Students can go through AP Board 10th Class Social Notes 19th Lesson రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000 to understand and remember the concept easily.
AP Board 10th Class Social Notes 19th Lesson రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000
→ 1975-86 మధ్య కాలం భారతదేశ ప్రజాస్వామ్యానికి పరీక్షాకాలం వంటిది.
→ 1975-85 మధ్య కాలం భారతదేశం ఏకపార్టీ ప్రజాస్వామ్యంలోకి జారిపోకుండా సమర్థవంతంగా నివారించింది.
→ 1975-85 మధ్య కాలంలో పర్యావరణ ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, పౌరహక్కుల ఉద్యమం, సాహిత్య ఉద్యమం వంటి ఉద్యమాలు మొదలై సామాజిక మార్పునకు బలమైన చోదకశక్తులుగా మారాయి.
→ భారతదేశంలో అత్యవసర పరిస్థితికి ముగింపు పలికిన ఎన్నికలు 1977 సాధారణ ఎన్నికలు.
→ 1977 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలిసి పోటీచేయాలని నిర్ణయించాయి.
→ కాంగ్రెస్ (ఓ), స్వతంత్ర పార్టీ, భారతీయ జనసంఘ్, భారతీయ లోక్ దళ్, సోషలిస్టు పార్టీలు విలీనమై జనతాపార్టీగా ఏర్పడాలని నిర్ణయించాయి.
→ కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు అన్నీ ఒక తాటి కిందకు వచ్చి ఎన్నికలలో పోటీ చేయటంలో జయప్రకాష్ నారాయణ్, ఆచార్య జె.బి. కృపలాని వంటి సీనియర్ నాయకులు ముఖ్యపాత్ర పోషించారు.
→ మొదటిసారి జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూసిన ఎన్నికలు 1977 సాధారణ ఎన్నికలు.
→ 1977 సాధారణ ఎన్నికలలో గెలిచిన జనతాపార్టీ 9 రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలను తొలగించింది.
→ 1977 సాధారణ ఎన్నికల తరువాత అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలలో జనతాపార్టీ, పశ్చిమ బెంగాల్ లో సిపిఐ(ఎం), తమిళనాడులో డి.ఎం.కె. గెలిచింది.
→ ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని పునరుద్ధరిస్తామన్న వాగ్దానంతో జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది.
→ జనతాపార్టీ తరపున భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టింది మొరార్జీ దేశాయి.
→ 1980లో జరిగిన సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది.
→ భారతీయ రైతులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం అన్న సోషలిస్టులతో ఏర్పడిన పార్టీ – భారతీయ లోక్ దళ్.
→ ఇందిరాగాంధీ విధానాలను వ్యతిరేకించి కాంగ్రెస్లోని సంప్రదాయవాద వర్గం ఏర్పరచిన పార్టీ – కాంగ్రెస్ (ఓ).
→ పెను భూసంస్కరణలకు, కార్మిక సంఘాలు, సోషలిస్టు విధానాలకు కృషిచేస్తున్న పార్టీ సి.పి.ఐ (ఎం).
→ తమిళనాడులో ఉన్న పార్టీ – ద్రవిడ మున్నేట్ర కజగం (డి.ఎం.కె).
→ హిందూ జాతీయతావాద పార్టీ – జనసంఘ్.
→ సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ – శిరోమణి అకాలీ దళ్.
→ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించటానికి ఉపయోగించే ఆర్టికల్ – 356.
→ ఎన్.టి. రామారావు 1982లో తన 60వ పుట్టినరోజునాడు తెలుగుదేశం పార్టీ (తె.దే.పా) ని స్థాపించారు.
→ పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యం, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, మద్యపాన నిషేధం వంటి పేదల సంక్షేమ పథకాలను ఎన్.టి. రామారావు ప్రకటించారు.
→ రాజకీయ అస్థిరత, బయటివారి రాకతో తమ సంఖ్య తగ్గుతుందనీ భయం కారణంగా, అస్సోం ప్రజలలో ఏర్పడిన అసంతృప్తి 1970 లో సామాజిక ఉద్యమంగా మారింది.
→ 1984లో రాజీవ్ గాంధీ చొరవతో కేంద్రప్రభుత్వం అఖిల అసోం విద్యార్థి సంఘం ఒక ఒప్పందంపై సంతకాలు చేశారు.
→ బెంగాలీలు, అస్సోమీయుల మధ్య మొదలైన సమస్య ఒక సున్నిత అంశంగా తయారై, సంక్లిష్ట అంతర్గత జాతిఘర్షణలకు దారితీసింది.
→ కేంద్రంలో జనతాపార్టీ ప్రభుత్వం ఉండగా 1978లో అకాలీ దళ్ కొన్ని తీర్మానాలు చేసి వాటిని అమలు చెయ్యాలని కేంద్రప్రభుత్వాన్ని కోరింది.
