AP 8th Class Social Notes Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం

Students can go through AP Board 8th Class Social Notes 6th Lesson ఖనిజాలు, గనుల తవ్వకం to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 6th Lesson ఖనిజాలు, గనుల తవ్వకం

→ భూమి లోపల నుండి పొందే ప్రతీది (మొక్కలు, జంతువుల రూపంలో లేనిది) ఖనిజమే అవుతుంది.

→ వనరులు పునరుద్దరింపబడేవి, అంతరించిపోయేవి అని రెండు రకాలు.

→ ఆధునిక పరిశ్రమలలో అనేక రకాల ఖనిజాలు ఉపయోగించబడతాయి.

→ మన రాష్ట్రంలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి.

→ భూమిని తవ్వటం లేదా గనుల తవ్వకం అనే ప్రక్రియ ద్వారా ఖనిజాలను మానవ వినియోగానికి వెలికితీస్తారు.

→ గనుల త్రవ్వకంలోని అనేక పద్ధతుల వల్ల ఉపరితల ప్రదేశం దెబ్బ తింటుంది.

→ ఖనిజాలు భూమి లోపలి పొరల్లో ఉండి, ఆ దేశ ప్రజలందరికీ చెందుతాయి.

→ ఎక్కువ మొత్తంలో గనుల త్రవ్వకం వల్ల దీర్ఘకాల సుస్థిరత దెబ్బతింటుంది.

→ బొగ్గు వెలికితీతకు, సింగరేణి కాలరీస్ లిమిటెడ్, స్థాపించబడింది.

→ బొగ్గును గని నుండి కన్వేయర్ బెల్టుతో రవాణా చేస్తారు.

AP 8th Class Social Notes Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం

→ SCL కంపెనీలో సుమారు 65,000 మంది ఉద్యోగులు ఉన్నారు. (2015)

→ గనులలో నుండి వచ్చే వ్యర్థ పదార్థాలను చెల్లా చెదురు కాకుండా చూడాలి.

→ ఖనిజాలు : భూమి నుండి వెలికి తీయబడే వాటిని ఖనిజాలు అంటారు (జంతు, వృక్ష రూపాలు తప్ప).

→ ఓపెన్ కాస్ట్ గనుల త్రవ్వకం : గుట్టలను పేల్చి లేదా గొయ్యి తవ్వి ఖనిజాలను తీయడం.

→ భూగరు గనుల తవ్వకం : భూమి లోపలి పొరల్లో ఉండే ఖనిజాలను వెలికి తీయడానికి సొరంగాలను నిర్మిస్తారు.

→ పునరుద్ధరింపబడే వనరులు : మళ్ళీ మళ్ళీ పొందగల వనరులను పునరుద్ధరింపబడే వనరులు అంటారు.
ఉదా : కలప

→ అంతరించిపోయే వనరులు : ఒకసారి వాడిన తరువాత తిరిగి తయారు అవ్వని వనరులను అంతరించిపోయే వనరులు అంటారు.
ఉదా : ముడి చమురు.

→ బొగ్గు : ఇది ఒక ఖనిజం మరియు ఇంధన వనరు. విద్యుత్తు తయారీకి, పరిశ్రమలకు ఉపయోగపడుతుంది.

→ బెరైటీస్ : ఇది కొన్ని ఖనిజాల సమూహం. వీటి నుంచి బేరియం అనే మూలకాన్ని వెలికి తీస్తారు.

AP 8th Class Social Notes Chapter 6 ఖనిజాలు, గనుల తవ్వకం 1