Students can go through AP Board 10th Class Social Notes 21st Lesson సమకాలీన సామాజిక ఉద్యమాలు to understand and remember the concept easily.
AP Board 10th Class Social Notes 21st Lesson సమకాలీన సామాజిక ఉద్యమాలు
→ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత చాలా దేశాలలోని కొంతమంది ప్రజలు సమాన హక్కులకు నోచుకోని వారు , ఉన్నారు. వీరు తమ హక్కులు కోరుతూ ముందుకు రావడంతో అనేక దేశాలలో ఉద్యమాలు ఆవిర్భవించాయి.
→ 1960 ప్రాంతంలో అమెరికాలోని నల్లవారు పౌరహక్కుల కొరకు డా॥ మార్టిన్ లూథర్ కింగ్ ఆధ్వర్యంలో ఉద్యమం జరిపినారు.
→ చాలా కాలం పోరాటం తరువాత అమెరికా ఈ జాతి వివక్షతను రద్దు చేస్తూ పౌరహక్కుల చట్టాలు చేసింది. ఇప్పుడు నల్లవారికి తెల్లవారితో సమాన హక్కులు ఉన్నాయి.
→ USSR లోని ప్రజలు సోషలిస్ట్ ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ స్వేచ్ఛను కోరుతూ మానవహక్కుల ఉద్యమం లేవదీశారు. తూర్పు యూరపులోని చాలా ప్రాంతాలలో ఇటువంటి ఉద్యమాలు చేయుట జరిగింది.
→ USSR అధ్యక్షుడు ‘గోర్బచేవ్’ ప్రజలకు మరింత స్వేచ్ఛను కల్పిస్తూ ‘గ్లాస్ నోస్త్’ అనే సంస్కరణలను చేసినారు.
→ 1970 – 1980 ల మధ్య యుద్ధాలకు, అణ్వాయుధాలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిగాయి.
→ అమెరికా 1945 ఆగస్టులో జపాన్లోని హిరోషిమా, నాగసాకి లపై అణుబాంబులు వేసింది. దీని మూలంగా జరిగిన దారుణాన్ని ప్రపంచం అంతా చూసింది. అయినప్పటికి అమెరికా, USSR, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఆయుధాలను పెంచుకుంటూనే పోయారు.
→ అమెరికా వియత్నాంతో చేస్తున్న యుద్ధాన్ని అమెరికా సైనికులు నిరసించినారు. సైన్యంలో చేరే వయసున్న యువకులు “మేము సైన్యంలోకి వెళ్లం” అని వ్యతిరేకించారు. వియత్నాం ప్రజలు ఉద్యమాలు చేశారు. అమెరికా చివరకు 1975లో వియత్నాంతో యుద్ధాన్ని విరమించింది.
→ అణ్వాయుధ పోటీ మూలంగా ప్రపంచమంతా యుద్ధభీతితో వణికిపోయింది. అమెరికా, USSR ల మీద ఆయుధ నియంత్రణ కొరకు ఒత్తిడి పెరిగింది.
→ ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపుగా 1991లో START ఒప్పందం చేసుకుని ఆయుధాలను నియంత్రించారు.
→ 1991లో USSR రద్దు అయ్యి రష్యా ఆవిర్భవించింది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోయింది.
→ USSR లోని చెర్నోబిల్ లో అణుకర్మాగారంలో జరిగిన ప్రమాదం మూలంగా చాలా ప్రాంతాలు కాలుష్యానికి గురి అయ్యాయి.
→ 1990 నుంచి ‘ప్రపంచీకరణ’, ‘నయా ఉదారవాదం’ అన్న పేర్లతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ మార్పుల వల్ల రైతులు, గిరిజనులు, పేదవారు, భూమి లేనివారు తీవ్ర ప్రభావితమయ్యారు.
→ 1971లో అమెరికా చేసిన అణు పరీక్షకు వ్యతిరేకంగా గ్రీన్ పీస్ ఉద్యమం ఆవిర్భవించింది.
→ వాతావరణ కాలుష్యం వల్ల ఓజోను పొర దెబ్బతిని భూమి వేడెక్కుతుంది. దీని మూలంగా ధృవాల వద్ద ఉన్న మంచు టోపీలు కరిగి ప్రపంచంలోని సముద్రాలలో నీటి మట్టాలు పెరుగుతాయి. తద్వారా తీరప్రాంతాలు ముంపుకు గురికావచ్చు.
→ 1984లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు ఇప్పటికీ సరైన నష్టపరిహారం లభించలేదు. బాధితులు ఇంకా ఉద్యమం చేస్తూనే ఉన్నారు.
→ ‘నర్మదా బచావో’ ఉద్యమ నాయకులు ఆనకట్టల నిర్మాణాన్నే వ్యతిరేకిస్తున్నారు.
→ ఆనకట్టల నిర్మాణంలో నిర్వాసితులైన ప్రజలకు సరైన పునరావాసం కల్పించబడలేదు. ఆ ప్రజలను ఎవరూ పట్టించుకోలేదు. ఈ కారణంగానే అనేక పర్యావరణ ఉద్యమాలు ఆవిర్భవించాయి.
→ 1980లో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ స్థాపించబడింది.
→ మానవ హక్కులు, సామాజిక న్యాయం కొరకు మహిళలు ఉద్యమాలు చేశారు.
→ ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా దూబగుంట గ్రామ మహిళలు సారాను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేసి 1993లో సారాపై నిషేధాన్ని విధించుటకు కారణమైనారు.
