These AP 10th Class Social Studies Important Questions 16th Lesson భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947 will help students prepare well for the exams.
AP Board 10th Class Social 16th Lesson Important Questions and Answers భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947
10th Class Social 16th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium
1. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ ప్రధాని ఎవరు?
జవాబు:
విస్టన్ చర్చిల్.
2. భారత దేశ చివరి వైస్రాయ్ ఎవరు?
జవాబు:
మౌంట్ బాటెన్.
3. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ ఏది?
జవాబు:
CPI (భారత కమ్యూనిస్ట్ పార్టీ)
4. బ్రిటిషు అధికారం కింద వివిధ స్థాయిలలో సర్వ సత్తాక పాలనతో సుమారుగా ఉన్న సంస్థానాలు ఎన్ని?
జవాబు:
550.
5. భారత ప్రభుత్వం రాజ భరణాలను రద్దుచేసిన సంవత్సరం?
జవాబు:
1971.
6. గాంధీజీ చొరవతో అల్ప సంఖ్యాక వర్గాల హక్కులపై తీర్మానం చేసినది ఎవరు?
జవాబు:
కాంగ్రెసు నాయకుడు జవహర్ లాల్ నెహ్రు.
7. ‘అజాద్ హింద్ ఫౌజ్’ను స్థాపించిన వారు ఎవరు?
జవాబు:
సుభాష్ చంద్రబోస్.
8. బ్రిటిషు ప్రభుత్వ పాలనా విధానం ఏది?
జవాబు:
విభజించు – పాలించు.
9. ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలను కేటాయించిన సంవత్సరం?
జవాబు:
1909.
10. భారత దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వటానికి సుముఖత చూపిన బ్రిటన్ పార్టీ ఏది?
జవాబు:
లేబర్ పార్టీ
11. ఎవరి నాయకత్వంలో నౌకాదళ కేంద్రీయ సమ్మె సంఘం ఏర్పడింది?
జవాబు:
M.S. ఖాన్
12. బొంబాయి రేవులోని ఏ నౌకాదళం 1946 ఫిబ్రవరి 16న నిరాహార దీక్ష చేపట్టారు?
జవాబు:
రాయల్ నౌకాదళం.
13. ‘తెభాగ’ ఉద్యమం ఏ రాష్ట్రంలోని రైతులు చేపట్టారు?
జవాబు:
బెంగాల్.
14. మంత్రిత్రయ రాయభారం (ముగ్గురు సభ్యుల బృందం)ను ఢిల్లీకి పంపిన సంవత్సరం?
జవాబు:
1946.
15. భారతదేశాన్ని విభజించకుండా మూడంచెల సమాఖ్యను ప్రతిపాదించింది ఎవరు?
జవాబు:
క్యాబినెట్ మిషన్.
16. మొదటి స్వాతంత్ర దినోత్సవం నాడు సంబరాలు చేసుకోకుండా నిరాహార దీక్ష చేసిన ప్రముఖ నాయకుడు ఎవరు?
జవాబు:
గాంధీజీ.
17. 1937లో రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ సంవత్సరంలో రాజీనామా చేసాయి?
జవాబు:
1939.
18. ‘తెభాగ’ ఉద్యమానికి నాయకత్వం వహించిన సంస్థ ఏది?
జవాబు:
రాష్ట్ర కిసాన్ సభ.
19. దేశ విభజనను ప్రకటించిన వైస్రాయ్ ఎవరు?
జవాబు:
మౌంట్ బాటెన్.
20. ఏ పార్టీ భారతీయులందరికి ప్రాతినిధ్యం వహించటం లేదని బ్రిటిష్ వారి భావం?
జవాబు:
కాంగ్రెస్ పార్టీ.
21. సంపూర్ణ స్వరాజ్యం కోరిన పార్టీ?
జవాబు:
కాంగ్రెస్.
22. ఉత్తర ప్రదేశ్ లోని ముస్లిం భూస్వాముల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఏది?
జవాబు:
ముస్లిం లీగ్.
23. ముస్లింలీగ్ కు ఏ సంవత్సరం వరకు పెద్దగా ప్రజలకు మద్దతు లేదు?
జవాబు:
1930.
24. NWFC ని విస్తరింపుము
జవాబు:
నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్
25. RSSని విస్తరింపుము.
జవాబు:
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.
26. అమెరికా, యూరపులో ఏదేశం సాధించిన విజయాలు భారతీయులపై బలమైన ముద్రలు వేశాయి?
జవాబు:
జపాన్.
27. INA ను విస్తరింపుము.
జవాబు:
భారత జాతీయ సైన్యం.
28. INA ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
జవాబు:
1942.
29. క్విట్ ఇండియాలో గాంధీజీ ఇచ్చిన నినాదం …..?
జవాబు:
చేయి లేదా చావండి. (Do or Die)
30. ‘సారే జహాసె అచ్చా హిందుస్తాన్ హమారా’ అన్న కవిత రాసిన వ్యక్తి ఏ భాషా కవి?
జవాబు:
ఉర్దూ కవి.
31. ‘దేశ రాజధాని అయిన ఢిల్లీకి అతడు 1947, సెప్టెంబడు 9న గాని రాలేదు. వాయువ్య భారతంలో పెద్ద ఎత్తున చెలరేగిన మత ఘర్షణలతో ఆ వృద్ధ నేత అసంతృప్తితో ఉన్నాడు. ప్రజల భయాలను దూరం చెరు, దానికి అతడు ప్రయత్నించాడు.” ఈ వాక్యంలోని నేత ఎవరు?
జవాబు:
గాంధీజీ.
32. ముస్లిం లీగ్ పార్టీ నాయకుడు ఎవరు?
జవాబు:
మహ్మద్ అలీ జిన్నా.
33. ముస్లిం లీగ్ ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించిన రోజు ఏది?
జవాబు:
1946, ఆగస్టు 16.
34. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) 1937 ఎన్నికలలో మొత్తం ముస్లిం ఓట్లలో 4.4% మాత్రమే ముస్లిం లీగుకు వచ్చాయి.
ii) 1946 ఎన్నికలలో ముస్లిం నియోజక వర్గాల్లో సైతం ముస్లిం లీగు ఓడిపోయింది.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
A (i) మాత్రమే
35. ‘ఛలో ఢిల్లీ’ (ఢిల్లీ పదండి) నినాదం ఇచ్చింది ఎవరు?
జవాబు:
సుభాష్ చంద్రబోస్
36. “1930 లో ముస్లిం లీగుకు అధ్యక్షోపన్యాసం ఇస్తూ వాయవ్య ముస్లిం రాష్ట్ర ఆవశ్యకతను గురించి మాట్లాడాడు.” ఇక్కడ ఎవరు ఉపన్యాసం ఇచ్చింది?
జవాబు:
మహ్మద్ ఇక్బాల్.
37. క్రింది సమాచారంను పూరించండి.
జవాబు:
బెలూచిస్తాన్.
38. 1939 లో కాంగ్రెసు ప్రభుత్వాలు రాజీనామా చెయ్యటానికి కారణమేమి?
జవాబు:
భారతీయులు 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొంటున్నారని బ్రిటన్ ప్రకటించడం.
39. “భారత దేశంలో విలీనం కావలసిన ఆవశ్యకత గురించి అతడు రాచరిక కుటుంబాలతో చర్చలు మొదలు పెట్టాడు”. ఈ వాక్యంలో ప్రస్తావించబడిన ‘అతడు’ ఎవరు?
జవాబు:
సర్దార్ వల్లభాయ్ పటేల్.
40. “సారే జహాసే అచ్ఛా హిందుస్తాన్ హమారా.” అన్నది ఎవరు?
జవాబు:
మహ్మద్ ఇక్బాల్.
41. మహ్మద్ అలీ జిన్నా క్రియాశీలకంగా పాల్గొన్న సంస్థ ఏది?
జవాబు:
ముస్లిం లీగ్.
42. క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యింది?
జవాబు:
1942.
43. హైదరాబాదులో తెలంగాణ ప్రాంత రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీ ఏది?
జవాబు:
కమ్యూనిస్ట్ పార్టీ.
44. 1947 లో సంస్థానాల విలీనం చేసే బాధ్యతను ఎవరికి అప్పగించడం జరిగింది?
జవాబు:
సర్దార్ వల్లభాయ్ పటేల్ కు.
45. ముస్లిం లీగు ప్రత్యక్ష కార్యాచరణ దినంను ప్రకటించడానికి కారణమేమి?
జవాబు:
పాకిస్తాన్ పేరిట ప్రత్యేక జాతీయ రాజ్యము కొరకు.
