటానికి అవసరమయిన ఆహారాన్నే పోషకాహారం అంటారు.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

ప్రశ్న 36.
జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది?
జవాబు:
జాతీయ పోషకాహార సంస్థ హైదరాబాద్లో ఉంది.

ప్రశ్న 37.
పిల్లల్లో తక్కువ బరువు ఉండటం సమస్య అన్నిటికంటే తక్కువగా ఉన్న రాష్ట్రమేది?
జవాబు:
పిల్లల్లో తక్కువ బరువు ఉండటం సమస్య అన్నిటికంటే తక్కువగా ఉన్న రాష్ట్రం కేరళ.

ప్రశ్న 38.
శరీర బరువు సూచికను (BMI)ని ఏ విధంగా లెక్కిస్తారు?
జవాబు:
BMI = బరువు కిలోలలో / మీటర్లలో ఎత్తు వర్గం.

ప్రశ్న 39.
మహిళల్లో తీవ్రశక్తి లోపం, ఊబకాయం (అధిక బరువు) కలిగి ఉన్న వారి శాతమెంత?
జవాబు:
35% తీవ్ర శక్తి లోపం, 14% ఊబకాయం మహిళల్లో కన్పిస్తుంది.

ప్రశ్న 40.
సాధారణ BMI (ఆరోగ్యవంతుని BMI) ఎంత?
జవాబు:
18.5 [BMI = 18.5]

ప్రశ్న 41.
ఆహార భద్రతకు, తీవ్ర శక్తి లోపానికి గల సంబంధం ఏమిటి?
జవాబు:
సరిపడా ఆహారం ఉంటే (తింటే) ఎవరూ ఉండవలసిన దానికంటే తక్కువ బరువు కాని, తక్కువ ఎత్తు కాని ఉండరు.

10th Class Social 11th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
మీ కుటుంబము యొక్క ఒక వారం ఆహారపుటలవాట్లను విశ్లేషించండి. దీని ప్రభావము వ్యవసాయం, పర్యావరణంపై ఏ విధంగా పడుతుందో రాయండి.
జవాబు:
మా కుటుంబ ఆహారపు అలవాట్లు :

  1. ప్రధానంగా అన్నం (వరి), పప్పు (కందులు), కూరలు (కూరగాయలు), పెరుగు, పాలు, గ్రుడ్లు మొదలైనవి.
  2. అల్పాహారంగా ఇడ్లీ, దోశ, పూరి, చపాతి మొదలైనవి.
  3. అప్పుడప్పుడు మాలో కొంతమంది మాంసాహారం తీసుకుంటారు.

వ్యవసాయంపై ఆహారపు అలవాట్ల ప్రభావం :

  1. వివిధ పంటల (వరి, పప్పు ధాన్యాలు, కూరగాయలు మొదలైనవి) దిగుబడి పెంచుటకై అత్యధిక మోతాదులో రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకం జరుగుతుంది.
  2. గ్రుడ్లు, పాలు, మాంసానికై పాడి పశువులను కృత్రిమ పద్ధతుల్లో, అవాంఛనీయ పద్ధతుల్లో పెంచడం జరుగుతుంది.

పర్యావరణంపై ప్రభావం :

  1. మోతాదు మించి వాడే రసాయన ఎరువులు, పురుగు మందుల కారణంగా వాయు, జల కాలుష్యం ఏర్పడుతుంది.
  2. అడవులను నరికి మొత్తం వ్యవసాయ భూమిగా మార్చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం.
  3. జీవ వైవిధ్యం దెబ్బతినేలా జంతువులను వినియోగించడం జరుగుతుంది.

ప్రశ్న 2.
ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించలేకపోవడానికి గల కారణములను తెల్పండి.
జవాబు:
జనాభా పెరిగిన స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుట లేదు. దీనికి కారణాలు :

  1. సరైన నీటి నిర్వహణా పద్ధతులను ఉపయోగించలేకపోవడం.
  2. రైతులు పురాతన వ్యవసాయ పద్ధతులను ఉపయోగించడం.
  3. చిన్న భూ కమతాలలో వ్యవసాయం చేయడం.
  4. ఎరువులను తగిన మోతాదులలో వాడకపోవుట.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

ప్రశ్న 3.
ప్రజా పంపిణీ వ్యవస్థలో నీవు గుర్తించిన ఏవేని రెండు లోపాలను గురించి వ్రాయుము.
జవాబు:

  1. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు వస్తువులను విక్రయించడం
  2. తూకంలో మోసం చేయడం
  3. బ్లాక్ మార్కెట్‌కు వస్తువులు తరలించడం
  4. అనర్హత కలిగిన వ్యక్తులు తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉండుట
  5. నెలలో కొద్ది రోజులు మాత్రమే సరుకులు అమ్మడం.

