AP 6th Class Telugu Important Questions Chapter 11 డూడూ బసవన్న

These AP 6th Class Telugu Important Questions 11th Lesson త్రిజట స్వప్నం will help students prepare well for the exams.

AP State Syllabus 6th Class Telugu 11th Lesson Important Questions and Answers డూడూ బసవన్న

6th Class Telugu 11th Lesson డూడూ బసవన్న Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

పరిచిత గద్యాలు

1. కింది పరిచిత గద్యభాగాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

గంగిరెద్దాట చాలా ప్రాచీనమయిందని చెప్పుకోవచ్చు. పరమేశ్వరుడంతటివాడు తన నందిచేత ఈ ఆట ఆడించాడు. మరి మహాచక్రవర్తులూ, యవన రాజులూ, రాజులూ, దేశమంతా చిత్తువత్తుగా ఉన్న రోజుల్లో ఈ ఆట మరింత దేదీప్యమానంగా ఉండేదేమో ! ఎందుకనంటే, అప్పట్లో వెలువడిన పుస్తకాలు చూస్తూ ఉంటే వాటిల్లోని రాకుమారులూ, ‘రాజకుమార్తెలూ ఈ గంగిరెద్దాటలు చూసి ఆనందించిన ఘట్టాలు కనిపిస్తాయి. ప్రారంభంలో ఇదొక వినోద క్రీడగా మొదలయినా, రానురాను గంగిరెద్దును ఆడించడం వొక వృత్తిగా మార్పు చెందింది. ఇప్పుడా వృత్తికి తిలోదకాలివ్వవలసి వచ్చిందంటున్నాడు బసవయ్య.
ప్రశ్నలు – జవాబులు:
అ) పరమేశ్వరుడు దేని చేత గంగిరెద్దాట ఆడించాడు?
జవాబు:
పరమేశ్వరుడు నంది చేత గంగిరెద్దాట ఆడించాడు.

ఆ) గంగిరెద్దాట ఎప్పుడు దేదీప్యమానంగా ఉండేది?
జవాబు:
మహా చక్రవర్తులూ, యవనరాజులూ, రాజులూ, దేశమంతా చిత్తువత్తుగా ఉన్న రోజుల్లో గంగిరెద్దాట దేదీప్యమానంగా ఉండేది.

ఇ) ప్రారంభంలో గంగిరెద్దాట ఎలా ఉండేది?
జవాబు:
ప్రారంభంలో గంగిరెద్దాట వినోదక్రీడగా ఉండేది.

ఈ) గతంలో ఉన్న పుస్తకాలు చూస్తే ఏమి తెలుస్తుంది?
జవాబు:
గతంలో ఉన్న పుస్తకాలు చూస్తే రాకుమారులు, రాజ కుమార్తెలూ గంగిరెద్దాట చూసి ఆనందించినట్లు తెలుస్తుంది.

AP 6th Class Telugu Important Questions Chapter 11 డూడూ బసవన్న

2. కింది పరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

“పోలేరమ్మ గుడి దగ్గరో, బొడ్డురాయి దగ్గరో ‘గడి’ వేసే వాళ్ళమండి. రెండుమూడు వందలమంది దాకా, చుట్టూ చేరేవారు. ఎద్దుచేత రకరకాల మోళీలు వేయించేవాడు మా నాన్న. ఆ ఎద్దు ముంగాళ్ళు వంచి, ముందుకు నడుస్తుంది. వెనక్కు జరుగుతుంది. ఒంటికాలితో దణ్నం పెడుతుంది. ‘కాదు’, ‘అవును’ అని తలతో సైగ చేసేది. రాండోలు వాయిద్యానికి అనుగుణంగా గంతులు వేసేది, అలిగేది, కోపగించుకొనేది. ఆనందంతో చిందులు తొక్కేది. కోపంతో కాలు దువ్వి, తోకమట్ట ఎగబట్టి, రంకెలు వేసేది. ఏ పని చేయమంటే, ఆ పని, సుబ్బరంగా చేసేదండీ” అన్నాడు బసవయ్య.
ప్రశ్నలు – జవాబులు:
అ) గడి ఎక్కడ వేసేవాళ్ళు?
జవాబు:
గడి పోలేరమ్మ గుడిదగ్గరో, బొడ్డురాయి దగ్గరో వేసేవారు.

ఆ) బసవయ్య నాన్న ఎద్దు చేత ఏమి వేయించేవాడు?
జవాబు:
బసవయ్య నాన్న ఎద్దుచేత మోళీలు వేయించేవాడు.

ఇ) ఎద్దు దేనికి అనుగుణంగా గంతులు వేసేది?
జవాబు:
ఎద్దు రాండోలు వాయిద్యానికి అనుగుణంగా గంతులు వేసేది.

ఈ) గంగిరెద్దు చేసే రెండు పనులు చెప్పండి.
జవాబు:
గంగిరెద్దు ముంగాళ్ళు వంచి ముందుకు, వెనక్కు జరుగుతుంది. ఒంటికాలితో దణ్ణం పెడుతుంది.