→ 1984లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యకు గురయ్యింది.
→ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి ఎస్.ఎ.డి నాయకుడైన సంత్ లాంగోవాల్ కి మధ్య ఒక ఒప్పందం కుదిరింది.
→ 1986 ఏప్రిల్ లో అకల్ తఖ్ వద్ద సమావేశంలో ఖలిస్తాను స్వతంత్ర దేశంగా ప్రకటించారు.
→ 1984లో రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ అంతకుముందెన్నడు లేనంతగా ఎన్నికలలో ఘనవిజయం సాధించింది.
→ రాజీవ్ గాంధీ భారతదేశంలో ‘టెలికం విప్లవం’ను ఆరంభించారు.
→ భర్త నుంచి విడాకులు పొందిన షా బానో అన్న మహిళ వేసిన కేసులో 1985లో సుప్రీంకోర్టు ఆమె మాజీ భర్త ఆమెకు భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
→ రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం ఏమనగా అది రాముని జన్మస్థలం అని, అంతకు ముందు అక్కడ ఉన్న గుడిని పడగొట్టి మసీదు కట్టారని హిందువులు భావించగా, అది నిజం కాదని, అది తమ ప్రార్థనాస్థలమని ముస్లిములు పేర్కొంటున్నారు.
→ ఉత్తరప్రదేశ్, హర్యానాలోని రైతులు మహేంద్రసింగ్ తికాయత్ నేతృత్వంలోనూ, మహారాష్ట్రలోని రైతులు శరద్ జోషీ నాయకత్వంలోనూ పోరాడసాగారు.
→ 1989లో జరిగిన ఎన్నికలలో ‘కాంగ్రెసేతర రాజకీయ శక్తులకు పరిపాలన, రాజకీయ రంగాలలో అవినీతి ప్రధాన ప్రచార అంశం.
→ 1989లో వి.పి.సింగ్ నేతృత్వంలో జనతాదళ్ తో మొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది.
→ 1977లో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికలలో సి.పి.ఎం.కి చెందిన జ్యోతిబసు గెలిచి వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఆపరేషన్ బర్గా అనగా కౌలుదార్లను భూస్వాములు బలవంతంగా ‘తొలగించటానికి వీలు లేకుండా పోవడం.
→ మండల్ కమిషన్ నివేదికను అనుసరించి, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లు కల్పించింది వి.పి.సింగ్ ప్రభుత్వం.
→ స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ గుర్తింపునిస్తూ 1992వ సంవత్సరంలో పి.వి. నరసింహారావు నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది.
→ 73వ రాజ్యాంగ సవరణతో గ్రామస్థాయిలో, 74వ రాజ్యాంగ సవరణతో పట్టణ మరియు నగరాల స్థాయిలో ప్రభుత్వాలను సార్వత్రిక వయోజన ఓటింగ్ ద్వారా మొట్టమొదటిసారి ఎన్నుకున్నారు.
→ బి.జె.పి నాయకుడైన ఎల్.కె. అద్వానీ 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర చేపట్టాడు.
→ 1991లో వి.పి.సింగ్ ప్రభుత్వం పడిపోయినప్పుడు భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది.
→ 1992లో పి.వి. నరసింహారావు నేతృత్వంలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.
→ ప్రాంతీయ ఆకాంక్షలు : ప్రాంతాలకు సంబంధించిన కోరికలు, స్వయం ప్రతిపత్తితో ప్రాంతీయ ప్రయోజనాలు కాపాడుకోవడం, స్థానిక ప్రయోజనాలకు చెందిన కోరికలు.
→ సంకీర్ణ ప్రభుత్వాలు : 2 లేదా అంతకు మించి జాతీయ మరియు ప్రాంతీయ పార్టీలు ఒక సమూహంగా ఏర్పడి, ఏర్పాటుచేసిన ప్రభుత్వాలు.
→ మతతత్వ వాదం : తమ మతమే గొప్పది అని నమ్మే భావన. తమ మత అస్తిత్వం ఆధారంగా దేశాన్ని నిర్మించాలనే భావన. అన్ని మతాలకు తమ మతమే మార్గదర్శకం అనే భావన.
→ అధిక సంఖ్యాక వర్గం : అత్యధిక సంఖ్యలో ఉన్న ఒకే వర్గానికి చెందిన ప్రజలు; ఒకే మతం, ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తున్న ప్రజలు ఎక్కువగా ఉండటం.
→ అల్ప సంఖ్యాక వర్గం : తక్కువ సంఖ్యలో ఒకే వర్గానికి చెందిన ప్రజలు; ఒకే మతం, ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తున్న ప్రజలు తక్కువగా ఉండటం.
