Students can go through AP Board 6th Class Social Notes 11th Lesson భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు to understand and remember the concept easily.
AP Board 6th Class Social Notes 11th Lesson భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు
→ భారతదేశ సంస్కృతిని ఒక ప్రత్యేకమైనదిగా పిలవడానికి భిన్నత్వంలో ఏకత్వమే’ ప్రముఖమైనది.
→ భారతీయ సంస్కృతి చాలా పురాతనమైనది. ఇది దాదాపు 5,000 సం||రాల పూర్వమే ప్రారంభమయ్యింది.
→ భాష ఒక ప్రసార మాధ్యమం. భూమిపై భాషను ఉపయోగించే జీవి మనిషి మాత్రమే.
→ లిపి మనం చదవడానికి మరియు రాయడానికి ఉపయోగపడుతుంది.
→ ఆర్యభట్ట ‘ఆర్యభట్టీయం’ అనే గ్రంథం రచించాడు.
→ శస్త్ర చికిత్సల పై రాయబడిన గ్రంథమే సుశ్రుత సంహిత.
→ తెలుగులో 56, ఇంగ్లీషులో 26 అక్షరాలు కలవు.
→ భారత రాజ్యాంగం గుర్తించబడిన (8వ షెడ్యూల్) భాషలు – 22
→ ప్రపంచంలోని మతాలలో హిందూమతం చాలా పురాతనమైనది. ఇది ఒక జీవన విధానం మరియు దీనిని సనాతన ధర్మం అనికూడా పిలుస్తారు.
→ ధర్మం, అర్థం, కామం, మోక్షంలను చతుర్విధ పురుషార్ధాలంటారు.
→ హిందూ అనే పదం ‘సింధూ’ అనే పదం నుండి వచ్చింది.
→ చిత్తూరు జిల్లాలోని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం శేషాచలం కొండలలో కలదు.
→ జైనమత గురువులను తీర్థంకరులు అంటారు. 24 మంది తీర్థంకరులు గలరు.
→ జైన అనే పదం ‘జిన’ అనే సంస్కృత పదం నుండి వచ్చింది.
→ మహావీరుడు మిక్కిలి ప్రసిద్ధి చెందిన తీర్థంకరుడు. అతను ఒక యువరాజు, ఇతనే చివరి తీర్థంకరుడు.
→ జైన మత పవిత్ర గ్రంథాలను ‘అంగాలు’ అంటారు.
→ జైన మత సిద్ధాంతాలను ‘పంచవ్రతాలు’ (అహింస, సత్యం, అస్తేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం) అంటారు.
→ పంచవ్రతాలు అనుసరించడానికి మహావీరుడు మూడు మార్గాలను సూచించాడు. వాటిని త్రిరత్నాలు (సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చరిత్ర) అంటారు.
→ బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. ఇతను లుంబిని (నేపాల్) వనంలో జన్మించాడు.
→ బుద్ధునికి జ్ఞానోదయమైన చెట్టును ‘బోధివృక్షం’ అంటారు.
→ బుద్ధుడు క్రీ.పూ. 483లో కుశీనగర్ (ఉ. ప్ర. )లో స్వర్గస్థుడైనాడు.
→ ‘త్రిపీఠికాలు’ బౌద్ధమత పవిత్ర గ్రంథాలు.
→ గౌతమ బుద్ధుని బోధనలను ‘ఆర్య సత్యాలు’ అంటారు.
→ మోక్షం పొందుటకు బుద్దుడు ‘అష్టాంగ మార్గాలు’ సూచించాడు.
→ సాంచి స్థూపంను క్రీ.పూ. మూడో శతాబ్దంలో అశోక చక్రవర్తి నిర్మించాడు.
→ క్రైస్తవ మతం పవిత్ర గ్రంథం బైబిల్.
→ ప్రపంచంలోని ప్రసిద్ధ చర్చి రోమన్ కాథలిక్ చర్చి. ఇది వాటికన్ నగరంలో కలదు.
→ రోమన్ కాథలిక్ చర్చికి అధిపతిని పోప్ అంటారు.
→ వాటికన్ నగరం ప్రపంచంలోనే అతిచిన్న దేశం.
→ మహమ్మద్ ను ప్రవక్త లేదా అల్లా యొక్క దూతగా భావిస్తారు.
→ ‘అల్లా యొక్క బోధనలను ‘ఖురాన్’ అనే గ్రంథంలో రాయబడినవి.
→ ప్రసిద్ధ మక్కా మసీదు (సౌదీ అరేబియా) మధ్యలో ఉన్న భవనమే ‘కాబా’.
→ ముస్లింలకు పవిత్ర నగరం ‘మక్కా’. ముస్లిం భక్తులు తమ జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా హక్కు మక్కాకు వెళ్ళాలనుకుంటారు.
→ సిక్కుమత స్థాపకుడు గురునానక్.