3. కింది పరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

“పోటీలుపడి ఆడించే వాళ్ళు బాబయ్యా ! పాతపంచెలు, ఉత్తరీయాలు, చొక్కాలు, చీరెలు, రవికెలు, మూటెడు దొరికేవి. గంగిరెద్దుకీ, ఆవుకూ మేతా, దాణా – ఊరివాళ్ళు పోటీలమీద పంపించేవారు… క్రమంగా, చూస్తూ చూస్తూ ఉండగానే ఆ కాలం కళ్ళముందే దాటిపోయిందండీ ! బస్తీల మొఖం చూసి, ఎన్నేళ్ళయిందోనండీ ! మరీ మారుమూల పల్లెటూళ్ళను పట్టుకుని వేళ్ళాడుతున్నాం. ఇదివరకు చాటలో గింజలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు గుప్పెళ్ళతో వేస్తున్నారు. లేదా 5 పైసలో 10 పైసలో పడేస్తున్నారు. నా తమ్ముళ్ళందరూ, కూలిపనో, నాలిపనో చేసుకుంటున్నారు. ఇదిగో నేనూ, మా లింగమయ్యా మాత్రం, ఇంకా బసవదేవుల్ని నమ్ముకొని బతుక్కొస్తున్నాం….
ప్రశ్నలు – జవాబులు:
అ) గంగిరెద్దుల వాళ్ళకు ఏమి పంపించేవారు?
జవాబు:
గంగిరెద్దుల వాళ్ళకు పాతపంచెలు, ఉత్తరీయాలు, చొక్కాలు, చీరెలు, రవికెలు మొదలయినవి పంపేవారు.

ఆ) బసవయ్య దేని ముఖం చూడలేదని బాధపడ్డాడు?
జవాబు:
బసవయ్య బస్తీ ముఖం చూడలేదని బాధపడ్డాడు.

ఇ) గంగిరెద్దు వాళ్ళకు ఇప్పుడెంత డబ్బు పడేస్తున్నారు?
జవాబు:
గంగిరెద్దువాళ్ళకు ఇప్పుడు 5 పైసలో, 10 పైసలో పడేస్తున్నారు.

ఈ) బసవయ్యతో పాటు గంగిరెద్దును నమ్ముకొని బతికేది ఎవరు?
జవాబు:
బసవయ్యతో పాటు లింగమయ్య గంగిరెద్దును నమ్ముకొని బతుకుతున్నాడు.

అపరిచిత గద్యాలు

1. కింది అపరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు నిర్మించడం కాదు. పౌరుని నైతిక అభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి. ఆలోచనలే ప్రగతిని సాధిస్తాయి. భవిష్యత్తును దివ్యంగా దర్శింపచేస్తాయి. ఆలోచనా రహితంగా వుండటమే వ్యక్తిని గాని, సంస్థను గాని, దేశాన్ని గాని నాశనం చేస్తాయి. జాగృతపరచబడిన యువత మేధాబలమే దేశాన్ని తీర్చిదిద్దడానికి కావలసిన అత్యంత శక్తివంతమైన ఐశ్వర్యం.
ప్రశ్నలు – జవాబులు:
అ) దేశాభివృద్ధి ఎలా లభిస్తుంది?
జవాబు:
పౌరుని నైతిక అభివృద్ది నిజమైన దేశాభివృద్ధి.

ఆ) ఏవి ప్రగతిని సాధిస్తాయి?
జవాబు:
ఆలోచనలు ప్రగతిని సాధిస్తాయి.

ఇ) ఆలోచనా రహితంగా ఉంటే ఏమౌతుంది?
జవాబు:
ఆలోచనా రహితంగా వుండటమే వ్యక్తిని గాని, సంస్థను గాని, దేశాన్ని గాని నాశనం చేస్తాయి.

ఈ) అత్యంత శక్తివంతమైన ఐశ్వర్యం ఏమిటి?
జవాబు:
జాగృతపరచబడిన యువత మేధాబలమే అత్యంత శక్తివంతమైన ఐశ్వర్యం.

AP 6th Class Telugu Important Questions Chapter 11 డూడూ బసవన్న

2. కింది అపరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

అంధుల ప్రపంచానికి లిపి ద్వారా చిరస్మరణీయుడు “లూయీ బ్రెయిల్”. లూయీ మేధాసంపత్తికి, ఆయన | చేసిన అవిరళ కృషికి ఫ్రాన్స్ వారు ఆయన లిపిని అధికార లిపిగా గుర్తించారు. 1852 సంవత్సరంలో తమ దేశపు గొప్పబిడ్డగా ఫ్రాన్సి జాతి నివాళులు అర్పించింది. బ్రెయిల్ లిపి నేటికి 160 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అన్ని దేశాలలోను బ్రెయిలీ లిపినే ఉపయోగిస్తున్నారు. అంధుల లిపి కోసం లూయీ బ్రెయిల్ చేసిన కృషి చిరస్మరణీయం.
ప్రశ్నలు – జవాబులు:
అ) అంధుల ప్రపంచానికి ఎవరు చిరస్మరణీయుడు?
జవాబు:
అంధుల ప్రపంచానికి “లూయీ బ్రెయిల్” తన లిపి ద్వారా చిరస్మరణీయుడు.

ఆ) ఏ సంవత్సరంలో ఫ్రాన్స్ జాతి లూయీకి నివాళులర్పించింది?
జవాబు:
1852వ సంవత్సరంలో తమ దేశపు గొప్ప బిడ్డగా ఫ్రాన్స్ జాతి నివాళులర్పించింది.

ఇ). బ్రెయిలీ లిపి నేటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది?
జవాబు:
బ్రెయిల్ లిపి నేటికి 160 సంవత్సరాలు పూర్తిచేసుకుంది.

ఈ) ఎక్కడ బ్రెయిలీ లిపిని ఉపయోగిస్తున్నారు?
జవాబు:
అన్ని దేశాలవారు బ్రెయిల్ లిపిని ఉపయోగిస్తున్నారు.

