These AP 6th Class Social Important Questions 7th Lesson సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం will help students prepare well for the exams.
AP Board 6th Class Social 7th Lesson Important Questions and Answers సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం
ప్రశ్న 1.
ఉపనిషత్తుల గురించి వివరించుము.
జవాబు:
వేదాలలో ఉపనిషత్తులు ఒక భాగం. ఉపనిషత్తులనగా అర్థం ‘వచ్చి చేరువగా కూర్చోవడం, ఇవి ఉపాధ్యాయులు – మరియు విద్యార్థుల మధ్య సంభాషణలు. “మనం ఎక్కడి నుంచి వచ్చాము? లేదా మరణం తరువాత మనం ఎక్కడకు వెళతాము?” వంటి ప్రశ్నలకు ఈ పుస్తకాలు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశాయి.
ప్రశ్న 2.
మహాజన పదాలలో నగర ప్రజల జీవన విధానంను వివరించండి.
జవాబు:
మహాజన పదాలలో నగర జీవనం :
మహాజనపదాలలోని పట్టణాలలో ఇప్పటివలే తమ జీవనానికి ఇతరుల కోసం కష్టపడి పని చేసే శ్రామిక పేదలు ఎక్కువగా ఉంటారు. వారిలో కొంతమంది బానిస సేవకులు, మిగతావారు వస్తువులు తయారు చేసి అమ్మే వృత్తి పనివారు. ఈ వృత్తి పనివారు ఏం తయారు చేసేవారు? అన్ని ప్రముఖ నగరాలలో ఎంతో గిరాకీ ఉండే అందమైన కుండలను తయారు చేసేవారు. చక్కని వస్త్రాలను నేసి మహాజనపదాలలోని ధనవంతులకు అమ్మేవారు. వాళ్ళు బంగారం, వెండి ఆభరణాలను కూడా తయారు చేసేవారు. పురావస్తు తవ్వకాలలో వారు చేసిన ఇనుము, రాగి, ఇత్తడి వంటి లోహాలతో చేసిన పాత్రలు, పరికరాలు బయల్పడ్డాయి.
వారు చెక్కతో బళ్ళను, గృహోపకరణాలను తయారు చేసేవారు. సైనికులు, గణకులు, తాపీ పనివారు, గుర్రాల శిక్షకులు, ఊడ్చేవారు. నీటిని తెచ్చేవారు. చెక్కతోను, ఏనుగు దంతంతోను బొమ్మలు తయారుచేసే అనే రకాల పనివాళ్ళు ఉండేవారు. వీళ్ళు తయారు చేసిన వస్తువులలో కొన్ని మాత్రమే తవ్వకాలలో బయటపడ్డాయి. పుస్తకాల ద్వారా వాళ్ళ గురించి మరింత తెలుసుకోవచ్చు.
వృత్తి పనివారు ఉత్పత్తి చేసిన వస్తువులను కొని గృహపతులకు వాటిని ఎక్కువ లాభానికి అమ్మే వ్యాపారస్థులు కూడా ఉండేవారు. అంతేకాక వివిధ దేశాలలో ప్రత్యేకంగా లభించే వస్తువులను తీసుకువచ్చి ఆయా జనపదాలలో అమ్మేవారు. వాళ్ళు వ్యాపార నిమిత్తం పరివారంతో పాటూ ఎద్దులు, గాడిదలు, ఒంటెలతో వారాలు, నెలలపాటు నదులు, మైదానాలు, కొండలు మహా ఎడారుల్లో సైతం ప్రయాణించేవారు. వాళ్ళకు వచ్చిన అపార లాభాలతో పెద్ద భవంతులలో డజన్ల కొద్దీ సేవకులతో, బానిసలతో పని చేయించుకుంటూ విలాసవంతమైన జీవనం సాగించేవారు.
ప్రశ్న 3.
‘గణ’ అనగానేమి?
జవాబు:
‘గణ’ అనే పదానికి సమాన హోదా ఉన్నవారు అని అర్థం. ‘సంఘ’ అంటే ‘శాసన సభ’ . గణ – సంఘాలు ఒక ఉన్నత సమూహం పాలించే ఒక చిన్న భౌగోళిక ప్రాంతమే గణ రాజ్యం.
ప్రశ్న 4.
రాజ్యం అంటే ఏమిటి?
జవాబు:
“రాజ్యం” అంటే రాజు లేదా రాణి పాలించే భూభాగం. ఒక రాజ్యంలో (రాజరికం) ఒక కుటుంబం వంశ పారంపర్యంగా చాలా కాలం పాటు పాలిస్తే అది రాజవంశం అవుతుంది. సాధారణంగా ఈ రాజ్యాలు సనాతన వైదిక సంప్రదాయాలకు కట్టుబడి ఉంటాయి.