→ సిక్కు అనే పదానికి విద్యార్థి లేదా శిష్యుడు అని అర్థం.
→ గురునానక్ పదిమంది గురువులలో మొదటివాడు.
→ సిక్కుల ఆలయాన్ని ‘గురుద్వారా’ అంటారు.
→ సిక్కుల పవిత్ర గ్రంథం ‘గురు గ్రంథ్ సాహెబ్’.
→ పంజాబ్ లోని అమృత్ సర్ లోని స్వర్ణదేవాలయం సిక్కుల ముఖ్యమైన పుణ్యక్షేత్రం.
→ భారతదేశం యొక్క అత్యున్నత (విశిష్ట సాంస్కృతిక లక్షణం ‘భిన్నత్వంలో ఏకత్వం’
→ మతం : దేవునిపై నమ్మకం.
→ ఆరాధించడం .: భగవంతునిపై భక్తి ప్రదర్శించడం.
→ ఉపఖండం : ఆసియా దక్షిణ భాగంలో, భారత పలకంలో ఉన్న ద్వీపకల్పం.
→ భాష : ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇతరులకు తెలియజేసే మాధ్యమం.
→ లిపి : భాషకు అక్షర రూపం.
→ తీర్థంకర : ధర్మాన్ని బోధించే జైనమత గురువు.
→ అహింస : హానిచేయకుండా ఉండటం.
→ త్రిరత్నాలు : బౌద్ధమతంలో ధర్మం, సంఘం, బుద్ధుడులను త్రిరత్నాలు అంటారు.
→ జ్ఞానోదయం : ఆధ్యాత్మిక అత్యున్నత స్థితి.
→ బోధివృక్షం : రావి చెట్టు.
→ త్రిపీఠికలు : బౌద్ధమత పవిత్ర గ్రంథాలు.
→ మోక్షం : పరిపూర్ణ శాంతి మరియు ఆనందం (స్వర్గం).
→ అష్టాంగ మార్గం : సంసారం నుండి విముక్తి పొందడానికి బౌద్ధులు అనుసరించే పద్ధతులు.
→ ఉపనిషత్తులు : హిందూ మత పవిత్ర గ్రంథాలు.
→ ప్రవక్త : దేవుని సందేశాన్ని బోధించేవాడు
→ సంస్కృతి : ఒక కొత్త వ్యవస్థని సృష్టించుకోవడం కోసం ముందు తరాల వారసత్వాన్ని అంది పుచ్చుకుని దానిని భావితరాలకు అందించడానికి జరిగే నిరంతర ప్రక్రియే సంస్కృతి.
→ శాసనాలు : రాతిపై, రాగి రేకులపై చెక్కబడిన రాజ ఆజ్ఞలు మరియు సందేశాలు మొదలైనవి.
→ సనాతన ధర్మం : పురాతనంగా ఆచరించబడుతున్న హిందూ జీవన విధానంనే సనాతన ధర్మం అంటారు.
→ పంచవ్రతాలు : జైనమత సిద్ధాంతాలను పంచవ్రతాలు అంటారు.
→ ఆర్యసత్యాలు : గౌతమ బుద్ధుని బోధనలను ఆర్యసత్యాలు అంటారు.
→ రోమన్ కాథలిక్ చర్చి : ప్రపంచంలోని ప్రసిద్ది చర్చి, ఇది వాటికన్ నగరంలో కలదు.
→ కాబా : ప్రసిద్ధ మక్కా మసీదు (సౌదీ అరేబియా) మధ్యలో ఉన్న భవనమే కాబా.
→ సిక్కు : సిక్కు అనే పదానికి విద్యార్థి లేదా శిష్యుడు అని అర్థం.
→ స్వర్ణదేవాలయం : సిక్కులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రం.
→ భిన్నత్వంలో ఏకత్వం : అనేక విభిన్నాల మధ్య ఏకత్వం సాధించడం, ఇది భారతదేశ విశిష్ట లక్షణం.
→ రాజ్యాంగ భాషలు : భారత రాజ్యాంగం 22 భాషలను గుర్తించింది. (8వ షెడ్యూల్ లో)
→ తపస్సు : ఏకాగ్రత ద్వారా మోక్షాన్ని పొందడం.
→ చతుర్విధ పురుషార్ధాలు : ధర్మం, అర్థం, కామం, మోక్షం అను నాలుగు పురుషార్ధాలు.
→ అంగాలు : జైనల పవిత్ర గ్రంథాలను అంగాలు అంటారు.
→ బైబిలు : క్రైస్తవుల పవిత్ర గ్రంథం.
→ ఖురాన్ : ఇస్లాంల పవిత్ర గ్రంథం.
→ గురుగ్రంథ్ సాహెబ్ : సిక్కుల పవిత్ర గ్రంథం.
→ భగవద్గీత : హిందువుల పవిత్ర గ్రంథం