3. కింది అపరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

కావేరీ నది పడమటి కనుమలలో ‘మెర్కారా’ వద్ద పుట్టి 500 మైళ్ళు తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. సాగర సంగమానికి ముందుగా 125 మైళ్ళ దూరాన పాయలై డెల్టాగా ఏర్పడింది. కావేరీ డెల్టా శిఖరానికి 18 మైళ్ళ ఎగువన ఈ నది రెండు పాయలయింది. ఉత్తర ముఖంగా వెళ్ళిన పాయను ‘కానిరూన్’ అని, దక్షిణ పాయను ‘కావేరి’ అని పిలుస్తారు. 20 మైళ్ళు ప్రవహించిన తరువాత ఈ కానిరూన్ శాఖ తిరిగి కావేరి శాఖలో కలిసిపోతుంది. ఈ శాఖ విడిపోయిన స్థలం నుండి కలిసిన చోటుకు మధ్య ‘శ్రీరంగ’ మనే ద్వీపం ఏర్పడింది.
ప్రశ్నలు – జవాబులు:
అ) కావేరినది ఎక్కడ పుట్టింది?
జవాబు:
కావేరీ నది పడమటి కనుమలలో మెర్కారా వద్ద పుట్టింది.

ఆ) కావేరినది ఎంత దూరం ప్రవహిస్తుంది?
జవాబు:
కావేరీ నది 500 మైళ్ళు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది.

ఇ) కావేరినది రెండు పాయల పేర్లేమి?
జవాబు:
ఉత్తర ముఖంగా వెళ్ళిన పాయ ‘కానిరూన్’, దక్షిణ ముఖంగా వెళ్ళిన పాయ ‘కావేరి’.

ఈ) కావేరి శాఖ విడిపోయి మళ్ళీ కలిసిన చోటుకు మధ్యలో ఏర్పడిన ద్వీపమేమిటి?
జవాబు:
శ్రీరంగ ద్వీపము.

4. కింది అపరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

వర్తమానంలోని ప్రతీ క్షణాన్ని ఆనందంగా శ్వాసిస్తూ జీవిస్తే గుండె పదిలంగా ఉంటుందని బ్రౌన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆ క్షణంలో తాము చేసే పనిపట్ల అంటే తినే తిండి, మాట్లాడే మాటా, ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తించడం ఇలా ఏదైనా గానీ దానిపట్ల పూర్తి స్పృహను కలిగి ఉండాలి. జీవించే ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలి. అంటే తమ జీవన విధానం గురించి పూర్తి అవగాహనను కలిగి ఉండాలి అంటున్నారు. అలా ఉండేవాళ్ళలో ఎలాంటి ఒత్తిడి ఉండదు.
ప్రశ్నలు – జవాబులు:
అ) గుండె ఎలా ఉంటే పదిలంగా ఉంటుంది?
జవాబు:
ప్రతీక్షణాన్ని ఆనందంగా శ్వాసిస్తూ జీవిస్తే గుండె పదిలంగా ఉంటుంది.

ఆ) అలాగని ఎవరు చెప్పారు?
జవాబు:
బ్రౌన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్పారు.

ఇ) దేనిపట్ల స్పృహ కలిగి ఉండాలి?
జవాబు:
చేసే ఏ పని పట్ల ఐనా పూర్తి స్పృహ కలిగి ఉండాలి.

ఈ) దేని గురించి అవగాహన కలిగి ఉండాలి?
జవాబు:
తమ జీవన విధానం గురించి అవగాహన కలిగి ఉండాలి.

AP 6th Class Telugu Important Questions Chapter 11 డూడూ బసవన్న

5. కింది అపరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

టీ 20 క్రికెట్ అక్కడ ఆటగాళ్ళస్థాయితో సంబంధం లేదు. కొమ్ములు తిరిగిన బౌలర్లకు కూడా, కొత్తగా వచ్చిన కుర్రాళ్ళు చుక్కలు చూపిస్తారు. బాల్ ఏదైనా అవలీలగా బ్యాట్స్మ న్ బౌండరీ దాటించేస్తారు. బంతిని చూడు సిక్సర్ కొట్టు ఇదే ఆటగాళ్ళ మంత్రం. ఇదే ట్వంటీ ట్వంటీ నినాదం. 13 సంవత్సరాలలో ఆటగాళ్ళు టీ 20 ద్వారా సూపర్ స్టార్లు అయ్యారు. నత్తనడకన సాగే క్రికెట్ రాకెట్ వేగాన్ని అందుకుంది.
ప్రశ్నలు – జవాబులు:
అ) దేనికి ఆటగాళ్ళ స్థాయితో సంబంధం లేదు?
జవాబు:
టీ 20 క్రికెట్ కు ఆటగాళ్ళ స్థాయితో సంబంధం లేదు.

ఆ) ఎవరు ఎవరికి చుక్కలు చూపిస్తారు?
జవాబు:
కొత్తగా వచ్చిన కుర్రాళ్ళు కొమ్ములు తిరిగిన బౌలర్లకి చుక్కలు చూపెడతారు.

ఇ) టీ ట్వంటీ నినాదం ఏమిటి?
జవాబు:
బంతిని చూడు సిక్సర్ కొట్టు.

ఈ) నత్తనడకన సాగే క్రికెట్ ఇపుడు ఎలాగ ఉంది?
జవాబు:
నత్త నడకన సాగే క్రికెట్ ఇపుడు రాకెట్ వేగాన్ని అందుకుంది.

