Students can go through AP Board 6th Class Science Notes 9th Lesson జీవులు – ఆవాసం to understand and remember the concept easily.
AP Board 6th Class Science Notes 9th Lesson జీవులు – ఆవాసం
→ మన చుట్టూ ఎన్నో జీవులు మరియు నిర్జీవులు ఉన్నాయి.
→ జీవులలో పెరుగుదల, శ్వాస, విసర్జన, కదలిక, ప్రతిస్పందన మరియు ఉద్దీపనలు మరియు చిన్నపిల్లలకు జన్మనివ్వడం వంటి లక్షణాలు ఉంటాయి.
→ మొక్కలు కూడా జీవులు, కాని జంతువుల్లా కదలలేవు.
→ మన శరీరం వేర్వేరు వ్యర్థ పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ వ్యర్థాలను శరీరం నుండి బయటకు పంపించడాన్ని విసర్జన అంటారు.
→ గుడ్లు పెట్టే జీవులను అండోత్పాదకాలు అని మరియు పిల్లలకు జన్మనిచ్చే జీవులను శిశోత్పాదకాలు అని అంటారు.
→ సూక్ష్మజీవులను మనం కంటితో చూడలేము. వాటిని సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలము.
→ చనిపోయిన జీవిని సజీవులకు మరియు నిర్జీవులకు మధ్యస్థ దశగా భావించవచ్చు.
→ విత్తనం కూడా ఒక జీవి, కానీ దీనికి జీవులలోని అన్ని లక్షణాలు లేవు.
→ ఒక జీవి వేర్వేరు ప్రదేశాల్లో నివసిస్తుంది. కాని చాలా జీవులు ఒకే స్థలంలో నివశిస్తూ ఉంటాయి.
→ జీవులు సాధారణంగా వాటి అవసరాలను తీర్చిన ప్రదేశాలలోనే ఉంటాయి.
→ ఆవాసాలు మొక్కలు మరియు జంతువులకు నివాస స్థలం, అవి వీటి జీవితానికి అనుకూలమైన పరిస్థితులను ఇస్తాయి.
→ చెట్టు, కొలను మరియు ఇల్లు ఆవాసాలకు కొన్ని ఉదాహరణలు.
→ ఉష్ణోగ్రత, తేమ, గాలి, నీరు, ఆహారం మొదలైనవి ఆవాసములోని నిర్జీవ అంశాలు.
→ అన్ని ఆవాసాలను ప్రధానంగా భౌమ మరియు నీటి ఆవాసాలుగా విభజించవచ్చు.
→ ఆవాసాలు ప్రకృతి వైవిధ్యాన్ని చూపుతాయి.
→ మంచి జీవన పరిస్థితుల కోసం పక్షులు తరచుగా నివాసాలను మారుస్తాయి. ఉదాహరణకు కొన్ని పక్షులు గుడ్లు పెట్టడానికి ముందు ఆవాసాలను మారుస్తాయి.
→ మన అవసరాలను తీర్చడానికి ఇతర జీవుల ఆవాసాలను నాశనం చేయకూడదు. బదులుగా, వాటిని రక్షించడానికి మనం ప్రయత్నించాలి.
→ సజీవులు : ప్రాణము ఉన్న పదార్థాలను సజీవులు అంటారు.
→ నిర్జీవులు : ప్రాణము లేని పదార్థాలను నిర్జీవులు అంటారు.
→ పెరుగుదల : జీవుల శరీర పరిమాణంలో ఎదుగుదల.
→ శ్వాసక్రియ : శరీరంలోకి గాలిని తీసుకొని బయటకు విడిచే ప్రక్రియ.
→ విసర్జన : శరీరం నుండి వ్యర్థాలను తొలగించడం.
→ ఉద్దీపన : జీవులలో స్పందనను కలిగించే పరిసరాలలోని మార్పును ఉద్దీపన అంటారు.
→ ప్రతిస్పందన : ఉద్దీపనకు జీవులు చూపించే ప్రతిచర్య
→ సూక్ష్మజీవులు : కంటితో చూడలేని చిన్న జీవులు.
→ సూక్ష్మదర్శిని : సూక్ష్మజీవులను పరిశీలించడానికి ఉపయోగించే పరికరం. ఇది చిన్న వాటిని పెద్దవిగా చూపుతుంది.
→ ఆవాసం : జీవుల నివాస స్థలం.
→ భౌమ్యావాసం : భూమి ప్రధాన వనరుగా ఉన్న ఆవాసం.
→ జలావాసం : నీరు ప్రధాన వనరుగా ఉన్న ఆవాసం. ఉదా : కొలను, నది
→ తోట : ఉద్యానవనం లేదా మొక్కల సమూహం
→ మడ అడవులు : సముద్రపు తీర ప్రాంతాన చిత్తడి నేలలలో పెరిగే మొక్కలు.
→ చలనము : జీవులు వాటి అవసరాల కొరకు ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశానికి వెళ్ళటం.
→ పోషకాహారం : జీవి శరీరానికి అవసరమయ్యే అన్ని పోషకాలను కలిగిన ఆహారం.
→ అనుకూలము : ఆవాసములో మనుగడ సాగించటానికి జీవికి తోడ్పడే లక్షణం.
→ ప్రత్యుత్పత్తి : కొత్త జీవులకు జన్మనివ్వటం.
→ సంఘం : ఆవాసములోని జీవుల సమూహం.
→ ఆర్చర్డ్ : ఎడారి మొక్కల ఉద్యానవనం.