Students can go through AP Board 10th Class Social Notes 22nd Lesson పౌరులు, ప్రభుత్వాలు to understand and remember the concept easily.
AP Board 10th Class Social Notes 22nd Lesson పౌరులు, ప్రభుత్వాలు
→ సమాచార హక్కు చట్టం, 2005 లో ప్రభుత్వం ఆమోదించింది.
→ అయితే ఈ సమాచార హక్కు ప్రయోజనకారిగా ఉండాలంటే ఇందులో ప్రభుత్వ శాఖలు, హక్కులు సక్రమంగా పనిచేయాలి.
→ ప్రజాస్వామిక ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉంటాయి.
→ ఇంతకుముందు ప్రభుత్వ శాఖలు, వాటి సిబ్బంది జవాబుదారీతనం ప్రధానంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు పరిమితమై ఉండేది.
→ ప్రతి ప్రభుత్వశాఖ కొన్ని నియమ, నిబంధనల ఆధారంగా పనిచేస్తుంది.
→ ప్రతి ప్రభుత్వశాఖ కొన్ని రికార్డులను నిర్వహించాలి. తీసుకున్న నిర్ణయాల వివరణ ఉండాలి. వీటి మూలంగా అనేక రికార్డులు, డాక్యుమెంట్లు, మెమోలు, ఈ – మెయిల్స్, సర్క్యులర్లు, ఆదేశాలు, లాగ్ పుస్తకాలవంటివి తయారుచేయవలసి వస్తుంది.
→ సమాచార హక్కు చట్టం వల్ల ఇప్పుడు ప్రతి ప్రభుత్వశాఖ రికార్డులను నిర్వహించి, వాటిని అడిగిన పౌరులకు అందుబాటులో ఉంచాలి.
→ ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక పౌర సమాచార, ఒక అప్పిలేట్ అధికారి ఉంటారు.
→ ఆయా శాఖల పనిలో చట్టాలను ఉల్లంఘిస్తే చర్య తీసుకునే బాధ్యత సమాచార అధికారులకు ఉండదు. న్యాయస్థానాలకు ఉంటుంది.
→ ఈ సమాచార హక్కు చట్టం కొన్ని అంశాలను గోప్యంగా ఉంచుతుంది. ఉదా : దేశ సార్వభౌమత్వం, సైనిక దళాలు, భద్రతా సంస్థలు.
→ సమాచారం కొరకు చేతితో రాసిన ఉత్తరం కాని, ఎలక్ట్రానిక్ మెయిల్ రూపంలో కాని అడగవచ్చు.
→ సమాచారం కొరకు నామమాత్ర రుసుం 5-10 రూపాయల వరకు చెల్లించాలి. దారిద్ర్యరేఖకు దిగువన ఉంటే ఈ రుసుము చెల్లించనవసరం లేదు.
→ ప్రజలకు ఉచిత న్యాయ సేవలను అందించుటకు న్యాయసేవల ప్రాధికార చట్టం, 2002 ప్రకారం న్యాయ పీఠాలను ఏర్పాటు చేశారు.
→ దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను ఎటువంటి ఖర్చు లేకుండా వెంటనే పరిష్కరించుకోవటానికి లోక్అదాలత్ మదులను ఏర్పాటు చేశారు.
→ న్యాయ సేవల ప్రాధికార సంస్థ, దేశంలోని బలహీన వర్గాలకు, స్త్రీలు, పిల్లలు మరియు అన్ని రకాల నష్టాలకు గురి అయిన వారికి ఉచిత న్యాయ సేవలను అందిస్తుంది.
→ లోక్ అదాలత్, సివిల్, క్రిమినల్, గృహహింస, భరణాలు వంటి అనేక కేసులను పరిష్కరిస్తుంది.
→ సమాచారం : ప్రతి వ్యక్తికి, ప్రభుత్వ సంస్థల నుండి ఏ విషయం గురించైనా సమాచారం సేకరించుకొనే అధికారం ఉంటుంది. సమాచార హక్కు చట్టంను 2005 లో కేంద్రప్రభుత్వం ఆమోదించింది.
→ అప్పిలేట్ అధికారి : ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక అప్పిలేట్ అధికారి ఉంటారు. ఈయన రాష్ట్ర పౌర సమాచార కార్యాలయానికి జవాబుదారీగా ఉంటారు.
→ రికార్డు ప్రభుత్వ అధికారి : సమాచార హక్కు చట్టం వల్ల ఇప్పుడు ప్రతి ప్రభుత్వశాఖ రికార్డులను నిర్వహించి, వాటిని అడిగిన పౌరులకు అందుబాటులో ఉంచాలి. కావున ఈ రికార్డులను నిర్వహించడానికి
ఒక ప్రభుత్వ అధికారి ఉంటాడు.
→ పారదర్శకత : పౌరులు అడగకుండానే ప్రతి శాఖ తమకు సంబంధించిన కొన్ని వివరాలను స్వచ్చందంగా ప్రజలకు బహిర్గతం చెయ్యాలి. దీనివల్ల ఆ శాఖ పని పారదర్శకత ఏర్పడి అవినీతిని అరికడుతుంది.
→ న్యాయసేవ : ప్రజలకు అనగా బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందించటమే న్యాయసేవ. న్యాయ సేవల ప్రాధికార చట్టం 2002 ప్రకారం ‘న్యాయ సేవా పీఠాలను ఏర్పాటు చేశారు.
→ లోక్ అదాలత్ : కోర్టులలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను ఎటువంటి ఖర్చు లేకుండా వెంటనే పరిష్కరించుట కొరకు ఈ లోక్ ఆదాలను ఏర్పాటుచేశారు. ‘న్యాయ సేవల పీఠాల చట్టం 19879 1994 లోనూ, 2002 లోనూ సవరించి, దాని ప్రకారం లోక్ అదాలతను ఏర్పాటుచేశారు.
→ గృహ హింస : మహిళలకి గృహ హింసకు సంబంధించిన కేసులను లోక్ అదాలత్ చేపట్టి త్వరితంగా పరిష్కరిస్తుంది. ఎటువంటి రుసుమును లోక్ అదాలత్ తీసుకోదు.
→ సివిల్ కేసులు : అన్ని రకాల ఆస్తి పాస్తులకు సంబంధించిన సివిల్ కేసులను లోక్ ఆదాలత్ పరిష్కరిస్తుంది. ఈ కేసులకు కూడా లోక్ అదాలత్ ఎటువంటి రుసుము తీసుకోకుండానే పరిష్కరిస్తుంది.
→ బాల నేరస్తుల గృహం : బాల నేరస్తుల న్యాయచట్టం, 1986లోని సెక్షన్ 2, క్లాజు (జె) ప్రకారం బాలనేరస్తుల గృహం వంటి కేసులకు సంబంధించిన న్యాయసేవల సంస్థ ద్వారా ఉచిత న్యాయసేవలను అందిస్తుంది.
→ ప్రభుత్వ అధికారి : ప్రతి ప్రభుత్వశాఖలో ఒక ప్రభుత్వాధికారి సమాచారాన్ని అందించడానికి ఉంటాడు. అతనినే పౌర సమాచార అధికారి అంటాము.