6. కింది అపరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

కొన్ని కుటుంబాలు, కొందరు గ్రామస్తులూ కోట్ల రూపాయలు అందుకోవడం కొంత ఆశ్చర్యమనిపించినా ఇది నిజం. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ దగ్గర్లో ఉన్న సనంలో ఇలాంటివారెందరో. ఊళ్ళో ఒకళ్ళిద్దరు కోటీశ్వరులుండటం గొప్ప. కానీ ఈ గ్రామంలో నాలుగు వందల మంది కోటీశ్వరులున్నారు. వీరిలో నూట ఇరవై మంది వరకూ మహిళలున్నారు.
ప్రశ్నలు – జవాబులు :
అ) ఏమిటి ఆశ్చర్యము?
జవాబు:
కొన్ని కుటుంబాలు, కొందరు గ్రామస్తులు కోట్ల రూపాయలు అందుకోవడం కొంత ఆశ్చర్యం.

ఆ) సనంలో ఎంతమంది కోటీశ్వరులున్నారు?
జవాబు:
సనంద్ లో నాలుగు వందల మంది కోటీశ్వరులున్నారు.

ఇ) ఎంతమంది మహిళా కోటీశ్వరులున్నారు?
జవాబు:
సనంలో నూట ఇరవై మంది మహిళా కోటీశ్వరులున్నారు.

ఈ) సనంద్ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది?
జవాబు:
సనంద్ గ్రామం గుజరాత్ రాష్ట్రంలో ఉంది.

AP 6th Class Telugu Important Questions Chapter 11 డూడూ బసవన్న

7. క్రింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

వర్తమానంలోని ప్రతీ క్షణాన్ని ఆనందంగా శ్వాసిస్తూ జీవిస్తే గుండె పదిలంగా ఉంటుందని బ్రౌన్ విశ్వ విద్యాలయ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆ క్షణంలో తాము చేసే పనిపట్ల అంటే తినే తిండి, మాట్లాడే మాటా, ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తించడం ఇలా ఏదైనా గానీ దానిపట్ల పూర్తి స్పృహను కలిగి ఉండాలి. జీవించే ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. అంటే తమ జీవనవిధానం గురించి పూర్తి అవగాహనను కలిగి ఉండాలి అంటున్నారు. ఇలా ఉండే వాళ్లలో ఎలాంటి ఒత్తిడి ఉండదు.
ప్రశ్నలు – జవాబులు:
అ) గుండె గురించి పరిశోధన చేసిన విశ్వవిద్యాలయమేది?
జవాబు:
గుండె గురించి బ్రౌన్ విశ్వవిద్యాలయం పరిశోధనలు చేసింది.

ఆ) మనం తినే తిండి పట్ల ఎలా ఉండాలి?
జవాబు:
మనం తినే తిండి పట్ల స్పృహ కలిగి ఉండాలి.

ఇ) దేనిని ఆస్వాదించాలి?
జవాబు:
ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి.

ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్నను తయారు చేయండి.
జవాబు:
జీవనవిధానంపై అవగాహన కలిగి ఉండడం వలన ప్రయోజనం ఏమిటి?

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
డూడూ బసవన్న పాఠ్యభాగ రచయితను గురించి వ్రాయండి.
జవాబు:
‘డూడూ బసవన్న’ పాఠము రావూరి భరద్వాజ గారు రచించిన ‘జీవన సమరం’ అనే ‘వ్యధాప్త జీవుల యథార్థ గాథలు’ అనే పుస్తకం నుంచి గ్రహించబడింది. ఆయన 05.07.1927న గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. ఆయన 37 కథా సంపుటాలు, 43 పిల్లల కథలు, 17 నవలలు రచించారు. ఆయన రచించిన ‘పాకుడురాళ్ళు’ నవలకు ‘జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఆయనకు కళాప్రపూర్ణ, కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం, కళారత్న మొదలైన పురస్కారాలు అనేకం లభించాయి.

ప్రశ్న 2.
బసవయ్య గురించి వ్రాయండి.
జవాబు:
బసవయ్యది చాలా పెద్ద కుటుంబం. ఆరుగురు అన్నదమ్ములలో బసవయ్య పెద్దవాడు. తండ్రి వెంట ఊరూరూ తిరిగేవాడు. తండ్రిని చాలా జాగ్రత్తగా గమనించేవాడు. తండ్రి మాటలను, పద్ధతుల్ని చిన్నతనం నుండి అనుకరించేవాడు. గంగిరెద్దాటలోని మెలుకువలన్నీ నేర్చుకున్నాడు. గంగిరెద్దు చేత తండ్రి మోళీ వేయిస్తుంటే బసవయ్య ఆ మోళీకి అనుగుణంగా రాండోలు వాయించేవాడు. రాండోలును వాయించటానికి రెండు చేతులలోను రెండు కర్రలను పట్టుకునేవాడు. ఒక కర్రతో డోలు చర్మాన్ని రాపాడించేవాడు. మరో కర్రతో రెండో వైపున వరసలు వాయించేవాడు. తన తండ్రి, తన చిన్నాన్నలతో కలిసి ‘బసవయ్య కొన్ని వందల ఊళ్ళు తిరిగాడు. బసవయ్య సన్నాయి కూడా వాయించేవాడు.

AP 6th Class Telugu Important Questions Chapter 11 డూడూ బసవన్న

ప్రశ్న 3.
గంగిరెద్దుల్ని ఎలా తయారుచేసేవారు?
జవాబు:
సాధారణంగా గంగిరెద్దుల్ని కొనరు. తప్పుడు సుడులున్న గిత్తల్ని, పొగరుబోతు గిత్తల్ని, పోట్ల కోడెల్ని గంగిరెద్దుల .. వాళ్ళకు ఇచ్చేస్తారు. దానికి గంగిరెద్దుల వాళ్ళు ముక్కుతాడు వేస్తారు. మూతికి చిక్కం కడతారు. కాళ్ళకు బంధాలు వేసి దానిని తమదారికి తెచ్చుకుంటారు. ఒక్కొక్క గిత్తకు మూడు నాలుగు నెలలకు విద్యలన్నీ వస్తాయి. కొన్ని పొగరుబోతు గిత్తలు గంగిరెద్దుగా తయారు కావడానికి ఏడెనిమిది నెలలు కూడా పడుతుంది. కొన్ని ఎద్దులయితే, పూర్తిగా గంగిరెద్దాట నేర్చుకుని కూడా ప్రదర్శించేటపుడు మొండికేస్తాయి.