46. కులం, వర్గాలను అధిగమించి, హిందువులందరినీ ఏకం చేసి సామాజిక జీవితంలో సంస్కరణలు తీసుకురావాలని ఆశించే సంఘం ఏది?
జవాబు:
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)
47. క్విట్ ఇండియా ఉద్యమానికి ప్రధాన కారణం ఏమి?
జవాబు:
క్రిప్స్ రాయభారం విఫలం అవ్వడం.
48. ‘రాజభరణం’ దేని కోసం మంజూరు చేశారు?
జవాబు:
రాచరిక కుటుంబాల వ్యక్తిగత ఖర్చులకు.
49. ‘తెభాగ’ ఉద్యమం చేసినది ఎవరు?
జవాబు:
చిన్న, పేద రైతులు.
50. బ్రిటిషు మంత్రివర్గం ముగ్గురు సభ్యుల బృందాన్ని 1946 మార్చిలో దేనికోసం ఢిల్లీకి పంపింది?
జవాబు:
భారతదేశ స్వాతంత్ర్యానికి అనువైన రాజకీయ చట్టం చేయడానికి.
51. బ్రిటిషు వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నడిపిన మూడవ పెద్ద ఉద్యమం ఏది?
జవాబు:
క్విట్ ఇండియా.
52. 1937లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెసు ఎన్ని రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చింది?
జవాబు:
8
53. భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చినపుడు బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు?
జవాబు:
అట్లీ.
54. ముస్లింలీగు ఏ సంవత్సరంలో ఏర్పడింది?
జవాబు:
1906.
54. ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేసిన సంవత్సరమేది?
జవాబు:
1909.
56. క్రిప్స్ రాయభారం భారతదేశానికి వచ్చిన సంవత్సరం?
జవాబు:
1942.
57. పాకిస్థాన్ స్వాతంత్ర్యం వచ్చిన తేది?
జవాబు:
1947 ఆగస్టు 14.
58. గాంధీజీ మరణించిన తేది?
జవాబు:
1948, జనవరి 30.
59. యుద్ధ సమయంలో ఇంగ్లండు ప్రధాని అయిన చర్చిల్ ఏ పార్టీకి చెందినవాడు?
జవాబు:
కన్సర్వేటివ్.
60. కాబినెట్ మిషన్ భారతదేశానికి వచ్చిన సంవత్సరం?
జవాబు:
1946.
61. పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ అన్న పేరును రూపొందించిన వారు ఎవరు?
జవాబు:
చౌదరీ రెహ్మత్ అలీ.
62. ఏ సంవత్సరం నాటికి జపాను ఆగ్నేయ ఆసియాలోకి విస్తరించ సాగింది?
జవాబు:
1941.
63. పశ్చిమంలో సతార, తూర్పున మేదినిపూర్ వంటి జిల్లాల్లో స్వతంత్ర ప్రభుత్వాలను ప్రకటించిన సోషలిస్టు నాయకుడు ఎవరు?
జవాబు:
జయప్రకాశ్ నారాయణ్.
64. INA, బ్రిటిషు వాళ్ళకు వ్యతిరేకంగా దాదాపు ఎన్ని సంవత్సరాలు యుద్ధం చేసింది?
జవాబు:
3 సంవత్సరాలు
65. సాయుధ పోరాటం సంభవించిన ఒక ప్రాంతంను తెల్పండి.
జవాబు:
తెలంగాణ, ట్రావెన్‌కోర్ లోని పున్నప్రా-వాయలార్
66. మౌంట్‌బాటెను ముందు భారత వైస్రాయ్ ఎవరు?
జవాబు:
వావెల్.
67. గాంధీజీని హత్య గావించింది ఎవరు?
జవాబు:
నాథూరాం గాడ్సే,
68. భారతదేశంలో కొత్త రాష్ట్రాలను ఏర్పరిచే ఈ ప్రక్రియ ఏ సంవత్సరం వరకు కొనసాగింది?
జవాబు:
1956.
69. బ్రిటిషు పార్లమెంట్ ఆమోదించిన భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం రాష్ట్ర శాసన సభలకు ఓటు వేసే హక్కును ఎంత శాతంకు కేటాయించారు?
జవాబు:
12%
70. బ్రిటిషు ఇండియాలో 11 రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించిన సంవత్సరం ఏది?
జవాబు:
1937.
71. కాంగ్రెస్ అనేక వ్యక్తిగత సత్యాగ్రహాలను ఏ సంవత్సరంలో నిర్వహించింది?
జవాబు:
1942
72. 1937 ఎన్నికలలో ముస్లింలీగుకు ఆదరణ లభించిన ప్రావిన్సులు ఏవి?
జవాబు:
బాంబే, మద్రాస్, యునైటెడ్ ప్రావిన్సెస్.
73. కాంగ్రెస్ సభ్యులు హిందూ మహాసభలో సభ్యులుగా ఉండే అవకాశాన్ని వ్యతిరేకించిన వారు ఎవరు?
జవాబు:
మౌలానా అబుల్ కలాం ఆజాద్.
74. భారత ఉపఖండంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలలో కొంత స్వయం ప్రతిపత్తిని కోరుతూ ముస్లింలీగ్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం.
జవాబు:
1940, మార్చి 23.
75. 1946లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరగగా రాష్ట్రంలోని 569 స్థానాలలో ముస్లింలీగ్ గెల్చుకున్న స్థానాలెన్ని?
జవాబు:
442.
76. జయప్రకాష్ నారాయణ్ వంటి సోషలిస్టు సభ్యులు చురుగ్గా పాల్గొన్న ఉద్యమం ఏది?
జవాబు:
క్విట్ ఇండియా ఉద్యమం.
77. బ్రిటిషు వారికి వ్యతిరేకంగా దేశంలో పలు ప్రాంతాలలో మిల్లులు, కర్మాగారాలలో పని ఆపేసిన సంవత్సరం ఏది?
జవాబు:
1946.
78. 1947 ఆగస్టు 15న బెంగాల్ లో అల్లర్లతో అతలా కుతలమైన నోవఖలీలో శాంతిని నెలకొల్పటానికి ప్రయత్నించిన నాయకుడు ఎవరు?
జవాబు:
మహాత్మా గాంధీజీ.
79. కాశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్, బెంగాలలో భారతదేశ విలీన ఒప్పందంపై సంతకాలు చేసిన సంస్థానం ఏది?
జవాబు:
బెంగాల్.
80. భారత ప్రభుత్వం భరణాన్ని గత రాచరిక కుటుంబాల బిరుదులను ఏ సంవత్సరంలో రద్దు చేసింది?
జవాబు:
1971.
81. అఖిల భారత హిందూ మహాసభ రాజకీయ కార్యక్రమాన్ని త్యజించి నిజమైన సంస్థాగత పనిమీద దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించినది ఎప్పుడు?
జవాబు:
1948 ఫిబ్రవరి 14.
82. క్రింది ఘటనలను సరైన కాలక్రమంలో అమర్చండి.
క్రిప్స్ రాయబారం, క్విట్ ఇండియా ఉద్యమం, రాయల్ నేవి తిరుగుబాటు, ప్రత్యేక కార్యాచరణ దినం.
జవాబు:
క్రిప్స్ రాయబారం, క్విట్ ఇండియా ఉద్యమం, రాయల్ నేవి తిరుగుబాటు, ప్రత్యేక కార్యాచరణ దినం.
10th Class Social 16th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
‘రెండు దేశాల సిద్ధాంతం’ అనగానేమి?
జవాబు:
రెండు దేశాల సిద్ధాంతం :
హిందూ, ముస్లిం మత ప్రాతిపదికగా దేశాన్ని విభజించడమే రెండు దేశాల సిద్ధాంతం.
ప్రశ్న 2.
హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్లు ఏ మార్పు తీసుకురావాలని ఆశించాయి?
జవాబు:
కులం, వర్గాలను అధిగమించి హిందువులందరినీ ఏకం చేసి సామాజిక జీవితంలో సంస్కరణలను తీసుకురావాలని ఈ సంఘాలు ఆశించాయి.
ప్రశ్న 3.
రాజభరణములను రద్దు చేసిన ప్రధాన మంత్రి ఎవరు?
జవాబు:
రాజభరణములను రద్దు చేసిన ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ.
ప్రశ్న 4.
1909 లో ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు ఎందుకు ఏర్పాటు చేశారు?
జవాబు:
1909లో ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు ఏర్పాటు చేయడానికి కారణం :
i) ప్రభుత్వంలో ముస్లింల ప్రయోజనాలను కాపాడడం కోసం.
ii) ముస్లింల సమస్యలను ప్రస్తావించడం కోసం.
ప్రశ్న 5.
