Students can go through AP Board 10th Class Social Notes 2nd Lesson అభివృద్ధి భావనలు to understand and remember the concept easily.
AP Board 10th Class Social Notes 2nd Lesson అభివృద్ధి భావనలు
→ అభివృద్ధి, ప్రగతికి సంబంధించిన భావనలు మనతో అనాదిగా ఉన్నాయి.
→ ప్రతి ఒక్కరి కోరికలు వేరువేరుగా ఉంటాయి.
→ ఉదాహరణకు మరింత విద్యుత్తు కోసం పారిశ్రామికవేత్తలు మరిన్ని ఆనకట్టలు కోరుకోవచ్చు. గిరిజనులు పెద్ద ఆనకట్టలను నిరసించి తమ భూములకు సాగునీటిని అందించేలా చిన్న చెక్ డ్యాములు లేదా కుంటలను కోరుకోవచ్చు.
→ మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాలసూచి (Time line) ని పరిశీలిస్తే వేట సేకరణ 2,00,000 సంవత్సరాలని, వ్యవసాయం ప్రారంభించి 12,000 సంవత్సరాలని, పారిశ్రామికీకరణ మొదలై 400 సంవత్సరాలని అర్థమవుతుంది.
→ అభివృద్ధి అంటే విభిన్న అభిప్రాయాలున్నప్పుడు అభివృద్ధి యొక్క విధానాలలో వ్యత్యాసాలుండడం సహజమే.
→ తమిళనాడు రాష్ట్రం, తిరుణవెల్లి జిల్లాలోని కుడంకుళం అణువిద్యుత్ కేంద్ర స్థాపనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ఉద్యమం అలాంటిదే.
→ కుడంకుళం అణువిద్యుత్ కేంద్రం ప్రధాన ఉద్దేశము నిరంతరం పెరుగుతున్న దేశ విద్యుచ్ఛక్తి అవసరాలు తీర్చడం.
→ వేరువేరు వ్యక్తులకు వేరువేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు, ఒకరికి అభివృద్ధి అయినది మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చు. అది మరొకరికి విధ్వంసం కూడా కావచ్చు.
→ ఆఫ్రికాలోని ఐవరీకోస్ట్ దేశంలోని అబిద్ జాన్ అనే పట్టణంలో ఒక ఓడ 500 టన్నుల విషపూరిత వ్యర్థ ద్రవ పదార్థాలను ప్రక్కన ఉన్న సముద్రంలో పారబోసింది.
→ డబ్బు లేదా అది కొనగలిగిన వస్తువులు మన జీవితంలో ఒక అంశం మాత్రమే. భౌతికం కాని అంశాలపైన జీవన నాణ్యత ఆధారపడి ఉంటుంది.
→ దశలను పోల్చటానికి ముఖ్యమైన ప్రామాణికాల్లో వాటి ఆదాయం ఒకటిగా పరిగణిస్తారు. ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలు తక్కువ ఆదాయం ఉన్న దేశాలకంటే అభివృద్ధి చెందాయి.
→ దేశవాసులందరి ఆదాయమూ కలిపి దేశ ఆదాయం అవుతుంది. ఇది దేశం మొత్తం ఆదాయాన్ని సూచిస్తుంది.
→ ఒకదేశంలోని ప్రజలు మరో దేశ ప్రజలకంటే మెరుగ్గా ఉన్నారా లేదా అనే విషయం తెలుసుకోవడానికి మనం సగటు ఆదాయాన్ని పోలుస్తాం.
→ దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే సగటు ఆదాయం వస్తుంది. సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అని కూడా అంటారు.
→ దేశాలను వర్గీకరించటానికి ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదికలో ఈ (తలసరి ఆదాయం) ప్రామాణికాన్ని ఉపయోగించింది.
→ 2012 సం||రానికి 12,600 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను “అధిక ఆదాయ దేశాలు” లేదా “ధనిక దేశాలు” అంటారు.
→ 1,035 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉండే దేశాలను “తక్కువ ఆదాయ దేశాలు” అంటారు.
→ 1,036 – 12599 అమెరికన్ డాలర్ల మధ్య తలసరి ఆదాయం ఉండే దేశాలను “మధ్య ఆదాయ దేశాలు” అంటారు.
