AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

SCERT AP 10th Class Social Study Material Pdf 5th Lesson భారతదేశ నదులు, నీటి వనరులు Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 5th Lesson భారతదేశ నదులు, నీటి వనరులు

10th Class Social Studies 5th Lesson భారతదేశ నదులు, నీటి వనరులు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
భారతదేశంలోని ప్రధాన నదీవ్యవస్థలను వివరించటానికి కింది అంశాల ఆధారంగా ఒక పట్టిక తయారుచేయండి. నది ప్రవహించే దిశ, అవి ఏ రాష్ట్రాలు లేదా దేశాల గుండా ప్రవహిస్తున్నాయి, ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులు. (AS3)
(లేదా)
భారతదేశంలోని ఏవేని నాలుగు ప్రధాన నదీ వ్యవస్థలను పట్టిక రూపంలో వివరించండి.
AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 1
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 2 AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 3

ప్రశ్న 2.
వ్యవసాయం, పరిశ్రమలు వంటి వివిధ సందర్భాలలో భూగర్భజలాల వినియోగాన్ని సమర్థించే, వ్యతిరేకించే వాదనలను పేర్కొనండి. (AS2)
జవాబు:

  1. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రధాన నీటివనరు భూగర్భజలమే.
  2. వ్యవసాయం, పరిశ్రమలు మరియు ఇతర అవసరాలకు కూడా ఈ నీరే ప్రధాన వనరు.

భూగర్భజల వినియోగాన్ని సమర్థించే వాదనలు :

  1. అధిక ఉత్పత్తికి, అన్ని రకాల రైతులకు సమానస్థాయిలో నీరు అందడానికి, కరవు పరిస్థితులను అధిగమించడానికి, వ్యవసాయ ఉత్పత్తిని క్రమబద్ధం చేయడానికి మరియు ఉద్యోగాల కల్పనకు భూగర్భజల వినియోగం అవసరం.
  2. యంత్రాలను చల్లబరచడానికి, ఇతర పారిశ్రామిక అవసరాలకి కూడా ఇది అవసరం.
  3. భారతదేశ ఆర్థిక ప్రగతికి ఈ నీరే అధిక అవసరం.

భూగర్భ జల వినియోగాన్ని వ్యతిరేకించే వాదనలు :

  1. భారతదేశం భూగర్భజల వినియోగంలో ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉన్నది.
  2. ఈ వినియోగం భూగర్భ జలాలను తగ్గించివేస్తుంది. సముద్రపు నీరు తీరప్రాంతాలలోనికి చొచ్చుకుని వచ్చేలా చేస్తుంది.
  3. పరిశ్రమలలో ఉపయోగించిన నీరు భూగర్భజలాలను కలుషితం చేస్తుంది.

ప్రశ్న 3.
నీటి వనరుల విషయంలో అంతర్గత, బాహ్య ప్రవాహాల ప్రక్రియలను వివరించండి. (AS1)
జవాబు:
అంతర్గత ప్రవాహాలు : ఏ ప్రాంతానికైనా. అంతర్గత ప్రవాహాలు = అవపాతం + ఉపరితల ప్రవాహం + భూగర్భ ప్రవాహం. ఉపరితల ప్రవాహం అంటే భూమి మీద వాగులు, కాలువలు, నదులు వంటి వాటిల్లోని నీటి ప్రవాహం. భూగర్భ జల ప్రవాహాన్ని అంచనా వేయవచ్చు కానీ అది కొంచెం కష్టమైన పని. అవపాతం అంటే వాన ఒక్కటే కాకుండా వడగళ్లు, హిమము, పొగమంచు కూడా ఉంటాయి. అవపాతం అన్ని సంవత్సరాలు ఒకేలాగా కాకుండా ప్రతీ సంవత్సరం మారుతూ ఉంటుంది. అందువలన అవపాతాన్ని లెక్కించడానికి కొన్ని సంవత్సరాల అవపాతం యొక్క సగటును పరిగణలోనికి తీసుకుంటారు.