క్రింది ఉద్యమాలను సరైన కాలక్రమంలో అమర్చండి.
క్విట్ ఇండియా ఉద్యమం, వందేమాతరం ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం
జవాబు:
i) వందేమాతరం ఉద్యమం.
ii) శాసనోల్లంఘన ఉద్యమం.
1) క్విట్ ఇండియా ఉద్యమం.
ప్రశ్న 6.
“బ్రిటీష్ పాలకులను తరిమివెయ్యటానికి అతడు రహస్యంగా జర్మనీకి, అక్కడి నుండి జపానుకు వెళ్ళి 1942లో భారతీయ సైనికులతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు.” ఈ వాక్యంలో చర్చించబడిన జాతీయ నాయకుడు ఎవరు?
జవాబు:
సుభాష్ చంద్రబోస్.
ప్రశ్న 7.
క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీ ఇచ్చిన నినాదమేమి?
జవాబు:
“చెయ్యండి లేదా చావండి” (Do or Die)
ప్రశ్న 8.
ఇవ్వబడిన దేశాలను అవి ఉన్న స్థానం ఆధారంగా తూర్పు నుండి పడమరకు అమర్చండి.
భారతదేశం, జపాన్, ఇంగ్లాండు, అమెరికా.
జవాబు:
జపాన్, భారతదేశం, ఇంగ్లాండు, అమెరికా.
ప్రశ్న 9.
అక్ష రాజ్యా లనగా ఏవి?
జవాబు:
జర్మనీ, జపాన్, ఇటలీలను కలిపి “అక్ష రాజ్యా ” లంటారు.
ప్రశ్న 10.
‘రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు?
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కన్సర్వేటివ్ పార్టీకి చెందిన “విన్స్టన్ చర్చిల్” ప్రధానమంత్రిగా ఉన్నారు.
ప్రశ్న 11.
ఎం.ఎ. జిన్నా ఎవరు?
జవాబు:
ఎం.ఎ. జిన్నా ముస్లిం లీగు నాయకుడు.
ప్రశ్న 12.
“క్విట్ ఇండియా” ఉద్యమం ఎప్పుడు, ఎందుకు ప్రారంభమైంది?
జవాబు:
క్రిప్స్ దౌత్యం విఫలమైన తరువాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గాంధీజీ 1942 ఆగస్టులో “క్విట్ ఇండియా” ఉద్యమాన్ని ప్రారంభించారు.
ప్రశ్న 13.
భారత జాతీయ సైన్యం అంటే ఏమిటి?
జవాబు:
బర్మా, మలయా దేశాలలో బ్రిటనను జపాన్ ఓడించి, కొంత మంది సైనికులను బందీలుగా తీసుకుంది. సుభాష్ చంద్రబోస్ జపాన్ వెళ్ళి ఈ బందీలను విడుదల చేయించి వారితో జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసినాడు.
ప్రశ్న 14.
“ప్రత్యక్ష కార్యాచరణ” దినం ఏది?జవాబు:
1946 ఆగష్టు 16ను “ప్రత్యక్ష కార్యాచరణ” దినంగా ముస్లిం లీగు ప్రకటించింది.
ప్రశ్న 15.
చివరి వైస్రాయ్ ఎవరు?
జవాబు:
“మౌంట్ బాటెన్” భారతదేశానికి చివరి వైస్రాయ్ గా 1947 ఫిబ్రవరిలో వచ్చాడు.
ప్రశ్న 16.
భారత్, పాక్ కు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది?
జవాబు:
పాకిస్తాన్‌కు 1947 ఆగస్టు 14న, భారత్ కు 1947 ఆగష్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది.
ప్రశ్న 17.
గాంధీజీ ఎప్పుడు మరణించాడు?
జవాబు:
గాంధీజీ 1948 జనవరి 30న మరణించాడు.
ప్రశ్న 18.
బ్రిటిష్ అధికారం క్రింద ఎన్ని సంస్థానాలున్నాయి?
జవాబు:
బ్రిటిష్ అధికారం క్రింద వివిధ స్థాయిలలో సుమారు 550 సంస్థానాలుండేవి.
ప్రశ్న 19.
రైతాంగం, ఎక్కడ సాయుధ పోరాటం చేపట్టింది?
జవాబు:
హైదరాబాదు, ట్రావన్ కోర్లలో పాలక జమీందార్లకు వ్యతిరేకంగా రైతాంగం సాయుధ పోరాటం చేపట్టింది.
ప్రశ్న 20.
సంస్థానాలను విలీనం చేసే బాధ్యతను ఎవరికి అప్పగించడమైనది?
జవాబు:
1947లో సంస్థానాలను విలీనం చేసే బాధ్యతను “సర్దార్ పటేల్” కి అప్పగించారు.
ప్రశ్న 21.
1947 ఆగష్టు 15 నాటికి భారతదేశంలో విలీనం కాని సంస్థానాలేవి?
జవాబు:
1947 ఆగష్టు 15 నాటికి భారతదేశంలో కాశ్మీర్, హైదరాబాదు, జునాగఢ్లు విలీనం కాలేదు.
ప్రశ్న 22.
రాష్ట్రాలను ఎందుకు ఏర్పరిచారు?
జవాబు:
అనేక సంస్థానాలను భారతదేశంలో విలీనం చెయ్యటం మూలంగా పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రాలను ఏర్పరిచారు.
ప్రశ్న 23.
భారతదేశంలో కొత్త రాష్ట్రాలను ఏర్పరిచే ప్రక్రియ ఎప్పటి వరకు కొనసాగింది?
జవాబు:
భారతదేశంలో కొత్త రాష్ట్రాలను ఏర్పరిచే ఈ ప్రక్రియ 1956 వరకు కొనసాగింది.
ప్రశ్న 24.
1971 భారత ప్రభుత్వం వేటిని రద్దు చేసింది?
జవాబు:
రాచరిక భరణాన్ని, గత రాచరిక కుటుంబాల బిరుదులను రద్దు చేసింది.
ప్రశ్న 25.
1935 భారత ప్రభుత్వ చట్టం ఎంత మందికి ఓటు హక్కును ఇచ్చింది?
జవాబు:
ఈ చట్టం రాష్ట్ర శాసనసభలకు 12%, కేంద్ర సభకు 1% ప్రజలకే ఓటు హక్కును కల్పించింది.
ప్రశ్న 26.
1937లో జరిగిన ఎన్నికలలో ఎన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం సాధించింది?
జవాబు:
1937 ఎన్నికలలో 11 రాష్ట్రాలకుగాను 8 రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.
ప్రశ్న 27.
కాంగ్రెస్ ఏ సభలో “పూర్ణ స్వరాజ్యం ” తమ ధ్యేయంగా తీర్మానించింది?
జవాబు:
1929 లో లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో ‘పూర్ణ స్వరాజ్యం” తమ ధ్యేయంగా కాంగ్రెస్ తీర్మానించింది.
ప్రశ్న 28.
1909 లో చేసిన చట్టం మూలంగా ముస్లింలకు లభించిన ప్రయోజనం ఏమిటి?
జవాబు:
1909 శాసన సభల చట్టం మూలంగా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు.
ప్రశ్న 29.
‘పాకిస్తాన్ లేదా పాకిస్తాన్’ అనే పదం ఏ విధంగా ఏర్పడింది?
జవాబు:
కేంబ్రిడ్జ్ లోని పంజాబీ ముస్లిం అయినా “చౌదరీ రెహ్మత్ ఆలి” అనే అతను పంజాబు, ఆఫ్ఘన్, కాశ్మీరు, సింధూ, బెలుచిస్థాన్లను ఇంగ్లీషు అక్షరాలతో రూపొందించినాడు.
ప్రశ్న 30.
లౌకిక రాజ్య మనగానేమి?
జవాబు:
మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ రాజ్యం నుండి రక్షణ లభిస్తుంది, సమాన హక్కులు ఉంటాయి. మత – ప్రమేయం ఉండదు. ఈ విధానాన్ని “లౌకికత్వం” అంటారు.
ప్రశ్న 31.
భారతదేశంలో విలీనం కావడానికి మొదట అంగీకరించని మూడు స్వదేశీ రాజ్యాలేవి?
జవాబు:
భారతదేశంలో విలీనం కావడానికి మొదట అంగీకరించని మూడు సంస్థానాలు :
- కాశ్మీర్
- జునాగఢ్
- హైదరాబాద్.
10th Class Social 16th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
గాంధీజీ హత్య ఉదంతాన్ని సంక్షిప్తంగా రాయండి.
