AP 6th Class Telugu Important Questions Chapter 12 ఎంత మంచివారమ్మా….!

These AP 6th Class Telugu Important Questions 12th Lesson ఎంత మంచివారమ్మా….! will help students prepare well for the exams.

AP State Syllabus 6th Class Telugu 12th Lesson Important Questions and Answers ఎంత మంచివారమ్మా….!

6th Class Telugu 12th Lesson ఎంత మంచివారమ్మా….! Important Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

పరిచిత గద్యాలు

1. కింది పేరా చదవండి. అడిగిన విధంగా ప్రశ్నలకు జవాబులు రాయండి.

పంటల పరిరక్షకునిగా, సంఘశ్రేయస్సు భుజానికెత్తుకున్న యానాది రూపంలో నిర్మలమైన కండ్లు, విండ్లవలె తీరిన కనుబొమలు కనిపిస్తాయి. ఎంత చమురు రాసినా ఎదుగనొల్లని ఎరకల ఉంగరాలు, సన్నని పెదవులు, పలుచని పలుకబారు కట్టె శరీరాలు, పరుగుల్లో గుజ్రాలను కూడా వెనుకవేయగల లేసైన పిక్కలు, సన్నని నడుములు, అందమైన పెదవులను ఎడబాయని చిరునవ్వులు, దక్షిణదేశపు ఆదివాసులందరిలోకి యానాదులే అందగాళ్ళని అనిపిస్తే అందుకు ఎవరూ కినియ బనిలేదు.
ప్రశ్నలు – జవాబులు :
అ) యానాదుల కళ్ళు ఎలా ఉంటాయి?
జవాబు:
యానాదుల కళ్ళు నిర్మలంగా ఉంటాయి.

ఆ) యానాదుల పిక్కల ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
యానాదుల పిక్కలు పరుగుల్లో గుర్రాలను కూడా వెనుకేయగలవు.

ఇ) యానాదుల పెదవుల ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
యానాదుల పెదవుల్లో చిరునవ్వులు ఎప్పుడూ ఎడబాయవు.

ఈ) యానాదుల పాట దేనితో ముగుస్తుంది?
జవాబు:
యానాదుల కనుబొమలను వింటితో పోల్చవచ్చు.

AP 6th Class Telugu Important Questions Chapter 12 ఎంత మంచివారమ్మా….!

2. కింది పేరా చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

వీరు ప్రదర్శించే యక్షగానం బాగా గ్రామీణులను ఆకర్షిస్తుంది. యానాదుల భాగవతాన్ని చూడడానికి ఐదారుమైళ్ళ దూరం నుండి జనం వస్తారు. స్త్రీ వేషాలను కూడా మగవారే ధరిస్తారు. వేషము యొక్క నాణ్యానికి జోడు గొంతు యొక్క మాధుర్యము పండిత పామరులను సైతం ఆకర్షిస్తుండేవి. యువతుల గొబ్బిపాటలు అంత శ్రావ్యంగాను, ఆటలు మరింత రమ్యంగాను, నటన అంత గంభీరంగాను ఉంటాయి. యానాది స్త్రీలకు తెలిసినన్ని పాటలు ఇతరులకు అంతగా తెలియవు, వారు పాడే పాటల్లో “వస్తా పదరా రస్తా పనికి” అని మొదలు పెట్టి పాడుతూ “ధనము దాచుట దొంగతనము” అని పాటను ముగిస్తుంటారు.
ప్రశ్నలు – జవాబులు:
అ) యానాదులు ప్రదర్శించే ఏ కళలు ప్రజలను ఆకర్షిస్తాయి?
జవాబు:
యానాదుల యక్షగానం, భాగవతం ప్రజలను బాగా ఆకర్షిస్తాయి.

ఆ) యానాదుల యక్షగానాల్లో స్త్రీ పాత్రలను ఎవరు ధరిస్తారు?
జవాబు:
యానాదుల యక్షగానాల్లో స్త్రీ పాత్రలను పురుషులే ధరిస్తారు.