ప్రశ్న 4.
ప్రస్తుత ప్రజా పంపిణీ వ్యవస్థ పని తీరును మెరుగుపరచడానికి నీవు సూచించే చర్యలు తెలుపుము.
జవాబు:

  1. రేషన్ కార్డులను పేదలకు మరియు అతి నిరు పేదలకు మాత్రమే కేటాయించాలి.
  2. ప్రతినెల వీరు ప్రజాపంపిణీ ద్వారా అన్ని సదుపాయాలను వస్తువులను పొందుతున్నారో లేదా తెలుసుకోవాలి.
  3. ప్రభుత్వం పంపిణీ చేసే వస్తువుల నాణ్యత పెంచాలి.
  4. ఏవైతే దొంగ రేషన్ కార్డ్స్ ఉన్నాయో వాటిని తొలగించాలి.

ప్రశ్న 5.
ప్రజలకు ఆహారాన్ని పొందే హక్కు కోసం 2013 లో భారత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం రూపొందించింది. ఈ చట్టం అమలు కావడానికి నీవు సూచించే ముఖ్యమైన చర్యలేవి?
జవాబు:
జాతీయ ఆహార భద్రతా చట్టం – 2013 అమలు కావడానికి సూచనలు :

  1. ప్రజాపంపిణీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేటట్లు చూడాలి.
  2. అధిక దిగుబడినిచ్చే ఆహార పంటలను ప్రోత్సహించాలి.
  3. ఆహార ఉత్పత్తులకు ప్రభుత్వం సబ్సిడీ అందించాలి.
  4. కరువు పరిస్థితులను ఎదుర్కొనుటకు గిడ్డంగులను ఏర్పాటు చేయాలి.

ప్రశ్న 6.
క్రింది రేఖాచిత్ర పటంను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 3
i) గ్రామీణ భారతదేశంలో ఎంత భాగం ప్రజలు అవసరమైన దానికన్నా ఎక్కువ కాలరీలు వినియోగిస్తున్నారు?
ii) గ్రామీణ భారతదేశంలో అవసరమైన దానికన్నా తక్కువ కాలరీలు వినియోగించడానికి కారణమేమిటి?
జవాబు:
i) 20%
ii) 1) ప్రజల కొనుగోలు శక్తి తక్కువగా ఉండటం.
2) ఆహారం కొనడానికి సరిపడా ఆదాయం ప్రజలకు ఉండటం లేదు.
3) పేదరికం, నిరుద్యోగం కూడా ప్రధాన కారణాలు.

ప్రశ్న 7.
ఆహార ధాన్యాల అధికోత్పత్తికి హరిత విప్లవం ఏ విధంగా దోహదం చేసింది?
జవాబు:

  1. అధిక దిగుబడినిచ్చే వంగడాలను వాడటం.
  2. నీటి పారుదల వసతులను మెరుగుపరచడం.
  3. నూతన వ్యవసాయ పద్ధతులను అవలంబించడం.
  4. క్రిమి సంహారక మందులు మరియు రసాయనిక ఎరువులు వాడటం.
    మొదలగు హరిత విప్లవంలోని అంశాలు ఆహార ధాన్యాల అధికోత్పత్తికి దోహదం చేసినవి.

ప్రశ్న 8.
భారత సుప్రీం కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి అన్ని పాఠశాలల్లోను మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆదేశించింది. మధ్యాహ్న భోజన పథకం సక్రమ నిర్వహణ మీద ఒక కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:
మధ్యాహ్న భోజన పథకంపై కరపత్రము :

  1. స్థానికంగా పండించే ఆహార ధాన్యాలను వినియోగించాలి.
  2. నిర్దేశించిన మెనూను తప్పక అనుసరిస్తూ విద్యార్థులకు తగిన పోషక పదార్థాలు అందించాలి.
  3. పరిశుభ్రమైన పరిసరాలలో ఆహార పదార్థాలను తయారుచేయాలి.
  4. మధ్యాహ్న భోజన తయారీ, పంపిణీలో విద్యార్థుల, ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఉండాలి.

ప్రశ్న 9.
మీ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఆహార వృథాను అరికట్టడానికి సూచనలు వ్రాయండి.
జవాబు:

  1. ఆహారాన్ని రుచిగా, శుభ్రంగా వండాలి.
  2. ఆహార వృథా పరిణామాలను గురించి విద్యార్థులకు వివరించాలి.
  3. భోజన సమయంలో ఉపాధ్యాయులు పర్యవేక్షణ చేయాలి.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

ప్రశ్న 10.
ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం వలన ఏయే ప్రయోజనాలు చేకూరుతున్నాయో ప్రశంసించండి.
జవాబు:
మధ్యాహ్న భోజన పథకం వలన ప్రయోజనాలు : .

  1. ఆహార భద్రతను సమకూరుస్తుంది.
  2. పోషకాహారాన్ని అందిస్తుంది.
  3. నికర హాజరు శాతం పెరగడానికి సహాయపడుతుంది.

ప్రశ్న 11.
మీ ప్రాంతంలో ‘ప్రజా పంపిణీ వ్యవస్థ’ సక్రమ అమలుకు, సంబంధిత అధికారికి ఒక లేఖ రాయండి.
జవాబు:

సిరిసిల్ల
31 మార్చి 20xx.