జవాబు:
- 1947 ఆగస్టు 15న బెంగాల్లో అల్లర్లతో అతలాకుతలమైన నోవఖలీలో శాంతిని నెలకొల్పటానికి జాతిపిత గాంధీజీ ప్రయత్నించాడు.
- దేశ రాజధాని అయిన ఢిల్లీకి అతడు 1947 సెప్టెంబరు 9నగాని రాలేదు.
- వాయవ్య భారత్ లో పెద్ద ఎత్తున చెలరేగిన మత ఘర్షణలతో ఆ వృద్ధ నేత అసంతృప్తితో ఉన్నారు.
- ప్రజల భయాలను దూరం చెయ్యడానికి ప్రయత్నించారు.
- దేశంలోని ప్రజలలోని ఒక వర్గం భారతదేశ రాజకీయాలలో గాంధీ పాత్రతో కోపంగా ఉంది.
- గాంధీజీ నిర్వహిస్తున్న సర్వమత ప్రార్థన సమావేశాలను పలుమార్లు వాళ్ళు భంగపరచారు.
- గాంధీజీని చంపటానికి రెండు రోజుల ముందు అతడిపై జరిపిన హత్యాయత్నం విఫలమైంది.
- దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆరు నెలల లోపే 1948 జనవరి 30 సాయంత్రం సర్వమత ప్రార్ధనకు వెళుతున్న జాతిపిత మూడు బుల్లెట్లకు నేలకొరిగాడు.
ప్రశ్న 2.
మహాత్మా గాంధీలో నీకు నచ్చిన లక్షణాలు ఏవి? ఎందుకు?
జవాబు:
- సత్యాన్ని పాటించడం.
- అహింసను పాటించడం.
- నిరాడంబరంగా ఉండడం.
- త్యాగనిరతి కలిగి ఉండడం.
ప్రశ్న 3.
‘భారతదేశం అనేక మతాల, జాతుల దేశము. అది అలాగే కొనసాగాలి.’ వ్యాఖ్యానించండి.
జవాబు:
- భారతదేశంలో అనేక మతాలు, జాతులు ఉన్నాయి.
- అయినప్పటికి ఇది ప్రజాస్వామిక లౌకిక రాజ్యం ‘గా కొనసాగుతున్నది.
- మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ రాజ్యం రక్షణ కల్పిస్తున్నది.
- పౌరులందరికీ సమాన హక్కులు ఉన్నాయి.
ప్రశ్న 4.
సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన భారత జాతీయ సైన్యం గురించి రాయండి.
జవాబు:
- బ్రిటన్న జపాన్ ఓడించినపుడు కొందరు భారతీయ సైనికులు జపానుకు బందీలుగా చిక్కారు.
- ఈ సైనికులతో సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు.
- తరువాత ఎంతోమంది మహిళలతో సహా ఇతర భారతీయులు కూడా ఈ సైన్యంలో చేరారు.
- భారత జాతీయ సైన్యం బ్రిటీషువారికి వ్యతిరేకంగా దాదాపు 3 సంవత్సరాలపాటు యుద్ధం చేసింది.
- అంతిమంగా భారత జాతీయ సైన్యం బ్రిటీష్ వాళ్ళ చేతుల్లో ఓడిపోయింది.
ప్రశ్న 5.
సర్దార్ పటేల్ లో నీకు నచ్చిన గుణాలు ఏవి? ఎందుకు?
జవాబు:
సర్దార్ పటేలో నాకు నచ్చిన గుణాలు
- దేశభక్తి
- అంకితభావం మరియు నిబద్ధత
ప్రశ్న 6.
దొమీనియన్ ప్రతిపత్తి అనగానేమి?
జవాబు:
బ్రిటిష్ ప్రభుత్వం, 2వ ప్రపంచ యుద్ధం తరువాత సార్వభౌమాధికారం కలిగిన రాజ్యప్రతిపత్తిని భారతదేశానికి ఇస్తామని, అందుకొరకు ఒక రాజ్యాంగాన్ని రూపొందించి, దానిని బ్రిటిష్ అమలు చేస్తుందని ప్రకటించింది. దీనినే ” డొమీనియన్ ప్రతిపత్తి” అంటారు.
ప్రశ్న 7.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు 1939లో రాజీనామా ఎందుకు చేయవలసి వచ్చింది?
జవాబు:
- 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ ను సంప్రదించకుండానే భారతదేశం కూడా రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనాలని బ్రిటిష్ వైస్రాయి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడు.
- ఈ నిర్ణయాన్ని సహజంగానే కాంగ్రెస్ వ్యతిరేకించింది.
- యుద్ధంలో చురుగ్గా పాల్గొనడానికి ముందే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం ప్రకటించాలని లేదా కనీసం ముఖ్యమైన అధికారాలను అప్పగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
- బ్రిటిష్ ప్రభుత్వం ఈ కోరికలను అంగీకరించలేదు. అందుకు నిరసనగా కాంగ్రెస్ మంత్రి వర్గాలు 1939లో రాజీనామా చేసినాయి.
ప్రశ్న 8.
హిందూ మహాసభ, ఆర్.ఎస్.ఎస్. ముఖ్య పాత్ర ఏమిటి?
జవాబు:
- ఈ రెండు కూడా ప్రజలను సమీకరించడానికి చురుకుగా పనిచేశాయి.
- కులం, వర్గాలను అధిగమించి హిందువులందరినీ ఏకం చేసి సామాజిక జీవితంలో సంస్కరణలు తీసుకురావాలని ఈ సంఘాలు ఆశించాయి.
- భారతదేశం అధిక సంఖ్యలో ఉన్న హిందువుల భూమి అన్న అభిప్రాయాన్ని కూడా వాళ్ళు కలిగించారు.
ప్రశ్న 9.
అమెరికా, యూరపులలో జపాన్ సాధించిన విజయాలు భారతీయులపై ఏ విధంగా ప్రభావం చూపాయి?
జవాబు:
- అమెరికా, యూరపులలో జపాన్ సాధించిన విజయాలు భారతీయులపై బలమైన ముద్రలు వేశాయి.
- జపాను ఆసియా దేశం. అది ఐరోపా వలస పాలకులను ఎదుర్కొగలిగింది. తాము కూడా బ్రిటనకు వ్యతిరేకంగా పోరాడి, గెలవగలమని భారతీయులు భావించసాగారు.
- ఆంగ్లేయులు ఉన్నత జాతికి చెందిన వాళ్లన్న భ్రమ బద్దలయ్యింది.
ప్రశ్న 10.
భారత జాతీయ సైన్యం ఏ విధంగా ఆవిర్భవించింది?
జవాబు:
బర్మా, మలయా దేశాలలో బ్రిటన్ తో జపాన్ యుద్ధం చేసి ఓడించినపుడు కొంతమంది బ్రిటిష్ సైనికులను జపాను బందీలుగా తీసుకున్నది. ఈ బందీలలోని భారత సైనికులను సుభాష్ చంద్రబోస్ తీసుకొని దానికి భారత జాతీయ సైన్యం అని పేరు పెట్టినాడు. బోస్, భారత జాతీయ సైన్యంను జపాన్ సైన్యంతో కలిపి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దాదాపు మూడు సంవత్సరాలపాటు యుద్ధం చేశాడు.
ప్రశ్న 11.
“తెభాగ” ఉద్యమం అంటే ఏమిటి?
జవాబు:
బెంగాల్లో పెద్ద భూస్వాముల నుంచి భూమిని సాగుకు తీసుకున్న చిన్న, పేద రైతులు ఆందోళన చేయసాగారు. ఆ సమయంలో కౌలుకింద తమకు సగం, లేదా అంతకంటే తక్కువ ఇస్తుండగా తమ వాటాని మూడింట రెండు వంతులకు పెంచాలని వాళ్ళు కోరారు. దీనిని “తెభాగ” ఉద్యమం అంటారు. దీనికి ఆ రాష్ట్ర కిసాన్ సభ నేతృత్వం వహించింది.
ప్రశ్న 12.
“రాచరిక భరణం” అంటే ఏమిటి?
జవాబు:
భారతదేశంలో బ్రిటిష్ పాలనలో సుమారు 550 సంస్థానాలుండేవి. ఈ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసినాక భారత ప్రభుత్వం ఆయా రాచరిక కుటుంబాలకు వ్యక్తిగత ఖర్చులకు పెన్షను మంజూరు చేశారు. దీనినే “రాచరిక భరణం” అంటారు. అయితే ఈ రాజ భరణాలను 1971లో భారత ప్రభుత్వం రద్దు చేసింది. రాచరిక బిరుదులను కూడా రద్దు చేసింది.
ప్రశ్న 13.
1935 భారత ప్రభుత్వ చట్టంలోని ముఖ్యాంశాలేమిటి?