→ అయితే ఒక దశాబ్దం క్రితం భారతదేశం తక్కువ ఆదాయ దేశాల జాబితాలో ఉండేది.
→ పశ్చిమ ఆసియా దేశాలు, మరికొన్ని చిన్న దేశాలు మినహా ధనిక దేశాలను సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాలని అంటారు.
→ పోలికకు ‘సగటు’ ఉపయోగకరంగా ఉన్నా అది ప్రజల మధ్య అంతరాలను వెల్లడి చేయదు.
→ వ్యక్తులను, ఆకాంక్షలను, లక్ష్యాలను చూసినప్పుడు మెరుగైన ఆదాయమే కాకుండా భద్రత, ఇతరులతో గౌరవింపబడడం, సమానంగా చూడబడటం, స్వేచ్ఛ వంటి లక్ష్యాలు కూడా ఉన్నాయని తెలిసింది.
→ సజీవంగా పుట్టిన ప్రతి వెయ్యిమంది పిల్లల్లో సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియచేసే సంఖ్యను “శిశుమరణాల రేటు” అంటారు.
→ ఏడు సం||రాలు, అంతకు మించిన వయస్సు వాళ్లల్లో అక్షరాస్యతను తెలియచేసేది, అక్షరాస్యత శాతం.
→ 6-17 సంవత్సరాల వయస్సు పిల్లల్లో బడికి హాజరవుతున్న పిల్లల శాతంను “నికర హాజరుశాతం” అంటారు.
→ పౌరులు ఉపయోగించుకోగల భౌతిక వస్తువులు, సేవలను కేవలం ఆదాయం సూచించలేదు.
→ వాస్తవానికి జీవితంలో ఎన్నో ముఖ్యమైన వాటిని అందించటానికి, తక్కువ ఖర్చుతో చేయాలంటే ఇటువంటి వస్తువులను, సేవలను సామూహికంగా అందించాలి.
→ ఆదాయ స్థాయి ముఖ్యమైనప్పటికీ అభివృద్ధిని సూచించటానికి అదొక్కటే సరిపోదని గుర్తించారు.
→ గత దశాబ్ద కాలం నుంచి అభివృద్ధికి కొలమానంగా ఆదాయంతో పాటు ఆరోగ్యం, విద్య సూచికలను కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
→ ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) ప్రచురించిన మానవ అభివృద్ధి నివేదిక దేశాలను ఆ ప్రజల విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాలను బట్టి పోలుస్తుంది.
→ మానవ అభివృద్ధి నివేదిక – 2013 లో భారతదేశం యొక్క స్థానం (ర్యాంక్) 136.
→ ఆయుః ప్రమాణ రేటు (మా. అ.ని – 2013) ఎక్కువగా కలిగి ఉన్న భారతదేశ పొరుగుదేశం శ్రీలంక.
→ తలసరి ఆదాయం రేటు (మా. అ.ని-2013) ఎక్కువగా కలిగి ఉన్న భారతదేశ పొరుగుదేశం శ్రీలంక.
→ మానవ అభివృద్ధి సూచికలు మొత్తం 177 దేశాల స్థానాలను సూచిస్తుంది.
→ మానవ అభివృద్ధి సూచికలలో దిగువన ఉండటం ప్రజల జీవితాలలోని కొన్ని అంశాలపై దృష్టి కేంద్రీకరించాలన్న సంకేతాన్ని ఇస్తోంది.
→ హిమాచల్ ప్రదేశ్ లో పాఠశాల విద్య విప్లవం, అభివృద్ధి అన్నది నిజంగా సంక్లిష్టమైన విషయమని తెలియచేస్తుంది.
→ హిమాచల్ ప్రదేశ్ లో పాఠశాలలో ఉపాధ్యాయులు, తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు వంటి కనీస సదుపాయాలు ఉండేలా అక్కడి ప్రభుత్వం చూసింది.
→ 2005 సంవత్సరంలో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై సగటున ప్రతి విద్యార్థి పై 1,049 రూపాయల ఖర్చు , పెడుతుంటే హిమాచల్ ప్రదేశ్ 2,005 రూపాయలు ఖర్చు పెడుతోంది. , పాఠశాల విద్యలో పది సంవత్సరాలు గడపటం అనేది హిమాచల్ ప్రదేశ్ పిల్లలకు నియమంగా మారిపోయింది.
