Students can go through AP Board 10th Class Social Notes 8th Lesson ప్రజలు – వలసలు to understand and remember the concept easily.
AP Board 10th Class Social Notes 8th Lesson ప్రజలు – వలసలు
→ ఒక వ్యక్తి పుట్టిన స్థానాన్ని ‘జన్మస్థానం’ అంటాం.
→ ఆడవాళ్లలో వలస వెళ్లడానికి వివాహం ప్రధాన కారణం కాగా పురుషులలో ఉపాధి ప్రధాన కారణం.
→ గ్రామీణ ప్రాంతాలలో తగినన్ని ఉపాధి అవకాశాలు లేనందున తగినంత ఆదాయం లేనందున వలస వెళుతున్నారు.
→ పట్టణాలలో ఉపాధి లభించుటకు పరిచయాలు, సంబంధాలు చాలా కీలకం.
→ జాతీయ సర్వేలలో వలస కాలపరిమితి కనీసం ఆరునెలలుగా నిర్ణయించారు.
→ మహారాష్ట్రలో కొయినా ఆనకట్ట నిర్మించిన తరువాత 1970 దశాబ్ద ఆరంభం నుండి పెద్ద ఎత్తున చెరుకు సాగు ప్రారంభించారు.
→ వలస వెళ్లిన వారిపై వలస ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వాతావరణం, ఆహారం, సామాజిక రంగాల్లో మార్పులు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
→ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో 1/3 వంతు కుటుంబాలు వలస సభ్యులు పంపించే డబ్బుపై ఆధారపడతారు.
→ భారతదేశం నుండి పశ్చిమాసియాకు వెళుతున్న 30 లక్షల వలస వ్యక్తులలో ఎక్కువ మంది సౌదీ అరేబియా, యు.ఏ.ఇ దేశాలకు వెళుతున్నారు. వీరిలో కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల వారు అధికం.
→ కేరళ మొత్తం ఆదాయంలో అయిదింట ఒక వంతు పశ్చిమాసియాలో పనిచేస్తున్న వారు పంపించే డబ్బుతో సమకూరుతుంది.
→ భారతదేశీయులు విదేశాలకు వలస వెళ్లి పనిచేయటాన్ని 1983 వలసల చట్టం పర్యవేక్షిస్తుంది.
→ సాంకేతిక నైపుణ్యం, వృత్తి అనుభవం గల భారతీయులు ఎక్కువగా అమెరికా, కెనడా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియాతో పాటు జర్మనీ, నార్వే, జపాన్, మలేషియా వంటి దేశాలకు కూడా వలస వెళుతున్నారు.
→ వలస : విద్య, ఉపాధి, మెరుగైన అవకాశాల కోసం ఒక ప్రాంతంలోని ప్రజలు మరో ప్రాంతానికి ఆరు నెలలకు తక్కువ కాకుండా వెళ్లడాన్ని వలస అంటాం.
→ విదేశాలకు వలస : ఒక దేశం నుండి మరో దేశానికి వలస వెళ్ళడాన్ని విదేశాలకు వలస అంటాం.
→ అంతరరాష్ట్ర వలస : ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వలస వెళ్ళటాన్ని అంతర రాష్ట్ర వలస అంటాం.
→ కాలానుగుణ వలస : తాత్కాలిక వలస.
→ దేశ సరిహద్దు : ఒక దేశ జాతీయ సరిహద్దునే ఆ దేశ సరిహద్దు అంటాం.