ఉపరితల, భూగర్భ నీటి ప్రవాహాలు :
మీ ప్రాంతానికి, అది చిన్న గ్రామమైనా, పట్టణమైనా నదులు, సాగునీటి పథకాల కాలువలు వంటి వాటి ద్వారా దిగువకు వచ్చే నీటి ప్రవాహాల జాబితా తయారుచేయండి.

ఒక గ్రామంలాంటి ఒక చిన్న ప్రాంతానికి కాలువలు, పైపులు వంటి వాటి ద్వారా నీళ్లు రావచ్చు – ఇటువంటి బయటి వనరులన్నింటినీ పేర్కొనండి. అవపాతానికి దీనిని జోడిస్తే ఆ ప్రాంతం లోపలికి మొత్తం ఎంత నీళ్లు వస్తాయో తెలుసుకోవచ్చు. భూగర్బం ద్వారా లోపలికి వచ్చే నీటిని అంచనా వేయటం కొంచెం కష్టం. అయితే నేల వాలుని బట్టి భూగర్భ జలం ఎటు ప్రవహిస్తుందో కొంత ఊహించవచ్చు.

బాహ్య ప్రవాహాలు :

బాష్పోత్సేకం :
అన్ని నీటి మడుగుల నుంచి నీరు ఆవిరిగా మారుతుంటుంది. చెరువులు, నదులు, సముద్రాలు వంటి అన్ని ఉపరితల నీటి వనరుల నుంచి నీరు ఆవిరి అవుతుంది. అన్ని జీవులు శ్వాస ప్రక్రియ ద్వారా గాలిలోకి నీటిని విడుదల చేస్తాయి.

ఉపరితల ప్రవాహాల ద్వారా, భూగర్భ ప్రవాహాల ద్వారా బయటకుపోయే నీళ్లు :
ఒక గ్రామంలాంటి ప్రాంతాన్ని ఊహించుకోండి. కొంత నీళ్లు వాగులగుండా ఉపరితల ప్రవాహం ద్వారా బయటకు ప్రవహిస్తాయి. వానాకాలంలో ఈ ఉపరితల ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది. వర్షపాతంలో కొంత నేలలోకి, భూమి లోపలి పొరల్లోకి ఇంకి భూగర్భ జలాలను’ తిరిగి నింపుతాయి. దీంట్లో కొంత బావులు, బోరు బావులలోకి ప్రవహించి తిరిగి వినియోగానికి వస్తుంది, కొంత చాలా లోతైన నీటి ఊటలను చేరి మళ్లీ అందుబాటులోకి రాదు. భూగర్భ జలంలో కొంత భూగర్భ ప్రవాహాలను చేరి తిరిగి బయటకు వచ్చి వాగులు, నదులలో కలుస్తుంది.

వ్యవసాయానికి నీళ్లు :
పంటల వేళ్లు ఉండే ప్రాంతంలోకి నీళ్లు వర్షపాతం ద్వారాగానీ, సాగునీటి ద్వారాగానీ చేరుతుంది. నేలకి తేమని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. వరద వంటి పరిస్థితుల్లో ఎక్కువ నీళ్లు ఉండి, అది నేల లోపలి పొరల్లోకి ఇంకకపోతే మొక్కల వేళ్లు దెబ్బతింటాయి. ఇంకొకవైపు కరవు పరిస్థితులలో వేళ్ల ప్రాంతంలో తగినంత తేమ లేకపోతే పంటలు వడిలిపోతాయి.

గృహ అవసరాలకు, పశువులకు నీటి వినియోగం :
తాగునీటికి, వంటకి, స్నానానికి, శుభ్రపరచడానికి, పశువులకు ఉపయోగించే నీరు చాలా ముఖ్యమైనది. ఆదాయాలతో సంబంధం లేకుండా అందరికీ ఈ అవసరాల కోసం తగినంత నీళ్లు అందేలా చూడటానికి ప్రణాళికలు తయారుచేయాలి.