To
తహశీల్దారు గారికి,
మండల రెవెన్యూ కార్యాలయము,
సిరిసిల్ల,

అయ్యా
విషయం : మా ప్రాంతంలో సక్రమంగా లేని చౌక ధరల దుకాణం నిర్వహణ దుకాణం సక్రమ నిర్వహణకు అభ్యర్ధన.

నేను సిరిసిల్లలోని సుభాష్ నగర్ ప్రాంత వాసిని. మా ప్రాంతంలో ప్రజా పంపిణీ వ్యవస్థ క్రింద పనిచేయుచున్న చౌక . ధరల దుకాణం నిర్వహణ సక్రమంగా లేదు ఎప్పుడు చూసినా మూయబడి వుంటుంది. రేషను వినియోగదారులు తమ సరకులు తీసుకెళ్ళేందుకు వచ్చి, దుకాణం మూయబడి ఉండటంతో ప్రభుత్వాన్ని, దుకాణం డీలరును నిందిస్తూ వెనుదిరిగి వెళుతున్నారు. వారు విధి లేని పరిస్థితులలో బహిరంగ మార్కెట్ ను ఆశ్రయించవలసి వస్తోంది. రోజువారీ పనులు చేసుకొనే వారు అటువంటి సందర్భాల్లో ఆ రోజు ఆదాయాన్ని కోల్పోవలసి వస్తోంది. దుకాణాన్ని ఎప్పుడో ఒకసారి తెరచినా అరకొరగా సరకులు అందిస్తున్నారు. కొన్ని సమయాలలో ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారు.

కావున మా ప్రాంతంలో చౌక ధరల దుకాణం సక్రమంగా పనిచేయు విధంగా ఆవశ్యక చర్యలు చేపట్టవలసిందిగా, తద్వారా మా ప్రాంత పేద ప్రజలకు మేలు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దీని ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ అసలు ఉద్దేశ్యం నెరవేరుతుంది. తమరు తక్షణ మరియు సానుకూల చర్యలు చేపట్టవలసినదిగా విజ్ఞప్తి చేయుచున్నాను.

ధన్యవాదములతో,

భవదీయుడు,
XXXXXXX.

To
తహశీల్దారు గారికి,
సిరిసిల్ల మండలం,
సిరిసిల్ల

ప్రశ్న 12.
భారతదేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ఉపయోగాలను వర్ణించండి.
జవాబు:
భారతదేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ఉపయోగాలు :

  1. భారతదేశంలో ఆహారధాన్యాలు అందుబాటులో ఉండటానికి చౌకధరల దుకాణాలు ఎంతో ముఖ్యమైనవి.
  2. ప్రజా పంపిణీ వ్యవస్థ పేదవారికి సబ్సిడీ ధరలలో ఆహార ధాన్యాలను అందిస్తుంది.
  3. తక్కువ ఆదాయం గలవారికి, నిరుపేదలకు ఆహార ధాన్యాలు అందుతాయి.
  4. పేద ప్రజలందరూ పోషకాహార స్థాయిని సాధించటానికి PDS దోహదం చేస్తుంది.

ప్రశ్న 13.
ఆహార వృథాను అరికట్టడానికి ఏవేని రెండు నినాదాలను రాయండి.
జవాబు:
ఆహార వృధాను అరికట్టడానికి నినాదాలు :

  1. అన్నం పరబ్రహ్మ స్వరూపం – కనుక వృధా చేయకండి.
  2. మీరు వృధా చేసే ప్రతి మెతుకు – నింపు మరొకరి కడుపు
  3. ఆహారం వృధా చేసే ముందు, ఆలోచించు రైతు కష్టం.

ప్రశ్న 1.
గ్రామీణ, పట్టణ ప్రాంతవాసులకు కనీసం అవసరమైన కాలరీలు, తీసుకుంటున్న వినియోగిస్తున్న కాలరీల గురించి వివరించుము.
జవాబు:
రోజుకు పట్టణ ప్రాంతాల్లో 2100 కాలరీలు, గ్రామీణ ప్రాంతాల్లో 2400 కాలరీలు శక్తిని ఇచ్చే ఆహారం తీసుకోవాలి. తీసుకోవలసిన కాలరీల కంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాల జాతీయ సగటు తక్కువగా ఉంది. అంతేకాకుండా కాలరీల వినియోగం 1983తో పోలిస్తే 2004 నాటికి తగ్గింది. మన దేశ ఆర్థిక పరిస్థితి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇలా జరగటం ఆందోళనకరంగా ఉంది.

ప్రశ్న 2.
ఎత్తు, బరువు సూచికల ఆధారంగా వేనిని అంచనా వేయవచ్చు?
జవాబు:
ప్రజా పంపిణీ వ్యవస్థ సామర్థ్యం, ఆహార పంటలను పండించటానికి ప్రాధాన్యత, ప్రజల కొనుగోలు శక్తి వంటి వాటినన్నింటినీ ప్రజల ఎత్తు, బరువు వంటి సూచికల ఆధారంగా అంచనా వేయవచ్చు. అంతే కాకుండా ఒక వ్యక్తి ఎత్తు ద్వారా అతనికి/ ఆమెకు బాల్యంలో సరిపడా ఆహారం అందిందో లేదో చెప్పవచ్చు. తక్కువ బరువు, తక్కువ ఎత్తు ఉన్న వాళ్లు పోషకాహార లోపానికి గురయ్యారని పేర్కొంటారు.

