Students can go through AP Board 10th Class Social Notes 10th Lesson ప్రపంచీకరణ to understand and remember the concept easily.
AP Board 10th Class Social Notes 10th Lesson ప్రపంచీకరణ
→ 20వ శతాబ్దం చివరిలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ముఖ్య పరిణామాల్లో ప్రపంచీకరణ ఒకటి.
→ 19వ శతాబ్దంలో విదేశీ వ్యాపారం, విదేశాలలో పెట్టుబడులు, కార్మికుల వలసలు వేగం పుంజుకున్నాయి.
→ ఈనాడు వృత్తి నైపుణ్యం ఉన్న ప్రజల వలసలకు గిరాకీ ఉంది.
→ ఒక దేశం కంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తిని చేపట్టే లేదా ఉత్పత్తిని నియంత్రించే సంస్థలను బహుళజాతి సంస్థలు అంటాం.
→ భూమి, భవనాలు, యంత్రాలు, ఇతర పరికరాలు వంటి వాటికోసం బహుళజాతి సంస్థలు ఖర్చు పెట్టే మొత్తాన్ని విదేశీ పెట్టుబడులు అంటాం.
→ బహుళజాతి కంపెనీలు ఆయాదేశాల స్థానిక కంపెనీలతో కలిసి ఉత్పత్తి చేపట్టడాన్ని జాయింట్ వెంచర్లు అంటారు.
→ బహుళజాతి సంస్థల కారణంగా దూరప్రాంతాలలోని ఉత్పత్తి మధ్య అనుసంధానం ఏర్పడుతుంది.
→ దేశాల మధ్య అనుసంధానంగా చాలా కాలంగా వాణిజ్యం ఉంటుంది.
→ ప్రపంచీకరణకు ముఖ్య కారణం సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందడం.
→ ప్రభుత్వం విధించిన అవరోధాలను, పరిమితులను తొలగించడాన్ని ఆర్థిక సరళీకరణ అంటారు.
→ నేడు ప్రపంచ వాణిజ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు వంటి ప్రపంచ పాలనా సంస్థలు ప్రపంచంలోని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
→ అమెరికా GDP లో వ్యవసాయం వాటా 1% కాగా మొత్తం ఉపాధి 0.5% మాత్రమే వ్యవసాయరంగంలో ఉన్నారు.
→ 1991 నుండి భారతదేశం ఆర్థిక సరళీకరణ విధానాలను అవలంబించింది.
→ టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, రాన్బాక్సీ మొదలగునవి మన దేశానికి చెందిన బహుళజాతి సంస్థలు.
→ భారతదేశంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఆర్థిక మండలులు’ ఏర్పాటు చేశాయి.
→ ప్రపంచీకరణ వలన జాతీయ రాజ్యాలు అంతరించిపోతాయని కొందరు భయపడుతున్నారు.
→ బహుళజాతి సంస్థలు (MNCs) : ఒక దేశం కంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తిని చేపట్టే లేదా ఉత్పత్తులను నియంత్రించే సంస్థలను ‘బహుళజాతి సంస్థలు’ అంటారు.
→ జాతీయ రాజ్యం : ఒక ప్రాంతం, జాతి వంటి వాటి ఆధారంగా సంఘటితమై రాజకీయంగా దేశాలను గుర్తించడం ద్వారా ఏర్పడ్డవే జాతీయ రాజ్యాలు.
→ సాంకేతిక పరిజ్ఞానం : సాంకేతిక జ్ఞానాన్ని కలిగియుండుటను ‘సాంకేతిక పరిజ్ఞానం’ అంటాం.
→ విదేశీ పెట్టుబడి : భూమి, భవనాలు, యంత్రాలు, ఇతర పరికరాలు వంటి వాటి కోసం బహుళజాతి సంస్థలు పెట్టే మొత్తాన్ని ‘విదేశీ పెట్టుబడులు’ అంటారు.
→ విదేశీ వాణిజ్యం : ఇతర దేశాలతో జరుపు వాణిజ్యాన్ని విదేశీ వాణిజ్యం అంటాం.
→ సరళీకృత ఆర్థిక విధానం : ఎగుమతి, దిగుమతి రంగాలలో ప్రభుత్వం తక్కువ పరిమితులను విధించడాన్ని సరళీకృత ఆర్థిక విధానం అంటాం.