జవాబు:
3వ రౌండ్ టేబుల్ సమావేశంలో కొనసాగిన చర్చల ఫలితంగా 1935లో చట్టం చేయబడింది.
ముఖ్యాంశాలు :
- ఈ చట్టం ప్రకారం భారతదేశంలో ఫెడరల్ విధానం ఏర్పాటుకు సంబంధించిన అంశాలున్నాయి.
- రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన రద్దు అయినది.
- అన్ని శాఖలు మంత్రులకే అప్పగించడం జరిగింది.
- కాని గవర్నర్‌కు శాసన సభా తీర్మానాలను తోసి పుచ్చే అధికారం ఉండేది.
ప్రశ్న 14.
జాతీయోద్యమానికి సంబంధించిన ఈ క్రింది ప్రదేశాలను ఇవ్వబడిన భారతదేశపటంలో గుర్తించండి.
1) పంజాబ్
2) సింధు
3) కాశ్మీర్
4) బెలూచిస్తాన్
5) బెంగాల్
6) హైదరాబాద్
7) జునాగఢ్
8) అసోం
9) ఆఫ్ఘన్
జవాబు:
ప్రశ్న 10.
భారతదేశ పటంలో ఈ క్రింది ప్రాంతాలను గుర్తించండి.
జవాబు:
- ఉత్తరప్రదేశ్
- బాంబే
- మద్రాసు
- బెంగాల్
- పంజాబ్
ప్రశ్న 11.
మహాత్మాగాంధీలో మీకు నచ్చిన ఏవైనా నాలుగు లక్షణాలను తెలపండి.
జవాబు:
- గాంధీజీ స్వాతంత్ర్యోద్యమానికి పెద్ద ఎత్తున ప్రజల మద్దతు సంపాదించి పెట్టాడు.
- గాంధీజీ సత్యాగ్రహం, అహింస ఆయుధాలుగా స్వాతంత్ర్యం సంపాదించి పెట్టాడు.
- గాంధీ విభజన సందర్భంగా జరిగిన అల్లర్లలో, మరణాలు, నిర్వాసితులుగావడం పట్ల బాధతో మొదట స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోలేదు.
- గాంధీజీ చొరవతో అల్పసంఖ్యాక వర్గాల హక్కులపై నెహ్రూ, కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది.
ప్రశ్న 12.
భారతీయులు తమ స్వాతంత్ర్య పోరాటాన్ని పక్కన పెట్టి స్వేచ్ఛాయుత ప్రపంచంపై దృష్టి కేంద్రీకరించాల్సినంతగా హిట్లర్ బలం పుంజుకుని మానవాళి స్వేచ్చకు ముప్పు కలిగించేవాడా?
జవాబు:
మొదటి ప్రపంచయుద్ధం తరువాత ఆమోదించిన రెహ్మత్ ఆలివర్సయిల్స్ సంధి షరతులు జర్మనీకి అవమానకరంగా ఉన్నాయని హిట్లర్ భావించాడు. ఇతర దేశాల ఆధీనంలో ఉన్న జర్మన్ భూభాగాలను ఏకం చేయాలని ఆశించాడు. సంధి షరతులను ఉల్లంఘించినాడు. పెద్ద దేశాలను ఎదిరించి, దూర ప్రాచ్యంలో తమకు కూడా వలసలు కావాలని ఆశించాడు. జర్మనీని చూసి అగ్రరాజ్యలు భయపడేలా చేసాడు. అయితే మన స్వాతంత్ర్య పోరాటం వదిలి స్వేచ్ఛాయుత ప్రపంచం కొరకు దృష్టి పెట్టవలసినంత అవసరం లేదు. జర్మనీకి భారత జాతీయ పోరాటం మీద సానుభూతి కూడా ఉంది.
10th Class Social 16th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
దేశ విభజన సామాన్య ప్రజానీకంపై ఎలా ప్రభావితం చూపింది?
జవాబు:
దేశ విభజన సామాన్య ప్రజల జీవితాలను బాగా ప్రభావితం చేసింది.
- తమ ఊళ్ళు, ఇళ్ళు, పట్టణాలను విడిచి వెళ్ళవలసిరావటంతో ఒకరిపట్ల ఒకరికి కోపం, విద్వేషాలు చెలరేగాయి.
- మొత్తంగా 1.5 కోట్లు హిందువులు, ముస్లిములు నిర్వాసితులయ్యారు.
- హత్యలు, దోపిడి, దహనాలు యధేచ్ఛగా కొనసాగాయి.
- హిందువులు, ముస్లింలు కలిపి రెండు నుండి అయిదు లక్షల మంది చంపబడ్డారు.
- వాళ్ళు కాందిశీకులుగా మారారు, పునరావాస శిఖరాలలో గడిపారు.
- రైళ్ళలో కొత్త ఇళ్ళ అన్వేషణలో బయలుదేరారు.
- శాంతి, సౌభ్రాతృత్వ సందేశాలను పంచుతూ గాంధీజీ అల్లర్లకు గురైన ప్రజల శిబిరాల మధ్య ఆసుపత్రులలో గడిపాడు.
- గాంధీజీ చొరవతో “అల్ప సంఖ్యాక వర్గాల హక్కుల పై’ నెహ్రూ, కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని చేశాయి.
ప్రశ్న 2.
ఈ క్రింది పేరాగ్రాను చదివి వ్యాఖ్యానించండి.
బ్రిటన్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమును సంప్రదించకుండనే భారతదేశం యుద్ధంలో పాల్గొంటుందని నిర్ణయం తీసుకుంది. దీంతో కాంగ్రెస్ సతమతమైపోయింది. అనేకమంది కాంగ్రెస్ నాయకులు హిట్లర్, ముస్సోలినిని, ఫాసిజాన్ని వ్యతిరేకించారు. ఇతర స్వతంత్ర దేశాలను జయించటానికి ప్రయత్నిస్తున్న ఫాసిస్ట్ శక్తులను ఎదుర్కోవాలన్న కృత నిశ్చయంతో వాళ్ళు ఉన్నారు. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం ఇవ్వకుండా ఫాసిస్టులపై తమ పోరాటంలో భారతదేశం మద్దతు ఇవ్వాలని కోరుకోవటంలో అవలంబిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను బ్రిటిష్ గుర్తిస్తుందని కాంగ్రెస్ ఆశించింది.
ప్రశ్న: బ్రిటిష్ వారి ద్వంద్వ ప్రమాణాలపై వ్యాఖ్యానించండి.
జవాబు:
- భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం ఇవ్వకుండా ఫాసిస్టులపై తమ పోరాటంలో భారతదేశం మద్దతు ఇవ్వాలని కోరుకోవటంలో అవలంబిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను బ్రిటీషు ప్రభుత్వం గుర్తిస్తుందని కాంగ్రెస్ ఆశించింది.
- బ్రిటిషువారు దీనిని గుర్తించారు.
- కానీ తాము నిర్మించిన సామ్రాజ్యాన్ని వదులుకోవటం వాళ్ళకి చాలా కష్టంగా అనిపించింది.
- బ్రిటిష్ సామ్రాజ్యం కింద భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి ఇవ్వటానికి బ్రిటిష్ వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్యం కోరింది.
- బ్రిటన్ దీనికి అభ్యంతరం పెట్టింది.
- కాంగ్రెస్ భారతీయులందరికీ ప్రాతినిధ్యం వహించటం లేదని బ్రిటన్ భావం.
- అనేకమంది భారతీయుల ప్రయోజనాలను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని వాటిని కాపాడాల్సిన బాధ్యత తమపైన ఉన్నదని బ్రిటన్ భావించింది.
ప్రశ్న 3.
ఈ క్రింది పేరాగ్రాను చదివి వ్యాఖ్యానించండి.
బెంగాల్లో పెద్ద భూస్వాముల నుంచి భూమికి సాగుకు తీసుకున్న చిన్న, పేద రైతులు ఆందోళన చేయసాగారు. ఆ సమయంలో కౌలు కింద తమకు సగం, లేదా అంతకంటే తక్కువ ఇస్తుండగా తమ వాటాని మూడింట రెండు వంతులకు పెంచాలని వాళ్ళు కోరారు. దీనినే ‘తేభాగ’ ఉద్యమం అంటారు. దీనికి ఆ రాష్ట్ర కిసాన్ సభ నేతృత్వం వహించింది.
ప్రశ్న: పై పేరాను చదివి చిన్న, పేద రైతుల డిమాండ్లను సమర్థిస్తావా? అయితే ఎలా? వ్యాఖ్యానించుము.