పారిశ్రామిక అవసరాలకు నీటి వినియోగం :
ఉత్పత్తి ప్రక్రియలకు కూడా నీళ్లు అవసరమవుతాయి. అయితే దీనికీ వ్యవసాయ, గృహ వసతి అవసరాలకూ మధ్య వైరుధ్యం ఉంది. ఈ వైరుధ్యం పెరుగుతోంది, కాబట్టి దీనిని పరిగణనలోకి తీసుకోవాలి. పారిశ్రామిక అవసరాల కోసం నీటి వినియోగంలో కాలుష్య నివారణ, నీటిని తిరిగి వినియోగించుకోవడం అన్నవి ముఖ్యమైన సవాళ్లు.

AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

ప్రశ్న 4.
భూగర్భ జల వనరులను అంతర్గత, బాహ్య ప్రవాహాలలో ఏ ప్రక్రియ ఎక్కువగా ప్రభావితం చేస్తుంది? (AS1)
జవాబు:
భూగర్భ జల వనరులను వర్షపాతం ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.

ప్రశ్న 5.
తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతంలో నీటి వనరులకు సంబంధించి ఎదుర్కొంటున్న సవాళ్ల జాబితా తయారుచేయండి. ఈ అధ్యాయంలో కానీ, లేదా ఇతర తరగతులలో కానీ ఈ సమస్యలకు సంబంధించి చర్చించిన పరిష్కారాలను పేర్కొనండి. (AS4)
జవాబు:
ద్వీపకల్ప నదులలో ఒకటైన కృష్ణానదికి ఉపనది తుంగభద్ర.

తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతంలో నీటి వనరులకు సంబంధించి ఎదుర్కొంటున్న సవాళ్ళ జాబితా :

  1. పట్టణీకరణ, పెరుగుతున్న నీటి అవసరాలు : ఈ నదీ పరీవాహక ప్రాంతంలో జనాభా పెరుగుదల, పారిశ్రామిక అవసరాలు పెరగడం మొదలైన వాటి వలన నీటి అవసరం పెరిగింది.
  2. తక్కువగా లభించే తాగునీటిని సరిగా వినియోగించుకోలేకపోవడం.
  3. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం.
  4. అన్ని వర్గాల వారికి పారిశుద్ధ్యం, తాగునీరు అందించడం.
  5. అంతరాష్ట్ర వివాదాలు.
  6. జలాశయాలు పూడికకు గురి అవడం.
  7. నీటి వనరుల పంపకానికి సరైన ప్రణాళికలు లేకపోవడం మొదలగునవి.

ప్రశ్న 6.
నీటి వనరులలో అనేక రకాల మార్పులు సంభవించాయి. ఈ అధ్యాయంలో చర్చించిన సానుకూల, ప్రతికూల మార్పులను వివరించండి. (AS1)
జవాబు:

సానుకూల మార్పులు వ్యతిరేక మార్పులు
1) వ్యవసాయ రంగంలో సాంకేతిక అభివృద్ధి. 1) పట్టణీకరణ
2) పారిశ్రామిక వ్యర్థాలను తిరిగి ఉపయోగించేలా చేయడం. 2) జనాభా పెరుగుదల
3) ఆనకట్టల నిర్మాణం. 3) పరిశ్రమల పెరుగుదల
4) వ్యవసాయ భూమి పెరుగుదల. 4) నీటి తగాదాలు
5) జల విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులను నిర్మించడం. 5) నీటి కాలుష్యం

ప్రశ్న 7.
నీటి సంరక్షణను మెరుగుపరచటానికి హి బజారులో వ్యవసాయంలో ఏ పద్ధతులపై నియంత్రణలు విధించారు? (AS1)
జవాబు:
గ్రామ పరీవాహక, సమగ్రాభివృద్ధికి ‘ఆదర్శ గ్రామ పథకం’ కింద హివారే బజారుని మహారాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో హివారే బజార్ ఉంది. మహారాష్ట్ర నుంచి కోస్తా కొంకణ తీర ప్రాంతాన్ని వేరు చేస్తూ ఉత్తర-దక్షిణంగా ఉన్న సహ్యాద్రి పర్వత శ్రేణికి (వర్షచ్ఛాయ ప్రాంతంలో) తూర్పువైపున గల వర్షచ్ఛాయా ప్రాంతంలో ఈ జిల్లా ఉంది. అందుకే అహ్మద్ నగర్ జిల్లా 400 మి.మీ వర్షపాతంతో కరువు పీడిత ప్రాంతంగా ఉంది. అందువల్ల ఆ గ్రామంలో కొన్ని నిషేధాలు విధించారు. అవి : సాగునీటికి బోరు బావులు తవ్వటం, చెరకు, అరటి సాగు చేయటం, బయటి వాళ్లకు భూమి అమ్మటం మొదలగునవి.