→ అత్యవసర పరిస్థితి : సాధారణ పాలనలో వైఫల్యం చెందినప్పుడు విధించే పరిస్థితి.
→ ఏకపార్టీ ప్రజాస్వామ్యం : ప్రజలు ఎల్లప్పుడు ఒకే పార్టీకి అధికారాన్ని అప్పగించటం.
→ సోషలిస్టులు : సమాజంలోని పౌరులందరు సమానమేనని, పేద, ధనికవర్గాల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు ఉండరాదని తెలియజేసేవారు.
→ హిందూ జాతీయవాదులు : హిందూ జాతీయతను పరిరక్షించాలి అని భావించేవారు.
→ కమ్యూనిస్టులు : శ్రమ చేసేవానికే శ్రమ యొక్క ఫలితం అందాలి అని భావించేవారు
→ బి.ఎల్.డి. : భారతీయ లోకదళ్
→ ఈ సి.పి.ఐ (ఎం) : భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
→ డి.ఎం.కె : ద్రవిడ మున్నేట్ర కజగం
→ ఎస్.ఎ.డి : శిరోమణి అకాలీ దళ్
→ ఎ.ఎ.ఎయు : అఖిల అస్సోం విద్యార్థి సంఘం
→ ఎ.జి.పి : అస్సోం గణపరిషత్
→ రాష్ట్రపతి పాలన : రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాన్ని పాలించలేకపోతోందని గవర్నర్ అభిప్రాయపడితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి సలహాతో రాష్ట్రపతి తొలగించి పాలనా బాధ్యతను చేపట్టమని గవర్నర్‌ను కోరి పరిపాలన సాగించడం.
→ అంతర్గత వలస ప్రాంతం : ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతంపై అధికారాన్ని చెలాయించటం.
ఉదా : బెంగాల్ ప్రాంతం వారు. అసోం ప్రాంతంపై అధికారాన్ని చెలాయించుట.
→ టెలికం విప్లవం : ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో దేశంలో టెలిఫోనిక్ నెట్వర్క్ వేగంగా విస్తరించడం.
→ విధాన పక్షపాతం : ప్రభుత్వం తీసుకునే కొన్ని విధానాల వల్ల కొద్దిమంది ప్రజలకు మేలు జరిగి, మిగతా వారికి ఏ విధమైన మేలు జరగకపోగా, ఒక్కోసారి కీడు జరిగే పరిస్థితి.
→ వామపక్ష పార్టీలు : బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయ అంశాలను అత్యధికంగా అమలుచేయాలనే ప్రధాన ఉద్దేశం గల పార్టీలు.
→ ఆపరేషన్ బర్గా : కౌలుదార్లను భూస్వాములు బలవంతంగా తొలగించటానికి వీలులేకుండా చేసిన చర్య.
→ మండల్ కమిషన్ : సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ కల్పించాలని నివేదించిన కమిటీ.
→ లౌకికరాజ్యం : రాజ్యపాలన నిర్వహణలో మతం ప్రమేయం లేకుండుట.
→ సరళీకృత ఆర్థిక విధానం : ప్రభుత్వ ఖర్చును తగ్గించుకొని, విదేశీ సరకులపై పరిమితులను తగ్గించి, ప్రైవేటు రంగానికి ప్రాధాన్యత ఇవ్వటం.
→ బహుళ పార్టీ వ్యవస్థ : రెండు లేదా అంతకన్నా ఎక్కువ పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే వ్యవస్థ.
→ ప్రజాస్వామ్యం : ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వ వ్యవస్థ ఉండడం.
→ దేశ ఐక్యత : దేశంలోని ప్రజలందరూ కలసిమెలసి జీవించడం.
→ పర్యావరణ ఉద్యమం : పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి జరిపే ఉద్యమం.
→ స్త్రీవాద ఉద్యమం : స్త్రీలకు అన్ని విషయాలలో సమాన హోదా కోసం పోరాడడం.
→ పౌరహక్కుల ఉద్యమం : ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించుట కొరకు జరిగేది.
→ సాహిత్య ఉద్యమం : మంచి రచనలతో ప్రజలను ముందుకు నడిపించడం.
→ రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాదం : అది రాముని జన్మస్థలం అని, అంతకు ముందు అక్కడ ఉన్న గుడిని పడగొట్టి మసీదు కట్టారని హిందువుల వాదన కాగా, అది నిజం కాదని, ఇది తమ ప్రార్థనా స్థలమని ముస్లింల వాదన.
→ వామపక్ష ప్రభుత్వం : అణగారిన వర్గాలకు ప్రభుత్వాధికారం సంక్రమించాలనే ప్రభుత్వం.