జవాబు:
అవును, నేను బెంగాల్ లోని చిన్న, సన్నకారు రైతుల ఆందోళనను సమర్థిస్తాను.
- బెంగాల్ ప్రజలకు కౌలు కింద తమకు సగం, లేదా అంతకంటే తక్కువ ఇస్తుండగా తమ వాటాని మూడింట రెండు వంతులకు పెంచాలని వాళ్ళు కోరారు.
- పంటను పండించటానికి రైతులు పెట్టుబడిని పెట్టినప్పటికీ రైతులకు సరియైన ఆదాయాన్ని యజమానులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు.
- పంటలు సరిగా పండకపోయినప్పటికీ రైతులు ఎక్కువ కౌలును చెల్లించవలసిరావడం మరియు వాళ్ళు చాలా ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొనవలసి రావడంతో తీసుకున్న రుణాలను కూడా తిరిగి చెల్లించలేకపోయినాయి.
ప్రశ్న 4.
కొత్తగా ఏర్పడిన భారతదేశంలోకి వివిధ సంస్థానాలను విలీనం చేసే ప్రక్రియ ఒక సవాలుగా పరిణమించింది. చర్చించండి.
జవాబు:
- బ్రిటిష్ పాలకులు భారతదేశంను విడిచి వెళ్ళే సమయానికి సుమారు 550 స్వదేశీ సంస్థానాలు ఉండేవి.
- బ్రిటిష్ వారి పాలన అనంతరం అవి స్వాతంత్ర్యం పొందాయి.
- ఈ సంస్థానాలను బ్రిటిష్ వారు భారతదేశంలో విలీనమవ్వడమో లేదా పాకిస్థాన్లో విలీనమవ్వడమో లేదా స్వతంత్రంగా ఉండటమో నిర్ణయం తీసుకోవలసిందిగా కోరారు.
- ఈ క్రమంలో హైదరాబాద్, ట్రావెన్ కోర్స్ లో పాలక జమీందార్లకు వ్యతిరేకంగా రైతాంగం సాయుధ పోరాటం చేపట్టింది.
- స్వదేశీ సంస్థానాలు భారత భూభాగంలో విలీనం చేసే బాధ్యతను 1947 జులై నెలలో సర్దార్ వల్లభాయి పటేల్‌కు అప్పగించబడింది.
- భారతదేశంలో ఈ సంస్థానాలు విలీనం కావలసిన ఆవశ్యకత గురించి పటేల్ రాచరిక కుటుంబాలతో చర్చించారు.
- ఫలితంగా కాశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్ లు తప్పించి మిగిలిన సంస్థానాలన్నీ భారతదేశంతో విలీన ఒప్పంద పత్రంపై సంతకం చేశాయి.
- స్వాతంత్ర్యం పొందిన రెండు సంవత్సరాలలోనే మిగిలిన సంస్థానాలను కూడా విలీనం చేసి సర్దార్ పటేల్ సమర్ధవంతంగా ఈ సవాలును ఎదుర్కొన్నారు.
ప్రశ్న 5.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రాజకీయ వ్యవస్థలుగా ప్రజాస్వామ్యాలే ఉన్నాయి. ఇవి ప్రజల ఆకాంక్షలకు పూర్తి న్యాయం చేశాయా?
జవాబు:
- అవును. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలకు న్యాయం చేస్తాయి.
- ఎందుకనగా అవి ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పడిన ప్రభుత్వాలు కనుక అవి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాయి.
- ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం ప్రజలచేత ఆమోదించబడిన రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్యము.
- ప్రజాస్వామ్యంలో ప్రజలు అత్యంత జాగరూకత మరియు అప్రమత్తత కలిగి ఉంటారు. కనుక వారి ఆకాంక్షలకు న్యాయం జరుగుతుంది.
- ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వాలు నెరవేర్చని పక్షంలో ప్రజలు ఉద్యమాలు చేపడతారు.
ప్రశ్న 6.
1935 చట్టం ఇచ్చిన అధికారాలకు భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వం పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండాలా? మీ అభిప్రాయం తెలుపుము.
జవాబు:
లేదు. 1935 చట్టం ఇచ్చిన అధికారాలకు భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వం పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండవలసిన అవసరము లేదు. ఎందుకంటే
- భారతదేశము భారతీయులదే.
- మనకు స్వేచ్ఛ కోరే హక్కు ఉన్నది.
- మన జాతీయ నాయకులు, స్వతంత్ర్య రాజ్యస్థాపనకై తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారు.
- అందువల్లనే బ్రిటిష్ వారు 1935 చట్టాన్ని చేశారు.
కనుక, మనము మన జాతీయవాద నాయకులు, స్వాతంత్ర్య పోరాట వీరుల పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి కానీ బ్రిటిష్ వారి పట్ల కాదు.
ప్రశ్న 7.
స్వాతంత్రం వచ్చిన తొలి సంవత్సరాలలో సామాజిక ఆర్థిక మార్పు తీసుకురావటానికి ఏ చర్యలు చేపట్టారు?
జవాబు:
- స్వాతంత్ర్యానంతరం 1950లో ప్రణాళికా సంఘం స్థాపించబడింది.
- పంచవర్ష ప్రణాళికలు 1951లో ప్రారంభం అయ్యా యి.
- భూ సంస్కరణలు అమలు చేయబడ్డాయి.
- జమిందారీ వ్యవస్థ రద్దు కాబడింది. 5) వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేశారు.
- కౌలుదారీ సంస్కరణలు మరియు భూపరిమితి చట్టాలు చేయబడ్డాయి.
- స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏర్పాటు చేశారు.
- డ్యాంలు, పరిశ్రమల నిర్మాణం చేపట్టబడింది.
ఈ విధంగా స్వాతంత్ర్యం వచ్చిన తొలి సంవత్సరాలలో సామాజిక, ఆర్థిక మార్పు తీసుకురావడానికి పలు చర్యలు చేపట్టారు.
ప్రశ్న 8.
క్రింది ఇచ్చిన పేరాగ్రాఫును చదివి దిగువ ఇచ్చిన ప్రశ్నకు జవాబు రాయండి.
శాంతి, సౌభ్రాతృత్వం అనే సందేశాలను పంచుతూ గాంధీజీ శిబిరాలలోనూ, ఆసుపత్రులలోనూ తలదాచుకుంటున్న అల్లర్లకు గురైన ప్రజల మధ్య గడిపాడు. తను ఇంతగా కష్టపడింది. ఇటువంటి స్వేచ్ఛ, స్వరాజ్యాల కోసం కాదు. మొదటి స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతిపిత ఎటువంటి సంబరాలు చేసుకోలేదు. నిరాహారదీక్ష చేశాడు.
ప్రశ్న: నూతన దేశం పాకిస్తాన్ ఏర్పాటు కావడంతో కొత్తగా గీసిన సరిహద్దు రేఖకు ఇరువైపులా గల ప్రజలు ఎదుర్కొనవలసి వచ్చిన పరిస్థితుల గురించి వ్యాఖ్యానించండి.
జవాబు:
- భారత్ వైపు ఉన్న ముస్లింలలో, పాకిస్తాన్ వైపు ఉన్న హిందువులలో అభద్రత ఏర్పడింది. ఇళ్ళు, ఊళ్ళు విడిచి వెళ్ళవలసి రావడంతో ఒకరి పట్ల ఒకరికి కోపం, విద్వేషం చెలరేగాయి.
- 1.5 కోట్ల మంది హిందువులు, ముస్లిములు నిర్వాసితులయ్యారు. అనేకులు పునరావాస శిబిరాలలో గడిపారు.
- హత్యలు, దోపిడీలు, దహనాలు కొనసాగాయి. జనం రెండు నుండి ఐదు లక్షలమంది చంపబడ్డారు.
- స్వాతంత్ర్య దినోత్సవం నాడు అందరూ పండుగ చేసుకుంటుంటే జాతిపిత గాంధీ మాత్రం నిరాహార దీక్షలో గడిపాడు.
ప్రశ్న 9.
భారతదేశ విభజన వలన సంభవించిన పరిణామాలు వ్రాయండి.
జవాబు:
భారతదేశ విభజన వలన సంభవించిన పరిణామాలు :
- భారత్ వైపు ఉన్న ముస్లింలలో, పాకిస్థాన్ వైపు ఉన్న హిందువులలో అభద్రత ఏర్పడింది.
- ఇళ్ళు, ఊళ్ళు విడిచి వెళ్ళవలసి రావడంతో ఒకరి పట్ల ఒకరికి కోపం, విద్వేషం చెలరేగాయి.
- దాదాపు 1.5 కోట్ల మంది హిందువులు, ముస్లింలు నిర్వాసితులయ్యారు.