ప్రశ్న 8.
నీటి వనరుల విషయంలో ప్రజల కార్యాచరణ, చట్టాల ప్రాముఖ్యత ఏమిటి ? ఈ అధ్యాయంలోని చివరి రెండు భాగాలలో చర్చించిన అంశాలను క్లుప్తంగా రాయండి. (AS1)
జవాబు:

  1. నీటి వనరులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టాలన్నీ అసంబద్ధమైనవి, చెల్లనివి అని చెప్పుకోవచ్చు.
  2. భూమిపై యాజమాన్యానికి ఆ నేలలో లభ్యమయ్యే నీటి వనరులకు మధ్య సరియైన సంబంధం లేదు. భూమి యజమాని నీరు తోడటంపై ఎటువంటి నియంత్రణ లేదు.
  3. నీరు అందరికీ చెందిన వనరుగా గుర్తించబడాలి.
  4. ఇలా గుర్తించి నియంత్రించడానికి సరియైన చట్టాలు, నియమాలు రూపొందించాలి.
  5. నీటి వనరుల వినియోగ నియంత్రణకు స్థానిక స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ చట్టాలను చేయాలి.

AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

ప్రశ్న 9.
మీకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే www.aponline.gov.in కి వెళ్లి ఆంధ్రప్రదేశ్ నీళ్లు, భూమి, చెట్ల సంరక్షణ (Andhra Pradesh WALTA Act.) చట్టం గురించి మరింత తెలుసుకోండి. (AS3)
జవాబు:
ఆంధ్రప్రదేశ్ నీళ్ళు, భూమి, చెట్ల సంరక్షణ చట్టం 2002 :
ఇది ఒక సమగ్రమైన చట్టం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలుచేస్తోంది. ఈ చట్టం 19.04.2002 నుండి అమలులోనికి వచ్చింది. ఈ చట్టంలో 6 చాప్టర్లు, 47 సెక్షన్లు, 30 నియమాలు ఉన్నాయి.

లక్ష్యాలు :

  1. నీటి సాగును, చెట్లున్న ప్రాంతాన్ని పెంచడం.
  2. నీటి వనరుల సాగును అభివృద్ధిపరిచి, రక్షించడానికి భూమికి సంబంధించిన విషయాలను సరిచూచుట,
  3. భూగర్భ, భూ ఉపరితల నీటి వినియోగాన్ని క్రమబద్దీకరించుట.

ప్రశ్న 10.
మీ ప్రాంతంలో ఏ ఏ అవసరాలకు నీటి కొనుగోలు, అమ్మకం జరుగుతోంది? దీనిపై ఏమైనా నియంత్రణలు ఉండాలా? చర్చించండి. (AS1)
జవాబు:

  1. మా ప్రాంతంలో నీరు ఎక్కువగా మా కార్పొరేషన్ చే సరఫరా చేయబడుతుంది. వారు నీటిని పంపుల ద్వారా సరఫరా చేస్తారు. ఈ నీరు త్రాగడానికి, ఇతర గృహ వినియోగాలకు ఉపయోగపడుతుంది.
  2. శుభ్రపరచబడిన త్రాగునీరు ఇతర ప్రైవేటు కంపెనీలచే బాటిల్ నీరును (2లీ.) రూ. 15/-ల నుండి రూ. 30/-ల వరకు తీసుకుని సరఫరా చేస్తారు.

వీటి మీద కొన్ని నియంత్రణలు ఉండాలని నేను భావిస్తున్నాను. కార్పొరేషను ట్యాంకులు తరుచూ శుభ్రం చేయాలి. నీటిని వివిధ మార్గాల ద్వారా శుద్ధి చేయాలి. సరఫరా చేయబడే సీసాలను శుభ్రపరచాలి. వారి యూనిట్ తరచూ సందర్శించి శుభ్రపరిచే విధానాన్ని పరిశీలించాలి.

