Students can go through AP Board 10th Class Social Notes 9th Lesson రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ to understand and remember the concept easily.
AP Board 10th Class Social Notes 9th Lesson రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ
→ పంజాబ్, హర్యానాలతో పాటు పశ్చిమ ఉత్తరప్రదేశ్ వ్యవసాయపరంగా సంపన్న ప్రాంతం. ఇది సారవంతమైన గంగానది ఒండ్రు నేలలను కలిగి ఉంది.
→ వ్యవయసాయ ఉత్పత్తికి భూమి చాలా కీలకమైన అంశం.
→ ఒకే విస్తీర్ణంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను సాగుచేయడాన్ని ‘బహుళ పంటల సాగు’ అంటారు.
→ రాంపురంలో బాగా అభివృద్ధి చెందిన నీటి పారుదల వ్యవస్థ ఉన్నందువలన రైతులు సంవత్సరంలో 3 పంటలు సాగుచేస్తున్నారు.
→ భూమి, నీరు వంటి సహజ వనరులను అధికంగా ఉపయోగించడం వలన దిగుమతులు, ఉత్పత్తి పెరిగాయి.
→ రసాయనిక ఎరువులు, పురుగుల మందులు అధికంగా, ఇష్టానుసారంగా వాడటం వలన భూసారం తగ్గుతుంది.
→ రాంపురం జనాభా 2660. అక్కడ వివిధ కులాలకు చెందిన 450 కుటుంబాలున్నాయి.
→ ప్రజలకు వస్తువులు, సేవలను అందించడమే ఉత్పత్తి ఉద్దేశం.
→ భూమి, శ్రమ, పెట్టుబడి, జ్ఞానం – ఈ నాల్గింటిని ఉత్పత్తి కారకాలంటాం.
→ భూమిలేని కుటుంబాల నుంచి, చిన్న రైతు కుటుంబాల నుంచి వ్యవసాయ కార్మికులు వస్తారు.
→ ఒకే పని చేస్తున్నప్పటికీ ఆడవారి కంటే మగవారికే కూలీ ఎక్కువ లభిస్తుంది.
→ నిర్వహణ పెట్టుబడి కోసం చాలా మంది రైతుల అప్పులు చేస్తారు. ఇటువంటి అప్పుల మీద వడ్డీ ఎక్కువ.
→ రైతులు తమ ఉత్పత్తిలో కొంత కుటుంబ అవసరాలకు ఉంచుకోగా బజారులో అమ్మేదాన్ని మిగులు అంటాం.
→ వ్యవసాయ పనులలో కొన్ని సార్లు నష్టం కూడా వస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, పురుగుల వలన పంట నష్టపోయినపుడు ఇలా నష్టం రావచ్చు.
→ గ్రామీణ ప్రాంతాలలో గత కొంత కాలంగా రవాణాపై ఆధారపడి జీవిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది.
→ రాంపురంలో వ్యవసాయేతర కార్యక్రమాలలో పాడి పరిశ్రమ, చిన్న తరహా వస్తువుల తయారీ, దుకాణాలు, రవాణా రంగం ప్రధానమైనవి.
→ ఉత్పత్తి కారకాలు : భూమి, శ్రమ, పెట్టుబడి, జ్ఞానము – ఈ నాల్గింటిని ఉత్పత్తి కారకాలంటారు.
→ భూమి : ఒక సహజ ఉత్పత్తి కారకము.
→ శ్రమ : శ్రమ అనగా కేవలం కార్మికులు చేసే శారీరక శ్రమేకాకుండా ఉత్పత్తికి అవసరమైన మానవ ప్రయత్నాలన్నింటినీ ఇది సూచిస్తుంది.
→ నిర్వహణ పెట్టుబడి : ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించే ముడిసరుకు, ఖర్చుచేయవలసిన డబ్బును నిర్వహణ పెట్టుబడి అంటాం.
→ స్థిర పెట్టుబడి : రైతులు ఉపయోగించే నాగలి నుండి ట్రాక్టరు వరకు అనేక పనిముట్లు కొనుగోలు, మరమ్మత్తు, నిర్వహణలకయ్యే ఖర్చును స్థిర పెట్టుబడి అంటారు.
→ మిగులు : పండిన పంటలో కుటుంబ అవసరాలకు పోను అమ్మగలిగే ఫలసాయాన్ని మిగులు అంటారు.
→ వ్యవసాయ కార్యకలాపాలు : పంటలో పండించేందుకు నిర్వహించు సమస్త కృత్యాలను వ్యవసాయ కార్యక్రమాలు అంటాం.
→ వ్యవసాయేతర కార్యక్రమాలు : వ్యవసాయం కాకుండా నిర్వహించు ఉత్పత్తి, సేవలను వ్యవసాయేతర కార్యక్రమాలంటాం.
ఉదా : పాడి పరిశ్రమ, చిన్న తరహా వస్తువుల తయారీ దుకాణాల నిర్వహణ మొదలగునవి.