ప్రశ్న 4.
‘ఈ విద్య నాతోనే ఆఖరు సార్’, అని బసవయ్య పలికిన దానిని బట్టి నీవేమి గ్రహించావు?
జవాబు:
గంగిరెద్దాటకు ఈ రోజులలో ఆదరణ లేదు. వారికి బ్రతకటమే కష్టమౌతోంది. పల్లెటూళ్ళల్లో కూడా పట్నపు వాతావరణం వచ్చేస్తోంది. గంగిరెద్దులను ఆడించేవారిని చులకనగా చూస్తున్నారు. వారిని కూడా సామాన్యమైన బిచ్చగాళ్ళ వలె పరిగణిస్తున్నారు. బసవయ్యకు తన తండ్రి నుంచి గంగిరెద్దాట వారసత్వంగా వచ్చింది. కానీ ప్రస్తుత పరిస్థితులలో అతని పిల్లలెవరూ గంగిరెద్దాటను వృత్తిగా స్వీకరించటానికి అంగీకరించి ఉండరు. అందుచేతనే . ‘ఈ విద్య నాతోనే ఆఖరు సార్’ అని అన్నాడు.

ప్రశ్న 5.
రచయితతో మాట్లాడుతున్నప్పుడు బసవయ్య కళ్ళు నీటితో ఎందుకు నిండిపోయాయి?
జవాబు:
తన తండ్రి దగ్గర గంగిరెద్దాటను నేర్చుకునేందుకు బసవయ్య చాలా కష్టపడ్డాడు. గంగిరెద్దాటతో చాలా ఊళ్ళు తిరిగాడు. ఆ విద్యతో ఎంతోమందిని ఆనందపరిచాడు. ఎంతోమంది అభిమానాన్ని సంపాదించాడు. విలువయిన బహుమతులు పొందాడు. గంగిరెద్దాట వలన ఎన్నో ఊళ్ళల్లో ఎంతోమందితో పరిచయాలు ఏర్పడ్డాయి. తన తమ్ముళ్ళను తీర్చిదిద్దాడు. తండ్రికి ఆసరాగా నిలబడ్డాడు. కుటుంబాన్ని పోషించుకున్నాడు. తన పిల్లలను తీర్చి దిద్దుకున్నాడు. తనను బ్రతికించిన కళకు ఆదరణ లేదని తెలిసేసరికి తట్టుకోలేకపోయాడు. తన తరువాతి తరాలలో కూడా, ఎవ్వరూ ఆ కళను నేర్చుకోకపోవడంతో నిరాశ చెందాడు. మహోన్నతమైన గంగిరెద్దాట తన వంశంలో తనతోటే అంతమయిపోతోందని తెలుసుకొని అతని గుండె తల్లడిల్లింది. అతని కళ్ళు నీటితో నిండాయి.

ప్రశ్న 6.
మీకు నచ్చిన ఒక కళాకారుడి గురించి మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

విశాఖపట్నం,
xxxxx.

ప్రియమైన కరుణ్ కు,

వరుణ్ వ్రాయు లేఖ.

ఇక్కడంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలచెదను.

నేనీ మధ్య ఆదిభట్ల నారాయణ దాసుగారి గురించి చదివాను. ఆయన హరికథా కళాకారుడు. సంగీతం, సాహిత్యం , నృత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియను సృష్టించారు. ఆయన ‘హరికథా పితామహుడు’ అనే బిరుదుతో ప్రఖ్యాతి గాంచారు. ఆయన సంస్కృతంలోనూ, తెలుగులోనూ చాలా రచనలు చేశారు. ఆయన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. ఇతర రాష్ట్రాలలో కూడా చాలా హరికథలు చెప్పారు. హరికథ చెప్పేవారెవరైనా ఇప్పటికీ ఆయనను గురువుగా భావించి నమస్కరించి, హరికథ ప్రారంభించడం హరికథా సంప్రదాయంగా సాగుతోంది. ఆయన 1864 నుండి 1945 వరకు జీవించారు.

రిప్లై రాయి. ఉంటాను మరి.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి. వరుణ్ వ్రాలు.

చిరునామా :
టి. కరుణ్, 6వ తరగతి,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల,
అనంతపురం,
అనంతపురం జిల్లా.

ప్రశ్న 7.
ఒక ‘జానపద కళాకారుడి ఆత్మకథ రాయండి.
జవాబు:
జానపద కళాకారుడు

పిల్లలూ ! నేనొక జానపద కళాకారుడిని. ఈ ఆధునిక పోకడలతో మమ్మల్నెవ్వరూ పట్టించుకొనేవారే లేరు. ఇప్పుడు పూటగడవడమే కష్టంగా ఉంది. పూర్వకాలం అయితే మాకు చాలా ఆదరణ ఉండేది. మా ప్రదర్శన రీతుల గురించి, మా సంప్రదాయాల గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. పరిశోధకులు కూడా తాము పట్టాలు సంపాదించడానికి అవసరమైనంతవరకు పరిశోధించారు. మేము కిన్నెర తంత్రీవాద్యం, కడ్డీ తంత్రీ వాద్యం, నాగస్వరం, చర్మవాద్యం, విల్లుపాద్యం ఇవన్నీ మన తెలుగువారి ప్రత్యేక వాద్యాలు. వీటిని ఉపయోగించి నాలుగైదు రోజులు కథలు చెప్పేవాళ్లం. అందులో పురాణాలు, చరిత్రలూ చాలా చెప్పేవాళ్లం. సర్లెండి. మా గురించి ఎన్నాళైనా చెబుతాను. బాగా చదువుకోండి. మీరైనా మా గురించి పూర్తిగా పరిశోధించండి.