10th Class Social Studies 5th Lesson భారతదేశ నదులు, నీటి వనరులు InText Questions and Answers

10th Class Social Textbook Page No.61

ప్రశ్న 1.
వాటర్ షెడ్ అన్న పదాన్ని చర్చించండి.
జవాబు:
ఒక ఎత్తైన ప్రాంతంలో ఒక వైపు నీటి ప్రవాహాలు ఒక నదిలోనూ, మరో వైపు నీటి ప్రవాహాలు మరో నదిలోనూ కలిస్తే . దానిని “వాటర్ షెడ్” అని అంటారు. ఈ నీటిని భూమిలోకి ఇంకేలా చేయడానికి చెట్లు నాటవచ్చు లేదా చెరువులు లాంటివి త్రవ్వించవచ్చు. ఇలా చేయడాన్ని “వాటర్ షెడ్ అభివృద్ధి పథకం” అని అంటారు.

AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

10th Class Social Textbook Page No.61

ప్రశ్న 2.
మొక్కలు వేళ్లనుంచి తీసుకున్న నీరు ఏమవుతుందో విజ్ఞానశాస్త్ర పాఠాలలో తెలుసుకుని ఉంటారు. అది మరొకసారి గుర్తుకు తెచ్చుకోండి.
జవాబు:
చెట్ల వేర్లు నీటిని సమతుల్యం చేసే లక్షణాన్ని కలిగి ఉంటాయి. అవి అవసరమైనపుడు మాత్రమే నీటిని తీసుకుంటాయి. అవసరం లేనపుడు వాటిని తీసుకోవు.

10th Class Social Textbook Page No.69

ప్రశ్న 3.
హివారే బజారులాగానే భూగర్భజలాల నియంత్రణ ప్రధానంగా ప్రజలే చేయాలా?
జవాబు:
హివారే బజారులలో భూగర్భజలాల నియంత్రణ చాలా విజయవంతం అయింది. దీనికి కారణం ప్రజల సహకారమే కాబట్టి ప్రజలు పూనుకొని భూగర్భజలాల నియంత్రణ చేయటమే సరియైన పని.

10th Class Social Textbook Page No.69

ప్రశ్న 4.
‘భూగర్భజలాల చట్టాలు పాతబడిపోయాయి మరియు ప్రస్తుత కాలానికి తగవు’. వివరించండి.
జవాబు:
ప్రస్తుతం నీటి వినియోగంపై ఉన్న చట్టాలు బ్రిటీషు వారి కాలంనాటివి. అవి ఈ కాలానికి సరిపోయేవి కావు. పైగా అసంబద్ధమైనవి కూడా, అవి భూగర్భజలాలను అన్ని వనరులతో కలిపి వాడుకున్నపుడు తయారుచేసినవి. అవి ఇప్పటి వాడకానికి సరిపోవు. కాబట్టి అవి పాతపడిపోయాయి అని చెప్పవచ్చు.

10th Class Social Textbook Page No.58

ప్రశ్న 6.
భారతదేశంలో 40 మిలియన్ల ఎకరాల భూమి వరదకు గురయ్యే ప్రమాదం ఉంది. అంతే విస్తీర్ణం కరవుకి గురయ్యే అవకాశం ఉంది. దీనికి కారణాలు ఏమిటి?
జవాబు:

  1. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నైఋతి ఋతుపవనాల మూలంగా వస్తుంది.
  2. ఈ ఋతుపవనాలలోని అనిశ్చితే వరదలకు, కరవుకు ప్రధాన కారణం.
  3. వరదలు అధిక వర్షం మూలంగా సంభవిస్తే, కరవులు వర్షాలు లేకపోవడం వలన సంభవిస్తాయి.
  4. అడవుల నిర్మూలన, నేలకోత మొదలైనవి ఈ విపత్తులకు మూల కారణాలు.

AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

10th Class Social Textbook Page No.60

ప్రశ్న 7.
ఇక్కడ ఇచ్చిన పటం, అట్లాన్ల సహాయంతో ఈ కిందివి వివరించండి.
1) గోదావరి …………….. వద్ద పుడుతుంది.
2) తూర్పుకి ప్రవహించే ద్వీపకల్ప నదులలో కృష్ణానదికి రెండవ స్థానం. ఇది ………….. వద్ద పుడుతుంది.
3) మహానది ఛత్తీస్ గఢ్ లోని నిహావా దగ్గర పుట్టి …………… గుండా ప్రవహిస్తుంది.
4) నర్మదానది మధ్యప్రదేశ్ లోని …………… వద్ద పుడుతుంది.
5) తపతీనది …………… వద్ద పుట్టి ………… దిశగా పయనిస్తుంది.
జవాబు:
1) నాసిక్, త్రయంబకం
2) మహాబలేశ్వరం
3) ఒడిశా
4) అమరకంటక్
5) ముల్తాయ్, పశ్చిమ

10th Class Social Textbook Page No.61

ప్రశ్న 8.
మీ సమీప మండల కార్యాలయం నుంచి గత 5 సంవత్సరాలకు మొత్తం వార్షిక వర్షపాతం ఎంతో తెలుసుకోండి.
జవాబు:
నేను కృష్ణాజిల్లా పెనమలూరు గ్రామంలో నివసిస్తున్నాను. మా ఊరిలో సరాసరి వర్షపాతం ఈ క్రింది విధంగా ఉన్నది.
2013 – 107 సెం.మీ.
2014 . 103 సెం.మీ.
2015 – 100 సెం.మీ.
2016 – 98 సెం.మీ.
2017 – 104 సెం.మీ.

AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

10th Class Social Textbook Page No.65

ప్రశ్న 9.
నీటి వినియోగ ప్రణాళికల కోసం ప్రభుత్వ నదీ పరీవాహక ప్రాధికార సంస్థ ఉంటే ఎలా ఉపయోగకరంగా ఉంటుంది?
జవాబు:

  1. నదీ పరీవాహక ప్రాధికార సంస్థ గనక ఉన్నట్లయితే ఆ సంస్థ ఆ నది నీటి వినియోగదారులందరికీ న్యాయం చేస్తుంది.
  2. నీటి వనరుల అభివృద్ధికి, పర్యవేక్షణకు అన్ని స్థాయిల్లోనూ సహకరిస్తుంది.
  3. కమ్యూనిటీ సహకారాన్ని కూడా పెంపొందిస్తుంది.
  4. నీటి వనరుల కొరత వలన రాబోయే రోజుల్లో ఏర్పడే ఇబ్బందులను అధిగమించేలా చూస్తుంది.
  5. నీటి సాగును, నిర్వహణను సాంప్రదాయక పద్ధతులలో జరిగేలా చూస్తుంది. నీరు అందరికి చెందినదని గ్రహించేలా చేస్తుంది.

10th Class Social Textbook Page No.65

ప్రశ్న 10.
తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతంలో నీటికి పరస్పర విరుద్ధ వినియోగాలు ఏమిటి?
జవాబు:

  1. గత కొన్ని దశాబ్దాల నుండి నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోంది.
  2. ఈ నదీ పరీవాహక ప్రాంతంలో నేలకోత ఎక్కువయ్యి సాంప్రదాయ చెరువులు, చిన్న జలాశయాలు, తుంగభద్ర జలాశయాలు పూడికకు గురి అవుతున్నాయి.
  3. అంతరాష్ట్ర జల వివాదాలు కూడా వీటిని ప్రభావితం చేస్తున్నాయి.
  4. జనాభా పెరుగుదల వలన, పారిశ్రామికీకరణ వలన కాలుష్యం పెరిగింది. వీటి మూలంగా ప్రజల జీవన ప్రమాణాలు, కొన్ని కమ్యూనిటీల జీవితాలు దెబ్బతింటున్నాయి.