- అనేకులు పునరావాస శిబిరాలలో గడిపారు. 5) హత్యలు, దోపిడీలు, దహనాలు కొనసాగాయి.
- రెండు నుండి ఐదు లక్షల మంది జనం చంపబడ్డారు.
ప్రశ్న 10.
భారత జాతీయ సైన్యం భారత స్వాతంత్ర్యం కోసం ఎలా పోరాడిందో వివరించండి.
జవాబు:
భారతదేశ స్వాతంత్ర్యం అత్యంత ప్రాధాన్యత గల అంశమని, బ్రిటిష్ పాలకులను తరిమెయ్యటానికి జపాను వాళ్ల సహాయం తీసుకోవాలని సుభాష్ చంద్రబోస్ భావించాడు. అతడు రహస్యంగా జర్మనీకి, అక్కడినుంచి జపానుకి వెళ్లి 1942లో భారతీయ సైనికులతో ఒక సైన్యాన్ని తయారుచేశాడు. బర్మా, మలయా దేశాలలో బ్రిటన్న జపాను ఓడించినపుడు బందీలుగా తీసుకున్న బ్రిటిష్ సైన్యంలోని వాళ్ళే వీళ్లు. భారత జాతీయ సైన్యం అని పేరుపెట్టి తన సైన్యంలోకి బోస్ వీళ్లని తీసుకున్నాడు. తరువాత ఎంతోమంది మహిళలతో సహా ఇతర భారతీయులు కూడా ఈ సైన్యంలో చేరారు. అయితే బోతో గాంధీజీ ఏకీభవించలేదు, జపనీయులు భారతదేశానికి విముక్తి దాతలు కాలేరని అతడు భావించాడు. కానీ సుభాష్ తాను ఎంచుకున్న మార్గంలో ముందుకు సాగాడు. జపాను సైన్యంతో కలిసి తన సైన్యంతో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా దాదాపు మూడు సంవత్సరాలపాటు యుద్ధం చేశాడు. . సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యం బ్రిటిష్ వాళ్ల చేతుల్లో ఓటమి పాలయ్యింది. భారత జాతీయ సైన్యానికి చెందిన సైనికులను జైలుపాలు చేసి శిక్షించాలని బ్రిటిష్ పాలకులు నిర్ణయించారు.
ప్రశ్న 11.
కింది పేరాను చదివి, మీ అభిప్రాయాన్ని రాయండి.
అమెరికా యూరప్లో జపాన్ సాధించిన విజయాలు భారతీయులపై బలమైన ముద్రలు వేసాయి. ఐరోపా వలస పాలకులు త్వరలోనే ఓడింపబడతారని అనుకోసాగారు. జపాన్ ఆసియా దేశం. అది ఐరోపా వలస పాలకులను ఎదుర్కోగలిగింది. తాము కూడా బ్రిటన్‌కు వ్యతిరేకంగా పోరాడి, గెలవగలమని భారతీయులు అనుకోసాగారు.
జవాబు:
- జపాన్ 1905 రష్యా-జపాన్ యుద్ధంలో శక్తివంతమైన రష్యా సామ్రాజ్యాన్ని ఓడించింది.
- జపాన్ తనదైన ఫాసిస్టు సిద్ధాంతాన్ని రూపొందించుకొని చైనా, కొరియా వంటి దేశాలపై సైనిక దాడులకు పాల్పడింది.
- రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా 1942లో జపాన్ అమెరికా పై దాడి చేసింది.
- అమెరికా, యూరప్లో జపాను సాధించిన విజయాలు భారతీయులను ప్రభావితం చేశాయి.
- జపాను విజయాలతో భారతదేశం వంటి ఆసియా దేశాలలో జాతీయవాదం వెల్లువలా ఉప్పొంగింది.
- ఒక చిన్న ఆసియా దేశమైన జపాను ఐరోపా వలస పాలకులను ఎదుర్కోగలిగినట్లే తాము కూడా బ్రిటనకు వ్యతిరేకంగా పోరాడి, గెలవగలమని భారతీయులు భావించారు. ఆంగ్లేయులు ఉన్నత జాతికి చెందిన వారన్న భ్రమ బద్దలయ్యింది.
- ఈ విధంగా జపాను విజయాలు భారత స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చాయని చెప్పవచ్చు.
ప్రశ్న 12.
1909 భారత శాసనసభల చట్టంలోని ముఖ్యాంశాలేమిటి?
జవాబు:
I. 1) శాసనసభలను విస్తరించడమైంది.
2) ప్రతి శాసనసభలో మూడు రకాలయిన సభ్యులు ఏర్పాటు అయినారు.
A) అధికారులు
B) అనధికారులు
C) నామనిర్దేశక సభ్యులు.
3) రాష్ట్రాలలో కూడా ఇదే విధంగా మూడు రకాలయిన సభ్యులు ఉంటారు. కాని ఇక్కడ ఎన్నిక ద్వారా వచ్చేవారి సంఖ్య ఎక్కువ.
4) సభ్యులను ఎన్నుకోవడం కోసం మూడు రకాలయిన నియోజక వర్గాలు ఏర్పడినాయి.
a) సాధారణ నియోజక వర్గం
b) భూస్వాముల నియోజక వర్గం, ముస్లింల నియోజక వర్గం
C) వర్తక సంఘాలలాంటి ప్రత్యేక నియోజక వర్గాలు.
II. 5) మహమ్మదీయులకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేసినారు.
III. 6) ఇంగ్లాండులోని ఇండియా కౌన్సిలులో రెండు స్థానాలు భారతీయులకు కేటాయించినారు. ఒకటి హిందువులకు, రెండవది మహమ్మదీయులకు.
ప్రశ్న 13.
1919 భారత రాజ్యాంగ చట్టమును వివరించండి.
జవాబు:
1919 భారత రాజ్యాంగ చట్టమును “మాంటేగు చేమ్సుఫర్డు సంస్కరణలు” అంటారు. ఈ చట్టంలో రెండు భాగాలున్నాయి.
I. బ్రిటన్‌లోని యంత్రాంగంలో మార్పులు చేయుట.
II. భారతదేశంలోని యంత్రాంగంలో మార్పులు చేయుట.
I. బ్రిటన్లోని యంత్రాంగంలోని మార్పులు :
a) భారత రాజ్యాంగ కార్యదర్శి (ఇండియా మంత్రి) జీతభత్యాల ఖర్చు బ్రిటిష్ ప్రభుత్వమే వహించడానికి నిర్ణయించబడింది.
b) కార్యదర్శి యొక్క అధికారాలను కొంత వరకు తగ్గించబడినాయి.
c) హై కమిషనర్ అనే ఒక కొత్త పదవి సృష్టించడమైనది. అతనిని భారత ప్రభుత్వమే నియమించి అతని ఖర్చులన్నీ భరించాలి.
II. భారత యంత్రాంగంలోని మార్పులు :
a) కేంద్ర శాసనసభలో దిగువశాఖ, ఎగువశాఖ అనే రెండు శాఖలు (Lower House and Upper House) ఏర్పడినాయి.
b) దిగువశాఖను శాసనసభ అనీ, ఎగువసభను రాజ్యసభ అనీ అంటారు.
c) ఎగువసభ కాలపరిమితి 5 సంవత్సరాలు, దిగువ సభ కాలపరిమితి 3 సంవత్సరములు.
d) ఈ చట్టం ద్వారా రాష్ట్రంలో రెండు రకాల అధికారాలు, శాఖలు అనగా రిజర్వు శాఖ, ట్రాన్స్ ఫర్డ్ శాఖలుగా విభజించబడ్డాయి.
e) ప్రాముఖ్యం లేదా వైద్యం, విద్య, వ్యవసాయం, పశుపోషణ, రిజిస్ట్రేషను, దేవాదాయాలు, పరిశ్రమాభివృద్ధి వంటి అంశాలు ట్రాన్స్ఫర్డ్ శాఖ ఆధీనంలో ఉంచబడినాయి.
f) భూమిశిస్తు, నీటి పారుదల, కార్మిక విషయాలు, వార్తా పత్రికలపై అజమాయిషి, క్షామనివారణ, శాంతి భద్రతలు వంటి కీలక అంశాలు రిజర్వ్డు శాఖ ఆధీనంలో ఉంచబడినాయి.
g) కేంద్రంలో వలెనే రాష్ట్రాలలో కూడా సాధారణ నియోజక వర్గాలు, ప్రత్యేక నియోజక వర్గాలు ఏర్పాటైనాయి.
ప్రశ్న 14.
1937-1947 మధ్య ముస్లింల ఆలోచనలు ఎందుకు మారాయి? అవి 1946 ఎన్నికలలో ముస్లిం లీగు విజయభేరి మోగించడానికి దోహదపడినాయా?
