Students can go through AP Board 6th Class Social Notes 9th Lesson ప్రభుత్వం to understand and remember the concept easily.
AP Board 6th Class Social Notes 9th Lesson ప్రభుత్వం
→ ఒక దేశాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని నియంత్రిస్తూ, వాటి కొరకు నిర్ణయాలను తీసుకునే ప్రజల సమూహాన్ని ‘ప్రభుత్వం’ అంటారు.
→ సాధారణంగా ప్రభుత్వం మూడు విభాగాలను కలిగి ఉంటుంది. అవి :
- శాసన నిర్మాణ శాఖ
- కార్యనిర్వాహక శాఖ
- న్యాయశాఖ
→ ప్రభుత్వాలు రాచరికం, ప్రజాస్వామ్యం అని రెండు రకాలు.
→ ఒక రాజు లేదా రాణి చేసే పాలనను ‘రాచరికం’ అంటారు.
→ రాచరికంలో రాజు లేదా రాణి వారసత్వంగా అధికారంలోకి వస్తారు.
→ “ప్రజల యొక్క ప్రజలచేత, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ప్రజాస్వామ్యం” – అబ్రహం లింకన్.
→ ప్రజాస్వామ్యం ప్రజలు నడుపుతున్న ప్రభుత్వ రూపం. ఇక్కడ ప్రతి పౌరుడికి ఓటు వేయటానికి అనుమతి ఉంటుంది.
→ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు రెండు రకాలు అవి :
- ప్రత్యక్ష ప్రజాస్వామ్యము
- పరోక్ష ప్రజాస్వామ్యము
→ ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో పౌరులు మాత్రమే చట్టాలు చేయగలరు.
→ స్విట్జర్లాండ్ కు విజయవంతమైన ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి సుదీర్ఘ చరిత్ర ఉంది.
→ ప్రతినిధిని ఎన్నుకునే విధానాన్ని ఎన్నికలు’ అంటారు.
→ పరోక్ష ప్రజాస్వామ్య విజయం ఎన్నికలపై ఆధారపడి ఉంటుంది.
→ ప్రాతినిధ్య సూత్రంతోపాటు, ప్రజాస్వామ్యంలోని ప్రధాన సూత్రాలలో ‘మెజారిటీ పాలన’ ఒకటి.
→ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ఒక నిర్దిష్ట (ప్రస్తుతం 18 సం||రాలు) పొందిన అందరికి ఓటుహక్కు ఉంది.
→ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మెజారిటీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తున్నాయి.
→ శాసన నిర్మాణశాఖ, కార్యనిర్వాహక శాఖల మధ్య సంబంధం ఆధారంగా పరోక్ష (ప్రాతినిధ్య) ప్రజాస్వామ్యం రెండు రకాలు. పార్లమెంటరీ వ్యవస్థ, అధ్యక్ష తరహా వ్యవస్థ.
→ పార్లమెంటరీ వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహకశాఖ ఏర్పడుతుంది.
→ పార్లమెంటరీ వ్యవస్థలో కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహిస్తుంది.
→ అధ్యక్ష తరహా వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడదు, కార్యనిర్వాహక శాఖ శాసనశాఖకు బాధ్యత వహించదు.
→ పార్లమెంటరీ వ్యవస్థ కల్గిన దేశాలకు ఉదాహరణ – భారత్, బ్రిటన్.
→ అధ్యక్ష తరహా వ్యవస్థ కల్గిన దేశాలకు ఉదాహరణ – అమెరికా, బ్రెజిల్.
→ దేశ వ్యాప్తంగా వివిధ సమస్యలను పరిష్కరించడానికి వివిధ స్థాయిలలో ప్రభుత్వం పనిచేస్తుంది.
→ జాతీయ స్థాయి – కేంద్ర ప్రభుత్వం
→ రాష్ట్ర స్థాయి – రాష్ట్ర ప్రభుత్వం
→ స్థానిక స్థాయి – స్థానిక ప్రభుత్వం
→ ఒక దేశం యొక్క చట్టాలు మరియు మౌలిక సూత్రాలను కలిగి ఉన్న పత్రంను రాజ్యాంగం అంటారు.
→ ప్రభుత్వం : ఒక దేశాన్ని పరిపాలించే అధికారం ఉన్న వ్యక్తుల సమూహం.
→ ప్రజాస్వామ్యం : ప్రజలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.
→ రాజరికం : ఒక చక్రవర్తి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ రూపం.
→ ఎన్నికలు : ప్రతినిధిని ఎన్నుకునే ప్రక్రియ.
→ నిర్ణయం తీసుకోవడం: నిర్ణయాలు తీసుకునే విధానం.
→ ప్రతినిధులు : ఒకరి తరపున పనిచేయడానికి లేదా మాట్లాడటానికి ఎన్నుకోబడిన లేదా నియమించబడిన వ్యక్తులు
→ రాజ్యాంగం : ఒక దేశం యొక్క చట్టాలు మరియు మౌలిక సూత్రాలను కలిగి ఉన్న పత్రం.
→ రాష్ట్ర ప్రభుత్వం : రాష్ట్ర స్థాయిలో పనిచేసే ప్రభుత్వం.
→ కేంద్ర ప్రభుత్వం : జాతీయ స్థాయిలో దేశం మొత్తానికి పనిచేసే ప్రభుత్వం.
→ శాసననిర్మాణ శాఖ : ఇది నిర్ణయాలను లేదా చట్టాలు చేసే (ప్రభుత్వ) విభాగం.
→ కార్యనిర్వాహక శాఖ : ఇది నిర్ణయాలను లేదా చట్టాలను అమలుపరిచే విభాగం.
→ న్యాయశాఖ : ఇది చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానాలతో కూడిన వ్యవస్థ.
→ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం : ప్రజలు నేరుగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు.
ఉదా : స్విట్జర్లాండ్.
→ పరోక్ష ప్రజాస్వామ్యం : ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా పరోక్షంగా నిర్ణయం తీసుకోవడంలో పాల్గొంటారు.
ఉదా : భారతదేశంలో
→ సార్వజనీన వయోజన ఓటు హక్కు : ఒక నిర్దిష్ట వయస్సు (ప్రస్తుతం 18 సం||రాలు) పొందిన అందరికీ ఓటుహక్కు ఉంది. దీనినే సార్వజనీన వయోజన ఓటుహక్కు అంటారు.
→ పార్లమెంటరీ వ్యవస్థ : శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహకశాఖ ఏర్పడే వ్యవస్థ.
→ అధ్యక్ష తరహా వ్యవస్థ : కార్యనిర్వాహక శాసనశాఖకు బాధ్యత వహించదు.
→ స్థానిక ప్రభుత్వం : స్థానిక (జిల్లా, మండల, గ్రామ, పట్టణ) స్థాయిలో పనిచేసే ప్రభుత్వం స్థానిక ప్రభుత్వం.
→ మెజారిటీ పాలన : ప్రజాస్వామ్యంలోని ప్రధాన సూత్రాలలో ఇది ఒకటి. ఎన్నికైన ప్రజాప్రతినిధులు (కూడా) నిర్ణయాలు తీసుకునేటప్పుడు మెజారిటీ విధానాన్ని అమలుపరుస్తారు.