These AP 6th Class Social Important Questions 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు will help students prepare well for the exams.
AP Board 6th Class Social 8th Lesson Important Questions and Answers రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు
ప్రశ్న 1.
క్రింది వారిని గురించి నీకు తెలిసిన రెండు వాక్యాలు రాయండి.
1) మెగస్తనీస్ 2) కౌటిల్యుడు
జవాబు:
1) మెగస్తనీస్ :
మెగస్తనీస్ ఒక గ్రీకు రాయబారి. అతను చంద్రగుప్త మౌర్యుని కొలువులో ఉండేవాడు. అతను ‘ఇండికా’ అనే గ్రంథాన్ని రచించాడు. ఇది మౌర్యుల కాలపరిస్థితులు. వారి పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఒక ఆధార గ్రంథం.
2) కౌటిల్యుడు :
కౌటిల్యుడిని ‘విష్ణుగుప్తుడు’ మరియు ‘చాణక్యుడు’ అని కూడా పిలుస్తారు. అతను చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి ‘అర్థశాస్త్రము’ అతను రచించిన ప్రముఖ గ్రంథం.
ప్రశ్న 2.
అశోకుని శిలాశాసనాల గురించి తెల్పండి. ఏదైనా ఒక శాసనం గురించి విపులంగా వివరించండి.
జవాబు:
13వ నంబరు రాతి శాసనంలో అశోకుడు కళింగయుద్ధం గురించి ప్రస్తావించడం జరిగింది. ‘దిగువ శిలా శాసనాన్ని పరిశీలించండి. ప్రాకృత లిపిలో అక్షరాలతో చెక్కబడిన శిలాశాసనం యొక్క అర్థం తెలుగులో ఈ కింది విధంగా భావించవచ్చును.
ఒక స్వతంత్ర రాజ్యాన్ని జయించినప్పుడు లక్షలమంది చని పోతారు మరియు అంతకంటే ఎక్కువ సంఖ్యలో సైనికులు బందీలుగా దొరుకుతారు. అందువలనే నేను విచారంగా ఉన్నాను. బలంతో కన్నా ధర్మం ద్వారా ప్రజలను గెలుచుకొనుటే ఉత్తమమైనదని నేను విశ్వసిస్తున్నాను. నేను ఈ శాంతి సందేశాన్ని భవిష్యత్ తరాల కొరకు లిఖిస్తున్నాను. దీనివలన నా వారసులు ఎవ్వరూ కూడా యుద్ధం గురించి ఆలోచించరు. దానికి బదులుగా వారు ధర్మాన్ని వ్యాప్తి చేయడం గురించే ఆలోచిస్తారు. (ధర్మము అనే పదాన్ని ప్రాకృత భాషలో ‘దమ్మము’ అని పిలుస్తారు.)
అశోకుడు ఇలాంటి చాలా శిలాశాసనాలను తన రాజ్యంలోని వివిధ ప్రాంతాలలో చెక్కించాడు. ధర్మాన్ని ప్రజలకు తెలియజేయడమే ఈ శిలాశాసనాల ముఖ్య ఉద్దేశం. అశోకుడు శిలాశాసనాలపై చెక్కబడి ఉన్న ధర్మ సూత్రాలను నిరక్షరాస్యులకు తెలియజెప్పేందుకు ప్రత్యేక అధికారులను నియమించాడు.
ప్రశ్న 3.
అశోకుడు ప్రజల కొరకు చేపట్టిన ప్రజోపయోగ కార్యక్రమాలేవి?
జవాబు:
నీరు, ఆహారం పవిత్రమైనవని అశోకుడు ఒక బౌద్ధ సన్యాసి ద్వారా తెలుసుకున్నాడు. తన ప్రజలందరికీ అందాలని సంకల్పించుకున్నాడు. అనంతరం అశోకుడు రోడ్డుకు రెండువైపులా చెట్లు నాటించాడు. చెట్లు రోడ్లపై ప్రయాణించేవారికి నీడను ఇవ్వడంతోపాటు ఆకలితో ఉన్నవారికి పండ్లను ఇవ్వడం ద్వారా ఆకలిని తీర్చేవి. ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించేందుకు బావులు తవ్వించాడు.
అశోకుని కాలంలో ప్రజలకు మంచి రవాణా సౌకర్యాలు కలవు. రహదారులు తన సువిశాల సామ్రాజ్యంలోని వేర్వేరు సంస్కృతులు గల ప్రజలను కలిపాయి. రవాణా మరియు వాణిజ్య సౌకర్యాలు సులభతరమయ్యాయి. విశాలమైన భారతదేశంలో రాజకీయ ఐక్యత సాధ్యమైంది. మనుషులు, జంతువులకు కూడా వైద్య సంరక్షణ కొరకు వైద్యశాలలు ఏర్పాటు చేయబడినవి.
ప్రశ్న 4.
శాతవాహనుల గురించి నీకు ఏమి తెలియును, వాణిజ్యము, మతము గూర్చి ప్రాధాన్యతనిస్తూ వ్రాయుము.
