Students can go through AP Board 10th Class Social Notes 20th Lesson ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం to understand and remember the concept easily.
AP Board 10th Class Social Notes 20th Lesson ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం
→ రెండవ ప్రపంచయుద్ధం తరువాత ప్రపంచం రెండు శిబిరాలుగా విడిపోయింది.
1) యుఎస్ఎస్ఆర్ కూటమి (కమ్యూనిస్ట్ వర్గం).
2) అమెరికా కూటమి (పెట్టుబడిదారి వర్గం).
→ రెండవ ప్రపంచయుద్ధం మూలంగా అమెరికా శక్తిమంతమైన దేశంగా ఆవిర్భవించిందని అమెరికా అధ్యక్షుడు “హారీట్రూమన్” అన్నాడు.
→ రెండవ ప్రపంచయుద్ధ వినాశనం, ఒక అంతర్జాతీయ శాంతి సంస్థ స్థాపనకు మూలమైంది.
→ ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతి స్థాపన కొరకు 1945లో ఏర్పడింది.
→ రెండవ ప్రపంచయుద్ధం తరువాత అనేక ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాయి.
→ ఐక్యరాజ్యసమితిలో శాశ్వత దేశాలైన చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, అమెరికాలకు ‘వీటో’ అధికారం ఉంది.
→ రెండవ ప్రపంచయుద్ధం తరువాత ప్రపంచం రెండు కూటాలుగా విడిపోయింది (అమెరికా-రష్యా). ఈ రెండు దేశాలు మధ్య చాలాకాలం ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగింది.
→ ప్రచ్ఛన్న యుద్ధంలో భాగంగా అమెరికా, రష్యాలు ఆయుధాలను సమకూర్చుకున్నారు. పరోక్ష యుద్ధాలు చేశారు. ఉపగ్రహాలను అంతరిక్షంలోనికి పంపించారు. సైనిక ఒప్పందాలు చేసుకున్నారు.
ఉదా : నాటో, వార్సా..
→ ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ప్రపంచం అణ్వాయుధ యుద్ధ విధ్వంస నీడలో బితుకు బితుకుమంటూ ఉంది.
→ ప్రచ్ఛన్న యుద్ధ నేపథ్యంలో భారతదేశం ఈ రెండు అగ్రరాజ్య కూటాలలో చేరకుండా ప్రత్యేకంగా అలీనోద్యమాన్ని రూపొందించుకున్నది.
→ 1964లో జోర్డాన్లో పాలస్తీనా విముక్తి సంఘం PLO ఆవిర్భవించింది.
→ ప్రచ్ఛన్న యుద్ధం ముగింపుగా యుఎస్ఎస్ఆర్ 1991లో రద్దు అయి, ప్రపంచం ఏకధృవ ప్రపంచంగా మారిపోయింది.
→ భారతదేశం పొరుగున ఉన్న దేశాల పట్ల ‘పెద్దన్న’ పాత్ర వహిస్తుందని చిన్న దేశాల ఆరోపణ.
→ సైనిక ఒప్పందాలు : రెండవ ప్రపంచయుద్ధం తరువాత ప్రపంచం, యుఎస్ఎస్ఆర్ (రష్యా) మరియు అమెరికా శిబిరాలుగా విడిపోయింది. ఈ రెండు వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఏర్పడింది. ఈ ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో రష్యా, అమెరికా వర్గాలు అనేక సైనిక ఒప్పందాలు చేసుకొని, చాలా దేశాలను వారి వారి కూటములలో చేర్చుకున్నారు.
ఉదా : నాటో (NATO), వార్సా (WARSA).
→ పరోక్ష యుద్ధం : ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా, రష్యాలు ప్రత్యక్ష యుద్దాలు చేసుకోలేదు. స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న దేశాలలో రెండు విరోధ బృందాలకు ఈ రెండు శిబిరాలలో చేరాక శిబిరం మద్దతు ఇవ్వసాగింది. దీంతో ఆయా యుద్ధాలలో ఈ రెండు శిబిరాలు పరోక్ష యుద్ధాలు చేస్తున్నాయి.