10th Class Social Textbook Page No.67

ప్రశ్న 11.
నీటి అందుబాటును బట్టి వ్యవసాయ ప్రణాళిక తయారు చేయటానికి ఎటువంటి ప్రయత్నం జరిగింది?
జవాబు:

  1. భారతదేశం లాంటి దేశాలలో దాదాపు 70% నీటి వినియోగం వ్యవసాయ రంగంలోనే జరుగుతోంది. ఇది అధిక వినియోగం అని చెప్పుకోవచ్చు.
  2. ఆనకట్టలు, చెక్ డ్యామ్ లు మొదలైనవి నీటిని సద్వినియోగం చేయడానికి రైతులకు సహకరిస్తాయి. పంట దిగుబడులను అధికం చేస్తాయి.
  3. బిందు సేద్యము లాంటి ఆధునిక పద్ధతులు నీటిని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడతాయి.

10th Class Social Textbook Page No.58

ప్రశ్న 12.
గృహ అవసరాలకు 5% నీటిని ఉపయోగిస్తున్నారు. అయినా కానీ జనాభాలో ఎక్కువ మందికి నీళ్లు అందటం లేదు. దీని గురించి చర్చించండి.
జవాబు:

  1. నీటిని సరఫరా చేయడం అనేది ప్రభుత్వ బాధ్యత.
  2. భారతదేశంలో ప్రభుత్వం దీనికి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేసింది.
  3. భూగర్భజల వనరులు తగ్గిపోవడం, వాటి నాణ్యత క్షీణించిపోవడం మొదలగునవి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నీటి సరఫరాను దెబ్బతీస్తున్నది.
  4. భూ ఉపరితల నీటి వనరులను కాలుష్యం వలన, కొరత వలన, జల వివాదాల వలన సరిగా సరఫరా చేయలేకపోతున్నారు.
  5. తీర ప్రాంతాలలో సముద్రపు నీరును ఉప్పును తొలగించి మంచినీరుగా మార్చుటకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.
  6. భారతదేశంలో జనాభా పెరుగుదల, పరిశ్రమల పెరుగుదల మూలంగా నీటి అవసరాలు పెరిగాయి. దీని మూలంగా నీటి సరఫరా అనేక యిబ్బందులను ఎదుర్కొంటుంది.
  7. వీటన్నింటి రీత్యా భారతదేశంలో నదుల అనుసంధానం అత్యంత ఆవశ్యకం.

AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

10th Class Social Textbook Page No.58

ప్రశ్న 13.
ఉపరితల నీటి వనరులలో 70% కలుషితం అయ్యా యి. కారణాలు ఏమిటి?
జవాబు:
అనేక వ్యర్థాలను నీటిలోనికి వదలడం వలన నీటి వనరులు కాలుష్యం అవుతున్నాయి. ఈ కాలుష్యం నీటిలోని మొక్కలను, జంతువులనే కాక, వాటిని ఉపయోగించే మానవులను కూడా నష్టపరుస్తోంది. ఈ కాలుష్యం పర్యావరణాన్ని దెబ్బ తీస్తున్నది.

నీటి కాలుష్యానికి కారణాలు :

  1. మురికినీరు, వ్యర్థ పదార్థాలు, చెత్త, చెదారం నీటిలో కలవటం మూలంగా నీరు విషతుల్యమవుతుంది.
  2. నీటి వనరులున్న ప్రాంతాలలో మలవిసర్జన చేయటం నీటిని కలుషితం చేస్తోంది.
  3. పారిశ్రామిక వ్యర్థాలు నీళ్ళలోకి వదలడం మూలంగా నీరు అధికస్థాయిలో కలుషితమవుతుంది.
  4. సముద్రంలో ప్రయాణం చేసే ఓడలు, ట్యాంకర్లు చమురును వదిలి ఆ నీటిని కలుషితం చేస్తున్నాయి.
  5. ఆమ్ల వర్షాల మూలంగా ఉపరితల నీరు కలుషితమవుతుంది.