జవాబు:
ముస్లిముల పట్ల కాంగ్రెస్ సున్నితత్వంతో స్పందించటం లేదని అనేక అంశాలను ముస్లిం లీగు ఎత్తి చూపింది. ఉదాహరణకు యునైటెడ్ ప్రావిన్స్ లో ఎక్కువ సీట్లనే గెలుచుకున్న ముస్లిం లీగుతో కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయటాన్ని కాంగ్రెస్ తిరస్కరించింది. తమ సభ్యులు ముస్లిం లీగులో సభ్యత్వం తీసుకోవటాన్ని కాంగ్రెస్ నిషేధించింది. అంతకుముందు వరకు కాంగ్రెస్ సభ్యులు హిందూ మహాసభలో కూడా సభ్యులుగా ఉండే అవకాశం ఉండేది. మౌలానా ఆజాద్ వంటి కాంగ్రెస్లోని ముస్లిం నాయకులు దీనికి అభ్యంతరం తెలిపిన తరువాత 1938లో దీనిని కూడా నిషేధించారు. ఈ విధంగా కాంగ్రెస్ మౌలికంగా హిందువుల పార్టీ అని, ముస్లిములతో అధికారాన్ని పంచుకోటానికి అది సుముఖంగా లేదన్న అభిప్రాయాన్ని ముస్లిం లీగు సృష్టించగలిగింది.
ప్రశ్న 15.
సర్ స్టాఫర్డ్ క్రిప్స్ రాయబారంలోని చర్చలు విఫలం అయినాయి అని ఏ విధంగా చెప్పగలవు?
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధానంతరం భారతదేశానికి డొమీనియన్ ప్రతిపత్తి మరియు రాజ్యాంగాన్ని రూపొందించుకోడానికి భారతదేశాన్ని అనుమతించే వాగ్దానం వంటి సంస్కరణలు క్రిప్స్ రాయబారంలో చర్చించినప్పటికి ఈ చర్చలు విఫలం అవడానికి ముఖ్య కారణాలు ఈ విధంగా ఉన్నాయి. అవి :
- ఏర్పాటు చేయబోయే రాజ్యాంగాన్ని తిరసరించే హక్కు సంస్థానాలకు ఇవ్వడం, దీని వల్ల కాంగ్రెస్ తిరస్కరించింది.
- పాకిస్తాన్ డిమాండను ఈ ప్రతిపాదన అంగీకరించలేదు. కాబట్టి ముస్లింలు కూడా దీన్ని అంగీకరించలేదు.
“దివాలా తీస్తున్న బ్యాంకు మీద ముందు రోజు తేది వేసి రాసిన చెక్కులాంటిదని” క్రిప్స్ రాయబారాన్ని గాంధీజీ తిరస్కరించడంతో ఈ చర్చలు విఫలం అయ్యాయని చెప్పవచ్చు.
ప్రశ్న 16.
“క్విట్ ఇండియా”. ఉద్యమం ఏ విధంగా విస్తరించింది?
జవాబు:
- 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది.
- ఉద్యమ ప్రారంభంలోనే గాంధీజీని ఖైదు చేసినా యువకార్యకర్తలు దేశ వ్యాప్తంగా సమ్మెలు నిర్వహించారు.
- దాడులు చేసి, ఆస్తి నష్టం కలిగించారు.
- యువత పెద్ద సంఖ్యలో కళాశాల చదువులు వదిలి పెట్టి జైళ్ళకు వెళ్ళారు.
- మారుమూల గ్రామాలలోని రైతులను మేల్కొలిపారు.
- పోస్టాఫీసులు, రైల్వే స్టేషన్లపై దాడి జరిపారు.
పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా విప్లవం సాగింది. అయితే బ్రిటిష్ పాలకులు మరింత బల ప్రయోగంతో శక్తివంతంగా ఉద్యమాన్ని అణచివేశారు.
ప్రశ్న 17.
సంస్థానాల విలీనం ఏవిధంగా జరిగింది ? ఎవరు దీనికి నాయకత్వం వహించారు?
(లేదా )
సంస్థానాల విలీనంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ నిర్వహించిన పాత్ర గురించి వివరించండి.
జవాబు:
బ్రిటిష్ అధికారం క్రింద సుమారు 550 సంస్థానాలు ఉండేవి. ఈ సంస్థానాలను, భారతదేశంలో చేరతారో, పాకిస్తాన్లో చేరతారో, లేదా స్వతంత్రంగా ఉంటారో నిర్ణయించుకోమన్నారు. అయితే ఆయా సంస్థానాలలోని ప్రజలు ప్రజా మండల ఉద్యమాల్లో పాల్గొనటం మూలంగా ప్రజాస్వామిక హక్కులపట్ల చైతన్యం కలిగి, రాజరిక కుటుంబాల పాలన కొనసాగాలని వారికి లేదు. కాంగ్రెస్ ఈ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసే బాధ్యతను 1947లో సర్దార్ పటేల్ కి అప్పగించారు.
1947 ఆగష్టు 15 నాటికి కాశ్మీర్, హైదరాబాద్, జునాగు తప్పించి మిగిలిన సంస్థానాలన్నీ భారతదేశంలో విలీనం ఒప్పందంపై సంతకాలు చేశాయి. తరువాత రెండు సంవత్సరాలలోపు ఈ మూడు సంస్థానాలు కూడా భారతదేశంలో విలీనం అయ్యేటట్లు పటేలు చేశారు.
ప్రశ్న 18.
హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్
ఈ సమయంలో హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం (ఆర్ఎస్ఎస్) ప్రజలను సమీకరించటానికి చురుకుగా పని చేశాయి. కులం, వర్గాలను అధిగమించి హిందువులనందరినీ ఏకం చేసి సామాజిక జీవితంలో సంస్కరణలు తీసుకురావాలని ఈ సంఘాలు ఆశించాయి. భారతదేశం అధిక సంఖ్యలో ఉన్న హిందువుల భూమి అన్న అభిప్రాయాన్ని కూడా వాళ్లు కలిగించారు. ఈ సంఘాల కార్యకలాపాలతో అనేకమంది కాంగ్రెస్ వాదులు కూడా ప్రభావితమయ్యారు.
“ముస్లిం లీగు బలపడడానికి కాంగ్రెస్ వైఫల్యమే కారణం అనే విషయాన్ని నీవు అంగీకరిస్తావా? ఎందుకు? చర్చించుము.”
జవాబు:
అంగీకరిస్తాను – ఎందుకనగా ….. హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ సంఘాలు, భారతదేశం అధిక సంఖ్యలో ఉన్న హిందువుల భూమి అన్న అభిప్రాయాన్ని కలిగించారు. ఈ సంఘాల కార్యకలాపాలతో అనేక మంది కాంగ్రెస్ వాదులు కూడా ప్రభావితమయ్యారు. అయితే తమ సభ్యులలో లౌకిక అవగాహనను పెంచటానికి కాంగ్రెస్ ఎంతో ప్రయత్నించింది. అయితే ముస్లిం లీగుకి హిందువుల ఆధిపత్యం పట్ల ఉన్న భయాలను బ్రిటన్ పెంచి పోషించింది.
చాలా ప్రాంతాలలో హిందువులు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి హిందువులే అన్ని సభలకు ఎన్నికవుతారని, ప్రభుత్వంలో ముస్లిముల ప్రయోజనాలను కాపాడటం కష్టమవుతుందనే ముస్లిం లీగు భయాన్ని కాంగ్రెస్ తొలగించలేక పోయింది. పై పెచ్చు ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు ఏర్పాటు చేయుటకు అంగీకరించి, ముస్లిం లీగు బలపడడానికి దోహదపడింది.
1937-1947ల మధ్య ముస్లిముల పట్ల కాంగ్రెస్ సున్నితత్వంతో స్పందించటం లేదని అనేక అంశాలను ముస్లిం లీగు ఎత్తి చూపింది మరియు యునైటెడ్ ప్రావిన్స్ లో ఎక్కువ సీట్లనే గెలుచుకున్న ముస్లిం లీగుతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయటాన్ని కాంగ్రెస్ తిరస్కరించింది. తమ సభ్యులు ముస్లిం లీగులో సభ్యత్వం తీసుకోవటాన్ని కాంగ్రెస్ నిషేధించింది. ఆ
ఈ విధమైన కాంగ్రెస్ ప్రవర్తన మరియు పద్ధతుల మూలంగా ముస్లిం లీగు బలపడిందని, అది చివరికి దేశ విభజనకు దారితీసిందని చెప్పవచ్చు.