→ మణిపూర్ మహిళలు మానవ హక్కుల కొరకు చేస్తున్న ‘మైరా పై బీ’ ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది.
→ పౌరహక్కులు : దీర్ఘకాలంగా సమాన హక్కులకు నోచనివాళ్లు తమ హక్కులు కోరుటనే పౌరహక్కులు అంటారు.
ఉదా : ఓటు హక్కు, అమెరికాలోని పౌరహక్కుల ఉద్యమం, నల్లజాతి వారు వివక్షతతో కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించటం.
→ సహాయనిరాకరణ : అమెరికాలోని పౌరహక్కుల పోరాటం 1960 లలో తీవ్రదశకు చేరుకుంది. పెద్ద ఎత్తున ప్రదర్శనలు, ఊరేగింపులతో పాటు సహాయనిరాకరణ అనగా వివక్షతతో కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించటం. వివక్షతతో కూడిన సేవలు అంటే శ్వేతజాతి, నల్లజాతి వాళ్లకి వేరువేరుగా సీట్లు ఉన్న బస్సులను బహిష్కరించటం.
→ ప్రజలను వేరు చెయ్యటం : ప్రజలను వేరుచెయ్యటం అంటే పాఠశాలల్లో, బస్సులలో బహిరంగ ప్రదేశాలలో, ఉద్యోగాలలో, గృహ వసతిలో, ఓటు హక్కులో సైతం వివక్షత చూపటం.
ఉదా : అమెరికాలో నల్లజాతి వారిని శ్వేతజాతి వారి నుండి వేరుచేసి చూసారు.
→ అస్థిర పరచటం : కాలుష్య పరిశ్రమలను స్థాపించుట మూలంగా, గనుల త్రవ్వకం మూలంగా ఆనకట్టలను నిర్మించడం మూలంగా ఆ ప్రాంతాలలో ఉన్న ప్రజలు, జంతువులు, అడవులు అన్ని కూడా అస్థిరపరచబడుతున్నాయి. ప్రజలు నిర్వాసితులవుతున్నారు.
→ యుద్ధ వ్యతిరేకత : అమెరికా, వియత్నాంతో చేసిన యుద్ధంలో 8 లక్షల సైనికులు, 30,00,000 పౌరులు చనిపోయారు. అమెరికాకు ఎటువంటి నష్టం జరుగలేదు. అమెరికాకు ఏ మాత్రం ప్రమాదకరం కానీ అమాయకమైన ప్రజలపై బాంబులు వెయ్యడం అటు సైనికులకు, ఇటు సైనికుల తల్లిదండ్రులకు అయిష్టంగా ఉంటూ, వారిలో యుద్ధ వ్యతిరేకత ఏర్పడింది. అమెరికా అంతా యుద్ధ వ్యతిరేక నిరసనలు ఉప్పొంగాయి.
→ సైన్యంలో చేరే వయస్సు : అమెరికాలో దృఢకాయులైన అందరూ తప్పనిసరిగా కొంతకాలం పాటు సైన్యంలో పనిచెయ్యాలనే చట్టం ఉంది. అయితే అమెరికా వియత్నాంతో యుద్ధం కొనసాగిస్తున్నంత వరకు “సైన్యంలో చేరే వయసున్న యువకులమైన మేము” సైన్యములో చేరం అని సైన్యంలో చేరే వయసున్న వారు తిరస్కరించినారు.
→ సాయుధీకరణ : వియత్నాం యుద్ధం ముగిసిన తరువాత మరిన్ని దేశాలు అణ్వాయుధాల నిల్వలలో ఒకదానితో ఒకటి పోటీ పడటంతో ఆయుధ పోటీ పెరిగింది.
→ పునరావాసం : ఆనకట్టలు కట్టే పథకాల వల్ల నిర్వాసితులయ్యే ప్రజలకు సరైన పునరావాసం కల్పించాలని కోరసాగారు.
→ నష్టపరిహారం : ఆనకట్టలు కట్టే పథకాలలో నిర్వాసితులయ్యే ప్రజలు కేవలం భూములున్న వాళ్లకే కాకుండా, అక్కడ ఉంటున్న వాళ్లందరికీ న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలని కోరసాగారు.
→ సారా వ్యతిరేకత : ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా దూబగుంట గ్రామంలోని మహిళలు, వారి భర్తలు సారా తాగి సొమ్మంతా ఖర్చు చేస్తున్నారని సారాకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీసుకువచ్చారు. సారా వేలం పాటలను ఆపించారు. సారాని నిషేధించేలా చేసారు.
→ ప్రజాస్వా మిక : ప్రపంచంలోని చాలా దేశాలు ప్రజాస్వామ్య దేశాలే. సామాజిక ఉద్యమాలు సాధారణంగా రాజకీయ పార్టీలకు దూరంగా ఉండి ఒక ఆశయం కోసం కలిసి పనిచేస్తాయి. తరచు ఈ సామాజిక ఉద్యమాల కార్యక్రమాలను భూస్వామ్య, ప్రజాస్వామిక పద్ధతుల్లో రూపొందిస్తారు.
భాగస్వామ్యం : సామాజిక ఉద్యమాలనేవి ఒక ప్రత్యేక ఆశయం కోసం ఆవిర్భవిస్తాయి. అయితే ఈ సామాజిక ఉద్యమాలలో సామాన్య ప్రజల సహకారం, భాగస్వామ్యం లేనిదే ఉద్యమాలు విజయం సాధించలేవు.