ప్రశ్న 3.
క్రింది గ్రాఫ్ ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలకు సరియైన సమాధానములిమ్ము.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 3
i) దేశంలో సంపన్నులైన 25% ప్రజలు సగటున రోజుకు ఎన్ని కాలరీలు తీసుకుంటున్నారు?
జవాబు:
దేశంలో సంపన్నులైన 25% ప్రజలు సగటున రోజుకు 2521 కాలరీలు తీసుకుంటున్నారు.

ii) ధనికులకు కింది పావుభాగం (25%) ప్రజలకు తీసుకుంటున్న కాలరీల్లో తేడా ఎంత?
జవాబు:
2521-1624 = 897 కాలరీలు.

iii) ఎవరు అతి తక్కువ కాలరీలు తీసుకుంటున్నారు?
జవాబు:
అట్టడుగు వర్గం వారు. (కింది పావుభాగం) అతి తక్కువ కాలరీలు తీసుకుంటున్నారు.

iv) కారణమేమి?
జవాబు:
కారణం : వారి ఆదాయం తక్కువగా ఉండటం, ఆహార పదార్థాల కొనుగోలు శక్తి తక్కువగా ఉండటం వలన.

v) ఈ గ్రాఫ్ ను బట్టి నీవు ఏ అభిప్రాయానికి వచ్చావు?
జవాబు:
ఆర్థికస్థాయి, ఆహారస్థాయిని నిర్దేశిస్తుంది.

10th Class Social 11th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
“కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడింట ఒక వంతు ఆహారధాన్యాలను రైతుల నుంచి కొనుగోలు చేస్తాయి. వివిధ పథకాల ద్వారా ఈ ఆహార ధాన్యాలను ప్రజలకు పంపిణీ చేస్తాయి.”
ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా ప్రభుత్వాలు ప్రజలకు సక్రమంగా ఆహార భద్రతను కల్పిస్తున్నాయని నీవు భావిస్తున్నావా? నీ అభిప్రాయం సవివరంగా తెలియజేయుము.
జవాబు:

  1. ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా ప్రభుత్వాలు ప్రజలకు సక్రమంగా ఆహార భద్రత కల్పిస్తున్నాయని నేను భావిస్తున్నాను.
  2. భారతదేశ దక్షిణాది రాష్ట్రాలలో ప్రజాపంపిణీ వ్యవస్థ బాగుందని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి.
  3. ప్రజా పంపిణీ వ్యవస్థలు అందరికి తక్కువ ధరలకు ఆహార ధాన్యాలను అందిస్తాయి.
  4. అంత్యోదయ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు 35 కిలోల ఆహార ధాన్యాలను ప్రజాపంపిణీ వ్యవస్థ అందిస్తుంది.
  5. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలలోని ప్రతివ్యక్తికి సబ్సిడీ ధరలకు 5 కిలోల ఆహారధాన్యాలు అందిస్తున్నాయి.
    కనుక పై చర్యల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు సక్రమంగా ఆహార భద్రతను కల్పిస్తున్నాయి.

ప్రశ్న 2.
క్రింది పేరాను చదివి, మీ అభిప్రాయం రాయండి.
‘భారత పార్లమెంటు జాతీయ ఆహారభద్రత చట్టం వంటి చట్టాలను, సమగ్ర శిశు అభివృద్ధి పథకం వంటి పథకాలను అమలు చేస్తుండగా ఇటీవల కాలంలో ఆహారభద్రత అమలు అయ్యేలా చూడటంలో భారత న్యాయ వ్యవస్థ కూడా చురుకైన పాత్ర పోషిస్తుంది. స్వచ్ఛంద సంస్థలు చేసిన దావాలలో తీర్పును ఇస్తూ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
జవాబు:

  1. ఈ పేరా ఆహార భద్రతా చట్టం పిల్లలకు బాగా ఉపయోగపడుతుందని తెలియజేస్తుంది.
  2. కోర్టులు చెప్పిన తీర్పుల ప్రకారం ప్రతి ఒక్కరికి ఆహారం అందించే బాధ్యతను ప్రభుత్వాలు తీసుకున్నాయి.
  3. దాని ప్రకారమే పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.
  4. ఈ పథకం ప్రకారం పాఠశాలల్లో చదువుతున్న 14 కోట్ల మంది పిల్లలు ఈ రోజు మధ్యాహ్న భోజనం తింటున్నారు.
  5. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చెయ్యటానికి నిరాకరించినప్పుడు న్యాయ స్థానం పర్యవేక్షణ విధానాన్ని కూడా నెలకొల్పింది.
  6. అలాగే స్థానికంగా పండించిన ఆహార ధాన్యాలను ఉపయోగించాలని, వేడిగా వండి పెట్టాలని (అప్పటి దాకా అనేక ప్రభుత్వాలు ఆహార ధాన్యాలు లేదా తినుబండారాలు ఇచ్చేవి), అది శుభ్రంగా, పోషకాహారంగా (సిఫారసు చేసిన కాలరీలు ఉండేలా) ఉండాలని, వారంలో ప్రతిరోజు వేర్వేరు పదార్థాలు పెట్టాలంటూ, మధ్యాహ్న భోజన పథకాన్ని మెరుగ్గా అమలుపరచటానికి అనేక సిఫారసులు న్యాయస్థానం చేసింది.
  7. ఆహారం వండటంలో దళితులకు, విధవలకు, ఏ ఆధారం లేని మహిళలకు ప్రాధాన్యతనివ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
  8. ప్రపంచంలోకెల్లా ఇదే అత్యంత పెద్ద పాఠశాల భోజన పథకం. ఈ పథకానికి డబ్బులు సమకూర్చుకోటానికి పన్నులు విధించమని కూడా భారత ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పుడు అంగన్వాడీలలోని పిల్లలకు కూడా వేడిగా ‘వండిన ఆహారం పెడుతున్నారు.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

ప్రశ్న 3.
ప్రస్తుతం దేశానికి “ఆహార భద్రత’ అవసరం ఎంతవరకు ఉంది?
జవాబు:
ప్రస్తుతం దేశానికి “ఆహార భద్రత” అవసరం :

  1. ఆహార ధాన్యాల లభ్యత
  2. సరిపడా కాలరీలు అందించే ఆహారం లభ్యం కాకపోవడం.
  3. కొనుగోలు శక్తి తక్కువగా ఉండటం.
  4. పేదరికం.
  5. నిరుద్యోగం
  6. ప్రజా సదుపాయాలు సరిపోయినంతగా లేకపోవడం.
  7. ఆహార ధాన్యాలు పేదలకు, పేదలు కాని వారికి వేర్వేరు ధరలకు అమ్మడం.
  8. పిల్లలలో పోషకాహార లోపం.

ప్రశ్న 4.
క్రింది పట్టాను పరిశీలించండి.
పంటల దిగుబడి (హెక్టారుకు కిలోలు)

పంట 1950-51 2000-2001
వరి 668 1901
గోధుమ 655 2708
పప్పుధాన్యాలు 441 544
నూనెగింజలు 481 810
పత్తి 88 190
జనపనార 1043 2026

వివిధ రకాల పంటల దిగుబడి ధోరణులను విశ్లేషిస్తూ ఒక పేరా రాయండి.
జవాబు:
1950-1951 మరియు 2000-2001వ సంవత్సరంలో పంటల దిగుబడి ఎలా ఉందో పై పట్టిక తెలియచేస్తుంది. వరి మరియు గోధుమల ఉత్పత్తిలో చాలా పెరుగుదల కనిపించింది. కాని పప్పు ధాన్యాల ఉత్పత్తి 100 కిలోలు మాత్రమే పెరిగింది. నూనె గింజలు, ప్రత్తి, జనపనార ఉత్పత్తుల పెరుగుదల రెట్టింపు అయ్యింది.

దానికి అంతటికీ ప్రధాన కారణం హరిత విప్లవం. అన్ని ఆహార పదార్థాలను పరిశీలిస్తే హరిత విప్లవం వలన వరి మరియు గోధుమ పంటలు బాగా లాభపడ్డాయని చెప్పవచ్చు. అలాగే మిగతా ఆహారధాన్యాల ఉత్పత్తి కూడా బాగా పెరిగింది.

ప్రశ్న 5.
ప్రజాపంపిణీ వ్యవస్థ పేదవారికి ఆహార అందుబాటును ఎలా కలిగిస్తుందో విశ్లేషించుము.
జవాబు:
ప్రజాపంపిణీ వ్యవస్థ – పేదవారికి ఆహార అందుబాటు విశ్లేషణ :

  1. జాతీయ ఆహారభద్రత చట్టం ప్రజలకు ఆహారాన్ని పొందే హక్కుకు చట్టబద్ధతనిచ్చింది.
  2. భారతదేశంలోని మూడింట రెండు వంతుల జనాభాకు వర్తిస్తుంది.
  3. ప్రజాపంపిణీ వ్యవస్థ పేదవారికి సబ్సిడీ ధరలలో ఆహార ధాన్యాలను అందిస్తుంది.
  4. అంత్యోదయ కార్డు ఉన్నవాళ్ళకు ప్రతి కుటుంబానికి, నెలకు 35 కిలోల ఆహార ధాన్యాలు (బియ్యం లేదా గోధుమలు) అందుతాయి.
  5. తక్కువ ఆదాయం గలవారికి ఆహార ధాన్యాలు అందుతాయి.
  6. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 75 శాతం వారికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు అందిస్తున్నారు.
  7. పట్టణ జనాభాలో 50% మందికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు అందిస్తున్నారు.
  8. పోషకాహార స్థాయిని సాధించటానికి ప్రజాపంపిణీ వ్యవస్థ దోహదం చేస్తుంది.
  9. భారతదేశ దక్షిణాది రాష్ట్రాలలో ప్రజాపంపిణీ వ్యవస్థ బాగుందని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి.

ప్రశ్న 6.
పట్టికలో ఇవ్వబడిన సమాచారమును పరిశీలించి విశ్లేషించండి.
AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత 8
జవాబు:
పట్టికలోని 1961-2011 వరకు భారతదేశంలో తలసరి ఆహారధాన్యాల అభ్యత వివరాలు పొందుపరచబడినవి.

  1. 1951 దేశ జనాభా 361 మిలియన్లు. ఆహారధాన్యాల ఉత్పత్తి 50.8 మిలియన్ టన్నులు కాగా ఒక రోజుకు తలసరి ఆహారధాన్యాల లభ్యత 395 గ్రాములు.
  2. 1961 సంవత్సరానికి 78 మిలియన్ల జనాభా మరియు దాంతోపాటే సుమారు 32 మిలియన్ టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగింది. తలసరి ఆహారధాన్యాల లభ్యత ఒక రోజుకు 469 గ్రాములుగా ఉంది.
  3. 1971, 1991 మరియు 2011లలో జనాభా మరియు అదే స్థాయిలో ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగింది. కాని 1961, 1971లలో తలసరి ఆహారధాన్యాల లభ్యత పెరగలేదు, ఒకే విధంగా ఉంది.
  4. 1991 నుండి 2011 వరకు ఆహారధాన్యాల లభ్యత వరదలు, కరవులు మరియు ప్రకృతి వైపరీత్యాల వల్ల కుంటుపడింది. అధిక జనాభా కూడా ఇందుకు మరో కారణం.

1991 వరకు జనాభా, ఆహారధాన్యాల ఉత్పత్తి మరియు తలసరి ఆహారధాన్యాల లభ్యత పెరిగింది. కాని 2011లో జనాభా మరియు ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగిన స్థాయిలో తలసరి ఆహారధాన్యాల లభ్యత పెరగకపోగా క్షీణించింది.

దేశం మొత్తానికి సరిపడా ఆహారధాన్యాలను పండించడం ప్రాథమిక అవసరం. దేశంలో తలసరి సగటు ఆహారధాన్యాల లభ్యత సరిపడా ఉండాలి. కాలక్రమంలో పెరుగుతూ ఉండాలి. పై సమాచారం బట్టి 2011 నుండి తలసరి ఆహార ధాన్యాల లభ్యత క్షీణిస్తోందని వెల్లడవుతోంది.

కావున ప్రభుత్వం ఈ విషయమై ఆవశ్యకమైన చర్యలు చేపట్టాలి. ఆహారధాన్యాలు ఎక్కువగా పండించేలా రైతులను ప్రోత్సహించాలి. ఎగుమతులపై నియంత్రణ విధించాలి. కొన్ని సమయాల్లో ప్రజలు ఆహారధాన్యాలు లేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం తమకు అవసరమైనవి దిగుమతి చేసుకోవడానికిగాను ఆహారధాన్యాలను ఇతరదేశాలను ఎగుమతి చేస్తుంది. దేశ ప్రజలందరికీ ముఖ్యంగా పేదవారికి ఆహారధాన్యాలు అందుబాటులో ఉండేలా చేయటం అన్నది సంక్షేమ ప్రభుత్వ కనీస కర్తవ్యం.

ప్రశ్న 7.
“ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజలకు ఆహార భద్రత ఉండేలా చూడగలదు.” వివరింపుము.
జవాబు:
ప్రజాపంపిణీ వ్యవస్థ – ఆహార భద్రత :

  1. భారతదేశంలో ఆహారధాన్యాలు అందుబాటులో ఉండటానికి ప్రజలకు చౌకధరల దుకాణాలు ఎంతో ముఖ్యమైనవి.
  2. పేద ప్రజలందరికీ అతితక్కువ ధరలకు చౌకధరల దుకాణాల ద్వారా ఆహారధాన్యాలు అందుతాయి.
  3. పేదలలో కూడా అత్యంత పేదలకు ప్రత్యేక కేటాయింపులు ఉన్నాయి.
    ఉదా : అంత్యోదయ కార్డువారికి ఒక్కో కుటుంబానికి నెలకు 35 కేజీల చొప్పున ఆహారధాన్యాలు అందుతాయి.
  4. గ్రామీణ ప్రాంతాలలో 75%, పట్టణ ప్రాంతాలలో 50% ప్రజలకు ప్రజాపంపిణీ వ్యవస్థ నుంచి ఆహారధాన్యాలను కొనుగోలు చేసే హక్కు ఉంది.
    ఈ విధంగా ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రజలకు ఆహారభద్రత ఉండేలా చూడగలదు.

ప్రశ్న 8.
ప్రస్తుతము జాతీయ ఆహార భద్రతా చట్టం ఏ విధంగా అమలౌతోంది?
జవాబు:
ప్రస్తుతం జాతీయ ఆహార భద్రతా చట్టం అమలు అవుతున్న తీరు.

