These AP 6th Class Social Important Questions 3rd Lesson పటములు will help students prepare well for the exams.
AP Board 6th Class Social 3rd Lesson Important Questions and Answers పటములు
ప్రశ్న 1.
చిత్తు చిత్రం, మాన చిత్రం (పటం)నకు వ్యత్యాసమేమి?
జవాబు:
చిత్తుచిత్రం | పటం |
చిత్తు చిత్రం అనేది ముఖ్యంగా స్కేల్ ఉపయోగించ కుండా గుర్తు ఉన్న దాన్ని బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీస్తారు. ఈ చిత్తు చిత్రంలో స్కేల్, దిక్కులు చూపకండానే గీయవచ్చు. | పటం అనగా మొత్తం భూమిని గాని లేదా అందులోని ఒక భాగం గురించి గానీ ఒక సమ ఉపరితలంపై స్కేలుకి అనుగుణంగా చూపడానికి ఉపయోగించేది. దిక్కులు, స్కేలు, చిహ్నాలు మొదలైనవి ఇందులోని ముఖ్యమైన అంశాలు. |
ప్రశ్న 2.
గ్లోబు, పటాలను ఏయే సందర్భాలలో ఉపయోగిస్తామో వివరించండి.
జవాబు:
గ్లోబుని ఉపయోగించడంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. భూమి యొక్క ఆకృతిని ఒకే మొత్తంగా అధ్యయనం చేయాలని అనుకున్నప్పుడు మాత్రమే గ్లోబు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ దేశం, రాష్ట్రం, జిల్లా, నగరం – ఇలా ఒక్కొక్క భాగాన్ని గురించి తెలుసుకోవాలని అనుకున్నప్పుడు గ్లోబు ఉపయోగం తక్కువ. అటువంటి పరిస్థితులలో మనం పటాలను ఉపయోగిస్తాం.
ప్రశ్న 3.
మీరు ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడి, ప్రధాన దిక్కులు ఏవో వివరించండి.
జవాబు:
ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడినట్లయితే ఎదురుగా ఉన్నది తూర్పుదిక్కు వెనుక అంటే వీపుభాగం వైపు వున్నది పడమరనీ, ఎడమవైపు ఉన్నది ఉత్తర దిక్కునీ, కుడివైపు ఉన్నది దక్షిణ దిక్కునీ సూచిస్తుంది. ఈ , నాలుగు దిక్కుల్లోనూ ఉత్తర దిక్కుని ప్రధానదిక్కుగా భావిస్తాం. అందువలనే అన్ని పటాలలోనూ కుడిచేతివైపు పైన N అనే అక్షరం, బాణం గుర్తు ఉంటాయి. మనకి ఉత్తరదిక్కు తెలిస్తే, మిగిలిన దిక్కులని సులభంగా కనుక్కోవచ్చును. ప్రధాన దిక్కులు నాలుగు – ఉత్తరం, దక్షిణం, తూర్పు మరియు పడమర, వీటిని ప్రధాన దిక్కులు అంటారు.
ప్రశ్న 4.
‘స్కేలు’ అనగానేమి? దీనిని ఎందుకు ఉపయోగిస్తాం?
జవాబు:
స్కేల్ పటంలోని మరొక ముఖ్యమైన అంశం. భూమిపై కల వాస్తవ దూరానికీ పటంలో చూపబడిన దూరానికీ కల నిష్పత్తినే ‘స్కేలు’ అని పిలుస్తాం. పటంలో రెండు ప్రాంతాల మధ్య కల దూరాన్ని లెక్కించడానికి స్కేల్ ఉపయోగిస్తాం.
ప్రశ్న 5.
పటాలు ఎన్ని రకాలు? అవి ఏవి? వివరణాత్మకంగా తెల్పండి.
జవాబు:
పటంలో చూపిన అంశం లేదా వాటి ఉపయోగాన్ని బట్టి పటాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.
- రాజకీయ పటాలు
- భౌతిక పటాలు
- విషయ నిర్దేశిత పటాలు.
1. రాజకీయ పటాలు :
గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు మరియు దేశాల సరిహద్దులను చూపేవి రాజకీయ పటాలు.
2. భౌతిక పటాలు :
పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను గూర్చి వివరిస్తాయి.
3. విషయ నిర్దేశిత పటాలు :
ఈ పటాలను భూమి వినియోగం, ఉష్ణోగ్రత, వర్షపాతం, జనాభా, నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు, రైలుమార్గాలు, రోడ్డు మార్గాలు, జల మార్గాలు వంటి కొన్ని నిర్దిష్ట అంశాలను గురించి వివరించడానికి ఉపయోగిస్తారు.
ప్రశ్న 6.
స్కేల్ ఆధారంగా పటాలలో రకాలు ఎన్ని? అవి ఏవి? సోదాహరణంగా వివరించండి.