III. భాషాంశాలు

1. పర్యాయపదాలు:

ప్రభువు = పరిపాలకుడు, పాలకుడు
బాధ = దుఃఖం, వ్యధ
క్రీడ ఆ = ఆట, కేళి
చర్మం = తోలు, అజినము
గింజ = బీజం, విత్తనం
వినోదం = ఉల్లాసం, సంతోషం
చేయి = హస్తము, కరము చర్మం
ఎద్దు = వృషభం, అనడ్వాహము

2. ప్రకృతి – వికృతులు :

పుస్తకము – పొత్తము
కష్టము – కస్తి
వృద్దు – పెద్ద
ధర్మము – దమ్మము

3. వ్యతిరేకపదాలు:

ఇస్తారు × ఇవ్వరు
కొత్త × పాత
బాధ × సంతోషం
మొదలు × చివర
కష్టం × సుఖం
ముందుకు × వెనుకకు
విద్య × అవిద్య
పెరుగుతుంది × తగ్గుతుంది
ఆచారం × అనాచారం
ప్రాచీనం × నవీనం
పెద్ద × చిన్న
తెలుసు × తెలియదు
కోపం × శాంతం

4. సంధులు:

ఇస్తారు + అంటూ = ఇస్తారంటూ – ఉత్వ సంధి
పెరుగుతు + ఉన్నపుడు = పెరుగుతున్నపుడు – ఉత్వ సంధి
మరుగు + అవుతాయి గంగిరెద్దు = మరుగవుతాయి – ఉత్వ సంధి
గంగిరెద్దు + ఆట = గంగిరెద్దాట – ఉత్వ సంధి
మొదలు + అయినా = మొదలయినా – ఉత్వ సంధి
ఇప్పుడు + ఆ = ఇప్పుడా – ఉత్వ సంధి
తిలోదకాలు + ఇవ్వడం = తిలోదకాలివ్వడం – ఉత్వ సంధి
అవగతము + అయ్యాయి = అవగతమయ్యాయి – ఉత్వ సంధి
వాయించడము + అంటే = వాయించడమంటే – ఉత్వ సంధి
వాడు + అట = వాడట – ఉత్వ సంధి
తిరిగాము + అన్నాడు = తిరిగామన్నాడు – ఉత్వ సంధి
పోలేరు + అమ్మ = పోలేరమ్మ – ఉత్వ సంధి
జరగదు + అన్నాడు = జరగదన్నాడు – ఉత్వ సంధి
వారు + అట = వారట – ఉత్వ సంధి
ఏడు + ఎనిమిది = ఏడెనిమిది – ఉత్వ సంధి
బాబు + అయ్యా = బాబయ్యా – ఉత్వ సంధి
ఎన్నేళ్లు + అయిందో = ఎన్నేళ్లయిందో – ఉత్వ సంధి
తమ్ముళ్లు + అందరూ = తమ్ముళ్లందరూ – ఉత్వ సంధి
ఊరు + అంటూ = ఊరంటూ – ఉత్వ సంధి
ప్రభువులు + ఉంటే = ప్రభువులంటే – ఉత్వ సంధి
వచ్చింది + అంటున్నారు = వచ్చిందంటున్నారు – ఇత్వ సంధి
మరి + ఓ = మరో – ఇత్వ సంధి
పోయింది +అండీ = పోయిందండీ – ఇత్వ సంధి
ఎన్ని + ఏళ్లు = ఎన్నేళ్లు – ఇత్వ సంధి
వాడికి + ఒక = వాడికొక – ఇత్వ సంధి
మరి + ఒక = మరొక – ఇత్వ సంధి
ఇది + ఒక = ఇదొక – ఇత్వ సంధి
జరగదు + అన్నాడు = జరగదన్నాడు – ఉత్వ సంధి
బసవ + అన్న = బసవన్న – అత్వ సంధి
ఉన్న + అప్పుడు = ఉన్నప్పుడు – అత్వ సంధి
బసవ + అయ్య = బసవయ్య – అత్వ సంధి
చిన్న +అప్పటి = చిన్నప్పటి – అత్వ సంధి
మూట + ఎడు = మూటెడు – అత్వ సంధి

5. ఈ క్రింది ప్రశ్నలకు సరైన జవాబులను బ్రాకెట్లలో గుర్తించండి.