ప్రశ్న 5.
‘వజ్ర’ గణకు ప్రాధాన్యత నిస్తూ, గణ రాజ్యంలోని పాలనా విధానము, పతనము గురించి వివరించుము.
జవాబు:
మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన వజ్జి మహాజనపదం ఉండేది. రాజ్యంలో ఒకే పరిపాలకుడు కాక్, ఒక పరిపాలకుల బృందం ఉండేది. కొన్ని సందర్భాలలో వేలమంది కలిసి పాలన చేసేవారు. ప్రతి ఒక్కరూ తమను ‘రాజు’ అని పిలుచుకునేవారు. వాళ్ళు సంప్రదాయాలను పాటిస్తూ అందరూ సమావేశమై అందరికీ సంబంధించిన అంశాలపై వాదోపవాదాల తరువాత నిర్ణయాలు తీసుకునేవారు. మహిళలకు, బానిసలకు, సేవకులకు ఈ సమావేశాలలో పాల్గొనే అవకాశం ఉండేది కాదు. బుద్ధుడు, మహావీరుడు గణాలకు చెందినవారు. ప్రఖ్యాత బోధకులయిన వీరిని అన్ని మహాజనపదాలూ గౌరవించేవి. ఈ గణ రాజ్యాలను జయించటానికి రాజులు ఎంతగా ప్రయత్నించినా 1500 సంవత్సరాల పాటు అవి మనగలిగాయి. చివరకు గుప్త రాజులు గణ రాజ్యాలను జయించారు.
ప్రశ్న 6.
గాంధార శిల్పకళ గురించి నీకేమి తెలియును?
జవాబు:
గాంధార శిల్పకళ :
గాంధార శిల్పకళ తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చేయబడింది. ఇది గ్రీకు కళతో ప్రభావితమైనది.
ఈ శిల్పం యొక్క ప్రత్యేక లక్షణాలు వాస్తవికత, సరైన కొలతలతో, సున్నితమైన పనితనం. చాలా గౌతమ బుద్దుని చిత్రాలు ఈ శైలిలో చెక్కబడినవి.
ప్రశ్న 7.
ఈ చిత్రం సుమారు 2000 సంవత్సరాల కాలంనాటి సాంచి స్థూపానికి చెందినది. ఈ చిత్రంలో రాజును ఎలా గుర్తిస్తావు?
జవాబు:
రాజు పట్టణ కోట నుండి గుర్రాల రథం ద్వారా వస్తున్నాడు. రథసారధి చాలా సాదాసీదాగా ఉన్నాడు. ప్రక్కన ఉన్న వ్యక్తి ప్రత్యేక అలంకరణలో ఉండడం మూలంగా ఆయనను రాజుగా గుర్తిస్తాను.
ప్రశ్న 8.
ప్రక్క పటాన్ని గమనించి క్రింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
1. అస్మక ఏ నది ఒడ్డున కలదు?
జవాబు:
అస్మక గోదావరి నది ఒడ్డున ఉన్నది.
2. అవంతికి ఉత్తరాన ఉన్న జనపదం ఏమి?
జవాబు:
అవంతికి ఉత్తరాన ఉన్న జనపదం ‘మత్స్య’.
3. కోసల, వజ్జిలకు మధ్యలో ఉన్న జనపదం ఏది?
జవాబు:
కోసల, వజ్జికి మధ్యలో ఉన్న జనపదం మలయ లేదా మల్ల జనపదం.
4. ఈ జనపదాలు భారతదేశానికి ఏ భాగాన ఎక్కువగా ఉన్నాయి?
జవాబు:
ఈ జనపదాలు భారతదేశానికి ఉత్తర భాగాన ఎక్కువగా ఉన్నాయి.
5. దక్షిణ భారతదేశంలో మహాజనపదం ఏమి?
జవాబు:
దక్షిణ భారతదేశంలో మహాజనపదం ‘అస్మక’.
ప్రశ్న 9.
ప్రక్క పటాన్ని గమనించి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
1. ‘కాంభోజ’ కు దక్షిణాన ఉన్న మహాజనపదం ఏది?
జవాబు:
గాంధారా
2. ‘నేపాల్’ సరిహద్దులో ఉన్నటువంటి మహాజనపదాలు ఏవి?
జవాబు:
కోసల, మలయ, వట్టి
3. ఈ మహాజనపదాల పేర్లతో ‘చేప’ అని అర్ధం వచ్చేది ఏది?
జవాబు:
మత్స్య