ఇ) యువతుల గొబ్బిపాటలు ఆటలు ఎలా ఉంటాయి?
జవాబు:
యువతుల గొబ్బిపాటలు శ్రావ్యంగా ఉంటాయి. ఆటలు రమ్యంగా ఉంటాయి.

ఈ) యానాదుల పాట దేనితో ముగుస్తుంది?
జవాబు:
యానాదుల పాట “ధనము దాచుట దొంగతనము” అనే దానితో ముగుస్తుంది.

3. కింది పేరా చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

భక్తిపరమైన భజనలు, మౌనధ్యానాలు, మంత్రతంత్రాలు యానాదిని ఆకర్షించవు. యానాదుల దైవం వెంకటేశ్వర్లు. ఆయన టెంకాయలతో, తులసిదళాలతో చులకనగా తృప్తిపడతాడని వీరి ఉద్దేశం. వీళ్ళు వేటకు వెళ్ళే ముందు కాట్రాయుడికి మొక్కుతుంటారు. సంక్రామిక వ్యాధులు తటస్థమైనప్పుడు మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ వెలిసియుండే చెట్ల దగ్గర, గ్రామ చావిళ్ళ దగ్గర ప్రార్థిస్తుంటారు.
ప్రశ్నలు – జవాబులు:
అ) యానాదుల దైవం ఎవరు? ఎందుకు?
జవాబు:
యానాదుల ‘దైవం వెంకటేశ్వర్లు. ఆయన టెంకాయతో, తులసిదళాలతో చులకనగా తృప్తి పడతాడని వీరి ఉద్దేశం.

ఆ) యానాదులను ఏవి ఆకర్షించవు?
జవాబు:
యానాదులను భక్తిపరమైన భజనలు, మౌన ధ్యానాలు, మంత్రతంత్రాలు ఆకర్షించవు.

ఇ) వేటకు వెళ్ళేముందు యానాదులు ఎవరికి మొక్కుకుంటారు?
జవాబు:
వేటకు వెళ్ళే ముందు యానాదులు కాట్రాయుడికి మొక్కుకుంటారు.

ఈ) వ్యాధులు వస్తే యానాులు ఎవరిని ప్రార్థిస్తారు?
జవాబు:
వ్యాధులు వస్తే మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ వెలసిన చెట్ల దగ్గర, గ్రామ చావిళ్ళ దగ్గర పూజలు చేస్తారు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
యానాదుల గురించి పరిశోధన చేసిన రచయిత గురించి వ్రాయండి.
జవాబు:
యానాదుల గురించి పరిశోధన చేసిన వ్యక్తి వెన్నెలకంటి రాఘవయ్యగారు. ఆయన 04.06. 1897 నుండి 24.11. 1981 వరకు జీవించారు. నెల్లూరు గాంధీగా పేరుపొందారు. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు. సంఘ సేవకుడు. చరిత్రకారుడు. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని 21 నెలలు జైలు శిక్ష అనుభవించారు. ఆయనకు 1973లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. ఆయన యానాదులు భారతదేశంలో “; ” ఆదివాసులు, అడవిపూలు, నాగులు, చెంచులు, సంచార జాతులూ వంటి 32 పుస్తకాలు రచించారు.

AP 6th Class Telugu Important Questions Chapter 12 ఎంత మంచివారమ్మా….!

ప్రశ్న 2.
యానాదులు అనాది మానవులని ఎలా చెప్పగలవు?
జవాబు:
ద్రావిడుల కంటే చాలా పూర్వమే తెలుగు ప్రాంతాన్ని అంటిపెట్టుకుని ఉన్న అనాది మానవులే యానాదులు అని అనుకోవచ్చు. దక్షిణాన కొన్నేరు (తమిళనాడు), ఉత్తరాన కృష్ణ (ఆంధ్రప్రదేశ్) మధ్య ప్రాంతమే వీరి తొలిస్థానం. అడవి యానాదులకు జంతువుల జాడలు బాగా పరిచయం. అలాగే పల్లపు ప్రాంతాల యానాదులు మానవుల జాడలు సులువుగా కనిపెట్టగలరు. జాడలు తీయటంలో వీరికున్న తెలివితేటలు అమోఘం. వేటగాళ్ళు యానాదులే తోడ్పాటును వేటలో ఉపయోగించుకుంటారు. పూర్వం జమిందారులు తాము కూర్చున్న మంచాల దగ్గర నుండి పులులను, చిరుతలను, ఎలుగుబంట్లను, అడవి దున్నలను దూరంగా తోలడానికి వీరినే ఉపయోగించేవారు. అడవిలోని మూలికల గురించి, కుండ కషాయాల గురించి యానాదులకు తెలిసినట్లు ఇంకెవ్వరికీ తెలియదు.