జవాబు:
శాతవాహనులు :
మౌర్య సామ్రాజ్యం పతనమైన తరువాత దక్కన్ ప్రాంతంలో అనేక తెగల పెద్దలు ఆ ప్రాంతాన్ని చిన్నచిన్న రాజ్యాలుగా విభజించుకొని పరిపాలన ప్రారంభించారు. అలా ఏర్పడిన రాజులలో శాతవాహనులు ఒకరు. శాతవాహనులు నర్మదా నది నుంచి కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతం వరకు పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. గుంటూరు జిల్లాలోని అమరావతి సమీపంలోని ధాన్యకటకం’ నుండి పరిపాలించారు. అది కృష్ణానదీ తీరంలో కలదు.
శాతవాహన కాలంలో ఉన్న ఓడ నాణేలు ప్రసిద్ది చెందినవి. అవి సముద్ర వ్యాపారంలో ఆంధ్రుల యొక్క నైపుణ్యాన్ని మరియు నౌకాదళ శక్తిని తెలియజేస్తాయి. అంతర్జాతీయ వ్యాపారంపై శాతవాహనులు మంచి పట్టును కలిగి ఉన్నారు. రోమ్ దేశాలతో వీరికి మంచి వ్యాపార సంబంధాలు కలవు.
శాతవాహనులు హిందూమతాన్ని అనుసరించారు. బౌద్ధమతాన్ని కూడా ప్రోత్సహించారు. నాగార్జునకొండ మరియు అమరావతి శాతవాహన కాలం నాటి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు. ప్రముఖ బౌద్ధ వేదాంతి ఆచార్య నాగార్జునుడు వీరి కాలంలో నివసించి ఉన్నాడని చెప్పబడుతున్నది.
ప్రశ్న 5.
చాళుక్యులు వాస్తు శిల్పకళకు చేసిన సేవను వివరింపుము. పట్టడగల్ లోని దేవాలయం గురించి వర్ణింపుము.
జవాబు:
చాళుక్యులు వాస్తుశిల్పకళకు ఎంతో సేవ చేశారు. వారి కాలంలో ‘వెశారా’. అను నూతన వాస్తుశిల్ప కళారీతి అభివృద్ధి చెందింది. దక్షిణ భారతదేశములోని ‘ద్రవిడ మరియు ఉత్తర భారతదేశంలోని ‘నగారా’ వాస్తుశిల్ప కళాకృతుల మేలి కలయికే ‘వెశారా’. పల్లవ రాజైన మొదటి మహేంద్రవర్మ రెండవ పులకేశిని యుద్ధంలో ఓడించి కావేరి నదిని దాటి వెళ్ళాడు. చోళ, చేత, పాండ్య రాజులతో చాళుక్యులు మంచి స్నేహసంబంధాలు నెలకొల్పారు.
కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం పట్టడగల్. ఈ గ్రామంలో పది దేవాలయాలు కలవు. అందులో నాలుగు దేవాలయాలు నగర నిర్మాణ శైలిలో ఉండగా మరొక నాలుగు దేవాలయాలు ద్రవిడ నిర్మాణ శైలిలో ఉన్నవి. విరూపాక్ష దేవాలయం మరియు సంగమేశ్వర ఆలయం ద్రవిడ నిర్మాణ శైలిలో ఉండగా, పాపనాథ ఆలయం నగారా నిర్మాణ శైలిలో ఉన్నది.
ప్రశ్న 6.
చాళుక్యులు గురించి నీకు ఏమి తెలియును?
జవాబు:
చాళుక్యులు :
దక్షిణ మరియు మధ్య’ భారతదేశంలో ఎక్కువ భాగాలను క్రీ.పూ. 600-1200 మధ్య చాళుక్యరాజులు పరిపాలించారు. తొలి చాళుక్యరాజులలో ఒకరైన రెండవ పులకేశి కర్ణాటకలోని బాదామిని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. రెండవ పులకేశి మరొక ప్రసిద్ది చెందిన చాళుక్యరాజు. నర్మదా నది ఒడ్డున జరిగిన యుద్ధంలో హర్ష చక్రవర్తి ఇతనిని ఓడించాడు. ఈ విజయాన్ని కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లాలోని ఐహోలు శిలాశాసనములో పేర్కొనబడినది. రెండవ పులకేశి కొలువులో ఉన్న రవికీర్తి ఐహోలు శాసనాన్ని తయారు చేశాడు.
ప్రశ్న 7.
క్రింది పటమును పరిశీలించి ప్రశ్నలకు సమాధానములు ఇవ్వండి.
అ. అజంతా, ఎల్లోరా గుహలు ఏ రెండు నదుల మధ్య ఉన్నాయి?
జవాబు:
తపతి, గోదావరి.
ఆ. గుప్తుల రాజధాని నగరం ఏది?
జవాబు:
పాటలీపుత్ర
ఇ. గుప్తుల కాలంలోని ముఖ్యమైన రేవు పట్టణం ఏది?
జవాబు:
జరుకచ్చా.
ఈ. అమరావతి ఏ నది ఒడ్డున ఉన్నది?
జవాబు:
కృష్ణానది.
ప్రశ్న 8.
ఈ క్రింది వాటిని గుర్తించండి.
1. పాటలీపుత్ర
2. కళింగ
3. ఉజ్జయిని
4. సువర్ణగిరి
5. తక్షశిల