Students can go through AP Board 6th Class Social Notes 2nd Lesson గ్లోబు – భూమికి నమూనా to understand and remember the concept easily.
AP Board 6th Class Social Notes 2nd Lesson గ్లోబు – భూమికి నమూనా
→ పురాతన గ్లోబును 1492లో మార్టిన్ బెహైమ్ రూపొందించాడు.
→ అధునిక గ్లోబును 1570లో టకీ-ఆల్-దిన్ రూపొందించాడు.
→ ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని గ్లోబును జహంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు.
→ గ్లోబల్ అనే పదం ‘గ్లోబస్’ అనే లాటిన్ పదం నుండి వచ్చింది, గోళం అని దాని అర్థం.
→ గ్లోబుకు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబును రెండు సమభాగాలు చేస్తూ ఒక ఊహా రేఖ పోతుంది. దీనిని భూమధ్యరేఖ 14 (0° అక్షాంశం) అంటారు.
→ భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉన్న అర్థభాగాన్ని ఉత్తరార్ధగోళమనీ, దక్షిణంగా ఉన్న అర్థభాగాన్ని దక్షిణార్ధ గోళమని అంటారు.
→ భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన రేఖలను అక్షాంశాలు అంటారు.
→ భూమధ్య రేఖకు ఉత్తరంగా 90° అక్షాంశాలు, దక్షిణంగా 90° అక్షాంశాలు ఉన్నాయి.
→ 23½° ఉత్తర అక్షాంశంను కర్కటరేఖ అంటారు.
→ 23½° దక్షిణ అక్షాంశంను మకరరేఖ అంటారు.
→ 66½° ఉత్తర అక్షాంశంను ఆర్కిటిక్ వలయం అంటారు.
→ 66½°° దక్షిణ అక్షాంశంను అంటార్కిటిక్ అంటారు.
→ 90° ఉత్తర అక్షాంశంను ఉత్తర ధృవం అంటారు.
→ 90° దక్షిణ అక్షాంశంను దక్షిణ ధృవం అంటారు.
→ అక్షాంశం అను పదం ‘లాటిట్యూడో’ అనే లాటిన్, పదం నుండి వచ్చింది. దీని అర్థం వెడల్పు, మందం, పరిధి, పరిమాణం.
→ రేఖాంశం అను పదం ‘లాంగిట్యూడో’ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దీని అర్థం పొడవు, నిడవి, వ్యవధి.
→ గ్లోబు మీద అక్షాంశాలకు లంబంగా గీసినట్లు ఉన్న రేఖలను రేఖాంశాలు అంటారు.
→ 0° రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశం/ ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ రేఖాంశం అంటారు.
→ 0° రేఖాంశానికి వ్యతిరేక దిశలో 180° రేఖాంశం ఉంటుంది. దీనిని అంతర్జాతీయ దినరేఖ అంటారు.
→ గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్ధగోళాన్ని తూర్పు అర్ధగోళమని, పశ్చిమంగా ఉన్న అర్ధగోళాన్ని పశ్చిమార్ధ గోళమని అంటారు.
→ 180 తూర్పు రేఖాంశాలు, 180 పశ్చిమ రేఖాంశాలు మొత్తం 360 రేఖాంశాలున్నాయి.
→ భూమి తన అక్షంపై తన పడమర నుండి తూర్పుకు గంటకు 1610 కి.మీ. వేగంతో తిరుగుతుంది. దీనినే భూ భ్రమణం అంటారు.
→ భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని ‘భూ పరిభ్రమణం’ అంటారు.
→ భూ భ్రమణానికి 23 గం||ల 56 ని॥ల 4.09 (సుమారు 24 గం॥లు) పడుతుంది.
→ భూపరిభ్రమణానికి 3651/4 రోజులు పడుతుంది.
→ లీపు సం॥రంలో 366 రోజులుంటాయి.
→ మార్చి 21 మరియు సెప్టెంబరు 23 తేదీలలో సూర్యకిరణాలు భూమధ్యరేఖపై నిట్టనిలువుగా పడతాయి. ఈ రెండు తేదీలను విషవత్తులు అంటారు.
→ జూన్ 21న కర్కటరేఖ మీద, డిసెంబరు 22న మకరరేఖ మీద సూర్యుని కిరణాలు నిట్టనిలువుగా పడతాయి.