ప్రశ్న 3.
యానాదులు అల్పసంతోషులని ఎలా చెప్పగలవు?
జవాబు:
యానాదులు అల్పసంతోషులు దేనికీ ఆశపడరు. వారి జీవితాలలో నిరాశా నిస్పృహలు, ఈర్ష్యా ద్వేషాలు, అసూయ కనిపించవు. వారికి కోపం వచ్చినా ఎక్కువకాలం ఉండదు. పస్తుకు, పండుగకు భేదం ఉండదు. జీవితంలో ఒడిదుడుకులకు అవకాశం లేదు. వారు తక్కువగా మాట్లాడతారు. అందుచేత అధిక ప్రసంగాలు, పరనిందారోపణలు. ఇరుగు పొరుగు వారితో తగాదాలు వారికి ఉండవు. పరుగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలనుకొనే స్వభావం యానాదులది. వీరికి మొహమాటం ఎక్కువ. సుగుణము, అమాయకత్వము, మర్యాద, ఆదరము, అతిథి సత్కారము ఇవన్నీ యానాదులకు ఉగ్గు పాలతోనే అలవడతాయి. ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటారు. వీరికి మత్తుపదార్థాలు గానీ, దౌర్జన్యాలు గానీ ఇష్టముండదు. ధనము దాచుట దొంగతనము అని వీరు పాడుకొనే పాటను బట్టి వీరు అల్ప సంతోషులని, ఆశలేని వారని తెలుస్తోంది.

ప్రశ్న 4.
యానాదుల కళాపోషణ గురించి వ్రాయండి.
జవాబు:
యానాదులకు తిరునాళ్ళు, భాగవతాలు, తోలుబొమ్మలాటలు, జాతరలు, ఊరేగింపులు అంటే చాలా ఇష్టం. యానాదులలో చాలామంది కళాకారులు ఉన్నారు. వీరు ప్రదర్శించే యక్షగానాలంటే గ్రామీణులకు చాలా ఇష్టం. యానాదుల భాగవతాన్ని చూడడానికి ఐదారు మైళ్ళ దూరం నుండి జనాలు వస్తారు. స్త్రీ వేషాలను కూడా మగవారే ధరిస్తారు. వీరి వేషము, గొంతులోని మాధుర్యము పండితులను, పామరులను ఆకర్షిస్తాయి. గొబ్బి పాటలను చాలా శ్రావ్యంగా పాడతారు. గొబ్బెమ్మలను చాలా రమ్యంగా ఆడతారు. వీరి నటన గంభీరంగా ఉంటుంది. యానాది స్త్రీలకు తెలిసినన్ని పాటలు ఇతరులకు తెలియవనడం అతిశయోక్తి కాదు. వీరు తెల్లవారకముందే వాకిండ్లను చిమ్మి కళ్ళాపు జల్లుతారు. రంగవల్లిని, పచ్చీసును, తెల్లటి పిండి ముగ్గులతో అందంగా చిత్రీకరిస్తారు.

AP 6th Class Telugu Important Questions Chapter 12 ఎంత మంచివారమ్మా….!

ప్రశ్న 5.
యానాదుల జీవన విధానం గురించి వ్రాయండి.
జవాబు:
అడవులలో దొరికే తేనె, చారపప్పు, వైద్యానికి అవసరమయిన మూలికలు సేకరించి అమ్ముకుంటారు. కలప, వెదురు మొదలైనవి అమ్మి తమకవసరమైన తిండి గింజలను, బట్టలను, నూనెలను కొనుక్కుంటారు. పొలాలలో పంటల కాపలా, చేపలు పట్టటం కూడా వీరి వృత్తులే.