  1. ప్రజలకు ఆహారము పొందే హక్కుకు చట్టబద్ధతనిచ్చిన చట్టం.
  2. ఆహార భద్రత చట్టం పరిధిలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు :

ఎ. ప్రజా పంపిణీ వ్యవస్థ :

  1. ప్రజాపంపిణీ వ్యవస్థలో చౌక ధరల దుకాణాలు ప్రధానమయినవి. నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించేవి చౌకధరల దుకాణాలు.
  2. భారతదేశంలో ఆహారధాన్యాలు అందుబాటులో ఉండటానికి, ప్రజలకు చౌకధరల దుకాణాలు ఎంతో ముఖ్యమైనవి.
  3. చౌకధరల దుకాణాల నుంచి కొనుగోలు చేసే ఆహారధాన్యాలు, వాళ్ళ మొత్తం ఆహార ధాన్యాల వినియోగంలో ఎక్కువ శాతమే ఉంది.
  4. ఈ ప్రజాపంపిణీ వ్యవస్థలో ప్రజలకు తెల్లకార్డులు, పింక్ కార్డులు, అంత్యోదయ కార్డుల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయబడతాయి.

బి. అంగన్‌వాడీ కేంద్రాలు :

  1. అంగన్ వాడీల ద్వారా 1-6 వయసు గల పిల్లలకు, పాలిచ్చే తల్లులకు, గర్భిణీ స్త్రీలకు పోషకాహారం సరఫరా చేయబడుతుంది.
  2. పిల్లల యొక్క ఎత్తు, బరువులను ఎప్పటికప్పుడు పరీక్షించి, తగుచర్యలు తీసుకుంటారు.
  3. పిల్లలకు అవసరమైన వైద్య, ఆరోగ్య సూచనలు ఆందింళబడతాయి, వ్యాక్సినేషన్ ఉంటుంది.
  4. ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణం ఉండటం వలన పిల్లల ఎదుగుదల చక్కగా ఉంటుంది.
  5. అంగన్ వాడీ కేంద్రంలో సరఫరా చేయు గ్రుడ్లు, ప్రోటీన్స్ (సోయాబీన్స్ పొడి), సమతౌల్య ఆహారం పొడి మొ||నవి – పిల్లల ఎదుగుదలకు, అభివృద్ధికి ఎంతో తోడ్పడతాయి.

సి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం (6-14 వయసు పిల్లలకు) అమలవుతుంది.

AP 10th Class Social Important Questions Chapter 11 ఆహార భద్రత

ప్రశ్న 9.
భారతదేశంలో ప్రజలకు ఇతర ఆహార పదార్థాల కనీస అవసరం, లభ్యత ఎలా ఉంది?
జవాబు:
కాలక్రమంలో ఇతర ఆహార పదార్థాల ఉత్పత్తి పెరిగినప్పటికి రోజువారీ కనీస ఆహార అవసరాలు తీర్చటానికి సరిపడేటంతగా ఇది లేదు. భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకు 300 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పళ్లు తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే, వీటి లభ్యత వరుసగా 180 గ్రాములు, 58 గ్రాములు మాత్రమే ఉంది. అదే విధంగా సగటున ప్రతి వ్యక్తి సంవత్సరంలో 180 గుడ్లు తీసుకోవలసి ఉండగా వీటి అభ్యత 30 మాత్రమే. ఆహారంలో మాంసం సగటున ప్రతి వ్యక్తి సంవత్సరానికి 11 కిలోలు తీసుకోవలసి ఉండగా లభ్యత 3.2 కిలోలు మాత్రమే. రోజుకు ప్రతి వ్యక్తి 300 మిల్లీలీటర్ల పాలు తీసుకోవలసి ఉండగా లభ్యత 210 మిల్లీలీతార్లు మాత్రమే ఉంది.