→ భూమికి మరియు సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
→ చంద్రుడు భూమి యొక్క వెనక భాగంలోనికి లేదా భూమి నీడలోనికి వెళ్ళినపుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది.
→ అక్షం : ఒక వస్తువు తన చుట్టూ తాను తిరగడానికి ఉండే ఒక ఊహారేఖ.
→ భూమధ్యరేఖ : 0° అక్షాంశం.
→ కర్కటరేఖ : 23½° ఉత్తర అక్షాంశం.
→ మకరరేఖ : 23½° దక్షిణ అక్షాంశం.
→ ఆర్కిటిక్ వలయం : 66½° ఉత్తర అక్షాంశం.
→ అంటార్కిటిక్ వలయం : 66½° దక్షిణ అక్షాంశం.
→ ఉత్తర ధృవం : 90° భూమికి ఉత్తర భాగాన ఉన్న చివరి ప్రాంతం.
→ దక్షిణ ధృవం : 90° భూమికి దక్షిణ భాగాన ఉన్న చివరి ప్రాంతం.
→ మధ్యాహ్న రేఖలు : ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ ఉండే రేఖాంశాలు. ఇవి మధ్యాహ్నాన్ని సూచిస్తాయి.
→ గ్రీనిచ్ / ప్రామాణిక రేఖాంశం : 0° రేఖాంశం
→ అంతర్జాతీయ దినరేఖ : 180° తూర్పు మరియు పశ్చిమ రేఖాంశం.
→ అక్షాంశాలు : భూమధ్యరేఖకు సమాంతరంగా గీయబడిన ఊహారేఖలు.
→ రేఖాంశాలు : ఉత్తర, దక్షిణ ధృవాలను కలుపుతూ గీయబడిన ఊహారేఖలు.
→ ఉత్తరార్ధగోళం . : భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగం.
→ దక్షిణార్ధగోళం : భూమధ్యరేఖకు దక్షిణంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగం.
→ తూర్పు అర్ధగోళం : ప్రామాణిక రేఖాంశానికి తూర్పుగా ఉన్న భూమి యొక్క అర్ధభాగం.
→ పశ్చిమార్ధగోళం : ప్రామాణిక రేఖాంశానికి పశ్చిమంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగం.
→ ఋతువులు : వాతావరణంలో మార్పుల ఆధారంగా సంవత్సరాన్ని ఋతువులుగా విభజించారు.
→ సూర్యగ్రహణం : సూర్యునికి భూమికి మధ్యగా చంద్రుడు వెళుతూ ఇవి మూడూ ఒక సరళరేఖ మీదకు వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది.
→ చంద్రగ్రహణం : . సూర్యునికి చంద్రునికి మధ్యగా భూమి వెళుతూ ఇవి మూడూ ఒక సరళరేఖ మీదకు వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది.
→ గ్లోబ్ : భూమి యొక్క నమూనా.
→ గ్లోబల్ : గ్లోబల్ అనే పదం ‘గ్లోబస్’ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దీని అర్ధం గోళం.
→ భూభ్రమణం : భూమి తన అక్షంపై తాను పడమర నుండి తూర్పుకు గంటకు 1610 కి.మీ. వేగంతో తిరుగుతుంది. దీనినే భూభ్రమణం అంటారు.
→ భూపరిభ్రమణం : భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని భూపరిభ్రమణం అంటారు.
→ విషవత్తులు : సూర్యకిరణాలు భూమధ్యరేఖపై నిట్టనిలువుగా పడే మార్చి 21 మరియు సెప్టెంబరు 23 తేదీలలో భూమి అంతటా రాత్రి, పగలు సమానంగా ఉంటాయి. ఈ రెండు తేదీలను విషవత్తులు అంటారు.
→ గ్రహణం : సూర్యుని పైన లేదా చంద్రుని పైనా నీడపడినట్లు కనబడటాన్నే గ్రహణం అంటారు.
→ ధృవాలు : భూమికి రెండువైపులా ఉండే స్థిర బిందువులు (చుక్కలు)
ఉదా : ఉత్తర, దక్షిణధృవాలు.
→ లీపు సంవత్సరం : సాధారణ సం||రంలో 365 రోజులుంటే, లీపు సం||రంలో 366 రోజులుంటాయి.