1. ప్రాచీనకాలంలో ఇప్పుడున్న సదుపాయాలేవీ లేవు. (అర్థాన్ని గుర్తించండి)
అ) నవీనకాలం
ఆ) పూర్వకాలం
ఇ) ఆధునిక కాలం
జవాబు:
అ) నవీనకాలం

2. గంగిరెద్దు ముంగాళ్ల మీద వంగుతుంది. (అర్థాన్ని గుర్తించండి)
అ) ముందరి కాళ్లు
ఆ) మోకాళ్లు
ఇ) వెనుక కాళ్లు
జవాబు:
అ) ముందరి కాళ్లు

AP 6th Class Telugu Important Questions Chapter 11 డూడూ బసవన్న

3. జీవితం ఒక క్రీడ. (అర్థాన్ని గుర్తించండి)
అ) ఆట
ఆ) పాట
ఇ) కళ
జవాబు:
అ) ఆట

4. కష్టం వచ్చినపుడు బాధతో కుంగిపోకూడదు. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) లేమి, దరిద్రం
ఆ) అప్పు, ఋణం
ఇ) వ్యధ, దుఃఖం
జవాబు:
ఇ) వ్యధ, దుఃఖం

5. చేయి కాలాక ఆకులు పట్టుకోవడం వృథా. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) హస్తము, కరము
ఆ) కాలు, పాదం
ఇ) పని, ఇల్లు
జవాబు:
అ) హస్తము, కరము

6. కొందరికి చర్మం పెళుసుగా ఉంటుంది. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) ఎముక, అస్థి
ఆ) తోలు, అజినము
ఇ) తోలు, ముఖం
జవాబు:
ఆ) తోలు, అజినము

7. మన ఆచారం మనం వదలకూడదు. (వ్యతిరేక పదం గుర్తించండి)
అ) సదాచారం
ఆ) దురాచారం
ఇ) అనాచారం
జవాబు:
ఇ) అనాచారం

8. కొత్త ఒక వింత. (వ్యతిరేక పదం గుర్తించండి)
అ) పాత
ఆ) సరికొత్త
ఇ) నవీనం
జవాబు:
అ) పాత

AP 6th Class Telugu Important Questions Chapter 11 డూడూ బసవన్న

9. విద్య కోసం ఎంత కష్టమైనా భరించాలి. (వ్యతిరేక పదం గుర్తించండి)
అ) అవిద్య
ఆ) నిరక్షరాస్యులు
ఇ) అక్షరాస్యులు
జవాబు:
అ) అవిద్య

10. పుస్తకములను జాగ్రత్తగా ఉంచుకోవాలి. (వికృతిని గుర్తించండి)
అ) పుత్తకము
ఆ) పొత్తము
ఇ) పొత్తకము
జవాబు:
ఆ) పొత్తము

11. పెద్దవారిని గౌరవించాలి. (ప్రకృతిని గుర్తించండి)
అ) తండ్రి
ఆ) తాత
ఇ) వృద్ధు
జవాబు:
ఇ) వృద్ధు

12. కష్టమునకు తగిన ఫలితం ఎప్పుడూ ఉంటుంది. (వికృతిని గుర్తించండి)
అ) కస్తి
ఆ) కట్టము
ఇ) కష్టము
జవాబు:
అ) కస్తి

13. ఎవరో ఇస్తారని ఆశించకు. (సంధి విడదీసిన రూపం గుర్తించండి)
అ) ఇస్తార + అని
ఆ) ఇస్తారు + అని
ఇ) ఇస్తా + రని
జవాబు:
ఆ) ఇస్తారు + అని

14. ఎన్నేళ్లు ఎదురుచూశానో ! (సంధి పేరు గుర్తించండి)
అ) అత్వ సంధి
ఆ) ఉత్వ సంధి
ఇ) ఇత్వ సంధి
జవాబు:
ఇ) ఇత్వ సంధి

15. బసవన్న అంటే నందీశ్వరుడే. (సంధి పేరు గుర్తించండి)
అ) అత్వ సంధి
ఆ) ఇత్వ సంధి
ఇ) ఉత్వ సంధి
జవాబు:
అ) అత్వ సంధి

16. అనాథ శరణాలయమునకు విరాళం ఇవ్వాలి. (సంధి విడదీసిన రూపం గుర్తించండి)
అ) శరణా + లయం
ఆ) శరణా + ఆలయం
ఇ) శరణ + ఆలయం
జవాబు:
ఇ) శరణ + ఆలయం

AP 6th Class Telugu Important Questions Chapter 11 డూడూ బసవన్న

17. రావణ + ఈశ్వరుడు మరణించాడు. (సంధి కలిపిన రూపం గుర్తించండి)
అ) రావణీశ్వరుడు
ఆ) రావణేశ్వరుడు
ఇ) రావణాఈశ్వరుడు
జవాబు:
ఆ) రావణేశ్వరుడు

18. డబ్బు వలన సుఖశాంతులు రావు. (సమాసం పేరును గుర్తించండి)
అ) ద్వంద్వ సమాసం
ఆ) ద్విగు సమాసం
ఇ) బహువ్రీహీ
జవాబు:
అ) ద్వంద్వ సమాసం

19. ఆంధ్రుల కీర్తి దశదిశలూ వ్యాపించాలి. (సమాసం పేరు గుర్తించండి)
అ) బహువ్రీహి
ఆ) ద్వంద్వం
ఇ) ద్విగువు
జవాబు:
ఇ) ద్విగువు

20. అటు వెళ్లకండి. (ఇది ఏ వాక్యమో గుర్తించండి)
అ) ప్రశ్నార్థకం
ఆ) నిషేధార్థకం
ఇ) అనుమత్యర్థకం
జవాబు:
ఆ) నిషేధార్థకం

21. దీర్ఘాయుష్మాన్ భవ ! (ఇది ఏ వాక్యమో గుర్తించండి)
అ) ఆశీరర్థకం
ఆ) విధ్యర్థకం
ఇ) నిషేధార్థకం
జవాబు:
అ) ఆశీరర్థకం

22. అక్కడికి వెళ్లావా? (ఇది ఏ రకం వాక్యమో గుర్తించండి)
అ) ఆశ్చర్యార్థకం
ఆ) అనుమత్యర్థకం
ఇ) ప్రశ్నార్థకం
జవాబు:
ఇ) ప్రశ్నార్థకం