→ ఆయుధ పోటీ : ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో, ఆయుధ పరిశోధనల పైనా, ఖండాంతర క్షిపణులు, విధ్వంసకర అణ్వాయుధాల నిల్వల పైనా అమెరికా, రష్యాలు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశాయి. ఈ రెండు దేశాలలో ఒక్కొక్క దాని దగ్గర ప్రపంచాన్ని పలుమార్లు మట్టుపెట్టుగల అణ్వాయుధాలు ఉన్నాయి.
→ ఏకధృవ ప్రపంచం : ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపుగా 1991లో, యుఎస్ఎస్ఆర్ అధ్యక్షుడు మిహాయిల్ గోర్బచేవ్ యుఎస్ఎస్ఆర్‌ను రద్దుపరచినాడు. అందులోని రాజ్యాలు స్వతంత్ర దేశాలు అయ్యాయి. యుఎస్ఎస్ఆర్ కుప్పకూలటంతో ప్రపంచ రాజకీయాలలో కొత్త యుగం ఆరంభమయ్యింది. అది ఏక ధృవ ప్రపంచంగా మారింది.
→ ద్విధృవ ప్రపంచం : రెండవ ప్రపంచయుద్ధం తరువాత రెండు ప్రధాన సైద్ధాంతిక రాజకీయ శిబిరాలు ఏర్పడ్డాయి. యుఎస్ఎస్ఆర్ నేతృత్వంలో కమ్యూనిస్టు శిబిరం, అమెరికా నేతృత్వంలో ప్రజాస్వామిక – పెట్టుబడిదారి శిబిరం. ఈ రెండు శిబిరాలు ప్రపంచంలోని దేశాలను వారి వారి శిబిరాలలో చేర్చుకొనుటకు అనేక ప్రయత్నాలు చేశాయి. చివరికి ప్రపంచమంతా రెండు ధృవాలుగా విడిపోయింది.
→ వలసపాలిత దేశాల విముక్తి : సామ్రాజ్య కాంక్షతో బలమైన దేశాలు వెనుకబడిన ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల మీద ఆధిపత్యం చెలాయించాయి. ఈ దేశాలలోని ప్రజలు అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి ఈ ఆధిపత్య దేశాల నుండి స్వాతంత్ర్యం సంపాదించుటనే వలసపాలిత దేశాల విముక్తి అంటారు.
→ వీటో : ఐక్యరాజ్య సమితిలోని భద్రతా సమితిలో శాశ్వత సభ్యులైన చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, యుఎస్ఎస్ఆర్ (ఇప్పుడు రష్యా), అమెరికాలకు వీటో పవర్ ఉంది. అంటే ఐక్యరాజ్య సమితి తీర్మానాలను తిరస్కరించే అధికారాన్నే వీటో అధికారం అంటారు.
→ జాతి వైరుధ్యాలు : శ్రీలంకలో ప్రధానంగా రెండు జాతుల ప్రజలున్నారు.
- సింహళం మాట్లాడే ప్రజలు
- తమిళం మాట్లాడే ప్రజలు. ఈ రెండు వర్గాల మధ్య అపనమ్మకం కారణంగా ఘర్షణలు తీవ్రమయ్యాయి. ఈ రెండు వర్గాల మధ్య వైరుధ్యాలనే జాతి వైరుధ్యాలని అంటారు.
→ పంచశీల : శాంతి, అహింస, సహజీవనం అనేవి మన విదేశాంగ నీతి సూత్రాలు. 1954లో టిబెట్టు విషయమై భారతదేశం, చైనాలు చేసుకొన్న ఒడంబడికలో శాంతియుత సహజీవన సూత్రం వివరించబడింది. దీన్నే పంచశీల అంటారు. ఇవి ఐదు సూత్రాలు.
- ఒకరి సర్వసత్తాకతని, భౌగోళిక సమగ్రతను మరొకరు గౌరవించటం.
- ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం.
- దాడులకు దిగకపోవటం, వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవటం.
- అంతర్జాతీయ సంబంధాలలో పరస్పర గౌరవం, సహకారాల కోసం కృషి చేయటం.
- శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించటం.
శాంతి : యుద్ధాలు, యుద్ధభయం లేని ప్రపంచంలో శాంతి ఉంటుంది.