జవాబు:
స్కేల్ ఆధారంగా పటాలలో రకాలు :
అ. పెద్ద తరహా పటాలు : ఇవి చిన్న ప్రాంతాలను గురించి తెలియజేస్తాయి. వీటిని భూనైసర్గిక పటాలు (topo graphic maps) భూ సరిహద్దులను తెలిపే పటాలు (cadastral maps) గా విభజించవచ్చును. భూసరిహద్దులను తెలిపే పటాలు వ్యక్తిగత ఆస్తికి చెందినవి కాగా భూనైసర్గిక పటాలు భూ ఉపరితలం యొక్క వివరాలను చూపుతాయి.
ఆ. చిన్న తరహా పటాలు :
ఇవి పెద్ద ప్రాంతాలను గురించి తెలియజేస్తాయి. ప్రపంచం, ఖండాలు లేదా దేశాలు మొదలగునవి. ఇవి రెండు రకాలు – గోడ పటాలు మరియు అట్లాస్. గోడ పటాలు అట్లాస్ కంటే పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. వాటిని తరగతి గదిలో బోధన కొరకు మరియు పరిపాలనా పరంగాను ఉపయోగిస్తారు. అవి రాజకీయ విభాగాలు, భౌగోళిక అంశాలు వంటి సాధారణ మరియు ముఖ్యమైన అంశాలను చూపుతాయి.
ప్రశ్న 7.
జి.పి.ఎస్ మరియు వెబ్ ఆధారిత పటాల వలన ఎటువంటి సమాచారం పొందవచ్చు?
జవాబు:
జి.పి.ఎస్ అనగా ప్రస్తుతం విశ్వంలో మనం ఉన్న స్థానాన్ని తెలుసుకునే వ్యవస్థ (Global Positioning System) భూమ్మీద ఉండే వస్తువులను గుర్తించడానికి 10 ఇది చాలా ముఖ్యమైన సాంకేతిక వ్యవస్థ.
వెబ్ ఆధారిత పటాల ద్వారా ప్రపంచంలోని అన్ని భౌగోళిక ప్రాంతాలు, ప్రదేశాలు గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చును. సాంప్రదాయక పటాలకి అదనంగా ఈ పటాల ద్వారా అనేక ప్రదేశాలను ఉపగ్రహ, విహంగ వీక్షణ చేయవచ్చును.
ప్రశ్న 8.
ఖండాలు అనగానేమి? ఖండాలు ఎన్ని అవి ఏవి? మహాసముద్రాలు అనగానేమి? మహాసముద్రాలు ఎన్ని అవి ఏవి? వీటిని ప్రపంచ పటంలో గుర్తించండి.
జవాబు:
విశాల భూభాగాలను ఖండాలు అని, జలభాగాలను మహాసముద్రాలు అని పిలుస్తాం. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఐరోపా మరియు ఆస్ట్రేలియా ఖండాలు కాగా పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, అంటార్కిటిక్ మరియు ఆర్కిటిక్ మహాసముద్రాలు.
ప్రశ్న 9.
బ్రాడ్ గేజ్ రైల్వే, కచ్చారోడ్లు, పక్కారోడ్లు, చెట్లు, ఇళ్ళు, నదులను, మాన చిత్రంలో ఏ విధమైన చిహ్నాలు/గుర్తులతో చూపిస్తారో వాటిని గీయండి.
జవాబు:
ప్రశ్న 10.
పై మాన చిత్రాన్ని పరిశీలించి క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సరియైన సమాధానము లిమ్ము.
i) చర్చికి ఏ దిశలో నది ప్రవహిస్తుంది?
జవాబు:
తూర్పు
ii) మసీదు ఏ గ్రామంలో ఉంది?
జవాబు:
బొందపల్లి.
iii) ఏ రెండు గ్రామాల మధ్య పోలీస్ స్టేషన్ కలదు?
జవాబు:
రామాపురం, కృష్ణాపురం
iv) కృష్ణాపురంలోని దేవాలయానికి వెళ్ళటానికి ఎటువంటి రోడ్డు కలదు?
జవాబు:
కచ్చారోడ్డు.
v) పై చిత్రంలో ఎటువంటి రైలుమార్గంను సూచిస్తుంది?
జవాబు:
బ్రాడ్ గేజ్ రైల్వే
vi) రైలు మార్గానికి ఉత్తరాన ఉన్న గ్రామమేది?
జవాబు:
బొందపల్లి
vii) పై పటంలోని పాఠశాలలో మీరు ఉన్నారని అనుకోండి. పాఠశాల నుంచి బయటకు వస్తుంటే ఏ దిశ వైపుకి నడుస్తుంటారు?
జవాబు:
దక్షిణ దిశలో
viii) నది ఒడ్డున ఉన్న ప్రార్ధన మందిరం ఏమిటి?
జవాబు:
(గుడి) దేవాలయం