ప్రశ్న 10.
ఆహార భద్రత అమలు అయ్యేలా చూడటంలో న్యాయ వ్యవస్థ పాత్రను వివరించుము.
జవాబు:
ఇటీవలి కాలంలో ఆహార భద్రత అమలు అయ్యేలా చూడటంలో భారత న్యాయ వ్యవస్థ కూడా చురుకైన పాత్ర పోషిస్తోంది. స్వచ్ఛంద సంస్థలు వేసిన దావాలలో తీర్పును ఇస్తూ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకం తమిళనాడు వంటి రాష్ట్రాలలో చిన్న స్థాయిలో అమలు అవుతూ ఉండేది. ఇప్పుడు ఈ పథకం అన్ని రాష్ట్రాలలో అమలు అవుతోంది. పాఠశాలల్లో చదువుతున్న 14 కోట్ల మంది పిల్లలు ఈ రోజు మధ్యాహ్న భోజనం తింటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చెయ్యటానికి నిరాకరించినప్పుడు న్యాయం స్థానం పర్యవేక్షణ విధానాన్ని కూడా నెలకొల్పింది. అలాగే స్థానికంగా పండించిన ఆహార ధాన్యాలను ఉపయోగించాలని, వేడిగా వండి పెట్టాలని (అప్పటి దాకా అనేక ప్రభుత్వాలు ఆహార ధాన్యాలు లేదా తినుబండారాలు ఇచ్చేవి), అది శుభ్రంగా, పోషకాహారంగా (సిఫారసు చేసిన కాలరీలు ఉండేలా) ఉండాలని, వారంలో ప్రతిరోజు జేర్వేరు పదార్థాలు పెట్టాలంటూ, మధ్యాహ్న భోజన పథకాన్ని మెరుగ్గా అమలు పరచటానికి అనేక సిఫారసులు న్యాయస్థానం చేసింది. ఆహారం వండటంలో దళితులకు, విధవలకు, ఈ ఆధారం లేని మహిళలకు ప్రాధాన్యతనివ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచంలోకెల్లా ఇదే అత్యంత పెద్ద పాఠశాల భోజన పథకం. ఈ పథకానికి డబ్బులు సతుకూర్చుకోటానికి పన్నులు విధించతుని కూడా భారత ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పుడు అంగన్‌వాడీలలోని పిల్లలకు కూడా వేడిగా వండిన ఆహారం పెడుతున్నారు.

ప్రశ్న 11.
భారతదేశం ప్రజలకు ఆహారం అందేలా చూడడానికి ఏ ఏ విధి విధానాలను రూపొందించింది?
జవాబు:

  1. భారతదేశంలో ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంచడానికి ప్రజలకు చౌక ధరల దుకాణాలు ఎంతో ముఖ్యమైనవి.
  2. 2013లో భారత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం అనే కొత్త చట్టం చేసింది.
  3. భారతదేశంలో మూడింట రెండు వంతుల జనాభాకు ఇది వర్తిస్తుంది.
  4. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలలోని ప్రతి వ్యక్తికి సబ్సిడీ ధరకు 5 కిలోల బియ్యం అందుతాయి.
  5. పేదవాళ్ళలో అత్యంత పేదలకు 35 కిలోలు ఇవ్వాలి.
  6. గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, అంగన్‌వాడీకి వచ్చే 1-6 సం|| పిల్లలకు, బడికి వచ్చే 6-14 సంవత్సరాల పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టాలి.
  7. ఇలా ప్రభుత్వం అందరికీ ఆహారం అందుబాటులో ఉంచింది.

ప్రాజెక్టు

” అమ్మ అనే క్రింది కవిత చదవండి. ఆహార భద్రతకు సంబంధించి ఏదో ఒక అంశంపైన మీరు కూడా ఒక కవిత రాయండి.

అమ్మ

పేగుల అరుపులను పట్టించుకోకుండా
ఎండిన గొంతు, పెదాలతో బాధపడుతూ
ప్రవహించే కన్నీటిని ఆపుతూ
తటాకాలైన కళ్లతో నిన్ను చూశాను …..

నువ్వు మాత్రం సగమే తింటూ,
అందరికీ తినటానికి ఉండాలని
ఒక రొట్టె, ఇంకొంచెం
ఏదో చెయ్యటానికి

పొయ్యిముందు కూర్చుని
నీ ఎముకలనే కాల్చిన
నిన్ను చూశాను …

అందరి ఇళ్లల్లో బట్టలు ఉతుకుతూ,
అంట్లు తోముతూ
వాళ్లు పారేసింది నీకు ఇస్తే
పరమాన్నంగా తీసుకున్న
నిన్ను చూశాను …

విద్యార్థులు స్వయంగా రాయగలరు :
ఆధారం :
పేదవాడి ఆకలిని ఏ హక్కు ఇచ్చి తీర్చలేం, ఆకలితో ఉన్నవాడికి ఆహారం కాకుండా ఏ విధమైన (రాజకీయ) అవకాశం, సమానత్వం ఇచ్చిన వ్యర్థమే … ఆహార భద్రత తప్ప అనే భావనతో ఈ కవిత …… -మ.శ్రీ

ఏమని వివరించను ! ఎవరికి విన్నవించను
కాలే కడుపుల కష్టాల గురించి,

ఆకలితో తడిమిన చేతికి కడుపు, వీపు
ఏకమయ్యి తగిలితే,

నీరసంతో నేలను తాకిన ఎముకల గూడుకు
అల్లుకున్న వస్త్ర చర్మం చలికి వణుకుతుంటే, …..

ఈ కణకణలాడే ఉదరకొలిమి గురించి ….
కాలకూట విషం మింగిన ఆ శివునికే ఎరుక.

ఓటు తీరుస్తుందా? సీటు ఆర్పుతుందా? …. నా ఆకలి – మంటలను
పార్లమెంటు ఆపుతుందా? ప్రజాస్వామ్యం అంతం చేస్తుందా? ….. నా పేగుల అరుపులను.
అందుకే …… అమ్మలాంటి ఆహార భద్రత చట్టం
చెయ్యకండి భరతమాత బిడ్డలకు దూరం.