→ ఆడపిల్ల పట్ల అంతగా వివక్షత లేకపోవటం అనేది హిమాచల్ ప్రదేశ్ లో చెప్పదగిన విషయం.
→ ఇతర రాష్ట్రాలలో పరిస్థితికి విరుద్ధంగా హిమాచల్ ప్రదేశ్ లో పుట్టిన కొన్ని నెలల్లో చనిపోయే పిల్లల్లో మగపిల్లలకంటే ఆడపిల్లల సంఖ్య తక్కువ.
→ భారతదేశం మొత్తంగా కంటే హిమాచల్ ప్రదేశ్ లో పాఠశాల విద్య విస్తరణ, అభివృద్ధి గణనీయంగా ఉన్నాయి.
→ అభివృద్ధి లక్ష్యాలలో వైవిధ్యం ఉన్నా వాటి సాధనా మార్గాలు వేరే అయినా అవి అభివృద్ధిలో భాగమే అవుతాయి.
→ ఆదాయం, తలసరి ఆదాయాలను అభివృద్ధి గణనలో తరచుగా పేర్కొన్నా అవి కొంతమేరకే తప్ప సమగ్ర అభివృద్ధిని సూచించవు. జాతీయాదాయంలో పెరుగుదల కన్పించినప్పటికీ పంపిణీలో చాలా అసమానతలు ఉన్నాయి.
→ ఆరోగ్య, విద్య, సామాజిక సూచికలను పరిగణనలోకి తీసుకోవడంతో మానవాభివృద్ధి భావన విస్తృతమైంది.
→ అందరికీ మెరుగైన విద్య, ఆరోగ్యం ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది.
→ తలసరి ఆదాయం : దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగించగా వచ్చునది ఆ దేశ తలసరి ఆదాయం . సగటు ఆదాయాన్ని “తలసరి ఆదాయం ” అని కూడా అంటారు.
→ మానవాభివృద్ధి : అభివృద్ధిని సూచించటానికి ఆదాయ స్థాయితో పాటు ఆరోగ్యం, విద్యా సూచికలలోని పెరుగుదలను కూడా పరిగణనలోకి తీసుకోవడంతో మానవాభివృద్ధి భావన మొదలైనది.
→ ప్రజా సదుపాయాలు : ప్రజలందరికీ అందాల్సిన ఆరోగ్యం, పారిశుద్ధ్యం, త్రాగునీరు, విద్యుత్తు, విద్యా, ప్రజారవాణా మొదలైన సదుపాయాలను “ప్రజా సదుపాయాలు” అంటారు.
→ విద్య, ఆరోగ్య సూచికలు : దేశంలోని ప్రజల విద్యాయిని, ఆరోగ్య స్థితిని తెలియచేయు సూచికలు.
ఉదా : అక్షరాస్యత శాతం, ఆయుఃప్రమాణం రేటు.
→ అక్షరాస్యత శాతం : ఏడు సంవత్సరాలు, అంతకు మించిన వయస్సు వాళ్ళల్లో అక్షరాస్యతను తెలియచేయునది అక్షరాస్యత శాతం.
→ శిశుమరణాల రేటు : సజీవంగా పుట్టిన ప్రతి వెయ్యిమంది పిల్లల్లో సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియచేయు సంఖ్య.
→ HDI : మానవాభివృద్ధి సూచిక.
→ సగటున బదిలో గడిపిన కాలం : 25 సం||రాల వయసు దాటినవాళ్ళు సగటున బడిలో గడిపిన సంవత్సరాలు.
→ పాఠశాల విద్యలో ఉండే : ప్రస్తుతం బడిలో పిల్లలు చేరుతున్నదాన్ని బట్టి బడి ఈడు పిల్లలు బడిలో ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలు ఉంటారన్న అంచనా.
→ ఆయు:ప్రమాణ రేటు : వ్యక్తి జీవించే సగటు కాలం. – జాతీయాదాయం : దేశవాసులందరి ఆదాయమును కలిపి “దేశ ఆదాయం” అంటారు. ఇది దేశం మొత్తం ఆదాయాన్ని సూచిస్తుంది.
→ UNDP : ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం.