AP 8th Class Social Notes Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

Students can go through AP Board 8th Class Social Notes 15th Lesson చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 15th Lesson చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

→ చట్టాలను ప్రభుత్వాలు చేస్తాయి.

→ చట్టాలను కార్యనిర్వాహక వర్గం అమలు చేస్తుంది.

→ నివేదికలో రాసిన సమాచారాన్ని SHO పైకి చదివి వినిపించాలి.

→ కేసు తీసుకోడానికి SHO నిరాకరిస్తే నేరుగా DCP లేదా మేజిస్ట్రేటు దగ్గరకు వెళ్ళి పిర్యాదు చేయవచ్చు.

→ నిందితులను మేజిస్ట్రేటు ముందు హాజరు పరచడానికి లాకలో పెడతారు.

→ భూమి, ఆస్తి, ఆదాయాలపై ఉన్న ప్రజల హక్కులు, ప్రజల మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించినవి సివిల్ వివాదాలు అవుతాయి.

→ క్రిమినల్ కేసులన్నింటినీ పోలీసులు చేపడతారు.

→ న్యాయస్థానంలో ప్రభుత్వ న్యాయవాది ప్రభుత్వ ప్రయోజనాలకు ప్రతినిధిగా ఉంటాడు.

AP 8th Class Social Notes Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

→ చట్టం ముందు అందరూ సమానులే అని చట్టం చెబుతోంది.

→ రాజ్యాంగంలో ముఖ్యమైన అంశం కార్యనిర్వాహక, న్యాయ, శాసన అధికారాలను వేరుచేయటం.

→ పోలీసులు న్యాయ రంగంలో భాగం కాదు. కార్య నిర్వాహక రంగానికి చెందినవాళ్ళు.

→ దేశంలోని అత్యున్నతమైన సుప్రీంకోర్టు కొత్తఢిల్లీలో ఉంటుంది. దీనికి అధిపతిగా ప్రధాన న్యాయమూర్తి ఉంటారు.

→ క్రింది కోర్టు తీర్పుపై పై కోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు.

→ నిందితుడు : నేరం మోపబడినవాడు

→ ఎఫ్.ఐ.ఆర్ : తొలి సమాచార నివేదిక

→ నేరం : చట్ట వ్యతిరేక చర్య

→ విచారణ : మంచి, చెడులను తర్కించి చూడటం

→ అరెస్టు : నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం.

→ సమన్లు : కోర్టుకు హాజరుకమ్మని పంపే ఆర్డర్లు.

→ సాక్షి : ఏదేనీ ఒక సంఘటనను కంటితో చూసినవారు

→ న్యాయవిచారణ : న్యాయస్థానంలో జరిగే విచారణ

→ తీర్పు : న్యాయమూర్తి అన్ని వాదనలు విన్నాక వెలిబుచ్చే అభిప్రాయం

→ అప్పీలు / అభ్యర్థన : న్యాయం జరుపమని న్యాయస్థానాన్ని వేడుకోవటం.

→ ఒప్పంద ఉల్లంఘన : ఇరువురు లేక అంతకన్నా ఎక్కువమంది ఒక ఒప్పందంలో ఉండి, దానిని తప్పడం.

AP 8th Class Social Notes Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం

→ వాజ్యదారు (క్లయింటు) : కోర్టులో కేసు వేసిన వారు.

→ ప్రభుత్వ న్యాయవాది : ప్రభుత్వం తరఫున వాదించే వ్యక్తి

→ బెయిలు : జైలులో ఉన్న వ్యక్తిని, కొన్ని హామీలు ఇచ్చి బయటకు తీసుకురావడానికి ‘బెయిలు’ అవసరం.

→ మెజిస్ట్రేటు : న్యాయమూర్తి

→ బాధితులు : వివిధ రకాలుగా బాధింపబడినవారు.

AP 8th Class Social Notes Chapter 15 చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం 1