10th Class Social Textbook Page No.58

ప్రశ్న 14.
భారతదేశ పటంలో హిమాలయాలను, పశ్చిమ కనుమలను గుర్తించండి.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 4

10th Class Social Textbook Page No.58

ప్రశ్న 15.
పటంలోని రంగుల సూచికను బట్టి నదులు పుట్టిన పర్వతాలు ఎంత ఎత్తులో ఉన్నాయో తెలుసుకోండి. అట్లాస్, ఉబ్బెత్తు భౌగోళిక పటం సహాయంతో నదీ గమనాన్ని అనుసరిస్తూ వాటి ప్రవాహ దిశను గుర్తించండి.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 5

10th Class Social Textbook Page No.59

ప్రశ్న 16.
అట్లాస్ సహాయంతో భారతదేశం, పాకిస్తాన్ లో సింధూనది ప్రవాహ మార్గాన్ని గుర్తించండి.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 6

10th Class Social Textbook Page No.59

ప్రశ్న 17.
గంగానది పటాన్ని (5.2) చూసి అది ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుందో చెప్పండి.
AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 7
గంగా, బ్రహ్మపుత్రల సంగమం
జవాబు:
గంగానది ప్రవహించే రాష్ట్రాలు :

  1. ఉత్తరాఖండ్
  2. ఉత్తరప్రదేశ్
  3. బీహార్
  4. జార్ఖండ్
  5. పశ్చిమబెంగాల్

AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

10th Class Social Textbook Page No.59

ప్రశ్న 18.
పై పటం చూసి గంగానది ఉపనదులలో ఉత్తర దిశగా ప్రవహించేవి ఏవో, దక్షిణ దిశగా ప్రవహించేవి ఏవో చెప్పండి.
జవాబు:
ఉత్తరంగా ప్రవహించే ఉపనదులు : కోసి, గండక్, గాగ్రా, గోమతి, శారద, యమున, రామ్ గంగా నదులు.

దక్షిణంగా ప్రవహించే ఉపనదులు : సన్, రిహార్డ్, కెన్, బెట్వా, తన్నా నదులు.

10th Class Social Textbook Page No.63

ప్రశ్న 19.
భారతదేశ పటంలో తుంగభద్ర నది ప్రవాహ మార్గాన్ని గుర్తించండి.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 8

10th Class Social Textbook Page No.67

ప్రశ్న 20.
సవారే బజారులో నీటి సంరక్షణకు చేపట్టిన పనులను సూచించే వాక్యాల కింద గీత గీయండి.
జవాబు:
స్వయం కృత్యం.

10th Class Social Textbook Page No.67

ప్రశ్న 21.
మీకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే హివారే బజారుకు సంబంధించిన వీడియో చిత్రాన్ని ఈ లింకులో చూడండి. http://bit.ly/koth LI
జవాబు:
స్వయం కృత్యం.

AP Board 10th Class Social Solutions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

10th Class Social Textbook Page No.69

ప్రశ్న 22.
భూగర్భజలాలు అందరికీ చెందిన వనరులు – మీ అభిప్రాయాన్ని వివరించండి.
జవాబు:
భూమిమీద హక్కుకి, భూగర్భ జలాలమీద హక్కుకి సంబంధం ఉన్నప్పుడు నీటిని సక్రమంగా వినియోగించటంపై వ్యక్తిగత భూ యజమానులపై ఎటువంటి ఒత్తిడి ఉండదు. అదే విధంగా పర్యావరణానికి, విస్తృత ప్రజానీకానికి ప్రయోజనం కలిగించేలా విధానాలను అమలు చేసే మార్గమేమీ లేదు. దాదాపుగా ఎటువంటి నియంత్రణలేని ఈ వ్యవస్థలో ఒక ప్రాంతంలో ఎన్ని చేతి పంపులు, బావులు, బోరుబావులు ఉండవచ్చో నిర్ణయించే అధికారం ఎవరికీ లేదు. కాబట్టి నీటిని ప్రజలందరికీ ఉద్దేశించిన ఉమ్మడి వనరుగా పరిగణించాలి. రోడ్లు, నదులు, ఉద్యానవనాలు, అంతర్భూజలం అందరికీ చెందే ‘ప్రజా ఆస్తి’ గా భావించాలి. దీనిని ప్రస్తుతం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి, కాని అంతగా విస్తృతం కాలేదు.