AP 6th Class Science Notes Chapter 10 విద్యుత్ వలయాలు

Students can go through AP Board 6th Class Science Notes 10th Lesson విద్యుత్ వలయాలు to understand and remember the concept easily.

AP Board 6th Class Science Notes 10th Lesson విద్యుత్ వలయాలు

→ టార్చిలైటులో ఘటం విద్యుత్తు వనరుగా ఉంటుంది.

→ ఘటానికి ధన (+), ఋణ (-) ధృవాలున్నాయి.

→ బల్బులో ఫిలమెంటు కాంతినిస్తుంది.

→ మూసిన వలయం గుండా విద్యుత్తు ప్రవహిస్తుంది.

→ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని స్విచ్ నియంత్రిస్తుంది.

→ టార్చిలైటులో ఘటం, బల్బు, స్విచ్ వలయాన్ని పూర్తిచేస్తే బల్బు వెలుగుతుంది.

AP 6th Class Science Notes Chapter 10 విద్యుత్ వలయాలు

→ విద్యుత్తును తమ గుండా ప్రవహింపజేసే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు.

→ విద్యుత్తును తమగుండా ప్రవహింపజేయని పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటారు.

→ విద్యుత్ బల్బును థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టాడు.

→ తన జీవిత కాలంలో ఎడిసన్ 1000 కి పైగా ఆవిష్కరణలు చేశాడు.

→ ఎడిసన్ మొదట తన బల్బ్ లో ప్లాటినం ఫిలమెంట్ ఉపయోగించాడు.

→ నూలు దారం ఫిలమెంట్ నిరంతరంగా 45 గంటలుపాటు వెలిగింది.

→ నేడు మనం బల్బ్ లలో వాడుతున్న ఫిలమెంట్ టంగ్ స్టన్.

→ విద్యుత్ : ఇది ఒక శక్తి స్వరూపం. దీని ద్వారా మనకు బల్బులు, ఫ్యాన్లు పనిచేస్తాయి.

→ ఘటం : విద్యుత్తును ఉత్పత్తి చేసే పరికరం. ఇది రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది.

→ బల్బు : కాంతిని ఉత్పత్తి చేసే విద్యుత్ పరికరం.

→ ధ్రువాలు : ఘటము మరియు బల్బులు వంటి విద్యుత్ పరికరాల్లోని రెండు చివరలను ధ్రువాలు అంటాము.

→ ఫిలమెంట్ : విద్యుత్ బల్బులలో కాంతి మరియు ఉష్ణాన్ని ఇచ్చే విద్యుత్ తీగను ఫిలమెంట్ అంటారు. బల్బ్ లోపల ఉన్న రెండు తీగల మీదుగా ఒక సన్నని తీగ ఉంటుంది. ఇదే బల్బ్ లో వెలిగే భాగం. దీన్నే ఫిలమెంట్ అంటారు.

→ స్విచ్ : విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించటానికి ఉపయోగించే పరికరం.

AP 6th Class Science Notes Chapter 10 విద్యుత్ వలయాలు

→ వలయం : విద్యుత్ పరికరాలు పనిచేయటానికి ఘటం నుంచి బయలుదేరిన విద్యుత్తు తిరిగి ఘటాన్ని చేరుతుంది. దీనిని విద్యుత్ వలయము అంటారు.

→ విద్యుత్ వాహకం : విద్యుతను తమగుండా ప్రవహింప చేసే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు. ఉదాహరణ రాగి, వెండి, ఇనుము.

→ విద్యుత్ బంధకం : విద్యుత్ ను తమగుండా ప్రవహింపచేయని పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటారు.

→ టంగ్స్టన్ : విద్యుత్ బల్బులలో ఫిలమెంట్ గా ఉపయోగించే పదార్థం. దీనికి నిరోధకత ఎక్కువ.

AP 6th Class Science Notes Chapter 10 విద్యుత్ వలయాలు 1