23. నీవు హాయిగా ఆడుకోవచ్చు. (ఇది ఏ రకమైన వాక్యం)
అ) అనుమత్యర్థకం
ఆ) ఆశ్చర్యార్థకం
ఇ) ఆశీరకం
జవాబు:
అ) అనుమత్యర్థకం

24. ఆహా ! ప్రకృతి ఎంత అందంగా ఉందో ! (ఏ రకమైన వాక్యం)
అ) అనుమత్యర్థకం
ఆ) ఆశ్చర్యార్థకం
ఇ) ఆశీరర్థకం
జవాబు:
ఆ) ఆశ్చర్యార్థకం

AP 6th Class Telugu Important Questions Chapter 11 డూడూ బసవన్న

25. రాము పాఠశాలకు వచ్చి వెళ్లాడు. (ఏ రకమైన వాక్యం)
అ) సంయుక్తం
ఆ) చేదర్థకం
ఇ) సంశ్లిష్టం
జవాబు:
ఇ) సంశ్లిష్టం

26. అన్నదమ్ములు కలిసి ఉండాలి. (ఏ రకమైన వాక్యం)
అ) సంయుక్తం
ఆ) సంశ్లిష్టం
ఇ) చేదర్థకం
జవాబు:
అ) సంయుక్తం

27. కత్తితో యుద్ధం చేస్తారు. (విభక్తి ప్రత్యయం గుర్తించండి)
అ) తో
ఆ) యుద్ధం
ఇ) చేస్తారు
జవాబు:
అ) తో

28. రాముడు బాణాలతో రావణుని చంపాడు. (క్రియను గుర్తించండి)
అ) తో
ఆ) రాముడు
ఇ) చంపాడు
జవాబు:
ఇ) చంపాడు

29. అతను చాలా మంచివాడని అన్నారు. (సర్వనామం గుర్తించండి)
అ) చాలా
ఆ) అతను
ఇ) అన్నారు
జవాబు:
ఆ) అతను

AP 6th Class Telugu Important Questions Chapter 11 డూడూ బసవన్న

30. కిందివానిలో అసమాపక క్రియను గుర్తించండి.
అ) చేసి
ఆ) చేశాను
ఇ) చేస్తాను
జవాబు:
అ) చేసి

చదవండి – ఆనందించండి

గురి

AP 6th Class Telugu Important Questions Chapter 11 డూడూ బసవన్న 1
పూర్వం విదర్భ దేశాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన మంత్రి రాంభట్టు ఎంతో తెలివైన వాడే కాకుండా సమయస్ఫూర్తి కలవాడు. విక్రమసేనుడు అన్ని విషయాల్లో మంత్రి సలహాలను తీసుకునేవాడు.

విక్రమసేనుడికి వేటంటే చాలా ఇష్టం. సంవత్సరంలో ఏదో ఒక నెల అడవికి వెళ్లి జంతువులను వేటాడుతూ గడిపేవాడు. ఒకసారి తన పరివారాన్ని వెంటబెట్టుకుని రాజ్యానికి తూర్పు దిక్కున వున్న దట్టమైన అడవికి వెళ్లాడు. ఆయనతో పాటు మంత్రి రాంభట్టు కూడా ఉన్నాడు.

ఆ రోజు ఎంత తిరిగినా ఒక్క జంతువు కూడా కనబడలేదు. విక్రమసేనుడికి ఎంతో నిరాశగానూ, విసుగ్గానూ అని పించింది. వాళ్ళు గుడారానికి తిరిగి వస్తుండగా పచ్చిక బయలులో ఒక లేడిపిల్ల కనిపించింది. విక్రమసేనుడు వెంటనే విల్లు ఎక్కుపెట్టి గురి చూసి బాణం వదిలాడు. రివ్వున విల్లు నుండి దూసుకెళ్ళిన బాణం లేడిపిల్లకు తగులకుండా కొన్ని అంగుళాల దూరంలో చెట్టుకు తగిలింది. ప్రమాదం పసిగట్టి లేడిపిల్ల పారిపోయింది.

“భలే గురి” అంటూ ఒక సైనికాధికారి అలవాటుగా చప్పట్లు చరిచి అన్నాడు.

అసలే కోపంతో ఉన్న విక్రమసేనుడు మరింత ఉగ్రుడయ్యాడు. “నన్నే ఎగతాళి చేస్తున్నావా? ఎంత ధైర్యం” అంటూ కళ్ళెర్ర చేశాడు.

ఆ సైనికాధికారి బిక్కచచ్చిపోయాడు. తనకు శిక్ష ఖాయమనుకొని గజగజా వణికాడు. పరిస్థితిని అంచనా వేసిన రాంభట్టు కల్పించుకుని “అతను ఎగతాళి చేయడం లేదు మహారాజా! నిజమే చెప్పాడు” అని అన్నాడు.

“మీ బాణం ఎప్పుడూ క్రూర మృగాల వైపే ఎక్కుపెట్టి ఉంటుంది. అమాయకమైన చిన్న చిన్న జంతువులను మీరు వేటాడరు. ఆ లేడిపిల్లను పారిపొమ్మని మీరు బాణం వేసారు. మీ గురి తప్పకుండా బాణం లేడిపిల్లకు తగలకుండా సరిగా లేడిపిల్ల ప్రక్కనే వున్న చెట్టుకు తగిలింది. అదే మీలోని చాతుర్యం” అని వివరించాడు. దానితో విక్రమసేనుడి కోపం పోయి సంతోషంగా నవ్వాడు. తనను రక్షించినందుకు రాంభట్టు వైపు కృతజ్ఞతగా చూసాడు సైనికాధికారి.